. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర
[7:04 am, 26/04/2020] On Sriram**: 🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 17 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 5 - మూడవ భాగము 🌻
దామోదర్ గారు శ్రీధరునికై భోజన ఏర్పాట్లు గావించారు. ఆయన ప్రతీరోజూ స్వయంగా వంటచేసి తినేవారు. ఆయన భోజనంలో అన్నము, ముద్దపప్పు, నెయ్యి, పాలు, పెరుగు, ఒకటి లేదా రెండు కూరలు ఉండేవి. కానీ ఆరోజు శ్రీధరుడు తపస్సుకు వెళ్లేరోజు కావడంచేత వీటితోపాటు పాయసం, కేసరి ఇత్యాది వంటలు కూడా చేశారు. దామోదర్ పళంటీకర్ ద్రుష్టిలో ఇదే చివరి పండుగ. ఆయన ఆ తరువాత 12 సంవత్సరాలు ఎట్టి మృష్టాన్న భోజనము చేయలేదు. శ్రీధరుడు తపస్సుకు వెళ్ళటం వలన అది అతని శరీరమునకు శిక్ష అగుటచేత ఆయన తనవంతు దీక్షగా అప్పట్నుంచి రాబోయే, ఏ పండుగదినాన 12 సంవత్సరాలు మృష్టాన్నభోజనం చేయనని ప్రతిజ్ఞ పూనారు. శ్రీధరుని తపస్సు ఫలించి యశస్సు కలుగుటకుగానూ ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. మంచి పనులకుగాను సహృదయుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది అనేదానికి ఇది ఒక తార్కాణం.
భోజనాలు జరుగు తున్నాయి. కానీ శ్రీధరుని మనస్సు అందు లగ్నం కాలేదు. ఆయన మనసెప్పుడో సజ్జనగడ చేరుకుంది. దామోదర్ గారింట్లో జరుగుతున్న విందుకు మరికొందరు కూడా వచ్చారు. వారిలో ఒకరు శ్రీధరుని తపస్సు విషయం తెలిసి దామోదర్ గారితో ఇలా అన్నారు. గురువు లేకుండా మంత్రోపదేశం కాదు. మంత్రోపదేశం కాకుండా దీక్ష సఫలం కాదు. కావున శ్రీధరునికి గురువెవరు? గురువులేని పారమార్ధిక ప్రయత్నం ఫలశూన్యమవుతుంది. శ్రీధరుడు గురువు విషయంలో ఏమి చేస్తాడు?.
దీనికి దామోదర్ గారు ఈ విధంగా జవాబిచ్చారు. గురువు తనముందు సాక్షాత్ శరీరంతో లేకపోయినా కూడా మంత్రదీక్ష తీసుకొనవచ్చు. ఆ పద్ధతి ఇలా ఉంటుంది అని వివరించసాగారు. ఈ సమర్ధరామదాస స్వామి ఫోటో ముందు త్రయోదశాక్షరీ మహామంత్రమైన "శ్రీరామ జయరామ జయ జయరామ" అనే మంత్రాన్ని ఒక కాగితముపై వ్రాసి ఆ ఫోటో ముందు ఉంచవలెను. మరల తను చెవినుంచి మూడుమార్లు ఆ మంత్రాన్ని అనిన శ్రీసమర్థుల వారి అనుగ్రహంతో ఆయన గురువుగా మంత్రోపదేశం చేసినట్లవుతుంది. ఈ విధంగా మంత్రదీక్షను తీసుకొని తపస్సు చేయవచ్చును.
శ్రీధరుడు ఏకాగ్రచిత్తముతో దామోదర్ గురువుగారి ముఖాన్ని తదేకంగా, ఇంకా ఏమైనా ఉపదేశిస్తారేమోనని జిజ్ఞాసతో చూస్తున్నాడు. భోజనం కార్యక్రమం పూర్తయిన తరువాత దామోదర్ గారు ఇలా అన్నారు. "రేపు దశమి తిథి ఉన్నది, కనుక రేపు ఉదయం బన్నేశ్వర దేవాలయములో స్నాన సంధ్య పూర్తి చేసుకొని శ్రీసమర్థుల వారి నుండి ఉపదేశము పొందాలి" అని అన్నారు.
అంతలో మధ్యాహ్నము అయింది. శ్రీధరుడు బయలుదేరడానికి సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. దేవ దర్శనం అయింది. దామోదర్ గురువుగారికి నమస్కారం చేసినాడు శ్రీధరుడు. ఆయన హృదయం ఆనందంతో పెల్లుబికింది. ఆయన హృదయాంతరాళములలో నుండి ఈ పదాలు వెలువడ్డాయి.
"పూర్వం ఋషులు, మునులు, పయనించిన పథంలో మీ (శ్రీధరుడి) జీవనం సాగాలి. జ్ఞాన వైరాగ్య భాస్కరుని వలె ఈ సర్వజగత్తును ప్రకాశింపచేయండి, యశస్సు పొందండి!" అంటూండగానే ఆయన స్వరం గద్గదమైంది. మాటలు రావడం కష్టమయింది. ఆవేదనతో గొంతు మాట రాలేదు.
ఆయన కొన్ని రూపాయలను శ్రీధరుని చేతిలో ఉంచారు. దారి ఖర్చులకు ఉపయోగపడతాయి అని అన్నారు దామోదర్ గారు.
"ఇప్పుడు డబ్బు అవసరమేముంది? కడవరకూ నడచి ప్రయాణం చేస్తాను" అని అన్నాడు శ్రీధరుడు.
దామోదర్ గారు శ్రీధరుడిని, "మంచి లౌకికమైన కీర్తి సంపాదించుకుని ధన్యులు కండి" అని మరొక్కమారు ఆసిర్వదించారు.
"వస్తాను!" అని శ్రీధరుడు బయలుదేరాడు.
అధ్యాయం - 5 సమాప్తం.
తరువాయి భాగము రేపు చదువుకుందాం....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 17 🌹
సంకలనము : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 6 - మొదటి భాగము 🌻
శ్రీధరుడు పూనా నుండి తమ ప్రయాణం సతారా దారిగుండా ప్రారంభించారు. ఆయన తన ప్రయాణం ప్రారంభించి పూనా హద్దులు దాటి రహదారి ప్రవేశం చేశారు. ఆయనకు ప్రథమ పరీక్ష ప్రారంభం అయిందన్నట్లుగా వరుణుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. ఆకాశం ఉన్నట్లుండి మేఘావృత్తం అయింది. చాలా పెద్ద వర్షం కురవడం ప్రారంభం అయింది. ఆధ్యాత్మిక దారి అంటేనే మొదటిలో ముళ్లబాట వంటిది. అడుగడుగునా పరీక్షలే. కారణజన్ములు, అవతార పురుషులు తప్ప సామాన్యులు నడవలేనటువంటి కఠిన మార్గము అది. అకుంఠిత దీక్ష, పట్టుదల, ఓర్పు ఇత్యాది లక్షణాలు గలవారు తప్ప ఆ మార్గపుటంచుల దాకా వెళ్ళలేరు.
ప్రతీ అవతార మందు భగవంతుడు స్వయంగా ఈ కష్టములను అనుభవించి మానవుడు ఏ విధంగా జీవించాలో తాను ఆచరించి చూపిస్తాడు. శ్రీధరుడు దత్తాంశం కదా! ఆయన సాధన అనితర సాధ్యం. దారికి ఆ ప్రక్కన ఈ ప్రక్కన వృక్షములు కూడా లేవు. అయినను తను విశ్రమిస్తే ఆలస్యం అవుతుందనే భావనతో అంతటి వర్షంలో తడుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
శ్రీధర స్వామిని ఓడించ లేనని తెలుసుకున్న వరుణుడు శాంతించాడు. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. తాను పూనా దాటి బన్నేశ్వరమునకు వెళ్లవలెను. పూనా నుండి 21 మైళ్ళ దూరంలో ఈ ఊరు ఉంది. కానీ చీకటిలో వర్షం కారణంగా శ్రీధరుడు దారితప్పి ముందుకు 2 - 3 మైళ్ళ పైగా వెళ్ళిపోయాడు. ఆ దారి ప్రక్కగా గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలలోని వారు శ్రీధరుడిని లోపలికి రమ్మని పిలిచారు. సమయం రాత్రి ఒంటి గంట రెండయి ఉండవచ్చు.
వారిని విచారించి తాను దారి తప్పిన విషయం తెలుసుకొని తిరిగి వెనక్కి నడవడం ప్రారంభించాడు. అతను నడచి నడచి ఒక గ్రామం పొలిమేరలో ఉన్న మారుతి మందిరం చేరాడు. అచ్చట తన బట్టలను పిండుకొని ఒకింతసేపు ఆలయంలో కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడున్న వారిని, బన్నేశ్వర్ ఊరికి దారి కోసం అడిగాడు. ఇచ్చటకు కొద్ది దూరంలోనే బన్నేశ్వర్ కలదని కానీ ఈ రాత్రి సమయంలో ఆ దారిగుండా ప్రయాణం ప్రమాదమని, ఆ దారిలో సర్పాలు తిరుగుతుంటాయని తెల్లవారిన పిమ్మట వెళ్ళమని వారు చెప్పారు.
శ్రీధర స్వామి కొంత విచారములో మునిగి పోయారు. కానీ ఆయన సూర్యోదయానికి ముందుగా స్నాన సంధ్యాదులను నిర్వర్తించి సమర్థుల నుండి దీక్ష స్వీకరించాలనేది సంకల్పం. అందువలన ఏది ఏమైనా ఫర్వాలేదని ఆయన అచ్చట నుండి బయలుదేరారు. దారిలో కటిక చీకటి. ఏమీ కనిపించుటలేదు. అంత ఒక ఇంటి ముందాగి బన్నేశ్వరమునకు దారి ఏది? అని అడిగాడు.
ఆ ఇంటి నుండి ఒకతను వెలుపలికి వచ్చి ప్రతిరోజూ ఈ సమయానికి ఒక పూజారి బన్నేశ్వరమునకు వెళ్ళును. ఆయన చేతిలో కాగడా ఉంటుంది. ఆయన వచ్చే సమయం ఇది. ఆయనతో పాటు వెళ్ళండి అని అన్నాడు. అంతలో ఒక కాగడా వెలుతురు కనిపించింది. శ్రీధరుడు పరుగుపరుగున వెళ్ళి ఆయన్ను వెంబడించాడు. కొద్దిగా ముందుకు వెళ్లేసరికి బన్నేశ్వర దేవాలయం వచ్చింది.
బన్నేశ్వరమ్ ఒక సుందరమైన శివ స్థానము. ఆ గుడి చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఆ దేవాలయం ఆవరణలో రెండు సుందర జలాశయములు కలవు. శ్రీధరుడు దైవ దర్శనమునకు వెళ్ళాడు.
శ్రీధరుడిని చూస్తూ పూజారి ఇలా అన్నాడు. "బుర్రలో ఆలోచన వచ్చిన వెంటనే ఇల్లు వదలి బయలు దేరటమేనా? మీకు తెలియటం లేదు. ఇంకొకరు చెబితే వినరు. మొదట ప్రపంచమును తెలుసుకుని తదుపరి పారమార్ధిక జ్ఞానము కొరకు ప్రయత్నించాలి. ఇల్లు వదలి తిరగమని మీకు ఎవరు చెప్పారు?"
శ్రీధరుడు నమ్రతగా "నేను విద్యాభ్యాసము కొరకు బయలుదేరాను" అని సమాధానమిచ్చాడు.
శ్రీధరుడు స్నానము చేసి, పుష్పములు, బిల్వపత్రములు తెచ్చారు. బన్నేశ్వరునికి అభిషేకం చేశారు. గర్భగుడిలో బన్నేశ్వరస్వామి కుడి ప్రక్కగా శ్రీ సమర్థుల వారి ఛాయా చిత్రమును ఉంచి మనోభావముతో పూజ చేశారు. సాష్టాంగ నమస్కారం చేసి, అనన్యభావముతో ప్రార్ధన చేసి, శ్రీధరుడు బ్రహ్మీ ముహూర్తమున దీక్ష తీసుకున్నారు.
మధ్యాహ్నము వరకు శ్రీ సమర్ధానుగ్రహ దీక్ష మంత్రమును పవిత్రమైన శ్రీ శంకర సాన్నిధ్యంలో ఏకాగ్రచిత్తముతో జపము చేశారు. దేవతా నైవేద్య సమయం అది. శ్రీధరుడు ఆ ఊరిలోని మూడు ఇండ్ల వద్ద మధుకరము చేశారు. ఆ మూడిండ్ల వారు ఆరోజు విజయదశమి పర్వదినం కావడం వలన అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అందువలన వారు తమతో పాటు శ్రీధరుడిని కూడా భోజనం చేయమని బలవంతం చేశారు. ఆ మూడిండ్లలో ఒకటి ఆ ఊరు మమల్తదారు గారిది. శ్రీధరుడు సున్నితంగా తిరస్కరించి మధుకరి మాత్రం స్వీకరించి దేవాలయమునకు చేరుకున్నాడు. ఆ తరువాత ఆ మధుకరము నైవేద్యము పెట్టి తాను భుజించాడు. భోజనం పూర్తయిన తరువాత ముందు ప్రయాణమునకు సిద్ధమయ్యాడు. సజ్జనగడకు బయలుదేరాడు.
తరువాయి భాగము రేపు చదువు కుందాం....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
+91 94413 20430 left
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 12 🌹
సంకలనం : సూర్య
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 4 - మొదటి భాగము 🌻
శ్రీధరుని భగవద్భక్తి మరియు దేవుని యందు గల ప్రేమ మరింత బలపడుటకు గాను అతని పెద్దమ్మ మరియు అంబక్క ఇరువురూ అతణ్ణి భగవద్గీత చదవమని ప్రోత్సహించేవారు. అంబక్క అనారోగ్యమునకు గురియైనది. శ్రీధరుడు ఆమె సేవలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. అతనిని, గుల్బర్గా నుండి మరోక పెద్దమ్మ రమ్మని మరీ మరీ బలవంతము చేయసాగింది.
చదువు మధ్యలో ఉండటం చేత, పరీక్షలు పూర్తయిన తరువాత వస్తానని అన్నాడు. కొన్నిరోజులు తరువాత ఇక్కడ పెద్దమ్మ నుండి అనుమతి తీసుకొని గుల్బర్గాకు బయలుదేరాడు. ఇతను గుల్బర్గా చేరిన కొన్ని రోజులకు అంబక్క మరణించింది.
శ్రీధరుని పెద్దమ్మ చించోళి నుండి గుల్బర్గాకు మకాం మార్చింది. చించోళియందున్న దేశాయి గారు మధ్వ బ్రాహ్మణులు. వారు మధ్వనవమి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరిపించేవారు. శ్రీధరుడు ఇటువంటి కార్యక్రమాలలో చాలా బాగా పాల్గొనేవాడు. ఈ కార్యక్రమాలను చాలా బాధ్యాతాయుతంగా నిర్వహించేవాడు.
అందువలన దేశాయి గారు గిడ్డంగి నిర్వహణ బాధ్యతను శ్రీధరునికి అప్పగించేవారు. గిడ్డంగిలో రకరకాల పదార్ధములు నిండుగా ఉండేవి. ఎవరైతే దేశాయిగారి వద్దనుండి చీటీ తీసుకొని వస్తారో, ఆ చీటీలోనున్న ప్రకారం వారికి ఆ వస్తువులుగాని లేదా పదార్ధములు గాని ఇవ్వటం శ్రీధరుని బాధ్యత.
ఒకరోజు అతను గిడ్డంగి కార్యనిర్వహణలో ఉండగా ఒక పేద బ్రాహ్మణుడు అతనివద్దకు వచ్చి, "శ్రీధరూ! నీవు నాకు ధాన్యం ఇచ్చి సహాయం చేస్తే నా కుటుంబమును రక్షించినవాడవు అవుతావు. కనుక నాకు కొద్దిగా ధాన్యం రోజూ ఇవ్వు" అని యాచించాడు.
అందుకుగాను శ్రీధరుడు "మహనీయా! మీరు చెప్పినది సబబుగానే ఉన్నది. కానీ ఇచ్చట నుండి వెలుపలకు వచ్చు ప్రతీ వస్తువుకు చీటీ ఉండాలనే నిబంధన ఉంది. అందువలన నేను ధైర్యము చేసి ఇచినను ఎవరైనా తనిఖీ చేసిన మీకూ, నాకు ఇద్దరికీ అవమానము జరుగుతుంది. పైగా నా విధి నిర్వహణలో లోపము వస్తుంది. అందువలన మీరు ఈ విషయమై నన్ను ఇబ్బంది పెట్టవద్దు అన్నాడు.
కానీ అతను మరల "స్వామీ! పుస్తకాలకని నా వద్ద 25/- లు స్వంత ధనం ఉంది. దానిని నేను మీకు ఇవ్వగలను. దానితో మీ కుటుంబావసరాలను తీర్చుకోవలసినది" అని ఆ సొమ్ము ఆయనకిచ్చి తన ఉదారతను కనబర్చాడు. ఇంత చిన్న వయస్సులో అతని ఉదారస్వభావం అంతటిది.
కొంతకాలానికి శ్రీధరుడు ఈ విధంగా ఆలోచించసాగాడు. పెద్దమ్మ ప్రేమ సంకెళ్ల నుండి విముక్తి పొందటానికి ఆత్రపడసాగాడు.
కానీ అది సాధ్యపడటానికి తగిన దారికొరకు వేచిచూడసాగాడు. తను ఇతరులకంటే ప్రత్యేకమైన వాడినని, తన మార్గము లోకులవలె సాధారణమైన మార్గము కాదని అందుకు తపస్సు చేయుట ఆవశ్యకమని అందుకు పెద్దమ్మ ఇల్లు ఒక ప్రతిబంధకముగా ఉన్నదని భావించేవాడు.
పై చదువులకి పూనాకి వెళ్లిన అచ్చట చదువు మరియు తపస్సు నిర్విఘ్నముగా కొనసాగుతాయి అనేది శ్రీధరుని భావన. అందుకుగాను తగిన ప్రణాళికను మనస్సులోనే రూపొందించుకున్నాడు. దానికి తగిన ప్రయత్నములు ప్రారంభించాడు. అతనిలో జాగృతమైన ఆధ్యాత్మిక శక్తి అతణ్ణి ఈ విధంగా నడిపిస్తుంది. ఇదిలా ఉండగా శ్రీధరునికి చితలీ అనే వ్యక్తి స్నేహం కలిసింది.
చితలీ, పూనాలో ఉండే కేతకరు బంధువులు. కేతకర్ పూనాలో ఉన్న అనాథ విద్యార్థి గృహ నిర్వాహకులుగా ఉండేవారు. శ్రీధరుడు చితలీ అనే వ్యక్తి నుండి సిఫారసు లేఖ తీసుకొని పూనా బయలుదేరి వెళ్ళాడు. అది 1923వ సంవత్సరము.
తరువాయి భాగము రేపు చదువు కుందాం.....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 129 / Sripada Srivallabha Charithamrutham - 129 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 17
🌴. శ్రీనామానందుల వారి దర్శనము - 1 🌴
నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకుని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించితిని.
ఆమె మనస్థిమితము లేనిదానివలె కన్పించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళుచేతులు వణక నారంభించినవి. యిద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి.
ఆమె పరుగుపరుగున వచ్చి నా కాళ్ళపైబడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయూ అయోమయముగా నుండెను. దారిబత్తెము కూడాలేని బక్కబ్రాహ్మణుడనైన నేను పరాయిస్థలములో పరాయి వ్యక్తుల బారినుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను?
నేను అప్రయత్నముగా, "అమ్మా! నీకు వచ్చిన భయమేమియూ లేదు. ఈ దుర్మార్గుల బారినుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది." అని అంటిని.
ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బలసౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే గాక తమ బారినుండి యీ స్త్రీని రక్షించెదనని ధృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి, వారు "ఓ బక్క బ్రాహ్మణుడా! మేము యీ దురాచారిణిని చంపదలచితిమి. నీవు యీమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన యెడల నిన్నుకూడా చంపవలసి యుండును. మర్యాదగా మా దారికి అడ్డురాకుము." అనిరి.
నాలో ఏదో అదృశ్యశక్తి ప్రవేశించినట్లనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటినుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడెడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టి వేయునవి అయి ఉన్నవి.
అంతట నేను, "బ్రాహ్మణజన్మనెత్తి సిగ్గులేకుండగా గతరాత్రి ఆవును వధించి, ఆ మాంసమును భుజించి, కల్లును ద్రావి, సకల దురాచారములతో కూడిన మీకు నన్నునూ, యీ నిరపరాధియైన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పనికాదు.
నేనన్నింటికిని సిద్ధముగనే యుంటిని. మీయందు జాలితో పలుకుచున్నాను. మీరు యీ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠివ్యాధి సోకినవారికి కామవాంఛ కూడా అధికముగా నుండును.
కుష్ఠివ్యాధి కలిగిన వానిని పాము కాటువేయదు. పాము విషము నుండి తయారయిన ఔషధముతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే యీ ఔషధమును తయారు చేయు విధానము అందరికినీ తెలియదు.
కామవాంఛను అణచుకొని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలెనని మీరు కోరుకున్నచో యీ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి యీ మాటలను పలుకుచున్నాను." అని పలికితిని.
నా మాటలు విన్న యిద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము! నేను పలికిన కొన్ని పలుకులు వారి గతజీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి.
జ్యోతిషము యందు ఏమాత్రమూ పాండిత్యములేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చొంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని.
అంతట వారు, "అయ్యా! మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు, అయిననూ మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము యిర్వురమునూ అన్నదమ్ములము. బ్రాహ్మణజాతిలో జన్మించిననూ, బ్రాహ్మణధర్మములు మాలో పూర్తిగా లుప్తమయినవి.
సర్వభ్రష్ఠులమయితిమి. గోమాంసభక్షకుల తో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోను మేము సర్వభ్రష్ఠులమైతిమి. ఒక గుట్టమీద పద్మాసనములో కూర్చొన్న యీమెను చూచితిమి.
మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానయిననూ ఆమెను అనుభవింపదలచితిమి. అదేమిచిత్రమో గాని, ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను.
ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శనభాగ్యము మాకు కలిగినది." అనిరి. అంతట నేను "ఏది మంచి, ఏది చెడు అను వివేచననుచేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించు చుండెను.
మనము మంచి దారిలో నడచిన యెడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన యెడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింప వలసివచ్చును. ఈయమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమయిన కోరికలతో యీమెను సమీపించిరి.
మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో, క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్త నందించుచున్నాను.
త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తిస్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుతకాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున యీ లోకమున సంచరించుచున్నారు.
వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియునూ కానరాదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 8 🌹
సంకలనం : సూర్య
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. అధ్యాయం - 2 - మూడవ భాగము 🌻
హైదరాబాద్ లోని సత్పురుషుల మఠంలో శ్రీ సమర్థుల వారి పెద్ద తైలవర్ణచిత్రం ఉండేది. శ్రీధరుడు మఠ ప్రవేశమొనరించిన వెంటనే ఆ చిత్రాన్ని తదేకంగా చూస్తూండేవాడు. అప్రయత్నంగా "రామ రామ" అనే మంత్రం అతని నుండి వెలువడేది.
శ్రీధరుడు నోటి వెంట తరచూ ఈ వాక్యాలు వెలువడేవి.
ఘటికాగేలి పళెగేళి తాసవాజి ఝణా ఝణా
ఆయుష్యాచా నాశ హోతూ రామ కాశి మ్హణానా
భావము: గడచిన క్షణాలు వృధా! గంట గణా గణా మ్రోగుతోంది. ఆయువు వ్యర్థంగా నాశనమైపోతుంది. అయినా 'రామ రామ' అని ఎందుకు అనవు?
శ్రీధరుడు విన్న కథలు, పురాణములను చాలా బాగా జ్ఞాపకముంచు కొనేవాడు. శ్రీధరునికి శ్రీరామనామం జపం వలన తనకు కావలసిన అన్నింటినీ రాముడు సమకూరుస్తాడనే ప్రగాఢ విశ్వాసము ఉండేది.
ఒక పర్యాయము ఒక హరిదాసు నోటివెంట "రాముడు తన భక్తులను వెన్నంటే వుండి కాపాడుతాడు" అని అనగా విన్నాడు.
ఒకసారి శ్రీధరుడు తన స్నేహితులతో కలసి దగ్గరలో జరుగు జాతరకు వెళ్ళినాడు. వారితో అన్న త్రయంబకుడు కూడా ఉన్నాడు.
శ్రీధరుని మిత్రులలో ఒకడు "నీవు పెద్ద రామభక్తుడిలా ఉన్నావు. ఆయన తన భక్తులను వెన్నంటే కాపాడతాడంటావు కదా!" అని అనగా "ఔను! నేను ఎప్పుడూ అదే మాటంటాను" అని ధైర్యంగా జవాబు ఇచ్చాడు శ్రీధరుడు.
ఇది విన్న ఆ స్నేహితుడు "ఇదెలాగా? నీవు ఎప్పుడైనా రాముడ్ని చూచావా? ఇప్పుడు నీ వెనుక రాముడున్నాడా? కాస్త చూసి చెప్పు" అని అన్నాడు. అందుకుగాను శ్రీధరుడు జవాబిలా ఇచ్చాడు. "రాముడు మన కంటికి కనిపించకపోయినా మన వెనుక ఎల్లప్పుడూ ఉండి కాపాడుతాడు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు".
నీవు చెప్పే మాటలు నిజమేనని మాకు అనుభవములోకి రప్పించు. ఈ ఎదురుగా కనిపించే నీళ్లలోనికి దూకి ఈతకొట్టి బయటకు రావాలి. మేము నిన్ను పైకి తీయము. నీకు ఈత రాదు. నీ రామ నామమే నిన్ను కాపాడాలి. అప్పుడు నమ్ముతాము అని అన్నాడు.
తక్షణమే శ్రీధరుడు ఒక్క ఉదుటున నీళ్లలోకి దూకడానికి పరిగెత్తాడు. వెంటనే అన్న త్రయంబకుడు మరోక మిత్రుడు శ్రీధరుడిని గట్టిగా పట్టుకొని ఆపివేశారు. అప్పుడు శ్రీధరుడు ఎవరైతే అన్నారో అతనితో "చూడు! శ్రీరాముడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తన భక్తులను కాపాడి తీరుతాడు.
ఆయన పరోక్ష సహాయమైనా సరే అందించి తీరుతాడు" అని జవాబు ఇచ్చినాడు. మొండిగా వాదించిన శ్రీధరుని స్నేహితుడికి మరొకసారి ఈ విధంగా చేయరాదని బుద్ధి కలిగింది.
తరువాయి భాగము రేపు చదువు కుందాం....
దిగంబర దిగం
[07:45, 17/04/2020] +91 98494 71690: బర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
[10:44, 17/04/2020] +91 7013 527 083: దశ మహా విద్యలు - త్రిపుర సుందరి
ఈ దేవత దశ మహావిద్యలలో 3వది. ఈమె శుద్ధ జ్ఞాన స్వరూపిణి. శివ-శక్త్యైక్య రూపిణి. కామమే, సృష్టికి మూల కారణం. పరబ్రహ్మకు, సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. అంటే తాను బహు విధాలుగా మారాలనే ఇచ్ఛ కలిగింది.
సోకామాయత బహుస్యాం ప్రజాయాయేతి ---తైత్తిరీయ ఉపనిషత్తు
అపుడు పూర్ణ బిందు స్వరూపుడైన పరబ్రహ్మ, తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు. వారే శివ-శక్తులు. వారే ప్రకాశ - విమర్శాంశలు. సూర్యునికి ఎదురుగా, అద్దాన్ని ఉంచితే...అందులోనిది అతని ప్రతిబింబమే అయినా .....మాయయే. ఆ ఆది పరాశక్తియే మాయా స్వరూపిణి. ఆమెయే యావత్ చరాచర సృష్టికి మూల కారణం. ఆమెయే శ్రీ మహారాజ్ఞి. ఆమెయే పరా భట్టారిక. ఆమెయే జగన్మాత కామేశ్వరి. లావణ్య మూర్తి లలిత. సౌందర్య రాశి "త్రిపుర సుందరి".
ఆమె "అ" కారాది "క్ష" కారాంతము...50 అక్షరాల రూపంలో ఉంటుంది. ఆమె వలనే సృష్టి-స్థితి-లయాలు. ఎప్పుడామె , సృష్టి వ్యాపారాల నుండి విముఖంగా ఉంటుందో, అపుడే ప్రళయం.
త్రిపుర సుందరి అను పదమునకు ముందు "త్రిపుర" ఏమిటి? పురమనగా నగరము, స్థలము, క్రియ జరిగే చోటు అని అర్థం. పరబ్రహ్మలో మొదట కోరిక కలుగగా, స్పందన ఏర్పడి, నాదమేర్పడి బిందురూపాన్ని ధరించగా, ఆ బిందువు మరల మూడు బిందువులై త్రికోణమేర్పడినది. ఈ త్రికోణమే, సృష్టికి ఆధారం. అదే బ్రహ్మ యోని.
త్రిపుర సుందరికి మూడైన వ్యక్తిత్వాలు కలవు. 1. బాలా 2. త్రిపుర సుందరి 3. త్రిపుర భైరవి. వీటిలో త్రిపుర సుందరిది సౌమ్య రూపం. ఐదవ మహా విద్య అయిన "త్రిపుర భైరవి" ది ఘోర రూపం. అయితే ఈ రెండు రూపములు ఒకే నాణెము యొక్క రెండు పార్శ్వములు. త్రిపుర సుందరికి, మంత్రిణి లేదా జ్ఞాన శక్తి "మాతంగి". త్రిపుర సుందరికి, సైన్యాధి కారిణి, దండ నాథ, వారాహీ లేదా బగళా ముఖీ.
ఈమె రూపాన్ని సౌందర్యలహరిలో, ఆది శంకరులు ఇలా వర్ణించారు.
క్వణత్కాఞ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా ।
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7॥
భావము : తన సన్నని నడుముకు సవ్వడిచేయు చిరుమువ్వల వడ్డాణము ధరించునదీ, శరత్కాల పున్నమినాటి పూర్ణచంద్రునివంటి వదనము కలిగినదీ, చేతులలో విల్లమ్ములు, పాశాంకుశములు ధరించునదీ, పరమశివుని పరహంతా స్వరూపము అయినట్టిదీ అగు అంబిక మాముందు కనపడుగాక.
సాధకుని మనస్సు, ఆమె ఆధీనము లోనే ఉంచి, ఆమె సంకల్పమే...నెరవేరుగాక...అని భావించడమే సాధన.
శాక్తేయులు విగ్రహాలకు బదులు యంత్రాలను పూజిస్తారు. అవి సరళ రేఖలతోనూ-వక్రరేఖలతో-బిందు కోణాలతోనూ ఉంటాయి. ఇలా పూజించడం ఉత్తమమని తాంత్రికుల మాట. మంత్రమే దేవత. దేవతా శరీరమే యంత్రం.

. భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి జీవితచరిత్ర - 4 🌹🙏
🌻. అధ్యాయం - 1 🌻
నారాయణరావు గారు, ఆయన భార్య కమలాబాయి హైదరాబాద్ లో సుఖంగా నివసిస్తున్న ఒక సంపన్న కుటుంబం. మానవుని యొక్క లౌకిక జీవితములో సంపూర్ణ సుఖమనేది ఎక్కడా ఎప్పుడూ దొరకదు. శ్రీసమర్ధ రామదాసు స్వామి చెప్పినట్లు "జగి సర్వ సుఖ ఆసాకొణ ఆహె!" (జగత్తులో సకల సుఖాలు ఎలా లభిస్తాయి?) అనేది అక్షరసత్యంగా వీరి జీవితంలో సంతానం విషయమై నిజమైనది.
నారాయణరావు దగ్గరికి పురోహితుల వారు వచ్చి ఇలా చెప్పారు, "నారాయణరావు గారూ! మీ వంశమునకు తగిలిన భయంకర సర్పశాప విషయం మీకు తెలుసా? అది అంత సులభంగా మిమ్ములను విడిచిపెట్టదు. అందుకుగాను మీరు దత్తాత్రేయస్వామి ఆరాధన చేయవలెను. తద్వారా మీ వంశము మళ్ళీ ఉద్ధరింప బడుతుంది. అంతేకాకుండా ఈ సకల జగత్తు కూడా ఉద్ధరింపబడుతుంది. అందువలన మరి ఆలస్యం చేయక తక్షణమే గాణగాపురమునకు బయలుదేరి వెళ్ళండి" అని కులపురోహితుల వారు అన్నారు.
మా వంశమునకు సర్పశాపం ఎలా వచ్చింది చెప్పండి అని కులపురోహితుల వారిని నారాయణరావు గారు అడిగారు. అప్పుడు ఆ పురోహితుడు ఇలా చెప్పారు, పూర్వము మీ పూర్వీకుల ఇంట్లో ఒకరోజున ఒక పెద్ద నాగుపాము కనబడింది. జనం కర్రలు, కట్టెలు తీసుకొని దానిని చంపడానికి ప్రయత్నించగా అది పడగ విప్పి బుసలు కొడుతూ లేచింది. ఆ ఇంటి యజమాని గురిపెట్టి తుపాకీ పేల్చాడు. సరిగ్గా గుండు ఆ నాగుపాము పడగలోనికి వెళ్లిన వెంటనే అది విలవిలలాడుతూ మరణించింది. అంతే ఆ ఇంటికి గొప్ప అరిష్టం దాపురించింది.
ఆ పాము మరణించిన రాత్రి తుపాకీ పేల్చిన మీ వంశస్థునికి స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు దర్శనమిచ్చి "నేను మీ వంశాన్ని మరియు ఇంటిని రక్షిస్తున్నాను. నీవు అది గ్రహించలేక అన్యాయంగా నన్ను చంపేశావు. ఇక మీకు రక్షణ లేదు. పైగా మీ వంశం నిర్వంశమైపోతుంది" అని అన్నారు. పశ్చాత్తాపంతో ఆ బ్రాహ్మణుని పాదములు పట్టుకొని బ్రతిమాలగా ఆయన ఇలా అన్నారు. "ఈ కులాన్ని ఉద్ధరించుటకు దత్తగురువు మీ వంశములో జన్మించి, బాలబ్రహ్మచారిగా సన్యాసము తీసుకొంటాడు. ఆయన వలన మీ వంశము మరియు జగత్తు ఉద్ధరింపబడతాయి. కానీ మీ వంశము మాత్రము అంతటితో ఆఖరు" అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైనాడు.
ఆరోజు నుండి మీ ఇంటికి పీడ పట్టింది. మీ ఇంట్లో అనేకులు మరణించారు. ఇది మీ సర్పశాపం అని పురోహితుల వారు వివరాలు స్పష్టంగా నారాయణరావు గారితో చెప్పారు.
ఈ విషయం విని తమకున్న సంతానం అల్పాయుష్కులేనని తెలిసి విచారంతో తమకు ఈ శాపము నుండి విముక్తి ఏ రకంగా కలుగుతుంది మార్గం చెప్పమని ప్రార్ధిం
చారు.
ఆ పురోహితుడు ఇలా చెప్పారు. మీకు త్వరలో లోకోత్తరమైన పుత్రుడు జన్మిస్తాడు. తక్షణమే మీరు గాణగాపురం వెళ్లి దత్తోపాసన చేయండి అని కర్తవ్యాన్ని బోధించారు.
తరువాయి భాగము రేపు చదువు కుందాము....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment