Vijnanam
వ్యవహారంలో నామ రూపములు ఉండి, స్వానుభవంలో నామ రూపముల స్పృహ లేని వాడే జ్ఞాని.
➡️ పుట్టక ముందు తాను ఒంటరియే.
➡️ గిట్టిన తర్వాత తాను ఒంటరియే.
⚡️✨⚡️✨⚡️✨
ఇప్పుడు తాను అందరికీ ఉన్నట్టున్నా, అందరికీ తాను ఉన్నట్లున్నా తాను సదా ఒంటరియే.
🕉🌞🌎🌙🌟🚩
➡️ చాట:- మంచిని తనలో ఉంచుకొని, చెత్తను బయటికి పంపించును.
➡️ పిండి జల్లెడ:- చెత్తను తనలో ఉంచుకొని, మంచిని బయటికి పంపించును.
అదేవిధంగా 'జ్ఞాని' చాట వలె (మంచిని ఉంచుతారు), 'అజ్ఞాని' జల్లెడ వలె (చెత్తను తనలో ఉంచుకుంటారు) వ్యవహరిస్తారు.
కాని దానిని తొలగించడం, కావలసిన దానిని తెలుసుకోవటం - ఇదియే "ఆధ్యాత్మికత".
పరోపకారం మిదం శరీరం:-
మనకు తెలిసిన సామాన్య అర్థం ఏమిటంటే పరులకు ఉపకరించేందుకే ఈ శరీరం ఉన్నదని.
కానీ అంతరార్థం ఏమిటంటే :--
'పరాని'కి (ఆధ్యాత్మికతకు) ఉపకరించేందుకే ఈ శరీరం ఉన్నదని.
కాశీలోనే నివసించేవాడు - కాశీయాత్ర ఎలా చేయగలడు?
భగవంతుని లోనే ఉన్న వాడు - భగవంతుణ్ణి ఎలా చేరగలడు?
ఈ శరీరంలో నుండి ఏది ఖాళీ అయితే,ఈ శరీరం శవం అయిపోతున్నదో అదే 'నేను'.
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే:-
ఇక్కడ పూర్వజన్మ అంటే క్రితం జన్మలో అని అర్థం తీసుకుంటాం.
కానీ తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే 'ఈ జన్మలో ఈ క్షణానికి పూర్వం కూడా పూర్వజన్మే' అని.
🕉🌞🌎🌙🌟🚩
బయట మీరు ప్రయత్నం చేస్తున్నట్టే కనబడాలి,మీ లోపల 'భగవదిచ్ఛ' అని స్థిమితంగా ఉండాలి.
⚡️✨⚡️✨⚡️✨
మోక్షం అనగా మోహ క్షయమే.
మీకు నచ్చినా, నచ్చకపోయినా ప్రపంచం ఇలాగే ఉంటుంది.
👉 నచ్చితే జీవించండి.
👉 నచ్చకపోతే ధ్యానం చేయండి.
⚡️✨⚡️✨⚡️✨
సంకల్పాలు:-
➡️ మనం కోరుకున్నది మనకు లభించదు., మనకు 'అర్హత' ఉన్నదే మనకు లభిస్తుంది.
*➡️ అర్హమైనది దక్కకపోవచ్చు కానీ.,
మన నిజమైన 'అవసరం' మాత్రం తీరుతుంది.*
➡️మన అవసరాలు తీరకపోవచ్చు కానీ., మన ద్వారా 'విశ్వాని'కి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి.
🕉🌞🌏🌙🌟🚩
'ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టి కోణాల నుండి సరిగ్గానే ఉన్నారు' అని గ్రహించగలగడమే విశాల దృక్పథం.
ఎప్పటికప్పుడు తెలివిగా నిర్ణయాలు వాయిదా వేయడం - తమోగుణ తత్వం.
సరైన ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం - రజోగుణ తత్వం.
సశాస్త్రీయంగా ఆలోచిస్తూ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం - సత్వగుణ తత్వం.
ఇక చివరగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటి పర్యవసానాల గురించి ఏమాత్రం చింతించకపోవడం - నిర్గుణ తత్వం.
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ నృసింహా ద్వాదశ నామ స్తోత్రం
శ్రీ సింహాచల వరాహ నృసింహ స్వామి
శ్రీ సింహాచల వరాహ నృసింహ స్వామి వారి చందనోత్సవం … కమనీయం మనోహరం
ఒక్క నిమిషం …. ఈ మహా మహిమాన్విత స్తోత్రం చదవండి …. ఈ స్తోత్ర మహాత్యం తెలుసుకున్నాక మీకు వీలైతే రోజూ భక్తితో పటించండి ………
శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం,ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.
అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,మీ ఇంట్లో ఉండే వారి కోసం కుడా ఈ స్తోత్రాన్ని పఠిన్చి స్వామి వారి అనుగ్రహం పొందండి …
శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం
ॐॐॐॐॐॐॐॐ
ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥
🚩ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః🚩 శ్రీగురుభ్యోనమః🙏
యోగము అనగా దైవమే. భగవంతుని యోగబలము మూలముగా భూమి నిలబడి ఉన్నది. భూమి గోళాకారముగా ఉండి, విపరీతమైన వేగవంతముగా నడుస్తూ ఉంటుంది. భూమి తిరుగుతున్నా, జీవులు పడిపోకుండా ఉండడానికి దైవ యోగమే బలము.
సూర్యుని చుట్టూ గ్రహములు కలిసి ఉన్నాయి. లెక్కకు మించిన సౌరకుటుంబము లున్నాయి.
సప్తర్షిమండలము, కృత్తికా మండలములున్నాయి. ఇవి ఏ ఆధారము లేకుండా , ఏవిధముగా నిలబడి ఉన్నవి? ఈ కనిపించని ఆధారమే దైవము. యోగము. ఇంతకన్నా అద్భుతమైన విషయము సృష్టి లో ఇంకొకటి లేదు.
నవ గోపికా సంఘము
🌹 🌹 🌹 🌹 🌹
🕉🌞🌏🌙🌟🚩
👉 సృష్టిలోని ప్రతి చలనానికి మహా ద్రష్ట అయిన శివుడు అచలుడు.
👉 తనువులోని ప్రతి చలనానికి ద్రష్ట అయిన జీవుడు కూడా అచలుడే.
శివుడికి, జీవుడికి చిరునామా ఒక్కటే.
ఇహము, పరము అనే రెండు కలలను కనేవాడివి నీవు. నీవు లేక ఇహము లేదు, పరము లేదు.
➡️ బహిరంగ యుద్ధంలో ... ఆయుధం ఎంత ముఖ్యమో;
➡️ అంతరంగ యుద్ధంలో ... ఆలోచన అంత ముఖ్యం.
ఆ యుద్ధంలో - ఆత్మరక్షణ;ఈ యుద్ధంలో- ఆత్మ శిక్షణ.
వ్యవహారంలో నామ రూపములు ఉండి, స్వానుభవంలో నామ రూపముల స్పృహ లేని వాడే జ్ఞాని.
అంతటా చైతన్యం
ఉన్నది, చైతన్యములోనే అంతా ఉన్నది.
➡️అందులో కొన్ని చలనంలో ఉంటాయి.
➡️ మరి కొన్ని నిశ్చలంగా ఉంటాయి.
🕉🌞🌏🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
➡️ అన్ని చోట్లా దు:ఖం విస్తరించి వుంది -- ఇది మొదటి సత్యం!
➡️ దు:ఖం అన్నది తృష్ణ వలన సంభవం -- ఇది రెండవ సత్యం!(తృష్ణ అంటే అవసరాలకు మించిన కోరికలు.)
➡️ తృష్ణ అన్నది అవిద్య జనితం - ఇది మూడవ సత్యం!
(ఆధ్యాత్మిక విద్య లేమినే 'అవిద్య' అంటాం)
➡️ అవిద్య అన్నది అష్టాంగ మార్గం ద్వారానే పోగొట్టబడుతుంది -- ఇది నాల్గవ సత్యం.
అష్టాంగ మార్గం అంటే సరైన దృక్పధాలు, సరైన కోరికలు, సరైన వాక్కు, సరైన కర్మ, సరైన జీవనోపాయం , సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం.
🕉🌞🌎🌙🌟🚩
👉 తాము గమనించినా... గమనించక పోయినా అంతర్గతంగా అందరూ 'బ్రహ్మజ్ఞానులే'.
👉 తమకు తెలిసినా... తెలియకపోయినా అందరూ అంతర్గతంగా 'బ్రహ్మం' అయి ఉన్నారు.
అందరిలోనూ సరిసమానంగా ప్రవహిస్తున్న ఈ అంతర్గత 'బ్రహ్మ జ్ఞానవాహిని' ప్రయత్నపూర్వకంగా. యోగసాధన మూలంగా.. బహిర్గతమైనప్పుడు "మేము బ్రహ్మ జ్ఞానులం" అని ఎవరికి వారు తెలుసుకుంటూ ఉంటారు.
ఉన్నది కాల మృత్యువే.,అకాల మృత్యువు అనేది లేనే లేదు.
సూర్యుని స్వరూపం - వెలుగు, వేడి.
ఆత్మ స్వరూపం - జ్ఞానము, శక్తి, చైతన్యం.
➡️ మనిషి అంటే నాలుగు - భౌతిక శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ.
➡️ మనిషికి కావలసినవి - సుఖం, సంతోషం, శాంతి, ఆనందం.
👉 సుఖం శరీరానికి సంబంధించినది.
👉 సంతోషం మనస్సుకు సంబంధించినది.
👉 శాంతం బుద్ధికి సంబంధించినది.
👉 ఆనందం ఆత్మకు సంబంధించినది.
పై వన్నీ ఉంటేనే ఆరోగ్యం పిలుస్తారు. 'ఆరోగ్యమే మహాభాగ్యము' అంటే ఇదేనన్న మాట.
🕉🌞🌎🌙🌟🚩 🕉🌞🌏🌙🌟🚩
భగవద్గీతలో 'సమఃకాయ శిరోగ్రీవం' అన్నారు. కాయం అంటే శరీరం, శిరం అంటే తల, గ్రీవం అంటే మెడ ... ఈ మూడు తిన్నగా అని కాదు !
సమఃకాయ శిరోగ్రీవం అంటే:-
➡️ శిరస్సు నుండి వచ్చే 'ఆలోచన'లనీ (మనసా)
➡️ గ్రీవం అంటే కంఠం ద్వారా 'వాక్కు'ని (వాచా)
➡️ కాయం అంటే శరీరం చేసే 'కర్మ'లని (కర్మణా) అర్ధం.
👉 మనసా, వాచా, కర్మణా సమంగా అంటే "త్రికరణశుద్ధి" గా ఉండమని అంతరార్థం.
⚡️✨⚡️✨⚡️✨
➡️ నామాలు పెట్టు
కోవడమే - ప్రాపంచికత.
➡️నామాలు తీసివెయ్యడమే - ఆధ్యాత్మికత. తీసివేయవలసినవి 'నా' 'మా' లు.
నా శరీరం , నా ఇల్లు, నా పిల్లలు -- 'నా' లు..... మా జాతి, మా కులం, మా దేశం -- 'మా' లు
ఇక నుంచి 'నా 'మా' అనేవి తీసేసి 'మన' అని పెట్టుకుందాం !
🕉🌞🌏🌙🌟🚩
ఆంజనేయ గాయత్రి , ధ్యానం , త్రికాల వందనం ॥
శ్రీ ఆంజనేయ స్వామీ పరదేవతాభ్యో నమః
ధ్యానమ్:-
ఉద్యదాదిత్య సంకాశం ఉదార భుజ విక్రమమ్ ।
కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదమ్ ॥
శ్రీ రామ హృదయానందం భక్త కల్ప మహీరుహమ్ ।
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ ॥
ప్రాణాయామ మంటే ?
'తస్మిన్‌సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేద: ప్రాణాయామ:'
"శ్వాసను నియమించుట లేక వశపరచుకొనుట యనగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆపుజేయుట. ఇది ఆసనసిద్ధి కలిగిన పిదప సహజముగ సిద్ధించును."
ప్రాణాయామమును గురించి పతంజలి యోగసూత్రములలో 2 అ. 49 సూత్రములో ఈ విధముగ వివరించబడి యున్నది
'శ్వాస' యనగా లోపలికి పీల్చుగాలి, 'ప్రశ్వాస' యనగా బయటకు విడచుగాలి. ఆసనసిద్ధి కలిగిన పిమ్మట ప్రాణాయామమును అభ్యసించవచ్చును. ఒకే ఆసనములో కదలక మెదలక ఒకేసారిగ మూడుగంటలసేపు కూర్చొన గలుగుటయే ఆసనసిద్ధి. అరగంట నుండి గంటవరకు ఒకే ఆసనములో కూర్చొన గలిగినప్పటినుండి ప్రాణాయామము చేయుటను ప్రారంభించ వచ్చును. ప్రాణాయామము చేయకుండా ఆధ్యాత్మిక సాధనలో జయము పొందుట చాల కష్టము. విడిగా చూచినచో ప్రాణము వ్యష్టి రూపము గలది. జగత్ప్రాణమును హిరణ్యగర్భ మందురు. దానినే సమిష్టి ప్రాణమని కూడ చెప్పెదరు. ఒకే నిప్పు పుల్లను వ్యష్టి యందురు; నిప్పుపెట్టెను అంతనూ సమిష్టి యందురు. ఇదేరీతిని ఒక మామిడికాయను వ్యష్టి యనియు, మామిడికాపున ంతటిని, సమిష్టియనియు అందురు. శరీరమునకు గల శక్తియే ప్రాణము. ఊపిరితిత్తుల యొక్క చలనమును లేక శ్వాస ప్రశ్వాసేంద్రియములను వశపరచుకొనుటవల్ల, లోపల ప్రసరించుచున్న ప్రాణ శక్తి వశపడును. ప్రాణము వశపడుటచే మనస్సులోబడును. ప్రాణము మనస్సు, పక్షి, తాడులాటివి. త్రాటితో కట్టి వేయబడిన పక్షి తప్పించుకుపోవలెనని యిటు అటు ఎగిరి చివరకు తప్పనిసరిగా, తాను కట్టివేయబడిన చోటునకే తిరిగివచ్చి ఏవిధముగా విశ్రమించునో, అదేవిధముగ ఈమనస్సు అనెడి పక్షి అనేకవిధములగు యింద్రియవిషయములకై పరుగులిడి, ఎందునను సుఖము గానక, చివరకు రాత్రి సమయమున తన విశ్రాంతి స్థానమగు ప్రాణమును చేరుచున్నది.
స్వామి శివానంద
అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్ ।
కపీశం అక్షహంతారం వన్దే లంకా భయంకరమ్ ॥
ఆంజనేయం అతిపాటలాననం కఞనాద్రి కమనీయ విగ్రహమ్ ।
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నన్దనమ్ ॥
ఉల్లంఘ్య సిన్ధోః సలిలం సలీలం యశ్శోక వహ్నిం జనకాత్మజాయ ।
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం ॥
అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహమ్ దనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యమ్ ।
సకల గుణ నిధానం వానరాణాం అధీశమ్ రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి ॥
గోశ్పదీకృత వారశిం మశకీకృత రాక్షసామ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
అమషీకృత మార్తండం గోశ్పదీకృత సాగరమ్ ।
తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహమ్ ॥
మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ ।
వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీ రామదూతం శిరసా నమామి ॥
ఆంజనేయ గాయత్రి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి । తన్నో హనుమత్ ప్రచోదయాత్ ॥
దశావతారాల నుండి మనం నేర్చుకోవలసిన అంతరార్ధము:-
🕉🌞🌏🌙🌟🚩
1. మత్స్యావతారం - చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.
2. కూర్మావతారం - తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.
3. వరాహావతారం - వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.
4. నరసింహావతారం - మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.
5. వామనావతారం - మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ; మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.
6. పరశురామావతారం - 'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.
7. రామావతారం - 'ధర్మ'యుతంగా జీవించాలి.
8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.
9. బుద్ధావతారం - 'జ్ఞానాన్ని' పంచాలి.
10. కల్కి అవతారం - సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'.
🕉🌞🌏🌙🌟🚩
🌹. ఈశ్వరుడే జీవుడిగా దిగి వస్తున్నాడు. 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీగురుభ్యోనమః🙏
కార్యము, కారణము, కర్తృత్వము ఈ మూడింటినీ నిర్వహించడానికి మూడు రకముల ప్రజ్ఞలు దిగివస్తాయి. అవి మూడు శరీరములుగా ఏర్పడతాయి.
1. కారణ శరీరము : ఇది జీవుడికి సమీపముగనే ఉంటుంది. వజ్ర కాంతితో ఉంటుంది. 2. సూక్ష్మశరీరము ఇది బంగారుకాంతితో ఉంటుంది. 3. భౌతిక శరీరము అది రక్తమాంసాలతో కూడి ఉంటుంది.
ఈ మూడును తనకు లింగ శరీరములుగా ఏర్పరచుకొని ఈశ్వరుడు జీవుడగుచున్నాడు.
✍️. భాగవతము
Master K.P.K. 🙏
నవ గోపికా సంఘము
🕉🌞🌏🌙🌟🚩
👉 ఏమి తినకుండా ఉండటం - ఉపవాసం.
యుక్తాహారం ➡️ మితాహారం➡️ నిరాహారం.
👉 ఏమీ మాట్లాడకుండా ఉండటం - మౌనం.
యుక్తభాషణం ➡️ మితభాషణం ➡️ నిర్భాషణం.
👉ఏ ఆలోచన లేకుండా ఉండటం- ధ్యానం.
యుక్త యోచనం ➡️ మిత యోచనం ➡️ నిర్ యోచనం.
⚡️✨⚡️✨⚡️✨
యుక్తము = అవసరం మేరకు స్వీకరించడం,
మితం=అవసరం కన్నా తక్కువ స్వీకరించడం,
నిరా = అసలు స్వీకరించక పోవడం. ( పై విధంగా, జ్ఞాని తన భౌతిక అవసరాలను, క్రమ క్రమంగా తగ్గించుకుంటు వెళతారు)
⚡️✨⚡️✨⚡️✨
👉 అరుణాచలమే తొలి లింగం - భౌతిక ప్రపంచంలో.
👉 'నేను' అను అహం స్ఫురణే జ్ఞాన లింగం - మనో జగత్తులో.
⚡️✨⚡️✨⚡️✨
'నేను ఉన్నాను' అని కాకుండా "నేను ఉన్నట్లు ఉన్నాను" అని ఉంటే.,
నీవు పొందవలసినదేదో, అది పొందినట్లు లెక్క.
⚡️✨⚡️✨⚡️✨
ఆకాశంలో మబ్బులు ఉండి, కాసేపటికి లేకుండా పోయినట్టు... మనసులో తలంపులు కూడా అంతే.
👉 తలంపులతో ఉన్నప్పుడు చిత్తము అని పేరు.
👉 తలంపులు లేనప్పుడు చిదము (జ్ఞానం) అని పేరు.
👉 తలంపుకు, తలంపుకు మధ్య ఉన్న ఖాళీ చిదాకాశము.
👉 తలంపుకు - తలంపుకు మధ్య ఉన్న శూన్యస్థితిని పెంచుకోవడమే "సాధన".
⚡️✨⚡️✨⚡️✨
ఆలోచన = అయితే భూతకాలం, లేకపోతే భవిష్యత్ కాలం.
శ్వాస = భూతకాలం కాదు, భవిష్యత్తు కాదు. నిరంతరం అది వర్తమానమే.
వర్తమానంలో స్థితమైతే అనగా ధ్యానం,ప్రాణాయమం (Simple & Powerful Technique) విధానం ద్వారా చిత్తం (మనస్సు) త్వరగా శూన్యస్థితి
ని (ధ్యానస్థితి) పొందుతుంది.
🕉🌞🌏🌙🌟🚩
🌻. సప్తర్షులు - సప్త జాతులు 🌻
ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, ఇంద్రుడు అనబడువారు ఒక్కొక్క తారకను అధిష్టించి పనిచేయుచుందురు. వారి ప్రభావమున మన భూమిపై నరజాతుల స్వభావములు కూడ ఏర్పడుచుండును.
సప్తర్షులను బట్టి భూగోళము మొత్తమున ఏడు జాతులు వర్తించును. అందొక్కొక్క జాతి యందు ఉపజాతులు ఏడు వర్తించును. ఈ జాతులు స్వభావ గుణ కర్మ స్వరూపులుగా ఏర్పడును గాని, రాజకీయపు సరిహద్దులను బట్టి ఏర్పడవు.
మఱియు ఒక్కొక్క తారకకు అధిదేవత అయిన వెలుగు యొక్క అంశలో ఒక్కొక్క దేహధారి ఈ భూమియందు పనిచేయుచుండును. వీని వివరములన్నియు పురాణేతిహాసముల యందు విస్తారముగా వెదజల్లబడి యున్నవి.
మనకు బోధపడునట్లు ఆంగ్లమున ఇరువదియవ శతాబ్దమున హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ రచించిన Secret Doctrine గ్రంథము నందును, Alice A Bailey రచించిన The Seven Rays అను శీర్షికతో ప్రకటింపబడిన ఇరువది నాలుగు గ్రంథముల యందును ప్రచురింప బడినవి.
🌹. ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు...! నిరాశ లేకుండా సాధన మరల మరల చేయాలి. 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది.
భగవంతుని పై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానం లో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. కాబట్టి ధ్యాన ప్రక్రియ లో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:
1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచము మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.
2. మరల, బుద్ధి విచక్షణ శక్తి చే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యం గా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతుని పైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.
3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.
ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, “భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.” అని.
శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు చంచలమైనదే, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది, అని ముందే అనుకోవాలి, అని అంటున్నాడు.
కానీ, అది చంచలమై పోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకి వస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించు కోవాలి.
ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానం పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది.
ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.
🌹 🌹 🌹 🌹 🌹
💫ముక్కుపుడక - కబీర్ దాస్ గారు :
🕉🌞🌏🌙🌟🚩
ఒకసారి సంత్ కబీర్ దాస్ గారు, హరి భజన చేస్తూ ఒక వీధిలో నుంచి వెళుతున్నారు. ఆయన ముందు కొంత మంది స్త్రీలు నడుచుకుంటూ వెళుతున్నారు. అందులో ఒక అమ్మాయికి అప్పుడే పెళ్లి కుదిరింది, ఆమె అత్తింటివారు నిశ్చితార్థం సారె తో పాటూ ఒక ఖరీదైన బంగారు ముక్కుపుడక పంపించారు. ఆ అమ్మాయి ఆ ముక్కుపుడక ను నలుగురికీ చూపిస్తూ ఎంతో మురిసిపోతోంది, తన అత్తింటివారిని వారు పంపిన ఆ ముక్కుపుడకను తెగ పొగిడేస్తోంది, ముక్కుపుడక అలా ఉంది, ఇలా ఉంది, మా అత్తారు నాకొసమే ప్రత్యేకంగా చేయించి పంపారు, వాళ్ళు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు అని తెగ పొగుడుతోంది.
వాళ్ళ వెనుక వస్తున్న కబీర్ దాస్ గారి చెవిలో ఈ మాటలు పడ్డాయి, వారు వెంటనే గబగబా రెండడుగులు ముందుకు వేసి,
ఆ అమ్మాయి వద్దకు వచ్చారు. వచ్చి ఇలా అన్నారు...
"అమ్మాయి నీకు ముక్కుపుడక ఇచ్చిన మీ వాళ్ళను ఇంతలా పొగుడుతూ, నానా విధాలా కీర్తుస్తున్నవే...,
మరి?
నీకు అంతటి అందమైనముక్కుని ప్రసాదించిన వాడిని (ఆ భగవంతుడిని) ఏనాడైనా గుర్తుచేసుకున్నవా? కనీసం ఒక్కసారైనా మనసారా కీర్తించావా..?" అని అడిగారు.
ఓ సాధు జీవులరా...!
అసలు ముక్కే లేకుంటే ఇక ముక్కెర (ముక్కుపుడక) ఎక్కడ పెట్టుకుంటారు.? అని హితబోధ చేశారు.
నిత్య జీవితంలో సరిగ్గా మనం చేసేది కూడా ఇదే..!
అశాశ్వతమైన ఈ భౌతిక/ప్రాపాంచిక వస్తువులను నిరంతరం గుర్తుంచుకుంటాం, కానీ.,
అతి దుర్లభమైన ఎంతో విలువైన ఈ మానవ జన్మని ప్రసాదించిన ఆ పరమాత్మను మాత్రం ఏమాత్రం గుర్తుంచుకోము,.
ఈ శరీరంతో సంబంధం ఉన్న ప్రతీ వారినీ మనం గుర్తుంచుకుంటాము, కానీ దీన్ని మనకు ప్రసాదించిన ఆ పరమాత్మని గుర్తుచేసుకోడానికి/స్మరించడానికి మాత్రం మనకు సమయం ఉండదు.
🕉🌞🌏🌙🌟🚩
దేహం
🕉🌞🌏🌙🌟🚩
*అద్దె కొంప కదరా!
ఆశలు ఎందుకురా!
తొమ్మిది గడపల ఇల్లు!
తొంగి చూడు నీచం రా!!
ఆహారం అద్దె కట్టి!
నిరంతరం నీరు పెట్టి!
పట్టు బట్టలు కట్టి!
పట్టమూ కడితె!
ఏక్షణం కూలునో!
ఎక్కడది రాలునో!!*
దేహం ఖచ్చితంగా బాడుగ ఇల్లే. నా స్వంతం అని అహంకరిస్తే అసలు యజమాని ఖాళీచేయమంటాడు. బాడుగ ఇస్తున్నాను అని వున్న ఇంటిని అలక్ష్యం చేసినప్పుడు కూడా అసలుయజమాని బైటికి తోలేస్తాడు. వున్నన్ని నాళ్ళు నాది అనికాని నాదికాదు అనికాని భావించక నేను నిమిత్త మాత్రం చేయించేది నీవు ఓ పరమాత్మ నీ ఇష్టం ప్రకారం జరిగేది జరగని. జీవునిగా నా ప్రయత్న లోపం జరుపుతాను.
ధనం, జ్ఞానం పంచుతుంటే పెరుగుతుంది. దాచితే నిరుపయోగం అవుతుంది.
🕉🌞🌏🌙🌟🚩
'అష్టావక్రగీత' 19వ ప్రకరణ (637)
🕉🌞🌏🌙🌟🚩
మనసులో సున్నితత్వం పెరిగే కొద్దీ నిర్మలత్వం వస్తుంది !!
శత్రుత్వం, క్రోధం, ద్వేషం వంటి గుణాలతో మనసును నింపితే ఎదుటివారితో అసహజంగా ఉండాలి. గంభీరంగా, ముభావంగా, పలకరింపులేకుండా ఉండటం అలవాటుగా మారి పవిత్రమైన మనసు
ను మలినం చేసుకుంటాం. అది దైవానికి మనని దూరంచేస్తుంది. మనో నిర్మలత్వమే దైవం. మనసులో సున్నితత్వం పెరిగే కొద్ది నిర్మలత్వం వస్తుంది. సున్నితత్వం అంటే ప్రేమ నిండిన మనసు. మాతృత్వంలో మనకు కనిపించేది ఆ సున్నితత్వమే. అది దైవత్వానికి ప్రతిరూపం. వాస్తవిక దృక్పథంతో అన్వేషిస్తే దైవంలేని చోటును చూడలేము. ఒక మొలకెత్తిన మామిడి టెంకె 100 ఏళ్ల పంటను, లక్షకాయల కాపు తనలో ఇముడ్చుకొని ఉండటం మాతృత్వం. అదే దైవం !
🕉🌞🌏🌙🌟🚩
అష్టైశ్వర్యాలు:-
అష్టైశ్వర్యాలు అంటే అష్ట సిద్ధులు! అవి:-
👉 సూక్ష్మరూపం ధరించగలగడం అణిమ.
👉 గొప్ప రూపం ధరించడం మహిమ.
👉 తేలికగా అయిపోవడం లఘిమ.
👉 బరువుగా అయిపోవడం గరిమ.
👉 పొందవలసిన వాటిని పొందడమే ప్రాప్తి.
👉 విశేషమైన కోరిక తీరడమే ప్రకామ్య.
👉 అందరి మీద పరిపాలనా శక్తి ఈశత్వ.
👉 అందరినీ వశపరచుకోవడం వశిత్వ.
మొదటి నాలుగు....అణిమ, మహిమ, గరిమ, లఘిమ .. ఇవి ధ్యానంలోంచి లభ్యమవుతాయి.
చివరి నాలుగు ... ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ... ఇవి బ్రహ్మ జ్ఞానంలోంచి లభ్యమవుతాయి.
✨⚡️✨⚡️✨⚡️✨
నేను శరీరం కాదు ఆత్మను అనేది స్థూల జ్ఞానం.
వివిధ రకాల మూల కర్మల పర్యవసానాల గురించి, సృష్టి రహస్యాల గురించి తెలుసుకోవడం సూక్ష్మ జ్ఞానం.
మొదట స్థూల జ్ఞానం గురించి తెలుసుకుంటే మెల్ల మెల్లగా సూక్ష్మజ్ఞానం వస్తుంది. ఎవరైతే సూక్ష్మజ్ఞానాన్ని పొందుతారో వారు అత్యున్నత స్థితికి చేరిన వాళ్ళు.
✨⚡️✨⚡️✨⚡️✨
దేవుడు అనుభవంలోకి రానంత వరకే దేవునికి, తనకూ ఉనికి.
అనుభవంలోకి వస్తే ఒక్కనికే ఉనికి. ఇదే 'జీవబ్రహ్మైక్య యోగం' అంటే.*
✨⚡️✨⚡️✨⚡️✨
మన శరీరంలో విద్యుదయస్కాంత శక్తి కణాలు (Electro Energy units) హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్ లు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ముట్టడించలేవు.వీటిని (EE units) పెంచుకోవడానికి అతి సులభమైన మార్గము అంతర్ ప్రయాణం లేదా ధ్యానం.
🕉🌞🌏🌙🌟🚩
బహిర్ముఖం (ప్రాపంచికం) - పార్వతి, అంతర్ముఖం (ఆధ్యాత్మికం) - శివుడు.
* ఈ రెండు ముఖాలను కలిగి ఉన్నవాడు - అర్ధనారీశ్వరుడు.*
* ఈ రెండు ముఖాలను తనవి కావని ఉన్నవాడు - పరమేశ్వరుడు.*
✨⚡️✨⚡️✨⚡️
ఇతర విషయాల్లో:-
తెలుసుకోవటానికి, తెలియకపోవటానికి తేడా ఉంది.
పొందటానికి, పొందకపోవటానికి తేడా ఉంది.
✨⚡️✨⚡️✨⚡️
ఆధ్యాత్మిక విషయాల్లో:-
నీకు తెలుసుకుంటే ఎంతో., నీకు తెలియక పోయినా అంతే.
నీవు పొందితే ఎంతో., పొందకపోయినా అంతే. తేడా ఉండదు.
ఎందుకంటే ఉన్నది అదొక్కటే కాబట్టి.
✨⚡️✨⚡️✨⚡️
కర్తృత్వ భావన - పాపం.
సాక్షి గా ఉండడం - పుణ్యం.
ఎప్పుడూ ఉండేదే సత్యం.
సర్వ ఉపరితల అనుకూ
ల, అననుకూల పరిస్థితుల్లో సదా సాక్షిభూతంగా ఉండే 'నేను' అన్న సత్య పదార్థం పేరే "ఆత్మ".
✨⚡️✨⚡️✨⚡️
సత్యం గురించి తెలుసుకుంటూ, తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు బోధిస్తూ ధర్మమార్గాన్ని అనుసరించడమే "ఆధ్యాత్మికత".
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment