శ్రీ ఆదిశంకరుల విరచిత స్తోత్రాలు
శ్రీశంకరభగవత్పాదాః
విజయంతే
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
శక్తి శివుల సమ్మేళన చక్రమనగ
సుందరీ సుందరులను తా చూపు నెపుడు
యోగ మార్గాన చూచెడి యోగివరుల
కాయసర్వంబు తానుగా కాన బడును.
(తోపెల్ల సత్య నారాయణ మూర్తి,
అమలాపురం)
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
నింగినైనను మరియును నేలనైన
వంగియైనను నిలచిన భంగినైన
జాగరమునను స్వప్నాది సమయమైన
నిన్ను తలచెడి మతినిమ్ము నీలకంఠ
(తోపెల్ల సత్య నారాయణ మూర్తి,
అమలాపురం.)
***
బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః-
1) వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ |
యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ ||
2) జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్ |
తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్ ||
3) తపోరూపం తపోబీజం తపోధనధనం వరమ్ |
వరం వరేణ్యం వరదమీడ్యం సిద్ధగణైర్వరైః ||
4)కారణం భుక్తిముక్తీనాం నరకార్ణవతారణమ్ |
ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరమ్ ||
5) హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభమ్ |
బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తాను గ్రహవిగ్రహమ్ ||
6) విషయాణాం విభేదేన బిభ్రతం బహురూపకమ్ |
జలరూపమగ్నిరూప-మాకాశరూపమీశ్వరమ్ ||
7) వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ప్రభుం |
ఆత్మనః స్వపదం దాతుం సమర్థ మవలీలయా ||
8) భక్త జీవన మీశం చ భక్తాను గ్రహ కారకమ్ |
వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుమ్ ||
9) అపరిచ్ఛిన్న మీశాన-మహోవాఙ్మనసోః పరమ్ |
వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరమ్ |
త్రిశూలపట్టిశధరం సస్మితం చంద్రశేఖరం ||
10) ఇత్యుక్త్వా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః |
ప్రాణమచ్ఛంకరం భక్త్యా దుర్వాసాశ్చ మునీశ్వరః ||
11)ఇదం దత్తం వసిష్ఠేన గంధర్వాయ పురా మునే |
కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం ||
12) ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః |
స్నానస్య సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితమ్ ||
13) అపుత్రో లభతే పుత్రం వర్షమేకం శృణోతి యః |
సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుమ్ ||
14) గలత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శృణోతి యః |
అవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితి శ్రుతమ్ ||
15)కారాగారేఽపి బద్ధో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిమ్ |
స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాద్ధృవమ్ ||
16)భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యామాసం శృణోతి యః |
మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్భ్రష్టధనో ధనమ్ ||
17)యక్ష్మగ్రస్తో వర్షమేకమాస్తికో యః శృణోతి చేత్ |
నిశ్చితం ముచ్యతే రోగాచ్ఛంకరస్య ప్రసాదతః ||
18)యః శృణోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్విజః |
తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక ||
19)కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య భారతే |
అచలం పరమైశ్వర్యం లభతే నాత్ర సంశయః ||
20)సుసంయతోఽతి భక్త్యా చ మాసమేకం శృణోతి యః |
అభార్యో లభతే భార్యాం సువినీతాం సతీం వరామ్ ||
21) మహామూర్ఖశ్చ దుర్మేధా మాసమేకం శృణోతి యః |
బుద్ధిం విద్యాం చ లభతే గురూపదేశ మాత్రతః ||
22)కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శృణోతి యః |
ధ్రువం విత్తం భవేత్తస్య శంకరస్య ప్రసాదతః ||
23) ఇహ లోకే సుఖం భుక్త్వా కృత్వాకీర్తిం సుదుర్లభామ్ |
నానా ప్రకార ధర్మం చ యాత్యంతే శంకరాలయమ్ ||
24) పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరమ్ |
యః శృణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమమ్ ||
|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖం సౌతిశౌనకసంవాదే శంకరస్తోత్ర కథనం నామ ఏకోన వింశోధ్యాయః ||
నర్మదా బాణలింగ సేవా సమితి🕉
విజయంతే
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
శక్తి శివుల సమ్మేళన చక్రమనగ
సుందరీ సుందరులను తా చూపు నెపుడు
యోగ మార్గాన చూచెడి యోగివరుల
కాయసర్వంబు తానుగా కాన బడును.
(తోపెల్ల సత్య నారాయణ మూర్తి,
అమలాపురం)
-----------------------------
🔴 శ్రీమాత్రేనమః 🔴
నింగినైనను మరియును నేలనైన
వంగియైనను నిలచిన భంగినైన
జాగరమునను స్వప్నాది సమయమైన
నిన్ను తలచెడి మతినిమ్ము నీలకంఠ
(తోపెల్ల సత్య నారాయణ మూర్తి,
అమలాపురం.)
***
బాణాసుర విరచితం శ్రీ శివ స్తవరాజః-
1) వందే సురాణాం సారం చ సురేశం నీలలోహితమ్ |
యోగీశ్వరం యోగబీజం యోగినాం చ గురోర్గురుమ్ ||
2) జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్ |
తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్ ||
3) తపోరూపం తపోబీజం తపోధనధనం వరమ్ |
వరం వరేణ్యం వరదమీడ్యం సిద్ధగణైర్వరైః ||
4)కారణం భుక్తిముక్తీనాం నరకార్ణవతారణమ్ |
ఆశుతోషం ప్రసన్నాస్యం కరుణామయసాగరమ్ ||
5) హిమచందన కుందేందు కుముదాంభోజ సన్నిభమ్ |
బ్రహ్మజ్యోతిః స్వరూపం చ భక్తాను గ్రహవిగ్రహమ్ ||
6) విషయాణాం విభేదేన బిభ్రతం బహురూపకమ్ |
జలరూపమగ్నిరూప-మాకాశరూపమీశ్వరమ్ ||
7) వాయురూపం చంద్రరూపం సూర్యరూపం మహత్ప్రభుం |
ఆత్మనః స్వపదం దాతుం సమర్థ మవలీలయా ||
8) భక్త జీవన మీశం చ భక్తాను గ్రహ కారకమ్ |
వేదా న శక్తా యం స్తోతుం కిమహం స్తౌమి తం ప్రభుమ్ ||
9) అపరిచ్ఛిన్న మీశాన-మహోవాఙ్మనసోః పరమ్ |
వ్యాఘ్రచర్మాంబరధరం వృషభస్థం దిగంబరమ్ |
త్రిశూలపట్టిశధరం సస్మితం చంద్రశేఖరం ||
10) ఇత్యుక్త్వా స్తవరాజేన నిత్యం బాణః సుసంయతః |
ప్రాణమచ్ఛంకరం భక్త్యా దుర్వాసాశ్చ మునీశ్వరః ||
11)ఇదం దత్తం వసిష్ఠేన గంధర్వాయ పురా మునే |
కథితం చ మహాస్తోత్రం శూలినః పరమాద్భుతం ||
12) ఇదం స్తోత్రం మహాపుణ్యం పఠేద్భక్త్యా చ యో నరః |
స్నానస్య సర్వతీర్థానాం ఫలమాప్నోతి నిశ్చితమ్ ||
13) అపుత్రో లభతే పుత్రం వర్షమేకం శృణోతి యః |
సంయతశ్చ హవిష్యాశీ ప్రణమ్య శంకరం గురుమ్ ||
14) గలత్కుష్ఠీ మహాశూలీ వర్షమేకం శృణోతి యః |
అవశ్యం ముచ్యతే రోగాద్వ్యాసవాక్యమితి శ్రుతమ్ ||
15)కారాగారేఽపి బద్ధో యో నైవ ప్రాప్నోతి నిర్వృతిమ్ |
స్తోత్రం శ్రుత్వా మాసమేకం ముచ్యతే బంధనాద్ధృవమ్ ||
16)భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భక్త్యామాసం శృణోతి యః |
మాసం శ్రుత్వా సంయతశ్చ లభేద్భ్రష్టధనో ధనమ్ ||
17)యక్ష్మగ్రస్తో వర్షమేకమాస్తికో యః శృణోతి చేత్ |
నిశ్చితం ముచ్యతే రోగాచ్ఛంకరస్య ప్రసాదతః ||
18)యః శృణోతి సదా భక్త్యా స్తవరాజమిమం ద్విజః |
తస్యాసాధ్యం త్రిభువనే నాస్తి కించిచ్చ శౌనక ||
19)కదాచిద్బంధువిచ్ఛేదో న భవేత్తస్య భారతే |
అచలం పరమైశ్వర్యం లభతే నాత్ర సంశయః ||
20)సుసంయతోఽతి భక్త్యా చ మాసమేకం శృణోతి యః |
అభార్యో లభతే భార్యాం సువినీతాం సతీం వరామ్ ||
21) మహామూర్ఖశ్చ దుర్మేధా మాసమేకం శృణోతి యః |
బుద్ధిం విద్యాం చ లభతే గురూపదేశ మాత్రతః ||
22)కర్మదుఃఖీ దరిద్రశ్చ మాసం భక్త్యా శృణోతి యః |
ధ్రువం విత్తం భవేత్తస్య శంకరస్య ప్రసాదతః ||
23) ఇహ లోకే సుఖం భుక్త్వా కృత్వాకీర్తిం సుదుర్లభామ్ |
నానా ప్రకార ధర్మం చ యాత్యంతే శంకరాలయమ్ ||
24) పార్షదప్రవరో భూత్వా సేవతే తత్ర శంకరమ్ |
యః శృణోతి త్రిసంధ్యం చ నిత్యం స్తోత్రమనుత్తమమ్ ||
|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖం సౌతిశౌనకసంవాదే శంకరస్తోత్ర కథనం నామ ఏకోన వింశోధ్యాయః ||
నర్మదా బాణలింగ సేవా సమితి🕉
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ కాశీ విశ్వనాథ స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతీ !
నంది స్కంద గణాధిరాజసహితా శ్రీవిశ్వనాథప్రభుః కాశీమందిరసంస్థితోఽఖిలగురుర్దేయాత్సదా మంగలం !!
2) యో దేవైరసురై ర్మునీంద్రతనయైర్గంధర్వయక్షోరగై- ర్నాగైర్భూతల వాసిభిర్ద్విజవరైః సంసేవితః సిద్ధయే !
యా గంగోత్తర వాహినీ పరిసరే తీర్థేరసంఖ్యైర్వృతా సా కాశీ త్రిపురారి రాజనగరీ దేయాత్సదా మంగలం !!
3) తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసారపారాపరా- నందా నంది గణేశ్వరైరుపహితా దేవైరశేషైః స్తుతా !
యా శంభోర్మణి కుండలైకకణికా విష్ణోస్తపోదీర్ఘికా సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్సదా మంగలం !!
4) ఏషా ధర్మపతాకినీ తటరుహాసేవా వసన్నాకినీ పశ్యన్పాతకినీ భగీరథతపః సాఫల్యదేవాకినీ !
ప్రేమారూఢపతాకినీ గిరిసుతా సా కేకరాస్వాకినీ కాశ్యాముత్తర వాహినీ సురనదీ దేయాత్సదా మంగలం !!
5)విఘ్నావాసనివాసకారణ మహా గండ స్థలాలంబితః సిందూరారుణపుంజచంద్రకిరణప్రచ్ఛాదినాగచ్ఛవిః !
శ్రీవిశ్వేశ్వర వల్లభో గిరిజయా సానందకానందితః స్మేరాస్యస్తవ ఢుంఢిరాజముదితో దేయాత్సదా మంగలం !!
6) కేదారః కలశేశ్వరః పశుపతిర్ధర్మేశ్వరో మధ్యమో జ్యేష్ఠేశో పశుపశ్చ కందుకశివో విఘ్నేశ్వరో జంబుకః !
చంద్రేశో హ్యమృతేశ్వరో భృగుశివః శ్రీవృద్ధకాలేశ్వరో మధ్యేశో మణి కర్ణికేశ్వరశివో దేయాత్సదా మంగలం !!
7) గోకర్ణస్త్వథ భారభూతనుదనుః శ్రీచిత్రగుప్తేశ్వరో యక్షేశస్తిలపర్ణసంగమశివో శైలేశ్వరః కశ్యపః !
నాగేశోఽగ్నిశివో నిధీశ్వరశివోఽగస్తీశ్వరస్తారక- జ్ఞానేశోఽపి పితామహేశ్వరశివో దేయాత్సదా మంగలం !!
8) బ్రహ్మాండం సకలం మనోషితరసై రత్నైః పయోభిర్హరం ఖేలైః పూరయతే కుటుంబనిలయాన్ శంభోర్విలాసప్రదా !
నానాదివ్యలతా విభూషితవపుః కాశీపురాధీశ్వరీ శ్రీవిశ్వేశ్వరసుందరీ భగవతీ దేయాత్సదా మంగలం !!
9) యా దేవీ మహిషాసురప్రమథనీ యా చండముండా పహా యా శుంభాసుర రక్తబీజదమనీ శక్రాదిభిః సంస్తుతా !
యా శూలాసిధనుః శరాభయకరా దుర్గాదిసందక్షిణా- మాశ్రిత్యాశ్రితవిఘ్నశంసమయతు దేయాత్సదా మంగలం !!
10) ఆద్యా శ్రీర్వికటా తతస్తు విరజా శ్రీమంగలా పార్వతీ విఖ్యాతా కమలా విశాల నయనా జ్యేష్ఠా విశిష్టాననా !
కామాక్షీ చ హరిప్రియా భగవతీ శ్రీఘంటఘంటాదికా మౌర్యా షష్టిసహస్ర మాతృసహితా దేయాత్సదా మంగలం !!
11) ఆదౌ పంచనదం ప్రయాగ మపరం కేదార కుండం కురు- క్షేత్రం మానసకం సరోఽమృత జలం శావస్య తీర్థం పరం !
మత్స్యోదర్యథ దండఖాండసలిలం మందాకినీ జంబుకం ఘంటాకర్ణ సముద్ర కూప సహితో దేయాత్సదా మంగలం !!
12) రేవాకుండ జలం సరస్వతిజలం దుర్వాసకుండం తతో లక్ష్మీతీర్థ లవాంకుశస్య సలిలం కందర్ప కుండం తథా !
దుర్గాకుండమసీజలం హనుమతః కుండప్రతాపోర్జితః ప్రజ్ఞానప్రముఖాని వః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
13) ఆద్యః కూపవరస్తు కాలదమనః శ్రీవృద్ధకూపోఽపరో విఖ్యాతస్తు పరాశరస్తు విదితః కూపః సరో మానసః !
జైగీషవ్యమునేః శశాంకనృపతేః కూపస్తు ధర్మోద్భవః ఖ్యాతః సప్తసముద్ర కూపసహితో దేయాత్సదా మంగలం !!
14) లక్ష్మీ నాయక బిందుమాధవహరి ర్లక్ష్మీనృసింహస్తతో గోవిందస్త్వథ గోపికాప్రియతమః శ్రీనారదః కేశవః !
గంగాకేశవ వామనాఖ్యతదను శ్వేతో హరిః కేశవః ప్రహ్లాదాదిసమస్తకేశవగణో దేయాత్సదా మంగలం !!
15) లోలార్కో విమలార్కమాయుఖరవిః సంవర్తసంజ్ఞో రవి- ర్విఖ్యాతో ద్రుపదుఃఖఖోల్కమరుణః ప్రోక్తోత్తరార్కో రవిః !
గంగార్కస్త్వథ వృద్ధవృద్ధివిబుధా కాశీపురీసంస్థితాః సూర్యా ద్వాదశ సంజ్ఞకాః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
16) ఆద్యో ఢుంఢివినాయకో గణపతిశ్చింతామణిః సిద్ధిదః సేనావిఘ్న పతిస్తు వక్త్రవదనః శ్రీపాశపాణిః ప్రభుః !
ఆశాపక్షవినాయకాప్రశకరో మోదాదికః షడ్గుణో లోలార్కాది వినాయకాః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
17) హేరంబో నలకూబరో గణపతిః శ్రీభీమచండీగణో విఖ్యాతో మణికర్ణికాగణపతిః శ్రీసిద్ధిదో విఘ్నపః !
ముండశ్చండముఖశ్చ కష్టహరణః శ్రీదండహస్తో గణః శ్రీదుర్గాఖ్యగణాధిపః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
18) ఆద్యో భైరవభీషణస్తదపరః శ్రీకాలరాజః క్రమా- చ్ఛ్రీసంహారక భైరవస్త్వథ రురుశ్చోన్మత్తకో భైరవః !
క్రోధశ్చండకపాల భైరవవరః శ్రీభూత నాథాదయో హ్యష్టౌ భైరవ మూర్తయః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
19) ఆధాతోఽమ్బికయా సహ త్రినయనః సార్ధం గణైర్నందితాం కాశీమాశు విశన్ హరః ప్రథమతో వార్షధ్వజేఽవస్థితః !
ఆయాతా దశ ధేనవః సుకపిలా దివ్యైః పయోభిర్హరం ఖ్యాతం తద్వృషభ ధ్వజేన కపిలం దేయాత్సదా మంగలం !!
20) ఆనందాఖ్య వనం హి చంపకవనం శ్రీనైమిషం ఖాండవం పుణ్యం చైత్రరథం త్వశాకవిపినం రంభావనం పావనం !
దుర్గారణ్యమథోఽపి కైరవవనం వృందావనం పావనం విఖ్యాతాని వనాని వః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!
21) అలికులదలనీలః కాలదంష్ట్రాకరాలః సజలజలదనీలో వ్యాలయజ్ఞోపవీతః !
అభయవరదహస్తో డామరోద్దామనాదః సకలదురితభక్షో మంగలం వో దదాతు !!
22) అర్ధాంగే వికటా గిరీంద్రతనయా గౌరీ సతీ సుందరీ సర్వాంగే విలస ద్విభూతిధవలో కాలో విశాలేక్షణః !
వీరేశః సహనందిభృంగిసహితః శ్రీవిశ్వనాథః ప్రభుః కాశీమందిర సంస్థితోఽఖిలగురుర్దేయాత్సదా మంగలం !!
23) యః ప్రాతః ప్రయతః ప్రసన్నమనసా ప్రేమప్రమోదాకులః ఖ్యాతం తత్ర విశిష్టపాదభువనేశేంద్రాదిభిర్యత్స్తుతం !
ప్రాతః ప్రాఙ్ముఖ మాసనోత్తమగతో బ్రూయాచ్ఛృణోత్యాదరాత్ కాశీవాస ముఖాన్యవాప్య సతతం ప్రీతే శివే ధూర్జటి !!
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాశీ విశ్వనాథస్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ జగన్నాథ పంచకం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) రక్తాంభోరుహదర్పభంజనమహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్జ్వలత్కుండలం !
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే !!
2) ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయం !
దైత్యారిం సకలేందు మండితముఖం చక్రాబ్జహస్త ద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీ నివాసాలయం !!
3) ఉద్యన్నీరద నీలసుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్య వారాంనిధిం !
భక్తానాం సకలార్తినాశనకరం చింతార్థిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రి చూడామణిం !!
4) నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన !
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మదారుం స్మరామి !!
5) దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాకాంతభూమండలం !
వజ్రాభామలచారుగండయుగలం నాగేంద్రచూడోజ్జ్వలం సంగ్రామే చపలం శశాంకధవలం శ్రీకామపాలం భజే !!
ఇతి శ్రీజగన్నాథ పంచకం సమాప్తం!!
🕉🌞🌏🌙🌟🚩
శ్రీ ఆదిశంకరాచార్య విరచితం ధన్యాష్టకం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩
1) తజ్జ్ఞానం ప్రశమకరం యదిన్ద్రియాణాం తజ్జ్ఞేయం యదుపనిషత్సు నిశ్చితార్థమ్ ।
తే ధన్యా భువి పరమార్థనిశ్చితేహాః శేషాస్తు భ్రమనిలయే పరిభ్రమన్తః ॥
2) ఆదౌ విజిత్య విషయాన్మదమోహరాగ- ద్వేషాదిశత్రుగణమాహృతయోగరాజ్యాః ।
జ్ఞాత్వా మతం సమనుభూయపరాత్మవిద్యా- కాన్తాసుఖం వనగృహే విచరన్తి ధన్యాః ॥
3) త్యక్త్వా గృహే రతిమధోగతిహేతుభూతామ్ ఆత్మేచ్ఛయోపనిషదర్థరసం పిబన్తః ।
వీతస్పృహా విషయభోగపదే విరక్తా ధన్యాశ్చరన్తి విజనేషు విరక్తసఙ్గాః ॥
4) త్యక్త్వా మమాహమితి బన్ధకరే పదే ద్వే మానావమానసదృశాః సమదర్శినశ్చ ।
కర్తారమన్యమవగమ్య తదర్పితాని కుర్వన్తి కర్మపరిపాకఫలాని ధన్యాః ॥
5) త్యక్త్వఈషణాత్రయమవేక్షితమోక్షమర్గా భైక్షామృతేన పరికల్పితదేహయాత్రాః ।
జ్యోతిః పరాత్పరతరం పరమాత్మసంజ్ఞం ధన్యా ద్విజారహసి హృద్యవలోకయన్తి ॥
6) నాసన్న సన్న సదసన్న మహసన్నచాణు న స్త్రీ పుమాన్న చ నపుంసకమేకబీజమ్ ।
యైర్బ్రహ్మ తత్సమముపాసితమేకచిత్తైః ధన్యా విరేజురిత్తరేభవపాశబద్ధాః ॥
7) అజ్ఞానపఙ్కపరిమగ్నమపేతసారం దుఃఖాలయం మరణజన్మజరావసక్తమ్ ।
సంసారబన్ధనమనిత్యమవేక్ష్య ధన్యా జ్ఞానాసినా తదవశీర్య వినిశ్చయన్తి ॥
8) శాన్తైరనన్యమతిభిర్మధురస్వభావైః ఏకత్వనిశ్చితమనోభిరపేతమోహైః ।
సాకం వనేషు విజితాత్మపదస్వరుపం తద్వస్తు సమ్యగనిశం విమృశన్తి ధన్యాః ॥
9) అహిమివ జనయోగం సర్వదా వర్జయేద్యః కుణపమివ సునారీం త్యక్తుకామో విరాగీ ।
విషమివ విషయాన్యో మన్యమానో దురన్తాన్ జయతి పరమహంసో ముక్తిభావం సమేతి ॥
10) సమ్పూర్ణం జగదేవ నన్దనవనం సర్వేఽపి కల్పద్రుమా గాఙ్గం వరి సమస్తవారినివహః పుణ్యాః సమస్తాః క్రియాః ।
వాచః ప్రాకృతసంస్కృతాః శ్రుతిశిరోవారాణసీ మేదినీ సర్వావస్థితిరస్య వస్తువిషయా దృష్టే పరబ్రహ్మణి ॥
॥ ఇతి శ్రీమద్ శ్రీ శంకరాచార్యవిరచితం ధన్యాష్టకం సమాప్తమ్ ॥
🕉🌞🌎🌙🌟🚩
శ్రీఆది శంకరాచార్య విరచిత శ్రీ మూకాంబికా పంచరత్న స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) మూలాంభోరుహమధ్యకోణవిలసత్ బంధూకరాగోజ్జ్వలాం జ్వాలాజాలజితేందుకాంతి లహరీం ఆనందసందాయినీం!
హేలాలాలితనీలకుంతలధరాం నీలోత్పలీయాంశుకాం కొల్లూరాద్రి నివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం!!
2) బాలాదిత్య నిభాననాం త్రినయనాం బాలేందునాభూషితాం నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రదాం !
శంఖం చక్రగదాఽభయం చ దధతీం సారస్వతార్థప్రదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం !!
3) మధ్యాన్హార్క సహస్రకోటిసదృశాం మాయాంధకారస్థితాం మాయాజాల విరాజితాం మదకరీం మారేణ సంసేవితాం !
శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం !!
4) కల్యాణీం కమలేక్షణాం వరనిధిం మందార చింతామణిం కల్యాణీ ఘనసంస్థితాం ఘనకృపాం మాయాం మహావైష్ణవీం !
కల్యాణీం భగవతీం వికర్మశమనాం కాంచీపురీం కామదాం కల్యాణీం త్రిపురాం శివేన సహితాం ధ్యాయామి మూకాంబికాం !!
5) కాలాంభోధరకుంతలాం స్మితముఖీం కర్పూర హారోజ్జ్వలాం కర్ణాలంబితహేమకుండలధరాం మాణిక్య కాంచీధరాం !
కైవల్యైక్యపరాయణాం కలముఖీం పద్మాసనే సంస్థితాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం !!
మందార కుంద కుముదోత్పల మల్లికాబ్జైః శృంగార వేష సుర పూజిత వందితాగ్రీం!
మందార కుంద కుముదోత్పల సుందరాంగీ మూకాంబికే మయి ని దేహి కృపా కటాక్షం!!
🕉🌞🌏🌙🌟🚩
శ్రీఆదిశంకరాచార్య విరచిత గంగా స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ||
2) భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామఙ్ఞానమ్ ||
3) హరిపదపాద్య తరంగిణి గంగే హిమవిధు ముక్తా ధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతి భారం కురు కృపయా భవసాగరపారమ్ ||
4) తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ||
5) పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ||
6) కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ||
7) తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ||
8) పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ||
9) రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ||
10) అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ||
11) వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ||
12) భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ ||
13) యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ||
14) గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ||
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం
ఓం శ్రీ రామ్ --- ఓంశ్రీమాత్రే నమః
కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.
1) దిగంబరం భస్మసుగన్ధలేపనం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ ।
పద్మాసనస్థం ఋషిదేవవన్దితం
దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥
భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.
2) మూలాధారే వారిజపద్మే సచతుష్కే
వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః ।
రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావం:- మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను.
3) స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే
బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః ।
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం, యం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
4) నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే
లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే ।
నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు). మణిపూరక మందున్న మేఘం నిలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
5) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే
అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్ ।
సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి !!
భావము:- హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది. అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయ కారకుడు, ధవల వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
6) కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే
చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే
మాయాధీశం జీవశివం తం భగవంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమ వలె వుండును.
అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఎ,ఏ,ఐ ,ఒ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును. ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము. దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
7) ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే
హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం
విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును. హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు. ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు, త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
8) మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం
శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే
హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- కపాలం పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును. హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన పరమహంసలు పొందేస్థితి. పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
9) బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం
బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ
పరమాత్మానం బ్రహ్మమునీద్రం భసితాఙ్గం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥ 9॥
భావం:- బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు, భగవంతుడు, బ్రహ్మజ్ఞాని మరియు జ్ఞానమయుడు, నిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు, బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు, శ్రీగురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
ఇతి శ్రీమద్శఙ్కరాచార్య విరచితం శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ ।
🕉🌞🌍🌙🌟🚩
శ్రీ దత్త షట్చక్ర జాగరణ స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం సాధన పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
సాధన :- పద్మాసనం లో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి మొట్టమొదట మూలాధారం నుండి మొదలు పెట్టి సహస్రారం వరకు,..., ఒక్కొక్క చక్రానికి సంబంధించిన స్త్రోత్రంను ఆచక్రం వద్ద పారాయణ చేయాలి.
*ఈ పారాయణ రోజుకి 11 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు దాని నుండి వచ్చే శక్తి తట్టుకోవడం కష్టం అతిగా చక్రాలు క్రియావంతం అయినా సమస్యలు వస్తాయి
గర్భిణీ స్త్రీలు చేయకూడదు.*
ఏ చక్రానికి సంబంధించిన స్త్రోత్రం చేస్తున్నారో ఆ చక్రం మీద దృష్టి పెట్టి చేయవలెను.
11 సార్లు పారాయణ ముగిసిన తర్వాత శ్వాస మీద ధ్యాస ఉంచి 15 నిమిషాలు ఉంచండి.భైరవ ముద్ర,కుండలిని ముద్ర,నాగ ముద్ర ఒకొక్క ముద్ర 5 నిమిషాలు చెప్పున 15 నిమిషాలు ధ్యానం చేయాలి.
తరువాత గంట వ్యవధి ఇచ్చి మీ ఇష్ట దేవత మంతాన్ని గాని స్త్రోత్రం గాని దండకం కానీ 108 సార్లు పారాయణ చేయండి.
*ఇలా 40 రోజులు చేయండి మీ శక్తి ని బట్టి
90 రోజులు కూడా చేయండి.*
*సాత్విక ఆహారం బ్రహ్మచర్యం
అవసరానికి మించి ఎక్కువగా వృధాగా మాట్లాడకూడదు పనికి వచ్చే మాటలు ఎంత సేపు అయిన పరవలేదు ఉపయోగం లేనివి వృదా మాటలు ఈ సాధన చేసినప్పడు వద్దు.ఎందుకు అంటే విశుద్ధి చక్రంలో శక్తి క్షీణిస్తుంది ఈ చక్రం గొంతు దగ్గర ఉంటుంది.*
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలనే యోగ సాధకులు చక్రాలంటారు.మనిషి వెన్నుపూసలో నిద్రాణ స్థితిలో దాగివుండే ఒక అనిర్వచనీయమైన శక్తినే కుండలిని శక్తిగా యోగ శాస్త్రం అభివర్ణిస్తోంది. విశేష యోగ సాధన ద్వారా వెన్నుపూస దిగువనుండే మూలాధారం వద్ద నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు సుషుమ్న నాడి సాయంతో చేర్చే పద్ధతిని కుండలినీ యోగం వివరిస్తోంది. ప్రాణ శక్తిని సమతుల్యం చేయటం తెలుసుకున్న మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.
చక్రాలు
----------------
మూలాధార చక్రము:- గుద భాగానికి పైన ,లింగ స్థానానికి కింది భాగంలో ఈ చక్రం ఉంటుంది. ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ చక్రం పనితీరు బాగున్న వారు ధైర్యం, భద్రతతో జీవిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు నిరంతరం అసంతృప్తి, భయం వంటి భావనలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. వీరు తరచూ ఎముకలు, దంతాలు, పేగులకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటుంటారు. మొక్కలు పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ చక్ర పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుపూస దిగువ భాగాన ఎరుపు రంగు ఉన్నట్లు భావిస్తూ 'నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అని భావన చేయటం ద్వారా ఈ చక్రం పనితీరును మెరుగు పరచుకోవచ్చు.
స్వాధిష్ఠాన చక్రము:- బొడ్డు దిగువ భాగాన ఉండే నారింజ రంగు చక్రమే స్వాధిష్ఠానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దీని పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అని పదే పదే మనసులో అనుకోవాలి.
మణిపూరక చక్రము:- బొడ్డు పై భాగంలో పసుపు రంగులో ఉండే చక్రమే మణిపూరకం. మానసిక ప్రవృత్తిని, ఆత్మ నిగ్రహాలను ఇది ప్రభావితం చేస్తుంది. సమస్యలను ఎదుర్కొని సానుకూల పరిష్కారాలను కనుగొనేందుకు ఈ చక్రం దోహదపడుతుంది. దీని పనితీరు బాగున్న వ్యక్తులలో ఏదో తెలియని ఆకర్షణ, వెలుగు ఉంటుంది. దీని పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు సొంతనిర్ణయాలు తీసుకోలేరు. తరచూ మాట మార్చటం, ఇతరుల మీద ఆధారపడటం, ఒప్పుకున్న పనిని పూర్తి చేయలేకపోవటం, ఒకే సమయంలో పలు పనులు మొదలుపెట్టి ఒక్క పనీ చేయలేక పోవటం, ఎదుటి వారిని సంతోషపు పెట్టేందుకు సొంత సమయాన్ని వృధా చేసుకోవటం వంటి లక్షణాలుంటాయి. ఈ పరిస్థితి మారాలంటే క్రమబద్ధమైన జీవనానికి అలవాటు పడాలి. రోజూ వ్యాయామం చేయట, ధ్యానం చేయటం తప్పనిసరి. బొడ్డు, గుండె మధ్య భాగంలో పసుపు రంగు గోళాన్ని ఊహించుకొని ' నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అని మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
అనాహత చక్రము:- ఇది హృదయ స్థానములో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమ వంటి సున్నితమైన భావనలకు ఇది కేంద్రం. ఈ చక్రం ఛాతీ, వీపు భాగాల పనితీరును నియంత్రిస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రేమించేలా చేయటంతో బాటు ప్రాణ శక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాలని అంగీకరిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బ తిన్నవారికి ఏ పనిలోనూ సంతోషం, సంతృప్తి లభించవు. ఎవరినీ నమ్మరు. ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఆశిస్తారు. పనులను మధ్యలోనే వదిలేస్తారు. పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ద్వారా ఈ చక్రం పనితీరు బాగుపడుతుంది. గుండె భాగంలో ఆకుపచ్చ గోళాన్ని ఊహిస్తూ ' నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుటూ ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను.' అని రోజూ పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
విశుద్ధి చక్రము:- కంఠ స్థానములో నీలి రంగులో ఉండే ఈ చక్రం సృజన, భావ వ్యక్తీకరణకు కేంద్రం. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఏ రంగంలోనైనా నాయకులుగా, మార్గదర్శులుగా ఎదుగుతారు. వీరిమాటను అందరూ ఆమోదిస్తారు. ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే గాక ఇతరులు చెప్పేదాన్నీ శ్రద్దగా వింటారు. ఈ చక్రం పనితీరు దెబ్బవారు కంగారు, గందరగోళానికి గురికావటం, అనాలోచితంగా పనులు చేయటం వంటి ఇబ్బందులకు గురవుతారు . మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేయటం, ఇంటిపని, రచనా వ్యాసంగం, పుస్తకాలు చదవటం, క్రీడలు వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది. ప్రశాంతంగా కూర్చొని గొంతు భాగాన నీలిరంగు గోళం ఉందని భావిస్తూ ' నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలిగేలా చెప్పగలను' అని మననం చేయటం ద్వారా కూడా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.
ఆజ్ఞా చక్రము:- భ్రూ (కనుబొమల) మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే ఈ చక్రమే అంతర్బుద్దికి కేంద్రం. ఊహించటం, ఆలోచించటం దీని పని. దీన్నే త్రినేత్రం అనీ అంటారు. దీని పనితీరు బాగుంటే భవిష్యత్తులో రానున్న సంకేతాలను, మార్పులనూ సరిగా ఊహించగలరు. కళాకారులుగా గుర్తింపు పొందుతారు. ఈ చక్రం పని తీరు దెబ్బ తిన్నవారు కంటికి కనిపించే వాటినే నమ్ముతారు. సొంతనిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకూ అతిజాగ్రత్త పడుతుంటారు. బొమ్మలు వేయటం, రంగులద్డటం వంటి పనులతో ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది. కనుబొమ్మల మధ్యభాగంలో ముదురు నీలిరంగు గోళాన్ని ఊహిస్తూ ' అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను. ఈ క్రమంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను' అని సంకల్పం చెప్పుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది.
సహస్రార చక్రము :- మాడు భాగంలో బచ్చలి పండు రంగులో ఉంటుంది. ఈ చక్రాన్ని చేరుకున్న వ్యక్తి జీవాత్మ, పరమాత్మల సంబంధాన్ని తెలుసుకుంటాడు. యోగ సాధన పరంగా కుండలిని ఆఖరి మజిలీ ఇది.ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు ఈ చక్రాన్ని చేరగలరు. దీనిని శైవులు శివస్థానమనీ, వైష్ణవులు పరమ పురుష స్థానమనీ, శాక్తేయులు దేవీస్థానమనీ, కొందరు హరిహర స్థానమనీ అంటారు. కుండలిని శక్తిని ఈ స్థానానికి చేర్చిన మనిషికి పునర్జన్మ నెత్తాల్సిన అవసరం లేదని యోగ శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రమ్
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) ఉషసి మాగధమంగలగాయనైర్ఝటితి జాగృహి జాగృహి జాగృహి |
అతికృపార్ద్రకటాక్షనిరీక్షణైర్జగదిదం జగదంబ సుఖీకురు ||
2) కనకమయ వితర్దిశోభమానం దిశి దిశి పూర్ణసువర్ణకుంభయుక్తమ్ |
మణిమయమంటపమధ్యమేహి మాతర్మయి కృపయాశు సమర్చనం గ్రహీతుమ్ ||
3) కనక కలశ శోభమానశీర్షం జలధరలంబి సముల్లసత్పతాకమ్ |
భగవతి తవ సంనివాసహేతోర్మణిమయమందిరమేతదర్పయామి ||
4) తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా |
నవరత్నవిభూషితా మయా శిబికేయం జగదంబ తేఽర్పితా ||
5) కనకమయ వితర్దిస్థాపితే తూలికాఢ్యే వివిధకుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే |
భగవతి రమణీయే రత్నసింహాసనేఽస్మిన్ సుపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ ||
6) మణిమౌక్తిక నిర్మితం మహాంతం కనకస్తంభచతుష్టయేన యుక్తమ్ |
కమనీయతమం భవాని తుభ్యం నవముల్లోచమహం సమర్పయామి ||
7) దూర్వయా సరసిజాన్వితవిష్ణుక్రాంతయా చ సహితం కుసుమాఢ్యమ్ |
పద్మయుగ్మసదృశే పదయుగ్మే పాద్యమేతదురరీకురు మాతః ||
8) గంధపుష్ప యవసర్షపదూర్వాసంయుతం తిలకుశాక్షతమిశ్రమ్ |
హేమపాత్రనిహితం సహ రత్నైరర్ఘ్యర్మేతదురరీకురు మాతః ||
9) జలజద్యుతినా కరేణ జాతీఫల తక్కోలలవంగగంధయుక్తైః |
అమృతైరమృతైరివాతిశీతైర్భగవత్యాచమనం విధీయతామ్ ||
10) నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ |
తదిదం జగదంబ తేఽర్పితం మధుపర్కం జనని ప్రగృహ్యతామ్ ||
11) ఏతచ్చమ్పక తైలమంబ వివిధైః పుష్పైర్ముహుర్వాసితం న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృంగైర్భ్రమద్భిర్వృతమ్ |
సానందం సురసుందరీభిరభితో హస్తైర్ధృతం తే మయా కేశేషు భ్రమరభ్రమేషు సకలేష్వంగేషు చాలిప్యతే ||
12) మాతః కుంకుమపంకనిర్మితమిదం దేహే తవోద్వర్తనం భక్త్యాహం కలయామి హేమరజసా సంమిశ్రితం కేసరైః |
కేశానామలకైర్విశోధ్య విశదాం కస్తూరికోదంచితైః స్నానం తే నవరత్న కుంభసహితైః సంవాసితోష్ణోదకైః ||
13) దధిదుగ్ధఘృతైః సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః |
స్నపయామి తవాహమాదరాజ్జనని త్వాం పునరుష్ణవారిభిః ||
14) ఏలోశీరసువాసితైః సకుసుమైర్గంగాది తీర్థోదకైః మాణిక్యామలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః |
మంత్రాన్వైదికతాంత్రికాన్పరిపఠంసానంద మత్యాదరాత్ స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీకురు ||
15) బాలార్కద్యుతి దాడిమీయకుసుమప్రస్పర్ధి సర్వోత్తమం మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితమ్ |
ముక్తాభిర్గ్రథితం సుకంచుకమిదం స్వీకృత్య పీతప్రభం తప్తస్వర్ణసమానవర్ణమతులం ప్రావర్ణమంగీకురు ||
16) నవరత్నమయే మయార్పితే కమనీయే తపనీయపాదుకే |
సవిలాసమిదం పదద్వయం కృపయా దేవి తయోర్ని ధీయతామ్ ||
17) బహుభిరగరు ధూపైః సాదరం ధూపయిత్వా భగవతి తవ కేశాంకంకతైర్మార్జయిత్వా |
సురభిభిరరవిందైశ్చంపకైశ్చార్చయిత్వా ఝటితి కనకసూత్రైర్జూటయన్వేష్టయామి ||
18) సౌవీరాంజనమిదమంబ చక్షుషోస్తే విన్యస్తం కనకశలాకయా మయా యత్ |
తన్న్యూనం మలినమపి త్వదక్షిసంగాత్ బ్రహ్మేంద్రాద్యభిలషణీయతామియాయ ||
19) మంజీరే పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ ముక్తాహారమురోజయోరనుపమాం నక్షత్రమాలాం గలే |
కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమా- త్తాటంకే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిమ్ ||
20) ధమ్మిల్లే తవ దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే ముక్తారాజివిరాజమానతిలకం నాసాపుటే మౌక్తికమ్ |
20) మాతర్మౌక్తికజాలికాం చ కుచయోః సర్వాంగులీషూర్మికాః|
కట్యాం కాంచనకింకిణీర్వినిదధే రత్నావతంసం శ్రుతౌ ||
21) మాతః ఫాలతలే తవాతివిమలే కాశ్మీరకస్తూరికా- కర్పూరాగరుభిః కరోమి తిలకం దేహేఽంగరాగం తతః |
వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం పాదౌ చందనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ ||
22) రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరవిద్ధైః |
అఖండితైర్దేవి యవాదిభిర్వా కాశ్మీరపంకాంకితతండులైర్వా ||
23) జనని చంపకతలైమిదం పురో మృగమదోపయుతం పటవాసకమ్ |
సురభిగంధమిదం చ చతుఃసమం సపది సర్వమిదం పరిగృహ్యతామ్ ||
24) సీమంతే తే భగవతి మయా సాదరం న్యస్తమేతత్ సిందూరం మే హృదయకమలే హర్షవర్షం తనోతి |
బాలాదిత్యద్యుతిరివ సదా లోహితా యస్య కాంతీ- రంతర్ధ్వాంతం హరతి సకలం చేతసా చింతయైవ ||
25) మందారకుందకరవీరలవంగపుష్పైస్త్వాం దేవి సంతతమహం పరిపూజయామి |
జాతీజపావకులచంపకకేతకాదినానావిధాని కుసుమాని చ తేఽర్పయామి ||
26) మాలతీవకుల హేమపుష్పికాకాంచనారకరవీరకైతకైః |
కర్ణికారగిరికర్ణికాదిభిః పూజయామి జగదంబ తే వపుః ||
27) పారిజాతశత పత్రపాటలైర్మల్లికావకులచంపకాదిభిః |
అంబుజైః సుకుసుమైశ్చ సాదరం పూజయామి జగదంబ తే వపుః ||
28) లాక్షాసంమిలితైః సితాభ్రసహితైః శ్రీవాససంమిశ్రితైః కర్పూరాకలితైః శిరైర్మధుయుతైర్గోసర్పిషా లోడితైః |
శ్రీఖండాగరుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్త్తుభిః ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమంగీ కురు ||
29) రత్నాలంకృత హేమపాత్రనిహితైర్గోసర్పిషా లోడితైః దీపైర్దీర్ఘతరాంధకారభిదురైర్బాలార్కకోటిప్రభైః |
ఆతామ్రజ్వలదుజ్జ్వలప్రవిలసద్రత్నప్రదీపైస్తథా మాతస్త్వామహమాదరాదనుదినం నీరాజయామ్యుచ్చకైః ||
30) మాతస్త్వాం దధిదుగ్ధపాయసమహాశాల్యన్నసంతానికాః సూపాపూపసితాఘృతైః సవటకైః సక్షౌద్రరంభాఫలైః |
ఏలాజీరకహింగునాగరనిశాకుస్తుంభరీసంస్కృతైః శాకైః సాకమహం సుధాధికరసైః సంతర్పయామ్యర్చయన్ ||
31) సాపూపసూప దధిదుగ్ధసితాఘృతాని సుస్వాదుభక్తపరమాన్నపురఃసరాణి |
శాకోల్లసన్మరిచిజీరకబాహ్లికాని భక్ష్యాణి భుంక్ష్వ జగదంబ మయార్పితాని ||
32) క్షీరమేతదిద ముత్తమోత్తమం ప్రాజ్యమాజ్యమిదముజ్జ్వలం మధు |
మాతరేతదమృతోపమం పయః సంభ్రమేణ పరిపీయతాం ముహుః ||
33) ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ ప్రక్షాల్య మాతః కలధౌతపాత్రే |
కర్పూరమిశ్రేణ సకుంకుమేన హస్తౌ సముద్వర్తయ చందనేన ||
34) అతిశీతముశీర వాసితం తపనీయే కలశే నివేశితమ్ |
పటపూతమిదం జితామృతం శుచి గంగాజలమంబ పీయతామ్ ||
35) జంబ్వామ్ర రంభాఫలసంయుతాని ద్రాక్షాఫలక్షౌద్ర సమన్వితాని |
సనారికేలాని సదాడిమాని ఫలాని తే దేవి సమర్పయామి ||
36) కూశ్మాండ కోశాతకిసంయుతాని జంబీరనారంగసమన్వితాని |
సబీజపూరాణి సబాదరాణి ఫలాని తే దేవి సమర్పయామి ||
37) కర్పూరేణ యుతైర్లవంగసహితైస్తక్కోలచూర్ణాన్వితైః సుస్వాదుక్రముకైః సగౌరఖదిరైః సుస్నిగ్ధజాతీఫలైః |
మాతః కైతకపత్రపాండురుచిభిస్తాంబూలవల్లీదలై సానందం ముఖమండ నార్థమతులం తాంబూల మంగీకురు ||
38) ఏలాలవంగాది సమన్వితాని తక్కోలకర్పూరవిమిశ్రితాని |
తాంబూలవల్లీదలసంయుతాని పూగాని తే దేవి సమర్పయామి ||
39) తాంబూలనిర్జిత సుతప్తసువర్ణవర్ణం స్వర్ణాక్తపూగఫలమౌక్తికచూర్ణయుక్తమ్ |
సౌవర్ణపాత్రనిహితం ఖదిరేన సార్ధం తాంబూలమంబ వదనాంబురుహే గృహాణ ||
40) మహతి కనకపాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరుసదృశరూపాన్బద్ధగోధూమదీపాన్ |
బహుఘృతమథ తేషు న్యస్య దీపాన్ప్రకృష్టా- న్భువనజనని కుర్వే నిత్యమారార్తికం తే ||
41) సవినయమథ దత్వా జానుయుగ్మం ధరణ్యాం సపది శిరసి ధృత్వా పాత్రమారార్తికస్య |
ముఖకమలసమీపే తేఽంబ సార్థం త్రివారం భ్రమయతి మయి భూయాత్తే కృపార్ద్రః కటాక్షః ||
42) అథ బహుమణిమిశ్రైర్మౌక్తికైస్త్వాం వికీర్య త్రిభువనకమనీయైః పూజయిత్వా చ వస్త్రైః |
మిలితవివిధముక్తాం దివ్య మాణిక్య యుక్తాం జనని కనకవృష్టిం దక్షిణాం తేఽర్పయామి ||
43) మాతః కాంచన దండమండితమిదం పూర్ణేందుబింబప్రభం నానారత్నవిశోభిహే కలశం లోకత్రయాహ్లాదకమ్ |
భాస్వన్మౌక్తికజాలికాపరివృతం ప్రీత్యాత్మహస్తే ధృతం ఛత్రం తే పరికల్పయామి శిరసి త్వష్ట్రా స్వయం నిర్మితమ్ ||
44)శరదిందుమరీచి గౌరవర్ణైర్మణిముక్తావిలసత్సువర్ణదండైః |
జగదంబ విచిత్రచామరైస్త్వామహమానందభరేణ బీజయామి ||
45) మార్తాండ మండలనిభో జగదంబ యోఽయం భక్త్యా మయా మణిమయో ముకురోఽర్పితస్తే |
పూర్ణేందుబింబ రుచిరం వదనం స్వకీయమస్మిన్విలోకయ విలోల విలోచనే త్వమ్ ||
46) ఇంద్రాదయో నతినతైర్మకుటప్రదీపైర్నీరాజయంతి సతతం తవ పాదపీఠమ్ |
తస్మాదహం తవ సమస్తశరీరమేతన్నీరాజయామి జగదంబ సహస్రదీపైః ||
47) ప్రియగతిరతితుంగో రత్నపల్యాణయుక్తః కనకమయవిభూషః స్నిగ్ధగంభీరఘోషః |
భగవతి కలితోఽయం వాహనార్థం మయా తే తురగశతసమేతో వాయువేగస్తురంగః ||
48) మధుకరవృతకుంభన్యస్తసిందూరరేణుః కనకకలితఘంటాకింకణీశోభికంఠః |
శ్రవణయుగలచంచచ్చామరో మేఘతుల్యో జనని తవ ముదే స్యాన్మత్తమాతంగ ఏషః ||
49) ద్రుతతరతుర గైర్విరాజమానం మణిమయచక్రచతుష్టయేన యుక్తమ్ |
కనకమయమముం వితానవంతం భగవతి తే హి రథం సమర్పయామి ||
50) హయగజరథ పత్తిశోభమానం దిశి దిశి దుందుభి మేఘనాదయుక్తమ్ |
అతిబహు చతురంగసైన్యమేతద్భగవతి భక్తిభరేణ తేఽర్పయామి ||
51) పరిఘీకృత సప్తసాగరం బహుసంపత్సహితం మయాంబ తే విపులమ్ |
ప్రబలం ధరణీతలాభిధం దృఢదుర్గం నిఖిలం సమర్పయామి ||
52) శతపత్రయుతైః స్వభావశీతైరతిసౌరభ్యయుతైః పరాగపీతైః |
భ్రమరీముఖరీకృతైరనంతైర్వ్యజనైస్త్వాం జగదంబ వీజయామి ||
53) భ్రమరలులిత లోలకుంతలాలీవిగలితమాల్యవికీర్ణరంగభూమిః |
ఇయమతిరుచిరా నటీ నటంతీ తవ హృదయే ముదమాతనోతు మాతః ||
54) ముఖనయన విలాసలోలవేణీవిలసితనిర్జితలోలభృంగమాలాః |
యువజనసుఖకారిచారులీలా భగవతి తే పురతో నటంతి బాలాః ||
55) భ్రమదలికుల తుల్యాలోలధమ్మిల్లభారాః స్మితముఖ కమలోద్యద్దివ్యలావణ్యపూరాః |
56) అనుపమితసువేషా వారయోషా నటంతి పరభృతకలకంఠ్యో దేవి దైన్యం ధునోతు ||
56) డమరుడిండిమజర్ఝరఝల్లరీమృదురవద్రగడద్ద్రగడాదయః |
ఝటితి ఝాంకృతఝాంకృతఝాంకృతైర్బహుదయం హృదయం సుఖయంతు తే ||
57) విపంచీషు సప్తస్వరాన్వాదయంత్యస్తవ ద్వారి గాయంతి గంధర్వకన్యాః |
క్షణం సావధానేన చిత్తేన మాతః సమాకర్ణయ త్వం మయా ప్రార్థితాసి ||
58) అభినయ కమనీయైర్నర్తనైర్నర్తకీనాం క్షణమపి రమయిత్వా చేత ఏతత్త్వదీయమ్ |
స్వయమహమతిచిత్రైర్నృత్తవాదిత్రగీతై- ర్భగవతి భవదీయం మానసం రంజయామి ||
59) తవ దేవి గుణానువర్ణనే చతురా నో చతురాననాదయః |
తదిహైకముఖేషు జంతుషు స్తవనం కస్తవ కర్తుమీశ్వరః ||
60) పదే పదే యత్పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి |
తత్సర్వపాపక్షయహేతుభూతం ప్రదక్షిణం తే పరితః కరోమి ||
61) రక్తోత్పలారక్త లతాప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖాకులిశాంకితాభ్యామ్ |
అశేషబృందారకవందితాభ్యాం నమో భవానీపదపంకజాభ్యామ్ ||
62) చరణనలిన యుగ్మం పంకజైః పూజయిత్వా కనకకమలమాలాం కంఠదేశేఽర్పయిత్వా |
శిరసి వినిహితోఽయం రత్నపుష్పాంజలిస్తే హృదయకమలమధ్యే దేవి హర్షం తనోతు ||
53) అథ మణిమయంచకా భిరామే కనకమయ వితానరాజమానే |
ప్రసరదగరుధూపధూపితేఽస్మిన్భగవతి భవనేఽస్తు తే నివాసః ||
64) ఏతస్మిన్మణిఖ చితే సువర్ణపీఠే త్రైలోక్యాభయవరదౌ నిధాయ హస్తౌ |
విస్తీర్ణే మృదులతరోత్తరచ్ఛదేఽస్మిన్పర్యంకే కనకమయే నిషీద మాతః ||
65) తవ దేవి సరోజచిహ్నయోః పదయోర్నిర్జితపద్మరాగయోః |
అతిరక్తతరైరలక్తకైః పునరుక్తాం రచయామి రక్తతామ్ ||
66) అథ మాతరుశీరవాసితం నిజతాంబూలరసేన రంజితమ్ |
తపనీయమయే హి పట్టకే ముఖగండూష జలం విధీయతామ్ ||
67) క్షణమథ జగదంబ మంచకేఽస్మిన్మృదుతలతూలికయా విరాజమానే |
అతిరహసి ముదా శివేన సార్ధం సుఖశయనం కురు తత్ర మాం స్మరంతీ ||
68) ముక్తా కుందేందు గౌరాం మణిమయకుటాం రత్నతాటంకయుక్తా- మక్షస్రక్పుష్పహస్తామభయవరకరాం చంద్రచూడాం త్రినేత్రామ్ |
నానాలంకారయుక్తాం సురమకుట మణిద్యోతితస్వర్ణపీఠాం సానందాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చింతయామి ||
69) ఏషా భక్త్యా తవ విరచితా యా మయా దేవి పూజా స్వీకృత్యైనాం సపది సకలాన్మేఽపరాధాంక్షమస్వ |
న్యూనం యత్తత్తవ కరుణయా పూర్ణతామేతు సద్యః సానందం మే హృదయకమలే తేఽస్తు నిత్యం నివాసః ||
69) పూజామిమాం యః పఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యది వా ప్రదోషే |
ధర్మార్థకామాన్పురుషోఽభ్యుపైతి దేహావసానే శివభావమేతి ||
70) పూజామిమాం పఠేన్నిత్యం పూజాం కర్తుమనీశ్వరః |
పూజాఫలమవాప్నోతి వాంఛితార్థం చ విందతి||
71) ప్రత్యహం భక్తిసంయుక్తో యః పూజనమిదం పఠేత్ |
వాగ్వాదిన్యాః ప్రసాదేన వత్సరాత్స కవిర్భవేత్||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ
దేవీచతుఃషష్ట్యుపచారపూజాస్తోత్రం సంపూర్ణమ్ ||
🕉🌞🌍🌙🌟🚩
ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం, ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం.
2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం.
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం.
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం.
5. మణి పీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం.
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట.
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట.*
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము.
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం.
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం.
11. అరుణ కుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం.
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం.
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం.
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం.
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమ మాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం.
16. భూషణ మండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము.
17. మణి పీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము.
18. నవమణి మకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం.
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం.
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం.
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం.
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం.
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం.
24. మణికుండళ యుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం.
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం.
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం.
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము.
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట.
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతా మణుల మాల వేయడం.
30. పతకం – బంగారు పతకం.
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం.
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం.
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం.
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము.
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు.
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు.
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము.
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము.
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు).
41. పాదకటకం – కాలి అందెలు.
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు.
43. పాదంగుళీయములు - మట్టెలు.
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు.
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం.
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు.
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు.
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు.
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం.
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట.
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట.
52. ఆచమనీయము – జలమునందించుట.
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది).
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము.
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం.
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట.
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట.
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట.
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట.
60. చందనం – గంధం పమర్పించుట.
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట.
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట.
63. దీపము – దీప దర్శనము చేయించుట.
64. నైవేద్య, తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట ఏకాంతము.
🕉🌞🌍🌙🌟🚩
1. శ్రీ ఆదిశంకరుల విరచిత వేదసార శివ స్తోత్రం*
మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం
1. శ్రీ ఆదిశంకరుల విరచిత వేదసార శివ స్తోత్రం*
1) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి ||
2) మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం ||
3) గిరీశం గణేశం గళే నీలవర్ణం గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం భవానీకలత్రం భజే పంచవక్త్రం ||
4) శివాకాంతశంభో శశాంకార్థమౌళే మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప ||
5 పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం ||
6) నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
*నచోష్ణం నశీతం నదేశో నవేశో నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే ||*
7) అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం ||
8) నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||
(అష్ట నమస్కార శ్లోకం)
9) ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః ||
10) శంభో మహేశ కరుణామయ శూలపాణే గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి ||
11) త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ ||
!! ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ !!
🕉 ఓంశ్రీమాత్రే నమః .... ఓంశ్రీరాం ..... ఓం నమ:శివాయ: 🕉
--(())--
మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం
(తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.
ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. వాటిని స్మరించుకొందాం.
मुक्तामणिस्तवं नयनं ममेति
राजेति जीवेति चिर सुत त्वम् ।
इत्युक्तवत्यास्तव वाचि मातः
ददाम्यहं तण्डुलमेव शुष्कम् ॥ १॥
ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.
తాత్పర్యము:
అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.
अम्बेति तातेति शिवेति तस्मिन्
प्रसूतिकाले यदवोच उच्चैः ।
कृष्णेति गोविन्द हरे मुकुन्द
इति जनन्यै अहो रचितोऽयमञ्जलिः ॥ २॥
అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.
పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
आस्तां तावदियं प्रसूतिसमये दुर्वारशूलव्यथा
नैरुच्यं तनुशोषणं मलमयी शय्या च संवत्सरी ।
एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याक्षमः
दातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ॥ ३॥
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.
తాత్పర్యము:అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
गुरुकुलमुपसृत्य स्वप्नकाले तु दृष्ट्वा
यतिसमुचितवेषं प्रारुदो त्वमुच्चैः ।
गुरुकुलमथ सर्वं प्रारुदत्ते समक्षं
सपदि चरणयोस्ते मातरस्तु प्रणामः ॥ ४॥
గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.
తాత్పర్యము:
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
न दत्तं मातस्ते मरणसमये तोयमपिवा
स्वधा वा नो दत्ता मरणदिवसे श्राद्धविधिना ।
न जप्त्वा मातस्ते मरणसमये तारकमनु-
रकाले सम्प्राप्ते मयि कुरु दयां मातुरतुलाम् ॥ ५॥
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.
తాత్పర్యము:
అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ!
--(())--
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - 64 కళలు
సర్వేజన్న సుఖినోభవంతు
చతుష్షష్టి విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.
వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు)
వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు :(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు)
ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు
ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు.
న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు
కావ్యము
అలంకారములు : సాహిత్యశాస్త్రము
నాటకములు
గానము (సంగీతం)
కవిత్వము : ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము
కామశాస్త్రము
ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ,
దేశభాషాజ్ఞానం
లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము.
వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు
సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము
స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము,
శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము
సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము
రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం
స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము
అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము
గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము
మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము
పాకకర్మ= వంటలు
దోహళము=వృక్షశాస్త్రము
గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు
ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య
ఖనీవాద- గనులు వాటి శాస్త్రం .
రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు.
అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి.
జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట.
వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య
ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య
వశ్యము - పరులను, లోబచుకొను విద్య
ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య,
మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.
విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము,
మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము.
కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము.
వాణిజ్యము - వ్యాపారాదులు.
పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు.
కృషి - వ్యవసాయ నేర్పు.
ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి
లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.
యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.
మృగయా - వేటాడు నేర్పు
రతి కళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు.
అద్మశ్యకరణీ - పరులకు కానరాని రీతిని మెలంగడము.
ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు.
చిత్ర - చిత్రకళ
లోహా - పాత్రలు చేయి నేర్పు
పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.
మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు
దారు - చెక్కపని
వేళు - వెదరుతో చేయు పనులు
చర్మ - తోళ్ళపరిశ్రమ.
అంబర - వస్త్ర పరిశ్రమ
చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు
ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము
మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము
స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము
దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము
పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య
భారతీయులు గణించిన చతుష్టష్టి కళలు[మార్చు]
కళలు 64 గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్టి కళలంటారు. అవి వరుసగా:
గీతం
వాద్యం
నృత్యం
అలేఖ్యం
విశేష కచ్ఛేద్యం
పుష్పాస్తరణం
తండుల కుసుమబలి వికారం
దశనవ సనాంగరాగం
మణి భూమికా కర్మ
శయన రచనం
ఉదక వాద్యం
ఉదకాఘాతం
చిత్రయోగాలు
మాల్య గ్రథన వికల్పాలు
శేఖర కాపీడయోజనం
నేపధ్య ప్రయోగాలు
కర్ణపత్ర భంగాలు
గంధయుక్తి
భూషణ యోజనం
ఇంద్రజాలం
కౌచుమారం
హస్తలాఘవం
వంటకాలు
సూచీవాన కర్మ
సూత్ర క్రీడ
వీణా డమరుక వాద్యాలు
ప్రహేళికలు
ప్రతిమాల
దుర్వాచక యోగాలు
పుస్తక వాచనం
నాటకాఖ్యాయికా దర్శనం
కావ్య సమస్యా పూరణం
పట్టికా వేత్ర వాసవికల్పాలు
తర్కు కర్మలు
తక్షణం
వాస్తువిద్య
రూప్యరత్న పరీక్ష
ధాతువాదం
మణిరాగాకర జ్ఞానం
వృక్షాయుర్వేద యోగాలు
మేష కుక్కుట లావట యుద్ధ విధులు
శుకశారికా ప్రలాపాలు
ఉత్సాదనే, సంవాహనే, కేశమర్దనేచ కౌశలం,
అక్షర ముష్టికా కథనం
మ్లేచ్చిక వికల్పాలు
దేశభాషా విజ్ఞానం
పుష్పశకటిక
నిమిత్త జ్ఞానం
యంత్రమాతృక
ధారణ మాతృక
మానసీక్రియ
సంపాఠ్యం
కావ్యక్రియ
అభిధానకోశం
ఛందోజ్ఞానం
క్రియాకల్పం
చలితక యోగం
వస్త్రగోపనం
ద్యూతవిశేషాలు
ఆకర్షక్రీడం
బాల క్రీడనకాలు
వైనయికే జ్ఞానం
వైజయికీ విద్యలు
వ్యాయామికీజ్ఞానం
--(())--
తోటకాచార్య విరచిత / తోటకాష్టకమ్
ఓం శ్రీ రామ్ - ఓంశ్రీమాత్రే నమః
శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్|| నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్||
1) విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిత్కథితార్థనిధే|
హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణమ్||
సకలశాస్త్ర సుధాబ్ధిని చిలికి తదంతర్గమైన మకరందమాధుర్యాన్నితాను గ్రహించి ఇతరులందరికీ పంచాలని అహర్నిశలు పరితపించిన ఓ శంకరా! భావితరాలని ఉద్ధరించాలన్న ఏకైక కారణంచేత వేదాంతోపవనాల్లో నిక్షిప్తమైన ఉపనిషత్తులలో దాగున్న నిధులని శేకరించి భాష్యాలుగా ప్రకటించి పంచిపెట్టినట్టి ఓ శంకరా! నా మదిలో విమలమైన నీ చరణాలని స్థాపించి అనునిత్యము పూజించుకుంటాను. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
2) కరుణావరుణాలయ పాలయ మాం భవసారదుఃఖ విదూన హృదమ్|
రచయాఖిదర్శన తత్త్వవిదం భవశంకర దేశిక మే శరణమ్||
ఓ కరుణాసింధూ! మమ్ము పాలించు. రక్షించు. శాసించు. జరామరణవలయంలో నా మది చిత్రవధ చెందింది. సాంఖ్య, జైన,మీమాంస, పాంచరాత్రం, శైవాది మార్గాలనెన్నో దర్శించి ముముక్షత్వానికి ఖచ్చితమైన మార్గాన్ని “శివః కేవలోహమ్” అని నిర్ణయించావే! ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
4) భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే|
కలయేశ్వర జీవవివేకవిదం భవశంకర దేశిక మే శరణమ్||
ఆహా! నీ బోధలనే అమృతపు జల్లులలో సేదతీర్చుకుంటూ ఎందరో లోకులు శాశ్వతమైన ఆనందాన్ని కరతలామలకం చేసుకున్నారే. ఆత్మవిచక్షణ, నిజరూపదర్శనం అనుగ్రహించడంలో నీకు నువ్వే సాటి. ఆత్మవిద్యనాకు అవగతమయ్యేట్లుగా అనుగ్రహించవయ్యా! ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
4) భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా|
మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణమ్||
“శంకరశ్శంకరసాక్షాత్” అని నాకు పూర్తిగా అర్థమైంది. ఆ ఆనందలహరి నా చిత్తాన్ని నింపివేసింది. మోహార్ణవాన్ని దాటడానికి నాకదే ఇంధనము. నన్ను గట్టెక్కించు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
5) సుక్రుతే౭ధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా|
అతిదీనమిమం పరిపాలయమాం భవశంకర దేశిక మే శరణమ్||
ఇది నా అదృష్టం. ఎంచేతంటే పూర్వజన్మకృత పుణ్య ఫలాధిక్యతచేత మాత్రమే ఆత్మవిద్యని నీద్వారా తెలుసుకోవాలని బలీయమైన కోరిక నాలో ఉత్పన్నమైంది. నేను దీనాతిదీనుడను. అంచేత నన్ను పరిపాలించు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
6) జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః|
అహిమాంశురివాత్ర విభాసిగురో భవశంకర దేశిక మే శరణమ్||
జగదోద్ధారణ చేసేందుకై కృషిచేస్తూ ఎందరో మహానుభావులు గురువులుగా అవతరించారు. ఆ పరంపరలో నీవుమాత్రం నాకు సూర్యభగవానునివలే ప్రకాశిస్తూ కనిపిస్తున్నావు. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
7) గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కో౭పి సుధీః|
శరణాగతవత్సల తత్త్వనిధే భవశంకర దేశిక మే శరణమ్||
ఓ గురువరేణ్యా. ధర్మమునకు సంకేతమైన వృషభాన్ని జైపతాకంగా కల్గిన శంకరుడవు నీవేకదా. నిన్ను మించిన లేక నీతో సముడైన జ్ఞాని ఎవ్వరూ లేరయ్యా.నిన్నాశ్రయించినవారిని వాత్సల్యంతో పరిరక్షించే తత్త్వనిధివి నీవే. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
8)విదితానమయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో|
దృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణమ్ ||
ముముక్షత్వానికి ఏ మార్గమవలంబించాలో నాకు తెలియటంలేదు. నా వద్ద ఎటువంటి ఐశ్వర్యమూ లేదు. నీవే నిశ్చయపూర్వకంగా నీ సహజమైన కృపను నాపై ప్రసరించునట్లు చేయి. ఓ ఆచార్యా! శంకరా! నీవే నాకు శరణం.
శ్రీ ఆదిశంకర భగవత్పాదుల దివ్య చరణారవిందాలకి ప్రణమిల్లుతూ...
🕉🌞🌎🌙🌟🚩
శ్రీచన్ద్రశేఖరభారతీనవరత్నమాలికా (శృఙ్గేరీజగద్గురుశ్రీశ్రీభారతీతీర్థమహాస్వామి విరచితా)
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
1) శ్రీమచ్చన్ద్రశేఖరభారత్యభిధానమాశ్రయే యమినమ్ ।
నిరవధిసంసృతినీరధిమగ్నజనోద్ధరణబద్ధదీక్షం తమ్ ॥
2) కాషాయామ్బరపరివృతమీషత్స్మితవదనమిష్టదాతారమ్ ।
శేషాఖ్యేయగుణాలిం భూషాయిత శమదమాదికం వన్దే ॥
3) గాఙ్గఝరీసమవాచం స్వాఙ్గత్విణ్ణిర్జితాచ్ఛగాఙ్గేయమ్ ।
మాఙ్గలికమాశ్రయేఽహం జాఙ్గలికం భవమహావిషస్యేశమ్ ॥
4) కరుణామృతసరిదీశం గురుణాఽపి స్తుత్యమతులధీయుక్తమ్ ।
తరుణారుణవదనాబ్జం చ నృణాం గమ్యం తమాశ్రయే సతతమ్ ॥
5) అతివేలమధురభాషితమతితరలస్వాన్తమఖిలవన్ద్యపదమ్ ।
యతివర్యం హృది కలయే మతిమాన్ద్యస్యాపనుత్తయే సతతమ్ ॥
6) పాలితనిజభక్తతతిం శీలితవేదాన్తగూఢతత్త్వం తమ్ ।
మీలితలోచనయుగలం లాలిత భువనత్రయం నమామి సదా ॥
7) రాకాశశినిభవక్త్రం పాకారిప్రముఖకీర్త్యచారిత్రమ్ ।
ఆకాశకేశభక్తం శోకాపహమాశ్రయే గురూత్తంసమ్ ॥
8) తాపారణ్యకృశానుం భూపాలకవన్దనీయపదయుగలమ్ ।
పాపాపహనామానం శాపాను గ్రహ సమర్థమహమీడే ॥
9) శఙ్కరదేశికవిరచితపీఠాధిపమాలికామహారత్నమ్ ।
ప్రణమామి చన్ద్రశేఖరభారత్యభిధానదేశికం హృదయే ॥
ఇతి శృఙ్గేరీజగద్గురుశ్రీశ్రీభారతీతీర్థమహాస్వామివిరచితా శ్రీచన్ద్రశేఖరభారతీనవరత్నమాలికా సమాప్తా ॥
🕉🌞🌏🌙🌟🚩


ఓం
ReplyDelete