: శ్రీ హనుమాన్

"దుస్స్వప్న నాశన సూర్య స్తుతిః...---ఆదిత్యః ప్రథమం నామ ద్వితీయం తు దివాకరః..తృతీయం భాస్కరః ప్రోక్తం చతుర్థం చ ప్రభాకరః!పంచమం చ సహస్రాంశుః షష్టం చైవ త్రిలోచనః!సప్తమం హరిదశ్వం అష్టమం చ విభావసుః !నవమం దినకృతం ప్రోక్తం దశమం ద్వాదశాత్మకః!ఏకాదశం త్రయీమూర్తిః ద్వాదశం సూర్య(:)ఏవం చ !ద్వాదశైతాని నామాని ప్రాతఃకాలే పఠేన్నరః( /పఠేత్+ నరః ),దుస్స్వప్న నాశనం సద్యః,సర్వసిద్ధిః ప్రజాయతే!!! "----
లోకా: సమస్తా: సుఖినోభవంతు నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్ మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ "మత్తకోకిల ---- అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్ భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!" --(())-- హనుమంతునికి - ప్రదక్షిణాలు హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి ''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగలగటం మరీ మంచిది. హనుమంతుని మహత్యం 🤔What is GDP🤔🤔💝మా ఇంటి పక్కన వెంకటరెడ్డి గారని ఒక పెద్దాయన. రిటైర్ అయి పోయి, ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి పెన్షన్/కౌలు డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు. ఒకటో తారీఖు అనుకుంటా..పొద్దున్నే సందు చివర షాప్ కి వెళ్లి 500 రూపాయల సరుకులు కొన్నారు.ఆ షాప్ అబ్బాయికి కూడా ఒకటో తారీఖు కదా. పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.ఆ బిరియానీ షాప్ ఆయనేమో రోజూ బిరియానీ ఏం తింటాం అనుకున్నాడేమో, పక్కన కర్రీ పాయింట్ లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.ఆ కర్రీ పాయింట్ అబ్బాయి ఆ పక్కన ఉన్న కూర గాయాల షాప్ లో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.కూరగాయల షాప్ అబ్బాయి సాయంత్రం రైతు కి కూరగాయల డబ్బులు ఇచ్చి లెక్క రాసుకున్నాడు.రైతేమో వెంకటరెడ్డి గారి పొలం కౌలుదారు. పొలం కౌలు డబ్బులు తెచ్చి వెంకటరెడ్డి గారికి ఇచ్చేశాడు.కథ అయి పోయింది.---------*----------ఒక్క నిమిషం ఈజీ లెక్క కోసం అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 పూర్తిగా ఖర్చుపెట్టారు; వాళ్లకు అదే ఆధారం అనుకుంటే...ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి 500x6 = 3000 రూ. (పేపర్ల వాళ్లు GDP అంటారే.. ఇది ఇదే)ఆ 500 రూపాయలు మళ్లీ వెంకట రెడ్డి గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.---------*----------ఇదే వెంకటరెడ్డి గారు అదే 500 తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ లోషనో కొన్నార నుకోండి..ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు పస్తన్న మాట. ---------*----------"చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India doing?" అని బాధ పడకుండా..వీణ్ణీ వాణ్ణీ తిట్టక్కర లేకుండా.. దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా...Be Indian! #Buy Indian!! జై స్వదేశీ స్వదేశీ వస్తువులను వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం
|
*శ్రీ ఆంజనేయ స్తోత్రం*
*ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే!*
*నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే.!!*
*మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే!*
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ !!*
*వాగ్మినేగతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ!*
*వనౌకసాం వరిష్టాయ వశినే వనవాసినే.!!
*తత్త్వ జ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే!*
*ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ.!!*
*జన్మ మృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ.!*
*నేదిష్టాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే!*
*యాతనా నాశనాయస్తు నమో మర్కట రూపిణే.!!*
*యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే!*
*మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రతే.!!*
*హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే!*
*బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే.!!*
*లాభ దోసిత్వమే వాసు హనుమాన్ రాక్షసాంతక!*
*యశోజయంచ మే దేహి శతృన్ నాశయ నాశయ.!!*
*స్వాశ్రితానాయ భయదం య ఏవం సౌత్తి మారుతిం!*
*హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవత్. !!*
🕉🌞🌎🌙🌟🚩
రాముడు నుండి స్వీకరించాల్సిన 16 లక్షణాలు :
1.గుణవంతుడు - గుణం కలిగినవాడు
2. వీరుడు – మంచి ప్రతాపం కలిగినవాడు
3. ధర్మజ్ఞుడు – ధర్మం అంటే ఏంటో తెలిసినవాడు
4. కృతజ్ఞుడు – చేసిన మేలు మరువనివాడు
5. సత్య వాక్య పరిపాలకుడు – ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు
6. ధ్రుఢవ్రతుదు– స్థిర సంకల్పం కలవాడు
7. ఉత్తమ చరిత్ర కలవాడు – మంచి నడవడి కలవాడు
8. సర్వ భూతముల హితము కోరేవాడు – సర్వ ప్రాణుల హితాన్ని కోరేవాడు
9. విద్వాంసుడు – జ్ఞానం కలవాడు
10. సమర్ధుడు – సామర్థ్యం కలవాడు
11. ప్రియవర్తనుడు – సదైక ప్రియదర్శనుడు
12. ఆత్మవంతుడు - ధైర్యం, వ్యక్తిత్వం కల్గవాడు
13. జితక్రోధుడు – కోపాన్ని జయించేవాడు
14. ద్యుతిమంతుడు – తానూ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు
15. అసూయ లేనివాడు
16. నిశ్చింతత - చింతలేనివాడు
🚩
🚩హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🚩
”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మంద వాసరే –పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హానూమతే
కరుణారస పూర్ణాయ,ఫలా పూప ప్రియాయచ -మాణిక్య హార కం థాయ మంగళం శ్రీ హానూమతే
సువర్చలా కళత్రాయ,చతుర్భుజ ధరాయచ -ఉష్ట్రా రూధాయ వీరాయ ,మంగళం శ్రీ హానూమతే
దివ్య మంగళ దేహాయ ,పీతాంబర ధరాయచ -తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హానూమతే
భక్త రక్షణ శీలాయ ,జానకీ శోక హారిణే-జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీ హానూమతే
పంపా తీర విహారాయ ,సౌమిత్రి ప్రాణ దాయినే -సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే
రంభా వన విహారాయ ,గంధ మాదన వాసినే –సర్వ లోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే
‘ పంచానన భీమాయ ,కాలనేమి హరాయచ –కౌండిన్య గోత్ర జాతాయ మంగళం శ్రీ హానూమతే ”’.
Com
🌹 🌹 🌹 🌹 🌹
హనుమగుణగణములతో/శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తవం
గుణగణములు
******
రామ పూజారి పర ఉపకారి
మహావీర భజరంగ బలీ
సద్ధర్మ చారి సద్బ్రహ్మ చారి
మహా వీర భజరంగబలీ!
జ్ఞాన గుణసాగర
రూప ఉజాగర
శంకర సువన
సంకట మోచన
మహా వీర భజరంగబలీ!
కేసరి నందన
కలిమల భంజన
రాఘవ దూత
జయ హనుమంత
మహా వీర భజరంగబలీ!
అంజని నందన
అసురనికందన
మంగళహారతి
మారుతి నందన
మహా వీర భజరంగబలీ!
జయ రణధీర
జయ రణశూర
జయ బలభీమ
జయ బలధామ
మహా వీర భజరంగబలీ!
🕉🌞🌎🌙🌟🚩
వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.
సుందరకాండ సారమైన
9 శ్లోకములతో ఏర్పడినదే.........
శ్రీఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం.
రత్ననములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామివారికి సమర్పంచబడినది.
ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది. ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది. శ్లోకము తత్‌సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.
🚩🚩🚩🚩🚩🚩
శ్రీ ఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం
🚩🚩🚩🚩🚩🚩
1) మాణిక్యం (సూర్యుడు)
******
శ్లో!! తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||
అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.
2) ముత్యం (చంద్రుడు)
******
శ్లో!!యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ|
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||
అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.
3) ప్రవాలం (కుజుడు)
******
శ్లో!! అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||
అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.
4) మరకతం (బుధుడు)
******
శ్లో!! నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||
అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.
5) పుశ్యరాగం (గురుడు)
*******
శ్లో!! ప్రియన్న సంభవేద్దు:ఖం అప్రియాదధికం భయం|
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం||
6) హీరకం (శుక్రుడు)
******
శ్లో!! రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర|
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||
అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.
7) ఇంద్రనీలం (శని)
*****
శ్లో!! జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||
అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.
8) గోమేదికం (రాహువు)
*******
శ్లో!!యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||
అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.
9) వైడూర్యం (కేతువు)
*******
శ్లో!!నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||
అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment