శ్రీ ఆర్యా ద్విశతి



🌹. శ్రీ ఆర్యా ద్విశతి  - 35 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక  (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 69వ శ్లోకము II 🌻 

తస్యాః పరితో దేవీః స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాం I
ప్రణమత జృంభిన్యాద్యా భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ II ౬౯

. తాత్పర్యముః 
తస్యాః పరితః - ఆ దేవిచుట్టూ ఉండు, స్వప్నేశీ - స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, ముఖాః - మొదలగు, దేవీః - దేవతలను, జృంభిన్యాద్యాః - జృంభినీ మొదలగు దేవతలను, హేతుక ప్రముఖాన్ - హేతుకుడు మొదలగు, భైరవవర్గాంశ్చ - భరవుడను దేవతను, ప్రణమత - నమస్కరించుచున్నాను.

వారాహీ అమ్మవారి చుట్టూ ఉండే స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, జృంభినీ, హేతుకుడు, భైరవుడు మొదలగు దేవతలకు నమస్కరించుచున్నాను !!

దండనాథాదేవి యొక్క చక్రమునకు కిరిచక్రరథమని పేరు. దానికి చక్ర రక్షకులు - డృంభిని, స్తంభిని, మోహిని అను ముగ్గురు శక్తులు. వీరు ఆ చక్రమునకు అధిష్టాన దేవతలు. 

ఆ రథమునకు క్రింది భాగమునందు, అష్టదిక్కులందును, అథోభాగమునందు రక్షకులై హేతుకుడు మొదలగు దశభైరవులు కలరు.. వారి పేర్లు..

హేతుక స్త్రిపురారిశ్చ తృతీయాశ్చాగ్నిభైరవః I
యమజిహ్వైకపాదౌచ తౌచకాలకరాళకౌ II

భీమరూపో హాటకేశస్తధైవాచలనామవాన్ I
ఏతే దశైవ విఖ్యాతా దశకోటిభటాన్వితాః II (లలితోపాఖ్యానము, 25వ అధ్యాయము, 81-82వ శ్లోకములు)

 ఆర్యా ద్విశతి - 70వ శ్లోకము II 🌻

పూర్వోక్తసంఖ్యయోజనదూరే పూషాంశుపాటలస్తస్య I
విద్రావయతు మదార్తిం విద్రుమసాలో విశంకటద్వారః II ౭౦

🌻. తాత్పర్యముః 
తస్య - దానికి (మరకతప్రాకారమునకు), పూర్వోక్తరసంఖ్యయోజనదూరే - ముందు చెప్పబడిన యోజనముల దూరమునందు (ఏడు యోజనముల దూరమున ఉండు), పూషా - సూర్యుని, అంశు - కిరణములవలె, పాటలః - ఎఱ్ఱని కాంతి కలదియు, విశంకట - విశాలమైన, ద్వారః - వాకిళ్ళు గలదియు, విద్రుమసాలః - పగడములతో చేయబడిన ప్రాకారము, మదార్తిం - నా యొక్క పీడను/బాధలను,సంకటములను, విద్రావయతు - పోగొట్టుగాక !!

మరకతమయ ప్రాకారమునకు ఏడు యోజనముల దూరమునందు సూర్యుని కిరణాలవలె ఎఱ్ఱని కాంతి కలది, విశాలమైన వాకిళ్ళు కలది, పగడములతో చేయబడినది అయిన పదిహేడవ ప్రాకారము (పగడమయ) - నా యొక్క బాధను/పీడను/సంకటములను పోగొట్టుగాక !!

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 67వ శ్లోకము II 🌻 

హల ముసల శంఖచక్రాంకుశ పాశా౨భయవరస్ఫురిత హస్తా I
కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా II ౬౭

🌻. తాత్పర్యముః 
హల - మడక, ముసల - రోకలి, శంఖ - శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయముద్ర, వరముద్ర తో , స్ఫురిత - ప్రకాశించుచున్న, హస్తా - హస్తములు గలదియు, కూలంకష - పూర్ణమైన (గట్టును పెళ్లగించు), అనుకంపా - దయారసము గలదియు, కుంకుమ - కుంకుమచేత, జంబాలిత - పూయబడిన, స్తనాభోగా - కుచముల వైశాల్యము కలిగినదియు..

🌻 II ఆర్యా ద్విశతి - 68వ శ్లోకము II 🌻 

ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా I
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ II ౬౮ 

🌻. తాత్పర్యముః 
 ధూర్తానాం - దుష్టులకు, అతిదూరా - మిక్కిలి దూరముగా ఉండునదియు (అనగా ధూర్తులకు లభించనది), వార్తాశేష - మాటయే శేషముగా గల (ఉన్నదో లేదో అనునంతటి సన్నని), వలగ్న - నడుము చేత, కమనీయా - మనోజ్ఞురాలైనదియు, ఆర్తాళీ - ఆర్తుల సమూహములకు (ఆర్తిగా ఉన్న భక్తులకు), శుభదాత్రీ - శ్రేయస్సును ఇచ్చునదియు అగు, వార్తాళీ - వారాహీ అమ్మవారు (దండనాథాదేవి), వాంఛితార్థాయ - అభీష్టములను, భవతు - ఇచ్చుగాక !!

🌻. భావము :
దుష్టులకు అందనిది, సన్నని నడుము కలిగినది, ఆర్తులైన భక్తులకు శుభములను, శ్రేయస్సును ఇచ్చునది అయిన వారాహీ అమ్మవారు మాకు అభీష్టములను ప్రసాదించుగాక !!

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి -  65వ శ్లోకము II 🌻 

బిందుత్రికోణవర్తుల షడస్రవృత్తద్వయాన్వితే చక్రే I
సంచారిణీ దశోత్తర శతార్ణ మనురాజకమలకలహంసీ II ౬౫ 

🌻. తాత్పర్యముః 
బిందుత్రికోణ - బిందువు, త్రికోణము, వర్తుల - గుండ్రమగు, షడస్రవృత్తద్వయ - ఆరు రేకులు గల రెండు వలయములతో, అన్వితే - కూడిన, చక్రే - చక్రము నందు, సంచారిణీ - సంచరించుచున్న, దశోత్తర - పదికి పైగాగల, శతార్ణ - నూరు వర్ణములు గల (110 అక్షరములు గల), మనురాజ - మంత్రశ్రేష్టమనెడు, కమల - తామరము యందు విహరించు, కలహంసీ - రాజహంసాంగనయు...

బిందువు, త్రికోణము, గుండ్రమగు ఆరురేకుల రెండు వలయములతో కూడిన చక్రము నందు, సంచరించుచున్నదియు, సహస్రముకి పైగా అక్షరములు గల మంత్రశ్రేష్టమనెడు కమలము యందు విహరించుచున్న రాజహంసాంగనయు ....

🌻 II ఆర్యా ద్విశతి - 66వ శ్లోకము II 🌻 

కోలవదనా కుశేశయనయనా కోకారిమండితకిరీటా I
సంతప్తకాంచనాభా సంధ్యారుణచేల సంవృతనితంబా II ౬౬ 

🌻. తాత్పర్యముః 
కోలవదనా - వరాహముఖము కలదియు, కుశేశయనయనా - తామరల వంటి నయనములు గలదియు, కోకారి - చంద్రుని చేత, మండిత - అలంకరింపబడిన, కిరీటా - శిరోభూషణము గలదియు, సంతప్తకాంచనాభా - తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము గలదియు, సంధ్యారుణ - సంధ్యాకాంతివలె ఎర్రని, చేల - వస్త్రముచేత, సంవృత - చుట్టబడిన, నితంబా - శరీరము కలదియు..

వరాహముఖము కలిగి, తామరముల వంటి నయనములు, శిరస్సున చంద్రవంకను ధరించిన, తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము కలదియు, ఎర్రని వస్త్రములను ధరించినదియు...

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 63వ శ్లోకము II 🌻 

తత్రైవ మంత్రిణీగృహపరిణాహం తరళకేతనం సదనమ్ I
మరకతసౌధమనోజ్ఞం దద్యాదాయూంషి దండనాథాయాః II ౬౩

🌻. తాత్పర్యముః 
తత్రైవ - ఆ ప్రదేశమునందే ఉండు, మంత్రిణీగృహపరిణాహం - శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలదియు, తరళకేతనం - చలించుచున్న పతాకములు కలదియు, మరకతసౌధమనోజ్ఞం - మరకత నిర్మితమైన మేడలచేత రమ్యముగా నుండునదియు అగు, దండనాథాయాః - దండనాథాదేవి (ఈమెయే వారాహీ అమ్మవారు), సదనం - గృహము, ఆయూంషి - దీర్ఘాయుస్సులను, దద్యాత్ - ఇచ్చుగాక !!

ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశము నందు, బంగారు తాటి వృక్షముల వనము ఉండు చోట, శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలిగినది, మరకత మణులతో నిర్మింపబడిన మేడలచేత రమ్యముగా ఉండునది అయిన, దండనాథాదేవి (అనగా వారాహీ అమ్మవారి) గృహము, మాకు దీర్ఘాయుష్షును ఇచ్చుగాక !!

దండనాథా దేవికి ద్వాదశ నామములు కలవు - అవి వరుసగా...
శ్రీహయగ్రీవః II

శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవః I
యేషామా కర్ణనామాత్రాత్ప్రసన్నా సా భవిష్యతి II

పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ I
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ తథా II

వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా I
అరిఘ్నీచేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే II

నామా ద్వాదశకాభిఖ్య వజ్రపంజరమధ్యగః I
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః II (లలితోపాఖ్యానము, 23వ అధ్యాయము, 54-58 శ్లో.)

వారాహీ అమ్మవారు, లలితాంబిక యొక్క అహంకారము నుండి పుట్టినది.

అహంకారాత్సముత్పన్నా మేఘశ్యామల విగ్రహా I
మహావార్తాళికాదేవీ పోత్రివక్త్రసముజ్జ్వలా II 
(లలితోపాఖ్యానము, 22వ అధ్యాయము, 31వ శ్లోకము)

🌻 II ఆర్యా ద్విశతి - 64వ శ్లోకము II 🌻 

సదనే తత్ర హరిన్మణిసంఘటితే మంటపే శతస్తంభే I
కార్తస్వరమయపీఠే కనకమయాంబురుహకర్ణికామధ్యే II ౬౪

🌻. తాత్పర్యముః 
తత్ర సదనే - ఆ గృహము నందు (అనగా వారాహీ అమ్మవారి గృహము నందు), హరిన్మణిసంఘటితే - పచ్చని పరకత మణులచేత నిర్మింపబడినది, శతస్తంభే - నూరు స్తంభములు కలదియు, మంటపే - మంటపము నందు, కార్తస్వరమయపీఠే - బంగారముతో చేయబడిన పీఠము యందు, కనకమయ - బంగారుమయమైన, అంబురుహ - తామరపువ్వు యొక్క, కర్ణిక - దుద్దు యొక్క, మధ్యే - నడుమ ఉండు....

సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 61వ శ్లోకము II 🌻

పవమానసంఖ్యయోజనదూరే బాలతృణమేచక స్తస్య I
సాలో మరకతరచితస్సంపదమచలాం శ్రియం చ పుష్టాతు II ౬౧

🌻. తాత్పర్యముః 
 తస్య - దానికి (ముక్తామణి ప్రాకారమునకు), పవమాన సంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు, (పవమాన సంఖ్య - వాయువుల సంఖ్య అనగా ఏడు), బాలతృణమేచకః - లేతపచ్చికగడ్డి వలె కాంతిగల, మరకతరచితః - మరకత మణులతో నిర్మింపబడిన సాలః - ప్రాకారము, సంపదం - సంపదలను/ధనములను, అచలాం - స్థిరమైన, శ్రియం చ - లక్ష్మిని (సౌభాగ్యమును), పుష్టాతు - వృద్ధి పొందించుగాక !!

పదిహేనవ (ముక్తామణి) ప్రాకారమునకు ఏడు యోజనముల దూరములో లేతపచ్చికగడ్డి వలె కాంతిగల మరకత మణులతో చేయబడిన ప్రాకారము - పదహారవది అయిన మరకతమయ ప్రాకారము - మాకు స్థిరమైన సంపదలను, సౌభాగ్యమును వృద్ధి పొందించుగాక !!

🌻 II ఆర్యా ద్విశతి - 62వ శ్లోకము II 🌻

ఆవృత్తియుగ్మాంతరతో హరితమణీనివహమేచకే దేశే I
హాటకతాళీవిపినం హాలాఘటఘటిత విటపమాకలయే II ౬౨

🌻. తాత్పర్యముః 
 ఆవృత్తియుగ్మాం - ఆ రెండు (ముక్తామణి మరియు మరకతమయ) ప్రాకారముల, అంతరతః - మధ్య ప్రదేశమునందు, హరితమణీ - మరకత మణుల, నివహ - గుంపులవలె, మేచకే - నల్లని, దేశే - ప్రదేశమునందు ఉండు, హాలాఘట - కల్లుకుండలతో, ఘటిత - కూర్పబడిన, విటపం - కొమ్మలుగల, హాటకతాళీవిపినం - బంగారు తాటిమ్రాకుల వనమును, కలయే -  ధ్యానించుచున్నాను !!

ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశమునందు, మరకత మణుల గుంపులవలె నల్లని ప్రదేశమునందు కల్లుకుండలతో కూర్పబడిన కొమ్మలు గల, బంగారు తాటివృక్షముల వనమును ధ్యానించుచున్నాను !!

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 59వ శ్లోకము II 🌻 

తస్యైవ పూర్వసీమని తపనీయారచితగోపురే నగరే I
కాత్యాయనీసహాయాం కలయే శీతాంశుఖండచూడాలమ్ II ౫౯

🌻. తాత్పర్యముః 
తస్యైవ - దానికి, పూర్వసీమని - తూర్పుప్రదేశమునందు, తపనీయారచితగోపురే - బంగారముతో నిర్మింపబడిన గోపురము గల, నగరే - పట్టణమునందు, శీతాంశుఖండచూడాలం - బాలచంద్రుని శిరస్సున ధరించిన, కాత్యాయనీసహాయాం - పార్వతీదేవి పతియగు ఈశానుని, కలయే - ధ్యానించుచున్నాను !!

దానికి తూర్పు ప్రదేశమునందు ఉండు, బంగారు గోపురము గల పట్టణమునందు, బాలచంద్రుని శిరస్సున ధరించిన, కాత్యాయనీ పతియగు ఈశానుని నేను ధ్యానించుచున్నాను.

🌻 II ఆర్యా ద్విశతి - 60వ శ్లోకము II 🌻 

తత్పురషోడశవరణ స్థలభాజ స్తరుణచంద్రచూడాలాన్ I
రుద్రాధ్యాయే పఠితాన్ రుద్రాణీసహచరాన్ భజే రుద్రాన్ II ౬౦

🌻. తాత్పర్యముః 
తత్పుర - ఆ ఈశానుని పట్టణము యొక్క, షోడశవరణ - పదహారు ప్రాకారములను, స్థల ప్రదేశములను, భాజః - పొందినవారు (అందు నివసించువారు), తరుణచంద్రచూడాలాన్ - బాలచంద్రుని ధరించినవారును, రుద్రాధ్యాయే - శతరుద్రీయమునందు, పఠితాన్ - చెప్పబడినవారును, రుద్రాణీ సహచరాన్ - రుద్రాణీ దేవతలతో కూడిన వారును అగు, రుద్రాన్ - రుద్రులను, భజే - సేవించుచున్నాను.

ఆ ఈశానుని పురమునందు, పదహారు ప్రాకారములలో నివసించువారు, బాలచంద్రుని శిరస్సున ధరించువారు, రుద్రాధ్యాయము నందు చెప్పబడిన వారు, రుద్రాణీ దేవతలతో కూడిన వారును అయిన రుద్రులను నేను సేవించుచున్నాను.

సశేషం..... 

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 57వ శ్లోకము II 🌻 

తరుణీ రిడాప్రధానాస్తిస్రో వా తస్య తత్ర కృతవాసాః I
ప్రత్యగ్రకాపిశాయన పానపరిభ్రాంతలోచనాః కలయే II ౫౭

🌻. తాత్పర్యముః 
తత్ర కృతవాసాః - అచ్చటనే వసించుచున్నవారును, ప్రత్యగ్ర - క్రొత్త, కాపిశాయన - మద్యమును, పాన- త్రాగుటచేత, పరిభ్రాంత - తిరుగుడుపడుచున్న, లోచనాః - కన్నులు కలవారగు, ఇడాప్రధానాః - ఇడాదేవి మొదలగు, తస్య - అతని యొక్క (వాయువు), తిస్రః - ముగ్గురు (ఇడా, పింగళా, సుషుమ్నా అను ముగ్గురు వాయుదేవుని పత్నులు), తరుణీః - భార్యలను, కలయే - ధ్యానించుచున్నాను. 

అచ్చటనే నివసించుచున్నవారును, క్రొత్త మద్యమును త్రాగుటచే తిరుగుడుపడిన కన్నులు కలిగిన వారును అయిన ఇడాదేవి మొదలగు వాయువు యొక్క ముగ్గురు పత్నులను (ఇడా, పింగళా, సుషుమ్నా) నేను ధ్యానించుచున్నాను !!

🌻 II ఆర్యా ద్విశతి - 58వ శ్లోకము II 🌻 

తల్లోకపూర్వభాగే ధనదం ధ్యాయామి శేవధికులేశమ్ I
అపి మాణిభద్రముఖ్యానంబాచరణావలంబినో యక్షాన్ II ౫౮

🌻. తాత్పర్యముః 
తల్లోక - ఆ ప్రదేశమునకు (వాయువ్య మూలకు), పూర్వభాగే - తూర్పు దిక్కునందు ఉండు, శేవధికులేశం - నిధుల సమూహమునకు ప్రభువగు, ధనదం - కుబేరుని, అంబాచరణావలంబిన - పరమేశ్వరి పాదములను ఆశ్రయించిన, మాణిభద్రముఖ్యాన్ - మణిభద్రుడు మొదలగు, యక్షాన్+అపి - యక్షులను, ధ్యాయామి - ధ్యానించుచున్నాను.

ఆ వాయువ్య మూలకు తూర్పు దిక్కున ఉండు, నిధులకు ప్రభువైన కుబేరుని, పరమేశ్వరి పాదపద్మములను ఆశ్రయించిన మణిభద్రుడు మొదలైన యక్షులను ధ్యానించుచున్నాను !!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌻. II ఆర్యా ద్విశతి - 53వ శ్లోకము II 🌻 

దక్షిణదిగంతరాళే దండధరో నీలనీరదచ్ఛాయః I
త్రిపురాపదాబ్జభక్త స్తిరయతు మమ నిఖిలమంహసాం నికరమ్ II ౫౩

🌻. తాత్పర్యముః 
దక్షిణదిగంతరాళే - ఆ మధ్య భూమికి దక్షిణదిశ నడుమ ఉండు, నీలనీరదచ్ఛాయః - నల్లనిమేఘమువంటి శరీరకాంతి గలవాడును, త్రిపురాపదాబ్జభక్తః - శ్రీ త్రిపురసుందరీ పాదారవిందములను సేవించువాడును, దండధరః - యముడు, మమ - నా యొక్క, నిఖిలం - సమస్తమైన, అంహసాం నికరం - పాపముల సమూహమును, తిరయతు - పోగొట్టుగాక !!

ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్యప్రదేశమునందు, దక్షిణదిశ మధ్యలో, నల్లనిమేఘము వంటి శరీర ఛాయ కలిగినవాడును, శ్రీత్రిపురమహాసుందరీ అమ్మవారి పాదారవిందముల సదా సేవించువాడు అయిన యమధర్మరాజు గారు, నా యొక్క సమస్త పాపములను పోగొట్టుగాక !!

🌻 II ఆర్యా ద్విశతి - 54వ శ్లోకము II 🌻 

తస్యైవ పశ్చిమాయాం దిశి దళితేందీవరప్రభాశ్యామః I
ఖేటాసియష్టిధారీ ఖేదానపనయతు యాతుధానో మే II ౫౪

🌻. తాత్పర్యముః 
తస్యైవ - ఆ దక్షిణదిశయందలి మధ్యభాగమునకు, పశ్చిమాయాం - పశ్చిమ దిక్కునందు ఉండు, దళిత- వికసించిన, ఇందీవర - కలువల, ప్రభా - కాంతివలె, శ్యామః - నల్లని మేనిఛాయ కలవాడు, ఖేట - ఖడ్గము, అసి - కత్తి, యష్టి - కొయ్య, ధారీ - ధరించినవాడును, యాతుధానః - నైరృతి, మే- నాయొక్క, ఖేదాన్ - దుఃఖములను, అపనయతు - పోగొట్టుగాక !!

ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, దక్షిణదిశమధ్య భాగమునకు పశ్చిమ దిక్కులో, బాగా వికసించిన నల్లకలువల కాంతివలే, నల్లని మేని ఛాయ కలిగిన నైరృతి, నా యొక్క దుఃఖములను పోగొట్టుగాక !!

సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹


🌻 II ఆర్యా ద్విశతి - 45వ శ్లోకము II 🌻

రోధసి తస్యా రుచిరే వజ్రేశీ జయతి వజ్రభూషాఢ్యా I
వజ్రప్రదానతోషిత వజ్రిముఖత్రిదశ వినుతచారిత్రా II ౪౫

🌻. తాత్పర్యముః
తస్యాః - ఆ నది యొక్క (అనగా వజ్ర నది యొక్క), రుచిరే - సొబగైన, రోధసీ - తీరమునందు, వజ్రభూషాఢ్యా - రవలు చెక్కిన సొమ్ములు ధరించినదియు, వజ్రప్రదాన - వజ్రాయుధమును ఇచ్చుటచేత, తోషిత - సంతోషపెట్టబడిన, వజ్రి - దేవేంద్రుడు, ముఖ - మొదలగు, త్రిదశ - దేవతలచేత, వినుత - కీర్తించబడిన, చారిత్రా - చరిత్ర గలదియు, వజ్రేశీ - వజ్రేశ్వరి యను దేవత, జయతి - సర్వోత్కృష్టముగా వర్తించుచున్నది.

వజ్ర నది యొక్క సొబగైన తీరమునందు, వజ్రాయుధము ఇచ్చుటచేత సంతోషపెట్టబడిన దేవేంద్రుడు మొదలైన దేవతలచేత కీర్తింపబడిన/నమస్కరింపబడిన చరిత్ర కలది, వజ్రభూషణములు ధరించినది అయిన, వజ్రేశ్వరీ అను దేవత సర్వోత్కృష్టముగా వర్తించుచున్నది (జయము కలుగుగాక) !!

 🌻 II ఆర్యా ద్విశతి - 46వ శ్లోకము II 🌻

తస్యోదీచ్యాం హరితి స్తబకిత సుషమావలీఢవియదంతః I
వైడూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వరణః II ౪౬

🌻. తాత్పర్యముః
తస్య - పన్నెండవ (వజ్రమయ ప్రాకారమునకు), ఉదీచ్యాం - ఉత్తరపు (పై భాగమునందు), హరితి - దిక్కునందు ఉండు, స్తబకిత - గుంపులుగా ఉండు, సుషమా - ఉత్కృష్టమైన కాంతులచేత, అవలీఢ - వ్యాపింపబడిన, వియదంతః - ఆకాశముయొక్క కొనలు గలదియు (అనగా బాగా పొడవైన), వైడూర్యరత్నరచిత - వైఢూర్య మణులచేత నిర్మింపబడినది, వరణః - ప్రాకారము, చేతసః - మనస్సుకు, వైమల్యం - నిర్మలత్వమును (ప్రసన్నత్వమును), దిశతు - ఇచ్చుగాక !!

వజ్రమయ ప్రాకారమునకు పై భాగమునండు, గుంపులుగా ఉత్కృష్టమైన కాంతులచేత వ్యాపింపబడినది, ఆకాశమంత ఎత్తులో కొనలు కలిగి, వైఢూర్య మణులచే చేయబడిన పదమూడవ ప్రాకారము - మా మనస్సుకు నిర్మలత్వమును చేకూర్చుగాక !!

సశేషం
.....
🌹 🌹 🌹 🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 43వ శ్లోకము II 🌻

వరణద్వితయాంతరతో వాసజుషో విహితమధురసాస్వాదాః I
రంభాదివిబుధవేశ్యా రచయంతు మహాంతమస్మదానందమ్ II ౪౩

🌻. తాత్పర్యముః
వరణద్వితయాంతరతః - గోమేధిక, వజ్రమణి ప్రాకారముల మధ్యన, వాసజుషః - వాసము చేయుచున్నట్టి, విహితమధురసాస్వాదాః - మద్యములను త్రాగుచున్న, రంభాదివిబుధవేశ్యాః - రంభ మొదలగు దేవతా వేశ్యలు, మహాంతమ్ - గొప్పదైన, అస్మదానందం - మా యొక్క సంతోషమును, రచయంతు - కలిగింతురు గాక.

గోమేధిక, వజ్రమణి ప్రాకారముల మధ్యన వాసము చేయు రంభ మొదలైన దేవతా వేశ్యలు, మాకు సంతోషములను కలుగజేయుదురు గాక !!

🌻 II ఆర్యా ద్విశతి - 44వ శ్లోకము II 🌻

తత్ర సదా ప్రవహంతీ తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ I
చటులోర్మిజాలనృత్యత్కలహంసీకులకలక్వణితపుష్టా II ౪౪

🌻. తాత్పర్యముః
తత్ర - ఆ ప్రదేశమునందు, సదా - ఎల్లప్పుడూ, ప్రవహంతీ - పాఱుచున్నదియు, చటుల - చలించుచున్నది, ఊర్మిజాల - అలల సమూహములయందు, నృత్యత్ - ఆడుచుండు, కలహంసీకుల - రాయంచమగువల సమూహములయొక్క, కలక్వణిత - మధురములగు ధ్వనులచేత, పుష్టా - నిండినదియు, వజ్రభిధా - వజ్రయను పేరుగల, తటినీ - నది, చిరం - ఎల్లప్పుడూ, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!

గోమేధిక, వజ్రమయ ప్రాకారముల నడుమ, ఎల్లప్పుడూ ప్రవహించునది, అలల సమూహములయందు కలహంసల మధురధ్వనులచేత నిండినది అయిన, వజ్ర అను పేరుగల నది, ఎల్లప్పుడూ సర్వోత్కృష్టముగా వర్ధిల్లుగాక !!

సశేషం...
 


🌻. II ఆర్యా ద్విశతి - 41వ శ్లోకము II 🌻

వప్రద్వయాంతరుర్వ్యాం వటుకై ర్వివిధైశ్చ యోగినీబృందైః I
సతతం సమర్చితాయాః సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జమ్ II ౪౧

🌻. తాత్పర్యముః
వప్రద్వయాంతః - పద్మరాగ, గోమేధిక ప్రాకారముల మధ్యన, ఉర్వ్యాం - ప్రదేశమునందు ఉండు, వటుకైః - వటువుల చేతను, వివిధైశ్చ - నానావిధములైన, యోగినీబృందైః - యోగినుల సమూహములచేతను, సతతం - ఎల్లప్పుడూ, సమర్చితాయాః - పూజింపబడుచున్న, సంకర్షిణ్యాః - సంకర్షిణీ దేవత, చరణాబ్జమ్ - పాదకమలములను, ప్రణౌమి - నమస్కరించుచున్నాను.

పద్మరాగ, గోమేధిక ప్రాకారముల మధ్యన ఉండే ప్రదేశమున, వటువులచేతనూ, అనేకరకములైన యోగినుల చేతను పూజింపబడుతున్న సంకర్షిణీ దేవత పాదపద్మములకు నమస్కరించుచున్నాను !!

🌻. II ఆర్యా ద్విశతి - 42వ శ్లోకము II 🌻

తాపసయోజనదూరే తస్య సముత్తుంగ గోపురోపేతః I
వాంఛాపూర్త్యై భవతా ద్వజ్రమణీని కరనిర్మితో వప్రః II ౪౨

🌻. తాత్పర్యముః
తస్య - గోమేధిక ప్రాకారమునకు, తాపసయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉండు (తాపస=ఋషి సంఖ్య), ఉత్తుంగ గోపురోపేతః - మిక్కిలి పొడవైన గోపురములతో కూడినదియు, వజ్రమణీని కరనిర్మితః - వజ్రమణుల గుంపులతో నిర్మింపబడిన, వప్రః - ప్రాకారము, వాంఛాపూర్త్యై - నా కోరికను నెరవేర్చుటకు, భవతాత్ - అగుగాక.

పదకొండవ (గోమేధిక) ప్రాకారమునకు, ఏడు యోజనముల దూరము నందు ఉండు, మిక్కిలి పొడవైన గోపురములతో కూడినదియు, వజ్రమణులతో నిర్మింపబడిన పన్నెండవ ప్రాకారము - నా మనోవాంఛలను నెరవేర్చుగాక !!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌻. II ఆర్యా ద్విశతి - 39వ శ్లోకము II 🌻

అంతరభూకృతవాసాననయోరపనీత చిత్తవైమత్యాన్ I
చక్రేశీపదభక్తాంశ్చారణవర్గానహర్నిశం కలయే II ౩౯

తాః అనయోః - పుష్యరాగ, పద్మరాగ ప్రాకారముల, అంతరభూః - మధ్యప్రదేశము నందు, కృతవాసాన్ - వసించుచున్నవారును, ఆపనీత - తొలగింపబడిన, చిత - మనస్సులయొక్క, వైమత్యాన్ - విముఖత కలిగిన వారును (అనగా ఏకాగ్రచిత్తులయిన వారు), చక్రేశీపదభక్తాన్ - చక్రేశీ అను పేరు గల దేవత (శ్రీలలితాదేవి) పాదములను ఆరాధించు వారును, చారణవర్గాన్ - చారణుల సమూహములను, అహర్నిశం - రేయింబవళ్ళు (ఎల్లప్పుడూ..), కలయే - సేవించుచున్నాను.

పుష్యరాగ, పద్మరాగ ప్రాకారముల మధ్యన ఉండే వారును, ఏకాగ్రచిత్తులై, చక్రేశీ అను దేవత పాదములను ఆరాధించువారు అయిన చారణులను, రేయింబవళ్ళు నేను సేవించుచున్నాను.

🌻. II ఆర్యా ద్విశతి - 40వ శ్లోకము II 🌻

సారంగవాహనయోజనదూరే సంఘటిత కేతనస్తస్యః II
గోమేదకేన రచితో గోపాయతు మాం సమున్నతః సాలః II ౪౦

తాః తస్య - దానికి (పద్మరాగ ప్రాకారమునకు), సారంగవాహనయోజనదూరే - ఏడు యోజనముల దూరము (జింకను వాహనముగా గల వాయువు), సంఘటితకేతనః - బాగుగా చేసిన పతాకములు గలదియు, గోమేదకేన రచితః - గోమేదక మణులచేత చేయబడినది అగు, సమున్నతః - మిక్కిలి పొడవైన, సాలః - ప్రాకారము, మాం - నన్ను, గోపాయతు - రక్షించుగాక !!

పద్మరాగ ప్రాకారమునకు పై భాగమున ఏడు యోజనముల దూరములో మిక్కిలి పొడవైనది, బాగుగా కూర్చబడిన పతాకములు గలదియు అయిన గోమేదక మణులచేత చేయబడిన - పదకొండవ ప్రాకారము - నన్ను రక్షించుగాక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 34వ  శ్లోకము II 🌻

ఆపాటలాంశుకధరా మాదిరసోన్మేష వాసితకటాక్షామ్ I
అమ్నాయసారగుళికామాద్యాం సంగీతమాతృకాం వందే II ౩౫

ఆపాటల - మిక్కిల ఎర్రనయిన, అంశుక - పైటను, ధరామ్ - తాల్చినదియు, ఆదిరస - శృంగారరసము, ఉన్మేష - ప్రకాశముచేత, వాసిత - మిళితమైన, కటాక్షాం - క్రీగంటిచూపులు గలదియు, ఆమ్నాయసారగుళికాం - రాశీభూతమైన వేదాసారముగా ఉన్నదియు, ఆద్యాం - మొదటి దేవతయగు, సంగీతమాతృకాం - సంగీతమాతృకయను దేవికి, వందే - నమస్కరించుచున్నాను.

 సంగ్రహముగా ----- "నల్లని శరీరము కలిగి, తాటిఆకుల తాటంకములు ధరించి, తాంబూలచర్వణము చేస్తూ ఉన్నది, ఎర్రని పెదవుల నుండి చిరునవ్వు కలది, కుంకుమపూవులచేత పూయబడిన ఎర్రని శరీరము కలిగినది, శిరస్సుపై చంద్రవంకను ధరించినది, ఎర్రని చరణకమలములు కలిగినది, కోయిల స్వరంవంటి కమనీయమైన కంఠస్వరము కలిగినది, సకల వేదార్ధములను పలికే చిలుకను చేతియందు ధరించినది, వీణానాదముచేత హృదయమునందు ఆనందపారవశ్యము చెంది, అర్ధనిమీళిత నేత్రములు కలిగినది, మిక్కిలి ఎర్రని చీరను ధరించినది, శృంగారరసముతో కూడిన క్రీగంటి చూపులు కలిగినది, వేదరాశి యొక్క రాశీభూతమైన ఆదిదేవత, సంగీతమాతృకామాత (శ్యామలాదేవికి) నేను నమస్కరించుచున్నాను".

 🌻. II ఆర్యా ద్విశతి - 36వ శ్లోకము II 🌻

తస్య చ సువర్ణసాలస్యోత్తరతస్తరుణ కుంకుమచ్ఛాయః I
శమయతు మమ సంతాపం సాలో నవమస్సపుష్యరాగమయః II ౩౬

తాః తస్య చ సువర్ణసాలస్య - ఆ బంగారు ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగము నందు, తరుణకుంకుమచ్ఛాయః - లేతకుంకుమ ఛాయ కలదియు, పుష్యరాగమయః - పుష్యరాగమణులచే అద్దబడినది అయిన, నవమః - తొమ్మిదవ, సాలః - ప్రాకారము, మమ సంతాపం -నా దుఃఖమును, శమయతు - పోగొట్టుగాక !!

బంగారు ప్రాకారమునకు పై భాగమున, లేతకుంకుమఛాయ కలిగినది, పుష్యరాగమణులచే అద్దబడిన తొమ్మిదవ ప్రాకారము - పుష్యరాగమణి ప్రాకారము, నా దుఃఖములను పోగొట్టుగాక.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
 

🌻. II ఆర్యా ద్విశతి - 33వ  శ్లోకము II 🌻

వామాంసలుళితచూళీవలమాన కదంబమాలికాభరణామ్ II
ముక్తాలలంతికాంచిత ముగ్ధాళికమిళితచిత్రకోదారామ్ II ౩౩

🌻. తాత్పర్యముః 
వామాంస - ఎడమ భుజమునందు, లుళిత - జారుతున్న, చూళీ - క్రొమ్ముడినుండి (కొప్పునుండి), వలమాన - వ్రేలాడుచున్న, కదంబమాలికా - కడిమిపూల దండను, ఆభరణాం - ధరించినదియు, ముక్తాలలంతికా - ముత్యములతో కూర్పబడిన హారముచేత, అంచిత - ఒప్పుచున్న, ముగ్ధ - సుందరమైన, అళిక - ఫాలప్రదేశమునందు, మిళిత- కూడిన, చిత్రిక - బొట్టుచేత, ఉదారాం -మహనీయముగా ఉన్నదియు.. 

🌻. II ఆర్యా ద్విశతి - 34వ  శ్లోకము II 🌻

కరవిధృతకీరశాబక కలనినదవ్యక్త నిఖిలనిగమార్ధామ్ II
వామకుచసంగివీణావాదన సౌఖ్యార్ధమీళితాక్షియుగామ్ II ౩౪

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. II ఆర్యా ద్విశతి - 37వ శ్లోకము II 🌻

అనయోరంతరవసుధాః ప్రణుమః ప్రత్యగ్రపుష్యరాగమయీః I
సింహాసనేశ్వరీమనుచింతననిస్తంద్రసిద్ధనీరంధ్రాః II ౩౭

🌻. తాత్పర్యముః
అనయోః - బంగారు, పుష్యరాగ ప్రాకారముల యొక్క, అంతరవసుధాః - మధ్య ప్రదేశములను, ప్రత్యగ్ర - కొత్త, పుష్యరాగమయీః - పుష్యరాగమణులమయమైనట్టిదియు, సింహాసనేశ్వరీ - సింహాసనేశ్వరి అను దేవత యొక్క (శ్రీలలితాదేవి), మను - జపమును, చింతన - జపించుటయందు, నిస్తంద్ర - ఏమరపాటులేని (పరమాసక్తి గల), సిద్ధ - సిద్ధపురుషులచేత, నీరంధ్రాః - నిండినవి అయిన, ప్రణమః - వినుతించుచున్నాను.

బంగారు, పుష్యరాగ ప్రాకారముల మధ్య ప్రదేశమున, ఏమరుపాటులేకుండా, సింహాసనేశ్వరి అయిన శ్రీలలితాదేవిని ఉపాసించుచున్న / జపించుచున్న సిద్ధ పురుషులకు నేను ప్రణమిల్లుతున్నాను.

🌻. II ఆర్యా ద్విశతి - 38వ శ్లోకము II 🌻

తత్సాలోత్తరదేశే తరుణజపాకుసుమధోరణీశోణః I
ప్రశమయతు పద్మరాగప్రాకారో మమ పరాభవం దశమః II ౩౮

🌻. తాత్పర్యముః
తత్సాలోత్తరదేశే - ఆ పుష్యరాగ ప్రాకారమునకు పై భాగము నందు, తరుణ - క్రొత్త (అప్పుడే వికసించిన), జపాకుసుమ - మందార పూవుల, ధోరణీ - వరుస (గుంపు) వలె, శోణః - ఎర్రనిదియగు, దశమః - పదవది అయిన, పద్మరాగప్రాకారః - పద్మరాగమణి నిర్మితమైన ప్రాకారము, మమ- నా యొక్క, పరాభవం - అవమానమును లేదా కీడును, ప్రశమయతు - పోగొట్టుగాక.

తొమ్మిదివ (పుష్యరాగ) ప్రాకారమునకు పై భాగమునందు, క్రొత్తగా వికసించిన మందాలపూవుల వరుసవలె, ఎర్రగా ఉన్న, పద్మరాగమణులతో చేయబడినది అయిన పదవ ప్రాకారము - నా యొక్క అవమానమును / కీడును తొలగించుగాక !!

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌻. II ఆర్యా ద్విశతి - 31వ  శ్లోకము II 🌻

తాపింఛమేచకాంగీం తాళీదళఘటిత కర్ణతాటంకామ్ I
తాంబూలపూరితముఖీం తామ్రాధరబింబదృష్టదరహాసామ్ II ౩౧

🌻. తాత్పర్యముః
తాపింఛ - కానుగు ఆకుల వలె, మేచక-నల్లనయిన, అంగీం - శరీరము గలదియు, తాళీదళ - తాటి ఆకులతో, ఘటిత - చేయబడిన, కర్ణ - చెవియందలి, తాటంకాం - కమ్మలు గలదియు, తాంబూలపూరిత ముఖీం - నోటి నిండా తాంబూలము చర్వణముచేత నిండి ఉన్నదియు, తామ్ర - ఎర్రని, అధరబింబ - దొండపండువంటి పెదవి యందు, దృష్ట - కనబడుచున్న, దరహాసాం - చిరునవ్వు కలదియు.

అనగా, కానుగు ఆకులవలె నల్లనయిన శరీరం కలిగి, తాటి ఆకులతో చేయబడిన తాటంకములను ధరించినది, తాంబూలపూరితముఖీ, ఎర్రని పెదవులు కలిగి, చిరునవ్వు కలిగినదియు (31వ శ్లోకము)

🌻. II ఆర్యా ద్విశతి - 32వ  శ్లోకము II 🌻

కుంకుమపంకిలదేహాం కువలయజీవాతుశాబకవతంసామ్ I
కోకనదశోణచరణాం కోకిలనిక్వాణకోమలాలాపామ్ II ౩౨

కుంకుమ - కుంకుమచేత పంకిల - పూయబడిన, దేహాం - శరీరము గలదియు, కువలయజీవాతు - కలువలకు ప్రాణాధారమైన చంద్రుని యొక్క, శాబక - బాలుని (బాలచంద్రుని), వతంసాం - శిరోభూషణముగా గలదియు, కోకనద - ఎర్రతామర వలె, శోణ - ఎర్రని, చరణాం - పాదములు గలదియు, కోకిల - కోయిలయొక్క, నిక్వాణ - ధ్వనివ
లే, కోమల - మనోజ్ఞమైన, ఆలాపాం - కంఠస్వరము గలదియు,

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹

🌻. II ఆర్యా ద్విశతి - 27వ శ్లోకము II 🌻

తస్యామతిశిశిరాకృత్యాసీన స్తపస్తపస్యలక్ష్మీభ్యామ్ I
శివమనిశం కురుతాన్మే శిశిరర్తుః సతతశీతలదిగంతః II ౨౭

🌻. తాత్పర్యముః
తస్యాం - ఆ కదంబవనమునందు ఉండు, అతిశిశిర - మిక్కిల చల్లనైన, ఆకృతి - రూపముగల, తపస్ - మాఘ మాసము, తపస్య - ఫాల్గుణ మాసము అనెడు, లక్ష్మీభ్యాం - లక్ష్ములతో (సంపదలతో), ఆసీనః - కూర్చొనిఉన్న, సతత - ఎల్లప్పుడూ, శీతలదిగంతః - చల్లని దిక్కుల కొనలు కలదియు, శిశిరర్తుః - శిశిర ఋతువు, మే - నాకు, శివం  - మంగళమును, అనిశం - ఎల్లప్పుడూ, కురుతాత్ - చేయుగాక !!

వెండి, బంగారు ప్రాకారముల మధ్యన ఉన్న కదంబవనము నందు మాఘ, ఫాల్గుణ మాస సంపదలతో కూడినది, దిక్కులన్నిటియండు చల్లగా వ్యాపించునది అయిన శిశిర ఋతువు, మాకు ఎల్లప్పుడూ మంగళములను చేయుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి  - 28వ శ్లోకము II 🌻

తస్యాం కదంబవాట్యాం తత్ప్రసవామోదమిళితమధుగంధమ్ I
సప్తావరణమనోజ్ఞం శరణం సముపైమి మంత్రిణీశరణమ్ II ౨౮

🌻. తాత్పర్యముః
తస్యాం కదంబవాట్యాం - ఆ కదంబ వనమునందు ఉన్న, తత్ప్రసవ - ఆ కదంబపుష్పముల, ఆమోదమిళిత - పరిమళముతో కూడిన, మధుగంధం - తేనెవాసనలు గలదియు, సప్తావరణమనోజ్ఞం - ఏడు ప్రాకారములచేత రమ్యమైనదియు, మంత్రిణీశరణం - మంత్రిణీదేవత యొక్క వాసస్థానమును (గౄహమును), శరణం సముపైమి - శరణు వేడుచున్నాను (సేవించుచున్నాను).
వెండి, బంగారు ప్రాకారముల మధ్యన ఉన్న కదంబవనము నందు ఉన్న కదంబ పుష్పముల పరిమళములతో కూడిన, తేనెల వాసనలు కలిగినది, ఏడు ప్రాకారములచేత రమ్యమైనది అయినటువంటి మంత్రిణీదేవత యొక్క గృహమున శరణు వేడుచున్నాను !!

మంత్రిణీ - సచివేశానీ - శ్యామలా - కదంబవనవాసినీ - ఇవి మొదలైనవి సంగీతయోగిని పేర్లు. ఈమెయే 35వ శ్లోకము నందు చెప్పబడిన సంగీతమాతృకాదేవి.

సంగీతయోగిన్యాః షోడశనామాని యథా I
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రినాయికా II
మంత్రిణీ సచివేశానీ ప్రధానేశీ శుకప్రియా I
వీణవతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా II
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ I
సదామదా చ నామాని షోడశైతాని కుంభజః II
ఏతైర్యస్సచివేశానీం సకృత్సౌతి శరీరవాన్ I
తస్య త్రైలోక్యమఖిలం వశేతిష్ఠత్య సంశయః II ( లలితోపాఖ్యానము)

ఈ దేవె శ్రీలలితాదేవి యొక్క బుద్ధి నుండి పుట్టినది.

బుద్ధేశ్చ లలితాదేవ్యాశ్స్యామలా పరమేశ్వరీ I
వీణాశుకలసత్పాణిర్జాతా సంగీతయోగినీ II (లలితోపాఖ్యానము నుంచి..)

సశేషం.....
🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 25వ శ్లోకము II 🌻

ఉత్తరతస్తస్య మహానుద్భటహుతభుక్ఛిఖారుణమయూఖః I
తపనీయఖండరచితస్తనుతాదాయుష్యమష్టమో వరణః II ౨౫

🌻. తాత్పర్యముః
తస్య - ఏడవది అయిన వెండి ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగమునందు, మహాన్ - గొప్పదియు, ఉద్భటః - ఉత్తమమైన, హుతభుక్ఛిఖా - అగ్నిజ్వాలలవంటి, అరుణ - ఎర్రని, మయూఖః - కాంతి కలిగినదియు, తపనీయఖండరచితః - బంగారుదిమ్మలచే చేయబడినయు అయిన, అష్టమ వరణః - ఎనిమిదవ ప్రాకారము, ఆయుష్యం - ఆయుర్వృద్ధిని, తనుతాత్ - చేయుగాక !!

ఏదవది అయిన వెండి ప్రాకారమునకు పై భాగము నందు, ఉత్తమమైన ఎర్రని అగ్నిజ్వాలలవంటి కాంతి కలిగిన, బంగారు దిమ్మెలచే చేయబడినది అయిన ఎనిమిదవ ప్రాకారము (బంగారు ప్రాకారము), మాకు ఆయుర్వృద్ధిని కలుగజేయుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 26వ శ్లోకము II 🌻

కాదంబవిపినవాటీమనయోర్మధ్యభువి కల్పితావాసామ్ I
కలయామి సూనకోరకకందళితామోదతుందిలసమీరామ్ II ౨౬

🌻. తాత్పర్యముః
అనయోర్మధ్యభువి - ఏడవది అయిన వెండి మరియు ఎనిమిదవది అయిన బంగారు ప్రాకారముల మధ్యన, కల్పితావాసామ్ - చేయబడిన నివాసం గలదియు, సూన - పూయుచున్న, కోరక - మొగ్గల నుండి, కందళిత - పుట్టుచున్న ఆమోద - పరిమళముచేత, తుందిల - బలసిన (నిండిన), సమీరాం - వాయువు కలదియు అగు, కాదంబవిపినవాటీం - కడిమిమ్రాకుల తోపును, కలయామి - ధ్యానించుచున్నాను !!

వెండి, బంగారు ప్రాకారముల మధ్యన పూయుచున్న మొగ్గల పరిమళముచేత నిండిన వాయువులు కల కదంబవనమును ధ్యానించుచున్నాను !!

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 23వ శ్లోకము II 🌻

మధ్యే తయోర్మరుత్పథలంఘిత విటపాగ్రవిరుతకలకంఠా I
శ్రీపారిజాతవాటీ శ్రియమనిశం దిశతు శీతలోద్దేశా II ౨౩

🌻. తాత్పర్యముః
తయోర్మధ్యే - ఆరవ (పంచలోహ) మరియు ఏడవ (వెండి) ప్రాకారముల మధ్యప్రదేశమునందు, మరుత్పథ - దేవతల మార్గమగు ఆకాశమును, లంఘిత - అతిక్రమించిన, విటపాగ్ర - కొమ్మలకొనలయందు, విరుత - కూయుచున్న, కలకంఠా - కోయిలలు కలది, శీతలోద్దేశా - చల్లని ప్రదేశములు కలదియు అగు, శ్రీపారిజాతవాటీ - లక్ష్మీకరమైన పారిజాతవృక్షముల వనము, అనిశం - ఎల్లప్పుడూ, శ్రియం - సంపదను, దిశతు - ఇచ్చుగాక !!

ఆరవ (పంచలోహ) మరియు ఏడవ (వెండి) ప్రాకారముల మధ్యన ఆకాశమంత ఎత్తులో ఉన్న కొమ్మలయందు కూయుచున్న కోయిలల గానములతోడి, చల్లని ప్రదేశము అయిన, పారిజాతవృక్షముల వనము కలదు, ఆ పారిజాతవనము మాకు ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చుగాక !!

🌻 II ఆర్యా ద్విశతి - 24వ శ్లోకము II 🌻

తస్యాం అతిప్రియాభ్యాం సహ లేఖన్ సహ సహస్యలక్ష్మీభ్యాం I
సామంతో ఝుషకేతోర్హేమంతో భవతు హేమవృద్ధ్యై నః II ౨౪

🌻. తాత్పర్యముః
తస్యాం - ఆ పారిజాతవనము నందు, అతిప్రియాభ్యాం - మిక్కిలి ప్రియురాండ్రగు, సహః - మార్గశీర్ష మాసము, సహస్య - పుష్య మాసము (ఈ రెండిటి), లక్ష్మీభ్యాం - లక్ష్ములతో (సంపదలతో) సహ - కూడిన, ఖేలన్ - విహరించుచున్న, ఝుషకేతోః - మీనధ్వజుడగు మన్మథుని, సామంతః - అనుచరుడగు, హేమంత ఋతువు, నః - మాకు, హేమవృద్ధ్యై - బంగారము వృద్ధిపొందించుటకు, భవతు - అగుగాక !!

ఆరవ, ఏడవ ప్రాకారముల మధ్యన ఉన్న పారిజాతవనము నందు, మికిలి ప్రియమైన మార్గశీర్ష,పుష్య మాస సంపదలతో కూడిన, మన్మథుని అనుచరుడైన హేమంత ఋతువు, మాకు సదా సంపదలను (బంగారమును), ధనసమృద్ధిని ఇచ్చుగాక !!

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 21వ శ్లోకము II 🌻

తస్యామిషోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతుః సదా సహితః I
అభ్యర్చయన్ స జీయాదంబామామోదమేదురైః కుసుమైః II ౨౧

🌻. తాత్పర్యముః
తస్యాం - ఆ మందార వృక్షముల యందు, ఇష - ఆశ్వయుజ మాసము, ఊర్జ - కార్తీక మాసము, ఈ రెండు మాసముల లక్ష్ములనెడు (సంపదల) తరుణీభ్యాం - యువతులతోడి, సదా - ఎల్లప్పుడూ, సహిత - కూడినది అయిన, శరదృతువు, ఆమోదమేదురైః - వాసనలతో దట్టమైన, కుసుమైః - పుష్పములచేత, అంబాం - పరమేశ్వరిని, అభ్యర్చయన్ - పూజించుచు, సః జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!

మందారవృక్షముల యందు, ఆశ్వయుజ, కార్తీక మాస సంపదలతో కూడినది, పుష్పముల చేత సదా అమ్మవారికి నమస్కరించి, అర్చించే శరదృతువు సర్వోత్కృష్టముగా ఉండుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 22వ శ్లోకము II 🌻

తస్యర్షిసంఖ్యయోజనదూరే దేదీప్యమానశృంగౌఘః I
కలధౌతకలితమూర్తిః కల్యాణం దిశతు సప్తమస్సాలః II ౨౨

🌻. తాత్పర్యముః
తస్య - ఆరవ (పంచలోహ) ప్రాకారమునకు, ఋషిసంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉండు, దేదీప్యమానశృంగౌఘః - మిక్కిలి ప్రకాశించుచున్న శిఖరముల గుంపు కలదియు, కలధౌత - వెండితో, కలిత - చేయబడిన, మూర్తిః - శరీరము కలది, సప్తమస్సాలః - ఏడవ ప్రాకారము, కల్యాణం - శుభములను, దిశతు - ఇచ్చుగాక !!

ఆరవ (పంచలోహ) ప్రాకారమునకు పైభాగమునందు, ఏడు యోజనముల దూరములో, గొప్ప ప్రకాశవంతమైన శిఖరములతో కూడిన ఏడవ ప్రాకారము - వెండితో చేయ
బడినది, మాకు శుభములను ఇచ్చుగాక !!

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌻. II ఆర్యా ద్విశతి - 19వ శ్లోకము II 🌻

మారుతయోజనదూరే మహనీయస్తస్య చోత్తరభాగే I
భద్రం కృషీష్ట షష్ఠః ప్రాకారః పంచలోహధాతుమయః II ౧౯

🌻. తాత్పర్యముః
తస్య - దానికి (ఇత్తళి ప్రాకారమునకు), ఉత్తరభాగే - పై భాగమునందు, మారుతయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉన్న, మహనీయమైన పంచలోహసారముచేత చేయబడిన ఆరవ ప్రాకారము, మాకు క్షేమమును చేయుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 20వ శ్లోకము II 🌻

అనయోర్మధ్యే సంతతమంకూరద్దివ్య కుసుమగంధాయామ్ I
మందారవాటికాయాం మానసమంగీకరోతు మే విహృతిమ్ II ౨౦

🌻. తా
త్పర్యముః
అనయోర్మధ్యే - ఆ రెంటిమధ్య (ఇత్తళి ప్రాకారమునకు, పంచలోహమయ ప్రాకారమునకు నడూమ ఉండు), అంకూరత్ - పూయుచున్న/మొలకెత్తుచున్న, దివ్యకుసుమ - ఇంపైన పుష్పముల, గంధాయాం - వాసనలు గల, మందారవాటికాయాం - మందారవ్క్షముల వరుసల యందు, సంతతం - ఎల్లప్పుడూ, మే మానసం - నా మనస్సు, విహృతిం - విహరించుటను, అంగీకరోతు - ఒప్పునుగాక !!

ఇత్తళి మరియు పంచలోహ ప్రాకారముల మధ్య ఉన్న మందారవృక్షముల వనమును నేను ఎల్లప్పుడూ ధ్యానించుచుందునుగాక !!

సశేషం....
🌹🌹🌹🌹🌹



🌻. II ఆర్యా ద్విశతి - 17వ శ్లోకము II, 🌻

ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితా౨న్యభృతపంచమోన్మేషా I
హరిచందనద్రువాటీ హరతాదామూలమస్మదనుతాపమ్ II ౧౭

తాత్పర్యముః
ప్రాకారయోశ్చ మధ్యే - సీస, ఇత్తళి ప్రాకారముల మధ్య ఉండు, పల్లవిత - చిగుళ్ళు కలది, అన్యభృత - కోకిల యొక్క, పంచమ - పంచమ స్వరము యొక్క, ఉన్మేషా - ప్రకాశము కలదియు, హరిచందన వృక్షముల వనము, అస్మదనుతాపం - మా కష్టములను, ఆమూలం - పూర్తిగా, హరతాత్ - పోగొట్టుగాక !!
సీస, ఇత్తళి ప్రాకారముల మధ్య చిగుళ్ళు కలిగిన, కోకిల పంచమస్వరములు కలిగిన, గొప్ప ప్రకాశము కలిగిన హరిచందన వృక్షములవనము, మా కష్టములను పూర్తిగా పోగొట్టుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 18వ శ్లోకము II 🌻

తత్ర నభశ్శ్రీ ముఖ్యైస్తరుణీవర్గైః సమన్వితః పరితః I
వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తుః II ౧౮

🌻. తాత్పర్యముః l
తత్ర - ఆ హరిచందన వృక్షముల వరుసలయందు, నభశ్శ్రీముఖ్యైః - శ్రావణమాస లక్ష్మి మొదలైన, తరుణీవర్గైః - యువతుల సమూహములతో, పరితః - చుట్టూ, సమన్వితః - కూడుకొన్నదియు, వజ్రాట్టహాస - పిడుగు యొక్క గొప్ప గర్జనతో, ముఖరః - శబ్దము చేయుచున్నది అయిన వర్షర్తుః - వర్ష ఋతువు, వాంఛాపూర్తిం - కోరికల పూరణమును, తనోతు - చేయుగాక !!

ఆ హరిచందన వృక్షముల వరుసల యందు శ్రావణమాస లక్ష్మి మొదలగు యువతులతో కూడుకొన్న, పిడుగుల గర్జనములతో ఉన్న శ్రావణ, భాద్రపద మాసములతో కూడిన వర్ష ఋతువు, మా కోరికలను నెరవేర్చుగాక !!

సశేషం...


🌹 🌹


🌻. II ఆర్యా ద్విశతి - 15వ శ్లోకము II 🌻

తత్ర తపనాతిరూక్షః సమ్రాజ్ఞీచరణసాంద్రితస్వాంతః I
శుక్రశుచిశ్రీసహితో గ్రీష్మర్తుర్దిశతు కీర్తిమాకల్పమ్ II ౧౫

🌻. తాత్పర్యముః
ఆ సంతాన వృక్షముల వనమునందు ఉండు, తపన - సూర్యుని వలె, అతిరూక్షః - మిక్కిలి ఉగ్రమైనదియు, సమ్రాజ్ఞీ - మహారాజ్ఞి (పరమేశ్వరి), చరణ - పాదములయందు, సాంద్రిత - ఆసక్తమయిన (లగ్నమయిన) స్వాంతః - హృదయము కలదియు (సదా పరమేశ్వరిని ధ్యానించుచున్నదియు), శుక్ర - జ్యేష్ఠ మాసము, శుచి -  ఆషాఢ మాసము, శ్రీ - ఈ మాసముల లక్ష్ములతో (సంపదలతో) కూడినది అయిన, గ్రీష్మర్తుః -  గ్రీష్మ ఋతువు, ఆకల్పం - కల్పాంతము వరకు (ఎల్లప్పుడూ), కీర్తిం - యశస్సును, దిశతు - ఇచ్చుగాక. గ్రీష్మ ఋతువును ధ్యానించుటచే అది ఎల్లప్పుడు మాకు శుభమునొసంగు గాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 16వ శ్లోకము II 🌻

ఉత్తరసీమని తస్యోన్నత శిఖరోత్కంపి హాటకపతాకః I
ప్రకటయతు పంచమో నః ప్రాకారః కుశలమారకూటమయః II ౧౬

🌻. తాత్పర్యముః
తస్య - దాని (సీసప్రాకారము యొక్క) పై ప్రదేశమునందు ఉండు ఉన్నతమైన శృంగములందు, ఉత్కంపి-కదులుచుండెడు, హాటకపతాకః - బంగారు టెక్కెములు కలదియు, ఆరకూటమయః - ఇత్తళిచే చేయబడినదియు అగు ఐదవ ప్రాకారము, నః - మాకు, కుశలం - యోగక్షేమమును ప్రకటయతు - కలిగించుగాక !!

సీసప్రాకారము పైన, ఉన్నతమైన శృంగములు కలిగి, బంగారు టెక్కెములు కలిగిన ఇత్తళి ప్రాకారము మాకు యోగక్షేమములను కలిగించుగాక !!


సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ గురుభ్యో నమః

🌻 II ఆర్యా ద్విశతి - 13వ శ్లోకము II 🌻

నమత తదుత్తరభాగే నాకిపథోల్లంఘశృంగసంఘాతమ్ I
సీసాకృతిం తురీయం సితకిరణాలోకనిర్మలం సాలమ్ II ౧౩

🌻. తాత్పర్యముః
తదుత్తరభాగే - తామ్ర ప్రాకారమునకు పై ప్రదేశమునందు ఉండు, నాకిపథ - దేవతల పథము/ఆకాశమును, ఉల్లంఘి -  దాటుచున్న (ఆకాశము కంటే పొడవుగా ఉన్న), శృంగసంఘాతం - శిఖరముల సమూహము కలదియు, సితకిరణ - చంద్రుని యొక్క ఆలోక - వెలుగువలె, నిర్మలం - స్వచ్ఛమైనదియు, సీసాకృతిం - సీసముతో చేయబడినదియు అయిన నాలుగవ ప్రాకారమునకు నమస్కరించుచున్నాను !!

రాగి ప్రాకారానికి పై భాగములో, ఆకాశము కంటే పొడవుగా ఉన్న శిఖరములను కలిగినది, చంద్రుని వెలుగులా స్వచ్ఛమైనది అయిన సీసపు ప్రాకారమునకు నేను నమస్కరించు చున్నాను !!

🌻. II ఆర్యా ద్విశతి - 14వ శ్లోకము II 🌻

సాలద్వయాంతరాళే సరళాళికపోతచాటు సుభగాయామ్ I
సంతానవాటికాయాం సక్తం చేతో౨స్తు సతతమస్మాకమ్ II ౧౪

🌻. తాత్పర్యముః
సాలద్వయాంతరాళే - ఆ రెండు ప్రాకారముల మధ్యనందు (తామ్ర, సీస ప్రాకారముల నడుమ ఉండు), మనోహరమైన తుమ్మెదల, పావురముల ఇంపైన పలుకులచేత, సుభగాయాం - మనోజ్ఞమైనది అయిన, సంతానవృక్షముల వరుస యందు, మా యొక్క మనసు సతతం (ఎల్లప్పుడూ) ఉండుగాక !!

సంతాన వృక్షములను మేము ధ్యానించు చుందుము గాక !

 (కల్పవృక్షములు ఐదు రకములు - మందారము/పారిజాతము/సంతానము/కల్పము/హరిచందనము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ గురుభ్యో నమః

🌻. II ఆర్యా ద్విశతి - 11వ శ్లోకము II 🌻
మధ్యే తయోర్మణీమయ పల్లవ శాఖాప్రసూన పక్ష్మళితామ్ I
కల్పానోకహవాటీం కలయే మకరంద పంకిలావాలామ్ II ౧౧

🌻. తాత్పర్యముః
ఆ రెంటి (కంచు, రాగి ప్రాకారముల) నడుమ ఉండు, రత్నమయములగు చిగుళ్ళు, కొమ్మలు, పుష్పములచేత నిండినదియు, తేనెచేత బురదగా చేఅబడిన (నింపబడిన), ఆవాలాం - అనగా పాదులు కలిగినదియు అగు, కల్పవృక్షముల వరుసను (కల్పవృక్షముల వనమును) ధ్యానించుచున్నాను !!

🌻. II ఆర్యా ద్విశతి - 12వ శ్లోకము II 🌻
తత్ర మధుమాధవ శ్రీతరుణీభ్యాం తరళదృక్చకోరాభ్యామ్ I
ఆలింగితో౨వతాన్మామనిశం ప్రథమర్తురాత్త పుష్పాస్త్రః II ౧౨

🌻. తాత్పర్యముః
తత్ర - ఆ కల్పవృక్షముల వనమునందున్న తరళదృక్చకోరాభ్యాం  -  చలించుచుండు చకోరముల వంటి నేత్రములు కలిగిన, మధుమాధవ శ్రీతరుణీభ్యాం  - చైత్ర, వైశాఖ మాసలక్ష్ములనెడు (సంపదలనెడు) యువతులచేత, కౌగిలింపబడిన ఆత్తపుష్పాస్త్రః - మన్మథునితో కూడిన, ప్రథమర్తుః - వసంత ఋతువు, అనిశం-ఎల్లప్పుడూ, మాం- నన్ను అనితాత్ - రక్షించుగాక.

ఆ కల్పవృక్షముల వనమునందున్న చకోరముల వంటి నేత్రములు కలిగిన చైత్ర, వైశాఖ మాసములనెడి యువతులతో కౌగిలింపబడి, మన్మథుడితో కూడిన వసంత ఋతువు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక !!

సశేషం....


🌻. II ఆర్యా ద్విశతి - 9వ శ్లోకము II 🌻

ఆలింగ్య భద్రకాళీమాసీనతత్ర హరిశిలాశ్యామామ్ I
మనసి మాహాకాళో మే విహరతు మధుపానవిభ్రమన్నేత్రః II ౯

🌻. తాత్పర్యము :
తత్ర - ఆ ఆరామమునందు ఉండు, హరిశిలాశ్యామాం - ఇంద్రనీలమణివలె నీలమైన దేహకాంతి గల, భద్రకాళి అను దేవతను, కౌగలించుకుని కూర్చున్నవాడును, మధుపానవిభ్రమన్నేత్రః అనగా మధుపానము చేత తిరుగుచున్న కనులు కలవాడును అయిన, మహాకాళుడను (శివభటుడను దేవత), నా మనసునందు సంచరించుగాక !! (భద్రకాళీ సమేతుడైన మహాకాళుడిని ధ్యానించుచున్నాను.

🌻. II ఆర్యా ద్విశతి - 10వ శ్లోకము II 🌻

తార్తీయికో వరణస్తస్యోత్తరసీమ్ని వాతయోజనతః I
తామ్రేణ రచితమూర్తి స్తనుతాదాచంద్రతారకం భద్రమ్ II ౧౦

🌻. తాత్పర్యము :
ఆ కంచు ప్రాకారమునకు పై భాగమునందు, వాతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, తామ్రేణ - రాగి చేత చేయబడిన రూపము కల, తార్తీయికః - మూడవదియగు, వరణ - ప్రాకారము, ఆచంద్రతారకం - చంద్రుడు నక్షత్రములుండువరకు శాశ్వతముగా, భద్రం - శ్రేయస్సును, తనుతాత్ - చేయుగాక !!

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
 


🌻. II ఆర్యా ద్విశతి - 7వ శ్లోకము II 🌻

తస్యోత్తరే సమీరణ యోజన దూరే తరంగితచ్ఛాయః I
ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మితస్సాలః II ౭

🌻. తాత్పర్యము :
ఆ ఇనుప ప్రాకారమునకు పైభాగము నందు, సమీరణయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు (సమీరణ అనగా వాయువు, వాయువులు ఏడు కనుక ఏడు యోజనములు), తళతళలాడు ప్రకాశముగలదియు, ఘంటానాదము యొక్క సారము చేత (కంచు చేత), నిర్మింపబడినదియు, ద్వితీయ ప్రాకారము, మాకు సంతోషమును కూర్చుగాక !!

🌻. II ఆర్యా ద్విశతి - 8వ శ్లోకము II 🌻

ఉభయోరంతరసీమన్యుద్దామ భ్రమర కూజితో దారమ్ I
ఉపవనముపాస్మహే వయమురరీకృత మందమారుతస్పందమ్ II ౮

తాః పైన చెప్పబడిన రెండు ప్రాకారముల (ఇనుము మరియు కంచు) అంతరసీమని - మధ్యభాగము నందు, అధికమైన తుమ్మెదల ఝుంకారముచేత, గొప్పది, మహిమ గలదియు, ఉరరీకృత - అంగీకరింపబడిన, మందమారుతము యొక్క కదలిక కలిగినదియు అయిన, ఉద్యాన వనమును మేము ధ్యానించుచున్నాము !!

సశేషం......
🌹 🌹 🌹 🌹 🌹


II ఆర్యా ద్విశతి -  5వ శ్లోకము II

తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితమ్ I
నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరమాదివిద్యయాః II ౫

🌻. తాత్పర్యము :
ఆ శిఖరము నందు ఉండు, నాలుగు వందల యోజనముల వైశాల్యము గలదియు, దేవశిల్పినా రచితమ్ - విశ్వకర్మచే నిర్మింపబడినదియు, అనేక ప్రాకారములచేత రమ్యమైనదియు అయిన, ఆదివిద్యాయాః - పురాతన, సనాతన విద్యాస్వరూపిణి అయిన పరాదేవత యొక్క నగరమునకు, అనగా శ్రీపురమునకు, నేను నమస్కరించుచున్నాను.

🌻. II ఆర్యా ద్విశతి - 6వ శ్లోకము II 🌻

ప్రథమం సహస్రపూర్వక షట్ఛతసంఖ్యాయోజకం పరితః I
వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయోరూపమ్ II ౬

🌻. తాత్పర్యము :
దాని చుట్టునూ (అనగా శ్రీపురమునకు), పదహారు వందల యోజనముల కలిగిన చుట్టబడిన గుడ్రమగు శరీరము గల, అయోరూపం - ఇనుముతో చేయబడిన, ప్రథమ వరణం - మొదటి ప్రాకారమును, శరణం వ్రజామి - నేను శరణు వేడుచున్నాను, ధ్యానించు చున్నాను.

ఆదివిద్యా నగరమునకు చుట్టూ గల 1600 యోజనముల విస్తీర్ణముగల ఇనుప ప్రాకారమును నేను సేవించుచున్నాను. (ఈ ప్రాకారమునకు నాలుగు దిక్కులయందు ద్వారములు, గోపరములు కలవు).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



🌻. II ఆర్యా ద్విశతి - 3వ శ్లోకము II 🌻

హరిహయ నైరృతమారుత హరితామంతేష్వవస్థితం తస్య I
వినుమస్సానుత్రితయం విధిహరిగౌరీశవిష్టపాధారమ్ II ౩

🌻. తాత్పర్యము :
ఆ మేరు పర్వతం యొక్క తూర్పు, నైరృతి, వాయువ్య దిశల మధ్యలయందు ఉన్నట్టి బ్రహ్మ, విష్ణు, శివుల లోకములకు ఆధారమైనది అయిన సానుత్రితయం అనగా మూడు శిఖరములను స్తోత్రము చేయుచున్నాము.

🌻. II ఆర్యా ద్విశతి -  4వ శ్లోకము II 🌻

మధ్యే పునర్మనోహర రత్నరుచి స్తబకరంజిత దిగంతమ్ I
ఉపరి చతుశ్శత యోజన ముత్తుంగ శృంగపుంగవముపాసే II ౪

🌻. తాత్పర్యము :
పైన చెప్పిన శిఖరముల నడుమ, పై భాగము నందు ఉండు రమణీయమైన మనీకాంతుల, స్తబక అనగా గుత్తుల చేత, వన్నెపెట్టబడిన, దిక్కులు గలదియు, నాలుగు వందల యోజనముల పొడవైన శృంగపుంగవం-శ్రేష్ఠమగు శిఖరమును నేను ధ్యానించుచున్నాను.

సశేషం.....



శ్రీ మాత్రే నమః ,
నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే

🌻. II ధ్యానం II🌻

ఆదిమ రసావలమ్బా
మనిదం ప్రథమోక్తి వల్లరీ కలికామ్ I
ఆబ్రహ్మ కీట జననీ
మన్తః కలయామి సున్దరో మనిశమ్ II
నతజన సులభాయ నమో
నాళీక సనాభి లోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహ్సే నవనీప పాటలాయ నమః II
పవనమయి పావకమయి
క్షోణిమయి వ్యోమయి కృపీటమయి I
రవిమయి శశిమయి దిఙ్మయి
సమయమయి ప్రాణమయి  శివే పాహి II
కాళీ ! కపాలని ! శూలిని !
భైరవి ! మాతఙ్గీ ! పఞ్చమీ ! త్రిపురే !
వాగ్దేవీ ! విన్ధ్యవాసిని !
బాలే ! భువనేశి ! పాలయ చిరం మామ్ II
శ్రీలలితామ్బాయై నమః

🌻. II ఆర్యా ద్విశతి - 1వ శ్లోకము II 🌻

వందే గజేంద్ర వదనం వామాంకారూఢవల్లభా౨౨శ్లిష్టమ్ I
కుంకుమపరాగశోణం కువలయినీజారకోరకాపీడమ్ II

🌷. తాత్పర్యము :
ఎడమతొడ యందు కూర్చున్న వల్లభాదేవి చేత కౌగిలింపబడిన వాడు, కుంకుమ పువ్వు పొడి వలె ఎర్రని కాంతి కలవాడు, కలువకొలనుకు విటుడగు చంద్రుని శిరోభూషణముగా కలవాడు, ఏనుగు ముఖము గల విఘ్నేశ్వరుని నేను నమస్కరించుచున్నాను !!

విఘ్నేశ్వరుడు శ్రీలలితాదేవి స్మితము వలన పుట్టాడు అని, విఘ్నేశ్వరుడి పత్ని సిద్ధలక్ష్మి అని లలితోపాఖ్యానములో చెప్పబడినది.

స్మితాద్విఘ్నేశ్వరో జాతో మదక్లిన్న కటస్థలః
సిద్ధలక్ష్మ్యం కితోత్సంగో బాలార్క సదృశ ద్యుతిః II

🌻. II ఆర్యా ద్విశతి - 2వ శ్లోకము II 🌻

స జయతి సువర్ణ శైలః సకలజగచ్చక్రసంఘటితమూర్తిః I
కాంచననికుంజవాటీ కందళదమరీ ప్రపంచసంగీతః II 2

🌷. తాత్పర్యము :
సమస్త లోకముల చేత కూర్పబడిన స్వరూపము గలది, బంగారు పొదరుల వరుసల యందు విస్తరించుచున్న దేవతాస్త్రీల సమూహముల యొక్క గానములు కలది, అటువంటి మేరుపర్వతము జయముతో వర్తిల్లుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹🌹🌹🌹🌹🌹 
 శ్రీశంకరభగవత్పాదాః  
       విజ యంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
 🔴 శ్రీమాత్రేనమః 🔴

అక్షయముగ పుణ్య ఫలమునందు కొనగ
ఛత్ర చామర పాదుకా చయము తోడ
దధియు శాకము జలకుంభ దానములను
భక్తి తోడ నేడొసగిన ఫలము మెండు.

అక్ష తదియ శుభాకాంక్షలు.

ఛత్రము=గొడుగు,
చామరము=విసన కర్ర,
పాదుకలు=జోళ్ళు,
దధి=పెరుగు,
శాకము=కూరగాయలు/ఆకు కూరలు,
జలకుంభము=నీటితో ఉన్న పాత్ర.

వీటిని ఈ రోజు దానం భక్తితో చేస్తే ఫలం అక్షయమని శాస్త్ర వచనం.

🙏🙏🙏🙏🙏🙏
-----------------------------
🌸🌸🌸🌸🌸🌸
       శుభోదయం
🌸🌸🌸🌸🌸🌸

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ