అమృత ఘడియ తత్వాలు 08-01-2023 to 14-01-2023




భ భ  భ  త  ర  న  గ గ 
UII  UII  UII  UUI  UIU  III  UU 
నేటి కవిత్వం ... "అంబురుహము.----
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మా  మతి శ్రీ పతి సేవలు వాక్సుధ్ది  మంత్రిగా మతిశబ్దదా
తామస  పంచియు ఆశలు తీర్చేటి తృప్తిగా కమలాసనీ
 రమ్యపు భావము తీర్చెది ధర్మమ్ము లాహిరీ మదిగోప్యమే 
 కామపు మాయను తెల్పుతు విశ్వాస కానుకా సుమమాలినీ

కాలము ఎప్పుడు నీ దను కోలేవు కాస్త సేవలను పంచీ 
గాళము వేసియు సాధక బాధల్ని గుట్టు ఓర్పుగ భరించీ   
తాళపు గోలలు చేయక మోనాన్ని తప్పుగా తెలపకా సే 
వాలలితాంబకు చెయ్యెత్తి వాక్కుతో నిజము చెప్పే 

వేదము విన్నను చద్విన కాయాన్ని ఉజ్వలంగ మెరిపించే   
సాధన తాత్విక భావము లేకుండా సామరస్యముగ  ఉంచే 
గాధలు ఎన్నియు ఉన్నను వేదాన్ని గాంచినా మనసు తీరూ 
శోధన చేష్టలు నుండియు శాంతమ్ము శోభ తృప్తి కలిగేలే 

భారతి ! వాగధి దేవత! గాయత్రి ! భాషదా !  మతిశబ్దదా !
శ్రీ రమ సంపదధిష్టిత ! భార్గవి ! శేవధి రూపిణీ !కమలాసనీ !
సారసలోచని ! దుర్గమ తారిణి ! శాంభవి ! దైత్యభండనభీకరీ !

సారస కామ్యవరమ్ములఁగోరెద సౌమ్యసౌహృదులమ్మలో!!!"

--(())--

Who do you see? Devata or Devi? | Creative Gaga

త త త త త త త గ గ - పద్మనాభ -12   
UUI  UUI  UUI  UUI   UUI   UUI  UUI  UU  
నేటి కవిత్వం - పద్మనాభ 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంతృప్తి  ఆలింగ భావమ్ము విశ్వాస
సాహిత్య సమ్మోహ సద్భావ మేగా 
సంతృప్తి ఆరోగ్య  రాగమ్ము  విశ్వాస    
ఔనత్య  ఔ పోస ఔదార్య  మేగా 

కాలాన్ని కామించు కామ్యమ్ము లోలాక 
కర్తవ్య కర్తుత్వ  కర్మత్వ మేగా 
కారుణ్య లాలిత్వ జాలిత్వ  లోలాక 
సద్భోద సందర్భ సంభావ మేగా   

నేత్రమ్ము నేమిష్ట నేమించు జన్మాన  
నేలంచు నేలంత నేస్తమ్ము యేగా 
నాదించు నాదేయ నాదేయి జన్మాన 
నైపద్య నైపుణ్య నైర్మల్య మేగా  






నేటి *ప్రేమలో పట్టు  

అలక చెప్పక ఆశగ వచ్చు చుండు 
మొలక గాలిని నీటిని త్రాగి వచ్చు 
పలక  బలపము వ్రాసిన గుర్తు తెచ్చు 
నలక  కంటిలో నీటిని శుభ్ర పర్చు 

సరిగ మలరాగ మతిశయ మల్లు చుండు 
చిరునగవు సేవ అతిఆశ కోస ముండు 
పరిమితియు విశ్వ మంతటి లోన గుట్టు 
అరగని అనురాగమును నమ్మి ఉండు 

కడలి పొంగును చల్లపర్చేటి పట్టు  
మడమ తిప్పక నీరుకార్చేటి పట్టు      
ఎడమ చేతివాటమురుచి చూసి పట్టు 
కుడియడమల భములను మట్టు పెట్టు 

కలలు పండించు కోవాలి ఏల  అనకు 
కళల వల్లన జీవితం శోభ కలుగు 
చలము నీటిని త్రాగితే తృప్తి కలుగు   
జలము పల్లము ఎరుగు ఆశ విరుగు 

--(())--

ఒకనాటి కవిత - పట్టు      

సరిగమల సరాగం ప్రేమతో పుట్టు
చెరపలేని ప్రేమ మనసులో పుట్టు
ప్రేమార్ధం విశ్వ మంతటి లో గుట్టు
అంతుతెలియని మాధుర్యంతో పట్టు

అరిగిపోని అనురాగం పంచె పట్టు
కడలి పొంగును చల్లఁపరిచే పట్టు
ఆలింగనాల అభిరుచులతో పట్టు
తీపిగుర్తులు అందించి నలిగే పట్టు

నిరంతర త్యాగాలతో, ఓర్పుతో పట్టు
వివరించలేని సుఖం ఇచ్చిన  పట్టు
తెలియని ఆనందం అందించే పట్టు
వీడని నమ్మకం తో బ్రతికించే పట్టు

ఇరుహృదయాల సంగమమే ప్రేమ పట్టు
ఈశ్వరుని లీలలను తట్టుకొనే ప్రేమ పట్టు
ఆకలేస్తే అన్నంపెట్టు, కోరికను వడిసి పట్టు
క్షణమొక యుగంగా బ్రతుకు ఈడిస్తు పట్టు
--(())--


భ   ర  న   ర  స  స  న  గ - మద్రక - 10  
UII  UIU  III  UIU  IIU  IIU  III  U 

కాలము మారెనే మనసు కోరికే కళలే ఇక ఏ మగును లే 
శీలము భద్రమే మగువ సాహసం తలపే దయతో పలుకులే 
పాలకి తెచ్చినా హృదయ పాలవాగును పంచుటయే కళలుగా 
చాలిక అన్నను వయసు చాకచక్యముతో పదహారు కళలే 

చోద్యము  తెల్పుటే వినయ చోలమే విడిచీ వలువే వదలి వే 
సే దయ దాహమే తపన సారికా కలిసే సమయా సమయమే 
వాదము చేయకే మనసు అర్పనే మనువాడిన భర్తకు సహా 
యం దరి చేరియే కులుకు యంతయూ సరి చూపె మగడి కొరకే      

పాలను ముంచినా జలము పంచినా తనువే తప మాచరణ మే   
లాలన పాలనే వదలి లక్ష్మిగా చలనాలను ఆశ్రయముగా 
గాలిని నీటినీ కలిపి ఆకళై గడుసై విధినే మరచియే 
ఆలిగ ఉండకా తిరుగు సోద్యమే మగవానికి కలే    


-(())-- Photo

త య  త య  మ  త య  గ గ  
UUI  IUU   UUI  IUU   UUU  UUI  IUU   UU  
నేటి కవిత్వం - నిజమైన స్త్రీ సుఖం 
రచయత : :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రాగమ్ముల తోడన్ ప్రేమమ్ముల తోడన్  రమ్యమ్మే  విశ్వాస వివాహం కాదా 
నీ గానము నందున్ నీ సేవల నందున్  కామ్యమ్మే  విశ్లేష  వినోదం కాదా 
రాగేశ్వరవై దేవీ దీవెన తోడన్  రంజిల్లున్  సౌందర్య  సమూహం కాదా 
యోగార్థిని నేనే  స్నేహార్ధి వి నీవే   ప్రేమాబ్ధీ కోరేది సహాయం కాదా     

నాయాశల వాణీ  ఆనందపు బోదీ  ఆరోగ్యా  హాస్యమ్ము లయార్ధీయున్ 
సాయమ్మివనాయీ  సాయంత్రము నందున్  బోదత్వా  ప్రావిణ్య సహాయంమ్మేయున్ 
రేయిన్ గడు హాయిన్ - బ్రేమన్ కళ లాగా  సంతృప్తే కల్గేటి సుధామాధుర్యమ్  
తీయంగను పాటల్ - పాడన్  గను వచ్చే  ప్రేమమ్మున్  పంచేటి  సభామంత్రీయున్ 
       
ఆఘట్టన మందున్ హాహా కర కారమ్ముల్ ప్రావిణ్యమ్ముల్  సహ పాండిత్యమ్మున్  
మేఘధ్వనిపూరం  బీయా కర కాశమ్మే  ప్రాధాన్యమ్ముల్  కళ  సాహిత్యమ్మున్ 
మేఘాగమ వేళన్  జల్లేలుట జర్గున్  సౌభాగ్యమ్ముల్ వీచి సువాసంబుల్గాన్ 
మేఘాంబువులిచ్చున్  సంతోషమ్ము కల్గున్  హర్షమ్ముల్ మెండై సుఖ వాసంబేయున్  


--(())--
మేఘధ్వనిపూర - 

క్రొత్త బుధ గురు గణములతో గు/బు - గు/బు అమరిక గల వృత్తములలో నొకటి ఈ మేఘధ్వనిపూర వృత్తము. గురువులతో నిండిన ఈ వృత్తమును వ్రాయుట కొద్దిగా కష్టమే. క్రింద నా ఉదాహరణములు - 



భ  భ   భ    భ  భ  భ భ గ   -- మానిని -12  
UII  UII  UII  UII  UII  UII  UII U 
నేటి కవిత్వం - రెక్కలు ముక్కలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రెక్కలు ముక్కలు చేసిన డొక్కర నిండదు ఎందుకు ఈ బతుకే 
మక్కువ చూపిన తిన్నది కక్కుము దుర్భర పల్కులు కోపముగా  
ఎక్కువ మాటలు  చెప్పకు లొంగియె తిండికి రూకలు  తీసుకుపో 
తక్కువ చాలవు భాదతొ కోరితి రేపటి నుంచియు రాకుఆనే 

కాలపు మాయకు చిక్కితి చేయక చేసిన తప్పును పట్టితిరే
చాలక ఆశకు  పోయితి  వారిజ మాటలు  భాధను పెట్టెనులే 
ఏలిక  తన్నులు  తిట్టులు  కల్సియె  ఆకలి చచ్చియు పోయనులే 
మాలిక బత్కుకు దారియు  చూపుము  అన్నను చూచియు పోవుదురే

సాధన చేయగ నెచ్చట మానస వేగము ఆపుట నాపరమే అగునా 
వేదము చద్విన ఆకలి మానవ  జీవిత భాగము తప్పదులే అవునా
వేదన తప్పదు ప్రేమను చూపియు సంపద లేకయు  లోకములో 
యుద్ధము చేసెద  బత్కుల బండియె లాగుట తధ్యము  దేశములో 

--(())--
    



జీవిలో - ప్రపంచం (౧)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బాహ్య కాంతి శబ్ద కాలుష్య పెర్గేటి  
వింత మార్పు చోటు చేసె మాయ  
ఆత్మ శక్తి నంత సంకల్ప సందేహ 
మేను పుల్క రింత సంభ మేగ   

జీవి తాను భావ భవ్యత  ఎవ్వరి 
కోస మైన  ప్రశ్న బుద్ది శక్తి 
జీవి తాంత మంత ఉండేటి కర్తవ్య 
తీర్పు విశ్వ మంత ప్రజ్వ లించు 

మౌన కళ్ళ ముందు ఆలోచ నాలుగ 
తీవ్ర సంఘ  మందు  పోరాడు శిష్టత 
ఊహ ఆశ మధ్య  భౌతిక దేహమె        
పాశ బంధ మేగ  జివి బత్కు 

--(())--



భ  ర న ర న ర న యూ - సుభద్రకు -11   
UII  UIU  III  UIU  III  UIU  III U 
నేటి కవిత్వం - చిత్తరువు 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చిత్తరువే లిఖించి వగచే మనో మయము వేదనా పడిన గ 
మ్మత్తుగ ధీర వీర సుమమే కదా మనసు దోచినా వనితగా 
కొత్తవి తెల్పెదీ వయసుకే ఉపాయమును తెల్పెదీ  సొగసుతో 
విత్తును నాటుటే కళలు విప్పి వేగమున నీరుతో కలియుటే 

మన్మధుడో సుఖాలయము కామితార్దమగు భావమే మనసు కే  
మైనను హావభావములనే మదీయ కాహరితార్ధమే తలపుతో 
గానము చేసియే సుఖపు వేగమే వయసు తోడుగా వలపు నీ 
డన్నది పొందియే మగని మైకమే తొలగి చీకు చింత వదలే        

స్త్రీ కృపయే సుఖాలయముచేసి కోర్కలను తోడుగా తరుణమే 
స్త్రీ ధయ యే విశాలమయమై సుఖాలయము తృప్తిగా మదనమే 
స్త్రీ  చర ఆశలే వినయ వాసిగా వివిధ కారణాలు తెలిపే 
 స్త్రీ కర మాటలే మనసు వెన్నపూస కరిగేవిధాన కరిగే 
--(())--




 స    త త న   స  ర    ర   గ మహాస్రగ్దర ... 8 . 15  
IIU  UUI  UUI  III   IIU  UIU  UIU U 


నేటి కవిత - కౌమారం  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మనసే మౌనంగ కౌమార దశలొ పరమానందమే ప్రోద్బలంగా 
పని చేసే విద్య  కోపాలతొ సరిగమపా ప్రేమ లక్ష్యమ్ముగా  తి 
ర్గును ఆర్భాటాల తో ప్రేమ కనుగుణమురే చేయు చైతన్య మూర్తే 
కను సైగల్లోకి చిక్కేటి మనిషి పలుకే స్వేశ్చ భావాలశక్తే 

అలకే ప్రేమమ్ముగా రాగమతిశయ మనోస్నేహమే శాంతిమార్గ 
మ్ములె సేవాపూర్వకమ్ముగకదిలె లయమే సామరస్యాలయ మ్మే 
కళ సంతోషమ్ముగా కాల మయము పరమై స్వేశ్చ హృద్యమ్ముగా పొం 
గులకారమ్మే  సమాగ్రాహ్య వలయములుగా  ఉండెదే జీవితమ్మే 

కమనీయం ప్రేమ వాక్కే మనకళలను  కారుణ్య భావాలుగా సే 
వ మహోత్సాహమ్ము దక్కే చిరునగవులులే  చిందులాటల్ల సాగే 
సమ భావ ప్రేమ విశ్వాసముతొ కలిసి సేవా సహాయమ్ము చేసే

మమ ఆశాపాశ సామాన్య వలపు మన మేకం సమోన్నత్వమేగా


Tanjore painting- Krishna

పంచభూతాలు 

భూమి 
అఖిల జీవ కోటి ఆధార భూతమ్ము 
శ్వామ లాంబ కరుణ  సుంద రమ్ము 
సకల సంప దల్కి మూలము భూమాత 
సర్గ మన్న నదియె తరచి చూడ 

ఆకాశం 
నింగి సూర్య చంద్ర నిత్యము సంచార
పగలు ఎండ రాత్రి నీడ  కల్గు  
తిధి వలన మేఘ మార్పుల ఆకసం 
ఋతువు లన్ని వరుస మారు చుండు   

వాయువు 
పరమ శివుని శక్తి  పవనమై జగమంత  
వ్యాప్తి చెంది జీవ కోటి కెల్ల 
రక్ష వాయు వగుచు జీవులు కాపాడు  
 గాలి లేక బతక లేము ఘడియ 

అగ్ని 
ప్రజ్వ లించు అగ్ని  లాభము నష్టము 
వేడి లేని మేను వ్యర్ధ మేగ 
అగ్ని తోడు తిండి  తయ్యారు కావచ్చు 
అగ్ని యజ్ఞ ఫలము దేవ తలకు     
  
నీరు 
నదుల జలధు లన్ని కలిగిన ఈభూమి 
అంద జేయు నాన్న పానములను
సకల జీవ కోటి  దాహము తీర్చేది 
వృష్టి లేక సృష్టి  సాగ లేదు 

విజ్ఞానం 

మొదట నమ్మియు దూషణ మూర్ఖ బుధ్ధి 
ఒకరి నర్ధించి వెరొకరి యాచ బుధ్ధి
మనిషి నర్ధము చేసుకో అన్న వాక్కు 
వినిన సహనము చూపించు నిత్య పలుకు

ఒకరిని అభివర్ణించేటి శక్తి చూడు
తెలుసు కొనుటముఖ్యం మంచి సేవ యుక్తి 
తగిన సమయంలొ ఉత్తమ సంఘ సేవ
మనిషి రోగిగ మారితే ఆదు కొనుము

విషయ వాంఛ లు వదలని మూర్ఖ బుధ్ధి
తెలియ నివి తెలుసునని పల్కేటి బుధ్ధి
తగిన రీతిలో తల్లి తండ్రల సేవ
మనిషి జన్మనిచ్చిన దైవ కరుణ బుధ్ధి

ఎలుక ఎదురైన ఏనుగు ఆగు బుధ్ధి
బలము ఉన్నను బలహీన బుధ్ధి కాదు
మనషి నొచ్చిన ఉత్తమ బుధ్ధి కోరు
మనసు చేతకాని తనము కానె కాదు

--(())--


నేటి కవిత్వం : నటుడు గానగంధర్వుడు 
బాలసుబ్రహ్మణ్యుని పుట్టినరోజు శుభాకాంక్షలు   

సీ ::   శ్రీ మాత కరుణయు శ్రీ వాణి దీవెన
          పండిత రాడ్యుల ప్రజ్ణ  కొరకు 
         చిత్ర సంగీత గంధర్వుడు పద్మశ్రీ 
         బాలసుబ్రహ్మణ్య గాయ కుండు
         అనితర సాధ్యమైనట్టివి కళలకు  
         నంది అవార్డులు పొంది  నారు     
         దేశబాష తెలుగు వృద్ధికి జీవితం
         అంకిత మిచ్చిన గాయకుండు 

తే :: ఎదురు లేనిసి నీసీమ లేలె రాజు 
        పలుకు పాటగా సంగీత  గాన రాజు
        నటుల గొంతుతన గొంతుగా  పలికె రాజు     
         నటుడు బాలుగారికి అభి నంద నాలు 

                       --(())--



స జ  స  జ  స  జ  స - మణిమాల 10 
IIU  IUI  IIU  IUI  IIU  IUI  IIU 

నేటి కావిత్వం - పరమేశ్వరుడు  
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సుజనుండు చేయు పనులే సమస్త లోకమే సుగర్వముగ చె
ప్పు జనా వలీ సుఖము గా ప్రయోగములు గా ఉపాసనలు గా 
నిజమే ననీ పలుకు గా నిరంతరము సేవ చేయుట కదా     
ప్రజలే మహా మనిషిగా ప్రధాని అను నేతగా  తెలిపుటే 

ఎవడింద్రి యమ్ములు సహాయ పర్చునని ఉన్న తోత్తమునిగా   
అవనీ తలమ్మున మదీయ పాలనను ఇచ్చు కార్య ముఖిగా
అవధాన కర్త రజ రాజ కీయ సమ రోద్ధికా వినయ మే 
జవసత్వ మే సకల సేవ తత్పరుడు గా ప్రధాని పలుకే 

కళ లే సకాలమున ఏక మవ్వుటకు యోగ్యతా కలుగు నే 
పలుకే వినోద పరిచే, ప్రమాదము నకే సహాయ పరిచే 
తెలిపేటి మేలు హృదయం తపోజనముగా  నిరంతరము  సే 
వలు చేయునట్టి మనిషే విశాల హృదయమ్ముగా ప్రజలకే   
--(())--



Image may contain: one or more people


విద్యుత్ వక్త విద్యా స్వరూప
సమ్మోహ్ శక్తి  విద్యా స్త్రీ రూప 
తన్మాయ్ తత్వ మేయీస్వరూప
ధర్మత్ విద్య వైద్యా స్వరూప

తగిన వాణ్ని చూసి దానము చేయుము 
తగని వాని తోను మంచి మాట 
తగని వాడె నన్న సత్యమె పల్కుము 
తగిన వాడి కైన పాత్ర తెల్పు 

ఎవరి కీని భాధ కల్పించ రాదులె 
నరుని నిత్య సత్య మార్గ మతము
మనము చేయ లేని దానిని మరొకరు 
చేసి చూపి వద్ద కొస్తె మెచ్చు 

ప్రేమ కరుణ దయ  సాధన సంపత్తి 
తోను  తప్పఁ  కుంచు  ధర్మ బుద్ధి     
ఉత్త మోత్త మమ్ము  తెల్యక దుర్బుద్ధి 
 పెర్గి  ధర్మ  మన్న   చిన్న చూపు  

జాలి దాన బుద్ధి ఏకొద్ది మందిలో 
ఉండి  సత్య  పల్కు వృద్ధి జరుగు
తృప్తి  ఉంటె ప్రశ్న ఉండదు ఎవ్వరికి 
పంచు నట్టి బుద్ది శాంతి కల్గు 

అంద మన్న దేది సాస్విత ముండదు 
పువ్వు పగలు రాత్రి శోభ పంచు
ఆకు రాలి పోవు ఎండిన తర్వాత 
జీవి వయసు పెరిగి రోగమాయె

కళ్ల నీళ్లు తిర్గు మంచిని చూడరు 
వల్లు గుళ్ళ అయిన ఓర్పు చేటు
బల్లి లాగ గోడ నక్కియు ఉండు
గుంట నక్కలు లాగ అరచు చుండు

మనిషి నడక మసక బారి ఖరీదైతె
ఎనక ముందు క్రింద పైన బతుకె
వయసు వేడి పడక చల్లగ ఉండుటే
కోప మేను ఉడికి రచ్చ రచ్చె
--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ