*
నది గట్టున చేరి ప్రవాహాన్ని చూస్తున్నట్టు మీ జీవిత ప్రవాహాన్ని అలా చూస్తూ ఉండు. వేదాంత ప్రయోజనం కూడా అంతవరకే. నిన్ను కొట్టుకు పోనివ్వకుండా గట్టున పెట్టి సాక్షిగా ఉండేటట్లు చేస్తుంది.
***
'ఒకటి' లో (అద్వైతం) ఉంటే ప్రశ్న ఉండదు.
'ఒకటి' ని దాటితే సమాధానం ఉండదు.
***
*మహా మూల చైతన్యం నుండి 'నేను' పుట్టింది. నేను లో నుండి 'నాది' పుట్టింది.*
స్వస్థితిని తిరిగి పొందాలంటే, వెనక్కి వెళ్లాలి. మొదట నాది లేని నేను గా మారాలి. తర్వాత నేను లేని నేనుగా (మహా మూల చైతన్యంగా) మారాలి.
***
*చూపు కు అందని వాడు, లో చూపుకు (ధ్యానం) అందేవాడు దేవుడు.*
****
మర్రి విత్తనంలో మర్రి చెట్టు మాత్రమే కాదు.,
ఆ చెట్టు మీద వాలే పక్షులు, ఆ చెట్టు నీడను చేరే మనుష్యులు, చెట్టుకు ఆధారంగా ఉండే భూమి, ఆ చెట్టును నరికే వానితో సహా మొత్తం ఆ మర్రి విత్తనంలో 'సూక్ష్మ రూపం'లో ఉంటుంది.
***
ధ్యానం అనగా ఆలోచన రాహిత్యంతో పాటు., 'నేను' రాహిత్యం కూడా కావాలి.
***
దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలన్నా తలంపు మానండి., ప్రత్యక్షంగా ఉన్నదంతా దైవమే, అని తెలుసుకోండి.
శిష్యుడు:- కాలానికి 'అంతు' ఉన్నదా?
సద్గురు:- మీ 'అంతు'యే కాలానికి అంతు.
పత్రం పుష్పం ఫలం తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః ( భగవద్గీత )
సామాన్యమైన అర్థం ఏమిటంటే :-
భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.
కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.
పత్రం -- మనస్సు -- చంచలం.
పుష్పం -- బుద్ధి -- వికసించడం.
తోయం -- చిత్తం -- నిర్మలం.
ఫలం -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.
అవి ధ్యానం వల్లనే సాధ్యం.
ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.
అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.
అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.
దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.
అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే ఆయనకు ప్రీతి పాత్రులు అవుతారు.
***
దివ్యపురుషులను ఆవాహనం చేయుట:
*దివ్యపురుషులతో, యక్షిణి, అప్సరసలతో, పంచభూతాలతో మాట్లాడటం, దర్శనం చేసుకోవడం, ప్రపంచంలో కొంత మందికి పరిచయమే, ఈ విధానం గురించి పూర్వకాలం నుంచీ మహహర్షులు, యోగులు ఇపుడు కూడా పరిశోధనలు కూడా చేస్తున్నారు!!
* దివ్య జీవులతో పరిచయం ఒక నూతన ప్రక్రియగా, మనస్సుకు సంబందించినది అవడం వల్ల ఆనందం, ఆశ్చర్యం, మనకు కలగవచ్చు. కానీ ఈ అనుభవాలు అన్నీ మనిషి మేధాశక్తిని పెంచలేవు. దివ్యజీవుల ప్రత్యక్షం కావడం వల్ల కొన్ని రోజులుగా సిద్దులు వస్తాయి కానీ ఆత్మోన్నతి తక్కువ. మీదు మిక్కిలీ, సద్గురువు ను ఆశ్రయించని వారు, బుద్ధి మాంద్యం కలవారు, చపలచిత్తులు, ధీర్ఘకాల రోగ ఫీడితులు ఈ ప్రక్రియ ద్వారా శారీరక మానసిక రుగ్మత లకు లోను అవుతారు. అందువలన ఈ ప్రక్రియ ని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సామాన్య ప్రజలకు తగదు.
8దివ్యపురుషులు, యక్షిణీ, ఫేయిరిస్, కొన్ని రకాల సూక్ష్మ శక్తులు అత్యంత శక్తివంతమైనవి, అతి తక్కువ స్థాయి కలిగిన శక్తులు కూడా ఉన్నాయి. వీటిలో దివ్యపురుషులు, యక్షిణీలు అంత త్వరగా దర్శనం ఇవ్వవు. తమ ప్రియసాధకుల విన్నపం మేరకు మాత్రమే వీరు పరోపకార పరాయణులై ప్రత్యక్షం కావడంతో మన సంకల్పం నివృత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని క్షుద్ర శక్తులు కూడా ఆవాహనం అయ్యే ఆస్కారం లేకపోలేదని గమనించాలి.
8 తమ తమ సొంత స్వార్థ ప్రయోజనాల కోసం, బదనిక, మూలికల సేకరణ కోసం, కొన్ని దివ్య తైలాల కోసం వీటిని ఈ ప్రక్రియ ద్వారా చేయవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. ఏది ఏమైనా స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగించిన ప్రమాదకర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.
8నిరంతర జప, ధ్యాన, లేకుండా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఆ శక్తుల ప్రభావం వల్ల మానసిక రోగాలు వస్తాయి.
8లోక కల్యాణం కోసం మాత్రమే శాంతి, వశీకరణ, మోహన, ఉచ్చాటన, విద్వేషణ లాంటి షఠ్ ఖర్మలకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని పూర్వం ఋషులు నిరూపించారు. అన్యధా ప్రమాదం.....
* సృష్టి రహస్యాలు తెలుకోవడానికి, తాత్వికులు, యోగులు, పరిశోధకులు, తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ దివ్యజీవుల ప్రక్రియను చేశారు. అనుభవం, అవగాహన లేకుండా ఈ ప్రక్రియ చేయకూడదు.
* ఈ ప్రక్రియ ద్వారా నేను లెడ్ బీటర్ ని, మూడు రకాల యక్షిణీలను, నీటికి, భూమికి సంబంధించిన భూతాలను, ఫేయిరీస్ ని ప్రత్యక్షంగా చూశాను.
*ఈ ప్రక్రియ ద్వారా చనిపోయిన వ్యక్తులకు ఊర్ధ్వ లోకాలకు పయనించడాని సహాయం చేసే అవకాశం ఉంది.
*ఎన్నో రకాల వస్తువులను, మూలికలను ఈ ప్రక్రియ ద్వారా తీసుకు రావడానికి అవకాశం ఉంది.
* పూర్వ జన్మ వృత్తాంతం, కొన్ని యక్షిణీల సహకారం తో సమయంలోకి సూక్ష్మ శరీరము తో ప్రయాణం చేయవచ్చని అనుభవం.
8మెటీరియలైజేషన్, బైలొకేషన్ ( ఒకే సారి రెండు చోట్ల కనబడటం వంటివి తాత్కాలికంగా జరుగుతాయి మాకు అనుభవం ఇది).
నేను మా ధ్యాన మిత్రులు అందరం కలిసి వరుసగా నాలుగు వారాలు ప్రతి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆవాహన విధానంలో చాలా ఆసక్తికరంగా పాల్గొని ,ముందుగా ఆత్మరక్షణ కోసం ఎవరినైతే ఆవాహన చేస్తున్నామో వారికి ప్రార్థన, ధ్యానం, చేశాము మొదటి రెండు వారాల్లో ఎటువంటి అనుభూతి కలగలేదు కానీ మూడవ వారంలో మాత్రం చాలా అద్భుతమైన అనుభవం ఎదురైనది. మూడవ ఆదివారం ఈ ఆవాహన కార్యక్రమం పూర్తి చేసుకుని ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్ళి పోయారు సాయంత్రం పూట నేను మా ఇంట్లో అందరూ కలసి భోజనం చేస్తుండగా సడెన్ గా ఓ అద్భుతమైన కాంతి కిరణాలను కలిగి, సుమారు ఆరు అడుగుల పై ఎత్తు కలిగి, అద్భుతమైన సౌందర్యం కలిగి, సుగంధ పుష్పాల వాసనతో మా కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడంతో మా అందరికీ ఆశ్చర్యం, భయం కలిగింది మేము ఆవాహనం చేసింది ఇవిడనే....... ఆవిడ మాటలు వర్ణనాతీతం అప్పుడు ఆవిడ చెప్పిన విషయం నాకు అర్ధం కాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆవిడ చెప్పిన మాటలు నా జీవితంలో జరిగాయి!!! ఆవిడ నాకు ఓ పుస్తకం నీవద్దకు వస్తుందని చెప్పారు కొంత కాలం తర్వాత ఆ పుస్తకం ఓ వ్యక్తి ద్వారా వచ్చింది.... అది నాకు ఈ తాంత్రిక విద్యపై ఆసక్తిని కారణం అయింది.....
తర్వాత మూడవ రోజు కూడా ఈవిడ దర్శనం కలిగి ఆవిడ నా శరీరాన్ని ఆవహించి ఉంది కాసేపు వరకు, తర్వాత నా ఆరా Aura అద్భుతంగా ఉండి చాలా పెద్దదిగా ఉండి నాకు దగ్గరగా ఎవరు వచ్చినా కూడా వారి ఆలోచనలు చెప్పకుండానే తెలిసిపోయాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ధ్యాన మిత్రుడు రాము ( icici bank manager ) కి కూడా ఓ విశేష అనుభవం అయింది నాలుగో ఆదివారం అతని శరీరం లోకి ఓ మహానుభావుడు ఫ్రవేశించి ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాడు!! రాము అనే వ్యక్తి జీవితంలో కోల్పోయిన వ్యక్తి తిరిగి తన జీవితంలో కి రావడం జరిగింది.
తర్వాత వారం నుంచి మా ఇల్లు కొన్ని శక్తులకు నిలయంగా మారి. కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాం.
ఇంటి గోడలకు, వస్తువులకు కొన్ని శక్తులు ఏవో రంగులు పులుముతూ భొమ్మలు గీసి చూపడం ఒక రోజు చూశాను!! తర్వాత ఆవాహనకై కూర్చుంటే ఓ కాళీ నోట్ బుక్ లో మొత్తం ఏవో బొమ్మలు గీసి చూపించాయి. తర్వాత వస్తవులు వాటతంట అవే గాలిలోకి ఎగిరి దూరంగా పడిపోవడం లాంటివి జరిగి కొంత ఇబ్బంది కలిగినా రాను రాను వాటిని అదుపులో ఉంచడం నేర్చుకున్నాను.
తర్వాత ఆవాహన కు కూర్చుని ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వీటి సహాయంతో వారికి తగిన పరిష్కారం కోసం ఆ శక్తులను ఉపయోగించే వారం.
మా ఇంట్లో నేను కూర్చుని ధ్యానం చేస్తుండగా నా శరీరం అంతా ఓ తెల్లని కాంతి ఆవరించి బయటకు రావడం మా అమ్మ గారు చూశారు...... ఆ తెల్లని కాంతి నుండి రకరకాల ఆకారాలుగా మొదలై క్రమంగా అదృశ్యం అవుతూ పోయింది. ఇలా ఎన్నో అనుభవాలు.
****
ఓం శ్రీగురుభ్యోనమః
"బ్రహ్మ ముహూర్తం"
అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం.!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయాన ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
బ్రహ్మముహూర్త కాలంలో ఏం చేయాలి:-
ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు, హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం.
ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
🙏శుభం🙏
ద్వాదశాంతము :
"ద్వాదశాంతము" అన్నది నడినెత్తికి పన్నెండు అంగుళముల పైన గల "శూన్య భూమిక". (ఇది కొంత మంది జిజ్ఞాసువులు, సిద్ధ పురుషులు ఇచ్చిన లక్ష్యం) ఈ విధంగా ప్రధాన నిర్వచనం ఉన్నప్పటికీ, ద్రష్టలైన శాస్త్ర కారులు కూడా మరిన్ని భావనలు ప్రకటించారు. నాభినుండి, హృదయం వరకు, హృదయం నుండి కంఠం వరకు, కంఠం నుండి లలాటం వరకు, లలాటం నుండి బ్రహ్మ రంధ్రం వరకు....ద్వాదశాంత స్థానాలు వర్ణించడం జరిగింది. అయితే ఇక్కడ లలాటం నుండి బ్రహ్మ రంధ్రం వరకు గల స్థానాన్నే "ద్వాదశాంతము" గా నిర్ణయించడం కూడా ఉన్నత, ఉత్తమ మనో స్థితికి సూచన. అయితే కొంత మంది జిజ్ఞాసువులైన సాధకులు "బ్రహ్మ రంధ్రము" నుండి పన్నెండు అంగుళాల దూరంలో గల "శూన్య భూమికను" ధారణా ప్రదేశంగా ఎంచుకొని కూడా సాధన చేయమంటున్నారు. అలా చేయడం వలన ఫలితం నిస్సందేహం.
ఇక్కడ శరీరమునకు బయట శ్వాసకు సంబంధించిన "ద్వాదశాంతం" ఒకటి, లోపల మరి కొన్ని ఉన్నాయి కదా! ఇవి కాక షట్చక్ర క్రమంలో, చివరనొక ద్వాదశాంతం ఉన్నది. కనుక శరీర సంబంధమైన ఈ ద్వాదశాంతాలలో గానీ, శరీరం బయట గల ద్వాదశాంతాలలో గానీ "ధారణ" చేయవచ్చు. తద్వారా భైరవత్వం వస్తుంది.
భట్టాచార్య
🙏 శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
🌹🌹🌹🌹🌹🌹
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
రామ రూపాన మనమది లయము నొంద
సకల జగమిక రామమై సాగుచుండు
జగదదీత బ్రహ్మము సర్వమునను
రామ రాజితమౌచును రక్షసేయు
(తోపెల్ల సత్య నారాయణమూర్తి, అమలాపురం) 🙏🙏🙏🙏🙏🙏
-------------------------
స్వామి రామా అనుభవాలు - ఆపన్న హస్తాలు :
హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య, తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది .ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు . ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది ,ఊళ్ళో వాళ్ళు వాళ్ళను చూసి నవ్వుకుంటారు ..తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా .నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది .చీకట్లు అలముకున్నాయి .ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు .చేతిలో బాటరీ లైట్ కూడా లేదు .కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది .. నిలువైన కొండ అంచు నుంచి జారిపోయాడు .ఇంతలో పొడవుగా తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డం తో ఉన్న ఒక ముసలాయనఆపన్న హస్తాలు అందించి పైకి లాగి బయటకు చేర్చికాలిబాట పట్టించి రామా తో ”ఇది దివ్య ధామం .రక్షిత ప్రదేశం .నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని ”చెప్పి పది నిమిషాలలో బయట దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకు వెళ్ళాడు ఇద్దరూకలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు .స్వామి రామా ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు ..ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు .ఇంతలో గుడిసె లో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి ,తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు .వెచ్చదనం కోసం లోపల మంట మండుతోంది .
రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు .సాధువు కన్నీరు కారుస్తూ ”నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా ?ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశం లోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను .నీకు కనిపించిన మహానుభావుడే నన్నూ ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు .మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు .ఆయనను నేను ”సిద్ధ బాబా ”అని పిలుస్తాను .నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి ”అన్నాడు గద్గద స్వరం తో .
మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు .తాను జారిన ప్రదేశం దగ్గర వెతికాడు .తాను జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు.ముసలాయన పద చిహ్నాలు లేవు . .ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా . తాను బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు ..దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు .అక్కడి వారందరికీ తమకుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ ప్రమాదాలనుంచి కాపాడే వాడు ఆ సిద్ధ బాబాయే అనే నమ్మకం లో ఉన్నారని తెలుసుకొన్నాడు .
ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరం లో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు .అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు .గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది .ఆయన సిద్ధిపొందాక ఆ ప్రదేశం లో ఆరు అడుగుల చతురం లో గుడికట్టారని ,లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని ,అప్పటినుంచి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించిసిద్ధబాబా ను స్మరించి వెడతారని ,ఆసిద్ధ బాబాయే తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు .ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ,ధ్యానాలు చేశాడు . స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోందికనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు ..కూలీలు వచ్చి గుడి ని పడ గొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు …అడుగు లోతు నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి .తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ లోపలి తవ్వారు .లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగి0దేకాని తగ్గలేదట.దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయం లో దీపం వెలిగించి,మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట .ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు ,దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది .కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు ..ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతం గా ఉన్నాయని గ్రహించి త్రవ్వకం ఆపేశారు .
పోనీ శివలింగాన్ని త్రవ్వి పీకి పారేద్దామని ప్రయత్నం చేశారట .8 అడుగులు తవ్వారు .”అంబ” పలక లేదు యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియ లేదట . కనుక పీకలేక తోక ఝాడించేశారు .ఒక రోజు రాత్రి ఇంజనీర్ కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి ”ఈ శివ లింగం అత్యంత మహిమాన్వితమైనది .దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు .ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు ”అని చెప్పాడట .అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా రిపేర్ చేసి లెంపలు వాయించుకొన్నారట .అందమైన ప్రకృతి మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిత,మహిమాన్విత శివాలయం అది దానికే తారకేశ్వరాలయమనీ పేరుంది
ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం .దీన్ని శివ సిద్ధ క్షేత్రమనీ పేరుకూడా ఉంది .తరువాతకాలం లో తాండ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు.
--(())--
అనంతావై వేదాః
''అనన్తావై వేదాః'' (వేదాలు అనంతం) - కాని ఆ అనంతమైన వేదాల నుండి కొన్ని మంత్రాలనే ఋషులు గ్రహించ గలిగారు. ఇహపర సౌఖ్యానికీ, ముక్తికీ, లోకకళ్యాణానికీ ఇవి చాలు. వేదాలు నాలుగంటూ మనమనుకొన్నా ఈ నాలుగింటికే భిన్నమైన పాఠాలూ, భిన్నరీతులలో పఠించే పద్ధతులూ ఉన్నాయి. వీటిని పాఠాంతరాలంటారు.
ఒక్కొక్క పఠనాపద్ధతినీ, పరిష్కృతపాఠాన్ని ''శాఖ'' అంటారు. వేదమనే వృక్షానికి శాఖలన్నమాట యివి. వేదం శాఖక్షపశాఖలు గల మహా వట వృక్షం వంటిది. అసంఖ్యాకమైన శాఖలున్నా వాటిలో కొన్నింటిని మాత్రం కలిపి నాలుగు శాఖలుగా వర్గీకరించారు. ఇవి ఋక్, యజుః, సామ, అధర్వ - వీటినే ఋగ్వేదము, యజుర్వేదమూ ఇత్యాది అంటారు. ఇవి ఆయా సమూహాల ప్రాముఖ్యతను సూచిస్తాయి.
ఆధునిక పరిశోధకుల ఉద్దేశంలో, ఋగ్వేదం, యజుర్వేదం కంటె ప్రాచీనం. కాని మన శాస్త్రాల ప్రకారం, మన విశ్వాసానుసారం, వేటికీ కాలమానంలో ఆది అంటూ ఏమీ లేదు. సృష్ట్యాదికే వేదాలు లభ్యాలు కావటం వల్ల! ''ఈ వేదం ముందు, ఆ వేదం తరువాత'' అంటూ చెప్పే పరిశోధకుల మాటలు విశ్వసనీయాలు కావు -
అట్లాగే, వేదభాగాలైన సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకాలు ఏ క్రమంలో వచ్చాయో చెప్పే ''పరిశోధకులూ'' పొరబడ్డారు. ఋషులు కాలాతీతులై, త్రికాలజ్ఞులైన తరువాతనే వేదాలని గ్రహించి మనకివ్వ గలిగారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టు కొంటే, కాలమానంలో వేదాల గురించీ, వాటి క్రమం గురించీ వేసే అంచనాలు అనుచితమని తెలుస్తుంది. ఆయా ఋషులు అలౌకిక చేతనా స్థితిని బట్టి వారికి కలిగిన వేదమంత్రాల గ్రహింపు మారియుండవచ్చు అంతే. అసలు, ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన ప్రస్తావనలున్నాయి. ఇతర వేదాల ప్రస్తావన గల పురుషసూక్తం, ఋగ్వేదం తొంభైయవ ఋక్ సమూహం పదవమండలులో ఉంది. దీనిబట్టే తెలుస్తుంది, కొన్ని వేదాలు ముందూ, మరి కొన్ని వెనుకా కావని.
ప్రతి శాఖలోనూ మూడు భాగాలుంటాయి. ఇవి సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము. ఇది కూడ ఒక విధమైన వర్గీకరణమే. ''వేద అధ్యయనం'' అని మనమన్నప్పుడు సాధారణంగా సూచింపబడేది ''సంహిత'' భాగ పఠనమే. ''సంహిత'' వేదశాఖకి మూలమూ, జీవమూ అవటమే దీనికి కారణం.
'సంహిత' అంటే సంకలింపబడి, ఒక క్రమంలో ఏర్పచబడినది అని అర్థం. ఏ సంహితైనా, ఆ వేదంయొక్క అంతరార్థాన్ని మంత్రాల ద్వారా తెల్పుతుంది.
ఋగ్వేదము :
ఋగ్వేదసంహిత అంతా పద్యరూపం. వీటిని ప్రథమంలో ఋక్కులనే వారు. తరువాతి కాలంలో శ్లోకమనటం ప్రారంభించారు. వివిధ దేవతలను స్తుతిస్తాయివి. ఒక్కొక్క ఋక్కూ ఒక్కొక్క మంత్రం. కొన్ని ఋక్కుల సమూహాన్ని సూక్తమంటారు.
ఋక్ సంహితలో 10, 170 ఋక్కులున్నాయి. నాలుగు వేదాల సంహితలలోనూ 20,500 మంత్రాలున్నాయి. ఋగ్వేదంలో 1028 సూక్తాలున్నాయి (ఋక్కుల సమూహాలు) వీటిని పది మండలాలూ, ఎనిమిది అష్టకాలుగా వర్గీకరించారు. అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ఆఖరవుతుంది. వేదాలన్నిటిలోనూ ఋగ్వేదంలోనే దేవతాస్తోత్రాలధికంగా ఉంటాయి. ఆరంభంలోనూ (ఉపక్రమంలోను) అంతంలోను (ఉపసంహారంలోను) అగ్ని దేవుని స్తుతి ఉండటం వల్ల ఆ వేదం యొక్క ఉద్దేశం అగ్నిని పూజించటమే అనుకొంటారు కొందరు. కాని 'అగ్ని' అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ మేల్కొనేప్పుడు కలిగే తేజస్సు అని భావించటం మంచిది.
ఋగ్వేదంలోని ఆఖరి సూక్తం అగ్నికి సంబంధించినదే అయినా, అందరి శ్రేయస్సునూ కోరే శ్లోకాలున్నాయి అందులో. ''అందరూ కలిసి ఏకమానసులై ఆలోచింతురు గాక. అందరి హృదయాలూ ప్రేమతో బంధింపబడుగాక. అందరికీ ఒకే లక్ష్యముండుగాక. అందరూ ఏకొన్ముఖులై సంతుష్టులగుదురు గాక'' - ఈ వాక్యాలతో ఋగ్వేదము సమాప్తమవుతుంది.
సకల దేవతాస్తోత్రాలు కలిగి యుండటమే ఋగ్వేదపు విశిష్టత. సామాజిక వర్తనమెట్లా ఉండాలో మిగిలిన వాటన్నిటి కంటె ఉత్తమంగా చెప్తుంది : అందువల్లనే విజ్ఞులు దానిని ఆరాధిస్తారు. ఉదాహరణకి : పెళ్ళికి సంబంధించిన కర్మలు సూర్యుని కుమార్తె యొక్క వివాహముననుసరించి నిర్దేశింపబడ్డాయి. ఊర్వశీపురూరవుల సంభాషణల వంటి విశేష సన్నివేశాలు కూడ ఋగ్వేదంలో ఉన్నాయి. తరువాతి కాలంలో కాళిదాసు వంటి మహాకవులు వీటినే విస్తరించారు.
ఋగ్వేదంలో, ఉషస్సునుద్దేశించిన భాగాలను రసజ్ఞులు మహోన్నతమైన పద్యకావ్యాలుగా శ్లాఘిస్తారు. వేదాలన్నిటిలోనూ అగ్రస్థానం ఋగ్వేదానికి కలగటానికి ఏదో కారణముండి ఉండాలి. ఋగ్వేదంలో ఋక్కులు నాద భరితమయిన సామవేద మంత్రములకు మాతృకలవంటివి. ''ఋచ్యధ్యూఢం సామ''
యజుర్వేదం :
''యజుస్'' అన్న పదం ''యజ్'' అన్నధాతువు నుంచి వచ్చింది. ''యజ్'' అంటే పూజించుట లేక ఆరాధించుట. 'యజ్ఞ' మనే పదం కూడ ఈ ధాతువు నుంచే వచ్చింది.
''ఋక్'' అంటే స్తోత్ర మయినట్లుగానే, ''యజుస్'' అన్న పదం యజ్ఞానికి కావలసిన కర్మకాండని సూచిస్తుంది. ఋగ్వేదంలో స్తోత్ర రూపంలో ఉన్న మంత్రాలకి, యజ్ఞం చేయటానికి వీలయిన రూపాన్ని యజుర్వేదం కల్పిస్తుంది. అంతేకాక, రకరకాల యజ్ఞాలని కొనసాగించే పద్ధతులని కూడ వచన రూపంలో యజుర్వేదం సూచిస్తుంది.
స్తోత్రంతో ఆరాధించటం నేర్పుతుంది ఋగ్వేదం. ఈ మంత్రాలనే, ఈ స్తోత్రాలనే యజ్ఞం చేయటానికి ఎట్లా ఉపయోగించుకోవాలో యజుర్వేదం నేర్పుతుంది.
మిగిలిన వేదాలకు వలెనే, యజుర్వేదానికి కూడా ఎన్నో శాఖలున్నాయి కాని వీటిలో ముఖ్యమైనవి రెండే. వీటికి ఎన్నో పాఠాంతరాలున్నాయి.
ఈ రెండు శాఖలను - శుక్లయజుర్వేదము, కృష్ణయజుర్వేదము అంటారు. 'శుక్ల' అంటే తెల్లని, 'కృష్ణ' అంటే నల్లని, శుక్ల యజుర్వేద సంహితని ''వాజసనేయ సంహిత'' అంటారు. 'వాజసని' అంటే సూర్యుడు. సూర్య భగవానుని వద్ద నేర్చుకొని యాజ్ఞవల్క్యముని లోకానికి ఈ సంహితను ఎరుక పరచాడంటారు. అందువల్లనే దీనిని 'వాజసనేయ సంహిత' అంటారు.
సూర్యుని వద్ద యాజ్ఞవల్క్యుడు వాజసనేయ సంహితను నేర్చుకోవటం గురించి ఒక కథ ఉంది. వ్యాసుడు వేదాలనన్నిటినీ నాలుగుగా విభజించినప్పుడు యజుర్వేదానికి ఒక శాఖేఉండేది. దీనిని వ్యాసమహర్షి వైశంపాయనునకు భద్రపరచమనీ, తన శిష్యుల ద్వారా ప్రచారం చేయమనీ యిచ్చాడట. యాజ్ఞవల్క్యుడు వైశంపాయనుని వద్ద దీనిని అధ్యయనం చేశాడు. గురుశిష్యుల నడుమ ఒక భేదాభిప్రాయం రావటంతో, వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుని తాను నేర్పిన సంహితను తిరిగి యిచ్చేయమని కోరాడు. ఇది న్యాయమేనని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ఆ విధంగా చేశాడు. ఆ తరువాత సూర్య భగవానుడిని తనను శిష్యునిగా స్వీకరింపుమని కోరాడు. సూర్య భగవానుడు అంగీకరించి, యజుర్వేదమనీ పేరు వచ్చింది. దీనికీ పేరు రావటం వల్ల, అంతకు పూర్వం వైశంపాయనుడు నేర్పిన దానిని కృష్ణయజుర్వేదమన్నారు.
కృష్ణ యజుర్వేదములో సంహిత బ్రాహ్మణ భాగాలు స్పష్టముగా విభజింప బడిలేవు.
యజుర్వేదం యొక్క ఘనత అంతా వైదిక కర్మలను, కర్మకాండను విశదీకరించటంలోనే ఉన్నది. దర్శపూర్ణమాసం, సోమయాగం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం - వంటి యాగాల నిర్వహణాక్రమాన్ని వివరంగా కృష్ణయజుర్వేదంలోని తైత్తిరీయ సంహిత తెల్పుతుంది. అంతేకాక, ఋగ్వేదంలో కానరాని కొన్ని స్తోత్రాలు కూడ యజుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న శ్రీ రుద్రం యజుర్వేదం లోనిది. ఋగ్వేదంలో అయిదు సూక్తాలు ''పంచరుద్రం''గా ఉన్నాయి, నిజమే. కాని యజుర్వేదంలో ఉన్న దానినే శ్రీ రుద్రమంటారు. అందువల్లనే అప్పయ్య దీక్షితులవారు అనబడే శివభక్తుడు, తాను యజుర్వేదంలో జన్మించి యుంటే పరమ శివుడ్ని యజుర్వేదం ద్వారానే ఆరాధించగలిగే వాణ్ణి కదా అని వాపోయారు. ఆయన సామవేదాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం అత్యధికులు యజుర్వేదాన్నే అనుసరిస్తున్నారు. ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేదాన్ని ఎక్కువగా ఉన్నది. దక్షిణ భారతంలో కృష్ణ యజుర్వేదాన్ని, ఋగ్వేదంలోని పురుషసూక్తం కొద్ది మార్పులతో యజుర్వేదంలో కూడ ఉంటుంది. కాని ''పురుషసూక్త'' మన్నప్పుడు యజుర్వేదంలోని పురుషసూక్తమనే అర్థం చేసుకోవాలి.
అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదం అత్యంత ప్రధానం. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్ర ముండాలి - దానికొక భాష్యముండాలి - దానికొక వార్తికముండాలి (అంటే విపులమైన వ్యాఖ్యానం)
సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం. ఆ సూత్రానికి వివరణ ఇచ్చేది భాష్యం. భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానమిచ్చేది వార్తికం. అద్వైత సిద్ధాంతంలో వార్తిక కర్త (అంటే, వార్తికం వ్రాసినవాడు) ఆది శంకరుల శిష్యుడు సురేశ్వరులే - ఈ పదం ఇంకెవ్వరికీ వర్తించదు. ఆయన ఏ భాష్యానికి వార్తికం వ్రాశాడు? ఉపనిషత్తులని సూత్రాలన్నామంటే ఆదిశంకరులు వాటికి భాష్యం వ్రాశారు. ఆయన వేదవ్యాసులు (బాదరాయణుడు) రచించిన బ్రహ్మ సూత్రాలకి కూడ భాష్యం వ్రాశారు.
ఆచార్యుల వారి ప్రత్యక్ష శిష్యులు సురేశ్వరులు. ఉపనిషత్ భాష్యంపై వార్తికం రచించారు. ఆయన తన వ్యాఖ్యానాన్ని ప్రధానమైన పది ఉపనిషత్తులమీదా కాక రెండింటిమీదే వ్రాశారు. అవి తైత్తిరీయ, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఈ రెండూ క్రమంగా కృష్ణయజుర్వేదానికీ శుక్లయజుర్వేదానికీ సంబంధించినవి. రెండూ యజుర్వేదానికీ సంబంధించినవి కావున అద్వైత సిద్ధాంతావలంబులకు యజుర్వేదమెంతో ముఖ్యం.
సామవేదం :
''సామ'' అంటే మనస్సుకి శాంతినివ్వటం. అంటే, శాంతంతో మనస్సు సౌఖ్యం పొందేట్టు చేయటం. శత్రువుని జయించటానికి ఉపయోగించే ఉపాయాలు నాలుగు విధాలు. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. వీటిలో మొదటిది ''సామ'', శత్రువుని ప్రేమతో, అనునయంతో లొంగదీసుకోవటం. ఋగ్వేదంలోని ఋక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడింది. ఋగ్వేద మంత్రాలను ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కాని సామవేదంలో దీర్ఘ స్వరాలతో గానం చేస్తారు భారతీయ సంగీత సంప్రదాయంలోని సప్తస్వరాలకి ఆధారమూ, మూలమూ సామగానమే అనవచ్చు. సామగానం వల్ల (అంటే సామవేదంలో నిర్దేశింప బడినట్లు) స్తోత్రాలను గానం చేయటం వల్ల సకల దేవతలనూ తృప్తి పరచవచ్చు. యజ్ఞాలను నిర్వహించేటప్పుడు మనం సమర్పించే ఉపహారాలతోనే కాక, ఉద్గాత అనబడే ఋత్విక్కు చేత చేయబడే సామగానం చేతకూడ దేవతలు మనలను అనుగ్రహిస్తారు.
ప్రధానంగా, ఋగ్వేదంలోని మంత్రాలే అయినా ఆధ్యాత్మిక ఉన్నతికీ, దేవతల అనుగ్రహానికి పాత్రులవటానికీ ఎంతో అనుకూంలగా స్వరపరుప బడ్డాయవి. సామవేదం యొక్క ప్రత్యేకత యిదే. అందువల్లనే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ''వేదాలలో సామవేదం నేను'' అంటాడు. లలితాసహస్రనామసోత్రంలో లలితా దేవికి గల నామాలలో ''సామగాన ప్రియ'' అన్న దొకటి. అంటే, సామవేదాన్ని గానం చేస్తే ప్రసన్నమవుతుందని భావం.
అధర్వవేదం :
''అధర్వణుడు'' అంటే పురోహితుడు, ఆచార్యుడు. 'అధర్వణుడు' అనే పేరుతో ఒక ఋషి ఉండేవాడు. అధర్వవేదంలోని మంత్రాలు ఆ ఋషి వల్లనే లోకానికి తెలిసినవి. కష్టాలని పారద్రోలటానికీ, ఈ వేదంలో శత్రువులని సంహరించటానికీ ఉపయోగపడే మంత్రాలెన్నో ఉన్నాయి. అవి వచన రూపంలోనూ, పద్యరూపంలోనూ ఉన్నాయి. ఇతర వేదాలలో పేర్కొనబడని దేవతలకి సంబంధించిన మంత్రాలు అధర్వవేదంలో ఉంటాయి.
అధర్వవేదంలో సృష్టికి సంబంధించిన మంత్రాలు కూడ చాలా ఉన్నాయి. సృష్టి ఎంత అద్భుతమైనదో వర్ణించే గీతం ''పృథ్వీ సూక్తం''. ఇది అధర్వవేదంలోనిది.
యజ్ఞాల నిర్వహణను పర్యవేక్షించే బ్రహ్మ అధర్వవేదానికి ప్రతినిధి. ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు ఈ వేదంలోనివి.
సత్యాన్వేషకుడైన ముముక్షువునకు మాండూక్యోపనిషత్తు మోక్షాన్ని స్తుందన్న నానుడి ఒకటుంది. దీనిబట్టి ఈ వేదం యొక్క ప్రాముఖ్యం గ్రహించవచ్చు.
సర్వశ్రేష్ఠమైన గాయత్రి మంత్రం ఋక్, యజః, సామవేదాల సారమంటారు. అంటే, అధర్వ వేదానికి వేరే మంత్ర ముందన్న మాట - అందువల్ల, అధర్వ వేదాన్ని అధ్యయనం చేసేముందు వేరొక ఉపనయనం చేసుకొని బ్రహ్మోపదేశం పొందుతారు.
ఉపనయనంలో బాలురకు ఉపదేశింపబడే గాయత్రిని ''త్రిపదాగాయత్రి'' అంటారు. అంటే, ''మూడు పాదాలు కలది'' అని అర్థం. ఒక్కొక్క పాదమూ ఒక్కొక్క వేదసారం. కాని అధర్వవేదానికి వేరే గాయత్రి ఉంది. అందువల్లే అధర్వవేదాన్ని పఠించే ముందు, అధర్వ గాయత్రి ఉపదేశం పొందాలి. ఋక్, యజుః, సామవేదాలకు ఒకే గాయత్రి ఉండటం వల్ల ఆ మూడింటిలో ఒక వేదాన్ని అధ్యయనం చేసినవాడు మిగిలిన రెండింటినీ అధ్యయనం చేయాలంటే మళ్లీ ఉపనయనం చేసికొనక్కర్లేదు.
ఒకప్పుడు అధర్వవేదం ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఆ వేదశాఖలని ఎరిగిన వారు మాత్రమిప్పుడు బహుకొద్ది మందే ఉన్నారు. దక్షిణ భారతంలో అసలు లేనే లేరు. ఆ కారణం వల్ల ఈ వేదశాఖ పారాయణం చాలా దయనీయమైన స్థితిలో ఉన్నదిప్పుడు. ఒరిస్సా బ్రాహ్మణులలో పద్దెనిమిది శాఖలున్నాయి. అందులో ఒకటి ''అధర్వనిక'' అంటే, అధర్వ వేదానికి చెందిన వారని అర్థం. ఇప్పటికీ ఆధర్వ వేదాన్ని అనుసరించే వారు కొద్దిగా గుజరాత్, సౌరాష్ట్ర, నేపాలులో ఉన్నారు.
నియమాలను పాటించటంలోనూ, పఠనాపద్ధతిలోనూ నాలుగు వేదాలూ పైకి వేరువేరుగా కనబడినా అన్నిటికీ ఒకే లక్ష్యం : అది విశ్వశ్రేయస్సు, ప్రతి యొక్కరి ఆధ్యాత్మిక ప్రగతీను.
''ఇదే మార్గం'' ''ఇదే దైవం'' అంటూ ఏ వేదమూ పేర్కొనదు - ఇదే వేదాల ప్రత్యేకత. ఏ మార్గాన్ని విశ్వాసంతో, చిత్తశుద్ధితో అవలంబించినా ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించినా ఒకే గమ్యాన్ని చేరుస్తాయంటాయి వేదాలు. పైగా, విభిన్న మార్గాలను అనుసరించవచ్చంటూ ప్రపంచంలో మరే యితర పవిత్ర గ్రంథమూ సూచించదు. ప్రతి మతమూ తన మార్గమే కైవల్యాన్నిస్తుందంటుంది. సత్యాన్వేషణకి ఏ మార్గానన్నా అనుసరించవచ్చన్న విశాల దృక్పథం వేదాలకే ఉన్నది. వేదాల గొప్ప తనమంతా యిదే.
బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు :
వేదాల గురించి ముచ్చటించేప్పుడు మన మింత వరకూ 'సంహిత''ల గురించే చెప్పుకొన్నాం. వేదంలో ముఖ్యమయిన భాగం ''సంహిత'' విభాగమే. అదికాక, ప్రతి వేదానికి బ్రాహ్మణ, ఆరణ్యక భాగాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు వైదిక కర్మలను, వాటిని ఆచరించవలసిన పద్ధతులను చెప్పుతాయి.
సంహితలోని మంత్రాలను యజ్ఞంలో ఉపయోగించటానికి బ్రాహ్మణాలు మార్గ దర్శకపు సూచనలనిస్తాయి. అంటే, ప్రతి మాటకూ అర్థం చెప్పి మంత్రాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ఉపకరిస్తాయి.
'ఆరణ్యక' అన్న పదం 'అరణ్య'మన్న మాటనుండి వచ్చింది. సంహిత విభాగంగాని, బ్రాహ్మణ విభాగంగాని పట్టణాన్ని విడిచి అడవులలో వ్యక్తి ఏకాంతాన్ని వెతుక్కోవాలని ఎక్కడా చెప్పవు. యజ్ఞాలూ ఇతర క్రతువులూ గృహస్థుల కోసం నిర్దేశింపబడినవే. కాని వైదిక కర్మలు కేవలం భౌతికమైన సంపదనే కాక, దీక్షాదుల వల్ల చిత్తశుద్ధి కూడ కలిగించటానికి ఉద్దేశింపబడ్డాయి. ఈ చిత్తశుద్ధి కలిగిన తరువాత ఏకాగ్రతకీ, ధ్యానానికీ దోహదకారి యైన ఏకాంతాన్ని అరణ్యాలలో కల్పించుకోవాలి. వేదపారాయణమూ, యజ్ఞ నిర్వహణమూ, నియమపాలనమూ ఇవన్నీ నిజతత్త్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన ధ్యానానికి సమాయత్త పరచే ప్రాథమిక దశలు.
సంహితలోని మంత్రాలకీ, బ్రాహ్మణాలలోని కర్మలకీ వెనుక గల అంతరార్థాన్ని, సిద్ధాంతాన్నీ వివరించటమే ఆరణ్యకాల ఉద్దేశ్యం. వేదాలలో నిక్షిప్తమైన నిగూఢ భావాలను విశద పరచటమే ఆరణ్యకాల ప్రయోజనం. ఆరణ్యకాల ప్రకారం - యజ్ఞ నిర్వహణకంటే యజ్ఞాలు ఎందుకు జరపాలో తెలుసుకోవటం ముఖ్యం. అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేసుకొనే ఋషుల కృషియే ఆరణ్యకాలని ఆధునిక పరిశోధకులంటారు
. ఆరణ్యకానికీ, ఉపనిషత్తుకీ సమ్మేళనమైన బృహదారణ్యకోపనిషత్తు అశ్వమేధ యజ్ఞాన్ని గురించిన విశ్లేషణతో ప్రారంభిస్తుంది!
అగ్ని హోత్రం :
ప్రకృతి మూలకములైన పంచ మహా భూతములలో అగ్ని ఒకటి . మిగిలినవి ఆకాశం, వాయువు, జలం, భూమి, ఈ పంచ భూతములే సర్వ సృష్టికి, త్రిగుణాలకు మూలాధారం అగ్నితో చేయబడు యజ్ఞం ను అగ్నిహోత్రం అని, దేవ యజ్ఞం అని, హోమం అని పిలుస్తారు.
పంచ భూతములలో అగ్నికి ఒక విశిష్ట స్థానం ఉంది. అది నిరాకారమైనది. అయినను జ్వాలారూపమున ఊర్థ్వదిశన పయనించునది. సమస్తం తనలో లయం కావించునది. భస్మమే శేషంగా గలది. వేదములలో యజ్ఞ పురుషునిగా అగ్నేయ దిక్కుగా స్వాహా దేవి పత్నిగా. వాహనం పొట్టేలుగా, న్యాయస్థానం తేజోవతిగా వర్ణింపబడింది. దేవతల దూతగా, యజ్ఞ భాగమును దేవతలకు గొనిపోవునదిగా, చైతన్య శక్తిగా ఉండి ప్రకృతి సమతూల్యతకు కారకురాలుగా ఉంది.
అగ్ని హోత్రం ఆచరించడం వలన మనస్సు పవిత్రమై సజ్జనులుగా ప్రవర్తిస్తారు. ప్రకృతిలోని పంచతత్వాలపై మానవ జీవితం ఆధారపడి ఉంది. యజ్ఞం ఆచరించడం వలన ప్రకృతి చాలనంలో సంతులనం ఏర్పడుతుంది. దీనివలన జీవితం సుఖమయం అవుతుంది. ప్రకృతి మనకు సమృద్ధిగా ప్రసాదించినది ( జీవనానికి) కాబట్టి. యజ్ఞం వలన ప్రకృతి పట్ల ప్రకృతి చేసినట్లు అవుతుంది. యజ్ఞం ఆచరించని వారు స్వార్థచింతన కలిగి ఉంటాడు. తన విద్యక్త దర్మమును మరచినవాడు ఆవుతాడు. యజ్ఞం ఆచరించిన తర్వాత శేష ( మిగిలిన) ఆహారాన్ని భుజించు వారు సుఖాన్ని పొందుతారు. భుజించు ఆహారాన్ని అగ్నికి మొదట సమర్పించటం వలన రోగ కారక జీవులు నశించి నిరోగులు అవుతారు. అగ్నిహోత్రం ఒక సులభమైన అందరిచేత అవశ్యకర్తవ్యంగా తప్పక ఆచరించతగిన ప్రక్రియ. దీని వలన అభ్యుదయం, మానసిక శాంతి లభిస్తుంది. అగ్ని హోత్రం ఆచరించేటప్పుడు మనం, ఇదం నమమ అంటాం!! అంటే నా దేమీ లేదు ( అంతా నీదే) అనే భావంతో ఉచ్చారణ చేస్తూ తద్వారా సంపూర్ణ శరణాగతి పొందుట అభ్యసిస్తాం. హే జగదీశ్వరీ!! ఈ చరాచర జగత్తుపై నీ శాసనమే చెల్లుతుంది!! నేను నిమ్మిత మాత్రుడనే, అజ్ఞానం చేత అహంబావనని కలిగి ఉన్నాను. నిజానికి అంతా నీదే. నా జీవితాన్ని, నన్ను, నేను నీ ఇచ్చాశక్తికి ఆహుతిగా సమర్పిస్తున్నాను. నేను అనే శరణాగతి భావన మనసా వాచా కర్మణా ఈ దేవ యజ్ఞం వలన ఉపాసకుడు పెంపోందించుకుంటాడు. ఇదే ముఖ్య విషయం. ఈ శరణాగతి భావననే అన్ని మతాలు, ప్రవక్తలు, ఆవతార పురుషులు , మతాలు తెలుపుతున్నాయి. అందువలన ఈ అగ్నిహోత్రం ఒక నిత్య కృత్యంగా, మానవుని విద్యుక్త దర్మంగా తెలుపబడింది!!
అగ్నిహోత్రం ఉదయం, సాయంత్రం సంద్యాసమయములలోనే ఆచరించాలి. సంద్యాసమయంలో ప్రకృతిలో, ప్రకృతిలోని భాగమైన చరాచర జగత్తుపై, వాతావరణంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. సంద్యవేళ - ఒక తీర్థ స్నానం వంటిది. సంద్యాసమయంలో ప్రాణి శ్వాస ప్రక్రియ, నాడీ మార్పు చెందుతుంది!! ఆరోగ్య ప్రదాయకమైన ఈ సమయంలో సుషుమ్న నాడి పనిచేస్తుంది. సుషుమ్న నాడి పని చేసే ఈ కొద్ది పాటి సమయంలో మనసు శరీరం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండి సంతులనం లో ఉంటాయి. ఈ సమయంలో అగ్ని హోత్రం ఆచరిస్తే సత్పలితం కలుగుతుంది. పూర్వకాలం మన ఋషులు అగ్నిహోత్రంను, ధ్యానాన్ని, ప్రాణాయామాన్ని ఒక నిత్య కృత్యంగా జరుపుటకు కారణం ఇదే....
అగ్ని హోత్రం నుంచి వెలువడే దూమం జౌషద గుణములు కలిగి ఉంటాయి. దూమం వాతావరణం లో కలవడం ద్వారా అక్కడ కలిగిన రకరకాల రసాయన ప్రక్రియ ద్వారా వర్షాలు పుష్కలంగా పడి వ్యవసాయానికి దొహదం చేస్తాయి. ఈ వాతావరణ మార్పులు, భూమిపై, ప్రజల మనుగడపై వాటి ప్రభావం శాస్త్రీయయంగా కూడా నిరూపించ బడినాయి!! ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక ఉపయోగాలు ఉన్న కారణంగా అగ్ని హోత్రం సనాతన ఋషులు ఆచరించే పంచసాధన మార్గంలో ఒకటిగా గుర్తింపబడింది.
🌻. భాగవతము 🌻
మహా కాల పురుష మహా యంత్రం అను జాతక చక్ర గనణ/ జాతక చక్ర గణక చక్రము. అవి నేను 8,9 తరగతులు చదువుచున్న రోజులు.6,7 తరగతులు చదివేటప్పుడు చిత్రలేఖన పరీక్షలో ఏదో కొద్దిగ మార్కులు అందరికన్నా ఎక్కువ తెచ్చుకున్నాను.అప్పుడు ఒకానొక పుస్తకములొ చూచిన ఈ మహాయంత్రరాజము ను ఇంటికి వచ్చాక వేసుకొన్నాను.అప్పట్లొ గ్రంధాలయములే మాకు శరణ్యం. ఏపుస్తకాలు ఎక్కడ దొరుకుతాయొ తెలియదు.పెద్దవాళ్ళను అడిగే ధైర్యం ఉండేది కాదు.వరుసగా వారం రోజులపాటు ఆపుస్తకాన్ని తీసుకొని దానిని చూచి ఆనందించేవాడ్ని.అక్కడెకూర్చుని బొమ్మ వేస్తే ఎవరైనా నవ్వుతారేమొ అని భయం.15 రొజులు ఎన్నో కాగితాలు పాడుచేసి చివరకు అనుకొన్న విధంగా ఆయంత్రం వేసుకొన్నాను.ఈ యంత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా ? దీన్ని చూస్తు ఎవరి దైనా జాతక చక్రమును అతి సుళువుగా వ్రాయగలగటం.అలాగా జాతక శాస్త్రం తెలిసినవారు దీనిని పరిశీలించి ఆ సమయంలొ ఏదేశమునందు ఏంజరుగుతున్నదీ గణించి చెప్పగలగటం.అంతేకాదు ఎవరి గురించైనా వారు ఆసమయంలొ ఏరంగు దుస్తులు ధరించారు,దేనికొరకు బాధ పడుచున్నారు,ఏ జబ్బుతోబాధపడుచున్నారు,తనను కలవటానికి ఎవరువస్తారు? వారి పేరు ఏఅక్షరంతొ మొదలవుతుంది వారు దేనిగురించి తనతొ మాట్లాడనుకొంటున్నారు మొదలగునవి చెప్పగలగటం.
ఇందులొ సమయమును 0 డిగ్రీ ల నుండీ 360 డిగ్రీలు గా భాగించి,నక్షత్ర జననము,నక్షత్ర పాదము ,రాశి ,లగ్నము మొద
[09:40, 08/05/2020] +91 90009 72611: లగునవి తెలుపబడుచున్నాయి.దీనిని నేను 78-80,:-90-92,2017 ఏప్రిల్ 6 వ తారీఖున వేయడమైనది.
[09:43, 08/05/2020] +91 90009 72611: దీనిని కేవలము మన ముందు తరాలవారు జాతక చక్రం ఎలా వేసేవారు అనే ఒక అవగాహన కొరకు మాత్రమే షేర్ చేయబడినది.
🕉🌞🌎🌙🌟🚩
జ్ఞాన ప్రసూనాంబిక శివ జ్ఞానమును మననం చేసుకుంటూ ఉంటుంది. అది లోకంలో సద్గురు ప్రవచనం గా ప్రకటనమౌతూ ఉంటుంది. అంతేగాని గురువుకు లోకానికి బోధించాలనే సంకల్పం ఏమి ఉండదు.
భూమిలో ఉండే ఖనిజాలకు ఇచ్చినంత విలువ, మనం 'భూమి'కి ఇవ్వడంలేదు.
మహనీయులకు ఇ
చ్చినంత విలువ, మనం 'బ్రహ్మ పదార్థాని'కి ఇవ్వడం లేదు.
పుట్టినప్పుడు పేరు ఉండదు., ఊపిరి తప్ప.
పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.
***
హాలో ఎర్త్ - అగార్తా - హిందూ పురాణేతిహాసాల సమన్వయం - వైజ్ఞానిక విశ్లేషణ :
భూ ఉపరితలం క్రింద, ఏదైనా నాగరికత ఉందా? లేక కేవలం ఘన పదార్ధంగానే భూమి ఉందా? నికెల్, ఇనుము, తదితర లోహాలు, మట్టి, రాళ్ళు రప్పలతోనే భూమి యొక్క ఉపరి భాగం తర్వాత పొరలు ఉన్నాయా? లేక ఏవైనా భూగర్భ నాగరికతలు ఉన్నాయా? ఈ ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే భూమి గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసుకోవలసినది చాలా ఉంది.
ఈ నేపథ్యంలో "హాలో ఎర్త్" (Hollow Earth) సిద్ధాంతం ప్రకారం....భూమి క్రింద గల"అగార్తా" (Aghartha), .....గూర్చి తెలుసుకోవడం, కొంతైనా జిజ్ఞాసా పూర్వకంగా ఉంటుంది!
అయితే "అగార్తా" .....హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా? పరిశీలిద్దాం.
"అగార్తా" ఒక ప్రాచీన, మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలా సార్లు ఈ "అగార్తా"...."శంబల" నగరానికి సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. శంబల ప్రస్తావన, విష్ణు పురాణం నందు మనం కాంచవచ్చును.
శంబల- కల్కి భగవానుడు-కలి యుగాంతం-పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞాన తత్వాలు-వీటిలో కలి యుగాంత ప్రస్తావన....అలాగే భవిష్య పురాణంలో కూడా కలియుగాంత ప్రస్తావన....ఇదంతా....చదువరులందరికీ తెలిసిన విషయమే.
ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో....కొంత మందికైనా "శంబల" గూర్చి తెలుసు. (గతంలో నేనే శంబల గూర్చి కొన్ని వ్యాసాలు ఇచ్చాను. ఆసక్తి కలవారు చదువగలరు.)
మానవ పరిణామ క్రమంలో...మన కంటే ముందున్న బుద్ధి జీవుల నివాసమే "శంబల". శంబల వాసులు, తపస్వులు. నిరంతరం ఊర్థ్వ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటారు. శంబల వాసులు ....నిరంతరం ఉన్నత తలాలతో (డైమన్షన్స్) సంబంధం కలిగి ఉంటారు. శంబలను జంగమ దేవరల నివాస స్థలంగాను, విస్మృత దైవీక రాజ్యం గానూ, శ్వేత-జలాల భూమి గానూ, జీవించే అగ్ని గల భూమి గానూ కూడా "శంబలను" గుర్తిస్తారు.
ఇక "అగార్తా" విషయానికొద్దాం. చాలామంది పరిశోధకుల ప్రకారం "అగార్తా" అన్న భూగర్భ నగరానికి వెళ్ళడానికి కొన్ని దారులున్నాయి. Kentucky Mammoth Cave - USA, బెర్ముడా ట్రయాంగిల్, భారత్-టిబెట్ సరిహద్దు హిమాలయాలు, భూమి యొక్క ధృవ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు....వీటి ద్వారా "అగార్తా"కు వెళ్ళే మార్గాలున్నాయని చెబుతున్నారు. అయితే భారత-టిబెట్ దేశాలలో మాత్రం ....ఆయా మార్మిక దారులన్నీ, శక్తివంతులైన హిందూ-బౌద్ధ యోగులచే కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతున్నాయి.
ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయంటే, లక్షల సంవత్సరాల క్రిందట, అనేక కారణాల వలన, బుద్ధి జీవులైన కొందరు ప్రజలు భూగర్భంలో గల నగరానికి వలస వెళిపోయారు. వారు తమ స్వంతదైన అనుకూల పరిస్థితులతోనూ, పర్యావరణ అనుకూల పరిస్థితులతోనూ, తమకు గల మార్మిక, ఆధ్యాత్మిక అవగాహనతోనూ....తమ నివాసం అయిన "అగార్తా" నగరాన్ని నిర్మించుకున్నారు.
ఇక "హాలో ఎర్త్" సిద్ధాంత నిరూపణలకొస్తే, గత మూడు, నాలుగు శతాబ్దాలుగా భూమి లోపలి నాగరికతలను పరిశోధించే పరిశోధనలు ఎక్కువయ్యాయి. భూమి కేవలం మట్టి, రాతి ముద్ద కాదు. శాస్త్ర వేత్తల ప్రకారం,వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు. కానీ "పాతాళావరణం " (hollow sphere) చుట్టూ దట్టమైన భూ ద్రవ్యరాశి (భూమి-భూ స్వరూపాలు) కలదు. ఉత్తర దక్షిణ ధృవాలలో తెరుచుకొనేటట్లుగానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒక సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడని కూడా సిద్ధాంతాలు చెబుతున్నాయి. "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం భూద్రవ్యరాశి వలయం సుమారు 600 నుండి 800 మైళ్ళ వ్యాసం తోనూ, ధృవాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసం తోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం చెబుతోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళతోనూ , ఈ పాతాళం విస్తరించి ఉందట.
విచిత్రమైన విషయమేమిటంటే, భూమి-నీరు ఆవరించిన నిష్పత్తి పరిశీలిస్తే, భూమి ఉపరి భాగానికి, భూమి అంతర్భాగానికి (హాలో ఎర్త్) , పరస్పర విరుద్ధం గోచరిస్తోంది. భూమి పై భూభాగం,జల భాగముల నిష్పత్తి 1 : 4 అయితే, ఈ inner crust లో వీటి నిష్పత్తి 4 : 1 గా ఉంది. ఈ వైరుధ్యానికి కారణం భూమి పై భాగంలో ప్రవహించే జల స్వరూపాలైన సముద్రాలు,నదులు,సరస్సుల....వలన ఆ నిష్పత్తి 1 : 4 గా ఉంటే, ఆ జల స్వరూపాలు, వాటి క్రింద గల భూభాగంపైననే ఆధారపడి ఉన్నాయి కదా!
భూ ఉపరితలం క్రింద, ఏదైనా నాగరికత ఉందా? లేక కేవలం ఘన పదార్ధంగానే భూమి ఉందా? నికెల్, ఇనుము, తదితర లోహాలు, మట్టి, రాళ్ళు రప్పలతోనే భూమి యొక్క ఉపరి భాగం తర్వాత పొరలు ఉన్నాయా? లేక ఏవైనా భూగర్భ నాగరికతలు ఉన్నాయా? ఈ ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే భూమి గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసుకోవలసినది చాలా ఉంది.
ఈ నేపథ్యంలో "హాలో ఎర్త్" (Hollow Earth) సిద్ధాంతం ప్రకారం....భూమి క్రింద గల"అగార్తా" (Aghartha), .....గూర్చి తెలుసుకోవడం, కొంతైనా జిజ్ఞాసా పూర్వకంగా ఉంటుంది!
అయితే "అగార్తా" .....హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా? పరిశీలిద్దాం.
"అగార్తా" ఒక ప్రాచీన, మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలా సార్లు ఈ "అగార్తా"...."శంబల" నగరానికి సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. శంబల ప్రస్తావన, విష్ణు పురాణం నందు మనం కాంచవచ్చును.
శంబల- కల్కి భగవానుడు-కలి యుగాంతం-పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞాన తత్వాలు-వీటిలో కలి యుగాంత ప్రస్తావన....అలాగే భవిష్య పురాణంలో కూడా కలియుగాంత ప్రస్తావన....ఇదంతా....చదువరులందరికీ తెలిసిన విషయమే.
ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో....కొంత మందికైనా "శంబల" గూర్చి తెలుసు. (గతంలో నేనే శంబల గూర్చి కొన్ని వ్యాసాలు ఇచ్చాను. ఆసక్తి కలవారు చదువగలరు.)
మానవ పరిణామ క్రమంలో...మన కంటే ముందున్న బుద్ధి జీవుల నివాసమే "శంబల". శంబల వాసులు, తపస్వులు. నిరంతరం ఊర్థ్వ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటారు. శంబల వాసులు ....నిరంతరం ఉన్నత తలాలతో (డైమన్షన్స్) సంబంధం కలిగి ఉంటారు. శంబలను జంగమ దేవరల నివాస స్థలంగాను, విస్మృత దైవీక రాజ్యం గానూ, శ్వేత-జలాల భూమి గానూ, జీవించే అగ్ని గల భూమి గానూ కూడా "శంబలను" గుర్తిస్తారు.
ఇక "అగార్తా" విషయానికొద్దాం. చాలామంది పరిశోధకుల ప్రకారం "అగార్తా" అన్న భూగర్భ నగరానికి వెళ్ళడానికి కొన్ని దారులున్నాయి. Kentucky Mammoth Cave - USA, బెర్ముడా ట్రయాంగిల్, భారత్-టిబెట్ సరిహద్దు హిమాలయాలు, భూమి యొక్క ధృవ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు....వీటి ద్వారా "అగార్తా"కు వెళ్ళే మార్గాలున్నాయని చెబుతున్నారు. అయితే భారత-టిబెట్ దేశాలలో మాత్రం ....ఆయా మార్మిక దారులన్నీ, శక్తివంతులైన హిందూ-బౌద్ధ యోగులచే కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతున్నాయి.
ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయంటే, లక్షల సంవత్సరాల క్రిందట, అనేక కారణాల వలన, బుద్ధి జీవులైన కొందరు ప్రజలు భూగర్భంలో గల నగరానికి వలస వెళిపోయారు. వారు తమ స్వంతదైన అనుకూల పరిస్థితులతోనూ, పర్యావరణ అనుకూల పరిస్థితులతోనూ, తమకు గల మార్మిక, ఆధ్యాత్మిక అవగాహనతోనూ....తమ నివాసం అయిన "అగార్తా" నగరాన్ని నిర్మించుకున్నారు.
ఇక "హాలో ఎర్త్" సిద్ధాంత నిరూపణలకొస్తే, గత మూడు, నాలుగు శతాబ్దాలుగా భూమి లోపలి నాగరికతలను పరిశోధించే పరిశోధనలు ఎక్కువయ్యాయి. భూమి కేవలం మట్టి, రాతి ముద్ద కాదు. శాస్త్ర వేత్తల ప్రకారం,వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు. కానీ "పాతాళావరణం " (hollow sphere) చుట్టూ దట్టమైన భూ ద్రవ్యరాశి (భూమి-భూ స్వరూపాలు) కలదు. ఉత్తర దక్షిణ ధృవాలలో తెరుచుకొనేటట్లుగానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒక సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడని కూడా సిద్ధాంతాలు చెబుతున్నాయి. "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం భూద్రవ్యరాశి వలయం సుమారు 600 నుండి 800 మైళ్ళ వ్యాసం తోనూ, ధృవాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసం తోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం చెబుతోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళతోనూ , ఈ పాతాళం విస్తరించి ఉందట.
విచిత్రమైన విషయమేమిటంటే, భూమి-నీరు ఆవరించిన నిష్పత్తి పరిశీలిస్తే, భూమి ఉపరి భాగానికి, భూమి అంతర్భాగానికి (హాలో ఎర్త్) , పరస్పర విరుద్ధం గోచరిస్తోంది. భూమి పై భూభాగం,జల భాగముల నిష్పత్తి 1 : 4 అయితే, ఈ inner crust లో వీటి నిష్పత్తి 4 : 1 గా ఉంది. ఈ వైరుధ్యానికి కారణం భూమి పై భాగంలో ప్రవహించే జల స్వరూపాలైన సముద్రాలు,నదులు,సరస్సుల....వలన ఆ నిష్పత్తి 1 : 4 గా ఉంటే, ఆ జల స్వరూపాలు, వాటి క్రింద గల భూభాగంపైననే ఆధారపడి ఉన్నాయి కదా!
స్థిత ప్రజ్ఞుడు
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ఏ విషయాన్నైనా మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే దాని గురించి పూర్తి వివరాలు తెలిసుండాలి. అంతేకాదు, ఆ విషయం గురించిన అనుభవం కూడా పొందాల్సి ఉంటుంది. మనిషి మంచి నడవడిక కలవాడు కావాలంటే మంచి లక్షణాలను తెలుసుకోవాలి. దానితోపాటు అటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
దట్టమైన మోహారణ్యాన్ని దాటే బుద్ధి కలిగినపుడు సమస్తం శుభకరమే అవుతుందని శ్రీకృష్ణుడు చెప్పగానే అటువంటి దివ్యమైన బుద్ధి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అర్జునుడికి తెలుసుకోవాలని అనిపించింది.
ఆ విషయాన్నే అడుగుతూ ‘కృష్ణా! స్థితప్రజ్ఞుడైన వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అతడెలా మాట్లాడతాడు? అతడి భాష ఎలా ఉంటుంది? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు’ (భగవద్గీ 2.54) అని ప్రశ్నలు కురిపించాడు. అంటే అర్జునుడు స్థితప్రజ్ఞత కలిగిన ఆదర్శమూర్తికి గల లక్షణాలేమిటో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కాని రాబోయే కాలాలలో తానే ఒక ఆదర్శవంతుడిని కాబోతున్నానని అతడు ఊహించలేకపోయాడు. సంపూర్ణ శరణాగతుడైన భక్తుని భగవద్గీత నిశ్చయంగా రాబోయే తరాలకు ఆదర్శవంతంగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాధారణంగా ప్రజ్ఞ అనే పదానికి బుద్ధి అనే అర్థం చెబుతారు. ప్రజ్ఞ కలవాడే ప్రాజ్ఞుడు. కాబట్టి బుద్ధిమంతులందరు ప్రాజ్ఞులనే భావన అందరికీ వచ్చేసింది. కాని అర్జునుడు తన ప్రశ్నలను శ్రీకృష్ణుడికి విన్నవిస్తున్నప్పుడు స్థితప్రజ్ఞుడు అనే పదాన్ని ప్రయోగించాడు. అంటే సుస్థిరమైన ప్రజ్ఞ కలవాడిని గురించి అడిగాడు.
ప్రతి మనిషికీ కర్మానుసారం ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ద్వారా అతడు జీవన కలాపాలను కొనసాగిస్తుంటాడు.
అయితే మనిషి ఆత్మ స్థితిలో నిలువనంత వరకు బుద్ధి ఏ క్షణంలోనైనా మనసు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. కేవలం ఆత్మస్థితిలో ప్రవేశించి తద్వారా బుద్ధిని జాగృతం చేసుకున్నవాడే మానసిక క్లేశాలకు దూరం అవుతాడు. అంటే ఆత్మస్థితిని గురించిన పరిచయం వలన జాగృతమయ్యే బుద్ధి ద్వారానే ఎవరైనా మోహారణ్యాన్ని, చింతల అడవులను దాటగలుగుతారు. ఆ విధంగా ఆత్మస్థితిలో అనుభవం ద్వారా పదునెక్కిన బుద్ధినే ప్రజ్ఞ అనాలి. అటువంటి ప్రజ్ఞలో సుస్థిరుడైన వ్యక్తి లక్షణాలేమిటో తెలుసుకోవాలని అర్జునుడు ఉవ్విళ్లూరాడు.
శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ.. ‘పార్థా! మనిషి ఎప్పుడైతే మనసు ద్వారా కల్పించబడే అన్ని విధాలైన కోరికలను విడిచిపెడతాడో, ఎప్పుడైతే ఆ విధంగా కోరికలు తొలగిన అతని మనస్సు ఆత్మస్థితిలో తృప్తి చెందుతుంది అపుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు (భగవద్గీత 2.55)’ అని అన్నాడు. మనశ్శాంతి కరువైందని అందరూ వాపోతుంటారు.
కాని మనశ్శాంతి కేవలం రెండు స్థితులలోనే లభిస్తుంది. ఆ రెండు స్థితులే నిద్ర, మరణం. నిద్రలో ఉన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. ఇక మరణం గురించి చెప్పనక్కర్లేదు. అయితే మనిషి జాగృతావస్థలో ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉండే అవకాశమే లేదు. కాని ఆత్మస్థితి గురించిన ఎరుకతో జాగృతమైన బుద్ధిలో, అంటే ప్రజ్ఞలో స్థితుడైనపుడు (స్థితప్రజ్ఞుడైనపుడు) మానసిక కలాపాలు ఆగిపోతాయి.
అంటే అనవసరమైన భోగవాంఛలు ఆగిపోతాయి. దీని అర్థం స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి కోరికలు కలగవని కాదు. అయితే ఆ కోరికలు స్వీయభోగానికి అయి ఉండవు. అవన్నీ తన ఆత్మోద్ధారానికో లేదా జనుల, సకల జీవుల ఉద్ధారానికో అయి ఉంటాయి. సంపూర్ణ భగవదాశ్రయంలో అటువంటి మహాత్ములు, స్థితప్రజ్ఞులు సకల మానవాళికి ఆదర్శనీయులుగా మారుతారు. అటువంటి స్థితప్రజ్ఞులను అనుసరించినపుడే మానవులు నిత్యోత్సాహంతో జీవనాన్ని కొనసాగిస్తూ జన్మను సార్థకం
చేసుకొంటారు.
భక్తుడు ఇలా అడిగారు...
అమ్మా! కొన్ని సమయాల్లో మనస్సు బలహీనమైపోతుంది. ఎందువలన?
మాతృదేవి ఇలా సెలవిచ్చారు...
నాయనా! దానిని గురించి ఆందోళనపడకు. ఒక్క గురుదేవులు తప్ప తక్కిన ఎవరి మనస్సుల్లో బలహీనత లేకుండాపోయింది! "ఎప్పుడైనా ఒక్కసారి సైతం బలహీనత తలెత్తని మహాపురుషులు ఎవరైనా ఇప్పటి దాకా జన్మించారా?"
"నా మనస్సు బలహీనంగావుంది' అని గ్రహింపగలిగితే, బలహీనత నుండి విడివడడానికి ప్రయత్నం జరిగివుంటే, అదే గొప్ప విషయం! ప్రయత్నం చేసేవాడి పట్ల మహామాయు ప్రసన్నమవుతుంది, దారి ఇస్తుంది."
కొన్ని రోజులు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు వెంటనే, నాకు అంతా సరిపోయింది అని భావించుకుంటారు. ఇంకా ముందుకు సాగాలి అనే ప్రయత్నం మానుకుంటారు వివేక హీనులు.
కానీ, వివేకి మనస్సులో కూడా అప్పుడప్పుడు బలహీనత చోటుచేసుకోవడం కద్దు. ఆ బలహీనతను ప్రసాదించేది కూడా భగవంతుడే. నీ సాధన ఇంకా పూర్తికాలేదు, జాగ్రత్తగావుండు. నలువైపులా భూతప్రేతాలు కాచుకొని ఉన్నాయి. సందర్భందొరికితేచాలు, అవన్నీ వచ్చి నీ భుజాల మీద కూర్చుంటాయి. అందువలన ప్రయత్నం మానకు! అనే విషయాన్ని దీని మూలంగా వారు జ్ఞాపకం తెచ్చుకొంటారు.
ఇలా బలహీనత రావడం వలన మనస్సులో అహంకారం నశిస్తుంది. సదా అప్రమత్తంగా మసలుకో నాయనా! గురుదేవులను శరణుజొచ్చి జీవితం సాగించు. అహంకారం ఉన్నందువలననే బలహీనత అదీ ఇదీ మనస్సులో తలెత్తుతాయి. చివరకు శరణాగతి పొంది జీవనం సాగించు.
గురుదేవులకే ఒకసారి కామోద్రేకం తలెత్తింది, ఇక సామాన్య వ్యక్తుల గురించి చెప్పాలా? అందువలన అహంకారానికి చోటేలేదు.
🌺శ్రీ శారదామాత వచనామృతం🌺
01-05020 -ప్రాంజలి ప్రభ నేటి కధ
చదివి చెప్పండి
40వేలు జీతంతో చావలేక బతుకుతున్న మధ్య తరగతి మనిషి... అంతరంగం...
నువ్వు నిజాయితీగా కట్టే TAX వల్ల...
అమ్మ ఒడి 15000 నీకు రాదు.ఐటీఐ,డిగ్రీ చదివే పిల్లలువుంటే వసతి 15000 రాదు...
రైతు భరోసా 12000 రాదు....
పంట కోసం రుణం తీసుకుంటే రుణమాఫీ నీకు రాదు..టైం బాగా లేక పంట సరిగా పండక పోతే మద్దతు ధర నీకు రాదు....
బియ్యం కార్డు నీకు రాదు (20kgx50rsx12months)--12000 పెట్టి బియ్యం కొనాల్సిందే
ఉగాదికి ఇళ్ల స్థలం నీకు రాదు
ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే 2లక్షల రూపాయలు నీకు రాదు.
డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ నీకు ఇవ్వరు.
ఆరోగ్య శ్రీ కార్డ్ నీకు యివ్వరు.
ఎంత బిల్లు ఆయినా నువ్వు కట్టాల్సిందే.
నీకు ఇన్ కమ్ సర్టిఫికెట్ ఉంది కాబట్టి నీ పిల్లల ఫీజు... నువ్వు కట్టాలి...
ఇక నీపిల్లలు ఇంజనీరింగ్/ MBBS చదువు? ఒక కల😩
అందుకే పని పాట మానేసి ఊరికే ఉంటే ...
టాక్స్ కట్టే పని లేదు ....ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతితోపాటు పైన నేను చెప్పినవన్నీ పొందొచ్చు....
కష్టపడి జాబ్ చేసి...సంవత్సరం చివర నీకు మిగిలింది GB
నెలకు జీతం 40 వేలు అనుకో
ఇంటి అద్దె 6000
పాలు.1800.1లీ" 60 రూ
కరెంట్ బిల్. 1000
రైస్ 50 kg x50rs 2500
కూరగాయలు 1000
ఆయిల్..వగేరా. 3000
సండే చికెన్. 4వాx200. 800
కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000
పిల్లల ఫీజు. 2000x2 నెలకి
(LKG కూడా 2వేలు కాబట్టి ఒక్కడికి)
(నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు)
పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి ..2000 అవుతాయి..
ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి...
నెలకు 4 మందికి 4000.
ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు....ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లు
అమ్మ వాళ్ళ ఊరు...
అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు....
ఇవన్నీ కాక....40వేల జీతం కదాఅని భార్య వచ్చి
మంచి ఫోన్ కొను,
ఏసీ కొను,
ఫ్రిడ్జ్ కొను,
వాషింగ్ మెషీన్ కొను
సోఫా కొను
గోల్డ్ కొను
భూషణం కొను
అంటే ఉంటాయా.......ఏమన్నా అంటే
40వేలు జీతం ఎమ్ చేస్తావ్ అంటారు...
సరే...ఏదో అడుగుతుందిగా అని BANKకి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటారు...
ఏమి మిగిలింది అని టాక్స్ కట్టడానికి....40వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడిపరిస్తితి అంతే....
సరే అడిగింది కదాఅని బజాజ్ EMI లోకొంటే మళ్ళా నెలనెలా వాడి గోల.. కాస్త జీతం లేటైతే.. ఎవర్ని అడిగినా...ఇదేమాట...నేను కట్టాలి బ్రో అని
ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...
#అయ్యా 40వేలు జీతం కదా ...
స్థలం కొన్నవా....
ఇల్లు కట్టావా అని....🤦♂ ..
(ఏందిరా ఈగోల....) 40వేల జీతంతో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం...
ప్రభుత్వం స్థలం ఇవ్వదు.... నేను కొనలేను..
ప్రభుత్వం డబుల్-బెడ్-రూమ్ ఇల్లు ఇవ్వదు....
నేను కట్టలేను...
40వేలు జీతంతీసుకుని నేను పొడిసింది ఏంది.....
జాబ్ మానేసి.....ఖాళీగా ఉంటే....
పైన చెప్పిన వన్నీ వస్తాయి....ఏ గోల ఉండదు.....
ఇంకొక ముఖ్య విషయం
చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొంది అన్ని ఫ్రీ గా పొంది ఇప్పుడు బతుకు బండికి ఎంత ఎంత విచిత్రమో.... డొనేషన్ కట్టి లక్షల ఖర్చుపెట్టి . ఆంగ్లం లో చదివి మన భారతదేశంలో బ్రతుకు తున్నటువంటి మనుషుల ఆవేదన ఆక్రందన....ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ప్రతి ఒక్కరూ మాతృభాష ను గౌరవించలేనివారు విధంగా బతకండి అదే అందరినీ బతికిస్తుంది.
శ్రీశ్రీ జయంతి ఏప్రియల్ 30
ఆ కలం సామాజిక అసమానతలను చీల్చి చండాడే హలం..
ఆయన రాసే ప్రతి పదం సామాన్యులను ఉర్రుతలూగించే జనపదం..
ఆధునిక జన కవిత్వానికి దార్శనికుడాయన..
ఖడ్గాన్ని సృష్టించిన ఆ చేతులే ప్రియురాలి నును లేత బుగ్గలునిమిరించింది.
ఆ కలం శైశవ గీతాన్ని ఆలపిస్తుంది..
ప్రపంచాగ్నికి సమిధగా మారుతుంది
అందుకే ఆయన " శ్రీ శ్రీ " అయ్యారు
మహాకవి' గా నిలిచారు.విశాఖపట్టణం మున్సిపల్ రికార్డులాధారంగా
ఆయన జయంతి ఏప్రిల్ 30
మహాకవి శ్రీ శ్రీ తెలుగు స్సాహిత్యం లో ఒక విప్లవం, ఒక శక్తీ, తెలుగు సాహిత్యాన్ని అర్ధ శకం పైగా ఏలిన "మహాకవి", ఆధునిక తెలుగు సాహిత్యం అంటే శ్రీ శ్రీ అనే గుర్తోచేలా "శ్రీ శ్రీ శకం" గా ముద్రవేసుకొని "మహాప్రస్థానం" ని మనకి 'మహాప్రసాదం' లా వదిలి "మరోప్రపంచం" లోకి వెళ్ళిపోయారు. 'సమాజం ఆవేదనే శ్రీ శ్రీ ఆవేదన'. ఆయన కవితల్లో ఒక కార్మికుడు, నీడలేని ఒక నిరుపేద, తల రాతకు తలవంచిన ఒక స్త్రీ, దిక్కులేని అనాధలు, సమాజం నిందించి దూషించి వెలేసిన ఎన్నో జీవితాలు, ముఖ్య విషయాలుగా ఉండటమే ఆయనను ప్రత్యేకంగా గుర్తించడానికి కారణం.
ఆయన తీరు అసమానమైనది. ఆయన స్నేహితుడు కొంపెల్ల జనార్ధనరావు కోసం రాసిన "మహాప్రస్థానం" ఆయన కేవలం 5 నిముషాల్లో రాసారంటే చాలామందికి అది ఆశ్చర్యం కాక తప్పదు.. శ్రీ శ్రీ ని అభిమానించే వారికి ఆయన ఒక ప్రవక్త ,కవి . విమర్శకులు కూడా ఆయనను "మహాకవి" గా అంగీకరించారు.
ఈరోజు శ్రీ శ్రీ కి అరవై దేశాల పైగా గుర్తింపుఉంది, ఇది మన తెలుగువాళ్ళకి ఎంతో గర్వించదగ్గ విషయం.ఆయన కేవలం "మహాకవి" కాదు, ఆయనను ఒక "యుగకవి" గా, ఒక "విశ్వకవి" గా కీర్తించవచ్చు. ఆయన సిద్ధాంతాలలో ముఖ్యమైనవి "మాకు అణువస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు కావాలి" , "నిజం విప్లవం లోనే ఉంది " , "శాస్త్రం నీ అస్త్రం" అనేవి ఆయన ఆలోచనల లోతు ను తెలుపుతాయి..
తెలుగు సాహితి వనంలో ఈ శతాబ్దం నాది అని చాటుకున్న 'శ్రీ శ్రీ' ' సినిమా రంగంలోనూ' అదే బాణీ పలికించారు
సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా శ్రీశ్రీ తన సిని ప్రస్థానం సాగించారు.
20 శాతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాశించారు శ్రీ శ్రీ .
శ్రీశీ తన జయభేరి కవితతో సమాజాభివృద్ధికి అందరూ కలిసి రా వాలని తెలిపారు. మనిషి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను తన కవిత్వంలో ప్రతిబింబింపజేశారు. మహాప్రస్థానం ద్వారా జన చైతన్యం తెచ్చి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, కష్టజీవిగా అండగా నిలిచారు. శ్రీ శ్రీ
"తెలుగు వీరలేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి.
రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాశారు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తరవాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపారు.
మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30, 1910 - లో జన్మించారు. శ్రీరంగం శ్రీనివాసరావు -శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు.
శ్రీశ్రీ...తెలుగు సినిమా పాట మీద చెరిగిపోని సంతకం శ్రీశ్రీ. ఉన్నత కవితా శిఖరాల నుంచి సినిమాల్లోకి దూకేశారాయన. డబ్బింగ్ సినిమా ఆహుతి కోసం రాసిన 'ప్రేమయే జననమరణ లీల' పాటతో మొదలైన సినీ సాహితీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఆయనతో తప్ప రాయించుకోవడం కుదరని సందర్భాలు ప్రతి దర్శక నిర్మాతకూ ఎదురయ్యింది.
తెలుగు సినిమా పాటకు మొదటిసారి జాతీయ స్థాయి పురస్కారం సాధించి పెట్టారాయన. ఈ శతాబ్దం తనదేనని ఢంకా బజాయించి మరీ చెప్పిన యుగకవి శ్రీశ్రీ.
ఆయన అరిస్తే పద్యమైంది... స్మరిస్తే వాద్యమైంది. ఆ కలం ఖడ్డసృష్టిలో అక్షరాక్షరం సాహిత్య వేదిక ముందు అస్త్ర నైవేద్యమైంది.
సినిమాల చిట్టడవిలో చిక్కుకొన్న మహాకవి' అని కొందరు వాపోయినా ఆ చిట్టడవిలో దట్టమైన గీత వసంతాల్ని పూయించడం శ్రీశ్రీకి మాత్రమే సాధ్యమైంది.
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఉండగా అయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోఉన్నారు.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య తో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించారు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని.
1970లో అయన షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే అయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
ఆయన మనమద్య లేకపోతేనేం.. ఆయన గీతాలు.. కవితలు.. తరతరాలూ సజీవంగా ఉండిపోతాయి.
2👉🏿బుద్ధుడిలా బతికేయడం సులభం
బుద్ధుడి భార్యలా బతకగలరా ?
***
🌹సర్వేజనా సుఖినోభవంతు🌹
🌹సర్వేజనా సుఖినోభవంతు🌹
యండమూరి వీరేంద్రనాథ్ ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ - 294
🌹సర్వేజనా సుఖినోభవంతు🌹
యండమూరి వీరేంద్రనాథ్ ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణ - 294
“భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టివేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్చానువాదం చదవండి:
"భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా? బతుకుoటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం.
యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.
కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.
‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.
అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొoటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.
వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మరో సంవత్సరం వరకూ వ్యాక్సిన్ కనుక్కోబడదు. వ్యాక్సిన్ కనుక్కునేవరకూ ఏ దేశం కూడా పరాయి దేశస్థుడిని తన దేశం రావటానికి ఒప్పుకోదు. ఒకసారి విదేశాలలో ఉన్నవారు మన దేశం వస్తే తిరిగి వెళ్ళటం కూడా కష్టమే. *2021 జూన్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఓడలూ, విమాన యానాలూ సాధ్యం కావు. పక్క సీటు ఖాళీ పెడితే తప్ప విమానయానం కుదరదు. అలా చేస్తే కమర్షియల్‌గా సక్సెస్ అవదు. కాబట్టి దాని గురించి మర్చిపోండి. విదేశాలలో ఉన్న మీ పిల్లలూ, బంధువులూ చాలా కాలంపాటూ మీకు కనపడక పోవచ్చు. లాక్-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శనాలు ఉండవు. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”
సేకరణ రచన
య౦డముారి వీరేంద్రనాథ్ గారు
"భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా? బతుకుoటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం.
యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.
కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.
‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.
అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొoటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.
వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మరో సంవత్సరం వరకూ వ్యాక్సిన్ కనుక్కోబడదు. వ్యాక్సిన్ కనుక్కునేవరకూ ఏ దేశం కూడా పరాయి దేశస్థుడిని తన దేశం రావటానికి ఒప్పుకోదు. ఒకసారి విదేశాలలో ఉన్నవారు మన దేశం వస్తే తిరిగి వెళ్ళటం కూడా కష్టమే. *2021 జూన్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఓడలూ, విమాన యానాలూ సాధ్యం కావు. పక్క సీటు ఖాళీ పెడితే తప్ప విమానయానం కుదరదు. అలా చేస్తే కమర్షియల్‌గా సక్సెస్ అవదు. కాబట్టి దాని గురించి మర్చిపోండి. విదేశాలలో ఉన్న మీ పిల్లలూ, బంధువులూ చాలా కాలంపాటూ మీకు కనపడక పోవచ్చు. లాక్-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శనాలు ఉండవు. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”
సేకరణ రచన
య౦డముారి వీరేంద్రనాథ్ గారు
Comments
Post a Comment