Swami Vivekananda's Wisdom for Daily Inspiration -




👉 ఏమి తినకుండా ఉండటం - ఉపవాసం.
                    యుక్తాహారం ➡️ మితాహారం➡️ నిరాహారం.

👉 ఏమీ మాట్లాడకుండా ఉండటం - మౌనం.
             యుక్తభాషణం ➡️ మితభాషణం ➡️ నిర్భాషణం.

👉ఏ ఆలోచన లేకుండా ఉండటం- ధ్యానం.
                          యుక్త యోచనం ➡️ మిత యోచనం ➡️ నిర్ యోచనం.

⚡️✨⚡️✨⚡️✨

యుక్తము = అవసరం మేరకు స్వీకరించడం,
          మితం=అవసరం కన్నా తక్కువ స్వీకరించడం,
                           నిరా = అసలు స్వీకరించక పోవడం.                  ( పై విధంగా, జ్ఞాని తన భౌతిక అవసరాలను, క్రమ క్రమంగా తగ్గించుకుంటు వెళతారు)

⚡️✨⚡️✨⚡️✨

👉 అరుణాచలమే తొలి లింగం - భౌతిక ప్రపంచంలో.

👉 'నేను' అను అహం స్ఫురణే జ్ఞాన లింగం - మనో జగత్తులో.

⚡️✨⚡️✨⚡️✨

'నేను ఉన్నాను' అని కాకుండా "నేను ఉన్నట్లు ఉన్నాను" అని ఉంటే.,

నీవు పొందవలసినదేదో,  అది పొందినట్లు లెక్క.

⚡️✨⚡️✨⚡️✨

ఆకాశంలో మబ్బులు ఉండి, కాసేపటికి లేకుండా పోయినట్టు...  మనసులో తలంపులు కూడా అంతే. 

👉 తలంపులతో ఉన్నప్పుడు చిత్తము అని పేరు.

👉 తలంపులు లేనప్పుడు చిదము (జ్ఞానం) అని పేరు.

👉 తలంపుకు, తలంపుకు మధ్య ఉన్న ఖాళీ చిదాకాశము.

👉 తలంపుకు - తలంపుకు మధ్య ఉన్న శూన్యస్థితిని పెంచుకోవడమే "సాధన".

⚡️✨⚡️✨⚡️✨

ఆలోచన = అయితే భూతకాలం,  లేకపోతే భవిష్యత్ కాలం.

శ్వాస = భూతకాలం కాదు, భవిష్యత్తు కాదు. నిరంతరం అది వర్తమానమే.

వర్తమానంలో స్థితమైతే అనగా ధ్యానం,ప్రాణాయమం  (Simple & Powerful Technique) విధానం ద్వారా చిత్తం (మనస్సు) త్వరగా శూన్యస్థితిని (ధ్యానస్థితి) పొందుతుంది.



, పురుషుడుకి గాని - హృదయపవిత్రతే మొదటి సుగుణం.

మానవకోటి అసత్యం నుండి సత్యానికి కాక, సత్యం నుండి సత్యానికి పయనిస్తున్నదన్న సంగతి మనం గుర్తించాలి. అది వ్యావహారిక సత్యం నుండి పారమార్థిక సత్యం వైపుకు కావచ్చు. కాని అసత్యం నుండి స
త్యం వైపుకు మాత్రము  క్షుద్రకీటకం మాదిరి చావటంకంటే, సత్యాన్ని భోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం.

ఆధ్యాత్మిక ధర్మము క్రొత్తగా ఏమీ ఇవ్వదు. అది కేవలం అంతరాయాలను తొలగించి, స్వస్వరూపాన్ని వీక్షింపజేస్తుంది.

🕉🌞🌏🌙🌟🚩


బహిర్ముఖం (ప్రాపంచికం) - పార్వతి, అంతర్ముఖం (ఆధ్యాత్మికం) - శివుడు.

* ఈ రెండు ముఖాలను కలిగి ఉన్నవాడు - అర్ధనారీశ్వరుడు.*
* ఈ రెండు ముఖాలను తనవి కావని ఉన్నవాడు - పరమేశ్వరుడు.*

✨⚡️✨⚡️✨⚡️

ఇతర విషయాల్లో:-

తెలుసుకోవటానికి, తెలియకపోవటానికి తేడా ఉంది.

పొందటానికి, పొందకపోవటానికి తేడా ఉంది.

✨⚡️✨⚡️✨⚡️

ఆధ్యాత్మిక విషయాల్లో:-

 నీకు తెలుసుకుంటే ఎంతో., నీకు తెలియక పోయినా అంతే.

నీవు పొందితే ఎంతో., పొందకపోయినా అంతే.  తేడా ఉండదు.

ఎందుకంటే ఉన్నది అదొక్కటే కాబట్టి.

✨⚡️✨⚡️✨⚡️

కర్తృత్వ భావన - పాపం.

సాక్షి గా ఉండడం - పుణ్యం.

ఎప్పుడూ ఉండేదే సత్యం.

సర్వ ఉపరితల అనుకూల, అననుకూల పరిస్థితుల్లో సదా సాక్షిభూతంగా ఉండే 'నేను' అన్న సత్య పదార్థం పేరే "ఆత్మ".

✨⚡️✨⚡️✨⚡️

సత్యం గురించి తెలుసుకుంటూ,  తెలుసుకున్న సత్యాన్ని ఇతరు
లకు బోధిస్తూ ధర్మమార్గాన్ని అనుసరించడమే "ఆధ్యాత్మికత".

🕉🌞🌎🌙🌟🚩




మీ శరీరంలో ఎన్ని శక్తులు, ఎన్ని సమర్థతలు, ఎన్ని మహిమలు దాగున్నాయో మీకు తెలుసా? మనిషిలో ఉండే సర్వాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరున్నారు? మనిషి ఈ లోకంలో అవతరించి కోట్ల సంవత్సరాలు గడిచాయి. అయినా మనిషికి తనలోని శక్తులలో అణు మాత్రమే ఇప్పటికీ వ్యక్తీకరణకు వచ్చింది. కాబట్టి నేను దుర్బలడును' అని పలుకరాదు. పైపైన కనిపించే హీనత క్రింద  మరుగుపడి ఎంత మహత్తు ఉందో మీ
కెలా తెలుస్తుంది. మీ లోపల దాగివున్న మహత్తును గూర్చి మీకు తెలిసింది. అత్యల్పం. మీలో అనంత సింధువును పోలిన శక్తి మహిమ దాగి ఉంది.

🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ