1

[17:52, 02/11/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 89 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు,  మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు  - 11 🌻

381. మూడవ భూమిక:-

దివ్య ప్రియతుముని గురించి అమరగాయము చేయు గాయకుల దివ్యగానము వినిపించును.

382. దివ్యనాదము అన్ని భుమికలలొ వినిపించుచునన్నను, ప్రత్యేకించి రెండు, మూడు భూమికలు దివ్యపరిమళములను గుబాళించును. 

383. సూక్ష్మ చైతన్యముగల మానవాత్మ ఇచట సూక్ష్మలోకము యొక్క అనంత ప్రాణశక్తియందు మరింత స్పృహకలిగి యుండును.

గొప్ప శక్తులను ప్రదర్శించును. అంధులకు దృష్టి నిచ్చును. వికలాంగులకు అవయవముల నొసంగును. కొన్ని సమయములందు చనిపోయిన వారిని బ్రతికించును.

స్థూలదేహ చైతన్యముగల సామాన్యుడు తన స్థూలదేహముతో ఖండాంతరములకు ప్రయాణము చేయగలిగినట్లు, ఇతడు సూక్ష్మప్రపంచము యొక్క, వేర్వేరు భూమికలయొక్క వేర్వేరు లోకములయొక్క అనుభవమును కలిగియుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹ష్యము

713వ నామ మంత్రము

ఓం గురుమండల రూపిణ్యై నమః

గురుపరంపర రూపంలో పారమార్థిక జ్ఞానమును ప్రసాదించు పరబ్రహ్మస్వరూపిణికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి గురుమండలరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం గురుమండల రూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఎనలేని భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు ఆధ్యాత్మిక జ్ఞాన సంపదతో విరాజిల్లును. 

గురుమండలము అనగా గురుపరంపర. పరమశివుని నుండి లేదా నారాయణుని నుండి తనవరకూ గల గురువులందరినీ కలిపి గురుపరంపర యని యందురు. అట్టి గురుపరంపరనే గురుమండలమని యందురు. అట్టి గురుమండలమే తన స్వరూపముగా గురుమండలరూపిణీ యను నామాంకిత అయినది.

712వ నామ మంత్రములో చెప్పిన ఈం యొక్క స్వరూపనిశ్చయము  వెనుక చెప్పిన కామకళాస్వరూపురాలగు శక్తిస్వరూపము మిక్కిలి రహస్యమయినది. అందుచేతనే ఆ రహస్యము గురుముఖము నుండియే నిష్కర్షగా తెలిసికొని చేయదగినది అని అర్థము. ఇదంతయు భాస్కరరాయలు వారు చెప్పినది. 

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

గురుపరంపర – కంచి కామకోటి పీఠం
పై శ్లోకంలో ఆది శంకరులవరకూ గల గురుపరంపర వివరణ సదాశివ, నారాయణ, చతుర్ముఖబ్రహ్మ, వశిష్ఠ మహర్షి, శక్తిమహర్షి, పరాశర మహర్షి, వేదవ్యాస మాహర్షి, శ్రీ శుక ఆచార్య,  శ్రీ గౌడపాదాచార్య, శ్రీ గోవిందభగవత్పాద, శ్రీ శంకర భగవత్పాద ఈ గురువులందరి రూపంలోని గురువులందరి రూపంలోను అమ్మవారే గురుప్రభావాన్ని చూపుతుంది గనుకనే ఆ పరమేశ్వరి గురుమండల రూపిణీ అని నామ ప్రసిద్ధమైనది.

గురువులు శిష్యులు వెళ్ళుమార్గమును సరైనది అవునా కాదా అని చూస్తూ ఉంటారు. సరైనది కాకుంటా సరైన మార్గం చూపుతారు.

ఎడతెగని గురు పరాక్రమములో చెప్పబడినప్పుడే ఈ రహస్య స్వరూపము తెలియును. పుస్తకములలో వ్రాసుకుని, చదివి, వల్లెవేసినంత మాత్రమున ఈ రహస్యము తెలియదు. గనుకనే యోగినీ హృదయములో గురువులు చెప్ఫుట, శిష్యులు చెప్పుట అనుక్రమముగా ఈ రహస్యార్థము భూలోకమునకు వచ్చినది అని చెప్పబడెను.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం గురుమండల రూపిణ్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీలలితా సహస్రనామ భాష్యము

139వ నామ మంత్రము

ఓం నిర్గుణాయై నమః

శరీరధర్మములు తప్ప చిద్ధర్మములు గాని గుణములు ఏవియు లేక సకలగుణాతీతయై, నిర్గుణ స్వరూపిణియై తేజరిల్లు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నిర్గుణా యను మూడక్షరముల (త్ర్యైక్షరీ) నామ మంత్రమును ఓం నిర్గుణాయై నమః యని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధన చేయు భక్తులకు ఆ పరమేశ్వరి ఎనలేని సద్గుణ సంపదనిచ్చి జీవనమంతయూ తన భక్థులను ఆ తల్లి తన ధ్యాననిమగ్నతయందుంచి తరింపజేయును.

సాక్షిచేతా కేవలోనిర్గుణశ్చ (సౌభాగ్య భాస్కరం - 343వ పుట) జగన్మాత నిర్గుణురాలు. సాక్షి చైతన్యము. కేవలము. నిర్గుణము. పరమేశ్వరిని లక్షించుటకు గుర్తించుటకు వీలుకానట్టిది. గుణములన్నియు కేవలము పాంచభౌతిక శరీరమునకు మాత్రమే. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత చైతన్యమనెడి అగ్నికుండమునుండి పుట్టినది. శుద్ధ చైతన్య స్వరూపిణి. అగ్నికుండమనెడి చైతన్యమునుండి పుట్టినది. అటువంటి జగన్మాత నిర్గుణ స్వరూపురాలు గనుకనే ఆ తల్లి నిర్గుణా యను నామాంకిత అయినది. దీనిచే తార్కికశాస్త్రము త్రోసిపుచ్చబడినది. తర్కశాస్త్రంలో ఆత్మకు గుణాలున్నాయని నిరూపించారు. ఈ నామంలో తర్కశాస్త్రం ఖండింపబడినది. వృద్ధి, క్షయములు, వికాసము, నాశనము మొదలైన వికారాలన్నీ శరీరధారులకే. కాని జగన్మాత పరమాత్మ. అందుకే శ్రీమాత నిర్గుణా యను నామముతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతింపబడుచున్నది. పదార్థాలననుసరించే లక్షణాలు ఉంటాయి. వేపకాయ చేదుగా ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది. అలాగే శరీరాలను బట్టి గుణాలు ఉంటాయి. అలాగే శరీరాలను బట్టి గుణాలు. ఇంద్రియాలు కూడా అంతే. బుద్ధి వశంలో ఉంటే ఇంద్రియాలు కుదురుగా ఉంటాయి. మనసు వికృతంగా ఆలోచిస్తే భావాలు కూడా వికృతంగా ఉంటాయి. వివక్షత లోపిస్తుంది. ఏది ఏమైనా అరిషడ్వర్గాలు అదుపులో ఉండవలసింది శరీరధారులకే.  పరబ్రహ్మస్వరూపిణికి ఇవన్నీ సంబంధించవు. అందుకే జగన్మాత నిర్గుణ స్వరూపిణి. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిర్గుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

: 🌹. శ్రీమద్భగవద్గీత - 535  / Bhagavad-Gita - 535 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 20 🌴

20.  ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్క్రుత కృత్యశ్చ భారత ||

🌷. తాత్పర్యం : 
ఓ పాపరహితుడా! వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. దీనిని అవగాహన చేసికొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణవిజయమును బడయగలవు.

🌷. భాష్యము  :
సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిపిన ఈ విషయములను ప్రతియెక్కరు యథాతథముగా స్వీకరింపవలసియున్నది. 

ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడును, ఆధ్యాత్మికజ్ఞానము నందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్త్వమును అవగాహనము చేసికొని, అతని భక్తియోగమున నిలుచుట ద్వారా ప్రతియొక్కరు త్రిగుణకల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తియోగమనునది ఆధ్యాత్మికావగాహన విధానము. భక్తియుక్తసేవ యున్న చోట భౌతికల్మషము నిలువలేదు. ఆధ్యాత్మికత్వమును కూడియుండుట వలన భక్తియుక్తసేవ మరియు భగవానుడు అనెడి అంశముల నడుమ భేదముండదు. 

వాస్తవమునకు శుద్ధభక్తి శ్రీకృష్ణభగవానుని అంతరంగశక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడున్నచోట అంధకారమనెడి ప్రశ్నయే ఉదయించనట్లు, ప్రామాణికుడగు ఆధ్యాత్మికగురువు నేతృత్వమున ఒనరింపబడు భక్తియుతసేవ యున్నచోట అజ్ఞానమనెడి ప్రశ్నయే కలుగదు.

శ్రీమద్భగవద్గీత యందలి “పురుషోత్తమ యోగము” అను పంచదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.    
🌹 🌹 🌹 🌹 🌹


Continues....
🌹 🌹 🌹 🌹 🌹
[06:40, 03/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 23  / Sri Devi Mahatyam - Durga Saptasati - 23 🌹
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 6
🌻.ధూమ్రలోచన వధ - 1 🌻

1-2. ఋషి పలికెను : దేవి పలికిన ఈ మాటలు విని కోపంతో ఆ దూత మరలవచ్చి ఆ మాటలను సవిస్తరంగా రక్కసులటేనికి తెలిపాడు.

3–4. అంతట దూత చెప్పిన ఆ మాటలను విని అసురరాజు మిక్కిలి కోపంతో దైత్యాధిపుడైన ధూమ్రలోచనునితో ఇలా చెప్పాడు: “ఓ ధూమ్రలోచనా! నీవు నీ సైన్యసమేతుడవై త్వరితంగా వెళ్లి ఆ దుష్టురాలిని బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకొని లాగి, భయంతో శరీరం స్వాధీనం తప్పునల్గొనర్చి, ఇచటికి తీసుకురా.

5. "ఇతరుడు ఎవడైనా ఆమెను రక్షించడానికి నిలువబడినచో, వాడు వేలుపైనా, యక్షుడైనా, గంధర్వుడైనా వాడిని చంపు.”

6-7. ఋషి పలికెను : శుంభునిచే ఇలా ఆజ్ఞాపించబడి ఆ దైత్యుడు ధూమ్రలోచనుడు అంతట అరువైవేల మంది అసురులతో కూడి శీఘ్రంగా వెళ్ళాడు. 

8. మంచుకొండపై కూర్చొని ఉన్న ఆ దేవిని చూసి, "శుంభనిశుంభుల వద్దకు రమ్ము” అని గట్టిగా అరచిచెప్పాడు.

9. "నీవు ఇప్పుడు నా ప్రభువు వద్దకు ప్రీతితో రాకపోతే, నిన్ను బలాత్కారంగా వెండ్రుకలు పట్టుకుని ఈడ్చి, భయంతో ఒడలిపై స్వాధీనం తప్పేటట్లు చేసి, కొనిపోతాను.”

10-11. దేవి పలికెను : “నీవు అసురపతిచేత పంపబడ్డావు; బలం గలవాడవు; సైన్యసమేతుడవు. నీ విట్లు నన్ను బలాత్కారంగా కొనిపోతే, నిన్ను నేను ఏం చేయగలను?”

12-13. ఋషి పలికెను : 
ఇలా పలుకగా ఆ అసురుడు ధూమ్రలోచనుడు ఆమె వైపునకు పరుగెత్తాడు. అంబిక అంతట హుంకారమాత్రం (“హుం” అని గర్జించుట) చేత అతనిని భస్మీకరించింది.

14. అంతట ఆ అసుర మహాసైన్యం క్రోధంతో అంబికపై వాడియమ్ములను, భల్లములను, గండ్రగొడ్డండ్లను కురిపించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

[06:40, 03/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 96 /  Sri Gajanan Maharaj Life History - 96 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 4 🌻

మీఇద్దరి ప్రవర్తనలూకూడా వేరుగా ఉన్నాయి, మరిమీరు ఆయనని మీసోదరుడు ఎలా అంటున్నారు ? దయచేసి నాకు విసదీకరించండి అని బాలా అన్నాడు. బాలా నువ్వు మంచిప్రశ్న వేసావు అని శ్రీమహారాజు అన్నారు. 

భగవంతుడుని చేరేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. ఇవి అన్నీకూడా నిన్ను ఆత్మజ్ఞానం అనే ఊరుకి తీసుకు వెళతాయి. అవి వేరువేరుగా కనపడి చూసేవాళ్ళని కలవర పెడతాయి. శుభ్రంగా ఉండడం, పట్టుపంచ కట్టుకోవడం, ఎవరినీ ముట్టుకోకుండా ఉండడం రోజూ మూడుసార్లు పూజలు చేయడం, ఉపవాసం ఉండి నిష్టగా, క్రమశిక్షణగా విధులు పాటించడం వంటి వ్యవహారాలు కర్మమార్గానికి సంబంధించినవి. 

ఎవరయితే ఇవి పాటిస్తారో వాళ్ళే నిజమయిన జ్ఞానంఉన్న నిష్టాపరులు. ఈక్రమంలో ఏవిధంగా అయినా వక్రించినా, విశ్మరించినా కర్మమార్గంనుండి వంచితుడవుతాడు. ఈమార్గంలో అతను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మాటలతో నైనా నొప్పించరాదు. 

భక్తిమార్గం ఎన్నుకున్న వారికి మనసు స్ఫటికంలా నిష్కల్మషంగా ఉండాలి. ఒక్కచెడు ఆలోచన ఛాయ వచ్చనా వారు భక్తిరహస్యం నుండి వంచితులవుతారు. క్షమ, ప్రేమ, నిరాడంబరత ఖచ్చితంగా తోడుగా ఉండాలి. అతనికి వేదశా స్త్రీలు వినడం, పూజించడం మీద నమ్మకంఉండి నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. ఇవి భక్తిమార్గానికి అవసరమయిన నియమాలు. వీటిని సాధనచేసిన వారు శ్రీహరిని కలుస్తారు. 

నిజానికి ఆత్మజ్ఞానానికి ఇది అత్యంత సులభమయిన మార్గం, కానీ ఆకాశం ఎలా అయితే మనకళ్ళకు దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందో, ఇది పాటించడం, సాధనచెయ్యడం కర్మమార్గం కంటే కష్టమయినది. ఇప్పుడు యోగమార్గం గురించి విను: యోగమార్గం మిగిలిన రెండిటికంటే కూడా ఎక్కువగా ప్రచలితమైనది, కానీ ఇది మనలోనే ఇమిడిఉంది. 

యోగమార్గం సాధన చేస్తున్నవారికి బయటనుండి ఏదీ అవసరంలేదు. ప్రపంచంలో ఏమయితే ఉన్నాయో అవిఅన్నీ మనలోనే మనం చూడవచ్చు. అలాలోపల ఉన్నవాటి సహాయంతో మనం యోగమార్గాన్ని అనుసరించాలి. దీనికోసం రేచక, కుంభక ఆసనాలు గూర్చి తెలియడం అవసరం మరియు ఇద, పింగళ నాడులగూర్చి, ధౌతి, ముద్రాతతక్ గూర్చి జ్ఞానం అవసరం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 

శ్వేతాశ్వతరోపనిషత్తు

జగదోద్భావానికి కారణాలను  కూలంకషంగా  చర్చించ బడుతోంది.

2.వ మంత్రము

కాలఃస్వభావోనియతిర్యదృచ్చాభూతానియోని   

పురుష ఇతి చిత్యాః సంయోగ ఏషాం న త్వాత్మభావా

దాత్మా ప్యనీశః సుఖదుఃఖ హేతోః

కాలం, ప్రకృతి ఈ జగత్తుకు కారణం కాజాలవని


ఈ మంత్రం సూచిస్తున్నది. 

       కాలము, స్వభావము ( ప్రకృతి ) నియమము యదృఛ్ఛ,అనుకోకుండా, కాకతాళీయం అంటుంటాం.

పంచభూతాలు ( పదార్ధాలు ) ప్రకృతి పురుషులు. ఇవన్నీ వేరువేరుగాకాని, అన్నీ కలిసికాని ఈ సృష్టికి  కారణాలు కాజాలవు. ఎందువలననంటే కాలము, స్వభావము మొదటనే సృష్టింప బడ్డాయి కాబట్టి. కావున ఇవి సృష్టికి కారణభూతాలు కావు. ఇవన్నీ కూడి తమతమ ఆత్మకు ఆధీనంలో ఉన్నాయి. అట్లే జీవాత్మకూడా ఈ సృష్టికి కారణం కాదు. ఈ జీవాత్మకూడా సుఖదుఃఖాలకు, శుభాశుభిలకు  వశీభూతమై ఉన్నది. అందుకూడా జీవాత్మకూడా 

జగత్కారణం కాదు. 

              మొదటి కారణం కాలం. పదార్ధాలు రూపాంతరము చెందుటకు కాలం కారణమౌతోంది.

అందువల్ల కాలం కారణమని వీరి వాదన. వీరు కాలవాదులు. కాని ఇది తప్పు. కాలం మన ఊహలో ఒకభాగం మాత్రమే.వర్తమానంభూతంగామారుతోంది. భవిష్యత్తు వర్తమానమౌతోంది. ఎన్నో జీవులు పుడుతున్నాయి. గిట్టుతున్నాయి. ఈ మార్పులనను క్షణం గ్రహించే ఆత్మ ఉన్నది. అగ్ని, ఉష్ణం మీద కాలం యొక్క ప్రభావం కనిపించదు. 

            కాబట్టి, స్వభావం ప్రకృతే జగత్కారణం అని దీనికి విరుధ్ధవాదన. కాని ఒక వస్తువు యొక్క స్వభావము ప్రరబ్దానికి అధీనమై ఉన్నది. కాబట్టి ప్రారబ్దమే జగత్తు కారణమన్నారు కొందరు. వీరిని నియతి వాదులంటారు. విశ్వంలో ప్రకృతి కూడా ఒకభాగమే. అట్టి ప్రకృతిని జగత్తుకు కారణంగా చెప్పలేము. ఈ ప్రకృతిని గ్రహించుటకు ఆత్మ అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఈ విశ్వానికి కారణం దాని ప్రకృతి ( సహజధర్మం ) కానేకాదు.

     

             ఈ ప్రకృతిలో ఒక నియమం, పధ్ధతి, సమన్వయం కనిపిస్తోంది. కాబట్టి నియతి వాదులు ప్రకృతీ జగత్కారణమన్నారు. కాని ఈ నియమము విశ్వానికి దానిని గుర్తించే ఆత్మకుఅతీతమైనది కాదు.  తమబుధ్ధికి జ్ఞానానికతీతమైనదాన్ని యాదృచ్చికంగా తలుస్తారు. ఇక చార్వాకులు పంచభూతాలే ( పదార్ధాలే ) సృష్టికి కారణ మంటారు. అవిభాజ్యమైన పరమాణువులు కలయికచే పదార్ధోత్పత్తి జరిగిందంటారు. కినీ ఆ పరమాణు వులుకూడా సృష్టిలోని భాగమేగదా. వాటికి ముందు వాటిని గుర్తించే ఆత్మ ఉందికదా. కాబట్టి పదార్ధానికి కూడా విశ్వకారణంగా చెప్పటానికి వీలులేదు.  సాంఖ్యులు సత్వరజోస్తమోగుణాల సామ్యావస్థను ప్రకృతి అని, ఆప్రకృతినుండి మహాతత్వం, మహాతత్వంనుండి అహఃకారము, ఐహంకారమునుండి పంచతన్మాత్రలు ఏకాదాదశ ఇంద్రియాలు. పంచతన్మాత్రల నుండి పంచభూతాలు పుడుతున్నాయని అంటారు. అయితే జడమైన ప్రకృతిలో స్వతంత్ర వ్యాపారాన్ని నిర్వర్తించే సామర్ధ్యం ఉఃడదు. ఏదో ఒక సత్తవల్ల జడమైన ప్రకృతిలో వ్యాపార సామర్ధ్యం వస్తోంది. కాబట్టి అట్టి సత్త జీవాత్మయైన పురుషుడే జగత్కారణమంటారు

మీమాంసకులు.   ఈ పురుషుడు కూడా వెనుకచెప్పిన కాలం మొదలైనవి ఏమీలేకుండా చేయలేదు. కాబట్టి వీటి సమిష్టియే జగత్కారణమనాలి. కాని సంఘాతం ఇతరుల కొరకు జరుగుతుంది. ఇది శేషము‌ ఆత్మ శేషి అవుతుంది. శేషము ఎప్పుడూ శేషికి లోబడి ఉంటుంది. స్వతంత్రం కాదు. కాబట్టి జీవాత్మను ఈ జగత్తుకు కారణ మనవచ్చును. కానీ జీవాత్ముడు కూడా స్వతంత్రుడుకాదు. వానికి సుఖదుంఖాలు న్నాయి. జీవాత్మగా చెప్పుకునే అహంత సుషుప్తి నుండి జాగ్రత్ స్వప్నాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నది. కాబట్టి ఈ జీవాత్మను కూడా నియంత్రించే ఒక శక్తి వేరే ఏదో ఒకటి ఉన్నదని స్పష్టమవుతోంది.

                                                     ( సశేషం )



🌹 🌹 🌹 🌹 🌹
[06:40, 03/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 68, 69 / Sri Lalitha Chaitanya Vijnanam  - 68, 69 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా

🌻 68. 'చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా' 🌻

చక్రరాజమను రథము నధిరోహించిన శ్రీదేవి యని, రథమునందామె చుట్టును సర్వాయుధములు పరివృతమై అలంకరింప బడినవని అర్థము.

శ్రీ చక్రమే రథము. అది చక్రరాజము, రథరాజము. చక్రమనగ తిరుగుచు త్రిప్పునది. రథమనగా ముందుకు సాగునది. అమ్మ,
సృష్టి చక్రమును త్రిప్పుచు జీవులనందు తిరుగాడ చేయుచున్నది. సర్వలోకములందు జీవుల కదలిక ఆమె కదలికయే. సృష్టిచక్రము త్రిప్పుచుండగ జీవులందు తిరుగాడుచుందురు. రథమునకు పురోగమనము తిరోగమనము గలవు. రథమందలి ఆయుధములన్నియు, సృష్టియందు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు యేర్పడి యున్నవి. 

అంతియే కాదు, సమస్తమైన ఆత్మజ్ఞాన ఆయుధములు కూడ అందున్నవి. యోగ సాధన లన్నియు గానుపోవు వున్నత స్థానము శ్రీ చక్రమే. శ్రీ చక్ర రథమును చేరినవాడు శుద్ధ విద్యయందు ప్రవేశించును. శుద్ధ విద్యయందు జగత్తును చైతన్యమయముగ చూచుట నియమము. 

అట్లు చూచినచో తనపై తనకు ఈశత్వము కలుగును. ఈశత్వమున చేరిన జీవుడు దానియందే సాధనా బలమున స్థిరబడినచో సదాశివుని పాదములను స్పృశించిన వాడగును. క్రమశః సదాశివత్వమును పొందును. అప్పుడు తానే బ్రహ్మమని తెలియును. విశ్వమంతా తానే నిండియున్నాడని తెలియును. అట్లు తెలియుటయే శుద్ధవిద్య. 

తెలియక పోవుట వలన భేదబుద్ధి కలుగును. భేదబుద్ధి అవిద్య,  శ్రీచక్రము రథరాజమని కూడ తెలుపబడినది. ఈ రథమునకు ధ్వజము ఆనందము. దీనికి తొమ్మిది కోణములు కలవు. అవియే నవావరణములు. అమ్మ మరియొక రథము ఏడు కోణములతో నుండును. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మ పేరు 'మంత్రిణి'. 

అమ్మకు మరియొక రథము కలదు. దానికి ఐదు కోణములు కలవు. దానిని అమ్మ అధిష్ఠించినపుడు అమ్మను 'ప్రాణి' అందురు. ఈ మూడు చక్రములు మూడు లోకముల వలె ప్రకాశించుచున్నవి. అందు ఉత్తమోత్తమమైనది. శ్రీచక్రమని తెలియవలెను. వీని వివరణములు
ముందు నామములతో యింకను తెలియబడును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

 సనత్కుమారుని బోధలు



12. సర్వమూ బ్రహ్మమే

ఆధ్యాత్మిక విద్య మరొకరు ఎంతగా వివరించినా మనకు అనుభవంలోకి వచ్చేవరకూ అర్థం కాదు. కనుకనే అది రహస్యమైంది. మనలోనే ఉండి కూడా మనకు తెలియక పోవడం చేత అది దుర్లభమైంది. సమస్తసృష్టికి బ్రహ్మమని పేరు. సృష్టిలో అదితప్ప మరొకటి లేదు. అందుకే అది "కేవలం" అయింది. ఈ సత్యాన్ని దర్శించి , అనుభవించిన సత్పురుషుల ద్వారా మాత్రమే దీనిని వినేందుకు మనకు అర్హత, అవకాశం ఉంటాయి. అట్టి బ్రహ్మమును గురించి ఋభు మహర్షుల వారు వివరిస్తున్నారు. బ్రహ్మేతర మైనది ఏదైనా అసత్యమే. అసత్యం కానిదల్లా బ్రహ్మమొక్కటే !
58-మంద్రగీత🌷
 🕉🌞🌎🌙🌟🚩

🥀జ్ఞానయోగము🥀

37. మంట కన్నా కట్టె పెద్దది కదా! అయినను ఎన్ని కట్టెలైనను మంటలో కాలిపోవును. జ్ఞానము నందు సర్వ కర్మల పాపములు భస్మమగును.


*38. నిప్పు కన్నా కాల్చగల వస్తువేది? అట్లే 
జ్ఞానము కన్నా పవిత్రము చేయగల శక్తి లేదు. ఈ మార్గమున యోగ సంసిద్ధి పొంది జ్ఞానమను వెలుగును చూసి అందు ప్రవేశించి నీవే ఆ వెలుగై జీవింతువు. అట్టి స్థితినే ఆత్మను పొందుట అందురు.*


39. దీనికి ఆచరణలో నిరంతరత్వము ఆవశ్యకం, ఇది తప్ప వేరు భావము లేకుండునట్లు మరల మరల ఈ భావము లోనికి నీవు సర్వ కర్మలతో ప్రవేశించు చుండవలెను. ఇట్లు విడువకుండుటను శ్రద్ధ అందురు. దానితో నీవు జ్ఞానమై నీ ఇంద్రియములు నీవగుదువు. అప్పటి అనుభూతే ఉత్తమశాంతి. ఇది ఈ మార్గమున స్వల్పకాలంలోనే సిద్ధించును.


40. ఈ మార్గము పట్టక, వ్యక్తులను, పనులను, పదార్థములను వేరుగా చూచుట అశ్రద్థ అనబడును. దానివలన అజ్…
[14:25, 03/11/2020] +91 92915 82862: 81) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

అనువృత్తేఽ పీశసృష్టే ద్వైతే తస్య మృషాత్మతామ్ ౹ బుద్ధ్వా బ్రహ్మద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదినః ౹౹40౹౹

40.ఈశ్వరసృష్టమగు ద్వైతము నశింపకున్నను అది మిథ్యయని తెలిసికొని అద్వైతవాది అద్వయమగు బ్రహ్మబోధను పొందగలడు.


ప్రలయే తన్నివృత్తౌ తు గురుశాస్త్రా ద్యభావతః ౹ విరోధి ద్వైతాభావేపి న శక్యం బోద్ధు మద్వయమ్ ౹౹41౹౹

41.ప్రళయమునందు ద్వైతప్రపంచము నశించును. గురువు శాస్త్రము మొదలైనవేవీ ఉండవు.ఇట్లు ద్వైతముపశమించినను,నిద్రలో వలె,ఎవరికిని అద్వయ బ్రహ్మబోధ కలుగుట లేదు.


అబాధకం సాధకం చ ద్వైత మీశ్వరనిర్మితమ్ ౹ అపనేతుమశక్యం చేత్యాస్తాం తద్ద్విష్యతే కుతః ౹౹42౹౹

42.ఈశ్వరనిర్మితమైన ద్వైతము అద్వయ బ్రహ్మజ్ఞానమునకు భాధకము కాదు.మీదు మిక్కిలి సహకారము కూడ.దానిని నిర్మూలించుట కూడా అసాధ్యమే.కనుక దానిని ఉండనిమ్ము.దాని పట్ల ద్వేషమెందుకు?


జీవద్వైతం తు శాస్త్రీయమశాస్త్రీయమితి ద్విధా ౹ ఉపాదదీత శాస్త్రీయమాత్త్వస్యావబోధనాత్ ౹౹43౹౹

43.జీవసృష్టమైన ద్వైతము శాస్త్రీయము అశాస్త్రీయము అని రెండు విధములు.తత్త్వము అవగతమగునంత వరకు శాస్త్రీయమగు జీవద్వైతము మనస్సున ఉంచుకొనవలెను.


శాస్త్రములు సూచించిన విధముగా  
మోక్ష స్థితిలో నెలకొన్నవారు తమ చైతన్యము ఆత్మవైపు ప్రసరించునుగనుక,ఈ ప్రపంచదృశ్యమను సముద్రమును నిశ్చింతముగా దాటుదురు.


కానీ దుఃఖమును,గందరగోళమును మాత్రమే కలిగించు తార్కిక వాదమను వలలో చిక్కుకొన్నవారు తమ పరమ శ్రేయమును పోగొట్టుకొందురు.


శాస్త్రములు చూపిన మార్గ విషయమున గూడ వ్యక్తియొక్క ప్రత్యక్షానుభవముమాత్రమే అతనిని సురక్షితమగు పరమగమ్యపు దారివెంట నడుపును.


శుద్ధచైతన్యమే రజోగుణవశమున
"నేను"
అను మలినభావనను పెట్టుకొని తన సహజమగు ప్రకాశరూపమును విడువకయే అహంకార,ప్రాణ,దేహ,ఇంద్రియాది వికృతరూపమును అనుభవగోచరముగావించుకొనును


ఈ వికృతరూపము నిజముగా అసత్యమయినను,(నేను అను) అహంకారము ఇది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాంతిజెందును.


లోభికి పిడికెడు బూడిద తప్ప మిగులునదేమున్నది?
కానీ ప్రపంచమును గడ్డిపోచకంటె తక్కువ విలువ గల దానినిగా భావించు వ్యక్తి ఎన్నటికిని దుఃఖమును పొందడు.


తన స్వీయధర్మముతో తృప్తిచెందక తాను విన్న ఉపదేశముపట్ల ఆసక్తుడయి సత్యమార్గమున నడుచుటకు గట్టిగా ప్రయత్నించువానిని మాత్రమే మానవునిగా పరిగణింతురు.


శాస్త్రముల ఆదేశములను అనుసరించుచు వ్యక్తి సహనముతో సిద్ధికొరకు నిరీక్షింపవలెను,అది తన సమయమున లభించును.


మోక్షము కొరకు ఈ పుణ్య శాస్త్రమమునధ్యయనము చేయుచు అధోగతిని అరికట్టుము.
"ఇది కేవలము ప్రతిబింబమే"అని తెలిసికొనుచు నిరంతరము సత్యతత్త్వమును విచారింపుము.


దురదృష్టము అత్యుత్తమమగు అదృష్టము.అందరు తిరస్కరించుటే విజయము.

🕉🌞🌏🌙🌟🚩
[14:25, 03/11/2020] +91 92915 82862: 81) కఠోపనిషత్తు

ఇపుడు హిరణ్యగర్భతత్వాన్ని గూర్చి వివరించ పూనుకుంటున్నారు. సాధకులందరూ ఈ హిరణ్యగర్భ తత్వాన్ని దర్శన రూపంగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.


 ఎనిమిది తనువులు కలిగినటువంటి ఈ ప్రయాణంలో జీవ తనువులు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈశ్వర తనువులు. ఈ ఎనిమిది తనువుల సమాహారమైనటువంటి ‘నేను’ విశ్వుడుగా ప్రారంభించి, విరాట్ పురుషుని వరకు పరిణామం చెందుతూ ఉన్నాడు.


        మరల విరాట్ పురుషుని దగ్గర నుండి పరమాత్మ వరకు పరిణామం చెందుతూఉన్నాడు. ఈ పరిణామం అంతా కూడ పిండాండ బ్రహ్మాండ పంచీకరణల యందు స్పష్టంగా బోధించబడుతూఉంది.  జాగ్రత్ సాక్షి యైనటువంటి విశ్వుడు, స్వప్న సాక్షి యైనటువంటి తైజసుడు, సుషుప్తి సాక్షి యైనటువంటి ప్రాజ్ఞుడు, తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ- విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మలు. 


ఇదే ప్రత్యగాత్మ అనంత విశ్వానికి విరాట్ పురుషుడు గా ఉన్నాడు. పురుష సూక్తం వర్ణించినటువంటి ఏ పురుషుడైతే అక్షర పురుషుడు గా ఉన్నాడో , ఆ అక్షర పురుషుడే ఈ విరాట్ పురుషుడు.


        ఈ విరాట్ పురుషుడు మరల ఈశ్వర తనువులలో స్థూలదేహాన్ని కలిగి ఉన్నాడు. ఈశ్వర తనువులలో స్థూలదేహ సాక్షి - విరాట్ పురుషుడు, సూక్ష్మదేహ సాక్షి - హిరణ్యగర్భుడు, కారణ దేహ సాక్షి- అవ్యాకృతుడు, మహాకారణ దేహ సాక్షి- పరమాత్మ. అయితే జీవ తనువులలో తురీయసాక్షి యైనటువంటి ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో మహాకారణ దేహసాక్షి యైనటువంటి పరమాత్మ అభిన్నులు. ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులు. జ్ఞాత, కూటస్థుడు అభిన్నులు.


        అయితే సర్వ వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యానికి హిరణ్యగర్భుడుగా సాక్షిగా ఉన్నటువంటి స్థితియందు అనంత విశ్వాన్ని తన లోకి గ్రహించి, గర్భిణీ స్త్రీ వలే ఉన్నాడట. అదీ పోలిక. ఇక్కడ ప్రతిచోట ఒక ఉపమానాన్ని ఉద్దేశిస్తూ, ఆ ఉపమానాన్ని వివరించి చెబుతూ, అదే రీతిగా సృష్టి యొక్క పరిణామాన్ని కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మొదటినుండి. 


ఈ నడక చాలా ఉత్తమమైన నడక అన్నమాట. ఇది సిద్ధాంతరీత్యా బోధించినట్లుగా బోధించితే, దర్శనరీతిగా గ్రహించ కలిగి నటువంటివారు సత్శిష్యులు. అలా కాక ఆ సిద్ధాంత రీతిని కొద్దిగా తగ్గించి, అందుబాటు లోకి వచ్చేటట్లుగా వివరణ వ్యాఖ్యాన సహితంగా బోధించినపుడు సూచన స్థాయి నుండి వ్యాఖ్యాన స్థాయికి దిగిపోతుంది బోధ.


        సూచన స్థానంలోనే దర్శన రీతిగా చెప్పగానే గ్రహించేటటువంటి సమర్ధుడైనవాడు శిష్యుడైతే, వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధోపదేశం తరువాత అర్ధమయేటటువంటి వాడు, బౌద్ధికంగా అర్ధం చేసుకుని, వివరణాత్మకంగా అర్ధం చేసుకుని, సాధనగా స్వీకరించేటటువంటివాడు శిష్యుడు.


 వ్యాఖ్యాన సహితమైనటువంటి బోధను అందుకోలేనటువంటి వారికి ఉపమాన పద్ధతిగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ దర్శన విధిని అనుసరించినటువంటి వికాసాన్ని పొందనటువంటి వారున్నారో వారిని ఉద్దేశించి, వారికి అర్ధం కావటం కోసమని వ్యాఖ్యానాన్ని ఉపమాన స్థాయికి తీసుకువస్తారు.


ఉపమాన స్థాయి లో బోధించినపుడు అది సర్వులకు అనుసరించేటటువంటి వారందరికి కూడ, వారి వారి జీవితాలలో అనుభవనీయమై ఉన్న అంశాన్ని ఉపమానంగా స్వీకరిస్తారు.


 అంటే అనుభవనీయమైన స్థితిలో స్వీకరించడడం వల్ల ఉపమాన పద్ధతి సులభంగా అనుసరించే వారందరికీ అర్థం అవుతుంది. కాబట్టి ఇలా అనుసరించే వారు, శిష్యులు, సత్శిష్యులు అని మూడు రకములైనటువంటి వారు ఉంటారు. అయితే శిష్యులలో మరల సాధకులై, నిరంతరాయంగా ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయాణంలో అలసి విశ్రాంతి తీసుకునే వారు కూడ ఉంటారు. సత్శిష్యులు అలా విరమించె వారు ఎవరు వుండరు. గమ్యం చేరే వరకూ వారు ఆగరు. వారే సత్శిష్యులు.


        ఇక అనుసరించేవారు అవకాశం ఉన్నపుడు చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ [on and off] లో వుంటారు అన్నమాట. అవకాశం కుదరలేదు అండి, సాధ్యం కాలేదు అండి అనేటటువంటి ఎక్షప్సనన్ క్లాజస్ [exceptional clauses] అంటే దాని ఏమంటారు అంటే.. ఎగ్సంప్షన్స్ [exemptions] అడుగుతూ ఉంటారు అన్నమాట.


 ఇవ్వాళ అవకాశం చిక్కలేదు అండి లేదంటే ఇవ్వాళ కుదరలేదు అండి, రేపు ప్రయత్నిస్తాను అండి అని తమోగుణ ధర్మం కలిగినటువంటివారు అనుసరించేవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్ధతను సంపాదించాలి.

🕉🌞🌏🌙🌟🚩
[14:27, 03/11/2020] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

అధ్యాత్మ సంకీర్తన
రేకు: 243-6
సంపుటము: 3-247.


అంతటి దైవమ వటు గాఁగా
చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము!!
॥పల్లవి॥


వెరవునఁ బంచమవేద సారములు
సిరుల నిను నుతించిన నుతులు
సరవితోడి బహుశాస్త్రసంతతులు
నిరతిఁ జెప్పెడిని నీకథలు!!
॥అంత॥


కొంగుపైడియగు గురుమంత్రంబులు
సంగడి వైష్ణవసంభాషలు
నింగికి భూమికి నిజపురాణములు
సంగతిగల నీ సంకీర్తనలు!!
॥అంత॥


వూనిన విధుల మహోపనిషత్తులు
నానాగతి నీనామములు
వీనులకును శ్రీవేంకటేశ మీ-
జ్ఞానార్థములు మిముఁ జదువు చదువులు!!
॥అంత॥

🕉🌞🌎🌙🌟🚩

కీర్తనలో అర్ధాలు:
--------------------------
 
వెరవునఁ = ఆశ్చర్యంతో

సరవితోడి = ఒప్పుగాను

నిరతి = ఆసక్తి

సంగడి = దానితో పాటు

వూనిన = ఆధారమైన

*****
భావామృతం
-----------------------
అంత గొప్ప దేవుడవు అయినందువలన నీ దగ్గరగా ఉండటమే గొప్ప. ఆశ్చర్యంతో పంచమవేదాల సారములు దేవతలు నిన్ను కీర్తించిన స్తోత్రాలు ఒప్పుగా అనేక శాస్త్రాలసారం. నీకథలు మిక్కిలి ఆసక్తి కలిగించేవి. సులభమైన గురు మంత్రములు దానితోపాటు వైష్ణవుల సంభాషణలు పరలోకంలోను ఇహలోకంలోను నిజమైన పురాణములు విషయము కల నీ సంకీర్తనలు. నీవే అని ఆధారముగా చెప్పగల పనులు మహాపనిషత్తులు పలువిధములైన నీ పేర్లు చెవులకు శ్రీవేంకటేశ మీ జ్ఞానార్ధములు మేము చదివే చదువులు అంటు అన్నమయ్య కీర్తించాడు.

🕉🌞🌏🌙🌟🚩
[14:30, 03/11/2020] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము||
షష్ఠ స్కంధము/ 22వ దశకము - అజామిళోపాఖ్యానము వర్ణనము-5-శ్లోకం:-*
🕉🌞🌎🌙🌟🚩

అముం చ సంపాశ్య వికర్షతో భటాన్ విముంచతేత్యారురుధుర్భలాదమీ।
నివారితాస్తే చ భవజ్ఞనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్।।

భావము:-

అజామిలుని తమపాశములతో యమభటులు లాగుకొని పోవుచుండగా, అతనిని వదలివేయమని, విష్ణు పార్షదులు వారిని గట్టిగా అడ్డగించిరి. అట్లు అడ్డగించబడిన యమకింకరులు - విష్ణు పార్షదులకు, అజామిలుని పాపపంకిల జీవితవృత్తాంతము నంతయు తెలిపిరి (అతనికి యమలోకమే సరియైనది అని అనిరి).

వ్యాఖ్య:-

నిన్నటి శ్లోకంలో యమభటులకు విష్ణు పార్షదులు అడ్డుపడడం చూశాము. అలా తమ ప్రయత్నానికి విఘ్నం కలిగించిన వారిని తేరిపారజూచిన  యమదూతలు వారిని "ఎవరు మీరు? చూడ్డానికి చక్కగా ఉన్నారు. మీ రూపాలు, ధరించిన భూషణాలు అద్భుతంగా ఉన్నాయి. మా ధర్మాన్ని పాటిస్తుంటే ఎందుకు అడ్డుపడ్డారు" అని అడిగారు. 


అప్పుడు విష్ణుదూతలు మీరు యమభటులైతే మాకొక సంగతి చెప్పండి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? మీరు ఎవరిని ఎందుకు దండిస్తారో, ఇతడిని ఎక్కడికి తీసుకొని పోబోతున్నారో చెప్పండి అని అడిగారు. యమభటులు వారికిలా సమాధానం చెప్పారు. 


"వేదసమ్మతమైన కార్యం ధర్మం. వేదవిరుద్ధమైనది అధర్మం. హరిరూపమే వేదం కాబట్టి అది అనుసరణీయం. ప్రాణకోటికి ప్రకృతే ధర్మాధర్మాలను తెలియజేస్తుంది. కర్మచేసేవాడికి శుభమో, అశుభమో కలగకమానదు. బ్రతికి ఉన్నప్పుడు పుణ్యం, పాపం ఎంత చేస్తాడొ అంతగా దాని ఫలాన్ని చనిపోయాక అనుభవిస్తాడు. యముడు అంతర్యామి. జీవులుచేసే మంచిపనులు, చెడుపనులు గమనిస్తాడు. వాటికి తగినవిధంగా ఫలాన్నిస్తాడు. ప్రాచీనకర్మలవల్ల వర్తమానదేహం ఏర్పడుతున్నది. కాని పూర్వజన్మ జ్ఞాపకం లేనందున కార్యకారణ సంబంధం తెలుసుకోలేరు. వర్తమాన వసంతకాలంలో పువ్వులు, పండ్లు చూసినవాడు గత వసంతకాలంలో ఉన్నవి, రానున్న వసంతకాలంలో ఉండేవి ఊహించగలిగినట్లే గతజన్మ, భావిజన్మలలో జరిగినవి, జరగబోయేవి ఈ జన్మలోని కర్మలను బట్టి ఊహించుకోవచ్చు. 


పూర్వజన్మ సంస్కారబలం వలన గుణస్వభావాలు ఏర్పడి తదనుగుణమైన కర్మలు చేయడం జరుగుతుంది. వాటిని బట్టే స్థూల సూక్ష్మ శరీరాలు కలుగుతాయి. ఇదంతా ప్రకృతిపురుషుల కలయిక ఫలితం. పరమేశ్వరుని సేవించితే ప్రకృతి దూరమవుతుంది. 

🕉🌞🌎🌙🌟🚩
గీతా మకరందము.
           శ్రద్ధాత్రయ విభాగ యోగము
🕉🌞🌏🌙🌟🚩  

అవతారిక - ఇక మూడువిధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు - 


ఆహార స్త్వపి సర్వస్య 
త్రివిధో భవతి ప్రియః | 
యజ్ఞస్తపస్తథా దానం 
తేషాం భేదమిమం శృణు || 

తాత్పర్యము:- ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. ఆలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి (చెప్పెదను) వినుము.


వ్యాఖ్య:- ఆహారాదులను నాలుగింటిని గుఱించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధనక్రమములో ఆహారశుద్ధి ప్రప్రథమమైనది.


 ఆహారశుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగలేనిచో మనస్సున్ను మలినముగానుండుటవలన దానివలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండును.


ప్రశ్న:- ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్నివిధములుగ ప్రియమై  యుండును? 

ఉత్తరము:- వారివారి గుణముననుసరించి మూడు విధములుగ ప్రియమైయుండును (సత్త్వగుణము గలవారికి సాత్త్వికాహారము - ఈ ప్రకారముగ).

 🌹. గీతోపనిషత్తు  - 66 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 4. పరిణామము  -మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె.  కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము.  🍀


[17:18, 03/11/2020] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 263 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 
62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 2 🌻

చిక్కని కాటుక కాంతి గల సతి స్ఫటికమువలె ప్రకాశించు దేహముగల శివుని సమీపములో చంద్రుని ప్రక్కన మేఘపంక్తి వలె భాసిల్లెను(20).అపుడా దాక్షాయణీ మిక్కిలి ప్రసన్నురాలై భక్త వత్సలుడగు శివునకు చేతులు జోడించి అనేక నమస్కారములను చేసి, ఆయనతో నిట్లనెను (21).

సతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవ! ప్రభూ! జగత్పాలకా! నా తండ్రికి తెలుపుడు జేసి నన్ను యథావిధిగా వివాహమాడి స్వీకరించుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు మహేశ్వరుడు సతీ దేవి యొక్క ఈ మాటను విని, ఆమెను ప్రేమతో చూచి 'అటులనే అగుగాక!'అని పలికెను (23). దాక్షాయణి కూడా శంభునకు నమస్కరించి భక్తితో విన్నవించి ఆజ్ఞను పొంది ప్రేమతో ఆనందముతో నిండిన మనస్సుగలదై తల్లి వద్దకు వెళ్లెను (24). 

శివుడు కూడా హిమవత్పర్వత మైదానములోని తన ఆశ్రమములో ప్రవేశించి, దాక్షాయణి వియోగముచే అతి కష్టముతో ధ్యానమును చేయ మొదలిడెను (25). వృషభధ్వజుడగు శంభుడు మనస్సును నియంత్రించుకొనెను. ఓ దేవర్షీ! ఆయన లౌకిక ప్రవృత్తి నాశ్రయించి, మనస్సులో నన్ను తలంచెను (26).

త్రిశూలి, మహేశ్వరుడు నగు హరుడు నన్ను స్మరించగా ఆయన యొక్క సిద్ధిచే ప్రేరితుడనై నేను ఆయన ముందు వెంటనే నిలబడితిని (27). వత్సా! శివుడు సతీవియోగముతో హిమవత్పర్వతముయొక్క మైదానములో ఉండెను. నేను సరస్వతితో గూడి అచటకు చేరుకుంటిని (28). ఓ దేవర్షీ! సతీదేవి యందు దృఢమైన ప్రేమగల ఆ శంభు ప్రభుడు ఉత్కంఠతో గూడి యుండెను సరస్వతితో గూడి వచ్చిన నన్ను చూచి ఆయన ఇట్లు పలికెను (29).

శంభుడు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నేను వివాహము చేసుకొనగోరి స్వార్ధ పరుడనైనాను. ఇప్పుడు నాకు స్వార్థచించనయే నా స్వభావమన్నట్లు తోచుచున్నది (30). దక్షుని కుమార్తె యగు సతి నన్ను భక్తితో ఆరాధించెను. ఆమె చేసిన నందా వ్రతము యొక్క ప్రభావముచే ఆమెకు నేను వరమునిచ్చితిని (31). 

హే బ్రహ్మన్‌! 'నాకు భర్తవు కమ్ము' అని ఆమె వరమును నానుండి కోరెను. నేను ఎంతయూ సంతసించి యుంటిని. 'నా భర్యవు కమ్ము' అని అంటిని (32). అపుడు దక్షపుత్రియగు ఆ సతీ దేవి నాతో నిట్లనెను. హే జగత్ర్పభో! నా తండ్రికి నివేదించి నన్ను స్వీకరించుము (33).

హే బ్రహ్మన్‌! ఆమె భక్తిచే సంతసిల్లిన నేను దానికి కూడా అంగీకరించితిని. ఓ బ్రహ్మా! ఆమె తన భవనమునకు తల్లి వద్దకు వెళ్లెను. నేనిచటకు వచ్చితిని (34). కావున నీవు నా ఆజ్ఞచే దక్షుని గృహమునకు వెళ్లుము. దక్షుడు నాకు ఆ కన్యను వివాహములో శీఘ్రముగా ఇచ్చు తీరున దక్షునకు నచ్చ జెప్పుము (35). నాకు ఈ సతీవియోగము నుండి విముక్తి కలుగు ఉపాయము ననుష్ఠింపుము. నీవు అన్ని విద్యల యందు దిట్టవు. ఆ దక్షని ఒప్పించుము (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:18, 03/11/2020] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 151 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి  - 25 🌻

ఆ తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయనకు మిత్రులకంటే శత్రువులే ముందర కనబడ్డారు. అప్పుడు నారదుని స్మరించగానే, ఆయ్న ప్రత్యక్షమై, “ఓ ధర్మరాజా! నువ్వు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వారు నీకు శత్రువులుకారు. ఇక్కడ దుఃఖపడ్డావంటే అది నీ అజ్ఞానమే. ఇది ఇంకా నీలో ఉండటంచేతనే వీళ్ళు నీకిలా కనబడుతున్నారు. 

భూలోకంలో ఉన్న శత్రుభావం ఆ శరీరాలు పోగానే పోతుంది. ఆ శరీరాలకు, ఆ అహంకారాలు మాత్రమే శత్రువులుకాని, జీవాత్మకు శతృత్వం ఉండదు. అది అక్కడతోతే నశిస్తుంది” అన్నాడు.

రామాయణంలోకూడా రాముడు ఈ మాటను లక్షమణుడికి చెప్పాడు. రావణుడు మృతుడైన తరువాత, రాముడు లక్ష్మణుడితో, “లక్ష్మణా! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకు పంపించే ఏర్పాట్లు చెయ్యి. ఆయన గొప్ప పండితుడు, బరాహ్మణుడు. వేదవేదాగములు చదువుకున్నవాడు. మహాతపస్వి. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి ప్రసన్నుణ్ణీచేసుకుని దర్శనం చేసుకున్న మహా వరప్రసాది. ఆయాన్ సామాన్యుడు కాడు. మనకంటే అనేక విధాల పూజ్యుడు” అన్నాడు. 

అప్పుడు లక్ష్మణుడు ఆయనతో, “శ్రీరామచంద్ర ప్రభూ! ఆయన శరీరాన్ని సగౌరవంగా లంకకౌ పంపించమన్నావు! ఆయన మనకు శత్రువు. మనను అవమానించి బాధించాడు కదా! అటువంటివాడిని నేను ఎలా సగౌరవంగా పంపుతాను?” అన్నాడు. 

అందుకు రాముడు, “శత్రుత్వాలు మృత్యువు తోటే పోతాయి. శత్రుత్వం ఇద్దరిమధ్యన ఉన్నప్పుడు, ఇద్దరూ మృతి చెందితేనే శతృత్వంపోతుందని అనుకోరాదు. వాళ్ళలో ఒక్కళ్ళు చనిపోయినా  శతృత్వం పోయినట్లే! ఆ ఇద్దరిలో బ్రతికిఉన్నవాడి మనస్సులో పోయిన వాడి యడల శతృత్వం ఉండకూడదు. 

శతృవు నశించిన తరువాత, శతృత్వం నీ ఒక్కడి హృదయంలోనే ఉండటంచేత అది నీకే నరకహేతువు అవుతుంది. ద్వేషించతగిన వస్తువు నశించింది. ద్వేషం ఆ తరువాతకూడా ఇంకా అతడిలో ఉంటే, అది నరకహేతువు. 

కాబట్టి ఆ దృష్టితో చూస్తే రావణడు మనకు శత్రువు కానేరడు. ఆయన ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి శత్రువేలేడు మనకు. ప్రస్తుతం, పూజ్యుడైన బ్రాహ్మణ రూపంలో సగౌరవంగా జాగ్రత్తగా ఆయనను పంపించు” అన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[17:18, 03/11/2020] +91 98494 71690: 🌹. శివగీత  - 105  / The Siva-Gita - 105 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 14
🌻. పంచ కోశో పాసన  - 1 🌻

శ్రీరామ ఉవాచ :-
భగవన్ ! యదితే రూపం - సచ్చిదానంద విగ్రహమ్,
నిష్కలం నిష్క్రియం శాంతం -నిరవధ్యం నిరంజనమ్. 1
సర్వ ధర్మ విహీనం చ - మనో వాచామగో  చర మ్,
సర్వ్యాపిన మాత్మాన - మీక్షతే సర్వత స్థ్సితమ్  2
ఆత్మ విద్యాత పోమూలం - తద్బ్ర హ్మో పనిషత్పరమ్,
అమూర్తం సర్వ భూతాత్మా - కారం కారణ కారణమ్ 3
యత్త దదేశ్య(?) మగ్రాహ్యం - తద్గ్రాహ్యం వా కధం భవేత్,
అత్రో పాయ మజా వాన - స్తేన భిన్నోస్మి శంకర ! 4
శృణు రామ ! ప్రవక్ష్యామి - తత్రో పాయం మహా భుజ !,
సగుణో పాస నాభిస్తు - చిత్తై కాగ్ర్యం విధాయచ. 5

శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ భగవంతుడా!  జ్ఞానానంద మాయమై ఆశములు లేక క్రియలు లేక దోషములు  లేక శాంతమై సామాన్య ధర్మ హీనమై వాచామ గోచరమై సర్వ 
వయాపియై యుండి ఆత్మ విద్యాత పంబులకు మొదల్కొని  బ్రహ్మోపనిషత్తుల కంటెను పరంబైన అమూర్తమైన సమస్త భూత స్వరూపంబయ్యు నిట్టిదని నిరూపించుటకును, గ్రహించు టకును, వీలు లేని దైన యెడల దానిని తెల్సి  కొనుట కెట్లు  సాధ్య పడును? ఉపాయమేమిటో తెలియక ఖిన్నుడ నైతిని ( ఉపాయము చెప్పుము). 

శ్రీ భాగావాను ఉవాచ! ( శివుడు ఆదేశించు చున్నాడు)  రామా ! ఉపాయమును వివరించెదను వినుము.  సగుణో పాసనము చేతనే మొట్ట మొదట చిత్తై కాగ్రతను నేర్చి స్తూలారుంధతీ న్యాయమున పిదప వాని యందు చిత్తమును ప్రవర్తింప చేయవలెను. 

 (స్తూలారుందతి న్యాయమనగా ప్రక్కనున్న నేదో ఒక గొప్ప నక్షత్రమును మొదట చూపి పిదప క్రమముగా నిజమైన సూక్ష్మముగా  నున్న అరుంధతీ నక్షత్రమును చూపుత ) అట్లుగానే నిర్గుణ పరబ్రహ్మను  తెలిసి కొనుటకు ముందు సగుణో పాసనము చేత చిత్తై కాగ్రత మాని  నిర్గుణుడను, పూర్వోక్త లక్షణ లక్షితుండనగు నన్ను తెల్సి కొనవలయును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹  

[17:18, 03/11/2020] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 90 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు,  మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు  - 12 🌻

384. ముడు-నాలుగు భూమికల మధ్య :

ఆధ్యాత్మిక యానములో మూడు నాలుగు భూమికల మధ్యనున్న స్థితి మహా ప్రమాదకరమైనది.అది సాధకులను మంత్రముగ్దులను గావించు ఆకర్షణలతో నిండియుండును. దీనిని ముకామ్-ఏ-హైరత్ అందురు.

చాలామంది ఈ ప్రమాద పరిస్థితినుండి దాటి ముందుకు నాల్గవ భూమికకు పోవుదురు.

సాధకుడు ఇచ్చట ఒకసారి ఆగినచో, అతడు ఆ స్థితినుండి బయటపడుట దుస్సాధ్యము. ఇతడు ఈ స్థితి నుండి తప్పించుకొని బయటపడి ముందుకు వెళ్లని యడల అతని ప్రగతి అంతటితో నిలిచిపోవును. కొన్ని సమయములందు, రోజుల తరబడి లేక, నెలల తరబడి లేక, సంవత్సరముల తరబడికూడా అతడు అట్లే నిలిచిపోగలడు.

ఈ స్థితియందు చిక్కుకున్న సాధకుడు ముందుకు పోలేడు, వెనుకకు రాలేడు. అతడు భౌతికమందు గానీ సూక్ష్మమందుగాని ఎరుక లేకుండును.

అతను స్పృహలేని వాడను చెప్పుటకు వీలులేదు.ఎందుచేతననగా, అతడు చిక్కుకొనియున్న అసమ్మోహిత స్థితియందు స్పృహకలవాడైవున్నాడు కాన జీవన్మృతుడై ఉన్నాడు.

సాధకుడు ఈ స్థితియందు చిక్కుకొని ప్రారంభములో అతడు శారీరకంగా ఏస్థితియందుఉండునో. అనగా ఏ భంగిమలో ఉండునో అదే భంగిమలో ప్రతిమవలె అట్లే ఉండిపోవును. ఆ విధముగా కన్పించిననూ వాస్తవంగా సామాన్యుని కంటే ఉత్సాహవంతుడై యుండును.

ఈ స్థితి యందున్నవాడు బయటపడవలెనన్నచో అతనికి మరణమైననూ సంభవించవలెను. లేదా ఏ సద్గురువు యొక్క సహాయమైనను కావలెను. అప్ప్పటి వరకూ అతడు అట్లే యుండును.

ఈతనిని సద్గురువు వెనుకకు మూడవ భూమికకు తీసుకుని పొవును, లేదా ముందుకు నాలుగవ భూమికకు త్రోసివేయును.

చాలా అరుదుగా ఈ స్థితియందున్న సాధకుడు భగవదనుగ్రహము వలన, ప్రమాద రూపములో 5వ భూమికకు 6వ భూమికకు మధ్య ఇదేమాదిరి వాసీకరణ స్ధితిలోనికి ముందుకు లాగబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:18, 03/11/2020] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53  / Sri Vishnu Sahasra Namavali - 53 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

🌻 53. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ‖ 53 ‖

చిత్త నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀. 494) ఉత్తర: - 
అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

🍀. గోపతి: - 
గోవులను పాలించువాడు.

🍀. గోప్తా - 
సర్వులను సంరక్షించువాడు.

🍀. జ్ఞానగమ్య: - 
జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

🍀. పురాతన: - 
సృష్టికి పూర్వమే వున్నవాడు.

🍀. శరీరభూతభృత్ - 
శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

🍀. భోక్తా - 
అనుభవించువాడు.

🍀. కపీంద్ర: - 
వానరులకు ప్రభువైనవాడు.

🍀. 502) భూరిదక్షిణ: - 
యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

[21:20, 03/11/2020] +91 95058 13235: 3.11.2020   సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము

విదర్భుని వంశ వృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

24.19  (పందొమ్మిదవ శ్లోకము)

కుకురో భజమానశ్చ శుచిః కంబలబర్హిషః|

కుకురస్య సుతో వహ్నిర్విలోమా తనయస్తతః॥8171॥

 24.20 (ఇరువదియవ శ్లోకము)

కపోతరోమా తస్యానుః సఖా యస్య చ తుంబురుః|

అంధకో దుందుభిస్తస్మాదవిద్యోతః పునర్వసుః॥8172॥

 24.21  (ఇరువది ఒకటవ శ్లోకము)

తస్యాహుకశ్చాహుకీ చ కన్యా చైవాహుకాత్మజౌ|

దేవకశ్చోగ్రసేనశ్చ చత్వారో దేవకాత్మజాః॥8173॥

 24.22  (ఇరువది రెండవ శ్లోకము)

దేవవానుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః|

తేషాం స్వసారః సప్తాసన్ ధృతదేవాదయో నృప॥8174॥

 24.23  (ఇరువది మూడవ శ్లోకము)

శాంతిదేవోపదేవా చ శ్రీదేవా దేవరక్షితా|

సహదేవా దేవకీ చ వసుదేవ ఉవాహ తాః॥8175॥

సాత్వతుని తనయులలో ఒక్కడైన అంధకు…
[02:59, 04/11/2020] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[03:03, 04/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

714వ నామ మంత్రము

ఓం కులోత్తీర్ణాయై నమః

కులము (ఇంద్రియాల గుంపు), మనస్సులచే ఎరుగబడనిదైన (అతీంద్రియ స్వరూపిణియైన) జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కులోత్తీర్ణా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కులోత్తీర్ణాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు సాధకుడు   ఆ తల్లి కరుణచే తన ఇంద్రియాలను  సన్మార్గంలోనికి నడిపించుకొని నిరంతరం భగవద్ధ్యానంలో జన్మతరింపజేసికొనును.

జగన్మాత ఇంద్రిసముదాయమునకు గోచరించనిది. అనగా సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా అని లలితాసహస్రనామస్తోత్రంలో  చెప్పినట్లు  ఆతల్లి ధరించిన వస్త్రములు, సుమమాలలు మొదలైనవి వన్నిటితోనూ, దోషరహితమైన అవయవ సొంపుతో ఉండి సర్వాభరణ భూషితయైన ఆ తల్లిని ఈ చర్మ చక్షువులతో చూడలేము, నిజసల్లాపమాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ యను నామ మంత్రములో చెప్పినట్లు ఈ శరీరంలో ఉన్న  చెవులతో  సరస్వతీ దేవియొక్క కచ్ఛపీ వీణానాదమునకన్నా మధురమైన ఆ తల్లి పలుకులను వినలేము, చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా  యను నామమంత్రములో చెప్పినట్లు సంపంగి, అశోక, పున్నాగ పుష్పసౌగంధములలరిన ఆతల్లి శిరోజముల సౌగంధము గాలిలో తేలియాడుతూ మన శరీరంలోని ఘ్రాణేంద్రియమైన నాసికా రంధ్రములను తాకదు, ఒకవేళ తాకినా గ్రహించలేము, అలాగే సుధాసారాభివర్షిణీ అను నామమంత్రంలో చెప్ఫినట్లు సహస్రారంలోని చంద్రమండలమందు స్రవించు అమృతధారలు, నానా రకాల భౌతికప్రపంచ పదార్థముల షడ్రుచుల మేళవింపుల రుచిమరిగిన జిహ్వను చేరనేలేవు, ఆ అమృతధారలలోని మధురిమలు ఈ నాలుకతో రుచి కూడాచూడలేము. ఇంకనూ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా అను నామ మంత్రములో చెప్పినట్లు పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణములతో భాసిల్లు పదద్వయంపై ఈ శిరస్సును తాకించినను ఆ పాదస్పర్శలోని దివ్యత్వాన్ని తెలియలేము.  ఎందుకంటే నేను అనే భ్రాంతిని విడచి, పరమాత్మలోనైక్యమునంది జీవన్ముక్తుడైతేనే తెలియగలముగాని లేకుంటే కులము (భౌతిక శరీరమందలి ఇంద్రియాల గుంపు) వలన గాని, ఈ శరీరముపై మమకార పూరితమైన మనసుతోగాని ఆ తల్లిని తెలియలేనంత అతీంద్రియ స్వరూపిణి అయినది జగన్మాత. 

కులము అంటే అజ్ఞానము. అజ్ఞానానికి గురువురూపంలో జ్ఞానోపదేశంచేసి, సాధకుణ్ణి కడతేర్చేది పరమేశ్వరి. అందుచే కులోత్తీర్ణా యను నామముతో ఆ తల్లి స్తుతింపబడుచున్నది.

ఆ  తల్లికి నమస్కరించునపుడు ఓం కులోత్తీర్ణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[03:03, 04/11/2020] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

140వ నామ మంత్రము

ఓం నిష్కలాయై నమః

శరీరభాగములైన అవయము లేవియు లేక నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహన్ర నామావళి యందలి నిష్కలా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం నిష్కలాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు సాధకుడు ఆ తల్లి కరుణచే సుఖసంతోషములతో, ఇష్టకామ్యార్థసిద్ధితో బాటు ఆత్మానందమును పొంది జన్మతరించినదను తృప్తినందును.

కలా అనగా అంశము, భాగము, అవయవము అని నిఘంటువులో అర్థములు గలవు. శరీరములోని భాగములు అని అనుకుంటే అవయవములు. నిష్కలా అని అంటే శరీరములోని భాగములు అనగా అవయవములు లేనిది. అవయవములు అనేవి శరీరధారులకే. జీవాత్మలకే శరీరములు ఉంటాయి. శుద్ధచైతన్య స్వరూపురాలు, పరబ్రహ్మ అయిన పరమేశ్వరి దేహధారికాదు.  గాన జగన్మాత నిష్కలా యని అనబడినది.

శ్లో. ధ్యానం యా నిష్కలా చింతా నిరాధారా నిరాశ్రయా|

న తు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే॥ (సౌభాగ్య భాస్కరం ర, 344వ పుట)

ధ్యానమనునది నిష్కలచింత. అది నిరాధారము, నిరాశ్రయము అయి ఉన్నది. శరీరము, ముఖహస్తాదులు  అని వివిధ అవయవములు కల్పించి చేయునది ధ్యానము కాదు. ముఖ్యంగా తెలియవలసినది ఏమంటే పరబ్రహ్మనుండి ఉద్భవించిన జీవసముదాయానికి అవయవములు ఉన్నవి గాని ఆ పరమాత్మకు లేవు. అందుచే పరమాత్మ అయిన జగన్మాత నిష్కలా యని అనబడినది. నిష్కళా అనగా కళాతీతురాలు. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నిష్కలాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[03:03, 04/11/2020] +91 95058 13235: 4.11.2020   ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

నవమ స్కంధము - ఇరువది నాలుగవ అధ్యాయము

విదర్భుని వంశ వృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

24.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

తస్యాం స జనయామాస దశ పుత్రానకల్మషాన్|

వసుదేవం దేవభాగం దేవశ్రవసమానకమ్॥8180॥


24.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

సృంజయం శ్యామకం కంకం శమీకం వత్సకం వృకమ్|

దేవదుందుభయో నేదురానకా యస్య జన్మని॥8181॥

24.30 (ముప్పదియవ శ్లోకము)

వసుదేవం హరేః స్థానం వదంత్యానకదుందుభిమ్|

పృథా చ శ్రుతదేవా చ శ్రుతకీర్తిః శ్రుతశ్రవాః॥8182॥

24.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

రాజాధిదేవీ చైతేషాం భగిన్యః పంచ కన్యకాః|

కుంతేః సఖ్యుః పితా శూరో హ్యపుత్రస్య పృథామదాత్॥8183॥

శూరుని వలన మారిష యందు పదిమంది పుత్రులు జన్మించిరి. వారు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవనుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, శమీకుడు, వత్సకుడు, వృకుడు - వీరు అందరును పుణ్యపురుషులు. వసుదేవుడు జన్మించినప్పుడు దేవదుందుభులు, ఆనకములు (ఢంకాలు లేదా తప్పెటలు) మ్రోగుటచే ఆయనకు ఆనక దుందుభి అను పేరు ఏర్పడెను. అవతారపురుషుడైన శ్రీకృష్ణునకు తల్లిదండ్రులైన దేవకీ వాసుదేవులు ధన్యాత్ములు. ఈ మారిష శూరులగు వసుదేవాది పుత్రులేగాక పృథ (కుంతీదేవి), శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి అను పుత్రికలును గలరు. వసుదేవుని తండ్రియైన శూరునకు (శూరసేనునకు) కుంతిభోజుడు అను మిత్రుడు గలడు. అతనికి సంతానము లేకపోవుటచే ఈ శూరుడు తన కూతురైన పృథను కుంతిభోజునకు  దత్తత ఇచ్చెను. కుంతిభోజునిచే పెంచబడినంధున పృథకు కుంతి అను పేరు వచ్చెను.

24.32 (ముప్పది ఒకటవ శ్లోకము)

సాఽఽప దుర్వాససో విద్యాం దేవహూతీం ప్రతోషితాత్|

తస్యా వీర్యపరీక్షార్థమాజుహావ రవిం శుచిమ్॥8184॥

24.33 (ముప్పది మూడవ శ్లోకము)

తదైవోపాగతం దేవం వీక్ష్య విస్మితమానసా|

ప్రత్యయార్థం ప్రయుక్తా మే యాహి దేవ క్షమస్వ మే॥8185॥

కుంతీదేవి సేవలకు సంతుష్టుడైన దుర్వాసమహాముని ఆమెకు దేవహూతి అను (దేవతలసు ఆహ్వానించు) పవిత్రమైన విద్యను (మంత్రమును) ఉపదేశించెను. ఒకనాడు కుంతీదేవి ఆ మంత్రప్రభావమును పరీక్షించటకై పరమపవిత్రుడగు సూర్యభగవానుని ఆహ్వానించెను. వెంటనే సూర్యనారాయణుడు ఆమె ముందు నిలిచెను. అప్ఫుడు ఆమె మిగుల ఆశ్చర్యపడుచు - 'స్వామీ! నా మంత్రశక్తిని తెలిసికొనుటకై దానిని స్మరించితిని. నా అపరాధమును క్షమించి, నీవు నీ స్థానమునకు చేరుము' అని ప్రార్థించెను.

24.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

అమోఘం దర్శనం దేవి ఆదిత్సే త్వయి చాత్మజమ్|

యోనిర్యథా న దుష్యేత కర్తాహం తే సుమధ్యమే॥8186॥

24.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఇతి తస్యాం స ఆధాయ గర్భం సూర్యో దివం గతః|

సద్యః కుమారః సంజజ్ఞే ద్వితీయ ఇవ భాస్కరః॥8187॥

24.36 (ముప్పది ఆరవ శ్లోకము)

తం సాత్యజన్నదీతోయే కృచ్ఛ్రాల్లోకస్య బిభ్యతీ|

ప్రపితామహస్తామువాహ పాండుర్వై సత్యవిక్రమః॥8188॥
అంతట సూర్యభగవానుడు ఆమెతో ఇట్లనెను. "సుందరీ! నా దర్శనము అమోఘమైనది. అది నిష్ఫలము కారాదు. నీ కన్యాత్వము  దూషితము కాకుండ, నీకు ఒక కుమారుని అసుగ్రహించెదను". ఇట్లు పలికిన పిమ్మట ఆ మహాత్ముడు ఆమెను గర్భవతిని గావించి దివికేగెను. వెంటనే కుంతీదేవి ఒక కుమారుని గనెను. ఆ శిశువు మరియొక్క భాస్కరుని (సూర్యుని) వలె తేజరిల్లుచుండెను. పిమ్మట ఆమె లోకనిందకు భయపడి ఆ శిశువును ఒక పెట్టెలో నుంచి నదీజలములలోనికి వదలెను. అనంతరము ఆమె నీకు ముత్తాతయు, పరాక్రమ సంపన్నుడును ఐన పాండురాజును వివాహమాడెను.

24.37 (ముప్పది ఏఢవ శ్లోకము)

శ్రుతదేవాం తు కారూషో వృద్ధశర్మా సమగ్రహీత్|

యస్యామభూద్దంతవక్త్రః ఋషిశప్తో దితేః సుతః॥8189॥

పరీక్షిన్మహారాజా! కుంతీదేవీ సోదరియగు శ్రుతదేవను కరూపదేశాధిపతియగు వృద్ధశర్మ పెండ్లియాడెను. ఆమెకు దంతవక్త్రుడు అను కుమారుడు కలిగెను. సనకాది మహర్షుల శాప ఫలితముగా పూర్వజన్మమున దితియందు పుట్టిన హిరణ్యాక్షుడు ఇతడే.

24.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

కైకేయో ధృష్టకేతుశ్చ శ్రుతకీర్తిమవిందత|

సంతర్దనాదయస్తస్యాం పంచాసన్ కైకయాః సుతాః॥8190॥

కుంతీదేవియొక్క మరియొక సోదరియైన శ్రుతకీర్తిని కైకయ దేశ ప్రభువగు దృష్టకేతువు పరిణయమాడెను. ఆ దంపతులకు సంతర్దనుడు (ప్రత్యర్దనుడు) మున్నగువారు ఐదుగురు తనయులు కలిగిరి.

24.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

రాజాధిదేవ్యామావంత్యౌ జయసేనోఽజనిష్ట హ|

దమఘోషశ్చేదిరాజః శ్రుతశ్రవసమగ్రహీత్॥8191॥

జయసేనుడు (జయత్సేనుడు) అనువాడు కుంతీదేవియొక్క మఱియొక సోదరియగు రాజాధిదేవిని వివాహము చేసికొనెను. వారికి విందాను విందులు అను ఇరువురు కుమారులు కలిగిరి. వారు అవంతి దేశమును పాలించిరి. (జయసేనుని వఞన రాజాధిదేవియందు మిత్రవింద అను కూతురుగూడ కలిగెను) చేదిదేశ ప్రభువగు దమఘోషుడు కుంతీదేవియొక్క మఱియొక సోదరియగు శ్రుతశ్రవను (సాత్వతిని) చేపట్టెను.

24.40 (నలుబదియవ శ్లోకము)

శిశుపాలః సుతస్తస్యాః కథితస్తస్య సంభవః|

దేవభాగస్య కంసాయాం చిత్రకేతుబృహద్బలౌ॥8192॥

ఆ దంపతులకు శిశుపాలుడు అను కుమారుడు కలిగెను. అతని పుట్టుకను గూర్చి ఇదివరలో (7వ స్కంధమున) ప్రస్తావింపబడినది. (ఈ శిశుపాలుడే పూర్వజన్మలో హిరణ్యకశిపుడు). వసుదేవుని తమ్ముడైన దేవభాగుని వలన అతని భార్యయగు కంసయనునామె (కంసుని చెల్లెలు) యందు చిత్రకేతువు. బృహద్బలుడు అను ఇద్దరు కుమారులు జన్మించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి నవమ స్కంధములోని ఇరువది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ