మాస్టర్ ఇ.కె. గారి సందేశములు
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 19 🌹
✍️
ప్రస్తుత మానవుని మానసిక బలహీనతలో భయమొకటి. పశుపక్ష్యాదులకును భయము కలదు. కాని తమను తాము కాపాడుకొను అంశము వరకే వాని భయము పరిమితము.
పశువుల నుండి పరిణమించిన నరుడు పశుప్రవృత్తియగు భయము కలిగియుండుటలో ఆశ్చర్యము లేదు. కాని పశువులలో కన్నా నరుని భయము విస్తరించినది.
ఆధునిక మానవుని మనస్సు అత్యధికమైన వేగముతో పనిచేయుట వలన ఇట్లు జరుగుచున్నది.
మానవునిలో ఆవేశములు, ఉద్వేగములు బలముగా ఉన్నప్పుడు భయము పెరుగును. గతమును గూర్చిన అతని గుర్తులు, భవిష్యత్తును గూర్చిన ఊహపోహలు అతనిని భయకంపితుని చేయుచున్నవి.
తనకు సన్నిహితులు అనబడు వారికి సంబంధించిన విషాద సమాచారము కూడ ఈ రోజులలో వేగముగా ప్రసారము చేయబడుటతో భయము పెరుగుచున్నది.
భయగ్రస్తుడు కానివాడెవడు? జంతుమానవుడు ప్రకృతి శక్తులను, చీకటిని, తెలియనివానిని గూర్చి భయపడును.
నాగరిక మానవుడు సన్నిహితుల వియోగము, ఆరోగ్యము, ధనము, పలుకుబడి వీని విషయమున భయపడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2 🌷*
*సంకలనం : వేణు మాధవ్*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻. సాధకుడు తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. 🌻*
*🥀. ఆధ్యాత్మిక జీవన విధానమును అవలంబించిన వారు జీవితంలో చాలా కష్టాలను అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ? 🥀*
*🌻. తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు.*
*మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది.*
*అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.*
*మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు.*
*ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి.*
*తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు.*
*నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.*
🌷 🌷 🌷 🌷 🌷
✍️
ప్రస్తుత మానవుని మానసిక బలహీనతలో భయమొకటి. పశుపక్ష్యాదులకును భయము కలదు. కాని తమను తాము కాపాడుకొను అంశము వరకే వాని భయము పరిమితము.
పశువుల నుండి పరిణమించిన నరుడు పశుప్రవృత్తియగు భయము కలిగియుండుటలో ఆశ్చర్యము లేదు. కాని పశువులలో కన్నా నరుని భయము విస్తరించినది.
ఆధునిక మానవుని మనస్సు అత్యధికమైన వేగముతో పనిచేయుట వలన ఇట్లు జరుగుచున్నది.
మానవునిలో ఆవేశములు, ఉద్వేగములు బలముగా ఉన్నప్పుడు భయము పెరుగును. గతమును గూర్చిన అతని గుర్తులు, భవిష్యత్తును గూర్చిన ఊహపోహలు అతనిని భయకంపితుని చేయుచున్నవి.
తనకు సన్నిహితులు అనబడు వారికి సంబంధించిన విషాద సమాచారము కూడ ఈ రోజులలో వేగముగా ప్రసారము చేయబడుటతో భయము పెరుగుచున్నది.
భయగ్రస్తుడు కానివాడెవడు? జంతుమానవుడు ప్రకృతి శక్తులను, చీకటిని, తెలియనివానిని గూర్చి భయపడును.
నాగరిక మానవుడు సన్నిహితుల వియోగము, ఆరోగ్యము, ధనము, పలుకుబడి వీని విషయమున భయపడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2 🌷*
*సంకలనం : వేణు మాధవ్*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻. సాధకుడు తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. 🌻*
*🥀. ఆధ్యాత్మిక జీవన విధానమును అవలంబించిన వారు జీవితంలో చాలా కష్టాలను అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ? 🥀*
*🌻. తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు.*
*మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది.*
*అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.*
*మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు.*
*ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి.*
*తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు.*
*నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.*
🌷 🌷 🌷 🌷 🌷
. కోరికలు - ధర్మస్వరూపము 🌻
ధర్మము మొదలగు వాని స్వరూపము కోరిన వానిని బట్టి మారుచుండును. కోరనివాని ధర్మమునకు ప్రభువు అచ్యుతుడు. కోరిన వారి ధర్మమునకు ప్రభువులు కోరిన వారే. తుదకు మోక్షము కూడ నిట్లే. మోక్షమనగా ఉపాసకుడు ఏమనుకొనుచున్నాడో అదియే దక్కును గాని , సకల బంధ విమోచనము దక్కదు . మోక్షమునకు గూర్చి తనకు గల అభిప్రాయములు తనను బంధించును. అపుడు మోక్షమను పేర జీవుడు బద్ధుడగుచు దాని కొరకై యత్నించుచు చచ్చుచు, పుట్టుచుండును.
. ఇదియే విష్ణుమాయ.
* ఎదిరించి యుద్ధము చేయుచున్నను , భక్తితో కొలిచినను శ్రద్ధతో మనస్సు విష్ణుని యందుంచుట జరుగును. ఏ విధముగా జరిగినను వానిపై మనస్సు నిలుచుట చాలును. దానితో వారి భావములు కరగిపోయి మనస్సు మాత్రము నిలబడును. ఆ మనస్సు భగవంతుని ప్రతిబింబముగా పరిణమించును. అపుడు జీవుడుండక భగవంతుడే యుండును.*
. అదియే మోక్షస్థితి.
క్రమము - క్రతువు
భగవంతుని తత్త్వము అంతు పట్టనది
భగవంతుడు జీవుడుగా దేహములలోనికి దిగి వచ్చునపుడు , దేహములందలి యింద్రియములను సృష్టించి కాపాడు దేవతలకు గూడ వాని తత్త్వము అంతుపట్టదు. కనుకనే వేదములలో " కంటి నుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవి నుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడూహించునో, మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో.....". అతడే భగవంతుడని వర్ణింపబడినది. ఆతడు ఇంద్రియముల నడుమ జీవుడై దిగివచ్చి క్రీడించుచు , ఇంద్రియములచే కూడ తెలియబడడు.
వేడుకతో గోపాలవరులతో గూడి గోవులను, దూడలను గాచెను. అపుడు గూడ నందలి గోపాల శ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు. (గోపాలవరులు అను మాటకు ఇంద్రియములను రక్షించు దేవతలని కూడ నర్థము.)
భగవంతునికి పూజాదికముల రూపమున తమకున్నది సమర్పించుట మాని తమ్ము తాము సమర్పణ చేసుకొనువారికి సంసార తాపములను అతడే నివారించును. అట్టివారి కథలను ఆతని కథలుగా అనుభవించు వారు నిజమైన మోక్షమును పొందుచున్నారు.
కృతజ్ఞత
భారతదేశం తన మహాఋషులందు ఒకరైన పరమహంస యోగానందగారి ద్వారా మనకు ఈ ఆత్మ సాక్షాత్కారమనే అమూల్య జ్ఞానాన్ని తెచ్చి ఇచ్చింది.
మానవునిలో దివ్యశక్తులను కనుగొనడానికి, యుగయుగాల నుండి అనేక మంది ఏ దేశపు మహాత్ములు తమ జీవితాలను, సర్వస్వాన్ని త్యాగం చేసేరో, అలాటి దేశానికి, ప్రజలకు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి?
పరమహంసగారి బోధనల ద్వారా మనకు భారతదేశం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మనం ఏమి ఇచ్చినా అది, ఆయన బోధనలంత విలువ చెయ్యదు.
నేడు పాశ్చాత్య మానవునికి తన ఆత్మశక్తులను పెంపొందించుకొనే ఆధ్యాత్మిక ప్రక్రియల అవసరం చాలా ఉంది.
క్రియా యోగము వంటి పురాతన శాస్త్రీయ ప్రక్రియను భారతదేశం నుండి వచ్చిన గురువు ప్రప్రధమంగా మన వద్దకు తెచ్చారు.
-శ్రీ రాజర్షి జనకానంద
23. పని
పనిని ప్రేమించుట ఉత్తమ లక్షణము. పనిని నిర్లక్షింప కుండుట మధ్యమ లక్షణము. పనిని గర్హించుట అధమ లక్షణము. పనిని గర్హించు వాడు క్రమశః జ్ఞానమును కోల్పోవును. అది కారణముగ ధర్మాధర్మ విచక్షణము కూడ పోవును. విలువైన విషయముల యందు శ్రద్ధ తగ్గుటయే కాక విముఖత, ఏహ్యభావము కూడ కలుగును. అట్టివారికి మా సోదర బృందమును గూర్చి తెలిపినచో చిట్టెత్తును. మండి పడుదురు. పందికి ముత్యముల విలువ తెలియదు కదా! అట్లే పని దొంగకు సత్పురుషులు, సద్ధంథములు, సత్ భాషణములు స్ఫూర్తి నివ్వక ఏహ్యత కలిగించును. విలువైన విషయముల యందు ఏహ్యత కలుగుట అపాయకరము.
అనగా రాబోవు అపాయమును సూచించును. సత్పురుషులు, సద్ధంథములు, సత్కార్యములు దూషింప బడు తావున క్షణమాత్రము ఉండరాదు. ఇది మా శాసనము. ఇతరములగు వ్యామోహములకు లోబడి అట్టి ప్రదేశముల యందు గాని, వ్యక్తులతోగాని మసలినచో మీకుగల క్రమశిక్షణము దెబ్బ తినుటయే గాక ధర్మసూత్రముల యందు అనుమానముకూడ ఏర్పడ గలదు. నియమిత కార్యములను ఏకోన్ముఖముగ నిర్వర్తించుచు, నిర్వర్తింపబడు కార్యములను ప్రేమించుచు జీవించుట శ్రేయోదాకము.
. సాధన యొక్క రెండు తరగతులు
ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. ఎంత తెలిసిన వారైనను నిర్ణయము తమది అయినపుడు తమ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును.
ఇక రెండవ తరగతి వారు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. కనుక వారి మార్గమున పతనము లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు.
కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. కర్తవ్యము నిర్వహించుకొని దానిని భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు.
నరకము
మనము చేయు పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డపనులు అను విభాగము ఎట్లు ఏర్పడునుచున్నది? తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనవలెను.
ఇది ఎట్లు తెలియును? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించు చున్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మ బుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు.
49.. లోకోద్ధరణము- లోక కల్యాణము
లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము. ఈ సాగరమే వాసుదేవుడు.
ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.
దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు.
జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.
నిజానికి లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి.
కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు. కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు.
కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు.
అలాకాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు....
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
48 🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము 🌻
జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు. వీరు కాలస్వరూపుడగు వాసుదేవుని మంద్రజాలంలో పరవశిస్తుంటారు.
ఇట్టి వారి ద్వారా వాసుదేవుడు తన సాన్నిధ్యాన్ని వ్యక్తం చేయడంతో, వీరిని చేరినవారికి ఆనందం, శాంతి కలుగుతాయి. ఇదియే సత్యం కాని, మొత్తం లోకంతా ఒక్కసారిగా విష్ణుధర్మావలంబులు కావడం జరుగదు.
అసలు తనను తానే ఉద్ధరించుకోలేని నరుడు లోకాన్ని ఉద్ధరిస్తాననడం పిచ్చిమాత్రమే. ఆ దృక్పథమే రోగ గ్రస్తమగు మనోవైఖరి.
జీవులకు యోగక్షేమాలను ప్రసాదించేది వారి వారి కర్మలను బట్టి వాసుదేవుడే కాని ఇంకెవరూ కాదు. మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే.
ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది.
అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.
అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము.
లోకకల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకుఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురు గాక...
🌹 🌹 🌹 🌹 🌹
47 🌻. భాగవతము వివరణ - కుబేరుని బోధలు 🌻
ఒకే పాత్ర యందు పోసిన జలమొకటిగనే యుండును. రెండు జలములుండుట సాధ్యము కాదు. కాని ఆ జలమే మంచుగడ్డలుగా కట్టినపుడు ఒకే పాత్రయందు రెండు గాని ఎక్కువ గాని మంచుగడ్డలుండుట సాధ్యము.
అవి ఒకదాని నుండి ఒకటి వేరుగా నుండును. ఒకదాని స్పర్శ ఇంకొకదానికి కలుగును. ఒక దానితో ఇంకొక దానిని కొట్టినచో బ్రద్దలగుట, శబ్దము వచ్చుట మున్నగు క్రొత్త చేష్టలు పుట్టుచున్నవి. నీరు మంచుగడ్డలుగా స్థితి భేదము చెందుటయే దీనికి కారణము.
అట్టి స్థితి భేదముతోనే అంతర్యామి యందు పంచభూతాదులు కట్టుకొని వేరువేరు దేహములేర్పడును. అంతర్యామి తానను తెలివి మాటుపడి దేహము తానను భ్రాంతి కలుగును.
ఆచరింపబడిన పనుల వలన సుఖదుఃఖములు అను ఫలితములేర్పడును. ఇదియే కర్మబంధము.
🌹 🌹 🌹 🌹 🌹
46 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
ఈశ్వరుని జీవుని రూపమునను, తన చుట్టునున్న జీవుల రూపమునను ప్రవేశించి యుండును.
జీవుని స్వరూపమున ఈశ్వరుడే ఉండును గనుక తనలో గాని, ఇతరులలో గాని ఈశ్వరుని దర్శించు సంకల్పము స్వరూప జ్ఞానమును కలిగించును.
( నాటకమున రాక్షసుని వేషము ధరించి ఒకడు అద్దములో చూచుకొని హఠాత్తుగా ఉలిక్కిపడును. నిదానించి నవ్వుకొనును. అట్లే జీవుడు నిదానించి ఆత్మజ్ఞానము పొందును. అద్దములో రాక్షసుని చూచునది క్షణకాలము, మరల స్వరూపము గ్రహించినది స్థిరమైన కాలము. )
అట్లే జీవుడు తనలో గాని, ఎదుటివారిలో గాని వ్యక్తులను చూచుట తాత్కాలికము. దైవమును చూచుట నిత్యము.
సాటివారిని దైవ విగ్రహములుగా ధ్యానించుట శీఘ్రముగా ఆత్మజ్ఞానమును కలిగించును. ఈ ప్రయత్నమున యోగాభ్యాసము చేసినను , భక్తి మార్గమున ఉపాసించినను పరమాత్మను పొందును.
🌹 🌹 🌹 🌹 🌹
45. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
నిరంతర దీక్షలలో ఉన్నవారు, యజ్ఞయాగాదులు ఆచరించు వారు కూడ నిత్య జీవితమున పరిసర వ్యక్తుల యందు విరోధములు పెట్టుకొను వారు కలరు.
కోర్టులో శత్రువును గెలుచుటకై ఆంజనేయ మంత్రము జపించువారు కలరు.
తనను తిట్టినవాడు నశింపవలెనని ఒకడు మిరియములతో హోమము చేయును.
ఒక్కొక్కడు గంధపు చెక్కలతో , నేతితో హోమము చేయును. ద్రవ్యములు ఎంత మంచివైనను వైరము మనస్సున ఉన్నది కనుక అది తామసోపాసనము.
క్రీస్తును నమ్మనివారు పాపులని క్రీస్తు భక్తుడు ద్వేషించును. అతడెంత ప్రార్థన చేసినను మనస్సున ఉన్నది పాపులే గాని క్రీస్తు కాదు.
ఇట్టి భక్తి వలన లాభము లేదు.
🌹 🌹 🌹 🌹 🌹
44 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
గోపికలనగా నారదుడు భక్తిసూత్రములలో నిర్వచించిన ప్రకారము కృష్ణునకు ఆత్మసమర్పణ చేసి వాని స్మరణలో పులకరింతలు, ఆనందాశ్రువులు పొందగలరు. వీరు కోరునది కృష్ణుని భౌతికమైన సామీప్యము కాక స్మరణ వలన కలిగిన సాన్నిధ్యము.
గోకులమున స్త్రీలు కృష్ణుని యెడల పొందిన అనుభూతి ఇట్టిదే.
గోకులమున కృష్ణుడు వసించినది పన్నెండు సంవత్సరముల వయస్సు లోపున. ఆ స్థితిలో గోపికలు దేనిని పొందిరో దానిని ద్వారకలో కృష్ణుని భార్యలు పొందలేకపోయిరి. వారు పొందినది మమకారపు వలలు.
🌹 🌹 🌹 🌹 🌹
43. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
భగవంతుడు సర్వజీవులలో అంతర్యామియై యున్నాడు. అట్టి దేవుని కన్న జీవులను వేరుగా చూచువారు మోసకాండ్రు.
వారు ఇతరులతో విరోధములు పెట్టుకొని జీవింతురు. వారి మనసుల యందు శాంతి ఎన్నడును కలుగదు.
వారు సామాన్యమైనవి , అరుదైనవి అగు పూజాద్రవ్యములతో దేవుని పాదములు అర్చించినను ఫలితమేమియు లేదు. వారి కుటిలతయే మిగులును.
🌹 🌹 🌹 🌹 🌹
42. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
గోపికలు గోకులము నందలి స్త్రీలు. వారి దగ్గర కృష్ణుడు వసించినది చిన్నతనమున.
ద్వారకలో భార్యలందరు నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యము లభించినను , వారనుభవించినది కృష్ణుడు తనవాడు కావలెనను మమకారము.
గోపికలకు కృష్ణుని యెడల నున్నది ఆత్మ సమర్పణ బుద్ధి. కనుకనే గోపికలు కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులెరగి వర్తించుట ముఖ్య లక్షణములు.
భక్తికి కావలసినది ఎట్టి నడవడి యనగా వ్రజమునందలి గోపికలు చూపిన నడవడి యని నారదుడు భక్తి సూత్రము లలో వివరించెను.
🌹 🌹 🌹 🌹 🌹
41. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
సర్వజీవుల హృదయములయందు భగవంతుడే ఈశ్వర రూపమున ఉన్నాడని తెలిసి దేవుని జీవుల రూపమున ఆదరింపవలెను. అట్టి ఈశ్వరుని అవమానము చేసి దేవుని విగ్రహములను మాత్రము పూజించువాడు లోకమును మోసగించును. అతడు మోహముతో తన్ను తానే వంచించుకొనును.
ఎంత భక్తి చూపినను అది ఉచితము కాదు గనుక బూడిదలో పోసిన హోమద్రవ్యము వలె నిష్ఫలమగును.
🌹 🌹 🌹 🌹 🌹
40 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
మహనీయములైన పుణ్యలక్షణములను, పవిత్ర వర్తనలను, సమస్తమును గ్రహించు చుండవలెను. తానుగాని, ఇతరులు గాని ఈ గుణములు కలిగియున్నవారు ముఖ్యము కాదు. ఉన్న గుణములు ముఖ్యము.
పువ్వుల నుండి గాలికి వెలువడిన సుగంధమును పూవులతో సంబంధము లేకుండ ముక్కుతో ఎట్లు అనుభవించునో, అట్లే వ్యక్తుల తరతమ భేదదృష్టులు లేక గుణములను అనుభవించి కీర్తించు వాడు కావలెను.
🌹 🌹 🌹 🌹 🌹
39. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామియై యుండి కూడ దాని ప్రకృతి లక్షణములతో అంటుపడడు.
నగలలో నున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము , పేరు మొదలగు వానిని అంటించుకొనదు. అందుండియు బంగారముగనే యుండును.
అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించుచుండియు జీవిత్వమంటించు కొనక , దేవుడుగనే యుం
డును.
🌹 🌹 🌹 🌹 🌹
38. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
అడవిలో వెదురుచెట్లు చిక్కగా పొదలై పెరిగి గాలికి కదులును. కదలిక వలన వెదురుబొంగులు ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుట్టును. దానితో వెదుర్లు అంటుకొనును. ఇట్లు రగిలిన కారుచిచ్చునకు మరల గాలియే తోడగును. దానితో వనమంతయు మండిపోవును.
అదే విధముగ భూమికి బరువైన లోకభీకర లక్షణములతో రాజులు సంపదలు పెంచుకొని మహాసేనలు అక్షౌహిణులుగా పోషించి ప్రజలను బాధ పెట్టుచుండిరి.
అప్పుడు భగవంతుడు వారిలోని కామక్రోధములైన అసుర లక్షణములనే కదలించి వారి నడుమ యుద్ధప్రేమ పుట్టించెను.
యుద్ధమున సారథియై పనిచేసి వారందరిని సంతము చేసి భూభారము తొలగించెను.
ఇది కృష్ణావతార పరమార్థములలో నొకటి. తాను ఆయుధము ధరింపకయే సంహారము చేసెను. తాను మాత్రము శాంతుడై కాంతల నడుమ సామాన్య మానవుని వలె సంచరించెను.
🌹 🌹 🌹 🌹 🌹
37. 🌻. భాగవతము వివరణ - కపిలమహర్షి బోధలు
లక్ష్మీదేవి జీవులయందు చంచలత్వము వహించును. అనగా జీవులు కోరికల రూపమున లక్ష్మిని స్థిరముగ పట్టుకొనలేరు.
ఆమె మాత్రము జీవులందరిలో ఈశ్వరుడై ప్రకాశించుచున్న వానిని భర్తగా నమ్మి స్థిరత్వము చెందియున్నది. అట్టివానిని కౌగలించిన వారే స్థిరత్వము చెందుదురు కాని, లక్ష్మియందు దృష్టి నిలిపిన వారు చాంచల్యముతో తిరుగాడుదురు.
కనుక శ్రీకృష్ణుని యందు నిష్ఠ నిలిపిన వారందరు వానికి భార్యలు. కొందరు జ్ఞానస్వరూపుడుగను , కొందరు సౌందర్య స్వరూపుడుగను , కొందరు తమ పరిజనుల యందు అంతర్యామి స్వరూపుడుగను దర్శించి ఉపాసించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
36 🌻. సాధన- సమిష్టి జీవనము 🌻
ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.
సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము.
సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు. ఇవన్నీ భక్తి సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు.
🌻. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది. 🌻
సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా ముందు భావనలో రూఢీచేసుకోవాలి.
అలా లేని సందర్భంలోనే, వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.
అంతే కాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు.
కాని ఇందులో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఒక మంచిపనిని ఉదాహరణకు హోమియో వైద్య సేవను ప్రారంభించినప్పుడు కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి.
ఇక సేవ యాంత్రికముగా మాత్రమే సాగుతుంటుంది. సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
🌹 🌹 🌹 🌹 🌹
35 🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻
సృష్టిలోనున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును.
దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును.
క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు. దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును.
ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు.
రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా కోయుదురు.
కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.)
32 🌻. భాగవతము-అనుభూతి 🌻
కలియుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.
పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప జాలరు.
కావున, ధర్మము కన్నా ధనము, అధికారము, కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై అల్పాయుష్కులగుట తప్పదు.
వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో వీరికి తెలియదు.
సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి ఒక్కటే. ఇట్టి అనుభూతికి సులభము, తీయనైన బోధ యుండ వలయును. వేదాంత గ్రంధములకు ఇట్టి సమర్థత లేదు.
ఇంద్రియముల ఆకర్షణకు లోనై జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు అంతకన్నా గొప్పదయిన, మధురమయిన ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను...
🌹 🌹 🌹 🌹 🌹
31 🌻. వైశాఖ పూర్ణిమ 🌻
🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు.
సాధకుని మనస్సు భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును.
అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును.
కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను.
వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది.
మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది.
కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు
ప్రతిష్ఠించును....
🌹 🌹 🌹 🌹 🌹
🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు.
సాధకుని మనస్సు భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును.
అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును.
కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను.
వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది.
మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది.
కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు
ప్రతిష్ఠించును....
🌹 🌹 🌹 🌹 🌹
30 🌻. అంతరంగం 🌻
తనతోపాటు వచ్చిన గుణములే ఆ మనిషి ని నడిపిస్తూంటాయి. ఆ గుణముల స్వభావాన్ని బట్టి అతని స్థానం ఈ సమాజంలో ఎంత వుందో అవగతమౌతుంది. ఆ గుణములు సద్గుగుణములైతే ఆ నడత తీరు ఎంతో సంస్కారవంతముగా ఉంటుంది.
అతని తీరు సమాజానికి క్షేమము ను శ్రేయస్సు ను కలుగజేస్తుంది. ఈ సమాజాన్ని సుసంపన్నం చేస్తుంది. అతని జీవితం ....అతని జీవనవిధానం యజ్ఞార్థముగా సాగుతుంది.
అతడే భావితరాలకు ఆదర్శప్రాయుడై ప్రాతఃస్మరణీయుడౌతాడు. నేటి సమాజమునకు అటు వంటి వ్వక్తులే అ
వసరం మరియు ఆవశ్యకము కూడా.
🌹 🌹 🌹 🌹 🌹
29. 🌻. మన దృష్టి - అంతర్యామి అనుకూలత 🌻
ఎదుటనున్న వాడు ఎట్టివాడను దృష్టి మనకక్కరలేదు. అతనిలో లోపములున్నచో అవి మనకు సంబంధించినవి కావు.
మనకన్న పెద్దవారిలో ఈ లోపములు కన్పించినచో సహించి వారిలోని సజ్జనత్వముతోనే సంబంధము పెట్టుకొనవలెను. మనతో సమానమైన వారి యెడల మిత్రభావమును పెంపొందించు కొనవలెను.
మనకన్న తక్కువవారు తప్పు చేసినచో దయచూపవలసి యుండును. మిగిలిన సమస్త జంతువుల యందును సమానమైన అంతర్యామి భావన కలిగి వర్తింపవలెను.
అట్లు వర్తించిన వానియందు అంతర్యామి అనుకూలుడగును. దానితో వ్యక్తిగత ప్రకృతి గుణములు తొలగిపోయి, లింగశరీరము భస్మమై బ్రహ్మానంద మనుభవించును.
భాగవతము 4-357
వైవస్వత మనువు బోధలు
ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹
28. 🌻. పరిస్థితులు - సాధన 🌻
సాధకుని జీవితమున వివిధానేక పరిస్థితులు తటస్థించుట తప్పనిసరి. సాధారణ మానవునికి ఎట్లో, సాధకునకు అంతియే. సాధకుడు తాను సాధారణ మానవుని కన్న విశిష్టుడనని భావించుట తప్పు.
భగవంతుని పొందవలెనని తపించి యోగసాధన చేయునట్టి చాలా మందిలో వికసించని దయ, శాంతము, ఓర్పు, ధైర్యము, వినయము వంటి సద్గుణములు, పెక్కుమంది మనము సాధారణ మానవులనుకొనువారిలో గమనింపదగును.
దీనికి కారణమేమి? భగవంతుని గూర్చి ఉద్వేగభరితములైన తపో, పూజా, సంకీర్తన, జప, హోమాది కార్యక్రమములు సాధకుడు చేపట్టవచ్చును. కాని అతనికి తల్లిదండ్రుల యందు వినయగౌరవములు లేకపోవచ్చును.
బాధలో ఉన్న దీనుని కన్నీటిని తొలగింపు దశలో అతడు తన వంతు కర్తవ్యమును నిర్ణయింపకపోవచ్చును. అతని దృష్టిలో భగవంతుని పొందుట అనగా ఒక వస్తువునో, వ్యక్తి యొక్క స్నేహమునో, అధికారమునో పొందుటవంటిది మాత్రమే.
మానవుని ప్రజ్ఞలో మూడు కక్ష్యలు గలవు. ఉద్వేగభరిత కక్ష్య ఒకటి. తార్కిక ప్రజ్ఞా కక్ష్య ఒకటి. దివ్య ప్రేమమయానుభూతి కక్ష్య ఒకటి.
తోటి వాడు రోగబాధతో ఏడ్చుచుండగా, కొందరు ఉద్వేగభరితులై తామును విలపింతురు. దాని వలన ఉపయోగము లేదు.
అట్లే మరికొందరు రోగార్తునకు సేవజేసిన మనకేమి లభించును అని తార్కికముగా ఆలోచింతురు మొదటి కక్ష్యలో జీవించువాడు భక్తుడుగా మనకు కనపడవచ్చును ఉదారహృదయుని వలె అనిపించవచ్చును.
రెండవ కక్ష్యలో జీవించువాడు మేధావి, పండితుడు, డిగ్రీలు కలవాడు, పెద్ద వైద్యుడుగనో, ప్లీడరుగనో, అధికారిగనో ప్రసిద్ధుడై ఉండవచ్చును. కాని వీరి వలన సంఘమునకు ఎట్టి ప్రయోజనము లేదు. రెండవ వాని వలన కీడు కూడ వాటిల్లవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
27🌻. గురువు - చైతన్య స్వరూపము - 2 🌻
గురువును దైవముగా అనుసంధానము చేసి ఆరాధించుటలో విశేషమున్నది. గురువు యొక్క రూపము-విద్య-ప్రశస్తి-యోగసాధనలో గడించిన అనుభవము- అపూర్వఘటనలు- వ్యక్తిత్వము -అభిభాషణమూ ఇవన్నీ తొలుత సహజంగా ఆకర్షిస్తాయి.
ఈ భౌతిక రూపము కొన్నాళ్ళో, కొన్నేళ్ళో దర్శనమిస్తున్నా, గురువులో వెలుగే క్రమంగా దర్శనమవ్వాలి. ఆ వెలుగే గురువు. అదే సాక్షాత్తు పరబ్రహ్మము.
కాగా గురూపాసన సాక్షాత్తు బ్రహ్మోపాసనమే అవుతుంది. ఆకార గుణవిశేషాదులు క్రమంగా ప్రక్కకు తొలగి వెలుగే గురువుగా సాధకునకు దర్శనమిస్తుంది.
మార్గం చూపుతుంది అపుడు గురువు శక్తివాహినిగానే అనుభవంలోకి వస్తుంటాడు. అతని ప్రతి చర్య, ప్రతి పలుకు కాంతి ప్రసార కేంద్రమే అవుతుంది.
నిత్యానుసంధానము మనస్సులో గురువే అయినపుడు- బ్రహ్మదర్శనమే అవుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ స్థితిలో గురువునకు బ్రహ్మమునకు భేదమే కానరాదు.
యోగసాధనకు గురువే అధిష్ఠాన దైవము. గురుకటాక్షము ప్రసరించే కొలదీ శిష్యునిలో చీకటులు మలగి ఆ మేరకు వెలుగు ఆక్రమిస్తుంది భ్రమరకీట న్యాయంగా వెలుగును ఉపాసించే వాడు, తానే వెలుగు అవటం సహజపరిణామము. అద్భుతమేమీ కాదు.
రమణమహర్షి వంటివారు 'గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛ్చిన్న సంశయాః" అంటుండేవారు. పరమగురువుల మౌనమే శిష్యులకు సందేహ నివారణ చేస్తుంది. అయితే, అందుకు సంపూర్ణశరణాగతి సాధకునకు అవసరం.
గురువు యొక్క ఒక కృపావీక్షణం చేత, అద్భుతశక్తులు శిష్యులకు సంక్రమించిన ఘట్టాలూ లేకపోలేదు. అలనాటి శంకరాచార్యుల వారి నుండి నేటి ఆధ్యాత్మిక గురువుల వరకూ ఎన్నో కథలు, గాధలు వింటూనే ఉన్నాము.
🌹 🌹 🌹 🌹 🌹
26🌻. గురువు - చైతన్య స్వరూపము - 1 🌻
గురుశబ్దము మహత్తరమైన అర్థముతో కూడుకొన్నది. లౌకికమైన శాస్ర్ర-విజ్ఞాన- ప్రాపంచిక విషయాలను బోధించేవారూ గురువులుగా లోకంలో చెలామణి అవుతున్నారు.
ఈ చదువు 'కొను' వారు, అమ్మేవారు నేడు వ్యాపారసరళిలోనే ఉంటున్నారు. అందుచేతనే గురుశిష్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
భగవద్విషయమైన 'ఎరుక' కలిగించేదే విద్య. విషయపరిజ్ఞాన మాత్రమైన దానిని విద్యగా ప్రాచీనులు పరిగణించేవారు కాదు. అందుచేతనే 'గురు' శబ్దము సనాతన ధర్మవివేచనలో విశిష్టార్థంలో పరిగణింపబడుట. గురు శబ్దానికి చీకటిని (అజ్ఞానాన్ని) పోగొట్టువాడని అర్థము.
అట్లే శాసింపబడువాడు శిష్యుడు. గురువుల యందు ఏవేని అప్రియమైన విషయాలు గమనిస్తే వాటిని గుప్తంగా ఉంచేవాడే ఛాత్రుడు.
'గురుదేవోభవ' అనే ఆర్యోక్తి ఒకటున్నది. కబీరును ఎవరో ఒకమారు అడిగారట! 'దైవమూ గురువు ఒకేసారి దర్శనమిస్తే ఎవరికి ముందు చేతులెత్తి నమస్కరిస్తావు' అని వెంటనే క్ఞణం ఆలస్యం చేయకుండా గురువుకే ముందు నమస్కరిస్తానని చెప్పినాడట
. గురువు స్థానము అంతటిది. సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు.
గురువుని గురించి శ్రీ అరవిందయోగి అభిబాషిస్తూ 'గురువును సాధారణముగా సాక్షాదీశ్వరావిర్భావముగా లేక ఈశ్వర ప్రతినిధిగా భావించెదరు.
వారు తమ ఉపదేశముల వలన, అంతకంటే ఎక్కువగా తమ ప్రభావాదర్శముల వలన మాత్రమే గాక, స్వానుభవమును ఇతరులకు సంక్రమింప చేయునట్టి ఒక శక్తి మూలముననూ సాయపడుతుంటారు.' అన్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 🌹 🌹 🌹 🌹
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 60 🌹
🌻. పాత్రత 🌻
🌻తగినవాడు కనిపించినపుడు దానము చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.
ఎవరికిని నీ వలన బాధ కలుగరాదను ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.
పాత్రునకు దానము చేయుట అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.
అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.
అది లేకపోవుట చేతనే మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.
దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.
తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.
దానిని సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 61 🌹
🌻. పాత్రత - 2 🌻
ప్రియముగా పలుకుట అనగా మన సంభాషణ వలన ఎదుటివాడు సంతోషించునట్లు పలుకుట.
సామాన్యముగా దానము చేసినవాడు దానము పొందిన వాని కన్నా గొప్పవాడను భ్రాంతి ఉండును కనుక నిర్లక్ష్యముగా దానము చేయుట, అమర్యాదగా మాట్లాడుట, తనతో సమానముగా చూడలేకుండుట మానవ లక్షణములైన దౌర్బల్యములు. వానిని దాటగల్గినపుడు మాత్రమే ప్రియవాక్యములతో దానము మున్నగునవి చేయవలెను.
మన కన్నా బలవంతుడు, ధనవంతుడు అగు వాని యెడల పలికిన ప్రియవాక్యములు లెక్కలోనివి కావు. అవి తప్పనిసరి కనుక సదభ్యాసములుగా లెక్కపెట్టరాదు.
ఉద్యోగమిచ్చినవాని ఎదుట చేతులు జోడించి నిలబడి మాట్లాడుట భక్తియోగము అనవచ్చునా? కనుక ప్రియవచనములు అనగా మన కన్నా చిన్న వారు తక్కువ వారు కనిపించినపుడు పలికిన ప్రియవచనములు మాత్రమే ఆత్మసాధనకు పనికి వచ్చును.
ప్రియముగా మాట్లాడవలెనని సత్యమును మెలిద్రిప్పరాదు. ఎదుటివాని అభిప్రాయము మనకు నచ్చనప్పుడు నచ్చినట్లు తియ్యగా మాట్లాడుట సత్యభంగము కనుక ఎదుటివానికిని మనకును త్రిప్పలు తెచ్చును. కనుక ప్రియవాక్కు కన్న సత్యవాక్కు ముఖ్యము. సత్యమును అయినను అప్రియముగా పలుకుటలో హింస ఉండును.
కనుకనే మనువు "సత్యమునే పలుకవలెను, ప్రియముగా మాత్రమే పలుకవలెను, సత్యమును అప్రియముగా పలుకరాదు, ప్రియము కదా అని అసత్యము పలుకారాదు" అని శాసించెను.
పై మూడింటికి ముఖ్యోద్దేశము ఒక్కటే. తనకు గాని ఎదుటి వారికి గాని బాధ లేకుండుట. దానినే అహింస అందురు. ఈ సంకల్పము మనస్సున ఉన్నచో మిగిలిన మూడును నిర్వర్తించుట చేతనగును....
✍ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
🌻. పాత్రత - 2 🌻
ప్రియముగా పలుకుట అనగా మన సంభాషణ వలన ఎదుటివాడు సంతోషించునట్లు పలుకుట.
సామాన్యముగా దానము చేసినవాడు దానము పొందిన వాని కన్నా గొప్పవాడను భ్రాంతి ఉండును కనుక నిర్లక్ష్యముగా దానము చేయుట, అమర్యాదగా మాట్లాడుట, తనతో సమానముగా చూడలేకుండుట మానవ లక్షణములైన దౌర్బల్యములు. వానిని దాటగల్గినపుడు మాత్రమే ప్రియవాక్యములతో దానము మున్నగునవి చేయవలెను.
మన కన్నా బలవంతుడు, ధనవంతుడు అగు వాని యెడల పలికిన ప్రియవాక్యములు లెక్కలోనివి కావు. అవి తప్పనిసరి కనుక సదభ్యాసములుగా లెక్కపెట్టరాదు.
ఉద్యోగమిచ్చినవాని ఎదుట చేతులు జోడించి నిలబడి మాట్లాడుట భక్తియోగము అనవచ్చునా? కనుక ప్రియవచనములు అనగా మన కన్నా చిన్న వారు తక్కువ వారు కనిపించినపుడు పలికిన ప్రియవచనములు మాత్రమే ఆత్మసాధనకు పనికి వచ్చును.
ప్రియముగా మాట్లాడవలెనని సత్యమును మెలిద్రిప్పరాదు. ఎదుటివాని అభిప్రాయము మనకు నచ్చనప్పుడు నచ్చినట్లు తియ్యగా మాట్లాడుట సత్యభంగము కనుక ఎదుటివానికిని మనకును త్రిప్పలు తెచ్చును. కనుక ప్రియవాక్కు కన్న సత్యవాక్కు ముఖ్యము. సత్యమును అయినను అప్రియముగా పలుకుటలో హింస ఉండును.
కనుకనే మనువు "సత్యమునే పలుకవలెను, ప్రియముగా మాత్రమే పలుకవలెను, సత్యమును అప్రియముగా పలుకరాదు, ప్రియము కదా అని అసత్యము పలుకారాదు" అని శాసించెను.
పై మూడింటికి ముఖ్యోద్దేశము ఒక్కటే. తనకు గాని ఎదుటి వారికి గాని బాధ లేకుండుట. దానినే అహింస అందురు. ఈ సంకల్పము మనస్సున ఉన్నచో మిగిలిన మూడును నిర్వర్తించుట చేతనగును....
✍ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
దేహమునందు జీవుడుగా బద్ధుడైనపుడు తన కన్న ఇతరమైన సృష్టి యుండుట కనిపించును.
ఇదియే వేదములందు కీర్తింపబడిన 'ఐతరేయము' అనబడు వెలుగు ( objectivity) . ఇది సృష్టి కనిపించుటకు అద్దము. దీనిలో దేవుడు కనిపించడు.
తనకు తానుగా జీవుడు తనను గుర్తించినచో తాను దేవుడుగా కనిపించును. దీనినభ్యసించిన వెనుక మిగిలిన సృష్టిలో కూడ తననే దర్శించును.
Comments
Post a Comment