భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 4


*మార్గదర్శకులు మహర్షులు -1*
🪷

రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి


*ముందు మాట:* 

మన భారతీయ జీవనవిధానానికి సనాతనధర్మం, ఆర్షధర్మం అని పేర్లు. 'ఆర్షధర్మం' అంటే, ఋషులు అనుసరించినది, ఋషులనుండి వచ్చినది అని అర్థం.  మహర్షుల బాహ్యమైన కార్యాలు, పురాణ సంఘటనలు, మహర్షుల మాటలు, చేతల వెనుక ఉద్దేశాలు వాటి అంతరార్థాలను కూడా ఇందులో విశదీకరించారు. ఋషుల ప్రభావం మన భారతీయ జీవనంలో ఊహకు అందని ప్రాచీనగతం నుండి నేటి వరకూ మన కుటుంబ, రాజకీయ, సాంఘిక వ్యవస్థలలో, వైద్య -న్యాయ - భౌతిక - ఖగోళ - వైమానికాది శాస్త్రాల పరిణామంలో, వికాసంలో ఎంత అవినాభావంగా పెనవేసుకొని ఉందో ఈ గాథలు మనకు అవగతంచేస్తాయి.
🙏🏻


*అత్రిమహర్షి -1*
🔱

బ్రహ్మదేవుడు సృష్టిచేస్తున్న కాలంలో, అంటే చతుర్దశ భువనాలు వీటన్నిటికంటే ముందు, జీవకోటికి ముందుగానే ఎప్పుడో, ఈ సృష్టి చేయటంలో తనకు సహాయం చెయ్యగలవాడనే ఉద్దేశ్యంతో తపస్సు లోంచి అత్రిమహర్షిని సృష్టించాడు. అత్రి మహర్షి బ్రహ్మలో ఒకభాగం అన్నమాట. అలా ఉంటారు మహర్షులు. వాళ్ళలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని ఉండదు. వాళ్ళందరూ కూడా సాక్షాత్తూ ఈశ్వర స్వరూపులే!

అత్రిమహర్షి పుట్టగానే, “నన్నెందుకు పుట్టించావు? నాకేమిటి పని?" అని బ్రహ్మను అడిగాడు. అప్పుడు ఆయనతో బ్రహ్మ, "నాయనా! సృష్టి విషయంలో నాకు నీ సహాయంకావాలి. తపస్సు చేసి నీ తపోబలం చేత జీవకోటిని సృష్టించు" అని ఆజ్ఞాపించాడు.

అత్రి చిరకాలము తపస్సు చేసి ఆత్మానుభూతి పొంది ఆత్మజ్ఞానియై, బ్రహ్మజ్ఞానియై, ఆత్మజ్ఞానతత్త్వజ్ఞుడు అయిన తరువాత కూడా తీక్షణంగా తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఆయనకు ఆత్మజ్ఞానం కలిగింది. తన పని తాను తెలుసుకున్నాడు. విశ్వాత్మభావన కలిగింది. ఆయనకు ఇంకా తీరవలసిన కోరికలు ఏమీలేవు. అయినా అఖండమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన రెండు నేత్రముల నుంచీ బ్రహ్మాండమయిన తేజస్సు ఒకటి వెలుగుతూ బయటకు వచ్చింది. ఆ తేజస్సు అనిరీక్ష్యంగా, కళ్ళు తెరచి చూడ్డానికి వీలులేకుండా ఉన్నది. భయంకరంగా కూడా ఉన్నది. దశదిశలా దానిని పంచుదామని చెప్పి పదిదిక్కులకూ ఇవ్వబోయినాడు. ఆ పదిదిశలూ ఆ తేజస్సుని స్వీకరించి, భరించలేక మళ్ళీ వెనక్కి వదిలేసాయి. అది ఒక పెద్ద తేజో పుంజంగా ఒక గోళంగా ఏర్పడింది. అప్పుడు దానిని అనంతంగా ఉండే సముద్రంలో వదిలేసాడాయన. ఆ తేజస్సు ను సముద్రం కూడా భరించలేక కుతకుత ఉడుకుతూ ఉంటే, బ్రహ్మదేవుడు భూ లోకానికి వచ్చి ఆ తేజస్సుకు ఒక పురుష రూపాన్ని ఇచ్చాడు. ఆ తేజస్సుకు పురుష రూపాన్ని ఇవ్వగానే దాని ఔద్ధత్యం తగ్గిపోయి చల్లబడింది. ఆకాశంలో పురుష స్వరూపంలో అది కనబడింది. దేవతలు ఒక పెద్ద ఆపద తప్పిందని సంతోషపడి బ్రహ్మను సోమ మంత్రములతో స్తుతించారు.

అప్పుడు బ్రహ్మదేవుడు, “ఈ అత్రిమహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే తపస్సులోంచి వచ్చిన ఈ భయంకరమైన తేజస్సును ఈ ప్రకారంగా చల్లబరిచాము. ఆయన భవిష్యత్తులో అనసూయా దేవిని వివాహం చేసుకుంటాడు. ఈ దివ్య పురుషుడు ఆయన తపస్సులోంచీ వచ్చిన వాడు కాబట్టి, అనసూయా గర్భ మందు ఇతడు మళ్ళీ ప్రవేశించినప్పుడు అత్రికి కుమారోదయం అవుతుంది" అని చెప్పాడని తాత్పర్యం. అలా దానిని
అర్థంచేసుకోవాలి. 

కశ్యప ప్రజాపతికి ఎనిమిదిమంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టారు. అందులో అనసూయ ఒకరు. అత్రిమహర్షి ఈ అనసూయకు తగినవరుడని నిర్ణయించి, కశ్యపుడు వారిద్దరికీ వివాహం చేశాడు. ఆవిధంగా కశ్యపప్రజాపతి కుమార్తె అయిన అనసూయ అత్రిమహర్షి ని వివాహం చేసుకుంది.

ఆయన సన్నిధిలో అనసూయాదేవికి ఏ కర్తవ్యమూ ఉండేది కాదు. ఆయనకు ఏమీ అవసరము ఉండేదికాదు. నిత్యము తపస్సులో ఉండేవాడు. చేసే పని ఏమీ లేకుండా ఉండటంచేత ఆమె కూడా ఆయన ఎదురుగా కూర్చుని తపోనిష్ఠలో ప్రవేశించింది. మహాతేజస్వినిగా, లోక పూజ్యురాలిగా ఆమె తపస్సు చేసింది.

తరువాత కొంతకాలానికి అత్రిమహర్షి ఆశ్రమానికి త్రిమూర్తులు వచ్చారు. త్రిమూర్తులు అనసూయాదేవి పాతివ్రత్య మాహాత్మ్యాన్ని పరీక్షించదలచుకొని వచ్చారు. ఈ కథంతా అందరికీ తెలిసిందే! వాళ్ళు ముగ్గురూ ఆమెను భోజనం వడ్డించమన్నారు. ఆమె అర్ఘ్యపాద్యాలిచ్చి భోజనం పెడదామనుకొంటే, వాళ్ళు, "మాకు నీవు నగ్నంగా ఉండి వడ్డిస్తేనే తింటాము" అన్నారు.

ఆవిడ అలాగే అని ఒప్పుకొని, తన తపస్సునంతా మంత్రజలంగా మార్చి ఆ త్రిమూర్తులమీద చల్లింది. వెంటనే వాళ్ళు ముగ్గురూ చంటిపిల్లలయినారు. ఆ చంటి పిల్లలు ముగ్గురినీ ఊయలలో పడుకోబెట్టి వారు కోరిన విధంగానే అన్నంపెట్టింది వాళ్ళకు. ఆ తరువాత అత్రిమహర్షి ఆ ముగ్గురుపిల్లలనూ దగ్గరికి తీసుకొని ఒకచోట చేరిస్తే వాళ్ళు ముగ్గురూ ఒకే శరీరము, మూడు ముఖాలు కలిగిన దత్తాత్రేయమూర్తి అయినాడు.

అత్రిమహర్షి, అనసూయలకు పుట్టినటువంటి త్రిమూర్త్యాత్మకుడు దత్తాత్రేయుడు. అందుకనే గురువుగా ఆయనకు నమస్కరిస్తారు. 'గురుర్ర్బహ్మా, గురుర్విష్ణుః గురుర్దేవోమహేశ్వరః' - ముగ్గురూ కలిసిన మూర్తికదా! వాస్తవంగా ఇది వారి ధ్యానశ్లోకం. మనం ఊరికే స్తోత్రశ్లోకంగా వాడతాం. ఆయనే ధ్యాన స్వరూపమైన దత్తాత్రేయుడు. 

దత్తాత్రేయమూర్తి, అనసూయాదేవి మహత్తువల్ల త్రిమూర్తులకు శైశవం ఏర్పడి శిశువులుగా పుట్టటం అనేది జరిగింది. ఆ రూపమే ఇది అని సమన్వయం చేసుకోవాలి. వాళ్ళముగ్గుర్నీ సమన్వయం చేసి ఒకేమూర్తిగా రూపకల్పన చేసినవాడు అత్రిమహర్షి!

అత్రిమహర్షి యొక్క తపస్సుకు, పూర్వం బ్రహ్మ ఇచ్చిన పురుషరూపం, ఆ తరువాత త్రిమూర్తుల పరీక్ష, అదంతా అత్రి దంపతులు మరిచిపోయారు. తమ గర్భ వాసములో ఒక కొడుకు పుట్టలేదనే కోరిక అలాగే వాళ్ళకు మిగిలిపోయింది. దత్తాత్రేయుడు పుట్టిన తరువాత కూడా సంతానం కలుగకపోయెనే అనే వెలితితో, కోరికతో వాళ్ళు దక్షపర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సులు చేసారు. మళ్ళీ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ముగ్గురూవచ్చి ప్రత్యక్షమైతే “మాకు ఒక కుమారుడు కావాలి. మేము ఆ పరమశివ తత్యాన్ని గురించి తపస్సు చేస్తే, మీరు ముగ్గురూ ఎందుకు వచ్చారు? మాకేమి ఇస్తారు? మీలో అధికులెవరు?" అని అడిగారట ఆ త్రిమూర్తులను.

"మాలో ఎక్కువతక్కువలు లేవు, మేమంతా సమానమే. మాకు భేదం లేదు, మా అంశలతో మీకు సత్పుత్రోదయం అవుతుంది" అని చెప్పారు. వాళ్ళ వర ప్రసాదంతో అత్రిమహర్షి నేత్రములలోంచీ చంద్రుడు పుట్టాడు. ఆయననే సోముడు అంటారు. అనసూయ గర్భంలో దత్తాత్రేయుడు ఇదివరకే పుట్టాడు కదా! ఇప్పుడు దూర్వాసుడు పుట్టాడు.
📖

ఒకనాడు అనసూయతో అత్రిమహర్షి, “నీకోరిక నెరవేరింది. నా కోరికా నెరవేరింది. ఇక ఈ సంసారం చాలు. నేను ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నీవు కూడా వస్తావా? లేకపోతే ఈ పిల్లల్ని సాకుతూ ఉండిపోతావా?" అని సామాన్యులవలె అడిగాడు.

అందుకు ఆమె, "పిల్లలు ఇంకా పెరిగి పెద్దవాళ్ళు కాలేదు కదా! వీళ్ళను పెంచాలంటే ధనంకావాలి. అందుకని పృథుచక్రవర్తి దగ్గరకువెళ్ళి ధనం తీసుకురండి. చిన్నపిల్లలను వదిలివెళ్ళడం సరిఅయిన పద్ధతికాదు కదా!" అని అన్నది. ఆవిడ చెప్పిన దాంట్లో ఒక ధర్మం, ఔచిత్యం గ్రహించాడు ఆయన. అందుకని పృథుచక్రవర్తి దగ్గరికివెళ్ళి ధనాన్ని అడిగాడు అత్రి.

"మహర్షీ! నీకు ధనం ఇవ్వటానికి అభ్యంతరం లేదు నాకు! కాని నాకు ఒక సహాయం చేయి. నేను అశ్వమేధయాగం చేస్తున్నాను. ఆ యాగాశ్వాన్ని స్వేచ్చగా వదిలిపెడతాను. దాన్ని రక్షించటానికి సాయంగా నా కొడుకును దానివెంట పంపిస్తున్నాను. నువ్వు నా కొడుకుకి సాయం చెయ్యి" అని అడిగాడు పృథు చక్రవర్తి. పృథుచక్రవర్తి యాగం మహా వైభవంగా జరుగుతున్నది. ఇంద్రుడు అసూయ చేత మారువేషంలో వచ్చి అశ్వాన్ని ఎత్తుకుపోయాడు. భూమిమీద ఎక్కడ వెతికినా దొరక్కుండా పాషండుడి వేషంలో ఇంద్రుడు, ఆ అశ్వాన్ని ఆకాశ మార్గంలో ఎత్తుకుపోతున్నాడు. 

పృథుచక్రవర్తి కొడుకు, "వాడు ఎవరో తెలియటం లేదే! వాడిని బాణం వేసి చంపనా?" అని అంటే, "అతడు దేవేంద్రుడే! మారువేషంలో వచ్చాడు. యాగానికి హాని తలపెట్టినవాడు ఎవరైనా సరే వధార్హుడే! వాడిమీద నీ బాణం వెయ్యి" అన్నాడు అత్రిమహర్షి. ఆయన అలా ధర్మసూక్ష్మాన్ని నిర్ణయించాడు. పృథుచక్రవర్తి కొడుకు బాణం వేశాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు తీవ్రమైన వేదనకు గురి అయి అశ్వాన్ని వదిలిపెట్టి పారిపోయాడట.
🔱
*సశేషం*
꧁☆

🌹 భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 4 🌹
భాగము - 4

🌻 కపిల మహర్షి - 1 🌻

1.    సాక్షాత్తు విష్ణువే కపిలుడిగా పుట్టడం చేత కర్దముడు కపిలునితో “నేను యోగసమాధిని అనుష్ఠించి నిన్ను ధ్యానం చేసుకుంటూ ఏకాంత వాసానికి తరలిపోతాను. అనుజ్ఞనివ్వు” అని అడిగాడు. అందుకు కపిలుడు, “మునీంద్రా! నా జన్మకు కారణం ఏమిటంటే మునులందరికీ యోగమార్గాన్ని చూపించటమే! అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. నీకోరిక మన్నించటం కోసం మాత్రమే కాదు, లోకానుగ్రహ కాంక్షతో నేను ఇక్కడికి వచ్చాను. నా కార్యాన్ని తత్త్వబోధతో కొనసాగిస్తాను. అందరికీ తత్త్వబోధ చేస్తాను. సకల కర్మలలోనూ నీవు సన్యసించి, అంటే నీవు కర్మను వదిలిపెట్టి, నన్నే భక్తితో ఆరాధించు. ముక్తిని పొందుతావు” అన్నాడు.

2.    కపిలుడు తల్లికి ఆత్మబోధ ఇలా చేసాడు “జీవుని చిత్తమందు ఈ సంసారము త్రిగుణమయంగా ఉండటంచేత బంధనము కలుగుతోందని, ఆ చిత్తమందే – నిర్గుణమయిన బ్రహ్మ పదార్ధంపై ధ్యానం అవసరం లేకుండా నారాయణాశ్రితంగా – అంటే,నారాయణుని ఆశ్రయించే చిత్తముండేటట్లు అలవాటు చేసుకున్నట్లయితే, మోక్షం లభిస్తుంది” అని బోధ చేసాడు.

3.    యోగి యొక్క స్థితి ఎమిటంటే, “వాక్పాణి పాయూపస్థలనేవి ఏవయితే శరీరంలో ఉన్నవో, వాటికి యోగి శరీరంలో స్థితి లేదు. అంటే అవి విషయములను విసర్జించవు, స్వీకరించవు. అంతర్ముఖుడైన యోగిని ఇంద్రియాలు బాధించవు. కాబట్టి వేదకర్మలనుంచి అతనికి వచ్చే సుఖము కానీ, ఆచరించకపోతే వచ్చే దుఖముకాని ఉండవు. ఈ నవద్వారాలను మూసి వేయగలిగినట్టి వాడెవడైనా ఉంటే, అటువంటి ముధునకు – అటువంటి యోగికి – తపోదానవ్రతములుకాని, వేదప్రామాణ్యముకాని కావలసిన పనిలేదు.

4.    వేదములే లోకములకు ప్రమాణములు. శబ్దబ్రహ్మ, పరబ్రహ్మలలో – శబ్దబ్రహ్మవలన పరబ్రహ్మమును గ్రహించవచ్చును. ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా’ అని పరబ్రహ్మ వస్తువును గురించి శృతి చెపుతున్నది. బ్రహ్మవస్తువును మనసుతో పొందటానికి వీలులేదు. ‘యతోవాచో వివర్తంతే’ – అంటే అక్కడ పదములు భాష, వాక్యములు దానిని నిర్దేశించలేవు. వాటికా శక్తిలేదు. కానీ మానవభాష, మానవజీవితానికి కావలసినటువంటి విషయములను సుసంపన్నం చేస్తుంది. కానీ అగోచరమయిన బ్రహ్మవస్తువును భాషచెప్పగలుగుతుందా? చెప్పలేదు. వేదము దానిని గురించి ఎంతయినా మాట్లాడుతుంది. కానీ దానిని తను చూపించలేదు. వేదమును శబ్దబ్రహ్మము అని భావించాలి. అంటే నిర్గుణమైన బ్రహ్మవస్తువు (వాక్కు, మనస్సులకు అతీతంగా ఉన్నది) శబ్దరూపంలో వేదంగా పరిణమించి ఇలా వచ్చింది. వేదాధ్యయనం చెయ్యటంచేత, వేదాన్ని నమ్మటంచేత బ్రహ్మమునే నమ్ముతున్నానని భావిస్తే; అదేవిధంగా ఇదీ మార్గమవుతుంది అని చెప్పాడు.

5.    శబ్ద బ్రహ్మ భావన యందు వేదాధ్యయనం చెయ్యమని చెప్పిన అర్ధం దాంట్లో సిద్ధిస్తోంది. అది క్రతువులకు కారణం అవుతుంది. దానివల్ల వర్షం వస్తుంది. సంతానం కలుగుతుంది. పశువులు కలుగుతాయి. శత్రుక్షయమవుతుంది. ఏ ప్రకారంగా చేసే వేద విచారణ, వేదాధ్యయనం, వేదాచరణ ముక్తిహేతువు కాజాలదు.దానిని ఏలావాడుకోవాలంటే, అది శబ్దబ్రహ్మ అనే భావనలో ఉంటే – ‘ఓం’ అనే ప్రణవాన్ని శబ్దబ్రహ్మగా భావిస్తే కలిగే అనుభవం అది. ‘ఓమిత్యేకాక్షరం బ్రహ్మ’- అంటే, ఒకటే అక్షరం అది. బ్రహ్మవస్తువది. ఆ భావనతోటే ప్రణవాన్ని ఉచ్చరిస్తే మంచిది. అప్పుడు పొందబడే వస్తువు పొందబడుతుంది. అలాకాక, కేవలం నోటితో అంటే, లభించేది కాదది. ఏందుకంటే, అలాచేసినప్పుడు నోరు అరుస్తుందే తప్ప నోటికేమీ జ్ఞానం లభించదు. అనుభూతి జీవిడికి చిత్తము ద్వారా లభిస్తుంది. చిత్తమనేటటువంటి ఒక ద్వారం ఉన్నది. అది జీవాత్మ అని అనబడుతున్నది. చిత్తాన్ని ధరించటంచేత జీవాత్మ అనబడుతున్నది. చిత్తాన్ని భేదించి లోపలికి ఈ బ్రహ్మ వస్తువును ప్రవేశపెట్టగలిగితే; చిత్తభేదనం జరిగి ఆత్మవస్తువుకు బ్రహ్మవస్తువుయొక్క స్పర్శచేత బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది ఒక పద్ధతి. అలావేలకొద్దీ మార్గములు చెప్పారు. బ్రహ్మణులు ఉత్తములై, వేదబోధిత కర్మలను అనుష్ఠిస్తూ శాశ్వతపదమును పొందవచ్చును. పురాణాల్లో ‘బ్రహ్మణ’ శబ్దం యెక్కడ వచ్చినా ఋషులనే అర్ధం. ఋషులు అనేటువంటి అర్ధంలోనే ఆమాట వాడతారు.

6.    కాబట్టి – బ్రహ్మజ్ఞానం ఎవరికయితే ఉంటుందో – వాళ్ళు బ్రహ్మణులు అనబడతారు. వేదం చదువుకోవటంచేత అతడు ద్విజత్వాన్ని సార్థకంచేసుకుంటాడు. ఉపనయనసంస్కారాలచేత ఆ తరువాత వేదం ఎందుకు వాడుకోవలెనో అది మాత్రమే తెలుసుకొని అందుకుమాత్రమే వేదాన్ని ఉపాసనచేసినవాడు విప్రుడనబడతాడు. విప్రత్వం అంటే వేదములను సక్రమంగా వాడుకొని విరాగియై, జ్ఞానమార్గంలో ఉండి సద్బ్రాహ్మణుడిగా సమస్తకర్మలనూ ఆచరిస్తూ, మోహబుద్ధి లేకుండా పరమాత్మను తన దృక్పథంలో పెట్టుకొని ఆచరించటము. విప్రుడు, విప్రోత్తముడు, బ్రాహ్మణుడు, అని అతనికి పేరు. అది కులంకోసం ఏర్పడ్డది కాదు.



🌹 🌹 🌹 🌹 🌹


భాగము - 5

🌻. కపిల మహర్షి - 2 🌻

🌻 7.  వేదం యొక్క తాత్పర్యం ఏమిటో గ్రహించి, తెలుకోదగినది ఏదో, దానిని వెతుక్కుంటూ ప్రయాణించే వాళ్ళు వేదజ్ఞులని అనబడతారు. అలా కాని వాళ్ళు వేదపాఠకులు అనబడతారు. ఈ ప్రపంచమంతా వేదమందున్నది. వేదంలోనే అది ఉనికిని కలిగి ఉన్నది. కాబట్టి అట్లాంటి వేద మార్గములలో ఉండేటటు వంటి బ్రహ్మణులకు నేను కూడా నమస్కరిస్తాను అని కపిలుడు అన్నారు. 

🌻 8. పోయిన జన్మలో మనం ఏదో పుణ్యం చేస్తాము. సిరిసంపదలు అన్నీ వస్తాయి. భార్యాపిల్లలందరూ బాగుంటారు. సంతోషమే. దానిని అనుభవిస్తున్న సమయంలో సత్త్వగుణంతో, అంటే సత్త్వగుణ ప్రధానుడై అనుభవించాలి. దర్పంతో ఇదంతా తన ప్రయోజకత్వం అనే భావంతో కాదు. ఇతరులను తిరస్కరించి కాదు. ఇతరులను అవమానించి తాను ధనవంతుడినని విర్రవీగకూడదు. ఈ సంపదలన్నీ క్షణికములనే మాట గుర్తుపెట్టుకుంటూ వాటిని అనుభవించాలి. ఎందుకంటే, తనుండగానే తన పుణ్యం ఖర్చయిపోయి సంపదలన్నీపోతాయి. సంపదలుండగానే ఆయుర్ధాయం అయిపోతే, తను పోతాడు. కాబట్టి ఎలాగూ వియోగం తప్పదు. ఈ రెండు విషయములలో కూడా సంపద యొక్క అనుభవం క్షణికమే! ఏడుతరాలు అనుభవించగలిగిన ఆస్తి ఉండవచ్చు. కాని వ్యక్తి యొక్క అనుభవము క్షణికం మాత్రమే.

🌻 9. అందుకనే జ్ఞానభిక్ష పెట్టమని గురువును ఆశ్రయించాలి.’ ఈ క్షణికమయిన జీవితంలో అనుభవించటానికి అన్నీ ఉన్నాయి కాని, అనుభవించటం కోసమని నేనుండటం లేదు. నేనూ ఉండను-అవీ ఉండవు. అందువలన నాకు మార్గోపదేశం చెయ్యి’ అని ఆర్తితో గురువును ఆశ్రయించి మోక్ష మార్గాన్ని అర్ధించే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు. వాళ్ళే అంకురితులు, పుష్పితులు, ఫలితులు. జీవితంలో ఏ మార్గాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళనే ఫలితులు అంటారు. ముక్తి ఫలం పొందిన వాళ్ళు ఫలితులు.

🌻 10. మోక్ష ధర్మ మందు ఆపేక్ష మాత్రం కలిగి, ఆ ఆపేక్ష అంకురించిన హృదయంతో ముక్తి మార్గం అన్వేషిస్తే చాలు. ఎలాగైనా, యెప్పటికైనా నా కోరిక తీరుతుందేమో! గురువు లభిస్తాడేమో! ఎప్పటికైనా ఈ సంసారంలోంచి నేను బయటికి రాగలుగుతానేమో! అనేటువంటి దీక్ష, కోరిక కలిగినవాళ్ళు అంకురితులు. ఆ తపస్సులో ప్రవేశించి సాధన చేస్తున్న వాళ్ళు పుష్పితులు. ఇలా మూడురకాలుగా ఉన్నారు.

🌻 11. “వీళ్ళంతా గురుబోధిత జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతారు. గురువు-ఇది మార్గమని, ఇది గమ్యమని, ఇది కర్తవ్యమని చూపిస్తాడు. ఆ తరువాత నీకు కర్తవ్యం లేదు. వెనక్కు తిరిగి చూడకు. ఈ సంసారం యొక్క అర్థం ఇంత కన్నా లేదు. ఇది వ్యర్ధమయినటువంటిది. నీవు అటు చూడవద్దు. నీకు ఏవో ధర్మాలున్నాయని అనుకోవద్దు. మోక్ష మార్గంలో వెళ్ళేవాడికి ధర్మాలున్నాయని జ్ఞాపకం రాకూడదు. అది పతన మవుతుంది” అని కపిలుని బోధ.

 ముక్తిమార్గంలో వెళ్ళి అందులో ఉండే వాడికి, అందులోకి వెళ్ళిపోయిన తరువాత, ఇతర ఆలోచనలుండకూడదు. ‘ఏమిటో సన్యాసాస్రమం తీసుకున్నాను కాని చిన్నపిల్లకు పెళ్ళిచేయలేదూ ఇట్లాంటి ఆలోచనలేవీ ఉండకూడదు. వాటివలన భ్రష్టత్వం వస్తుంది. ఒకానొక సమయంలో కలిగిన తీక్షణమయినటువంటి వైరాగ్య ప్రవృత్తిలో వెళ్ళిపోతే, మరి వెనుతిరిగి చూడకూడదు.

🌻 12. మనుష్యుడుకి (జీవుడికి) కర్మ, భక్తి, వైరాగ్యము, జ్ఞానము, యోగము అనేటటువంటి ఐదు పరిణామాలు ఉంటాయి.

పరాయ పరరూపాయ 
పరమాత్మన్‌ పరాత్మనే 
నమః పరమతత్వాయ 
పరానందాయ ధీమహి

“పరాత్పరమైనటు వంటిది బ్రహ్మవస్తువు. దానికే నమస్కరించు. ఈ మధ్యలో దేనికీ కాదు. ఈ జగత్తులో పొందే ఆనందానికి పరమై ఉండేటటువంటి ఒకానొక ఆనంద స్వరూప మయినట్టి వస్తువు అది. పరమాత్మ దర్శనం చేత కలిగేటటు వంటి ఆనందానికి హేతువేదో, అది లోకాన్ని తరించిన తరువాత కలిగే ఆనందాన్నిచ్చేది. ఈ లోకంలో ఆనంద దాయకమయిన వస్తువులు అనేకం ఉన్నాయి. ఆ వస్తువులు లభిస్తే ఆనందం-లేకపోతే దుఖఃం కలుగుతవి. లోకాన్ని తరించి బయటికి వెళ్ళిన తరువాత పరమాత్మ వస్తువు యొక్క భావన చేత కలిగే శాశ్వతమయిన, నిరంతరమయిన ఆనందానికి అవధిలేదు. నిరవధిక ఆనందం అది. ఇంత అని చెప్పటానికి వీలులేదు. దానికొక హద్దు లేదు. ఒకనాటికి అది తరిగిపోయేది కాదు. పరమాత్మయొక్క సాన్నిధ్యంలో పొందినటువంటి ఆనందం నిరవధికంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండే ఆనందం అవధి కలిగినటువంటిదే! ఏ వస్తువయినా ఆనందాన్ని కొంత కాలమే ఇస్తుంది. అవధి కలిగినటువంటి ఆనందాలు ఈ లోకంలో చాలా ఉంటాయి.

సశేషం.. 
🌹 🌹 🌹 🌹 🌹


🌻. కపిల మహర్షి - 3 🌻

🌻 13. మనము గంగాస్నానము చేస్తాము. గంగాస్నానము పాపక్షయకరమేకాదు; చచ్చిపోయినతరువాత జీవునియొక్క బూడిదకు గంగస్పర్శ కలిగితే, జీవుడు లేకపోయినప్పటికీ-పూర్వశరీరంలో ఉండిన జీవుడు, ప్రేతరూపంలో ఉన్నప్పటికీకూడా-ముక్తిని పొందుతున్నాడు.

ఈ ఆర్య రహస్యము యెవరికీ అర్థంకానటు వంటిది. అసలు ఎలాగ అర్థం అవుతుంది! ఏమిటి దీని అర్థం! తర్కంతో చెపితే తెలిసే విషయం కాదిది. అసలు తర్కమేలేదు దీనికి.

ఏనాడయితే మనం ఆర్యసంస్కృతిలో ఉన్న మౌలికసూత్రాలను, ధర్మాలను ప్రశ్నించకుండా విశ్వాసంతో నమ్మటానికి అలవాటు చేసుకుంటామో,అప్పుడే మనకు భవిష్యత్తు ఉన్నది.

మన బుద్ధి కుశలతచేత దానిని పరీక్షించి, దానికి మన తర్కాన్ని అన్వయించి, “నా తర్కానికి ఇది నిలబడింది. కాబట్టి ఇది సత్యమే” అనుకుంటే; మనకు తెలిసిన తర్కం, మనకుండే విజ్ఞానం చాలా తక్కువ. దానిని పరీక్షించేందుకు మనము అధికారులమే కాదు. మనకు ఉండేటటువంటి యుక్తి, బుద్ధికుశలత చాలా అల్పం.

కాబట్టి గంగ అనేటువంటి వస్తువు అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ కూడా పవిత్రమయినదే! యజ్ఞంలో మనం గంగోదకం చల్లుకొని పవిత్రుల మవుతున్నాము. గంగ కటువంటి శక్తి ఉంది.

జీవితంలో ఒక్కమాటైనా గంగాస్నానం చేసితీరమని ప్రతి భారతీయుడికీ పెద్దలు చెప్తారు. అయితే కొందరు, “గంగ అపవిత్రంగా ఉందండీ!” అంటారు. అయ్యా! మురికి ఉంది కాని అపవిత్రంగాలేదు” అని సమాధానం చెప్పాలి.

అది ఎలాగ అంటే “నీవు వెళ్ళి ఆ యోగికి నమస్కారం చేసావు కదా! నీ శరీరంలో ఉన్నట్లుగానే ఆయన శరీరంలో కూడా మలమూత్రాలు ఉన్నాయి. ఆయనకెందుకు నమస్కరించావు?

ఆయనలో రక్తమాంసాలు, చర్మము క్షీణించి అందంగా కూడా లేడాయన. కేవలం సుందరమైన దేహంతో, రూపంతో అందంగా ఉన్నాడని నీవు ఎవడికైనా నమస్కారం చేస్తావా?” అని అదిగితే, ఏమిటి సమాధానం.

🌻 14. కాబట్టి బయటికి కనబడేటటువంటి శుభ్రత, అశుభ్రత అనేటటువంటివి భౌతికమైనవి. ‘పవిత్రతా అనేది దీనికి పైన, వెనుక ఉండేటటువంటి రహస్యం.

అది ఒక తత్వం. ఆ తత్త్వానికే మనం మొక్కుతాము. గంగానదిలో ఎంత మురికి ఉన్నా పవిత్రమయినదే! అలాగని మురికిచేస్తే ఫరవాలేదు అని అనటం లేదు.

అంత పవిత్రమయిన గంగను మురికి చెయ్యటం పాపంగా భావించాలి మనం. కాబట్టి అది శుభ్రంగా లేకపోవచ్చు గాని, ‘పవిత్రం’గానే ఉంది. అదీ ఆ రెండింటికీ ఉన్న తేడా. నీళ్ళు శుభ్రంగా ఉంటే ఇంట్లో స్నానం ! చేస్తాము. సబ్బు పెట్టుకొని, చక్కగా వేడినీళ్ళు పెట్టుకొని చేస్తాము.

ఆ నీళ్ళను పవిత్రమయినవి అంటామా! శుభ్రంగా ఉన్నాయి అనిమాత్రమే అర్థం. ఆ రెండస్తులలో ఆర్యుడు ప్రతీవస్తువునూ చూస్తాడు. భౌతికస్థితి, తాత్వికస్థితి అని రెండు దృక్పథములు ఉన్నాయి ఆర్యులకు. అది గుర్తుపెట్టుకోవాలి.

🌻 15. ఒకప్పుడు ప్రశ్నలు పుట్టేవికావు. కృష్ణుడి రాసక్రీడ యందు అవినీతి లేదా? అనే ప్రశ్న పూర్వం ఎవరూ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు అంటే, అధికారం లేకుండా అడుగుతున్నారు.

కృష్ణుడు అవినీతిపరుడు, అవినీతిలో సంచరించాడు అనే మాట అనే ముందు మనం ఎంతటి అవినీతిలో ఉన్నామో ఒక్కమాటు గుర్తు చేసుకుంటున్నామా! మనను మనం అలా ప్రశ్నించుకున్నామా? మనసా, వాచా, కర్మణా అంత నీతిమంతులుగా ఉన్నామా మనం! ఆ ప్రశ్న వెయ్యటా
నికి మనకీ అధికారం ఎక్కడినుంచి వచ్చిందనేది మొదటిప్రశ్న! సమాధానం తరువాత.

అధికారం లేకుండానే ప్రశ్నడగటం నేర్చుకోవటం చేతనే, ఆర్యధర్మం ఇలా అవమానం పాలవుతోంది. ప్రతీవాడినీ ప్రశ్నించవచ్చు. తప్పుకాదు. కాని అలా అడిగేముందు – అతడి ప్రవర్తనలో వక్రత్వాన్ని దూషించే ముందు, ముందర మన ప్రవర్తన సక్రమంగా ఉంటేనే అలాగ అడగటానికి వీలవుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం  - 7 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి - 4 🌻

🌻 16. మనిషితో ఏంచేసినా తప్పే! సాక్షాత్తు భగవంతుడు వరమిచ్చినా సందేహిస్తాడు. “ఈయన వరమిచ్చాడు, నిజంగా అవుతుందా?” అనుకుంటాడు. ఇవ్వకపోతే, “స్వార్థపరుడు, డబ్బిస్తే ఇస్తాడేమో, ఈపనులన్నీ చేస్తాడేమో!” అని అనుకుంటాడు. ఏం చేసినా మనుష్యుడిని రంజింప చెయ్యలేరు. ‘నరం నరంజయతి బ్రహ్మాపీ – బ్రహ్మ కూడా నరుడిని రంజింప చెయ్యలేడు అని ఒక వాక్యంకూడా ఉన్నది.

🌻17. ఈశ్వరుని యొక్క ప్రతిపాదన ఎలాగ ఉన్నదంటే – కృష్ణచరిత్ర లోని రాసలీలలో అంతా కూడా; కోరేవాడు, పొందేవాడు, అనుభవించేవాడు మనుష్యుడేనని అర్థం. మనుష్యుడు ఏది కోరుతాడో అదే పొందుతాడు, అదే అనుభవిస్తాడు. ఇది మనుష్యుడి యొక్క లక్షణమే తప్ప ఈశ్వరుడు దేంట్లోనూ కర్తకాడు. ఈశ్వరుడి యొక్క స్థితి ఎలాఉందంటే – ఇచ్చేవాడు కాదు, చేసేవాడుకాదు, తీర్చేవాడుకాదు; ఇవ్వననే వాడు కూడా కాదు. ఆయన తటస్థంగా ఉంటాడు.

🌻 18. మనుష్యుడు శృంగార భావంతో గాని, శత్రుభావనతో కాని, ప్రేమ భావనతో కాని, భక్తి భావంతో కాని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు; వాళ్ళు ఆ పరమాత్మను తమవంటి మరొక వ్యక్తిగా పొందుతారు. దాతగా చూస్తారు. సంహర్తగా చూస్తారు. ద్వేషంచేత వెళ్ళి తనను అతడు చంపుతున్నాడనే భావనతో చచ్చిపోతారు. అనుగ్రహిస్తున్నాడనే భావంతో అనుగ్రహించబడి, ఆనందాన్ని పొందుతారు. మోహంతో ప్రేమతోవెళ్ళి, అతడు తనను భర్తగా స్వీకరించాడనే భావం వీళ్ళు పొందుతారు. ఏయే భావంతో జీవుడు ఈశ్వరుణ్ణి చేరతాడో, ఆయా అనుభూతి వాళ్ళకు వస్తుంది. ఆ వస్తువును నిజంగానే పొందుతారు. ఆ పొందటం అనేది వీళ్ళకే జరుగుతుంది గాని, ఇవ్వటమనేది అతడికి జరగదు. అక్కడ ఈశ్వరుడు క్రియాశూన్యుడేగాని, సమస్తక్రియలకు ఆధారభూతమైన కర్త, సాక్షిమాత్రుడు. అంటే, ఇదంతా జగత్కారణుడైన ఈశ్వరుడివల్లే జరిగినప్పటికీ; అతీతమైన స్థితిలో అతడు ఉండటం చేత ఇదంతా జీవుల చరిత్రే తప్ప, ఈశ్వరుడు నిష్క్రియుడే అని చెప్పి ప్రతిపాదిస్తున్నది భాగవతం.

సశేషం.. 


🌹 🌹 🌹 🌹 🌹




🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 19 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 16 🌻

🌻 44. అర్థంలో లోభం అన్నారు. ధనానికి ఉన్న గుణం ఏమిటంటే, అది ఎవరినీ వరించదు. 

ఉదాహరణకు రోడ్డుమీద ఒక వెయ్యి రూపాయల నోటు అక్కడపడి ఉంటే, వచ్చి నన్నెవరయినా తీసుకోండీ అని ఆ ధనం పిలుస్తుందా? పిలవదు. వెంటనే చూచేవాళ్ళలో లోభత్వాన్ని కలుగచేస్తుంది. అది ధనంయొక్క లక్షణం అని అంటాం. కానీ బుద్ధిలో పుట్టే వికారమే అది. 

ధనంలో లోభం ఉంది. అంటే ధనాన్ని చూస్తే మనిషిలో లోభత్వం కలుగుతుంది. బుద్ధి అక్కడ కర్త, వస్తువుగా ఉంది. ఏదయినా అంతే! ఒక వస్తువులో ఇంకొక వస్తువు ఇమిడి ఉన్నది.

🌻 45. మనసు ఒక స్తంభాన్ని చూడగానే అది స్తంభము అని గుర్తుపట్టటం; దాన్ని బుద్ధి అంటారు. చూడటము అనేటటువంటిది, చూపు ఇంద్రియం చేసినప్పటికీ, మనసు అనేది మొట్టమొదట దానియందు ప్రసరిస్తుంది. 

పూర్వ జ్ఞానం చేత-అంతకుముందు ఉండే అనుభవం చేత-ఇలా పొడుగ్గా, నిలువుగా ఉండేటువంటిది స్తంభము అనేటువంటి జ్ఞానము బుద్ధిది. మనస్సు, ఇంద్రియాన్ని అనుసరించి అక్కడిదాకా తీసుకువెళుతుంది. 

నేత్రేంద్రియం అక్కడిదాకా మనస్సును అనుసరించి వెళితేనే అది బుద్ధికి స్తంభంగా గోచరిస్తుంది తప్ప; మనసు కాని, నేత్రేంద్రియం కాని అది స్తంభమని తమంతట తాము గుర్తించలేవు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 21 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 18 🌻

🌻 47. రజస్సులో కొన్ని సందర్భాలలో తమస్సు ఉంటుంది. తమస్సు అంటే అంధకారం, సత్యానికి, సత్యదూరత్వం. అంటే సత్యానికి చాలా దూరం వెళ్ళిపోవటము, అసత్యపదార్థాన్ని సత్పదార్ధంవలే భావించటము-ఇవన్నీ తమోగుణ లక్షణములు. తమస్సు అంటే ఇంకా చాలా చెప్పవచ్చు. నిద్రావస్థ ఉన్నది. దాన్ని తమస్సు అంటాం.

ఉదాహరణకు విచక్షణ లేకుండా కళ్ళు మూసుకొని నడిస్తే కిందపడతాడు, పళ్ళువిరుగుతాయి. పళ్ళు ఎలా విరుగుతాయో చుద్దామని అనుకుంటే అది తమస్సు. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలుసుకుందామనుకొని కళ్ళుమూసుకొని నడిస్తే, వాడు బుద్ధిహీనుడు.

విచక్షణ ఒక క్రియయందు ప్రవేశించటం, స్వప్రయోజనం లేకుండాకూడా ప్రవేశించటము తమస్సు. అజ్ఞానం. నిష్ప్రయోజకమయిన క్రియయందు అంతఃకరణ ప్రవేశించటము.

నిష్ప్రయోజకము అంటే ఏమిటి? ఉదాహరణకు, నిద్ర ఉంది. దానియొక్క ప్రయోజనం ఏమిటి? దానివలన శరీరానికి ప్రయోజనం కలుగుతుంది. అయితే కర్తకేమిటి ప్రయోజనం?

శరీరానికి ప్రయోజనం అయిన నిద్రలో, తన ప్రయోజనం ఆశించి కర్త ప్రవేశిస్తే, అది నిష్ప్రయోజకం. తన ప్రయోజనం ఆశించి, నిష్ప్రయోజక మయినటువంటి ఒక పనిలో కర్త ప్రవేశించటం పేరు తమస్సు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 22 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 19 🌻

🌻 48. బుద్ధిలో రజోగుణం ఉంది కనుకే, ఈ ప్రపంచం అంతా తెలుసుకుని జగ్రత్తగా నడుస్తాం. అలా తెలుసుకోకపోతే; రోడ్డుమీద నడుస్తున్నాం లారీవస్తూంటుంది, జగ్రత్తగా ఉండకపోతే దానికింద పడతాం.

అది ప్రమాదమని ముందే తెలుసుకొని కన్నేమో లారీని చూపించింది. బుద్ధేమో అది మీదకి వస్తుంది అని చెపుతుంది. కాబట్టి ఇంద్రియములు అక్కడినుంచీ తప్పుకో అని పక్కకు నెడుతున్నాయి. అంటేదేహరక్షణోపాయానికి ఈ రజోగుణబుద్ధి కారణమవుతున్నది.

దేహ పోషణకు కూడా అదేకారణమవుతున్నది. ఆకలివేస్తే, అన్నం ఎక్కడదొరుకుతుందో వెతుక్కుని తింటాం. ఇదంతా బుద్ధియొక్క లక్షణం. ఇదంతా రజోగుణమే.

🌻 49. ‘సత్వరజస్సేమిటి?’ అంటే, అంతఃకరణ సాత్వికస్థితిని పొందినపుడు, ఉపశమనం కావాలనేది. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ద్వంద్వములనుంచీ వచ్చేటటువంటి దుఖాఃన్ని తప్పించుకుని శాంతిని పొందాలనే కోరిక పుడితే, అది సత్వగుణ లక్షణము.

అది కూడా ఈ బుద్ధిలో రజోగుణంవల్లనే వివేకంచేత పుట్టింది. ఇది రజోగుణసముద్భవమయిన వివేకం. ఇది లేకొపోతే వివేకము పుట్టదు; సద్వస్తువునందు మనసు ప్రేరణ పొందదు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 18 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 15 🌻

🌻 42. ముక్తి కోరుకోవటమే మనకు శరణ్యమని, పరమాత్మను మనకు దానినే ప్రసాదించమని కోరుకోవాలి. అదే మనకు ధ్యేయంగా భావించాలి.

ఈ విశ్లేషణవలన మనలో పరివర్తన కలిగినప్పుడు ఆత్మవస్తువు సహజంగానే దర్శనమిస్తుంది. దానిని పొందటానికి ప్రత్యేకంగా చేయాల్సిన కర్మంటూ ఏమీలేదు.

అందుకనే సత్వరజస్తమో గుణములు కర్మలలో లేవు; బుద్ధిలో ఉన్నవి. బుద్ధిలో ఉండే సత్వగుణం కాసేపు భజన చేయిస్తుంది. రజోగుణం ఎవరినయినా తన్నమని-తిట్టమని అంటుంది. తమోగుణం కడుపునిండా భోజనం చేయమంటుంది.

కర్మలలో ఏమీ లేవు. ఒక సాత్వికకర్మ, మరొక రాజకర్మ ఉన్నవి. కర్మయొక్క హేతువులు, కర్త అయినటువంటి బుద్ధిలో ఏదయితే ప్రేరకశక్తి ఉన్నదో, దాని యందున్నాయి. గుణత్రయాతీతంగా ఈ బుద్ధిని మార్చుకోవాలంటే ఏం చేయాలి?

గుణత్రయాతీత మయినటువంటి వస్తువు ఉంటే, దాని యందు ఈ బుద్ధిని ప్రవేశపెట్టగలగాలి. ఈ కర్మలన్నీకూడా-వేదంచదువుకొన్నా, యజ్ఞం చేసినా, కసాయి వాడి ఉద్యోగం చేసినా-ఆయా గుణములు బుద్ధిలో ప్రవేశించి చేయించే పనులే తప్ప, కర్మకు ఒక గుణం లేదు అని అర్థం చేసుకోవాలి. ఇది కపిలుని ఉద్దేశ్యం.

🌻 43. పంచభూతములలో, భూతత్వములో పంచేంద్రియములు ఉన్నాయి. ఆకాశంలో అగ్ని ఉంది. అగ్నిలో జలమున్నది. జలములో భూమి ఉంది.

కౌశికునిలో బలమెలా ఉందో, ఉపేంద్రునియందు క్రాంతి ఎలా ఉందో, ధనంలో లోభత్వం ఎలాఉందో-తమస్సులో ముద్ధి, రజస్సులో తమస్సు, సత్వంలో రజస్సు ఉన్నామని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా అలోచిస్తే అంతా సత్వమే? అది అర్థంకావాలి అంతే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 11 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి  బోధనలు - 8 🌻

🌻 27. బాలోన్మత్త పిశాచవత్ ‘ అంటారు. చిన్నపిల్లవలె, ఆ అనుభూతి కలిగిన తరువాత-ఈ ప్రపంచస్పృహ పోవటమనే స్థితి – మైకము మనందరికీకూడా సాధ్యమే! ఎందుకంటే ఏ భావనతో ఏది కావాలని ఆయనను అడుగుతారో, అటువంటి భావనను వాళ్ళుపొందుతారని చెపుతుంది భాగవతము.

🌻 28. ఆయన క్రియాశూన్యుడు, సర్వకారణకారణుడేకాని, ఆయన ప్రత్యేకంగా దేనికీ కారణముకాదు. కారణాలకుకారణం వంటివాడు. పాపానికి, పుణ్యానికి సహజంగా ఏ సృష్టిలో ఫలాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఏదో అదేఇస్తుంది తప్ప; ఏ వ్యక్తినీ ప్రత్యేకంగా, “నువ్వు పాపం చేసావు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను” అని ఆయన అనలేదు. అకర్తృత్వభావనతో అతడు సమిష్టిగా ఉంటాడు కానీ, వ్యక్తిగా ఆతడు ఏపనీ చెయ్యడు. ఒకే వస్తువుగా ఉంటాడు.

🌻 29. కాబట్టి వాళ్ళవాళ్ళ రాసక్రీడలలో అనేకమంది గోపికలతో అనేకమంది కృష్ణులు ఏకకాలంలో కనబడటంచేత వాళ్ళ అంతఃకరణంలో వాళ్ళ తపోబలం(తపన) చేతనే అది సాధ్యమయింది.

అంతర్యామి ఆయనను-ఆత్మలో కృష్ణుడిని-ధరించి, అలాగే వెర్రిగా తిరిగారు. ఆడుకున్నారు. పాడుకున్నారు. అతడు కౌగిలించుకున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. అట్టి స్థితిని మోక్ష హేతువుగా చెపుతుంది భాగవతం. అది పిచ్చి స్థితి అనుకుంటారేమో, కాదు మోక్ష హేతువని చెబుతుంది.

సశేషం.. 


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 15 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి బోధనలు - 12 🌻

🌻 35. సుఖము-దుఖఃము, ఉదయము-అస్తమయమువలె ఉంటాయి. అలా ఒకనాడు కాలగతిలో సుఖం వస్తుంది. అన్నీ కూడా గదిచిపోయేవే, నిలబడి ఉండిపోయేవి కావు అని తెలుసుకోవాలి.

సుఖము శాశ్వతం కాదు, దుఖఃము శాశ్వతం కాదు. సూర్యోదయం, సూర్యాస్తమయం శాశ్వతమా? రాత్రి శాశ్వతంగా ఉందా! ఏమీలేదు. గడచిపోతోంది.

ఆ ప్రకారంగానే, క్షణికంగా ఉంది ఆయువు. ఆయువు క్షణికం అంటే-125 ఏళ్ళు ఆయుర్దాయం ఉండి కూడా క్షణికమేనా అంటే – మన జీవనం అనేటువంటి క్రియ క్షణక్షణంగా ఉంది. మనం ఎప్పుడూ కూడా ఒక్కక్షణమే జీవిస్తున్నాము.

ఆ క్షణం అయిపోయిన తరువాతనే ఇంకొక ఉత్తరక్షణంలో జీవిస్తున్నాము. ఆ తరువాత మరొక క్షణంలోకి ప్రవేశించి ఆ క్షణాన జీవిస్తున్నాము. అంటే జీవనం క్షణికమే అవుతోంది.

🌻 36. అట్లాంటి జీవనక్రియలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఆకలితో బాధ పదుతున్నాం, ఒకప్పుడేమో ఆకలి తీర్చుకోవటానికి అన్నంతిని తృప్తిపడుతున్నాం.

మరొకప్పుడు ఇంకేదో పని చేస్తున్నాం. ప్రతీ ఒక్క అనుభవంలో కూడా క్షణికంగా-క్షణక్షణాలలో జీవిస్తున్నామే తప్ప, ఒక continuity గా, ఒకే కాలమనేటటువంటి వస్తువుగా మనంకాలాన్ని అనుభవించటంలేదు.

ఎందుచేతనంటే, ఏ అవస్థాకూకూడా నిత్యత్వం లేదు. ప్రతీ అవస్థా క్షణికమే కావటంచేత, అయుర్దాయం క్షణికము అని చెప్పబడుతున్నది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 16 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి బోధనలు - 13 🌻

🌻 37. ఆయుర్దాయం క్షణికం అంటే, మామూలుగా ఏముంది! ఎవరైనా, ఇంకో 20 ఏళ్ళు బతుకుతాను, అది క్షణికం ఎలా అవుతుంది అనవచ్చు! ఇరవై ఏళ్ళూ అంటే చాలా కాలమే కదా! అనుకోవచ్చు.

ఆయుర్దాయం క్షణికమంటే ఏమిటి? ఎప్పుడు ఏపని చేస్తాడో ఆ క్షణంలో ఆ పనిచెయ్యటమే! వండుకున్నాము. పొద్దున్నేలేచాము. కాలకృత్యాలు తీర్చుకున్నాము.ముఖం కడుక్కున్నాము. స్నానంచేసాము, పూజచేసుకున్నాము, భోజనం చేసాము. ఎక్కడికో వెళ్ళాము. తిరిగి వచ్చిపడుకున్నాం. అయిపోయింది.

ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఉన్నాము. రేపు పొద్దున మళ్ళీ అలాగే ఉంటాము. ఇది క్షణికంకాదా!ఏదయినా ఒక్క అనుభవం, ఒకస్థాయి, ఒక స్థితిని స్థాయీభావంతో ఖచ్చితంగా అనుభవితున్నామా? స్థితి అంటూ ఉందా మనకు? స్థితిలో లేనటువంటి, క్షణక్షణ్మూ అనుభవించేటటు వంటి ఆయుర్దాయం మొత్తము అంతా క్షణికమే అని అర్థంచేసుకోవాలి!

🌻 38. అసలు అనుభవించే టటువంటి ఈ క్షణాలు అన్నిటినీ కలిపి, కాలాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటున్నాం! ఎవరూ కాలాన్ని అనుభవించటం లేదు. కాలవస్తువుని ఆ ఈశ్వరుడు ఒక్కడే అనుభవిస్తున్నాడు.

ఎందుచేతనంటే ఆయనకు క్షణికంలేదు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు, నిరంజనుడు. కాలం అంతా ఆయనలో లయం అయి పోతున్నది కూడా. జగత్తు అంతాకూడా ఆయనలో లయం చెందుతున్నది. మహాకాలుడాయన. కాలస్వరూపుడు, సాక్షిగా ఉన్నాడు.

🌻 39. మానవజన్మకు సంబంధించిన అనుభవములు సర్వమునకు సాక్షిగా ఉండి, ఏదీ అనుభవించని ఆ కాలమే ఆయన.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 17 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 14 🌻

🌻 40. మానవజన్మకు సంబంధించిన అనుభవములు సర్వమునకు సాక్షిగా ఉండి, ఏదీ అనుభవించని ఆ కాలమే కృష్ణపరమాత్మ. కర్మయొక్క తత్వం ఏమిటో తెలుసుకోవాలి. వేదం చెప్పిన కర్మలు ఏవో అవి తెలుసుకొని వాటిని చెయ్యాలి.

వేదోచిత కర్మలను ఆచరించాలి. వీటియందుప్రమాణబుద్ధితో ఉండాలి. నేను ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న ఉండకూడదు. వేదము నన్ను తృప్తిపరిస్తే నేను చేస్తాను అని అనుకోకూడదు. ఎందుకంటే, మనకు తననుతాను ఋజువు చేసుకోవలసిన పని వేదానికి లేదు.

వేదోచిత కర్మలను మనం చేస్తే మన జీవితాలు ఒక దారిలో పడతాయి, లేకపోతే లేదు.

🌻 41. ప్రపంచాన్ని గురించిన సందేహనివారణకోసమే ఈ కపిల సాంఖ్యం పుట్టింది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం ఎలాగ ? నా జీవన విధానం ఎలా ఉండాలి ? అనేటటువంటి ప్రశ్నకు సాంఖ్యం జవాబు చెబుతుంది.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 13 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి బోధనలు - 10 🌻

🌻 31. ఈ సైన్సు అనేది అసలు ఎక్కడినుంచి వచ్చింది? ఈ బుద్ధి వారికెక్కడి నుంచి వచ్చింది? విమర్శనాజ్ఞానం ఎక్కడినుంచి వచ్చింది? అనేటువంటి ప్రశ్న పుట్టడంలేదు.

తన బుద్ధి కుశలతతో నిర్మాణం చేసుకున్నటువంటి మూర్ఖత్వం ప్రస్తుతం ఈ లోకానికి ఉన్నది. వీళ్ళకు ప్రమాణబుద్ధి, వీళ్ళే స్వయంగా నిర్మించుకున్నటువంటి సైన్సు మీదనే, విజ్ఞానశాస్త్రం మీదనే ఉంది తప్ప; జ్ఞానం మీదలేదు.

ప్రామాణబుద్ధి దేనియందుందో, తదనుగుణమైన మార్గాన్ని మనయందు దయతో చూపించటానికి ఆయన ఎప్పుడూ వస్తూ ఉంటాడని తాత్పర్యం. ఈశ్వరుడియొక్క అవతారానికి అదే కారణం.

🌻 32. దర్శనములు అనేవి రండు విధములుగా ఉన్నవి. ఆర్షదర్శన్ములు, అంటే వేదము ప్రమాణంగా తీసుకున్నవి. వేదము ప్రమాణ్ము కాదు అనే దర్శనములు నాస్తికదర్శనములు.

ఆ దర్శనకర్తలు
, ఈ దర్శనకర్తలు ఇద్దరూ కూడా జీవిడియొక్క మోక్షమార్గాన్ని గురించి అన్విషించి చెప్పినవాళ్ళయి ఉండవచ్చు. అయినా వాళ్ళ ధ్యేయము ముక్తి అయినప్పటికీ; వేదప్రామాణ్యతను దృష్టిలో పెట్టుకొని చెప్పేమార్గోపదేశము చేసినటువంటి దర్శనములు ఏవయితే ఉన్నవో అవి ఆర్షదర్శనములు అనబడతాయి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹



భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 14 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి బోధనలు - 11 🌻

🌻 33. ‘దేహము పొదేటటువంటి సుఖదుఖాఃలు, దేహి అయినటువంటి ఆ లోపల ఉండేటువంటి ఆత్మకు చెందవు.

అది ఏరకమైన సుఖాలనూ, దుఖాఃలనూ అనుభవంచదు. ‘నశ్వరమై కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోయేటటువంటి శరీరానికి వచ్చేటటువంటి సుఖదుఖఃములు కూడా నశ్వరములే! అసత్యములే!’ – అనేటువంటి విమర్శజ్ఞానంతో దీనిని బాగా తెలుసుకుని, దృఢమయిన జ్ఞానంతో ఒక్కమాటే ఆ విషయసుఖములను వదిలిపెట్టాలి.

🌻 34. “మొట్టమొదట పంచేంద్రియములను సమీకరించుకుని, వాటన్నిటినీ నియంతృత్వంలోనికి తీసుకొని; విషయములను, ఇంద్రియములను విశ్చయముగా శాసించగలిగిన శాసనకర్తవు నీవే అయి, అవి నిన్ను శసించకుండా చేసుకున్న తరువాత – అంతటి దృఢమైన జ్ఞానము వచ్చినతరువాత; ఇంద్రియములను, వాటి సుఖదుఖములను వదిలిపెట్టాలి”. అని బోధ.

మొట్టమొదట యోగానికి ఇది ప్రవేశ ప్రాంగణము. లోపలికి వెళ్ళిన తరువాత యోగంలో ప్రవేశిస్తారు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 🌹 🌹 🌹 🌹
కుండలిని శక్తి జాగృతి - ఖర్జ సాధనము :

నిత్యము "ఖర్జము"  అభ్యసించినచో,  కుండలినీ శక్తి జాగృతం అగును. నిత్యము ఉదయమే కొంత సేపు తక్కువ స్వరంతో సంగీత - గానములను అభ్యసించినచో...కుండలినీ శక్తి జాగృతమగును.  స్వరము యొక్క హెచ్చుతగ్గులను పూర్తిగా శ్రద్ధతో వినవలెను. ఈ విధముగా ఖర్జ సాధనను అభ్యసించినచో, మూలాధారము నందు,  నిభిడీకృతమైన కుండలినీ శక్తి విడుదల గావించబడి,  మేరు దండము, వెన్నెముక గుండా సప్తస్వరములు, సప్త యోగ చక్రములకు, స్థానములైన...సప్త కేంద్రములను దాటుతూ... ఊర్ధ్వముఖంగా పయనించును.

      అట్టి స్థితి లోని పారంగతుడు, తన సహస్రారము నందలి ఏడవ యోగ చక్రము నందు.... ఏకాగ్రత నిలిపి పరిణతి పొందిన యోగి కాగలడు. గాయకులు ఈ ఖర్జ సాధనను  అభ్యసించి, వారి సమయమునందు ఉత్తమమైన గాయకులుగా పేరు పొందగలరు. అటువంటి గాయకుని స్వరము చాలా వినసొంపుగా, మాధుర్యం గా ఉండి పరిపక్వత స్థితికి చేరును.


📚 యోగిరాజ్ శ్రీకృష్ణ మనోహర్ హర్కరే

✒️ భట్టాచార్య



భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 10 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కపిల మహర్షి - 7 🌻

🌻 33. ‘దేహము పొదేటటువంటి సుఖదుఖాఃలు, దేహి అయినటువంటి ఆ లోపల ఉండేటువంటి ఆత్మకు చెందవు. అది ఏరకమైన సుఖాలనూ, దుఖాఃలనూ అనుభవంచదు. ‘నశ్వరమై కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోయేటటువంటి శరీరానికి వచ్చేటటువంటి సుఖదుఖఃములు కూడా నశ్వరములే! అసత్యములే!’ – అనేటువంటి విమర్శజ్ఞానంతో దీనిని బాగా తెలుసుకుని, దృఢమయిన జ్ఞానంతో ఒక్కమాటే ఆ విషయసుఖములను వదిలిపెట్టాలి.

🌻 34. “మొట్టమొదట పంచేంద్రియములను సమీకరించుకుని, వాటన్నిటినీ నియంతృత్వంలోనికి తీసుకొని; విషయములను, ఇంద్రియములను విశ్చయముగా శాసించగలిగిన శాసనకర్తవు నీవే అయి, అవి నిన్ను శసించకుండా చేసుకున్నతరువాత – అంతటి దృఢమైన జ్ఞానము వచ్చినతరువాత; ఇంద్రియములను, వాటి సుఖదుఖములను వదిలిపెట్టాలి”. అని బోధ. మొట్టమొదట యోగానికి ఇది ప్రవేశప్రాంగణము. లోపలికి వెళ్ళిన తరువాత యోగంలో ప్రవేశిస్తారు.

🌻 35. సుఖము-దుఖఃము, ఉదయము-అస్తమయమువలె ఉంటాయి. అలా ఒకనాడు కాలగతిలో సుఖం వస్తుంది. అన్నీ కూడా గదిచిపోయేవే, నిలబడి ఉండిపోయేవి కావు అని తెలుసుకోవాలి. సుఖము శాశ్వతం కాదు, దుఖఃము శాశ్వతం కాదు. సూర్యోదయం, సూర్యాస్తమయం శాశ్వతమా? రాత్రి శాశ్వతంగా ఉందా! ఏమీలేదు. గడచిపోతోంది. ఆ ప్రకారంగానే, క్షణికంగా ఉంది ఆయువు. ఆయువు క్షణికం అంటే-125 ఏళ్ళు ఆయుర్దాయం ఉండి కూడా క్షణికమేనా అంటే – మన జీవనం అనేటువంటి క్రియ క్షణక్షణంగా ఉంది. మనం ఎప్పుడూ కూడా ఒక్కక్షణమే జీవిస్తున్నాము. ఆ క్షణం అయిపోయిన తరువాతనే ఇంకొక ఉత్తరక్షణంలో జీవిస్తున్నాము. ఆ తరువాత మరొక క్షణంలోకి ప్రవేశించి ఆ క్షణాన జీవిస్తున్నాము. అంటే జీవనం క్షణికమే అవుతోంది.

🌻 36. అట్లాంటి జీవనక్రియలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఆకలితో బాధ పదుతున్నాం, ఒకప్పుడేమో ఆకలి తీర్చుకోవటానికి అన్నంతిని తృప్తిపడుతున్నాం. మరొకప్పుడు ఇంకేదో పని చేస్తున్నాం. ప్రతీ ఒక్క అనుభవంలో కూడా క్షణికంగా-క్షణక్షణాలలో జీవిస్తున్నామే తప్ప, ఒక continuity గా, ఒకే కాలమనేటటువంటి వస్తువుగా మనంకాలాన్ని అనుభవించటంలేదు. ఎందుచేతనంటే, ఏ అవస్థాకూకూడా నిత్యత్వం లేదు. ప్రతీ అవస్థా క్షణికమే కావటంచేత, అయుర్దాయం క్షణికము అని చెప్పబడుతున్నది.

🌻 37. ఆయుర్దాయం క్షణికం అంటే, మామూలుగా ఏముంది! ఎవరైనా, ఇంకో 20 ఏళ్ళు బతుకుతాను, అది క్షణికం ఎలా అవుతుంది అనవచ్చు! ఇరవై ఏళ్ళూ అంటే చాలా కాలమే కదా! అనుకోవచ్చు. ఆయుర్దాయం క్షణికమంటే ఏమిటి? ఎప్పుడు ఏపని చేస్తాడో ఆ క్షణంలో ఆ పనిచెయ్యటమే! వండుకున్నాము. పొద్దున్నేలేచాము. కాలకృత్యాలు తీర్చుకున్నాము.ముఖం కడుక్కున్నాము. స్నానంచేసాము, పూజచేసుకున్నాము, భోజనం చేసాము. ఎక్కడికో వెళ్ళాము. తిరిగి వచ్చిపడుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఉన్నాము. రేపు పొద్దున మళ్ళీ అలాగే ఉంటాము. ఇది క్షణికంకాదా!ఏదయినా ఒక్క అనుభవం, ఒకస్థాయి, ఒక స్థితిని స్థాయీభావంతో ఖచ్చితంగా అనుభవితున్నామా? స్థితి అంటూ ఉందా మనకు? స్థితిలో లేనటువంటి, క్షణక్షణ్మూ అనుభవించేటటు వంటి ఆయుర్దాయం మొత్తము అంతా క్షణికమే అని అర్థంచేసుకోవాలి!

🌻 38. అసలు అనుభవించే టటువంటి ఈ క్షణాలు అన్నిటినీకలిపి, కాలాన్ని అనుభవిస్తున్నామని అనుకుంటున్నాం! ఎవరూ కాలాన్ని అనుభవించటం లేదు. కాలవస్తువుని ఆ ఈశ్వరుడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఎందుచేతనంటే ఆయనకు క్షణికంలేదు. ఆయన నిత్యుడు, శాశ్వతుడు, నిరంజనుడు. కాలం అంతా ఆయనలో లయం అయి పోతున్నది కూడా. జగత్తు అంతాకూడా ఆయనలో లయం చెందుతున్నది. మహాకాలుడాయన. కాలస్వరూపుడు, సాక్షిగా ఉన్నాడు.

🌻 39. మానవజన్మకు సంబంధించిన అనుభవములు సర్వమునకు సాక్షిగా ఉండి, ఏదీ అనుభవించని ఆ కాలమే ఆయన.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹






భారతీయ 
మహర్షుల మార్గదర్శక జ్ఞానం (1)


🌻ఉపోద్ఘాతం - 1 🌻

1. భారతీయ సంస్క్రతి పేరుతో మన జీవన విధానాన్ని, జీవిత పరమార్ధాన్ని నిర్ణయించి చెప్పినవారు మన మహర్షులు. వారు లేకపోతే, వేదములూ లేవు, హిందూ ధర్మమూ లేదు, మనకొక విర్దుష్ఠమైన, గమ్యమైన ఈశ్వరుడూలేడు.

2. దేవతలకంటే, ఈశ్వరుని కంటేకూడ మనకు దగ్గరగా వుండి, మనను నిత్యమూ నడిపిస్తూ, మనకు సంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. వారి వల్లనే మనకు ఈ సంస్కృతి వచ్చింది. (అట్టి ఋషులు ఈ శతాబ్దంలోకూడా మనకు ఉన్నారు; రమణమహర్షి అటువంటివారు.)

3. ఋషుల చరిత్ర మనలో ఒక ఉత్తేజం కలుగజేసి, మనకు గొప్పజ్ఞానం ఇస్తుంది. బ్రహ్మ ముఖంలోనుండి వేదం పుట్టిందిగాని, దానిని మనకు ప్రసాదించింది ఋషులే. బ్రహ్మ మనకు నేరుగా ఇవ్వలేదు. ఋషులే ఇచ్చారు.

4. బ్రహ్మ మొట్టమొదట సృష్టించిన అతడి మానసపుత్రులు,వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోయి మోక్షంపొందారు. పూర్వ కల్పంలో (అంటే ప్రళయానికి ముందరున్న పూర్వసృష్టిలో) ఉండే దేవతలు,ఋషులు,మునులు-వాళ్ళే ఈ సృష్టిలో జ్ఞానులైపుట్టడం, వెళ్లిపోవడము జరిగింది. ప్రజాపతుల ఉద్దేశ్యం – మనుష్యులు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. వాళ్ళ సంతానం వృద్ధిచెంది దేశమంతా నిండాలి, కళకళలాడాలి అని. అవిద్య, ఆజ్ఞ్యానం, దేహాత్మభావన, దేహాభిమానం-ఇలాంటి లక్షణాలుంటే తప్ప మనుష్యులు వృద్ధిపొందరు. శుద్ధజ్ఞానంతో ఉండేవారు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోతారు.జ్ఞానాజ్ఞానములు రెండూ, విద్య-అవిద్యలు రెండూ ఎవరికైతే ఉంటాయో వారే సంతానము పొందుతారు. అప్పుడే ప్రజలు వృద్ధి అవుతారు.

5. మనకందరికీ మూలాధారచక్రంలో చతుర్దళపద్మంలో గణపతి అధిష్ఠాన దేవతగా ఆశీనుడై ఉండి,’ఈ దేహమే నేను‘ అనే భ్రాంతిని కలుగజేస్తున్నాడు. ఆయన అలా చేస్తున్నందు వలనే మనం అన్నం తింటున్నాము, పడుకొంటున్నాము. దేహం నాదని,ఇల్లు నాదని కాపాడుకుంటున్నాము.ఇందువలనే సంతానం కలుగుతున్నది. ఇదంతా-ఈ నాగరికత అంతాకూడా-దేహాభిమానం వల్లనే కలుగుతోంది.దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమై పోతుంది.ఎవరూ ఉండరు.”దేహాభిమానం చెడ్డది కదా!” అని అంటే, జ్ఞానానికీ, మోక్షానికీ వెళ్లే దారిలో వదిలి పెట్టమన్నారు కానీ, అది లేకుండా జీవితంలో సంచరించడమే సాధ్యంకాదు. అది లేకుండా సంచరిస్తే, మనుష్యుడు-త్రాగినవాడు, పిచ్చివాడివాలె – తనను ఏ స్థంభానికో వేసికొట్టుకుంటాడు. దేంట్లోనో పడి చచ్చిపోతాడు. ”ఈ దేహం నాది, దీనిని సంరక్షించి ఉంచుకుంటాను” అనేటువంటి వివేకం ఒకటి జీవకాక్షణంలో సహజంగా ఉండాలి. అట్టి జీవలక్షణం అనే భావానికి అధిపతి గణపతి.

6. అలా సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు అనేక ఇబ్బందులు కలిగాయి. మనుష్యులను సృష్టించగానే, వారికి తలపైకి ఉండాలో క్రిందికి ఉండాలో, కడుపు ఎక్కడ ఉండాలో తెలియలేదు. ఆకారం ఎలాగ ఉండాలో ఆయనకు జ్ఞాపకం రాలేదట. ఒకవేళ జ్ఞాపకం వచ్చి అలాగే పెడదామని ప్రయత్నించినా కూడా, వంకరటింకరగా తల క్రిందికి,కాళ్ళు పైన, చేతులు వీపు వెనుక – అలాగ వచ్చాయట.

7. అప్పుడు ఆ గణపతిని బ్రహ్మదేవుడు తన ముందర ఆవాహన చేసుకున్నాడు. అ గణపతి బ్రహ్మదేవునికంటే పూర్వుడు. “బ్రాహ్మణాం బ్రహ్మణస్పతి” అని మంత్రం అంటే, సృష్టి ప్రారంభానికి ముందు అని. బ్రహ్మదేవుడు, ఆ మహాగణపతిని తలచుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమై, ”మూలాధారమనే చక్రాన్ని సృష్టించు, అక్కడి నుండి సహస్రార కమలందాకా నిర్మాణం చెయ్యి. ఆ మూలాధార చక్రంలో నేను అధిష్ఠాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను ప్రసాదించి, వాళ్ళ ఆత్మ రక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్లు, అన్నవాస్త్రాలను సంపాదించుకుని బ్రతకాలనే కోరిక వాళ్లలో కలిగేటట్లుగా చేసి, ఆ కోరికలోనుండి సంతానమందు వాళ్లకు ఇచ్ఛ కలుగజేసి సృష్టిని కలుగచేస్తాను. నీవు సృష్టించు, నేను ఈ పనిని చేస్తాను” అన్నాడు. కాబట్టి, ఆ మహాగణపతి జీవులలోకి ప్రవేశించగానే, ఆయన యొక్క అనుగ్రహంచేత వాళ్లకు దేహాత్మ భావన కలిగింది. దేహాభిమానం కూడా కలిగింది. అటువంటి గణపతి అనుగ్రహం చేత, తరువాత సృష్టి సక్రమంగా జరిగింది.

8. ఈ సృష్టిరహస్యము యావత్తు, సమస్త జీవకోటి యొక్క జీవ లక్షణమూ అంతా సంపూర్ణంగా అర్థం చేసుకుని,”బ్రహ్మ ఎవరు? ఆత్మ ఎక్కడ? పదార్ధం అంటే ఏమిటి? పంచభూతములు ఎలా వచ్చాయి? ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయనయొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి?“-ఇన్ని విషయాలూ తెలిసి,ఈ జగత్తుయొక్క భవిష్యత్తు తెలిసి,జీవులకు ఏది క్షేమకరమో అదీ తెలిసినవారు మహర్షులు. ఆద్యంతమూ సృష్టి కథ అంతా తెలిసి, వాళ్ళ కర్తవ్యమే గాక, మన కర్తవ్యము, భవిష్యత్తులో పుట్టబోయే వారియొక్క యోగక్షేమాలుకూడా ఆలోచించి గలిగినవారు మహర్షులు. అటువంటి మహర్షులు అనేకమంది ఆర్యసంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు.
🌹 🌹 🌹 🌹 🌹


భాగము - 2

🌻 అగస్త్య – లోపాముద్ర  - 1 🌻

1. అగస్త్య మహర్షి – లోపాముద్ర వివాహము విదర్భ దేశంలో సిద్ధతీర్ధం అనే ప్రాంతంలో జరిగింది. అగస్త్యుడు లోపాముద్రను వివాహం చేసుకున్న స్థానం కాబట్టి, ఆ సిద్ధ తీర్ధాన్ని స్మరణ చేసుకున్నా, అక్కడికి వెళ్లి స్నానం చేసినా కన్యకు అత్యుత్తమమైన వరుడు లభిస్తాడని, వరుడుకి కూడా అత్యుత్తమమైన వధువు లభిస్తుందని విశ్వాసం.

2. అగస్త్య మహర్షి త్రికాలవేది. ఆయనది మనుష్య బుద్ధి కాదు. అనేక విషయాలు చూడగలడు. మనుష్య బుద్ధికి కొంతే తెలుస్తుంది. ఒక మాట వింటుంటే దాని వెనకాల ఎన్ని పరిణామాలు ఉన్నవో చూసేదే దివ్యదృష్టి. మాట మాత్రమే అర్థంచేసుకుంటే అది మనుష్య బుద్ధి.

3. తపస్సుకు, యోగానికి అసాధ్య మనేదేమీ లేదు. అవి శాశ్వత సత్యాలు. ఇప్పుడైనా ఎప్పుడైనా సాధ్యమే. భవిష్యత్తులో ఎంత అధర్మం ఉన్నా, అజ్ఞానం ఉన్నా యోగం మాత్రం నశించే విద్య కాదు. సజీవంగా ఉండే విద్య. అదే ఆర్ష్య సంప్రదాయం! ఈ సత్యం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఋషుల యొక్క చరిత్రలు సత్యము యొక్క చరిత్రలు.

4. పితృలోకాలలో ఎప్పుడూ అయిదుగురు దేవతలు శాశ్వతంగా ఉంటారు. ఇక్కడ చనిపోయిన జీవులు ఆ పితృలోకాలకువెళ్లి ఆ పితృదేవతల సంరక్షణలో ఉంటారు. ఆ దేవతలకు ముందర నమస్కరించి, తర్పణం ఇచ్చి, తరువాత మనం ఇక్కడనుంచి వెళ్ళిపోయిన మన తాతలకు ఇస్తాము.

5. మనుష్యులలో సామాన్యప్రజాలు లక్షల కొద్దీ చేసే నేరాలు, అధర్మాలు-వాటినాన్నిటినీ ఆహారంగా తీసుకొని జీర్ణించుకొని, చక్కగా ఈ ప్రపంచాన్ని ధర్మబద్ధంగా నడిపించేటటువంటి వాళ్ళు మహర్షులే!. నిరంతరమూ మహర్షులే మానవ జాతికి ప్రాతఃస్మరణీియులు, వందనీయులు.

6. జీవులకు చాలా భయంకరమయిన కర్మపాశం ఉంటుంది. ముక్తికి అది అడ్డువస్తుంది. ముక్తిని కోరుకోగలిగి నప్పటికీ, కర్మ జీవుని వదలదు. పూర్ణ కర్మక్షయం కావడం అనేది సాధ్యంకాదు. సులభంగా కాదు. అందుకే అనుభవించమంటారు దానిని. అనుభవించాలి. వదిలి పెట్టేటప్పుడు దానిని విడదీసుకోవాలి. పాశం మనకు ఎక్కడ అయితే బంధంఅయిందో, అక్కడ దానిని కత్తిరిస్తే ఆ గొలుసంతా ఊడిపోతుంది.

7. దేవతలు శాపగ్రస్థులై భూమిమీద పుట్టారంటే, అక్కడ వాళ్ళు అలా వుండగానే వాళ్ళ జీవలక్షణంతో మనిషి శరీరంలోకి వచ్చి ఇక్కడ కూడా బ్రతుకుతున్నారు అని అర్థం చేసుకోవాలి . అలాంటి మానవత్వ లక్షణం వాళ్లకు శాపం తోటే కలగాలి. లేకపోతే రాదు.

8. “అగస్త్య మహర్షి జీర్ణం చేసుకొని, పవిత్రమైన సముద్ర జలం మళ్లీ వదిలిపెట్టారు. అందుచేత నిరంతరమూ సముద్రస్నానం చేయకండి! పర్వదినాలలో, పుణ్యతిధులలో మాత్రమే – ఆ పుణ్యతిధుల ప్రభావంచేత దాంట్లో ఉన్న అపవిత్రత తొలగుతుంది. ఆనాడు మాత్రమే స్నానం చేయాలి” అని నిర్ణయంచేశారు అగస్త్య మహర్షి.

9.  క్షత్రియుడు లోకాన్ని పరిపాలించే ప్రభువు. కాబట్టి ఎవరైనా తమ ప్రభువుకు ఏదైనా సమర్పిస్తారు. అది దానంకాదు. సమర్పణం. దేశాన్ని ఏలే ప్రభువుకు ప్రజాలెవరైనా ఆభరణాలలాంటి కానుకలు సమర్పించటము, ప్రభువులు స్వీకరించటము ధర్మము. అయితే బ్రాహ్మణుడు దానం తీసుకుని ఆశీర్వదిస్తాడు. చెయ్యిజాపి అడుగుతారు, తీసుకుంటాడు. దానం తీసుకునేటప్పుడు బ్రహ్మణుడి చెయ్యి క్రింద ఉంటుంది. ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. కాని రాజు స్వీకరించేటప్పుడు ఇచ్చేవాడి చెయ్యి క్రిందఉంచి అందిస్తే, రాజు చేయి పైన ఉంచి స్వీకరిస్తాడు క్షత్రియుడు కాబట్టి.

10. యజ్ఞం జరుగుతూ ఉండగా, లోకోపద్రవంగా తుఫానురాకూడదు. వర్షం మాత్రం పడాలి. అదికూడా ప్రసన్నంగా, నాజూకుగా వర్షంపడటం యజ్ఞానికి శుభసూచన. సాత్వికంగా ఉండాలి ఆ వర్షం.

11. దక్షిణకాశి – వాస్తవానికి భీమేశ్వరమే దక్షిణకాశి. ఏదయినా సరే, కాశీతో సమానమని చెప్పటంచేత ఒక క్షేత్రాన్ని గౌరవించినట్లు భారతీయుల భావం.

12. మహర్షులు తత్త్వం తెలిసి మాట్లాడుతారు. వారి స్తోత్రంలో సత్యం ఉంటుంది. కాబట్టి ఆ స్తోత్రాలను మనం చదువుకుంటే,అందులో ఉన్న సత్యమే మనల్ని కాపాడుతుంది. నాశనంగాని, వినాశనం గాని అజ్ఞానంవలన ఏర్పడతాయి. మనిషికి ఆయుర్దాయం, భాగ్యం అన్నీ కూడా సత్య జ్ఞానం వలన కలుగుతాయి. మహర్షులు చేసే స్తోత్రములన్నీ కూడా సత్యములే! సృష్టిలో రహస్యంగా కనబడీ కనబడకుండా ఉండే సత్యాలతో వారు చేసిన స్తోత్రములు నిండిఉండటంచేత, వాటికి ఆ శక్తి ఉంది. అంతేగాని వట్టి స్తోత్రాలు కావావి.

13. రసవంతము, రసహీనము – పుష్టిగా ఉండే చెఱకు కర్రకు, ఎండకు ఎండిపోయిన పుల్లకు ఉన్న తేడా.

14. 29వ మహా యుగంలో అగస్త్య మహర్షే వేదవ్యాసుడు.

15. లోపాముద్ర సహితమయినటువంటి అగస్త్య మహర్షిని ఎవరైతే తలచుకుంటారో, వాళ్లకు సమస్తశుభాలు, కళ్యాణము జరుగుతాయి.

🌹 🌹 🌹 🌹 🌹

🌻. అగస్త్య – లోపాముద్ర  - 2 🌻

🌻 16. పురాణ గోత్రకర్తలయిన సప్తఋషులు వేరు. సప్తఋషులలో, అంటే గోత్ర కర్తలలో ఆగస్థ్య మహర్షి లేడు. నక్షత్రమండలంలో ఉన్నాడు. ఒక యుగంలో ఆ నక్షత్రానికి అధిపతిగా, యాజమానిగా ఉన్నాడాయన. వశిష్ఠుడు,అరుంధతి ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు అక్కడ లోపాముద్ర సహితంగా ఆగస్త్యుడున్నాడు. సప్తర్షులు అంటే ఒకే సమూహము అని అర్థం.

🌻 17. తపస్సులు ఎలాంటివి?ఎన్ని జన్మలు ఎన్నివేల సంవత్సరములు ఎంత చేసినా అలా ఎందుకవుతుంది? దీనికి ఒక ముగింపు లేదా! ఈశ్వరుడు ప్రత్యక్షం కావాలి కదా! అని ప్రశ్న. అంటే, ముక్తికొరకై ఆచరించ బడేటటువంటి తపస్సుకు, ఈశ్వరుడిలో లయం చెందుదామనే తపస్సుకు అవరోధంగా ఏదో ఒక చిన్న కర్మశేషం మిగిలి ఉంటుంది. ఆ కర్మ శేషం నివారణ అయ్యే వరకు కూడా అలాగే తపస్సు చేసుకుంటూనే ఉంటారు. తపస్సు అంటే ఆత్మదర్శనం/ఈశ్వర దర్శనం. అల్లాంటిది ఏదో అయిన తరువాత కూడా, ఆ జీవత్వం అతడిని వదలక ఆ కర్మశేషం అనుభవింపచేస్తుంది. లౌకికమయిన కోరికలతో చేసే తపస్సులో, వ్యక్తి తపస్సును అనవసరంగా ఎక్కువగా పెరగనీయకుండా, ముందే ప్రత్యక్షమై, అతడికి ఆ భౌతికమయిన కోరికలనిచ్చి, అంతటితో తపస్సులోంచి బయటకులాగి మళ్ళీ మామూలు మనుష్యుల్లో పడేస్తుంది దైవం.

🌻 18. తపస్సు దేని కోసమంటే – ఆ ఆత్మ దర్శనం కోసం వేచి ఉండటమే తప్ప, తాను వెళ్లి ప్రయాణం ముగించి సంపాదించు కోవడం అనేది లేదు. ఆ ప్రయాణానికి అంతు లేదు. దానంతట అది లభించ వలసిందే.

🌻 19. ముక్తి కోరే తపస్సుకి ఏ కర్మయితే అడ్డువస్తున్నదో, ఆ కర్మానుభవం వాళ్లకు రావసిందే! ముక్తికి అడ్డం వచ్చేటటువంటి కర్మ, కర్మఫలం, సంస్కారం, మానుషత్వం, ఈ ప్రపంచపు వాసన – ఇదంతా నిస్సేషంగా దానంతట అదిపోదు. ఏదో ఒక సంఘటన,ఒక అనుభవం, ఒక జన్మ అయితేనే అవుతుంది!ఎవడి అదృష్టం పండుతుందో వాడికి ఆ తపస్సు అక్కడితో భంగమయి; ఆ కర్మశేషానికి దాన్ని ఖర్చుపెట్టడానికి ఏయే సంఘటనలు కావలెనో ఆ సంఘటనలు వెంటనే జరిగితే, ఆతడు ముక్తిని పొందుతాడు. ఆ తపస్సుకు భంగం కలగటమే వాడి అదృష్టం! అలా కాకపోతే శిలామయంగా కూర్చుని ఉంటాడేతప్ప వాడికేమీ సుగతి ఉండదు. వేలాది సంవత్సరాలు ఎందుకు తపస్సులో ఉన్నారో అంటే, సమాధానం ఇదే.

🌻 20. మానస తీర్ధములే ముక్తిహేతువులు. బాహ్య తీర్ధముల కంటే ఇవి మేలు. సత్యము, ఇంద్రియ నిగ్రహము, అనసూయ, దానము, దయ, సంతోషము, బ్రహ్మచర్యము, ధైర్యము, యమము, సమత్వము, విజ్ఞానము వీటన్నింటినీ మానస తీర్ధములు అంటారు. వీటిని పాటించకుండా, కేవల బాహ్య తీర్ధముల వలన ప్రయోజనము లేదు. అంటే, మానసిక తీర్ధములు అలవరచు కొంటేనే గాని బాహ్య తీర్ధముల వలన ప్రయోజనము ఉండదు. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనక పోవటము, అహంకారము లేకపోవటము, కోపము చంపుకోవటం, ఆలస్యం చేయక పోవటం, సత్యనిష్ఠ మొదలైనవన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఎన్ని తీర్ధాలైనా కాశీప్రాప్తినే ఇస్తాయి. కాశీ తీర్ధంలో స్నానం చేయని వాడు లక్ష తీర్ధాలను దర్శించినా మోక్షం రాదు.

🌻 21. ప్రకృతిని ఎవ్వరూ శాసించలేరు. ఒకవేళ ప్రార్థిస్తే ప్రసాన్నంకావచ్చు. ప్రార్థిస్తే ప్రసన్నమయే లక్షణం ప్రకృతిలో ఉండబట్టే, ‘శన్నోవాతః…’ అంటూ ప్రార్ధన వచ్చింది. మనం ప్రార్థిస్తే అది ప్రసన్నం అవుతుంది. ఇవాళపుట్టి రేప్పొద్దున్న వెళ్లిపోయే మనిషిఎవడికీ కూడా, ఈ ప్రకృతిమీద అధికారం లేదు. ఈ ప్రపంచంలో మనం ఉండేది కేవలం అతిస్వల్పకాలం! ఒక రకంగా చెప్పాలంటే, మనకు దానిమీద ఈనాడు అధికారం ఉంటే, అంతకు ముందు ఏముంది? స్వతంత్రంగా ఉందా? మనం వచ్చాకే అది మనకు లొంగిందా? అజ్ఞానంవల్ల అలా మనుష్యుల్లో కొందరికి అహంకారంవస్తుంది. ఎప్పుడూ అలా రాకూడదు.

🌻 22. శరీరాన్ని రక్షించే అంగములన్నీ దేవతల రక్షణ పొందటాన్ని ‘కవచం’ అని అంటారు. మనోబలం,  ఆత్మబలం అనిమనం అంటూ ఉండే ధైర్యస్థైర్యాలను ఈ కవచం ఇస్తుంది. శరీరంలో రోగబాధలు వచ్చినప్పుడు ఆదిత్యకవచం చదువుకోవాలి. అందరు దేవతలకు స్తోత్రం ఉంటుంది. తరువాత కవచం, తరువాత హృదయం, తరువాత మంత్రము ఉంటాయి. అవి అన్నీ ఆయా ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయి. అందుకే శరీరాబాధలు వచ్చినప్పుడు కవచం, దర్శన సిద్ధి కోసం మంత్రం చదువుకోవాలి.

🌻 23. నక్షత్రరూపంలో ఉన్న అగస్థ్యమహర్షిని భాద్రపద మాసంలో దర్శించుకోవాలని చెపుతారు. ఆ కాలంలో రాత్రి సమయంలో సూర్యుడు కన్యారాశిలో ఉండటంచేత, కన్య అస్తమించిన తరువాత ఉదయించేటటువంటి ధనూరాశి, పైకి వెళ్లినప్పుడు ఆగస్థ్యమహర్షి దర్శనం సరిగ్గా ధనూరాశి ప్రక్కనే అవుతుంది. అంటే మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రక్కనే, అర్ధరాత్రి సమయంలో మిణుకు మిణుకుమంటూ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి దక్షిణభాగంలో, ధనూరాశి ప్రక్కన, అర్ధరాత్రి సమయంలో బాగా చీకటి ఉన్నప్పుడు మాత్రమే అగస్త్య నక్షత్రం భాద్రపద మాసంలో కనబడుతుంది. అప్పుడు చూసిన తరువాత దానికి నమస్కరించి, నదీ స్నానం చేసి ఆర్ఘ్యములు ఇవ్వాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹  


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 26 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 23 🌻

56. రెండు రెక్కలూ లేనిదే పక్షి పైకెగురలేదు. రెండురెక్కలూ సమానమైన కొలతలో ఉండాలి. అదొక షరతు. లేకపోతే ఎగురుతుందా! 

కాబట్టి సత్వమందు రజస్సు మనిషిలో ఎప్పుడు ప్రవేశించిందో, అప్పుడు అతడు యోగంలో ప్రవేశించవలసి వస్తుంది ఆత్మదర్శనంకొరకు. 

అక్కడ సాంఖ్య, యోగములు రెండూ బోధచేస్తున్నారు. సాంఖ్యం చెపితే యోగంచెప్పవలసిందే! కేవలం సాంఖ్యమొక దానివల్లనే ముక్తిమార్గం లభించదనే విషయం యోగంలో రూఢీ అయింది.

57. సాంఖ్యంలో ఈశ్వరప్రతిపాదన లేదు అనేటటువంటి ఒక విషయం రూఢీగా అందరిచేత నమ్మబడుతోంది కాబట్టి, యోగమందు ఈశ్వరప్రతిపాదన చెయ్యబడింది. 

ఏది ఇందులో సాఖ్యంలో- చెప్పబడలేదో. అది యోగమందు చెప్పబడటంచేత; సాంఖ్యయోగములు పరస్పరము పుష్థికరములై, సంపూర్ణత్వం పొందుతాయి. 

యోగశాస్త్రంతో కలిసి ఉండటంచేత సాంఖ్యానికి పర్యవసానం అంటూ ఏర్పడింది. ఒకటి సిద్ధాంతము, ఇంకొకటి క్రియ. అలా భావించవచ్చు. యోగంలేని సాఖ్యంలేదు. సాంఖ్యంలేని యోగంలేదు. 

కాని ఆ రెండూ ఎప్పుడైనా పనిచేయదల్చుకుంటే రెండింటినీ చదువుకొని ఒక్కమాటు మొదలుపెట్టవలసిందే తప్ప, ఏపుస్తకమూ ఒక్కటే మార్గదర్శకం కాదు. సిద్ధాంతం ఉంటుంది. ఒక సూత్రం ఉంటుంది. తరువాత సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇన్నిలేవా? 

చివరకు మనకు లాభం రావాలంటే theory, practice, సహాయకరంగా ఉంటాయి. theory ముందర సాంఖ్యంగాను, practice యోగంగాను ఉంటాయి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 27 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 24 🌻

58. యోగమందు ఈశ్వరప్రతిపాదన ఉంది. ఈశ్వరుడు ఏ రూపంలోనైనా, యోగంలోనైనా ఉండవచ్చు. ప్రరమాత్మ, జీవాత్మ లేదా పరాశక్తి, పరమపురుషుడు-ప్రకృతి; ఏ పేరయినా పెట్టుకోవచ్చు. రెండే ఉన్నాయి. 

ఈ రెండూకూడా లయక్రియను ఎక్కడైతే సాధిస్తాయో-సహస్రార కమలంలో రెండు లేకుడా ఒకటవుతుందో- సుషుమ్న ద్వారా ప్రవేశించి రెండూ ఒకటయి కలుస్తాయో అక్కడికి వెళ్ళిన తరువాత పర్యవసానం ఏదీ ఉండదు. 

ఈ భృకుటి దాటిన తరువాత అక్కడ సహస్రారకమలంలో రెండూ ఉండవు. ఒకటే మిగులుతుంది. అదే ముక్తి.

59. ఈ సృష్టియొక్క సుఖదూఃఖాలకు అతీతంగా ఒకానొక అతీతస్థితిలో ఉండటము అంటే-ఇంకా తానుంటాడు. అక్కడ సహస్రారకమలంలో పాదుకాంత దీక్ష అని అంటారు. అక్కడ గురుపాదుకలు ఉంటాయి. 

ఎడమపాదం ఒకటి, ఇంకొకటి కుడిపాదం-ఆ రెండుపాదుకలను ఆశ్రయిస్తాడు. వాటిని ఆశ్రయించినప్పుడు లోకం అతనికి జ్ఞాపకం ఉండదు.

 సుఖదూఃఖాలుండవు. అటువంటి స్థితిని పొందుతాడుకాని ఆ పాదుకలు, రెండుపాదములు ఒక వస్తువులో ఇతడిని లయంచేస్తాయి. 

ధ్యానశ్లోకంలో మనం ‘యదంఘ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం’ అంటాము. రెండింటినీ ఆశ్రయిస్తాము. ‘రెండు’ అనే దు:ఖాన్ని పోగొడతాయి అవి. మనకుండే దు:ఖం అంతాకూడా; తపన, తాపము అంతాకూడా ద్వంద్వముల చేతనే, సుఖదు:ఖములని రెండుండటం చేతనే ఉన్నాయి. 

ఏ రెండిటినీ ఆశ్రయిస్తే రెండు అనేభావన నశిస్తుందో అవే గురుచరణములు. ద్వంద్వత్వ నివారకమయిన చరణద్వంద్వాన్ని ఆశ్రయించాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 32 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

68. అయితే దశరధుడు పోయినప్పుడు దు:ఖపడ్డాడు. దశరథుడియొక్క మమకారమే అతడి దు:ఖం. ఎక్కడికక్కడే సమన్వయం చేసుకోవాలి. “నన్ను గురించి ఇంత బెంగపెట్టుకొని చనిపోవడానికి హేతువును నేనయినానే!” అని దశరథుడిమీద జాలితో దు:ఖపడ్డాడు. “ఇంత మమకారం నామీదకదా పెంచుకొని ఆయన చనిపోయినాడు!” అని బాధపడ్డాడు. 

అది దశరధుడికి తనపై ఉన్నటువంటి మమత్వాన్నే ప్రతిబింబించింది. సీతపోయినప్పుడు దు:ఖపడ్డాడు కదా మరి, అంటారు. నిజమే! మానవుడిగా అతడియొక్క వర్ణన అలా ఉంటుంది. తాత్కాలికంగా అదే అక్కడే రెండోవైపు తిప్పితే, తాత్వికంగా ఉంటుంది. 

“నీతో నీవెంబడి ఉండేటట్లయితే నాకు ఆపద ఎక్కడిది? అడవికి రావద్దంటావు. జంతువులున్నాయంటావు. పెద్దపులులు, రాక్షసులు ఉన్నారంటావు. నీ వెనకాల వస్తే నాకు ఆపదే ఉండదు. నీ మీద భారం పెట్టుకొని నేనొస్తాను” అనేకదా సీత అన్నది అని అర్థం. 

కాబట్టి ఆమెకుండేటటువంటి ధైర్యం విషయంలో, తనవల్ల ధర్మలోపంలోంచి వచ్చిన దు:ఖం రాముడి తత్వంలో ఉంటుంది. ఇలాగ పురాణాన్ని మనం తాత్వికార్థంలో గ్రహించినప్పుడే, దానివల్ల మనకు లోపల ఈశ్వరతత్వాన్ని గురించిన ఒక విలక్షణమయిన జ్ఞానము, వివేకము పుడుతుంది.

69. కపిల సాంఖ్యం ఇలా ఉంది,

 ‘అత్ముడనే వస్తువు ఒకటి లోపల ఉన్నది. అది పరమాత్మయొక్క ప్రతిబింబమే! యథార్థంగా దుఃఖమేమీలేదు. 

గర్భవాసదుఃఖము, జన్మవ్యధ, బాల్యంలో ఉండేటటువంటి అజ్ఞానము, రాగము, క్లేశము, వార్ధక్యము వీటివలన కలిగేటటువంటి దుఃఖములేవయితే ఉన్నవో అవన్నీ తెలుసుకున్న, తరువాత, అన్నీవస్థలూకూడా దుఃఖములే అనేవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యౌవనం చాలామంచిది, వార్ఠక్యం చాలా చెడ్డది అని అనుకోవటము అజ్ఞానము”. 

ఇతరులయందు ఆధారపడితే వచ్చేటటువంటి దుఃఖములన్నీకూడా దుఃఖములే! అన్ని అవస్థలూ దుఃఖములే! దుఃఖహేతువులే! దుఃఖమయములే! అని ఈ విషయములను గుర్తెరిగి సంగబుద్ధిని వదిలిపెట్టి, ఆత్ముడియొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలి. 

ఆత్ముడు అంటే లోపల ఉండే యథార్థ వస్తువు.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 29 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.  కపిల మహర్షి - 26 🌻

62. ఆయనకు రాసలీలలు అంత ఇష్థమై ఉన్నప్పుడు అది నడుస్తూ ఉండగానే ఎందుకు అంతర్ధానమైపోతాడు! 

మనుష్యుడికి, మనుష్యస్థితికి అతీతమైన; మనుష్య ఇంద్రియములకు, మనసుకు గోచరంకానటువంటి అతిమానుషత్వం ఒకానొక క్షణమందే వీళ్ళయొక్క తపస్సుకు ఫలంగా పర్యవసానంగా కొన్ని ఘడియలు వాళ్ళకు అనుభూతిగా కలగడం; అర్ధమయ్యేలోపలే అంతర్థానమవటం యథార్ధమయిన ఈశ్వరతత్వం. 

అది ఆ కృష్ణావతారంలో చాలా స్పష్టంగా ప్రత్యక్షంగా, రూఢీగా రుజువుచేయబడింది భాగవతంలో.

63. మూర్ఖులు – “ఆయన ఒక మనుష్యుడే! ఆయనకు ఈశ్వరతత్వం వీళ్ళు అంటగట్టారు!మొట్టమొదట ఆయన ఏదో ఆటవిక తండాల నాయకుడు” అంటూ విమర్శించారు. 

అట్లాంటివారు ప్రచారంచేసిన చరిత్రలనే చదవటం మొదలైనటువంటి నేటి ఈ పాడునాగరికతలో, తత్వ సుబోధకమైనటువంటి గ్రంధమును చదువవలసిన ఆవశ్యకత ఉన్నదికాబట్టి, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని భాగవతాన్ని చదవాలి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 31 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

66. నృసింహావతారానికి కూడా, అందులోని తత్వమే దివ్యత్వము. హిరణ్యకశిపుడు ఎలా కోరుకున్నాడో, ఆయన అలాగే వచ్చాడు. ఈశ్వరుడికి వీడిని అనుగ్రహిద్దాము, వీడిని చంపుదాము అని ఏమీ ఉండదు. 

అవతారానికి కారణం కూడా అధికార ప్రారబ్దమే అని చెప్పినట్లు-ఆ అధికారం విష్ణువుమీద వీళ్ళే పెట్టారు. ఆయనలాగే నెరవేర్చాడు. ఆర్తులను రక్షించవలసిన బాధ్యత తమమీద ఉంది అని మునులు, యోగులు భావించారు. 

ఆర్తిలో ఉండే మానవులు పడుతుండేటటువంటి కస్టాలు తీరడటంకోసం, ఈశ్వరుడియందు ఆ లక్షణాన్ని ఆపాదించి, భావనచేసి ప్రార్ధిస్తారు ఋషులు. 

వీళ్ళ కర్మక్షయం కోసం, వీళ్ళ ప్రార్ధన కనుకూలమయిన అవతారాన్ని అతడు-ఆ తత్వము-ఎత్తుతుంది. 

ఆ తత్వానికి సహజమయిన విభూతి లక్షణం ఇది. దాని ఐశ్వర్యం అట్లాంటిది. ఎవరు ఏరూపంలో దానిని ధ్యానిస్తారో అలా ఆ రూపంలో ఆయన కనపడవలసిందే! ఆ కార్యం నెరవేరిపోతుంది. 

ఆ కార్యనిర్వహణ చేస్తున్నప్పుడు ఎవరియందూ మమకారం కాని, ఏమీ ఉండదు, ప్రత్యేకానుగ్రహంకాని, ఆగ్రహంకాని ఉండదు. ఆయన అవతారాలను పరిశీలిస్తే ఈ సత్యం మనకు స్పస్టమవుతుంది.

67. అందుకనే రాముడు రావణాసురవధలోకూడా అతడిని ద్వేషం లేకుండానే చంపాడు. రాముడు యుద్ధం చేసి చంపినవాళ్ళు అనేకమంది. లోకంలో పరాక్రమశాలురైనవారు యుద్ధాలలో అనేకమందిని సంహరించారు, దుష్టులను చంపారు. కాని వాళ్ళు క్రోధంతో ఈ పనిచేసారు. 

కాని రాముడు రావణుని క్రోధంతో సంహరించలేదు. రావణుని మీద రాముడికి కోపమే ఉండి ఉంటే, “ఓ రావణా! ఇవాళ అలసిపోయి ఉన్నావు. ఇప్పుడు నాతో సమానంగా యుద్ధంచేసే స్థితిలో లేవు. రేపు పొద్దున్న యుద్ధం చేద్దాం! ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో” అని అంటాడా! కొంచెం అలసిపోయినట్లు కనబడితే పదిబాణాలు ఎక్కువవేసి చంపడూ! ద్వేషమేలేదు. అందుకని ద్వేషంకాని, ప్రేమ కాని రెండూ లేనటువంటి లక్షణమది.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹


🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 33 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

70. కపిలుడు భక్తి మార్గంకూడా చెప్పాడు – తామసభక్తి, రాజసభక్తి, సాత్వికమైన భక్తి. 

నిత్యమూ హింసాపరుడై, దంభమాత్సర్యముకలిగి భేదదృష్టితో ఉండికూడా భగవద్భక్తుడు కావచ్చు. 

అంటే తనప్రయోజనం కోసమని ఇతరులని ద్వేషిస్తూ, అజ్ఞానంలో భవంతుడిని భక్తితో ఆరాధించవచ్చు ఒకడు. విషయసుఖాలు పొందుతూ, ఐశ్వర్యాలను అనుభవిస్తూ, అంతాబాగుండికూడా భగవంతుడియందు భక్తిని విడవనేవిడవనివాడు రాజసభక్తుడు. 

ఏ కష్ఠమొచ్చినా ఇది కర్మక్షయమవుతున్నది అనుకుంటూ, జనహిత మైనటువంటి-ఏదో మంచిపని-ఏదోవిధంగా చేస్తూ, సమస్తకర్మలను భగవంతుడి యందు అర్పిస్తూ కర్మలుచేస్తూ ఉండేవాడు, భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు సాత్వికభక్తుడని కపిలుడు చెప్పాడు. ఇక తామసభక్తి- క్రూరకర్మలుచేస్తూ భగవంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తాడు? అంటే, ఫలాపేక్షకోసమే. 

ఆ మాట చెప్పనే అఖ్ఖరలేదు. “నేనివాళ దొంగతనానికి వెళ్తాను. పోలీసులకు దొరకకూడదు. నేను ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తానో ఆ ఇంట్లో వాళ్ళంతా ఒళ్ళు తెలియకుండా నిద్రలో పడిఉండాలి. అది నీదయ” అంటాడు ఒకడు. అదోకోరిక! మరి వాళ్ళమాట ఏమిటి? వాళ్ళమీద ఈయనకు దయ ఏమీ ఉండనఖ్ఖరలేదా? అంటే ఉంటుంది. వాడు తామసి. తన స్వలాభమే చూసుకుంటాడు. తామసభక్తునియొక్క లక్షణం అలా ఉంటుంది.

71. అహంకారం ఉన్నచోట, ఏదైనా అహంకారాన్నే వృద్ధిచేస్తుంది. కానీ అహంకారాన్ని చంపగలిగిన శక్తి ఇంకొకటిలేదు. అహంకారం ఉండేవాడికి, యౌవనం అహంకారాన్ని వృద్ధిచేస్తుంది. అందులో కాస్తంత అందము, చందము ఉంటే వాడుదానివలన మరీ విర్రవీగిపోతాడు. కాస్త తెలివితేటలుంటే, అది ఆజ్యం పోసినట్లు ఇంకా అంతఎత్తున పెరుగుతుంది. భగ్గునమండుతుంది అహంకారం. కాస్త విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడంటే, అహంకారానికి ఆజ్యంపోసినట్లు ఇంకా అగ్నిశిఖవలె మండుతుంది. 

ఏ మంచివస్తువు లభించినా అంతే! భగవంతుడు స్వయంగా వచ్చి ఎదురుకుండా ఉంటేకూడా అతడిని తన అహంకారంతో అవమానించే ప్రయత్నం చేస్తాడు. అహంకారానికి ఈ సృష్టిలో మందులేదు. దాన్ని దురహంకారం అంటారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 34 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ  - 1 🌻

🌻. బోధనలు / గ్రంధాలు: 
అత్రిసంహిత, నిత్యోత్సవ నిబంధం, అత్రిస్మృతి, ఆత్రేయధర్మ శాస్త్రము, లఘుఅత్రి స్మృతి, వృద్ధ ఆత్రేయస్మృతి

🌻. జ్ఞానం:
1. మహర్షులు బ్రహ్మలో ఒకభాగం. అలా ఉంటారు మహర్షులు. వాళ్లలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని ఉండదు. వాళ్ళందరూ సాక్షాత్తూ ఈశ్వర స్వరూపులే. అత్రి, అనసూయాలకు పుట్టినటువంటి త్రిమూర్త్యాత్మకుడు దత్తాత్రేయుడు. 

2. అందువలనే గురువుగా ఆయనకు నమస్కరిస్తాము. ‘గురుర్బ్రహ్మా, గురూర్విష్ణుః గురుర్దేవోమహేశ్వరః‘. వాస్తవంగా ఇది వారి ధ్యానశ్లోకం. మనం ఊరికే స్తోత్రశ్లోకంగా వాడతాం. ఆయనే ధ్యానస్వరూపమైన దత్తాత్రేయుడు – దత్తాత్రేయమూర్తి. వాళ్ళ ముగ్గురినీ సమన్వయంచేసి ఒకే మూర్తిగా రూపకల్పన చేసినవాడు అత్రి మహర్షి.

3. రాజును ఇంద్రుడు చంద్రుడు అని స్తోత్రంచేస్తే తప్పులేదు, అందులో ఉన్నధర్మసూక్ష్మం ఏమిటంటే, ‘న విష్ణుః పృథ్వీపతిః‘ – విష్ణువు యొక్క అంశ లేకపోతే పృథ్వీపతి కాలేడు అన్నది. 

4. ఆ విష్ణువు అంశను ఎంత స్తోత్రం చేసినా ఫరవాలేదు. అతడిలో ఉండే ఇతరలక్షణాలు, మానవమాత్రుడిగా ఉండే ఇతర లక్షణాలు, తప్పొప్పులు వుంటాయే – వాటిని పరిహరించి విష్ణువు అంశ అతడిలో ఉండబట్టే చక్రవర్తి అయినాడు కాబట్టి, అతడి కులాగోత్రాలతో నిమిత్తంలేదు. విష్ణువు అంశ ఉండబట్టే చక్రవర్తి అవుతాడు కాబట్టి ఆ అంశను ఎంత శ్లాఘించినా తప్పులేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 42 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ  - 9 🌻

35. మనుష్యుడి లోపల ఉండేటటువంటి అజ్ఞానంచేత, ఈశ్వరసాక్షాత్కారం కోరినా, ఒకవేళ అది లభించినా, ఇంకేదయినా అడగటం సంభవిస్తుంది అతడికి. 

36. అలాంటిదే జరుగుతుంది కాబట్టి ఈశ్వరుడిని ఎలా చేరాలి? ఏం చెయ్యాలి? అనే ప్రశ్నలు మనుష్యుడిని ఎప్పుడూ పీడిస్తూనే ఉన్నాయి. అయన వస్తే ఏమని అడగాలి? ఇలా అడగటం సరియైనదేనా? ఇలా అడగటం తప్పా? ఇలాంటి ప్రశ్నలు పీడిస్తున్నాయి మనుష్యుడిని. 

37. ఈ ప్రశ్నలకు ఈశ్వరుడు ప్రత్యక్షంగా సమాధానమివ్వడు. గురువే చెప్తాడు. కనుక గురు స్వరూపమైనటువంటి మహర్షులే మనకు శరణ్యం. 

38. వేదములలో మంత్రములు, సూక్తములన్నీ కూడా వాళ్ళముఖంలోంచే మనకు వచ్చాయి. వాళ్ళహృదయాలలో బ్రహ్మ వాళ్లకు వినిపించి ఉండవచ్చు. వాళ్లకు అది ‘శృతి’ కావచ్చు. మనకు ‘శృతి’ కాదు. 

39. ఋషులకు ‘శృతి’, మనకు ‘ఋషిప్రోక్తం’. ఇది ఎప్పుడూ మరచి పోకూడదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 46 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ  - 13 🌻

59. ఈశ్వరుడు బ్రహ్మతో, “నీవు సృష్టించిన వాడివికావు. నేనెలా సంకల్పించానో నువ్వు అలా చేస్తున్నావు. 

60. నీవు ఒకవేళ, ‘నేను రెపటినుంచీ సృష్టించను’ అన్నప్పటికీ కూడా, అప్పుడుకూడా సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. సృష్టించింది వెనక్కు తీసుకుంటావానంటావా, అప్పుడూ నడుస్తూనే ఉంటుంది. నీవు నిమిత్తమాత్రుడివే” అన్నాడన్నమాట. అది బ్రహ్మకు బ్రహ్మోపదేశం.

61. ఈశ్వరుడియొక్క లక్షణం ఎలా ఉందంటే, నిర్గుణమైన పరబ్రహ్మ వస్తువులో అవిద్యయొక్క ప్రతిబింబం ఈశ్వరుడని – ఈశ్వరుడిరూపమే అవిద్య అని అనవచ్చు. ఆయనలో ఉండే తత్త్వంమాత్రమే సత్యం.

62. శాశ్వతమయిన తత్త్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏ రూపంలో వచ్చాడో, ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానించినా ఆ తత్త్వమే మనకు ఉపకరిస్తుంది.

63. శాశ్వతమయిన తత్త్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏ రూపంలో వచ్చాడో, ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానించినా ఆ తత్త్వమే మనకు ఉపకరిస్తుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 47 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ  - 14 🌻

64. పరమాత్మ వస్తువును తెలుసుకోవటం ఎలాగూ సాధ్యంకాదుకాబట్టి, పరమాత్మ సగుణ స్వరూపంలో మనవలె ఒకమానవ అవతారంలో వచ్చినప్ఫడు, దాన్ని ప్రేమిస్తేచాలు. 

65. పరమాత్మ సగుణ స్వరూపంలో ఉన్నప్పుడు ప్రేమించటమే నీ కర్తవ్యం. నీ ప్రేమద్వారా అతన్ని పొందు – అని బోధ. ప్రేమ, భక్తి రెండింటికీ తేడా ఏమీలేదు. రెండూ ఒకటే. అలాగే భక్తి భావం ఉంటే, దానిని వదలనేవదలకుండా ఉండేది ప్రేమ. 

66. పరమాత్మను పొందాలి అంటే మనలో లేనటువంటి ఒక క్రొత్త గుణాన్ని సంపాదించుకోవలసిన అవసరం, ఆవశ్యకత లేదు. నీలో సహజంగా మానవుడిగా ఏయే లక్షణములున్నాయో వాటినే ఆధారంచేసుకొని నీవు భగవంతుడిని చేరవచ్చు.

67. జీవలక్షణములో ఉండేటటువంటి సహజమయిన గుణములే ఈశ్వరుడిని చేరటానికి సమర్ధవంతములు. నీలో ఏయేగుణములున్నాయో – ఈ గుణములనే నువ్వు ఈశ్వరునియందు ఆపాదించుకో! నీవు ఉన్న స్థితిని వదిలిపెట్టి లేనిస్థితిని పొందవలసిన పనియేమిలేదు. ఉన్న స్థితిలోనే ఆయనను పొందవచ్చు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 48 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి-అహల్య  - 1 🌻

బోధనలు/గ్రంధాలు:  గౌతమధర్మసూత్రాలు, గౌతమస్మృతి

🌻. జ్ఞానం:

1. అహల్య అంటే ఏమిటి? ‘హలం నామేవ వైరూప్యం’ – హలం అంటే వంకటింకరగా ఉండేది! వైరూప్యం-విరూపంగా ఉండేది. 

2. ‘హల్యం’ అంటే వంకరగా ఉండేది. (హలం అంటే నాగలి. నాగలి వంకరగా ఉంటుంది. దాని ఆకారం అందరికీ పరిచితమే!) కాబట్టి వంకరగా ఉండేది హలమయితే, అహల లక్షణం కలిగింది అహల్య. ‘అహల్య’ అంటే వంకరలేనిది. సృష్టిలోని ఎలాంటి వంకరా లేదు; ఆదర్శసౌందర్యం ఆవిడది.

3. గౌతముడు అహల్యాసమేతుడై దండకారణ్యవాటికలో బ్రహ్మదేవుడినిగురించి ఉగ్రంగా తపస్సుచేసాడు. 

4. బ్రహ్మదేవుడే కదా గౌతముడిని పిలిచి అహల్యనిచ్చి వివాహం చేసాడు! ఆయన గురించి తపస్సు చేయటమేమిటి? మళ్ళీ ఎందుకు చెయ్యాలి? అవసరమయితే బ్రహ్మదగ్గరికి వెళ్ళగలదు కదా! ఆయన అవసరమనుకుంటే రాగలడు కూడా! 

5. మరి ముఖాముఖీ మాట్లాడగలిగిన వాడికోసం తపస్సెందుకు? అంటే; బ్రహ్మదేవుడి దగ్గరికివెళ్ళగలడు. ఏదయినా అడిగితే ఆయన ఇస్తాడు. 

6. అయితే బ్రహ్మను గురించి చేసిన తపస్సులో, బ్రహ్మలోపల ఉండే విజ్ఞానం ఏదయితే ఉన్నదో అది పొందడంకోసం, తాను తత్తుల్యం కావడంకోసం, ఆ సంకల్పంతో గౌతముడు తపస్సు చేసాడు.

7. గోవును రక్షించిందికాబట్టి, ఆ నదికి ‘గోదావరి’ అనిపేరు. గౌతముడిచేత తీసురాబడిందికాబట్టి, ‘గౌతమి’ అని పేరు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 49 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి - అహల్య  - 2 🌻

రుద్రుడిని ‘స్తేనానం పతయే నమః’ , ‘కులుంచానాం పతయే నమః’ ఇత్యాది నామాలతో రుద్రం స్తుతిస్తుంది. 

అంటే, దుష్ట స్వభావులైనటు వంటి, లోకులను బాధలు పెట్టే వాళ్ళందరినీ కూడా ఈశ్వర స్వరూపంగా ధ్యానంచేసి, సమంత్రకంగా భావన చేస్తే, మనను బాధించేటటువంటి లక్షణం కలిగినవాళ్ళలో-ఆ బాధించే లక్షణంపోయి; ఐశ్వర్యం (ఈశ్వరతత్వం) అనే లక్షణము పుట్టి చక్కగా మన యందు మైత్రితో, సుహృద్భావంతో ప్రవర్తిస్తారు. 

మన సంఘంలో నాస్తికుడు, దుష్టుడు, పాషండుడు, విశ్వాసంలేని వాడు, క్రూరుడు, స్వార్థపరుడు, తీవ్ర ధనలోభం కలిగినవాడు, మ్లేఛ్ఛుడు మొదలైన సంఘవ్యతిరేక శక్తులు, ఇంకా ఈటువంటి ఇతరులెవరివలన మనం ఈ బాధలు పడుతున్నామో; భారతీయ సంస్కృతి అంతా బాధపడుతోందో, వారందరిలో కూడా సాక్షిగా ఉన్న రుద్రభవానుడిని పైదృష్టితో మన రక్షణకై ప్రార్ధించాలి. 

ఒకడు సంఘానికి వ్యతిరేకంగా, మరొకడు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఉంటే సంఘవ్యతిరేకి అవుతాడు. ధర్మంలోఉండే సంఘానికి వ్యతిరేకశక్తి కాబట్టి, వాడు అందరినీ బాధిస్తాడు. 

పదకొండు రకాలయిన దుష్టులను గురించి చెప్పబడింది ఆ రుద్రమంత్రంలో. వాళ్ళందరినీ కూడా మనకు సుఖప్రదులుగా సుముఖులుగా ఈ సంఘంలో మార్చుకోవటమే మన ధ్యేయం. 

కాబట్టి అలాగ మనం ఆ భావనతో చేసేటట్లయితే అది సాధ్యమవుతుంది. (వసోర్ధారా మంత్రం చెపుతున్నంతసేపూ ధారగా ఎలాగ ఆజ్యంపోస్తామో, రుద్రనమకంలో కూడా అనువాదం చెబుతున్నంతసేపూ అలా ధారగాపోయటం ఒక పద్ధతి. 

చమకానికి వసోర్ధార అని కూడా పేరు. అసలు వసోర్ధారామంత్ర స్వరూపంగానే చమకమంతా కూడా ఉంది).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 50 🌹 
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

 🌻. గౌతమమహర్షి - అహల్య  - 3 🌻 

15. యజ్ఞపురుషుడి యొక్క స్వభావము ఒకటి ఉంది, అతడి స్వరూపము ఉంది. తేజస్వంతమయిన శరీరం ఉంటుంది. తేజస్వంతం, వర్చస్వంతం. తేజస్సంటే బయటికి కనబడేటటువంటిది-ప్రభవలె కనబడేటటువంటిది. వర్చస్సు అంటే అతడి లోపలనుంచి కనబడేది. 

16. ఒకతెర వెనుకాల దీపం ఉంటే కనబడేటటువంటిదానిని వర్చస్సు అనవచ్చు. తేజస్సు, వర్చస్సు ఆ దివ్యపురుషుడియందుంటాయి. 

17. ఎవరిని మనం దృష్టిలోపెట్టుకొని ఆవాహనచేస్తున్నామో అతడి దర్శనం మన అంతఃకరణలో క్రమంగారావాలి. భావనగా అంతర్గతంగా ఒక వస్తువును మనం ఆరాధిస్తున్నాము. 

18. అది చక్కగా ప్రవర్ధమానమై మనకు ఒకనాడు కనబడుతోన్నది. ఈ భావనతోచేస్తే మనం మన ఉపాసనకు ఫలం పొందవచ్చు. 

19. అలా కనుక యజ్ఞం చేసినట్లయితే, అందరికీకూడా వ్యక్తిగతంగా ఉండేటటువంటి కష్టాలు, బాధలు, గ్రహదోషాలు అవీ నిర్మూలించబడుతాయి.

సశేషం....

🌹🌹🌹🌹🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 51 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి-అహల్య  - 4 🌻

20. ఆ కాలంలో ఆర్యులకు ఒకటే మార్గం. పుట్టినవాడు తపోబలంతో జ్ఞానం సంపాదించిన తరువాత-భవంతుడి దర్శనం చేయకపోతే ఇక ఈ మానవజన్మ ఎందుకనుకునేవాడు. 

21. అదొక్కటే ప్రశ్న. ఏ పనిచేసినా ఇక ఎందుకూ పనికిరాదు. రాజ్యాలను ఏలుతున్న కొడుకులను కన్నప్పటికీ కూడా లాభంలేదు. 

22. తపస్సు, ఈశ్వరసాక్షాత్కారం, ముక్తి – ఇవే పరమధర్మం ఆర్యుడికి. ఎవరూ చెప్పనఖ్ఖరలేదు. విరక్తిని బొఢించవల్సిన ఆవశ్యకతలేనికాలం అది. రక్తిని బోధించటమే కష్టంగా ఉండేది ఆ కాలంలో~ అట్లాంటిది ఆర్యావర్తం ఒకనాడు! 

23. సంసారంలోకి వెళ్ళి పిల్లలనుకను. సుఖంగా ఉండు అని చెప్పటం కష్టంగా ఉండేది! ఎవరూ వినేవాళ్ళుకారు. అల్లంటి దృక్పథం కలిగినజాతి ఇది ఒకనాడు! 

24. ఈ మహర్షుల చరిత్రే కాక, సంఘమ్యొక్క చరిత్రకూడా అలాగే ఉండేది. భారతీయ సంఘమ్యొక్క లక్షణంకూడా ఆనాడు అదే!

25. గౌతముడు చిరకాలము జీవించి అనంతరము తపోలోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో ధర్మాన్నిగురించి ప్రజలకు చెప్పటమే మహర్షులయొక్క ఆశయం. 

26. ఏది స్నుష్ఠేయమో(ఏది చెయవలెనో), ఏది చేయకూడదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో ప్రజలకుచెప్పటమే వారియొక్క తాత్పర్యం. 

27. అందుకనే తపస్సులు చేసినాకూడా, జీవన్ముక్తులు అయినాకూడా, ఈ లోకంలో బోధచేసి చిరకాలము మనుష్యులతో కలిసి జీవించారు మహర్షులు.

28. శిష్యుడు వచ్చి నమస్కరిస్తాను అన్నప్పుడు గురువుగారు నమస్కారం తీసుకుని తీరవలసిందే! అదే ధర్మము. అదే న్యాయమైనది. తను తిరస్కరించటానికి వీలులేదు. 

29. ఎవరైనాసరే, నమస్కరించినపుడు ఆశీర్వదించాలి. అది ధర్మం! నువ్వు నాకు నమస్కరించటానికి వీలులేదు, నేను నీకు ఆశీర్వచనం ఇవ్వనుపో అనటానికి వీలులేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 53 🌹 
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

 🌻. పులస్త్యమహర్షి - హవిర్భువు  - 2 🌻 

5. రాక్షసుడికి ఊరికే ఎవడినిచూచినా తినేయ్యాలనిపిస్తుంది. అది వాడి లక్షణం. తనకేమి అపకారం చేసిఉండవలసిన పనిలేదు. మోక్షకామన, ధర్మప్రవృత్తివంటి లక్షణాలను ఎవరయినా కలిగిఉంటే, అట్టివాడిని ఆటంకపరిచి, బాధించటమే రాక్షసుడి లక్షణం. అకారణద్వేషం. 

6. ఈ లక్షణాలతోపాటు, ఇతరులయొక్క ధనమందు ఆశ, ఎవరియొక్క ప్రాభవమూ సహించకపోవటం, ఇంకొకడిని పీడించి దుఃఖపెట్టడంలో ఆనందం – ఇవన్నీ రాక్షసలక్షణాలు. 

7. ఇంకొకరి దుఃఖం చూసి ఆనందించటం అనేటటువంటి లక్షణం ఎవరి దగ్గరయితే ఉంటుందో అది రాక్షసాంశ.

8. ఒకడు పండితుడు కావచ్చు, అనేకమయిన పుణ్యకార్యాలు చేస్తూ ఉండవచ్చు, తపస్వి కావచ్చు, శక్తి ఉండవచ్చు, యోగి కావచ్చు – ఎవరైనా కావచ్చు; కాని అతడు మరొకడి దుఃఖంలో ఆనందం పొందే వాడైతే రాక్షసాంశలో ఉంటాడు అనే బోధ మన పురాణాలలో వస్తుంది.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 54 🌹 
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

 🌻. పులస్త్యమహర్షి - హవిర్భువు  - 3 🌻 

9. రాక్షసస్వభావం కలవారిని గుర్తుపట్టాలంటే, మరొకడి దుఃఖంవల్ల ఆనందం పొందేవాడని సులభంగా చెప్పారు పెద్దలు. ఈ రాక్షసస్వభావంగలవాడికి ఏమీ కోరికలుండవు. 

10. నీ దగ్గర ఉండే సొమ్ము నాకు కావాలని ఆశించడు. “నువ్వు దానిని అనుభవిస్తున్నావుకాబట్టి, దానిని నాశనం చేస్తాను. నువ్వు ఆనందంగా ఉండటమే నాకు దుఃఖం. నువ్వు దుఃఖపడటమే నాకానందం” అంటాడు. ఇవే వాడి లక్షణాలు. 

11. ఇట్లాంటి లక్షణాలు ఒకవేళ బ్రాహ్మణులను ఆశ్రయించినాయంటే ఇక భారతీయసంస్కృతికి భవిష్యత్తు ఎక్కడుంటుంది? అలాగేకనుక జరిగితే, ఇక ఆసురీ సంపత్తియే తప్ప దేవతాలక్షణం, దైవీసంపత్తి మిగలదు. దానివల్ల భారతజాతి అష్టకష్టాలపాలవుతుంది.

12.  ఏమీలేకుండా, ఏ నేరమూ చేయకుండానే భారతదేశం ఈ స్థితికి ఎందుకొచ్చింది? మనది మహోత్కృష్టమయిన సంస్కృతి అంటాం కదా! మనవారు పరమ ధార్మికులు, ఇది ఉత్తమమైన ఆర్యసంస్కృతి అని మనం అందరికీ చెప్పుకుంటాం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:44, 13/07/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 1 🌻

🌴. గ్రంధాలు: అంగిరస్మృతి, బృహదంగిరస్మృతి, మధ్యమాంగిరస్మృతి,

🌻. జ్ఞానం :

1. బ్రహ్మగారి బుద్ధిలోంచి పుట్టినవారు అంగిరసమహర్షి. బ్రహ్మగారు ఆయనతో, “నా మానసపుత్రులలో నీవు మూడవ వాడివి. నీవు నా దయకు పాత్రుడివై నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నా దగ్గరికివచ్చి నేను చెప్పేదానిని చేస్తూ ఉండటమే నీ ఉద్యోగం. లోకక్షేమమే నీ కర్తవ్యం. లోకానికి ఏది క్షేమమని నేను అంటానో ఆ పని నీవు చెయ్యి. లోక క్షేమం కొరకు నేను ఆదేశించిన సమయానికి నీవు వివాహితుడవై సంసారంలో ప్రవేసించు” అని చెప్పాడు.

2. అంగిరసమహర్షి కర్దమప్రజాపతి కుమార్తె అయిన శ్రద్ధను ధర్మపత్నిగా స్వీకరించి గృహస్థజీవనంలో ప్రవేశించాడు. ఆ సంసారయాత్ర మోక్షలక్ష్మిని చేరుకోవటానికి ప్రయాణమేకాని, భౌతికమయిన లాలసతో కూడుకున్నటువంటి యాత్ర కాదు. ఇంద్రియవాంఛాప్రవృత్తులకు, లోభాదులకు అతీతులై నియమంతో, నిగ్రహంతో, తపస్సులో సంసారయాత్ర చేసారు వాళ్ళు. జగమంతా ఈశ్వరమై గోచరించింది వాళ్ళకు. ఇంద్రియములు, కర్మలు అన్నీ కూడా ఈశ్వరమయఒంగా చూసారు. ప్రశాంతచిత్తులై ఉన్నారు. గృహస్థజీవనాన్నికూడా తపస్సుగా భావించారు వాళ్ళు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 13/07/2020] +91 98494 71690: 🌹. మనోశక్తి  - Mind Power  - 59 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 54 :--నేను, పూర్ణాత్మ,  అంశాత్మ - 2  🌻

4) ఒక అంశాత్మ జ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటే అది పూర్ణాత్మ కు అంశాత్మ కు విస్తరణ అవుతుంది. అనగా అంశాత్మ ప్రగతి పూర్ణాత్మ ప్రగతి అవుతుంది.

5) కోటానుకోట్ల పూర్ణాత్మ లు మూలచైతన్యం నుండి ఉద్భవించాయి. మూలచైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. చైతన్య పరిణామం చెందుతూ ఉంది.

6) నక్షత్రాలుగా, గ్రహాలుగా, సూర్యుళ్ళుగా, సముద్రాలుగా, పర్వతాలుగా, జీవరాసులన్నింటిలో ఆత్మశకలాలుగా విడగొట్టబడి ఉంది మూలచైతన్యం. 

పూర్ణాత్మలు నుండి అంశాత్మలు మరియు అంశాత్మలు నుండి పూర్ణాత్మలుగా సృష్టి ఆనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 1 🌻

🌴. గ్రంధాలు: అంగిరస్మృతి, బృహదంగిరస్మృతి, మధ్యమాంగిరస్మృతి,

🌻. జ్ఞానం :

1. బ్రహ్మగారి బుద్ధిలోంచి పుట్టినవారు అంగిరసమహర్షి. బ్రహ్మగారు ఆయనతో, “నా మానసపుత్రులలో నీవు మూడవ వాడివి. నీవు నా దయకు పాత్రుడివై నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నా దగ్గరికివచ్చి నేను చెప్పేదానిని చేస్తూ ఉండటమే నీ ఉద్యోగం. లోకక్షేమమే నీ కర్తవ్యం. లోకానికి ఏది క్షేమమని నేను అంటానో ఆ పని నీవు చెయ్యి. లోక క్షేమం కొరకు నేను ఆదేశించిన సమయానికి నీవు వివాహితుడవై సంసారంలో ప్రవేసించు” అని చెప్పాడు.

2. అంగిరసమహర్షి కర్దమప్రజాపతి కుమార్తె అయిన శ్రద్ధను ధర్మపత్నిగా స్వీకరించి గృహస్థజీవనంలో ప్రవేశించాడు. ఆ సంసారయాత్ర మోక్షలక్ష్మిని చేరుకోవటానికి ప్రయాణమేకాని, భౌతికమయిన లాలసతో కూడుకున్నటువంటి యాత్ర కాదు. ఇంద్రియవాంఛాప్రవృత్తులకు, లోభాదులకు అతీతులై నియమంతో, నిగ్రహంతో, తపస్సులో సంసారయాత్ర చేసారు వాళ్ళు. జగమంతా ఈశ్వరమై గోచరించింది వాళ్ళకు. ఇంద్రియములు, కర్మలు అన్నీ కూడా ఈశ్వరమయఒంగా చూసారు. ప్రశాంతచిత్తులై ఉన్నారు. గృహస్థజీవనాన్నికూడా తపస్సుగా భావించారు వాళ్ళు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 57 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 2 🌻

3. రాక అంటే పౌర్ణమి చంద్రుడు. సినీవాలి అంటే అమావాస్య. అందులో రెండున్నాయి. ‘సా దృష్టేందు సినీవాలి, సా నష్టేందు కళా కుహూ’. ‘దృష్ట ఇందూ, ‘నష్ట ఇందు’ లక్షణములచేత అమావాస్య రెండు విధములుగా ఉంటుంది. అందుచేత ఆ పేరు పెట్టారు ఆవిడకు – సినీవాలి అని, కుహూ అని. ఒక దానిలో చంద్రకళ కనబడుతుంది, మరొక దానిలో కళ గుప్తమైపోతుంది. అందులో బృహత్కీర్తియే ఉతథ్యుడు అనే పేరుతో, బృహజ్జ్యోతియే సంవర్తుడు అనే పేరుతో పిలువబడతారు.

4. గిరసుని సంతానంతా అంగిరసులు అని పిలువబడతారు. అధర్వణవేదాన్ని - అధర్వాంగిరవేదం అంటారు. అంగిరసుడి అధర్వణవేదం ‘అధర్వాంగిరసం’ అని పేరు పొందింది. ‘అంగారాన్నిరూహ్య’ అంటే, అగ్నిదేవుడు కాదు. అంగిరసుడనే అర్థం. అనేకచోట్ల అగ్నికి ‘అంగార’ శబ్దం వాడతాం. అంగిరసుడిని అగ్నిస్వరూపుడుగా భావిస్తాం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 13/07/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 1 🌻

🌴. గ్రంధాలు: అంగిరస్మృతి, బృహదంగిరస్మృతి, మధ్యమాంగిరస్మృతి,

🌻. జ్ఞానం :

1. బ్రహ్మగారి బుద్ధిలోంచి పుట్టినవారు అంగిరసమహర్షి. బ్రహ్మగారు ఆయనతో, “నా మానసపుత్రులలో నీవు మూడవ వాడివి. నీవు నా దయకు పాత్రుడివై నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నా దగ్గరికివచ్చి నేను చెప్పేదానిని చేస్తూ ఉండటమే నీ ఉద్యోగం. లోకక్షేమమే నీ కర్తవ్యం. లోకానికి ఏది క్షేమమని నేను అంటానో ఆ పని నీవు చెయ్యి. లోక క్షేమం కొరకు నేను ఆదేశించిన సమయానికి నీవు వివాహితుడవై సంసారంలో ప్రవేసించు” అని చెప్పాడు.

2. అంగిరసమహర్షి కర్దమప్రజాపతి కుమార్తె అయిన శ్రద్ధను ధర్మపత్నిగా స్వీకరించి గృహస్థజీవనంలో ప్రవేశించాడు. ఆ సంసారయాత్ర మోక్షలక్ష్మిని చేరుకోవటానికి ప్రయాణమేకాని, భౌతికమయిన లాలసతో కూడుకున్నటువంటి యాత్ర కాదు. ఇంద్రియవాంఛాప్రవృత్తులకు, లోభాదులకు అతీతులై నియమంతో, నిగ్రహంతో, తపస్సులో సంసారయాత్ర చేసారు వాళ్ళు. జగమంతా ఈశ్వరమై గోచరించింది వాళ్ళకు. ఇంద్రియములు, కర్మలు అన్నీ కూడా ఈశ్వరమయఒంగా చూసారు. ప్రశాంతచిత్తులై ఉన్నారు. గృహస్థజీవనాన్నికూడా తపస్సుగా భావించారు వాళ్ళు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 13/07/2020] +91 98494 71690: 🌹. మనోశక్తి  - Mind Power  - 59 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 54 :--నేను, పూర్ణాత్మ,  అంశాత్మ - 2  🌻

4) ఒక అంశాత్మ జ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటే అది పూర్ణాత్మ కు అంశాత్మ కు విస్తరణ అవుతుంది. అనగా అంశాత్మ ప్రగతి పూర్ణాత్మ ప్రగతి అవుతుంది.

5) కోటానుకోట్ల పూర్ణాత్మ లు మూలచైతన్యం నుండి ఉద్భవించాయి. మూలచైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. చైతన్య పరిణామం చెందుతూ ఉంది.

6) నక్షత్రాలుగా, గ్రహాలుగా, సూర్యుళ్ళుగా, సముద్రాలుగా, పర్వతాలుగా, జీవరాసులన్నింటిలో ఆత్మశకలాలుగా విడగొట్టబడి ఉంది మూలచైతన్యం. 

పూర్ణాత్మలు నుండి అంశాత్మలు మరియు అంశాత్మలు నుండి పూర్ణాత్మలుగా సృష్టి ఆనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.

🌹 🌹 🌹 🌹 🌹

: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 58 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 3 🌻

5. వేదాలలో ‘ఇంద్ర’ శబ్దం అంటే, ఎప్పుడూ ఈ దేవతల నాట్యం చూస్తూ అప్సరసలతో ఆడుకుంటూ వాళ్ళను చూసుకుంటూ సంగీతం వింటూ ఉండే ఇంద్రుడు కాడు. ఇంద్రుడు అంటే రుద్రుడు ఒక చోట. ఇంద్రుడు అంటే విష్ణువు మరొకచోట. ఇంద్రుడు అంటే అగ్ని ఇంకొకచోట. ఇంద్రుడు అంటే వాయువు వేరొకచోట. ఈ ప్రకారంగా ఇంద్రశబ్దం పూజ్యమయింది. ఇంద్ర శబ్దం వేదాలలో అనేక అర్థాలలో వాడబడింది. విష్ణుస్వరూపుడైనట్టి అగ్నికి అని ఒకచోట; సప్తముఖములు కలిగినటువంటి అగ్నికి నమస్కారం అని మరొకచోట. పూర్ణాహుతి చేసిన తరువాత, అగ్ని సప్తజిహ్వలతోటి తీసుకుంటాడు పూర్ణాహుతిని. మనం ఇచ్చే మిగతా ఆహుతులన్నీకూడా ఒక ముఖంతోటే అగ్ని తీసుకుంటాడు. అన్ని ముఖాలతోటీ ఒక్కసారే తీసుకోడు. పూర్ణాహుతిలో ‘పూర్ణ’ శబ్దం దేనికంటే, ఒక్క పూర్ణాహుతినిమాత్రమే సప్తజిహ్వలతోటి తీసుకుంటాడని అనుకోవాలి. అందుకే ఆ మాటను చివర వాడతాం.

6. పాశ్చాత్యులు వ్రాసినటువంటి వ్యాఖ్యానాలకు సమాధానంగా, ఆ నవీనభాషలోనే వాటిని ఖండిస్తూ వ్రాయగలిగినటువంటి పండితులు అటువంటి శ్రద్ధ కలిగిఉండలేదు. మన పండితులు సనాతన సంప్రదాయంలో ఉండే పండితులు. వాళ్ళు వాటిని ఇంగ్లీషులో వ్రాయరు. అసలు ఆ పాశ్చాత్యులకు వేదానికి వ్యాఖ్యానం వ్రాసే అధికారం లేదని వారు వ్రాసిన వాటికి మనం జవాబు చెప్పనఖ్ఖరలేదని – ఇట్లాంటి భావాలున్నాయి మన పండితులకు. కాబట్టి, ఏ ఖండనలూ లేక ఆ పాశ్చాత్యులు వ్రాసిన ఆధునికభాషా వ్యాఖ్యానాలు ప్రచారం అయ్యాయి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 59 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 4 🌻

7. దయానంద సరస్వతి చాలా వ్యాఖ్యానాలు వ్రాసారు. సాంగోపాంగంగా వేదం తెలిసిన అఖండ విద్యాసమేతుడాయన. ఆయనది అసామాన్యమయిన విద్య. అతడికి శిక్ష, కల్పము మొదలయినవన్నీ కూడా కరతలామలకము. ఆయనకు ఇరవై ఏళ్ళప్పుడే అన్నీ వచ్చేసాయి. ఆయన కారణజన్ముడు. అయితే ‘ఆర్యసమాజ’ స్థాపనలో విగ్రహారాధనను తిరస్కరించాడు. పురాణాలు చదవొద్దన్నాడు. రాతిబొమ్మలకు పూజలు చెయ్యవద్దన్నాడు.

8.  దేవాలయాలకు వెళ్ళటం మానెయ్యండి అన్నాడు. అలా అయితే హిందూ మతం ఎలా మిగులుతుంది? అందరూ వేదం చదువుకుంటే అగ్నిహోత్రం మాత్రమే ఉంటుందా? ఆయ చెప్పినట్లే అందరూచేస్తారా? ఇలాంటి వాదంవల్లే ఆర్యసమాజం తెరమరుగైపోయింది. ఆర్యసంస్కృతి, ఆర్యమతంలో ఎన్ని వివాదాలు ఉన్నాయో, ఎన్ని అభిప్రాయ భేదాలున్నాయో లెఖ్ఖలేదు. ప్రపంచంలో ఏమతానికీ ఇవి లేవు. దీని నిజస్వరూపం తెలుసుకోవటం ఎవరికైనా కష్టమే, దుస్సాధ్యమే అయింది. అయితే మహర్షుల చరిత్ర తెలిస్తే కొన్ని భావాలు సరిగా అర్థం అవుతాయి. స్మృతులు,శ్రుతులు చదవటం కంటే మహర్షుల భావాలు తెలుసుకోవటమే మనకు శరణ్యం. స్మృతికర్తలు వాళ్ళే కదా! వారి మాటలవల్ల సందేహాలు తీరవచ్చు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 60 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 5 🌻

9. వేదం ఎలాగ ప్రమాణమో, బ్రహ్మర్షులైన ఈ మహర్షులయొక్క వాక్యములు, వాళ్ళ మాటలుకూడా అలాగ పరమప్రమాణాలే. ఆ భావంతోటే మనం వినాలి.

 ఎందుచేతనంటే, శ్రుతికి(వేదానికి) వ్యక్తిత్వం లేదు.సత్యమే ఉంది దానిలో. వాక్కే ఉంది. ఆ వాక్కు ఒకానొక వ్యక్తిత్వంలో ప్రవేశించి, అవగాహనను పొంది, ఆ వ్యక్తిత్వంలోంచీ వచ్చినటువంటి నిర్వచనములే మనకు ఇంకా మహోన్నతంగా లభిస్తాయి. అంటే అవి మహర్షుల వ్యక్తిత్వములే అని భావించాలి. అందువల్ల మహర్షుల వాక్యములే మనకు శరణ్యం. శ్రుతులకంటే, శ్రుతులను అర్థం చేసుకున్నవాళ్ళ మాటలు గొప్పవి. శ్రుతియొక్క భావనలే వాళ్ళు చెప్తారు కాబట్టి అది మనకు శరణ్యం.

10. నాడు గౌతమమహర్షి అంగిరసుడిని భరతవర్షంలో ఉన్న గొప్పక్షేత్రములు, వాటి మహత్తులు గురించి అడిగాడు. అప్పుడు అంగిరసుడు ఒక తీర్థసందర్శనంవలన సంతానప్రాప్తి కలుగుతుందని, మరొక తీర్థంవలన పుణ్యంవస్తుందని చెప్పాడు. “కాశ్మీరదేశంలో ఎన్నో నదులుపుట్టి సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడి తీర్థాలన్నీ కూడా పవిత్రమయినవి. 

కాశ్మీరదేశంలోని నదులలో స్నానం చేసినవాడు, అక్కడ తపస్సు చేసినవాడు యోగస్థితిని పొందుతాడు. జ్ఞాన సిద్ధిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు” అని చెప్పి. అలాగే పుష్కర తీర్థము, ప్రభాసతీర్థము, నైమిషతీర్థము, దేవిక, ఇంద్రమార్గ, స్వర్ణబిందులనబడే తీర్థాల మహిమలను గురించి కూడా చెప్పాడు.
ప్రశాంతచిత్తుడు, విరాగి, బ్రహ్మభావన కలిగినవాడు, దేనియందూ ఆపేక్ష లేనివాడు-అట్లాంటి వాళ్ళకు తీర్థాలతో పనిలేదు. అలాగే ఎవరైనా తీర్థయాత్రల కథనాన్నంతా వింటేచాలు. కొంత పుణ్యం వస్తుంది” అని చెప్పాడు అంగిరసుడు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹
🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 6 🌻

11. “పరవిద్య, అపరవిద్య అని విద్య రెండు రకములుగా ఉంటుంది. ఋక్, యజుస్, సామములు వేదములు; శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, జ్యోతిషము,ఛందస్సు అనే ఈ వేదాంగలూ అన్నీ అపరవిద్యలు అనుబడుతున్నాయి. 

అక్షరస్వరూపుడయిన పరమాత్మను గురించి ఉన్న జ్ఞానమే పరవిద్య. ఆయన సర్వాంతర్యామి, అతీంద్రియుడు” అని చెప్పాడు. ఈశ్వరుడు క్షరాక్షరాలకు అతీతుడు. ‘క్షర’ అంటే కదులుతూ ఉండేది. ‘అక్షర’ మంటే కదలలేకుండా నిర్మలంగా ఉన్నది. 

“ఆ పరమాత్మయొక్క జ్ఞానాన్ని సంపాదించటానికి బాణంగా అనుసంధానంచేసి, ఉపాసన అనేటటువంటి పదును దానికిపెట్టి, ప్రరమాత్మయందు ఏకాగ్రత కల మనస్సును బ్రహ్మంగా భావించి దానిని వేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క ఆపరోక్షజ్ఞానం కలుగుతుంది. అదే మోక్షం” అని చెప్పాడు అంగిరసుడు.

12. బ్రాహ్మణుడు మహాదోషములను చేసినప్పుడు క్షంతవ్యుడు కాడు. అతడిపట్ల క్షమ అనేది వర్తించదు. అసులు క్షంతవ్యుడే కాడు. కానీ తన దోషానికి తనే శిక్ష వేసుకుని కఠోరమైన వజ్రవ్రతము అనేదానిని అనుష్ఠించాలి. 

పశువును కాని, పక్షిని కాని ఏ కారణం చేతనైనా బ్రాహ్మణుడు చంపినా, దానికి అతడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు అంగిరసుడు. అయితే యజ్ఞంలో మాత్రం, పశువు దేహంలోని జీవునికి ఉత్తమగతులు కలుగుతాయి కనుక, యజ్ఞంలో పశువధ అనుమతించబడింది. అయితే, అదికూడా కలిప్రారంభంలో స్మృతులచే నిషేధించబడింది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 62 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 7 🌻

13. పతితో సహగమనం చేసిన సతి స్వర్గసుఖాన్ని అనుభవిస్తుంది. కానీ బ్రాహ్మణస్త్రీ సహగమనం చేయకూడాదు. తపస్సు, యోగమును అనుసరించి తాను విరాగినిగా ఉండవలసిందే! బ్రాహ్మణస్తీకి సహగమన నిషేధం ఎందుకంటే, స్వర్గసుఖంకోరి భర్తతో వెళ్ళకూడదని. తను వేరుగా తన జీవుడియొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళవలసిందే! 

అసలు విషయం ఏమిటంటే, మనుధర్మశాస్త్రానికి పూర్వం ఉండేటటువంటి ధర్మశాస్త్రములు అత్యుత్తమమైనవని, మనుధర్మశాస్త్రం అత్యుత్తమంకాదు అని అంగిరసుడు చెప్పాడని తరువాతివారు ఉదహరించారు.

14. అంగిరసుడిని ఇంద్రాగ్నితుల్యుడని చెప్పింది ఋగ్వేదం. అగ్ని అంగిరసుడేనని మరొకచోట చెప్పింది. అంగిరసుడె మొదట అగ్నిని ఆవాహనముచేసి మథించి గౌరవించినట్లు సుస్పష్టంగా తెలుస్తున్నది. 

అగ్నిదేవుడికి అంగిరసుడంటే చాలా గౌరవము. అందుచేతనె యజ్ఞ యాగాదులలో అంగిరసులచే ప్రోక్తమైన పద్ధతిలో ఆవాహనముచేస్తేనే అగ్ని తృప్తిచెందుతాడని సంప్రదాయంగా అనుకుంటారు. అంటే అంగిరసుడు చెప్పిన విధంగా అగ్నిని ఆవాహనచేస్తేనే అగ్ని ప్రసన్నుడవుతాడు. 

అధర్వణవేదంలో వాళ్ళను దేవతలుగాను, పితృదేవతలుగాను స్తోత్రంచేసారు. వాళ్ళను మహర్షులుగాను పేర్కొన్నారు. అంటే అంగిరసులు దేవతలు, పిత్రుదేవతలు, మహర్షులు అని మూడువిధాలుగా పేర్కొనబడ్డారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ