శ్రీ కృష్ణ కర్ణామృతం
.......................
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
🌷🙏🙏🙏🌷
13
ప్రణయ పరిణతాభ్యాం ప్రభావాలంభనాభ్యాం
ప్రతి పద లలితాబ్యాం ప్రత్యహం నూతనాభ్యాం
ప్రతిముహు రధికాభ్యాం ప్రస్పుర లోచనాభ్యాం
ప్రభవతు హృదయే నః ప్రాణనాథః కిశోరః !!
14
మాధుర్య వారిది మదాంబు తరంగ భంగీ
శృంగార సంకలిత శీత కిషోర వేషం
ఆమందహాస లలితానన చంద్రబింబం ఆనంద సంప్లవ మమప్లవతాం మనో మే !!
15
అవ్యాజ మంజుల ముఖాంబుజ ముగ్ధభావైః
ఆస్వాద్యమాన నిజవేణు వినోద నాదమ్
ఆక్రీడతా మరుణ పాద సరోరుహాభ్యాం
ఆర్థ్రే మదీయ హృదయే భువనార్ధ్ర మోజః !!
భావము :- ప్రేమ చేత పండినవి. సౌందర్యములకు ఆలంబన మైనవి. అడుగడుగున ఆనందం ఒలికించునవి. నిత్య నూతనమైనవి. ప్రతిక్షణం సుఖము వృద్ధి చేయునవి, అయిన మనోహర నేత్రములతో శోభిల్లు ప్రాణనాధు డైన బాలకృష్ణుడు , మా హృదయమున నిలచు గాక .
సౌందర్య సాగరం నుండి లేచిన మదించిన కెరటాల రూపమైన , శృంగారం తో కూడిన చల్లని బాలుని ఆకారం కలది , అతిశయించిన ఆనందం వలన కలిగిన చిరునగవు చేత మంజుల మైన చంద్రబింబం వంటి ముఖము కలది అయినా శ్రీ కృష్ణానంద ప్రవాహమున నా మనసు తేలియాడు గాక.
సహజ సుందరమైన ముఖారవిందం యొక్క మనోహర భావముల ద్వారా తన వేణుగాన వినోదమును ఆస్వాదించుచు సకల లోకములను చల్లబరిచే శ్రీకృష్ణ తేజో రూపము ఎర్రనైన తన పాదపద్మములు నా హృదయమున విహరించు గాక


శ్రీ కృష్ణ కర్ణామృతం (3 )
చాతుర్త్యైక నిధానసీమ చెపలా పాంగ్ చ్చటామంథరం
లావణ్యామృత వీచి లాలిత దృశం లక్ష్మి కటాక్షదృతమ్
భావము :- గొప్ప నైపుణ్యం ములకు కారణములై,.... చలించు చున్న క్రీగంటి కాంతుల చే శోభించు వాడును ....దివ్య ప్రకాశము లనే అమృత వీచికల చేత కదులుతున్న నేత్రములు గలవాడు ను,.... సైకత శ్రేణులలో వివరించుటకు అనురాగ శక్తులు గలవాడు ను.....మన్మధుని పుట్టుకకు కారణమైన వాడు ను,......సమస్త సౌందర్య రాశి యును, శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేత ఆధరింపబడే వాడును అగు నల్లని బాలుడి ని మేము సేవింతుము
.
సీస పద్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అనురాగ లక్ష్యముతో గొప్ప నైపుణ్య
మంతయు తెల్పుచు ఉన్న కృష్ణ
కదులు నేత్రములు కలిగి దివ్యాతి
దివ్యమై నట్టి కాంతులను కలిగి
మన్మధ జన్మకారకుడు సమస్త శక్తి
సౌందర్య రాశియు ధైర్య లక్ష్మి
శ్రీదేవి తొ కటాక్ష విక్షణ ములచేత
ఆధరింప బడేటి జలజ నయన
తేటగీతి
దివ్యనేత్రములు కలిగి దెరుచునంత
గానపడుచుండు నాకు నిత్యంబు విశ్వ
మేలు మాజ్యోతి కాంచితి కరుణ తోడ
నన్ను రక్షించు శ్రీకృష్ణ సన్ను తింతు
--(())--

శ్రీ కృష్ణ కర్ణామృతం (4 )
బర్హోత్తంస విలాసి కుంతల భరం మాధుర్య మగ్నాననం
ప్రోన్మీలన్నవయౌవనం ప్రవిల ద్వేణు ప్రణదామృతమ్
ఆపీన స్తన కుట్మలాభిరభితో గోపీభి రారాధితం
జ్యోతిశ్చేతసి నశ్చకాస్తి జగతా మేకాభిరామాద్భుతమ్ !!
భావము :- నెమలి పింఛము శిరోభూషణము గా కలిగి ప్రకాశించు దట్టమైన ముంగురుల ముడి కలది. సుందరమైన ముఖము కలది. చక్కగా వికసించిన నవ యౌవనము తో కూడినది. మిక్కిలి మధురమైన వేణునాధ మనే అమృతము కలది అంతట కాస్త బలసిన స్తన మొగ్గలు గల గోపికల చే నలువైపులా సేవించ బడునది . లోకములో సాటిలేని మనోహరమైన మంజుల రూపముతో అద్భుతమైనది అయిన చైతన్య జ్యోతి మా మనసులలో ప్రకాశించుచున్నది.
*****
సీస పద్యము
కురులలో నెమలి పింఛము ధరించినలీల
మగధీరుడు మమత నెరిగి నోడు
చనుగుబ్బ లుబ్బిన గోప భామల మధ్య
దివ్యాకృతి మనోహ రంగ ఉండి
వక్షస్థలాకర్షణలు హౄదయము
స్పదన పరమాత్మ కళల లీల
మంజుల రూపము చైతన్య జ్యోతిగా
మామనసులొ ఉన్న కరుణ కృష్ణ
ఆట వెలది
స్త్రీల హావ భావ విన్యాస లీలలే
మనసు కదిపి మమత పంచు చుండు
కృష్ణ లీల మాయ స్త్రీలలో ప్రేమను
పంచి పంచె విధము గాను తెలుపు
**(())**
సీస పద్యాలు
జయ జయ జయజయ ధ్వనులతొ మనసిచ్చు
మువ్వల శబ్ధాలు గుండె చేరె
గలగల గలగల చెవుల దిద్దుల శోభ
జిలుగు రత్నముల వల్లే మెరిశియు
చక చక చక చక కదిలేటి కనుల చూ
పుల పిలుపులు మనసు నూర డించె
పక పక పక పక నవ్వులు చూసాక
హదయమే తపించె కృష్ణ లీల
ఆటవెలది
నెమలి నాట్య మాడి నట్లుగ నటన తోను
హంస నడకల వలపున పెంచు చుండె
కొంటె చెష్టలు పడచుల మనసు చేరె
కృష్ణ దివ్యవేషములన్ని ప్రగతి కొరకు
**(())**

శ్రీ కృష్ణ కర్ణామృతం -5
మధురతర స్మితామృత విముగ్ద ముఖాంబురుహమ్
మదశిఖిపింఛ లాంచితం మనోజ్ఞ కచ ప్రచయం
విషయ విషామిషగ్రసన గృద్ధుని చేతసి మే
విపుల విలోచనం కిమపి ధామ చకాస్తి చిరమ్
భావము. :- మందహాసం అనే మధురామృతము చే , మనోహరమైన ముఖ కమలం కలదియు మత్తెక్కిన నెమలి పించం చే ప్రకాశించు ముంగురుల సమూహం కలదియు
విశాలమైన నేత్రములు కలది అయినా ఒక అద్భుతమైన ప్రకాశం .......
శబ్దాది విషయములనే విషము కలసిన మాంసమును మ్రింగుట యందు ఆసక్తి కలిగిన నా మనసున....... దివ్యముగా ప్రకాశించుచున్నది.
సీస పద్యము
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మందహాస మనిన అదిఎప్పుడు శుభమే
మధురామృ తముగాను హృదయ చేరు
ముఖ కమలము మనోహరము ఎప్పుడు మన
సునె మత్తు లోననే ముంచి వేయు
నెమలి పింఛముకన్నుల మెరుపు హృదయక
మలము ను చేరియు అద్భుతమ్ము
చూపియు మంసదే హములోన రక్తము
ఉడికియు తెలియని కృష్ణ లీల
మనసు మీమాంస పడుటయు లోక మాయ
దేహము చలించి పోవుట కృష్ణ మాయ
రాగ అనురాగ భావము ప్రేమ మాయ
దేహ మమృత స్వ రూపము జన్మ మాయ
--(())--
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం ...6
ముకుళాయమాన నయవాంభుజం విభోః
మురళీ నినాద మకరంద నిర్భరమ్
ముకురాయమాన మృదు గండ మండలం
ముఖపంకజం మనసి మే విజృఃభతామ్ !!
భావము :- వేణునాదం చేయునపుడు అరమోడ్పు కన్నులు కలది యు మురళి నాదమనే అమృతంతో నిండి నదియు పిల్లనగ్రోవిని ఊదుటచే కాస్త ఉబ్బి అద్దం వలె ప్రకాశించు చెక్కిల్లు కలదియుఅగు శ్రీకృష్ణుని ముఖ పద్మము నా మనసున విలసిల్లు గాక.
****
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం... 7
కమనీయ కిశోర ముగ్ధ మూర్తే
కలవేణు క్వణితాదృతాననేందో
మమవాచి విజృంభతాః మురారేః
మధురిమ్ణః కణకాపి కాపి కాపి !!
భావము :- ఆశపడ్డ తగిన బాల సుందర రూపం కలిగిన వాడు....
అవ్యక్త మధురమైన మురళీరవం చే మిక్కిలి శోధించుచు, చంద్రుని వలె ప్రకాశించు మోము కలిగినవాడు అయినా శ్రీకృష్ణుని సౌందర్యము లేశమాత్రమైనను నా వాక్కు నందు స్పురించు గాక......
శ్రీ కృష్ణ కర్ణామృతము... 7
సీస పద్యము
సుందరు డేకాదు హృదయము లోచేరి
మరవలేని మహాను భావుడున్ను
ఆశలు రేపుతూ ముగ్ధ మోహన రూప
మహిమలు చూపిస్తు దివ్ర శక్తి
పంచుతూ వెన్నల రాజుగా పడచుల
ప్రేమను దోచియు కళలు చూపి
వాక్కుతో వర్ణించలేనట్టి అద్భుత
దేహ సౌందర్య వంతుడులె కృష్ణ
తేటగీత
అన్ని ఒక్కటి గాతెలి పేటి మాయ
ఉన్న దానిలో తృప్తియు కలుగ.చేసి
చెప్ప లేనట్టి మహిమలు చూపు చున్న
చిన్న పెద్దల మన్నన పొందు కృష్ణ
**(())**
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం- ౮
మద శిఖండి శిఖండ విభూషణం
మదన మంథర ముగ్ధ ముఖాంభుజమ్
వ్రజ వధూ నయనాంచల వంచితనం
విజయతాం మమ వాజ్మమయ జీవితం !!
భావము ;- మత్తెక్కిన నెమలి యొక్క పింఛమును శిరోభూషణము గా కలది మన్మధుని పరిహసించు మనోహరమైన ముఖ కమలము కలదీ గోపి వనితల యొక్క క్రీగంటి చూపుల చే వంచింప బడినదినా కవిత్వానికి ప్రాణమైనది అయిన వస్తువు సర్వోత్కర్షముగా శోభించుగాక
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం - 9
పల్ల వారుణ పాణి పంకజం వేణురవాకులం
పుల్లపాటల పాటలీ పరివాది పాదసరోరుహం
ఉల్లాసన్మధురా ధర ద్యుతి మంజరి సరసాననం
పల్లవీ కుచకుంభ కుంకుమపంకిలం ప్రభు మాశ్రయే !!
భావము :- లేత చిగురుటాకుల వంటి ఎఱ్ఱనైన చేతియందు చేరియున్న మురళీ రవముల చే గోపవనితలను కలత పెట్టువాడు ......
వికసించిన గులాబీ పువ్వుల ఎరుపు రంగును పరిహసించు పాదపద్మములు కలవాడు....
ప్రకాశించు అందమైన మోవి కాంతుల చే భాసించు మోము కాలవాడు అగు శ్రీ కృష్ణుని ఆశ్రయించు చున్నాను.
అందంతొ చూపులు - మురళీ రవముల చే
గోపకాంతల కిచ్చి - మనసు దోచె
మురళీ రవంబుచే - పువ్వుల కమలమే
విప్పగా మాధుర్య - మంత దోచె
మఱిమఱి వేణువు - మాధుర్యరుచులచే
గర్ణామృతమొనర్చి - గారవమున
మనసు దృప్తిని చేయు - మాధుర్య పీయూష
మో? యెఱుంగఁగరాదు - మోహనమయి
గోపికలయందు చపలంబు దోఁపఁజేయుఁ
చరిత మునుగల వాడు సుం దరుడుగా
హృదయ తాపము తగ్గించి శాంతి చేయు
మోవి కాంతితొ లోకాల్ని ఏలు వాడు
--(())--
శ్రీ కృష్ణ కర్ణామృతం ...్్10
సీస పద్యము
క్రీగంటి చూపులతో తమ తాపాన్ని
శ్రీకృష్ణ ఎదుటనే చర్చ జరుపు
పడచుల ఆశ్రిత కోరికను కరుణించి
దర్శించి ఎడతెగ ప్రేమ చూపి
సుందరీమణుల మదన మనో వాంఛను
నెరవేర్చి తగినట్టి ఆశ తీర్చి
లీలశుకుడు పున రంకిత మవ్వుచూ
సిధ్ధుల యోగుల కోర్క తీర్చె
తేటగీతి
మధురిమ మనోమయ సుగంధ పరిమళమ్ము
హృదయ లీల మానుష శక్తి బాల కృష్ణ
దోచె నిముషమ్ము మాయక పరవశమ్ము
చెంది మనశాంతి కలిగియు హాయి గుండె
--(())--
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం --11
హృదయే మమ విభ్రమాణాం
హృదయం హర్ష విశాల లోల నేత్రమ్
తరుణం వ్రజ బాల సుందరీణాం
తరళం కించన ధామ సన్నిధత్తామ్ !!
భావము :- మనోహరములైన విలాసములు గల గోపవనితల యొక్క మనస్సును గ్రహించినది .హర్షాతిశయము చే విశాలమై కదులుతున్న నేత్రములు కలది
యౌవనము లో ఉన్నది . వర్ణించుటకు సాధ్యపడనిది .....అయినా దివ్య ప్రకాశం
నా హృదయమున నిలుచు గాక....
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
శ్రీ కృష్ణ కర్ణామృతం ప్రధమాశ్వాసం - 12....
నిఖిల భువన లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం
కమల విపిన వీథీ గర్వం. సర్వం కషాభ్యాం
ప్రణమ దభయదాన ప్రౌడి గాఢోద్ధతాభ్యాం
కి మపి వహతు చేతః కృష్ణ పాదాంభుజాభ్యామ్ !!
భావము :- సకల లోకముల లోని లక్ష్మీదేవి యొక్క ఎడతెగని విలాసము లకు ఆశ్రయము లైనవి పద్మ వన శ్రేణుల గర్వమును నశింప చేయునది ఆశ్రితులైనవారికి అభయప్రదానం చేయుటలో అత్యధికమును కలిగినవి అగు.......
శ్రీ కృష్ణ దేవుని చరణ కమలములు నా మనసున చెప్పనలవి గాని ఆనందమును ప్రసాదించు గాక
Comments
Post a Comment