మీకు నచ్చే కవితలు 001-01-2023 to l07-01-2023
ఈవారం కవితలు - 1. నేస్తమా , 2. చిన్నది 3. స్థితి 4. కాఫీ లీల 5. లీల 6. సభాపతి 7. ద్విపద ప్రేమ

నేటి కవిత - నేస్తమా
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నేస్తమానేస్తమా నన్నొదిలి పోలేవు,
అర్ధం చేసుకో లేక పోతున్నావు,
వాస్తవ మనోభావాలు తెల్ప లేకున్నావు,
నీవు ఒక వస్తువు కాదు నేస్తమా
నను వలచి వెంబడించావు,
నను తలచి తపన చెందావు,
నను కలసి మాటలు చెప్పావు
నీవు ధర్మమార్గాన్ని చూపావు నేస్తమా
స్వార్ధమునకు మనమధ్య చోటు లేదు
నిస్వార్ధ సేవలే మనమధ్య కమ్ముకున్నాయి
సుస్వరభావామృతము మనమధ్య ఉన్నది
మదిని మరిపించుట కదా నేస్తమా
వర్ణ వివక్ష మన మధ్య రాదు
వర్గ విలక్షణ అసలు లేదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమయే నేస్తమా
మనసారా నన్ను పిలిచావు
మదితీరా మనసును తెలిపావు
హృదయ స్పందన ఒక్కటిగా మలిచావు
వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా
ఎప్పుడొస్తావో తెలపవు
ఎలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు
మరువ లేనని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా
నేస్తానికి నేస్తం ప్రాణం
ప్రాణానికి ప్రాణం దేహం
దేహానికి దేహం ప్రేమ
ప్రేమకి ప్రేమే దాసోహం నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా
--(())--

నేటి కవిత - చిన్నది
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మంచు కన్న చల్లని మనసున్నది
వయ్యార వంపుల వయస్సు ఉన్నది
నందనవనం లాంటి యవ్వనముంది
బృందావనం లాంటి సొగసు ఉన్నది
భోగవతిని మించిన ప్రాయముంది
యమునలా పరవళ్ళు త్రొక్కుతోంది
పరువమ్ము పొన్ననీడగా మారింది
పదారేళ్ళ వయస్సులోన చిన్నది
విహంగమై వినువీధి తిరిగింది
నాజూకు నడకలో కలిగున్నది
అందమంతా ఒక్కరాశిలో ఉన్నది
పోటీలో గెలుపు తనకే నన్నది
తళుకుల తో మెరిసి పోతున్నది
సృష్టికిమూలం అందముయే నంటుంది
ప్రకృతి తన ఆకృతిగా మారింది
ఆనందానికి హద్దులు లేవన్నది
అగ్నిపర్వతపు జ్వాల గై యున్నది
హిమంతో వేడికి చేరువై ఉన్నది
ధరణి అంత ఓర్పు కలిగి ఉన్నది
వయసు మెరుపులతో కల్గున్నది
కోయిలలా పాటలు పాడు చిన్నది
జలపాతంలా కదులుచూ ఉన్నది
మనసుకు మనసై ప్రేమ పంచింది
కళ్ళతో సుఖము అందించే చిన్నది

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - నేటి కవితా స్థితి
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
మెలకువలో ఒకరీతి, నిద్రలో మరోరీతి,
సందేహముల మధ్య ఇతి హాసపు నీతి,
నడమంత్రపు సిరి తో మది పోగొట్టే నీతి,
సుఖ దు:ఖాల నడుమ ఏక మయమై నీతి
పాప పుణ్యాల కళల లోకము మనిషి స్తితి
మంచి చెడులు చెప్పలేని మానవులకు గతి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధోగతి
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు యేగతి
లోకంలో ప్రీతి యనున దేదీ లేని విధం స్థితి
జ్ణానరూప జ్ణాన గమ్య జ్ణాన శక్తి లేని స్థితి
విశ్వ మంతయు ఆరోగ్యము స్థిరం లేని స్థితి
శస్య శ్యామలమని చెప్పుకోలేని పరిస్థితి
అవకాశ వాద ప్రతివాదనలు చెప్పలేని స్థితి
అగమ్యగోచరంగా మారిఅర్ధం కాని ప్రజల స్ధితి
అర్ధం కోసం ఆశల బండిని లాగే టి మతి స్థితి
దైవమా నీవే గతి అని ప్రార్ధించుటయే స్థితి
- - ((*)) - -

ఆరాధ్య కాఫీ లీల
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
అది నీలో నేర్పును ఫిలాసఫీ
నీకు ఎదురులేదు అదే మాఫీ
ఎత్తైన మెడ జంతువు జిరాఫీ
నాకు ఇష్టం చెక్కర పాల బర్ఫీ
నాకు ఎప్పుడూ ఉండును బార్ తారిఫ్ (మన:సాక్షి)
అందుకే నే చేసే ధర్మబోధ ఫ్రీ
కాలం అందిస్తుంది వనరులు ఫ్రీ
పుడమితల్లి లో ఖనిజాలు ఫ్రీ
ఆకాశ మేఘాల వర్షం మనకు ఫ్రీ
కానిదంటూ లేదు స్త్రీ పొందు ఫ్రీ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
--((**))--

ఆరాధ్య సంసార లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కాలమనే నావలో, భూమి యనే సంద్రం లో
ప్రే మనే జీవిలో, మనసనే సంసారం లో
అణువణువు ప్రకంపనలే
తనుతనువు తపస్సులులే
కనకనువు ఊగిసలులే
తడి పొడులు సరాగములే ...... కా
వయసులో పెరుగు ఉబలా టలే
మమతలో మరుగు కీచులాటలే
తనువులో జరుగు కుమ్ములాటలే
బ్రతుకులో నలుగు జంజలాటలే ...... కా
ఆశాపాశము లో చిక్కి తన్నులాటలే
ధనమదములో నల్గి అనారోగ్యులే
తన్వా కర్షణలో మర్గి వళ్ళు గుల్లలే
పుణ్యపాపాలలో చిక్కి బొమ్మలాటలే ...... కా
ఉన్నది లేనిది, లేనిది ఉందని వాదనలే
మంచే చెడని చెడె మంచిని నీ నా వాదనలే
నీవు గొప్ప నేను ఒప్ప నీవు దిబ్బ వాదనలే
జీవితం లో నీవు నేను వాదం ఏకం తప్పఁదులే ...... కా
కాలమనే నావలో భూమి యనే సంద్రం లో
ప్రేమనే జీవిలో మనసనే సంసారం లో
--((**))--
నేటి కవిత *సభాపతి
రచన: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సభా పతియే రాజ్యాంగమునకు దైవం
హుందాగా సభ నిర్వాహణయే ఆదర్శం
వాక్కును క్రమ శిక్షణగా చేయు మార్గం
నిత్యం సభ నిర్వాహానే అతని లక్ష్యం
దొరకునా ఈధరణి పై నాకు భాగ్యం
సుమధుర సాహిత్యామృత పల్కు స్నేహం
ప్రజలు ఎన్నుకున్న నాయకున్న ప్రాంతం
సస్యశ్యామలం చేసేటి అమృత భాష్యం
వేదం, పురాణ గాధల లోని మహత్యం
సందర్బోచిత నీతులు ధర్మోప దేశమ్
ప్రజల దైవాన్ని గుర్తించే ఉపన్యాసం
వాద ప్రతివాద సభాపతి సన్మానం
--((*))--
శ్రీ శ్రీ గారి మీసం మీద సీసం
.
‘కుమ్మరి మొల్ల’ సినిమాలో మొల్ల ప్రతిభను పరిశీలించడానికి తెనాలి రామలింగడు సమస్యను ఇచ్చే సందర్భంలో ఒక పద్యం రాయవల్సి వచ్చి
శ్రీశ్రీగారు, అవధాన ప్రక్రియలో అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అనే దత్తపదాలను తీసుకొని
పద్యంలో అప్పు అంటే ఋణం, నిప్పు అంటె అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్ధాలు రాకుండా ఈ కింది కంద పద్యం రాశారు
అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్!
.
అగాథమవు జలనిధిలోనా అణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని వేదాంత సారాన్ని హృద్యంగా చెప్పగలిగే అభ్యుదయ కవి నుంచి ఇలాంటి పద్యాన్ని ఎవరూ ఊహించరు.
లాగే ఆ మహాకవి కులగోత్రాలు సినిమా కోసం మీసం మీద రాసిన సీసం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుందాం.
కారుమబ్బుల బారు సేరునేలెడి తీరు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు

నేటి కవిత - నేస్తమా
రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
*నేస్తమానేస్తమా నన్నొదిలి పోలేవు,
అర్ధం చేసుకో లేక పోతున్నావు,
వాస్తవ మనోభావాలు తెల్ప లేకున్నావు,
నీవు ఒక వస్తువు కాదు నేస్తమా
నను వలచి వెంబడించావు,
నను తలచి తపన చెందావు,
నను కలసి మాటలు చెప్పావు
నీవు ధర్మమార్గాన్ని చూపావు నేస్తమా
స్వార్ధమునకు మనమధ్య చోటు లేదు
నిస్వార్ధ సేవలే మనమధ్య కమ్ముకున్నాయి
సుస్వరభావామృతము మనమధ్య ఉన్నది
మదిని మరిపించుట కదా నేస్తమా
వర్ణ వివక్ష మన మధ్య రాదు
వర్గ విలక్షణ అసలు లేదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమయే నేస్తమా
మనసారా నన్ను పిలిచావు
మదితీరా మనసును తెలిపావు
హృదయ స్పందన ఒక్కటిగా మలిచావు
వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా
ఎప్పుడొస్తావో తెలపవు
ఎలా వస్తావో తెలపవు
ఏకంగా మమత పంచేసావు
మరువ లేనని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా
నేస్తానికి నేస్తం ప్రాణం
ప్రాణానికి ప్రాణం దేహం
దేహానికి దేహం ప్రేమ
ప్రేమకి ప్రేమే దాసోహం నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా
--(())--
నేటి కవిత - చిన్నది
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మంచు కన్న చల్లని మనసున్నది
వయ్యార వంపుల వయస్సు ఉన్నది
నందనవనం లాంటి యవ్వనముంది
బృందావనం లాంటి సొగసు ఉన్నది
భోగవతిని మించిన ప్రాయముంది
యమునలా పరవళ్ళు త్రొక్కుతోంది
పరువమ్ము పొన్ననీడగా మారింది
పదారేళ్ళ వయస్సులోన చిన్నది
విహంగమై వినువీధి తిరిగింది
నాజూకు నడకలో కలిగున్నది
అందమంతా ఒక్కరాశిలో ఉన్నది
పోటీలో గెలుపు తనకే నన్నది
తళుకుల తో మెరిసి పోతున్నది
సృష్టికిమూలం అందముయే నంటుంది
ప్రకృతి తన ఆకృతిగా మారింది
ఆనందానికి హద్దులు లేవన్నది
అగ్నిపర్వతపు జ్వాల గై యున్నది
హిమంతో వేడికి చేరువై ఉన్నది
ధరణి అంత ఓర్పు కలిగి ఉన్నది
వయసు మెరుపులతో కల్గున్నది
కోయిలలా పాటలు పాడు చిన్నది
జలపాతంలా కదులుచూ ఉన్నది
మనసుకు మనసై ప్రేమ పంచింది
కళ్ళతో సుఖము అందించే చిన్నది
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - నేటి కవితా స్థితి
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
మెలకువలో ఒకరీతి, నిద్రలో మరోరీతి,
సందేహముల మధ్య ఇతి హాసపు నీతి,
నడమంత్రపు సిరి తో మది పోగొట్టే నీతి,
సుఖ దు:ఖాల నడుమ ఏక మయమై నీతి
పాప పుణ్యాల కళల లోకము మనిషి స్తితి
మంచి చెడులు చెప్పలేని మానవులకు గతి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధోగతి
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు యేగతి
లోకంలో ప్రీతి యనున దేదీ లేని విధం స్థితి
జ్ణానరూప జ్ణాన గమ్య జ్ణాన శక్తి లేని స్థితి
విశ్వ మంతయు ఆరోగ్యము స్థిరం లేని స్థితి
శస్య శ్యామలమని చెప్పుకోలేని పరిస్థితి
అవకాశ వాద ప్రతివాదనలు చెప్పలేని స్థితి
అగమ్యగోచరంగా మారిఅర్ధం కాని ప్రజల స్ధితి
అర్ధం కోసం ఆశల బండిని లాగే టి మతి స్థితి
దైవమా నీవే గతి అని ప్రార్ధించుటయే స్థితి
- - ((*)) - -
ఆరాధ్య కాఫీ లీల
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
అది నీలో నేర్పును ఫిలాసఫీ
నీకు ఎదురులేదు అదే మాఫీ
ఎత్తైన మెడ జంతువు జిరాఫీ
నాకు ఇష్టం చెక్కర పాల బర్ఫీ
నాకు ఎప్పుడూ ఉండును బార్ తారిఫ్ (మన:సాక్షి)
అందుకే నే చేసే ధర్మబోధ ఫ్రీ
కాలం అందిస్తుంది వనరులు ఫ్రీ
పుడమితల్లి లో ఖనిజాలు ఫ్రీ
ఆకాశ మేఘాల వర్షం మనకు ఫ్రీ
కానిదంటూ లేదు స్త్రీ పొందు ఫ్రీ
అందరి జీవితం సాగాలి సాఫీ
అందుకు త్రాగాలి నిత్యము కాఫీ
ఆరాధ్య సంసార లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
కాలమనే నావలో, భూమి యనే సంద్రం లో
ప్రే మనే జీవిలో, మనసనే సంసారం లో
అణువణువు ప్రకంపనలే
తనుతనువు తపస్సులులే
కనకనువు ఊగిసలులే
తడి పొడులు సరాగములే ...... కా
వయసులో పెరుగు ఉబలా టలే
మమతలో మరుగు కీచులాటలే
తనువులో జరుగు కుమ్ములాటలే
బ్రతుకులో నలుగు జంజలాటలే ...... కా
ఆశాపాశము లో చిక్కి తన్నులాటలే
ధనమదములో నల్గి అనారోగ్యులే
తన్వా కర్షణలో మర్గి వళ్ళు గుల్లలే
పుణ్యపాపాలలో చిక్కి బొమ్మలాటలే ...... కా
ఉన్నది లేనిది, లేనిది ఉందని వాదనలే
మంచే చెడని చెడె మంచిని నీ నా వాదనలే
నీవు గొప్ప నేను ఒప్ప నీవు దిబ్బ వాదనలే
జీవితం లో నీవు నేను వాదం ఏకం తప్పఁదులే ...... కా
కాలమనే నావలో భూమి యనే సంద్రం లో
ప్రేమనే జీవిలో మనసనే సంసారం లో
--((**))--
నేటి కవిత *సభాపతి
రచన: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సభా పతియే రాజ్యాంగమునకు దైవం
హుందాగా సభ నిర్వాహణయే ఆదర్శం
వాక్కును క్రమ శిక్షణగా చేయు మార్గం
నిత్యం సభ నిర్వాహానే అతని లక్ష్యం
దొరకునా ఈధరణి పై నాకు భాగ్యం
సుమధుర సాహిత్యామృత పల్కు స్నేహం
ప్రజలు ఎన్నుకున్న నాయకున్న ప్రాంతం
సస్యశ్యామలం చేసేటి అమృత భాష్యం
వేదం, పురాణ గాధల లోని మహత్యం
సందర్బోచిత నీతులు ధర్మోప దేశమ్
ప్రజల దైవాన్ని గుర్తించే ఉపన్యాసం
వాద ప్రతివాద సభాపతి సన్మానం
--((*))--
.
‘కుమ్మరి మొల్ల’ సినిమాలో మొల్ల ప్రతిభను పరిశీలించడానికి తెనాలి రామలింగడు సమస్యను ఇచ్చే సందర్భంలో ఒక పద్యం రాయవల్సి వచ్చి
శ్రీశ్రీగారు, అవధాన ప్రక్రియలో అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అనే దత్తపదాలను తీసుకొని
పద్యంలో అప్పు అంటే ఋణం, నిప్పు అంటె అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్ధాలు రాకుండా ఈ కింది కంద పద్యం రాశారు
అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్!
.
అగాథమవు జలనిధిలోనా అణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని వేదాంత సారాన్ని హృద్యంగా చెప్పగలిగే అభ్యుదయ కవి నుంచి ఇలాంటి పద్యాన్ని ఎవరూ ఊహించరు.
లాగే ఆ మహాకవి కులగోత్రాలు సినిమా కోసం మీసం మీద రాసిన సీసం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుందాం.
కారుమబ్బుల బారు సేరునేలెడి తీరు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు
Comments
Post a Comment