అయోధ్యకాండ వర్ణనము- . శ్రీ మదగ్ని మహాపురాణము


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 14 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అయోధ్యకాండ వర్ణనము - 3 🌻

రుదన్రాజాపి కౌసల్యాగృహమాగాత్సుదుఃఖితః | పౌరా జనాః స్త్రియః సర్వా రురుదూ రాజయోషితః. 31

మిక్కిలి దుంఖితు డైన దశరథమహారాజు ఏడ్చుచు కౌసల్యాగృహమునకు వెళ్ళెను. పౌరులును. స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.

రామో రథస్థశ్చీరాఢ్యః శృఙ్గబేరపురం య¸° | గుహేన పూజిత స్తత్ర ఇఙ్గదీమూలమాశ్రితః. 32

నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. ఆచట రాముడు ఇంగుదీవృక్షమూలమున నివసించెను.

లక్ష్మణః సగుహో రాత్రౌ చక్రతుర్జాగరం హితౌ | సుమన్త్రం సరథం త్యక్త్వా ప్రాతర్నావాథ జాహ్నవీమ్‌.

రామలక్ష్మణసీతాశ్చ తీర్ణా ఆపుః ప్రయాగకమ్‌ | భరద్వాజం నమస్కృత్య చిత్రకూటం గిరిం యయుః. 34

లక్ష్మణుడును, గుహుడును…
 

. శ్రీ మదగ్ని మహాపురాణము - 13 🌹
ప్రథమ సంపుటము, అధ్యాయము - 6
🌻. అయోధ్యకాండ వర్ణనము - 2 🌻

ప్రోత్సాహితా కుబ్జయా సా అనర్థే చార్థదర్శినరీ | ఉవాచ సదుపాయం మే కచ్చిత్తం కారయిష్యతి.
క్రోధాగారం ప్రవిష్టథ పతితా భువి మూర్ఛితా | 16

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కై కేయి, అనర్థమును లాభకర మని భావించినదై ''ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా ?'' అని పలికి కోప గృహమును ప్రవేశించి, మూర్ఛితురాలు వలె భూమిపై పడి యుండెను.

ద్విజాతీనర్చయిత్వాథ రాజా దశరథస్తదా. 17

దదర్శ కై కయిం రుష్టామువాచ కథమీదృశీ | రోగార్తా కం భయోద్విగ్నా కిమిచ్ఛసి కరోమి తత్‌. 18

యేన రామేణ హి వినా న జీవామి ముహూర్తకమ్‌ | శపామి తేన కుర్యాం వై వాఞ్ఛీతం తవ సున్దరి. 19

రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కై కేయిని చూచి ఇట్లు పలికెను. '' ఇట్లున్నావేమి? రోగముతో బాదపడుచున్నావా ? భయపడినావా ? నీ కేమి కావలెను. చెప్పుము. అది చేసెదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాల మైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టుపెట్టుచున్నాను. ఓ సుందరీ ! నీ కోరికను నెరవేర్చెదను.''

సత్య బ్రూహీతి సోవాచ నృప మహ్యం దదాసి చేత్‌ |
వరద్వయం పూర్వదత్తం సత్యాత్తవ్వం దేహి మే నృప. 20

చతుర్దశ సమా రామో వనే వసతు సంమతః | సంబారై రేభిరద్యైవ భరతో త్రాభిషేచ్యతామ్‌.
విషం పీత్వా మరిష్యామి దాస్యసి త్వం న చేన్నృఫ | 21

ఆమె పలికెను. ''ఓ రాజా ! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని పూర్వము నా కిచ్చిన రెండు కరములను, సత్యమును పాలించుచు నాకిమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంబారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషమ త్రాగి మరణించెదను.

తచ్ర్ఛుత్వా మూర్ఛితో భూమౌ వజ్రాహత ఇవాపతత్‌.
ముహూర్తాచ్చేతనాం ప్రాప్య కై కేయి మిదమబ్రవీత్‌. 22

ఆ మాట విని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవాడు వలె భూమిపై పడెను. ముహూర్త కాలమున స్మృతి చెంది కై కేయితో ఇట్లనెను.

దశరథ ఉవాచ :

కిం కృతం తవ రామణ మయా వా పావనిశ్చయే.

యన్మామేవం బ్రవీషి త్వం సర్వలోకాప్రియం కరి | కేవలం త్వత్ర్పయం కృత్వా భవిష్యామి సునిన్దితః. 24

యా త్వం భార్యా కాలరాత్రిర్భరతో నేదృశః సుతః | ప్రశాధి విధవా రాజ్యం మృతే మయి గతే సుతే. 25

ఓ పాపనిశ్చయవంతురాలా ! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు ? నేనేమి చేసినాను ? సకల ప్రపంచకమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు ? కాలరాత్రి వంటి భార్య వైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడ నగుదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యచమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యము నేలికొనుము.

సత్యపాశనిబద్ధ స్తు రామమాహూయ చాబ్రవీత్‌ | కై కేయ్యా వఞ్చీతో రామ రాజ్యం కురు నిగృహ్య మామ్‌.
త్వయా వనే తు వస్తవ్యం కై కేయి భరతో నృపః | 26

సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి ఇట్లు పలికెను. ''రామా ! నేను కై కేయిచే వంచింపబడితిని. నన్ను బంధించి రాజ్య మేలుము. నీవు వనములో నివసింపవలెను. కై కేయీ కుమారు డైన భరతుడు రాజు అగును. ''

పితరం చైవ కై కేయిం నమస్కృత్య ప్రదక్షిణమ్‌ . 27

కృత్వా నత్వా చ కౌసల్యాం సమాశ్వాస్య సలక్ష్మణః |
సీతయా భార్యయా సార్థం సరథః ససుమన్త్రకః. 28

దత్త్వా దానాని విప్రేభ్యో దీనానాథేభ్య ఏవ సః |
మాతృబిశ్చైవ విప్రాద్యైః శోకార్తైర్నిర్గతః పురాత్‌. 29

రాముడు తండ్రికిని, కై కేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణసమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రినతో కూడినవాడై, రథము నెక్కి శోకార్తులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణమునుండి బయలువెడలెను.

ఉషి
త్వా తమసాతీరే దాత్రౌ పౌరాన్‌ విహాయ చ | ప్రభాతే తమపశ్యన్తోయోధ్యాం తే పునరాగతాః. 30

రాత్రి తమసా తీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 51 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి-అహల్య  - 4 🌻

20. ఆ కాలంలో ఆర్యులకు ఒకటే మార్గం. పుట్టినవాడు తపోబలంతో జ్ఞానం సంపాదించిన తరువాత-భవంతుడి దర్శనం చేయకపోతే ఇక ఈ మానవజన్మ ఎందుకనుకునేవాడు. 

21. అదొక్కటే ప్రశ్న. ఏ పనిచేసినా ఇక ఎందుకూ పనికిరాదు. రాజ్యాలను ఏలుతున్న కొడుకులను కన్నప్పటికీ కూడా లాభంలేదు. 

22. తపస్సు, ఈశ్వరసాక్షాత్కారం, ముక్తి – ఇవే పరమధర్మం ఆర్యుడికి. ఎవరూ చెప్పనఖ్ఖరలేదు. విరక్తిని బొఢించవల్సిన ఆవశ్యకతలేనికాలం అది. రక్తిని బోధించటమే కష్టంగా ఉండేది ఆ కాలంలో~ అట్లాంటిది ఆర్యావర్తం ఒకనాడు! 

23. సంసారంలోకి వెళ్ళి పిల్లలనుకను. సుఖంగా ఉండు అని చెప్పటం కష్టంగా ఉండేది! ఎవరూ వినేవాళ్ళుకారు. అల్లంటి దృక్పథం కలిగినజాతి ఇది ఒకనాడు! 

24. ఈ మహర్షుల చరిత్రే కాక, సంఘమ్యొక్క చరిత్రకూడా అలాగే ఉండేది. భారతీయ సంఘమ్యొక్క లక్షణంకూడా ఆనాడు అదే!

25. గౌతముడు చిరకాలము జీవించి అనంతరము తపోలోకానికి వెళ్ళిపోయాడు. లోకంలో ధర్మాన్నిగురించి ప్రజలకు చెప్పటమే మహర్షులయొక్క ఆశయం. 

26. ఏది స్నుష్ఠేయమో(ఏది చెయవలెనో), ఏది చేయకూడదో, ఏది ధర్మమో, ఏది అధర్మమో ప్రజలకుచెప్పటమే వారియొక్క తాత్పర్యం. 

27. అందుకనే తపస్సులు చేసినాకూడా, జీవన్ముక్తులు అయినాకూడా, ఈ లోకంలో బోధచేసి చిరకాలము మనుష్యులతో కలిసి జీవించారు మహర్షులు.

28. శిష్యుడు వచ్చి నమస్కరిస్తాను అన్నప్పుడు గురువుగారు నమస్కారం తీసుకుని తీరవలసిందే! అదే ధర్మము. అదే న్యాయమైనది. తను తిరస్కరించటానికి వీలులేదు. 

29. ఎవరైనాసరే, నమస్కరించినపుడు ఆశీర్వదించాలి. అది ధర్మం! నువ్వు నాకు నమస్కరించటానికి వీలులేదు, నేను నీకు ఆశీర్వచనం ఇవ్వనుపో అనటానికి వీలులేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 63 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 8 🌻

15. పితృలోకంలో అయిదుగురు దేవతలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళను పితృదేవతలు అంటారు. పిత్రుదేవతలు శాశ్వతంగా ఉంటారు. చనిపోయిన జీవులు ఆ దేవతల అనుగ్రహం సంపాదించి అక్కడికివెళ్ళటానికి, ఆ దేవతలయందుండే మహత్తర శక్తిచేత, పుణ్యం అభివృద్ధి చేసుకుని తమపాపం నశింపచేసుకుని ఆ లోకాలకు వెళ్ళటానికని, ఇక్కడ ఆ జీవుల బంధువులు క్రతువులు చేస్తారు. 

అంతే తప్ప చనిపోయిన వాళ్ళకు పాపక్షయం చేయగల శక్తి మనకు లేదు. వీళ్ళు ఏ లోకాలకు వెళ్లితే పాపక్షయం అయి సుఖపడతారో, అక్కడికి పంపించేందుకు వేదమంత్రాలను ఉపయోగిస్తాము. వాటినే తర్పణాలు అంటారు. పితృదేవతల కార్యం అది.

16. మనం ఒక మంత్రోపాసన చేస్తాం. ఆ మంత్రాన్ని విసర్జించే విధానం ఉంది. అవసరమయితే, గోవు చెవిలో చెప్తాం. గోవుచెవిలో చెపితే ఆ మంత్రాన్ని ఇక మళ్ళీ ఉపాసించకూడాదు. దాన్ని ఇక విసర్జించినట్లే. అంటే గోవు చెవిలో దాన్ని వదిలి పెట్టవచ్చు.

17. అంగిరసుడు ఋషిగా ఉన్న గోత్రాలు చాలా ఉన్నాయి. సప్తార్ష్యంలో ఉన్నాడు. త్రయార్ష్యంలో ఉన్నాడు. ఏకాదశార్ష్యంలో ఉన్నాడు. అంగిరస ఋషి కలిస్తే వివాహంకూడా చెయ్యవచ్చని అంటారు. ఎందుకంటే రెండు గోత్రాలను చూచి వివాహం చేసుకునేటప్పుడు, అంగిరసుడు రెండు గోత్రాలలోనూ ఋషిగా కలిసినప్పటికీ దోషంలేదు, తప్పులేదు. వివాహం చేసుకోవచ్చు.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ