🌹 . శ్రీ శివ మహా పురాణము - 149 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
36. అధ్యాయము - 11
మహేశ్వరసహస్రాంశాద్రుద్రమూర్తి రజాయత |అఘేరవదనాకార స్తేజస్తత్త్వాధిపశ్చ సః || 11
గౌరీశక్తియుతో వామే సర్వసంహారకృత్ర్ప భుః | అసై#్యవ వ్యష్టిరూపం స్యాచ్ఛివాద్యథ చతుష్టయమ్ || 12
శివో హరో మృఢభవౌ విదితం చక్రమద్భుతమ్ | సంహారాఖ్యం మహాదివ్యం పరమం హి మునిశ్వర || 13
స సంహారస్త్రి ధా ప్రోక్తో బుధైర్నిత్యాదిభేదతః | నిత్యో జీవసుషుప్తాఖ్యో విధేర్నైమిత్తికస్మ్సృతః || 14
విలయస్తస్య తు మహానితి వేదనిదర్శితః| జీవానాం జన్మదుఃఖాదిశాంతానాముషితాత్మనామ్ || 15
విశ్రాంత్యర్థం మునిశ్రేష్ఠ కర్మణాం పాకహేతవే | సంహారః కల్పితస్త్రే ధా రుద్రేణామితతేజసా || 16
రుద్రస్యైవ తు కృత్యానాం త్రయమేతదుదాహృతమ్ | సంహృతావపి సృష్ట్యాదికృత్యానాం పంచకం విభోః || 17
మునే తత్ర భవాద్యాస్తే దేవతాః పరికీర్తితాః | పరబ్రహ్మస్వరూపాశ్చ లోకానుగ్రహకారకాః || 18
సంహారాఖ్యమిదం చక్రం విద్యారూపకలామయమ్ | అధిష్ఠితం చ రుద్రేణ పదమేతన్నిరామయమ్ || 19
ఏతదేవ పదం ప్రాప్య రుద్రారాధనకాంక్షిణామ్ | రుద్రాణాం తద్ధి సాలోక్యక్రమాత్సాయుజ్యదం మునే || 20
మహేశ్వరుని వెయ్యవ అంశమునుండి అఘోర (శాంతమైన) ముఖము మరియు ఆకారము కలిగి అగ్నితత్త్వమునకు అధిపతియైన రుద్రస్వరూపము జన్మించెను (11).
సర్వమును సంహరించే రుద్రప్రభుని ఎడమ భాగమునందు గౌరీశక్తి గలదు. శివుడు, హరుడు, భవుడు, మృడుడు అను నలుగురు వ్యష్టిరూపమగుచున్నారు. ఓ మహర్షీ! అద్భుతము, మహాప్రకాశము గలది, సర్వశ్రేష్ఠమైనది అగు ఈ చక్రమునకు సంహారచక్రము అని పేరు (12,13).
నిత్యము ఇత్యాది భేదములచే ఆ సంహారము మూడు విధములుగా నున్నదని పండితులు చెప్పుచున్నారు. జీవులు పొందే నిద్రావస్థ నిత్యసంహారము. బ్రహ్మగారు నిద్రించినప్పుడు అది నైమిత్తికసంహారము అని చెప్పబడును (14).
బ్రహ్మయొక్క లయము మహాసంహారమగునని వేదములు వర్ణించుచున్నవి. ఓ మహర్షీ! తాపమును పొందియున్న అంతఃకరణములు గల జీవులు జన్మ, దుఃఖము మొదలైన వాటినుండి సంహారమును కల్పించినాడు (15,16).
రుద్రుడు మాత్రమే చేసే ఈ మూడు కార్యములను, మరియు పరమేశ్వరుడు చెసే సృష్టి మొదలైన ఐదు కార్యములను నేను చెప్పితిని (17).
ఓ మునీ! పైన పేర్కొనబడిన భవుడు మొదలైన దేవతలు పరబ్రహ్మస్వరూపులు మరియు లోకానుగ్రహమును చేయువారు (18).
విద్యాకళతో నిండియున్నదై రుద్రునిచే అధిష్ఠింపబడియుండే ఈ సంహారచక్రము దుఃఖసంపర్కము లేనిది (19).
ఓమునీ! రుద్రుని ఆరాధనయందు ఆసక్తి గలవారు ఈ రుద్రపదమును పొంది సాలోక్యము ఇత్యాది క్రమములో సాయుజ్యము (రుద్రునితో కలిసియుండుట) ను పొందెదరు (20).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment