నవగ్రహ సంబందిత క్షేత్రాలు
By
Dr. Nerella Rajasekhar.
🔥అవధూత గీత🔥
💥💎💥💎💥💎💥
రచన:-వ్యాఖ్యానం..శ్రీ సుందర చైతన్యానంద.
ఆడియో నం 104
💥💎💥💎💥💎💥
ప్రాణాయామ ప్రకరణము
--- 10 ---
సూర్యభేద ప్రాణాయామము :
పద్మాసనములో గాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కండ్లు మూయుము. కుడిచేతి వుంగరపు, చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. నీవు పీల్చగలిగినంత సేపు ఏ విధమగు శబ్దమును చేయకుండ నెమ్మదిగా కుడి ముక్కుతో గాలిని పీల్చుము. తరువాత కుడిముక్కును కుడి బొటన వ్రేలితో మూసి గడ్డమును రొమ్మునకు ఆనించి (జాలంధర బంధము) కుంభకము చేయుము. ఈ కుంభకమును శరీర మందలి రోమములన్నిటి నుండిన్నీ, గోళ్ళ మొనలనుండిన్నీ చెమట బిందువులు బయలుదేరు నంతవరకు చేయవలెను. మొట్ట మొదటిసారిలోనే యింతసేపటివరకు కొందరు చేయలేక పోవచ్చును. అట్టివారు క్రమ క్రమముగ కుంభకము చేయు కాలమును అధికము చేసికొనుచూ రావచ్చును. ఇదియే సూర్యభేధ కుంభకముయొక్క పరిమితి. తరువాత గాలిని నెమ్మదిగా కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూసి, ఎడమముక్కు గుండా ఏ విధమగు శబ్దము లేకుండ విడువవలెను. రేచక పూరక కుంభక సమయములందు 'ఓం'ను భావము, అర్ధములతో స్మరించుము. శ్వాసను పైకి పూఱ్ఱెవైపుకు పోనిచ్చి, పుఱ్ఱెను పరిశుద్ధపరచిన పిదప విడవుము.
ఇది మెదడును పరిశుద్ధపరచును. ప్రేవులందలి నులిపురుగులును నాశనమొనర్చును. వాతాధిక్యతచే వచ్చు రోగములను నివారణ చేయును. కీళ్ళవాతమును పోగొట్టును. అన్ని విధములగు మజ్జాతంతు వేదన (Newralgia) లను, రినిటిన్ (Rhinitis), సెఫలాల్జియా (Cephalalgia)లను నిర్మూల మొనర్చును. నాడీప్రాణ ముఖము నందలి క్రిములను పారద్రోలును. వృద్ధాప్యము మరణమును లేకుండా చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును.
ఉజ్జయి ప్రాణాయామము :
పద్మాసనము లేక సిద్ధాసనములో కూర్చొనుము. నోటిని మూయుము. నెమ్మదిగా రెండుముక్కులతోను సమానముగ, గొంతునుండి హృదయ ప్రదేశమువరకు నిండులాగున గాలిని పీల్చుము. పిమ్మట, నీవు సుఖముగా ఆపుజేయగలిగినంత సేపటి వరకు గాలిని లోపల కుంభించి, కుడి ముక్కును కుడి బొటన వ్రేలితో మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలిని విడవుము. గాలిని పీల్చు నప్పుడు రొమ్మును విశాలముగ (Expansion) వుంచుము. ఈ రీతిని గాలిని పీల్చునప్పుడు కంఠ బిలము ఒక వైపు మాత్రమే మూసికొని యుండుటచే ఒక విధమగు విచిత్రమైన ధ్వని పుట్టును. ఇది సమముగను నెమ్మదిగను వుండవలెను. అంతేగాక, యిది చివరవరకు వుండును. ఈ రకపు కుంభకమును నడచు నప్పుడుగాని, నిలబడి గాని చేయవచ్చును. ఎడమ ముక్కుతో గాలి విడచుటకు బదులుగా రెండు ముక్కులతో కూడ నెమ్మదిగా గాలిని విడవవచ్చును.
ఇది తలయందు గల వేడిని పోగొట్టును. జఠరాగ్ని వృద్ధియగును. సాధకునకు అందమువచ్చును. జలోదరమును కుదుర్చును. శరీరములో గల దోషములను, ధాతువులలో గల దోషములను పోగొట్టును. గొంతులో గల శ్లేష్మమును పోగొట్టును. క్షయ, ఉబ్బసము తదితర పుప్పుసీయ వ్యాధులను నిర్మూలన మొనర్చును. ప్రాణవాయువు కొరత వల్ల కలుగు జబ్బులున్నూ హృద్రోగమున్నూ నివారణ యగును. ఉజ్జయి ప్రాణాయామముచే అన్ని కార్యములు సిద్ధించును. శ్లేష్మ నరముల వ్యాధులు, మందాగ్ని, రక్తగ్రహణి, ప్లీహోదరము, క్షయ, దగ్గు, జ్వరములు ఈ కుంభకము చేయు సాధకుని దగ్గరకు రాజాలవు. వార్ధక్యమును, చావును లేకుండా చేయును.
సీత్కారి ప్రాణాయామము
నాలుకమొన పై అంగిలికి తాకులాగున నాలుకను వంచి, సీ, సీ, సీ, సీ అను శబ్దము వచ్చులాగున నోటితో గాలిని పీల్చుము. తరువాత ఊపిరి సలపకుండ వుండునంతసేపటి వరకు గాలిని లోపల కుంభించి, నెమ్మదిగా రెండు ముక్కులతోను గాలిని విడువుము. గాలిని పీల్చునప్పుడు రెండు పంటి వరసలను(క్రింది, పైని) దగ్గరకు చేర్చవచ్చును.
ఇందువలన శరీరమునకు వన్నె, దార్డ్యము వచ్చును. ఆకలి, దప్పిక, బద్ధకము, నిదురమత్తులు లేకుండ పోవును. ఇంద్రునంతటి బలశాలి యగును. యోగులకు ప్రభువగును. ఏదైన చేయుటకుగాని, కాకుండ చేయుటకు గాని సమర్థుడగును. స్వతంత్ర చక్రవర్తి వలె అగును. అజేయుడగును. ఏ విధమగు ఆపదలు అతని దరిజేరజాలవు. దాహము వేసినప్పుడు ఈ కుంభకము చేసినచో, దాహము తగ్గిపోవును.
శీతలి ప్రాణాయామము
నాలుకను పెదవుల బయటకు కొద్దిగా రానిమ్ము. గొట్టమువలె నాలుకను వంచుము. సీ, సీ, సీ, సీ అను శబ్దమువచ్చు లాగున నోటితో గాలిని పీల్చుము. నీవు శ్రమలేకుండ ఆపుచేయ గలిగినంత సేపటివరకు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను, గాలిని నెమ్మదిగాబయటకు విడువుము. ప్రతిరోజు ఉదయమున 15 నుండి 30 పర్యాయములవరకు ఈ విధముగ చేయుచుండుము. ఈ అభ్యాసమును పద్మ, సిద్ధ, వజ్రాసనములలోగాని, నడచుచు లేక నిలబడిగాని చేయవచ్చును. ఈ ప్రాణాయామము రక్తమును శుభ్రపరచును. ఆకలి దప్పులను చల్లార్చును. శరీరమును చల్లగా వుంచును. గుల్మము, ప్లీహ, జ్వరము, దీర్ఘవ్యాధులు, క్షయ, అజీర్తి, శ్లేష్మము, పైత్యదోషములు, పాము,తేలు మొదలగువాని విషముల వల్ల కలుగు దోషములను పోగొట్టును. నీరు దొరకుట దుర్లభముగా తోచుస్థితిలో దాహము వేసినచో ఈ ప్రాణాయామమును చేయుము. వెంటనే దప్పిక లేకుండ పోవును. ఈ ప్రాణాయామమును ప్రతినిత్యము అభ్యసించువానిని తేలు, పాము కాటుల ఏమియు చేయజాలవు. ఈ ప్రాణాయామ సాధకుడు, నీరు, ఆహారము, గాలి లేకుండా తన శరీరమును కాపాడుకొనగల శక్తి శాలి యగును. అన్ని విధములగు వేదనలు, పోటు, బాధ, మంట, జ్వరాదులనుండి విముక్తిని పొందును.
స్వామి శివానంద
సశేషము
ప్రాణాయామ ప్రకరణము
--- 9 ---
(నడుచుచూ చేయు ప్రాణాయామము)
రొమ్మును విశాలముగ వుంచి, భుజములను వెనుకకు వుండులాగునను తల పైకి వుండులాగునను వుంచి నడువుము, ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క 'ఓం' జపించుచూ 3 'ఓం' లను లెక్కించునంతసేపటివరకు గాలిని రెండు ముక్కులతోను నెమ్మదిగా పీల్చుము. తరువాత 12 'ఓం' లను జపించునంతవరకు కుంభకముచేయుము. తరువాత ఆరు 'ఓం' లను జపించునంతవరకు రెండు ముక్కులతోను గాలిని విడచుము. ఇటుల ఒక ప్రాణా యామము అయినపిదప 12 'ఓం'లను జపించునంతవరకు మామూలుగా గాలినిపీల్చి విడచుచుండుము. అడుగుకు ఒక్కొక్క 'ఓం; చొప్పునలెక్క పెట్టుట కష్టముగా తోచుచో, ఈ నియమమును పాటించుట మానుము.
'కపాలభాతి'ని కూడ నడచుచూ చేయవచ్చును. పనులతో తీరిక వుండని మనుష్యులపై ప్రాణాయామమును ఉదయము సాయంత్రములందు షికారుకు వెళ్ళునప్పుడు చేయవచ్చును. దీనినే ఒకే రాతితో రెండు పక్షులను కొట్టుట అందురు. పరిశుద్ధమగు గాలి వచ్చెడి బహిరంగ ప్రదేశములో నడచుచూ ప్రాణాయామము చేయుట, ఎంతో ఆహ్లాదకరముగ వుండును. ఇందువలన ఎంతో పుష్టివచ్చును. దీనిని అభ్యసించి లాభములను అనుభవించుము. త్వరత్వరగా నడచువారు 'ఓం' ను మానసికముగా గాని, నెమ్మదిగాగాని స్మరించవచ్చును. ఏప్రయత్నమును లేకుండ సహజ ప్రాణాయామమును చేయుము.
శవాసనములో
ఒక జంపఖానాపరచి, దానిపైన వెల్లకిల్లా పడుకొనుము. చేతులను ప్రక్కగా పెట్టుకొనుము. కాళ్ళు జాపుము. చీలమండలను రెంటినీ దగ్గరగావుంచి కాలి బొటనవ్రేళ్ళను కొంచెము దూరముగావుంచుము. స్నాయువులను, నరములను సడలించి వుంచుము. చాల బలహీనముగా వుండువారు ఈవిధముగ ప్రాణాయామమును చేయవచ్చును. ఏ విధమగు శబ్దము చేయకుండ రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని పీల్చుము. శ్రమ లేకుండ ఆపగలిగినంతసేపు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని విడచుము. పై విధముగా ఉదయం 12 మారులు, సాయంత్రం 12 మారులు చేయుము. అభ్యాసము చేయునప్పుడు మానసికముగ 'ఓం'ను జపించుము. వీలై, యిష్టమైనచో "సుఖపూర్వక ప్రాణాయామము"ను కూడ చేయవచ్చును. ఇది, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము విశ్రాంతులు కలసియున్న సాధన, ఇందువల్ల శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. పెద్ద వయస్సు వచ్చినవారికి యిది చాల అనుకూలమైనది.
క్రమ శ్వాస :
సాధారణముగ స్త్రీలుగాని, పురుషులుగాని పీల్చెడి శ్వాస సరిగలేదు. గాలి విడచునప్పుడు 16 అంగుళములు నిడివిగను, పీల్చునప్పుడు 12 అం. నిడివిగాను వుంటున్నది. ఇందువల్ల 4 అం. శ్వాస వ్యర్థముగ పోవుచున్నది. పీల్చునప్పుడుకూడ 16 అంగుళములు నిడివిగ పీల్చుచో క్రమ శ్వాసయగును. ఇటుల చేయుటచే కుండలినీశక్తి మేల్కొనును. ఇట్టి క్రమశ్వాసవల్ల నిజమగు విశ్రాంతి లభించును. సుషుమ్నా శీర్షకములో గల శ్వాస కేంద్రము వశపడును. ప్రశాంతముగా మనస్సుండును.
ఉచ్ఛ్వాసనిశ్వాసల పరిమాణము సమానముగ వుండుటనే క్రమ శ్వాసయందురు. 6 'ఓం' లను జపించునంత సేపటి వరకు పూరకము చేయుము. రేచకమునుకూడా 6 'ఓం' లను జపించుటకు పట్టునంతటిసేపువరకే చేయును. ఇది శరీరమును ప్రశాంతస్థితిలో వుండులాగున చేయుము. ఇందువల్ల మనస్సు, ఇంద్రియములు శాంతిని పొందుటయే గాక అలసియున్న నరములకు తిరిగి బలము కలుగును. అన్ని విధములగు తొందరలు, తొట్రుపాటులు, ఆవేశములు అణగిపోయి సముద్రము వలె గంభీరముగ వుందువు. ఇంకొకరకపు క్రమ శ్వాసాభ్యాసము కలదు. దానిని యీ విధముగ చేయుదురు. 4 'ఓం' లను జపించునంతసేపటి వరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినిపీల్చుము. 8 'ఓం' లను జపించునంత సేపటివరకు ఆ గాలిని లోపల బంధించుము. తరువాత మరల 4 'ఓం' లనుజపించునంతసేపటివరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినివిడవుము. తరువాత 8 'ఓం' లను లెక్కించునంత సేపటివరకు గాలిని పీల్చకుండ బాహ్యకుంభకము చేయుము.
నీ శక్త్యానుసారము పై ప్రకారము కొన్ని మారులు చేయుము. క్రమక్రమముగ శ్వాసోచ్ఛ్వాసల సమయమును 8 'ఓం' లను లెక్కించునంత సేపటివరకును, కుంభకమును 16'ఓం' లను లెక్కించునంత సేపటివరకును అధికము చేసికొనుచూ రమ్ము. ఇటుల వృద్ధిచేయుటలో ఏవిధమగు శ్రమయు వుండకుండు లాగున చూచుకొనుము. ఇందుచే ఏ మాత్రము బాధ వుండరాదు. దీర్ఘ శ్వాసకంటె, క్రమశ్వాసయే యెక్కువ విలువగల దనెడి విషయమును జ్ఞప్తియం, దుంచుకొనుము. పట్టుదల శ్రద్ధలతో చేయుము.
స్వామి శివానంద
(సశేషమ
ప్రాణాయామ ప్రకరణము
--- 8 ---
(కపాలభాతి)
'కపాలభాతి' అనగా పుఱ్ఱెను ప్రకాశింప జేయుట. అనగా, యీ క్రియ వల్ల కపాలము పరిశుద్ధ మగును. దీనిని షట్కర్మలలో ఒకటిగా లెక్కించెదరు.(హఠయోగ షట్కర్మలు)
పద్మాసనములో కూర్చొనుము. మోకాళ్ళపై చేతులను పెట్టుము, కండ్లు మూయుము. త్వరత్వరగ పూరక రేచకములను చేయుము. ఇందువల్ల చెమట పోయును. ఇది ఒక చక్కని వ్యాయామము. ఈ అభ్యాసము బాగా అలవాటైనవారు భస్త్రిక ప్రాణాయామమును సులభముగ చేయగలరు. ఈ ప్రాణాయామములో కుంభకము లేదు. దీనియందు రేచకము ప్రధానము, పూరకము నెమ్మదిగను దీర్ఘమైనదిగను వుండును. రేచకమును అతి త్వరగా బలవంతముగ చేయవలెను. పూరకము చేయునపుడు పొట్ట యందలి స్నాయువులను సడలించి వుంచుము. కొందరు వెన్నెముకను, మెడను వంపుగా వుంచెదరు. అటుల వుంచరాదు. మెడ, మొండెము నిలువుగా వంపు లేకుండ వుండవలెను. భస్త్రికలో వలె ఆకస్మికముగ పూరకము వెంటనే రేచకము జరుగును. మొట్టమొదటిలో రేచకము ఒక సెకండు సేపు చేయుము. క్రమక్రమముగ సెకండుకు రెండు రేచకములు చేయగలుగు లాగున అలవరచు కొనుము. మొట్టమొదటిలో ఉదయమున 10 రేచకములు గల ఒక చుట్టును మాత్రము చేయుము. రెండవ వారములో, ఉదయము.... పై పరిమితి గల ఒక చుట్టు సాయంత్రము ఇంకొక చుట్టునూ చేయుము. మూడవ వారములో ఉదయము రెండు, సాయంత్రము రెండు చుట్లను చేయుము. ఈ రీతిని క్రమక్రమముగ వృద్ధిచేసికొనుచూ ప్రతిపూట 120 రేచకములను చేయగలుగునంతవరకు పెంచుచూ రమ్ము.
ఇది ముక్కు, శ్వాసావయవములను పరిశుభ్రపరచును. సూక్ష్మ శ్వాసనాళములందలి స్నాయువుల ఈడ్పును పోగొట్టును. క్రమక్రమముగ కొంతకాలమునకు ఉబ్బసము నివారణమగును. ఊపిరితిత్తులకు వలసినంత ప్రాణవాయువు లభించును. ఇందువలన క్షయవ్యాధిబీజములు జన్మింపవు. క్షయవ్యాధిని కూడ యీ అభ్యాసము నివారించగలదు. ఊపిరితిత్తులు వృద్ధియగును. కర్బన ద్వ్యమ్లజనిదము (carbon di oxide) బయటకు నెట్టివేయబడును. రక్తములోగల అన్నివిధములగు అపరిశుద్ధతలు పోవును. జీవాణువులు, ధాతువులు ఎక్కువగా ప్రాణవాయువును తీసికొనును. సాధకునకు చక్కని ఆరోగ్యము లభించును. హృదయము చక్కగా పనిచేయును. రక్తప్రసరణావయవములు, శ్వాసావయవములు తమ పనులను చక్కగా నిర్వర్తించుకొనును.
బాహ్య కుంభకము :
8 మార్లు 'ఓం'ను లెక్కించునంతవరకు ఎడమముక్కుతో గాలిని పీల్చుము. గాలిని లోపల ఆపుజేయకుండా వెంటనే 6 'ఓం' లను లెక్కించునంత సేపటివరకు కుడిముక్కుగుండా బయటకు విడచుము. 12 'ఓం'లను లెక్కించునంతవరకు గాలిని పీల్చకుండా ఆగుము. ఆపైన కుడిముక్కుతో పైరీతిని గాలిని పీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడచి, పై పరిమితి ప్రకారము గాలిని పీల్చకుండ ఆపుము. ఈ విధముగ ఉదయం ఆరు పర్యాయములు, సాయంత్రం ఆరు పర్యాయములు చేయుము. క్రమ క్రమముగ ఏ విధమగు శ్రమయు పడకుండ ప్రాణాయామముల సంఖ్యను, కుంభక సమయమును అధికముచేయును.
సుఖపూర్వక ప్రాణాయామము :
నీ యిష్ట దేవతకు ఎదురుగా, నీవు ధ్యానముచేసి కొను గదిలో పద్మాసనములోగాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా గాలిని పీల్చుము. తరువాత ఎడమ ముక్కును కూడా కుడి వుంగరపు, చిటికెన వ్రేళ్ళతో మూయుము. నీవు శ్రమ లేకుండ ఆపగలిగినంతసేపటికి వరకు గాలిని లోపల ఆపుము. ఆపైన కుడి ముక్కుతో (బొటన వ్రేలు తీసి) చాల నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో గాలిని పీల్చి, పైన చెప్పిన విధముగా కుంభకము చేసి, తరువాత ఎడమ ముక్కుతో పైన చెప్పినటుల గాలి విడువుము. ఇదంతయు ఒక ప్రాణాయామము అగును. ఇట్టి ప్రాణాయామములు ఉదయమున 20, సాయంత్రం 20 చొప్పున చేయుము. క్రమ క్రమముగ సంఖ్యను పెంచుచూ రమ్ము. గాలిని పీల్చునప్పుడు దయ, ప్రేమ, క్షమ, శాంతి, ఆనందము మొదలగు దైవీసంపదలు నీలో ప్రవేశించుచున్నట్లు, గాలిని విడచునప్పుడు, కోపము, కామము, అసూయ మొదలగు రాక్షస సంపదలు నీ నుండి బయటకు వెళ్ళిపోవుచున్నట్లు , ఈవిధమగు మానసిక భావమును కలిగి యుండుము. పూరక -కుంభక - రేచక... సమయములందు మాన సికముగ 'ఓం' లేక గాయంత్రి మంత్రమును జపించుము. త్వరగా వృద్ధిలోనికి రాగోరు సాధకులు రోజుకు 320 కుంభకములను 4 పర్యాయములుగా చేయ వచ్చును.
ఈ ప్రాణాయామము సమస్త వ్యాధులను పోగొట్టును. నాడులను పరిశుద్ధ పరచును. మనస్సును నిలకడ గలదిగ చేసి, ధారణ చేయ గలుగునటుల మార్చును. జీర్ణశక్తిని పెంపొందించును. ఆకలిని కలిగింప జేయును. బ్రహ్మచర్య పాలన చేయుటలో సాయపడి, నిద్రించు చున్న కుండలినీ శక్తిని మేల్కొలుపును.
కుండలిని మేల్కొలుపుటకు :
ఈ క్రింద అభ్యాసము చేయునప్పుడు వెన్నెముక యొక్కమూలమగు మూలాధార చక్రమువద్ద ధారణచేయుము.(తప్పని సరిగా సిద్ధుడైన గురువు సహకారం తీసుకోవాలి...Mandatory)
కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. 3 'ఓం'లను జపించగలుగునంతవరకు మెల్లిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. పీల్చునప్పుడు బాహ్యప్రదేశమునుండి ప్రాణమును లోపలికి తీసికొను చుంటినని భావించుము. ఆ తరువాత కుడి వుంగరపు చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. అప్పుడు గాలిని ఆపి, 12 'ఓం'లను జపించుము. ఆ సమయమున మూలాధార చక్రమునకు ఈ ప్రాణశక్తిని పంపుచున్నాననిన్నీ, ఆ ప్రాణశక్తి త్రిదళముగల పద్మమందలి కుండలినీ శక్తిని మేల్కొలుపుచున్న దనిన్నీ భావించుచుండుము. ఈ 12 'ఓం'లను జపించిన పిదప, కుడి ముక్కుతో 6 'ఓం'లను లెక్కించునంతవరకు నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో విడవుము. పై రీతిగాభావించి, జపించుచూ,) ఇది ఒక ప్రాణాయామమగును. ఇది కుండలినీ శక్తిని త్వరగా మేల్కొలుపును. ఈ రీతిని ఉదయము 3 మారులు సాయంత్రము 3 మారులు చేయుము. నీశక్తి ననుసరించి క్రమక్రమముగ సంఖ్యను కాలమును అధికము చేసికొనుచు రమ్ము. ఈ ప్రాణాయామములో మూలాధార చక్రముపై ధారణ చేయుట ప్రధానాంగము. ప్రాణాయామమును క్రమముగ చేయుచూ, తీక్షణముగ ధారణ, చేయుచున్నచో త్వరలోనే శక్తి లేచును.
ధ్యానసమయమున ప్రాణాయామము :
ధారణ ధ్యానములు చేయునప్పుడు ప్రాణాయామము సహజముగ సిద్ధించును. ఇట్టి సమయమున శ్వాస అతి నెమ్మదిగా వచ్చును. మనమందరము మనకు తెలియకుండగనే, ఈ ప్రాణాయామమును చేయుచున్నాము. ఏదైన చక్కని ఆహ్లాదకరమగు కథల పుస్తకమునుగాని, ఏదైన చిక్కుగల లెక్కనుగాని చేయునప్పుడు తదితర విషయముల నన్నిటిని మరచి ఆ విషయమునందే నీమనస్సు పూర్తిగా లగ్నమై యుండును. ఇట్టి సమయమున నీశ్వాసను పరీక్షించుచో.... చాల నెమ్మదిగా వచ్చుటను కనుగొనగలవు. ఆనందము, విచారము, దు:ఖములను కలిగించు విషయములను చూచుట, వినుటలో కూడ శ్వాస అతి నెమ్మదిగా వుండును. ఇదే సహజముగ వచ్చు ప్రాణాయామము. శీర్షాసనమును అభ్యసించువారికి కూడ సహజముగ ప్రాణాయామము ప్రాప్తించును. ఈ ఉదాహరణల వల్ల, ధారణా ధ్యానములలో శ్వాస చాలా నెమ్మదిగా వుండునని గాని, ఆగి పోవుననిగాని అనుటను కాదనజాలము. మనస్సు ప్రాణము ఒక దానితో ఒకటి దగ్గరి సంబంధము కలిగి వుండుట వల్ల యిటుల జరుగును. మనస్సుకు ప్రాణము దుస్తులాటిది. అట్టి సమయములలో నీ శ్వాసను పరీక్షించ సాగిన కొద్దిసేపటిలోనే, నీ శ్వాస మరల మామూలు స్థితికి వచ్చును. జపము, ధ్యానము లేక బ్రహ్మ విచార మొనర్చువారికి సహజముగనే ప్రాణాయామము సిద్ధించును.
ప్రాణము, మనస్సు, వీర్యము, ఈ మూడును ఒకే లంకెయందున్నవి. కావున, వీనిలో ఏ ఒక్కదానిని వశ పరచు కొన్నప్పటికి, మిగిలిన రెండునూ వాటంతట అవే వశమగును. అఖండ బ్రహ్మచర్యమును 12 ఏండ్లు ఒక్క వీర్యపు చుక్క కూడ వ్యర్ధము కాకుండ కాపాడుకొనిన వానికి, మనస్సు, ప్రాణములు పూర్తిగా లోబడును. హఠయోగులు ప్రాణమును వశపరచుకొనియు, రాజయోగులు మనస్సును వశపరచుకొనియు బ్రహ్మను చేరెదరు.
ఈ ప్రాణాయామములో ముక్కులను మూయనక్కర లేదు. కూర్చొని అభ్యసించ దలచుచో కండ్లను మూయుము. శరీరమును మరచి ధారణ చేయుము. నడచుచూ చేయుచున్నచో నీవు పీల్చెడి విడిచెడి గాలిపై ధారణచేయుము.
(సశేషము)
స్వామి శివానంద
ప్రాణాయామ ప్రకరణము
-- 7 --
(1 వ అభ్యాసము)
పద్మాసనములో కూర్చొనుము. కండ్లు మూయుము. రెండు కనుబొమల (త్రికుటి) మధ్య ధారణ చేయుము. కుడి ముక్కును కుడిబొటనవ్రేలితో మూయుము. నీకు సులభముగను శ్రమ లేకుండగను వుండునంత సేపటివరకు నెమ్మదినెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. ఆ పిమ్మట చాల నెమ్మదిగా అదే ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మార్లు చేయుము. ఇది ఒక మెట్టు లేక చుట్టు లేదా ఒక cycle. ఆ పిదప ఎడమ ముక్కును కుడిచేతి చిటికెన వుంగరపు వ్రేళ్ళతోమూసి, కుడిముక్కు గుండా మెల్ల మెల్లగా గాలిని పీల్చి, తరువాత అదేముక్కుతో గాలిని బయటకు విడువుము. ఈ విధముగ పండ్రెండుమార్లు చేయుము. ఇది ఒక మెట్టు లేక చుట్టు లేదా cycle.
గాలి పీల్చునప్పుడు గాని, విడచునప్పుడుగాని శబ్దము కారాదు. సాధనాసమయమున, నీ ఇష్టదేవతను స్మరించుము. సాధన మొదలిడిన రెండవవారములో రెండు చుట్లును, మూడవవారములో మూడు చుట్లును చేయుము. ఒక్కొక్క చుట్టు పూర్తిఅయిన పిదప, రెండు,మూడు నిమిషములసేపు విశ్రాంతి తీసికొనుము. ఒక చుట్టు కాగానే కొన్ని సాధారణ శ్వాసోచ్ఛ్వాసలు జరుపుటచే నీకు తగిన విశ్రాంతి లభించగలదు. ఈ అభ్యాసములో కుంభకములేదు. నీశక్తి ననుసరించి ఎక్కువచుట్లు చేయవచ్చును.
(2 వ అభ్యాసము):
నెమ్మదిగా రెండు ముక్కులతోను గాలిని పీల్చుము. గాలిని ఆపవద్దు. అటుపిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము. ఈ విధముగా 12 మార్లు చేయుము. ఇక్కడికి ఒక చుట్టు అగును. నీ వీలు, శక్తి ననుసరించి 2, 3 చుట్లువరకు చేయవచ్చును.
(3 వ అభ్యాసము):
ఆసనములో కూర్చొనుము. కుడిముక్కును కుడి బొటన వ్రేలితో మూయుము. ఆ పిదప ఎడమముక్కుతో నెమ్మదిగా
గాలిని పీల్చుము. అటుపైన, ఎడమ ముక్కును కుడి ఉంగరపు చిటికెన వ్రేళ్ళతో మూసి, కుడి ముక్కుగుండా గాలిని విడువుము[నెమ్మదిగా].
ఆ పిదప నీవు పీల్చ గలిగినంత సేపు కుడిముక్కుతో గాలినిపీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మారులు చేయుము. ఒక చుట్టు అగును. దీనిలోకూడ కుంభకము లేదు.
(4 వ అభ్యాసము)
అ, ఉ, మ - అను మూడు అక్షరములకు మూలము ఒకే ఒక అక్షరమగు 'ఓం' అని ధ్యానించుము. 16 సెకండ్లు(మాత్రలు) సేపు ఎడమ ముక్కుగుండా గాలిని పీల్చుచూ 'అ' ను ధ్యానించుము. ఆ పిదప గాలిని 64 మాత్రలు (సెకండ్లు) సేపు కుంభించి ఆ సమయమును 'ఉ' ను ధ్యానించుము. ఆ పైన 32 సెకండ్ల సేపు 'మ్'ను ధ్యానించుచూ గాలిని కుడి ముక్కుతో విడువుము. పై విధముగా చాలసార్లు చేయుము. మొదట 2,3 సార్లుచేసి క్రమక్రమముగ 20, 30 మార్లు నీశక్తి ననుసరించి చేయుచుండుము. ప్రారంభములో పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1: 4: 2 వుండనిమ్ము. క్రమ క్రమముగ ఈమూడును 16: 64: 32 నిష్పత్తిలో వుండు నంతవరకు పెంచుకొనుచు రమ్ము.
దీర్ఘ శ్వాసాభ్యాసము :
ప్రతి దీర్ఘ శ్వాసాభ్యాసమునందు ముక్కుతో నిండా గాలిని పీల్చుటయు, నెమ్మదిగ గాలిని పూర్తిగా విడచుటయు, ఆవశ్యకము. నీవు నెమ్మదిగా పీల్చగలిగినంత సేపటివరకు గాలిని పీల్చుము. సాధ్యమైనంత నెమ్మదిగా గాలిని విడువుము. గాలి పీల్చునపుడు, యీ దిగువ విషయములను గురించి శ్రద్ధతీసి కొనవలయును:-
1. నిల్చొనుము. చేతులను తొంటిపై పెట్టుము. మోచేతులను బలవంతముగ వెనుకవుండు లాగున వుంచకుండా బయటకు వుండులాగున వుంచుము. సుఖముగా నుంచొనుము.
2.రొమ్మును తిన్నగా ముందుకు విరిచి వుంచుము. తొంటి ఎముకలను చేతులను క్రిందివైపుకు వుండులాగున వుంచి నొక్కిపట్టుము, ఇందువలన ఖాళీప్రదేశము ఏర్పడి, గాలి తనంత తాను పోగలుగు లాగున వుండును.
3. ముక్కులను తెరచి వుంచుము. ముక్కులను ప్రతి వస్తువును పీల్చెడి పంపువలె వుపయోగించకుము. అది పీల్చెడి విడచెడి గాలి ద్వారమువలె వుండవలెను. పీల్చునప్పుడు ఏవిధమగు ధ్వనిని చేయరాదు. శబ్దములేని శ్వాసయే సరియైన శ్వాస యని జ్ఞాపకము వుంచుకొనుము.
4. మొండెముయొక్క పై భాగమునంతను పరచినట్లుండులాగున వుంచుము.
5. రొమ్ముయొక్క పై భాగమును వంపుగా ఆర్చివలె వుండనివ్వకుము. పొత్తి కడుపును బిగబట్టివుంచకుము.
6. తలను మరీ వెనుకకు వంచకుము. పొట్టను లోపలికి వంగనివ్వకుము. భుజములను బలవంతముగా వెనుకకు నొక్కిపట్టివుంచకుము. భుజములు పైకి ఎత్తిపట్టుకొని యుండునటుల చూడుము. గాలిని బయటకు విడచునపుడు యీ దిగువ నియమములను పాటించుము:
1. ప్రక్కయెముకలు, మొండెముయొక్క పైభాగమును క్రమక్రమముగ క్రిందికి క్రుంగనిమ్ము.
2. క్రింది ప్రక్కటెముకలు, పొట్ట, వీటిని నెమ్మదిగా పైకి లాగుకొనుము.
3. శరీరమును మరీముందుకు వంగనివ్వకుము, రొమ్మును ఆర్చివలె వుంచుటనుకూడ మానవలెను. తల, మెడ, మొండెములను నిలువుగీతవలె వంపులేకుండ వుంచుము. రొమ్మును ముడుచుకొనుము. గాలిని నోటితో విడువకుము. ఏ విధమగు శబ్దము కలుగకుండా ముక్కుతో మెల్ల మెల్లగా గాలిని విడువుము.
4. గాలిని పీల్చు స్నాయువులను సడలించుటచే సహజముగ గాలిని విడువ వచ్చును. అట్టి స్థితిలో రొమ్ము ముందుకు వాలును. ముక్కులనుండి గాలి బయటకు వచ్చును.
5. ప్రారంభములో గాలిని పీల్చగనే కుంభకము చేయకుము. శ్వాసించుట అయిపోవగనే గాలిని విడచుచుండుము. ఇది బాగా అలవాటైన పిమ్మట 5 సెకండ్లనుంచి ప్రారంభించి, 1 నిమిషమువరకు నీశక్తి, బలము ననుసరించి కుంభకమును అధికము చేసికొనుచు రమ్ము.
6. మూడు మారులు దీర్ఘశ్వాసలు తీసికొన్న తర్వాత కొంచెముసేపు, సాధారణ శ్వాసోచ్చ్వాసలు తీసికొనుట మూలముగా విశ్రాంతి తీసికొనుము. తరువాత రెండవ చుట్టును ప్రారంభించుము. మధ్య విశ్రాంతి సమయములో సుఖముగ వుండురీతిని చేతులను తొంటిపై పెట్టి నుంచుకొనుము. నీశక్తి ననుసరించి నీయిష్టము వచ్చినన్ని చుట్లు చేయవచ్చును. ప్రతి వారము ఒక్కొక్క చుట్టును పెంచుకొనుచు వచ్చుచు 3, 4 చుట్లు వరకు చేయుము. ఇది ఒక విధమగు ప్రాణాయామమే.
(సశేషము)
స్వామి శివానంద
🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹
🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
వనమునైనను మరి గిరి పథము నైన
జనము మధ్యనునైననిర్జనమునైన
నీదు సన్నిధి నాకగు నిఖిల మెపుడు
వాహనముగనౌచు నీసేవ వదలనయ్య
🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రాణాయామ ప్రకరణము
--- 6 ---
(నాడీ శుద్ధి కొరకు)
మాలిన్యముతో, నిండియున్న నాడులలోనికి వాయువు చొరజాలదు. కావున మొట్టమొదట వీటిని శుభ్రపరచి, ఆపైన ప్రాణాయామమును అభ్యసించవలెను. నాడీశుద్ధికి సమాణుపు, నిర్మాణుపు అను రెండుమార్గములు గలవు. సమాణు విధానమునే బీజాక్షర మంత్రజపమని, నిర్మాణ విధానమును షట్కర్మానుష్ఠానమని అందురు.
1. పద్మాసనములో కూర్చొనుము. వాయువుయొక్క బీజాక్షరమగు పొగలాటి రంగుగల 'వం' ను ధ్యానించుము. ఎడమ ముక్కుతో గాలిని పీల్చుచూ 16 మారులు ఆ బీజాక్షరమును జపించుము. (ఇది పూరకము) తరువాత 64 మారులు ఆ బీజాక్షరమును జపించునంతవరకు, గాలిని లోపల బంధించుము. ఇది కుంభకము. ఆ పిమ్మట 32 మార్లు ఆ బీజాక్షరమును జపించుచూ, అనగా 32 మార్లు జపించుట పూర్తియగు నంతవరకు, గాలిని బయటకు విడువుము. (రేచకము)
2. బొడ్డు అగ్ని తత్త్వమునకు అధిష్ఠానము. (మణిపూరక చక్ర స్థానము) ఈ అగ్ని తత్త్వముపై ధ్యానము చేయుము. కుడి ముక్కుతో అగ్ని బీజాక్షరమగు 'రం' ను 16 మారులు జపించుట అగునంత వరకు, గాలిని పీల్చుము. ఆ పిమ్మట 64 మారులు జపించునంత వరకు కుంభకము చేయుము. 32 మారులు జపించుట అగునంతవరకు గాలిని విడుచు చుండుము. '(ఎడమ ముక్కుతో)'
3. ముక్కు పుటమువద్ద దృష్టిని నిలుపుము. ఎడమ ముక్కుతో 16 మారులు 'తం' అను బీజాక్షరమును జపించు నంత వరకు గాలిని పీల్చుము.
64 మారులు జపించునంతవరకు గాలిని లోపలఆపుము. ఈ కుంభక సమయములో చంద్రనాడిగుండా అమృతము శరీర మందలి అన్ని నాడులలోనికి ప్రవహించి, శరీరమునంతటిని పరి శుద్ధ పరచుచున్నదని భావించుము. ఆ తరువాత 32 మారులు 'లం' బీజాక్షరము (పృథ్వీబీజము) జపించునంతవరకు కుడిముక్కుతో గాలిని విడువుము.
పై మూడు రకములగు ప్రాణాయామములు నాడీశుద్ధిని బాగుగా కలిగించును.
ప్రాణాయామ సమయమున మంత్రజపము:
ప్రాణాయామ సమయమున మంత్రజపము చేయుటను గురించి "ఈశ్వర గీత" లో యీ విధముగా చెప్పబడివున్నది:-
సప్త వ్యాహృతులతో గూడిన గాయత్రీ మంత్రమును ఆద్యంతముల యందు ఓం కార సహితముగ, ప్రాణమును నియమించి జపించినచో అదియొక ప్రాణాయామమగును.
ఓం భూ: ఓం భువ: ఓగ్‌ం సువ: ఓం మహ: ఓం జన: ఓం తప: ఓగ్‌ం సత్యం.
ఇవి సప్తవ్యాహృతులనబడును.... గాయత్రీ మంత్ర శిరస్సును గూడ, చివర చెప్పవలయును.
ఓం ఆపోజ్యోతీరసో ంబ్రహ్మ భూర్భువస్సువరోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, ఇది శిరస్సు, యజ్ఞ వల్క్యయోగి దీనినిగురించి యీ రీతిని చెప్పెను:-
ఉచ్చ్వాస నిశ్వాసలను రెండింటిని నిరోధించి మాత్రా పరిమితి గల 'ఓం'కార స్మరణతో శ్వాసను నియమించుటను అభ్యసించవలెను. 'ఓం'కారము పరమ హంస సన్యాసులకు మాత్రమే నిర్ణయింపబడి యున్నది. స్మృతులతో ఉచ్చ్వాస నిశ్వాసాదులను బొడ్డు, హృదయము, నుదుటిపై ధారణ చేయుచూ, ఆ స్థలములందు వరుసగ బ్రహ్మ, విష్ణు, శివు
లను ధ్యానించుచూ ప్రాణాయామము చేయవచ్చునని కలదు. ఇది సాధారణ జనులకు కాని పరమ హంస సన్యాసులకు బ్రహ్మ ధ్యానము ఒక్కటే నిర్ణయింపబడినది. దీనినే శ్రుతులలో "ఆత్మ సంయమము గల సాధకుడు పరబ్రహ్మపై ఓం కార జపముచే ధారణ చేయవలెను." అని గలదు.
స్వామి శివానంద
ప్రాణాయామ ప్రకరణము
--- 5 ---
(త్రివిధ ప్రాణాయామములు)
అధమము, మధ్యమము, ఉత్తమము, అని ప్రాణాయామములు మూడువిధములు.
అధమము 12 మాత్రలు, మధ్యమము 24 మాత్రలు, ఉత్తమము 32 మాత్రల పూరక కాల పరిమితిని కలిగి వుండును. పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1:4:2 గా వుండవలెను. పూరకము అనగా, గాలిని పీల్చుట, కుంభకము అనగా, గాలిని లోపల ఆపుజేయుట. రేచకము అనగా, గాలిని బయటకు విడచుట అని అర్థము. 12 మాత్రల కాలము పూరకము చేసినచో, 48 మాత్రల కాలము కుంభకమున్నూ, 24 మాత్రల కాలము రేచకమున్నూ చేయవలెనని పై దాని అర్థము. ఇది అధమ ప్రాణాయామము. తతిమ్మా రెండు ప్రాణాయామములకు కూడ ఈ నియమమే వర్తించును. (ప్రాణాయామ సిద్ధుడైన గురువు సహకారం తీసుకొనుట మంచిది)
మొట్టమొదట అధమ ప్రాణాయామమును ఒక మాసము రోజులు అభ్యసించుము. మధ్యమ ప్రాణాయామమును ఆతరువాత మూడు మాసముల వరకు అభ్యసించుము. అటు పిమ్మట ఉత్తమ ప్రాణాయామమును మొదలిడుము.
ఆసనములో కూర్చున్న వెంటనే, నీ గురువునకున్నూ, శ్రీ గణేశునకున్నూ నమస్కారము చేయుము. ప్రాణాయామాభ్యాసము చేయుటకు ఉదయం 4 గం; 10 గం; సాయంత్రం గం 5; రాత్రి గం 10; 12 గం ల సమయములు తగినవి. నీవు ఉచ్చస్థితికి రాగానే రోజుకు 320 ప్రాణాయామములను చేయుచుండ వలెను. సగర్భ ప్రాణాయామము అను ఒక పద్ధతి ఒకటి గలదు. ఈ ప్రాణాయామములో, ప్రాణాయామముతో పాటు మానసికముగ గాయత్రి లేక 'ఓం' మంత్రజపము చేయుదురు. ఈప్రాణాయామము అగర్భ ప్రాణాయామము(మంత్రజపము లేకుండ చేయు ప్రాణాయామము) కంటె నూరురెట్లు లాభకారి. ప్రాణాయామసిద్ధి, సాధకుని ఉత్సాహము, సాహసము, పట్టుదలపై ఆధారపడి వుండును. ఈ లక్షణములు గలవానికి 6 మాసములలో సిద్ధి ప్రాప్తి కలుగును. సోమరి పోతు, బద్ధకస్తుడుగావుండి సంశయ గ్రస్తుడగు వానికి 8, 10 సంవత్సరములకు కూడ ఏ విధమగు అభివృద్ధియు కనుపించదు. కావున, పట్టుదల, ఓర్పు, విశ్వాసము, శ్రద్ధ, ఉత్సాహములు కలవాడవై పాటుపడుము. నీకు తప్పక విజయప్రాప్తి కలుగును.
వేదాంతుల కుంభకము:
ఏవిధమగు చాంచల్యము లేకుండ ప్రశాంతమగు మనస్సుతో ప్రాణాయామమును అభ్యసించవలెను. శ్వాస-ప్రశ్వాసలను రెంటిని నిరోధించవలెను. బ్రహ్మానుసంధానమే తన జీవిత లక్ష్యముగా ఎంచవలెను. బాహ్యవస్తు త్యాగమును రేచకమందురు. ఆధ్యాత్మికజ్ఞానము, శాస్త్రజ్ఞానము లేక అట్టి విషయములనుగురించి తెలిసికొనుటలను పూరకమందురు. చిత్తమును ఈ విధమగు సాధనలను చేయులాగున చేయువాడే ముక్తుడు. మనస్సును పరమశివునిపై నిలుపుటయే కుంభకము. ఈ కుంభకము ప్రాణాయామకుంభకమువల్ల చక్కగా సిద్ధించును. ఇందువలన మొట్టమొదట బ్రహ్మగ్రంథి వద్ద మార్గమేర్పడును. అచ్చటినుంచి విష్ణుగ్రంథి, విష్ణుగ్రంథినుండి రుద్ర గ్రంథివరకు మార్గమును చేసికొని ముక్తుడై సుఖలాభమును యోగించువాడు అనుభవించును. ఇట్టి స్థితి అనేక జన్మలలో చేసిన యజ్ఞయాగాదులు, గురుకృప, దైవకృప, యోగ సాధనలచే లభించును.
సశేషం
📚స్వామి శివానంద
✒️భట్టాచార్య

ప్రాణాయామ మంటే ?
'తస్మిన్‌సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేద: ప్రాణాయామ:'
"శ్వాసను నియమించుట లేక వశపరచుకొనుట యనగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆపుజేయుట. ఇది ఆసనసిద్ధి కలిగిన పిదప సహజముగ సిద్ధించును."
ప్రాణాయామమును గురించి పతంజలి యోగసూత్రములలో 2 అ. 49 సూత్రములో ఈ విధముగ వివరించబడి యున్నది
'శ్వాస' యనగా లోపలికి పీల్చుగాలి, 'ప్రశ్వాస' యనగా బయటకు విడచుగాలి. ఆసనసిద్ధి కలిగిన పిమ్మట ప్రాణాయామమును అభ్యసించవచ్చును. ఒకే ఆసనములో కదలక మెదలక ఒకేసారిగ మూడుగంటలసేపు కూర్చొన గలుగుటయే ఆసనసిద్ధి. అరగంట నుండి గంటవరకు ఒకే ఆసనములో కూర్చొన గలిగినప్పటినుండి ప్రాణాయామము చేయుటను ప్రారంభించ వచ్చును. ప్రాణాయామము చేయకుండా ఆధ్యాత్మిక సాధనలో జయము పొందుట చాల కష్టము. విడిగా చూచినచో ప్రాణము వ్యష్టి రూపము గలది. జగత్ప్రాణమును హిరణ్యగర్భ మందురు. దానినే సమిష్టి ప్రాణమని కూడ చెప్పెదరు. ఒకే నిప్పు పుల్లను వ్యష్టి యందురు; నిప్పుపెట్టెను అంతనూ సమిష్టి యందురు. ఇదేరీతిని ఒక మామిడికాయను వ్యష్టి యనియు, మామిడికాపున ంతటిని, సమిష్టియనియు అందురు. శరీరమునకు గల శక్తియే ప్రాణము. ఊపిరితిత్తుల యొక్క చలనమును లేక శ్వాస ప్రశ్వాసేంద్రియములను వశపరచుకొనుటవల్ల, లోపల ప్రసరించుచున్న ప్రాణ శక్తి వశపడును. ప్రాణము వశపడుటచే మనస్సులోబడును. ప్రాణము మనస్సు, పక్షి, తాడులాటివి. త్రాటితో కట్టి వేయబడిన పక్షి తప్పించుకుపోవలెనని యిటు అటు ఎగిరి చివరకు తప్పనిసరిగా, తాను కట్టివేయబడిన చోటునకే తిరిగివచ్చి ఏవిధముగా విశ్రమించునో, అదేవిధముగ ఈమనస్సు అనెడి పక్షి అనేకవిధములగు యింద్రియవిషయములకై పరుగులిడి, ఎందునను సుఖము
గానక, చివరకు రాత్రి సమయమున తన విశ్రాంతి స్థానమగు ప్రాణమును చేరుచున్నది.
స్వామి శివానంద
(సశేషం)

ప్రాణాయామము
(గీత ప్రకారము)
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపాన: తథాపరే
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామ పరాయణా:
(గీత 42వ శ్లో కం)
ప్రాణాయామము ఒక పవిత్రమైన యజ్ఞము. కొందరు పూరక కుంభకమును (ప్రాణవాయువుతో నింపుట), కొందరు రేచక కుంభకమును (గాలిని పూర్తిగా బయటకు విడచి కుంభించుట), కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటిని ఆపుజేసి కుంభించుటను చేతురు. వీటినే పూర్ణకుంభకము, శూన్య కుంభకము, కేవలకుంభకము అందురు.
ప్రాణాయామము
(శంకరుని ప్రకారము)
"మనస్సువలె సమస్తమును బ్రహ్మమేయనియు, ఈ జగత్తు అంతయు శూన్యమే అనియు గుర్తించుట రూపముగా, సమస్త ప్రాణశక్తులను వశపరుచుకొనుటయే ప్రాణాయామము"
"బయటకు విడచుగాలి జగత్తుయొక్క అభావమును సూచించును. లోపలికి పీల్చుగాలి నేను బ్రహ్మను అను భావమును సూచించును.
"ఆ పిమ్మట చేయు శ్వాసావరోధము నేను బ్రహ్మను అను భావమును ధృవపరచును. బుద్ధిమంతుడగువాడు ప్రాణాయామమును యీ విధముగా తెలసికొనును. ఇటుల తెలిసి కొనని వాడు మూర్ఖుడు."
(అపరోక్షాను భూతి 118 - 120)
ప్రాణాయామము :
(యోగి భుశుండుని ప్రకారము)
భుశుండుడను యోగి వశిష్ఠునకు యీరీతిని చెప్పెను:- పంచభూతములచే చేయబడిన యీదృశ్య శరీరములోగల హృదయ పద్మములో - ప్రాణము, అపానము అను రెండువాయు వులు గలవు. ఈ రెండు వాయువులు అల్పస్థాయి హెచ్చుస్థాయిలలో పైకి క్రిందికి వీచుచుండును. ఇవి రెండూ మెలకువ యందును, స్వప్నావస్థయందును, స్వప్న రహితమగు నిద్రావస్థయందును ఒకే స్వభావము కలిగి యుండి అంతటను వ్యాపించి యుండును. ఈ వాయువులు రెండింటి సంచారము ననుసరించి నేను నడచుకొనుచూ వాసనల నన్నింటిని నాశన మొనర్చుకొనిన వాడనై, స్వప్నరహిత నిద్రావస్థలో ఏ విధముగ ప్రశాంతుడనై వుందునో, అదే రీతిని జాగ్రదావస్థ యందుకూడ ఏ విధమగు వికారములు లేనివాడనై యున్నాను. ఒక తామర తొడిమను తీసికొనుము. దానిని వెయ్యి భాగములు చేయుము. దానిలో అనగా అంత సూక్ష్మభాగములోకూడ ఈ రెండు వాయువులు అంతకంటె సూక్ష్మరూపములో వుండును. కావున ఇట్టి సూక్ష్మాతి సూక్ష్మముగా వుండు యీ వాయువుల యొక్క తత్వమును గాని. వాటి ప్రవాహములను గు
రించి గాని తెలిసికొనుట చాల కష్టము. వీటిలో ప్రాణము ఎల్లప్పుడు పైవైపునకు (బయటగాని, లోపలగాని) ప్రవహించు చుండును; అపానము శరీరమునకు బయటను లోపలను క్రిందివైపుకు పోవుచుండును. ఇది వీటి సహజలక్షణము. ప్రాణవాయువు సాధారణముగ 16 అంగుళముల పొడవు బయటకువిడచి, పండ్రెండు అంగుళముల పొడవువరకు లోపలకు పీల్చెదరు. అందుకు మారుగా 16 అంగుళముల గాలిని విడచి, మరల 16 అంగుళముల గాలిని పీల్చు చుండవలెను. ఇది లాభకారి. ఉచ్ఛ్వాసనిశ్వాసల ప్రమాణమును సమాన మొనర్చుకొన గలిగినవాడు బ్రహ్మానందమును అనుభవించగలడు.

ప్రాణాయామ ప్రకరణం
-- 3 ---
(శ్వాసావరోధము)
ఆసన సిద్ధిని పొందుట లేక శరీరమును వశపరుచుకొనుట అనునది మొట్టమొదటి ముఖ్యవిషయము. ఆ తరువాత ప్రాణాయామమును అభ్యసించవలెను. ప్రాణాయామ సాధనలో విజయము, పొంద గోరుచో సరియగు ఆసనమున కూర్చొన గలుగుట ఆవశ్యకము. సులభముగను సుఖముగను కూర్చొను ఏ పద్ధతినైన ఆసనము అనవచ్చును. ఇట్టి వాటిలో చాలసేపటి వరకు ఏవిధమగు బాధయు లేకుండ కూర్చొన గలుగు ఆసనము శ్రేష్ఠమైనది. ఱొమ్ము, మెడ, తల, ఇవి నిలువుగా వంకర లేకుండ గీసిన గీతవలె వుండవలెను. శరీరము ఏమాత్రము వెనుక ముందులకు గాని, ప్రక్కలకు గాని వాలి వుండరాదు. వంగి కూర్చొనరాదు. ముడుచుకొని వుండరాదు. ఈ విధముగ కూర్చొనుటను అనేకమారులు అభ్యసించినచో ఆసన సిద్ధి వచ్చును. బొద్దు(లావు)గా వున్నవారికి పద్మాసనము కష్టముగా తోచవచ్చును. అట్టివారు 'సుఖ' లేక 'సిద్ధాసనము'లో కూర్చొనవచ్చును. ఆసన సిద్ధి లభించునంతవరకు ప్రాణాయామము చేయకుండ వుండనక్కరలేదు. ఆసనము, ప్రాణాయామము రెండింటిని ఒక దానితో పాటు మరొకదానిని అభ్యసించవచ్చును. కొంతకాలమునకు రెండింటియందును నీకు పూర్ణత్వము ప్రాప్తించును. కుర్చీలో నిలువుగా కూర్చొనికూడ ప్రాణాయామమును చేయవచ్చును.
భగవద్గీతలో ఈ ఆసనమును గురించి చక్కగా వివరింపబడినది:-
పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశములో, మిక్కిలి ఎత్తును మిక్కిలి పల్లమునుగాని పీటమీద దర్భాసనమువేసి, దానిపైన పులి లేక జింక చర్మమును, (ప్రాచీన శాస్త్రాలననుసరించి), దానిపైన గుడ్డనువేసి, దానిపై కూర్చొని చిత్తమును ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రమగు మనస్సుతో అంత:కరణ శుద్దికొరకు యోగాభ్యాసమును చేయవలెను. అప్పుడు శరీరమును, శిరస్సును, కంఠమును స్థిరముగా నిలిపి, కదలక, దిక్కులు చూడక, నాసికాగ్రమును జూచుచూ వుండవలెను.
(6 అ. 10, 11, 12 శ్లో.)
ప్రాణాయామము అనగా ప్రాణమును, శరీరమందలి ప్రాణ శక్తులను వశపరచుకొనుట. శ్వాసను క్రమబద్ధ మొనర్చుట. ఇది చాల ముఖ్యమగు మెట్టు. ప్రాణాయామముచే శ్వాసను వశపరచుకొనవచ్చును. అందువలన ప్రాణశక్తి కంపనములు, సాధనకు వశపడును. శ్వాస అనునది స్థూల ప్రాణముయొక్క బాహ్యరూపము. ప్రాణాయామము చేయుటచే, సరియగు రీతిని గాలిని పీల్చుట విడచుటను నేర్చుకొనవలెను. ఇటుల చేయని వారి శ్వాసోచ్చ్వాసలు సరియగు రీతిని వుండవు.
ప్రాణమును వశపరుచుకొన గలిగినవాడు సృష్టియందలి మానసిక శారీరక శక్తులను అన్నింటిని వశపరుచు కొనగలడు. ఇతనికి సృష్టిలో వశము కాని విద్యుచ్ఛక్తి మొ. నవి కూడ పదార్థము ఏదియు లేదు.
ప్రాణమును లోబరుచు కొనుటచే మనస్సులోబడును. మనస్సు లోబడుటవలన శ్వాస లోబడును మనస్సును ప్రాణమును వశపరుచు కొనుటవలన జనన మరణ చక్రమునుండి విడిపింప బడినవాడై అమరత్వమును పొందును. మనస్సు, ప్రాణము. వీర్యములకు చాల దగ్గరి సంబంధము గలదు. ఇందులో ఏ ఒక్కటి వశపడినప్పటికి తక్కినవి కూడ వశపడును. ప్రాణాయామ సాధనచే ఆకలి, జీర్ణశక్తి, ఆనందము, బలము, ధైర్యము, ఉత్సాహము, చక్కని ఆరోగ్యము, పుష్టి, శక్తి, ఏకాగ్రతలు లభించును.
యోగి యగువాడు తన ఆయువును సంవత్సరములతో లెక్కించడు; అతని శ్వాసతో లెక్కించును. ఈ బాహ్య ప్రకృతినుండి నీవు పీల్చుగాలితో కొంతశక్తిని తీసికొందువు. దీర్ఘముగా గాలిని బయటకు విడచిన పిదప మరల అంత దీర్ఘముగా గాలినిపీల్చుటయే, మనుజుడు బాహ్యప్రకృతినుండి శక్తి కొలది తీసికొన గలిగిన ప్రాణశక్తియొక్క అత్యధి
[07:34, 24/04/2020] +91 7013 527 083: క ప్రమాణము. నిమిషమునకు 15 మారులు మనుష్యుడు శ్వాసించును. ఆ ప్రకారము రోజుకు 21,600 మార్లు శ్వాసించుచున్నాడు.
స్వామి శివానంద
[07:37, 24/04/2020] +91 90009 72611: 🙏🙏🙏

ప్రాణాయమ ప్రకరణం - 4
"బాహ్యాభ్యంతర స్తంభవృత్తి: దేశకాల సంఖ్యాభి: పరిదృష్టో దీర్ఘాత్ సూక్ష్మాత్"
(యోగసూత్రం - 2 అధ్యాయం 50 వ సూత్రం.)
ప్రాణాయామము దీర్ఘముగాని సూక్ష్మముగాని మూడు అంగములు గలదిగా వున్నది. 1. బాహ్యము 2. ఆంతరికము 3. స్థంభము, అని. స్థలము, కాలము, సంఖ్యలపై ఇది ఆధారపడియున్నది.
గాలిని బయటకు విడచుటను రేచకము అందురు. ఇది మొదటి ప్రాణాయామము. గాలిని లోపలికి పీల్చుట రెండవది. గాలిని విడువకను, పీల్చకను లోపల ఆపుచేసి వుంచుట (కుంభకము). మూడవది కుంభకము. ఆయు:ప్రమాణమును పెంచును. అంతరిక ఆధ్యాత్మిక శక్తులను, బలమును, శక్తిని, పుష్టిని పెంపొందింపజేయును. నీవు ఒక నిమిషముసేపు వాయువును కుంభించ గలిగినచో, నీ ఆయువును ఒక నిమిషము అధికము చేసి కొంటివని అర్థము. యోగులగు వారు ఈ వాయువును తల యొక్క ఉపరిభాగమున గల, బ్రహ్మరంధ్రము వద్దకు తీసికొని పోయి, యముని ఓడించి మరణమును లేకుండ చేసికొందురు. కుంభకమును అభ్యసించుటవల్ల చాంగదేవుడు 14 వందల సంవత్సరములు జీవించెను. ఈ త్రివిధ ప్రాణాయామములు (రేచక, పూరక, కుంభకములు) స్థల, కాల, సంఖ్యా భేదములపై ఆధారపడివున్నవి. స్థలము అనగా, శరీరమునకు బయట, లోపల అనియు, శ్వాసయొక్క పరిమాణము అనియు, ఒకానొకస్థలమున (శరీరములో) ఆపుజేయబడిన ప్రాణము అనియు అర్థము. గాలిని బయటకు విడచు పరిమాణము, ఒక్కొక్క వ్యక్తియందు ఒక్కొక్క విధముగవుండును. అ దేరీతిని, లోపలికిపీల్చు గాలికూడ ఆ సమయమున వుండు ప్రధాన తత్త్వము ననుసరించికూడ ఈశ్వాస యొక్క పరిమాణము మారుచుండును. పృథ్వి, అప్, తేజ, వాయు ఆకాశతత్వములలో శ్వాస వరుసగ 12, 16, 4, 8, 0 ల వ్రేలి అడ్డపుపొడవుల పరిమాణము కలిగివుండును. బయటకు విడచునప్పుడు బయటను, లోపలికి పీల్చునప్పుడు లోపలను ఈ ప్రకారము మరలకూడ అదేవిధముగ వుండును.
కాల పరిమాణమును 'మాత్ర' యను కాలపరిమితిచే లెక్కించెదరు. ఈ 'మాత్ర' యను కాలపరిమితి ఒకసెకండుకు సమానముగవుండును. 'మాత్ర' యను మాటకు కొలత అని అర్థము. ఒకస్థలమున ఎంతవరకు ప్రాణమును ఏకాగ్రముగ నిలిపెదమో, ఆ కాలపరిమితినికూడ 'మాత్ర' యని వాడెదరు.
'సంఖ్య' యన ప్రాణాయామమును ఎన్నిమారులు చేయుదుమో లెక్కించుట. యోగసాధకులు ఒక్కొక్క పర్యాయము 80 ప్రాణాయామములు చేయగలుగు నంతవరకు క్రమక్రమ ముగ అభ్యసించవలెను. రోజుకు నాల్గు పర్యాయములు అన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 9 గంటలకు లేక అర్థరాత్రివేళయందు ప్రాణాయామమును చేయుచుండవలెను. ఇటుల చేయుటచే రోజుకు 320 ప్రాణాయామములు చేసినట్లగును. ప్రాణాయామమువల్ల కలుగు ఫలము, నిద్రించుచున్న కుండలినీశక్తి మేల్కొనుటయే. ప్రాణాయామము యొక్క ప్రధానాశయము, ప్రాణమును అపానముతో ఐక్య పరచి, ఇటుల ఐక్యమైన ప్రాణాపానములను మెల్లమెల్లగా తల వైపుకు పంపుటయే.
సమస్త విధములగు గుప్తమహిమలు, కుండలినీశక్తివల్లనే లభించును. అభ్యసించు కాలము ననుసరించి, దీర్ఘము, హ్రస్వము అని ప్రాణాయామము రెండు విధములు. కాలియున్న పెనముపై నీటిబొట్టు వేసినచో అటుయిటు చిటపట మనుచు ఎగిరి పొవును గదా! అదేరీతిని గాలి కూడ అటుయిటు సంచరించు చుండ (స్వేచ్ఛగ) గాలిని కుంభకమువల్ల, దాని యిచ్ఛవచ్చిన రీతిని పోకుండులాగున చేసినచో, అది లోపలనే ఆగిపోవును.
వాచస్పతి దీనిని గురించి యీరీతిని వర్ణించెను:- "36 మాత్రల పరిమాణముగల మొదటి ప్రయత్నమును సాధారణమనియు, దీనికి రెట్టింపు పరిమాణముగల రెండవ ప్రయత్నమును మధ్యమము అనిన్నీ, దీనికి మూడురెట్లు పరిమాణము గల మూడవ ప్రయత్నమును తీవ్రమనిన్నీ - యీ రీతిని ప్రాణాయామమును సంఖ్యచే గణించెదరు.
బయటకు విడచు గాలి యొక్క దూరము (స్థలము) ముక్కు పుటమునకు పండ్రెండు అందుళములు వుండును. దీనిని ఒక దూదిపింజ లేక రెల్లుగడ్డి సహాయముచే కనుగొన వచ్చును. లోపలికి పీల్చుగాలి యొక్క దూరము (స్థలము) తలనుండి అరకాలి వరకు వుండును. దీనిని చీమలాటి జీవిని తాకుటచే కలుగు స్పర్శ జ్ఞానమువల్ల తెలసి కొన వచ్చును. శ్వాస ప్రశ్వాసల బాహ్యాభ్యంతర దూరములను అనుసరించి, కుంభకము యొక్క దూరము [స్థలము] వుండును. ఏలనన, ఈ శ్వాసపై రెండుస్థలములందును ఆగ గలిగియున్నది. ఇది దానిధర్మము. పైన సూచించిన రెండునూ లేకుండ పోయి నప్పుడు దీనిని గురించి తెలిసి కొన గలము.
కాలము, స్థలము, సంఖ్య - అను మూడు రకములగు ప్రాణాయామ విధానములు ఐచ్చికములు మాత్రమే, అనేక స్మృతులు ఈ మూడిటికిని ప్రాధాన్యతను యివ్వక, కాలమునకు మాత్రమే ప్రాధాన్యమును ఇచ్చినవి. అందు వలన వీటిని గురించి ఎక్కువ బాధ పడనక్కర లేదు.
నాల్గవది శ్వాసను బంధించుట, (బయటగాని, లోపల గాని):-
"బాహ్యాభ్యంతర - నిశ్యక్షేపి - చతుర్థ:
యోగసూత్రం - 2 అధ్యాయం.
యోగసూత్రములలో 50 వ సూత్రములో చెప్పబడిన మూడవ మాదిరి ప్రాణాయామము, మొదటి ఉద్ఘటావస్థ ప్రాప్తించు నంతవరకే చేతురు. ఆ తరువాత ఈ నాల్గవ మాదిరి ప్రాణాయామమును చేయవలెను. ఈ స్థితిలో సాధకుడు తన ప్రాణము శరీరమున గల అనేక చక్రములపై ధారణ చేయునటుల క్రమ క్రమముగ అభ్యసించి, చివరకు తలలో గల సహస్రారముపై ధారణ చేయునటుల చేయును. అతనికి పూర్ణ సమాధి సహస్రారములో సిద్థించును. ఇది ఆంతరిక విధానము. ఇక బాహ్యవిధానము; ఏ తత్త్వమున ప్రాణ వాయువు ఎంతదూరమువరకు పోవునో అంతదూరమున ధారణ చేయవలెను. ఈ రీతిని అంతరికముగను, బాహ్యముగను ప్రాణ ధారణ చేయవచ్చును.
క్రమముగ మొదటి మూడు విధములగు ప్రాణాయామములను చక్కగా అభ్యసించి, విజయప్రాప్తి పొందిన పిమ్మట నాల్గవమాదిరి ప్రాణాయామము సహజముగ అలవడును. మూడవ రకపు ప్రాణాయామములో పరిమాణమును గురించి ఎక్కువ శ్రద్ధవహించ నక్కరలేదు. ఈ స్థితిలో మొట్టమొదటి సారిగనే శ్వాసావరోధము చేయగలుగును; అప్పుడు స్థల కాల సంఖ్యలను దీర్ఘ సూక్ష్మ భేదములచే లెక్కించెదరు. కాని, నాల్గవ రకపు ప్రాణాయామములో శ్వాస ప్రశ్వాసలయొక్క పరిమితులు నిశ్చితమై వున్నప్పటికీ, భిన్నభిన్న దశలలో ఒక్కొక్కటిగ క్రమప్రకారము జయమును సంపాదించుకొనుచు రావలెను. అంతేగాని, మూడవరకపు ప్రాణాయామములో వలె మొదటి ప్రయత్నములోనే అన్నిదశలయందు జయప్రాప్తి కలుగదు. అటుల అభ్యసించుట కూడ అపాయకారియే, అదిన్నీగాక, ఒక మెట్టుతరువాత మరొకమెట్టుగా ఎక్కుటకుగల కారణము మరొకటి గలదు. అదేదనగా, యితనికి ఒక్కొక్క చోట ధారణ చేయుటచే ఒక్కొక్కరకపు సిద్ధి లభించును. కావున ఒక్కొక్క దశ సిద్ధించిన పిదప, మరొక దశ సిద్ధించుటకై సాధన చేయ వలెను.
ఇక మూడవ నాల్గవ రకపు ప్రాణాయామములో గల భేదమేదనగా, మూడవ రకపు ప్రాణాయామములో స్థల, కాల, సంఖ్యాగణనలేదు. అంతేగాక, ఒకేవిధపు ప్రయత్నముతోనే అది సిద్ధించును. కాని, నాల్గవ దానిలో స్థల, కాల, సంఖ్యా గణన వుండుటయేగాక, ఒకదాని తరువాత ఒకటిగా ప్రతిదశ
యందును సిద్ధి పొందుచూ రావలెను. ఇందువల్ల భిన్నభిన్న మహిమలు లభించును. (సశేషము)

Comments
Post a Comment