'అష్టావక్రగీత' 18వ ప్రకరణ (600)_
🕉🌞🌎🌙🌟🚩

పారమార్థిక జీవితానికి బుద్ధిపరమైన కొలతలతో పనిలేదు !

జ్ఞాని మనసు అద్దంలాంటిది. ఎదురుగా ఏది ఉంటే అది ప్రతిబింబిస్తుందేగానీ తనవైపు నుండి ఇష్టా ఇష్టాలు ఏవీ ఉండవు. అందుచేతనే జ్ఞాని తెలుసుకొనుచున్నవాడైననూ తన ఇష్టంచేత తెలుసుకోవాలని అనుకుంటున్నవాడు కాదు. చూస్తున్న వస్తుప్రపంచం అంతా అతనిచేత చూడబడుతున్నదే గానీ ఆయన ఆసక్తి, ఆనాసక్తులతో దేనినీ చూడడు. వాసనారాహిత్యం అలానే ఉంటుంది. మనసు ఎటువైపు మొగ్గదు. వాసనారహితమైన మనసుకు బుద్ధిపరమైన కొలమానాలు కూడా ఉండవు. బుద్ధి ఆవశ్యకత లౌకిక జీవనంలోనే గానీ దానిని అధిగమించి పారమార్థిక జీవనం సాగించే జ్ఞానికి బుద్ధిపరమైన కొలతలు కూడా ఉండవు !

🕉🌞🌎🌙🌟🚩

"మనం దేన్నయినా జయించాలంటే ఏ విధంగా ప్రయత్నించాలి ?"

దేన్నయితే జయించాలనుకుంటున్నారో దాని స్వరూపాన్ని ముందుగా అవగాహన చేసుకోవాలి. మనసు మనని బాధించదు ! మనసులోని కోరికలే బాధకు కారణం అవుతున్నాయి. ఆధ్యాత్మిక సాధనలో మన మనసును మనం విశ్లేషించుకోగలుగుతాము. అప్పుడు మనం వద్దనుకునే దుఃఖం, బాధ, విచారం వంటి భావాలకు అశాంతి కారణమని తెలుస్తుంది. ఆ అశాంతికి మనలోని ఆశ కారణమని గ్రహిస్తాం. మనలోని అనేక కోరికలకు ఆశ అనే గుణమే మూలం. ఆశ పరిధి చాలా విస్తృతం. మనతో దేన్నైనా కోరుకునేలా చేయించేది ఆశే ! మనసు పేరుతో ఏ శక్తి అయితే మన జీవనానికి ఆధారమైందో అది ధ్యానస్థితిలో సాక్షాత్తు శివుడే తన ఎదురుగా ఉన్నా.. అదే శక్తి కోరిక రూపంలో మనని అశాంతికి గురిచేస్తుంది. మనం కోరికలను జయించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆశ స్వరూపం ఏమిటో అర్థమైతే కోరికను సమూలంగా తొలగించుకోగలుగుతాం !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'ఆశ యొక్క స్వరూపం అర్ధం కావాలి !'-

03. ధర్మ మహిమ !
                           ➖➖➖

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి! విలాసాలు,డాబు పెంచుకున్నారంటే,
ఏ నాటికైనా పతనం తప్పదు!”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారంలా పండుతుంది. అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.

ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !

అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది.

తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.

చీరలు, నగలు ధరించి, షోకేసుల్లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు.
రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.
రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను
సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.

తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామీ ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.
ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి.

వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.
‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు
ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.

హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది,
మంత్రిని ఆదరించి, పంపివేసాడు.

నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.

మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం
వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.
దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే
పాదాక్రాంతం అవుతుంది !
ఇది సత్యం ....!!
==(())==
 04. శుభోదయం

ఇప్పుడు మీరు ఒక సమ్యక్ స్థితిలో ఉన్నారు. మీరు అటూ వాలరు, ఇటూ వాలరు.

కృష్ణుడు యజ్ఞ, తప, దానాదులని వదలి వేయవలసిన అవసరం లేదు ఆని అంటున్నాడు. పదార్ధాన్ని, పరమాత్మని రెండింటినీ తిరస్కరించకూడదు. సంసారంలో, మోక్షంలో కూడా సమతుల్యత సాధించాలి. సంసారంలో నిర్వహించ వలసిన ఏ కర్తవ్యం ఉందో, దాన్ని వదిలి పారిపోవడం ఉచితం కాదు. కర్మని వదలి వేసి పారిపోవడం కూడా మరో కర్మ అవుతుంది.

కర్మ ఏదైతే వుందో అది యజ్ఞరూపంలో ఉండాలి. ఇతరులకి హితం కలిగించేదై ఉండాలి. ఇతరులకి ఏదో ఇచ్చే చేష్ట అవ్వాలే కానీ, వారి నుండి ఏదో తీసుకునే చేష్ట కారాదు. అది ఒక తపస్సు రూపంలో ఉండాలి. మీరు చేసే ప్రతి పనీ మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి పనికి వచ్చేదిగా ఉండాలి.

మీరు ఎవరికైనా సేవ చేశారు అంటే, వారి నుండి ధన్యవాదాలు కూడా ఆశించకూడదు. అలా కాని పక్షంలో ఆ సేవ వ్యర్థం అవుతుంది. అలాగే మీరు తపస్సు చేస్తుంటే, పరమాత్మ కి " చూడు, నేను ఇంత తపస్సు చేస్తున్నాను, కానీ ఇంతవరకు నాకు ఏదీ జరగలేదు" అంటూ పితూరీ చెప్తున్నట్లుగా ఉండకూడదు. అలాగే మీరు దానం చేస్తుంటే సుఖాన్ని అనుభవించాలి.
05. [8:44 am, 08/03/2020] Bhavana 9: #ధర్మసందేహం-#సమాధానం*

#సందేహం:- శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామా అంటూ శ్రీరాముని గురించి ఎందుకు వస్తుంది? దీని లోని అంతరార్థం ఏమిటి?

#సమాధానం:- శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం #కౌసల్యా #సుప్రజారామ* వాల్మీకి రామాయణ శ్లోకం. తన యాగ సంరక్షణ నిమిత్తం శ్రీరాముణ్ణి వెంట తెచ్చుకున్న విశ్వామిత్ర మహర్షి ఆయనను నిద్ర మేల్కొలిపిన సంధర్భంలోని శ్లోకం ఇది.

ఇక వేంకటేశ్వర సుప్రభాతంలోని రెండో శ్లోకం #ఉత్తిష్ఠోత్తిష్ఠ #గోవింద* అంటూ శ్రీకృష్ణుని మేలొలుపుతుంది.

ఇరవై నాలుగవ శ్లోకం #మీనాకృతే* దశావతార స్వరూపుడైన శ్రీవేంకటా చలపతిని మేల్కొలుపుతుంది.

శ్రీవేంకటేశ్వరుడే మహావిష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాల సమాహార స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు.

శ్రీవాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకం #మానిషాద #ప్రతిష్ఠాంత్వ* లో శ్రీరాముడే శ్రీనివాసుడుగా పెద్దలు నిరూపించారు.

తిరుమల కలియుగ వైకుంఠం. తిరుమల వాసుడైన శ్రీనివాసుడు సాక్షాత్తూ వైకుంఠవాస శ్రీమన్నారాయణుడే.🙏🙏🙏🙏🙏
06. [8:55 am, 08/03/2020] Bhavana 9: గుప్తనిధి..

అదిగదిగో! ఆ కొండలు ఉన్నాయా? మూడుకొండలు. ఆ మూడుకొండలూ దాటి ముందుకెళ్తే కీకారణ్యం వస్తుంది. ఆ కీకా రణ్యంలో తూర్పుగా ఓ రెండు మైళ్ళు ప్రయాణించాలి. ప్రయాణిస్తే శివాలయమూ,

కోనేరూ కనిపిస్తాయి. అయిదువందల యేళ్ళనాటి ఆలయం అది. అగ్రహారానికి అంతదూరంలో ఆ ఆలయాన్ని ఎవరు, ఎందుకు నిర్మించారంటే...ఆ రోజుల్లో దేవిడీమీద ఇరుగుపొరుగురాజులూ, బందిపోట్లూ తరచూ

దాడిచేసి దొరికినకాడికి సొమ్మును దోచుకుపోయేవారట! పదేపదే దోపిడీకి గురవుతూ ఉంటే పాలన కష్టం అని, మిగిలినమేరకు బంగారునాణేల్నీ, నగల్నీ, వజ్ర వైడూర్యాల్నీ తెచ్చి రాయుడుగారి తాతముత్తా తలు తెచ్చి

అక్కడే పాతరేశారట! గుర్తుగా దానిమీద అదిగో! ఆ శివాలయాన్ని నిర్మించారంటారు. జలమే జీవం! జలమే బలం అని నమ్మారేమో! కోనేరు కూడా నిర్మించారు. ఈ సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. తెలిసినవారిలో

దేవిడి ఉద్యోగులిద్దరు ఆ నిధినిక్షే పాలను తర్వాతికాలంలో కాజేయాలనుకున్నారట. పలుగూ, పారా, భార్యాపిల్లలుసహా బయల్దేరి వచ్చారట. శివలింగాన్ని తవ్వితీసి పక్కనపెట్టారట. పక్కన పెట్టారో లేదో కలుగులోంచి

ఎలుకల్లా తవ్వితీసిన చోటులోంచి పాములు అనేకం బుసలు కొడుతూ వచ్చి ఉద్యోగులిద్దరినీ వారి భార్యల్నీ కాటేసి చంపాయంటారు.

జాలిదలచి పిల్లలిద్దరినీ వదిలేశాయట! ఆ

పిల్లలే శివుడూ గౌరీ అంటాడు సామి. సామి అంటే ఆలయ పూజారి. ఆయన్ని అక్కడ ఎవరు పూజారిగా నియమించారో తెలియదుగాని, దేవుణ్ణి పూజిస్తూ, దిక్కు లేని శివుణీ, గౌరినీ చేరదీసి పెంచి, పెద్ద చేసింది

ఆయనే! పెంచి పెద్దచేయడమేకాదు, పెళ్ళిచేసి, వారిద్దరినీ ఒకటిచేశాడాయన. చిలకా గోరింకల్లా శివుడూ, గౌరీ, సింహంలా సామీ ఆలయంలో కొలువుదీరారు. వాళ్ళు కొలువుదీరిన ఆ చోటుకి కార్తీకమాసంలోనూ,

మహా శివరాత్రి రోజునా ఒకరో ఇద్దరో భక్తులొస్తారు. మిగిలిన రోజుల్లో మరో నరమానవుడు కనిపించడక్కడ. శ్రమకోర్చి అంతదూరం భక్తులు రావడమే గొప్ప. ఇంకేం మోసుకొస్తారు? వచ్చిన భక్తులకి సామే ప్రసాదం

పెట్టాలి. పెడుతూనే వస్తున్నాడాయన. ఈ కొండ కోనల్లో ఇంత రుచికరంగా ప్రసాదం పెడుతున్నారంటే...ఆషామాషీకాదు. ఇదెలా సాధ్యం? అనడిగిన భక్తులకి శివయ్య ఇస్తున్నాడు, పెడుతున్నాను అన్నదే సామి

సమాధానమవుతోంది. శివయ్య ఇస్తున్నాడంటే...నిధి కాజేస్తున్నాడా సామి? అన్న అనుమానం

ప్రబలింది. సామి కాజేయడం మాట అటుంచి, ఆలయనిధిని అమాంతం సొంతం చేసుకుందామనుకున్నారు కొంత మంది. అనుకున్నదే ఆలస్యం సామినీ, శివుణ్ణి, గౌరినీ అక్కణుంచి తరిమేయాలని చూశారు.

బెదిరించారు. భయ పెట్టారు. అయినా ఆలయాన్ని విడిచిపెట్టలేదు ఆ ముగ్గురూ.

ఓరాత్రి నలుగురైదుగురు దుండగులు వచ్చారు. సామినీ, శివుణీ, గౌరీనీ ఆలయం బయటికి లాక్కొచ్చారు. అక్కడి చెట్టుకు కట్టివేశారు. లోపల నిధికోసం దేవుణ్ణి తొలగించే ప్రయత్నంలోపడ్డారు. పలుగుతో శివలింగాన్ని

పగలగొడు తున్న శబ్దాలు వినవస్తూ ఉంటే సామీ, శివుడూ ఒకరిని ఒకరు చూసుకుంటూ కళ్ళు చెమర్చుకున్నారు. కాసేపటికి హాహాకారాలు వినవచ్చాయి. తర్వాత ఏరకమైన అలికిడీ లేదు. తెల్లారింది. కట్లు

విప్పదీసుకుని పరుగునవచ్చి ఆలయంలో చూస్తే ఏముంది? దుండగులంతా చనిపోయి కనిపించారు. దేవుడిమీద చిన్న దెబ్బలేదు. అంగుళం కూడా ఆయన్ని కదల్చిన జాడలేదు. నిన్ను నువ్వే కాపాడుకున్నావా

దేవా! చేతులు జోడించి నమస్కరించాడు సామి. శివుడూ, గౌరీ ఆనం దించారందుకు. శవాల్ని తీసి లోయలో పడేశారు. ఆలయాన్ని సంప్రోక్షించారు. యథాప్రకారం పూజలు మొదలెట్టాడు సామి. ఆ రాత్రి గౌరిసహా

సామిని సమీపించాడు శివుడు. అడిగాడు. నిజంగా దేవుడికింద నిధి ఉందా సామీ? ఉంది! దేవుడికిందేకాదు, నీ గుండెలోనూ నిధులు ఉన్నాయి. నీ ఆశలూ, నీ ఆలోచనలూ, నీ కలలూ, నీ ఆనందాలూ, నీ

అనుమానాలూ అన్నీ నిధులే! వాటిని రహస్యంగా దాచుకో! పెదవులు బిగించి తాళం వేసుకో! పెదవి విప్పావో బయటపడతాయన్నీ అన్నారు సామి. నవ్వాడు. అలాగే నిధిగురించి నీకు ఆలోచన కలగడం, ఉన్నదా?

అని నన్ను ప్రశ్నించడం మంచిదికాదు. మానుకో! నీకు కష్టం కలిగినా నేనిలా మాట్లాడడం నీ శ్రేయస్సుకోసమే! నువ్వు గౌరికి నిధి. గౌరి నీకు నిధి, మీరిద్దరూ నాకు రెండు నిధులు. దేవుడు మనకు తరగని నిధి

అన్నారు సామి. కళ్ళుమూసుకుని ధ్యానంలో మునిగిపోయారు.🙏🙏🙏🙏🙏
07. [8:58 am, 08/03/2020] Bhavana 9: గుడి నిర్మాణం - జీవుడికి ఆధారమైన చక్రములు

సహస్రార చక్రము: (గర్భ గుడి)

జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.

ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.

అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

అనాహత చక్రము: (అర్ధమంటపం)

ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.

అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: (మహామంటపం)

నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)

ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

మూలాధార చక్రము: అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి.

08. [8:59 am, 08/03/2020] Bhavana 9: శ్రీ చక్రం మానవదేహం: యంత్రమంటే ఏమిటి?

ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.

అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.

ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.

నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే.

విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే 'ప్రకృతి' అని, 'పరాశక్తి' అని, 'అవ్యక్తం', 'శుద్ధమాయ' అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.

శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.

కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను 'విమర్శ' (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.

దీనినే "పరాబిందువు" అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

09. శ్రీ చక్రం - పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.

1) శివశక్తులొకటిగా నున్న 'బిందువు', 2) అచేతనంగా ఉన్న 'శివుడు', 3) 'చేతనా స్వరూపమైన శక్తి'.
ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.

మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది.
పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
పరమ శివునకు ఐదు ముఖాలు.....!!

అవి తత్పురుష, వామదేవ, సద్యొజాత, అఘోర, ఈశాన ముఖములు. ఇవి పంచభూతములకు ప్రతీకలు.

ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన సృష్టి( పుట్టుక), స్థితి (పెరుగుట), లయ (గతించుట), తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం), అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట. గుర్తుంచుకోవలసిన విషయం పుణ్యము ఎక్కువ చేసిన పాపము ఎక్కువ చేసిన తిరిగి జన్మించాలి. పాపము - పుణ్యము లేని సమతుల్య స్థితి లో మాత్రమే మోక్షము) చేయబడును.

ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:
సద్యొజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని పూర్వమ్నాయ మంత్రములు అంటారు.

సద్యొజాత - పశ్చిమ దిశ - అధిపతి సుబ్రహ్మన్యుడు - పృధ్వి తత్వం(సమస్త ప్రాణులు భూమి నుండే పుట్టును) - స్రుస్టి.

వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని దక్షిణాంమ్నాయ మంత్రములు అంటారు. శైవాగమమ్ ఇందులోనిదే.

వామదేవ - ఉత్తర దిశ - అధిపతి కల్ప వృక్షం క్రింద పార్వతీ సహిత ఈశ్వరుడు - జల తత్వం (సమస్త ప్రాణులు నీటి వలననే జీవించి / వృద్ది పొందును) - స్థితి.

అఘోర ముఖమునుండి వైష్ణవాగమంకు( విష్ణు తత్వాన్ని ఆరాధించే వారు) సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని పశ్చిమామ్నయమ్ మంత్రాలు అంటారు.
అఘోర - దక్షిణ దిశ - అధిపతి దాక్షిణామూర్తి - అగ్ని తత్వం ( అన్నిటినీ కాల్చి భస్మం చేయటం) - నాశనం.

తత్పురుష ముఖము నుండి శక్తేయములైన(శక్తి ని ఉపాశించే వారు ఆచరించే విధానం శాక్తేయం) 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహావిద్యాది మంత్రములు ఇందులోనివే. వీటిని ఉత్తారాంన్యాయ మంత్రాలంటారు.

తత్పురుష - తూర్పు దిశ - వాయు తత్వం (ఒక చోటనుండి మరో చోటికి ప్రయాణం) - తిరొధానం, ఈశాన్య ముఖమునుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్న్యాయ మంత్రాలు అంటారు.

ఈశాన - ఊర్ద్వ దిశ - అధిపతి రుద్రుడు - ఆకాశ తత్వం – అనుగ్రహం.
అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది.

అంతే కాదు దేవునికి మహా నివేదన సమయములో ఈమహా మంత్రాలతోనే పవిత్రించబడును.
వాటినే "సధ్యోజాతాది పంచబ్రహ్మ మహామంత్రాలు" అంటారు..
ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ??

1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

2.కనకధారా స్తోత్రం..!!

"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!!

ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి …
10. హాస్యం
ఒక లావాటి వ్యక్తి పేపర్ లో " వారంలో 5 KGలు తగ్గండి,  లేకపోతే డబ్బు వాపస్" అనే ప్రకటన చూసి వాళ్ళకి ఫోన్ చేసాడు.
 ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి, “రేపు ఉదయం ఆరు గంటలకు రెడీ గా వుండండి” అని చెప్పింది.
తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, షార్ట్, షూ వేసుకున్న ఒక ఆందమైన అమ్మాయి "నన్ను పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి"
అని పరిగెట్టటం మొదలుపెట్టింది. అతను బాగా కష్టపడి పరిగెట్టాడు, కాని పట్టుకోలేకపోయాడు. మొత్తానికి వారంలో 5 KGలు మాత్రం తగ్గిపోయాడు.
..
ఈ సారి అతను 10 KGల ప్రోగ్రామ్ తీసుకున్నాడు తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, షార్ట్, షూ వేసుకున్న ఇంతకు ముందుకన్నా అందమైన అమ్మాయి  "నన్ను పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి" అని పరిగెట్టటం మొదలుపెట్టింది. అతను బాగా కష్టపడి పరిగెట్టాడు, కాని పట్టుకోలేకపోయాడు.
మొత్తానికి వారంలో 10 KGలు మాత్రం తగ్గిపోయాడు.
..
అతనికి ఇది బాగా నచ్చి ఈ సారి అత్యాశకి పోయి ఈ సారి అతను 25 KGల ప్రోగ్రామ్ అడిగాడు. కస్టమర్ కేర్ వాడు" నిజంగా 25KG ప్రోగ్రాం కావాలా మీకు?” అని అడిగాడు. అతను "కావాలి పంపించండి"అన్నాడు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, ఒక గొరిల్లా లా వున్న ఒక అమ్మాయి " నాకు దొరికావో, ముద్దు పెట్టుకుంటా" అంది...

పరుగు అందుకున్నాడు... యెంత తగ్గాడో తెలియదు, ఇంకా దొరకలేదు!!
--(())--

౦౯ : గురు బోధ
.....................................................................

ఆత్మ స్వరూపులందరికీ శుబోదయం
ఆత్మ స్వరుపులారా మనమందరం దైవ వారసులం .
ఎవరైతే నిత్యం దైవ నామస్మరణతో ఉంటారో ,
ఎవరయితే నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉంటారో ,

ఎవరైతే నిత్యం సాద్విక ఆహరం తీసుకుంటారో ,
ఎవరైతే నిత్యం ఉన్నదాంతో సర్దుకు పోతారో ,
ఎవరైతే ప్రక్కన ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని తపన లేకుండా ఉంటారో ,
ఎవరైతే బౌతిక విషయాలపై ఆసక్తి లేకుండా ఉంటారో ,

ఎవరైతే నాలికను ,పొట్టను కంట్రోలులో పెట్టుకుంటారో
ఎవరయితే రోజుకి రెండుపూటలు మాత్రమే ఆహరం భుజిస్తారో ,
ఎవరయితే ధూమపానం , మద్యపానానికి దూరంగా ఉంటారో ,
ఎవరయితే లోచనలను తగ్గించుకుంటారో ,

ఎవరయితే నేను అను అహంకారాన్ని తగ్గించుకుంటారో ,
ఎవరయితే ఇతరులకు సహాయపడతారో ,
ఇతరులకు సహాయపడి ఎదుటివారికి ఎవరయితే తెలపకుండా ఉంటారో ,
ఎవరయితే నిరంతరం మానసికంగా మౌనంగా ఉంటారో ,

వారందరు దైవ సన్నిహితులవుతారు ,
దైవ వారసులవుతారు ,ఆరోగ్యవంతులవుతారు .....
9704852146
ఆయుష్మాన్‌ భవ

పెద్దలు వస్తుండగా లేచి వెళ్ళి నమస్కరించడం మంచి సంప్రదాయం. దాన్ని అభ్యుత్థానమని, అభివాదనమని అంటారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయని స్మృతులు చెబుతున్నాయి. నమస్కారాల్లో సాష్టాంగ ప్రణామం ఉత్తమం. దానికే ప్రణతి అని పేరు. అంటే గొప్పదైన నమస్కారమని అర్థం.

సంప్రదాయం తెలిసిన పెద్దలకు నమస్కరించినప్పుడు ‘ఆయుష్మాన్‌ భవ’ అని దీవిస్తారు. చాలాసార్లు ఆ మాట విని ఉండటంవల్ల వారేదో అలవాటుగా ఆశీర్వదించారని మనం అనుకొంటాం. నిజానికది అద్భుతమైన ఆకాంక్ష. చాలా విలువైన దీవెన. ఆ ఆశీస్సులో రెండు గొప్ప పదాలున్నాయి. వాటిలో ఆయుష్మాన్‌ అనేది యోగాల్లో మూడోది. భవ అనేది కరణాల్లో మొదటిది.

మన అందరికీ పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు.

తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అంటే పదహారు కళలున్నవాడు. వాటినే తిథులు అంటారు. పాడ్యమి మొదలు పున్నమి వరకు, తిరిగి పాడ్యమినుంచి అమావాస్య వరకు విదియ, తదియ, చవితి, పంచమి అంటూ పౌర్ణమి/అమావాస్యతో కలిసి శుక్లపక్షం, కృష్ణపక్షం అని నెలకు రెండు పక్షాలున్నాయి.

పంచాగంలో రెండో విభాగం- వారం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలవి. నక్షత్రం అనేది పంచాంగంలో మూడో విభాగం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి... నుంచి రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు. ఒకో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం 108 పాదాల్లో సృష్టిలోని ప్రతి జీవీ ఇమిడిపోతుంది. పుట్టిన ప్రతి మనిషికీ ఒక్కో నక్షత్రం ఒక్కో పాదం స్థిరపడతాయి. అష్టోత్తరశత నామావళి సంప్రదాయానికి ఇదే పునాది. ఆ 108 నామాల్లో ఒకటి ప్రతి మనిషికీ అనువర్తిస్తుంది. ఉపాసకులకు అదే ఆధారం. తమ నక్షత్రానికి చెందిన పాదానికి, 108లో ఒక నామానికి సమన్వయం తెలుసుకొని, సంపుటీకరణ ప్రక్రియను ఉపాసకులు ఆచరిస్తారు.

పంచాంగంలో నాలుగోది యోగం. యోగాలూ ఇరవై ఏడే. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్‌, సౌభాగ్య, శోభన నుంచి వైధృతి వరకు 27 యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్‌ అనేది వీటిలో చాలా మంచి యోగం.

ఇక అయిదోది కరణం. ఇది పంచాంగంలో ఆఖరి భాగం. కరణాలు మొత్తం 11. భవ బాలవ కౌలవ తైతుల గరజ వనజ భద్ర శకుని చతుష్పాత్తు నాగవం కింస్తుఘ్నం... అనేవి వాటి పేర్లు. వీటిలో మొదటిదైన భవకరణం ఎంతో శుభప్రదం.
శుభ తిథులు, అశుభ తిథులు వాడే పంచాంగంలోని మిగిలిన వార నక్షత్ర యోగ కరణాల్లోను మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయని పంచాంగకర్తలు చెబుతారు. మనిషికి యోగాల్లో ఆయుష్మాన్‌, కరణాల్లో భవ- మంచి ఫలితాలనిస్తాయి. ఆయుష్మాన్‌ భవ అని పెద్దలు దీవించడంలోని ఆంతర్యం ఏమంటే- శుభ యోగం, శుభ కరణం రెండూ కలిస్తే ఎంత గొప్ప స్థితి లభిస్తుందో, అంత ఉత్తమ స్థితి నీకు కలుగుగాక అని.
మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో లోతైనవి, చాలా విలువైనవి. అందుకే పెళ్ళిళ్లు, శుభకార్యాల్లో వాటికి పట్టింపు ఎక్కువ.

--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ