శ్రీ కృష్ణ లీలామృతం.. సీస పద్యాలు




 ప్రాంజలి ప్రభ పద్య పుష్పాయాలు  14
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కుదురుగ కూర్చున్న కులుకుల చూపులు 
ఎవరి నుధ్ధరించు బాల కృష్ణ 
రేపల్లె ఆడపడుచు లకు అల్లరి 
కృష్ణయ్య పలుకుకే సంతసించు
కృష్ణుని కనుసైగలకె మనసే కరిగి
తెలియని ప్రేమను పొందు చుండు 
ముసిముసి నవ్వులమురిపెంబుల్ నిల్పు
హృదయమ్ము శాంతింపు బాల కృష్ణ

చిన్ని చిన్ని నవ్వు కలలను పండించు
కనుల కులుకు చిలుకు హృద్యమంత 
కరుణ దయ కనికర శేషతల్పనివాస 
శరణు మనసు తెల్పు చుంటి కృష్ణ 

--(())--


ప్రాంజలి ప్రభ -శ్రీ కృష్ణ లీలామృతం ....13
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కుసుమ కోమల కనకస్వప్ర కాశమ్ము
వెల్గుల విరజాజి మహిళ కాంతి
విశ్వవ్యాపిత పరం ధామక పరం జ్యోతి 
సత్యపు తృప్తి యే విశ్వ తేజ
లలిత లావన్యమ్ము సుకుమార సౌందర్య 
హాసినీ సుమధురా స్నేహ మధుర 
పరుగులు తీసేటి పరువాలు థళథళ
మెరుపుల అందాల మెర్పు వల్లె 

సరస సౌందర్య ఆకర్ష మహిళ పిలుపు
నయనముల కులుకుల వల్ల ఆశ తలపు 
వినయ పెదవి కదలిక లు మనసు దోచె
తెల్పు మల్లాప్రగడ కళలే లు శోభ
--(()) - -



ప్రాంజలి ప్రభ -శ్రీ కృష్ణ లీలామృతం ....12
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సీస పద్యము 
నను నయనముల నవనిధుల మెరుపులు
నళినిలొ నటనల తలపు పిలుపు
మురిపెముగ మగువ సిగముడి చె మురిసి 
మది మలుపు పిలుపు కధలు తెలుపు
సరసపు సుమ దళముల సరిగమలతొ
సకల శుభములుతొ పరిమళములు
విరహిణి వినయపు వలపుల వికసిత 
విహసిత వలయపు హృదయ విమల

తేటగీతి 
మగువ మనసుకు మనుగడ మధుర మహతి 
చెలియ ఛలుకుల పలుకులు చలన చరిత
తరుణి తమకము తికమక తరుణ తపతి
కళల కులుకుల కలవర కధలు తెలిపె

--(())--




శ్రీ కృష్ణ లీలామృతం   ....11
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
  
కరవలయంబులు ఘల్లు ఘల్లు మనుచుండ
జారిన ధోవతి జక్క నొత్తి 
కుంతలమ్ములు దిద్ది  కొమరొప్ప, నెమలి పిం
ఛమును, సింగారంబు సలిపి, వేగ
రతీశయ్య నుండి,  శ్రీపతి లేవగా బోవ   
ప్రియురాలు గౌగిలి బెట్టి, సన్న 
సేయ, సుళువేరింగి, తోయజాక్షిని, రతి 
క్రీడల, మఱల సుఖింప జేసి 

నట్టి, జారశిఖామణి,  ఎట్ట ఎదుట
గానబడుచున్న వాడు, నా కన్నులకును, 
మనన మొనరించి,.ధ్యానించి, మమత బెంచి, 
ప్రార్ధన మొనర్చి, స్తుతియించి, పాడు కొందు 

--(())--


శ్రీ కృష్ణ లీలామృతం   ....10

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

తరుణారుణముఁ దయాకరము దీర్గములైన 
వెడలపు గన్నుల - బుడత కాడు   
కలశంబులు బోలు-  గమలాకుచంబుల
బులకలు కల్గించు - కులుకులాడు 
మురళీ రవంబుచే - మునుల మానస కమ 
లములు విప్పగ జాలు - లలిత యశుడు 
మధురామృత మహిమచే పల్లవీ 
జనముల దనిపెడు - సరస మూర్తి   

అమృతరూపుండు పరమాత్ముడాదిరూపు 
డాల కాపరి గోపాల బాలకుండు 
పొలుపుగా, నాదు సంతోష పూర్ణమైన 
చిత్తమందు గ్రీడించుచు జెలగు వాడు 

--(())--

శ్రీ కృష్ణ లీలామృతం   ....9
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సీ :: కమ నీయమైన  కనువిందు సౌందర్య 
       సంపద కల్గిన సోంపు కాడు 
       వాక్కునా క్రమణచే విశ్వాస పాత్రుడు  
       కర్తవ్య దక్షత కమల ముఖుడు 
       ముకురసన్నిభమైన ముద్దు లొలకువాడు 
       పూర్ణచంద్రుని వంటి ముఖము వాడు 
       వేణుగానామృతవృష్టిని గురిపించు 
       కారుమబ్బుల దేహ కాంతి వాడు 

ఆ..  సంత సించి శాంతి యుద్ధంబు చేసేటి 
        వాడు మంచి చేసి మాయ లేని 
        వాడు కమల ముఖుడు  బ్రహ్మాండ మంతున్న 
        బాల రూప మైన బ్రహ్మ యోగి 
                           

                              --(())--


31-05-2020

Buy Studio Briana Standing Krishna With Flute Silhouette wall Decal Sticker on Premium Vinyl Online at Low Prices in India - Amazon.in
శ్రీ కృష్ణ లిలామృతం   ....7 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సీ :: మధురాతి  మధురమ్ము  చిరునవ్వు  చిన్నోడు 
       సమ్మొగము తొ పడచులు  ముద్దు చేయు  
       భూషణముల వెలుగుముఖార విందము 
       సింగారమును  గల్గు రంగు కాడు 
       వెడద కన్నులతోడ వేడ్కగొల్పెడివాడు 
       మదన మోహనుడైన మన్మ దుండు  
       అలుక తీర్చు పలుకు మదన మోహనుడులే 
       నిత్యమూ నామనము నున్నవాడు 

ఆ : ఆడు ఈడు నాది ఆయిననుఁ మొక్కెద 
      ఈడు తోను సంత సమ్ము ఇచ్చు 
      నట్టి జ్యోతి రూపు కల్గిన కృష్ణుడు   
      నన్ను రక్ష చేసి సన్ను తింతు 
     
                   --(())--

30-05-2020





ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
శ్రీ కృష్ణ లీలామృతం (5 )
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సీ:: నెమలిపురి దాల్చి నీటైన మొముతో 
      నవ యవ్వనము  గుల్కు నాట్య కాడు 
      నవరాగములు  పల్కి  నవరత్న వెలుగుతో 
      నటననే చూపేటి  నవ్య తేజ 
      వేణునాదామృత  వీచికల్ విరజిమ్మి    
      పాపము తొలగించు పావ నుండు 
      మురిపాల మోహనా గొల్లభామల చేత 
      నారాధి తుండైన యనఘ మూర్తి    

ఆ:: ఎల్ల దేవ తాళి  యుల్లంబు గొన్నట్టి 
       బాలధూపమైన  బ్రహ్మ యోగి 
       నాదు రచన లందు  మోదంబు లొసంగుచు 
       నాట్యమాడుగాన నారతంబు 


                   __(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
శ్రీ కృష్ణ లీలామృతం (5 )
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సీ::    పాలాభిషేకంబు  చిత్తశుద్ధిని గూర్చు  
          ఘంధంబు వలన  పుణ్యంబు కలుగు 
          ధూపంబు కలిగించు ధనధాన్య సంపద 
          దీపంబు చేఁ జ్ఞాన దీప్తి కలుగు 
          నైవేద్య మిచ్చును నిండైన జీవితం 
          భోగాల నొసగు తాంబూలమేపుడు 
         ఆత్మ ప్రదక్షణ ఆగముల నణగించు 
         శాంతినొసగు నమస్కారమ్ము  కృష్ణ 

తే :: హృదయ పూర్వక ముగ పచా రములు సేయ   
         మనసు అర్పించి  ఉపవాస ఉండి  సేయ 
         యొసఁగు తున్నట్టు  పూజలు  సేయ కృష్ణ 
         విధితొ  మమతాను రాగములు  పెంచు కృష్ణ 

-                               -(())--  

29-05-2020

2Hues & Shades - Hand Painted Oil & Charcoal

సీ:: వెన్నను తింటివె వెన్నును చూపియు
       మురిపెము చూపిన ముద్దు కృష్ణ 
       పడతుల మధ్యన పల్కులతొ మాయను
       చూపియు నవ్వులు చూపు కృష్ణ 
       బాలురతొ ఆటలు బాల్యపు చేష్టలు
        ధైర్యము చూపిన ధర్మ తేజ 
       అమ్మకు చూపెను ఆటలు నవ్వతూ
       దీక్షకు మద్దతు దీక్ష కృష్ణ

తే::: మనసు పడచులకు పంచియు మోక్ష మిచ్చె
. . .  కలువ పువ్వుల నవ్వుల కళ్ళు తిప్పి
. . .  తరుణ మాయను చూపెనులే తల్లి పలుకు
. . .  వినయ విధేయత వినమ్రత చూపె కృష్ణ
              . . . .(())......

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 
శ్రీ కృష్ణ లీలామృతం (2 )
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సీ:: శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీ ధర్మ  తేజస్వి 
      పాలకా  మరహరీ పావ నుండ 
      గోవర్ధనోద్ధార గోపికాలోల అ 
     క్రూరవరద శ్రీ ముకుంద నంద 
      కర్తవ్య  దక్షత  కారుణ్య దీక్షిత  
      పాండవ రక్షక  ప్రాణ రక్ష 
      కోరుకున్నోరికి   బంగార మిచ్చేటి  
      కోనేటి నాయుడు రక్ష రక్ష 

తే ::  మనసు కోరిక తెలిసికొని ధర్మ రక్ష  
        వయసు వేడుక గమనించి  ఆశ తీర్చి
        మమత  మానవత్వమ్ముకు శిష్ట రక్ష   
        కరుణ కృష్ణ లీలామృత మ్మేగ రక్ష  
                      --(())--
  
ప్రాంజలి ప్రభ - శ్రీ కృష్ణ లీలామృతం -3    
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

సీ::చైతన్య సంతోషుని చేతిపూవులతోడ
     నిందార మునిగిన నీటు కాడు
     విస్తృత లహరీ విశ్వాస సద్భావ
     వినమ్ర విషయాల దీప వాసి
     మ్రోక్కిన వారికి మోక్షంబు కల్పించి
     ఇష్టము ను తెల్సి ఇచ్చువాడు
     సుఖంబులు అందించు సుఖాల సూర్యుడు 
     బట్టి ఇచ్చాడు నట్టి బాల కుండు

తే::  చెలియ మాటలతో తన్మాయ చూపినోడు
       చెలిమి కోరుతున్న పిల్లలతో ఆడు వాడు 
       కలిమి కోరిన వారికి ఇచ్చే వాడు
\      మగువ మాటలకు కట్టుబడి ఉండువాడు

                   --(())--

 

ప్రాంజలి ప్రభ - శ్రీ కృష్ణ లీలామృతం -4    
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 


సీ :: నిమ్న కళ్లా చూపు  నిత్యచంచలములై 
        కాంతులీనెడు  కడగండ్ల వాడు 
        లావణ్య రసవాసి  లాస్యము పంచేటి 
        శృంగార  పురవాసి  రసిక వాడు 
        మన్మధ జనకుడై  సామ్రాజ్య  రక్షకుడై 
        భువినంత ఏలేటి  భాగ్య పరుడు
        భక్తితొ  పూజిస్తె  భాగ్యమ్ము  కల్పించు 
        నిధియై చెలంగెడు నీటు గాడు   
    
తే : కధలు వినినను చదివిన  మోక్షమిచ్చు  
       కవిత పాడిన  మధురమ్ము అనువాడు 
       కదులు రెప్పల మాటున ఉండువాడు 
       కమల నయనాల  కాంతి  పరుడు       ....... 4  



సీసము. .
మధుసూధనా!వేణు-మాధవా!కారుణ్య
        గుణధామ,శ్రీశ,వై-కుంఠ వాస.!
ఎన్నెన్ని నామంబు-లెన్నెన్ని లీలలో.!
        కీర్తించినంతనే-యార్తి దొలగు.!
నీ నామకీర్తనల్ -నిత్యంబు స్మరియించ,
        భవబంధముల్ తొల్గి-పరము గలుగు.!
గాఢాంధకారమై-కనిపించకే దారి,
        దిక్కుతోచని మాకు-దిక్కు నీవె.!
తే.గీ.
కాదు!శాశ్వతంబేదియు-కాదు కాదు.!
కలల మేడల విహరించ-ఫలితమేమి.!
హరిహరీయని యనకున్న-యందమేమి.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!

--(())--
సీసము. 
రాగానురాగాలు-రగిలించు యెదలోన,
     మనసులనాడించి-మౌనమేల.?
కోపతాపంబుల-గుణములన్ కల్పించి,
        చోద్యంబు ముదముగన్-జూచుటేల.?
గర్వమహంబుల-కంచెలన్ సృజియించి,
         హాయిగన్ జూచుట-న్యాయమేన.?
మోహలోభంబులన్- ముద్దుగ సృజియించి.,
          ప్రాకులాటలు జూడ-పాడియేన.?
తే.గీ.
ఇంద్రియమ్ముల తనువునున్-సృజనజేసి.,
కనుల ముందర మాయలన్-గలుగజేయ.,
మనసు బంధించి నిన్జేరు-మార్గమేది.?

శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!


సీసము. 47
ఎందుకీ యాతనో.!-యేమియు గొంపోవు,
        సుడిగుండముల బడి-మడియుటేల.!
ఏమియోననుకుంటు.!-నెగరంగబోదువు. !
        నేదియు నీవెంట-రాదు తుదకు.!
ఎవరెవరినొ జూచి-యెందుకు కుమిలేవు.!
         వీడరా!నీ బాధ-వీడి గనుము.!
అత్యంత భక్తితో- నాద్యంతరహితునిన్.,
          యర్చించి కొలువంగ-నార్తి దొలగు.!
తే.గీ.
ఏలరా!చింత.,నీకేల-యేల మేలు.!
వేడరా.!భక్తి పొంగార-వేడి చూడు.!
భక్తికన్నను మేలైన-శక్తిగలదె.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.

సీసము. 48
సర్వంబు విడనాడి-జపతపంబులజేసి
          తాపసులెందరో-ధన్యులైరి.!
భక్తిమార్గమువోయి-ప్రార్థించి వేడుచు
          పుణ్యాత్ములెందరో-ముక్తులైరి!
సంసారమందున-చరియించుచున్నను
          పూజించి యెందరో-పుణ్యులైరి.!
తత్వసాగరమందు-తరియించి శోధించి,
          మౌనీంద్రులెందరో-జ్ఞానులైరి.!
తే.గీ.
నింగికంటెడు నాశల-నిమ్నపరచి.,
మానసంబున గ్రమ్మిన-మబ్బుదీసి.,
దైవపూజల జన్మంబు-ధన్యమగును.!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము. 49
పరులను నిందించ-పాడియే గాదురా.!
         పరమాత్మ నర్చించు-పరము గలుగు.!
పుణ్యమార్గము వీడి-మోసంబులేలరా.!
         నిష్టగన్బూజించు-కష్టమొదులు.!
వక్రభాష్యంబుల-వాదంబులేలరా.!
          సత్యమార్గమువోవ-జయము గలుగు.!
విలువలన్ విడనాడి-పెడదారులేలరా.!
          దైవమున్ నమ్మిన-దారిదెలియు.!
తే.గీ.
మేడ మిద్దెల హంగులన్-జూడబోకు.!
నగల ధగధగలన్ గని-వగచబోకు.!
పరమసత్యంబులవి గావు-తరచిచూడ.!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము.50
పరమపదంపు సో-పాన పటమ్మిది,
         నిచ్చెనల్ పాములు-నీకు తగులు.!
సత్యసూత్రముబట్టి-యత్యంతనేర్పునన్,
         కేళించవలె జన్మ-గాలిపటము.!
పులి నక్కలెన్నియో-పొంచియుండు,మిగుల
         జాగ్రత్తగన్ జూచి-సాగవలయు.!
సర్ప,వృశ్చిక,విష-సాదృశ్యజీవులు,
          నీ త్రోవ నుందురు-నిన్ను త్రుంచ.!
తే.గీ.
నిత్యపూజలన్ జేయుచు-నియతిగలిగి.,
సత్యమార్గము నందునన్-సాగుచుండ.,
యాపదల్ తొలంగియు,పూర్ణ-యశముగల్గు.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!

సీసము.51
ప్రేమ సుధాబ్జముల్-వికసించు హృదయాన
         పరమాత్మ నీనామ-భజన వలన.!
జ్ఞానప్రసూనముల్-ననచును హృదయాన
          మాధవా.!నీనామ-మహిమ వలన.!
జన్మసాఫల్యంబు-సరగున సిద్ధించు,
           కేశవా.!నీనామ-కీర్తి నుడువ.!
కర్మబంధమ్ములు-నిర్మూలనంబగు.,
            జలజాక్ష నీనామ-జపము వలన.!
తే.గీ.
కమలనాభ,జనార్దనా!-విమలతేజ.!
అచ్యుతానంత,నీనామ-యశము నుడువ.,
మోక్షమార్గంబు ప్రాప్తించి-ముదము గలుగు.,
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము. 52
పరుషంపు వాక్కులన్-పలువురన్ నిందించి.,
         కాలంబు వృధజేసి-కరగిపోకు.!
నీలోను నీవేను-నేర్పునన్ శోధించ
          నీవేమిటో నీకు-నిజముదెలియు.!
కల్లోల హృదయమ్ము-గాంచదు సత్యంబు,
           పోటెత్తు కోర్కెల-ముంచివేయు.!
మితిమీరినాశలు-మతివిభ్రమణ జేసి.,
           పంజరమ్మున జేర్చి-బంధిజేయు.!
తే.గీ.
పనికిరానట్టి చేష్టలన్-వదలిపెట్టి.,
యోగ్యమైనట్టి సత్యమున్-యుక్తిజేత
బడసి,ముక్తినిన్ పొందంగ-వాసియగును.!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము. 53
జనన,మరణచక్ర-సంస్థితార్ణస్థితి,
       యాత్మకెపుడు గూడ-నంటబోదు.!
పరిశుద్ధచైతన్య-పరితోషతత్వమై
       అంచితంబగునాత్మ-యలరులొలుకు.!
నిర్వికార,పవిత్ర-నిర్మలంబగునాత్మ,
       భాసిల్లు జీవులన్-బ్రభలనొలికి.!
ఇంపారునాత్మల-నింద్రియవాంఛలే,
        కప్పివేయగనవి-గానరావు.!
తే.గీ.
తుచ్ఛమైనట్టి కోర్కెలన్-ద్రుంచివేసి.,
స్వచ్ఛమైనట్టి చర్యలన్-స్వాగతించి,
జన్మసాఫల్యమొందగ-చనగ మేలు.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!

సీసము. 54
రాగానురాగాలు-రగిలించి యెదలోన,
     మనసులనాడించి-మౌనమేల.?
కోపతాపంబుల-గుణములన్ కల్పించి,
        చోద్యంబు ముదముగన్-జూచుటేల.?
గర్వమహంబుల-కంచెలన్ సృజియించి,
         హాయిగన్ జూచుట-న్యాయమేన.?
మోహలోభంబులన్-ముద్దుగ సృజియించి.,
          ప్రాకులాటలు జూడ-పాడియేన.?
తే.గీ.
ఇంద్రియమ్ముల తనువునున్-సృజనజేసి.,
కనుల ముందర మాయలన్-గలుగజేయ.,
మనసు బంధించి నిన్జేరు-మార్గమేది.?
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము.55

శ్రీహరీ!శ్రీశ,హృ-షీకేశ,వైకుంఠ
        పురవాస!కేశవా!-భరము నీవె.!
దామోదరాయ!శు-ద్ధాయ,నారాయణా.!
        బ్రహ్మాండనాయకా!-రక్ష నీవె.!
భక్తవత్సల,భవ-బంధవిమోచకా.!
        పరమాత్మ,నన్నేలు -స్వామి నీవె.!
నిర్వికార,నిధయ!-నిశ్చలమొనరించి,
        సద్గతి నిడునట్టి-శౌరి నీవె.!
తే.గీ.
చంచల మదిని నిలుపంగ-జాలనైతి.!
జన్మకర్థంబు నెఱుగంగ-జాలనైతి.!
దేవ!నీదయ జూపించు!-దిక్కు నీవె!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము. 56
తావినీనెడు భక్తి-తత్వంబు విడనాడి.,
       యుమ్మెత్తపూలకై-యుఱుకుటేల?
వేదశాస్త్రమ్ముల-విధులనే విడనాడి.,
        కోర్కెలమత్తునన్-గూలుటేల.?
ధనరాశియుప్పొంగ-ధర్మంబు విడనాడి,
         గర్వమహంబుల-కసరుటేల.?
జ్ఞానముప్పొంగగ-న్యాయమున్ విడనాడి,
         పరులపై పరుషంపు-పల్కులేల.?
తే.గీ.
సత్యసంధత సహనంబు-శాంతి గల్గి,
సజ్జనాళికి సాయంబు-స్వాగతించి,
తత్వమరయగ జన్మంబు-ధన్యమగును.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!

సీసము. 57.
మధుసూధనా!వేణు-మాధవా!కారుణ్య
        గుణధామ,శ్రీశ,వై-కుంఠ వాస.!
ఎన్నెన్ని నామంబు-లెన్నెన్ని లీలలో.!
        కీర్తించినంతనే-యార్తి దొలగు.!
నీ నామకీర్తనల్ -నిత్యంబు స్మరియించ,
        భవబంధముల్ తొల్గి-పరము గలుగు.!
గాఢాంధకారమై-కనిపించకే దారి,
        దిక్కుతోచని మాకు-దిక్కు నీవె.!
తే.గీ.
కాదు!శాశ్వతంబేదియు-కాదు కాదు.!
కలల మేడల విహరించ-ఫలితమేమి.!
హరిహరీయని యనకున్న-యందమేమి.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!


సీసము. 58
తగవుదీర్చగ శిబి-తనమాంసమొసగియు,
         ధర్మమున్ గాపాడి-ధన్యుడయ్యె.!
సర్వంబువోయినన్-సత్యపథము,నడ
        చియు,హరిశ్చంద్రుండు-జిందె కీర్తి.!
అతిథి పూజలయందు-యమునినే మెప్పించి,
        సక్తుప్రస్థుడు జేరె-ముక్తిపథము.!
కవచకుండలముల-గాన్కగనొసగియు,
        దానకర్ణుండుగా-ధన్యుడయ్యె.!
తే.గీ.
మాటకన్నను లేదేది-మేటియనుచు,
ధర్మమార్గము నడచి,యా-దర్శమైరి.!
కీర్తిముఖ్యంబు నిలుచును-కీర్తి తుదకు,
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!

సీసము. 59
కర్మబోధను,గాంచి-కర్తవ్యమూనినన్,
        కర్మకారణుండు,తా-కరుణ జూపు.!
పాపపుణ్యంబుల-ప్రారబ్ధకర్మలు,
         వదలక మనవెంట-వచ్చుతుదకు.!
ఏడేడులోకము -ల్నేలు,హరిని గొల్వ,
         జన్మసాఫల్యమొంది-జయము కలుగు.!
మధుసూదనా!యని-మనసార ప్రార్థించ,
         శీఘ్రంబు కరుణించి-చింతదీర్చు.!
తే.గీ.
విశ్వమంతయు నిండిన-విశ్వరూప,
భక్తమందార శ్రీరంగ-భవ్య నామ.!
కరుణజూపించి మమ్మేల-భరము నీవె.!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!
Co
౬౦.
మనసును బంధించి- నిను జేరగ,సులభ
         పథమును జూపించు-వరమునిడుము.!
మాయల తిమిరముల్-మాయంబు జేసియు,
          నీ దరి జేరెడు-నేర్పునిడుము.!
చుట్టిన రజ్జుల-కట్టులన్ దొలగించి,
          నీ సన్నిధిన్ జేరు-వాసి నిడుము.!
చల్లని జూపులన్-సంసార దావాగ్ని
          జల్లార్చి సద్గతి-సౌఖ్యమిడుము.!
తే.గీ.
సత్యమార్గమున్ పయనించ-సాయమిడుము.!
మధుర మధురమౌ నీదివ్య-మంత్రమిడుము.!
తిమిర సంహారమొనరించ-తేజమిడుము.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!


సీసము. 67
చలనమొందినయట్లు-చంద్రుండు తోచును.,
           వాస్తవమ్ముగ మేఘ-పంక్తి కదలు.!
ఆత్మను గప్పంగ-నవివేకమంతయు.,
           నాత్మస్థిరత్వంబు-నరయకుండు.!
ధనవర్షంబును గుర్వ-తృణవృద్ధియు గలిగి,
           దైవపథంబుకు-దారినిడదు.!
మాయల తృణములన్-మట్టుపెట్టగ,దైవ
           సన్నిధికిని యడ్డు-సమసిపోవు.!
తే.గీ.
కలతజెందక సాగినన్-గలుగు సుఖము.!
చంచలించక ప్రార్థించ-జయము గలుగు.!
పుణ్యకర్మల జేయంగ-ముక్తిగలుగు.!
శరణు శరణంటి కేశవా.!శరణమంటి.!

ప్రణవ మెవ్వాని రూపమై పరిఢవిల్లె
ప్రణుతిసేయగ నెవ్వడు రక్ష సేయు
ప్రాణి కోటికి నెవ్వడు ప్రాణ శక్తి
వాని హృత్పద్మ పీఠాన భజనసేతు

సీస పద్యము 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 
మాయ మాటలను చెప్పకమనో  వేదము
తెల్పిన విశ్వాన్కి నేత   కృష్ణ 
ప్రేమమ్ము పంచియు రసలీల చూపియు 
తన్మాయ పంచేటి యుక్తి దేవ
కాలమ్ము స్వాధీన పరిచియు ధర్మాన్ని 
తెలిపే టి సత్య వాది
ఆనంద ముప్పొంగ సౌఖ్యమ్ము కల్పించు 
ఆరాధ్య దైవమ్ము నీవె కృష్ణ 
మనసు మారక ముందునె నేను నిన్ను 
తలచి గోపాల గోకుల నంద మారు
పలకు చెప్పక మోహన కృష్ణ మేలు 
కొలుపు గాపూజ చేసితి మహా-నిష్ఠా 
--(()) - -


సీసము.71

సర్వ జనుల బ్రోచు-సంకర్షణా,కృష్ణ.!
         ప్రేమానుబంధాల-విశ్వరూప.!
పక్షపాత రహిత-వాసుదేవా,హరి.!
         సర్వజగములేలు-సర్వసాక్షి.!
కర్మబంధము దీయు-కర్మకారణ,శౌరి
         శిష్టజన హృదయ-శ్రీనివాస.!
ఆద్యంతరహిత,శ్రీ-హరి శ్రీధరా,దేవ,
         ధర్మసంస్థాపక-దైవమీవె.!
తే.గీ.
ఆర్త జనబాంధవా స్వామి-కీర్తి ధామ.!
జన్మ సంకెలల్ ద్రుంచు-సత్యనామ.!
విశ్వమంతయు నిండిన-వేద రూప.!
శరణు శరణంటి కేశవా.!-శరణమంటి.!       


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ