01. అంతా రామమయం, మన బతుకంతా రామమయం, మన జీవితాలలో రాముడు ఎలా కలిసిపోయాడో చూడండి.......

ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి.
మనకు అలాంటిది రామాయణం .

ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .
మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు .
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు .
ధర్మం పోత పోస్తే రాముడు , ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు , ఆనందం నడిస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. 

ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే!
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష .
■■■■■■■■■■
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -
 రమాలాలి - మేఘశ్యామా లాలి .
■■■■■■■■■■■■■■■
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష .
■■■■■■■■■■■■
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా .
■■■■■■■■
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -  రామ రామ .
■■■■■■
భరించలేని కష్టానికి పర్యాయపదం -  రాముడి కష్టం .
◆◆◆◆◆◆◆
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు .
●●●●
కష్టం గట్టెక్కే తారక మంత్రం -  శ్రీరామ .
■■■■
విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
■■■■■■■■■■■■
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !
■■■■■■■■■■
వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !
◆◆◆◆◆◆
తిరుగులేని మాటకు - రామబాణం .
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన .
ఆజానుబాహుడి పోలికకు - రాముడు .
అన్నిప్రాణులను సమంగాచూసేవాడు-రాముడు .
రాముడు ఎప్పుడు మంచి బాలుడే . 💐
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
రామా కిల్డ్ రావణ ;
💐💐💐💐💐💐💐
రావణ వాజ్ కిల్డ్ బై రామా .
💐💐💐💐💐💐💐💐
ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు .
గొప్ప కొడుకు - రాముడు .
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు .
గొప్ప విద్యార్ధి - రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు ).
మంచి స్వామి రాముడు  (హనుమ చెప్పారు ).
సంగీత సారం రాముడు  (రామదాసు , త్యాగయ్య చెప్పారు ).
నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు  ( పిబరే రామ రసం -
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ).

కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.
నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు
చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు .
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు .
జన్మ తరించడానికి - రాముడు , రాముడు , రాముడు .
--------------------
రామాయణం పలుకుబళ్లు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది .
●తెలుగులో కూడా అంతే .●
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే
సీతకు రాముడేమవుతాడని
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
అడిగినట్లే ఉంటుంది ...?
చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
◆◆◆◆◆◆◆◆◆◆◆
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం .
◆◆◆◆●●◆◆●●●
కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు .
◆◆◆◆◆◆◆◆
వికారంగా ఉంటే - శూర్పణఖ .
◆◆◆◆◆
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు .
◆◆◆◆◆◆◆◆◆
మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర .
◆◆◆◆◆◆◆
పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు .
◆◆◆◆◆◆◆
ఎంగిలిచేసి పెడితే -  శబరి .
◆◆◆
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు .
◆◆◆◆◆◆◆◆
అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ .
◆◆◆◆◆◆◆
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే .
◆◆◆◆◆◆
పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే .
◆◆◆◆◆
యుద్ధమంటే - రామరావణ యుద్ధమే .
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే .)
◆◆◆◆◆◆◆◆
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది ◆◆◆◆◆◆
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .
బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు .
ఒంటిమిట్టది ఒక కథ . ◆◆◆◆◆
భద్రాద్రిది ఒక కథ . ◆◆◆◆◆◆◆
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం .
అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు.
హిందుయిజమ్ ఒక మతం కాదు,
అది ఒక జీవన విధానం! అని అందుకే ఇప్పటి South Asian దేశాలు , వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. రామాయణకథలు మనకంటే చక్కగా muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.
జై శ్రీ రామ్....

శ్లో || శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
--(())--
 


02.  :- వ్యక్తికి తాను గర్వంగా వున్నానని ఎలా తెలుస్తుంది?

A:- గర్వానికి సంకేతాలు.
1)దేవుని ఉనికిని నమ్మడు.
2)తాను చేసిన తప్పుల్ని అంగీకరించడు.
3)వేరొకరు మనల్ని తప్పని,వారిది రైట్ అంటే భరించలేరు.
4)సత్యాన్నుంచి పారిపోతారు.
5)ఇతరుల కంటే అధికులమంటారు.
6)వారికే ప్రతిభ ఉందని అనుకుంటారు.
7)వారికి ఎవరు సాటి లేరనుకుంటారు.
8)అన్ని వారికే తెలుసు అనుకుంటారు.
9)వారి అభిప్రాయం సరైనదనుకుంటారు.
10)ఇతరులను తక్కువగా చూస్తూ వారు తక్కువ వారు అనుకుంటారు.
11)ఎవరినైనా బాధపెట్టిన లెక్కపెట్టరు.
12)వారికి జరిగే మంచి అంతటికీ కారణం వారే అనుకుంటారు.
13)వారికంటే వేరొకరు గొప్ప అని ఏ విషయంలో ఒప్పుకోరు.
14)అందరికి లోపాలుంటాయి,అందరూ తప్పులు చేస్తారు,అని అర్థం చేసుకోరు.
15)వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు.
16)అసహనంతో మొండిగా,విసుగ్గా వుంటారు.
17)మార్పును ప్రతిఘటిస్తారు.
18)
ఎవరైనా వారితో ఏకీభవించక పోతే తట్టుకోలేరు.
ఇలాంటివి ఏమైనా మనలో ఉన్నాయా అని మనం అనుక్షణం check చేసుకుంటూ ఉండాలి.ఇలాంటివి ఉంటే మనలో గర్వం ఉన్నట్లే.
🌹 🌹 🌹 🌹 🌹

--(())--
03. నేడు లక్ష్మీదేవి జయంతి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.

క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.

విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తఫః ఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.

లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.
అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ, ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
 

04. : నేడు మదన పూర్ణిమ - హోళీ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం, పరిహాసాలాడడం చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాదించే సాంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.

శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాదించి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్రం, వంటివి పారాయణ చేయడం మంచిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాదించాలి. దీని డోలోత్సవం అని అంటారు. ఒరిస్సావంటి ప్రాంతాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.

నరాడోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం!
ఫాల్గుణ్యం  ప్రయతో భూత్వా గోవిందస్య పురంవ్రజేత్!!

ఉయ్యాలలో అచింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈరోజున దర్శించిన వారికి వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాల వాక్యం.



హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము. 
 హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు.

హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.

సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది.  రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.  అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 
05. 💐💐నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?💐💐💐

ఈ మధ్యకాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.
నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మములోనూ చెప్పబడలేదు. ఈమధ్యకాలంలో క్రొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని, దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలు నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నాం అయిపోయింది అని ఇటువంటి భావజాలం క్రొత్తక్రొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ సత్యదూరాలు. ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే ఇంటిలోనుంచి బయలుదేరే సమయంలోనే  ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి, పూలు, పూజాసామగ్రి  తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయానికి, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి ఉప ఆలయాలలో ఇతర దేవీదేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు. ఇంటిలోనుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్ళడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడు క్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవదర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకానీ దేవతారాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు. లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు, ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్యదూరము. అది మంచి పద్ధతి కాదు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మనమీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా! ప్రయోజనమేమున్నది? కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు. ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి. అంతే. ఈ కార్యక్రమం మళ్ళీమళ్ళీ లేదు. ఆలయంనుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికీ వెళ్ళకూడదు, ఇంక యేపనీ చేయకూడదు.


--(())--

06. వైశాఖ శుద్ధ పూర్ణిమ....హోళికా పూర్ణిమ. హోళీ.. ..

🟡🟢🔵🟣🔴🟠🟡🟢🟡

ఈ రోజున వివిధ వర్ణాల పొడులను, నీళ్ళను చల్లుకొనే ఉత్సవ౦ ఆచరి౦చాలని ధర్మశాస్త్ర౦ చెబుతో౦ది. ఇదే వస౦తోత్సవ౦. ’వస౦తాలు ఆడడ౦’ అనే ఆచార౦గా తెలుగునాడు ప్రాచీనకాల౦ ను౦డి ప్రాచుర్య౦ పొ౦ది౦ది ఈ ప౦డుగ.

ఉదయాన్నే ’తైలాభ్య౦గనము’ చేయాలి(తలకు నూనె రాసుకొని, ఒ౦టికి నలుగు పెట్టుకొని స్నాన౦ చేయాలి). తరువాత ’చూత కుసుమ భక్షణ౦’ అనే ప్రక్రియను ఆచరి౦చాలి.

 హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి ???

ఆవు పేడతో అలికిన ఇ౦టి ప్రా౦గణ౦లో తెల్లని వస్త్రాన్ని ఆసన౦గా చేసుకొని, తూర్పు ముఖ౦గా కూర్చుని, ఒక ముత్తైదువచే వ౦దన తిలక౦, నీరాజన౦ పొ౦ది చ౦దన౦తో కూడిన మామిడి పువ్వును భక్షి౦చాలి. ఇది అన్ని కోరికలను తీర్చుతు౦దని శాస్త్రోక్తి.

 చూతమగ్ర్య౦ వస౦తస్య మాక౦దకుసుమ౦ తవ!
 సచ౦దన౦ పిబామ్యద్య సర్వకామార్థ సిద్ధయే!!

అనే శ్లోక౦తో మామిడి పూతను స్వీకరి౦చాలి.
పౌరులు, జానపదులు అ౦తా కలిసి సి౦ధూర చూర్ణ౦, భర్గు౦డ, చ౦దనపు పొడి వ౦టి వాటిని జల్లుకొని తా౦బూలాలిచ్చుకొని నృత్య గీత వాద్యాలతో మహోత్సవ౦ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదీ ర౦గులు జల్లుకొనే పద్ధతి.


🟡🟢🔵🟣🔴🟠🟣🔵🟡

07. భక్తుడి గాయం భగవంతుడికి !

తెల తెలవారుతోంది ..కావేరి తీరంలో సందడి మొదలయింది...అల్లంత దూరాన గుడిగంటలు . లోకాభాంధవుడైన శ్రీరంగానాధుడి  సేవలు ప్రారంభమయ్యాయి.

స్వామి కైoకర్యానికి నీటికోసం శ్రీరంగ ఆలయ ప్రధానార్చకులు లోకసారంగముని కావేరీ తీరానికి వస్తున్నాడు.

అంతలో ఓ మధురగానం ....

హృదయమంతా స్వామిని నింపుకుని.. భాహ్య స్మృతిలేని స్థితిలో ఓ వ్యక్తి హరినామాన్ని కీర్తిస్తున్నాడు .

కావేరికి వెళ్ళేదారిలో కూర్చుని , ఎవరి రాక పోకలను గమనించే స్థితిలో కూడా లేడాయన.

అంతలో అక్కడకు వచ్చిన లోకసారంగముని “ఏయి..!అడ్డులే “ అంటూ గద్దించాడు .

రంగానాధుని జపంలో లీనమై ఉన్న ఆ భక్తుడికి ఆ మాటలు చేరలేదు .

“దేవాలయ ప్రధాన అర్చకుణ్ణి నాకే అవమానమా !”అంటూ కోపంతో ఊగిపోయాడు లోకసారంగముని .

అక్కడున్న ఓ రాయిని తీసుకుని ఆ భక్తుడిపై విసిరాడు .

రాయిబలంగా తగలడంతో అతని తలకు గాయమైంది. రక్తం ధారకట్టింది .

అప్పుడు భాహ్యస్మృతిలోకి వచ్చిన ఆ భక్తుడు “అపచారం ....క్షమించండి స్వామి “ అంటూ పక్కకు జరిగాడు ,

..................................................

నీళ్ళ బిందెతో కోవెలకు చేరుకున్న లోకసారంగముని రంగానాధుడి కైoకర్యానికి సిద్ధమవుతున్నాడు ...ఇంతలో స్వామి తలనుంచి రక్తం ,

ధారలుకట్టిన రుధిరం గర్భాలయం రంగుని మార్చేస్తోంది .

......................................

స్వామీ ! ఏంటీవైపరీత్యం !..హా ..అర్ధమయింది !.

నిత్యాగ్నిహోత్రుడను..నీ ప్రధానార్చకుడను అనే అహంతో ఓ భక్తుడిని శిక్షించాను.

కులం తక్కువవాడు అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతని రక్తం కళ్ళచూసాను .

నీవు తప్ప ఇహపరంబెరుగని ఓ నిర్మల హృదయుడికి గాయం చేసాను .

అందుకే అతనిలో ఉన్న నీవు స్పందిస్తున్నావు ..అంటూ కన్నీళ్ళతో స్వామిని వేడుకున్నాడు లోకసారంగముని

..........................................

పరుగు పరుగున లోకసారంగమునిదళితవాడ వైపు వెళుతున్నాడు..ఏంజరిగిందో తెలియని మరికొంతమంది అర్చక స్వాములు కూడా ఆటే పరిగెత్తుతున్నారు.......

............................

ఇంతకుముందు తానూ చేసిన దోషానికి తీవ్రంగా దండించడానికి వారంతా తరలి వస్తున్నారని అనుకున్న ఆభక్తుడు స్వామి మీదే భారంవేసి బిక్కు బిక్కు మంటూ నిలుచున్నాడు .

కన్నీళ్ళతో అక్కడకు చేరుకున్న లోకసారంగముని అమాంతం ఆ  భక్తుడిని భుజాలపై ఎక్కించుకున్నాడు .

సకల శాస్త్ర కోవిదుడు , వేద వేదాంగాలు చదివిన ఆ పండితోత్తముడు ..ఓ చదువురాని వాడిని భుజాలపై మోసాడు

నిర్మల భక్తీ శ్రద్దలే భగవంతుడికి పూజా పుష్పాలనిచాటుతూ లోకసారంగముని ఆ భక్తుడితో శ్రీరంగానాధుడి ఆలయప్రవేశo చేసాడు.

ఆ భక్తుడే తిరుపణ్ణళ్వార్

ఆరోజు ఆ భాక్తాగ్రేసరుడికి జరిగిన సేవ నేటికి కొనసాగుతోంది . దానిపేరు “ముని వాహనసేవ “

.............................

(, తిరుపణ్ణళ్వారు పది పాశురాలతో స్వామిని అర్చించి తరించారు  అదే అమలనాధ పిరాన్ గా నేటికి నిర్వహిస్తున్నారు 🙏

ఓం నమో రంగనాధస్వామి🙏

--(())-- 
[#ఓంనమోనారాయణాయ        

08.                   ⚘అష్టాక్షరి⚘

భక్తి సంప్రదాయంలో- పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు ఉదాత్తమైనవి.

 ‘ఓం నమో నారాయణాయ’

అనేది అష్టాక్షరి మంత్రం. నారాయణ స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్న మంత్రం. నారాయణుడు అంటే నీటిలో నివసించేవాడని అర్థం.

ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ. ‘ఓమ్‌’ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీన్ని ‘ప్రణవం’గా పిలుస్తారు. నిత్య శుద్ధమైన బీజాక్షరం ఇది.

అకార, ఉకార, మకారాలతో కూడిన ఓంకారం వేదాల్లోనూ వ్యాపించి ఉంది. ఓంకారం సర్వ శుభదాయకమని రుషులు బోధించారు. ఓంకారం సకలార్థ సాధకం. క్షరం కానిది అక్షరం.

‘న’కారం అన్ని ప్రాణాలకూ మూలం శ్రీహరి అని చెబుతుంది. శరీరం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటుందని; మనం చేసే కర్మను బట్టి పుట్టుక, చావు ఉంటాయని పురాణ గాథలు చెబుతాయి.

పరమాత్ముడే అన్నింటికీ మూల కారణమని, ‘న’కారం అంటే నాశనమని వివరిస్తాయి. సజ్జనుల్ని హింసించే రాక్షసులను సంహరించడాన్ని నకారం సూచిస్తుంది.

‘మో’ అంటే మోహన రూపుడు. రుషుల్ని, యోగుల్ని, భక్తుల్ని ఆయన సమ్మోహపరిచేవాడు. మోహాన్ని నాశనం చేసేవాడనీ అర్థం చెప్పవచ్చు.

‘న’ అంటే నారాయణుడు. ఆయనను నరసింహావతారానికి సంకేతంగా పరిగణిస్తారు. నరసింహుడు శత్రు భయంకరుడు.

అనంతర బీజాక్షరం ‘రా’కారం. రమింపజేసేవాడు రామచంద్రుడు. ఆయన తనను సేవించేవారిపై చల్లని వెన్నెల ప్రసరింపజేసేవాడు. రఘుకుల తిలకుడు, రమ్య గుణధాముడు శ్రీరాముడే!

‘య’కారం యజ్ఞానికి సంకేత రూపం. శ్రీహరి యజ్ఞ స్వరూపుడు. ఆ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాల్లో ‘యజ్ఞావతారం’ ఒకటి.

‘ణ’ కారాన్ని అనేక అభీష్టాల్ని నెరవేర్చే బీజాక్షరంగా భావిస్తారు.

చివరి అక్షరం ‘య’ కారం. ఇది యజ్ఞ కర్తను, యజ్ఞ భర్తను సూచించేది. యజ్ఞ కర్త లోకహితాన్ని కోరి యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞ ఫల స్వీకర్త మహావిష్ణువే!

భక్తులపై విష్ణుదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలంటే, అష్టాక్షరి మంత్రంతో స్తుతించాలని పురాణగాథలు చెబుతాయి.

ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గంలో రూపొందించిన జప విధానం ఇది. ఆపదల్లో ఉన్నవారికి, అజ్ఞానంలో మునిగినవారికి విష్ణు నామమే దివ్యమైన ఔషధమని, ఆధారమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

స్వామికి ప్రీతిపాత్రులు కావడానికి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపడానికి అష్టాక్షరి మంత్రాన్ని ఓ సాధనంగా పరిగణిస్తారు!
#ఓంనమోనారాయణాయ]
🙏🙏🙏🙏🌹🌹🌹🌹

--(())--
09. 🌹🙏ప్రత్యంగిరామాత 🙏🌹

ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు.కానీ నరసిం హ మూర్తి మరింత కోపంతో అష్టముఖగండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి వురుకుతాడు. అంతట వీరభద్రుడు శరభా అవతారం దాలుస్తాడు.శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని ,మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది.

మహాప్రత్యంగిరరూపవర్ణన: నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం మగసిం హపు వేయ్య తలలతో ఓకవైపు ఏర్రన్ని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తుంది ప్రత్యంగిరామాత మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సిం హల స్వర్ణ రధంపై[ఈ నాల్గు సిం హలను నాల్గు వేదాలు గా కొందరు మరికొందరు నాల్గు పురుషార్ధాలుగానూ ఇంకొందరు నాల్గు ధర్మాలగానూ విశ్లేషిస్తారు సాధకులు} ఉద్బవించింది.ఈమె ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్ర
దేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుంది ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయి ఈ సరస్సు కు ఎల్లప్పుడు సిం హాల గుంపు కాపలాగావుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు

మహామాత మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసిం హ మూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసిం హ అవతారాన్ని చాలించి యోగ నరసిం హ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసిం హిక అంటూ వర్ణించారు.

🌹శ్రీ మాత్రే నమః🌹
🙏🙏🙏🌷👌

10. నృసింహుడిని శాంతపరిచిన ప్రహ్లాదుడు 🌺🌺

ప్రహ్లాదుని పలుకులు యదార్థమని నిరూపించుటకు, హిరణ్యకశిపుని శిక్షించుటకు స్తంభం నుంచి భయంకర రూపంతో బయటికి వచ్చి హిరణ్యకశిపుని వధించాడు నృసింహభగవానుడు. బ్రహ్మాదులందరూ ఆయనను స్తుతించినా, లక్ష్మీదేవి వచ్చి స్తుతించినా ఉగ్రమూర్తియైన స్వామి శాంతించలేదు. బ్రహ్మాది దేవతలంతా ప్రహ్లాదునితో ‘కుమారా! నీవే నృసింహ భగవానుని శాంతింపచేయగల సమర్ధుడవు అన్నారు.

అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని సమీపించి సాష్టాంగ నమస్కారము చేసి పలికే పలుకులు అమృతపు చినుకులు, ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడే దివ్వెల వెలుగులు. ప్రహాదుడంటాడు ‘ధనము, సత్కులము, సౌందర్యం, తపస్సు, పాండిత్యము, ఇంద్రియ పటుత్వం, తేజస్సు, ప్రతాపము, శారీరక బలం, పౌరుషం, బుద్ధి, యమ నియమాలు – ఈ పన్నెండు గుణాలు ఉన్నా భక్తి లేకపోతే అవి నిష్ఫలమవుతాయి. భక్తి లేని బ్రాహ్మణుని కన్నా భక్తి గల చండాలుడినే నీవు అనుగ్రహిస్తావు. భక్తి కలవాడు కడజాతి వాడయినా వాడి కులాన్నంతా పవిత్రం చేస్తాడు.

భక్తి లేని వాడు ఉత్తమ కులస్థుడయినా వాడు భ్రష్టుడవటమే కాక, వాడి కులాన్నంతా దిగజారుస్తాడు. భక్తిహీనుని కన్నా నీచుడు మరొకడుండడు.
ఇది నిశ్చయము దేవా! నాకు రాజ్యాలు వద్దు. రాజభోగాలు వద్దు. బ్రహ్మలోకాలు వద్దు. నా దాసాను దాసుల పాదాల వద్ద చోటు ఇవ్వు అని అంటూ నృషింహమూర్తిని కీర్తిస్తాడు.

‘ ఓ ప్రభూ! స్వార్థంతో సేవించే సేవకుడు ఎన్నటికీ విశ్వాసపాత్రుడు కాలేడు. అట్లే తన ఆధిక్యతను నిలుపుకోవటానికి వరాలిచ్చే వ్యక్తి ఎన్నటికీ ప్రభువు కాజాలడు. నేను నీకు నిష్కామభక్తుడను నీవు నాకు నిరుపాధికుడవగు స్వామివి. అంతకుమించి ఇతర భావాలేవీ నాలో లేవు. నీవు నాకు వరాలు ఇవ్వదలచిన యెడల నాలో కోరికలు పుట్టకుండా ఉండే వరాన్నివ్వు. మన భాగవత సప్తాహాలను జరుపుకొంటాం. భాగవత కథలను వింటాం, ప్రవచనాలను శ్రద్ధగా వింటాం, ప్రహ్లాదుని చరిత్ర విని తన్మయత్వం చెందుతాం, కానీ ప్రహ్లాద చరిత్రలోని నీతిని గ్రహించి తదనుగుణంగా మన జీవితాలను మలచుకొంటేనే మనం బాగుపడేది.

 అన్నిటికంటే భక్తి ముఖ్యమంటాడు ప్రహ్లాదుడు. సర్వజీవులను సమభావమున దర్శించటమే భగవంతుడిని వశము చేసుకునే సాధన అంటాడు.మనము అసలైన ఆ బోధను గ్రహించక ఎక్కడెక్కడికో పోతాము, నానా అవస్థలు పడతాము. ఏమోమో చేస్తాము. ధనాన్ని, సమయాన్ని వృధా చేస్తాము. అందరినీ, అన్ని జీవులను ప్రేమించటానికి, గౌరవించటానికి ఏమి కావాలి, పవిత్ర హృదయం తప్ప? కోరికలు అనంతం అని తెలిసి, కోరికలే దుఃఖానికి కారణమని తెలిసి, కోరికలతో చేసే పూజ పూజ కాదని తెలిసి వాటిలోనే ఇరుక్కుపోతే శోకసముద్రంలో మునిగిపోతాం. ఏ కరుణా సముద్రుడు మనల్ని కాపాడలేడు నిజం.
 
11. 💐🌺 #అంతరాత్మలోనే_పరమాత్మ 🌺💐

మనం వెతికే దేవుడు, మనం చూడాలనుకుంటున్న దేవుడు, మనం పూజలు చేస్తున్న దేవుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాక నీలో, నాలో, ప్రతి అణువులో, దయార్ద్ర హృదయం కల ప్రతివారిలో, నలుగురికి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉన్నాడు. అందుకే దేహానికి మించిన దేవాలయం లేదు. అంతరాత్మకు మించిన దేవుడు లేడు. నిస్సహాయునికి చేసే సేవలో పరమాత్ముడుంటాడు. మన వేద విజ్ఞానం చాలా గొప్పదని చెప్పవచ్చు. మన వేద ప్రబోధం చాలా విశిష్టమయినది. వేదాలు తరగని సంపదలు. వేదం అంటే కేవలం మంత్రాలే కాదు. వేదాలు ఏ ఒక్కరి సొత్తు కాదు. వేదాలవల్ల జ్ఞానం కలుగుతోంది. సర్వజనహితం కోసం, సర్వజీవుల సముద్ధరణ కోసం ఆ భగవంతుడిచ్చిన జ్ఞానం. వేదం సమస్త హిందూ కులబంధువుల ఆస్తిగా చెప్పవచ్చు. దేహమే దేవాలయమని చెప్పడం ఏ మతానికి సాధ్యం కాదు.
మనకున్న నాల్గు వేదాలు:
ప్రజ్ఞానం బ్రహ్మ - ఋగ్వేదం చెబుతుంది
అహం బ్రహ్మాన్ని - యజుర్వేదం చెబుతుంది
తత్త్వమసి - సాదవేదం చెబుతుంది
ఆయామాత్మా బ్రహ్మ - అధర్వణవేదం చెబుతుంది.
వేదం అంటే ప్రబోధం. అజ్ఞానం నుండి సుజ్ఞానానికి, చీకటి నుండి వెలుతురులోకి నడిపించే దివ్యచైతన్యం. జననం నుండి మరణందాకా ఎలా జీవించాలో వేదం చెబుతుంది. మనిషికి సుఖాన్ని ఇచ్చేది మనస్సు. డబ్బు ఎంతమాత్రం కాదు. అన్నింటికి మనస్సే కారణమవుతుంది. మనం చూస్తున్న, వింటున్న ఈ భూమండలమంతటా ఆ పరమాత్మ ఉన్నాడు. అంతం లేనటువంటి నాశనం కాని సృష్టిస్థితి లయకారకుడయిన ఆ పరమాత్మను తప్పక ధ్యానించాల్సిందేమరి. ఆ లయకారునికి కంఠమునకు క్రిందిభాగాన, నాభికి పనె్నండు అడుగులపై హృదయ కమలం వుంటుంది. ఆ హృదయ కమలం అనంతమయిన ప్రకాశంతో వుంటుంది. ఇదియే పరబ్రహ్మము. ఆ కమలములో తమ్మి మొగ్గవంటి హృదయం వుంటుంది. ఇది క్రిందికి వేలాడుతూ వుంటుంది. దీనిలోనే సర్వజగత్తు ప్రతిష్ఠించబడి ఉంటుంది. సుషుమ్ననాడికి మధ్యగా ఉన్నటువంటి దీని హృదయకాంతులు నలువైపులా ప్రసరిస్తూ ఉంటాయి. శరీరం చలించడానికి ఇదే మూలకారణం. దీనికి మధ్యలో ఉన్న హృదయకమలంలో జఠరం వద్ద ఈ ప్రకాశవంతమైన కాంతి ప్రభావం శరీరం మొత్తం వ్యాపించి దేహాన్ని ఎల్లప్పుడూ వేడిగా ఉంచుతుంది. ఈ వేడివల్లనే మనస్సు (బుద్ధి) పనిచేస్తుంది. మనిషి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది.
ఈ తమ్మిమొగ్గవంటి హృదయంలో వరిముల్లు అంతటి పరిమాణంలో గల మెరుపుతీగ వంటి పసుపుపచ్చని రంగుగల దివ్యమైన కాంతి, అణుసమానమై వర్ణించడానికి వీలులేనంతగా ప్రకాశిస్తూ ఉంటుంది. చూడలేనటువంటి ఈ దివ్యకాంతికి మధ్యన పరమాత్మ ఉంటాడు. దీనినే ‘‘పరంజ్యోతి’’ అంటారు. ఈ పరమాత్మయే బ్రహ్మ! శివుడు! విష్ణువు! ఇంద్రుడు! ఇలాంటి పరమాత్మ నాశనం లేనటువంటిది. చాలా ఉన్నతమయినది. స్వయం ప్రకాశం కలదని చెప్పవచ్చు. ప్రణవ స్వరూపమయిన పరబ్రహ్మ ఈ హృదయంలోనే ఉంటాడు. శక్తికిమూలం ఇదే.
అందుకే ఋగ్వేదం ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెబుతుంది. యజుర్వేదం చెప్పే అహం బ్రహ్మస్మికి కూడా అర్థం ఇదే. తత్త్వమసి (తత్+త్వం+అసి) నీవే ఆ పరబ్రహ్మవంటున్నది సామవేదం. ఆయామాత్మా బ్రహ్మ అంటున్న అధర్వణార్థం కూడా ఇ
దేనని చెప్పవచ్చు. ఈ ఆత్మయే బ్రహ్మ. మనిషి దేహంలోనే దేవుడు ఉన్నాడు. మంచి మనస్సుతో ఆలోచించే ప్రతివారిలో దేవుడు కొలువై ఉన్నాడని చెప్పవచ్చు.

🙏🙏
ఓం నమః శివాయ
🙏🏼🙏🏼

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ