శ్రీవివేకానందుని జీవితచరిత్ర





08. అమృతస్య పుత్రాః
శ్రీ వివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు - 51
🕉🌞🌎🌙🌟🚩

నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు.

స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో  చెప్పుకుంటున్నాము కదా ! 

పాశ్చాత్య ప్రముఖులు అనేకులు స్వామికి శిష్యులైనారు.  అలాగే సామాన్యజనులు కూడా వేలాదిమంది తాము స్వామి శిష్యులుగా ఐచ్ఛికముగా  ప్రకటించుకున్నారు.  అందులో, కొందరు అర్హులైన వారు కోరిన మీదట వారికి సన్యాసదీక్ష కూడా యిచ్చారు, స్వామి.  

నిరంతర తీవ్ర మహోద్యమ కార్యాచరణలో స్వామి మునిగివున్నప్పుడు,  స్వామికి అప్పుడప్పుడు విసుగు రావడం  సహజమే కదా !   అలాంటి సమయంలో స్వామి తమ వైరాగ్యభావనను ప్రకటించుకుని నిలదొక్కుకునే వారు.  '  నా కాషాయాంబరాలు, నా కేశములు లేని తలా ( గుండు )  నా అరణ్య విహారం, నా భిక్షాచరణ మళ్ళీ నాకెప్పుడూ లభిస్తాయో కదా  ! ' అనుకునే వారు.   సామాన్యంగా రాజభోగాలు అనుభవిస్తూ, నాయకత్వ పీఠం మీద వున్నవారు, తమ వెనుకటి జీవితాన్ని గుర్తు ఉంచుకునే అవకాశం వుంటుందా ?  అదే స్వామి వ్యక్తిత్వం. అందుకే వారిజీవితం మనం చదువుకుంటున్నాం. 

ఆయన కార్యాచరణ శైలి యెలా వుండేదంటే, ' సమాజంలో లోపాలు వుండవచ్చును గాక !  కానీ ఆ లోపాలను సరిదిద్దుకోవడం కూడా సమాజం మార్పులో భాగంగా యెప్పటికైనా, ఇంకా వెయ్యి సంవత్సరాలకైనా జరిగితీరుతుంది.  మన అంతర్వాణిని వింటూ, మనము చేయవలసిన ఇతోధికమైన సేవ సమాజానికి చేయడమే ! '  అనే లక్ష్యంతో వుండేవారు.    ఫలాపేక్ష రహితుడై తన సందేశాన్ని  ప్రజలకుఇవ్వడమే, స్వామి సంకల్పం.   ఇదే కదా నిష్కామ కార్యాచరణ. 

ఈ  ప్రక్రియలో కొందరు,  స్వామికి, సమాజంలోని పెద్దమనుషులతో పరిచయం పెంచుకుని పలుకుబడితో ముందుకు వెళ్లమని సలహా ఇచ్చారు.   అందుకు స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు.   'పరమేశ్వరుడు ఎవరిని నా వద్దకు పంపుతాడో, వారే ' పెద్దమనుషులు. '  స్వానుభవం మీద నేను ఈవిషయం తెలుసుకున్నాను.   అలాంటి వాళ్లే నాకార్యాచరణలో పనికి వస్తారు.    ఇంకెవరైనా మొక్కుబడిగా వచ్చేవాళ్ళుంటే, భగవంతుడు నన్ను వారి బారిన పడకుండా రక్షించు గాక ! '  అని చమత్కరించారు. 

ఆ తరువాత శివస్తోత్రం చేస్తూ, స్వామి వివేకానందులు, ఇలా ప్రార్ధించారు :  

' పరమేశ్వరా !  బాల్యం నుంచీ నువ్వే నావెంట వున్నావు.   నేను ఎటువెళ్లినా, ఎన్ని కంటక ప్రదేశాలలో ప్రవేశించినా నా ఒంటరితనాన్ని పోగొట్టి, నా ప్రక్కనే నువ్వు వున్నానని ఎన్నోసార్లు నిరూపించావు. '  అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు, స్వామి.  

ఆ  ప్రయాణంలో, తరువాతి కొద్దిరోజులకు,  స్వామి తమ పుస్తకాలలో,  ' నరుడు చేసే సాయం యెంత ?  నరుల మీద ఆధార పడడం మానివేసిననుండీ, నారాయణుని సాయం అంది వస్తూ వుంటుంది. '   '  నా కర్తవ్యమ్ నాకు తెలుస్తూనే వున్నది. పరమ దుర్మార్గులను గుణవంతులుగా తయారు చేయడమే, ఆచార్యుని పని.  నేనొక వ్యక్తి ముఖం చూడగానే,  అతడి గుణము,  స్వభావం తెలిసిపోతూ వున్నది, రామకృష్ణుల అనుగ్రహంతో.  '  అని వ్రాసుకున్నారు. 

స్వామి కార్యక్రమాలు అపరిమితంగా వృద్ధి చెందుతున్నాయి.   స్వామికి తీరిక అనేది లేకుండా పోయింది.  విశ్రాంతి అత్యావశ్యకమని తోచింది.   అలాంటి సమయంలో స్వామిని, ' థౌసండ్ ఐలాండ్ పార్క్ ' లో వేసవి గడపమని, శిష్యులు ఆహ్వానించారు.   అక్కడ స్వామి గడిపిన జీవితాన్ని గురించి సోదరి నివేదిత ఇలా చెప్పుకొచ్చారు : 

స్వామి మాతో వచ్చి ఇక్కడ వున్న విడిదిలో విశ్రాంతి తీసుకుంటారని తీసుకు వస్తే,  అక్కడ కూడా తమ కర్తవ్య నిర్వహణకు నడుం కట్టారు.   స్వామి తన శిష్యులనుండి యోగులను తయారు చెయ్యడమే తమ లక్ష్యం అని చెప్పారు.   మాకు ఆయన మంత్రోపదేశం చేసి, తన దివ్యదృష్టితో, మా జీవిత వృత్తాంతాలను పూస గుచ్చినట్లు వర్ణించారు.   ఆయన తమ దివ్య బోధలనే రెక్కల మీద కూర్చోబెట్టుకుని, ఆత్మానంద ధామానికి మమ్మల్ని తీసుకువెళ్లారు.   మాకు ముక్తి మార్గం చూపడమే స్వామి పరమ సంకల్పం అని గ్రహించాము.   అవతార మూర్తి అయిన వివేకానందుని సాన్నిధ్యంలో గడపడానికి మేమెంత పుణ్యం చేసుకున్నామో  అనిపించింది.  అహోరాత్రాలు మాకు అక్కడ  స్వామితో భగవంతునికి సంబంధించిన చింతనే... '

అని సుదీర్ఘంగా సోదరి నివేదిత వ్రాసారు.   అక్కడ వున్నన్ని రోజులూ స్వామి పరిచారకులను ఉపయోగించుకోవడానికి ఇష్టపడక,  స్వయంగా,  లేదా శిష్యుల ద్వారా తమ పనులు చూసుకునేవారు.   గానము, కవిత, వక్తృత్వము, మొదలైన వాటిలో స్వామి యెంత నిపుణులో, పాకశాస్త్రంలో కూడా  అంతే నిపుణత చూపించేవారు.  మధుర భక్ష్యాలు స్వయంగాచేసి శిష్యులకు పెట్టి ఆనందించేవారు, స్వామి. 

థౌసండ్ లైట్స్ పార్క్ లో స్వామి చేసిన ఉపన్యాసాలు, మహోపదేశాలు,  దివ్యవాణి ( 
 Inspired  talks  ) పేరుతో సుప్రసిద్ధ గ్రంధంగా రూపుదాల్చాయి.   

అందులోని కొన్ని అమృత వాక్కులు :  

భగవంతుడు ఒక్కడే దాత.  మిగిలినవారు వ్యాపారస్తులు. 

నీలో ఆత్మశక్తిని ఉద్దీపింప చేసేవాడే గురువు. 

సంఘాన్ని గానీ, వ్యక్తిని గానీ బలాత్కారంగా సంస్కరించాలని ప్రయత్నిస్తే, ఎదురయ్యేది ఎప్పుడూ అపజయమే !  '  నువ్వుమంచివాడవే కానీ, ఇంకా మంచివాడవు అవడానికి ప్రయత్నించు. ' అని చెప్పాలి. 

మానవుడు తాను దుర్బలుడను అనుకోవడమే పెద్ద దోషం. 

పుస్తకాలలో వున్న జ్ఞానం, ఇతరుల చేతిలోని డబ్బు వున్నా,లేకున్నా తేడాలేదు. 

ఆ సమయంలో స్వామి కొందరికి బ్రహ్మచర్య దీక్షను, ఇద్దరికి మాత్రం  సన్యాస దీక్షను ఇచ్చారు.  '   ఏ బంధాలూ లేని వాడను నేను.  నా బంధాలు అన్నీ విచ్ఛిన్నమైనాయి.  అమృత పుత్రుడనైన నేను లోకానికి సందేశం యివ్వాలి.  నా కార్యాచరణలో పాలు పంచుకునే ధీరులను ఉత్తమోత్తములను ఆ పరమేశ్వరుడే నా వద్దకు పంపిస్తాడు. '  అని స్వామి ఆ సందర్భంలో అన్నారు. 

అదే సమయంలో, సామాన్య జనులకు ఈ బోధనలు చేసేకంటే, సంపన్నులను దగ్గరకు దీసి, వారికి బోధిస్తే, యెంతో లాభదాయకమని స్వామికి కొందరు మళ్ళీ సలహా ఇచ్చారు.  ఇలాంటి చవకబారు సలహాలు యివ్వవద్దని వారికి సమాధానం చెబుతూ,  స్వామి జగత్ప్రసిద్ధమైన యతి గీతాన్ని ఆలపించారు.  యతిగీతం సారాంశం :    సంకెళ్లు బంగారం వి అయినా, ఇనుముతో చేసినవి  అయినా అవి సంకెళ్లే .    సన్యాసికి మానావమానాలు సమానమే.   అజ్ఞానమనే నిద్రనుండి ప్రజలను మేల్కొలపడమే యతి ధర్మమనీ ఆ యతిగీతం లో స్వామి చెప్పారు.  

భక్తిజ్ఞాన వైరాగ్యాలతో పొంగి పొరలుతూ వుండే ఈ యతిగీతం అత్యుత్తమమైనది గా ఉత్తరోత్తరా ప్రసిద్ధిగాంచింది.   

Swami Vivekananda Cottage in Thousand Lights park.


🕉🌞🌎🌙🌟🚩
--(())--
09.  💐💐శారదా మాత💐💐

శారదా దేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి.

శారదాదేవి (డిసెంబరు 22, 1853 - జూలై 20, 1920), జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో, బహుముఖ్యులైన, శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు, శారదాదేవిని, శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్, అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించడంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు.

శారదాదేవి, జయరాంబాటిలో జన్మించారు. ఐదేళ్ళ బాల్యప్రాయంలో, ఆవిడ వివాహం, రామకృష్ణులతో జరిగింది. కాని కిశోరప్రాయం వరకూ, రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతులిరువురూ, జీవించినంతకాలం, సన్యాసులవలే, కఠోరబ్రహ్మచర్యం, అవలంబించారు.

 రామకృష్ణుల మరణం తర్వాత, ఈమె కొన్నాళ్ళు, ఉత్తరభారతంలో, తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో, ఉంటుండేవారు. రామకృష్ణులశిష్యులందరూ, ఆమెను కన్నతల్లిలా చూసుకొన్నారు. వారి గురువు మరణం తర్వాత, ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహనివృత్తికైనా, శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు, ఈవిడను ఆదిశక్తి అవతారంగా, భావిస్తారు.

శారదమణి దేవి, పశ్చిమబెంగాల్లో ఒక కుగ్రామమైన జయరాంబాటిలో, ఒక పేదబ్రాహ్మణ ఇంట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు, రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామసుందరీదేవి ధార్మికులు.

 రామచంద్రకి జీవనాధారం పౌరోహిత్యం, వ్యవసాయం. శారదాదేవి జననం ముందు, తల్లిదండ్రులిద్దరికీ, మానవాతీత అనుభూతి కలిగిందని ప్రతీతి.

శారదాదేవి, చాలా సాధారణమైన పల్లెటూరి అమ్మాయిలా, బాల్యం గడిపారు. బాల్యం నుంచే ఆమెకు, హిందూ పురాణ గాథలంటే ఆసక్తి మెండు. అప్పట్లో చాలమంది అమ్మాయిల్లాగే, శారద, పాఠశాలకు వెళ్ళి విద్యనేర్చు కొనలేదు. దినచర్యలో ప్రధానభాగం, అంత పెద్ద ఇంటిని నడపడంలో అమ్మకు సేవచేస్తూ, చిన్నవారైన తమ్ముళ్ళ ఆలనాపాలనా చూస్తూ, ఇతరుల సేవలోనే గడిచేది.

 1864లో బెంగాల్లో వచ్చిన ఘోరకరువులో, అన్నార్తులకు, ఆమె కుటుంబం చేసిన సేవలో, ఆమె కూడా చురుకుగా పాల్గొంది. కాళీ, లక్ష్మీ దేవతల మట్టిబొమ్మలను, సదా పూజిస్తూ ఉండేది. చాలా చిన్న వయసులోనే, ధ్యానం చేసి, పారమార్థిక అనుభూతులు పొందగల్గింది. ఎక్కడనుండో వచ్చిన ఎనిమిది మంది బాలికలు, ఆమె వెన్నంటే చెరువుకు వస్తుండేవారని, తర్వాతికాలంలో, శిష్యులతో అన్నారు.

1855లో శ్రీరామకృష్ణులు సర్వం త్యజించి, దక్షిణేశ్వర్ దగ్గర, కాళీ మందిరంలో, ఆధ్యాత్మికసాధనలు, చేస్తుండేవారు.

 ఆయన అమ్మ, సోదరుడు, పెళ్ళి చేస్తే, ఆయన ధ్యాస కాస్త లౌకికవిషయాలవైపు మళ్ళించవచ్చని భావించి, వధువుకోసం వెతుకుతుంటే, శ్రీరామకృష్ణులే, ఈ శారదామణి తనకు తగిన సంబంధమని సూచించారు. 1859 మేలో వారి వివాహమైంది. అప్పుడు శారద వయస్సు 5ఏళ్ళు, రామకృష్ణులవయస్సు 23ఏళ్ళు. అప్పటి భారతీయ సమాజంలో అది సర్వసాధారణమైన విషయం.

వివాహం తర్వాత శారదాదేవి తల్లిదండ్రుల సంరక్షణలో ఉండగా, రామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళిపోయారు.

 పధ్నాలుగేళ్ళ ప్రాయంలో, ఆమె కామార్పకూర్లో, మూడు నెలలు మళ్ళీ రామకృష్ణులతో గడిపారు. అప్పుడు రామకృష్ణులు ఆమెకు ధ్యానం, ఆధ్యాత్మిక జీవనం గురించి బోధించారు. రామకృష్ణులు తరచూ, భావావస్థలోకి వెళ్ళి, ఏదో మాట్లాడడం చూసి, చాలామంది, ఆయనకు పిచ్చి పట్టింది, అనుకునేవారు.

 మరికొంతమందేమో, ఆయన్నొక గొప్ప సాధువుగా భావించేవారు. ఇదంతా విని, పద్దెనిమిదేళ్ళ ప్రాయంలో, ఆవిడే సంకల్పించి, దక్షిణేశ్వర్ వెళ్ళారు. తనతో, ఇతరులతో, రామకృష్ణుల ప్రవర్తన చూసి, నిజం గ్రహించారు.

దక్షిణేశ్వరంలో, శారదాదేవి, నహబత్ (సంగీతశాల) లోని, ఒక చిన్నగదిలో, నివసించారు. మధ్యమధ్యలో, జయరాంబాటిలో గడిపిన కొన్నాళ్ళు మినహా, 1885 వరకూ అక్కడే ఉన్నారు. అప్పటికే రామకృష్ణులు సన్యాసదీక్ష స్వీకరించారు. శారదాదేవినే మూర్తిగా చేసుకుని, రామకృష్ణులు, షోడశీపూజ నిర్వహించారు. ఆయన ముఖ్యశిష్యుల్లో ఒకరైన స్వామి శారదానంద, వీరి వివాహం, లోకానికి ఒక ఆదర్శవివాహాన్ని చూపడానికేనని, అంటారు. ఆయన శారదాదేవిని, ఆదిశక్తి అవతారంగానే భావించారు. సదా గౌరవంగా సంబోధించేవారు. శిష్యులతో ప్రస్తావించినప్పుడు,' శ్రీమా 'అని అనేవారు.

శారదాదేవి దినచర్య, పొద్దున్నే మూడింటికి మొదలయ్యేది. గంగానదిలో స్నానాదికాలు ముగించి, తెల్లవారేవరకూ జపధ్యానాల్లో మునిగిఉండేవారు. రామకృష్ణులే ఆమెకు మంత్రదీక్షనిచ్చి, ఆధ్యాత్మిక జీవనానికి బాటలు వేశారు. ఆవిడే శ్రీరామకృష్ణుల ప్రథమ శిష్యురాలు అంటారు.

 రామకృష్ణులకూ, ఆయన అనుయాయులకూ, వండి వార్చడానికే, ఆమె  దినచర్యలో ప్రధానభాగం కేటాయించబడేది. చాలాకాలం ఆవిడ తెరవెనుకే ఉండేవారు. కొంతమంది స్త్రీ శిష్యులు మాత్రమే, ఆవిడను చూడగలిగేవారు. ఈ కాలంలో, ఆమె జీవితం ప్రధానంగా సేవ, జప, ధ్యానాలతో గడిచింది.

రామకృష్ణుల చివరిరోజుల్లో, గొంతులో క్యాన్సర్‌తో బాధపడుతూ, కలకత్తాలో ఉన్నప్పుడు రామకృష్ణులకు, ఆయనను రాత్రింబవళ్ళూ చూసుకున్న శిష్యగణానికి, నిత్యం వంటగది అవసరాలన్నీ, ఆవిడే చూసుకొన్నారు.

 1886లో, రామకృష్ణుల నిర్యాణం తరువాత, అప్పటి ఆచారం ప్రకారం, చేతికున్న బంగరు కడియాలు తీసి, విధవరాలి బట్టలు కట్టుకోబోతుంటే, రామకృష్ణులు ఆమెకు దర్శనమిచ్చి, "నేను చనిపోలేదు, ఒకగదిలోంచి మరో గదిలోకి మారాను" అని చెప్పారని ప్రతీతి. ఆయన నిర్యాణం తర్వాత, ఎంతో మంది శిష్యులకు మంత్రదీక్షనొసగి, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ సంస్థలు అభివృద్ధి చెందడంలో, కీలకపాత్ర పోషించారు.

రామకృష్ణుల నిర్యాణం తర్వాత, శారదాదేవి, బనారస్ వెళ్ళి, విశ్వనాథుడి దర్శనం, అయోధ్య వెళ్ళి, రామమందిర దర్శనం, చేసుకొన్నరు. కొన్నాళ్ళు ఆధ్యాత్మిక సాధనలు అనుష్టిస్తూ, మధుర దగ్గరి బృందావనంలో, గడిపారు. అప్పటివరకు తెరచాటునున్న శారదాదేవి, అక్కడే నిర్వికల్పసమాధి పొంది, ఒక ఆధ్యాత్మిక గురువు పాత్ర నిర్వహించడం, ఆరంభించారు. రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన స్వామియోగానంద, మహేంద్రనాథ్ గుప్తా ('మా) లకు, మంత్రదీక్షనొసగారు.

శారదాదేవి చివరి రోజులు, కలకత్తాకు, జయరాంబాటికి మధ్య, పయనిస్తూ గడిపారు. 1919 జనవరిలో, జయరాంబాటి వెళ్ళి, అక్కడే ఒక యేడాది కాలం గడిపారు. అక్కడ చివరిమూడు నెలలూ, ఆమె ఆరోగ్యం క్షీణించగా, ఫిబ్రవరి 27, 1920 న తిరిగి కలకత్తాకు తీసుకువచ్చారు. మరి ఐదు నెలలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు.

 నిర్యాణానికి ముందు, ఆవిడ శిష్యులతో అన్న మాటలివి. "ఒక్క విషయం చెబుతాను-- మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే". దీన్నే ఆమె అంతిమసందేశంగా భావిస్తారు. ఆవిడ 1920 జూలై 20 న రాత్రి ఒకటిన్నరకు పరమపదించారు.

బోధనలు మరియు సూక్తులు
*********
శారదాదేవి సాంప్రదాయిక పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు, పుస్తకాలూ ఏమీ రాయలేదు.

ఆమెతో పెక్కుకాలం గడిపిన స్వామి నిఖిలానంద, స్వామి తపస్యానంద అనే శిష్యులిద్దరూ, ఆమె జ్ఞాపకాలలో , బోధనలలో  సూక్తులు "శ్రీశారదాదేవి చరితామృతం", "శ్రీశారదాదేవి వచనామృతం" అనే రెండు పుస్తకాల్లో గ్రంథస్థం చేశారు.

 ముఖతా ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం, ఆమె ఆధ్యాత్మికజ్ఞానానికి అబ్బురపోయేవారు.

 ఆమె బోధనల సారాంశం.
**********
క్రమం తప్పక ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానం చేయకుండ ఉండలేని స్థితికి వస్తారు.

ప్రచండ వాయువు మేఘాలను చిన్నభిన్నం చేసినట్టు, పావన భవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది.

 జపం ఒక సాధన. మనం ప్రయత్నించి అభ్యసంచాలి.

మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి.
మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి.

 ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే.

కొన్ని సంఘటనలు
**********
ఓం శ్రీ మాత్రే నమః

ఒక భక్తురాలు ఇలా మనవి చేశారు .....
అమ్మా ! నాకు ఒకే ఒక్క పుత్రుడు . అతడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు . మీ వద్దే మంత్రదీక్ష కూడా తీసుకున్నాడు . అతడు సన్యాసం తీసుకోవాలని అంటున్నాడు . ఏమి చేయమంటారు !

        శారదా మాత
                  ఇలా సెలవిచ్చారు ....

     ఆహా ! ఈ రోజుల్లో యువకులకు ఇలా చెప్పడం అలవాటైపోయింది . వివాహం చేసుకొంటే ఆధ్యాత్మిక జీవితం గడపలేమా ! గురుదేవులు ( శ్రీరామకృష్ణులు ) నన్ను వివాహం చేసుకోలేదా ఏమి ! అంతా మనస్సుకు సంబంధించినదేకదా !

     ఒకవేళ సంసార యాతనలు పడకుండా జీవించగోరుతున్నాడేమో ! సంసార యాతనలను  అనుభవిస్తూ కూడా, భగవంతుణ్ణి వదలక గట్టిగా పట్టుకొన్నవారే, తప్పక దైవాన్ని పొందగలరు .

    అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు మాత్రమే సన్న్యాసులై, సమస్త బంధాలనూ ఛేదించుకుంటూ ముందుకు పోగలుగుతారు . కొందరు సుఖభోగాలను అనుభవించడానికే జన్మిస్తారు . సుఖదుఃఖాలను పూర్తిగా అనుభవించివేయడమే మంచిదని నేనంటాను . గురుదేవుల సన్యాస శిష్యుల విషయం మాత్రం వేరు .

   నేను చెబుతున్నాను ; అతడు వివాహం చేసుకోనీ ! అన్నిటినీ పూర్తిగా అనుభవించనీ ! లేకుంటే ఎక్కడ నుండి ఏ కోర్కె అంకురిస్తుందో ఎవరికి తెలుసు !
కానీ ఒక్క విషయం తెలుసుకో !  గురుదేవులు ఒక వ్యక్తిని పట్టుకొన్నారంటే , ఆ వ్యక్తికి ఇక పతనం ఉండదు . నువ్వు స్థిమితంగా ఉండు . గురుదేవులు అనుగ్రహించిన సిద్దమంత్రం అతడికి ప్రసాదించాను . కాబట్టి అతడు భయపడవలసిన అవసరంలేదు .

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

భక్తుడు :
ఒకసారి మా అమ్మను , మాతృదేవి దర్శనానికి తీసుకువెళ్లగోరాను . కానీ ఆ రోజు మంచిరోజు కాదని  మా అమ్మ చెప్పడం వలన , ఇక ఆ రోజుకి వెళ్లకుండా మానుకొన్నాము . ఈ విషయం మాతృదేవికి తెలిపాను .

     అప్పుడు మాతృదేవి
                      ఇలా సెలవిచ్చెను ....

     “ నాయనా ! తిథి , నక్షత్రం , వారాలు చూడకుండా తీర్థస్థలాలకు పోతే , అప్పటికే సముపార్జించిన పుణ్యమంతా హరించుకుపోతుందని చెబుతారు . అదే సమయంలో , సత్కార్యాలను వాయిదా వేయరాదని కూడా చెబుతారు ” .

భక్తుడు :

అమ్మా ! మీ మాటలు నాకు అర్థం కాలేదు . అందువలన ఇటువంటి సమయంలో ఏమి చేయాలి !

       శారదా మాత
                  ఇలా సెలవిచ్చారు ....

    అకాల సమయాలలో ( కాలంగాని కాలం ) తీర్థ స్థలాలకు వెళ్లకూడదని కొందరంటారు . కానీ ఒక విషయం గమనించు ; వారం , తిథి , నక్షత్రం , వర్జ్యం చూసి సత్కార్యాలు వాయిదా వేయవచ్చు . కాని కాలుడు ( మృత్యువు ) వారం , వర్జ్యం లెక్కించి  వస్తాడా ఏమి ! మరణానికి కచ్చితమైన సమయం లేనట్లే , సత్కార్యానికి కూడా ముహూర్తం నిర్ణయించుకోవడం మంచిదికాదు .

 సందర్భం లభించినప్పుడు మనం వారం , వర్జ్యం చూడకుండా సత్కార్యాలను తక్షణమే నిర్వర్తించాలి.”

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

ఒక భక్తుడు  ఉత్తరం ఇలా వ్రాశాడు ....

  అమ్మా ! నేను పేదవాడిని, ఇప్పటికే మీ వద్దకు రెండుసార్లు వచ్చాను. ఎంతో శ్రమపడితేగాని మీ వద్దకు రాలేను. కానీ నా దురదృష్టం ఏమిటంటే , నేను వచ్చినప్పుడల్లా మీకు ఒంట్లో బాగుండడం లేదు. ఈసారి  వచ్చినప్పుడు అయినా నన్ను దయచేసి అనుగ్రహించగలరు !

            శారదా మాత
                        ఇలా సెలవిచ్చారు ....

    ఆతడు వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగుండకపోతే , అతడు తిరిగి వెళ్లవలసిందే ! నా ఆరోగ్యం బాగున్నప్పటికీ నేను అందరినీ ఆహ్వానించలేకున్నాను. వారి వారి పుణ్యాన్నిబట్టీ , కర్మఫలసారాన్నిబట్టి మంచి అవకాశాలు , మంచి ఉపాయాలూ చేకూరుతాయి.

 ఒక వ్యక్తి అనేకసార్లు రావచ్చు. కానీ నా ఆరోగ్యం బాగా లేనందునో లేక మరేదో కారణంగానో నన్ను చూసే అవకాశం లభించకపోవచ్చు. అది అతడి దురదృష్టం.అందుకు నేనేం చేయగలను ! వచ్చిపోవడానికి ఎంతో ఖర్చు కావచ్చు ; ప్రతి ఒక్కరికీ డబ్బు ఉండకపోవచ్చు. కానీ గురువు ఎన్నిసార్లు నిరాకరించినప్పటికీ , అనుగ్రహం పొందగోరితే భిక్షమెత్తి అయినా వచ్చితీరాలి.

      అసలు విషయం ఏమిటంటే :

    సంసార సాగరాన్ని దాటగోరిన వ్యక్తి ఏదో ఒక విధంగా బంధనాలను ఛేదించుకొంటాడు. అతణ్ణి ఎవరూ బంధించలేరు. ఆర్థిక ఇబ్బందులూ, జవాబు కోసం నిరీక్షించడమూ, వెళ్లినా చూడలేకపోతాను అనే భయమూ, ఇవన్నీ కుంటిసాకులు.
సరే ! పోనీలే , ప్రస్తుతం నా ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉంది. అతణ్ణి రమ్మని ఉత్తరం వ్రాయండి" అని తెలిపారు.
🙏🏻🙏🏻🙏🏻
??🤔
ఓం నమఃశివాయ
[6:31 pm, 11/03/2020] +91 98484 59989: 🙏🚩🛕🚩🛕🚩🛕🚩🛕🚩🙏
            ఓం శ్రీ గురుభ్యోనమః     
       🌟 12....మార్చి.... 2020 🌟
గురు వారం (బృహస్పతి వాసరే), శ్రీ వికారి
నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళ  పక్షం, తిధి: తదియ సా 04.54 ఆ తదుపరి చవితి, నక్షత్రం:చిత్త రా 09.11 వరకూ తదుపరి స్వాతి, యోగం : వృద్ధి ఉ 8.08 ఆ తదుపరి ధృవం తె 05.07, కరణం : భద్ర / విష్ఠి సా 04.54 తదుపరి బవ తె 03.46 ఆ తదుపరి బాలువ, వర్జ్యం : ఉ. శే.వ. 07.45 వరకు & రాత్రి 2.26 to 3.56, దుర్ముహూర్తం: ఉ 10.11 - 10.59 & మ 2.55 to 03.43, అమృత కాలం : మ 03.13 to 4.42, రాహు కాలo: మ 01.30 to 03.00,  యమ గండం/కేతుకాలం: ఉ 6.00 to 07.30, సూర్య రాశి : కుంభం, చంద్రరాశి:కన్య, సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 6.05. నిత్యం గోమాతను పూజిoచండి. గోమాతను సంరక్షించండి.  శుభమస్తు. రామసుబ్బారావు   (12.03.2020)
🙏🚩🛕🚩🛕🚩🛕🚩🛕🚩🙏
[6:44 pm, 11/03/2020] Mallapragada Sridevi: https://governmentselfemployee.blogspot.com/2020/03/blog-post_10.html
👌👌🙏🙏🙏🌷👏
👏👏👌🙏
🙏🏻🙏🏻🙏🏻
10. అమృతస్య పుత్రాః
శ్రీవివేకానందుని జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు - 49
🕉🌞🌎🌙🌟🚩

నిత్యానిత్య వస్తు వివేకంతో సర్వసంగ పరిత్యాగం గావించి, బ్రహ్మచర్యవ్రతాన్ని స్వీకరించి, ఇహసంసారం నుండి తాము తరించడమే గాకుండా, భగవదంశ గల కొందరు మహనీయులు, సమస్త ప్రజలకు మార్గదర్శులై వెలుగొందుతూ వుంటారు. అట్టివారిలో స్వామీ వివేకానంద ఒకరు. వారి జీవితచరిత్రలోని కొన్ని ఆసక్తికర విషయాలు.

క్రైస్తవులలో ఆరోజులలో విపరీతమైన పరమత ద్వేషం ఉండేదని తెలిసి స్వామి ఆశ్చర్యపోయారు.

ఇంకొకసారి, స్వామీ వివేకానంద ప్రసంగిస్తున్న సమయంలో,  కొంతమంది వారి మనో నిబ్బరాన్ని పరీక్షించాలని,  ప్రసంగమధ్యంలో తుపాకీ గుళ్లను స్వామి వైపు గురిచూసి పేల్చారు.  కర్ణకఠోరంగా  ఆ తుపాకీలు గుళ్లవర్షాన్ని స్వామి చెవులకు ఇరువైపుల నుంచీ పంపిస్తున్నా,  స్వామి చెక్కు చెదరకుండా, తమ ఆధ్యాత్మిక ప్రసంగ పాఠం కొనసాగించి వారిని నిశ్చేష్టులను చేసారు. 

మరొకసారి స్వామి ప్రయాణంలో వుండగా,   ఒక నల్లజాతీయుడు  ( నీగ్రో )  కూలీ  ప్రయాణమధ్యంలో  స్వామిని సమీపించి, '  మాజాతిలో మీలాంటి మహానుభావుడు పుట్టడం మా అదృష్టం.  మీతో ఒకసారి కరచాలనం చేసే భాగ్యం ప్రసాదించండి.  '  అని అడగగా, స్వామి అమితప్రేమగా ఆ నల్లజాతి వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ,   అతడితో కరచాలనం చేసారు.  ఇలాంటి మంచి అనుభవాలతో బాటుగా,  స్వామి కొన్ని చేదు అనుభవాలు రుచిచూశారు.  అనేక భోజనశాలలో  స్వామిని  నల్లజాతీయునిగా భావించి ఆయనను లోనికి అనుమతించక పోవడం జరిగేది.   ఆఖరికి, క్షౌరశాలలో కూడా యిలాంటి అవమానాలు ఎదురై,  స్వామి లోనికి వెళ్లకుండా  అడ్డుపడడం జరిగింది. 

ఇంత జరిగినా స్వామి వారెవరికీ తానూ నీగ్రోను కాదని చెప్పలేదు.  ఇవన్నీ చూస్తూ తట్టుకోలేని ఒకపాశ్చాత్య శిష్యుడు, ఆయనను, ' మీరు నీగ్రో సంతతి వారు కాదని ఎందుకు చెప్పడం లేదు ? '  అని బాధగా అడిగాడు.   దానికి స్వామి చెప్పిన సమాధానం ఆ పాశ్చాత్య శిష్యుని నివ్వెర పరచింది.   స్వామి అతనితో,  ' నేను నీగ్రోను కాదని చెబితే, నీగ్రోలను నేను తక్కువవారిగా చూసినట్లే కదా !  పరులను అణచివేసి పైకివచ్చే ఘోరకృత్యాలు చేయడానికి నేను జన్మించలేదు. '  అని చెప్పారు.   అదీ స్వామి వ్యక్తిత్వం. 

స్వామి ఉపన్యాస పరంపర కొనసాగుతూనే వున్నది.  రోజు రోజుకీ ఆహ్వానాలు పెరుగుతున్నాయి, కానీ తరగడం లేదు.  అద్వైత సిద్ధాంతాన్ని పాశ్చాత్య దేశాలలో విస్తరించే ఉద్దేశ్యంతో,  స్వామి వారానికి పన్నెండు నుంచి పధ్నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంటే సుమారుగా రోజుకు రెండు ఉపన్యాసాలు ప్రతిరోజూ వుండేవి.  

పరమాత్మ కృప వుండడం వలననే స్వామి ఆ విధంగా పరిశ్రమించ గలిగేవారు.   ఒక్కొక్కసారి,  మరునాడు ఆయన చెప్పవలసిన ఉపన్యాసాన్ని,  ఎవరో ఒకవ్యక్తి తనముందు నిలబడి ఉపన్యసిస్తున్నట్లు వినవచ్చేదట, స్వామికి.  దానినే మరునాడు స్వామి ఉపన్యాసంగా చెప్పేవారు.  ఎంత ఆశ్చర్యం,  ఆ వ్యక్తి ఈశ్వరుడు అని అనిపించడంలో ఏవిధమైన తప్పూ లేదు కదా ! . 

అనేక  యోగసిద్ధులు ఆ సమయంలో అప్రయత్నంగా స్వామికి అలవడ సాగాయి.   అవి ఎలాంటివంటే, తమ గురుదేవులు రామకృష్ణ పరమహంస వారివలె, స్వామీ వివేకానందులు కూడా కేవలం స్పర్శ మాత్రానే ఇతరుల జీవితాలను మార్చగలిగేవారు.  ఆయన సోదర శిష్యులు చెప్పిన దాని ప్రకారం, స్వామి యెదుటివారి ముఖం చూడగానే వారి పూర్వజన్మ వృత్తాంతం  స్వామికి కరతలామలకంగా వుండేది.  

ఇది ఇలా ఉండగా, కలకత్తాలో కొందరు ప్రముఖులు స్వామి ఉపన్యాసాలను రాజకీయ భావ గర్భితాలుగా  ప్రచారం చేయసాగారు.  చూసారా !  ప్రతికూలవర్గం ఏర్పడానికి ఏ కారణమూ అక్కరలేదని దీనిని బట్టి  తెలియడం లేదూ !   

ఈ విషయం తెలుసుకున్న స్వామి తీవ్రంగానే స్పందించారు.  తన మాటలకూ, చేతులకూ రాజకీయరంగు పులమవద్దని వారికి తన మద్రాసు శిష్యుని ద్వారా వర్తమానం పంపారు.   తనను రాజకీయ ప్రతినిధిగా ఎవరైనా చిత్రీకరిస్తే, వారు తగిన ఋజువులు చూపాలనీ,  లేకపోతే, వారి మూర్ఖపు ప్రకటనలను వాపసు తీసుకోవాలనీ హెచ్చరించారు, స్వామి.   తరువాత కొంతకాలానికి  తమను రాజకీయ ప్రతినిధిగా భావించడం అక్కడి మిత్రులకు గొప్పగా అనిపించి  ఆవిధమైన ప్రచారం చేస్తున్నారని, స్వామి గ్రహించారు.   వెంటనే,  స్వామి, ' పరమేశ్వరా ! ఈ మిత్రుల బారినుండి నన్ను రక్షించు. ' అని మొరబెట్టుకున్నారు.  

అలా ప్రచారం చేస్తున్నవారిని,  శత్రువులుగానే పరిగణిస్తూ స్వామి, తన మౌనమే వారికీ సమాధానంగా ఊరక ఉండిపోయారు.  తమశిష్యులతో,  '  నా మౌనమే కుక్కకాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా పనిచేస్తుంది.  వారితో వాదించి నా స్థితిని దిగజార్చుకోలేను.  వారు నేర్చుకోవలసిన యింకా అనేక విషయాల మీద వారిని శ్రద్ధ పెట్టమను.  '  అని ఆదేశించారు. 

ఇక స్వామీ వివేకానందుడు సంకల్పించిన మహోద్యమం  అమెరికాఖండంలో ఎలా వ్యాపించిందో  చూద్దాం. 

🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ