శ్రీ ఆంజనేయ స్వామి కధలు***


ఓం శ్రీ రామ్ - శ్రీ మాడఁత్రే నమ:
సేకరణ మల్లాప్రగ్గడ శ్రీదేవి రామకృష్ణ

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది

ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " ఫేసుబుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్ లు కూడా చూడండి మీకు కొన్నైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మా ఆశ

మీరు చూసి తరించండి

అందరూ దర్శించుకునేందుకు దయచేసి షేర్ చేయండి

జై శ్రీరామ్
జై హనుమాన్
--(())--

తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆపరిస్థితులలోనే ఒక సంఘటన జరిగింది.

ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతం. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు! పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది!

అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమము చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో! ఆ ఆశ్రమములోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమువల్ల తన శోకం రూపుమాపగలడనుకున్నదేమో! ఏమనుకుందో ఏమోగాని, ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.

నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దేవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా! అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దేవెన నిష్పలమైంది కదా! అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మాఅ! ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాస్‌. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవం కట్లు విప్పి, ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి, తన కమండలములోని జలాన్ని శవంమీద జల్లాడు.

అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూసిన ఆతని భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు డిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో, రామనామం ఎంతో శక్తివంతమైనదని, రామనామస్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పాడు తులసీదాసు. మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా! అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.

రామచంద్రా! ఇదేమి పరీక్ష! రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా! రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి రామా! అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడైయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడం, కళ్ళు మూసుకుని ఉండటం, కనీసం తన తప్పు కాయమనుకోవకపోవడం, శరణు వేడకపోవడం, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి , ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా! తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు. 

ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను గుంజుకుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.


తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి.


చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు.
నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు.


--(())--

        హనుమాన్ చాలీసా (తెలుగు)

        శ్రీ హనుమాను గురుదేవు చరణములు !
        ఇహపర సాధక శరణములు
        బుద్ధి హీనతను కలిగిన తనువులు !
        బుద్బుదములని తెలు సత్యములు ॥ శ్రీ ॥

        జయ హనుమంత జ్ఞానగుణ వందిత
        జయ పండిత త్రిలోక పూజిత
        రామదూత అతులిత బలధామ
        అంజనీ పుత్ర పవన సుతనామ ॥ శ్రీ ॥

        ఉదయభానుని మధుర ఫలమని
        భావనలీలా మృతమును గ్రోలిన
        కాంచన వర్ణ విరాజిత వేష
        కుండల మందిత కుంచిత కేశ ॥ శ్రీ ॥

        రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
        రాజపదవి సుగ్రీవున నిలిపి
        జానకీ పతి ముద్రిక తోడ్కొని
        జలధి లంఘించి లంక జేరుకొని ॥ శ్రీ ॥

        సూక్ష్మ రూపమున సీతను జూచి
        వికట రూపమున లంకనుగాల్చి
        భీమరూపమున అసురుల జంపిన
        రామకార్యమును సఫలము జేసినా ॥ శ్రీ ॥

        సీతజదగని వచ్చిన నినుగని
        శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
        సహస్త్ర రీతుల నినుకొని యాడగ
        కాగల కార్యము నీపై నిడగ ॥ శ్రీ ॥

        వానర సేనతో వారధి దాటి
        లంకేసునితే తలపడి పోరి
        హోరుహోరున పోరుసాగిన
        అసురసేనల వరుసగా గూల్చిన ॥ శ్రీ ॥

        లక్ష్మణ మూర్చతో రాముడడలగ
        సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
        రామలక్ష్మణుల అస్త్రధాఅతికి
        అసురవీరులు అస్తమించిరి ॥ శ్రీ ॥

        తిరుగులేని శ్రీ రామ భాణము
        జరిపించెను రావణ సంహారము
        ఎదురలేని ఆ లంకా పురమున
        ఏ లికగా విభిషను జేసిన ॥ శ్రీ ॥

        సీతారాములు నగవుల గనిరి
        ముల్లోకాల హారతులందిరి
        అంతులేని ఆనందాశృవులే
        అయోద్య్యా పురి పొంగి పొరలె ॥ శ్రీ ॥

        సీతారాముల సుందర మందిరం
        శ్రీ కాంతు పదం సీ హృదయం
        రామచరిత కర్ణా మృత గాన
        రామనామ రసామృత పానా ॥ శ్రీ ॥

        దుర్గమమగు ఏకార్యమైన
        సుగమమే యగు నీకృత జాలిన
        కలుగు సుఖములు నిను శరణన్న
        తొలగు భయములు నీరక్షణయున్న ॥ శ్రీ ॥
   
        రామద్వారపు కాపరి వైన నీ
        కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
        భూత పిశాచ శాఖినీ ఢాకినీ
        భయపడి పారు నీనామ జపము విని ॥ శ్రీ ॥

        ద్వజాది రాజా వజ్ర శరీరా
        భుజబల తేజా గదాధరా
        ఈశ్వరాంశ సమ్భూత పవిత్ర
        కేసరీ పుత్ర పావన గాత్ర ॥ శ్రీ ॥

        సనకాదులు బ్రహ్మాది దేవతలు
        శారద నారద ఆదిశేషులు
        యమకుబెర దిక్ప్పాలురు కవులు
        పులకితులైరి నీకీర్తి గానముల ॥ శ్రీ ॥
   
        సోదర భారత సమానాయని
        శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా
        సాదులపాలిట ఇంద్రుడ వన్నా
        అసురుల పాలిట కాలుడవన్నా ॥ శ్రీ ॥
       
        అష్ట సిద్దిలకు నవనిధులకు దాతగ
        జానకీ మాత దీవిచెనుగా
        రామసామృత పానము జేసిన
        మృ త్యుంజయుడవై వెలసిన ॥ శ్రీ ॥
       
        నీనామ భజన శ్రీ రామ రంజిత
        జన్మ జన్మాంతర దు:ఖ భంజన
        ఎచ్చ్తుమ్డినా రఘువరదాసు
        చివరకు రాముని చేరుత తెలుసు ॥ శ్రీ ॥
       
        ఇతర చింతనలు మనసున మోతలు
        స్తిరముగా మారుతి సేవలు సుఖములు
        ఎందెందున శ్రీరామ కీర్తన
        అందందున హనుమాను నర్తన ॥ శ్రీ ॥
   
            శ్రద్ధగా దీనిని అలకిమ్పుమా
        శుభమగు ఫలములు గలుగు సుమా
        భక్తీ మీరగ గానము సేయగ
        ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ ॥ శ్రీ ॥

        తులసీదాస హనుమాను చాలీసా
        తెలుగున సులువుగా నలుగురు పాడగ
        పలికిన సీతారాముని పలుకున
        నాలో దోషములున్న మన్నింపు మన్న ఓ హనుమన్నా
   
        మంగళహారతి

        మంగళహారతి గొను హనుమంత
        సీతారామ లక్ష్మణ సమేత
        న అంత రాత్మ నిలుమో అనంత
        నివే అంతా శ్రీ హనుమంతా

        ఓం శాంతి: శాంతి: శాంతి:

            హనుమత్ సూక్తమ్

        శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రద సర్వా భరణ భూ షిత ఉదారో మహోన్నత ఉష్ట్రా రూడ : కేసరి ప్రియ నందనో వాయు తనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధ మాదన సంచారీ హేమ ప్రాకారామ్చిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ వస్త్రం చ భిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్ప్రతాపశాలీ రజతవర్ణ: శుద్ధ స్పటిక సంకాశ : పంచ వదన: పంచదళ నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రామణో మహేమ్ద్రాద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గిర్వాణ మునిగణ గంధర్వ యక్ష్ కిన్నర పన్నగాశుర పూజిత పాద పద్మయుగళో నానా వర్ణ కామ రూప : కామచారీ యోగి ద్యెయ : శ్రీ హనుమాన్ ఆంజనేయ: విరాడ్రూప: విశ్వాత్మ పవన నందన: పార్వతీ పుత్ర : ఈశ్వ ర తనూజ సకల మనోరధాన్నో దదాతు
--(())--


05. [దైవ నామ స్మరణ ఇందులో మాధుర్యము గొప్పతనము నేను అనుభవించి మీకు చెప్తున్నాను🙏

ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో, ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని
మన మదిలో నిలుపుతాయి. నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం

బెల్లం బెల్లం అంటేనే బెల్లం రుచి మనకు తెలియదు. అలాగే, తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి. తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.

దైవనామం, దైవం వేరు కాదు. ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.
అది నిజం అని భగవదనుభూతిపరులు తెలియజేశారు. ఉపనిషత్తుల్లో భగవన్నామ స్మరణ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి. పిలిస్తే పలికే భగవంతుడని ఎందరో భక్తులు ఋజువు చేశారు.

సరే, నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు.
ఎంతకాలం నిరీక్షించాలి. ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని చాలామందికి సందేహం.
అందుకే కొంతకాలం నామం చెప్పి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.
అక్కడే మనం నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. అందులో వేడి కనిపించకపోవచ్చు. ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది. 

నామస్మరణతో మనసు పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారుతుంది. కొన్నాళ్లకు మనసే మారిపోతుంది.
పుట్టుక నుంచి వచ్చిన చెడ్డ గుణాలు ఒక్కొక్కటిగా మనల్ని వదిలిపోయి, వాటి స్థానే ప్రేమ వచ్చి చేరుతూ ఉంటుంది.

నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.
బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. పరవశించి దివ్య తన్మయత్వంతో చేసే పరమశివుడి పంచాక్షరి అవుతుంది.

భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం గొప్పతనాన్ని విశ్వానికి చాటారు.

 పురాణాల్లో శాస్త్రాల్లో చదివేము ఆ మహానుభావులు గురించి కానీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను  నామస్మరణం వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను మీ అందరి అభిమానం పొందుతున్నాను నా తండ్రి శివయ్య నాతోనే  నా పక్కన ఉన్నడు అన్న చక్కని అనుభూతి పొందుతున్నాను 🙏

హనుమ నిత్యనామం "ఓం శ్రీరాం "
మహాశివ నిత్యనామం " ఓం శ్రీ రాం "
పూజ నిమిత్తం సామగ్రి కొనాలి. నియమాలు పాటించాలి. ధనం ఉండాలి. వ్రతాలకు, నోములకు కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి.
శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి. అందుకే, కలియుగంలో నామస్మరణను మించింది లేదని ప్రతిపాదించారు పెద్దలు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే, ఆ చేసే పని పవిత్రమవుతుంది.
అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ ఈశ్వరార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని
సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు?
తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో....
 
పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ కలవడానికి తొందరగా ఉంటాడు. మన నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే
ఇప్పుడే అతడు మనకు చేరువవుతాడు]

🙏🙏🌹🌹

06. 🌼🌿సుందరకాండ మహిమ 🌼🌿

ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.
ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్ట చివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు.
అందుకే, ప్రత్యేకించి సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు అని అంటారు. కారణం ఏమంటే శ్రీ రామాయణం లో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది.
సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు.
రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ! అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.
ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే! 

ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా
అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. - అలాగే, సుందరాకాండ ని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.
రామాయణం లో ఒక్క సుందరకాండకొచ్చేసరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు కావు. చాలా శ్లోకములు మంత్రములే.
అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే, 

పిల్ల పెళ్ళవలేదు! - సుందరకాండ చదువుకోండి.
పిల్లాడికి ఉద్యోగం రాలేదు - సుందరకాండ చదువుకోండి.
ఆరోగ్యం బాలేదు - సుందరకాండ చదువుకోండి.
ఏమిటో భయంగా వుంటోంది - సుందరకాండ చదువుకోండి.
భీతి కలిగింది - సుందరకాండ చదువుకోండి.
ఏ కష్టం కలగనీండి - సుందరకాండ చదువుకోండి ఫలితం వుంటుందని నమ్ము
తారు భక్తులు.

ఎందుకనంటే - లోకం లో ఇంత  శక్తిమంతమైనవి  రెండే రెండు  సాహిత్యం లో వున్నాయని చెబుతారు పెద్దలు. ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.   
 ఆ రెండూ ఏమిటంటే ఒకటి సుందరకాండ, రెండు - సౌందర్య లహరి. మూడు ఇక లేదు.
రెండూ సౌందర్యము, సుందరము   ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి.
రామానుగ్రహాన్ని    ప్రసాదించే   శక్తి సుందరకాండలో వుంది.#రామభక్త హనుమాన్ కి జై  #దండలయ్య సామి 🙏🏻
🙏🙏🙏🙏🌹🌹🌹🌹

--(())-- 07.  🌹. దేహ, జీవ, పరమాత్మల సమన్వయము - హనుమ చెప్పిన వేదాంత రహస్యం 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

ఒక రోజు శ్రీ రాముడు హనుమంతుని దగ్గరికి పిలిచి "హనుమా! నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా. దేహ, జీవ, పరమాత్మలకు సమన్వయము చేస్తూ చెప్పు" అని కోరాడు.

అదే శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి

"శ్రీ రామా! వేదాంత రహస్యము తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరు వేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ, సేవించాలి.

అన్ని భావాలను త్యజించి, శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ, వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి, సేవించాలి.

ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ, భగవంతుని స్మరిస్తూ, భగవంతుని పూజలు చేస్తూ,. భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు.

జీవుడు, పరమాత్మ ఒక్కరే. ఎందులోను భేదం అనేది.లేదు అనే భావనలో, ఆచరణలో చూపించటం జ్ఞాన లేక, విజ్ఞాన  లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన..

"దేహ బుధ్యాతు దాసోహం, జీవ బుద్ధ్యాతు త్వదంశః ... ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతిమే నిశ్చితా మతిహ్

"రామా! దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని. జీవ దృష్టిలో నీవు పరమాత్మవు. నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను. పరమాత్మ దృష్టి లో 'నీవే నేను-నేనే నీవు' ఈ మూడు లక్షణాలు నాలోనూ, నీలోనూ ఉన్నాయి. ఇంక భేదానికి అవకాశమే లేదు" అని స్పష్ట పరచాడు హనుమ.

అంజనానందనుడి సమాధానం విని పరమానంద భరితుడయ్యాడు దాశరధి "త్వమేవాహం, త్వమేవాహం" అని చాలా సార్లు హనుమను అభినందించాడు.

"యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః
యత్రాస్తి మోజొ నహి తత్ర భోగః
శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం
భోగశ్చ, మోక్షశ్చ, కరస్త యేవ"

అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కాని శ్రీహనుమ సేవాతత్పరులైన వారికి భోగమూ, మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు "వరం" అనుగ్రహించాడు.

దానికి వెంటనే ఆంజనేయుడు "నువ్వు శివుడవు, నేను భద్రుడను, నీకూ నాకు భేదమే లేదు" అని చెప్పాడు.

--(())--

శ్రీ ఆంజనేయ కధలు 
08. ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై

ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా..............!!

పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు.

''రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి.
నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు.

కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు'' అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు.

అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ''రామ రామ రామ'' అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు.

''ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్''

అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.

మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

--(())--

08. *హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది.

అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?

అష్టసిద్ధులు...

1.అణిమా,2.మహిమ,3.లఘిమ,4.ప్రాప్తి,5.ప్రాకామ్యము,6.ఈశత్వం,7.వశిత్వం,8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము)
1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట

నవనిధులు.

1. పద్మం, 2. మహాపద్మం, 3. శంఖం, 4. మకరం, 5. కచ్చపం, 6. ముకుందం,7. నీలం, 8. కుందం, 9. వరం
(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి).

ఆంజనేయ స్వామి లంఖిణి జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంఖిణి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు వచ్చి. కొండంత శరీరాన్ని పెంచి లంఖిణిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. 
ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తారు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు.. 
‘శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప.

అందుకే హనుమంతుడు గొప్పనమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు.*

🙏🙏🙏🌹🌹🌹

10. [09:03, 03/03/2020] Mallapragada Sridevi: *🌼🌿#నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం🌼🌿

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.

నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు. 

కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు. 

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం. 

రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. 

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. 

శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

♦మాణిక్యం (సూర్యుడు)..
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

♦ముత్యం (చంద్రుడు).
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

♦పగడం (కుజుడు).
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

♦మరకతం (బుధుడు).
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

♦హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

♦ఇంద్రనీలం (శని)..
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

♦గోమేదికం (రాహువు)..
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

♦వైడూర్యం (కేతువు)..
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
జై హనుమాన్*

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ