మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం
మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం మనం నిత్యం చదివే మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం ఇది.
ఈ మహిమాన్విత ప్రదేశం పేరు జాగేశ్వర్. ఉత్తరాఖండ్ లో ఆల్మోరా కి సమీపాన (సుమారు 50 కిలోమీటర్లు) ఉంది. ఇక్కడి స్వామి జాగేశ్వరుడు… అమ్మవారి పేరు పుష్టీ దేవి. ఇదే దారుకావనం..
నిజానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఉన్నది నాగేశం దారుకావనే కాదట.. జాగేశం దారుకావనే అని చెబుతారు.
అదే ఈ జ్యోతిర్లింగం.. చుట్టూ దారుకావనం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
సతీ దేవి తపస్సొనర్చిన గొప్ప క్షేత్రం కూడా ఇదే.
“ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం!
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!!”
ఈ మహా మృత్యుంజయ మంత్రంలోని పుష్టి వర్ధనుడే ఈ స్వామి. జాగేశ్వర కృపతో.. పుష్టీ దేవి అనుగ్రహంతో అందరికీ అంతటా శుభం కలగాలని ఆశిస్తూ..
హరహర మహాదేవ శంభో శంకరా!!
జగేశ్వర్ ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం గా ప్రసిద్ధి చెందినది. ఇది సముద్రమట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో నెలకొని ఉన్న ఈ ప్రసిద్ధ మత పట్టణం చరిత్ర ప్రకారం, ఒకప్పుడు లకులిష్ శైవత్వాన్ని కేంద్రంగా సేవలు అందించింది. జగేశ్వర్ క్షేత్రం జతగంగా నది ఒడ్డున లోయలో ఉంది. ఆ లోయ ప్రాంతం అంతా విస్తారమైన పచ్చిక బయళ్లు, దేవదారు చెట్ల తో నిండి ఉండి మనసుకి ప్రశాంతతను, ఆధ్యాత్మిక భావాలను చేకూరుస్తుంది.
జగేశ్వర్ క్షేత్రం, దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి ప్రధాన ఆలయాన్ని(జగేశ్వర్ మహదేవ్ ఆలయం) 'నగేష్ జ్యోతిర్లింగ' అని పిలుస్తారు. ఈ ప్రదేశం చుట్టూ హిందూ దేవుడైన శివుడికి అంకితం చేయబడిన 124 ఆలయాలు ఉన్నాయి. దందేశ్వర్ ఆలయం, చండికా ఆలయం, మహామృత్యుంజయ ఆలయం, కుబెర్ ఆలయం, నవ-గ్రహ ఆలయం, మరియు నందా దేవి ఆలయం ఇక్కడ ప్రముఖ దేవాలయాలుగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో చూడవలసిన ఇతర పర్యాటక స్థలాల విషయానికి వస్తే .
దందేశ్వర్ ఆలయం, జగేశ్వర్ క్షేత్రంలో అతి పెద్ద ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం అక్కడి మిగితా ఆలయాలన్నింటిలో కెల్లా భిన్నంగా సహజ రాయితో ఉంటుంది. ఆలయ గేట్ వద్ద భారీ ఇనుప గంట కట్టబడి, లోపల అందమైన పురాతన చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా, క్రీ.శ. 18 వ శతాబ్దంలో బయటపడ్డ డ్యాన్సింగ్ శివ విగ్రహం కూడా ఆలయ సముదాయంలో ఉంది.
మహా మృత్యుంజయ మహదేవ్ ఆలయం, జగేశ్వర్.
మహా మృత్యుంజయ మహదేవ్ ఆలయం జగేశ్వర్ ఆలయం యొక్క సముదాయంలో గల పురాతమైన ఆలయం. ఈ ఆలయంలోy శివుడు తూర్పు ముఖంగా తిరిగి ఉంటాడు. ఇక్కడి శివలింగం కన్ను ఆకారంలో తెరిచి ఉంటుంది. 'మరణాన్ని' పాలద్రోలే శివలింగం గా ప్రసిద్ధి చెందినది. చాలా శక్తివంతమైన మహా మృత్యుంజయ మంత్ర పారాయణం చేయటం వల్ల దుష్ట ప్రభావాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
పుష్టి ఆలయం, జగేశ్వర్ లో ఉన్న ముఖ్య మత ప్రదేశాలలో ఒకటి. ఇక్కడున్న విగ్రహానికి ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మంగళ హారతులు జరుగుతుంటాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం వస్తుంటారు.
ట్రెక్కింగ్ ద్వారా ఆలయాన్ని సందర్శించాలనుకొనే వారు బడ్ జగేశ్వర్ లేదా బ్రిద్ధ జగేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది జగేశ్వర్ క్షేత్రానికి 3 కి. మీ. దూరంలో ఒక కొండ మీద నెలకొని ఉంది. ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే చేరుకొనే విధంగా ఉండే ఈ ఆలయానికి ఆసక్తి గల యాత్రికులు వెళ్ళటం సూచించదగినది.
జగేశ్వర్ మహదేవ్ ఆలయం జగేశ్వర్ లోని ప్రధాన దేవాలయం మరియు దేశంలోని ప్రఖ్యాత దేవాలయం. ఈ ఆలయాన్ని తరుణ్ జగేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి శివున్ని బాల జగేశ్వర్ గా పూజిస్తారు. ఆలయం లోని శివ లింగం రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటి సగం శివున్ని మరో సగం పార్వతి దేవి ని సూచిస్తుంది.
ఝాన్కేర్ సైమ్ మహదేవ్ ఆలయం జగేశ్వర్ లో ఉన్న ఒక ప్రసిద్ధ మత కేంద్రం. ఇక్కడి వారి నమ్మకం ప్రకారం, హిందూ మత దేవుడైన శివుడు ఈ ప్రదేశంలో ధ్యానం చేసుకొంటుంటే కొంతమంది రాక్షసులు ఆయనను ఇబ్బంది పెట్టేవారట. ఆ సమయంలో, హిందూ దేవుడు ఝాన్కేర్ సైమ్ తన తినేత్ర రూపంలో వచ్చి రాక్షసులను హతమార్చాడని చెబుతారు.
వినాయక్ క్షేత్ర, జగేశ్వర్ పరిధిలోని అర్టోల గ్రామం నుండి సుమారు 200 మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం ఝాన్కేర్ సైమ్ ఆలయం సమీపంలో ఉంటుంది.
జగేశ్వర్ లో బాగా ప్రసిద్ధి పొందిన, ఆకర్షణగా నిలిచిన ఉత్సవం జగేశ్వర్ మాన్సూన్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు జరిగే ఈ వేడుకలు శివుని గౌరవార్థం జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి శివ భక్తులు వస్తుంటారు.
జగేశ్వర్ చేరుకోవడం ఎలా?
వాయు మార్గం
జగేశ్వర్ కి సమీప ఏర్ పోర్ట్ ప్యాంట్ నగర్ ఏర్ పోర్ట్( 150 కి. మీ.). ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయలకు ముఖ్యంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో బాగా అనుసంధానించబడింది. ప్యాంట్ నగర్ ఏర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ ద్వారా జగేశ్వర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం
కత్గోడం రైల్వే స్టేషన్(125 కి.మీ.) జగేశ్వర్ సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా సాధారణ రైళ్లు లక్నో, ఢిల్లీ, మరియు కోలకతా వంటి భారతీయ గమ్యస్థానాలకు అనుసంధానించబడింది. టాక్సీలు రైల్వే స్టేషన్ నుండి జగేశ్వర్ కు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గం
జగేశ్వర్ కు సాధారణ బస్సు సేవలు సమీపంలోని స్థలాల నుండి అనుసంధానించబడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు జగేశ్వర్ కు అల్మోర , పితోఢగర్, మరియు హాల్డ్వాని వంటి గమ్యం నుండి అందుబాటులో ఉన్నాయి.
🕉🌞🌏🌙🌟🚩
మహా మృత్యుంజయ మంత్రం
ఓం శ్రీ రామ్ --- ఓంశ్రీమాత్రే నమః

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం !
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్!!
భావం:-
‘‘అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి.’’
మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనదనీ, దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుందనీ.
ॐॐॐॐॐॐॐॐॐ
మహా మృత్యుంజయ మంత్రం
ॐॐॐॐॐॐॐॐॐ
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం!
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్!!
ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.
ఈ మహామృత్యుంజయ మంత్రానికి ॐమార్కండేయ మంత్రంॐ అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: -
ॐॐॐॐॐ
భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ' అ ' కారం. యజుర్వేదం నుండి ' ఉ ' కారం, సామవేదం నుండి ' మ ' కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ' ఓంకారం ' ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.
త్ర్యంబకం:-
ॐॐॐॐॐॐ
భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.
యజామహే:-
ॐॐॐॐॐॐॐ
అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి కృంగి పోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.
సుగంధిం:-
ॐॐॐॐॐॐ
సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.
పుష్టివర్థనం :-
ॐॐॐॐॐॐॐ
మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం :-
ॐॐॐॐॐॐॐॐॐ
దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.
మృతోర్ముక్షీయ:-
ॐॐॐॐॐॐॐ
అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.
అమృతాత్ :-
ॐॐॐॐॐॐ
స్వామి అల్ప సంతోషి,సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి పత్తిరి సుమంత నెవ్వడు పార వైచు కామధేను వతడింట గాడి పసర మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.
మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు.
అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగ గల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించ లేకపోయాడని చెప్పారు.
అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.
ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు.
ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.
--(())--

Comments
Post a Comment