🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 169 / Sripada Srivallabha Charithamrutham - 169 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 21
🌴. దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట
- 4 🌴
🌻. మోహము నశించుటతో మోక్షము - 1 🌻
పీఠికాపురములో అబ్బన్న అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచూ జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచూ అతడు బాపనార్యుల యింటికి వచ్చెను. శ్రీపాదులవారు వేదఘోషను ఆపుచేయమనిరి.
అబ్బన్నకు కడుపునిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదులవారు అబ్బన్నను పిలిచి, "ఓయీ! ఇచ్చట నుండి నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము.
దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవయవములతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా, అకారణ నిందచేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున నున్నారు.
వారికి చిత్రగుప్తులు వారు మరణానంతరము పిశాచజన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాపపరిహార ఉపాయము చేయుచున్నాను.
భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్లి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచినవారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలము ప్రోక్షింపవలసినది.
చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య యింటికి వెళ్ళి వానిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది." అనిరి. అబ్బన్నయునూ, సుబ్బయ్యయునూ అచటికి వెళ్లి, వారందరిని బాపనార్యుల యింటికి తీసుకొనివచ్చిరి.
శ్రీపాదులవారు ఉగ్రస్వరూపమున, "ఓయీ! దండిస్వామినని ఎంత గర్వించితివి? నీవు ఆరాధించు దత్తుడే యిక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు తోడుగా శిష్యగణమొకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణమొకటి. నీవు నన్ను ఏమి చేయగలవు?
సమస్త సృష్టినీ శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వమెంత? నీ సామర్థ్యమెంత? దైవదూషణ చేయుటవలన నీకూ, నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొన్నది. మిమ్ములనందరిని కొన్ని వందల సంవత్సరములు పిశాచజన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తులవారు నిర్ణయించిరి. అవ్యాజకరుణతో నేను దానిని రద్దుపరచితిని.
మానవజన్మకు వచ్చినపుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశ్యమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును.
నా మాయయునూ, నేనునూ అభిన్నస్వరూపులమై ఉండగా మోక్షమనునది ఏమో ఆలోచించుము. మోహము క్షయమగుటయే మోక్షము. ఏ జీవుడయినా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన యెడల, వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 190 / Sripada Srivallabha Charithamrutham - 190 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 24
🌴. శివుని ఆయుధాల విశిష్టత - 2 🌴
విభూతి పవిత్రమైన తెల్లటి జ్ఞానానికి గుర్తు. అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక, ఈ మూడు స్థాయిలలోను జ్ఞానప్రాప్తి లభి స్తుంది. పైన చెప్పిన బాధలను శరీరం అనుభవిస్తూ ఉన్నా నిజమైన సాధకుడు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతూ దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చును అనే విషయాన్ని సూచిస్తూ శివభక్తులు మూడు విభూతి రేఖలను (త్రిపుండ్రాలు) ధరిస్తారు.
🌻. శివార్చనా విధానాలు 🌻
మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి మంగళవారం నాడు అలాగే త్రయోదశి శనివారం నాడు వస్తే చాలా మంచిది.
కర్మకారకుడైన శని వల్ల కలిగే కష్టాలను శనికి అధిదేవత అయిన శివుని పూజచేసి పోగొట్టుకోవచ్చు. శని త్రయోదశి నాడు ప్రదోష (సాయంసంధ్యా) సమయంలో శివార్చన చేస్తే కర్మదోషాలు పోయి సుఖశాంతులు కల్గుతాయి.
🌻. శివుడు పంచభూతాత్మకుడు. 🌻
మన శరీరంలోని మూలాధారంలో ఉన్న పృథ్వీతత్త్వానికి ప్రతీకగా పార్థివ లింగాన్ని; స్వాధిష్ఠానంలో ఉన్న జలతత్త్వానికి ప్రతీకగా జలలింగాన్ని; మణిపూరకంలో ఉన్న అగ్నితత్త్వానికి ప్రతీకగా జ్వాలాలింగాన్ని; విశుద్ధిలోని వాయుతత్త్వానికి ప్రతీకగా వాయులింగాన్ని అనాహతంలోని ఆకాశతత్త్వానికి ప్రతీకగా చిదంబరలింగాన్ని సాధకులు పూజిస్తారు. ఆకాశ లింగంగా పిలవబడే చిదంబరలింగానికి అసలు రూపమే ఉండదు.
రుణము అంటే పాపం. పాపం లేనిది అరుణం. పాపాలను నాశనం చేసేవాడు, అరుణాచలేశ్వరుడు.
శ్రీపాదులే శ్రీవేంకటేశ్వరులు
ఇంతవరకు ఆపాదమస్తకం పరమశివుని తత్వాన్ని విశ్లే షించిన ధర్మగుప్తులు, ఈ ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీపాదులు పద్మావతీ సమేత వేంకటేశ్వరుల సంయుక్త రూపమని వర్ణిస్తూ దానిని ఇలా వివరించారు:
“శ్రీవేంకటేశ్వరులు కృత యుగంనుంచే ఉన్నారు. దశరథునికి పుత్రునిలా జన్మిస్తా నని వరం ఇచ్చి, శ్రీరామునిలా అవతరించారు. అందువల్ల కౌసల్యా తనయుడు అయిన శ్రీరామునిగా పూజింపవచ్చు. కొంతకాలంపాటు వారిని శక్తి స్వరూపమైన బాలాత్రిపుర సుందరిగా, కొంతకాలం శివస్వరూపంగా, కొంతకాలం సుబ్రహ్మణ్యస్వామిగా, కొంతకాలం మహావిష్ణువుగా ఆరాధించారు.
వారి వైష్ణవమాయకు అంతు ఎక్కడ? జగన్మోహినీ రూపం లో దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి, మన్మథుడి అవసరమే లేకుండా శివుని మోహింపజేసి, ధర్మశాస్తను (అయ్యప్పను) జన్మింపజేసి సృష్టికే ఒక క్రొత్త అర్థాన్ని ఇచ్చిన ప్రభువునకు అసాధ్యం అనేది ఏమైనా ఉంటుందా?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 215 / Sripada Srivallabha Charithamrutham - 215 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 39
🌻. నాగేంద్రశాస్త్రి కథ 🌻
"నేనీ స్థలంలో ఆశ్రమం కట్టుకొని, నా దగ్గరకు వచ్చిన వారికి ధర్మాన్ని బోధిస్తూ, పీడితుల బాధలను తొలగిస్తూ జీవితం గడుపుతున్నాను. ఇంతలో నా భార్య మరణిం చింది. అప్పుడే ఒక మంగలివాని భార్య పాముకాటుతో మరణించింది.
నేను నా నాగవిద్యతో పామును రప్పించి విషం తీయించాను. కాని, మంగలి భార్య ఆ శరీరంలోకి రావడానికి ఇష్టపడక ప్రాణమయ జగత్తులో స్వేచ్ఛగా ఉండాలని, జనులను ఆవహించి వాళ్ళని బాధించి తాను ఆనందం అనుభవించాలని సంకల్పించుకొన్నది.
మంగలి తన భార్యను బతికించమని ప్రాధేయపడటంతో వాడి భార్య శరీరంలో నా భార్య ఆత్మ ప్రవేశపెడ్తానని, ఆమెను తల్లిలా చూడాలని నేను చెప్పాను. అతడు అంగీకరించడంతో నా భార్య ఆత్మని వాని భార్య శరీరంలో ప్రవేశపెట్టాను.
కాని మంగలివాని భార్య మహా దుష్టురాలు, గయ్యాళి అవడంతో ఆ శరీరంలోని నాడులన్ని దోషభూయిష్టమై ఉండటంవలన ఆ శరీరంలో ప్రవేశించిన నా భార్యకు విపరీతమైన బాధ, కంపరం పుట్ట సాగాయి. ఆ శరీరాన్ని వదిలి వెళ్తానని పదేపదే నా భార్య ప్రాధేయ పడుతుండేది.
ఆమె తరచూ నన్ను కలుసుకుంటూ ఉండటంవల్ల నాకు మంగలివాని భార్యతో అక్రమ సంబంధం ఉన్నదని, కాబట్టి నన్ను కులంనుండి వెలి వెయ్యాలని, మంత్ర, తంత్రాలలో నాకు వచ్చే సంపాదనలో ముప్పాతిక భాగం మంగలివానికి నష్టపరిహారంలా ఇవ్వాలని, మంగలి కులపెద్దలు తీర్పు ఇచ్చారు. పురుగు మీద పుట్రలా మంగలివాని భార్య ఆడవాళ్ళ వంటిమీదకు వచ్చి తాను మరణించిన శాస్త్రిగారి భార్యనని, తన భర్త చేసే అన్యాయాన్ని అరికట్టమని, అలా కాని పక్షంలో నన్ను, ఆ మంగలి కాంతని హత్య చేస్తానని బెదిరించడం మొదలుపెట్టింది.
దిక్కు తోచని నేను శ్రీపాదులని శరణు వేడాను. "భర్తవి అయినంత మాత్రాన నీ భార్యని మంగలివాని భార్య శరీరంలో ప్రవేశించమని ఆఙ్ఞాపించడం ఉచితం కాదని" నన్ను మందలించి బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయమని బోధించి విచిత్రంగా మంగలివాని భార్య తిరిగి మరణించేలా, ఆ శవాన్ని దహనం చేసేలాంటి పరి స్థితులను కల్పించి నా భార్య ఆత్మకు విముక్తి కలిగించారు ఆ జగత్ప్రభువులు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 218 / Sripada Srivallabha Charithamrutham - 218 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 41
🌻. కుహనా పరివ్రాజక వృత్తాంతం 🌻
శ్రీపాద శ్రీవల్లభులలో ఉన్న దేవీ తత్త్వం గురించి చెపుతూ వారు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి స్వరూపులనీ చెప్పి... పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ వాక్కులను వివరించారు భాస్కరశాస్త్రి,
త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిమూర్తులు మొదలయినవి త్రయములు. త్రయాలకు అధీశ్వరి త్రిపుర భైరవి. కాలుని విశేష అవస్థలవల్ల కలిగిన పరిస్థితులను శాంతింపచేయగల శక్తినే త్రిపురభైరవి అంటారు.
త్రిపుటిని పురత్రయంగా చేసుకుని ఆమె ముల్లోకాలను పాలిస్తుంది. మనకు భౌతికమయ, ప్రాణమయ, మానసికమైన అస్తిత్వ స్థితులు, వాటికి అనుగుణంగానే ఆయాలోకాలు ఉన్నాయి.
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతే మనం భౌతిక ప్రపంచంలో ఎలా జీవిస్తున్నాయో...అలాగే ఆయా లోకాలలో కూడా జీవించగలం...అని వివరించిన తర్వాత శ్రీపాదులవారు తానే దత్తుడనని ప్రకటించి పీఠికాపురమును విడిచిపోవటం ఎట్లా జరిగిందో బాస్కరశాస్త్రి చెప్పసాగారు.
శ్రీపాదులవారికి పదహారు సంవత్సరాలప్పుడు పీఠికాపురానికి ఒక సన్న్యాసి వచ్చి, మండల దత్త దీక్షలను ఇచ్చి, భారీగా దక్షిణలు స్వీకరించసాగాడు. శ్రీపాదులవారు వెంకయ్య అనే పంటకాపు ఇంటికి వెళ్ళి, తాను దత్త దీక్షలను ఇస్తాననీ... ఏకరాత్రి దీక్ష చాలుననీ.. యధాశక్తి దక్షిణను ఇవ్వవచ్చుననీ ప్రకటించగానే, అష్టాదశ వర్ణాలవారు దీక్షలను తీసుకున్నారు.
ఆనాడే శ్రీపాదులవారు బాహాటంగా తానే దత్తుడనని ప్రకటించింది.
తరువాత వారు నరసింహవర్మ గారింటికీ, వెంకటప్పయ్య శ్రేష్టిగారి ఇంటికీ, బాపనార్యులవారి ఇంటికీ వెళ్ళి, మంగళ స్నానాలు చేసి, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు.
వారు శ్రీపాదుల వివాహ ప్రస్తావన తేగా, అవధూతగా వచ్చిననాడే వివాహ ప్రస్తావన వస్తే ఇల్లు విడిచి పోతానని చెప్పాననీ, తమ యొక్క అనఘాలక్ష్మీ సమేత దివ్య మంగళ దర్శనాన్ని ఇచ్చారు. అన్నలిద్దరినీ స్పృశించి వారి అంగవైకల్యాన్ని పోగొట్టారు. వారు శ్రేష్ఠిగారి, వర్మగారి, మల్లాదివారి మూడు వంశాల వారినీ, ఘండికోట వారినీ మరువనని మాట ఇచ్చారు. శ్రీధరరాజశర్మ సమర్థ
రామదాసుగా జన్మించి, శివాజీగా జన్మించే నరసింహవర్మకు గురువు అవుతాడనీ... రామరాజశర్మ
భవిష్యత్తులో శ్రీధర నామంతో గొప్ప యోగి అవుతాడనీ తెలిపారు.
శ్రీపాద శ్రీవల్లభరూపం కేవలం మాయాస్వరూపమేననీ... తాను సాక్షాత్తు దత్తుడనేననీ...
బాధాసర్పదష్టులనూ, ఆదివ్యాధిపీడితులనూ తమ దివ్యలీలల ద్వారా ఉద్ధరించవలసి ఉందనీ చెప్పి, సావిత్రిపన్నం వేదపఠనం జరుగుతుండగా... వారు అందరూ చూస్తూండగానే అంతర్థానమై పోయారు.ఈ విధంగా శ్రీపాదులవారు పీఠికాపురాన్ని విడిచిపోవడం తటస్థించిందని
భాస్కరశాస్త్రి శంకరభట్టు, ధర్మగుప్తులకు వివరించారు.

Comments
Post a Comment