* డాక్టర్ శ్రీ ప్రసాదరాయ కులపతిగారు
* 'అలాక్కాదు..
* స్వామివివేకానంద
* మూడు కోతుల కథ:
:
డాక్టర్ శ్రీ ప్రసాదరాయ కులపతిగారు
వీరు నేడు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి.
వీరే పూర్వాశ్రమంలో.... సాహిత్య, అవధాన, ఆశు కవితా, భువనవిజయ సామ్రాజ్యాలలో సమ్రాట్ గా వెలిగిన డాక్టర్ శ్రీ ప్రసాదరాయ కులపతిగారు. గుంటూరు హిందూ కాలేజ్ కులపతి/ Principal గా, తెలుగు ఉపన్యాసకులుగా విద్యార్థులను సన్మార్గంలో నడిపిన గురుదేవులు.
మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యోగాభ్యాసం,వ్యాయామం, ముష్టియుద్ధం, వెయిట్ లిఫ్టింగ్, అవధానం, ఆశుకవిత్వం... ఇలా బహువిద్యలలో అసమాన ప్రతిభామూర్తులైన దివ్య దీప్తులు వీరు.
ఇంతటి బహుముఖ ప్రజ్ఞా జ్ఞాన ఘనులైన పీఠాధిపతులు భారతదేశంలోనే వీరు తప్ప ఇంకెవరూ లేరన్నది పెద్దలమాట !!
వీరి ధారణ, సాధన అనన్య సామాన్యం. కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు వీరి మస్తిష్కం లో నిక్షిప్తమై ఉంటాయి. వీరు అనేక దేవతల మంత్రాలను కొన్ని కోట్ల పర్యాయములు ఉపాసించారు.
వీరి ఉఛ్వాస నిశ్వాసలే మంత్రములు... మంత్రములే వీరి ఉఛ్వాస నిశ్వాసములు...
వీరిని చూస్తేనే? నడిచి వచ్చే మంత్రాధిదేవతలా.. తరలివచ్చే పూర్వమహాకవి సమూహముగా అనిపిస్తుంది..
వీరి పూర్వీకులూ అంతటి వారే! వీరి ముత్తాత శ్రీ పోతరాజు రామకవి. వీరు 20 కళలలో నిష్ణాతులు. సుప్రసిద్ధ కొప్పరపు సోదర కవులకు వీరే అవధాన గురువరేణ్యులు. కులపతి గారి పితామహ వంశం పోతరాజు వారు, మాతామహ వంశం కొప్పరపు వారు.
రెండు వంశములలో పూర్వులంతా మహా మంత్రులు,దండనాథులు, దివానులు, గ్రామాధికారులు, మహాకవులు.అందుకే? అటు కవిత్వము, ఇటు వ్యాయామము రెండింటి పట్ల ఆకర్షణ, అనురాగం, సాధన, ప్రజ్ఞ సహజసిద్ధంగా వీరికి వచ్చాయి.
వీటి సాధనలో వీరు ఎంచుకున్నది ఉపాసనా మార్గం. ఇందుకే, ఆ విద్యలు రక్తనిష్ఠమై,హృదయ కంజాతస్థమైనాయి.
బహుశా! తిక్కన, పెద్దన, తిమ్మరసు వంటి మహనీయులు ఈ కుటుంబాలకు ప్రేరణ అయిఉంటారు. తిక్కన కుటుంబీకులు దండనాధులుగా, మహా మంత్రులుగా, గ్రామాధికారులుగా చరిత్ర ప్రసిద్ధులు.
అల్లసాని పెద్దన శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధవ్యూహం, రణతంత్రంలో గురు దేవులుగా ఉండేవారు.
ఇక, తిమ్మరసు వారిది ఇక్కడి కొండవీడు ప్రాంతం నుండే వెళ్లిన కుటుంబం. రాయలవారి కుటుంబాలకు తండ్రి, గురువు, దైవము... అన్నీ తిమ్మరసు వారే అన్నది చరిత్ర లిఖితము.
ఇలా... ప్రసాదరాయ కులపతి గారి వంశాలపై వీరందరి ప్రభావం తప్పక ఉంటుంది.
కులపతి గారు మొట్టమొదటి అవధానం తన 15వ ఏట కొప్పరం లోనే చేశారు. ప్రఖ్యాత కొప్పరపు కవుల తమ్ముడు బుచ్చిరామయ్య గారి అధ్యక్షతలో జరిగింది. అలా మొదలైన వారి అవధానం అప్రతిహతంగా సాగింది.
కులపతి గారి గురుదేవులు శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు. వారి సూచనతో కులపతి గారు అవధానాలకు స్వస్తి చెప్పి, తెలుగులో M. A., Phd సంపూర్ణం చేశారు.
మహాకవి పోతన్న భాగవతం పై వీరి పరిశోధన జరిగింది. ఆ ఆశుకవితా ధోరణి ని, ఆ అవధాన విద్యామూలమైన ధారణను భువన విజయాలలో ప్రదర్శించి, పద్యానికి పట్టాభిషేకం చేశారు.
2002లో సన్యసించి, కుర్తాళ పీఠాధిపతులయ్యారు. పూర్వం శ్రీ మౌనస్వామి, శ్రీ విమలానంద భారతి, శ్రీ త్రివిక్రమ రామానంద భారతి, శ్రీ శివ చిదానంద భారతి వంటి మహితాత్ములు అధిపతులు గా ఉన్న శ్రీ సిద్ధేశ్వరీ పీఠానికి వీరు నేడు అలంకృతులయ్యారు.
తమిళనాడులో తెలుగు స్వామి మౌనస్వామి 1916లో స్థాపించిన ఈ సిద్ధేశ్వరీ పీఠం.. నేటి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ఏలుబడిలో.... ఆధ్యాత్మిక, సారస్వత , సంగీత సమలంకృతమై వేయి వెన్నెలలతో మేటి పీఠంగా వెలుగులీనుతోంది...
తిక్కన, పోతన, శ్రీనాథుడు, శ్రీ కావ్యకంఠ గణపతిముని, తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటి... మహా ఔపదేశిక, సహజ కవులే ప్రసాదరాయ కులపతి గారి కవన, ఉపాసనా జీవనానికి ప్రభావ మూర్తులు.
అవధాన, ఆశుకవిత్వం తో పాటు ఎన్నో మహాద్భుతమైన రచనలు చేసిన మహాకవి, మహా మనీషి, మహితాత్ముడు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి.
" కులపతి.. కులపతి.. మహాకవి దళపతి 'అని కీర్తిగాంచిన ఈ మహనీయునికి, మహా మంత్ర స్వరూపంగా భాసించే ఈ స్వాములవారికిి అక్షర సుమములతో అర్చన చేస్తున్నాను -
రోజుకు వెయ్యి నేల దండీలు, రెండు వేల బస్కీలు తీసేవారు. ఇనుప కడ్డీలను ఒంచేవారు. పెద్దపెద్ద రాళ్లను ఎత్తి పడేసేవారు. కొన్ని గంటలపాటు ఒకే యోగాసనంలో ఉండేవారు. ఇక యోగ సాధన అసామాన్యం. కొప్పరపు కవుల తర్వాత వీరంతటి వేగంగా పద్యాలు చెప్పే నేర్పుకలవారు లేనేలేరు. వారు పుస్తకాలు చదివి, 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ కొన్నివేల పద్యాలు, శ్లోకాలు వారి రసనాగ్రంపై నాట్యం చేస్తూ ఉంటాయి. 10వ తరగతి నుండి Phd. వరకూ వారే అగ్రస్థానం సాధించారు. 19 ఏళ్లకే కాలేజీలో Tutor అయ్యారు. ఇక వారిది కఠోరమైన మంత్రసాధన. ఇంతటి ప్రతిభ, శక్తి, సాధన, పట్టుదల ఉన్న ఈ స్వామివారిని మనం దర్శించుకోవడం, వారు ఉన్న కాలంలోనే మనమూ ఉండడం మహద్భాగ్యం... అని, నా భావన..
--(())--
'*అలాక్కాదు..
.
'చచ్చిపోయేమనుకో
'చచ్చిపోయేమనుకో
అప్పుడు ఏమవుతుందంటావ్?'
'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది'
'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.. మంచి బేరం పోయిందే.. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు'
'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?'
'స్వర్గం అంటే ఏమిటో?'
'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, మేనకా డాన్సాడుతూంటారూ..'
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '
' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా '
' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? '
' సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా? '
' ఛఛ.. మా ఆవిడ పతివ్రత.. '
' అంటే.. నువ్వు వెధవ్వన్నమాట'
' సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా? '
' నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి? పోనీ.. వేయించేడే అనుకో... వేయించి ఏం చేస్తాడూ? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు.. '
' అంటే వేయించడంటావా? '
' ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా? '
' అంటే.. స్వర్గం, నరకం లేవంటావు? '
' ఎందుకు లేవూ?... స్వర్గం, నరకం చస్తే ఉండవు... బతికుండగానే ఉంటాయి .. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో... అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.... అది నరకం.
--)())--
* స్వామివివేకానంద
స్వామివివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..
ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!
.
ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..
వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...
.
ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!
" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"
.
దానికి వివేకానందుడు..!!
ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :
" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.
(1St Punch👊)
.
ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!
ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!
.
ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...
వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!
"వివేకానందా..!!
నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..
నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!
ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"
.
వివేకానందుడు (సందేహించకుండా)...
"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!
.
ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..
"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!
నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!
.
దానికి వివేకానందుడు..!!
" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"
(2nd Punch👊)
.
ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!
అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...
వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!
.
టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!
ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!
.
కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..
వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!
.
ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...
తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది
కోపం తగ్గిన తరువాత హుందాగా..
ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...
గౌరవప్రదంగా...
వినమ్రమయిన శాంత స్వరంతో...
"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)
😆😆😆😆😆that is. Vivekananda
మూడు కోతుల కథ::
ఒక చెట్టు మీద ముచ్చటగా మూడు కోతులుండేవి. మూడు కోతులూ మంచి ఐకమత్యంతో మంచి స్నేహంతో ఒకేమాట, ఒకేబాట అన్న విధంగా ఉండేవి. ఆ కోతుల మధ్య ఐక్యత ఎక్కువగా ఉండటం వల్ల పాములుగానీ, పక్షులుగానీ, కుక్కలు గానీ, నక్కలు గానీ, చివరకు చీమలు, దోమలు, ఈగలు, పురుగూ పుట్రా కూడా వాటి జోలికి రావడానికి సాహసించేవి కాదు.
కోతుల మధ్య ఐక్యత చెడగొట్టడానికి ఒక కాకి ప్రయత్నించింది.
అంతవరకూ ఆ కోతులకు అలవాటులేని మాంసాహారం అలవాటు చేసింది, అక్కడక్కడా దొరికిన మాంసం ముక్కలు తెచ్చి కోతులకు అందించేది. ఒకసారి ఆ కాకి కల్లు దుకాణంలో విసిరేసిన గ్లాసులు, సీసాలలోని కల్లు తాగి వచ్చి కోతుల ముందు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఆడుతూ.. పాడుతూ తైతక్కలాడింది. కల్లు తాగిన కాకి చేష్టలు ఆ కోతులకు బలే మజా, సరదా అనిపించింది. ‘నేస్తమా నీ హుషారుకి కారణమేమిటి అని అమాయకంగా అడిగాయి ఆ కాకిని. ‘మిత్రులారా నేను మాంసం ముక్కలు తింటూ కల్లు తాగి మజా చేసుకుంటాను. ఇదే నా ఆనందాల రహస్యం అని చెప్పింది కాకి గెంతులు వేస్తూ. మూడు కోతులకు కల్లు దుకాణం వైపు మనసు దారి తీసింది, కాకి దారి చూపగా కోతులు కల్లు దుకాణానికి చేరుకుంటూ కల్లు గ్లాసులు, ముంతలు, సీసాలు, కుండలు నాకడం నేర్చుకున్నాయి.
అప్పటి నుండి కోతులకు కల్లు తాగడం, మాంసం తినడం, తైతక్కలాడటం నిత్య చర్యలు అయిపోయాయి. అసలే కోతులు, వాటికి స్వతహాగా చపల చిత్తం, అల్లరి చేష్టలు ఉంటాయి, పైగా కల్లు తాగి ఉండేవి కాబట్టి చీటికీ మాటికీ కీచులాడుకుంటూ, తగువ్ఞలు, తంటాలు పడుతూ విడిపోయాయి. కోతుల మధ్య ఐక్యత చెడి ఆ చెట్టు మీదే ఒక్కొక్కటీ ఒక్కొక్క కొమ్మమీద వేరు వేరుగా నివాసముండేవి. వాటి మధ్య మాటామంతీ ఉండేది కాదు, ఇది గమనించి, ఒక పాము ఒక కోతి మీదకు వచ్చి తన ఇష్టానుసారం కాట్లు వేసింది. మిగతా రెండు కోతులూ పాము చర్యలను చూస్తూ.. వారించకుండా ప్రేక్షక పాత్ర వహించాయి. పాము కాట్లకు గురైన కోతి ప్రాణభయంతో అక్కడ నుండి చాలా దూరం పారిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు వచ్చి రెండు కోతుల్లో ఒక కోతిని పట్టుకుని వెళ్లిపోయాడు.
అప్పుడు మూడో కోతి వేటగాడిని అడ్డుకోలేదు, ఉదాసీనత చూపింది. ఇక మిగిలింది ఆ చెట్టు మీద ఒక కోతి మాత్రమే. ఆ కోతి కూడా మాంసాహారానికి, కల్లు తాగడానికి బానిస అయిపోయి, నిత్యరోగంతో చెట్టుమీద నీరసంగా, కునుకుపాట్లు పడుతుండేది. ఆకతాయి జీవ్ఞలు ఆ కోతిని ఆటపట్టిస్తూ అవమానపరిచేవి. గాయపరిచేవి. అప్పుడు ఆ కోతికి అర్ధమయింది.
‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని పెద్దలు ఎందుకు అంటుంటారో, ఒక ఆకతాయి కాకి ఈర్ష్యబుద్ధితో చెప్పిన చెడు మాటలు విని, చెడు వ్యసనాలు నేర్చుకుని, మిత్రుల మధ్య ఐక్యత చెడగొట్టుకుని ఎంత నష్టపోయామో అని చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఆ కోతి మాంసాహారం తినడం, కల్లు తాగడం క్రమంగా మానేసింది. మిత్రుల కోసం చుట్టుపక్కల వెదకడం మొదలుపెట్టసాగింది.
మరలా ఏకమై మూడుకోతులు ఒకేచిత్తుపైకి చేరినాయి.
--((*))--
Comments
Post a Comment