నేటి కవితలు -2
8 ..నేటి కవిత్వం - బ్రహ్మము - ఆత్మ
రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అసలు అన్నది ఉన్నదా బ్రహ్మ మంత
తెలుసు కొన్నంత కొద్దియు బ్రాంతి కల్గు
ఎవరి కైనను అధ్యాస తప్పు కాదు
విలువ ఉండదు బుద్ధికే భ్రమలు కమ్ము
ఎవడు అణ్యమై నదియు చూడడో అట్టి
ఎవడు అన్యమై నదియు వినడొ అట్టి
ఎవడు అన్యమై నదియు తెల్సుకో నట్టి
అతడు పృద్వికి ఆనంద కార కుండు
తెలియ బడనిది ఆత్మను తెలుసు కొనవు
తెలుసు కుందాము అన్నను వీలులేదు
ఎదుట ఉన్నట్టి వస్తువు కాదు ఆత్మ
తెలుసు దృశ్యాన్ని ఆత్మగ చెప్పలేవు
విషయ వాంఛల తోనుండు ఆత్మ కలసి
వినుట చెప్పుట చూచుట వెనుక ఆత్మ
మమసు వస్తువు మీదకు పొవుట ఆత్మ
తెలివి చైతన్య వెంటను ప్రజ్ఞ ఆత్మ
--(())--

9. నేటి కవిత్వం *పువ్వే - మనం
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పువ్వు పుట్టిన రోజు పరిమళిస్తుంది
మనిషి పుట్టిన రోజు ఉంటుంది భయము
పువ్వు కాయగ పండుగ మారు చుండు .
మనిషి ఊసరివేళ్ళుగ మారు చుండు
పువ్వు వికసించి నీరు కారి వకుళించు
పువ్వు దేవుని పూజకై వేచి ఉండు
మనిషి పుట్టగా పాల కోసము ఏడ్చు
పెరగగానె పెంచిన వారికే ముప్పు
పువ్వులు సూదుల భాద అనుభ వించి
పువ్వులు వలపు వాసన పంచి పెట్టు
మనిషి పూలనే నలిపి వాసన చూడు
అలమటించేట్లు ఆశలు చూపి ఉండు
పువ్వులు పాదాల క్రింద నలుగు చుండు
కొప్పుకు చేరి అందాలు చూపు చుండు
మనిషి సహజ గుణాన్ని ఎప్పుడూ మార్చు
మనసు చేసిన పాపాలు చెప్పు చుండు
పువ్వు నలిగి వాడి పృద్విని చేరును
చెట్టుపై నిగనిగ మెరుపు కోస్తె నీరు
మనిషి విద్య ఉద్యోగ సంసార వృద్ధి
మమత పెరిగి అనుకూల ప్రతికూల బతుకు
--((*))--

రచయత:: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అసలు అన్నది ఉన్నదా బ్రహ్మ మంత
తెలుసు కొన్నంత కొద్దియు బ్రాంతి కల్గు
ఎవరి కైనను అధ్యాస తప్పు కాదు
విలువ ఉండదు బుద్ధికే భ్రమలు కమ్ము
ఎవడు అణ్యమై నదియు చూడడో అట్టి
ఎవడు అన్యమై నదియు వినడొ అట్టి
ఎవడు అన్యమై నదియు తెల్సుకో నట్టి
అతడు పృద్వికి ఆనంద కార కుండు
తెలియ బడనిది ఆత్మను తెలుసు కొనవు
తెలుసు కుందాము అన్నను వీలులేదు
ఎదుట ఉన్నట్టి వస్తువు కాదు ఆత్మ
తెలుసు దృశ్యాన్ని ఆత్మగ చెప్పలేవు
విషయ వాంఛల తోనుండు ఆత్మ కలసి
వినుట చెప్పుట చూచుట వెనుక ఆత్మ
మమసు వస్తువు మీదకు పొవుట ఆత్మ
తెలివి చైతన్య వెంటను ప్రజ్ఞ ఆత్మ
--(())--

9. నేటి కవిత్వం *పువ్వే - మనం
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పువ్వు పుట్టిన రోజు పరిమళిస్తుంది
మనిషి పుట్టిన రోజు ఉంటుంది భయము
పువ్వు కాయగ పండుగ మారు చుండు .
మనిషి ఊసరివేళ్ళుగ మారు చుండు
పువ్వు వికసించి నీరు కారి వకుళించు
పువ్వు దేవుని పూజకై వేచి ఉండు
మనిషి పుట్టగా పాల కోసము ఏడ్చు
పెరగగానె పెంచిన వారికే ముప్పు
పువ్వులు సూదుల భాద అనుభ వించి
పువ్వులు వలపు వాసన పంచి పెట్టు
మనిషి పూలనే నలిపి వాసన చూడు
అలమటించేట్లు ఆశలు చూపి ఉండు
పువ్వులు పాదాల క్రింద నలుగు చుండు
కొప్పుకు చేరి అందాలు చూపు చుండు
మనిషి సహజ గుణాన్ని ఎప్పుడూ మార్చు
మనసు చేసిన పాపాలు చెప్పు చుండు
పువ్వు నలిగి వాడి పృద్విని చేరును
చెట్టుపై నిగనిగ మెరుపు కోస్తె నీరు
మనిషి విద్య ఉద్యోగ సంసార వృద్ధి
మమత పెరిగి అనుకూల ప్రతికూల బతుకు
--((*))--

11. తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా
తల్లి ఆనంద పారవశ్యం గురించి వర్ణించే శక్తి ఎవ్వరుకూలేదు, నీకు తప్ప అందుకే నేను నిన్ను ప్రార్దిమ్చుతున్నాను, నేను వ్రాసే ఈ చిన్న కవితా వాక్యములకు సహకరించు తల్లి, నన్ను అశీర్వదించు తల్లి
నీటి కవిత ... ప్రేమాతిశయము
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .
సకల జగతి దర్శించు మనోఫలకమున

ఆకళించుకొని లోఅరలలో దాచియుంచు
వికలమగు మది తోటి వారి బాధల గాంచి
అలరించు సుందర దృశ్యములు హృదిని
వినిపించు గానము విహరించు వినువీధి
అనరాని మాటలు అస్త్రములై బాధించు
ఎనలేని రుచులు అనవరతము స్మరించు
మానసము హరించు సగంధ సౌరభములు
ప్రేమాతిశయము భామామణి పరిష్వంగము
శ్రమానంతర సతి సేవా భావ మాధుర్యము
హేమ మణిమయ హారమిచ్చు మనోల్లాసము
కామ భావనల దేహ సుఖ మధురానుభూతి
ఎంచి చూడ నంతయు పంచేద్రియ ప్రభావమ్ము
కాంచగ సకలము నీ మానస రంగస్థల క్రీడలేను
పంచుకొంటివి బాహ్యభావ సర్వమంతరమందు
ముంచినవి నీ సహజ అద్వితీయ దైవ బలము
మరలించి ఇంద్రియము లంతర్గత సుక్షేత్రము
కరుణామయుడౌ హరి చరణములే శరణనుచు
కరగించి జడ భావము ద్రవించి ఆర్ద్రమానసమై
పరవశింపుము పరమాత్మ దివ్యరూప దర్శనము
--(())--
నేటి కవిత - కాదు - ఔనా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేను చెప్పేది నీకు అర్ధం కాదనుకోనా
నీకునచ్చ చెప్పటానికి నాకు చేతకాదు
నన్నునమ్మి నట్లు ఉన్నా వనుకోనా
ఎదో మనసుకు చిక్కిన పిచ్చిదానివి కాదు
పువ్వు విరిసింది నాకోసమే అనుకోనా
నవ్వు చూపింది నన్ను పిలుపు మాత్రం కాదు
కెవ్వు మని కేక వేసింది భయమను కోనా
లవ్వు అంటుంది దగ్గరికి తీసు కోదు
కోడి పిల్లలతో పరిగెడుతుందానిఅను కోనా
కోడి గుడ్లు విసిరి సంబర పడేది కాదు
కోడి ఈకలను తలలో గుచ్చుకొని ఉండెదనుకోనా
కోడిలా కూస్తూ రైలు లా కదులే ఆట కాదు
గడియారంలా నా వెనుక తిరుగుతుందనుకోనా
రేడియో లా ఏవో పాటలు పాడనే పాడదు
కరంటు తీగపై గబ్బిలంలా వ్రేలాడతుందననా
బకెట్టులొ కూర్చొని బావిలో వదలమనేది కాదు
ఈనాటి పుణ్యమో నీవు నాకు దక్కవు అనుకోనా
దుర్మాగాన్ని అంతం చేసావు నన్ను కాదు
అనీ ఒకటే ఏడుస్తావు జాలి అనుకోనా
ఏమని చెప్పేది, ఎలాచెప్పేది తప్పేకదు
నా ప్రేమకోసం తపిస్తున్నానీ నేను అనుకోనా
ఓర్పుతో ఓదార్పుతో నా తోనే ఉండదు
నిన్ను కాపాడి చదివిన చదువను కోనా
గుర్తు చేయాలని తపిస్తూ ఉన్నడి కాదు
నేను చెప్పేది నీకు అర్ధం కాదను కోనా
నీకు నచ్చ చెప్పటానికి నాకు చేతకాదు
--(())--
అనుగ్రహించు
ఓం శ్రీ రామా -
మా మాదిలో లోపభూయిష్టమైన ఆలోచన నుండి
మమ్ము ఉద్ధరించగ రావా రామా
ఓం శ్రీరామా -
మాయకు చిక్కాము ముంచుతావో తెల్చుతావో భారమంతా
నీ మీదే వేసి తప్పు చేస్తున్నాము సరిదిద్ద లేవా రామా
ఓం శ్రీరామా -
మా మానసంతా మీ ముంగిట ఉంచాము, సక్రమముగాను
అక్రమముగాను ఉంచినా హెస్చరించక ఊరుకున్నావా రామా
ఓం శ్రీ రామా -
మాలో మాకు మమతలు పెంచి, తుంచి ఆడుకుంటూ
ఆవేదనకు గురిచేసి వింతగా చూస్తు ఊరుకుంటు
ఉండి తెలియనట్టు ఉంటావరామా
ఓం శ్రీ రామా-
మార్పుకోరము మాలో ఉన్న మాయామర్మాన్ని తొలగించి
మది తలపులు నీపై ఉండేటట్లు అనుగ్రహము అందించుటకు రావారమా
ఓంశ్రీరామా -
మా ఆలోచన, మా నడక, మా ప్రార్ధన మీపై ఉంచాము,
నీవు పాలముంచినా నీట ముంచినా మొత్తము భారము
నీపై ఉంచుతున్నాము మమ్ము రక్షించగ రావారామా,
లేదా హనుమంతుని అండగా ఉండమని ఆజ్ఞ ఇవ్వగలవు రామా
--((*))--
Comments
Post a Comment