. శాంతి మంత్రాలు***



.
 శాంతి మంత్రాలు - 1 🌹

ఏ పని చేసినా సఫలం కావాలని కోరుకోవటం మానవ సహజం.
ఉన్నతమైన జీవితాన్ని గడపాలనుకోవటం కూడా సహజమే.

అందుకు ఏమి చేయాలి? పెద్దలేమంటారంటే మనసు పెట్టిచేయాలి అంటారు.

మాట కూడా మంచిగా మాట్లాడలన్నా చదవాలన్నా మనసులో దృఢమైన భావం జనించాలి. ఆప్పడు ఆ మాటకు బలముంటుంది. ఆ పనికి ఫలముంటుంది. ఉన్నత మన జీవనాన్ని, ఉన్నత స్థితిని ఆకాంక్షించే వారికి మనస్సు, వాక్కు ఒక్కటిగా యుండటం ఆవశ్యకం.

బాహ్యైభ్యంతరాలు ఒకటిగా ఉండే స్థితికై ప్రార్ధించే మంత్రం ఇది.
ఈ మంత్రం ఐతరేయే ఉపనిత్తుకు చెందిన శాంతి మంత్రము.

ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠతా 
మనోమే వాచి ప్రతిష్ఠత
మావిరావీర్మ ఏధిన వేదస్య మ అణిస్థః 

శృతం మే మా ప్రహాసీరనేనా
ధీతేనాహోరాత్రాన్ సందధామృతం
వదిష్యామి సత్యం వదిష్యామి
తన్మామవతు తద్వక్తారమవత్వవతు
మామవతు వక్తారమవతువక్తారమ్!!

మే వాక్ ...నావాక్కు
మనసి...మనస్సులో
ప్రతిష్ఠతా ...ప్రతిష్ఠతం అగుగాక!
మే మనః..... నామనస్సు
వాచి ప్రతిష్ఠతం ...... వాక్కుతో ప్రతిష్ఠి తమగుగాక!
ఆవిః...ప్రకాశవంతమైన పరమాత్మ
మే ఆవిః ఏధి...నాలో ప్రకాశించు గాక!
మే వేదస్య....నాకు వేదాలయదార్థాన్ని
ఆణీస్థః ..తీసుకొస్తారుగాక!
మే శ్రుతం ....నేను విన్నవి
మా ప్రహాసీః.... నన్నువీడకుండా ఉండుగాక!
అనేన అధీతేన... నేర్చుకున్న వాటిని
అహః రాత్రాన్... రాత్రింబవళ్ళు
సందధామి.... అనుసంధానము చేస్తాము గాక!
ఋతం వదిష్యామి... నేను వ్యావహారిక సత్యాన్ని పలుకుదును గాక!
సత్యం వదిష్యామి... నేను పారమార్ధిక సత్యాన్ని పలుకుదును గాక!
తత్.... ఆ భగవంతుడు
మాం అవతు... నన్ను కాపాడుగాక!
తత్ వక్తారం అవతు...ఆభగవంతుడు
గురువును కాపాడు గాక!
అవతు మాం ...నన్ను కాపాడు గాక!
అవతు వక్తారం ...గురువును కాపాడు గాక.!

వాక్కు మనసునందున మనసు వాక్కునందున ప్రతిష్ఠతమగుగాక!
పరమాత్మ నాలో ప్రకాశించెదవుగాక!
మనస్సు వాక్కు రెండూ వేదాల యథారార్థాన్ని నాకు తీసుకు వస్తాయి
గాక.!
నేను విన్నది యావత్తు నన్ను వీడ కుండుగాక.!
నేర్చుకన్న దానిని రేయింబవళ్ళు యోచించస్తాను గాక!
నేను వ్యావహారిక సత్యాన్ని పలికెదను గాక!
పార
మార్థకసత్యాన్ని పలికెదను గాక.!
ఆ భగవంతుడు నన్నుగురువును
కాపాడుగాక.!
నన్ను రక్షించు గాక.!
గురువును రక్షించుగాక..!

🌹. దైవంతో మాట్లాడ్డం ఎలా సాధ్యం ? 🌹

ఈశ్వరుడి సమాధానం కోసం మన అభ్యర్ధన బలంగా ఉండాలి. సగం సగం నమ్మకంతో చేసే ప్రార్ధన సరిపోదు.

"ఆయన నాతో మాట్లాడతాడు, అని మీ మనస్సులో నిశ్చయించు కున్నట్లయితే , ఎన్నేళ్ళు ఆయన మీకు సమాధానం ఇయ్యకపోయినా మరోలా నమ్మడానికి నిరాకరించినట్లయితే, ఆయనను నమ్ముతూనే ఉన్నట్లయితే ఒకనాడు ఆయన తప్పక మీకు సమాధానమిస్తాడు.

🙏. జై గురుదేవ


శాంతి మంత్రాలు - 2 🌹
🌻. ప్రసాద్ భరద్వాజ

🌷. వాతావరణం శాంతికి

మనసులో చీకాకు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే మనమున్న వాతావరణ ప్రభావం కూడా అవసరమే చుట్టు వున్న పరిస్థతులు అనుకూలంగా లేకపోతే మానసికంగా శాంతి యుండదు. ఏ పని సక్రమంగా చేయలేము.

అలాగే మనం పీల్చేగాలి సువాసన భరితంగా ఉంటే సంతోష పడతాము. అదే దుర్వాసన వస్తుంటే చీకాకు పడతాము. ఇంతా ఎందుకు చెప్పటం అంటే మనకు ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదకరము ఉండాలంటే మంచి వాతావరణము అవసరము.

ఈ విషయం మన పూర్వులకు బాగా తెలుసు కాబట్టే వారు పర్యావరణ కాలుష్యము కాకుండా నిత్యము హోమ క్రియలను జరిపేవారు. సువాసనలు వచ్చే పూల చెట్లను పెంచేవారు. ఫల వృక్షాలను పెంచేవారు. ఆ ఫలాలను స్వార్థానికి కాక ప్రకృతిలో జీవాలకు కూడా అందులో భాగాన్ని కల్పించేవారు.
గోవులను పూజించేవారు.

అటువంటి వాతావరణం వుంటే మనస్సు ఆహ్లాదంగా యుండి ప్రశాంతతను పొందుతుంది.

పూర్వీకుల పర్యావరణ చింతనా వైశిష్ట్యాన్ని సూచించే మంత్రాలలో ఈమంత్రం ఒకటి.

ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః 
మధు నక్తముతోషసి మధుమత్పార్ధివగ్ంరజః
మధుద్యౌరస్తు నః 
పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః
మాధ్వీర్గావో భవంతునః

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఋతవాతే .. మంచి కార్యం చేయాలని
అభిలషించే
నః......మనకు
వాతా..గాలి
మధు...మాధుర్యంగా వీచుగాక.!
సింధవః...నదులు
మధు...తియ్యనినీటితో
క్షరంతి....ప్రవహిచుగాక.!
ఓషధీః... ఓషధులు, చెట్లు, లతలు
మొదలగునవి
మాధ్వీ సంతు....పుష్టిగాయుండుగాక.,!
నక్తం ఉత ఉషసి ....రాత్రులుమరియు పవళ్ళు
మధు..మాధుర్యాన్ని అందించు గాక.!
పార్ధివగ్ం రజః....భూమి
మధుమత్...తియ్యదనాన్ని ఇచ్చుగాక.!
నః....మన
పితా...తండ్రయైన
ద్యౌః....ఆకాశం
మధు...మాధుర్యాన్ని వర్షించుగాక.!
వనస్పతిః....ఓషధులకు చెట్లకు లతలకు ఇంకా అలాంటివాటికి అధిపతియైన చంద్రుడు
నః...మనకు
మధుమాన్....తియ్యగాయుండుగాక,!
మధురంగాయుండుగాక.!
గావః...పశువులు
నః...మనకు
మాధ్వీః భవంతు...తియ్యదనాన్ని ఇచ్చుగాక!

సత్కార్యం చేయాలని అభిలషించే మనకు గాలిమధురంగా వీచు (వలయును) గాక.!
నదులు మధురమైన నీటిని ప్రవహించునుగాక.!
ఓషధులు చెట్లు లతలు మొదలగునవి పరిపుష్టితో నుండుగాక!
భూమి మాధుర్యాన్ని అందించుగాక,!
మన పితయైన ఆకాశం (మాధుర్యాన్ని)తియ్యదనాన్నివర్షించు గాక.!
ఓషధులకుకు అధిపతియైన చంద్రుడు మధురంగా యుండు గాక!
పశువులు అధికంగా పాలను ఇచ్చు గాక!

ఇలా వారు భావన చేసేవారు అందుకు తగిన చర్యలను చేపట్టేవారు.

స్వస్తి....
🌹 🌹 🌹 🌹 🌹



శాంతి మంత్రాలు - 3 🌹
    🌻... ప్రసాద్ భరద్వాజ

🌴. సమస్త జీవుల శాంతి కొరకు  🌴

మన వేదధర్మము నందు ప్రాచీన ఋషులు జీవితాన్ని ఒక మహా యజ్ఞం గా భావించారు భావించటమే కాదు ఆచరణలో పెట్టారు.

ప్రకృతి మొత్తము ఆత్మస్వరూపమనే తెలుసు కున్నారు. అందుకే చెట్టు, గుట్టా పుట్టా ,మట్టీ, ఆకాశము, నీరు, అగ్ని, గాలి, భూమి. ఈ పంచ భూతాలను, నక్షత్రాలను సమస్త విశ్వములో యున్న ప్రతీ పరమాణు స్వరూపాన్ని కూడి దైవ శక్తిగా భావించి ఆచరించి పూజించి తరించారు.

మనకు వారి అనుభవాలను శిష్య ప్రశిష్యులద్వారా పంచారు.
కావుననే భారతదేశం ప్రపంచమున ఉన్నత స్థాయిలో యున్నది.

ప్రపంచదేశాలకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చే గురుస్థానంలో యున్నది.

జీవనమనే మహాయజ్ఞము సక్రమముగా సాగటానికి ప్రార్థనా మంత్రము. ఇది సృజింప బడిన సమస్తము యజ్ఞ వస్తువే వాటి మంగళకరం కోసం ఈ మంత్రం ప్రార్ధిస్తుంది.

ఓం తచ్ఛం యోరావృణీమహే
గాతుం యజ్ఞాయ
గాతుం యజ్ఞపతయే
దైవీ స్వస్తిరస్తు నః
స్వస్తిర్మానుషేభ్యః
ఊర్ధ్వం జిగాతు భేషజమ్
శం నో అస్తు ద్విపదే
శం చతుష్పదే!!
ఓం శాంతిః శాంతిః శాంతిః

యః...ఎవరు
శం..... మంగళం అనగా శుభమును
సుఖమును ప్రసాదిస్తారో
తత్...... ఆ భగవంతుని
ఆవృణీమహే...... ప్రార్దిస్తాము.
యజ్ఞాయ... యజ్ఞము (చక్కగా నెరవేరుట)కొఱకు
గాతుం ......గానముచేయుదము గాక.!
అనగా అర్ధిస్తున్నాము
యజ్ఞపతయే...యజ్ఞమునిర్వర్తించే వారికై
గాతుం......అర్ధిస్తున్నాము
నః...మనకు
దైవీః....దేవతలు
స్వస్తి అస్తు....మేలు ఒనగూర్తురుగాక.!
మానుషేభ్యః........మానవులందరికీ
స్వస్తి...మేలు ఒనగూరునుగాక.,!
భేషజమ్ ...ఓషధులు చెట్లు (మొదల గునవి)
ఊర్ధ్వంజిగాతు.....ఊర్ధ్వముఖంగా అనగా ఆకాశమువైపు పైకి పెరుగును గాక. !
నః....మనయొక్క మనవద్దయున్న
ద్వపదే ...రెండు పాదముల జీవులకు
శం అస్తు....... మంగళమగుగాక. !
చతుష్పదే......నాలుగు పాదముల జీవులకు
శం....మేలు జరుగుగాక. !

ఎవరు మంగళకరము ననుగ్రహించెదరో ఆ భగవంతుని ప్రార్ధిస్తాం.

యజ్ఞము సక్రమముగా పరిసమాప్తి యగుటకు ప్రార్ధిస్తాం.

మనకు దేవతలు శుభము చేయుగాక.!

మానవులందరికి మేలు జరుగు గాక.!

చెట్టు చేమ
లు ఊర్ధ్వ ముఖముగా పెరుగు గాక.!

మన వద్దయున్న ద్విపద జీవులకు మంగళకరమగు గాక.!

చతుష్పాద జీవులకు మేలు కలుగు గాక.!

🌹. శాంతి మంత్రాలు  - 4 🌹

ఈ మంత్రము ఓంకారము పరబ్రహ్మ స్వరూపమని చెపుతున్నది.

మన వేద ధర్మమున ఓం కారమునకు విశిష్టమైన స్థానమున్నది.

ఓంకారము మంత్రముల దోషమును క్షాళన చేస్తుందని పూర్వుల. విశ్వాసము.

ఈ మంత్రము కూడా ఇంద్రియములకు శిక్షణ నీయుటయే ముఖ్యోద్దేశ్యము.
ఇందులో దేవతలను సహాయము అర్థించుట లేదు. భగవంతుని నాదస్వరూపమైన ఓం కారాన్ని ప్రార్ధించట జరిగినది.

ఓం యశ్ఛందసామృషభో విశ్వరూపః
ఛందోభ్యోధ్యయమృతాథ్సంబభూవ
స మేంద్రో మేధయా స్పృణోతు
అమృతస్య దేవధారణో భూయాసమ్
శరీరం మే విచర్షణమ్
జిహ్వా మే మధు మత్తమా
కర్ణాభ్యాం భూరివిశ్రువమ్
బ్రహ్మణః కోశోఽసి మేధయా పిహితః
శ్రుతం మే గోపాయ !!

ఓం శాంతిః శాఃతిః శాంతిః

యః....ఏనాదం
ఛందసామ్... వేదాల
ఋషభః ..అత్యంత శ్రేష్టమైన భాగమో
విశ్వరూపః....సమస్తముతానై ఉంటున్నదో
అమృతాత్...మరణంలేని
ఛందోభ్యః... వేదముల నుండి
అధిసంబభూవ..... ఉద్భవించినదో
స ఇంద్రో... ఆ ఓంకారం
మే...నన్ను
మేధయా...మేధస్సుతో
స్పృణోతు. ..చేర్పించనీ, స్పృసించనీ
దేవ....దేవా.!
అమృతస్య... మరణములేని పరబ్రహ్మ ను గూర్చిన జ్ఞానాన్ని
ధారణః... పొందినవానిగా
భూయాసమ్... అగుదునుగాక.!
మే...నాయొక్క
శరీరం...శరీరము
విచర్షణమ్ ...ఆరోగ్యవంతంగాయుండనీ.!
మే....నాయొక్క
జిహ్వా...నాలుక
మధుమత్తమా...అతి తియ్యని (మాటలు)వాటిని పలుకనీ.,
కర్ణాభ్యాం.....చెవులద్వారా
భూరివిశ్రువమ్......అనేక మంచి విషయాలనే ఆలకించనీ.,!
మేధయా...తెలివితో
పిహితః..మరుగుపరచబడియన్నావు
బ్రహ్మణః....భగవంతుని
కోశః అసి...ప్రాప్తిస్థానము నీవే.!
మే...నేను లేదా నాచేత
శ్రుతం........విన్నదానిని
గోపాయ .......కాపాడు.,!

ఏ నాదం వేదాల అత్యంతశ్రేష్టమైన,  భాగమో, వినాశంలేని వేదాల నుండి ఉద్భవించినదో ఆ ఓంకారం నాకు మేధస్సును ప్రసాదించు గాక.!

దేవా నేను అమృతమయుడైన పరబ్రహ్మను గురించిన జ్ఞానమును పొందుదును గాక.!

నా శరీరం ఆరోగ్యవంతంగా యుండు గాక.!

నా నాలుక మధురాతి మధురమైన మాటలనే పలుకు గాక.!

చెవులు మంచి విషయములనే ఆలకించుగాక.!

ఓంకార పరబ్రహ్మమాలౌకిక వస్తువుల గురించిన జ్ఞానంచేత నీవు ఆవరింపబడియున్నావు..!

భగవంతుని ప్రాప్తిస్థానము నీవు నేర్చుకొనిన దానిని మరచి పోకుండా కాపాడు.!
🌹. శాంతి మంత్రాలు - 5 🌹
     

ప్రపంచముతో సంబంధము ఉన్నది కావున మనిషిని ప్రేయస్సు శ్రేయస్సులు సమీపిస్తాయి.

బుద్ధిమంతండు రెండవ దానిని ఎన్నుకుంటాడని కఠోపనిత్తు 1-2-2 లో చెపుచున్నది.

ప్రేయస్సు కర్మ సంబంధమైనది ఇంద్రయసౌఖ్యమును కలిగించునది.
శ్రేయస్సనగా ఉన్నతమైనది, ధర్మము, మోక్షము.

ఆ విధంగా శుభమైన వాటిని ఉన్నతమైన వాటిని ఎన్నుకోవటానికి మన ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వడానికని దేవలసహాయాన్ని అర్థించటానికై ఈమంత్రము విని యోగించటమైనది.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః
భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రాః
స్థిరైరంగైస్తుష్టువాగ్ంసస్తనూభిః
పశ్యేమ దేవహితం యదాయుః
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వ వేదాః
స్వస్తి న స్తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్త నో బృహస్పతిర్దధాతు!!

ఓం శాంతిః శాంతిః శాంతిః!!

దేవాః..దేవతలారా (పూజ్యపాదు లారా)
కర్ణేభిః...(గురశిష్యుల)చెవలతో
భద్రం...శుభప్రదమైనదానిని అనగా
శాస్త్రసంబంధమైన విషయములను
శృణుయామ...విందుముగాక.,!
యజత్రాః.....యజ్ఞకర్మలలో కోవిదుల మైన(మేము)
అక్షభిః...కళ్ళతో
భద్రం...శుభప్రదమైనదానిని అనగాయజ్ఞపూజా ఇత్యాదులు
పశ్యేమ...చూచెదముగాక.,!
స్థిరైః.....పటువైన
అంగైః..అవయవములతో
తనూభిః....శరీరాలతో (కూడియున్న మేము)
తుష్టువాంసః ..(మీస్తుతులను)గానం
చేస్తు
దైవహితం...దైవనియమితమైన
ఆయుః....జీవనపరిమితి(ఆయుష్కాలము)
పశ్యేమ...సంపూర్ణముగా చూచెదము గాక.,! అనగా పొందెదముగాక అని అర్థము
వృద్ధశ్రవాః..ప్రచీన గురంవులచే వర్ణింపబడినవాడు (అయిన
ఇంద్రః.....దేవేంద్రుడు
నః ...మాకు
స్వస్తి.....(మాస్వాధ్యాయంలోనేర్చిన
దాన్ని అభ్యసిండంలో)అభ్యుదయాన్ని
దధాతు...ఒసగుగాక..!
విశ్వవేదాః సర్వజ్ఞుడైన
పూషా...పూషుడు అనగా సూర్యుడు
నః స్వస్తి దధాతు...మాకు అభ్యుదయ ము ఒసగు గాక.,!

అరిష్టనేమిః....అరిష్టాలను హరించే
తార్ క్ష్యం...దివ్యవిహంగం గరుడుడు
నః స్వస్తి దధాతు...మాకు అభ్యుదయము ఒసగుగాక.!

బృహస్పతిః... బృహస్పతి నః స్వస్తి దధాతు... మాకు అభ్యదయము ఒసగుగాక.,!

ఓ దేవతలారా,! మాచెవులు శుభాన్నే వినునుగాక.,! యజ్ఞకోవిధులమైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదము గాక.,!

మీ స్తోత్రాలను గానం చేస్తు మాకు నియమితమైన ఆయూషకాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో గడుపుదుము గాక.,!

శాస్త్ర ప్రశంసితుడైన ఇంద్రుడు సర్వజ్ఞుడైన సూర్యుడు ఆపదలనుండి రక్షించే తార్క్ష్యుడు మా బ్రహ్మ వర్చస్సును పాలించే బృహస్పతి మాకు శాస్త్రాధ్యయనంలో, అందు చెప్పబడిన సత్యానుష్ఠానంలో అభ్యుదయాన్ని ఒసంగెదరుగాక..,!

🌹. శాంతి మంత్రాలు - 6  🌹

 ఈ విశ్వం మొత్తము శక్తిమయము. ఆ శక్తి నాట్యవిలాసమే ప్రపంచం. కంటికి కనిపించే ఈ బాహ్య ప్రపంచకమును నడిపించు స్థూలశక్తులనే కాకుండా, అంతర ప్రపంచకమును సూక్ష్మ రూపమున నడిపించు సూక్ష్మ శక్తులను ఒక దైవంగా భావించారు సనాతన ధర్మ పరాయణులైన ఉపనిషత్కాలపు ఋషులు. ఈ దైవాలు అభిమాన దైవాలుగా పేర్కన బడినాయి.

ఒక్కోదేవత ప్రపంచంలో ఒక దాన్ని మానవునిలో ఒకదాన్ని నడిపించేవిగా స్వీకరింప బడినాయి.

ఉదాహరణకు:-సూర్యునికి కంటికి సంబంధము అదుచే కంటికి అభిమాన దేవత సూర్యుడు.

పగటికి అభిమాన దేవత అర్యముడు ప్రాణానికి అభిమాన దేవత మిత్రుడు ఇలా ఈదేవతలతో అనగా ప్రకృతి శక్తులతో కలిసిమెలిసి జీవించమని మానవునకు ఉపదేశించ బడినది.

మనలను కాపాడమని ప్రార్ధించటమే శాంతి మంత్రాల ముఖ్యోద్దేశ్యము

ఈ మంత్రము తైత్తరీయ ఉపనిషత్తునకు చెందిన శాంతి మంత్రము.

ఓం శం నో మిత్రః శం వరుణః !

శం నోభవత్వర్యమా! శం న ఇంద్రో

బృహస్పతిః ! శం నో విష్ణురురుక్రమః!

నమో బ్రహ్మణే !నమస్తే వాయో !

త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ! త్వామేవ

ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి !ఋతం

వదిష్యామి !సత్యం వదిష్యామి !

తన్మామవతు! తద్వక్తారమవతు!

అవతు మామ్ ! అవతు వక్తారమ్!!

ఓం శాంతిః శాంతిః శాంతిః !!

మిత్రం ..మిత్రుడు ; నః.. మాకు
శం... మేలు చేయుగాక.,!

మిత్రుడు... ప్రాణానికభిమాన దేవత
వరుణః...వరుణుడు;
శం... మేలుచేయుగాక.,!

వరుణః.....అపానవృత్తికి
(ప్రాణంలో ఒక అంశం.. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన వాయువులు)
రాత్రికి అభిమాన దేవత
శం.. మేలు చేయుగాక. ,!

అర్యమా.. అర్యముడు
(కన్నులకు సూర్యమండలమునకు అభిమాన దేవత)
నః...మాకు
శం భవతు.... మేలుచేయునుగాక.,!

ఇంద్రః....ఇంద్రుడు
(చేతులకు బలానికి అభిమానదేవత)
బృహస్పతిః.......బృహస్పతి
(వాక్కుకు బుద్ధికి అభిమాన దేవత)
నః..మాకు;శం... మేలుచేయుగాక..!

ఉరుక్రమః......విశాలమైన పాదములుగల
విష్ణుః.....విష్ణువు
నః ...మాకు; శం...మేలుచేయుగాక. ,!
(విష్ణువు పాదములకు అభిమాన దేవత)

బ్రహ్మణే...బ్రహ్మమునకు
నమో...నమస్కారము.!
వాయో....వాయుదేవుడా
తే...నీకు;నమః...నమస్కారము.,!
త్వం ఏవ ...నీవే
ప్రత్యక్షం ...ప్రత్యక్షమైన
బ్రహ్మ అసి...బ్రహ్మము అగుచున్నావు
త్వాం ఏవ...నిన్నే
ప్రత్యక్షం బ్రహ్మ... ప్రత్యక్షమైన బ్రహ్మవు
అని
వదిష్యామి...ఉద్ఘాటించుచున్నాను.!
ఋతం..నీవే ఋతము అనీ వదిష్యామి...చెప్పుచున్నాను.!
సత్యం వదిష్యామి..నీవే సత్యం అనీ
వదిష్యామి...చెప్పుచున్నాను.!
తత్.. (వాయురూప ) బ్రహ్మము
మాం..(శిష్యడనైన) నన్ను
అవతు...రక్షించుగాక.!
తత్...ఆయన (ఆవాయుదేవుడే)
వక్తారం...ఆచార్యుని(చెప్పెడువానిని)
అవతు ...రక్షించు గాక.!

ఋతం. సత్యం రెండు ఒకే దానిని సూచించే పదాలు .ఋతం అన్నది వ్యావహరిక సత్యం .
ఉదా:-సూర్యాస్తమయాలు నిత్యం చూసే విషయం

సత్యం ..అసలు సూర్యాస్తమయాలు లేవన్నది పారమార్థిక సత్యం. భగవంతుడే నడిపిస్తున్నాడన్నది పారమార్థిక సత్యం.

మిత్రుడు, వరుణుడు, అర్యముడు మాకు మేలు చేయుదురు గాక.,!

ఇంద్రుడు బృహస్పతి మంచినొన గూర్చునుగాక విస్తీర్ణమైన పాదములుగల (సర్వ వ్యాపి అయిన) విష్ణువు మాకు మేలు చేయునుగాక.!
బ్రహ్మమునకు నమస్కారము..!

ఓ వాయువా నీకు నమస్కారము.!
నీవే ప్రత్యక్ష బ్రహ్మమగుచున్నావు.!
నీవే ప్రత్యక్ష బ్రహ్మమని చెప్పుచున్నా ను.! నీవే ఋతం నీవే సత్యం అనీ వక్కాణించుచున్నాను.!

ఆ బ్రహ్మము శిష్యడనైన నన్నును ఆచార్యునుని రక్షించుగాక..!
 త్రివిధ శాపములు శమించు గాక.!


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ