క్రిష్టల్ బాల్ రీడింగ్
క్రిస్టల్ బాల్ రీడింగ్..... ఇది బహు పురాతనమైన విద్య . పురాణ కథల్లో దీని విశిష్టత కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తుంది . చాలా మంది నేపాళ మాంత్రికులు, మళయాళ మాంత్రికులు... క్రిష్టల్ బాల్ ను చాలా సార్లు ఉపయోగించినట్లు అంటే .....తనకు కావలసిన విషయం ఏ మూలన ఉందో తెలుసుకోవాలన్నప్పుడు, ఈ గోళాన్ని ఉపయోగించి తదేకంగా గోళంలో చూసి ఎక్కడ ఏం జరుగుతుందో విశదీకరించేవాడు. ఆ రోజుల్లో దీనిని అద్దంతో పోల్చి మాయటద్దం అనేవారు. అలాగే ఫ్రెంచి దేశీయుడైన "నోష్ట్రడామస్", తన "సెంచురీస్" ను, ఈ క్రిష్టల్ బాల్ విద్యనుపయోగించే వెలువరించాడంటారు. కానీ ఇదొక మార్మిక విద్య.
నేటి కాలంలో కూడా పురాతన కాలం నుండి అంజన విద్యలో, దీనిని ఉపయోగించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్పేవారని వాటి నుంచి ఇతర గ్రహాల గురించి కూడా దీనిలో చూసి విపులంగా రాశారని చరిత్ర చెబుతోంది . ప్రాచీన భారతదేశంలో, అంతకంటే ఎక్కువ స్థాయి విద్యలుండడం వలన, ఈ క్రిష్టల్ బాల్ విద్య...ప్రాచుర్యంలోకి రాలేదేమో!
అయితే, ఈ క్రిష్టల్ గేజింగ్ ఉపయోగించి....గ్రహ గతులు,గ్రహ స్వరూపాలు గణించడానికి కూడా,ప్రాచీన భారత దేశంలో ఈ విద్యను ఉపయోగించారని తెలుస్తోంది. అవే కుజుడు , చంద్రుడు , గురుడు , శని , శుక్ర గ్రహాలు మీద, పరిస్థితులు ఎలా ఉంటాయో అని వివరించారు ..... మహా ఋషులు. దీని ద్వారా అనేక ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు .
దీన్ని సరైన పద్దతిలో, వినియోగించే పద్ధతిని గురుముఖతా నేర్చుకుంటే పోయిన వస్తువుల గురించి , తప్పిపోయిన వారి గురించి , పశువుల గురించి , భూమి అంతర్భాగంలో ఉన్న జలం , ఖనిజాలు , నిధి నిక్షేపాల గురించి కూడా చూసి చెప్పినవన్నీ విజయవంతంగా ఉంటుంది అని తంత్ర శాస్త్రం లో ఉంది .
ముఖ్యంగా శుక మహర్షి యొక్క "శుక నాడి" గ్రంథంలో ఈ క్రిస్టల్ బాల్ గురించి చాలా గొప్పగా చెప్పారు . ఏ సమస్యకైనా పరిష్కారం తేలికగా సంపాదించవచ్చు . దీనికి పుట్టిన తారీఖు , సంవత్సరం , నెల అవసరం లేదు , దీని వలన నేరాలు కూడా అరికట్టవచ్చు అని చెప్పబడింది .
క్రిస్టల్ దృష్టి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో సంభవిస్తుంటాయి . వ్యక్తులు కనిపిస్తారు కనుక వారి ఉనికిని సందేహించనక్కరలేదు . మంచి వ్యక్తులను అనుమానించలేవు .
బహుశా ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలలో 5%అధ్యాపకులను అభివృద్ధి చేయడానికి అభ్యాసాన్ని చేయగలుగుతారు . కొన్ని సార్లు ఇక్కడ సాధారణ సమాచారం ద్వారా సాధించలేని సమాచారం తెలియజేస్తోంది .
క్రిస్టల్ బాల్ చరిత్ర :
క్రిస్టల్ బాల్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో దీనిని ఎక్కువగా చూసేవారు . దీని యొక్క ఆనవాళ్లు భారత్, ఆస్ర్టేలియా , పర్షియా , ఈజిప్టు , గ్రీస్ , చైనా , జపాన్ , నార్త్ అమెరికా , ఆఫ్రికా , పెరు , జులాస్ , మయోరిస్ , ఇన్ కాస్ ప్రస్తుతం ఆస్ర్టేలియా , ఆబ్రోజినిస్ , పోలిసియన్స్ , షామాస్ , సభేరియా , ఈస్ర్టన్ రష్యా , మడగాస్కర్ లో ఉండేవి.
క్రిస్టల్ బాల్ దృశ్యాన్ని ఒక దైవ శక్తిగా భావించేవారు..... . . దీనిని ఆరాధించి చికిత్స ను కూడా పొందెడివారు ఉన్నారు .
డాక్టర్ జాన్ డీ ( 1527_1608) డా . జాన్ ఇద్దరూ జ్యోతిష్యులు . క్వీన్ ఎల్జిబెత్ 1 కాలంలో ఇంకా డెవలప్ చేసారు . షో స్టోన్ అనే పేరు మీద బ్రిటిష్ మ్యూజియం లో క్రిస్టల్ బాల్ ఉంది .
క్రిస్టల్ బాల్ ని ఎలా ఉపయోగించాలి ?
👉 విజయవంతమైన క్రీస్టల్ ని చూడాలి అంటే ఆ వ్యక్తి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండాలి . దైవీగుణ ప్రవృత్తి కలిగియుండాలి.
👉 శ్రధ్ధ , సామర్థ్యం ఈ రెండు విజయాలను చేకూరుస్తాయి. మీ చుట్టు ఉన్న ప్రతీదీ మీ ఆలోచన నుంచి మూసివేయ బడుతుంది .
👉 క్రిస్టల్ బాల్ ఎటువంటి మచ్చలు , బుడగలు లేనిది తీసుకోవాలి ... లేదా మరో సాధనా విధానం కూడా ఉంది అదే మిర్రర్ ఇది క్రిస్టల్ బాల్ అంత ఫలితాలు ఇస్తుంది .
👉 ఇది చూసేటప్పుడు మీ మెదడు లో ఎటువంటి ఆలోచనలు ఉండరాదు . మీ సమస్య గురించి మాత్రమే ఆలోచించాలి . ఆ రూం లో ఎటువంటి శబ్దాలు ఉండరాదు . ఉంటే మీరు శ్రద్ధ నిలపడం కష్టం అవుతుంది .
👉 ఒక సమస్య గురించి మాత్రమే ఆలోచిస్తే విజయం మీదే . కన్ను కదల్చకుండా , శరీరం కదలకుండా నిటారుగా మీ దృష్టి మొత్తం క్రిస్టల్ మీదే ఉంచాలి .
👉 దీనికి చాలా ఆచరణ , గురు అనుగ్రహం అవసరం ఉంది . ఇతర శబ్దాలు వినిపించకుండా , కళ్ళు కదల్చకుండా క్రిస్టల్ పై దృష్టి సాధించడానికి కొంత సమయం పడుతుంది .
👉 మీరు పూర్తి శ్రద్ధ దానిపై నిలిపితే ఈ క్రిస్టల్ బాల్ మీకు ఒక మబ్బులా , పొగలా, తెల్లని రంగులో మారుతుంది . ఇదే గుర్తు మీకు క్రిస్టల్ ని చూడటం వచ్చింది అనడానికి నిదర్శనం . తర్వాత ఈ తెల్లని మబ్బు రంగులు మారుస్తూ ఉంటుంది . ఎరుపు , పచ్చ , నలుపు , మారితే మీరు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నట్లు . నలుపు రంగులోకి మారగానే మీ కోరిక నిజం అవుతుంది . మీ ప్రశ్నలు సమాధానాలు దొరుకుతాయి .
👉 నల్లగా మారిన మబ్బులా ఉండి చివరి దశలో పైకి లేచినట్టు అవుతుంది . మీకు అందులో దృశ్యాలు ఏమీ జరుగుతాయో మీ కళ్ళకు కనిపిస్తుంది . ఒక వేళ మీరు నల్లగా మారి పైకి వచ్చాక ట్రాన్స్ నుంచి బయటకు వస్తే తిరిగి ప్రయత్నం చేయాలి . చాలా ప్రయత్నాలు తర్వాత మాత్రమే ఇది మీకు సాధ్యం అవుతుంది .
👉 పూర్తిగా నలుపుగా మారాక మీ సమస్యకు సంబంధించిన సమాధానాలు ఇందులో కనిపిస్తాయి . కొన్ని దృశ్యాలు మనుషులు , ఇళ్లు , కొన్ని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం గల స్థలాలు , ప్రదేశాలు , ఏమైనా పదాలు , సింబాలిక్ కోడ్స్ , వస్తువులు , అవి మీరు అర్థం చేసుకోవాలి .
👉 మీరు ఎవరికోసమైనా ప్రశ్న అడుగుతూ ఉంటే , చూసే దృశ్యం అతనిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది .
👉 మీరు ఏదైతే ఆ దృశ్యం లో చూశారో అది మాత్రమే నిజాయితీగా చెప్పండి .
👉 ఎంటర్టైన్మెంట్ కోసం , క్రిస్టల్ బాల్ ని ఉపయోగించి భ్రష్టులు కావద్దు .
ఉపయోగించే విధానం :
వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశం ఒక డార్క్ రూం లో పెట్టాలి . లైట్ చాలా తక్కువగా ఉండాలి . డిమ్ లైట్ లో మాత్రమే ఈ క్రిస్టల్ బాల్ లో దృశ్యాలు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి .
లైట్ పెట్టాక , బాల్ పై తక్కువ కాంతి పడే విధంగా పెట్టుకోవాలి . తర్వాత నల్లటి వస్త్రంతో కప్పి ఉంచాలి . ఒక టేబుల్ పై ఉంచాలి . వాటికి చుట్టు ఉన్న వస్తువులు , మన ముఖం కనబడకుండా ఉంచాలి . ఒక వేళ బాల్ చిన్నది అయితే చేతి ద్వారా కప్పి ఉంచవచ్చు .
సాధనకు సమయం :
ఒంటరిగా ఉన్న సమయంలో సాధన చేయాలి . లేదంటే ఇతరుల వలన మీరు శ్రద్ధ నిలపడం కష్టం అవుతుంది .
వాతావరణం :
బాల్ ని పెట్టాక మీరు ముందుగా ప్రశాంతంగా ఇతర వాటి మీద ఆలోచనలు పోకుండా మీ మనస్సు లగ్నం చేస్తే 10 నుంచి 20 నిమిషాల మించి సాధన చేయకూడదు . కొత్తగా మొదలు పెట్టిన వారు 4,5 సార్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది . కొంత మందికి మబ్బులా మాత్రమే కనబడి తిరిగి యథాస్థితికి వస్తారు. తిరిగి ప్రయత్నం చేయాలి .
దృశ్యాలు ( visions ) :
ఈ క్రిస్టల్ బాల్ మీరు ఏ ప్రశ్నకు అయితే సమాధానం అడుగుతున్నారో ఆ దృశ్యం మీకు కనబడుతుంది. పుర్రె , చిన్నప్పటి చిత్రాలు , అక్షరాలు , మీకు దూరంలో ఉన్న మిత్రులు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు జరుగుతాయి . మొదలు అయినప్పుడు తెల్లని మబ్బు లా కనబడి అది రానురాను పెరిగి కొన్ని చిత్రాలు చాలా చక్కగా అతి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది . ఇవి ఆ వ్యక్తికి సలహాలను , సహాయాన్ని ఆ వ్యక్తి ఉండే కండిషన్ ని తెలియజేస్తుంది . కొన్ని సమయాల్లో జీవిత చిత్రాలను కూడా సజీవంగా ఉన్నట్లు చూపిస్తుంది ... ఇది క్రిస్టల్ బాల్ సైజ్ ని బట్టి ... దాని క్వాలిటీ మీద , సాధకుని మీద ఆధారపడి ఉంటుంది ...
ఈ క్రిస్టల్ బాల్ ని ఓ సాధారణ వ్యక్తి కొని సాధన చేయడం చాలా కష్టం. ఒక వేళ క్రిస్టల్ బాల్ ని కొన్నా కూడ ఇంట్లో దాన్ని మేయిన్టేయిన్ చేయడం ఇబ్బంది .. దీనికి సరి సమానంగా ఉండే ఇంకో సాధనం ఉంది అదే మిర్రర్ ...( అద్దం ) ఇది కూడా క్రిస్టల్ బాల్ కి తగినట్లు గా ఉంటుంది ... ఏది ఏమైనా గురుముఖతః సాధన రహాస్యం తెలుసుకుని చేయాలి .
ఈ క్రిస్టల్ బాల్ ద్వారా మన జీవితం మారదు కానీ ఒక కళగా మనకు కనిపించి జరగబోవు విషయాలను తెలియజేస్తాయి . ఎప్పుడూ ఒకే రంగులో .. ఒకటే సరళంగా చిత్రాలు కనబడవు .. మారుతూ ఉంటాయి ........
🙏

Comments
Post a Comment