శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 517వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం అంకుశాది ప్రహరణాయై నమః🌹🙏🙏🙏అంకుశము మొదలైన నాలుగు ఆయుధములను నాలుగు చేతులలో ధరించి ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలతా త్రిపురసుందరీ నామావళి యందలి అంకుశాది ప్రహరణా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం అంకుశాది ప్రహరణాయై నమః అని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులు అజ్ఞాన నివృత్తిగలిగి, బ్రహ్మజ్ఞాన సంపన్నులై, అమ్మనామ తత్త్వవిచారణయందు విశేషమైన అవగాహననంది, ఆ తల్లి పాదసేవయందే జీవించి తరించుదురు🌻🌻🌻 మూలాధార చక్రాధిష్ఠాన దేవతయైన సిద్ధవిద్యా స్వరూపిణియై నాలుగు చేతులయందు అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్రతో విరాజిల్లుతూ అంకుశాది ప్రహరణా యను నామ ప్రసిద్దయై విరాజిల్లుతున్నది ఆ పరాత్పరి. దేవికి నమస్కరించునపుడు ఓం అంకుశాది ప్రహరణాయై నమః అని అనవలెను
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*🌹🌹🌹 *518వ నామమంత్రము*🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 *ఓం వరదాది నిషేవితాయై నమః*🙏🙏🙏 *వరద* మొదలైన నాలుగు శక్తులచే సేవింపబడుతూ ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹నాలుగు దళాలు కలిగిన మూలాధార పద్మమునందు ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత చొప్పున నలుగురు దేవతా శక్తులచే జగన్మాత *సాకినీ* రూపంలో సేవింపబడుచున్నది🌻🌻🌻శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని *వరదాదినిషేవతా* అను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం వరదాది నిషేవితాయై నమః* అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరాశక్తిని ఉపాసించు భక్తులకు సకలవేద శాస్త్రసారమైన ముక్తిస్వరూపిణి ధ్యాననిమగ్నులై యుండు తరుణంలో కనుల ముందు సాక్షాత్కరించిన భావం కలుగుతుంది, ఆ దివ్యస్వరూప దర్శనంతో జన్మ తరించిన వారగుదురు🌺🌺🌺మూలాధార మునందు వశించు సిద్ధవిద్యా దేవత చుట్టూ *వ, శ, ష, స* అక్షరములకు సంబంధించిన *వరద, శ్రియ, షండా, సరస్వతి* అను నల్గురు పరివేష్టితులై శ్రీమాతను సేవించుచున్నారు🌸🌸🌸కావున *ఓం వరదాదినషేవితాయై నమః* అని ఉచ్చరిస్తూ నమస్కరించవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 522వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం శుక్లవర్ణాయై నమః🙏🙏🙏తెల్లని రంగులో ప్రకాశించు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్రనామావళిలోని శుక్లవర్ణా యను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం శుక్లవర్ణాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరాత్పరిని సేవించు భక్తులకు అభీష్టములు సిద్ధించును🌻🌻🌻శ్రీమాత (సిద్ధమాత), ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత తెల్లని కాంతి కలిగియున్నది; ఆజ్ఞాచక్రం వద్ద మిగతా క్రింది చక్రాలకు కావలసిన నియంత్రణ బీజాలు ఉండును; ఆజ్ఞాచక్రం సంపూర్ణముగా జ్ఞాన సంబంధమైనది; త్రికాలజ్ఞాన ఈ చక్రాధిష్ఠాన దేవతచే పొందవచ్చును🌺🌺🌺 అమ్మవారకి నమస్కరించునపుడు ఓం శుక్లవర్ణాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 523వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం షడాననాయై నమః🙏🙏🙏ఆరుముఖములతో ఉండు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా త్రిపురసుందరీ సహస్రనామావళిలోని షడాననా అను నాలుగక్షరముల (చతురక్షరి) నామ మంత్రమును ఓం షడాననాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు భక్తులకు అమ్మ కరుణతో ఐశ్వర్యాది సర్వ విభూతియుతులు అగుదురు; శాశ్వత బ్రహ్మానందభరితులై, దేవీ తత్త్వము వారి వదనంలో ప్రదర్శితమై, తాము తరించుచూ, ఇతరులనుకూడా తరింపజేయుదురు🌻🌻🌻 శ్రీదేవి ఆరు ముఖములు కలది; సిద్ధమాతా స్వరూపిణియై, శ్రీచక్రాధిష్ఠానదేవతయై, షడాననగా భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మ; ఆరు వర్ణములు గలదని భావించవలయును; కుమారస్వామి (శ్రీమాత తనయుని) ఆరుముఖములనూ, ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత సిద్ధమాత ఆరుముఖములతో సమన్వయించవలయును🌺🌺🌺గర్భస్థ శిశువునకు ఆజ్ఞా చక్రసంఖ్య ఆరు అనబడే ఆరుమాసములు వచ్చేసరికి పంచేంద్రియాలతో బాటు మనస్సుకూడా ఏర్పడుతుంది🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 526వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం హరిద్రాన్నైక రసికాయై నమః🙏🙏🙏పసుపుతో కూడిన అన్నము మక్కువ కలిగిన తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్రనామావళి యందలి హరిద్రాన్నైకరసికా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం హరిద్రాన్నైక రసికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగజ్జననిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులను ఆ తల్లి కరుణించి వారిని అష్టైశ్వర్యములతో,సుఖసంతోషాలతో, బ్రహ్మజ్ఞాన సంపన్నతతో విలసిల్లేలాచేసి, ఆతల్లి పదసేవా తత్పరులై తరింపజేయును🌻🌻🌻హరిద్రాన్నము అనగా పెసరపప్పు, బియ్యము కలిపి వండిన పులగము, పులిహోర వంటి పసుపుతో కూడిన అన్నము అనిన అత్యంత ప్రీతిగలిగినది ఆ సర్వేశ్వరి; సిద్ధమాతయైన ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతకు హరిద్రాన్నమనిన చాలా ఇష్టము మరీచీ రజనీ చూర్ణైః జీరకాద్యైశ్చ సంయుతం| ఆజ్యై సంప్లుతహవిర్హరిద్రాన్న మతీరితమ్ 🌺🌺🌺 అనగా మిరియాలు పసుపు చూర్ణం తో జీలకర్ర మొదలైనవి నేతితో కలిపిన హరిద్రాన్నము హవిస్సుగా చెప్పబడినది🌻🌻🌻అన్నప్రాశన అయిన శిశువు పాలు, నేతి అన్నం, తీపి అన్నం, పెరుగన్నం, పప్పు అన్నం తర్వాత పసుపుతోకూడిన పచ్చని అన్నం రుచికి అలవాటు పడతారు🌸🌸🌸పసుపుకలిపిన అన్నము అనిన ప్రీతి గనుక ఆ తల్లి హరిద్రాన్నైక రసికా అని నామప్రసిద్ధమైనది🙏🙏🙏అమ్మవారికి నమస్కరించు నపుడు ఓం హరిద్రాన్నైక రసికాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🌻🌻
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 527వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం హాకినీ రూపధారిణ్యై నమః🙏🙏🙏ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత అయిన హాకినీ రూపంలో దర్శనమిచ్చే తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్రనామావళియందలి ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) హాకినీరూపధారిణీ యను నామ మంత్రమును ఓం శ్రీ హాకినీ రూపధారిణ్యై నమః అని ఉచ్చరిస్తూ ఆ జగజ్జననిని ఉపాసించు ఉపాసకులకు జగత్తంతయు ఆ పరమేశ్వరి ఆజ్ఞకు లోబడినదనియు, ఆ తల్లి నామ మంత్ర ఉచ్చారణమే బ్రహ్మజ్ఞానపదమునకు మార్గమని గ్రహించి ఆ పరాశక్తిని ధ్యానించి విశేషమైన బ్రహ్మజ్ఞాన సంపదలను పొంది తరించుదురు🌻🌻🌻ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతయగు సిద్ధమాత, హాకినీ రూపధారణియై విరాజిల్లుచున్నది🌺🌺🌺అటువంటి హాకినీ రూపధారిణియైన శ్రీమాతకు నమస్కారములు🌸🌸🌸శ్రీచక్రాధిష్ఠాన దేవతకు అనుగుణమైన బీజ, కీలక, న్యాస మంత్రములన్ని హ యగునని గమనించగలమని ఇంతకు ముందు చెప్పుకున్న ఆజ్ఞాచక్రాబ్జనిలయా అను నామ మంత్రమునుండి హాకినీరూపధారిణీ అను ఈ నామ మంత్రమువరకు వర్ణింపబడినది🌻🌻🌻
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 530వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం సర్వాయుధ ధరాయై నమః🙏🙏🙏అన్ని రకములైన ఆయుధములను ధరించి ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్రనామావళిలోని సర్యాయుధధరా అను ఆరుఅక్షరముల (షష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వాయుధ ధరాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకులకు ఆ పరమేశ్వరి మహిషాసురాది దుష్టరాక్షులనే గాక అంతకన్నా భయంకరమైన మనిషిలోని అంతర్గతశత్రువులైన (అరిషడ్వర్గములు -కామ, క్రోధ, లోభ, మోహ,మద, మాత్సర్యములు) నశింపజేసి బ్రహ్మపదమును చూపించి, బ్రహ్మజ్ఞాన సంపన్నులను జేసి తరింపజేయుటకు సర్వాయుధములను ధరించి యున్న ఆ శక్తి రూపిణి అయిన జగజ్జనని వచ్చి కనులముందు దర్శనమయిన భావముకలుగును🌻🌻🌻అరిషడ్వర్గాలు అంటే, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గములే; ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం🌺🌺🌺 1.కామము – కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము; 2. క్రోధము – క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము; 3. లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించు కున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెంద గూడదని దానములు, ధర్మ కార్యములు చేయకపోవడము; 4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము; 5. మదము – మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము; 6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము; అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం పరమేశ్వరి అనుగ్రహించు సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ జగజ్జనని అనుగ్రహం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి🌹🌹🌹అన్ని ఆయుధములను ధరించియుండునది ఆ యశస్వినీ రూపధారిణియైన జగజ్జనని కమలాధిష్ఠాన దేవత అన్ని రకములైన ఆయుధములు వేయి చేతులందు ధరించి ఉంటుంది🌻🌻🌻 సహస్రాణి సహస్రధా బాహ్వోస్తవ హేతయః (రుద్రనమకం)🌹🌹🌹 ఈ మంత్రాన్ని సమన్వయ పరచుకుంటే యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని హస్తములుంటాయి🌹🌹🌹ఆ హస్తములలో అనేక రకములైన అస్త్రములు ధరిస్తుంది అని భావించవలయును🌻🌻🌻అమ్మవారికి నమస్కరించు నపుడు ఓం సర్వాయుధ ధరాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🕉🕉🕉నేడు సోమ వారము🌻🌻🌻ఇందు వారము అని కూడా అంటాము🔱🔱🔱నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము🙏🙏🙏 ఓం నమశ్శివాయ అనే ఈ ప పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🌺🌻🌹🌻🌸 🙏🙏🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 531వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం శుక్ల సంస్థితాయై నమః🙏🙏🙏శుక్ల ధాతువునందు అధిష్ఠాన దేవతగా ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీ లలితా సహస్రనామావళి యందలి శుక్ల సంస్థితా అను ఐదు అక్షరముల (పంచాక్షరి) నామ మంత్రముసు ఓం శుక్ల సంస్థితాయై నమః అని ఉచ్చరిస్తూ ఆ పరమేశ్వరిని అచంచలమైన భక్తివిశ్వాసములతో ఆరాధించు భక్తులు ఆ జగజ్జనని కరుణతో మాయా విలాసంలో చిక్కుకొనక, బ్రహ్మజ్ఞాన పదమునందు ముందుకు సాగి శాశ్వత బ్రహ్మానందమునంది తరించుదురు🌻🌻🌻శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండు యశస్వినియను సహస్రార కమలాధిష్ఠాన దేవతా స్వరూపిణియై పరమేశ్వరి తేజరిల్లు చున్నది🌺🌺🌺శుక్లం అనునది జీవియొక్క సారము, అందుకే దీని సారాంశము సప్తధాతువులలో ఆఖరున తెలుపడమైనది🌸🌸🌸అన్నిటి కంటే విలువైన ధాతువు, దీనికంటే విలువైన ధాతువు, దీనిని మించినది వేరొకటి లేదని తెలియవలయును; ఈ శుక్లధాతువు సర్వ శరీరమున వ్యాపించియుండు ఓజస్సు అను ధాతువునకు అధిష్ఠానముగా ఉన్నది🌹🌹🌹ఈ శుక్ల బిండువులో రాబోయే జీవియొక్క అన్ని లక్షణాలు, రూప, గుణ విశేషములు సూక్ష్మరూపముగా దీనిలోనే ఇమిడి ఉంటాయి🌻🌻🌻కావున సర్వవర్ణోపశోభితా అనే నామము యొక్క లక్షణాలన్నీ శుక్లసంస్థితా అనబడే నామం ధ్రువ పరుస్తుంది🌺🌺🌺శుక్ల శబ్దము వలన కలుగు వివరాలు శోణిత పదమునకు కూడ వర్తిస్తుందని భావించవలయును🌻🌻🌻ఆ జగదాంబకు నమస్కరించునపుడు ఓం శుక్ల సంస్థితాయై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏🕉🕉🕉🕉ఈ రోజు మంగళవారము🌻🌻🌻మంగళవారమునకు అధిపతి అంగారకుడు అనగా భౌముడు గాన నేడు భౌమవారము అని కూడా అంటాము🌹🌹🌹పవనసుతుని ఆరాధించు శుభదినము🚩🚩🚩గులాబీ నేటి పుష్పము🌸🌸🌸సిందూర వర్ణము శుభప్రదం🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 532వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం సర్వతోముఖ్యై నమః🙏🙏🙏అన్నివైపుల ముఖములు కలిగి, అన్ని దిక్కులను చూచునదైన పరమేశ్వరికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వతోముఖీ అను ఐదక్షరముల (పంచాక్షరి) నామ మంత్రమును ఓం సర్వతో ముఖ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాత్పరిని అచంచలమైన భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి దయతో అజ్ఞాన నివృత్తియు తద్ద్వారా ఆత్మనుభూతియు కలిగి తరించుదురు🌻🌻🌻 అన్ని వైఫులా, అంతటా అనంతములైన తన ముఖములతో నిండి విరాజిల్లు అఖిలాండేశ్వరికి నమస్కారము🌺🌺🌺 సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్ అన్నది శృతి వాక్యము🌸🌸🌸సహస్రార పద్మమునందలి దళముల యందు అధివసించు అమృథాది పరివార దేవతలు మరియు విశ్వమునందు అనంత జీవరాసులును తానేయగుటచేత, ఆ పరాశక్తి సర్వతోముఖీ అను నామముతో ప్రసిద్ధినంది యున్నది🌹🌹🌹జగత్తులోని సర్వప్రాణుల ముఖములు జగన్మాత ముఖములుగాను, అన్ని ప్రాణుల కన్నులు, పాదాలు, చేతులు, శిరస్సులు, ముఖములు అన్నియు అమ్మవిగానే సమన్వయం చేసుకొనే భావములో అమ్మను దర్శించాలి🌻🌻🌻ప్రపంచములోని అనంత జీవరాసులు శ్రీమాత రూపమనే భావించవలెను🌺🌺🌺గర్భస్థమగా పిండమునందు ఏడవ మాసమున జీవుడు పిండములోనికి ప్రవేశిస్తాడు🌸🌸🌸గృహ యజమాని ఇల్లు నిర్మాణము అయిన పిదప గృహప్రవేశం చేసినట్లు ఈ స్థితియందు గర్భస్థ పిండములోనికి జీవుని ప్రవేశము కలుగుతుంది🌹🌹🌹సర్వ జ్ఞాన సముపార్జనకు అక్కరకు వచ్చే బీజములన్నియు మానవునికి (జీవునికి) లభించుతాయి🌻🌻🌻మరి ఇట్టి అవకాశము మరే జన్మకు లభించదు🌺🌺🌺పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం సర్వతోముఖ్యై నమః అని అనవలెను🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🙏🙏నేడు బుధ (సౌమ్య) వారము🔱🔱🔱బుధ (సౌమ్య) వారమునకు అధిపతి బుధుడు🌻🌻🌻ఈ రోజు గణపతిని, షణ్మఖుని ఆరాధించుదుము🌹🌹🌹ఆధ్యాత్మికంగా శ్రీమహా విష్ణువుకు ఈ రోజు చాలా ప్రీతికరము🌸🌸🌸ఓం గం గణపతయే నమః🚩🚩🚩ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిప్రచోదయాత్🕉🕉🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి 7702090319🕉🕉🕉🕉
శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 533వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః🙏🙏🙏అన్ని రకముల అన్నముపై ప్రీతిని కలగియున్న తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వౌదన ప్రీత చిత్తా అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం సర్వౌదన ప్రీత చిత్తాయై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పరాశక్తిని అర్చించు భక్తులకు ఆ తల్లి కరుణచే అన్నవస్త్రములకు లోటులేక, సకల ఐశ్వర్య సంపన్నతతో, బ్రహ్మజ్ఞాన సంపదతో విలసిల్లుతూ, అచంచలమైన ఆ తల్లియొక్క పాదసేవనాతత్పరతతో తరింపజేయును🌻🌻🌻యశస్వినియగు సహస్రార కమలాధిష్ఠాన దేవత అన్నిరకముల ఆహారములు ప్రీతిగా స్వీకరించును; అన్నము పరబ్రహ్మ స్వరూపము యగుటచే తాను భోక్త యొక్క స్వరూపముగా ఉండును; ఆహారము జీవుని శరీరాభివృద్ధికి తోడ్పడుచున్నది; కావున అన్నం న నింద్యా, అన్నం న పరిరక్షత అని వేదవాణి అన్నము పారవేయకూడదు మరియు దొంగిలించకూడదు; ధాన్యమును సమృద్ధిగా పండించుము అని తెలుపునది; అన్నం పరబ్రహ్మస్వరూపము; శరీర పోషణాదులకు అవసరమైనది; వివిధ రకములైన ఆహారములు పరమ భక్తితో అమ్మవారికి సమర్పించినచో ఆనందముతో స్వీకరించును; శ్రీకృష్ణపరమాత్మ భక్తితో విదురుని ధర్మపత్ని సమర్పించిన అరటి తొక్కలు ఆరగించినాడు; కుచేలుని అటుకులు స్వీకరించి అష్టైశ్వర్యములను ప్రసాదించినాడు; రంతిదేవుని మంచినీరు, శబరియొక్క ఎంగిలి రేగుపండ్లు శ్రీరాముడు సేవించినారు; భక్త కన్నప్ప ఎంగిలి మాంసమును పరమశివుడు గ్రహించినాడు; కావున శ్రీమాతకు సర్వౌదనప్రీతచిత్తా అను నామప్రసిద్ధమగునట్లుగా అన్ని విధములైన ఆహారములను ఇష్టపడుచున్నది; శిశువునకు అన్నప్రాశన తరువాత వరుసగా పాలు, అన్నము, నెయ్యి అన్నము, బెల్లము అన్నము (పరమాన్నము), పెరుగన్నము, హరిద్రాన్నము అటు పిమ్మట క్రమేపి మనం తినే అన్ని పదార్థములను పెట్టడం జరుగుతుంది
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🌹🌹🌹🙏🙏🙏శ్రీమాత్రేనమః 🙏 🙏🙏 🙏🙏🙏 శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ🌹🌹🌹 534వ నామమంత్రము🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః🙏🙏🙏సహస్రదళ పద్మము నందు యాకినీ యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారము🌹🌹🌹లలితాసహస్రనామావళి యందలి యాకిన్యంబా స్వరూపిణీ అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరి) నామ మంత్రమును ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః అని ఉచ్చరిస్తూ అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులు శ్రవణాది సర్వేంద్రియాలను దేవిపరం గావించి తీవ్రసాధనా పరులై అమ్మ కరుణను పొంది, బ్రహ్మజ్ఞానసంపన్నులై తరించుదురు🌻🌻🌻సహస్రార కమలాధిష్ఠాన దేవతయగు యశస్వినీ దేవత యాకినీ దేవతయై, ఆ యాకినీ రూపధారిణియైన జగజ్జననిని కి సంబంధించిన బీజ, శక్తి, కిలక, న్యాస మంత్రాదులన్నియు య కారముతో ప్రారంభమగును🌺🌺🌺బ్రహ్మ రంధ్రమునకు అధో ముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము🌻🌻🌻సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు🌻🌻🌻ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొంద గలిగిన స్థానమిద🌹🌹🌹 దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీ భక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు🌺🌺🌺ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు🌹🌹🌹 యాకిన్యంబస్వరూపిణి- 534వ నామము, అనియు మరియు సహస్రదళ పద్మస్థా - 528వ నామము, సర్వవర్ణోపశోభితా - 529వ నామము, సర్వాయుధధరా - 530వ నామము, శుక్లసంస్థితా - 531వ నామము, సర్వతోముఖీ - 532వ నామము, సర్వౌధన ప్రీతచిత్తా 533వ నామమంత్రము
వరకూ నామములు జగజ్జననిని గూర్చియే తెలెయజేస్తాయి;
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ముండ వ్యోమస్థ పద్మే దశశత దళకే కర్ణికాచంద్ర సంస్దామ్
రేతోనిష్ఠాం సమస్తాయుధ కలితకరాం సర్వతోవక్త్రపద్మామ్
ఆదిక్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీమ్
సర్వాన్నాసక్తచిత్తామ్ పరశివరసికాం యాకినీ భావయామః
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శిరస్సు మధ్యభాగములో సహస్త్రార చక్రము ఉంటుంది🌹🌹🌹ఇది వేయి దళములు కలది✡✡✡ యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత🕉️🕉️🕉️7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది🌻🌻🌻ఇందు విశ్వంలోని సకల వర్ణములు, రంగులు, అక్షరములు, విద్యలు, ధ్వనులు, బీజాక్షరములు ఉంటాయి🌹🌹🌹యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది🌺🌺🌺ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది పరాశక్తి🌻🌻🌻ఈమె సర్వతో ముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది🙏🙏🙏మిగిలిన ఆరు (మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక,అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రము) చక్రములను షట్చక్రములుగా పేర్కొంటారు. ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం🌻🌻🌻 ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం🌺🌺🌺ఇదియే అద్వైతస్థితి🌹🌹🌹ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును. తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే; రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును;ఈ మూడును మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ,సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి; సహస్రార కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది. అధిదేవత యాకిని. అకారాది క్షకారంత వర్ణమాల యోగినీగణం చేత సేవించబడుచున్నది; మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం విశ్వాత్మ నివాసస్థానం. పరమాత్మ స్థానం. ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం; విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం; పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక; ఆనందమయకోశంతో సంబంధం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణశక్తి లోపిస్తుంది. భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు. కష్టదుఃఖాలు పొందుతుంటారు. పునర్జన్మలు తప్పవు; ఈ చక్ర మానసిక స్వభావం - ఈ చక్రం జాగృతయితే సాధకుడు అమరుడౌతాడు. పరమాత్మగా వ్యక్తమౌతాడు. తనకు తాను తెలుసుకుంటాడు; ఇది ఈశ్వరీయత స్థితి; ఈశ్వరత్వం పొందుతారు. ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే - తలపు, మాట, చేత యోగ్యంగా వుండాలి. క్రమశిక్షణ, ఆచరణ, విశ్వాసం కలిగియుండాలి. ధ్యానం, బ్రహ్మతత్త్వజ్ఞానం, స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు; సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింప బడియున్న షట్చక్రాలు శక్తి సామర్ధ్యాలు కలిగియుండి మన జీవితములు ఆనంద నందన వనములు అవుతాయి. ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నాన పానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి. అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్ని చక్రాలయందు నిబిడీకృత మవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంత చిత్తంతో కాసేపు ధ్యానించాలి; క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తు లవుతాం; కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది; ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి; ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి; {ప్రార్థన అంటే దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును ఇహం నుండి పరం వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధంచేసుకొని, దేహమే దేవాలయమని, అంతరాన్నే అంతర్యామి కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన చేయాలి}. ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించుకోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది;
ఈ సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది; 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు అహంబ్రహ్మస్మి అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును; అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది; సహజత్వానికి దగ్గరగా ఉండటమే; ఈవిధంగా సరైనరీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేసే సాధనతో స్థూలంనుండి ప్రజ్ఞామయం వరకు పయనించి అహం బ్రహ్మస్మి అన్న స్థితిని పొందడమే జీవన పరమావధి🌹🌹🌹🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము🚩🚩🚩🕉🕉 🌺🌻🌹🌻🌸 🕉🕉🕉🕉🕉
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

Comments
Post a Comment