శివుని సహస్ర నామాలు - 1




    💐శ్రీ మాత్రే నమః💐

 శివుని సహస్ర నామాలు - 1

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



1    స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,

2    స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,

3    ప్రభుః = సమస్తమునకు అధిపతి,

4    భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,

5    ప్రవరః = సర్వశ్రేష్టుడు,

6    వరదః = వరములనిచ్చువాడు,

7    సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,

8    సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,

9    సర్వః = సమస్తము తానేఅయినవాడు,

10    సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,

11    భవః = శివుని రూపంలో పుట్టినవాడు,

12    జటీ = జడలు ధరించినవాడు,

13    చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,

14    శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,

15    సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,

16    సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.

17    హరః = సమస్త పాపములను హరించువాడు,

18    హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,

19    సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,

20    ప్రభుః = అధిపతి,

21    ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,

22    నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,

23    నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,

24    శాశ్వతః = నిత్యమైనవాడు

25    ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.

26    శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,

27    భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,

28    ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,

29    అగోచరః = కంటికి కనిపించనివాడు,

30    అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,

31    అభివాద్యః = నమస్కరింప తగినవాడు,

32    మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,

33    తపస్వీ = తపస్సుచేయువాడు,

34    భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.

35    ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,

36    సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,

37    మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,

38    మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,

39    వృష రూపః = పుణ్య స్వరూపుడు,

40    మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.

41    మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,

42    సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,

43    శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,

44    మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,

45    లోకపాలః = లోకములను పరిపాలించువాడు,

46    అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,

47    ప్రసాదః = అనుగ్రహించువాడు,

48    నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.

49    పవిత్రం = పరిశుద్ధమైన,

50    మహాన్ = గొప్పవాడు,

51    నియమః = నియమం తన స్వరూపమైనవాడు,

52    నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,

53    సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,

54    స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,

55    ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,

56    నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.

57    సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,

58    విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,

59    సోమః = చంద్రుని వంటివాడు,

60    నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,

61    చంద్రః = చంద్రుని వంటివాడు,

62    సూర్యః = సుర్యుని వంటివాడు,

63    శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,

64    కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,

65    గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,

66    వరః = శ్రేష్టుడు.

67    ఆది = మొదలు,

68    అంతః = చివర,

69    లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,

70    మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,

71    అనఘః = పాపరహితుడు,

72    మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,

73    ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,

74    అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,

75    దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.

76    సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,

77    మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,

78    ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,

79    పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,

80    యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,

81    యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,

82    మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,

83    మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,

84    మహాబలః = గొప్పశక్తి కలవాడు.

85    సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,

86    సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,

87    సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,

88    బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,

89    దశబాహుః = పది భుజాలు కలవాడు,

90    అనిమిషః = రెప్పపాటు లేనివాడు,

91    నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,

92    ఉమాపతిః = పార్వతి భర్త

93    విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు

94    స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు

95    బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు

96    బలః = బలము కలవాడు

97    గణః = సమూహ స్వరూపమైనవాడు

98    గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు

99    గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు

100    దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు


శివుని సహస్ర నామాలు - 2

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


101    కామః = కామము యొక్క స్వరూపము తానే అయినవాడు.

102    మంత్రవిత్ = మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు

103    పరమః = అందరికంటె ఉన్నతుడు

104    మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు

105    సర్వభావకరః = సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు

106    హరః = పాపములను హరించువాడు

107    కమండలుధరః = కమండలమును ధరించినవాడు

108    ధన్వీ = ధనుస్సు ధరించినవాడు

109    బాణహస్తః = చేతియందు బాణము ధరించినవాడు

110    కపాలవాన్ = కపాలమును చేత
ధరించినవాడు

111    ఆశనిః = వజ్రాయుధము

112    శతఘ్నీ = శతఘ్ని అను ఆయుధమును ధరించినవాడు

113    ఖడ్గీ = ఖడ్గమును ధరించినవాడు

114    పట్టసీ = పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు

115    ఆయుధీ = ఆయుధము కలవాడు

116    మహాన్ = గొప్పవాడు

117    స్రువహస్తః = హోమము చేసెడి పరికరమును చేత ధరించినవాడు

118    సురూపః = మంచి రూపము కలవాడు

119    తేజః = తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు

120    తేజస్కరః = తేజస్సును కలుగజేయువాడు

121    నిధిః = ఐశ్వర్యమునకు మూల స్థానమైనవాడు

122    ఉష్ణీషీ = శిరస్త్రాణము కలవాడు

123    సువక్త్రః = మంచి ముఖము కలవాడు

124    ఉదగ్రః = అన్నిటికంటె ముందుండువాడు

125    వినతః = వినయము కలవాడు

126    దీర్ఘః = పొడవైనవాడు

127    హరికేశః = ఆకర్షణీయమైన కేశములు కలవాడు

128    సుతీర్థః = ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు

129    కృష్ణః = నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు

130    సృగాలరూపః = నక్కయొక్క ఆకారము కలవాడు

131    సిద్ధార్థః = అన్ని ప్రయోజనాలను సాధించినవాడు

132    మృడః = భక్తులను ఆనందింపజేయువాడు

133    సర్వశుభంకరః = సమస్తమైన శుభములను కలుగజేయువాడు

134    అజః = పుట్టుక లేనివాడు

135    బహురూపః = అనేక విధాలైన రూపములు కలవాడు

136    గంగాధారీ = గంగను ధరించినవాడు

137    కపర్దీ = జటాజూటములు కలవాడు

138    ఊర్ధ్వరేతాః = ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు

139    ఊర్ధ్వలింగః = ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు

140    ఉర్ధ్వశాయీ = ఊర్ధ్వముగా నిద్రించువాడు

141    నభస్థలః = ఆకాస ప్రదేశమున ఉండువాడు

142    త్రిజటః = మూడు జడలు ప్రధానముగా కలవాడు

143    చీరవాసాః = నారచీరలు ధరించువాడు

144    రుద్రః = శత్రువులను దుఃఖపెట్టువాడు

145    సేనాపతిః = సైన్యమునకు అధిపతి

146    విభుః = అధిపతి

147    నక్తంచరః = రాత్రులందు సంచరించువాడు

148    అహశ్చరః = పగటియందు సంచరించువాడు

149    తిగ్మమన్యుః = తీక్షణమైన కోపము కలవాడు

150    సువర్చసః = మంచి కాంతి కలవాడు

151    గజహా = గజాసురుని చంపినవాడు

152    దైత్యహా = రాక్షసులను చంపినవాడు

153    కాలః = కాలము యొక్క స్వరూపమైనవాడు

154    లోకధాతా = లోకములను సృష్టించినవాడు

155    గుణాకరః = ఉత్తమ గుణములకు గనివంటివాడు

156    సింహశార్దూలరూపః = సింహము, పెద్దపులి రూపములలో ఉన్నవాడు

157    వ్యాఘ్రచర్మ అంబర ఆవృతః = పెద్దపులి చర్మమును వస్త్రముగా చుట్టుకొనియున్నవాడు

158    కాలయోగీ = కాలమును నియంత్రించినవాడు

159    మహానాథః = గొప్పవాడైన అధిపతి

160    సర్వకామః = సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు

161    చతుష్పథః = అనేక మార్గముల కూడలి అయినవాడు

162    నిశాచరః = రాత్రులందు సంచరించువాడు

163    ప్రేతచారీ = ప్రేతభూతములయందు సంచరించువాడు

164    భూతచారీ = సర్వప్రాణులందు సంచరించువాడు

165    మహేశ్వరః = గొప్పవాడైన అధిపతి

166    బహుభూతః = అనేక రూపములలో ఉన్నవాడు

167    బహుధరః = అనేకమైన వాటిని ధరించువాడు

168    స్వర్భానుః = రాహురూపమున ఉన్నవాడు, స్వర్గమునకు వెలుగునిచ్చువాడు

169    అమితః = పరిమితి లేనివాడు

170    అగతిః = ఒకే విధమైన నడక లేనివాడు

171    నృత్యప్రియః = నాట్యములందు ప్రీతి కలవాడు

172    నిత్యనర్తః = ఎల్లప్పుడు నాట్యము చేయువాడు

173    నర్తకః = స్వయముగా నాట్యము చేయువాడు

174    సర్వలాలసః = అన్నిటియందు ఆసక్తి కలవాడు

175    మహాఘోరతపాః = గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు

176    శూరః = పౌరుషము కలవాడు

177    నిత్యః = శాశ్వతమైనవాడు

178    అనీహః = కోరికలు లేనివాడు

179    నిరాలయః = స్థిరమైన గృహము లేనివాడు

180    సహస్రహస్తః = అనేకమైన (వేయి) హస్తములు కలవాడు

181    విజయః = విజయమును సాధించువాడు

182    వ్యవసాయః = ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు

183    అతంద్రితః = తొట్రుపాటు లేనివాడు

184    అమర్షణః = దుష్టత్వమును కోపగించుకొనువాడు

185    మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు

186    యజ్ఞహా = దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు

187    కామనాశకః = మన్మథుని నశింపచేసినవాడు

188    విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు

189    స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు

190    బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు

191    బలః = బలము కలవాడు

192    గణః = సమూహ స్వరూపమైనవాడు

193    గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు


194    గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు

195    దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు


196    కామః = కామము యొక్క స్వరూపము తానే అయినవాడు.

--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ