శ్రీ ఆంజనేయం (1)


నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై
జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
"మత్తకోకిల 
----
అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా 
అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా
రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా 
యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా

ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే
ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే
సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా
దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా

ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా
ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే
పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే
వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా

కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ 
రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్
భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే 
అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!"

--(())--


 హనుమంతునికి - ప్రదక్షిణాలు

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం
'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'

శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
శ్రీ మాత్రే నమ:
శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ: 


    ప్రాంజలి     
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:



శ్రీ వీర హనుమత్ కవచము

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 


శ్రీ పంచముఖి  హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                         

శ్రీ హనుమత్ ప్రార్ధన             
             
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా             
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా             
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!             
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా             
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!             
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము             
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   

శ్రీ  అంజనేయ సుప్రభాతము             
             
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !             
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !             
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !             
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !              
             
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం             
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్             
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే             
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !               




శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము             
             
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:             
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:             
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:             
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!             
             
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :             
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:             
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్              
 


  శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం            
            
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం            
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం             
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం             
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥             
            
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం             
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం           ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్            
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥            
           
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం         
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం         ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం               ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥             
            
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం            
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం           
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్          
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి              
            
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్            
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం               హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం              హం హం హం  హంసహంసం సకలదిశయశం  రామదూతంనమామి॥                             
ఓం నమోభగవతే  వాయునందనాయ  

శ్రీ హనమత్ స్తుతి:

అతులిత బలధామం  స్వర్ణ  శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా  మధీశం
రఘు పతి  ప్రియభక్తం వాతాజాతం నమామి

గోష్పధీకృత  వారాశిం  మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం

అంజనా నందనం వీరం జానకి శోకనాశనం
కపిస మక్షహంతారం వందే లంకా  భయం కరం

ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం       


శ్రీ మారుతీ  స్తోత్రం

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే


యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్                            


శ్రీ హనుమత్పంచరత్నం

వీతాఖిలవిషయేఛ్ఛం జాతానందాశ్రుపులకమత్యఛ్ఛం |

సీతాపతిదూతాద్యం వాతాత్మజ భావయే హృదం ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరితాపాంగం |

సంజీవనమాశాసే మంజుల మహిమానమంజనాభాగ్యం ||

శంబరవైరిశరాతిగమంబుజదలవిపులలోచనాదారం |

కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే ||

దూరీకృతసీతార్తిః ప్రకతీకృత రామవైభవస్ఫూర్తిః |

దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతోమూర్తిః ||

వానరనికరాధ్యక్షం దానవకుల కుముద రవికరసదృక్షం |

దీనజనావనదక్షం పవనతపః పాకపుంజ మద్రాక్షం ||

యేతత్పవన సుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం |

చిరమిహనిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామభక్తి భాగ్భవతి ||

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం హనుమత్పంచరత్న స్తోత్రం సంపూర్ణం

   Lik
సుందర కాండ (వాల్మీకి విరచి రామాయణం)
        (మల్లాప్రగడ రామకృష్ణ అంత్యానుప్రాస భావ 
సుందర కాండ)

ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణ మహా కావ్యములో  సుందరమైనది "సుందర కాండ "
ఈ ఉత్తమోత్తమ గ్రందాన్ని ఆంద్ర మహాజనులకు తేట తెలుగులో  సులభ శైలిలో ప్రతిఒక్కరు చదివే  విధముగా నా చేత ఆ సీతా రామాంజ నేయులు వ్రాయమన్న విధముగా నేను గూగల్ వారి సహాయ సహకారముతో, యూట్యూబు, ట్విట్టర్, మరియు ఫేస్ బుక్ సహాయముతో నేను ఇందు పొందు పరుస్తున్నాను. 
నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఇది మాత్రము నిష్టగా, ఇష్టముగా చదివి రోజుకు కొంత చొప్పున చదువుతూ పూర్తిగా మాత్రము చదవవలెను, మద్యలో మాత్రము ఇది ఆపకూడదు,  సుబ్రపరుచుకొని పరిసుబ్ర ప్రాతమున చదవగలరు, యువకులు, పిల్లలు, స్త్రీలు వృద్ధులు అందరు చదవవచ్చును. 
"సుందరే సుందరో రామ:
సుందరే సుందరి కథా
సుందరే సుందరి సీతా 
సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం 
సుందరే సుందర: కపి:
సుందరే సుందర మంత్రం 
సుందరే కిం న  సుందరం ". 
శ్రీరాముడు సుందరుడు, సీత సుందరి, కథ సుందరం, వనం సుందరం, కావ్యం సుందరం. హనుమ సుందరుడు. మంత్రం సుందరం. 
 సుందర కాండలో సుందరం కానిదేమున్నాది ?
మా తాతగారు, మాతండ్రి గారు హనుమత్,  బాలా ఉపాసకులు 
నాకు వచ్చిన విద్యతో నలుగురికి అర్ధమయ్యె విధముగా చదువుతారని ఆ సీతా రామాంజనేయుల కృపకు పాత్రులవుతారాని ఒక చిన్న ఆశతో 
భీష్మ ఎకాదశినాడు నేను సుందర కాండ వ్రాయుట ప్రారంభించినాను, ఆ దేవుని సంకల్పము పూర్తి చేయగలనని నమ్మకముతో ఇందు పొందు పరుచుతూన్నాను. 
నాకు సహకరిస్తున్నా డి.టి.ఎ.మరియు డిస్ట్రిక్ ట్రాజరీ స్టాప్ వారికి, హనుమత్ భక్తులకు, రామాయణము వ్రాసిన ఎందఱో మహానుభావులకు, స్నేహితులకు, సహకారం అందించిన నాశ్రిమతికి, మాపిల్లలకు ,  ప్రతిఒక్కరికి, చదివినవారికి చదవమని చెప్పినవారికి ఆ హనుమంతుని దీవెననలు ఉండునని నేను  నమ్ముతున్నాను, మీరు ఆదేవుని కృపకు పాత్రు లవతారని ఆశిస్తున్నాను     





   ప్రాంజలి     
సర్వేజనా సుఖినోభవంతు
 ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:


 ప్రాంజలి - సుందరకాండ - తెలుగు- వచస్సు 
అథ: సుందరకాండ ప్రారంబ: - ప్రధమ: సర్గ:
210 సంస్కృత  శ్లోకాల ఆధారముగా తెలుగు- వచస్సు    

O -- O -- O
హనుమంతుడు సముద్రమును లంఘించుట
మైనాకుడు అతనిని గౌరవించుట
సురసను హనుమంతుడు ఓడించుట
సింహికను వధించుట
దక్షిణ తటముచేరి అచట లంక శోభను చూచుట 

O -- O -- O
హనుమంతుడు  - సముద్ర లంఘన - ప్రయత్నము


హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు.

సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.

హనుమత్ బడబానల స్తోత్రం

ఓం అస్య శ్రీహనుమద్బడబానల స్తోత్ర మహామంత్రస్య భగవాన్ శ్రీరామచంద్రః ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్రం జపం కరిష్యే ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే ప్రశస్త పరాక్రమ సకల దిజ్ఞ్మండల యశోవితాన ధవళీకృత జగత్త్రతయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన సీతాశ్వాసన వాయుపుత్ర శ్రీరామామల మంత్రో పానకా ఉదధిబంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామలక్ష్మణానందకర కపిసైన్య ప్రాకార సుగ్రీవ సహాయకర పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారీ గంభీరనాద సర్వ పాపగ్రహ నాశక సర్వజ్వరోచ్చాటన ఢాకినీ విధ్వంసన ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరా వరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల సర్వ భూతమండల సర్వ పిశాచమండ లోచ్చాటన భూతజ్వర, ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్థిక జ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ ఛింది ఛింది యక్ష బ్రహ్మరాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ||

ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీమహాహనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఐం సౌం ఏహి ఓం హాం ఓం హ్రీం ఓం హ్రుం ఓం హైం ఓం హ్రౌం ఓం హ్రః ఓం నమో భగవతే శ్రీమహాహ నుమతే శ్రవణ చక్షు ర్భూతానాం శాకినీ డాకినీ విషమ దుష్టానాం సర్వవిషం హర హర. ఆకాశభవనం భేదయ ఖేదయ ఖేదయ మారాయ మారాయ మారాయ. వశ మాన్య ఆనయ ఆనయ శోషయ శోషయ శోషయ. మోహయ మోహయ మోహయ. జ్వాలయ జ్వాలయ జ్వాలయ ప్రహారాయ ప్రహారాయ ప్రహారాయ. సకల మాయం ఖేదయ ఖేదయ ఖేదయ ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీమహా హనుమతే సర్వగ్ర హోచ్చాటన పరబలం క్షోభయ ఖోభాయ సకల బంధ మోక్షం కురు కురు శిరః శూల గుల్మ శూల సర్వ శూలాన్ నిర్మూలయ నిర్మూలయ, నాగపాశా అనంత వాసుకి తక్షక కర్కోటక కాళియానాం యక్షకుల కులగత క్షితిగత రాత్రించరాదీనాం విషారిష్టాన్ నిర్విషం కురు కురు స్వాహా. రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరవిద్యా పర ప్రయోగాదీన్ ఛేదయ ఛేదయ. స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాన్ ప్రకటయ ప్రకటయ. సర్వారిష్టాన్ నాశయ నాశయ సర్వ శత్రూన్ నాశయ నాశయ అ సాధ్యం సాధయ సాధయ హుం ఫట్ స్వాహ ||

– ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం
ఫలస్తుతి: శత్రువులు సులభముగా జయింపడుదురు, సర్వ రోగ నివారణార్దం, అసాద్య సాదక స్తోత్రం.


రాముడు నుండి స్వీకరించాల్సిన 16 లక్షణాలు :
1.గుణవంతుడు - గుణం కలిగినవాడు
2. వీరుడు – మంచి ప్రతాపం కలిగినవాడు
3. ధర్మజ్ఞుడు – ధర్మం అంటే ఏంటో తెలిసినవాడు
4. కృతజ్ఞుడు – చేసిన మేలు మరువనివాడు
5. సత్య వాక్య పరిపాలకుడు – ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు
6. ధ్రుఢవ్రతుదు– స్థిర సంకల్పం కలవాడు
7. ఉత్తమ చరిత్ర కలవాడు – మంచి నడవడి కలవాడు
8. సర్వ భూతముల హితము కోరేవాడు – సర్వ ప్రాణుల హితాన్ని కోరేవాడు
9. విద్వాంసుడు – జ్ఞానం కలవాడు
10. సమర్ధుడు – సామర్థ్యం కలవాడు
11. ప్రియవర్తనుడు – సదైక ప్రియదర్శనుడు
12. ఆత్మవంతుడు - ధైర్యం, వ్యక్తిత్వం కల్గవాడు
13. జితక్రోధుడు – కోపాన్ని జయించేవాడు
14. ద్యుతిమంతుడు – తానూ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు
15. అసూయ లేనివాడు
16. నిశ్చింతత - చింతలేనివాడు
🚩

🚩హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🚩  

”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే –పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే
కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూమతే
సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూమతే
దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ  మంగళం శ్రీ హానూమతే
భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీ హానూమతే
పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే
రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే –సర్వ లోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే
‘ పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ –కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూమతే ”’.

 ఓం నమః శివాయ:
ॐఓంॐ
శ్రీహనుమజ్జయంతి / ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆంజనేయుడు
🕉🌞🌎🌙🌟🚩

తాత్త్వికదృష్టితో రామాయణమును దర్శిస్తే అందులో పరమార్ధతత్త్వం అవగతమౌతుంది. ఆంజనేయుని బుద్ధి, యోగత్వం, శౌర్య, సాహస పరాక్రమలతో కూడిన సుందరకాండమును పరిశీలిస్తే అత్యద్భుత ఆధ్యాత్మిక రహస్యార్ధములు అనేకం గోచరిస్తాయి. ఆంజనేయుడు నిర్వర్తించిన ప్రతికార్యమూ ఆధ్యాత్మిక సాధకునికి చక్కటి సందేశమే.


శ్రీ ఆంజనేయుడు శ్రీ విద్యోపాసకుడు :
మానవశరీరం పంచభూతాత్మకం. ఈ పంచభూతములను సమన్వయ పరచడమే యోగసాధన పరమార్ధం. ఈ పంచభూతములను సమన్వయపరిచే కుండలినీ యోగీశ్వరుడు శ్రీ ఆంజనేయుడు. 'వాయు'పుత్రుడైన ఆంజనేయుడు 'భూమి'సుత అయిన సీతమ్మ అన్వేషణ కొరకు 'ఆకాశ'మార్గంబున బయలుదేరి,'జల'ధిని దాటి, సీతమ్మ దర్శనమనంతరం లంకను 'అగ్ని'కి ఆహుతి చేసిన మహామహిమోపేతుడు శ్రీ విద్యోపాసకుడు శ్రీ ఆంజనేయుడు.


పంచముఖాంజనేయ స్వరూపం - పంచభూతముల సమన్వయతకు సూచనం

వానరరూపం - వాయుతత్త్వం. గరుడరూపం - ఆకాశతత్త్వం.
నరసింహరూపం - అగ్నితత్త్వం. వరాహరూపం - భూమితత్త్వం.
హయగ్రీవరూపం - జలతత్త్వం.

ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు


ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.


యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ /
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'.


తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'.


సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదనారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు.


అఖిలలోకోపకారి ఆంజనేయుడు

యోగత్వం వలన తనకి ప్రాప్తించే అష్టసిద్దులను తన ప్రయోజనంనకు కాకుండా రామకార్యమునకై, లోకహితంనకై ఉపయోగించిన అఖిలలోకోపకారి ఆంజనేయుడు.


{అష్టసిద్ధులు - వివరణ :-
అష్టసిద్ధులు సిద్ధించుటకు ముఖ్యంగా కావలసింది 'భూతజయము'.
పృధివ్యప్తేజోవాయ్వాకాశము (పృథివ్యప్‌తేజోవాయురాకాశాలనే పంచభూతలంటారు)లను స్థూల భూతములయందును, తత్స్వరూపములైన కఠినత్వాదులయందును, తన్మాత్రలయిన గంధాది సూక్ష్మతత్వములయందును, వాని స్థితులయందును, ఇంద్రియములయందును, వానికర్మలయందును, అంతఃకరణములయందును, తత్ప్రకాశరూపములైన వృత్తులయందును క్రమముగా సంయమనం చేసినచో భూతజయం కలుగును.


అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం "అణిమా"సిద్ధి.
అనేక కోట్ల బ్రహ్మాండాల కంటే అధికుడవడం "మహిమా"సిద్ధి.
పరమాణువుల కంటే తేలిక కావడం "లఘిమా" సిద్ధి, విశేష బరువుగా మారగలగడం "గరిమ"సిద్ధి.
ఇష్టపదార్థాలను పొందగలగడం "ప్రాప్తి"సిద్ధి.
లౌకిక పారలౌకిక పదార్థాలలో దేనిని కావాలంటే దానిని పొందడం "ప్రాకామ్య"సిద్ధి.
భూతములన్నింటిని (పంచభూతములను) వశం చేసుకొనుట "వశిత్వం".
అరిషడ్వర్గమును జయించి, తాపత్రయం లేనివాడై, జితేంద్రియుడై, అపరోక్ష సాక్షాత్కార స్వానుభవము కలిగియుండుట, సర్వమును గ్రహించి ఈశ్వరుని వలె సృష్టిస్థితిలయములకు కారణభూతుడగుట "ఈశత్వం"}


లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఞ్కా పురీ మయా /
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ //
తాను తలపెట్టిన కార్యం ఎంతో గొప్పదగుటచే, ఆ కార్యసాధనకు రాత్రి సమయమే యోగ్యమైనదని తలుస్తాడు. అందుకే హనుమ లంకలో రాత్రిసమయంలో ప్రవేశించాడు. అయితే ఇక్కడ రాత్రి అంటే ఏమిటీ? ఇందులో అంతరార్ధం ఏమిటీ?
ఆధ్యాత్మిక కోణంలో - ఇంద్రియప్రవృత్తులతో పాటు సర్వవిధ మనఃప్రవృత్తులు, బహిప్రవృతాలు కాకుండా
అంతస్స్రోతములై ఉండే తురీయదశయే రాత్రి.


గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లు -
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ /
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే: //
భూతజాలములన్నింటికి

ని ఏది రాత్రియో, అది యోగికి పగలు. సమస్త భూతములకు ఏది పగలో అది విజ్ఞుడగు ద్రష్టకు రాత్రి. అనగా అజ్ఞానంధాకారములో నుండు జీవులకు ఆత్మానుభూతి లేనందున ఆత్మవిషయమందు వారు నిద్రించుచుందురు. సమస్త ప్రాణులకు అనగా అజ్ఞానులకు ఏది (ఆత్మజ్ఞానం) రాత్రి అగుచున్నదో (అంతరదృష్టికి గోచరించక యుండునో), అట్టి ఆత్మజ్ఞానం నందు యోగి జాగురుకుడై యుండును (ఆత్మావలోకనం జేయుచుండును). దేనియందు ప్రాణులు (అజ్ఞానులు) జాగురూకము లగుచున్నవో (విషయాసక్తితో ప్రవర్తించుచున్నవో), అది ఆత్మావలోకనం చేయు యోగికి రాత్రిగా యుండును. అంటే ఆత్మనిష్టుడు ఆత్మవిషయమై జాగ్రత్తలో నుండి ప్రపంచవిషయమై నిద్రావస్థలో నుండును.


రామ - హనుమల బంధం ఏమిటంటే - ప్రభు - సేవకుడు;భగవానుడు - భక్తుడు; గురువు - శిష్యుడు
అటుపై వీరి బంధం "ఏకత్వం".
ఓసారి రామునితో హనుమ ఇలా అంటాడు -
దేహదృష్ట్యా తు దాస్యోహం జీవదృష్ట్యా త్వదంశకః /
ఆత్మదృష్ట్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతి: //


ఈ శ్లోకం పరిశీలిస్తే సాధకునికి అన్నీ అవగతమౌతాయి. బలం ధైర్యం నేర్పు ఓర్పు బుద్ధి శక్తి సామర్ధ్యం తదితర సుగుణాలతో అనేక ధర్మకార్యాలు చేసిన 'కర్మయోగి' ఆంజనేయుడు. రామభక్తిరసంలో మునకలు వేసి దాసోహం అంటూ తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకొని సోహం స్థితికి (అద్వైతస్థితికి) చేరుకున్న 'భక్తియోగి' ఆంజనేయుడు. సీతమ్మతల్లి (పరదేవత), రాముని(పరమాత్మ)లచే ఉపదేశములు పొంది, మనల్ని తరింపజేస్తున్న 'జ్ఞానయోగి' ఆంజనేయుడు. భక్తితో మనస్సును పూజాప్రసూనంగా సమర్పించి, జ్ఞానంచే జీవేశ్వరుల ఏకత్వాన్ని గ్రహించి, నిష్కామ కర్మాచరణలతో "భవిష్యద్బ్రహ్మ" అయినాడు ఆంజనేయుడు.

🕉🌞🌎🌙🌟🚩
 ||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము / 12వ దశకము - వరాహావతార వర్ణనము12-5-శ్లోకం
🕉🌞🌎🌙🌟🚩

గదోన్మర్దే తస్మింస్తవ ఖలు గదాయాం దితిభువో
గదాఘాతాద్భూమౌ ఝటితి పతితాయామహహ భోః।
మృదుస్మేరాస్యస్త్వం దనుజకులనిర్మూలనచణం
మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే||

భావము:-

ఆ ఘోర సంగ్రామమున, హిరణ్యాక్షుని గదాఘాతమునకు నీ చేతినుండి కౌమోదకము (గద) అకస్మాత్తుగా క్రిందపడెను. అయినను నీవు వెఱవక, దైత్యులను సంహరించు సుదర్శనమను మహాచక్రమును స్మరించితివి. ప్రభూ! ఆ క్షణమున మృదుమధుర ధరహసము నీ మోమును అలరించుచుండగా - ధరణిని ఉద్ధరించుటకు చక్రాయుధమును చేపట్టి మెరసిన నీరూపము -అద్భుతమైనది మరియు దేవతలకు హర్షము కలిగించునది.

వ్యాఖ్య:-

శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమందలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.
అపుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు.


ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ‘స్వామీ, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనం అయిపోతుంది’ అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.


ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.


ఆదివరాహమై,యజ్ఞవరాహమై  ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్ర లో ఈ ఘట్టమును చదివిన రోజు పరమోత్కృష్ట మయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.

🕉🌞🌎🌙🌟🚩
--(())--
హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
 
--(())--

హనుమజ్జయంతి సందర్భంగా మన్యుసూక్తం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మన్యుసూక్తం
(ఋగ్వేద సంహితా; మండలం 10; సూక్తం 83,84)


యస్తే” మన్యో‌உవి’ధద్ వజ్ర సాయక సహ ఓజః’ పుష్యతి విశ్వ’మానుషక్ |
సాహ్యామ దాసమార్యం త్వయా” యుజా సహ’స్కృతేన సహ’సా సహ’స్వతా || 1 ||


మన్యురింద్రో” మన్యురేవాస’ దేవో మన్యుర్ హోతా వరు’ణో జాతవే”దాః |
మన్యుం విశ’ ఈళతే మాను’షీర్యాః పాహి నో” మన్యో తప’సా సజోషా”ః || 2 ||


అభీ”హి మన్యో తవసస్తవీ”యాన్ తప’సా యుజా వి జ’హి శత్రూ”న్ |
అమిత్రహా వృ’త్రహా ద’స్యుహా చ విశ్వా వసూన్యా భ’రా త్వం నః’ || 3 ||


త్వం హి మ”న్యో అభిభూ”త్యోజాః స్వయంభూర్భామో” అభిమాతిషాహః |
విశ్వచ’ర్-షణిః సహు’రిః సహా”వానస్మాస్వోజః పృత’నాసు ధేహి || 4 ||


అభాగః సన్నప పరే”తో అస్మి తవ క్రత్వా” తవిషస్య’ ప్రచేతః |
తం త్వా” మన్యో అక్రతుర్జి’హీళాహం స్వాతనూర్బ’లదేయా”య మేహి’ || 5 ||


అయం తే” అస్మ్యుప మేహ్యర్వాఙ్ ప్ర’తీచీనః స’హురే విశ్వధాయః |
మన్యో” వజ్రిన్నభి మామా వ’వృత్స్వహనా”వ దస్యూ”న్ ఋత బో”ధ్యాపేః || 6 ||


అభి ప్రేహి’ దక్షిణతో భ’వా మే‌உధా” వృత్రాణి’ జంఘనావ భూరి’ |
జుహోమి’ తే ధరుణం మధ్వో అగ్ర’ముభా ఉ’పాంశు ప్ర’థమా పి’బావ || 7 ||


త్వయా” మన్యో సరథ’మారుజంతో హర్ష’మాణాసో ధృషితా మ’రుత్వః |
తిగ్మేష’వ ఆయు’ధా సంశిశా”నా అభి ప్రయం”తు నరో” అగ్నిరూ”పాః || 8 ||


అగ్నిరి’వ మన్యో త్విషితః స’హస్వ సేనానీర్నః’ సహురే హూత ఏ”ధి |
హత్వాయ శత్రూన్ వి భ’జస్వ వేద ఓజో మిమా”నో విమృధో” నుదస్వ || 9 ||


సహ’స్వ మన్యో అభిమా”తిమస్మే రుజన్ మృణన్ ప్ర’మృణన్ ప్రేహి శత్రూ”న్ |
ఉగ్రం తే పాజో” నన్వా రు’రుధ్రే వశీ వశం” నయస ఏకజ త్వమ్ || 10 ||


ఏకో” బహూనామ’సి మన్యవీళితో విశం”విశం యుధయే సం శి’శాధి |
అకృ’త్తరుక్ త్వయా” యుజా వయం ద్యుమంతం ఘోషం” విజయాయ’ కృణ్మహే || 11 ||


విజేషకృదింద్ర’ ఇవానవబ్రవో(ఓ)3’‌உస్మాకం” మన్యో అధిపా భ’వేహ |
ప్రియం తే నామ’ సహురే గృణీమసి విద్మాతముత్సం యత’ ఆబభూథ’ || 12 ||


ఆభూ”త్యా సహజా వ’జ్ర సాయక సహో” బిభర్ష్యభిభూత ఉత్త’రమ్ |
క్రత్వా” నో మన్యో సహమేద్యే”ధి మహాధనస్య’ పురుహూత సంసృజి’ || 13 ||


సంసృ’ష్టం ధన’ముభయం” సమాకృ’తమస్మభ్యం” దత్తాం వరు’ణశ్చ మన్యుః |
భియం దధా”నా హృద’యేషు శత్ర’వః పరా”జితాసో అప నిల’యంతామ్ || 14 ||


ధన్వ’నాగాధన్వ’ నాజింజ’యేమ ధన్వ’నా తీవ్రాః సమదో” జయేమ |
ధనుః శత్రో”రపకామం కృ’ణోతి ధన్వ’ నాసర్వా”ః ప్రదిశో” జయేమ ||

భద్రం నో అపి’ వాతయ మనః’ ||


ఓం శాంతా’ పృథివీ శి’వమంతరిక్షం ద్యౌర్నో” దేవ్య‌உభ’యన్నో అస్తు |
శివా దిశః’ ప్రదిశ’ ఉద్దిశో” న‌உఆపో” విశ్వతః పరి’పాంతు సర్వతః శాంతిః శాంతిః శాం
తిః’ ||



॥ నీలకృత ఆంజనేయస్తోత్రమ్ ॥

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ఓం జయ జయ । శ్రీఆఞ్జనేయ । కేసరీప్రియనన్దన ।  వాయుకుమార ।

 ఈశ్వరపుత్ర । పార్వతీగర్భసమ్భూత । వానరనాయక । సకలవేదశాస్త్రపారగ ।

సఞ్జీవనీపర్వతోత్పాటన । లక్ష్మణప్రాణరక్షక । గుహప్రాణదాయక ।

సీతాదుఃఖనివారక । ధాన్యమాలీ శాపవిమోచన ।  దుర్దణ్డీబన్ధవిమోచన ।

నీలమేఘరాజ్యదాయక । సుగ్రీవరాజ్యదాయక । భీమసేనాగ్రజ ।

ధనఞ్జయధ్వజవాహన ।  కాలనేమిసంహార । మైరావణమర్దన ।

వృత్రాసురభఞ్జన । సప్తమన్త్రిసుతధ్వంసన । ఇన్ద్రజిద్వధకారణ ।

అక్షకుమారసంహార । లఙ్కిణీభఞ్జన । రావణమర్దన । కుమ్భకర్ణవధపరాయణ ।

జమ్బుమాలినిషూదన। వాలినిబర్హణ । రాక్షసకులదాహన । అశోకవనవిదారణ ।
 లఙ్కాదాహక । శతముఖవధకారణ ।  సప్తసాగరవాలసేతుబన్ధన ।

 నిరాకార-నిర్గుణ-సగుణస్వరూప ।  హేమవర్ణపీతామ్బరధర । సువర్చలాప్రాణనాయక ।  త్రింశత్కోట్యర్బుదరుద్రగణపోషక ।

 భక్తపాలనచతుర । కనకకుణ్డలాభరణ ।  రత్నకిరీటహారనూపురశోభిత ।

 రామభక్తితత్పర । హేమరమ్భావనవిహార ।  వక్షతాఙ్కితమేఘవాహక ।

 నీలమేఘశ్యామ । సూక్ష్మకాయ । మహాకాయ । బాలసూర్యగ్రసన ।

ఋష్యమూకగిరినివాసక । మేరుపీఠకార్చన । ద్వాత్రిశదాయుధధర ।

చిత్రవర్ణ ।  విచిత్రసృష్టినిర్మాణకర్త్రే । అనన్తనామ । దశావతార ।

అఘటనఘటనాసమర్థ ।  అనన్తబ్రహ్మన్ ।  నాయక । దుర్జనసంహార ।

సుజనరక్షక ।  దేవేన్ద్రవన్దిత ।  సకలలోకారాధ్య । సత్యసఙ్కల్ప ।

భక్తసఙ్కల్పపూరక । । అకర్దమవినోదలేపన । కోటిమన్మథాకార ।

రణకేలిమర్దన ।  విజృమ్భమాణసకలలోకకుక్షిమ్భర ।

 సప్తకోటిమహామన్త్రతన్త్రస్వరూప ।  భూతప్రేతపిశాచశాకినీడాకినీవిధ్వంసన ।

 శివలిఙ్గప్రతిష్ఠాపనకారణ ।  దుష్కర్మవిమోచన । దౌర్భాగ్యనాశన ।  జ్వరాదిసకలరోగహర । భుక్తిముక్తిదాయక । కపటనాటకసూత్రధారిన్ । తలావినోదాఙ్కిత ।  కల్యాణపరిపూర్ణ । మఙ్గలప్రద ।  గానలోల ।

గానప్రియ । అష్టాఙ్గయోగనిపుణ । సకలవిద్యాపారీణ । ఆదిమధ్యాన్తరహిత ।
యజ్ఞకర్త్రే ।  యజ్ఞభోక్త్రే । షణ్మతవైభ వసానుభూతిచతుర ।  సకలలోకాతీత ।

 విశ్వమ్భర । విశ్వమూర్తే । విశ్వాకార । దయాస్వరూప ।  దాసజనహృదయకమలవిహార ।  మనోవేగగమన  । భావజ్ఞనిపుణ । ఋషిగణగేయ ।  భక్తమనోరథదాయక । భక్తవత్సల ।  దీనపోషక । దీనమన్దార ।  సర్వస్వతన్త్ర । రణాగతరక్షక ।  ఆర్తత్రాణపరాయణ । ఏక అసహాయవీర ।  హనుమన్ విజయీభవ । దిగ్విజయీభవ । దిగ్విజయీభవ । ఇతి నీలకృతం శ్రీఆఞ్జనేయస్తోత్రమ్ ।

🕉🌞🌏🌙🌟🚩


తెలుసుకోండీ... తెలియజేయండీ....

భూత , ప్రేత , పిశాచ బాధలు తొలగుటకు . ఆర్థిక , మానసిక భాధలు తొలగించటానికి .

శ్వేతార్క హనుమాన్ ప్రయోగం మంగళవారం రోజున గానీ పౌర్ణమి రోజున గానీ జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ముఖ్యంగా సూర్యుడికి నమస్కరించి ,ఓ సూర్య దేవా మా ఇష్టదైవం అయిన హనుమంతుడు విగ్రహం కోసం నేను ఈ వృక్షం సేకరిస్తున్నాను దీనికి నీ అనుగ్రబలం కావాలి , నీ కరుణా కటాక్ష వీక్షణలు కావాలి అని ప్రార్థించి ఆ వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు ఈ ఓం హరిమర్కట మర్కటాయ నమః అని గానీ హం హనుమాతే నమః అని అంటూ ప్రదక్షిణలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత జిల్లేడు చెట్టు మొదలు ఉత్తరం వైపు నుంచి త్రవ్వి పడమరకు పూర్తి చేసి ఆ వృక్షం మొదలను తీసుకుని శుద్దజలంతో శుద్ధి చేసి వేరును , వృక్షాన్ని ఎండబెట్టి ఎండిన తర్వాత సమిదలను నిత్యహోమంలో ఉపయోగించాలి . ఆకులను , ఎండిన పూలను నదిలో నిమజ్జనం చేయాలి !! వేరును మాత్రం అభయ హనుమాన్ విగ్రహం గా చెక్కించాలి . అనునిత్యం హం హనుమతే నమః అంటూ పూజిస్తే ఆ గృహంలో ఉన్న సమస్త భూత ప్రేత పిశాచాలు , సమస్త భూతములు తొలగి పోతాయి . ఆర్థిక మానసిక శతృబాధలు తొలగి లక్ష్మీదేవి దేవి స్థిరనివాసం ఉంటుంది . ఆ ఇంట్లో నిత్యం శుభకార్యాలు జరుగుతాయని శాస్త్ర వచనం.

ఆంజనేయ స్వామి అంటేనే సమస్త భూత ప్రేత పిశాచాలు దరిచేరవు . తేజస్, ధైర్యం , ఆరోగ్యం , కాబట్టి శ్వేతార్క హనుమాన్ విగ్రహం ఎందుకో ఆలోచించండి ? విగ్రహం ఏదైనా సరే మన్యుసూక్తం తో స్వామి వారికి అభిషేకం చేసి మూల మంత్రం జపం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ..... ప్రత్యంగిరా దేవి మంత్రాన్ని మన్యుసూక్తంతో సంపుటీకరించి అభిషేకం జపం చేస్తూ ఉంటే ఎంత భయంకరమైన సమస్యలు కూడా పరిష్కారం కాగలవు.
--(())--


అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩




శ్రీ హనుమాన్ మాలా మంత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

– హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)_

ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం)          
ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ప్రకట పరాక్రమాక్రాంత సకలదిఙ్మండలాయ, నిజకీర్తి స్ఫూర్తిధావళ్య వితానాయమాన జగత్త్రితయాయ, అతులబలైశ్వర్య రుద్రావతారాయ, మైరావణ మదవారణ గర్వ నిర్వాపణోత్కంఠ కంఠీరవాయ, బ్రహ్మాస్త్రగర్వ సర్వంకషాయ, వజ్రశరీరాయ, లంకాలంకారహారిణే, తృణీకృతార్ణవలంఘనాయ, అక్షశిక్షణ విచక్షణాయ, దశగ్రీవ గర్వపర్వతోత్పాటనాయ, లక్ష్మణ ప్రాణదాయినే, సీతామనోల్లాసకరాయ, రామమానస చకోరామృతకరాయ, మణికుండలమండిత గండస్థలాయ, మందహాసోజ్జ్వల-న్ముఖారవిందాయ, మౌంజీ కౌపీన విరాజత్కటితటాయ, కనకయజ్ఞోపవీతాయ, దుర్వార వారకీలిత లంబశిఖాయ, తటిత్కోటి సముజ్జ్వల పీతాంబరాలంకృతాయ, తప్త జాంబూనదప్రభాభాసుర రమ్య దివ్యమంగళ విగ్రహాయ, మణిమయగ్రైవేయాంగద హారకింకిణీ కిరీటోదారమూర్తయే, రక్తపంకేరుహాక్షాయ, త్రిపంచనయన స్ఫురత్పంచవక్త్ర ఖట్వాంగ త్రిశూల ఖడ్గోగ్ర పాశాంకుశ క్ష్మాధర భూరుహ కౌమోదకీ కపాల హలభృద్దశభుజాటోప ప్రతాప భూషణాయ,      వానర నృసింహ తార్‍క్ష్య వరాహ హయగ్రీవానన ధరాయ, నిరంకుశ వాగ్వైభవప్రదాయ, తత్త్వజ్ఞానదాయినే, సర్వోత్కృష్ట ఫలప్రదాయ, సుకుమార బ్రహ్మచారిణే,      భరత ప్రాణసంరక్షణాయ, గంభీరశబ్దశాలినే, సర్వపాపవినాశాయ, రామ సుగ్రీవ సంధాన చాతుర్య ప్రభావాయ, సుగ్రీవాహ్లాదకారిణే, వాలి వినాశకారణాయ, రుద్రతేజస్వినే వాయునందనాయ, అంజనాగర్భరత్నాకరామృతకరాయ, నిరంతర రామచంద్రపాదారవింద మకరంద మత్త మధురకరాయమాణ మానసాయ, నిజవాల వలయీకృత కపిసైన్య ప్రాకారాయ, సకల జగన్మోదకోత్కృష్టకార్య నిర్వాహకాయ, కేసరీనందనాయ, కపికుంజరాయ, భవిష్యద్బ్రహ్మణే, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే తేజోరాశే ఏహ్యేహి దేవభయం అసురభయం గంధర్వభయం యక్షభయం బ్రహ్మరాక్షసభయం భూతభయం ప్రేతభయం పిశాచభయం విద్రావయ విద్రావయ, రాజభయం చోరభయం శత్రుభయం సర్పభయం వృశ్చికభయం మృగభయం పక్షిభయం క్రిమిభయం కీటకభయం ఖాదయ ఖాదయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగదాశ్చర్యకర శౌర్యశాలినే ఏహ్యేహి శ్రవణజభూతానాం దృష్టిజభూతానాం శాకినీ ఢాకినీ కామినీ మోహినీనాం భేతాళ బ్రహ్మరాక్షస సకల కూశ్మాండానాం విషయదుష్టానాం విషమవిశేషజానాం భయం హర హర మథ మథ భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ ప్రహారయ ప్రహారయ, ఠఠఠఠ ఖఖఖఖ ఖేఖే ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే శృంఖలాబంధ విమోచనాయ ఉమామహేశ్వర తేజో మహిమావతార సర్వవిషభేదన సర్వభయోత్పాటన సర్వజ్వరచ్ఛేదన సర్వభయభంజన, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కబలీకృతార్కమండల భూతమండల ప్రేతమండల పిశాచమండలా-న్నిర్ఘాటయ నిర్ఘాటాయ భూతజ్వర ప్రేతజ్వర పిశాచజ్వర మాహేశ్వరజ్వర భేతాళజ్వర బ్రహ్మరాక్షసజ్వర ఐకాహికజ్వర ద్వ్యాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధికజ్వర పాంచరాత్రికజ్వర విషమజ్వర దోషజ్వర బ్రహ్మరాక్షసజ్వర భేతాళపాశ మహానాగకులవిషం నిర్విషం కురు కురు ఝట ఝట దహ దహ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే కాలరుద్ర రౌద్రావతార సర్వగ్రహానుచ్చాటయోచ్చాటయ ఆహ ఆహ ఏహి ఏహి దశదిశో బంధ బంధ సర్వతో రక్ష రక్ష సర్వశత్రూన్ కంపయ కంపయ మారయ మారయ దాహయ దాహయ కబళయ కబళయ సర్వజనానావేశయ ఆవేశయ మోహయ మోహయ ఆకర్షయ ఆకర్షయ, ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే జగద్గీతకీర్తయే ప్రత్యర్థిదర్ప దళనాయ పరమంత్రదర్ప దళనాయ పరమంత్రప్రాణనాశాయ ఆత్మమంత్ర పరిరక్షణాయ పరబలం ఖాదయ ఖాదయ క్షోభయ క్షోభయ హారయ హారయ త్వద్భక్త మనోరథాని పూరయ పూరయ సకల సంజీవినీ నాయక వరం మే దాపయ దాపయ,

ఓం నమో భగవతే పంచవక్త్ర హనుమతే ఓం (హ్రౌం క్ష్రౌం గ్లౌం హుం హ్సౌం) శ్రీం భ్రీం ఘ్రీం ఓం న్రూం క్లీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హుం ఫట్ ఖే ఖే హుం ఫట్ స్వాహా ||    


                 – హ్రౌం క్ష్రౌం క్ష్ర్మ్యౌం గ్లౌం హ్సౌం (ఇతి పాఠభేదః)_

🕉🌞🌏🌙🌟🚩
--(())--
ప్రాంజలి ప్రభ - *శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి.*
సేకరణ: మల్లాప్రగడ  శ్రీదేవి రామకృష్ణ


ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః
ఓం అశొకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వబంధ విమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయనమః
ఓం పరవిద్వపరీ హారాయ  నమః
ఓం పరశౌర్య వినాశనాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
ఓం పరమంత్ర ప్రభేధకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ధృమూలస్ధాయ నమః
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వ విద్యాసంపత్ప్రదాయ నమః
ఓం కపిసేనా నాయకాయ నమః
ఓం భవిష్యచ్చతు రాననాయ నమః
ఓం కూమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గందర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహ విమోక్త్రే నమః
ఓం శృంఖల బంధ విమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరిసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భసంభుతాయ నమః
ఓం బాలర్క సదృశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణేభంజనాయ నమః
ఓం గంధమాదన శ్తెలస్థాయ  నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం ద్తెత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం రామ చూడామణి ప్రదాయ 
నమః

ఓం కామరూపినే నమః
ఓం శ్రీ పింగళాక్షాయ నమః
ఓం నార్ధి ంతే నాక నమః
ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః
ఓం కబలీకృత మార్తాండ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సందాత్రే నమః
ఓం మహారావణ మర్ధనాయ నమః
ఓం స్పటికా భాయ నమః
ఓం వాగ ధీశాయ నమః
ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహత్మనే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సంజీవన నగా హర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమధనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయనమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ మదావహృతేనమః
ఓం యోగినే నమః
ఓం రామకధాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్ర నఖాయ నమః
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః
ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజర భేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాంబవ త్ప్రీతి వర్ధనాయ నమః
ఓం సీత సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః
*శ్రీ ఆంజనేయం*
*శుభోదయం*
-(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
మహావీర హనూమంత:
*నమామి*
 భజరంగభళీ హనూమంతం
స్మరామి మహా వీర గుణవంతం
శ్రీ రామ పదసేవ ధీమంతం
సీతాశోక నాశక జ్ఞాన వంతం.
"నమామ్యహమహర్నిశమ్ ".
జయజయహోప్రాణదేవరా
జయోస్తుబాహు పరాక్రమా
నమ నమహో పవనపుత్రా
నమోస్తు భక్తాగ్రేసర హనుమా
"నమామ్యహమహర్నిశమ్ ".
అచంచల మనోబల సంకల్ప ధీమ
దుష్ట నివారణ నిగ్రహసంపన్న తేజ
కష్టతారణ,భూతప్రేత భయవిదూర,
అష్టసంపద నవనిధులొసగు మంగళదాయి.
"నమామ్యహమహర్నిశమ్ "
గుండెగుండెలో రామనామ స్మరణయి
జెండానిండుగ ధీర కపిరాజు వీర
అండగ బుద్ధి యశోబల ఆంజనేయ
సుందర సిద్ధి భక్తాగ్రేసర కేసరినందన.
"నమామ్యహమహర్నిశమ్ "
సంకటహర సకలదేవానుగ్రహతేజ
సంజీవ రాయ శ్రీ రామకార్యజయకర
శ్రీ విద్యా శోభిత,విక్రమ చరిత పావన
ప్రభుగుణగాన భవిష్యత్ బ్రహ్మభావమా.
"నమామ్యహమహర్నిశమ్ ".
మాట తీరు-కార్యశూరతలశాంతి ద్రష్ట
తారకమంత్ర శ్రీ రామరక్ష చిరంజీవ,
గ్రహపీడతొలగ,
శ్రీ రామదూత
 -శ్రీరుద్రరూప,
నామసంకీర్తనబ్రహ్మతేజ,
శ్రీ సూర్యమిత్ర
నమామ్యహమహర్నిశమ్ 
--(())--


ఆధ్యాత్మి కానందారోగ్యా ప్రభ 
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
*శ్రీ ఆంజనేయ స్తోత్రం*

*ఓం నమో వాయు పుత్రాయ 9pm  ధీమతే!*
*నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే.!!*
*మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే!*
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ !!*

*వాగ్మినేగతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ!*
*వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే.!!

*తత్త్వ జ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే!*
*ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ.!!*

*జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ.!*
*నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే!*
*యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే.!!*

*యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే!*
*మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే.!!*

*హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే!*
*బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే.!!*

*లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక!*
*యశోజయంచ మే దేహి శతృన్ నాశయ నాశయ.!!*

*స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం!*
*హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్. !!*
--(())--


హనుమత్ సూక్తమ్

శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రద సర్వా భరణ భూ షిత ఉదారో మహోన్నత ఉష్ట్రా రూడ : కేసరి ప్రియ నందనో వాయు తనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధ మాదన సంచారీ హేమ ప్రాకారామ్చిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ వస్త్రం చ భిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్ప్రతాపశాలీ రజతవర్ణ: శుద్ధ స్పటిక సంకాశ : పంచ వదన: పంచదళ నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రామణో మహేమ్ద్రాద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గిర్వాణ మునిగణ గంధర్వ యక్ష్ కిన్నర పన్నగాశుర పూజిత పాద పద్మయుగళో నానా వర్ణ కామ రూప : కామచారీ యోగి ద్యెయ : శ్రీ హనుమాన్ ఆంజనేయ: విరాడ్రూప: విశ్వాత్మ పవన నందన: పార్వతీ పుత్ర : ఈశ్వ ర తనూజ సకల మనోరధాన్నో దదాతు



హనుమాన్ చాలీసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు !
ఇహపర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు !
బుద్బుదములని తెలు సత్యములు ॥ శ్రీ ॥

జయ హనుమంత జ్ఞానగుణ వందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ ॥ శ్రీ ॥

ఉదయభానుని మధుర ఫలమని
భావనలీలా మృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మందిత కుంచిత కేశ ॥ శ్రీ ॥

రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని ॥ శ్రీ ॥

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలము జేసినా ॥ శ్రీ ॥

సీతజదగని వచ్చిన నినుగని
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
సహస్త్ర రీతుల నినుకొని యాడగ
కాగల కార్యము నీపై నిడగ ॥ శ్రీ ॥

వానర సేనతో వారధి దాటి
లంకేసునితే తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసగా గూల్చిన ॥ శ్రీ ॥

లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాఅతికి
అసురవీరులు అస్తమించిరి ॥ శ్రీ ॥

తిరుగులేని శ్రీ రామ భాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురలేని ఆ లంకా పురమున
ఏ లికగా విభిషను జేసిన ॥ శ్రీ ॥

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోద్య్యా పురి పొంగి పొరలె ॥ శ్రీ ॥

సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతు పదం సీ హృదయం
రామచరిత కర్ణా మృత గాన
రామనామ రసామృత పానా ॥ శ్రీ ॥

దుర్గమమగు ఏకార్యమైన
సుగమమే యగు నీకృత జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీరక్షణయున్న ॥ శ్రీ ॥

రామద్వారపు కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాఖినీ ఢాకినీ
భయపడి పారు నీనామ జపము విని ॥ శ్రీ ॥

ద్వజాది రాజా వజ్ర శరీరా
భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సమ్భూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర ॥ శ్రీ ॥

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబెర దిక్ప్పాలురు కవులు
పులకితులైరి నీకీర్తి గానముల ॥ శ్రీ ॥

సోదర భారత సమానాయని
శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా
సాదులపాలిట ఇంద్రుడ వన్నా
అసురుల పాలిట కాలుడవన్నా ॥ శ్రీ ॥

అష్ట సిద్దిలకు నవనిధులకు దాతగ
జానకీ మాత దీవిచెనుగా
రామసామృత పానము జేసిన
మృ త్యుంజయుడవై వెలసిన ॥ శ్రీ ॥

నీనామ భజన శ్రీ రామ రంజిత
జన్మ జన్మాంతర దు:ఖ భంజన
ఎచ్చ్తుమ్డినా రఘువరదాసు
చివరకు రాముని చేరుత తెలుసు ॥ శ్రీ ॥

ఇతర చింతనలు మనసున మోతలు
స్తిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ॥ శ్రీ ॥

శ్రద్ధగా దీనిని అలకిమ్పుమా
శుభమగు ఫలములు గలుగు సుమా
భక్తీ మీరగ గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ ॥ శ్రీ ॥

తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
నాలో దోషములున్న మన్నింపు మన్న 

ఓ హనుమన్నా మంగళహారతి

మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
న అంత రాత్మ నిలుమో అనంత
నివే అంతా శ్రీ హనుమంతా

ఓం శాంతి: శాంతి: శాంతి:

శ్రీ ఆది శంకరుల విరచిత
శ్రీ గణేష పంచ రత్నం
(1)ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం||

కళాధరావతంసకం
విలాసిలోక రక్షకం |

అనాయకైక నాయకం
వినాశితేభ దైత్యకం||

నతాశుభాశునాశకం 
నమామితంవినాయకం ||


(2)నతేరాతి భీకరం
నవోదితార్కభాస్వరం||

నమత్సురారి నిర్జరం
నతాధికాప దుద్ధరం||

సురేశ్వరం నిధీశ్వరం
గజేశ్వరం గణేశ్వరం||

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ||


(3)సమస్తలోకశంకరం
నిరస్త దైత్యకుంజరం||

దరేతరోదరం వరం
వరేభవక్త్ర మక్షరం||

కృపాకరం క్షమాకరం 
ముదాకరం యశస్కరం||

మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం ||


(4)అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం||

పురారి పూర్వ నందనం
సురారి గర్వచర్వణం||

ప్రపంచ నాశభీషణం ధనంజయాదిభూషణం||

కపోల దానవారణం
 భజే పురాణ వారణం ||


(5)నితాంత కాంత దంత 
కాంతి మంత కాంత కాత్మజం||

అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం||

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం||

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ||

ఫలశ్రుతి :

మహాగణేశ పంచరత్న
మాదరేణ యోన్వహం||

ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్గణేశరమ్||

అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం||

సమాహితాయురష్టభూతి 
మభ్యుపైతి సోచిరాత్ ||


🕉🌞🌎🌙🌟🚩

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ