----

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక ------
నేటి పద్యము
ఏదో భావమునే మదీయ తలపే తెల్పేందుకే నా వయ
స్సేదో తెల్పకయే వినీల మలుపే మల్లించుటే యీ సమ
స్సేదో కల్పనగా తపస్సు జపమే సత్యాలుగా యీ మన
స్సేదో నీ పరమే ఉషస్సు వెలుగే దైవమ్ము వేదమ్ముగా
కాదో అన్న సరే కధల్ని తెలిపే సత్యాన్ని బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుగా
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
లేదో ఉన్నదియో యశస్సు మలుపే హృద్యమ్ము విశ్వాసమే

UII UUI III IUU UUI UII
--
శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయం – మురమళ్ళ
ఈ ప్రదేశంలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారని అందువలన ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చింది. అది కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి.
గౌతమీ నది తీరాన ఉన్న సుప్రసిద్దమైన క్షేత్రం ఇది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఉన్న మురమళ్ళ గ్రామం లో వెలసిన వీరేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందినది. భద్ర ఖాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఇది. ప్రతి రోజు ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది.
దక్షయజ్ఞం ద్వంసంగావించి తదుపరి మహావిష్ణువు కోరిక పై దక్ష యాగం పుర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు గొర్రె తలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయన చేత వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేయించిన తారువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడలేదు. దేవతలందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింప చేయుటకై వైకుంటమునకు వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్తించి శాంతింప చేయమని కోరిరి. మహా విష్ణువు నరసింహ అవాతరం దాల్చి వీరభద్రుని శాంతింప చేయుటకు ప్రయత్నించిన పలితం కలగలేదు.
అప్పుడు మహా విష్ణువు జరిగినదంతా బ్రహ్మ లోకమునకు వెళ్లి బ్రహ్మ కు చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఆది పరాశక్తిని ధ్యానించి గ షోడ కళ లో ఒక కళ ను భాద్రకాళి నామము తో భూలోకమునకు పంపి వీరభాద్రున్ని శాంతింప చేయుటకు ప్రయత్నించిన వీరభద్రుడు శాంతింప నందున అప్పుడు భద్రకాళి ప్రక్కనగల తటాకమునందు మునిగి భాద్రాకాలి స్వరూపం నుండి కన్య రూపమును దాల్చి వీరభద్రుడి ముందు నిలువగా అప్పుడు వీరభద్రుడు శాంతి అయ్యాడు అని అప్పుడు వారీరువురికి గందర్వ వివాహ పద్దతిన కాల్యణం జరిపించారు అని స్థల పురాణం.
ఆ నాటి నుండి స్వామీ వారికి గందర్వ పద్దతిలోనే కల్యాణోత్సవం జరిపిస్తారట అందుకే ఈ క్షేత్రం లో పెల్లిలు కాని వాళ్ళు కల్యాణోత్సవం జరిపిస్తే తొందరగా పెళ్ళిలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము
ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు . దీనితొపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 05 గం.ల నుండి స్వామి కల్యాణములు చేయబడుతాయి.
స్థల పురాణం.
దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను. కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను. భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను. అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుట చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయింది. అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ధ శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చింది.
తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను. అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామమున ఒక ప్రదేశమునకు రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్ఠా కార్యక్రమములు నిర్వహించిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు.
మురమళ్ళ, తూర్పు గోదావరి జిల్లా, ఐ.పోలవరం మండలానికి చెందిన గ్రామము.
మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం) మరియు రాజమండ్రి నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది. మురమళ్ళ గ్రామం మేజర్ పంచాయితీ మరియు ఇది ముమ్మిడివరం మండలం సమీపంగా ఉంది.
అమలాపురం నుండి 25 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది.
రాజముండ్రి నుండి సుమారు 71 కి మీ దూరం ఉంటుండు ( ద్వారపూడి-యానం రోడ్ )
కాకినాడ, అమలాపురం నుండి అనేకం బస్సులు నడుస్తాయి. రాజమండ్రి నుండి బస్సులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. కత్తిపూడి - పామర్రు నుండి జాతీయ రహదారి 214 మధ్య ఉన్న మురమళ్ళ గ్రామం ఉంది. గోదావరి ఉపనది అయిన గౌతమి నది మీద కొత్తగా నిర్మించి, ప్రారంభించిన జిఎమ్‌సి బాలయోగి వారధి ద్వారా ప్రతి ఒక బస్సు లేదా ఏ ఇతర వాహనములు అయినా ఈ గ్రామం గుండా వెళ్ళుతాయి.
10. 🌴. దత్తదాసునకు అభయ ప్రదానము - 1 🌴
నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులవారిని భౌతికముగా ఎప్పుడు దర్శించెదనా అని మనమున ఎంతయో ఆతురతగా నున్నది.
ఒక చేతిలో కల్లుముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయిననూ బ్రాహ్మణుడనయిన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతనూ, ఆ కల్లు వాసన నాకు ఎంత మాత్రము ఆమోద యోగ్యము కాని కారణముననూ, నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను.
శ్రీపాదులవారి నామమును ఉచ్ఛరించుచూ వడివడిగా నడచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా? అని అతడు ప్రశ్నించెను.
అంతట ఓయీ! నీవెవ్వడవు? నాతో నీకేమి పని? అని నేనడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కల్లువాసన వచ్చుచుండెను.
నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో, ఎందుండి వచ్చితివో? నీ పయనము ఎక్కడికో? తెలుసుకొనుట యుక్తమనెను. కల్లు నమ్ముకొనువారు గూడ యీ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్ధులు కాబోలనుకొంటిని. దారిన బోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచట చేరినది. ఆ కల్లు నమ్ముకొను వ్యక్తి,
"అయ్యా! నేను యీ ప్రాంతములో కల్లు తీసుకొని అమ్ముకొనువాడను. ధర్మబద్ధముగా జీవించు వాడను. నాకు తాటిచెట్టే కల్పవృక్షము. నేను చెట్లునెక్కికల్లు తీసుకొని వచ్చునంత వరకును యీ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నాకొరకు వేచి యుండెను. నేను బ్రాహ్మణుడనయిననూ కల్లు త్రాగుటకు అలవాటు పడితిననియూ, చెల్లించుటకు తనవద్ద పైకము లేదనియూ, కాస్త కల్లుపోసి పుణ్యమును పొందవలసినదనియూ కోరెను. నేను వల్లె యంటిని.
నేను కల్లు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి, నలుగురి ఎదుట కల్లు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునాకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దానభంగమొనరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు యిది అమృతముతో సమానమైనది.
అంతటి అమూల్యమైన కల్లును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన యెడల విశేష పుణ్యము లభించును గదాయను ఆశతో నున్నాను, నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులయిన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది." అనెను.
అచ్చట ప్రోగుపడిన వారందరునూ కల్లుగీసుకొని జీవించు గౌడకులస్థులైనందున తమసాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కల్లు త్రావింపబడెను. తదుపరి వారందరునూ తలా ఒకదారిలోను పోయిరి. నాకు కల్లు త్రావించిన ఆ విచిత్రవ్యక్తి కూడా ఎటో పోయెను.
నేను నా మనసులో "ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడయిన శ్రీపాదుని సందర్శనమునకు పోవుచూ నీచమైన కల్లును సేవిన్చితిని. నా బ్రాహ్మనత్వము మంట కలిసినది.
పరమపవిత్రులైన శ్రీపాడులవారి ముఖమునెట్లు చూడగలను? నా ఖర్మ యిట్లు కాలినది. విధి బలీయమైనది. నా నుదుట యీ రకముగా వక్రలిపి లిఖించియుండ మరోవిధముగా ఎట్లు జరుగును?" అని కుమిలిపోసాగితిని.
నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లువాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాడులవారి నామోచ్ఛరణము చేసుకోనుచూ నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కన్పించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది.
మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించితిని. ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందుననూ, కల్లు త్రాగిన యీ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచితిని.
నేను నా దారిన పోవుచుండ వెనుకనుండి ఒకవ్యక్తి చప్పట్లు చరచుచూ, "ఓయీ! శంకరభట్టూ! ఆగుము. నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానందస్వాముల వారి ఆజ్ఞ" అని ఉచ్చైశ్వరమున పల్కెను.
దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తీ దత్తానందస్వాముల వారి ఎదుట నిల్పిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీస్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములయిన ఫలముల నొసంగిరి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment