stories
01. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ??
1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.
2.కనకధారా స్తోత్రం..!!
"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.
3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!!
ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.
4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి..
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.
5.నవగ్రహ స్తోత్రం..
నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.
6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు.
విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.
7. గోపాల స్తోత్రం..!!
సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.
02. భగవంతుణ్ణిపొందాలంటే ఏమి చేయాలి
భగవంతుని పొందకుండా మన జీవితానికి సార్థకత ఎలా వస్తుంది
"మనం భగవంతుని పొందాలంటే మెుదట కోతిపిల్లవలే ఉండాలి..."
కోతిపిల్ల తల్లి కడుపును గట్టిగా పట్టుకుని ఉంటుంది... ఇక్కడ ఒకటి గమనించాలి, పిల్ల పట్టే కానీ తల్లి బాధ్యత ఏమీ ఉండదు...
అయినా సరే తల్లిని గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకూ దాని రక్షణ విషయంలో భయపడనవసరం ఉండదు. అలాగే ముందు మనం భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి... అంటే సంపూర్ణ విశ్వాసం కావాలి..
మన పట్టు దృఢముగా ఉన్నంత వరకూ లోకం తలక్రిందులైనా మనకు ఏ విధమైన నష్టమూ జరుగదు. అది ఏదైనా కానివ్వండి! మనం భగవంతుణ్ణి పొందాలంటే ఆయనను ఏ పరిస్థితిలోనూ విడువకూడదు. భగవంతునిపై సంపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి, ఆయన ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. ' అన్యథా శరణం నాస్తి' అంటూ దైవమునకు పూర్తిగా శరణాగతులై, మన బాధ్యత ఆయనకు అప్పగించి, ఆయన సందేశ వ్యాప్తిలో ఓ పనిముట్టుగా తయారవ్వాలి. అప్పుడు మనల్ని భగవంతుడు పట్టుకుంటాడు మర్కట భక్తి అంటే ముందు కోతిలా మనం ఆయనని పట్టుకుంటే ఆయన మనల్ని పిల్లిలా పట్టుకుంటాడు పిల్లి తనపిల్లల్ని తనే పట్టుకొని సంరక్షిస్తుంది. అందుకే
సర్వధర్మాన్ పరిత్యజా మమేకం శరణంవ్రజ అహం త్వా పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
ఇతరోపాయములన్నింటిని సావాసనగావిడచి నన్నే ఇతరోపాయపేక్షునిగానమ్మి ఉండుమా సర్వ శక్తివంతుడనైన నేను నిన్నుఅన్నీ ప్రతిబంధకాలనుండి విడిపింతును దుఃఖింపకుమాఅని భగవంతుడు ప్రతిజ్ఞా పూర్వకంగా ఉపదేశించెనుఅంటే నన్నే నమ్మినాపై భారం వేసినవారి బాగోగులు భారం నేనే వహించి అన్నీ కష్టములనుండి విడిపింతును అని ప్రతిజ్ఞ పూర్వకంగా హామీ ఇచ్చాడు
ఇంతకంటే మన జీవితములకు వేరే సార్థకత ఏముంటుంది!?.. "
ఓం నమో వేంకటేశాయా
--(())--
03. అనన్య భక్తితోనే భగవదనుగ్రహం
అనన్యాశ్చింతయంతో మాంయేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం
‘అనన్యమైన మనస్సుతో ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారో వారి యోగక్షేమాల బాధ్యతలను నేను మోయగలను’ అని భగవద్గీతలో భగవంతుడు మనకు ఇచ్చిన అభయహస్తం. భగవంతుడు చెప్పిన ప్రతి మాటా ముఖ్యమైనదే అయినప్పటికీ.. పై శ్లోకంలోని కొన్ని పదాలు మరీ ముఖ్యమైనవి. ఒకటి అనన్య చింతన, రెండు నిత్యాభియుక్తులవడం, మూడు.. యోగక్షేమాలు. ఈ మాటలకు ఉదాహరణగా మనకు కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. ధర్మావతారమైన శ్రీరాముడు ధర్మసంస్థాపన కార్యంలో భాగంగా వనవాసానికి వెళ్తున్నప్పుడు.. ఆయన ధర్మపత్ని సీతాదేవి ‘ఈ రాజ్యభోగాలు నాకు అవసరం లేదు. రాముడే కావాలి’ అని ఆయనను అనుసరించి తాను కూడా వనవాసానికి వెళ్లింది.
వనవాసకాలంలో సీతాదేవి యోగక్షేమాల బాధ్యతను తానే వహించాడు. ఎప్పుడైతే సీతాదేవి మనస్సు మాయలేడిని కోరిందో.. అంటే అన్యచిత్తయైునదో అప్పుడు ఆమె సంరక్షణ బాధ్యతను వదులుకొన్నాడు. ఫలితమే సీతాపహరణం. ఆ తర్వాత సీతమ్మతల్లి లంకలో సర్వకాల సర్వావస్థల యందూ రాముని స్మరించింది. అప్పుడు మరల ఆమె యోగక్షేమాల బాధ్యతను స్వీకరించాడు. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత చూలాలైన పట్టపురాణి కోరికలు తీర్చడంలో భాగంగా సీతాదేవిని ఏదైనా కోరుకోమనగా.. ‘ముని ఆశ్రమాలు, మునులను చూడాలని కోరికగా ఉన్నది’ అన్నది. అనగా మరలా అన్యచిత్తయైునది. ఇది గమనించిన రాముడు సీతాదేవిని ముని ఆశ్రమంలో వదిలివేశాడు. ఈ రెండు సందర్భాలలో కూడా సీతాదేవి అన్యమనస్క కావడమే కారణం. ఇందులో రాముని గురించి వేరే విధంగా భావించకూడదు. అలాగే.. నిండుసభలో కౌరవులు వస్త్రాపహరణం చేసి అవమానిస్తున్నప్పుడు ద్రౌపది ఆత్మరక్షణ ప్రయత్నం చేసినంతసేపూ ఉపేక్షించిన కృష్ణుడు.. ఆమె రెండు చేతులూ ఎత్తి ‘గోవిందా నీవే దిక్కు’ అని శరణాగతి చేసినప్పుడు అక్షయమైన వలువలిచ్చి రక్షించి ఆమె యోగక్షేమాల బాధ్యతను స్వీకరించాడు. గజేంద్రుడు మొసలిచేత చిక్కి సమస్త శక్తులనూ ఉపయోగించి పోరాడి అశక్తుడై.. ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అని వేడుకున్నాడు.
అది అనన్యభావాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఆ పరమాత్మ ‘సిరికింజెప్పక.. శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపక’.. పరుగుపరుగున వచ్చి గజేంద్రుని యోగక్షేమాల బాధ్యత స్వీకరించి గజరాజవరదుడైనాడు. ఇక ప్రహ్లాదుని విషయం సరేసరి. ఆగర్భ భక్తియుక్తుడైన ప్రహ్లాదుని అనుక్షణం కాపాడాడు. ఇలా ‘అనన్య చిత్తంతో నిత్యాభియుక్తులైనవారి యోగక్షేమాల బాధ్యతను నేను మోయగలను’ అనే భగవంతుడి మాటలకు ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి. లోకంలో కూడా తమనే నమ్ముకున్న సంతానం యోగక్షేమాలను చూసే తల్లిదండ్రులు ఒక ఉదాహరణైతే.. తననే నమ్ముకున్న భక్తుల యోగక్షేమాలు విచారించి ఎన్నో సేవాకార్యాలు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయిబాబావారి కృషి మరొక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయంలో ప్రభువుకు స్వపరభేదం లేదు. లింగ, వయోవిచక్షణ లేదు. కాబట్టి, ఈ విషయంలో మర్కట కిశోరం వలె కాక.. మార్జాల కిశోరం వలె సమస్త భారాన్నీ భగవంతునిపై వేసి కర్మలను ఆచరించడం ముఖ్యం.

04. : సూక్ష్మంలో మోక్షం:ఏ ఆలోచనాలేని మానసిక స్థితికి చేరుటకు ప్రయత్నించండి. ఆస్దితి ధ్యాన సిద్ధినిస్తుంది. ఆస్థితే మోక్షమార్గానికి తీసుకొనివెళుతుంది. అనగా మోక్షాపేక్షతో లౌకిక విషయాలనుండి మీ దృష్టి మరల్చండి.ధ్యాన నిష్ఠను పొందండి. ఆ స్థితిలో మోక్ష మార్గ ద్వారాలు దర్శనమిస్తాయి.
"యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతిl సర్వ భూతేషు చాత్మానం తతోన విజుగుప్సతేll. ఎవరైతే సర్వ జీవజాలాన్ని ఆత్మలోను(పరమాత్మ లోను),ఆత్మను(పరమాత్మను) అన్ని జీవులలోను చూడగలుగుతాడో అతడు ఎవరిని ఎప్పుడు కూడా ద్వేషింపడు. (ఈశావాశ్యోపనిషత్తు)

05. విశ్వములో జీవితం -1
ఒక్క సారి ఆలోచిస్తే?
మనం
ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం
తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి
జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం లో చూసామనుకో
మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.
మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.
సినిమా
చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా భయాందోలనకు దిగుతాం,
అది తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల
రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని
చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా
ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం తప్పక ఉన్నది అని
గ్రహించవలెను.
మనం
ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా
తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం
చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా
ఉండవచ్చు, అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి
చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం
మరీ అవసరం.
ఎవరి
శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి
వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు
కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు
అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న
జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ
పరచాలి .
మానవులకు
మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా
మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు
రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది.
మన
హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు
తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని
హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట
పడితే మానవ బలం పెరుగు తుంది.
సూర్యుని
బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము
కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి
వాదనకు దిగటం తప్ప, అది అవసరమా ?
కుండ
నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి
చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి
రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి .
అదేవిధముగా
ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి
వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ
కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి .
--((*))--
06. ప్రేమంటే ఇదేనా ?
అప్పుడే
అడుగు పెట్టింది కొత్తకాపురానికి, కోటి ఆశలతో,ఆశయాలతో ఒకవైపు ఉద్యోగం
చేయాలి, మరోవైపు కాపురాన్ని సరిదిద్దు కోవాలి, అదే ఈనాటి స్త్రీకి, భర్త
కూడా అవకాశవాదిగా మారి పోతున్నాడు, ఈ తప్పు ఎవరిదో మీరే ఈ కధబట్టి మిరే
చెప్పగలరు కథానాయికి ఆనందీ, కథానాయకుడు ఆనందరావు . ఇక చదవండి.
కంటికి
కునుకు రాదు, ఎంతసేపు వేచి చూసిన గడియారం కదులుతుంది తప్ప, మనసులో
వేధిస్తున్న ఆలోచనలకు దారి దొరకక, నోరు విప్పి చెప్పుకోలేక, సన్మార్గంలో
నడుస్తున్న అనుమానం బీజంతో ఉన్నవానికి అంతా దుర్మార్గంగా కనిపిస్తున్నది,
ఎప్పుడో చేసిన తప్పును పదే పదే వల్లిస్తూ, ఎప్పుడూ వెకిలి చేష్టలతో,
మానసికంగా హింసించి సంతోష పడేవారు మావారు, అని తలుస్తూ వాకిటముందు కూర్చొని
ఉన్నది ఆనందీ, ఆనందం అంటే ఏమిటో తెలియదు, పెళ్లయిన ఒక్కసిన్మాకు పోవటం,
హోటల్ కు పోవటం అనేదిలేదు, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి, పెళ్ళైన
సుఖపడాలని ఆశతో జీవిస్తూ ఉన్న మహిళ.
నెమ్మదిగా పాడుకుంటున్నది, నీలి కన్నుల కృష్ణా, వాలు చూపులతో ఉడికిస్తున్నావా కృష్ణా, నీ నవ్వులో రాలు రత్నాలు, నీ కాలి మువ్వల శబ్దం నన్ను ఒక్క నిముషము కూడా నిలవ నీయుటలేదు, నా మేని సొగసులు, అమాయకపు నడకలు, హొయలు పోయే నీకోసం, ఈ పండు వెన్నెల, ఆ పూల గంధాలు వేచి వున్నాయి మనకోసమే, అందుకొని అల్లుకోగా రారా..నా మనసే నీదిరా, నీవంటే నేనురా వెన్నెల స్నానాలు చేద్దాం.......రారా, ఇద్దరమూ ఒకటయ్యి, ఏలుదాము ఈ రస జగతిని., ..
రోజూ జరిగే భారతమే ఈరోజు మరీ ఎక్కువ అయింది, బాగుగా త్రాగి, పచ్చి బూతులు పలుకుతూ, ఇంట్లోనించి బయటకుపో, నా కళ్ళ ఏదుట కనబడ వద్దు, నేను మారను, ఉండ గలిగితే ఉండు, లేకపోతె తక్షణం, బయటకు నడువు అన్న మాటలకు ఓర్పు నశించి, దుర్మా ర్గుని ఆశ్రయించి ఉండే బదులు అనాధలకు, సేవ చేయదలచి కట్టు బట్టలతో నడిచింది బయటకు ఆనందీ. మత్తులో ఉండుట వల్ల సోఫాలో పడుకున్నాడు ఆనందరావు .
నిద్రలేవంగానే కాఫీ రాలేదు , చక్కటి పలకరింతలేదు, తనతప్పు గ్రహించాడు, వెంటనే ఫోన్ తీసుకోని తెలిసిన వారందరికీ ఫోన్ చేసాడు, భార్య వివరాలు తెలియలేదు, భార్య ఆఫీసుకు బయలు దేరాడు రాలేదని తెలుసు కున్నాడు, తను ఆఫీసుకు చేరాడు, ఆఫీసులో డబ్బు పోయ్యిందని దానికి కారణం తనే కారణమని భావించి పోలీసులకు దొరక కుండా తిరిగాడు, ఆనందరావు మారి, భార్య చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఏడ్వసాగాడు, స్నేహితులెవరూ సహకరించలేదు, పలకరింపులు లేక, ఆఫీసుకు పోక, రోడ్డువెంట తిరుగుతున్నాడు, మనసు మనసులో లేదు, భార్యను మరువలేక త్రాగుటకు బానిస అయినాడు, ఒక వైపు పోలీసువోల్లు, మరోవైపు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు, అనారోగ్యముతో బాధను భరించ లేక రోడ్డుమీద పడిపోయాడు.
కళ్లుతెరచి చూడగా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాడు, గురువుగాను చెప్పిన మాటలు విన్నాడు ఆనందరావు.
ఆశ్రమంలో ఈవిధముగా గురువుగారు నీతి బోధ చెప్పటం మొదలు పెట్టారు, మనిషికి అహంకారమే పరమ శత్రువు, చెడుస్నేహము మనిషిని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కొన్ని అలవాట్లకు కొందర్ని బానిసగా మారుస్థాయి, చేతులారా జీవితాన్ని నాశనం చేసు కుంటారు, అట్టివారు ఎవరైనా పశ్చాత్తాపముతో తప్పు వప్పుకుంటే వారిని ఆదేవుడు క్షేమించి మంచి మార్గము చూపిస్తాడు.

అక్కడి వాతావరణ, అలవాట్లు ఆనందరావుకు కొత్తఆశలు వేళ్ళు విరిశాయి, అక్కడ దేవుని ముందు కూర్చొని తనతప్పులు చెప్పుకున్నాడు, అక్కడ వున్న వారికి సేవచేస్తూ ఉన్నాడు.
అప్పుడే అక్కడకు ఒక ఉత్తరము వచ్చింది, మీ అప్పులు తీర్చటం జరిగినది, ఆఫీసు డబ్బు కట్టడం జరిగింది, ఇక మీరు స్వేశ్చ జీవి .
దుర్జన స్నేహమ్ము - దూరమ్ము సేయుమా - వర్జించు
వారలన్ నీవు
వారలన్ నీవు
అప్పులన్ జేయకుమ - ఆర్జనల్ చాలుగా - ముప్పులన్
దేబోకు నీవు
గర్వమున్ వీడుమా - కల్లలన్ వీడుమా - సర్వ మా దైవమే
నీకు
అమ్మయే దైవ మా - అబ్బయే దైవమ్ము - బమ్మయే
సృష్టించె నిన్ను
నీ ప్రేమ ఓప్పులో భాగము పంచుకున్నాను, ఆ చిరుకానుక
నీకు అందిస్తున్నాను, నా గురించి వెదక వద్దు నీవు
మారావని గమనించాను, నన్ను కలవాలను కుంటే
రావచ్చు, క్షమించే గుణం ఒక్క స్త్రీ కే ఉన్నది, ఓర్పుతో
నీకోసం వేచి ఉన్నాను.
.
ఆశ్రమంలో గురువు గారికి తన గురించి పూర్తిగా చెప్పటం
వళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికి
తిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
వళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికి
తిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
--((*))--
o7 సంసారంలో సరిగమలు -
అమ్మా ఏమిటమ్మా ఇళ్ళంతా సర్దుతున్నావు, ఇప్పుడు ఏమి పండుగలేదు కదమ్మా,
ఏమిలేదురా మా అన్నయ్య కూతురు సౌందర్య వస్తున్నది.
అమ్మ సౌందర్య సినిమా యాక్టర్ లాగా ఉంటుందమ్మా
ఏమోరా నాకేం తెలుసు, చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు పెద్దదైవుంటుంది.
అమ్మా నాకన్నా చిన్నదా, పెద్దదా
నీకన్నా చిన్నదేరా
ఎప్పుడొస్తుంది.
అంత తొందరెందుకు వచ్చాక చూస్తావుగా
అమ్మా చిన్నప్పుడు చూశానన్నావు, మన ఇంటికి వచ్చినదా,
చిన్నపుడు అనగా నీకు 8 ఏళ్ళు ఉన్నప్పడు సౌందర్యకు 5 ఏళ్ళు
మా అన్నయ్య వ్యాపారనిమిత్తం లండన్ కు పోవలసి వచ్చి నప్పుడు సౌందర్యను నాదగ్గర ఉంచారు.
ఆనెల రోజులు మీరిద్దరూ తెగ గొడవ చేసేవారు
ఎం గొడవ చేశామమ్మా,
ఒక్క
సారేమిట్రా చాలాసార్లు నీ వీపు విమానం మోగించా, ఎన్ని సార్లు కొట్టినా
మీఇద్దరి ఆగడాలు తగ్గలేదు ఆ నెలరోజులు మీఇద్దరిని పట్టుకోవడం నాకు భాద్యత
సక్రమముగా నిర్వహిస్తానా లేదా అని భయము కూడా ఉన్నది. మొత్తానికి
సౌందర్యను మా అన్నయ్యకు అప్పగించా.
అమ్మ నేను ఎలా గొడవ చేసానో చెపుతావా
చెపుతారా కూర్చో చిన్నప్పుడు విషయాలు నీకు తెలియాలి అంటూ చెప్పటం మొదలు పెట్టింది.
నీవు
చిన్నప్పుడు సౌందర్యను ఏడిపించాలని పొలం గట్టున ఉన్న పల్లేరు కాయలను
ఏరుకొచ్చి వరండాలో పోసి సౌందర్య నడుస్తూ అబ్బా అబ్బా గుచ్చుకున్నాయి అని
ఏడుస్తుంటే నేను తీస్తాను అంటూ తీసి ఎవరు పోశారో అంటూ ప్రక్కకు ఉడ్చావురా.
ఒక
సారి మనం పార్కుకు వెళ్లి నప్పుడు గడ్డిలో ఆడుకొనేవారు, కోసిన గడ్డి కుప్ప
ఒకటి మనం కూర్చున్న చోట ఉన్నది, అప్పుడే మీరిద్దరూ ఆగడ్డి కుప్పవద్దకు
పోయి గడ్డి పరకలు నెత్తిమీద పోసుకొని ఆడు కున్నారు, అప్పుడే మీనాన్నకు
కోపమొచ్చి వెంటనే మీఇద్దరిని ప్రక్కనే ఉన్న పంపుదగ్గరకు తీసుకోని వెళ్లి
శుభ్రముగా స్నానం చే యించి నట్లు వంటిమీద పడ్డ గడ్డిపరకలు దులిపారు,
సౌందర్యకు మాత్రం నాన్న అప్పుడే కొన్న డ్రస్సును వేసాడు
వేస్తున్నప్పుడు
నీవు చూసి జిలాయిలే, జిలాయిలే, అని ఏడిపించావురా అప్పుడు మీ నాన్న నాలుగు
బాదాడు, అది చూసి చెప్పుట్లు కొడుతూ సౌందర్య నవ్వేదిరా..
అమ్మ అమ్మా ఇంకా నేను ఎం గొడవ చేసానే చెప్పఁవే వినాలని ఉంది.
ఒకసారి
సౌందర్యకు ఇచ్చిన పాలను నీవు తాగేసి, నేను తాగ లేదని అబద్దాలు
చెప్పేవాడవు, మరోసారి పాలను నీవు సగం తాగి సౌందర్యకు ఇచ్చేవాడవు.
మీనాన్న
ఏ పండు తెచ్చినా తిను సౌందర్యా అంటూ చేతిలో పెట్టే వాడవు, ఆమ్మో నీవు
తినలేవు చిన్న పిల్లవు నేను నమిలి పెడతాను అని నోటితో నమిలి మరీ
పెట్టేవాడవు.
చిన్నపుడు
నీకు సౌందర్యకు తొమలపాకులో తేనెవేసి నాకించేదాన్ని, అది మూతి నిండా
పూసుకొనేది. అప్పడు నీవు మొఖం మీద అదిగో అక్కడ ఉన్నది ఇదిగో ఇక్కడ ఉన్నది,
అని తేనెను నాలుకతో నాకే వాడివి, కోపం వచ్చి కొట్టేది, నీవు కొట్టి
ఏడ్చేవాడివి అన్నది.
ఒకరోజు
పట్టు లంగా జాకెట్టు వేసి, ఎర్ర రిబ్బన్లు కొమ్ముల్లా పెట్టి కాళ్లకు
పట్టాలు, చేతులకు బంగారు గాజులు,. చెవులకు చిన్న దిద్దులు పెట్టి, పుట్టిన
రోజు పండగ ఘనంగా చేసినప్పుడు నీవు సౌందర్య చుట్టూ తిరిగి జడ పీకటం, కేకు
పెట్టడం, బూరలను పట్టుకొచ్చి" టప టపా" అని కొట్టడం ఆమ్మో ఎంత గొడవ చేసావో
నేను చెప్పలేను బాబు అని తల్లి అన్నది.
అప్పుడే తండ్రి వచ్చాడు ఏమిటి ముచ్చట్లు పని అయినదా కాఫీ ఏదన్న ఇచ్చేది ఉన్నదా అని అడిగాడు.
ఏమిటిరా ఇక్కడ కూర్చొని ఉన్నావు బయట బుట్ట మామిడి పండ్లు తెచ్చాను లోపలకు తెచ్చి, బయటకు తీసి బల్లపై పెట్టు అన్నాడు.
అట్లాగే నాన్న అంటూ కదిలాడు కొడుకు మాధవ్
సరే అంటూ గబా గబా కాఫీ త్రాగి నేను ఇప్పుడే షాప్ దాకా పోయాయి వస్తాను అంటూ వెళ్ళాడు.
అమ్మా నాన్న వెళ్లడుగా తర్వాత ఏమైనదో చెప్పొమ్మా
ఏమికాలేదురా
మా అన్నయ్యదగ్గరనుండి టెలిగ్రామ్ వచ్చింది హోలీ పండుగ తర్వాత వచ్చి
సౌందర్యను తీసుకోని వెళ్తామని తెలిపారు. సరే అట్లాగే రమ్మనమని కబురు
చేసాము
మాఅన్నయ్య ఎమన్నా అంటాడా నని చాలా భయ పడినాము ఏమయిందమ్మా
అంతా నీవు చేసిన ఘన కార్యమే
ఎం చేసాను అమ్మా
ఆరోజు హోలీ
పిల్లలందరూ
రంగులు పూస్తున్నారు, పక్క ఇంటి కుర్రాడు ఒక్కసారి రంగులు కొడుతూ
సౌందర్యను తోసాడు. అప్పుడు నీకు కోపం వచ్చి అతన్ని ఒక్కసారి కోపంతో తోసావు,
అతనికి దెబ్బలు తగిలినాయి, ఆఇంట్లోవారు వచ్చి పోట్లాడారు, దానితో మీనాన్న
కు కోపం వచ్చి బెల్టు తీసుకోని కొట్టబోతే పరుగెత్తావు.
మరి నేను ఎప్పుడు ఇంటికి వచ్చానమ్మా
రాత్రికి ఇంటికి వచ్చి మంచం క్రింద పడుకోని నిద్రపోయావు.
నీవు నిద్రలేచే లోపే మాఅన్నయ్య రావటం సౌందర్యను తీసుకోని వెళ్ళటం జరిగింది.
అమ్మా ఇప్పుడెలా ఉంటుంది అని అడిగాడు.
ఇప్పుడా అదిగో టివి సినిమా చూడు,
అది పదహారేళ్ళ వయస్సు సినిమా కదమ్మా
అవునురా దానిలో శ్రీదేవిలాగా ఉండవచ్చు
శ్రీదేవిలాగా ఉంటుందా అంటూ సౌందర్యా రాక కోసం ఎదురు చూస్తునాడు మాధవ్
తల్లి పిలుస్తున్న శ్రీదేవి సినిమా చూస్తూ ఉండి పోయాడు
--(())--
|
08. మానవ జన్మ సముద్రములో
09.-ప్రాంజలి ప్రభ - సెల్ ఫోన్ - 3 (చిన్న కధ
అదేపనిగా ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో దేవీ
అదేనండి మీ స్నేహితురాలు రూపతో
ఆమ్మో ఆవిడతోనా, నేను ఏమిచెప్పిది నీవు ఏమిచెప్పావు అసలే వాళ్ళ ఆయన శాడిష్టు
ఎదో చెప్పింది లెండి, అది మీకెందు కండి
నేను జాగర్త పడాలి, వాళ్ళ ఆయన అసలే అనుమాన పక్షి
ఎదో ఫోన్ గురించి భాధ వ్యక్త పరిచింది
ఈ
స్మార్ట్ ఫోన్ వచ్చిం తర్వాత, అదేపనిగా చూస్తున్నావు అంటాడు, వీడియో
ఫోన్లో మాట్లాడితో ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటాడు, అన్ని నువ్వే నేర్పావు,
ఆడవాళ్లు పైకి రావాలి అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఒక్క నిముషం
మాట్లాడితే ఓర్చుకోలేడు, ఒకసారి ప్రేమగా మాట్లాడుతాడు, మరోసారి కోపంగా
మాట్లాడుతాడు అంటూ ఫోన్ లో చెపుతున్నది వాళ్ళ పెనిమిటి
గురించి స్నేహితురాలు రూప
నీవేం చెప్పఁవు, ఇంకా చెప్పలేదు.
నీవేం
సలహా ఇవ్వకు, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు,
తొందరపడి మాట సలహా ఇచ్చావో వాళ్లిద్దరూ ఏకమై నిన్నే తిడతారు జాగర్త.
భర్త ఈవిధంగా చెప్పుడు
ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే "ఈమైయిల్" అయినా ఉండాలి లేదా "ఫీమేల్" అయినా ఉండాలి.
రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.కదండీ అంటూ నెమ్మదిగా మాట్లాడింది.
అవునే
మనం మాటల్లోనే ప్రేమ ఉద్భవిస్తుంది అది తెలుసుకో, అందుకే ఫోన్ ల్లో
జాగర్తగా మాట్లాడ మంటాను, ఎందు కంటే రికార్డుకూడా చేస్తున్నారు ఇప్పుడు.
అందుకే నేను అంటాను
తల్లితో ప్రేమగా మాట్లాడాలి...!
తండ్రితో మర్యాదగా మాట్లాడాలి...!
అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో అభిమానంగా మాట్లాడాలి...!
గురువులతో గౌరవంగా మాట్లాడాలి...!
మిత్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి...!
బావా, బామర్దులతో వెటకారంగా మాట్లాడాలి...!
మరి భార్యతో...
అంత సినిమా లేదు గాని... నోరు మూస్కుని ఆవిడ చెప్పింది "వినాలి"...!
అంటూ నాలుకలా కొరుక్కున్నాడు
ఎన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పారు అంటూ ఇద్దరు నవ్వు కున్నారు
--((*))--
10. నేటి చిన్న కధప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఇద్దరు వ్యక్తులు పోటీ పరీక్షలకు చదువుతున్నారు, తెలుగు మాష్టర్ వద్దకు పోయి ఏదన్న నేర్చు కుందామని అడిగారు
గురువు గారు: మీరు ఆధునిక విద్య నేర్చు కుంటున్నారు ఈ తెలుగు ఇప్పుడు అవసర మైనదా
శిష్యులు : మేము కొంత నేర్చుకున్నాము, ఇంకా నేర్చు కోవాలను కున్నాము చెప్పగలరా
గురువుగారు: మీ రెంత వరకు నేర్చుకున్నారో నాకేం తెలుసు
శిష్యులు : మీరు కొన్ని ప్రశ్నలు వెయ్యండి మేము చెపుతాము
గురువు గారు: ముందు మంచి నీల్లు త్రాగుతారా
శిష్యులు : మీ ప్రశ్నలకు జవాబు చెప్పాక త్రాగుతాము అన్నారు గర్వంగా
గురువుగారు: ప్రపంచములో ఇద్దరు బలవంతులు ఉన్నారు, వారు ఎవరో చెప్పండి అని అడిగాడు.
శిష్యులు : ఒకరికొకరు మొహాలు చూసుకొని చెప్పలేక పోయారు.
గురువుగారు : ఇద్దరు బలవంతులు ఎవరో తెలియదా
శిష్యులు: మాకు తెలియదని చెప్పారు
గురువుగారు : ఆకలి, దాహం
శిష్యులు: మంచినీల్లు త్రాగ పొయ్యారు శిష్యులు
గురువుగారు: తొందర పడకండి సమాధానాలు చెప్పక తాగొచ్చు ఇద్దరు అన్నాడు
శిష్యులు : అడగండి మాష్టారు దాహం వేస్తుంది
గురువుగారు : ఈ లోకంలో అలసి పోకుండా ఉండే బాటసారులెవరో చెప్పండి.
శిష్యులు మాకు తెలియదు మీరే సమాధానము చెప్పండి మాకు దాహం వేస్తున్నది
గురువుగారు : సూర్య ,చంద్రులు
శిష్యులు : అయ్యే అదే చెపుదామను కున్నాము కానీ చెప్పలేక పోయాము, మరో ప్రశ్న అడగండి
గురువుగారు : అతిధులు ఎందరు? వారెవరో చెప్పండి అని అడిగారు
శిష్యులు: మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరు వెయ్యరు, ఇవి మాకు అనవసరమండి అన్నారు.
గురువుగారు: మీకు ఒక సలహా ఇస్తాను " ఇవి ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు.
శిష్యులు : గురువుగారు మాకు దాహం వేసున్నది తాగాక పొతే ఇప్పుడే పోతాం వాళ్ళ విష్యం దేవుడెరుగు అన్నారు.
గురువుగారు: మాటమీద నిలబడ లేని వారు మీ రేమి ఉద్యోగము సంపా దించగలరు అన్నారు
శిష్యులు: గురువుగారు మేముచెప్పలేము, దయచేసి మీరే చెప్పండి.
గురువుగారు: అతిధిలు '2' ఒకటి దానం, రెండవది యవ్వనం అన్నారు గురువుగారు.
శిష్యులు : లేచారు మేము వెళ్ళొస్తాము అన్నారు
గురువుగారు : నా ప్రశ్నలకు సమాధానము చెప్పి మంచినీరు త్రాగి వేళ్ళ వచ్చు.
శిష్యులు : అడగండి
గురువుగారు : ఇద్దరు సహన శీలురున్నారు వారెవరు.
శిష్యులు : నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఒకరికొకరు అన్నారు
గురువుగారు: వారు ఒకటి "భూమి," రెండవది " వృక్షం"
శిష్యులు : బయట ఎవరో పిలుస్తున్నారు వెళ్ళమంటారా అన్నారు
గురువుగారు
: మీరు మాత్రం పోకండి ఇక్కడే ఉండండి , నేను వెళ్లి కనుక్కొని వచ్చి మిమ్ము
ప్రశ్న లడుగుతాను. మీరు మంచినీల్లు త్రాగకుండా ఓర్పు వహించండి.
గురువుగారు : వచ్చి "మూర్ఖులు" ఎవరో చెప్పండి అని అడిగారు.
శిష్యులు : మేమె మూర్ఖులము, బుద్ధి తక్కువై మిమ్ము కలిసాము ఆన్నారు.
గురువుగారు : మీరు విద్యార్థులు కోపం తెచ్చుకోకూడదు, కోపం అన్నింటిని నాసనమ్ చేస్తుంది అది ఎలుసుకోండి.
శిష్యులు: సరే జవాబు చెప్పండి మేము ఇక్కడే పడిపొయ్యేటట్లు ఉన్నాము అన్నారు
గురువుగారు: ఒకరు అధికారంలోకి వచ్చిన మంత్రి " వీరు అర్హత లేక పోయినా ప్రజలపై పెత్తనం చేసేవారు. రెండవవారు . అన్ని వచ్చని అహంకారి మరియు అసత్య వాక్యాలు పలుకుతూ కాలాన్ని వ్యర్ధ పరిచేవారు .
శిష్యులు
: గురువుగారు మమ్ము మన్నించండి, మేము తప్పు తెలుసు కున్నాము. మేము
నేర్చికున్నది ఆవగింజంత నేర్చికోవాల్సినది సముద్రమంతా అని కాళ్లపై పడి
ప్రాధేయ పూర్వకముగా వేడుకున్నారు శిష్యులు.
గురువుగారు:
ముందు మంచి నీల్లు త్రాగండి. విద్యతో వినయం పెరగాలి, ఎదో మాయలో పడి
అహంకారులుగా మారి పోయారు మీరు కళ్ళు తెరచి నిజం తెలుసుకోండి.
శిష్యులు : మమ్మల్ని క్షమించండి,
గురువుగారు : ఎవరూ గొప్పవారు కాదు. కాలమే వారిని మేధావులు మారుస్తుంది. మీరు ఓర్పుతో పట్టుదలతో కొత్త విషయాలతో పాటు పాత విషయాలను మాతృ భాషలో నేర్చుకుంటే మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్నారు.
శిష్యులు : నమస్కారమండి అని చెప్పి బయటకు నడిచారు ఇద్దరు.
--((*))--
Comments
Post a Comment