మాస్టర్ ఇ.కె. గారి సందేశము
23
22. 🌸. మహాపూర్ణవాణి 🌸
నీవు దేవలోకంలో భోగాలు అనుభవించాలి అనుకొంటే, కేవలం సత్కర్మలనే చేయటానికి తగిన గుణములను సంపాదించుకో చాలు.
నీవు పరమాత్మ అనుగ్రహమును బ్రహ్మానుభూతిని పొందాలి అనుకొంటే, నీ మాటల వలన గాని, చేతల వలనగాని, భావాల వలన గాని నీ ఏ కదలికల వల్లా పుణ్యం గాని, పాపం గాని రావటానికి వీలు లేని స్థితిలో ప్రవర్తించు.
🌹 🌹 🌹 🌹 🌹
21. సామ్రాజ్య పరిపాలనము, (రాచరికము) సామ్యవాద పరిపాలనము నరజాతి చరిత్రలో తరంగములవలె పర్యాయము లగుచుండును.
సామ్రాజ్య పాలక విధానమున (రాచరికము) ప్రభువు హృదయమువలె కేంద్రము, మంత్రి సామంతాదులు మనోబుద్ధ్యహంకారాదుల వలె ఉపకరణములు.
రాజ్య సంపద రక్తమువలె జీవనాడియై ప్రవహించుచుండును. ప్రజాసమూహము దేహధాతువులవలె పోషణము నొందుచుండును. ఇట్టిది ఆరోగ్యవంతమైన దేహస్థితి వంటిది రాజ్యాంగము.
అందు ఆహార పానీయముల వలె సంపదలు ఆవశ్యకతను బట్టి వినిమయమగుచు ఎపుడు ఆచరించవలసిన దానిని అపుడు కాలమే నిర్దేశించుచుండును. దానిని ఆచరించుటకన్నా మరియొక సత్యము లేదు.
సంశయములు తర్కము వలనగాని, ప్రశ్నోత్తరముల వలన గాని తొలగవు.
ప్రజ్ఞలోని మడతలు విచ్చుకొని విశాలత్వము ఏర్పడినపుడు మాత్రమే తొలగిపోవును. కారణమేమనగా ప్రశ్నలు స్వభావము నుండి పుట్టినవిగాని, జవాబుల కొరకు పుట్టినవి కావు.
🌹 🌹 🌹 🌹 🌹
20. 🌻. యుక్తాయుక్త విచక్షణ 🌻
సహజమైన భగవద్ధత్తమైన ఆనందిస్థితిని నిలుపుకోవటానికి మనకు కావలసినది వివేకము. అనగా యుక్తాయుక్త విచక్షణ. దీనినే బుద్ధి అంటారు.
నీ మనస్సు 'నా' యందు నిలుపు. నీ బుద్ధిని 'నా' యందు ప్రవేశింపజేయి. అప్పుడు నిస్సందేహముగా 'నా' యందే నిలిచిఉంటావు అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. ఇక్కడ 'నా' యందు అనగా ఆయన యందు అని అర్థం కాదు. 'నేను' అనగా అంతర్యామియైన వెలుగు.
ఆ విధంగా అంతర్యామి యందు మనస్సు, బుద్ధి నిలిచి ఉన్నప్పుడున్న స్థితినే ఆనందము అంటారు.
ఆనందము కన్నా భిన్నమైన వానిని తొలగించినపుడు మిగిలేది ఆనందమే. ఇదే ప్రతి ఒక్కరు చేయవలసిన సాధన. ఈ సాధనను సులభతరం చేసేవి సహజీవనము, సేవ.
సేవాధర్మాన్ని అనుసరించినపుడు మనలో ఆనందస్థితికి అడ్డుతగిలే పొరలన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఈ విధానాన్ని మనకు ఆచరణ పూర్వకంగా మనకు బోధించేవారే మాస్టర్స్ లేక పరమగురువులు అంటారు.
అటువంటి వారిలో మాస్టర్ సి.వి.వి. గారు ఒకరు. వీరు నిత్యజీవితంలో మన కర్తవ్యపాలనము చేస్తూనే అమరత్వసిద్ధిని పొందే సులువైన మార్గాన్ని అందించారు. నిజానికిది సనాతనమైన మార్గమే.
రోగార్తులైన వారి ఆర్తి పోగొట్టి యోగమార్గాన్ని అందించడమనేది వీరి పద్ధతి. వారి సహజీవన మార్గాన్ని అనుష్టించడానికి సాధన అవసరము.
దీనికి అందరనీ ఉన్ముఖము చేయడం కోసమే 'గురుపూజలు'......
🌹 🌹 🌹 🌹 🌹
17. పరమార్థ సాధనకు ఏకాంతవాసం అవసరం అని చెప్పటంలో, పరమార్థ సాధకులతోనే కలిసి ఉండాలి, విషయ లంపటులతో కలిసి ఉండరాదు అనే భావం.
బొత్తిగా ఎవరూ లేనిచోట కూర్చున్నప్పుడు మనస్సులో అనేక పిచ్చి ఆలోచనలు బయలుదేరతాయి. ఆ సమయంలో అక్కడికి ఒక పరమార్థ సాధకుడు వస్తే ఆ అలోచనలు తిరిగి వెళ్ళిపోతా
యి.
మన మనస్సునకు సిగ్గు కూడా తోస్తుంది. కాబట్టి అవకాశం కలిగించుకుని అయినా సరే, పరమార్థ సాధకులతోనే సర్వదా కలిసి ఉండాలి సాధకుడు.
🌹 🌹 🌹 🌹 🌹
16. "ఓం"అను అక్షరమును పై కుచ్చరించి వినుచుండవలెను. ఈ సాధనతో వాక్కు పరిశుద్ధ మగును. మనస్సు, ప్రాణము కలిసి యొకటియై వాక్కునందు ధారణ జరుగును.
దీనితో బాటు సత్యమునే పలుకుట, పెద్దలను భక్తితో వాగ్రూపమున గౌరవించుట, స్వధర్మమునందు మాత్రమే సంభాషణ చేయుట, అక్కరలేని విషయములు ప్రసంగింపకుండుట కూడ జోడించ వలెను.
దానితో నరుడు భూమిపై తిరుగుచున్న విష్ణుమూర్తిగా వ్యవహరించును. జీవిత దినచర్యయే యజ్ఞ మగును. (భాగవత రహస్య ప్రకాశము).
14. భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనబడు ద్రవ్యమయ, శక్తిమయ, ప్రజ్ఞామయ సృష్టులే మూడు లోకములు. జీవుల దేహములు కూడ ఈ మూడు లోకములందు సృష్టింపబడును.
మన దేహమునందున్న భౌతిక పదార్థము భూలోకము. దానిని కదలించు ప్రాణశక్తి భువర్లోకము. దానిని గమనించు మనస్సు మున్నగునవి స్వర్లోకము.
ఈ మూడును దేహము విడుచుకాలమున నశించును. అంతర్యామి యందుండు వాడు నశింపక ఈ మూడిటి ప్రళయమును గమనించును.
అట్లుగాక ఈ మూడింటిలో దేనియందో మెలగుచున్న ప్రజ్ఞ కలవాడు సంసార బద్ధుడనబడును. అట్టివాడు మృత్యువును పొందును. అనగా దేహాదులు పోవుటకు ముందే తెలివి తప్పిపోవును.
ఇట్లే ఒక భూగోళము యొక్క ప్రళయము, ఒక సౌరకుటుంబము యొక్క ప్రళయము , ఒక బ్రహ్మాండము యొక్క ప్రళయము కూడ వర్ణించబడినది.
భాగవతము 4-290, ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹
11. కొందఱు తమకు రాజ్యము కావలెననియు , పదవులు కావలెననియు కోరి దేవుని భజించుచున్నారు.
వారికా ఫలితములను దేవుడే తగిన విధమున ప్రసాదించుచునే యున్నాడు. ఆ ఫలితములపై వారికి గల ఆకర్షణమే వారిని దేవుని ధ్యానమున నిలుపును. దానివలన వారు ఆపదలకు గురికాక ధర్మమార్గమున జీవించుచున్నారు.
లేగదూడలు క్షీరముపై ఆపేక్షతో తల్లి వెంట నడచుట వలన దారి తప్పుట, క్రూరమృగముల బారిపడుట లేకుండ రక్షింపబడుచున్నవి.
అ ట్లే భగవంతుని కోరికలతో ఆరాధించు వారును.
భాగవతము 4-288 - ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
10. 🌸. మహాపూర్ణవాణి 🌸
ధర్మం అనే మహావృక్షం - ఆ వృక్షం చిటారుకొమ్మన బ్రహ్మానందం అనే ఫలం.
ఈ మహావృక్షానికి అన్ని వైపులా కొమ్మలు నేలకు వంగి ఉన్నాయి. అహింస, భూతదయ, సత్యం, శాంతం -ఇలా ఎన్నో కళ్యాణ నామములతో ఉన్నాయి ఆ కొమ్మలు.
ఆ ధర్మ వృక్షం అధిరోహించాలంటే, బ్రహ్మానంద ఫలాన్ని పొందాలంటే, ఏదో ఒక కొమ్మని పట్టుకోవాలి. ఆ కొమ్మే నిన్ను పై కొమ్మ వరకూ చేరుస్తుంది. ఫలం నోటికి అందిస్తుంది.
అలాకాక, అదికాదు ఇది అనీ, ఇది కాదు అది అనీ, దేనినీ సరిగా పట్టుకొనక, సందేహాలతో ఉన్నా, అన్ని కొమ్మలనూ ఒక్క పర్యాయమే పట్టుకోవాలి అని ప్రయత్నించినా ఎటూ కాకుండా పోతావు.
🌹 🌹 🌹 🌹 🌹
6. కర్మలను విడిచిపెట్టుట ద్వారా గాక, కర్మల యందు సంగాన్ని విడిచిపెట్టి అంతర్యామికి అర్పితమయిన యజ్ఞార్థ కర్మ చేయడం ద్వారానే యోగసిద్ధి లభిస్తుంది.
అట్లా అని కర్మలలో ఇరుక్కుపోకూడదు.
కర్మ చేయని క్షణముండదు కావున, నిత్యదినచర్య అంతా యోగసాధనే అవుతుంది. మోక్షమనే అంశముపై మనస్సు పెట్టడం కూడా బంధమే అవుతుంది.
కావున ముందు మోక్షమును గూర్చిన అభిప్రాయములు, ఆలోచనలు వదలివేయాలి. "తన" అసలైన అస్తిత్వములో ఎడము లేకుండా, జీవించడమే లక్ష్యముగా దినచర్యను ఏర్పాటుచేసికోవాలి.
ఏకాగ్రత అంటే ఒక దానిపైన మనస్సు కేంద్రీకరించి, మిగిలిన పనులు మానేయమని కాదు. అసలు మనస్సు స్వభావమే అదికాదు.
ధ్యానం పేర పనులు ఎగగొట్టేవాని మనస్సే అనవసరమయిన ఆలోచనలు, రాగద్వేషాలు, ఇతరులను గూర్చి వివిధాభిప్రాయాలతో గజిబిజి అయి, అశాంతిని పెంచుకుంటూ, పంచుతూ ఉంటుంది.
చేతి రుమాలులో ఎట్టి వాసనల వస్తువునుంచితే, ఆ వాసనే రుమాలు కేర్పడుతుంది. అట్లే మనసుకూడ. రుమాలులో కర్పూరముం
చి, వెలిగిస్తే, అదే లయిస్తుంది.
ఇలాగే అంతర్యామి స్మరణతో గూడిన పనులలో నిమగ్నమయిన మనస్సు కూడా అంతర్యామితోనిండి, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.
కావున ఏకాగ్రత లేక ఏకాంత భక్తి అంటే ఏ పనిలో ఉన్నా ఒకే ఒక అంతర్యామి తత్త్వమునందు నిలుచుటయే.....
🌹 🌹 🌹 🌹 🌹
7. 🌸. మహాపూర్ణవాణి 🌸
🌻. సాధనలో ఉన్న సాధకులు ముఖ్యంగా ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొన్నావా లేదా అని. 🌻
🌷. నీవు ఎంత జపం చేశావు అని చూడడు పరమాత్మ. ఎంత నామం చేశావు అని చూడడు- ఎలా చేశావు అని మాత్రమే చూస్తాడు.
నీ హృదయాన్ని పరమాత్మ సంకల్పానికి అభిముఖంగా ఉంచుకొని చేశావా లేదా అని మాత్రమే చూస్తాడు.
ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా, అది పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతుంది.
మనం మంచి అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినా, అది కూడా మన మనస్సు అందుకోలేని మరొక మంచికి ప్రాతిపదిక అన్న సత్యాన్ని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.
పరమాత్మ సంకల్పాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యరూపంగా పరిణమిస్తాయో ఎవరూ గ్రహించలేరు.
పరమాత్మ సంకల్పాలు బాహ్యానికి సుఖదుఃఖ రూపములుగా పరిణమించనీ, అధర్మరూపంగా అనిపించనీ, నీవు ధర్మం అనుకుంటూ చేసే ప్రచారానికి ఆటంకరూపంగా ఉండనీ -జరిగిన ప్రతిదీ ఆయన సంకల్పమే అని గుర్తించి, నీ హృదయాన్ని దానికి అభిముఖంగా ఉంచుకో!
అయ్యో, భగవంతుడు ఇలా ఎందుకు చెయ్యాలీ అనీ, విఘ్నాలు ఎందుకు కలిగించాలి అనీ అనుకోబోకు!
అయితే నీ శక్తి మేరకు ఆ ఆటంకములను నివారించడానికి ప్రయత్నం చేయకుండా మాత్రం ఊరుకోబోకు! విసుగు లేకుండా, ప్రసన్నచిత్తంతో, నా బాధ్యత నేను చెయ్యాలి అనే భావంతో నీ యత్నం నువ్వు చెయ్యి.
కర్తృత్వం నీ మీద వేసుకోకుండా చెయ్యి. పరమాత్మ ఇచ్ఛయే నెరవేరాలి, పరమాత్మ ఇచ్ఛయే మనకు క్షేమం కలిగిస్తుంది, అనే భావంతో విశ్వాసంతో చెయ్యి.
నీ మనస్సును రాగద్వేషాలకు పాల్పడకుండా ఉంచుకొని ఇలా చేస్తే, నీవు తలపెట్టిన మంచిపని- క్రతువు-బాహ్యానికి చెడిపోయినట్టు కనిపించినా, నిర్విఘ్నంగా నెరవేరినట్టే. అందువల్ల పరమాత్మ సంతోషిస్తాడు.
అలాకాక, నీ మనస్సు రాగద్వేషాలకు పాల్పడితే, ఆ క్రతువు- మంచిపని- బాహ్యానికి ఎంత వైభవంగా జరిగినట్టు కనపడినా, అది చెడిపోయినట్టే.
కాబట్టి నీ మనస్సును పరమాత్మ సంకల్పాలకు అభిముఖంగా ఉంచుకొని చెయ్యి ఏమి చేసినా!
🌹 🌹 🌹 🌹 🌹
8.

Comments
Post a Comment