పద్యాలు






ఊయలూగియు చేరి పెర్గియు ఉన్నతమ్ముయు చూపియే తల్లి ముద్దుయు పల్లె ముద్దుయు తండ్రి ముద్దుయు పంచెనే అన్న ప్రేమయు తండ్రి సేవయె ఆత్మ లక్ష్యము పెర్గెనే కంస రాజుకు గుండె జబ్బుయు కర్గె కృష్ణను చూడగా మ. ఏమి కోరను ఏది ఇవ్వకు ఎంత భక్తియు కోరుతా రామ చంద్రుడు ఆశ తీర్చిన రమ్య సీతను కోరుతా సీమ బత్కుల ఈతి భాధను స్వేచ్ఛ చూదుము కోరుతా ఏమి చెప్పిన హృధ్య భాదను ఎన్ని అయ్యెను దాసుగా


గొల్లపిల్లొడు ఘల్లుఘల్లున గంతులేసియు దాగుడే
పిల్ల లాటల బాలకృష్ణుడు హాస్యమాడుతు ఆడుతూ
వల్లమాలిన భక్తిచూపిన సోదరుండుయు బ్రాహ్మణా
బాలుడేవినయంతొఎత్తెనె సంతసిచెను కృష్ణుడే




జన్మ భూమియు బంధి కానయు రక్కసమ్మును దాటియే
విష్ణు మూర్తియు దేవి మాయయు బాల రక్షణ చేసియే
వెంట ఉండియు తల్లి తండ్రి యు ప్రేమ పంచియు పెర్గెనే
చేరి ఉండియు గొల్ల పల్లెయు సంత సమ్మున ఉండెనే



నేను నాశన కాని మైనపు దేహ మైనను దీపమే
కాని దంటుయు లేని వాడను ఉన్న దంతయు దీపమే
అని ముత్యపు తామ రాకున నీటి బిందువె దీపమే
నేను అన్నిట ఉండి ఉన్నను భక్తి రక్షణ దీపమే


ప్రాంజలి ప్రభ పద్యపుష్పము 

రామ నిన్నెను  నమ్మి వుంటిని వమ్ము చేయక మమ్మునే 
మేము చేసిన పాప పుణ్యము లెక్క కట్టియు చూడుమా  
ప్రేమ చూపియు ఆశ తీర్చియు మంచి చెడ్డను తెల్పుమా 
కమ్ము కున్నటి ఇష్ట కష్టము సాటి భాధలు తీర్చుమా 

రామ నామము పాడు చుంటిని నిత్య భక్తిగ జానకీ
రామ గానము చేసి అంకిత భావ బంధము సీతగా
రామ కాలము నిత్య సత్యము పల్కు వేదపు నీతిగా
రామ
 యోగము ధర్మయుద్ధము నీకె చెల్లును రాజుగా
రామ రక్షయె భాగ్య బీదకు నిత్య సత్యపు సత్క్రపన్
అమ్మ సీతయు ఆంజ నేయుని సత్య దీవెన సత్క్రపన్
లక్ష్మి సొంతము పొందుకే సుమ మాలికా సమ సత్క్రపన్
మేము నిత్యము సీతరాముని ఆంజనేయుని సత్క్రపన్

బాహ్య సౌఖ్యము యవ్వనత్వము కోరియుండుట ప్రేమగా
జిహ్వ చాపము  ఇంద్రి యానము  బాల్య చేష్టలు ప్రేమగా
లేహ్య మన్నది  నిత్య శక్తిగ  ప్రాజ్ఞు లందరు  కోరగా
స్నేహబంధము ప్రేమబంధము  దైవమాయము  లోకమే

ऊँ!
----


 నేను రాముడు నేను కృష్ణుడు సర్వ లోకపు రక్షకే
చేను నేనుయు పువ్వు నేనుయు కాయ నేనుయు సర్వమూ
కాని దంటుయు లేని దంటుయు ఉన్న దంతయు రక్షణే
అన్న మాటకు నవ్య పూజకు మోక్ష మిచ్చును కృష్ణుడే

వట్టి వేషము బత్కు నీడలో కష్ట నష్టము జర్గుటే
గట్టి మాటకు రుక్మిణీపతి స్త్రీలప్రేమను పొందుటే
పట్టు పట్టియు పట్టు వస్త్రము వెండి పుత్తడి కానుకే
మేరు నవ్వులొ చిన్మయా లయ సుంద. రత్వపు హృద్యమే
చారు హాసక చిద్వి లాసక కారుణ్య భవ భంధకా
నేర్పు కూర్చియు రుక్మిణీ పతి ప్రేమ పాఠము చూపియే
ఆరు నూరుగ ప్రేమ సాక్షిగ ఇద్దరేకము ప్రేమయే




 చూసి చూడక రెప్పవాల్చక చూపులెందుకు కృష్ణుడా
మోసి మోయక హృద్యతాపము విందు చేసెద కృష్ణుడా
మూసి మూయక తెర్చి తెర్వక కష్టసాధ్యము కృష్ణుడా

కోసి తెచ్చితి పువ్వుకాయలు పొందు కోసము కృష్ణుడా



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ