నేటి కలము వ్రాతలు ... ప్రాంజలి ప్రభ ..  

వింత జరిగే
మత్తు చేరి గుండె భారమయ్యే
వైద్యుని బిల్లు చూసి తేలికయ్యే ... .1

ముచ్చటే
నేను కాబట్టి రోగాన్ని తాగించాను
కొకరైతే బిల్లు చూపి రోగాన్ని పెంచెను ... 2
 
ఒంటి చేత్తో
పోషించటం కష్టగా ఉంది
పెళ్లిచేసుకో ఇష్టమవుతుంది  .... ... 3
 
కొత్త వింత
చూపుల చదువులు
పరీక్ష రాయని మార్కులు  ... .... .. 4
 
ఇదేనా దారి
వెనుకకు తిరిగి చూడు అదేదారి
ఏకాగ్రతగా చూడు దొరుకు నిజమైన దారి ...  5 


చెట్టు
కార్బన్ డయాక్సేడ్ పీల్చి
జీవ రక్షణగా వాయువు విదిల్చి  ...  .......  6

ఆధునికత
అవసరానికి ఆనందం
పొందలేక పోతే నిర్వేదం   ... ........ 7

ఎవ్వరైనా
నిన్ను నువ్వు కాదని అన్నా
చెప్పు తల్లి తండ్రుల చాటు బిడ్డ నన్నా  .... ....... 8


ముచ్చటంత
పోయిన వారి గురించి రభస
మరోచోట వీళ్ళు ఎప్పుడు పోతారని రభస .... ....... 9

కవి
మనసు భావం తెలియ పరుచు
మనము అందులో నిజము ఆచరించు ...... ..... 10

ప్రేమ
తీర్చే వారి మనసున ఉండు
కోపించు వారి మాటలలో ఉండు...... 11

చులకన
ఎప్పుడు చేయుట వద్దు
తప్పుడు మాటలన్నా వద్దు......12

నిలువెల్లా
విషమున్నా ప్రేమించు
నమ్మకంతో బతికించు..13

తేలు
తనపని తాను చేస్తుంది
భయము వల్లా చచ్చుటక గురిఅవుతుంది....14

తేలుకు
విషం తోకలో
మనిషికి విషం గుండెలో..15

ప్రకృతి
కానీ రాకుండా కదలి పోవు
పంచభూతాల్లో కలిసి పోవు.....16

ముసుగు
లో ఘాటు ప్రేమ ముద్దు
చాటు సరసం ఎన్నటికీ వద్దు.......17

పైకి
కనిపించేది నిజము అనుకోకు
నవ్వు లోన విషాన్ని గమనించు కదులు ముందుకు.......18

 బ్రమ
మబ్బుల్లో చిక్కాడు సూర్యుడు
మనిషి గా అబద్ధం ఆడనన్నాడు  .... ........ .. 19

మేఘము
కదులుతూ కురియును వర్షము
పుడమి తల్లి పురివిప్పి చూపు హర్షము ..19

కాకికి
సంద్రంలో ఎండిన కొమ్మ ఆధారము
దైవం దారిచూపగ తొలగే భయము  ..... ..... 20

కన్నీరు
నవ్వినా నవ్వించినా వచ్చు
ఏడ్చినా ఏడ్పించినా వచ్చు   ... ...... 21

ఎడారి
బతుకులో అనుమానం పెనుభూతము  
సహనమ్ముతో సాగినా అయ్యోమయ్యము   ... ... 22
 
ఆమె
తన పని తాను చేసుకొనేది
తనకోసం వచ్చిన వారిని భరించేది   ... ... 23

రోదన
చేయని మనిషి ఎవ్వడో
ఆపిన వాడెవ్వడో            .... ...24

వర్షము
బొట్లుగా జారుతుంటే
హృదయం చల్ల బడిందంటే   ... .... 25

కోయిలమ్మ
కూత స్వరావు మాలిక   
హృదయం ఆనంద డోలిక    ... .... 26

ఆకాశం
తనువు రంగులు మార్చినా
వసుందర మెప్పు కోసమేనా     .... .... 27

ప్రపంచం
మూడొంతుల జలము ఒకవంతు భూమిలో  
ఆశలతో జనులు జీవచ్ఛవములై వలలో  ... 28

ధర్మము
ఆచరించుటకు అనువైనది ధర్మము
ఆచ రించ లేకపోతే వారి కర్మము  ....29

మనసు
పంజరంలో చిక్కిన చిలక
అది నిత్యము మారె మొలక .... 30

పంజరం
అందరు నివసించేది పంజరం
తెలుసుకో లేక అగమ్య గోచరం ..... 31
 
శరీరం
రక్తమాంసాలు పంజరం
గాలివేలుగులతో నడిచే కుంజరం   .... 32

సమాజం
బతికి బతికిస్తా నంటుంది  
బతక లేని వారు ముర్ఖులంటుంది ... 33

ఒక్కోసారి
వెలుగులలో వయ్యారం
చీకటిలో శృంగారం    .... ... 34

వివాహము
జిహ్వ చాపల్యానికి మందు
మరిస్తే పొందాలి మరో మందు .... 35

స్వేఛ్చ

అనేది ఎక్కడుంది
ఉన్నదంతా అనుభవం అంది  .... 36

లఘు ప్రక్రియ కవిత 


రాలిన

ఆకులు కళకళ  

మనిషిని చుసిన విలవిల 


నటించటమంటే/

హృదయాల్లో జీవించటం 

ఆత్మాభిమానాన్ని బతికించటం 


ఏ తప్పూ

చేయలేదంటే నమ్మడం దేనికి 

నమ్మి మోసపవడం దేనికి 


మూర్ఖులకు

ఎవ్వరు ఏమి చెప్పలేరు 

సేవచేస్తా ముర్కులవుతారు 


 ఈ లోకములో  

చిత్ర మైనది మనిషిని అర్ధం చేసుకోవడం 

చింతలే దన్న వాడిని వెతకడం 


మనసు తొ  

ప్రేమ,  ధైర్యం,ఔదార్యము బ్రతికించు 

స్వార్ధం, అహంభావం, లేక జీవించు 


చిల్లులు

పడినగొడుగు నన్నెక్కిరిస్తుంది

పళ్లెం నూకలు మట్టిగడ్డలు జారుస్తుంది 


చీపురు

వీధులను ఊడ్చి పెడుతుంది

అవినీతి సమాజాన్ని దులిపేస్తుంది 


అధికారం

అహంకారాన్ని అలంకరించుకుంది

అనధికారులను ప్రోత్సహించింది 


సూర్యోదయం

వెలుగులను వెదజల్లింది

మనుష్యుల మత్తు వదిలించింది


వికృతి

తుఫానుగా చెలరేగింది

పంట రైతును కౌగిలించుకుంది




 

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ