ప్రాణాయామ ప్రకరణం

ప్రాణాయామ ప్రకరణం



               --- 18 ---


 25.  శరీరమును గాని, శరీర భాగములను గానీ అనవసరముగా ఊపులాటగాని, కదల్చుటగాని చేయకుము. ఇందువల్ల మనస్సు చెదరి పోవును. శరీరమును అదేపనిగ గోకుట తప్పు. ప్రాణాయామము, జపము ధ్యానములను చేయునప్పుడు శరీరము రాతివలె నిశ్చలముగ వుండవలెను.

26. నీ శరీర తత్వమునకు సరిపడు ఆహార నియమములను ఏర్పరచు కొనుము. నీకు సులభముగా అభ్యసించుటకు అనువైన సాధననే మొదట ప్రారంభించుము. దానికి సంబంధించిన వివరముల నన్నిటిని జాగ్రత్తగా చదివి, అర్ధము చేసికొని, ఆ పిమ్మట సాధన మొదలుపెట్టుము. ఇంకను సందేహము లున్నచో, ఎవరైన సాధనచేయుచున్న విద్యార్థి నడిగి సంశయమును నివారించుకొనుము. ఇది సుఖమైన పద్ధతి. నీశక్తికి మించిన సాధనను అత్యాశతో ప్రథమములోనే ప్రారంభించి అపాయములను పొందవద్దు.

27. మొదటిలో రేచక, పూరక కుంభకముల పరిమాణమును లెక్కించుటకు 'ఓం' ను నిర్ణయించి చెప్పితిమి. ఈ మంత్రమునే వుపయోగించవలెనను నియమ మేదియూ లేదు. (పిండే పిండే మతిర్భిన్నః.....ఒక్కొక్కడి తత్వాన్ని బట్టి కూడా ఫలానా మంత్రం జపం చేయవచ్చు. అయితే అది గురువు నిర్ణయిస్తాడు.) రామ, శివ, లేక నీ గురువుచెప్పిన మరే మంత్రమునైనగాని, చేయవచ్చును. కాని 'ఓం' లేక గాయత్రి, ప్రాణాయామమునకు సులభమైనట్టిన్నీ, అనుకూలముగా వుండునట్టివిన్ని అయివున్నవి. వీటిని యిదివరలోచెప్పిన, నిష్పత్తి ననుసరించి లెక్కించవలెను. ఉచ్చస్థితికి వచ్చినపిమ్మట ఈ లెక్క లేకుండగనే లెక్కప్రకారము చేయగలుగుట అలవడును.

28. ప్రారంభస్థితిలో నీయందలి అభివృద్ధిని తెలసికొనుటకై లెక్కించవలెను. ఆ తరువాత ఉచ్ఛస్థితికి వచ్చిన పిమ్మట ఊపిరితిత్తులే నీకు లెక్క చెప్పగలవు.

 29. మిక్కిలి అలసట చెందిపోవునంతవరకు ప్రాణాయామము చేయకుము. మితిమీరిన నియమములకు కట్టుబడి వుండకుము.

30. ప్రాణాయామము చేసిన వెంటనే స్నానము చేయకుము. ప్రాణాయామానంతరము అరగంటసేపు విశ్రాంతి తీసికొనుము. సాధనాసమయమున చెమటపోసినచో, తువ్వాలతో తుడవవద్దు. చేతితో ఆరిపోవునంతవరకు రుద్దుము. అంతేగాని గాలికి ఆరిపోవులాగున వదలకుము. దీని వలన నాడులకు, మొత్తంగా శరీరానికి బలము కలుగును.

31. రేచక పూరకములలో ఏమాత్రము శబ్దమును కానివ్వరాదు. భస్త్రిక, కపాలభాతి, శీతలి, సీత్కారి ప్రాణాయామములలో మాత్రము, కొద్ది శబ్దము కావచ్చును.

32. రోజుకు రెండు మూడు నిమిషముల చొప్పున ఒకటి రెండు రోజులు చేసినంతటిలోనే ఏ ఫలితములును కనిపించవు. రోజుకు 15 నిముషములకు తక్కువ కాకుండ కొన్నాళ్ళవరకు చేయవలెను. రోజుకు ఒకరకపు సాధనను చేయరాదు. ప్రతి రోజూ చేయుటకు కొన్ని సాధనలను నిర్ణ యించుకొని, వాటి యందే అభివృద్ధిలోనికి వచ్చుటకు ప్రయత్నించవలెను. తదితర సాధనలను ఏకొద్దిగానో ప్రతిరోజుగాని, అప్పుడప్పుడుగాని చేయుచుండవలెను. భస్త్రిక, కపాలభాతి, సుఖ పూర్వక ప్రాణాయామములను నిత్యమూ చేయుచుంటివనుకొనుము. శీతలి, సీత్కారి ప్రాణాయామాదులను అప్పుడప్పుడు చేయవచ్చును.

33. పూరకమును 'నిశ్వాస'మనియు, రేచకమును 'ఉచ్చ్వాస' మనియు, కేవల కుంభకమును 'శూన్యక' మనియు, సరియగు కుంభకమును అభ్యసించుటను, 'అభ్యాసయోగ' మనియు, గాలిని త్రాగి జీవించుటను 'వాయుభక్షణ' అనియు అందురు.

 34. 'శివయోగ దీపిక'ను రచించినవారు ప్రాణాయామమును మూడు రకములుగ వర్ణించిరి:

1. ప్రకృతి 2. వైకృతి 3. కేవల కుంభకము----అని.

"రేచక పూరకములు తమంత తామే, తమ సహజ రీతిని జరుగుచుండుటను "ప్రకృత" మందురు. శాస్త్రోక్త ప్రకారము రేచక పూరక కుంభక నియమములతో చేయునది కృతిమము గాన దానిని "వైకృతి" యందురు. ఈ రెండింటికి అతీతుడై రేచక పూరకములను ఆకస్మికముగ ఆపివేయ గలుగుటను కేవల కుంభకమందురు.

ప్రకృతి ప్రాణాయామము మంత్ర యోగమునకును, వైకృతి లయయోగమునకును సంబంధించినది!

35. శరీరము నిశ్చలముగా ప్రశాంతస్థితిలో వుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా వుండుటను కుంభకమందురు. ఇట్టి స్థితియందున్న వాని స్థితి వినుటయందు చెవిటివానివలెను, చూచుటలో గ్రుడ్డివానివలెను వుండును!

36. పతంజలి మహర్షి,  ప్రాణాయామమును గురించి ఎక్కువ శ్రద్ద చూపలేదు. "రేచకమును, పూరకమును నెమ్మదిగా చేయుము. కొంతసేపు గాలిని కుంభించుము. ప్రశాంతమైన నిలుకడగల మనస్సుగలవాడ నగుదువు" అని చెప్పెను. హఠయోగులే దీని నొక ప్రత్యేక శాస్త్రముగ వృద్ధిచేసి, అందరకు అనుకూలముగ వుండునటుల రకరకములగు ప్రాణాయామములను సృష్టించిరి.

37. "పులి లేక జింక చర్మము, అదిన్నీ లేనిచో నాల్గు మడతలు వేసిన జంబుఖానాను పరచుము. దానిపై తెల్లని గుడ్డనుపరచి, ఉత్తరముఖము గలవాడవై, ప్రాణాయామము చేయుటకు కూర్చొనుము.

38. కొందరు రేచక, పూరక, కుంభకములను, మరి కొందరు పూరక కుంభక రేచకములను వరుసగా చేసెదరు. వీటిలో రెండవ విధమునే ఎక్కువమంది చేసెదరు.

యాజ్య్ఞవల్కుడు 'పూరక, కుంభక, రేచకములను' క్రమముగ చెప్పెను. నారదీయములో రేచక, పూరక, కుంభకములను క్రమముగా చెప్పెను. ఈ రెండింటిని ఇచ్ఛానుసారము అభ్యసించ వచ్చును.

39. యోగి యగువాడు భయము, కోపము, సోమరి తనము, అతి నిద్ర, అతి మెలకువ, అతి తిండి, అతి ఉపవాసములు లేకుండ వుండవలెను. పై నియమములను పాటించుచూ ప్రతినిత్యము సాధన చేయుచున్నచో ఆధ్యాత్మిక సామ్రాజ్యము నిస్సందేహముగ మూడు మాసములలో లభించగలదు. నాల్గు మాసములలో దేవతలను చూడగలడు. అయిదు మాసములలో బ్రహ్మనిష్ఠుడు కాగలడు. ఆరు మాసములలో తన ఇచ్ఛాను సారము కైవల్య ప్రాప్తిని పొందగలడు. ఇం దేవిధమగు సంశయము లేదు.

40. ప్రారంభకుడు పూరక రేచకములను మాత్రమే కొన్నాళ్ళు చేయవలెను. కుంభకము చేయరాదు. అట్టి స్థితి యందు పూరక రేచకముల నిష్పత్తి 1:2 లో వుండవలెను.

41. ప్రాణాయామమును కూర్చొని, నిలబడి లేక నడచుచూ లేక పడుకొని ఏరీతిగా చేసినప్పటికి ఫలితముల నివ్వ గలదు. చెప్పిన విధానము ప్రకారము చేసినచో ఫలితములు త్వరగా కనిపించును.

42. కుంభకకాలమును క్రమక్రమముగ వృద్ధిచేయుము. మొదటివారము 4 సెకండ్లు, రెండవవారము 8 సెకండ్లు, మూడవవారము 12 సెకండ్లు ఈ రీతిని పెంచుకొనుచురమ్ము. నీ శక్తి ననుసరించి పెంచుకొనుచు రమ్ము.

43. యుక్తిని వుపయోగించుము. యుక్తి లేనిచో ఏమియులేదు. యుక్తి వున్నచోట సిద్ధి, భుక్తి ముక్తులుగలవు.

44. రేచక పూరక కుంభక పరిమాణములు, సాధనలో శ్రమగా తోచకుండు రీతిని వుండవలెను. సాధన మధ్యలో కొంచెము సేపుఆగి, చేయుదమని అనిపించులాగున వుండరాదు.

45. రేచకమును అనవసరముగ ఎక్కువ పొడిగించకుము. అందువల్ల పూరకమును హడావిడిగా చేయవలసి వచ్చును. ఇందుచే క్రమము తప్పును.

46. సూర్యభేది, ఉజ్జయులు ఉష్ణమును కలిగించును. సీత్కారి, శీతలులు చల్లదనము నిచ్చును. భస్త్రిక శీతోష్ణములను సమానముగ వుంచును. సూర్యభేది వాతాధిక్యతను, తొలగించును. ఉజ్జయి శ్లేష్మాధిక్యతను, సీత్కారి శీతలులు పైత్యమును, భస్త్రిక యీ మూడింటి ఆధిక్యమును తగ్గించును.

47. సూర్యభేది, ఉజ్జయులను శీతాకాలమందును, సీత్కారి, శీతలులను ఎండాకాలమందును, భస్త్రికను అన్ని కాలములందును అభ్యసించవచ్చును. అతి ఉష్ణతత్వముతో కూడియుండు శరీరము గలవారు. శీతాకాలములో కూడ సీత్కారి, శీతలులను చేయవచ్చును.

48. జీవితముయొక్క లక్ష్యము ఆత్మజ్ఞానము. ఇది శరీర ఇంద్రియ సంయమము, సద్గురు సేవ, వేదాంత శ్రవణ, ఎడ తెగని ధ్యానముచే సిద్ధించును. నీవు అతిత్వరగా లక్ష్యమును చేరగోరుచో, ఆసన, ప్రాణాయామ, జప, ధ్యాన, స్వాధ్యాయాదులను, ప్రతినిత్యము క్రమప్రకారము చేయుచు బ్రహ్మ చర్య పాలనమును చేయవలెను.

"మనస్సును వశపరచు కొనుట, ఆత్మజ్ఞానము, సత్సంగము, వాననా పరిత్యాగము, ప్రాణమును వశపరచుకొనుట యివి ముక్తినిచ్చును." (ముక్తికోపనిషత్తు)

49. ఆసనము, ప్రాణాయామము, జపము, ధ్యానము, బ్రహ్మవిచారము, సత్సంగము, ఏకాంతము, మౌనము, నిష్కామకర్మ, యివన్నియు అధ్యాత్మికోన్నతికి ఆవశ్యకములని మరొకమారు చెప్పుచున్నాను. హఠయోగము లేకుండా చాలాకష్టపడిననే రాజయోగ సిద్ధి కలుగ గలదు. కుంభకముయొక్క అంతమున మనస్సును ఇంద్రియములనుండి మరల్చవలెను. క్రమక్రమముగ ఇందు సిద్ధి కలుగ గలదు.

50. వేదాంత గ్రంథ పఠనము మాత్రము చేయు కొందరు విద్యార్థులు, తాము జ్ఞానులమని భ్రమపడి ఆసన ప్రాణాయామాదులను త్యజించెదరు. వారుకూడ జ్ఞానయోగమునకు కావలసిన శమదమాది షట్సంపదలు లభించునంత వరకు ఆసనాదులను చేయవలెను.

51. నీ ప్రక్కన కూర్చొని నీకు ప్రతివిషయమును బోధించుటకు గాను గురువెవరూ లభించలేదని వ్యాకులపడ కుము. చెప్పిన ప్రకారము సక్రమముగా చేయుచున్నచో, ఏ విధమగు బాధయు రాదు. నిస్సంశయముగ జయమును పొందెదవు. ప్రారంభములో ఏవో స్వల్ప దోషములు వుండవచ్చును. అవి క్రమక్రమముగ పోవును. కావున ప్రతి స్వల్పవిషయమునకు భయపడి సాధనను మానివేయకుము. సాధనను శ్రద్దాభక్తులతో వెంటనే ప్రారంభించుము. క్రమము తప్పకుండ చేయుచుండుము. తప్పక యోగివి కాగలవు.

(అయిపోయింది)

స్వామి శివానంద, హృషీకేశ్

ప్రాణాయామ పద్ధతులను , బోధించిన ఋషి సత్తములకు నమోవాకములు అర్పిస్తూ......

భట్టాచార్య

ప్రాణా యామ ప్రకరణం



            --- 17 ---

(కొన్ని సూచనలు)


13. మొట్ట మొదట కొంతసేపు జపధ్యానములు చేయుము. తరువాత కొంతసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఆ తరువాత మరికొంతసేపు ధ్యానముచేయుము.

14. నిదురనుంచి లేవగనే, నిద్రమత్తుగానున్నచో కొంచెముసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఇందుచే మత్తుపోయి, ఏకాగ్రత లభించును.

15. ఈ క్రియలను యీ క్రిందిక్రమము ప్రకారము చేయుము. ఆసనములు, ముద్రలు, ప్రాణాయామము, ధ్యానము. ఉదయసమయమున చేయుచో, జపము, ధ్యానము, ఆసనములు, ముద్రలు, ప్రాణాయామములను వరుసగ చేయుము. ఈ రెండింటిలో నీకు అనుకూలముగ వున్నరీతిని చేయుము. ఆసనములు తరువాత ప్రాణాయామము మొదలు పెట్టుటకు పూర్వము, అయిదు నిమిషములు విశ్రాంతి తీసికొనుము.

16.కొన్ని హఠయోగ గ్రంథములు ప్రాత:కాలమందు చన్నీటి స్నానము చేయుటను నిషేధించును. ఇటువంటిది అతి శీతల ప్రదేశములగు కాష్మీర్, ముస్సోరీ, డార్జీలింగ్ మొదలగు ప్రదేశములలో ఉదయం 4 గంటలప్పుడు స్నానముచేయు వారికై యుండవచ్చును. కాని, వేడిప్రదేశములందుండు వారి విషయమై కాదు. యోగసాధనకు కూర్చొనబోవుటకు ముందు చన్నీటి స్నానము చాల ఆరోగ్యకరము.

17. ఆసనములు, ప్రాణాయామములు అన్ని వ్యాధులను కుదుర్చును. ఆరోగ్యమును కలిగించును. జీర్ణశక్తిని వృద్ధి చేయును, నరములకు పుష్ఠినిచ్చును. సుషుమ్నా నాడిని బాగు చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును. రజస్సును లేకుండ చేయును. ఆరోగ్యము, శరీరపుష్టి, లేనిదే ఏ సాధనచేయుటకు వలను కాదు; గాన ధ్యానయోగులు, కర్మ భక్తి యోగులు, వేదాంతులు అందరు హఠయోగ క్రియలను చేయుట లాభకరము.

18. శరీరారోగ్యము లేకుండా ఏ విధమగు కార్యములను చేయజాలము. కావున ప్రతివాడు శరీరారోగ్యమును నిలుపుకొనుటకు తెలసియో తెలియకయో యేదో హఠయోగ క్రియను చేయుచునే వున్నాడు.

19. అసౌకర్యముగా తోచినప్పుడు ప్రాణాయామము చేయుము. వెంటనే ఓపిక వచ్చును. నీవు ఏదైన వ్రాతపని మొదలు పెట్టబోవుటకు ముందు, కొంచెముసేపు ప్రాణాయామము చేయుము. చక్కని, ఆశ్చర్యకరమైన భావములు తట్టును.

20. కొందరు ప్రథమములో ఎక్కువ శ్రద్ధతో సాధనచేసి, కొద్దికాలము కాగానే మాని వేసెదరు; లేదా ఒకరోజు చేయుటా, ఒకరోజు మాని వేయుటా చేసెదరు. ఇది తప్పు.

21. తమలో గల మాలిన్యమును స్వార్ధ రహిత సేవ, విక్షేపము, యోగసాధనలచే పారద్రోలు కొనుటకు ప్రయత్నించ కుండగనే, సాధన ప్రారంభించుటయే తడవుగా కుండలినీ శక్తిని పైకిలేపి, బ్రహ్మాకారవృత్తిని పొందవలెనని చాల మంది కోరుదురు. ఇది తప్పు. ఇట్టి స్థితిని పొందగోరు వారు మనో వాక్కాయకర్మలందు పారిశుద్ధ్యము, మానసిక శారీరక బ్రహ్మ చర్యములను కలిగి యుండవలెను. అప్పుడే కుండలినీ శక్తిని లేపుటచే గలుగు ఆనందము లభించ గలదు.

22. పడుచుతనమునందే ఆధ్యాత్మిక బీజములను నాటుము. వీర్యమును వ్యర్థముచేసి కొనకుము. ఇంద్రియములను, మనస్సును కట్టుబాటు నందుంచుము. సాధనను చేయుము. ముసలి వాడవైన పిదప చేయవచ్చు నని తలచుట భ్రమ. మొక్కగా వున్నప్పుడు వంగనిది, మ్రానై నప్పుడు వంగునా? అను సామెతను జ్ఞాప్తికి తెచ్చుకొని, సాధనచేసి పూర్ణమగు ఫలితములను సంపాదించుము.

23. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిమ్మట పూర్తిగా 24 గంటలు మౌనధారివై యుండవలెను. నీకు అనుకూలముగా నుండునట్టి ఆసన, ప్రాణాయామాదులను ఎంచుకొనుము.

24. ప్రపంచములో అనేక రకములగు వ్యామోహములు వున్నప్పటికీ బ్రహ్మచర్య పాలనము  చేయవచ్చును. చక్కని కట్టుబాటుగల జీవితము, సద్గ్రంధ పఠన, సత్సంగము, జపము, ధ్యానము, ప్రాణాయామము, సాత్విక మైన మితాహారము, ఆత్మ చింతన, ఆత్మ వివేచన, ఆత్మపరీక్ష, సదాచారము, యమ నియమాభ్యాసము, శారీరక వాచిక తపస్సులు, ఇవన్నియు ముక్తిమార్గమునకు గొంపోవును. ఏనుగు తన నెత్తిపై తానే దుమ్ము పోసికొనునటుల తమ దుష్ప్రవర్తనాదులచే తమ జీవితమును తామే కంటక మయముగా చేసికొని, యితరులను నిందెంచెదరు. ఇంతకు మించిన మూర్ఖ
త్వము మరొకటి లేదు.

సశేషం

ప్రాణాయామ ప్రకరణం


             --- 16 ---

 (ప్రత్యేక సూచనలు)

1. ఉదయము పెందలకడ కాలకృత్యములను తీర్చికొని సాధన చేయుటకు కూర్చొనుము. తేమ లేకుండావుండి; చక్కగా గాలివచ్చెడి గదిలో ప్రాణాయామము చేయుము. ప్రాణాయా మము చేయుటకు గాడమైన ఏకాగ్రత శ్రద్ధలు కావలెను. నీకు అనుకూలముగావుండు ఆసనములో కూర్చొనుము. మనస్సు యొక్క ఏకాగ్రతను చెరచు ఏ వస్తువును నీ సమీపమున వుండనివ్వకుము.

2. ప్రాణాయామము చేయుటకు కూర్చొన బోవు ముందు, ముక్కులను బాగా శుభ్రపరచుకొనుము. సాధనను చేయబోవుటకు ముందు కొద్దిగా పళ్ళరసము లేక పాలు లేక కాఫీని తీసికొనవచ్చును. సాధన ముగిసినతరువాత 10 నిమిషముల అనంతరము ఒక గ్లాసెడు పాలుగాని ఏదైన అల్పాహారమునుగాని తీసికొనుము.

3. ఎండాకాలములో ఉదయము ఒకసారి మాత్రమే అభ్యాసముచేయుము. మెదడు లేక తల వేడిగానున్నచో భృంగామలక తైలమునుగాని, వెన్ననుగాని స్నానము చేయ బోవుటకు పూర్వము మర్ధనచేయుము. నీటిలో పటికబెల్లపు (నౌబోత్) పొడిని కరగించి, ఆ షర్బత్తును త్రాగుము. ఇందువల్ల శరీరమునందలి వేడి తగ్గును. శీతలి ప్రాణాయామమునుకూడ చేయుము. ఇందువల్ల శరీరముకు ఉష్ణాధిక్యము కలుగదు.

4. అతివాగుడు, మితిమీరి తినుట, అతినిద్ర, మిత్రులతో అతిగా కలసివుండుట, అతి శ్రమ కలిగించెడి పనులను మానుము. "యోగము మితిమీరి మెక్కువానికిగాని, మితిమీరి ఉపవసించువానికి గాని, మేల్కొనువానికిగాని సిద్ధించదు". (గీత 6-16 అన్నముతోపాటు నెయ్యి కలుపుకొని తినుము. ఇందువలన వాయువు సులభముగ సంచరించును.

5. "మితాహారం వినా యస్తు యోగారంభంతు కారయేత్| నానారోగో భవేత్తస్య కించిత్ యోగో న సిధ్యతే." (ఘే.సం. 5-16) ఆహార నియమములేకుండా యోగమును అభ్యసించువాడు, ఫలితమేమియు పొందకపోగా అనేకములగు జబ్బుల పాల్పడును.

6. ఆరు మాసములు లేక ఒక సంవత్సరము వరకు పూర్ణమైన బ్రహ్మచర్య పాలనము చేసినవాడు, ఆధ్యాత్మిక జగత్తులో....త్వరలో వృద్ధిలోనికి వచ్చును. స్త్రీలతో మాట్లాడవద్దు. వారితో పరిహాసము లాడుటగాని, నవ్వుటగాని చేయకుము.  బ్రహ్మచర్యపాలన, ఆహారమునందు కట్టుబాటు లేకుండా యోగసాధన చేసినచో నీకు పూర్తియైన ఫలితములు లభించవు. ఆరోగ్యమును కాపాడుకొన గోరువారు సామాన్య సాధనలు చేయవచ్చును.

7. క్రమబద్ధముగా నియమిత కాలమందు సాధన చేయుము. ఒక్క రోజుకూడ మానివేయకుము. ఏదైన తీవ్రమైన బాధ నిన్ను బాధించునప్పుడు సాధన మానివేయుము. కొందరు కుంభకమును చేయునప్పుడు ముఖ స్నాయువులను బిగలాగుదురు. అటుల చేయరాదు. ఇటుల చేయుట వారి శక్తికి మించిన సాధన చేయుచున్నారని అనుకొనుటకు సూచకము. ఇట్టి అలవాటు గలవారు రేచక పూరకములను సక్రమముగా చేయలేరు.

8. పగటినిద్ర, రాత్రులం దెక్కువసేపు మేల్కొని వుండుట, మలమూత్రములు అత్యధికముగా వుండుట, అనారోగ్యమును కలిగించు ఆహారము, ప్రాణశక్తి అపరిమితముగా వ్యర్థమగు మానసిక పరిశ్రమలు యోగ విఘ్న కారులు. కొందరు ఏదైన కారణముచే ఏదైన వ్యాధి వచ్చినచో, అది యోగ సాధనవల్ల వచ్చినదని తలచెదరు. ఇది తప్పు. 9. ఉదయం 4 గం. లకు నిద్ర లెమ్ము. అరగంటసేపు జపముగాని, ధ్యానముగాని చేయుము. తరువాత ఆసనములను ముద్రలను చేయుము. 15 నిముషములు విశ్రమించుము. ఆ పిమ్మట ప్రాణాయామము చేయుము. ఈ ఆసనములతో శరీర వ్యాయామములను కూడ కలిపి సులభముగ చేయవచ్చును. నీకు వీలున్నచో ధ్యానాదులు ముగించుకొన్న పిదప వ్యాయామము చేయవచ్చును. నిదురనుండి లేవగనే జపము, ధ్యానములను చేయబోవుటకు ముందు, ప్రాణాయామమును చేయవచ్చును. ఇందువలన శరీరము తేలికగా వుండి, ధ్యాన సుఖము లభించును. నీకు వీలైన కాలముల ననుసరించి, ఒకనిర్ణీత కార్యక్రమము నేర్పరచుకొనుము.

10. ఆసన ప్రాణాయామములు చేయునప్పుడు వీటితో జపముకూడా చేసినచో, పూర్తియగు ఫలితములు కనిపించును.

11. నిదురనుండి లేవగనే ఉదయము 4 గం. లప్పుడు జపము, ధ్యానములను చేయుట మంచిది. ఏలనన, ఈ సమయమున మనస్సు ప్రశాంతముగ నుండును. అందువలన ఏకాగ్రత లభించును.

12. ఎక్కువమంది జనులు పవిత్రమగు ప్రాత:కాల సమయమును ఒక అరగంటసేపు మలవిసర్జన చేయుటకు, మరొక అరగంట ముఖము కడుగుకొనుటకు వ్యర్థము చేసెదరు. ఇది తప్పు. సాధకులు పది నిమిషములలో పై రెండుకార్యములను నెరవేర్చుకొనవలెను.. మలబద్ధకముచే పీడింప బడుచున్న వాడవైనచో, నిద్రనుండి లేవగనే అయిదు నిమిషములసేపు శలభ, భుజంగ ధనురాసనములను వేయుము. లేక ఆలస్యముగ కాలకృత్యములను నెరవేర్చుకొను అలవాటు గలవాడవై యున్నచో, యోగసాధన అయిన పిమ్మటనే తీర్చుకొనవచ్చును.

సశేషము

స్వామి శివానంద

ప్రాణాయామ ప్రకరణం


           --- 15 ---
             ప్రాణాయామావశ్యకత, లాభములు :

"అనేక జన్మములనుండి కలిగిన ఈ మాయా ప్రాపంచిక వాసనలు అనేకమారులుగా చాలా కాలమువరకు యోగసాధన చేయనిదే నశింపవు"

(ముక్తికోపనిషత్తు)

"మోక్షము నివ్వగల జ్ఞానము యోగసాధన చేయకుండ ఎటుల లభించును? అంతేకాదు. జ్ఞానోదయముకానిదే యోగము కూడ మోక్షము నివ్వజాలదు. కావున ఇంద్రియములను వశపరుచుకొనిన పిదప, సాధకుడు యోగము, జ్ఞానము రెండింటిని గురించిన్నీ తీవ్రమగు సాధనచేయవలెను."

(యోగతత్త్వోపనిషత్తు)

"తత:క్షీయతే ప్రకాశావరణం -"

ఆ పైన వెలుగుకు గల ఆవరణ పోవును.

(పతంజలి యోగసూత్రం 2-52)

తమస్సు, రజస్సు అనునవి రెండునూ అడ్డంకులు. ఇవి రెండూ ప్రాణాయామమువల్ల నశింపగలవు. ఈ రెండింటినీ నాశనమొనర్చినపిదపనే ఆత్మయొక్క నిజమైన ప్రకృతి తెలియగలదు. "చిత్త" మనునది సాత్విక పదార్థములచే చేయబడినదై వున్నప్పటికికూడ, అది రజస్తమములను పొరలచే మూసివేయ బడియున్నది. ఇవి నిప్పు పొగచే కప్పివేయబడి కనిపించకుండ చేయబడి నటుల చిత్తముయొక్క ప్రకృతిని తెలిసికొనుటకు వీలులేకుండ చేయుచున్నవి. వీటినుండి విముక్తినిపొందుటకు ప్రాణాయామమునకు మించినదిలేదు. ఇది పవిత్రత, జ్ఞానములను కలిగింపజేయును. జ్ఞానశక్తిని కప్పి వేసియున్న కర్మయను పొర ప్రాణాయామముచే తొలగింపబడును. పునర్జన్మలకు కారణమగు యీ కర్మను ప్రాణాయామాభ్యాసముచే లేకుండ చేసి కొనుము.

మనుమహర్షి, "నీ దోషముల నన్నిటిని ప్రాణాయామమనెడు అగ్నిచే దగ్ధము చేయుము" అని చెప్పెను. విష్ణు పురాణములో, "ప్రాణశక్తిగా చెప్పబడిన యీ వాయువును ఎల్లప్పుడు గైకొన గోరుచుండువానిచే ప్రాణాయామసిద్ధి పొందిన వానినిగా చెప్పవలెను." అని గలదు.

"ధారణానుయోగ్యతా మనన:"

మనస్సు ధారణచేయుటకు యోగ్యమైనదిగా అగును. (యోగసూత్ర 2-53)

జ్ఞానావరణ తొలగింపబడిన పిదప, గాలిలేనిచోట దీపము ఏ రీతిని నిలుకడ గలదిగా వుండునో, ఆ విధముగా మనస్సు ధారణచేయుటకు అనువైనది యగును. కొన్ని కొన్ని సమయములందు రేచక పూరక కుంభకములను మూటినీ కలిపి ప్రాణాయామమనిన్నీ, కొన్ని సమయములందు వీటిలో ప్రతి దానిని ప్రాణాయామమనిన్ని వాడబడినది. ఆకాశతత్వమున ప్రాణవాయువు సంచరించుచున్నప్పుడు శ్వాసయొక్క నిడివి చాల తక్కువగ వుండును. ఇట్టి సమయమున శ్వాసను సులభముగా ఆపివేయవచ్చును. ప్రాణాయామముచే మనశ్చాంచల్యము పోవుటయే గాక వైరాగ్యోదయము కూడ కాగలదు. ఒక అంగుళము నిడివిగల శ్వాసను లోపల ఆపివేయుటచే భవిష్యత్తు చెప్పగల శక్తియూ, రెండు అంగుళములు ఆపుచేయ గలుగుటచే ఇతరుల మనస్సునందుగల విషయములను చెప్పగలశక్తియు, మూడంగుళములవల్ల భూమిపై నుండి లేవగలుగుటయు, నాల్గంగుళములవల్ల యోగ దృష్ట్యాదులును, అయిదంగుళములవల్ల ఎవరికినీ కనిపించకుండ వుండగలుగుటయు, ఆరంగుళములవల్ల కాయసిద్ధియు, ఏడంగుళములవల్ల పరకాయ ప్రవేశమున్నూ, ఎనిమిదంగుళములవల్ల ఎల్లప్పుడు పడుచువానివలె వుండగలశక్తియు, తొమ్మి దంగుళములవల్ల దేవతలచే సేవకులవలె పనిచేయించుకొన గలుగుటయు, పదంగుళములవల్ల అణిమాది సిద్ధులును, పదకొండంగుళములవల్ల పరమాత్మైక్యము సిద్ధించును. మూడుగంటల సేపటివరకు పూర్తిగా కుంభకము చేయగల యోగి, తన కాలి బొటనవ్రేలిపై శరీరము నంతను నిలపగలడు. ఇంతేగాదు, అన్నివిధములగు సిద్ధులను పొందును. అన్నివిధములగు పాపములను పోగొట్టుకొనినవాడగును. ప్రత్యాహారమువల్ల మనశ్శాంతి లభించును. ధారణ వల్ల మనస్సు నిలకడ గలదిగా యగును.. ధ్యానము శరీరమును ప్రపంచమును మరచులాగున చేయును. సమాధి బ్రహ్మానందము, జ్ఞానము, శాంతి ముక్తుల నిచ్చును.

యోగ సమాధి సమయమున బొడ్డునుండి తలవరకు బ్రహ్మ రంధ్రము నందలి అమృతము ప్రవహించును. అప్పుడు యోగి దానిని ఆనందముతో పానము చేయును. ఈ యోగామృతమును పానము చేసి నెలల తరబడి ఆహారము లేకుండ వుండగలడు. అప్పుడు శరీరము సన్నగాను, బలముగను ఆరోగ్యముగను వుండును. లావు తగ్గును, ముఖమునందు తేజస్సు వుండును. కనులు ప్రకాశవంతముగ మెరయు చుండును. గొంతు మధురముగ వుండును. ఆంతరిక అనాహత శబ్దములు చక్కగా వినిపించును. అన్ని రోగములనుండి విముక్తుడగును. బ్రహ్మచర్యమును గలిగి యుండును. వీర్యము చిక్కగా వుండును, జఠరాగ్ని పెంపొందును. అప్సరసలు వచ్చి మీద పడినను కూడ చలించని మనో నిలుకడను కలిగి యుండును, ఆకలి చక్కగా వుండును. నాడులు పరిశుద్ధ మగును. మనస్సు ఏకాగ్రత గలదిగా అగును. రజస్తమములు నిర్మూల మగును. ధారణా ధ్యానములు చేయుటకుగాను మనస్సు యోగ్యమైనదిగా అగును. మల మూత్రముల పరిమాణము తగ్గును. ఊర్థ్వ రేత యోగి యగును. ఉచ్చస్థితికి వచ్చిన సాధకులు పైసిద్ధులనన్నిటిని పొందెదరు.

సామాన్య జ్ఞానమునకు అందుబాటులో లేని అనేక విషయములుగలవు. వాటిని ధారణ ధ్యానాదులవల్ల మాత్రమే తెలిసికొనగలము. అట్టిజ్ఞానమును సంపాదించుటయే యోగము యొక్క ఆదర్శము. ప్రాణాయామమువల్లనే యిట్టిస్థితిని పొంద గలము. అప్పుడే మనకు ఆత్మజ్ఞాన ప్రాప్తికాగలదు.


సశేషము

స్వామి శివానంద


ప్రాణాయామ ప్రకరణము


              --- 13 ---


    దూరము నుండి రోగ నివారణ :

దీనినే 'అప్రత్యక్ష నివారణ' యని కూడ అందురు. దూరమున వున్న స్నేహితునికి ప్రాణశక్తిని పంపి అతని వ్యాధిని కుదుర్చ వచ్చును. కాని దీనిని గైకొనగల శక్తి అతని కుండ వలెను. ఈ విధానము ప్రకారము చేయు నప్పుడు నీ మిత్రుడు, నీవు ఎదురుగా వున్నటుల భావించవలెను.

నీవు అతనికి వుత్తరము వ్రాసి 'యిన్ని గంటలనుండి యిన్ని గంటలవరకు ప్రాణశక్తిని, నీవద్దకు పంపుదునని తెలియజేయ వలెను. అతనికి యీ విధముగ వ్రాయుము:- "ఉదయము నాల్గు గంటలకు నేను ప్రాణ శక్తిని నీ వద్దకు పంపెదను. వాటిని గైకొనుచుంటి ననెడి మానసిక భావము, కలిగి యుండుము. ఆ సమయమున ఒక పడక కుర్చీలో పడుకొనుము. కండ్లు మూసికొని యుండుము. అప్పుడు ప్రాణశక్తిని పంపెదను."

ఇక మానసికముగ యీ విధముగ చెప్పుము:- " నేను ప్రాణశక్తిని పంపుచున్నాను" ప్రాణశక్తిని పంపునప్పుడు కుంభకము చేయుము. క్రమశ్వాసను కూడ అభ్యసించుము. నీవు రేచకము చేయునప్పుడు ప్రాణశక్తినీనుండి వారి వద్దకు పోవుచున్నదని భావించుము. ఆ ప్రాణశక్తి ఆకాశము నుండి పోయి రోగియొక్క శరీరములో ప్రవేశించుచున్నదని కూడ భావించుము. ఈ ప్రాణశక్తి రేడియోవలె ప్రపంచమునందలి ఏభాగమునకైన పోగలదు. నీవు కోల్పోయిన ప్రాణశక్తి కుంభకముచేయుటచే తిరిగి లభించును. చాలకాలము, దీర్ఘముగను, శ్రద్ధగను అభ్యసించిన మీదట యీపద్ధతి ప్రకారము చేయుట సిద్ధించును.

విశ్రాంతి :

శరీరమును, స్నాయువులను సడలించి వుంచుటవలన శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. ఇందుచే స్నాయువుల ఈడ్పుతగ్గును. ఈ రహస్యము తెలిసిన వారు తమశక్తిని వ్యర్ధము చేసికొనరు. ధ్యానమును కూడ చక్కగా చేయ గలుగుదురు. కొద్ది దీర్ఘ శ్వాసలను తీసికొని శవాసనములో వలె వెల్లకిల పడుకొనుము. పాదములనుండి తలవరకు శరీరమునంతను సడలించి వుంచుము. ఆ తరువాత ఒకప్రక్కకు ఒత్తిగిల్లి పడుకొని స్నాయువుల నన్నింటిని సడలించి వుంచుము. స్నాయువులకు ఏవిధమగు శ్రమయుకలుగనివ్వరాదు. మరల రెండవ వైపుకు ఒత్తిగిల్లి స్నాయువుల నన్నిటిని సడలించుము. సాధారణముగ గాడనిద్రాసమయమున యీ రీతిని అందరూ చేసెదరు. ఒక్కొక్క స్నాయువుకు విశ్రాంతి నిచ్చుటకు ఒక్కొక్క రకపు అభ్యాసము గలదు. తల, భుజములు, మోచేతులు, ముంజేతులు, మణికట్టు, తొడలు, కాళ్ళు, చీలమండలు, కాలి బొటన వ్రేళ్ళు, మోకాళ్ళు మొదలగు ప్రతిభాగమునకు విశ్రాంతి నిమ్ము. వీనిని యోగులు బాగా ఎరుగుదురు. ప్రతి అభ్యాసమును చేయునప్పుడు, ఆ భాగము తన బాధలను పోగొట్టు కొని, బలమును సంపాదించు కొనుచున్నదని మానసికముగ భావించుము.

మానసిక విశ్రాంతి :

మనశ్శాంతి, సమానత్వములు - కోపము, చీకాకు లను నవిలేకున్నచో లభించును. కోపము చీకాకులకు వెనుక భయము దాగి యుండును. కోపము, చింతలవలన వచ్చునదేమియూ లేకపోగా మిక్కుటమగు శక్తి వ్యర్థమగును. ఈ రెండు దుర్లక్షణములు గలవాడు దుర్బలుడే. కావున జాగ్రత్తగలిగి యుండుము. అన్ని విధములగు అనవసరపు చీకాకు చింతలను పారద్రోలుము.

15 నిమిషముల సేపటివరకు శరీరమును సడలించి, సుఖముగావుండు ఆసనములో వుండుము. కనులు మూయుము. మనస్సును బాహ్యవిషయములనుండి మరల్చుము. మనస్సును నిలుకడ గలదిగా చేయుము.

సంకల్పముల నన్నిటిని శాంతింప జేయుము. కొబ్బరి పెంకు, లోపలనున్నకురిడీ రెండును ఏ విధమగ విడివిడిగా నున్నవో, అదేరీతిని నీశరీరము, నీవు భిన్నభిన్నముగా వున్నారని తలచుము. ఈ శరీరము నీ చేతియందలి ఒక పరికరమని తలంచుము. నీవు సర్వవ్యాపియగు ఆత్మనని తలంచుము. సముద్రమునందు తేలియున్న గడ్డిపోచవలె, అనంతమగు ఈ ఆత్మయందు నీ శరీరమున్నూ, సమస్త ప్రపంచమున్నూ తేలియున్నవని తలంచుము. పరమాత్మతో సంబంధము కలిగి యున్నటుల అనుభవించుము. ఈ సమస్త ప్రపంచము నీవల్లనే జీవించియున్నదని అనుభవించుము. జీవితమనెడి మహాసముద్రము నిన్ను, తనలోనికి, నెమ్మదిగా గొంపోవుచున్నదని అనుభవించుము. ఆ పిదప కన్నులు తెరువుము. అప్పుడు నీకు గొప్ప మనశ్శాంతి, బలము, పుష్టివచ్చును. దీనిని అభ్యసించి అనుభవించుము.



సశేషము

ప్రాణాయామ ప్రకరణము


               ---12 ---

      (కేవల కుంభకము)

   సహిత కుంభకము, కేవల కుంభకము అని కుంభకములు రెండు రకములు. పూరక రేచకములతో కూడియున్న కుంభ కమును సహిత కుంభకము అందురు. ఇవి రెండును లేని దానిని కేవలకుంభకము అందురు. సహితకుంభకములో పూర్ణమైన విజయమును పొందిన పిమ్మట దీనిని అభ్యసించవలెను. ఇది చేయువానియందు స్థల - కాల - సంఖ్యా నియమములు లేకుండ అనేక స్థలములలో పూరకరేచకములు కూడ లేకుండ శ్వాసనిలచిపోవును. అట్టిస్థితినే "కేవలకుంభకము" అందురు. ఇదే నాల్గవ మెట్టు. ఇందువలన అనేక విధములగు మహిమలు లభించును. దీనిని గురించి వశిష్ఠ సంహితలో, "శ్వాసోచ్చ్వాసలు రెండును లేకుండ ఏమాత్రము శ్రమయులేకుండ పోవుటనే కేవలకుంభకము అందురు." అని గలదు. ఈప్రాణాయామములో రేచక పూరకము లేమియు లేకుండ ఆకస్మికముగ శ్వాస ఆగిపోవును. సాధకుడు తన యిచ్ఛ వచ్చినంతసేపటివరకు శ్వాసను ఆపి వేయగలిగియుండును. రాజయోగ స్థితినిపొందును. కుండలినిని గురించిన జ్ఞానముకలుగును. కుండలినిమేల్కొనును. సుషుమ్నా మార్గమున గల అడ్డంకులన్నియు లేకుండపోవును. హఠయోగము సిద్ధించును. దీనిని రోజుకు మూడుమారులు చేయవచ్చును. ఇది తెలిసినవాడే నిజమైనయోగి.


( ఉత్తిష్ఠోత్తిష్ఠ యోగీ భవ!)


 ఈ కుంభకము సిద్ధించినవానికి పొందరాని ది ముల్లోకములం దేదియు లేదు. ఈ కుంభకము సమస్త వ్యాధులనుపోగొట్టి ఆయువును పెంచును.

ప్రాణశక్తిచే రోగ నివారణ :

ప్రాణాయామమును చేయువారు తమ ప్రాణశక్తివలన వ్యాధులను నివారించగలరు. ఆ విధముగ కోల్పోయిన ప్రాణశక్తిని కుంభకముచేసి తిరిగి సంపాదించుకొనగలరు. ఈ విధముగ ప్రాణశక్తిని వినియోగించుటవల్ల, నీ యొక్క  ప్రాణశక్తి నంతను కోల్పోదునేమో యని యెన్నడును భయపడకుము. దీనిని ఎంత అధికముగా వినియోగించుచుందునో, అంత అధికముగా జగత్ప్రాణము (హిరణ్యగర్భుడు) నుండి నీకు లభించును.

ఇది ప్రకృతి నియమము. లోభిని కాబోకుము. కీళ్ళవాతముచే ఎవడైన బాధపడుచున్నచో, వాని కాళ్ళను మెల్లగా పిసుకుము. ఆవిధముగ పిసుకు (చమురుట) నప్పుడు కుంభకము చేసి, మానసికముగ నీ యందలి ప్రాణశక్తిని నీ చేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావించుము. లేనిచో జగత్ప్రాణమునుండి ప్రాణశక్తిని గైకొని, నీచేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావింపుము. రోగి వెంటనే బాధ తగ్గి బలము, ఉష్ణము వచ్చినటుల తలచసాగును. తలనొప్పి మొదలగువాటిని ఈ రీతిగాచేయు ఆకర్షణశక్తి స్పర్శముచే నివారించగలవు. యకృత్తు, ప్లీహము, పొట్ట లేక శరీరమందలి తదితరభాగమును దేనినైన చమురునపుడు, జీవాణువులను ఈ రీతిని ఆజ్ఞాపించును:- "ఓ జీవాణువులారా! మీ మీ ధర్మములను చక్కగా చేయుడు. మిమ్ములను ఆ విధముగా చేయ వలసినదిగా నేను ఆజ్ఞాపించుచున్నాను. అటుల ఆజ్ఞాపించుటచే అవి నీ యిచ్ఛానుసారము చేసితీరును. నీయందలి ప్రాణశక్తిని యితరులకు పంపునప్పుడు మానసికముగ 'ఓం' జపము చేయుము. ఈరీతిని కొందరకు చేసినపిదప, నీకు తగిన యోగ్యతలభించును. తేలుకాటు పొందినవారి కాళ్ళను చమురుచూ క్రిందికి ఆ విషమును దింపవచ్చును.

ప్రాణాయామమును సరిగా అభ్యసించుటవల్ల ధారణా శక్తి, మంచి ఆరోగ్యము, దృడమైన శరీరము లభించగలవు. నీ శరీరమందలి అనారోగ్య భాగములకు ప్రాణశక్తిని పంపి ఆరోగ్యవంతముగ చేసికొనుచుండవలెను. కారిజము సరిగా పనిచేయుట లేదనుకొనుము.

   పద్మాసనములో కూర్చొనుము, కనులు మూయుము. ముమ్మారు ఓం ను ఉచ్చరించునంత వరకు నెమ్మదిగా గాలిని పీల్చుము. ఆరు మారులు "ఓం" ను జపించు నంతవరకు గాలిని లోపల ఆపు జేయుము. ఆ సమయమున ప్రాణశక్తిని కారిజము వుండు ప్రదేశమునకు పంపుము. నీ మనస్సును ఆ ప్రదేశములపై నిలుపుము. నీవు పంపుచున్న ప్రాణశక్తి కారిజమున ప్రవేశించి దానికి పుష్టినిచ్చి, దాని యందలి జీవాణువులకు బలమును కలిగించి, అవి యన్నియు తమ తమ కార్యములను చక్కగా నెరవేర్చునటుల చేయు చున్నదని భావించుము. నమ్మకము, భావన, ఏకాగ్రతలు ఈరీతిగా వ్యాధులను కుదుర్చుటలో ప్రధాన పాత్రను వహించును. ఆ పిమ్మట నెమ్మదిగా రేచకము చేయుము. రేచకము చేయునప్పుడు కారిజము నందు గల రోగ బీజాణువు లన్నియు బయటకు నెట్టివేయ బడినవని భావించుము. ఈ రీతిని ఉదయము పండ్రెండు మారులు, సాయంత్రము పండ్రెండు మారులు చేయుము. కొద్దిరోజులు యిటుల చేయుటచే ఆ బాధతగ్గి పోవును. ఇది మందులేని ప్రకృతి వైద్యము. ఈ రీతిని ప్రాణాయామ సమయములో ప్రాణవాయువును వ్యాధిగల స్థలముకు గొంపోయి దీర్ఘ వ్యాధులను గాని, తరుణ వ్యాధులనుగాని కుదుర్చుకో గలవు. ఒకటి రెండు మారులు నీ వ్యాధిని నీవు కుదుర్చుకొనుటకు ప్రయత్నము చేయుము. అప్పుడు నీకు నమ్మకము కలుగ గలదు.

చేతిలో వెన్నను పెట్టికొని, నెయ్యి లేకపోయెను గదా యని యేడ్చెడు అబలవలె డబ్బులేని మహిమ నంత మగు ప్రాణ శక్తిని నీ చేతి యందుంచుకొని రోగము కుదురలేదని యేల యేడ్చెదవు? న్యాయముగ ఉపయోగించుము, నీవీ సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిదప, తాకినంత మాత్రముననే అన్ని వ్యాధులను కుదుర్చగలవు. అంతే గాదు, మనస్సులో తలచినంత మాత్రముననే నివారణ కాగలవు.


సశేషము

స్వామి శివానంద
+91 98482 72315 left
విశ్వము యొక్క విస్తృతి - ఈశ్వర తత్త్వం - 11 తలాలు (dimensions) :

మనము 3 డైమన్షనల్ ప్రపంచం ( త్రిమితీయ) లో ఉన్నామని తెలుసు కదా! అయితే ఈ 3 తలాలే కాకుండా అనేక తలాలు ఉన్నాయని , అనేక సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11 తలాల సిద్ధాంతాన్ని పరిశీలిద్దాం.

3D గురించి వినని వారు ఉండరు. అసలు ఈ D – డైమెన్షన్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం.
ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు విశ్వాన్ని space-time గా కొలుసస్తున్నాయి.....  వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. 
అన్నింటిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన థియరీ “సూపర్ స్ట్రింగ్” అని. అటువంటివే M-థియరీ అని , బోసోనిక్ స్ట్రింగ్ థియరీ అని మరి కొన్ని ప్రాచుర్యం పొందిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సూపర్ స్ట్రింగ్ థియరీ ప్రకారం విశ్వానికి కనీసం 10D – 10 రకరకాల డైమెన్షన్లు ఉన్నాయి అని చెబుతుంది. M-థియరీ ప్రకారం 11D. ఈ  డైమెన్షన్ లు ఎల…
🙏🙏🙏
https://



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ