బ్రహ్మోత్సవ సంకీర్తన
తేటగీతి పద్యాలతో
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
రండి రారండీ, శ్రీవేంక టేశ్వరున్ని
వేడు కుందాము, దుర్లభ మైన స్వామి,
భక్తుల నందరి, క్షేమము చూసె, స్వామి
రండి, రారండీ, వేడుకుందాము రండి ...
అదిగో, హరి రధము కదులుతు ఉంది
ముందర గరుడ ద్వజ కద్లె, ఘంట కద్లె,
సక్రమముగాను తిరిగేటి చక్రము కద్లె,
తిరుమల తిరువీధులలోన ఉండి రయ్య .... .. రం
తోర ణంబులు, తెల్ల గొడుగులు కద్లె
బుట్ట బొమ్మలు, ధీరతు కట్టినట్టి
దివ్య హయములు, సారధి కలిగి ఉండి
పుత్తడి శ్రీనివాసుడు మెరియు చుండె ..... .... రం
శ్రీ హరి రథము మేరుపర్వతము లాగ
మెఱసి పోతు, పసిడికుండ లవియు, కుచ్చు
లవియు, నడుమున శ్రీ వేంకటేశ్వరుడు ఉండె
యురమున యలమేల్మంగయు , వసుధ ఉండె ... రం
హరి నామస్మరణలతో భజన చేయు
వారు నడకతో మెరిసియు తిరుమలాద్రి
చూచు వారికన్నులు తిప్పలేని అంద
మదియు శ్రీవేంకటేశ్వరుని రధ యాత్ర .... రం
lll దైవాన్ని
దైవాన్ని ప్రార్ధ న మనసు ధర్మ మగును
దైవాన్ని తలచు ధైర్యము తేజ మగును
దైవాన్ని స్త్రీ ల మనసును తెల్ప లేము
దైవాన్ని ఎపుడు నమ్ముము తీర్పు చెప్పు
3 ఎప్పుడు పాటించాల్సినవి ఈమూడు
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక।।। 09-10-2020
బ్రహ్మోత్సవ సంకీర్తన (11) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నారి నారి న డుమ మురారి సుకుమార
స్రుతి లయల మేను బంగార మదన రాజ
మామదియుదోచి మందహాసములు ఏల
మమ్ము ఆనదింప దిగిరా చక్ర దారి ।।।
సప్త గిరివాస మునిజన హృదయ వాస
శ్రీధర నవమన్మద నిత్య సత్య వాస
తప్త పుత్తడి భూషణ నిత్య దారి
భూపతే సనాతన ధర్మ రక్ష ధారి
ఆప్త నరుల తృప్తియు కష్ట మాపు దారి
యాగ సంరక్ష దీనజ నోద్ధరనవె
విశ్వ గురునిగా లోకాల రక్షాధారి
అంధ కారము తరిమేటి చక్ర ధారి
సుధలు కురిపించు సుకుమారి వగల మారి
పరమ హంసల తోడుగా నిజము పోరి
శ్వాస ల పయణం గామది లోమయూరి
సున్నితంగా మీటేటి వీణలతొ రాణి
గుహల మాటు మనసుమీటి మదిని దోచు
వయసు దాచి ఏకాంతములో న కలిసె
ఆమె వదనమ్ము సునయణం సుమధురమ్ము
వసుధ అలివేలు మంగమ్మ శ్రీనివాసు
నారి నారి న డుమ మురారి సుకుమార
స్రుతి లయల మేను బంగార మదన రాజ
మామదియుదోచి మందహాసములు ఏల
మమ్ము ఆనదింప దిగిరా చక్ర దారి
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక।।। 08-10-2020
బ్రహ్మోత్సవ సంకీర్తన (10) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తలచి నప్పుడు దర్శింప జేయు వాడు
ఆది మునులకు మోక్షము ఇచ్చి నోడు
అద్భుతాలతో హృదయము దోచువాడు
జీవ నాధార మైనట్టి పురుషు డతడు
ఆగొపెమ్మగృ హమున కీ ర్తించి నోడు
తన విశాల నేత్రములను చూపి నోడు
అల్లరితొ ఆదుకున్నట్టి బాలు డతడు
అన్ని దిక్కుల అమృతము పంచి నోడు।।।। ।।। త
పగలు గొల్లఁపడచులతో అడినోడు
నంద గోకులం అందరి ఆట గాడు
సర్వమును గ్రహించి చిరునవ్వుగలవాడు
ముద్దు లొలుకేటి మువ్వగోపాల డతఁడు।।।। ।।। త
జీవ నాధార మైన మహాను భవుడు
మోక్షదాతయై వెలసిన సత్య భవుడు
రుక్మిణీ సత్యభామల ప్రేమ సఖుడు
వేంకటాచలమున వెంకటేశ్వ రుండు ।।।। ।।। త
తలచి నప్పుడు దర్శింప జేయు వాడు
ఆది మునులకు మోక్షము ఇచ్చి నోడు
అద్భుతాలతో హృదయము దోచువాడు
జీవ నాధార మైనట్టి పురుషు డతడు
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక।।। 07-10-2020
బ్రహ్మోత్సవ సంకీర్తన (9) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏల ఏలా అనియు వేడు కొనుచు ఉన్న
ఎల్ల వేళలా మా కొరకు అలసతివి
స్వామి మాబాధ లెల్లను బాపి ఉండి
ఆలి కడకుపోక వడలి నావు దేవ
1।చరణం
వేకువన నేను మేలుకొని వేలు గాను
నామ జపమతో గోవింద అని పలుకుచు
నిన్ను కోరితి కష్టము బాపు మయ్య
భక్తులకు రక్ష గావేంక టేశ్వ రుడు గాను।।।। ఏ
2చరణం
లోకములు నెల్లగా లాలనలు సలిపియు
పాలనలు చేయు నిత్యము సత్య దేవ
ధర్మముకు కడు రక్షగ ఉన్న దేవ
సర్వ లోకనాయకగాను ఉన్న దేవ ।।।।। ఏ
3 చరణం
సకల జీవుల సంక్షేమ ములను జూసి
విగత జీవుల వేదన లన్ని బాపి
జగతి నంతయు ఏలుచూ సవ్యశాచి
శ్రీని వాసుల దాసుల నేలు దేవ
ఏల ఏలా అనియు వేడు కొనుచు ఉన్న
ఎల్ల వేళలా మా కొరకు అలసతివి
స్వామి మాబాధ లెల్లను బాపి ఉండి
ఆలి కడకుపోక వడలి నావు దేవ
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక
బ్రహ్మోత్సవ సంకీర్తన (8) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శరణు శరణని వేడు కొంటితిని దేవ
జాలి ధీరుడా పాలించు ఆదిమపురుష
శరణు జొచ్చితి సర్వంబు రక్ష చేయ
తెల్పితి సామర్ద్య మంతయు దేవ దేవ
శరణు శరణని వేడు కొంటితిని దేవ
గతియు కర్తవు భర్తవు మాకు నీవు
మతియు అందించు నిత్యమూ మాకునీవు
యితర శక్తుల తోపని ఏమి లేదు
చతురతయు లేదు శరణమే దిక్కు దేవ ।।। శ
తల్లితండ్రులుగా నిన్ను మొక్కి నాము
ఉనికి జీవిత మంతయు సేవ నీకు
మనసు మార్చియు మన్నించ మనియు నిన్నె
మనవి చేసితి శరణ ని వేడు చుంటి ।।।। శ
లోక సాక్షివి నీవె బంధువుగ నీవె
లోక నాయక వేంకటేశ్వర నీవె
నిఖిల మింతయు గాన వేరెవరు లేరు
శరణు జొచ్చితి సర్వంబు రక్ష చేయ ।।।।। శ
శరణు శరణని వేడు కొంటితిని దేవ
జాలి ధీరుడా పాలించు ఆదిమపురుష
శరణు జొచ్చితి సర్వంబు రక్ష చేయ
తెల్పితి సామర్ద్య మంతయు దేవ దేవ
శరణు శరణని వేడు కొంటితిని దేవ
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక
బ్రహ్మోత్సవ సంకీర్తన (7 ) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సర్వమ్ము నీవు, మాయా మర్మమ్మును
గెలిచేటి శక్తిమ్ము, మెలికలు తిరిగే మనసును
నీవే చూడుము, మాయ నుండి రక్షను
కల్పించు, శ్రీవెంకటేశ్వర స్వామి ।।।।
నిను నిత్యమూ కొలిచెద స్వామీ ।।।।।। ।।
మానవాకృతి జన్మ బెత్తినను మాయ
నిన్ను నమ్మికొలిచితిని అంత మాయ
చిత్తము నుతెల్పె ఫలమేమి లేని మాయ
మాధవా భోగములనిచ్చి చేయు మాయ
మరువ లేనుసంసార సు ఖమను మాయ
వదల లేను ఈ ఆహారములను మాయ
మరచెద నిజఙ్ణా నంబును నీదు మాయ
మరచెదను తత్వ పురహశ్యములను మాయ
మరిచెద గురువు దైవము కృష్ణ మాయ
విడువనులె పుణ్య పాపము లవిధి మాయ
విడువనులె ఆశ పాశము ల కల మాయ
విడువనులె తల్లితండ్రుల ప్రేమ మాయ
విడిచెదను వైరాగ్యంబు ను నిధి మాయ
విడిచెదను షట్కర్మంబుల నిత్య మాయ
విడిచె నాచార ములను ఇదియును మాయ
ఎన్ని విడిచిన తప్పదు విష్ణు మాయ
తగిలెద బహు లంప టముల తొనుమాయ
తగిలెద బహు బంధములన్ని చూపు మాయ ।
తగులు మోక్షపు మార్గము తలపు మాయ
నన్ను వెంబడించిన మాయ చూడు దేవ
యెంత అయినను శ్రీవెంకటేశ్వరన్ని
వేడు కుందును అంతర్యామిగను కోరి
నిత్య భక్తితో వెడుతూ ఉన్న నేను
సర్వ మాయల నుజయించు శక్తి నివ్వు
సర్వమ్ము నీవు, మాయా మర్మమ్మును
గెలిచేటి శక్తిమ్ము, మెలికలు తిరిగే మనసును
నీవే చూడుము, మాయ నుండి రక్షను
కల్పించు, శ్రీవెంకటేశ్వర స్వామి ।।।।
నిను నిత్యమూ కొలిచెద స్వామీ ।।।।।। ।।
గోవిందా హరిగోవిందా
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక
బ్రహ్మోత్సవ సంకీర్తన (7 ) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
హూంకారముతో కూడిన గట్టి నిశ్వాసవదిలి అందరూ కకావికలై పారిపోయేట్లు చేసిన హనుమంతుడు వేంకటేశ్వరుని బంటు అయ్యే
ఘనమైన, మానస మహితాత్ముడు
హనుమంతుడు అంజనా తనయుడు
భూతప్రేతపిశాచాలను తరిమే ధైర్యవంతుడు
అయిన వేంకటేశ్వరుని బంటు భక్తాగ్రేసుడు
ముష్టి ఘాతము తో కొట్టె కొందరిన్ని
దానవుల ఆట పట్టించె భీకరరుపు
వాల మంతయు బిరబిరఁ దిప్పి మొత్తె
అక్కడ హనుమంతుడు రక్కసుల్ని చంపె
ధైర్య మునుచూసి లంకలో భయము చెందె
అంబరము తిప్పి గిరగిరా నేల కొట్టె
భుజములు పట్టి దానవు లదర కట్టె
మాల్యవంతుడు హనుమంతుఁడు భయ పెట్టె
గట్టి విశ్వాస మునుచూపి భీకరరుపు
రక్కసుల గుండె దడతోను మరణ మొందె
అందువల్లనే బాలాజి బంటు అయ్యె
అట్టి మారుతి వేంకటేశ్వరుని బంటు
భక్తులందరు నిత్యము కొలుచు చుండు
సర్వ కోర్కలు తీర్చేటి ఘనుడు అయ్యె
దుష్ట శిక్షణ శిష్టుల రక్ష చేయు
అయిన వేంకటేశ్వరుని బంటు అతడె
ఘనమైన, మానస మహితాత్ముడు
హనుమంతుడు అంజనా తనయుడు
భూతప్రేతపిశాచాలను తరిమే ధైర్యవంతుడు
అయిన వేంకటేశ్వరుని బంటు భక్తాగ్రేసుడు
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక
బ్రహ్మోత్సవ సంకీర్తన (6 ) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఈవేళ ఆవేళ ।।।। అనుట ఏలా
సర్వాంతర్యామిని దర్శించవచ్చు అన్నీ వేళల
హరినామమే దిక్కు అన్నీ వేళల
ఇక దిక్కు మారేది లేదు ।।। గోవిందా ।। ఆహార గోవిందా
బాధ చెందియు బాధ్యత చేయు వేళ
భారమునుభరిం చిమనసు చెప్పు వేళ
కులము వలననే మనసులో చేటు వేళ
శ్రీ హరిజపము మొక్కటే గతియు వేళ ।।।। ।।।। ।।।
చెఱవడి వొరుల చేజిక్కి ఉన్న వేళ
మఱచి తప్పిదమును చేసి ఉన్న వేళ
ఆపదలు వచ్చి భయమును తెచ్చు వేళ
శ్రీ హరిజపము మొక్కటే గతియు వేళ ।।। ।।। ।।।
ఆశలకు చిక్కి నష్టించి నట్టి వేళ
పాపమును చేసి పశ్చాతాపమ్ము వేళ
నమ్మియు చెడియు బతుకుతున్నట్టి వేళ
శ్రీ హరిజపము మొక్కటే గతియు వేళ ।।। ।।।। ।।।।
మాపు దాకా పొరలినట్టి మార్పు వేళ
సంకెలకు చిక్కి హాయిని పొందు వేళ
చంప బిలిచిన చచ్చుట కున్న వేళ
శ్రీ హరిజపము మొక్కటే గతియు వేళ ।।।। ।।।।। ।।।
మంకు బుద్ధియు పోరలిన మార్పు వేళ
ఆకలిని తీర్చి దాహము ఇచ్చు వేళ
ఆశ యాల సాధనలకు పంచు వేళ
శ్రీ హరిజపము మొక్కటే గతియు వేళ ।।।। ।।।। ।।।
ఈవేళ ఆవేళ ।।।। అనుట ఏలా
సర్వాంతర్యామిని దర్శించవచ్చు అన్నీ వేళల
హరినామమే దిక్కు అన్నీ వేళల
ఇక దిక్కు మారేది లేదు ।।। గోవిందా ।। ఆహార గోవిందా
--(())--
ప్రాంజలి ప్రభ -- అంతర్జాల పత్రిక
బ్రహ్మోత్సవ సంకీర్తన (5 ) తేటగీతి పద్యాలతో
రచయిత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అదిగదిగో అక్కడా ।।।। అటువస్తున్నాడు శ్రీహరి
తూర్పు వీధిలో సూర్యప్రభ వాహనం మీద వచ్చేది వాడే శ్రీహరి
సోమ వీధిలో చెంద్ర ప్రభ వాహనం మీద వచ్చేది వాడే శ్రీహరి
అదిగదిగో అక్కడా ।।।। అటువస్తున్నాడు శ్రీహరి
రండి హారతు లిచ్చియు మనమూ తరించు దాము రండి
చుట్టరికమును తలపోసి ఉదయ భాను
కమల వికసింప చేసేటి సూర్య వెల్గు
తూర్పు వీధిలో శ్రీహరి ఊరె గింపు
సూర్య వెలుగు తో ఇందిరా రమణ డుండె
హారతు లిచ్చియు మనమూ తరించు దాము
చుట్టరికమును తలపోసి చంద్ర దేవ
కలువ వికసింప చేసేటి చెంద్ర వెల్గు
తారలతొ చుట్టరిక హరి ఊరె గింపు
సోమ వీధిలో వెల్గుతూ చంద్ర రథము।
చెంద్ర వెలుగు తో ఇందిరా రమణ డుండె
హారతు లిచ్చియు మనమూ తరించు దాము
యింతుల మనసును ఆకర్ష మన్మధుండు
రంతుల నదియుఁ కానని చుట్టరికము
ప్రియసఖలతొ కలసియు ఏగుతుండె
వింత రీతిన శ్రీవేంక టేశ్వరుఁ డుండె
హారతు లిచ్చియు మనమూ తరించు దాము
ప్రేమతో సాగునే పేగుబంధమ్ముగా
ప్రేమయే జీవమై ప్రేమభూతమ్ముగా
ప్రేమ రాగమ్ముగా ప్రేరణమ్మేనుగా
ప్రేమ శాంతించునే ప్రేమబంధించునే
తమవిధేయుడు।।మల్లాప్రగడ రామకృష్ణ
0
ఓ మహిళా
మధుచంద్ర।।। UIUIIIU।।।IIUIUU
అహఫ్వానం
తుల్యచేతులు చించియు మై బ్రతుకుగా -- ఉపమానమేగా
మూల్యమై మనసుగా - ముడుపేలె మీకూ
శల్యమై జపముగా -- సంబధమ్ము నీకై
బాల్యమే మనదిగా -- బలమైన నీదే
కాలమే మనదిగా -- కళ లన్నినీవే
విశ్వాస
ప్రాణంగా పదవే స్వపోష పర సేద్భుత సౌలభ్యమే
చేసేదీ మరచీ స్వలాభ పదవే సంపాద ఆకర్షణే
చేసేదీ వదలీ విశేష సేవలో ప్రజల్నె ఒప్పించునే
ప్రాణంగా పదవే వరించి ధనమే పొందేటి సౌజణ్యమే
***
౨
. 1 వ పద్యం
శ్రీ రుక్మిణీశ కేశవ
నారద సంగీతలోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా.ll
భావం:--
శ్రీ రుక్మిణీదేవికి నాథుడవు, జలమున నిద్రించువాడవు, నారద సంగీతమునకు వశడవు గోవర్ధనపర్వతమెత్తి గోపకులమును రక్షించినవాడవు. ద్వారకా వాసుడవు. భక్తులను పాలించువాడవు అగు ఓ కృష్ణా ! దయతో మమ్ము రక్షింపుము.
2 వ పద్యం
నీవే తల్లి వి దండ్రి వి
నీవే నా తోడు నీడ నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా.ll
భావం :--
హే కృష్ణా ! నీవే నా తల్లివి, తండ్రియు, హితుడవు, వీడవలెవెన్నంటి యుండువాడవు, గురుడవు దైవము అయినవాడవు, నా ప్రభుడవు, నాకు ఆధారుడవు అని నమ్మితిని. నిజముగ సుమా !
3 వ పద్యం
నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll
భావం:--
నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.
నేటి ..ప్రాంజలి ప్రభ... తేటగీతి పద్యాలు
మల్లాప్రగడ రామక్రృష్ణ
చూడ బడునవి అన్నియు పూలు కావు
చూడ లేనిది అంతయు చుపు కాదు
మానసిక దర్శనమ్ము యే మధుర చరిత
ద్రష్ట దృశ్యమంత జగతి ధరణి యందు ......
......
తాను తనలోకి చూడక దాచు దాన్ని
గొప్ప శకలంగ ఊహించి బోధ పల్కు
దైవ దర్శనము సులభం ధైర్య మున్న
వ్యక్తి గతపుణ్య మిగులుయె వ్యసన శక్తి.......
......
పరధనమును ఆశించేటి వాని బుద్ధి
పరుల మానము ప్రాణము పంచ బుధ్ధి
పరుల మాటను నమ్మక పాడు బుధ్ధి
పరమ భక్తి యు నటనతో పంచ బుధ్ధి......
......
కలియుగ మనషి బతుకుకు కామ్య బుధ్ధి
చపల చిత్తుని మార్చిన చిత్ర బుధ్ధి
తెలివి తెల్లారే సరికళ్ళ తెప్ప బుధ్ధి
తగిన రీతిలో భార్యతో తపన బుధ్ధి......
......
కుసుమ కోమల హృదయాన చూపు చేరి
వీణ నాదసంగీతము విద్య చేరి
పరిమళించియు ఆనంద పరిమళమ్ము న
నిత్య మెరుపుల కదలిక నీడ మనసు ....
......
........
చతుర్విధ పురుషార్ధాలు:- ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు.
::మనం నాలుగు పదార్థాలం:- అవి దేహం, మనస్సు, బుద్ధి, ఆత్మ.
అందువలన : దేహానికి - కామం, :: మనస్సునకు - అర్థం, :: బుద్ధికి - ధర్మం
:: ఆత్మకు - మోక్షం కావాలి...
ధ్యాన 'యజ్ఞం':- సంకల్ప రహితంగా శ్వాసపై నిలచిన మనస్సే - యజ్ఞకుండం
శ్వాసే - ఆహుతులు. మరి మనస్సు అనుభవించే శూన్యత్వమే - యజ్ఞ ఫలం...
Comments
Post a Comment