: శ్రీరమణీయం -


"ముక్తిస్థితి ఎందుకని అర్ధం కావటంలేదు ?"

మన అసలు పేరు ముక్తి. ఇప్పుడున్నది అదనంగా వచ్చి చేరిన స్వరూపం. మనకు పూర్వజన్మల గురించి తెలియటం దేవుని అనుగ్రహం అనుకుంటాం. కానీ మనం ఆ పూర్వజ్ఞానాన్ని మరిచిపోవటమే ఆయన అనుగ్రహం. ఎందుకంటే పూర్వపుణ్యం తెలుస్తే మనకు గర్వం వస్తుంది. చేసిన పాపాలు తెలిస్తే బాధ కలుగుతుంది. అందుకే వర్తమానంలో ఉన్న నేను ఎవరో తెలిస్తే చాలని భగవాన్ శ్రీరమణమహర్షి సెలవిచ్చారు. ఇప్పుడు మన గుణాలు మన మనసును అధిగమిస్తున్నాయి. అందుకే మన ముక్తిస్థితి మనకు అర్ధం కావటం లేదు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
అంతరంగం గమనించటమే అంతర్వీక్షణం !'- (అధ్యాయం -70)

🌻 ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

   యువకుడు:

  భగవాన్! జపం రామనామం తో చేయాలా? కృష్ణ నామంతో చేయాలా? లేక రెండూ కలిపి రామకృష్ణ నామజపం చేయాలా?

       భగవాన్:

    నీకే నామం ఇష్టమో దాన్ని
జపం చేయవచ్చు. అన్నీ నామాలు
ఒకటే. కావల్సిందల్లా మనసులో ఇతర తలుపులు పోయి జపించే నామం పై
ఏకాగ్రత కుదరడమే.
           
      యువకుడు:
    
 భగవాన్! జపం ఇంట్లో కూర్చొనే చేయవచ్చునా? లేక ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్లి చేయాలా?
                
       భగవాన్:

 "ఆహా! హాయిగా ఇంట్లో కూర్చుని చక్కగా జపం చేసుకోవచ్చు. ఎక్కడికి పోనక్కర్లేదు. ఎక్కడ వుంటే అక్కడే చేయవచ్చు. 

    యువకుడు: 

భగవాన్! నాకిలా చెప్తున్నారు. మరి తమరు మాత్రం మధురనుండి ఇక్కడికి (తిరువణ్ణామలై)  ఎందుకు రావాల్సి వచ్చింది?

         భగవాన్: 

 ఓహో, అదా నీ సందేహం! ఏవిఁరా ఈ స్వామి తాను చేసేదొకటి ఇతరులకు చెప్పేదొకటి అనేగా నీ సందేహం! అయితే చూడు, నీలాగ నేను ఎవరి దగ్గరకి వెళ్ళి, ఇలా చెయ్యాలా అలా చెయ్యాలి ఏం చేయమంటారు,అని అడగలేదు. 

    నాకు ఎలా తోచిందో అలాగే చేసాను. నువ్వు కూడా ఇష్టమొచ్చినట్లు చేయవచ్చు, ఎవరు వద్దన్నారు. ఎందుకు ఇతరులను పోయి అడుగుతావు. 

   యువకుడు బదులు చెప్పలేక నోరు మూతపడి కాస్సేపు తల వాల్చి కూర్చుని, లేచి వెళ్ళిపోయాడు.

  అప్పుడు భగవాన్ ఇలా సెలవిచ్చారు.... 
  
  "తన మీద తనకే నమ్మకం లేదు.
ఇల్లువదిలి బయటకువెడితే ఉండగలిగే స్థైర్యం, ధైర్యం తనకున్నవో లేవో తెలీదు.
కారణం మనోబలం లేకపోవడమే. మనస్సు ధృఢంగా వుంటే సందేహాలు రావు. ఎవరినీ సలహా అడగక్కర్లేదు". 

      వైరాగ్యం ధృఢంగా వుంటే తన నిర్ణయంతో ఎలాంటి ఫలం ఎదురైనా చలించక ధైర్యంగా స్వీకరిస్తాడు. వైరాగ్య లక్షణానికి ఇది గీటురాయి. అయితే, దృఢ వైరాగ్యం పరమేశ్వరుని అనుగ్రహం ప్రసాదంగా లభిస్తుంది.

      🌻అరుణాచల శివ🌻

: 🌷. శ్రీ శివ మహా పురాణము - 86 🌷
రచన ✍. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

🌴. విద్యేశ్వర సంహితా 🌴
అధ్యాయము - 21
🌻. పార్థివ పూజా వర్ణనము - 4 🌻

పూజయేత్పరివారం చ తతశ్శంభోస్సు భక్తితః || 47

ఈశానాది క్రమాత్తత్ర చందనాక్షత పత్రకైః|
ఈశానం నందినం చండం మహాకాలం చ భృంగిణమ్‌ || 48

వృషం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తత్ర్కమాత్‌ |
 అగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా || 49

తత ఏకాదశాన్‌ రుద్రాన్‌ పూజయేద్విధినా తతః |
 తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రియ మేవ చ || 50

స్తుతీర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా |
 తతః ప్రదక్షిణాం కృత్వా నత్వా లింగం విసర్జయేత్‌ || 51

తరువాత శివుని పరివారమును భక్తితో పూజించవలెను (47).

ఈశానునితో మొదలిడి, క్రమముగా నంది, చండ, మహాకాల, భృంగి(48),

వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులను, అగ్రము నందు వీరభద్రుని, వెనుక కీర్తి ముఖుని గంధ అక్షత, బిల్వపత్రములతో పూజించవలెను (49).

తరువాత పదకొండు రుద్రులను యథావిధిగా పూజించి, పంచాక్షరిని జపించి, రుద్రాధ్యాయమును పఠించవలెను (50).

పిమ్మట వివిధ స్తుతులను, పంచాగమును పఠించి, ప్రదక్షిణము చేసి, నమస్కరించి లింగమునకు ఉద్వాసన చెప్పవలెను (51).

ఇతి ప్రోక్తమశేషం చ శివపూజన మాదరాత్‌ |
రాత్రావు దజ్ముఖః కుర్యాద్దేవకార్యం సదైవ హి || 52

శివార్చనం సదాప్యేవం శుచిః కుర్యాదుదజ్ముఖః |
న ప్రాచీమగ్రత శ్శంభో ర్నోదీచీం శక్తి సంహితామ్‌ || 53

న ప్రతీచీం యతః పృష్ఠ మతో గ్రాహ్యం సమాశ్రయేత్‌ |
వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా || 54

బిల్వపత్రం వినానైవ పూజయోచ్ఛంకరం బుధః |
భస్మాప్రాప్తౌ మునిశ్రేష్ఠాః ప్రవృత్తే శివపూజనే || 55

తస్మాన్మృదాపి కర్తవ్యం లలాటే చ త్రి పుండ్రకమ్‌ || 56

ఇతి శ్రీ శివ మహాపురాణ ప్రధమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే పార్ధివ పూజన వర్ణనం నామైక వింశోsధ్యాయః (21)

ఈ విధముగా శివపూజను నిశ్శేషముగా శ్రద్ధతో చెప్పితిని. దేవకార్యమును రాత్రియందు ఎప్పుడైననూ ఉత్తరము వైపు కూర్చుండి మాత్రమే చేయవలెను (52).

భక్తుడు శుచియై, ఉత్తరాభిముఖుడుగనే శివుని అర్చించవలెను. శివలింగమునకు ఎదురుగా తూర్పునందు గాని, శక్తి ఉంéడే ఉత్తరభాగమునందు గాని (53),

వెనుక పశ్చిమ మునందు గాని అర్చనకు కూర్చుండరాదు. కావున మిగిలిన దక్షిణము నందు కూర్చుండవలెను. భస్మ యొక్క త్రిపుండ్రము లేకుండా, రుద్రాక్షమాల లేకుండా(54),

మారేడు దళములు లేకుండా విజ్ఞుడు శంకరుని అర్చించరాదు. ఓ ముని వరులారా! శివపూజ ఆరంభ##మైనప్పుడు భస్మ లభించనిచో (55),

మట్టితో నైననూ లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను (56).

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో పార్థివ పూజన వర్ణనము అనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[16:41, 11/03/2020] +91 98494 71690: 🌹. అథర్వ వేద సంహిత వచనము - 91  / Atharva Veda Hymns - 91 🌹
🌻. జీవన సమస్యలకు వేద పరిష్కారాలు 🌻
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴 . 3వ కాండము - 5వ అనువాకము - 1వ   సూక్తము - 21 -  బ్రహ్మవర్చస్సును, తేజస్సును పొందుటకు 🌴

🌻. వినియోగము :
 1) తేజస్సు కోరువాడు ఈ సూక్తముచే ఏనుగు దంతమును తాకి ఉపస్థానము చేయునది. గజదంత మణిని దీనిచే సంపాతన అభిమంత్రణములు చేసి కట్టుకొనవలెను.
 
       2) పురోహితుడు నిత్యము దీనితో అభిమంత్రించిన గజమును రాజుకు అందించునది.
 
       3) బ్రాహ్మిని, బ్రహ్మవర్చస్సును కోరువాడును, బట్టలు, పడక కాలిన వాడును దీనిచే బ్రాహ్మీ మహా శాంతిని ఆచరించునది.
 
1.    నేను తేజస్సు కోరువాడను. నాయందు గజము యొక్క తేజస్సు ప్రవేశించును గాక. అదితి దేవాము నుండి అద్భుత తేజము సంభవించుచున్నది. ఆ తేజస్సును విశ్వేదేవతలు, అదితి నాయందు ప్రవేశపెట్టుదురు గాక.
 
2.    మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు నన్ను తమ అనుగ్రహ పాత్రునిగా తలంతురు గాక. విశ్వమును భరించునట్టి దేవతలందరు నాకు తేజస్సు కలిగింతురు గాక.
 
3.    ఏ తేజస్సుచే గజము గజము అయినదో, దేనివలన రాజు మనుష్యులందు తేజస్వి అగుచున్నాడో, ఏ జలములందుండి ప్రాణులు తేజస్వులు అగుచున్నవో సృష్టికి పూర్వము ఏ తేజస్సు వలన ఇంద్రాదులు దేవతలు అయినారో అగ్నిదేవా! అట్టి తేజస్సును నాయందు ప్రవేశపెట్టుము.
 
4.    జాతవేద అగ్నీ! నీయందు ఆహుతుల మహా తేజస్సు ఉన్నది. సూర్యుని యందు, అసురులందు, గజములందు తేజస్సులున్నవి. కమల మాలాలంకృతులగు అశ్వినులు ఆ తేజస్సులను నాయందు ప్రవేశపెట్టెదరు గాక.
 
5.    నాలుగు దిశలు ఎంత వరకు వ్యాపించి ఉన్నవో, ఈ నేత్రము ఎంతవరకు చూడగలుగునో అంతవరకు వ్యాపించిఉన్న ఇంద్రతేజము హస్తి వర్చస్సు నాయందు ప్రవేశించును గాక.
 
6.    అడవి మృగములందు తన బలాధిక్యత వలన ఏనుగు సామ్రాట్టు అయినది. అట్టి భాగ్య రూపమగు తేజస్సుచే నేను అభిషిక్తుడను అగుచున్నాను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 🌹. ఋగ్వేద  సంహిత వచనము  - 42 🌹
✍. రచన :  దాశరధి రంగాచార్య
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మండలము 1, అధ్యాయము 3,  అనువాకము 8, సూక్తము - 5 🌻
🌴 41వ సూక్తము  🌴

ఋషి - ఘోరపుత్రుడు కణ్వుడు, దేవత 1-3, 7-9 వరుణ, అర్యమ, మిత్రులు, 4-6 ద్వాదశాదిత్యులు, ఛందస్సు-గాయత్రి.

    1. వరుణ, మిత్ర, అర్యములు అధిక జ్ఞానవంతులు. వారి రక్షణపొందినవారు శత్రువును సులభముగా ఓడింతురు.

    2. వరుణాదులు ఏ యజమానిని తమ బాహువులుగా భావింతురో, ఎవనికి సంపదలు ఇత్తురో, ఎవనిని శత్రువులనుండి కాపాడుదురో ఆ యజమాని అన్యభయములేక వర్ధిల్లును.

    3. వరుణాదులు కరుణించిన యజమాని యొక్క చొరరాని శత్రు స్థానములను నాశనము చేయుదురు. ఆ యజమాని శత్రువులను, పాపములను హరింతురు.

   4. ఆదిత్యులారా ! మీ మార్గము సుగమము నిష్కంటకము అయినది. మీరు యజ్ఞమునకు విచ్చేయుడు. ఇచ్చట అయోగ్యమగు హవిస్సులేదు. వాత్రావఖాదో అస్తినః

    5. ఆదిత్యులారా ! మీరు అధినాయకులు. మీరు నేతృత్వము వహించిన యజ్ఞము మీకు అనుభవ యజ్ఞము కాగలదు.

    6. ఆదిత్యులారా ! మీరు నేతృత్వము వహించి పూర్తిచేయించిన యజ్ఞపు యజమాని ఎవరితోను బాధింపబడడు. సర్వసంపదలను, తనకు సాటివచ్చు సంతానమును పొందును.

    7. ఋత్విజులను మిత్రులారా ! మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు మహితాత్ములు. అంతటి వారికి తగిన స్తోత్రము సాధించగలమా ?

    8. మిత్రాది దేవతలారా ! దేవతలను ఉపాసించు యజమాని తనను హింసించు వారిని గురించిగాని, దుర్భాషలాడు వారి గురించిగానినోరు విప్పడు. అతడు తన సంపదలతో మిమ్ము సేవించుచునే ఉండును.

   (ఇది ఫలమును అభిలషించని యజ్ఞము)

    9. దుష్ట వాక్యము కోరరాదు. దుష్టునకు భయపడవలెను. జూదరి పాచిక తనచేత ఉన్నంతవరకే పొంగును. పందెము పడెనా తేలిపోవును. దుష్టుని విషయమున భయము సహితము అంతమాత్రమే !
🌹 🌹 🌹 🌹 🌹
[16:41, 11/03/2020] +91 98494 71690: 🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 16 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  ప్రశ్నోపనిషత్తు  -  1 🌻

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్తువాꣳసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః ॥

స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః
      స్వస్తి నః పూషా విశ్వవేదాః ।
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః
      స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

శాంతిపాఠము:- గురువు యొద్ద అధ్యయనముచేయు శిష్యుడు తన గురువు, సహాధ్యాయులు, మానవ మాత్రుల కర్యాణముకొరకు దేవతలను ప్రార్థించు చున్నాడు.

దేవతలారా! మాకర్ణములు నేత్రములు ఎల్లపుడు కళ్యాణ వచనములనే వినుచు, చూచుచుండగాక, అమంగళకరమగు వస్తువులపై మామనస్సు ఆకర్షింప బడకుండుగాక.

మా జీవితము ప్రమాద రహితముగా దేవ కార్యములయందు సదా లగ్నమగు గాక, దేవరాజగు ఇంద్రుడు, సర్వజ్ఞుడగు పూష, అరిష్ఠ నివారకతార్యుడు (గరుత్మంతుడు) బుద్ధికి స్వామి బృహస్పతి వీరందరు భగవానుని దివ్యవిభూతులు వీరు సదా మాకళ్యాణ పోషణము ద్వారా ప్రాణుల కళ్యాణము జరుగుగాక, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధి భౌతిక సర్వతాపములచే శాంతి కలుగుగాక.

🌷. ప్రధమ ప్రశ్న - 1 🌷

1. ఓం సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః
కౌసల్యశ్చాశ్వలాయనో భార్గవో వైదర్భిః కబన్ధీ కాత్యాయనస్తే హైతే
బ్రహ్మపరా బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం
వక్ష్యతీతి తే హ సమిత్పాణయో భగవన్తం పిప్పలాదముపసన్నాః ॥ ౧.౧॥

ఓంకారస్వరూపుడగు పరమాత్మనుస్మరించుచు ఉపనిషత్తు ఆరంభింపబడెను. భరద్వాజపుత్రుడు సుకేశుడు, శిబికుమారుడు సత్యకాముడు, గార్గ్యగోత్రోద్భవుడు సౌర్యాయణి, కోసల దేశవాసి ఆశ్యలాయనుడు, విదర్భదేశస్థుడు భార్గవుడు, కత్యుని ప్రపేత్రుడు కబంధీయను.

నీయార్వురు వేదాభ్యాస పరాయణులు, బ్రహ్మనిష్ఠులు. వీరు పరమేశ్వర జిజ్ఞాస చే పిప్పలాదుడను మహర్షిని సమిత్సాణులై సమీపించి పరబ్రహ్మ సంబంధమగు విషయములు తెలియగోరుచున్నాము. దయచేసి మాకు తెలుపుడని ప్రార్థించిరి.

2. తాన్హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా
సంవత్సరం సంవత్స్యథ యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత యది
విజ్ఞాస్యామః సర్వం హ వో వక్ష్యామ ఇతి ॥ ౧.౨॥

జిజ్ఞాసువులైన ఈయార్వురనుచూచి పిప్పలాదమహర్షి వారిని ఒక సంవత్సరకాలము తపమొనరించి పిమ్మట మీరు కోరినది ప్రశ్నించిన నాకు తెలిసినంతవరగకు చక్కగా బోధపరచి చెప్పుదుననెను.

3. అథ కబన్ధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ ।
భగవన్ కుతే హ వా ఇమాః ప్రజాః ప్రజాయన్త  ఇతి ॥ ౧.౩॥

మహర్షి పిప్పలాదుని ఆజ్ఞానుసారము శ్రద్ధా పూర్వకముగా బ్రహ్మ చర్యము నవలంబించి తపస్సుచేసిరి. మొదట కాత్యఋషి ప్రపేత్రుడు కబంధి. శ్రద్ధావినయ పూర్వకముగా నిట్లు ప్రశ్నించెను. హేభగవాన్‌! ఎవరి నుండి ఈ సంపూర్ణ జగత్తు నానా రూపముల ఉత్పన్నమగునో ఆ సునిశ్చితకారణము ఎవరు?

4. తస్మై స హోవాచ ప్రజాకామో వై ప్రజాపతిః స తపోఽతప్యత
స తపస్తప్త్వా స మిథునముత్పాదయతే । రయిం చ ప్రాణం
చేత్యేతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతి ॥ ౧.౪॥

 సమస్త ప్రాణులకు స్వామియగు పరమాత్మ సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించెను. సంకల్ప తపోబలముచే "రయి" ప్రాణము" అను జంటను ఉత్పన్నము చేసెను. సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే ప్రాణము. ఈ జీవనశక్తి నుండియే ప్రకృతి స్థూలరూప భూత సముదాయము. 'రయి' . ఇది ప్రాణరూప జీవనశక్తిచే అనుప్రాణితమై కార్యషీమత కలిగియుండును. ప్రాణము చేతనము, రయిశక్తి లేక ఆకృతి. ధన ఋణతత్వముల వలె ప్రాణ రయి సంయోగముచే సమస్త సృష్టికార్యము.సంపన్నమగును. వీనినే అగ్ని- సోమము, పురుషుడు-ప్రకృతి అనుపేర్ల పిలిచెదరు.

5.  ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చన్ద్రమా రయిర్వా ఏతత్
సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మాన్మూర్తిరేవ రయిః ॥ ౧.౫॥

ప్రాణ రయి శక్తులను వేర్వేరుగా చెప్పలేము. అయినను జీవన ప్రదాత చేతన శక్తి అధికముగాగల సూర్యుడు ప్రాణము. స్థూల తత్వపుష్టికర భూత తన్మాత్రలు. అధికముగానుండుటచే చంద్రుడేరేయి. ఈ రెండుతత్వములు మన శరీరమున ప్రతి అంగమున సూర్యరూప జీవశక్తి, మాంసమేధారూప స్థూల తత్వమే చంద్రుడు.

6. అథాదిత్య ఉదయన్యత్ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే । యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధో
యదూర్ధ్వం యదన్తరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే ॥ ౧.౬॥

సూర్యోదయమగుటతోడనే సర్వప్రాణులయందు స్పూర్తి దాయక జీవన శక్తి సూర్యకిరణ ప్రసారమున లభించును.

7. స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోఽగ్నిరుదయతే ।
తదేతదృచాఽభ్యుక్తమ్ ॥ ౧.౭॥

ప్రాణుల శరీరమందు, జఠరాగ్ని రూపమున అన్నపచనము చేయు వైశ్వానరుడు సూర్యుడే, పంచ ప్రాణములు సూర్యాంశలే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹🌹. శ - వాటి మహాత్మ్యం - ఉపయోగములు  - నక్షత్ర రీత్యా రుద్రాక్ష ధారణ 🌹
✍. చింతా గోపీ శర్మ సిద్ధాంతి.
📚. ప్రసాద్ భరద్వాజ

శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారణ్యమహాత్యం, దేవిభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగ పురాణం, స్కంద పురాణం, పద్మపురాణం లాంటి అనేక గ్రంథములలో రుద్రాక్షలవివరణ ఉన్నది.

🌻. రుద్రాకారణ్య మహాత్యం  🌻

ఒకప్పుడు త్రిపురాసుర పదార్థమైన నేను నిమిలిత నేత్రకుడినై యుండగా నాకన్నుల నుండి జలబిందువులు భూమ్మీద పడినవి ఆ జలబిందువుల నుండి సర్వజనులక్షేమార్థము రుద్రాక్ష వృక్షములు జనించినవి అని పరమేశ్వరుడు స్వయముగా చెప్పాడు.

''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"

అని రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొనబడింది.

రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు.

శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.

"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"

అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా పేర్కొనబడుతున్నాయి.

కాబట్టి రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణమును కూడా గమనించాల్సివుంటుంది. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.

🌻. రుద్రాక్షలు 🌻

ఏకముఖి. (ఒక ముఖము కలిగినది) అత్యంత శ్రేష్టమయినది.
ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) ఇది శివపార్వతుల స్వరూపం

త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) త్రిమూర్తి స్వరూపం

చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపం

పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం

షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయ రూపం

సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుగా పరిగరించుతారు

అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)విఘ్నేశ్వరరూపం

నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం.

దశముఖి (పది ముఖాలు కలిగినది) దశావతార స్వరూపం.
జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

ఇండస్ట్రియల్ స్కానింగ్ కానీ , డెంటల్ ఎక్స్ రే యంత్రంతో తీసిన ఎక్స్ రే ద్వారా నిజమైన రుద్రాక్షని గుర్తించవచ్చు.

🌻. జన్మ నక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు 🌻

నక్షత్రము --- ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని --- నవముఖి
భరణి --- షణ్ముఖి
కృత్తిక --- ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి --- ద్విముఖి
మృగశిర --- త్రిముఖి
ఆరుద్ర --- అష్టముఖి
పునర్వసు --- పంచముఖి
పుష్యమి --- సప్తముఖి
ఆశ్లేష --- చతుర్ముఖి
మఖ -- నవముఖి
పుబ్బ --- షణ్ముఖి
ఉత్తర --- ఏకముఖి, ద్వాదశముఖి
హస్త --- ద్విముఖి
చిత్త --- త్రిముఖి
స్వాతి --- అష్టముఖి
విశాఖ --- పంచముఖి
అనురాధ --- సప్తముఖి
జ్యేష్ఠ --- చతుర్ముఖి
మూల --- నవముఖి
పూర్వాషాఢ --- షణ్ముఖి
ఉత్తరాషాఢ --- ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం --- ద్విముఖి
ధనిష్ట --- త్రిముఖి
శతభిషం --- అష్టముఖి
పూర్వాభాద్ర --- పంచముఖి
ఉత్తరాభాద్ర --- సప్తముఖి
రేవతి --- చతుర్ముఖి...
🌹 🌹 🌹 🌹 🌹
[16:41, 11/03/2020] +91 98494 71690: 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 19 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻

లక్ష్మణ్ రావు మరియు మరికొందరు ప్రభువును పరీక్షించడం, ప్రభువును ఇబ్బంది పెట్టాలని చూడడం ఆ గ్రామ దేవతకు ఆగ్రహం కలిగించింది. గ్రామ దేవతకు కోపం వచ్చిన విషయం గ్రహించిన ప్రభువు తన శిష్యులతో, జాగ్రత్త ఈ గ్రామములో ఏదైనా అనర్ధం జరగబోతోంది అని చెప్పి ప్రభు కొన్నిరోజులు అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడకి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. గ్రామంలో కొన్నిరోజులకు మంటలు లేవడం, కలరా వ్యాపించడం జరిగాయి. అంతటా హాహాకారాలు నిండాయి. వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో కలరా వ్యాపించింది. అందరూ ప్రభు నామస్మరణ చేశారు, కానీ ప్రభు ఆచూకీ దొరకలేదు. నృసింహతాత్యా కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడు తల్లి ప్రభువును ప్రార్ధించగానే వెంటనే ప్రత్యక్షమై తాత్యాకు తీర్థం ఇచ్చిన వెంటనే జబ్బు నయమయ్యింది. తాత్యా భార్య ఈ జబ్బుతో మరణించింది. అప్పటినుండి లక్ష్మణ్ రావుకి దుఃఖం కలిగింది. లక్ష్మణ్ రావు ప్రభువుకి పరమభక్తులయ్యారు.

    ప్రభువు యొక్క లౌకిక పారమార్థికత రోజు రోజుకు ఎక్కువై అన్ని జాతుల ప్రజలు ప్రభువు దర్శనార్ధమై వచ్చేవారు. వీరిలో హిందువులతో పాటు ముసల్మాను వ్యక్తులు కూడా ఉండేవారు. మొదట ముస్లిం మతంలోని పెద్ద పెద్ద వారు వచ్చేవారు. వారు ప్రభువును పరీక్షించాలని తమ మతంలోని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ వాదోపవాదాలు చేసేవారు. ప్రభువు అన్ని ధర్మాలలోని శ్రేష్టమైన తత్త్వంపై విడమర్చి చెప్పేవారు. పెద్ద పెద్ద మౌళీలను చకితులు చేసే జ్ఞానం ప్రభువు వద్ద ఉండడం చూసి వాళ్లంతా విస్మయులయ్యారు. ప్రభువు యొక్క అగాధమైన జ్ఞానం గురించి తెలుసుకొని ప్రభు భక్తి పరాయుణులయ్యారు. కానీ కొంతమంది ముస్లింలకు నచ్చక ప్రభువును చంపాలని చూసారు. ప్రభువు హతమార్చాలని సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రయోగం చేద్దామనుకున్న వ్యక్తి అన్నకు నచ్చలేదు.

   ప్రభువులాంటి అసామాన్యమైన సామర్ధ్యంకల వారిని చంపడానికి ప్రయత్నించడం సాధ్యం కాదు. *ఆ ముసల్మాను మంత్ర ప్రయోగం చేయాలనుకునేసరికి ఆ మంత్ర దేవతకే భయంకరమైనదిగా అనిపించింది. ఈ విధంగా ఆ మంత్రాధిదేవత ఆ యవనుడిపైన తిరగబడింది. ఆ యవనుడి శరీరం విపరీతమైన బాధతో నిండింది. అది చూసిన అతని సోదరుడు ఈ ప్రమాదం నుండి రక్షించగలవారు ప్రభువు ఒక్కరే అని తలిచి వారినే శరణువేడాలని అనుకున్నాడు.

  ప్రభువు దగ్గరికి వెళ్లి నాకు అభయం ఇవ్వండి, క్షమించండి అని అంటూ, నేను మీ దాసుణ్ణి మీ శరణువేడుకుంటున్నాను. నాపై కృపతో మా ఇంటికి రండి, అనగానే ప్రభువు ఎంత వారించినా వినక తన ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. తన సోదరుడు ప్రభువుకు భయంకరమైన అపరాధం తలపెట్టాడు, అందువలన ఇపుడు మృత్యుముఖంలో ఉన్నాడు. అదంతా మరిచి తన సోదరుని రక్షించమని ప్రభువును ప్రాధేయపడ్డాడు. అదివిని ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ప్రభువు సహృదయంతో తమ శిష్యులతో కలిసి అతని ఇంటికి వెళ్లారు. ప్రభువును చూడగానే ఆ దుష్టబుద్ధి కలిగిన యవనుడికి సిగ్గు అనిపించింది. అప్పుడు సోదరుడు, 'ఇప్పటికైనా మరణద్వారంలో ఉన్నావు, తప్పు ఒప్పుకొని ప్రభువుని క్షమించమని వేడుకో', అనగానే ఇప్పటివరకు జరిగిందంతా వివరించి ప్రభువును శరణువేడాడు. నీ దేవతే నీకు తిరగబడింది, ఇకనుండి ఈ దుష్ట ప్రవృత్తి వదిలేయ్, ఇతరులకు చెడు జరగాలని చూస్తే, తనకే చెడు జరుగుతుంది. ఈ విషయము ద్రుష్టిలో  పెట్టుకో అని బోధించి దుఃఖ విముక్తి కలిగించారు. ప్రభువుకి శత్రువు-మిత్రుడు సమానమే. దుష్ట జనుల క్రూరత్వం పోయి వారినుండి ఇతరులకు ఏ ఉపద్రవం కలగకుండా చేయటం ప్రభువు కర్తవ్యాలలో ఒకటి.

తరువాయి భాగము రేపు చదువుకుందాము.....

దిగంబర దిగంబర
శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ