Mantra pushpam

 🌹. మంత్ర పుష్పం  - భావగానం  🌹

రచన ✍️. శ్యామలారావు, సేకరణ 

హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక  పుష్పం ఇచ్చి  వేదం లోని మంత్రపుష్పం చదువు తారు. ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి  గర్భగుడి లోని దైవానికి సమర్పిస్తారు . వేదం లో భాగమైనది మంత్ర పుష్పం.

ఇది దైవం గురించి ఆయాన విశిష్టతను తెలుపు తుంది. మంత్ర పుష్పం మొత్తం 34 శ్లోకముల దైవ తత్వ మంత్రరాజము. 

🌻. మంత్ర పుష్పం - 1

ఓం ధాతా పురస్తాద్య ముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః

తమేవం విద్వానమృతమిహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే


భావ గానం:

అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి, ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి

ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి , అదే అందరికి అమృత మార్గమ నోయి

వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి. 


🌻. మంత్ర పుష్పం 2.

 సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం

విశ్వం నారాయణం దేవం  అక్షరం పరమం పదం

భావ గానం: 

అంతటా తలలున్న దేవమోయి, అంతటా కనులున్న దైవమోయి, అన్ని లోకాల శుభ  దైవమోయి

విశ్వమంతానిండిన దైవమోయి, నశించని నారాయణుడోయి, ముక్తి నీయు పరంధాముడోయి.


🌻. మంత్ర పుష్పం  3.


విశ్వతః పరమాన్నిత్యమ్ విశ్వం నారాయణగ్o హరిమ్

విశ్వమే వేదం పురుషస్త  ద్విశ్వ ముపజీవతి


విశ్వము కన్నా ఉన్నతుడోయి,  అందరిలోనుండు ఆత్మోయి, శాశ్వత పోషకుడు హరోయి

సర్వాత్మడు పరమాత్ముడోయి, ఈ విశ్వ లోకాల కారకుడోయి, ఆ దైవమే విశ్వానికి తోడోయి

🌻. మంత్రపుష్పం   4.

పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o  శాశ్వతగ్oశివమచ్యుతమ్

నారాయణం మహాజ్ఞ్యేయమ్ విశ్వాత్మానం పరాయణం


భావగానం:

పతిలా పోషించువాడు, లోకాలకు ఈశ్వరుడు, శాశ్వితుడు శుభకరుడు, సకల లోక ఉన్నతుడు

సకల జీవ నాయకుడు, అతడు నారాయణుడు, అతడు మహా దేవుడు, లోకమంత ఆత్మ వాడు

పూజింప తగు దేవుడు, 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

. మంత్ర పుష్పం ... తేటగీతి పద్యాలు 1&౨


అన్ని దిక్కులు రక్షించు వాని నోయి

బ్రహ్మ పూజించి సుఖించి తెల్పె నోయి

ఆది దైవము తెలిసిన చాలు నోయి

అదియు అమృతమార్గమును దేవేంద్ర నోయి


అంతటా తలలున్నట్టి దైవ మోయి

అంతటా కనులున్నట్టి దైవ మోయి

అన్ని లోకాలు సుఖము దైవ మోయి

విశ్వ మంతట నిండిన దైవ మోయి


నిత్య సత్య వ్రతుడు గాను దైవ మోయి

ముక్తి నిచ్చుపరంధామ లీల నోయి

నిత్య భక్తనారాయణ లీల నోయి

సర్వ రక్షణ కల్పించు దైవ మోయి

--(())--

మంత్ర పుష్పం ... తేటగీతి పద్యాలు 3&4

!!3 !!

విశ్వమయ ఉన్నతోత్తమ శిధ్ధు డోయి

అందరి హృదయ ఆత్మగా నుండు నోయి

శాశ్వతముగ రక్షకుడుగ నుండు నోయి

సర్వ ఆత్మల పరమాత్మ ఈశ్వ రోయి  


విశ్వ నారాయణ పరం ఆత్మ నోయి 

విశ్వ లోకాల కారకు డుగను నోయి 

విశ్వమునకు దైవముయేను తోడు నోయి 

విశ్వ వేదపురుషుడుగ ఉండు నోయి  


!!4!!

భర్త గాపోషణను చేయు ఈశ్వరుండు 

లోకములకు శాస్వితుడు శుభకరుడు 

సకల లోకమున ఉన్నతుడుగ నటుడు   

సకల జీవము నకునాయ కుడగు నతడు

  

సర్వ ముశివనారాయణ తత్వ పరుడు    

లోకమున ఆత్మ పరమాత్మ కలిగి నోడు 

అతడు సమ్మోహు లకు మహా మహుడుశుభుడు 

నిత్య పూజింప దగిన వాడు శుభకరుడు 

--(())--

🌹. మంత్ర పుష్పం  - భావగానం - 3  🌹

🌻. మంత్ర పుష్పం  5. 🌻

నారాయణ పరో జ్యోతి రాత్మా  నారాయణః పరః

నారాయణ పరమ్ బ్రహ్మ తత్వం నారాయణః పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

భావగానం:

నారాయణుడే  పరమలోకము, నారాయణుడే జ్యోతిరూపము,  నారాయణుడే ఆత్మ రూపము

నారాయణుడే  పరబ్రహ్మము, నారాయణునే  ధ్యానిoచుము

🌻. మంత్ర పుష్పం  6.🌻

 యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః

భావగానం:

 చూసే దంతా  వినే దంతా, లోకమంతా  మారే దంతా, లోనా బైటా వుండే దంతా

పైనా కింద  వుండే దంతా, నారాయణుడే అ దంతా

****

తేటగీతి పద్యం 

పరమ లోకము ప్రీతియు చేయు వాడు 

జ్యోతిరూపము తో అంత ఉన్నవాడు 

ఆత్మరూపము హృదయము ఉండు వాడు 

ధ్యానము నుచేయువారికి రక్షా గుండు  ..... ...  ..... ...

అతడే నారాయణుడు పరబ్రహ్మస్వరూపుడు 

***

చేయునది అంత నారాయణడుగ ఉండి 

వినునది అంత  నారాయణడుగ ఉండి 

లోక మార్పుకు నారాయణడుగ ఉండి 

లోన బైట క్రిందయు  నారాయణడుగ 

లోకాల్ని ఏలేటి నారాయణుడు పరబ్రహ్మస్వరూపుడు

   

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌻.  *🌻. మంత్రం పుష్పం - శ్లో. 9 &10 🌻*


సంతతగ్o శిలాభిస్తు

లమ్బత్యా కోశ సన్నిభమ్

తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం

తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్


తస్యమధ్యే మహానగ్ని

 ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః

సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ

 న్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మధశ్శాయీ

 రశ్మయస్తన్య సన్తతా


      

🌻. భావగానం:


అదే హృదయ నివాసము

నాడి నరముల కమలము

వేడి వెలుగుల మయము  

దానికి ఉంది చిన్నరంద్రము

అందే  ఉంది అగ్నిసర్వము


అనంతమైన అగ్నిరూపము

విశ్వము ముందు ప్రకాశము

తన  ముందున్నది తినును

ఆహారముగా విభజించును

అన్నీ వైపులా అందించును

మీదకి కిందకి అందించును

🌹 🌹 🌹 🌹 🌹

సురులు నరులు హృదయ నివాసముకలిగిన 

నాడి నరముల కమలము కలిగి ఉన్న 

వేడి వెలుగుల మయము తో నిండి ఉన్న 

చిన్నరంద్రము జ్వలిత కలిగి యున్న 


అగ్నిపర్వతము కలిగి హృదయ మైన 

అగ్ని రూపము వెలుగు  అనంత మైన

విశ్వ ముందు ప్రకాశము జ్వాల ఆయన

తిన్న ఆహారము ను జీర్ణ జ్వాల ఆయన 



సశేషం....


🌻. మంత్ర పుష్పం - 1

ఓం ధాతా పురస్తాద్య ముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః

తమేవం విద్వానమృతమిహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే


🌻. మంత్ర పుష్పం 2.

 సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం

విశ్వం నారాయణం దేవం  అక్షరం పరమం పదం


🌻. మంత్ర పుష్పం  3.


విశ్వతః పరమాన్నిత్యమ్ విశ్వం నారాయణగ్o హరిమ్

విశ్వమే వేదం పురుషస్త  ద్విశ్వ ముపజీవతి


🌻. మంత్రపుష్పం   4.

పతిం విశ్వస్యాత్యే శ్వరగ్o  శాశ్వతగ్oశివమచ్యుతమ్

నారాయణం మహాజ్ఞ్యేయమ్ విశ్వాత్మానం పరాయణం


🌻. మంత్ర పుష్పం  5. 🌻

నారాయణ పరో జ్యోతి రాత్మా  నారాయణః పరః

నారాయణ పరమ్ బ్రహ్మ తత్వం నారాయణః పరః

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః


🌻. మంత్ర పుష్పం  6.🌻

 యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః



🌻.  *🌻. మంత్రం పుష్పం - శ్లో. 9 &10 🌻*


సంతతగ్o శిలాభిస్తు

లమ్బత్యా కోశ సన్నిభమ్

తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం

తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్


తస్యమధ్యే మహానగ్ని

 ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః

సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ

 న్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మధశ్శాయీ

 రశ్మయస్తన్య సన్తతా


మంత్ర పుష్పం  - భావగానం - 5 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.  *🌻. మంత్రం పుష్పం - శ్లో. 9 &10 🌻*


సంతతగ్o శిలాభిస్తు

లమ్బత్యా కోశ సన్నిభమ్

తస్యాంతే సుషిరగ్o సూక్ష్మం

తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠితమ్


తస్యమధ్యే మహానగ్ని

 ర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః

సో ౭ గ్రభుగ్వి భజంతిష్ఠ

 న్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మధశ్శాయీ

 రశ్మయస్తన్య సన్తతా



🌻. భావగానం:


అదే హృదయ నివాసము

నాడి నరముల కమలము

వేడి వెలుగుల మయము  

దానికి ఉంది చిన్నరంద్రము

అందే  ఉంది అగ్నిసర్వము


అనంతమైన అగ్నిరూపము

విశ్వము ముందు ప్రకాశము

తన  ముందున్నది తినును

ఆహారముగా విభజించును

అన్నీ వైపులా అందించును

మీదకి కిందకి అందించును

తేజో సంతానము పంపును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹







మంత్రపుష్పం : 02 (FINAL)
సద్గురు శ్రీ చలపతిరావు
శరీరాన్ని నిలబెట్టే వైశ్వానర అగ్నిజ్వాలల్లో పరమాత్మ ఏ రూపంలో ఎలా ఉన్నాడు?
(8) తస్య మధ్యే వహ్ని శిఖా అణీ యోర్ధ్వా వ్యవస్థితః ।
నీలతో యద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా ।
నీ వార శోక వత్తన్వీ పీతా భాస్వత్త్యణూపమా ॥
హృదయకుహరంలోని ప్రధాననాడి మధ్యలోని రంధ్రంలో ఉన్న అగ్నిజ్వాలల్లో - ఒక అగ్నిజ్వాల (వహ్నిశిఖ) సూక్ష్మాతి సూక్ష్మమైనది. (అణీయ), పైకి లేచి ఉన్నది (ఊర్థ్వా). అది ఎలా ఉంది ?
నీలమేఘం మధ్యన మెరిసే మెరుపు తీగలాగా (విద్యుల్లేఖ) ప్రకాశిస్తూ ఉన్నది - దాని రంగు పీతవర్ణ. అంటే పసుపు రంగు. అది వడ్లగింజ మొనలాగా (నీవార శూకవత్) సూక్ష్మంగా ఉన్నది. అది అగ్నిజ్వాల యొక్క రూపం - రంగు - సైజు - ఆకారం.
(9) తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః ।
భావం:- ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన పసుపురంగు గల వడ్లగింజ మొన వంటి అగ్నిజ్వాల మధ్యన పరమాత్మ ఉన్నాడు.
ఎవరు ఆయన -
(10) స బ్రహ్మ స శ్శివః స హరిః స ఇంద్రః స అక్షరః పరమ స్వరాట్ -
భావం:- అతడే బ్రహ్మ - శివుడు - విష్ణువు - ఇంద్రుడు. అక్షరుడు - జ్ఞాన స్వరూపుడు - స్వయం ప్రకాశుడు - నీవు ఏ పేరుతో పిలిచినా పలికే ఒకే ఒక్క పరమాత్మ - పరంజ్యోతి - పరంధాముడు.
అంటే -
(i) మన దేహంలోనే - హృదయ కుహరానికి దగ్గరగా - తామర మొగ్గలాంటి పద్మకోశం దిగువ ముఖంగా ఉన్నది.
(ii) ఈ కోశంలో నుండి అనేక నాడులు - నరములు దేహంలోని అన్ని భాగాలకు వ్యాపించి ఉన్నాయి.
(iii) అందులో ఒక ముఖ్యనాడి మధ్యన రంధ్రం - ఖాళీ ప్రదేశం ఉంది.
(iv) అందులో అనేక ముఖాలు గల అగ్నిజ్వాలలతో పైకీ - క్రిందికీ - అడ్డంగా వ్యాపించి ఉన్నది. ఇదే వైశ్వానరాగ్ని -
(v) ఈ జ్వాలల మధ్య ఒక్కటి మాత్రం సూక్ష్మాతి సూక్ష్మమై మేఘాల మధ్య మెరుపుతీగలా ఊర్ధ్వ ముఖంగా - (పైకి) ప్రజ్వరిల్లుతున్నది.
(vi) ఆ జ్వాల పసుపు రంగులో వడ్లగింజ మొనలా ఉంది.
(vii) ఆ జ్వాల మధ్యలో పరమాత్మ ఉన్నాడు. అతడే శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు ...
అంటే -
ఈ జడమైన దేహంలోనే పరమాత్మ ఉన్నాడు అని స్పష్టం.
మరి నేను జడమైన దేహాన్నా? చైతన్యరూప పరమాత్మనా?
దేహం కొన్నాళ్ళుండి పోయేది. పరమాత్మ శాశ్వతం. కనుక నేను పరమాత్మనే గాని - దేహాన్ని కాదు. కాకపొతే - దేహాన్ని ధరించిన పరమాత్మను అని తెలుసుకో - భావించుకో - అలా ఉండిపో.
కనుక -
(i) పరమాత్మ హృదయంలోనే అతి సమీపంగా ఉన్నాడని,
(ii) ఆయనను దర్శించటానికి, పూజించటానికి గుళ్ళూ గోపురాలు తిరగనక్కరలేదని,
(iii) ఆయనను తెలుసుకొనేదాకా విగ్రహాలను పెట్టుకొని కొంతకాలం పూజ చేయాలని,
(iv) అది కూడా ఏ కోరికా, ఫలాసక్తి లేకుండా నిష్కామంగా చేయాలని,
(v) దానివల్ల కలిగే శక్తితో నీలోనే - నీ హృదయంలోనే ఉన్న పరమాత్మను ఉపాసన చేయాలని; చివరకు నాలో ఉండటం కాదు; అసలు నేనే పరమాత్మను అని గ్రహించాలి.
ఇలా చేస్తేనే మన దుఃఖాలు పూర్తిగా తొలగిపోయేది. శాశ్వతమైన ఆనందం కలిగేది.
అయితే ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా, భగవంతుణ్ణి గుళ్ళూ గోపురాలలోను, గంగా, గోదావరి, కావేరి తీర్దాలలోను, తిరుపతి, శ్రీశైలం, కాశీ, రామేశ్వరం, గయ, ప్రయాగ మొ॥న పుణ్యక్షేత్రాలలోను మాత్రమే ఉన్నాడనుకొని అక్కడ పూజలు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు చేయిస్తేనే స్వర్గంలో సీటు ఖాయమనుకుంటూ ఏవో పూజలనే తతంగాలు జరుపుకుంటూ అక్కడ అమ్మే ప్రసాదాలు కొనుక్కుంటూ పుణ్యం వచ్చేసిందని పొంగిపోతామే గాని, ఒక్కసారి ఈ భగవంతుని వాక్యాలను పట్టించుకోం. వాటి అర్ధాలు తెలుసుకోం. ఎవరన్నా చెప్పినా వినం. విన్నా నమ్మం. మన పాత అలవాట్ల ప్రకారం పది మందినీ పిలిచి ఘనంగా సేవలనూ, పూజలనూ జరిపించి, చివరకు మంత్రపుష్పాన్ని చదివిస్తాం.
దీనితో మనకేం అర్ధమవుతుందంటే పూజలు ముగుస్తున్నాయి అనే సిగ్నల్ వచ్చింది అనుకుంటూ -
తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయం దగ్గరకొచ్చింది గనుక నిద్ర పోతున్న పిల్లలను, గోడవారగా ఆనుకొని కునుకుతీస్తున్న అమ్మమ్మలను, తాతయ్యలను మేలుకొలిపి, ఇస్తరాకులు ఎక్కడ ఇస్తున్నారో, ప్రసాదాలు ఎక్కడ పెడుతున్నారో సమాచారాన్ని సేకరించి తొందరగా ఇంటికి పోవాలనేదే వీరికర్ధమైన అంతరార్ధం.
ఒకవేళ ఆలస్యం చేస్తే ప్రసాదాలు అయిపోవచ్చు -
చివరి వాళ్ళకు కొద్ది కొద్దిగా రాల్పి పంపించవచ్చు కనుక ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ఎలాగో బయటపడదాం అనుకుంటారు. అంతే తప్ప మనం పూజలు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామో, అసలు పూజ ఎలాంటి పవిత్ర భావంతో చెయ్యాలో, ఆ పూజలో వచ్చే మంత్రాల అర్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తే ఉండదు. మంత్రాలు వల్లించటమే తప్ప వాటి అర్ధం తెలుసుకోరు. తెలిసినవారున్నా చెప్పరు. చెప్పినా వినరు. దానికి కావాల్సిన సమయం ఉండదు ఎవరికీ -
ఆ(! ఎవరిక్కావాలండీ ఈ అర్ధాలు, పర్ధాలు,
తీర్ధ ప్రసాదాలు తీసుకుంటున్నాం గదా !
పుణ్యం వచ్చి ఒళ్ళో పడిపోతుందాయె ।
స్వర్గ ద్వారాలు తెరుచుకొని సీట్లు రిజర్వు అయిపోతుండె ! కనుక అర్ధం చేసుకోవటాలు, ఆచరణలు - ఈ గోలంతా ఎందుకు? అనుకుంటారు.
ఇదే విషయాన్ని సంక్షిప్తంగా భగవద్గీత చెబుతున్నది.
శ్లో ॥ అహం వైశ్వానరో భూత్వా .................
భావం :- నేను వైశ్వానర అగ్ని రూపంలో సమస్త ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని; ప్రాణ అపాన వాయువులతో కూడి జీవులు తినే ఆహారాన్ని పచనం చేసి అనవసరమైన పిప్పిని మల మూత్రాల ద్వారా బయటకు నేట్టేస్తున్నాను అని. అంటే భగవంతుడు మన దేహంలోనే ఉన్నాడని తెలుసుకొని - అసలు నేనే భగవంతుడినని తెలుసుకొని సమస్త దుఃఖాల నుండి నివృత్తి చెంది శాశ్వత ఆనందాన్ని పొందాలి. జన్మ సార్ధకం చేసుకోవాలి. మోక్షాన్ని పొందాలి. -
ఇదే మనకున్న ఏకైక బాధ్యత –
.............................సమాప్తం .......................................


Swami Vivekananda's Wisdom for Daily Inspiration - May 21.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 21.

Worldliness and realization of God cannot go together.

మానవజీవితం లక్ష్యం ఇంద్రియభోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం.

🕉🌞🌎🌙🌟🚩

SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
LOVE & PURITY

Is there a greater strength than that of Brahmacharya - purity, my boy?

స్వామివివేకానంద-ధీరయువతకు...
ప్రేమ - పవిత్రత

నాయనా! బ్రహ్మచర్యం, పవిత్రతల కన్నా ఉన్నతమైన బలం ఏముంది?


🕉🌞🌎🌙🌟🚩

Swami Vivekananda's Wisdom for Daily Inspiration - May 23.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మే 23.

This is the hardest period, but hold fast; in the end the gain is sure if you have patience.

అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.

🕉🌞🌎🌙🌟🚩

SWAMI VIVEKANANDA-TO THE BRAVE YOUTH...
LOVE & PURITY

Out of purity and silence comes the word of power.

స్వామివివేకానంద-ధీరయువతకు...
ప్రేమ - పవిత్రత

పవిత్రత, నిశ్శబ్దతల నుండే అమోఘవాక్కు వెలువడుతుంది.

🕉🌞🌎🌙🌟🚩

[19:06, 25/09/2020] +91 98494 71690: 🌹. మంత్రపుష్పం అంటే ఏమిటి ? దాని విశిష్టత ఏమిటి ? 🌹

📚. ప్రసాద్ భరద్వాజ 


సాధారణంగా పుష్పం అనేదానిని పూజలో ఉపయోగించినప్పుడు ఈశ్వరుడు మనకు చెవులు ఇచ్చినందుకు ఆయనకు మనం చెప్పే కృతజ్ఞతకు సాధనంగా వాడతాం. కన్ను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడతాం. నాలుక ఇచ్చి రుచి చూసే శక్తి ఇచ్చాడు కాబట్టి నైవేద్యం పెడతాం. స్పర్శ ఇచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తాం. పంచేంద్రియములు ఒక్కొక్క డానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. వాసన చూసే అధికారం ఇచ్చాడు ముక్కుతో. ధూపం వేస్తాం. చెవులు ఇచ్చాడు. ఎన్నో ఉపకారాలు పొందుతున్నావు. అందుకని పువ్వులతో పూజ చేస్తున్నావు.


వినడానికి పువ్వుకు సంబంధం ఏమిటి అంటే తుమ్మెదల యొక్క ధ్వనులన్నీ పువ్వుల కోసం. పువ్వు దగ్గరికి వెళ్ళి తేనే తాగేటప్పుడు ధ్వనులన్నీ ఆగిపోయాయి.  కాబట్టి ధ్వనులు చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి డానికి కృతజ్ఞతగా పువ్వులు వాడతాం. అంతేకాదు పువ్వు జ్ఞానమునకు గుర్తు. జ్ఞానం కలిగితే వికసనం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది జ్ఞానము చేత. 


అందుకే పూజ చేసేటప్పుడు పువ్వు. చిట్టచివర చేతిలో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాం. పూజ చేసేటప్పుడు కూర్చుంటాం. అసలు రహస్యం తెలుసుకునేటప్పుడు లేచి నిలబడతాం. అప్పుడు చేతిలో పట్టుకున్న పువ్వులను మంత్రపుష్పం అంటారు. 


అంటే మంత్రం అనే పుష్పం ద్వారా అందుతున్న జ్ఞానాన్ని లోపలికి తీసుకో. లోపలికి పుచ్చుకున్నాను అనుభవంలోకి వచ్చేటట్లు చేయమని అడగడానికి పువ్వు ఈశ్వరుడి పాదం మీద పెట్టు. అది మంత్రపుష్పం. 


మంత్రపుష్పంలో ప్రారంభం చేస్తూనే ఒక మాట చెప్తాం – ‘ నాన్యః పంథాయనాయ విద్యతే’ – ఈశ్వరుడిని తెలుసుకోవడానికి ఇంకొక మార్గం లేదు. నీ ఎదురుగుండా పెట్టి నువ్వు ఇప్పటివరకూ ఎవరిని పూజ చేశావో అసలు వాడు ఎక్కడ ఉంటాడో నువ్వు తెలుసుకుంటే అది ఒక్కటే వాడిని తెలుసుకొనే మార్గం. 


ఎక్కడ ఉన్నాడు అంటే ‘హృదయం చాప్యధోముఖం’ – యోగవిద్యను కలిగిన వాడు తెలుసుకుంటాడు. వంగిన తామర మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ‘నాభ్యాం ఉపతిష్టతి’ – చిటికెన వ్రేలు బొడ్డులో పెట్టుకుని బొటనవ్రేలు పైకి పెడితే బొటనవ్రేలు ఎక్కడ తగులుతుందో ఆ వంగిన మొగ్గ అక్కడికి వస్తుంది. దాని చివర ఒక చిన్న బిందువు ఉంటుంది. ‘నీవార   పీతాభా స్వస్త్యణూపమా’ ‘తస్య మధ్యే – మధ్యలో ఒక చిన్న ప్రకాశం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కాంతి, ఆ వెలుగు ‘ఊర్ధ్వ మూల మధశ్శాయీ’ – దానికాంతి పైకి కొడుతోంది, క్రిందకి కొడుతోంది, ప్రక్కకు కొడుతోంది. ఆ కాంతి ఏదో అది జీవుడు. 


‘స బ్రహ్మః స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్’ – ఏ పేరు పెట్టి పిలు అభ్యంతరం లేదు. కానీ ఆ వెలుగు ఉన్నదే అది పరమాత్మ. అది ఎక్కడ ఉంది? – అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా’. కాబట్టి నిజంగా ఈశ్వరుడిని చూడాలంటే కళ్ళు తెరిస్తే కనబడడం కాదు. కళ్ళు మూతలుపడి అంతర్ముఖత్వంతో లోపలికి ధ్యానంలో ప్రయాణం చేస్తే వెలుగులకు వెలుగైన వెలుగు కనబడుతుంది. వాడు ఈశ్వరుడు. 


వాడు సమస్త ప్రాణికోటియందు హృదయ క్షేత్రంలో వెలుగుతున్నాడు. కాబట్టే ఆ తొడుగుకు ఆకలి వేస్తోంది, నిద్రవస్తోంది. అది లేనినాడు ఆ తొడుగు శవం. అది ఉన్ననాడు ఆ తొడుగు శివం. ఆకలి దానివల్లనే వస్తోంది, ఆకలి తీరింది అని దానివల్లే తెలుసుకుంటోంది. జ్ఞాని ఎలా చూస్తాడంటే తనలో ఉన్నవాడిని చూస్తూ ఉంటాడు తప్ప ఆయనకు నామరూపాలు కాదు. లోపల ఉన్నది అన్నింటిలో నేనే. తెలిసో తెలియకో ఎక్కడ ఉన్నాడు అని శాస్త్రాలు చెప్పాయో అక్కడే చూపిస్తాడు ‘నేను’ అని. 


అంటే ఎవరు ఆ నేను? – భగవంతుడు. ఆ ‘నేను’ అక్కడా ఉంది. ‘నేను’ ‘నువ్వు’ – ఈ ‘నేను’కి, ‘నువ్వు’కి మధ్య స్వార్థం అంతా వస్తుంది. ‘నువ్వు’ పాడైపోయినా పర్లేదు, ‘నేను’బాగుండాలి. కానీ ఇందులో ‘నేను’ అందులో ‘నేను’ ఒక్కటే – జ్ఞానం. ఇక తరతమాలు లేవు, బేధాలు లేవు, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. 


అప్పుడు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఉన్నది ఒక్కటే అది ఎరుకలోకి వచ్చింది. అద్వితీయం – రెండవది లేదు. అద్వైతం – రెండు కానిది. ఒక్కటే. ఒక్కటి అంటే అది ఒకటి ఇది ఒకటి అని అంటారేమో అని రెండు కానిది అన్నారు. ఆ అద్వితీయానుభూతిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే సాధనం. అందుకు అది మంత్రపుష్పం. 


అది మననాత్ త్రాయతే’ ఎంత ఆలోచించి సాధనలోకి తెచ్చుకుంటావో అంత గొప్పగా అద్వైతానుభూతిలో నిన్ను పెట్టగలదు. అందుకని పూజయందు చివరి భాగమై జ్ఞాన కటాక్షమై మంత్రపుష్పం అయింది. ఇది నా అంత నేను నిలబడితే రాదు, భగవంతుని అనుగ్రహం ఉంటే వస్తుంది. 


కాబట్టి ఆ వికసనాన్ని - ఇవ్వు అని విన్నదానిని పట్టుకుని ప్రయత్నం కోసం, అనుగ్రహం కోసం అడగడం ఆ  భగవంతునికే సమర్పించి నమస్కరించడం. అందుకే పూజ చివరలో మంత్రపుష్పం. పూజ అంతర్భాగంలో పుష్పార్చన...

🌹 🌹 🌹 🌹 🌹

[19:06, 25/09/2020] +91 98494 71690: 🌹. మంత్ర పుష్పం  - భావగానం - 6 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


 🌻. మంత్రం పుష్పం - 11 &12 🌻


సంతాపయతి స్వం దేహ

 మాపాద తల మస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా

 అణీ యోర్ధ్వా వ్యవస్థితః


నీలతో యద మధ్యస్థా

 ద్విద్యుల్లేఖే వ భాస్వరా

నీవార సూక వత్తన్వీ పీతా

 భాస్వత్యణూపమా


 🌻. భావగానం:

పాదాల నుండి తలవరకోయి

వేడిసెగలు అందించు నోయి

అది మహాగ్ని చక్రము మోయి


మధ్య పుల్లలానిలచిన దోయి

పైకిచేరు అగ్నిశిఖల తోడోయి

ఉన్నత చక్రము కాంతులోయి


బంగారురంగు మెరుపు కాంతులోయి

నీలిమబ్బుల  మెరుపు కాంతులోయి

బియ్యపుగింజ చివర ములకంతోయి.


🌻. మంత్ర పుష్పం .13.


తస్యా శ్సిఖాయ మధ్యే

పరమాత్మా వ్యవస్థితః

స బ్రహ్మ సశివ స్సహరి స్సేన్ద్ర

స్సో౭క్షరః పరమస్స్వరాట్


🌻. భావగానం:

ఆ అగ్ని పైభాగ మధ్యనోయి

అదే పరమాత్మ నివాసమోయి

అతడే బ్రహ్మ  అతడే శివుడు

అతడే హరి  అతడే ఇంద్రుడు

అతడే నశించని పరమాత్మడు

అతడే నడిపించు పాలకుడు


ఓం ఇది శ్రీ కృష్ణ యజుర్వేదము లోని

తైత్తరీయ అరణ్యక మందు

 పదవ పాఠకమున  

నారాయణ ఉపనిషత్ లో

13వ అనువాకము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌻. మంత్రం పుష్పం - 14  to 16 🌻

🌻. మంత్రపుష్పం 14.


 యో ౭ పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

చన్ద్రమావా అపాం పుష్పం

 పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి

య ఏవంవేద


🍀. భావగానం:

ఎవరు నీరే పూవులని తెలిసేదరో, వారు స్త్రీలు ప్రజలు పశువులు పొందెదరు, ఎవరు చంద్రుడే నీరు పూవులని తెలిసెదరో, వారు స్త్రీలు  ప్రజలు పశువులు పొందెదరు .


🌻. మంత్ర పుష్పం15.


 యో౭పామాయతనం

 వేద,ఆయతనవాన్ భవతి

అగ్నిర్వా అపామాయతనం

 వేద,ఆయతనవాన్ భవతి

యో ౭ గ్నే రాయతనం వేద

ఆయతనవాన్ భవతి

అపోవా ఆగ్నేరాయతనం

ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావగానం:

ఎవరు నీటి స్థానము ఎరుగుదురో, వారు నీటి స్థానము పొందెదరు. ఎవరు నిప్పే నీటికి ఆధారమని

ఎరుగుదురో, వారునిప్పు స్థానముపొందెదరు. ఎవరు నిప్పుకి నీరే ఆధారమని ఎరుగుదురో

వారు నీటి స్థానము పొందెదరు. 


నీటికి నిప్…


[

--((**))-

🌹. మంత్ర పుష్పం  - భావగానం - 8 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


 🌻. మంత్రం పుష్పం - 17  to 19 🌻


🌻. మంత్ర పుష్పం 17.


యో౭పామాయతనం వేద

ఆయతనవాన్ భవతి

అసౌవై తపన్నపా మాయ తనం

ఆయతనవాన్ భవతి

ఆముష్య తపత ఆయతనంవేద

ఆయతనవాన్ భవతి

అపోవా ఆముష్య తపత

 ఆయతనం ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావగానం:


ఎవరు నీటి నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు. 


సూర్య తేజో నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు. 


నీరు జ్వాలల  బంధ మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు. 


🌻. మంత్ర పుష్పం  18.


యో౭పామాయతనం వేద

ఆయతనవాన్ భవతి

చన్ద్రమా వా అపామాయతనం

ఆయతనవాన్ భవతి

యశ్చన్ద్ర మసఆయతనం

వేద ఆయతనవాన్ భవతి

అపోవై చన్ద్రమస ఆయతనం

ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావ గానం:


ఎవరు నీటి నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


నీరు చంద్రుని దని  తెలిసెదరో

వారు ఆ నివాసము పొందెదరు


ఎవరు చంద్ర నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


నీరుచంద్రుల నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


🌻. మంత్ర పుష్పం19.


 యో౭పామాయతనం వేద

ఆయతనవాన్ భవతి

నక్షత్రాణివా అపామాయతనం

ఆయతనవాన్ భవతి

యో నక్షత్రాణా మాయతనం వేద

ఆయతనవాన్ భవతి

అపోవై నక్షత్రాణా మాయతనం

ఆయతనవాన్ భవతి

య ఏవంవేద


🍀. భావ గానము:


ఎవరు నీటి నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు


నక్షత్రాలకు నీరు నివాసమని

నీటికి నక్షత్రాలు నివాసమని. 


నీరు, తారల నివాస మెరిగెదరో

వారు ఆ నివాసము పొందెదరు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ