"ఋభుగీత "



నీవు లేక అదీ.. ఇదీ.. ఏదీ లేదు !

బంధం అంటే సంసారం. అదొక్కటే మిథ్య అని చెప్పి ఊరుకోలేదు. మోక్షం కూడా మిథ్యేనన్నారు. మరోలోకం ఉందనుకోవడం కూడా మిథ్యేనని  తేల్చారు. అలా ఆలోచిస్తే నేను లేకుండా దేనికీ ఉనికి లేదు. వ్యక్తావ్యక్తాలకు మధ్య ఉన్న స్థితి 'నేను' దానిని మనకు తీవ్రమైన భయం కలిగినప్పుడు, మూర్ఛ వచ్చినప్పుడు కూడా చూడవచ్చని భగవాన్ బోధించారు. నేను లేకుండా భయంలేదన్న విషయం తెలియాలి. ధ్యానమైనా చేసేవాడు లేకుండా అదీలేదు. ప్రతి అనుభవానికి నీవే మూలం. నీవు లేక అది, ఇది, ఏది లేదు !


*ఆశలేని స్థితిని సాధించుకోవడమే బ్రహ్మీస్థితిని తెలుసుకునే మార్గం !!

పరము అంటే అంతకు మించింది లేనిది. ఆనందమే అన్నిటికన్నా ఉన్నతమైనది. ఆనందం అంటే కోరిక తీరిన స్థితి కాదు. కోరిక రాని స్థితి. కోరిక తీరకపోయినా అది గుర్తుకు రాని స్థితి. మనసులో కలిగే కోరికరహిత స్థితే శూన్యత. ఎందుకంటే కోరిక లేనప్పుడు మనసుకు ఉనికే లేదు. అలాంటి ఆశలేని స్థితిని సాధించుకోవడమే మన బ్రహ్మీస్థితిని తెలుసుకునేందుకు మార్గం. ఆనందం అంటే సంతోషం కాదు. సంతోషం, దుఃఖం లేనిస్థితి. ఆ స్థితి ఏర్పడిన తర్వాత ఇక అడగటానికి మరొకటి ఏదీ ఉండదు. అందుకే అది అద్వితీయ స్థితి అయింది !


*మనం పెంచుకున్న బంధమే మనకి ఇబ్బందిగా మారుతుంది !!

మనం చిత్ తో సమైక్యత కలిగి ఉండాలి. చిత్ అంటే అనుభవంలో మన ఎదురుగా ఉన్నదే. ఎప్పుడో వృద్ధాప్యంలో వచ్చే బాధలు పోవాలంటే  ఇప్పుడు మన ముందున్న రియాక్షన్ను దాటాలి. శరీరానికి వృద్ధాప్యం మనప్రమేయం లేకుండా అదే వస్తుంది. కానీ మన మనసుకు వృద్ధాప్యం అంటే ఏమిటో, ఎలా ఉంటుందో అవగాహన కల్పించాలి. విద్యార్థికి పరీక్షల సమయంలో టీవి చూడటం మానెయ్యాలంటే  కష్టంగా ఉంటుంది. అందుకే ముందునుండే అది అలవర్చుకుంటే ఆ భారం ఉండదు. వృద్ధాప్యంలో వచ్చేది కూడా ఇప్పుడున్న ఇబ్బందులే. కానీ అప్పుడు ఓపిక తగ్గడంవల్ల, స్వశక్తి తగ్గడంవల్ల అలా అవి చాలా పెద్దవిగా అనిపిస్తాయి. అన్నింటితోనూ మనం పెంచుకున్న బంధమే ఇప్పుడైనా, అప్పుడైనా మనకి ఇబ్బందిగా మారుతుంది !


🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత" - (1)
🕉🌞🌎🌙🌟🚩

ముందుగా... ఓ మాట !


ఆత్మీయ పాఠకులకు అభివాదాలు !


_శ్రీశ్రీశ్రీ శివానంద సద్గురుమూర్తి చల్లని నీడలో  శ్రీగురుధామ్ లో గురుకుటుంబంతో  పంచుకున్న విషయాలకు అక్షర రూపాన్నివ్వాలని సంకల్పించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతాభివందనాలు.  శ్రీరమణ భగవాన్ కి అత్యంత ప్రీతిపాత్రమైన   ఋభుగీతాసారముపై  సద్గురుదేవుల అనుగ్రహంతో కలిగిన కించిత్ జ్ఞానంతో సత్యానుభవాన్ని వివరించేందుకు  సత్యాన్వేషణలో సాధకులకు సోపానంగా నిలిచి ప్రోత్సాహకంగా నిలుస్తుంది. 


జ్ఞానప్రదాతలైన శ్రీశ్రీశ్రీ సద్గురు శివానందమూర్తి గురుదేవుల పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ...


🕉🌞🌎🌙🌟🚩


శ్రీశివానంద గురుభ్యోన్నమః > శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (2)


విశ్రాంత ఐఏఎస్ అధికారి "దేవరకొండ రామకృష్ణ"గారి  ముందుమాట >


అస్మద్గురువరేణ్యులు శ్రీ గెంటేల వెంకటరమణ మహోదయులు ఆత్మానుభూతిని పొందిన మహనీయులు. వారి శిష్య పరమాణువు సమాశ్రయము పొందుట నా పూర్వజన్మ సుకృత పరిపాకమని తలచెదను. గురుమహాదశ ప్రారంభముననే వారి ఆశ్రయము దొరకుట ఏమి విశేషమో ! వారు శిష్యులపట్ల అమితమైన వాత్సల్యము కలవారు. శిష్యుల త్రితాపములను హరింప సమర్థులు. వారు తమను తాము తెలుసుకున్న వారైనప్పటికీ తమ ప్రఖ్యాతి పట్ల ఉదాశీనులు. భగవద్గీత, అష్టావక్రగీత, ఋభుగీత - ఈ మూడును అతి పవిత్రమైన తత్వజ్ఞాన బోధనాగీతలు. అయితే భగవద్గీత కన్న అష్టావక్రగీత, దీనికంటె ఋభుగీత సూటిగా అద్వైత తత్త్వమును బోధించును. ఈ కారణంచేతనే ఋభుగీత చాలా తక్కువ ప్రచారములోనున్నది. (సశేషం)


🕉🌞🌎🌙🌟🚩


శ్రీశివానంద గురుభ్యోన్నమః : శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (3)


విశ్రాంత ఐఏఎస్ అధికారి "దేవరకొండ రామకృష్ణ"గారి  ముందుమాట (కొనసాగింపు)


శ్రీ గెంటేల వెంకటరమణ గారు జిజ్ఞాసు లోకముపట్ల తమకున్న అపార అనుగ్రహంతో తమ సత్సంగములలో ఆత్మ తత్వోపదేశము విరివిగా చేయుచున్నారు. సుకృతాత్ములు అట్టి సత్సంగాలలో పాల్గొని ధన్యులగుచున్నారు. ఇంకను ఎక్కువమంది జిజ్ఞాసువులకు ఈ తత్త్వరహస్యము సుబోధనము  కావలయునని గురువుల సంకల్పము. అందుచే ఇటీవల 'శ్రీరామణీయము' అను పేర తత్త్వ గ్రంథమును రచించిరి. ఇప్పుడు అతి గహనమైన ఋభుగీత అతి సులభమైన వ్యాఖ్యానముతో రచించినారు. ఋభుగీతా రహస్యములను సామాన్య ప్రజలకు తెలియునట్లు ఈ గ్రంథమును వెలువరించారు.


ఋభుగీత శివరహస్యాంతర్గతము. నిజముగా ఇది రహస్యమే. పదే పదే అద్వైతము నొక్కి వక్కాణించుటచే ఉత్తమాధికారులకే ఒకొక దురాహ్యముగానుండును. ఇంతకు పూర్వము ఋభుగీతను మహానుభావులు ఓల్క్ అనేకులు ఆంద్రీకరించియున్నారు. చాలవరకు అవి సంస్కృత గ్రంథ యధాతధ అనువాదములు. ప్రస్తుత గ్రంథములో అనువాదంతో పాటు బహుసరళమైన వివరణ కూడా ఉంది. ఇది సాధకులకు ఎంతో ఉపయోగకరం.(సశేషం)



"ఋభుగీత" - (1)
🕉🌞🌎🌙🌟🚩

ముందుగా... ఓ మాట !

ఆత్మీయ పాఠకులకు అభివాదాలు !

_శ్రీశ్రీశ్రీ శివానంద సద్గురుమూర్తి చల్లని నీడలో  శ్రీగురుధామ్ లో గురుకుటుంబంతో  పంచుకున్న విషయాలకు అక్షర రూపాన్నివ్వాలని సంకల్పించిన ఆత్మీయులందరికీ కృతజ్ఞతాభివందనాలు.  శ్రీరమణ భగవాన్ కి అత్యంత ప్రీతిపాత్రమైన   ఋభుగీతాసారముపై  సద్గురుదేవుల అనుగ్రహంతో కలిగిన కించిత్ జ్ఞానంతో సత్యానుభవాన్ని వివరించేందుకు  సత్యాన్వేషణలో సాధకులకు సోపానంగా నిలిచి ప్రోత్సాహకంగా నిలుస్తుంది. 

జ్ఞానప్రదాతలైన శ్రీశ్రీశ్రీ సద్గురు శివానందమూర్తి గురుదేవుల పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ...

🕉🌞🌎🌙🌟🚩

శ్రీశివానంద గురుభ్యోన్నమః > శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (2)

విశ్రాంత ఐఏఎస్ అధికారి "దేవరకొండ రామకృష్ణ"గారి  ముందుమాట >

అస్మద్గురువరేణ్యులు శ్రీ గెంటేల వెంకటరమణ మహోదయులు ఆత్మానుభూతిని పొందిన మహనీయులు. వారి శిష్య పరమాణువు సమాశ్రయము పొందుట నా పూర్వజన్మ సుకృత పరిపాకమని తలచెదను. గురుమహాదశ ప్రారంభముననే వారి ఆశ్రయము దొరకుట ఏమి విశేషమో ! వారు శిష్యులపట్ల అమితమైన వాత్సల్యము కలవారు. శిష్యుల త్రితాపములను హరింప సమర్థులు. వారు తమను తాము తెలుసుకున్న వారైనప్పటికీ తమ ప్రఖ్యాతి పట్ల ఉదాశీనులు. భగవద్గీత, అష్టావక్రగీత, ఋభుగీత - ఈ మూడును అతి పవిత్రమైన తత్వజ్ఞాన బోధనాగీతలు. అయితే భగవద్గీత కన్న అష్టావక్రగీత, దీనికంటె ఋభుగీత సూటిగా అద్వైత తత్త్వమును బోధించును. ఈ కారణంచేతనే ఋభుగీత చాలా తక్కువ ప్రచారములోనున్నది. (సశేషం)

🕉🌞🌎🌙🌟🚩

శ్రీశివానంద గురుభ్యోన్నమః : శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (3)

విశ్రాంత ఐఏఎస్ అధికారి "దేవరకొండ రామకృష్ణ"గారి  ముందుమాట (కొనసాగింపు)

శ్రీ గెంటేల వెంకటరమణ గారు జిజ్ఞాసు లోకముపట్ల తమకున్న అపార అనుగ్రహంతో తమ సత్సంగములలో ఆత్మ తత్వోపదేశము విరివిగా చేయుచున్నారు. సుకృతాత్ములు అట్టి సత్సంగాలలో పాల్గొని ధన్యులగుచున్నారు. ఇంకను ఎక్కువమంది జిజ్ఞాసువులకు ఈ తత్త్వరహస్యము సుబోధనము  కావలయునని గురువుల సంకల్పము. అందుచే ఇటీవల 'శ్రీరామణీయము' అను పేర తత్త్వ గ్రంథమును రచించిరి. ఇప్పుడు అతి గహనమైన ఋభుగీత అతి సులభమైన వ్యాఖ్యానముతో రచించినారు. ఋభుగీతా రహస్యములను సామాన్య ప్రజలకు తెలియునట్లు ఈ గ్రంథమును వెలువరించారు.

ఋభుగీత శివరహస్యాంతర్గతము. నిజముగా ఇది రహస్యమే. పదే పదే అద్వైతము నొక్కి వక్కాణించుటచే ఉత్తమాధికారులకే ఒకొక దురాహ్యముగానుండును. ఇంతకు పూర్వము ఋభుగీతను మహానుభావులు ఓల్క్ అనేకులు ఆంద్రీకరించియున్నారు. చాలవరకు అవి సంస్కృత గ్రంథ యధాతధ అనువాదములు. ప్రస్తుత గ్రంథములో అనువాదంతో పాటు బహుసరళమైన వివరణ కూడా ఉంది. ఇది సాధకులకు ఎంతో ఉపయోగకరం.(సశేషం)

🕉🌞🌎🌙🌟🚩



*సత్యాన్ని పదేపదే స్మరించుకోవాలి

అనాదిగా మనిషికున్న సమస్య అశాంతి. అశాంతికి మూలకారణం "అహం". అహం నిర్మూలనకు పరిష్కారం సత్యదృష్టి. వేదం మొదలుకొని గీత వరకూ ప్రతి ఆధ్యాత్మిక గ్రంథం మనిషికి సత్యదృష్టి అలవర్చే ప్రయత్నమే చేస్తుంది. ఉన్న సత్యం ఒక్కటే అయినా అది తెలుసుకోకుండా అనేక కోణాల్లో మనసును ఆవరించి ఉన్న మాయను ఛేదించాలంటే పదేపదే సత్యాన్ని స్మరించుకోవాల్సిందే. మన పిల్లలకు బాల్యం నుండి పెరిగి పెద్దయ్యేవరకూ “బాగా చదువుకోవాలి నాన్నా. గొప్పవాడివి కావాలి” అని చెప్తుంటాం. అది ఏ వయసుకైనా, ఏ తరగతికైనా అదే మాటను పదేపదే వల్లెవేస్తూ ఉంటాం. పిల్లలు విసుక్కున్నా మనం మాత్రం అదే మాట చెపుతూ ఉంటాం. ఎందుకంటే అది వాడు మర్చిపోకూడని విషయం కనుక. ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా మనకి సత్య విషయంలో అలానే వెంటపడుతున్నాయి. 'మనమంతా బ్రహ్మమే' అనే అత్యంత పరమోత్కృష్టమైన సత్యాన్ని మనకు బోధించిన ఋభుగీతాసారంలో కూడా అదే విషయాన్ని పదేపదే వక్కాణించారు. అందుకే శ్రీరమణభగవాన్ దీన్ని నిత్య పారాయణ గ్రంథంగా ప్రబోధించారు !


*పారాయణం.. చదవడం...


పారాయణానికి, చదవడానికి చాలా తేడా ఉంది. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే దానిపై మనకు మనసు కుదరాలి. అప్పుడే అందులోని విషయాలు అర్థం అవుతాయి. లేకపోతే మనం దాన్ని చదవలేము. చదివినా మనకు ప్రయోజనంలేదు. కానీ పారాయణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనం మనసు పెట్టకపోయినా, అది మనకు అర్థం కాకపోయినా కేవలం చదవడం చేతనే ఫలాన్నిస్తుంది. అందుకు కారణం పారాయణంలో పదే పదే సత్యాన్ని స్మరించడమే. సత్యం మనకు అర్థం కాకపోయినా సత్యస్మరణవల్ల ఆ ఫలం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మనం కోరుకున్న ఫలాలతో పాటు అంతిమ ఫలమైన శాంతి మనకు లభిస్తుంది !



*సత్యమే అంతిమ లక్ష్యం కావాలి !!

నేడు శాంతికి ఉన్న నాలుగు తలుపులు మూసుకుపోతున్నాయి. మనసు సత్యం నుండి విడివడటమే అందుకు కారణం. భక్తి, సాధన, జపం, యోగం, ధ్యానం ఇవన్నీ మనని సత్యానికి దగ్గర చేయలేకపోతే అవికూడా సాధారణ లౌకిక ప్రక్రియలకన్నా దారుణంగా ఉంటాయి. శాంతికి అవే భయంకరమైన ఆటంకాలు అవుతాయి. అందుకే ప్రతి మార్గంలో, విధానంలోనూ సత్యదృష్టి మన అంతిమలక్ష్యంగా పెట్టుకున్నప్పుడే అవి మనకి సోపానాలుగా ఉపయోగపడతాయి !


*జ్ఞానమువలన  మమకారమును జయించి, సంసార సాగరమును దాటగలరు !!


ఋభుగీతాసారం ఆరంభమున బ్రహ్మజ్ఞాని, శివభక్తుడు, కేదారవాసి అయిన ఋభుమహర్షిని కొందరు మునులు ఇలా అడిగారు “కైలాస పర్వతంపై ఈశ్వరారాధన వల్ల తమరు బ్రహ్మజ్ఞానమును సంపాదించితిరి. వేదములసారము, మహావాక్యముల సారమూ అయిన ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించుమని ప్రార్థన.” ప్రసన్నుడైన ఋభు మహర్షి వారికిచ్చిన సమాధానం “శివభక్తులారా పుణ్యచరిత్రులారా, బ్రహ్మజ్ఞానమును పొందగోరు మహనీయులారా ! వేదశీర్షము నుండి ఉదయించు ఈశ్వర తత్త్వమును వివరించెదను. ఈ జ్ఞానము వలన మీరు మమకారమును జయించి, సంసారసాగరమును దాటగలరు. మహాదేవునికి ప్రణామాలతో వివరిస్తాను” అంటూ ఈ గీతను ఆరంభించారు !



*ఋభుగీత విన్నవారు బ్రహ్మమే అగుదురు !!


ఋభు గీతాసారం రహస్యములలోకెల్లా పరమ రహస్యమైనది - త్రికాలాలలో లేనిది. అందులోని బోధ ఇలా ఉంటుంది... "నేను చైతన్యాన్ని, అనాత్మ అంటూ ఏదీలేదు. నేను నిత్య పరిపూర్ణ స్వరూపుడను. నేను సచ్చిదానందమును, నేను అద్వైత రూపమును, బ్రహ్మము నేను - నా తత్త్వము వర్ణనాతీతము, ఆది మధ్యాంత రహితము. జడముకాను నేను. బ్రహ్మమునేను. అహం లేదు నాకు, ప్రభువు లేడు నాకు, చిన్మాత్రము నేను. సదా సత్తును నేను. ఆనందము నేను. ఆనంద స్వరూపుడను నేను. బహురూపములు లేవు నాకు. స్వానుభవమిది. ఉపనిషత్ సారము నేను. ఇది విన్నవారు బ్రహ్మమే అగుదురు !



*తత్త్వమెప్పుడూ రహస్యమే !!


బ్రహ్మజ్ఞానం పరమరహస్యమన్నారు. తత్త్వమెప్పుడూ రహస్యమే. ఎందుకంటే అది వాచకమైన జ్ఞానం చేత తెలిసేది కాదు. భౌతికంగా ఐతే దొంగ ఎవరో చెప్పగానే రహస్యం తెలిసి పోతుంది. కానీ మన మనసే దొంగ అయినప్పుడు దాని గురించి చెప్పినా అర్థంకాదు. కనుక అది అర్థమయ్యేవరకూ రహస్యమే. మనసే "దొంగనేను" అని పెద్దలు, శాస్త్రాలు చెప్తున్నంత మాత్రాన మనకది అనుభవ పూర్వకంగా తెలియడం లేదు. కనుక అది రహస్యంగానే మిగిలి పోయింది !



*జ్ఞానం, సత్వగుణం లేని మనసుకు అందదు !!


మనసుకు సత్వగుణముంటే గానీ సత్యం అర్థం కాదు. మనకు అర్థమయ్యే వరకూ అది నిజమనిపించదు. రహస్యం అంటే ఎవరికీ తెలియనిది అని అర్థం. బ్రహ్మజ్ఞానం పరమరహస్యమని ఎందుకన్నారంటే మనలోనే ఉండి కూడా మనకు అర్థం కావడం లేదు కాబట్టి. బ్రహ్మజ్ఞానం త్రికాలాలలో లేనిది అన్నారు ! కాలం అంటే మనసు. జ్ఞానం సత్వగుణంలేని మనసుకు అందదు.  అందుకే త్రికాలాతీతమైనదిగా పేర్కొన్నారు. మనసు ఆగితేగానీ సత్యం అర్థం కాదు. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడూ మనసుకే. అందుకే మనసే కాలం గతం, భవిష్యత్తుల్లేని మనసు వర్తమానంలో ఉండే క్షణం. అది నిరంతర ప్రవాహం. అలాంటి స్థితి పొందిన మనసుకు సత్యం గోచరమవుతుంది !



*పరిపూర్ణత అంటే వెలితిలేని స్థితి !!


సృష్టిలో ఏదీ అనాత్మ కాదు. ఆత్మ కానిదానికి ఉనికి లేదు. ఉనికి ఉన్నదేదీ అనాత్మకాదు. మనం చూస్తున్నది అంటే గ్రహిస్తున్నదంతా ఆత్మే. మనకు ఏది తెలుస్తుందో అది ఆత్మే. అదెలా సాధ్యం ? అన్న సంశయంపోతే మనం ఈ క్షణమే ఆత్మజ్ఞానులం అవుతాము. ఈ విశ్వాసం ఉంటే వెతుకులాట పోతుంది. అనాత్మ అనేదే లేనప్పుడు ఇక సంశయానికి, వెలితికి, వెతుకులాటకు తావెక్కడిది ? బంధం ఉంటేనే విముక్తి ఉంది. దేహముంటేనే దానికి జరామరణాలు, బాల్య-వృద్ధాప్యాలు ఉంటాయి. ఇవన్నీ భావాలే. పరిపూర్ణత అంటే వెలితిలేని స్థితి ! 



*సంతోషం-దుఃఖం.. రెండూ క్షణికం మాత్రమే !!

ఆనందంలో ఉన్నవాడు సంతోష, దుఃఖాల్లో ఏదివస్తే అది స్వీకరిస్తాడు. దేన్నీ తిరస్కరించడు, కావాలనుకోడు. నిజానికి సంతోషం, దుఃఖం క్షణికం మాత్రమే. ఆనందంలో ఉన్నవాడు మాత్రమే వాటిని క్షణమాత్రం అనుభవించి వదిలేస్తాడు. అసలు సంతోష, దుఃఖాలే లేకుండా ఉండడు. అసలు అవి లేకపోవడం, సంతోష పడుతూ, దుఃఖపడుతూ... ఉండటం ఇవన్నీ జడ పదార్థ లక్షణాలు. దేనికెంత స్పందన ఉండాలో అంత లేకపోవడం, అధికంగా ఉండటం, అసలు లేకపోవడం ఇవన్నీ జడపదార్థం లక్షణాలే 

*మనో ధర్మాన్ని తెలుసుకుంటే మనం కూడా చిన్మాత్రులుగానే ఉండగలుగుతాము !!

చైతన్యం అంటే దేనికీ స్పందించని జడం కాదు. అది ఖచ్చితమైన స్పందనతో ఉండే ఆనందం. వర్ణన అంతా కాలానికి లోబడింది. మనసుకూ లోబడింది. అందుకే కాలాతీతమైన మనసుకు ఆవల ఉన్న "ఆత్మ" లేదా "బ్రహ్మము"ను గురించి వర్ణన సాధ్యం కాదు. ఆనందానికి మొదలు, చివర చెప్పలేము. అది ఆదిమధ్యాంత రహితంగా ఉంటుంది. ఆనందం అనేది మనసుకి సహజం. శుద్దమనసు సుఖదుఃఖాలను మోస్తూ ఉండడానికి ఇష్టపడదు. అది క్షణక్షణం తాజాగానే ఉంటుంది. ఈ మనో ధర్మాన్ని తెలుసుకుంటే మనం కూడా చిన్మాత్రులుగానే ఉండగలుగుతాము. ఎవరైనా ఈ మనోధర్మాన్ని అనుసరిస్తే చాలు. ఇది ఎవరో ప్రభువు ఉండి శాసించి నడిపించేది కాదు. మనకి మనమే ప్రభువులంగా ఉండి నడవాల్సింది. నిజానికి అదే మన సహజగుణం !

*దృఢ విశ్వాసమే ఉన్నస్థితిని  అనుభవంలోకి తెస్తుంది !!

మనసుకు బహు రూపాలు లేవు. ఇది గమనిస్తే అందిరికీ 'ఉన్నస్థితి' గోచరమై స్వానుభవంలోకి వచ్చేదే. అదే ఉపనిషత్తుల సారంగా ఉంది. వినటంలోనే తెలుసుకోవడం ఉంటుంది. నేను బ్రహ్మగా మారక్కర్లేదు. నేను బ్రహ్మనే అని తెలుసుకుంటే చాలు. ద్రష్టల వాక్కులపై విశ్వాసంతో వినగలిగితే ఆక్షణమే మనం బ్రహ్మమని స్వయంగా తెలుసుకోకపోయినా ఒక నిర్ణయానికి వస్తాము. ఆ దృఢ విశ్వాసమే, ఉన్నస్థితిని మనకు అనుభవంలోకి తెస్తుంది !


*గృహింపు శక్తి అర్ధమైతే దైవం కూడా అర్థమవుతుంది !

సాధనచేసేప్పుడు కానీ, తీవ్రంగా ఆలోచించేప్పుడు కానీ కళ్ళు మూసుకుంటాము. నిజానికి కళ్ళు మనం కావాలని మూసుకోము. అవే సహజంగా మూతలు పడతాయి. కళ్ళు తెరిచినప్పుడు ఏమి చూస్తున్నామో అది తెలుసుకుంటాము. కళ్ళు మూసినప్పుడు ఏమి కనిపిస్తుందో అదే చూస్తాము. ఈ సాపేక్షత అర్థం అయితే ఏమి చూస్తున్నామో అర్థం అవుతుంది. కెమేరా షట్టర్ లాగా కన్ను తెరిచినప్పుడు బాహ్య గ్రహింపును స్నాప్ తీసుకొని మనసు దాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. కాబట్టి కళ్ళు తెరిచి చేసే పనుల్లో బాహ్య గ్రహింపు ఏమిటో అర్థమైతే, కళ్ళు మూసుకున్నప్పుడు జరిగే అంతర్ గ్రహింపు ఏమిటో తెలుస్తుంది. గృహింపు శక్తి అర్ధమైతే దైవం కూడా అర్థమౌతుంది. కళ్ళుమూసేది లోపల నిక్షిప్తమైనది చూడటానికి. అది బాహ్యం నుండి గ్రహించిందే. కళ్ళు మూయడం అనేది గ్రహించిన దానిని దాచుకోడానికి, దాచుకున్నదాన్ని తిరిగి చూసుకోడానికి సంకేతం !_

*బ్రహ్మముకాని వారు ఎవరూ లేరు !

"మునీశ్వరా బ్రహ్మతత్వానికి ఎవరు అర్హులు ? శివుని వద్ద నుండి వచ్చిన ఆ జ్ఞానాన్ని అనుగ్రహించండి" అని నిదాఘుడు ప్రార్ధించగా..."నీవే బ్రహ్మము, నీవే పరమగురువు, నీవే ఆకాశరూపం, బ్రహ్మము నీవే. అది నిస్సంశయము..." అంటూ ఋభుమహర్షి తన బోధను అనుగ్రహించడం ఆరంభించారు !

నీవే బ్రహ్మము అంటే... అందరూ బ్రహ్మమేనని భావం. బ్రహ్మముకాని వారు ఎవరూ లేరు. దాని కోసం వెతుకులాట అక్కర్లేదు. పరమగురువు ఆంటే గురువులకు గురువు. "శివయేవ గురుహూ". శివుడే పరమగురువు. 'గురువు-బ్రహ్మ-శివుడు' వేర్వేరు కాదు. తాను బ్రహ్మమని తెలిసినవారే గురువు. గురువైనవాడు సదా బ్రహ్మమే అవుతారు. ఆకాశం అంటే అవకాశం. ఖాళీ అంటే అది కేవలం స్థితికి సంబంధించినది. సత్యాన్ని తెలుసుకునే అవకాశమే ఇక్కడ ఆకాశం.. సత్యానుభవం కోసం ఉన్న శూన్యతే ఆకాశం... అవకాశం !!


*అతి స్పందనల వద్దే ఆగిపోతే శాంతిని చేరుకోలేము !

మనకి నిత్య జీవన విధానంలో కోపం, విసుగు, తాపం, చికాకు వంటి అతి స్పందనలు అలవాటయ్యాయి. జపం, ధ్యానంలోనే కాదు, సాధారణ పనుల్లో కూడా శ్రద్ధ కుదరకపోవడానికి ఈ అతిస్పందనలు అడ్డు వస్తాయి. అవి మనని అసత్యంలోకే నెట్టేస్తాయి. పిల్లాడు ఎగ్జిబిషన్ గేటు వద్దే ఆగిపోతే లోపలేమీ చూడలేనట్లే మనసు కూడా అతి స్పందనల వద్దే ఆగిపోతే లోపలి శాంతిని చేరుకోలేదు. అతిస్పందనలే పెను సమస్యగా మారితే జీవితంలో అతికొద్దిగా ప్రసంశలు, అతి ఎక్కువగా ఫిర్యాదులు కనిపిస్తాయి. జీవితంలో అన్నింటినీ తప్పించుకోవాలని చూడకూడదు. అన్నీ తప్పించు కోవడం సాధ్యంకాదు. కొన్నింటితో రాజీపడాలి. మరికొన్ని మార్చుకోవాలి. కొన్ని భరించాలి. ఇంకొన్ని స్వీకరించాలి.  జీవితమంటే ఇవన్నీ సహజమని గుర్తించాలి !

****

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ