ఔషధాల ఖజానా







అద్భుతమైన ఔషధాల ఖజానా ఈ దానిమ్మ...

* దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

* అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ.

* దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.

* దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.

* ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. 

* కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి.

* గర్బవతులు ప్రతి రోజు  ఫోలిక్ ఆమ్లం తీసుకోవాలి. దానిమ్మ రసం ఒకసారి తాగడము వలన 60 మి.గ్రా ఫోలేట్ వస్తుంది

* దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది.

*  పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.

* ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.

* ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు.

* వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. 

* నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.

* దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి.

* దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది.

* గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. 

* దీని ఆకులకు నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.

* అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి మరియూ గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . 

* మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ  జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది 

* దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .

* ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. 

* అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.

* సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. 

* దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. 

* సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.

* గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది.

*  గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుంది.

* వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. 

* ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. 

* అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

* రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.

* దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... 

* దానిమ్మ  శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది 

* గుండె (హృదయము) కు మేలు చేస్తుంది. 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది . 

* రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది . 

* దానిమ్మ గింజల, నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .

--(())--

Image result for ఇమేజ్ అఫ్ జామకాయ


* జామకాయ  


జామకాయ గురించి  కొన్ని తెల్సుకొని అనుకరిస్తే ఆరోగ్యం తో మన :శాంతి 

అపరిమిత పోషకాల నిలయం ఈ జామ. 

* విటమిన్‌ సి ఎక్కుగా దొరికే వాటిలో ఉసిరికాయలకు ధీటుగా జామను చెప్పుకోవచ్చు.

* కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది.

* నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది.

* ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి' విటమిన్ శాతం అధికమవుతుంది.

* కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. 

* అంతేకాదు, జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో నిండుగా ఉంది.

* గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

* దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండి పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది.

* నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. 

* మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పక తినవలసిన పళ్ల జాబితాలో జామను మొదటి వరుసలో ఉంచబడింది. 

* డయాబెటిస్ రోగులకు సంజీవనిలా ఉపయోగపడుతుందంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు.

*  బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది.

* అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు.

*  ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు.

* ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. 

* కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే ' పెక్టిన్' జామలొ లభిస్తుంది. 

* ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.

*  జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు. 

*  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి.

*  ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. 

*  జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. 

* ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.

* ఎసిడిటికి రోజుకో పండు తింటే మంచిది. కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశనం పొందేలా చేస్తుంది. 

*  కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి.

*  కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది. 

* ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి ఆ నీళ్లను వాడితే దగ్గు, జలుబు పోతుంది. 

* ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. 

* జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఆకులను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. 

* ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. 

* జామకాయలో  ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

* ఋతుస్రావ సమస్యలను దూరం చేయడంలో చాలా ఉపయోగకరమైనది.

* రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో మంచి ఔషధంగా పని చేస్తుంది.

* చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేస్తుంది.

* మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. 

* జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుంది.

* ముసలితన ఛాయలు అరికట్టడంలో సహాయపడుతుంది. 

* కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. 

*  ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. 

*  బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.

* ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🙏

--(())--



ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడుపండు.

* ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తాము.

* ఇది మధుమేహ బాధితులకు చాలా మంచిది. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి  డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

* సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు.. తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది.

* గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.

* నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది.

*  ముదురంగు నేరేడు పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

* ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. 

* నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.

*  ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. 

* ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది. 

*  వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.
 అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది. 

*  స్కిన్ రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది.

*  నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి.

*  నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరం యొక్క రోగ్యనిధోక శక్తిని పెంచతుంది.

*  నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి.ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.  

* ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. 

* దీర్ఘకాలిక దగ్గును నివారిస్తుంది.

*  దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.

 *  నేరుడు పండ్లు శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది.

* ఇందులో ఉండే విటమిన్ సి, మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

* రక్తపోటు ని నియంత్రించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. 

* పండ్లలో ఉండే విటమిన్ సి కీళ్ల నొప్పులు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. 

* ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే మెదడు పనితీరు పెరిగి చురుగ్గా వుంటారు.

* నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోని వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయోరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తారు.

 *  గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడవచ్చు. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్‌, నయం చేసే గుణాఉంటాయి. 

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

*  జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది. 

* నేరుడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటి తగ్గిస్తుంది.

*  కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పని చేస్తాయి.

* నేరుడు పండ్లను క్రమం తప్పకుండా రెండు మూడు నెలలు తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల వచ్చే రక్తస్రావంను నివారిస్తుంది.

 * చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ తడుపుతుంటే... అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పౌడర్ ను నీళ్ళలో కలిపి  రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు.

*  మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది.

*  మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిది. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయి.

* ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏


--((**))--

అద్భుతమైన పోషకాల గని ఈ నారింజ పండు.

* చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం.  చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు.

* నారింజలో విటమిన్ సి, ఏ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి.

*  నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. 

* శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. 

* మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. 

* ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం, మెంతిపొడి కలుపుకున్నట్లయితే… ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. 

* జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. 

* అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. 

* నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

* ఇందులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. 

* రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. 

* విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

*  జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. 

* రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు. 

* గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

* నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది.

* ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. 

*  వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. 

* ఆస్తమా, శ్వాశ నాల ఇబ్బందులు,  ట్యూబర్‌క్యూలోసిస్‌తో ఇబ్బంది పడేవారికి కమలాపండు అతిముఖ్యమైన ఆహారం. 

* ఈ పండు రసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. 

* కమలాపండులో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. 

* యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. 

* తరచూ జలుబు చేసేవారిలో రోగనిరోధక శక్తి పెంచగలదు.

* గుండెపోటు ముప్పును తప్పించుకోవాలంటే? రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే సరిపోతుంది. 

* కమలాల్లో ఉండే హెస్పెరిడిన్‌ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుంది.

*  నారింజ రసం క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతుంది.

* ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది.

*  తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తిగల నారింజ పండ్లను ఇస్తే జీర్ణ సమస్యలు పోతాయి.

*  'పయోరియా' వంటి దంతవ్యాధులు నారింజ రసాన్ని సేవిస్తే తగ్గిపోతాయి. 

* శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. 

*  నారింజ పళ్ల తొక్కలను నీడలో ఎండ బెట్టి మెత్తగా పొడి చేసి దానిని పెరుగులో కలిపి ముఖానికి లేపనంగా రాసుకొ పది నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖం మీద ఏర్పడిన మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.

--(())--


మన శరీరానికి ఎంతో రక్ష... ఈ ఎండు ద్రాక్ష...

👉ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది.

👉  ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది . 

👉 ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును .

👉మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. 

👉 మీరు అనీమియాతో బాధపడుతున్నట్లై ఈ ఎండు ద్రాక్ష ని మీ రోజువారీ ఆహారం లో చేర్చుకోండి. 

👉ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ మరియు ఇతర పోషకాంశాలు రక్త కణాల సంఖ్యను ను పెంచుతాయి. 

👉వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. 

👉ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.

👉 ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం. 

👉 ఎండు ద్రాక్షలో ఉండే ఫోలిఫినోలిక్ యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కు కారణం అయ్యే టోమర్ సెల్స్ తో పోరాడే గుణాలు ఎండుద్రాక్షలో ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 

👉ఒక మోతాదులో ' ఐరన్‌ ' & బీకాంప్లెక్స్ ,కాపర్ ... ఈ ఎండు ద్రాక్ష లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును. 

👉 ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్స్ మూలాన యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తుంది . 

👉ఫ్రీరాడికల్స్ వల్ల కంటి సమస్యలను నివారిస్తుంది.

👉 ఎండుద్రాక్షలో క్యాల్షియం , బోరాన్‌ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది. 

👉శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి సహాయపడటమే కాదు, మోనోపాజ్ దగ్గరగా ఉన్న లేదా మోనోపాజ్ లో ఉన్న స్త్రీలు ఖచ్చితంగా ఈ క్యాల్షియం రిచ్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

👉 లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్‌ ఇందులో ఉన్నది. 

👉దాంపత్య జీవితంలోని నిరాస నిస్ప్రుహలను తొలగించును .

👉ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున.. ఆహారం అతి సులభంగా జీర్ణం అవ్వడానికి, మరియు జీర్ణశయాంతర ప్రేగుమార్గం నుండి టాక్సిన్స్(విషాలను)మరియు వ్యర్థాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. 

👉 ఎండు ద్రాక్షలో గ్లూకోజ్ మరియు విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్ ను కలిగి ఉంటుంది. 

👉ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

👉 ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉంటుంది. 

👉అంతే కాదు జీర్ణక్రియకు సహాయపడుతుంది. 

👉 ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును .

👉 మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల జ్వరం తగ్గే అవకాశము ఉంది.

👉 ఎండు ద్రాక్షను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 

👉 ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .

👉 శరరంలో రక్తకణాలు, హిమో గ్లోబిన్‌ల శాతం పెరిగేలా చేస్తాయి.

👉 మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి. 

👉కండరాలకు బలాన్నిస్తాయి. 

👉 ఎండు ద్రాక్ష లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును .

👉 తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .

👉 సంతానం లేని స్త్రీలు ఎండు ద్రాక్ష తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. 

👉 మహిళలు ప్రతిరోజూ వీటిని తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుంది.

👉 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల ఎండు ద్రాక్ష తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. 

👉 పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. 

👉 గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది .

👉 ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది.

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

--(())--
ఆరోగ్యానికి ఔషధాల సంజీవని ఈ అంజీరా...

👉కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

👉 సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది.

👉 విరివిగా లభించే అంజీర పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. 

👉అంజీర ఫలంలో కొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి.

👉 ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

👉 పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి.

👉 కడువులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. 

👉పేగువూత, కడువులో మంట, అజీర్తి సమస్యతో బాధవడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు.

👉 దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. 

👉రక్త ప్రసరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది. 

👉అతి ఆకలితో బాధవడే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి.. ఈ పండు చక్కటి ఆహారము .

👉 దీనిలోని ఇనుము, క్యాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది. 

👉చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని తగిన మోతాదులో తీసుకోవచ్చు.

👉నోటి దుర్వాసన గలవారు భోజనం చేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది.

👉 కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్నం అరగడానికి దోహదవడుతుంది. 

👉వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేవు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. 

👉సూపర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీరా లలో మినరళ్లు అధికం. 

👉అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి. 

👉తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడువులో మంట ఉన్న వారు వుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. 

👉దీనిలోని ట్రైప్టోఫాన్స్‌ చక్కగా నిద్ర వట్టడానికి సాయపడతాయి.

👉 ఎలర్జీ, దగ్గు, కఫం గలపారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనివిస్తుంది. 

👉మేడిపండు గొంతు ఇన్ఫెక్షన్‌, కఫాన్ని తగ్గిస్తుంది.

👉రక్త హీనత, మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉవశమనం కలుగుతుంది. 

👉ఒంటిమీద గడ్డలు, కురువులకు ఈ పండు గుజ్జును వూతగా వేసి ఉంచితే, అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి.

👉పులుపు మరీ ఎక్కువగా ఉన్నవ్పుడు తక్కువగా తీసుకోపాలి. లేదంటే పళ్లమీద ఎనామిల్‌ పొర తగ్గుతుంది. 

👉మరీ ఎక్కువ తిన్నాము అనివిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి.

👉పండుని చీల్చి, గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి. ఇలా చేస్తే చిగుళ్ల సమస్య తగ్గుతుంది.

👉 అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. 

👉 అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి.

👉 ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.

👉 అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. 

👉 మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది.

👉మల విసర్జన సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు.

👉 మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.

👉కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది.

👉 ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. 

👉అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.

👉 అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి.

👉 బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి.

👉 వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. 

👉వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.

👉పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి నిర్యాసం కారుతుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి.

👉శరీరంలో వేడి ఉన్న వాళ్ళు బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపి రాత్రి అంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి. 

👉చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.

👉 ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

--(())--

ఆరోగ్యం మరియు ఆయుష్షుని పెంచే అవిసె గింజలు

👉అవిసె గింజలను తినడానికి ఉత్తమమైన మార్గం మొలకలు. 

👉నానబెట్టి మొలకెత్తించిన అవిసె గింజలను తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. 

👉వీటిని కేవలం 10 నిమిషాలు నానబెడితే చాలు మొలకెత్తడానికి.

👉వీటిని పొడిచేసి తీసుకోవడం మంచిది. 

👉వీటిని తినేటప్పుడు చాలా ఎక్కువ నీరు తాగటం మర్చిపోవద్దు.

👉అవిసె గింజల నూనెను వేడి చేయరాదు. వేడి చేస్తే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. 

👉కానీ అవిసె గింజలను హాయిగా వేయించుకొని తినవచ్చు.

👉వీటిని ఉదయం అల్పాహారంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

👉అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. 

👉వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది.

👉 దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

👉అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

👉వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను తగ్గించడానికి సహాయపడుతుంది.

👉 అవిసె గింజలలో గల పీచుపదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది.

👉వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. 

👉ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. 

👉దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. 

👉ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది.

👉అధిక రక్తపోటు తగ్గించడానికి ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. 

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన మధుమేహంతో బాధపడే వ్యక్తుల ఆరోగ్యం నిదానంగా మెరుగుపడుతుంది. 

👉20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

👉మరీ ముఖ్యంగా ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. 

👉అవిసె గింజలు జలుబు, దగ్గులను నివారించడానికి కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడతాయి.

👉 2-3 చెంచాల అవిసె గింజలను ఒక కప్పు నీటిలో నీరు బాగా చిక్కగా అయ్యేవరకు ఉడికించి వడకట్టిన చిక్కని నీటికి 3 చెంచాల నిమ్మరసం మరియు 3 చెంచాల తేనే కలిపి తీసుకోవాలి.

👉 అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయి. 

👉అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుంది. 

👉అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

👉అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ లను తగ్గించడానికి ఉపయోగ పడతాయి 

👉వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చు.

👉గర్భధారణ సమయంలో అవిసెగింజలను తీసుకోవడం వల్ల ఆ సమయంలో కలిగే మలబద్దకాన్ని పోగొట్టవచ్చు.

👉 ఈ గింజలలో ఉండే పోషకాలు గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి. కానీ డాక్టర్ల సలహాతో తీసుకోవడం మంచిది.

👉అవిసె గింజలను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

👉అంతేకాక  ప్రోస్టేట్ కాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి కొన్ని కాన్సర్ ల నుండి కూడా కాపాడగలదు.

👉 ఫంగల్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, గొంతునొప్పి, చెవినొప్పి, పన్ను నొప్పి, ఆస్తమా తగ్గించటానికి ఉపయోగపడతాయి

👉అవిసె గింజలను ప్రతీ రోజూ ఆహారంలో భాగంగా చేయడం వలన  రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

👉అవిసె గింజల్లోని పీచు పదార్ధాలు జీర్ణాశయం పనితీరును మెరుగుపరచి గ్యా స్ట్రిక్ సమస్యలను త్తగ్గించడంలో సహాయపడతాయి. 

👉అవిసె గింజల పొడిని ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మలబద్దకం కూడా తగ్గుతుంది.

👉అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి.

👉 అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. 

👉కాలుష్య కారకాలు మీ చర్మ రంధ్రాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. 

👉 చర్మం పై ముడతలు పోతాయి. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారడాన్ని నిరోధించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

👉అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. 

👉ప్రతీ రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తీసుకోవడం ద్వారా మొటిమలను అరికట్టవచ్చు.

👉పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులు అవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి.

👉ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి. 

👉దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది. చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.

👉అవిసె గింజలలో ప్రోటీన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఇనుము మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలూ ఉంటాయి. 

👉అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.

👉ఏదైనా తగు మోతాదులో తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోకూడదు. 

🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు  ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

మిత్రులందరికీ విన్నపం...
ఈ గ్రూప్ కేవలం ఆరోగ్య సమస్యల కోసం మాత్రమే చేయబడినది. ఈ గ్రూపు కి నేను( Dr. RK naidu) మాత్రమే అడ్మిన్ గా వ్యవహరించడం జరుగుతోంది. ఒకవేళ గ్రూప్ లోని మిత్రులు ఎవరైనా సందేహాలు ఉంటే మా  వాట్సాప్ ( 9705569901 ) ద్వారా అడగవచ్చును. ధన్యవాదాలు

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ