ఆయుష్మాన్ భవ
పెద్దలు వస్తుండగా లేచి వెళ్ళి నమస్కరించడం మంచి సంప్రదాయం. దాన్ని అభ్యుత్థానమని, అభివాదనమని అంటారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయని స్మృతులు చెబుతున్నాయి. నమస్కారాల్లో సాష్టాంగ ప్రణామం ఉత్తమం. దానికే ప్రణతి అని పేరు. అంటే గొప్పదైన నమస్కారమని అర్థం.
సంప్రదాయం తెలిసిన పెద్దలకు నమస్కరించినప్పుడు ‘ఆయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. చాలాసార్లు ఆ మాట విని ఉండటంవల్ల వారేదో అలవాటుగా ఆశీర్వదించారని మనం అనుకొంటాం. నిజానికది అద్భుతమైన ఆకాంక్ష. చాలా విలువైన దీవెన. ఆ ఆశీస్సులో రెండు గొప్ప పదాలున్నాయి. వాటిలో ఆయుష్మాన్ అనేది యోగాల్లో మూడోది. భవ అనేది కరణాల్లో మొదటిది.
మన అందరికీ పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు.
తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అంటే పదహారు కళలున్నవాడు. వాటినే తిథులు అంటారు. పాడ్యమి మొదలు పున్నమి వరకు, తిరిగి పాడ్యమినుంచి అమావాస్య వరకు విదియ, తదియ, చవితి, పంచమి అంటూ పౌర్ణమి/అమావాస్యతో కలిసి శుక్లపక్షం, కృష్ణపక్షం అని నెలకు రెండు పక్షాలున్నాయి.
పంచాగంలో రెండో విభాగం- వారం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలవి. నక్షత్రం అనేది పంచాంగంలో మూడో విభాగం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి... నుంచి రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు. ఒకో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం 108 పాదాల్లో సృష్టిలోని ప్రతి జీవీ ఇమిడిపోతుంది. పుట్టిన ప్రతి మనిషికీ ఒక్కో నక్షత్రం ఒక్కో పాదం స్థిరపడతాయి. అష్టోత్తరశత నామావళి సంప్రదాయానికి ఇదే పునాది. ఆ 108 నామాల్లో ఒకటి ప్రతి మనిషికీ అనువర్తిస్తుంది. ఉపాసకులకు అదే ఆధారం. తమ నక్షత్రానికి చెందిన పాదానికి, 108లో ఒక నామానికి సమన్వయం తెలుసుకొని, సంపుటీకరణ ప్రక్రియను ఉపాసకులు ఆచరిస్తారు.
పంచాంగంలో నాలుగోది యోగం. యోగాలూ ఇరవై ఏడే. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన నుంచి వైధృతి వరకు 27 యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్ అనేది వీటిలో చాలా మంచి యోగం.
ఇక అయిదోది కరణం. ఇది పంచాంగంలో ఆఖరి భాగం. కరణాలు మొత్తం 11. భవ బాలవ కౌలవ తైతుల గరజ వనజ భద్ర శకుని చతుష్పాత్తు నాగవం కింస్తుఘ్నం... అనేవి వాటి పేర్లు. వీటిలో మొదటిదైన భవకరణం ఎంతో శుభప్రదం.
శుభ తిథులు, అశుభ తిథులు వాడే పంచాంగంలోని మిగిలిన వార నక్షత్ర యోగ కరణాల్లోను మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయని పంచాంగకర్తలు చెబుతారు. మనిషికి యోగాల్లో ఆయుష్మాన్, కరణాల్లో భవ- మంచి ఫలితాలనిస్తాయి. ఆయుష్మాన్ భవ అని పెద్దలు దీవించడంలోని ఆంతర్యం ఏమంటే- శుభ యోగం, శుభ కరణం రెండూ కలిస్తే ఎంత గొప్ప స్థితి లభిస్తుందో, అంత ఉత్తమ స్థితి నీకు కలుగుగాక అని.
మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో లోతైనవి, చాలా విలువైనవి. అందుకే పెళ్ళిళ్లు, శుభకార్యాల్లో వాటికి పట్టింపు ఎక్కువ.
--(())--
ఓ మహిళా అంత ఓర్పు నీకెలా సాధ్యమమ్మా
ధరాపుత్రీవా నీవు
ఓ మగువా అంత అనురాగం ఎక్కడిదమ్మా
గగనయువరాణివా నీవు
ఓ ముదితా అంత ప్రేమ కురిపించెదవేంటమ్మా
జలసోదరివా నీవు
ఓ అతివా అంత చల్లని చూపులు నీకెలా ఒంటపట్టెనమ్మా
చందురుడి కోడాలివా నీవు
ఓ పడతి అంత వెలుగు నీ వచ్చస్సున ఎలా కలిగెనమ్మా
రవితనయవా నీవు
పంచభూతాలను నీలో నిబిడీకృతము చేసుకున్న
ఓ మమతల తల్లీ నీకిదే నా పాదాభివందన సమర్పణము🌹
______((((()))))______
🌞ఓం భాస్కరాయ నమః🌞
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
యావత్తు సృష్టిని.. ఒక్క గంటలో తయారు చేయగల్గిన దేవుడు.. మహిళా మూర్తిని తయారు చేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడంట. ఎందుకో తెలుసుకోవాలంటే.. మనసు పెట్టి చదవాలలి
మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.
ఒక రోజూ రెండు రోజులూ కాదు.
ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం.
మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".
ఆప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...
ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...
ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..
సృష్టి. వివక్ష తగదు.
మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి.
చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...
ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...
ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి.
అడిగేవారు ఉండరు ఉండకపోవచ్చు...
రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి.
ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.
"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమహిళణు మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.
ఆప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు.
కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు.
అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు,
ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు.
ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవిచూడాలి.
అవసరమైతే దిగమింగాలి.
కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి.
తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు.
కానిఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.
"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.
అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు?
అన్ని విషయాలు ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.
దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.
అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది.
ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదన దుఃఖము దిగులు ఆశ్చర్యము భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి.
ఆ కన్నీటికున్న శక్తి అనంతం....
పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" అని చెప్పాడు.
దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.
అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు.
అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
అవసరమైనప్పుడు..ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు..
అని చెప్పి భూమ్మీదకు పంపాడు మహిళా మూర్తిని...!!👌
ఇదంతా చదువుతుంటే.. మన జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలు జ్ఞప్తికి వస్తున్నాయి కదా..
అందుకనే ఏమో మహిళా మూర్తిని పుడమి తల్లి తో పోల్చారు..
కనుకే (ప్రతిరోజు )మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో...
మీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[తక్షక విషాగ్ని వలన తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతి పై ప్రతీకార వాంఛతొ సర్పయాగం ప్రారంభించాడు. మంత్రశక్తి ప్రారంభం వలన ఎక్కడెక్కడి పాములు వచ్చి అగ్ని గుండంలో ఆహుతి కాసాగాయి. కొండకోనల్లో,చెట్టుపుట్టల్లో,వాగువంకల్లో తల దాచుకున్న పాములన్నీ తప్పించుకోలేక యాగాగ్నిలో హుతమై పోవడం ప్రారంభమైంది . తన బిడ్డల దురావస్థ చూచి నాగదేవత చలించిపోయింది. మానసా దేవిని ప్రార్ధించింది.మానసా దేవి పంపగా,ఆమె కుమారుడైన ఆస్తీకుడు వచ్చి , జనమేజయునకు నచ్చ జెప్పి సర్పయాగం మాన్పించాడు.
ఆ తరువాత జనమేయయునిలోని అంతర్మధనం ప్రారంభమయ్యింది . సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తి కోసం, మనశ్శాంతి కోసం తనకు ఏదైనా ఉపాయం చెప్పవలసినదిగా ఆ రాజు వ్యాస మహర్షిని ప్రార్ధించాడు.
జనమేజయుని ప్రార్ధన విని వ్యాసుడు అంబా యజ్ఞము చేయవలసినదిగా అతణ్ణి సూచించాడు. అప్పుడు జనమేజయుడు, “ఆ అంబ ఎవరు? ఆమె నివాస స్థానం ఏది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమెను దర్శించడానికి కర్తవ్యం ఏమిటి?” అని ఆసక్తితో అడిగాడు.
వ్యాస మహర్షి జనమేజయునకు ఇలా వివరింప సాగాడు.
“జనమేజయా! ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్ధ్వ లోకాలు, ఏడు అధో లోకాలు ఉన్నాయి.భూలోకం,భువర్లోకం,సువర్లోకం,మహాలోకం,తపోలోకం,జనలోకం సత్యలోకాలు ఊర్ధ్వ లోకాలు.సత్యలోకాన్నే బ్రహ్మలోకమని అంటారు. ఆ పైన వైకుంఠం ఉన్నది. కుంఠము అంటే అంతరాయం.నిరంతరాయంగా సర్వత్రా ప్రవర్తింప గల విష్ణు మూర్తి నివసించే ప్రదేశం వైకుంఠం . వైకుంఠానికి పైన గోలోకం ఉన్నది. అక్కడ చతుర్భుజుడైన శ్రీ కృష్ణుడు నివసిస్తాడు. అతని అర్ధ భాగం లో రాధా దేవి ఉన్నది. సమస్త వేదాలూ, సర్వ ప్రాణులూ అతని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి. ‘గో’ శబ్దానికి వేదము, భూమి, ఆవు, కిరణము, ఇంద్రియము మొదలైన అర్ధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి అన్నింటికీ మూలమైనదే గోలోకము.అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానం ఉన్నది. ఆ పరమేశ్వరి జగన్మాత. ఆమె ఆది పరాశక్తి. ముగురమ్మలకు మూలపుటమ్మ. ఆమె నివాస స్థాన
మే మణిద్వీపం
🌹🌹🌹🌹🙏🙏🙏🙏
[సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం
1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు
2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ
3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ
4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ
5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి
6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు
7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్
8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః
9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే
10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి
శుభ శూర్యోదయం
--(()0--
దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి
కార్తిక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుంది. ఉసిరి కొమ్మతెచ్చి పూజ చేయడం, ఉసిరి కాయపై దీపాలు వత్తులు వెలిగించడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వంటి పలు రకాల క్రియలు చేస్తారు, మళ్ళీ ఉసిరి ప్రస్త్తావన కనబడేది ఫాల్గుణ మాసంలో. ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇక చైత్ర మాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔషథ గుణముంటుంది. ఆమలక వృక్షాన్ని విష్ణువుగా భావించి మరో పర్వం ఆమలక ఏకాదశి.
ఈ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు. దీనికే ధాత్రీ ఏకాదశి, అమృత ఏకాదశి అనే నామాంతరాలున్నా యి, ‘ఆమలక వృక్షే జనార్దన:’ టారు కనుక ఈ రోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏ దానం చేసినా అది అక్ష యమవుతుంది. కొన్ని సంప్రదాయాలవారు ఈ రోజున సంపదలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున ఆమె ఆ చెట్టులో ఉంటుందని భావిస్తారు. అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, రాధ ఈ చెట్టు సమీపంలోనే నివసించారనేది ఒక కథ. కార్తిక మాసంలో ఉసిరికాయల ప్రస్తావన వస్తుం ది. ఉసిరి కొమ్మతెచ్చి పూజ చేయడం, ఉసిరి కాయప దీపా లు వత్తులు వెలిగించడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయ డం వంటి పలు రకాల క్రియలు చేస్తారు, మళ్ళీ ఉసిరి ప్రస్త్తావన కనబడేది పాల్గుణ మాసంలో. ఉసిరి ఎంతో ప్రశస్తమైనది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇక చైత్ర మాసంలో కాసే ఉసిరి పండ్లకు ఒక ప్రత్యేకమైన ఔష థ గుణముంటుందని, వాటి కోసం ప్రత్యేకంగా వెతుకు తుం టామని ఒక వైద్య గ్రంథాన్ని ఉటంకిస్తూ ఒక ఆయు ర్వేద వైద్యుడు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజునే హోళీ ఉత్సవాలకు ప్రారంభ దినంగా భావిస్తారు. ఆంధ్ర ప్రాంతం లోని గోదావరీ తీర వాసులు దీనిని కోరుకొండ ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ రోజు కోరుకొండలోని నరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు, తిరునాళ్ల జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో నుంచి జనం వస్తారు. అన్ని పండగ దినాలకూ సంబంధించి ఉన్నట్టే ఈ పర్వానికి సంబంధించి కథలు ఉన్నాయి. ఒకసారి చిత్ర కేతుడనేరాజు వేటకు వెళ్ళాడు, వేట తమకంలో దారి త ప్పాడు. అతను ఒక ప్రాంతానికి వెళ్లగానే రక రకాల ఆయు ధాలు ధరించిన రాక్షసులు అధిక సంఖ్యలో అతనిని చుట్టు ముట్టారు. వారితో యుద్ధంలోఅతను గాయపడకపోయినా అలసిపోయి స్పృహ తప్పాడు ఆ సమయంలో ఒక దివ్య శక్తి వెలుగు రూపంలో అతని శరీరం నుంచి వెలువడి రాక్ష సులనందరినీ హతమార్చింది. కొంతసేపటికి స్పృహలోకొ చ్చిన చిత్ర సేనుడు తనపై దాడికి వచ్చిన వారందరూ పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆకాశవా ణి అతనిని ఒక దివ్య శక్తి రక్షించిందని, దానికి కారణం అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించడమేనని పేర్కొంది. ఆ తర్వాత అతని రాజ్యంలో ఆ వ్రతం, దాని ఫలితం ప్రసిద్ధి పొందింది. ఎక్కువ మంది దానిని ఆచరించడంతో రాజ్యంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరిసాయి.
దీనికి సంబంధించి వ్రత ఫలాప్ని చెప్పే మరో కథ బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠుడు చెప్పినట్లుగా ఉందని విజ్ఞులు చెబుతారు. దాని ప్రకారం విదిష రాజ్య ప్రభువైన చిత్రరథుడు విష్ణు భక్తుడు. అతని రాజ్య ప్రజలు కూడా విష్ణు భ క్తులే. ఒక ఏడాది అతను, కొంత మంది భక్తులతో ఒక నదీ తీరంలో ఉన్న ఒక ఆమలక వృక్షం వద్ద విష్ణు పూజ చేశాడు. దీనిలో భాగంగా రాజు పరశు రామావతార విష్ణువును కూడా పూజించాడు. వారందరూ ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణు భజనలు పాడుకుంటూ జాగరణం చేశారు.ఆ సమయంలో ఎటువంటి వేట దొరక్క ఉపవాసం ఉన్న ఒక వేటగాడు కూడా వారితో బాటు రాత్రంతా జాగారం చేశాడు. ఆ కారణంగా అతను మరు జన్మలో రాజుగా జన్మించారు. అతనికి వసుర
థుడని పేరు పెట్టారు. అతను కూడా వేట తమకంలో రాక్షసుల బారిన పడడం
అతను కూడా వేట తమకంలో రాక్షసుల బారిన పడడం ఒక దివ్య శక్తి చేత రక్షించబడటం వంటివన్నీ జరిగాయని చెబుతారు. గత జన్మలో చేసిన ఆమలక ఏకా దశి ఫలితంగా అతనికి ఈ జన్మలోనూ రక్షణ లభించింద ని చెబుతారు. ఏది ఏమైనా ఎటువంటి కోరిక లేకుండా పూర్తి భక్తితో ఈ రోజు విష్ణు పూజ చేస్తే పైన చెప్పిన విధం గా ఈ జన్మలోనూ, వచ్చే జన్మలోనూ విశేష ఫలితం ఉం టుందని చెప్పడం కథ ఉద్దేశం. ఈ రోజు చేసిన దానం వాజపయం, సోమయజ్ఞంలో చేసిన దానంతో సమానమని చె బుతారు. ఇక ఈ రోజున పూజించే ఆమలక వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నదనేది అందరికీ తెలిసిందే. దా నికి ఎన్నో విశేష లక్షణాలు ఉన్నాయి. వృద్ధాప్యం త్వరగా
రాకుండా కాపాడుతుందని, గొంతు నొప్పి, హృద్రోగాలు పిత్తాశయంలో రాళ్లు, అల్సర్లు, కామెర్లు, నెప్పులు, దురద లను, పేలను నివారిస్తుందని, జీవ క్రియలు వేగంగా జరి గేలా చేస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని జీర్ణ క్రియకు ఉపయోగించే పీచు పదార్థం దీనిలో ఎక్కు వని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, రోగ నిరోధక శక్తిని పెం చుతుందని, కంటి చూపును మెరుగు పరుస్తుందని, రక్తాన్ని వృద్ధి చేస్తుందని, ఎముకలకు బలం చేకూరుస్తుం దని, శరీరాన్ని చల్లబరుస్తుందని, కేన్సర్ వచ్చే అవకశాలను త గ్గిస్తుం దని, లివర్ ను కాపాడుతుందని, శరీరానికి కాంతిని ఇస్తుందని, జుట్టు నెరవడాన్ని అరికడుతుందని చెబుతారు. అం తేకాక తె ల్ల ప్లేగు అనే క్షయ వ్యాది రాకుండా ఇది కాపాడుతుందని కూడా ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాక ఈ పండులో షడ్రసాల్లో ఒక్కటి తప్ప అన్నీ ఉంటాయని చెబు తారు. లేని ఆ ఒక్క రసం ఉప్పు అని చెబుతారు.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
రేపు నృసింహ ద్వాదశి ఫాల్గుణ నృసింహ ద్వాదశి నాడు గంగానదిలో స్నానం చేస్తే..!?
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు.
అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు.
అందుచేత ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి న వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి గంగాస్నానం పాపనాశనమని పురోహితులు చెబుతున్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం, ఆ రోజున మహిళలు సీతామాత పూజ, విష్ణుపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఇంకా ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
రేపు గోవింద ద్వాదశి
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
సాంప్రదాయ హిందూ క్యాలెండర్‌లోని 'ఫాల్గుణ' నెలలో శుక్ల పక్ష (చంద్రుని ప్రకాశవంతమైన పక్షం కాలం) యొక్క 'ద్వాదశి' (12 వ రోజు) పై పడే శుభ హిందూ ఆచారం గోవింద ద్వాదశి . ఇంగ్లీష్ క్యాలెండర్ అనుసరిస్తున్నవారికి, ఈ తేదీ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి వరకు వస్తుంది. విష్ణు భక్తులకు గోవింద ద్వాదశి చాలా ముఖ్యం. ఈ రోజున హిందూ భక్తులు విష్ణువును సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం తన దైవిక ఆశీర్వాదం కోరుకుంటారు. విష్ణువు యొక్క 'నరసింహ' అవతారం ఈ రోజున పూజిస్తారు కాబట్టి గోవింద ద్వాదశి ని 'నరసింహ ద్వాదశి' గా కూడా జరుపుకుంటారు. ఈ పండుగ వేడుకలు పూరీలోని జగ్గనాథ్ ఆలయంలో చాలా విస్తృతంగా మరియు ముఖ్యమైనవి. గోవింద ద్వాదశి ఉత్సవాలతో పాటు ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం మరియు విష్ణువు యొక్క ఇతర ప్రముఖ ఆలయాలలో కూడా ప్రసిద్ది చెందింది. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు కర్ణాటక గోవింద ద్వాదశి ని ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు.
☘విష్ణువు గోవింద ద్వాదశి సమయంలో ఆచారాలు:☘
గోవింద ద్వాదశి రోజున, గంగా, సరస్వతి, యమునా మరియు గోదావరి వంటి పవిత్ర నదులలో ఉత్సవ స్నాన వేడుక చేయడానికి భక్తులు సూర్యోదయానికి ముందే లేస్తారు. ఈ పవిత్ర నదులను సందర్శించలేకపోతే, ఈ కర్మ స్నానం ఏ సరస్సులోనైనా లేదా నదుల దగ్గర కూడా చేయవచ్చు. అయితే అలా చేస్తున్నప్పుడు; భక్తులు గంగా దేవి మరియు విష్ణువు పేర్లను జపించాలి. ప్రత్యేకమైన హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత కారణంగా పవిత్రముగా మునిగి తేలడానికి వేలాది మంది భక్తులు గోవింద ద్వాదశి రోజున పూరి తీరంలోని మహోదాది తీర్థాన్ని సందర్శిస్తారు.
భగవంతుడు విష్ణువు యొక్క 'పుండారికక్ష' రూపాన్ని గోవింద ద్వదశిపై పూజిస్తారు. వారు పండ్లు, పువ్వులు, గంధపు పేస్ట్, నువ్వులు, మరియు ధూపం కర్రల రూపంలో ప్రభువుకు అనేక నైవేద్యాలు చేస్తారు.
ఈ రోజు భక్తులు గోవింద ద్వదశి వ్రతం అని పిలువబడే కఠినమైన ఉపవాసాలను కూడా పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజ ఆచారాలు పూర్తి చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే తింటారు. ఈ రోజు మద్యం లేదా మాంసాహారం తినడం అనుమతించబడదు.
గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి అక్కడ జరిగే పూజ ఆచారాలలో పాల్గొంటారు.
విష్ణువు పేరు జపించడం మరియు 'శ్రీ నరసింహ కవచం' మంత్రాన్ని పఠించడం గోవింద ద్వాదశిపై చాలా అనుకూలమైనదిగా భావిస్తారు.
🌹గోవింద ద్వాదశిపై ముఖ్యమైన సమయాలు🌹
సూర్యోదయం మార్చి 06, 2020 6:47 ఉద
సూర్యాస్తమయం మార్చి 06, 2020 6:28 అపరాహ్నం
ద్వాదశి తిది ప్రారంభమైంది మార్చి 06, 2020 11:47 ఉద
ద్వాదశీ తిది ముగుస్తుంది మార్చి 07, 2020 9:29 ఉదయం
☘గోవింద ద్వాదశి యొక్క ప్రాముఖ్యత:☘
గోవింద ద్వదశి యొక్క మతపరమైన ప్రాముఖ్యత 'అగ్ని పురాణం' వంటి అనేక హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది. విష్ణువు అనుచరులకు ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువును ఆరాధించడం ద్వారా మరియు గోవింద ద్వదాశి వ్రతం చేయడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలను దాని పరిశీలకునికి ఇస్తుందని నమ్ముతారు. ఆ వ్యక్తి కూడా చివరికి మోక్షాన్ని పొందుతాడు మరియు నేరుగా విష్ణువు యొక్క స్వర్గపు నివాసమైన 'వైకుంఠం' వద్దకు వెళతాడు. హిందూ ఇతిహాసాల ప్రకారం, విష్ణువు తన నరసింహ అవతారంలో అసుర రాజు హిరణ్యకశ్యప్‌ను చంపి అతని భక్తి (భక్తుడు) ప్రహ్లాద్ ప్రాణాలను కాపాడాడు. నరసింహ ద్వాదశిని పాటించడం ద్వారా వారి గత పాపాల నుండి విముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఇది దేని వలన అంటే; గోవింద ద్వదశి పండుగ చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది.
💐గోవింద ద్వాదశి పండుగ 2020 & 2027 మధ్య తేదీలు💐
2020 మార్చి 6, శుక్రవారం
2021 మార్చి 25 గురువారం
2022 మార్చి 14, సోమవారం
2023 మార్చి 3 వ శుక్రవారం
2024 మార్చి 21 గురువారం
2025 మార్చి 10, సోమవారం
2026 ఫిబ్రవరి 28 శనివారం
రేపటి నుండి అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
తిరుపతి, 2020 మార్చి 02: టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 3వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
మార్చి 7వ తేదీ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు మేష లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 8న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 9వ తేదీ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.
అదేవిధంగా మార్చి 10న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజలసేవ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మార్చి 25వ తేదీన ఉగాది సందర్భంగా ఉదయం 3.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
🕉🌞🌎🌙🌟🚩
లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు;
వస్తుంటే వస్తుందని సంబరపడరాదు;
పోతుంటే, అయ్యో! పోతూందనరాదు!
ఆనందం కోసం చేసేది కర్మ.
ఆనందంగా ఉండి చేసేది లీల.
చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ మన స్థూల శరీరాన్ని వదిలే చర్యలే.
చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలేస్తాం.
నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుండి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి దేహప్రవేశం చేస్తాం.
ధ్యానంలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదలి సూక్ష్మ దేహయాత్రల తరువాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహప్రవేశం చేస్తాము.
ఏదైతే లేదో దానినే 'మాయ' అని పిలుస్తారు.
ప్రపంచంలో రెండే రెండు వస్తువులు మాయ.
ఒకటి - చావు అనే భావన;
రెండు - నువ్వు వేరే, నేను వేరే అనే భావన.
🕉🌞🌎🌙🌟🚩
వాక్భూషణం
💐💐💐💐💐💐💐💐💐
ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి. సంభాషణం మిత భాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు- అంతకన్నా భూషణం మరొకటి లేదు.
‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం. రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.
సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.
ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.
మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.
మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.
మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.
ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.
మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానికన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!
👌🙏🙏🙏
--(())--
🙏లలితాసహస్త్రనామ పారాయనఁ నియమాలు🙏
1. లలితా సహస్త్రనామం mar 6 నుండి apr 6 వరకు 30 రోజుల్లో 108 సార్లు సంకల్పమ్ చెప్పుకొని ఎవరి స్వగృహంలో వారు పారాయనఁ చేస్తారు..
2. రోజు చేసే విధంగానే నిత్యపూజ చేసి రోజుకు వీలైనన్ని సార్లు కనీసం 4 సార్లు అనగా ఉదయం రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు చేసిన సరిపోతుంది..
3. ఆడవారికి నెలసరి ఆటంకం వచ్చినప్పుడు ఆపి సుచి అయ్యాక కొనసాగించాలి.. కొనగించే టప్పుడు కాస్త ఎక్కువ సార్లు చదివితే లెక్క సరిపోతుంది.
4. ఆహార నియమాలు ఏమీ లేదు మీరు ఉదయం పారాయనఁ పూర్తి చేసిన తర్వాత మీరు తినే ఆహారం తీసుకోవచ్చు మాంసాహారం మానటం మనకపోవడం మీ ఇష్టమే కానీ పారాయణ చేయడానికి అలాంటి నియమం ఏమీ లేదు..
5. లలితా సహస్త్ర నామం ఒక్కసారి పూర్తి అయిన సమయానికి పారాయణ చేస్తున్న వారి చుట్టూ ఆ శబ్ద ధ్వనికి శ్రీ చక్రం ఆకారం ఏర్పడుతుంది అందువల్ల పారాయణ ఒక్కసారి పూర్తి చేసే వరకు ఒకే చోట కూర్చుని పారాయణ చేయాలి అటు ఇటు తిరుగుతూ చేయాకుడదు
6. ఫలస్తుతి పూర్తిగా చదవాల్సిన పని లేదు ఒక 5 శ్లోకాలు చదివి ముగించ వచ్చు.
7. శుచిగా స్నానం చేసి చేయాలి కింద కూర్చోలేని వారు ఏదైనా కుర్చీలో కూర్చోవచ్చు ,పడుకునే బెడ్ పైన కూర్చుని చదవ కూడదు దానికి కారణం శ్రీ చక్రాన్ని సహస్త్రరం రూపంలో జపం రూపంలో అర్చిస్తున్నాము అంటే ఆ తల్లి మన సన్నిధిలోనే ఉంటుంది అన్న భావన తోనే చేయాలి కనుక నిద్రపోయే పడకలు పైన కూర్చొని పడుకుని పారాయణ చేయాకుడదు..
8. వివాహితులకు బ్రహ్మచర్య నియమాలు ఏమీ లేదు..శుచిని పాటించాలి...
9. తినే ఆహారంలో నియమాలు లేదు కానీ శ్వాస దుర్వాసన రాకూడదు ఎందుకంటే శబ్దంతో అర్చన చేస్తున్నాము ఆ ప్రతిధ్వని శబ్ద తరంగాలు ప్రకంపనలు దేవతా చిహ్నాలు గా రూపు దాలుస్తుంది కనుక సిగరెట్టు మందు లాంటి అలవాట్లు పారాయణ పూర్తి ఐఏ వరకు మానుకుంటే మంచి ఫలితం ఉంటుంది
10. మీరు మధ్యలో ఎక్కడైనా ఊరికి వెళ్తే అక్కడ కూడా యధావిధిగా పారాయణ చేసుకోవచ్చు...
11. సమయము లేని వారు, వయసు పైబడి ఓపిక లేని వారు, ఆరోగ్య సమస్య తో ఉండి అన్ని సార్లు చేయలేని వారు ఒక్కసారి అయిన చదవండి ఎందుకంటే కొన్ని వందల మంది ఈ పారాయణలో పాలకొంటున్నారు అన్నిసార్లు పారాయణ చేసిన ఫలితం మీకు కూడా దక్కుతుంది.
12.. ఎవరైనా ఏ వయస్సు వారైనా చేయవచ్చు..పారాయణకు అంగన్యాసాలు కరన్యాసాలు అవసరం లేదు, సంకల్పమ్, ధ్యానం , సహస్త్రరం, ఫలస్తుతి 5 శ్లోకాలు చాలు
13.ఉదయం సాయంత్రం కూడా పారాయణ చేసే వారు సాయంత్రం మళ్ళీ స్నానం మీ సౌకర్యం అంతే సౌకర్యం లేని వారు కాళ్ళు చేతులు మొహం కడిగి దీపం పెట్టుకుని చేయవచ్చు..
14. 30 రోజులు పారాయనఁ సమయంలో వీలైతే ఒకసారి గోవుకి పూజ చేయండి, ఒక గురువారం దక్షణామూర్తి ని గుడిలో దర్శించండి, ఒక శుక్రవారం గుడిలో దీపం పెట్టి రండి.. ఇంట్లో అరవడం గోడవపడటం లాంటివి చేయకండి పారాయనఁ ఐయ్యాక కూడా నిత్యం శ్రీమాత్రే నమః అన్న నామాన్ని మనసులో తలుచుకుంటూనే ఉండాలి అప్పుడు మీకు పూర్తి ఫలితం దక్కుతుంది చేసిన తృప్తి ఉంటుంది..
15. ఇలా అనేక సార్లు మీరు ఒకే రోజులో చేస్తూ 108 సార్లు నెల మొత్తంలో చేయడం వల్ల మీరు ఉన్న ప్రాంతంలో మీ లో మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తో మీ సంకల్పమ్ నెరవేరుతుంది.. పదే పదే ఆ శబ్ద ధ్వని మీ సగృహంలో పలకాలి ఆ ప్రకంపనలు వల్ల మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తీరాలి అని ఎవరి నివాస స్థానంలో వారిని చేయమని చెప్తున్నాను..
16. మొదటి రోజు పారాయణ ఉదయం 5 గం మొదలు అవుతుంది. సంకల్పమ్ 5 వతేదీ పోస్ట్ చేస్తాను.. వేరే దేశంలో ఉన్నవారు. మీ సమయంలో 5 గం మొదటి రోజు మొదలు పెట్టుకోండి....నేను 3 గం మొదలు పెట్టే పూజలో నామ గోత్రాలతో మహా సంకల్పమ్ అమ్మవారికి అభిషేకం.. పూర్తి చేసి 5 గం పారాయణ మొదలు అవుతుంది..మరుసటి దినం నుండి మీకు వీలైన సమయంలో నే మొదలు పెట్టుకోవచ్చు కేవలం మొదటి రోజు మటుకు అందరూ ఒకే సమయంలో మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాము.
ఆ తల్లి పై నమ్మకం విశ్వాసం తో ఎందరో పారాయణ చేయడానికి ఆశక్తి గా ఉన్నారు అందుకు చాలా ఆనందంగా ఉంది , ఆ తల్లి పట్ల మీ భక్తికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను 🙏🙏🙏 భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొటున్న వారికి ఎక్కడ ఎవ్వరు పారాయణ చేస్తున్నా వారందరి సంకల్పమ్ నెరవేరాలి అని కోరుకుంటున్నాను
ముఖ్య గమనిక :- ఈ పారాయణ చేయడంలో ధ్వని ప్రధానం ఆ ప్ర
కంపనలు స్పష్టంగా పలకాలి అప్పుడే పారాయణకు ఫలితం ఉంటుంది.. కనుక త్వరగా అవ్వాలి అనే కంగారులో చడవకూడదు స్పష్టంగా పదాలు తప్పులు లేకుండా సాధన ఆడియో వింటూ చదవండి అలవాటు అవుతుంది.
🙏శ్రీ మాత్రే నమః🙏
--(())--
: నీవు గంగానదిలో స్నానం చేస్తే
చేసిన పాపాలు పోతాయని అలోచిస్తావు !!
కానీ ఈశ్వరుడిని స్మరిస్తే
పాపబుద్ది పోతుందని ఏనాడైనా ఆలోచించావా !!
గంగానది బాహ్య శరీరాన్ని మాత్రమే శుద్దిచేయగలదు
కానీ ఈశ్వరుడు లోపల ఉన్న ఆత్మను శుద్ది చేస్తాడు !!
ఓం నమః శివాయ.......
విష్ణు సహస్ర నామ మహిమ :
పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు . అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .
ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను , ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన నల్లరంగు ను తొలగించాడు . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది .
విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .
--(())--
“శబరి విందు’!
🥀💥🥀💥🥀💥🥀💥🥀
శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?
శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు
ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని
కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు
చూస్తూనే వృద్ధురాలై పోయింది.
రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.
“ మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్. “ వా.3-74.17
అని మాత్రమే వాల్మీకం.
దీన్ని వ్యాఖ్యానిస్తూ గోవిందరాజీయం లో -
“ వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే.”
{ చతుర్వ్యాఖ్య. పు. 1276 .}
దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం.
అంటే” ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకం లో లేదు.
కాని” శబరి “పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు
ఒక్కరు లేరు.
మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది.
పద్మపురాణం లో మనకు ఈ ** విందు ప్రస్తావన కన్పిస్తోంది.
” ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం
........................................................
ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా”
పద్మపురాణ భాగంలో” పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది.
కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.
“ “
శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి.
అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.
వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి స్వామికి సమర్పించిందని భావించిన జానపదులు
“శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు తూనే ఉంది..
శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన..
శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
“ శబరి పూర్వ జన్మ లో” మాలిని” అనే గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి మాలిని గా మారిపోయి భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. “ అని కంబరామాయణం శబరి పూర్వ చరిత్ర ను ప్రస్తావించింది.[puranic encyclopedia –p.659].
తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.
తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.
***శబరీ దత్త ఫలాశన రామ******
🌼🌿1) పూజ్యులు పెద్దలైన ఇద్దరి మధ్య నుంచి నడిచి వెళ్ళకూడదు . 🌼🌿
2) ఒక నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని స్మరించకూడదు .
3) షష్టి , అష్టమి , చతుర్దశి తిధులయందు తైలాభ్యంగ స్నానం చేయరాదు .
4) బహిష్టు అయిన 5 వ రోజు నుంచి స్త్రీలు, దేవత శుభకార్యాలలో పాల్గొనవచ్చు .
5) దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ,ముట్టు వలన వారు వ్రతభంగము అయింది అని బాధపడుతుంటారు . అది వ్రతభంగము ఏమి కాదు . వారు 5 లేక 7 వ రోజు నుంచి యధావిధిగా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు .
6)ఇల్లు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను మూడు రోజులు కట్టివేయుట వలన స్ధలసంబంధిత దోషాలు ఏమైనా ఉంటె అవి తొలగిపోతాయి .
7) మొక్క / చెట్టు మీద నుంచి రాలిన, నలిగిన పూవులు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించరాదు . పూజకు పూవులు లేని సమయంలో
వాటి స్థానంలో అక్షింతలు వాడుకోవచ్చు .
8) దేవతలను తృప్తి పరుచుటకన్నా పితృదేవతలను( కాలం చేసిన పెద్దలును ) తృప్తి పరచుట ముఖ్యం . అందువలన వంశాభివృద్ధి జరుగును .
9)ప్రతి రోజు మొదటి అన్నం ముద్ద తినేముందు ఓం హ్రీం గౌరీయై నమః అని కానీ ఓం అన్నపూర్ణా దేవియై నమః అని ఒక 5 సార్లు స్మరించుకొని భోజనం ప్రారంభిస్తే ఆ భోజనం ఔషధము లాగ పని చేస్తుంది, ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుంది , మరియు పండించిన రైతుకి కూడా ఎంతో మేలు జరుగుతుంది
10) శత్రునాశనం కొరకు ఎన్నో క్షుద్రపూజలు చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు . అంటువంటి వారికి ఒక చిన్న చిట్కా . ఒక చిన్న శివలింగానికిప్రతి రోజు ఆవాలు నూనెతో అభిషేకం చేస్తే ( ఎంత చిన్న శివలింగమైతే అంత మంచిది .) శత్రుబాధలనుంచి విముక్తి పొందవచ్చు.
11) తల్లిపాదాలకు ఒక్క సారి నమస్కారం , తండ్రి పాదాలకు 2 సార్లు , గురువు పాదాలకు 3 సార్లు , భగవంతునికి 4 సార్లు , అమ్మవారికి
( శక్తి దేవతలకు) 5 సార్లు నమస్కారం చేయాలి .
12)భగవంతునికి , మగవారు అయితే సాష్టాంగ నమస్కారం , ఆడవారు అయితే పంచమ నమస్కారం చేయుట శ్రేష్టం .
13) స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా పిన్నీసులు వంటివి పెడుతుంటారు . అది శాస్త్ర, విరుద్ధం . ఆలా చేయటం వలన భార్య, భర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు .
14) భగవంతుని నైవేద్యానికి బెల్లము ముక్క ఇక పటిక బెల్లం ఉపయోగించాలి . పంచదార నివేదన చేయరాదు . ఒకవేళ పండ్లు నివేదన చేస్తే తొక్క తీసి పెట్టాలి .
15) సూర్యునికి, చంద్రునికి ఎదురుగా ఎప్పుడు కూడా మల మూత్ర విసర్జన చేయరాదు, అలాగే ఉదయాన్నే బయట సూర్యునికి ఎదురుగా
నుంచుని పండ్లు తోముకుంటూ ఉంటారు . ఆలా ఎప్పుడు చేయరాదు .
16) ఓం
శ్రీ శా నమో నమః - ఈ మంత్రాన్ని సర్వకార్యసిద్ధి మంత్రం అంటారు . సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని శక్తీ కొలది స్మరించుకోండి . మీరు చేయబోయే కార్యము నిర్విఘ్నం గా జరుగుతుంది .
--(())--
శుభోదయం
ప్రార్థన చేయగలవా? ప్రార్ధన అనేది ఒక భావ దశ. నీవు ప్రార్ధనలో ఉండగలుగుతావు. ప్రార్ధనలో మౌనంగా, నిశ్శబ్దంగా ఉంటావు. ఆ నిశ్శబ్దంలో మీరు స్వీకరించడం, అంగీకరించడం జరుగుతుంది. దేవాలయాల్లో పూజారి ప్రార్ధన చేస్తూ ఉంటాడు. అభినయం నడుస్తూవుంటుంది. ఆయనొక ఉద్యోగి. అతను జీవితాంతం ప్రార్ధన చేస్తున్నా కూడా అతనిలో ఘటించేది ఏదీ ఉండదు.
శిష్యుడు ఎక్కడ సిద్ధంగా ఉంటాడో, గురువు అక్కడ ప్రత్యక్షమవుతాడు. వారిద్దరూ అక్కడ ఉండాలి. సత్సంగము జరగాలి. అప్పుడు ఘటనలు ఘటించడం ప్రారంభమవుతుంది.
* అర్జునుడు సందేహం మీద సందేహం లెవనెత్తుతూనే వున్నాడు. కృష్ణుడు వాటన్నింటికీ సమాధానాలు చెప్తూనే వున్నాడు. మీ లోపల కూడా అలాంటి ప్రశ్నల మధనమే నడుస్తూ ఉంది. కానీ కష్టం ఏమిటంటే, మీరు చెప్పింది చాలాసార్లు వినడం వలన, మిమ్మల్ని చాలాసార్లు చదవడం వలన లోపలి నుండి తక్షణమే జవాబు వచ్చేస్తోంది. దీని వలన ఏదో ఇబ్బంది కలుగుతోంది. దానికి ఏమి చేయాలి?
మీ లోపల ప్రశ్నలు ఉదయించినప్పుడు, జవాబులు కూడా రావాలి. ప్రశ్నలు మస్తిష్కం నుండి వస్తే, జవాబులు లోతుల నుండి రావాలి. హృదయం నుండి రావాలి. జవాబు ప్రశ్న కన్నా లోతుగా వున్న స్థానం నుండి రావాలి. అప్పుడు పరిష్కారం లభిస్తుంది.
మీ లోపల నుండి ఒక సమాధానం వచ్చి, ఆ సమాధానం మీ సమస్యకు పరిష్కారం కాదు అని మీకు అనిపించినట్లయితే, అసలు ఆ సమాధానం సమాధానమే కాదు అని మీరు భావించవలసి వస్తుంది.
చిత్తానికి గల రెండు దశలలో అభిప్రాయం అనే భావం జనిస్తుంది. ఒకటి మీరు తర్కముతో, ఆలోచనతో, మ ధనముతో ఒక నిర్ణయానికి చేరుకున్నారు అంటే, అప్పుడు కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మరో కొత్త తర్కం వస్తుంది. అప్పుడు ఈ అభిప్రాయం మూల పడుతుంది. అందువలన తర్కముతో ఏర్పడిన దానిని అభిప్రాయం అనకూడదు. నిర్ణయం అనాలి.
కృష్ణుడు అర్జునుని తో నేను నీకు నా నిర్ణయం చెప్తున్నాను అని అనడం లేదు. నా అభిప్రాయం చెప్తున్నాను అంటున్నాడు. అభిప్రాయం అంటే ఎలాంటి మార్పు ఉండనిది. అభిప్రాయం అంటే ఆత్మ జాగరణతో పొందినది. పరిస్థితులు మారతాయి. నిర్ణయాలు మారతాయి. ఎందుకంటే కొత్త పరిస్థితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కానీ అభిప్రాయాలు మాత్రం మారవు.
ఎప్పుడు పురుషుడు శ్రేష్ఠ చిత్తముతో నిండి ఉంటాడో, అప్పుడతను మోక్షమును గురించిన జిజ్ఞాసను కలిగి ఉంటాడు. నేను ముక్తిని ఎలా పొందగలను? అని అతను ప్రశ్నిస్తాడు. సంసారం తో, సంసారం లోని బాధలతో విసిగిపోయి, మెలకువ తెచ్చుకునే వారే, ముక్తిని ఎలా పొందాలి అని అడుగుతారు. వారే సన్న్యాసం గురించి, త్యాగము గురించి చక్కగా అర్ధం అయ్యేలా చెప్పండి అని అడుగుతారు. కృష్ణుడు త్యాగము
మూడు రకాలు, సన్న్యాసం మూడు రకాలు అని అంటున్నాడు.
--(())--
: నవ గోప్యాలు
ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.
ప్రాణికోటికి ఉండు ఆయువు నిబ్బ రమ్ముగ ఉంచుటే
వేణు నాదము మల్లె జీవియు ఆ వివేకము పొందుటే
శ్రేణి జ్ణానము పొంది ఉండిన బ్రహ్మ రాతను దాటరే
ఆణి ముత్యము అందు బాటున ఉండి జీర్ణము కాదులే
ఉప్పు డబ్బు యు తక్కు వైనను ఎక్క వైనను కష్టమే
అప్పు డబ్బు యు ఉన్నదన్నను లేదు ఆన్నను కష్టమే
ఒప్పు చెప్పుట డబ్బు దాచుట అగ్ని ఆహుతి అవ్వుటే
పప్పు కూడు కు దాన ధర్మము చేసి బత్కుట జీవితం
👉భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ ‘వివేకము’ అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.
👉ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది.
👉ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానే్న ‘ఇంటిగుట్టు’ అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు.
👉‘‘మననం చేసేది మంత్రం’’- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం. మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి.
👉పరపంచంలో ప్రతి మొక్క ఔషధమే. ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటేవారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
👉సంగమం అంటే కలయిక. మనం కొన్ని రహస్యమైన భేటీలు జరుపుతాం. అవి అధికారిక, అనధికారమైనవి ఏవైనా కావచ్చు. రహస్యంగా ఉంచడం ఉత్తమం. అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న సమావేశాలు ఉంటుంటాయి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది.
👉దనం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది.
👉మనం అంటే గౌరవం. దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఏమీ చేతగాకున్నా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని చెప్పకూడదు. మనం గౌరవాన్ని ఎంత రహస్యంగా ఉంచితే అంత పెరుగుతుంది.
👉అలాగే తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుంది. దాంతో పగ.. అలా అంతే ఉండదు. ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మన చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం.
ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ
🙏🙏🙏🙏
9: శుభోదయం

ఎప్పుడు పురుషుడు శ్రేష్ఠ చిత్తముతో నిండి ఉంటాడో, అప్పుడతను మోక్షమును గురించిన జిజ్ఞాసను కలిగి ఉంటాడు. నేను ముక్తిని ఎలా పొందగలను? అని అతను ప్రశ్నిస్తాడు. సంసారం తో, సంసారం లోని బాధలతో విసిగిపోయి, మెలకువ తెచ్చుకునే వారే, ముక్తిని ఎలా పొందాలి అని అడుగుతారు. వారే సన్న్యాసం గురించి, త్యాగము గురించి చక్కగా అర్ధం అయ్యేలా చెప్పండి అని అడుగుతారు. కృష్ణుడు త్యాగము మూడు రకాలు, సన్న్యాసం మూడు రకాలు అని అంటున్నాడు.
హరిఓం ,

Comments
Post a Comment