శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

వ్యాఖ్య:-  .***

-శ్రీ రామదాసు కీర్తన


మోహన రాగం     త్రిపుట తాళం.

ప: వందే రఘురామ శుభనామ శుభనామ

తులసీ దళధామాభిరామ శ్రీరామ || వందే ||


చ 1: కనక మణిమయహార సుకుమార సుకుమార

పంక్తి రధ మహిత కుమారా సువిహార

అరిసూర భూధర ధరకల్మషదూర

పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘు

వీర నీరదాభ విమలశరీర నిర్వికార || వందే ||


చ 2: వందిత అనిమిష సత్యభావ సీతానన

భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష

మానుషవేష సంగరభీషణదాస సుపోషణ నిజతోష

రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యు

ష సుమానస భ్ఋంగ మునిరాజవేష శ్రీరామ || వందే ||


చ 3: కుంతల జిత నీల భక్తపాల భక్తపాల

అసురద్వేష పటలపాల వరశీల కనకచేల

కాంతిజాల మానుషశరీర దానవ బాలక

తావక సేవక సురసాల భూపాల పాలక

కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల || వందే ||


చ 4: ధరణిజ సత్కళత్ర సుచరిత్రసురిత్ర

మునిస్తోత్ర మృదయాబ్జమిత్ర సత్పవిత్ర

త్రిశర జైత్ర నీరజనేత్ర వారిజగాత్ర

విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర

అజపవిత్ర అతురమిత్ర విభీషణపరస్తోత్ర పాత్ర || వందే ||


చ 5: భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి

రాభ మదేభ హర్యక్ష మృదు పక్షపం కేరుహాక్ష

నిజరూపాక్ష శతృవిపక్ష వసురేషణ

వీక్షణ శిక్షణ దాక్షణ రామదాస

భద్రాద్రీశ దుష్టశిక్షక శిష్టరక్షక అహోరామ || వందే ||

***

|శ్రీమన్నారాయణీయము||అష్టమ స్కంధము 26వ దశకము - గజేంద్రమోక్షణము వర్ణనము/26-6-శ్లోకము

త్వత్సేవాయా వైభవాద్దుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణాం సహస్రమ్।

ప్రాప్తేకాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై వక్రాక్రాంతం హస్తివర్యం వ్యధాస్త్యమ్।।

భావం:-

ప్రభూ! నారాయణమూర్తీ! నిన్ను సేవించిన భాగ్యమున - గజేంద్రుడు ఆ మొసలితో వేయి సంవత్సరములు నిరంతరముగా పోరాడెను. అంతట ఆ గజేంద్రునికి పుణ్యలోకప్రాప్తి కాలము ఆసన్నమయ్యెను. అప్పుడు ఆ గజేంద్రునికి నీ పాదపద్మముల యందు ఏకాగ్రచిత్తము కలుగుటకై - అతని శక్తి తగ్గి, మకరికి వశమగుస్ధితిని నీవే కల్పించితివి.

వ్యాఖ్య:-

భాగవతంలోని గజేంద్ర మోక్షణం ‘శరణాగతి’ తత్వాన్ని సర్వాంగ సుందరంగా ప్రతిపాదించే ఘట్టం. జీవుని జన్మసంసార బంధనాన్ని, బంధ విముక్తి సాధనాన్ని రూపకాలంకారం ద్వారా పరోక్ష బోధలో అత్యద్భుతంగా వర్ణించాడు వ్యాసుడు.

క్షీరసాగరంలో త్రికూటమనే ఒక అందమైన పర్వతం. దానికి బంగారు, వెండి, ఇనుముతో నిండిన మూడు శిఖరాలు. ఆ కొండ కింద ఒక అందమైన కాసారం (మడుగు). సమీప అరణ్యంలో ఒక గజరాజు కాపురమున్నాడు! ఒకనాటి మండుటెండలో అడవిలో అలవోకగా తిరిగి తిరిగి అలసి దప్పికగొని గజరాజు భార్యాబిడ్డలతో సరోవరంలో దిగి విహరించాడు. 

ఇంతలో ఒక బలిష్టమైన మొసలి గజరాజు పాదాన్ని ఒడుపుగా వదలక పట్టుకుంది. కరి మకరుల మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది. స్థానబలిమి వలన మొసలిది పై చెయ్యి కాగా గజరాజు అన్నివిధాలా క్షీణించాడు.

నిస్సహాయ స్థితిలో ‘ఆపద్బాంధవుడు ఆదినారాయణుడొక్కడే’ అన్న వివేకం ఉదయించింది. గత జన్మలో గురూపదిష్ట మంత్రం (స్తోత్రం) స్ఫురించగా గజరాజు దాన్ని జపించసాగాడు. అది పూర్వపుణ్యఫలం.

ఇంతవరకూ జరిగిన కథలో ఆంతర్యాన్ని గ్రహిస్తే.. మన శరీరమే త్రికూట పర్వతం. సత్వ, రజో, తమో గుణాలే మూడు శిఖరాలు. సంసారమే కాసారం. 

చావు పుట్టుకల జీవుడే గజేంద్రుడు. అహంకార మోహాలకు వశుడై జీవుడు పశువయ్యాడు. వాసనా జ్ఞానం తప్ప వివేక జ్ఞానం లేనిదే పశువు. అది ఉన్నా సంసార పాశబద్ధుడైతే పశువే!- మోహమే గ్రాహం (మొసలి). పట్టుకోవటమే కానీ వదలడం తెలియనిదే గ్రాహం. 

పరమార్థంలో అవిద్య లేక అహంకార పాశమే మకర బంధం. బంధించిన అవిద్య, బద్ధుడైన జీవుడు, ఇద్దరూ అనాదులు కనుక మృతి లేదు. మంత్ర జపంతో ఈ దివ్యజ్ఞానమే గజరాజుకు కలిగింది. 

తన శరీరాభిమానమే (దేహమే నేను అను బుద్ధి) మహా మకరమై తనను పట్టుకున్నదని గ్రహించాడు. కడకు తాను రక్షింపబడినా ఏనుగుగా జీవింప కోరక అవిద్యాబంధ విముక్తే వాంఛించాడు. 

వెంటనే శ్రీహరి గరుడారూఢుడై వచ్చి సుదర్శన చక్రంచే మొసలి తల ఖండించి గజరాజు (పూర్వ జన్మలో అగస్త్య మహర్షి శాపంతో ఏనుగుగా పుట్టిన మహా భక్తుడు ఇంద్రద్యుమ్న మహారాజు)ను ఉద్ధరించాడు. 

అదే సమయంలో.. దేవల ఋషి శాపం వల్ల మకర జన్మ పొందిన ‘హూహూ’ గంధర్వునికి మహాభక్తుని (గజేంద్రుడి) పాదాలు పట్టుకున్నందుకు ముక్తి లభించింది. అజ్ఞాన బంధనం తొలగగా గజేంద్రునికి సారూప్య ముక్తి లభించింది. 

అంటే.. సంసార సముద్రంలో మునగకుండా కాపాడి దరి చేర్చేవి రెండే.. ఒకటి పూర్వపుణ్యం, రెండు భగవత్కృప. అందుకే ఎల్లప్పుడూ సత్కార్యాలతో పుణ్యం సంపాదిస్తూ భగవంతుని శరణు వేడాలి.


🕉🌞🌎🌙🌟🚩

18-63-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

అII ఇంతదనుక చెప్పిన బోధను చక్కగ విచారణమొనర్చి తన కెట్లు ఉచితమని తోచునో ఆప్రకార మాచరింపవలసినదిగా భగవానుడు అర్జునునకు హితము చెప్పుచున్నారు-

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా | 

విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు || 

తా:- ఈ విధముగా రహస్యములన్నిటికంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును(గీతాశాస్త్రమును) నేను నీకు జెప్పితిని. దీనినంతను బాగుగ విచారణచేసి తదుపరి నీకెట్లు ఇష్టమో అట్లాచరింపుము.

వ్యాఖ్య:- "గుహ్యాద్గుహ్యతరమ్”- శ్రీకృష్ణపరమాత్మ గీతాశాస్త్రమంతయు నుపదేశించి తుట్టతుదకు దానిని అతిరహస్యమైన విద్యగా వర్ణించుచున్నారు.

 ఉపనిషత్సారమగు ఈ మహాజ్ఞానమును సద్గురువులు అతిగోప్యముగ నుంచుకొని అధికారులగు సచ్చిష్యులకే యుపదేశించుచుందురు. అధికారపురుషుడగుటచే అర్జునునకు శ్రీకృష్ణు డద్దానిని బోధించి తద్ద్వారా లోకమున కంతకును మహోపకార మొనర్చిరి.

 ఈ జ్ఞానము రహస్యములలోకెల్ల అతిరహస్యమని చెప్పుటవలన దాని ప్రభావమెట్టిదో మనము ఊహించవచ్చును. ఏలయనిన, సామాన్యముగ విలువగలిగిన వస్తువులనే జనులు రహస్యముగ నుంచుదురు కాబట్టి ఈ మహత్తర జ్ఞానధనముయొక్క విలువను గ్రహించి విజ్ఞులగువారు దానిని సద్వినియోగపఱచుకొని ధన్యులు  కావలయును.

"విమృశ్యైతదశేషేణ” - మహనీయులు తాము ధర్మమును బోధించినప్పటికిని దానిని గూర్చి ఆలోచించుటకును, విమర్శించుటకును ఇతరులకు పూర్తిగ అధికారమిచ్చుదురు. వారు చెప్పిన బోధను పూర్వాపరవిచారణలేక, స్వయముగ దానినిగూర్చి ఆలోచింపక అమాంతముగా గ్రహించుడని ఇతరులకు వారు చెప్పరు. మహాత్ములగు గురువులయొక్క లక్షణ మిట్లే యుండును.

 గురువు బోధించినదానిని శిష్యుడు తన సొంతపరిజ్ఞానముతో, నిజసంస్కారముతో చక్కగ పరిశీలించి, విచారణ సలిపి, పూర్వాపరములను విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చినదానిని గ్రహింపవచ్చును. ఇట్టిస్వాతంత్ర్యమును పూర్వపు గురువులు తమ శిష్యుల కిచ్చియుండిరి.

 ఈపద్ధతికి అనుగుణ్యముగనే గురోర్గురువగు శ్రీకృష్ణపరమాత్మయు వ్యవహరించిరి. శ్రీకృష్ణుడు అర్జునునకు బోధింపవలసిన దానినంతను బోధించి తదుపరి " ఓ అర్జునా! నాపై భక్తిచే, విశ్వాసముచే, గురుత్వముచే నేను చెప్పినదానినంతను నీవు కన్నుమూసికొని గ్రహింపవలెనని నేను చెప్పను. మఱియేమనిన, నీవు సొంతముగ దానిని చక్కగ విమర్శింపుము, వివేచనచేయుము.

 ఆ పిమ్మట నీకు నచ్చినదానిని గ్రహింపుము." అని వచించి తనయొక్క విశాలభావమును, ఔదార్యమును ప్రకటించిరి. గురువు బోధించిన దానిని శిష్యుడు సొంత ప్రజ్ఞచే సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసింపదు.

 ఇదియంతయు ఆలోచించియే భగవానుడు పైవాక్యములను పలికినవారైరి. మఱియు బోధయందు పటుత్వము, యాథార్థ్యము లేనిచో ఇట్టి వాక్యములను ధైర్యముగా ఎవరును పలుకజాలరు గనుక గీతా బోధయొక్క పరమప్రామాణ్యత్వము, సత్యత్వము దీనిచే సువ్యక్తమగుచున్నది. "అశేషేణ” అని చెప్పుటచే ఒకింత విచారణతో ముగించవలదనియు, సంపూర్తిగ, సర్వవిధముల సమస్తప్రమాణములతో విచారించుమనియు అర్జునునకు తెలిపినట్లైనది.

          “యథేచ్ఛసి తథాకురు" - "అట్లు విచారణ చేసిన పిదప నీకెట్లు ఉచితమని తోచునో అట్లు ఆచరింపుము" అని భగవానుడు సెలవిచ్చిరి. గురువగు శ్రీకృష్ణుడు కర్తృత్వమును తనపై పెట్టుకొనలేదు. నిష్కామకర్మముయొక్క చక్కని దృష్టాంత మిచట కానంబడుచున్నది.

 పదునెనిమిది అధ్యాయముల బోధను అనర్గళముగ నుపదేశించి తుట్టతుదకు దాని ఫలితమును కోరకయే భగవానుడు విరమించుచున్నారు. అర్జునునిచే తిరిగి యుద్ధమును చేయింపించుట తన బోధయొక్క ఒకానొక లక్ష్యమైనప్పటికిని ఆ బోధయొక్క ఫలమగు అట్టి లక్ష్యమును వాంఛింపకయే శ్రీకృష్ణుడు దానిని ముగించివైచెను. "నీవు యుద్ధము చేయుము, లేక చేయకనుండుము - దానితో నాకు పనిలేదు.

 నేను చెప్పవలసిన ధర్మమును నీకు చెప్పివేసితిని. ఆ పిదప నీ యిష్టము  (యథేచ్ఛసి తథా కురు) - అని భగవానుడు విశాలదృష్టితో పలికిరి. నిష్కామకర్మయొక్క మచ్చుతునక యిది.

అట్లుకాక కర్తృత్వము తమపై వేసికొనినచో ఇక గురువులకు శాంతియుండదు.

కావున వారెన్నటికిని అట్లు చేయరు. వారి ధర్మమును (Duty) వారు నెరవేర్చుదురు. ఫలమును వాంఛింపరు. ఇక శిష్యుడు తన ఉద్ధారమును తాను చూచుకొనవలసియుండును. గురువు దారిచూపును. శిష్యుడు తాను సొంతముగ నడపవలెను.

“జ్ఞానమాఖ్యాతమ్” - అని చెప్పినందువలన గీతాశాస్త్రమందు కర్మ భక్త్యాద్యనేకములు వచింపబడినను అవి యన్నియు జ్ఞానమం దంతర్భూతములే యని స్పష్టపడుచున్నది.

 కర్మ, భక్తి, ధ్యానాద్యనేక ధర్మములు బోధించి తుట్టతుదకు వాని నన్నింటిని కలిపి భగవానుడు "జ్ఞానం” అను ఒక్క పదములో ఇమిడ్చి యిచట చెప్పివైచిరి. కాబట్టి సమస్తమార్గములు తుదకు జ్ఞానమునందే పరిసమాప్తతను బొందుననియు, జ్ఞానమే జీవుల చరమ లక్ష్యమనియు, ఆ కర్మభక్త్యాదులు జ్ఞానప్రాప్తికి సహాయభూతములుగ నుండుననియు దీనిద్వారా నిశ్చయించు కొనవచ్చును.

ప్ర:- ఈ గీతాజ్ఞాన మెట్టిది?

ఉ:- పరమ రహస్యమైనది.

ప్ర: - గురువు జ్ఞానమును బోధించినపిదప శిష్యు డేమిచేయవలెను?

ఉ:- ఆ చెప్పినదానిని తన సొంత భావములతో చక్కగా విమర్శించి, సమాలోచనచేసి తనకు నచ్చినదానిని కార్యానిత్వ మొనర్చవలెను.

***



🌻. క్షువదధీచుల వివాదము  - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-


వత్సా! శుక్రుడు తన వంశములోని వాడు, మహర్షియగు దధీచికి ఇట్లు ఉపదేశించి, శంకర ప్రభుని స్మరిస్తూ తన స్థానమునకు వెళ్ళెను(35). దధీచి మహాముని ఆయన చెప్పిన ఆ మాటలను విని, మహాప్రీతితో శివుని స్మరిస్తూ , తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను(36)


ఆయన వనమునకు వెళ్ళి ఆ మహామృత్యుంజయ మంత్రమును యథావిధిగా జపిస్తూ శివుని ప్రీతితో స్మరిస్తూ తపస్సును చేసెను (37). 


ఆయన ఆ మంత్రమును చిరకాలము జపించి తపస్సును చేసి శంకరుని ఆరాధించెను. ఆయన మహామృత్యుంజయ మంత్రమును జపించుటచే శివుడు సంతసించెను(38) ఓ మహర్షీ! అపుడు భక్తవత్సలుడగు శంభుడు ఆ జపముచే ప్రసన్నమైన మనస్సు గలవాడై ప్రీతితో అతని ఎదుట ఆవిర్భవించె…

 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 216 🌹


🌻. జైమినిమహర్షి  - 1 🌻


బోధనలు/గ్రంధాలు: జైమినిభారతం, జైమినిసూత్రాలు, శ్రౌతసూత్రము, స్మృతిమీమాంస, జైమినీయబ్రాహ్మణము, జైమినీయసంహిత, జైమినీయ గృహ్యసూత్రాలు

🌻. భగవంతుని తొమ్మిదవ పాత్ర - జీవన్ముక్తుడు  - 2 🌻

609. జీవన్ముక్తుడు తురీయఅవస్థలో అనంత సచ్చిదానందమును అనుభవించు చుండును. అతని చైతన్యము కొంతసేపు "నేను భగవంతుడను" అను స్థితి యందును, మరొకప్పుడు దానితోపాటు ముల్లోకములతోనూ కూడి యుండును. కాని సృష్టిలో కర్తవ్యము లేనివాడై సచ్చిదానంద స్థితిని అన్యులకై వినియోగించడు.

610. జీవన్ముక్తుడు తన జీవితాంమందు మాత్రము ఒకనిని తనవలె పరిపూర్ణుని చేయును.

611. ఆత్మ స్వీయ చైతన్యమును పొందిన తరువాత అనుభవించు అవస్థలు మూడింటిలో జీవన్ముక్తి రెండవది.


. వివేక చూడామణి - 1 / Viveka Chudamani - 1 🌹


🌹. శ్రీమద్భగవద్గీత - 618  / Bhagavad-Gita - 618 🌹


నయతి ప్రాణులను, విశ్వములను సృష్టిస్థితిలయాదులచే స్వస్వవ్యాపారములయందు  ముందునకు కొనిపొవును. భక్తులను తన పరమపదమునకు కొనిపోవును. నయతీతి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః శాశ్వతుడగు పరమాత్ముడు నయతి/కొనిపోవును అను వ్యుత్పత్తి చే నరః అని చెప్పబడుచున్నాడు అను వ్యాసవచనముచే నరుడు అనగా విష్ణువు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

[05:10, 24/01/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 1 / Viveka Chudamani - 1 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు

📚. ప్రసాద్ భరద్వాజ


🌻 2. మానవ జన్మ  - 1 🌻


1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.


4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన…

🌻 4. అశ్వవిద్య - 3  🌻


సంవత్సర చక్రమును ప్రవర్తింప చేయుచున్న శక్తి అశ్వమే. అది సూర్య కేంద్రితమైన శక్తి. అందుండియే సర్వము నందును విత్తనములు మొలక రూపమున మరల మరల బహువిధముగ జన్మించుచున్నవి. 


మరల మరల పునరావృతమైన వర్షించు పర్జన్య శక్తి కూడ అశ్వమే. అనగా సూర్య కేంద్రకమైన సంవత్సర చక్రమున అగ్ని అశ్వ స్వరూపుడు. దాని నారోహించి పర్జన్య శక్తి వర్తించు చుండును. 


భూమి సూర్యుని చుట్టూ వృత్తాకారముగ తిరుగు నపుడు ఏర్పడు అక్షరములన్నియు తేజోమయములు. సూర్యుని నుండి భూమికి చేరు ఈ కిరణములన్నియు భూమికిని సూర్యునికి వెలుగు మార్గము లేర్పరచుచున్నవి. 


సూర్యుని నుండి భూమికి గమనము చేయుచు వ్యాపించి యన్నవి. అనగా అశ్వములుగ నున్నవి. ఈ వెలుగు కిరణముల నాధారము చేసుకొని భూలోకము నుండి సూర్యులోకమునకు చేరవ…

🌹. ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀*)


ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.


అలా ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనం కోసమే అన్నట్లుగా తయారైంది. ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. ఆ సత్యాన్ని మీరు అంగీకరిస్తారు.


నిజానికి, మీరు- శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా- ప్రతిక్షణం మృత్యువును చాలా ఆనందంగా ఎదుర్కొంటున్నారు. అందువల్ల అలా ఆనందించే క్షణాలలోనే మృత్యువు సాక్షాత్కరించే క్షణమొకటి వస్తుంది. కాబట్టి, కేవలం ఆనందించే క్షణాలలోనే మీరు మృత్యువును నేరుగా కలుసుకుంటారు. అదే…

[05:10, 24/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 8 / Bhagavad-Gita - 8 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 8 🌴


8. భావాన్ భీష్మశ్చ 

కర్ణశ్చ సమితింజయ:

అశ్వత్థామా వికర్ణశ్చ 

సౌమదత్తిస్తథైవ చ ||


🌷. తాత్పర్యం : 

యుద్దమునందు ఎల్లప్పుడును విజయమును సాధించు మీరు,భీష్ముడు, కర్ణుడు,కృపుడు, అశ్వత్థామ,వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మన సైన్యము నందున్నారు.


🌷. భాష్యము: 

యుద్దరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖవీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీకరాజు తనయుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించియున్నందున కర్ణుడు అర్జునునికి సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని భార్య.

🌹 🌹 🌹 🌹 🌹 


🌹 …

 శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


794వ నామ మంత్రము 24.01.2021


ఓం కళామాలాయై నమః


చతుష్షష్టికళలను మాలగా ధరించి విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి కళామాలా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం కళామాలాయై నమః అని  ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆరాధించు భక్తులకు జ్ఞానసంపదను  ప్రసాదించి వారి వారి వృత్తి, వ్యాపార రంగములలో ప్రతిభావంతులను జేసి, తద్వారా ఐహికముగా సిరిసంపదలతోబాటు,  ఆధ్యాత్మికతయందు జీవనసరళిని పొందుచూ తరించువారిగా అనుగ్రహించును.


పరమేశ్వరి చతుష్షష్టికళా స్వరూపిణి. అరువదినాలుగు కళలను మాలగాధరించి విరాజిల్లుచున్నదియను భావముచే కళామాలా యని అనబడినది.

జగన్మాత షోడశకళాప్రపూర్ణ. అనగా

చంద్రుని పదహారు కళలను తనవిగా జేసుకుని విరాజిల్లుచున్నది జగన్మాత. ఆ షోడశ కళలు 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5…

: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


220వ నామ మంత్రము 24.01.2021


ఓంమహైశ్వర్యాయై నమః


నిరతిశయమైన ఈశత్వము, సంపద, ఈశ్వర విభూతి అనంతముగా కలిగిన జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహైశ్వర్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహైశ్వర్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితా పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపూరిత హృదయంతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి అనంతమైన జ్ఞానసంపదలను ప్రసాదించును.


జగన్మాత మువురమ్మల మూలపుటమ్మ. గనుక సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి. అష్టలక్ష్మీ స్వరూపిణిగా ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి,  ధైర్య లక్ష్మి, రాజ్య లక్ష్మి, జయ లక్ష్మి,  జ్ఞాన లక్ష్మి, సంతాన లక్ష్మి, శౌర్య (వీర) లక్ష్మిగా భక్తులకు అష్టైశ్వర్యప్రదాయనియై విరాజిల్లుచున్నది. గనుకనే మహైశ్వర్యా యని అనబడినది.  


ఒకసారి శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి …

 శ్రీశంకరభగవత్పాదాః   

       విజయంతే

🌹🌹🌹🌹🌹🌹

-----------------------------

 🔴 శ్రీమాత్రేనమః 🔴


శ్రీశంకర భగవత్పాదాః విజయంతే


కర్మఫలములందాసక్తి కలుగుచుండ

జన్మలెత్తెడి యోగంబు జరిగితీరు

కరిగి పోవగనయ్యది కర్మ తీర

జన్మనందక ముక్తుడై చనగనోపు


(తోపెల్ల సత్య నారాయణ మూర్తి,

అమలాపురం.)


🙏🙏🙏🙏🙏🙏

-----------------------------

శ్రీ సమర్థ రామదాసు స్వామి వారి జీవిత చరిత్ర

    సత్యాత్మ

ఆడియో నం.22


శ్రీకృష్ణ కర్ణామృతం.

     --  లీలాశుకుల రచన 

  

ఆడియో నం.22


🌀👂🍯🎊💖🎊👂🍯🌀

 శ్రీ భాస్కర స్తోత్రం

[అథ పౌరాణికైశ్శ్లోకై రాష్ట్రై ద్వాదశాభిశ్శుభైః | 

ప్రణమేద్దండవద్భానుం సాష్టాంగం భక్తిసంయుతః ||]


1) హంసాయ భువన ధ్వాంత ధ్వంసాయాఽ మితతేజసే |హంస వాహన రూపాయ భాస్కరాయ నమో నమః ||

2) వేదాంగాయ పతంగాయ విహంగా రూఢగామినే |హరిద్వర్ణతురంగాయ భాస్కరాయ నమో నమః ||

3) భువనత్రయ దీప్తాయ భుక్తిముక్తి ప్రదాయ చ | భక్త దారిద్ర్య నాశాయ భాస్కరాయ నమో నమః ||

4) లోకాలోక ప్రకాశాయ సర్వ లోకైక చక్షుషే |లోకోత్తర చరిత్రాయ భాస్కరాయ నమో నమః ||

5) సప్తలోకప్రకాశాయ సప్తసప్తిరథాయ చ |సప్తద్వీపప్రకాశాయ భాస్కరాయ నమో నమః ||

6) మార్తాండాయ ద్యుమణయే భానవే చిత్రభానవే |ప్రభాకరాయ మిత్రాయ భాస్కరాయ నమో నమః ||

7) నమస్తే కమలానాథ నమస్తే కమలప్రియ |నమః కమలహస్తాయ భాస్కరాయ నమో నమః ||

8) నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణ…


శ్రీ సమర్థ రామదాసు స్వామి వారి జీవిత చరిత్ర

శ్రీకృష్ణ కర్ణామృతం.

     --  లీలాశుకుల రచన 

  

ఆడియో నం.23

స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు


ప్రకృతి నుండి అన్నింటినీ పొందాలని అనుకుంటాం. కానీ ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి, పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది.


🕉🌞🌏🌙🌟🚩


ఉపనిషత్తులు అనే పూదోటనంతటిని వెదకి, సేకరించిన సత్యాలను ఒకటిగా చేర్చి రచించిన అందమైన పూబంతి భగవద్గీత.


🕉🌞🌏🌙🌟🚩


 ఆత్మలోకమునకు, ప్రాపంచికమైనటు వంటి లోకములకు వ్యత్యాసము ఉన్నది. ఈ ఆచార వ్యవహారములన్నీ లోకము నందు ఒకరి యందు ఒకరికి ఉండేటటువంటి ఇష్టాఇష్టములను బట్టి, ఒకరి యందు ఒకరికి ఉండేటటువంటి అవసరములను బట్టి ఒక వ్యాపారదృష్టితో ఏర్పడుతూ ఉంటాయి. అలోకమైన ఆత్మలోకమందు ఆ దృష్టి ఉండదు. ఒక కార్యాన్ని నిర్వర్తిస్తూ సంఘములో కీర్తి కలుగుతుందనేటటువంటిది ఆత్మలోకములో ప్రధానమయినటువంటి విషయం కాదు.

 


ప్రతి ఇంట్లోనూ బారసాల నుంచి, సహస్రచంద్ర దర్శనం  వరకు మూడు తరాల కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. ఆత్మలోకముతో అనుసంధానం చెందుతున్నటువంటి వారికి, మనము పోవాలి అనే నియమము, నిబంధనలేదు. ఆత్మసాధనకు సంబంధములైన కార్యక్రమములు  మాత్రమే అనుసరిస్తూ, ఇతర కార్యక్రమాలను సున్నితముగా ప్రక్కకు నెట్టేయగలిగినటువంటి వాడే ఆత్మసంధానానికి ఎక్కువ యోగ్యత సంపాదించుకుంటాడు. 


🕉🌞🌏🌙🌟🚩

 మన కోరికలు ఎలా ఉండాలి ?

🕉🌞🌏🌙🌟🚩


-[మనమిచ్చే దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి]-



హరిద్వార్లో కొండగుహలో ఉండే స్వామీజీ వద్దకు ఇద్దరు స్త్రీలు వచ్చారు. స్వామిజీకి నమస్కరించి ఇలా ప్రశ్నించారు.. "స్వామిజీ ! మామనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు ! ఎప్పుడూ అశాంతితోనే ఉంటాము !! మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామీ !!" అంటూ అడిగారు. "ఏమిటమ్మా ! మీ మనసులో ఉన్న కోరిక ?" ప్రశ్నించాడు స్వామిజీ.



"నాకు ఎవరితో మాటపడవద్దని ఉంటుంది స్వామి ! నన్నెవరూ తిట్టవద్దు !! అని కోరుకుంటాను. కానీ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ వుంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది." చెప్పింది ఒక స్త్రీ !



"నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఖం వస్తూనే ఉంటుంది.. లేదా.. ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు".. చెప్పింది రెండవ ఆమె కూడా !! వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక పదినిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్ళి తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగాడు..



"చూడండీ ! మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది.. అంటే మన భావాలే మంత్రాలౌతాయి !!"



మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే... "కావాలా ?వద్దా ?? ...జరగాలా ? వద్దా ?? అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది." "భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి".



"స్వామీజీ ! భావాన్ని బట్టి అలవాట్లు అంటే ?" ప్రశ్నించారు ఒకరు. స్వామీజీ సమాధానమిస్తూ.. మనకోరికలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి ! నెగిటివ్ గా ఉండవద్దు !!



"శతమానం భవతి" ..అంటూ వంద సంవత్సరాలు జీవించు !! ..అంటూ దీవిస్తామే తప్ప.. "నువ్వు నూరు సంవత్సరాల వరకు చచ్చిపోకు !!"..అంటూ దీవించము !!..అని చెబుతూ "అమ్మా ! నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా ? "ప్రశ్నించాడు స్వామి ఒకరిని.



"అవును స్వామీ ! నేను తప్పును ఓర్వనూ !! ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను !" అంది ఆమె.



"నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా ? నువ్వు !! "అంటూ రెండవ ఆమెను ప్రశ్నించాడు స్వామిజీ. "అవును స్వామీ ! కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలికపడుతుంది సమాధానమిచ్చింది రెండో ఆమె.

 


"అలవాట్లంటే ఇవేనమ్మా ! మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి !" ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి !



"మీరొకరికి జ్ఞానదానం చేశారు ! అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా ?తగ్గుతుందా ??" అడిగాడు స్వామిజీ.



"పెరుగుతుంది స్వామి" చెప్పారిద్దరొకేసారి. "సరే ! మరొకరికి ధైర్యం చెప్పారు ! అప్పుడు ధైర్యం పెరుగుతుందా ?తగ్గుతుందా ??" "పెరుగుతుంది స్వామి" చెప్పారు మళ్ళీ..



*మీరు జ్ఞానాన్ని.. ధైర్యాన్ని.. సంతోషాన్ని.. ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినపుడు.. మీరు విమర్శలనూ.. దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు కాబట్టి, అవి కూడా పెరుగుతూ పోతాయి కదా !!

"స్వామిజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ? " అంటూ ప్రశ్నించారు.*



స్వామిజీ సమాధానమిస్తూ... "అందుకే మనసులో ఎప్పుడూ నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు !"

"నేను మాటలు పడవద్దు !

నన్నెవరూ తిట్టవద్దు !!

నాకు దుఃఖాలు రావద్దు !!!

నేను అడుకోవద్దు !!!!" ...ఇలా !!

వద్దు ! ..కావాలా ? ..అనేది ముఖ్యం కాదు.. ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది.. ఆ భావమే ఒక మంత్రంలా పనిచేస్తుంది ! కాబట్టి వాటినే ఇలా అనుకోవాలి !



నేను పొగడబడాలి !

నేను బాగా కీర్తించబడాలి !!

నేను ఆనందంగా ఉండాలి !!!

నేను ధనవంతురాలను కావాలి !!!!

...ఇలా పాజిటివ్ గా ఉండాలి ! అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది. మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్ గా అనుకోండీ ! "అమ్మా ! నీ అదే కోరికను "నన్ను అందరూ పొగడాలి !" గా మార్చుకుని దాన్నే మననం చెయ్యు !!" అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి...

రెండవ ఆమె వైపు తిరిగి.."నువ్వేమో 'నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి' అనుకో !దాన్నే మననం చెయ్యి !" అంటూ చెప్పాడు. "సరే ! స్వామి !! ఈ క్షణంనుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము ! ఇది తొందరగా నెరవేరేలా ఇంకేదైనా రెమిడి చెప్పండీ !" అంటూ అడిగారు.

"సరే అమ్మా ! అలవాట్లను బట్టే ఫలితాలు ఉంటాయన్నాను కదా !! ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి ! ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం ఐదు గురినైనా పొగుడు ! తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ వెళ్లు !!"

ఇక నువ్వేమో కష్టాలు, దుఃఖాలు, బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను.. సంతోషాలను చెబుతూ నీ హ్యాపీ నెస్ ను పంచుతూ వెళ్లు ! అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో !! అంటూ రెమిడి సూచించాడు స్వామిజీ !

"అద్భుతం స్వామి !! చాలా బాగా చెప్పారు !" అంది మొదటి స్త్రీ."కదా !! స్వామిజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషమనిపించిందో !!! అంది రెండవ ఆమె. ఆ క్షణమే రెమిడి ప్రారంభించిన ఆ ఇద్దరినీ చూసి స్వామిజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపాడు !

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు.

దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి !ఉపనిషత్‌ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు.

నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది. వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి.

 యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు. కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే !

అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్‌ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు.

బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి. ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి.

జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి !

🌞🌏🌙🌟🚩

[14:54, 24/01/2021] +91 92915 82862: 🌷137 - మంద్రగీత🌷

🕉🌞🌎🌙🌟🚩

 పురుషోత్తమ ప్రాప్తి

7. సనాతనమైన నా అంశమే జీవలోకమున జీవుడైనది. మనస్సు ఆరవది అగు ఇంద్రియములను ప్రకృతి యందు ఉంచి సంచాలనము చేయించుచున్నది.


(సనాతనుడగు 'నే'నను తత్త్వమే జీవులుగా దిగివచ్చినది. దానికై జీవలోకం ప్రకృతి నుంచి సృష్టింపబడినది. గోడకన్నము నుంచి గది లోనికి ప్రవేశించిన సూర్యకిరణము గదికి అంతటికీ కొంత వెలుగు ఇచ్చును. కిరణము వచ్చుదారిలో ఉన్నవే కాక అటు ఇటు ఉన్న వస్తువులు కూడా కొంత కొంత కనిపించును. అట్లే సనాతనమైన పురుషుని అంశ గదులు గదులుగా స్థూల లోకములలోనికి దిగిరాగా ఒక్కొక్క లోకమునకు తగినంత ప్రజ్ఞ పని చేయుచున్నది. ఈ ప్రజ్ఞల లేత ముదుళ్ళన్నియు కలసి 'నే'నను ప్రజ్ఞను ఆశ్రయించి జీవుడనబడుచున్నవి. గోళ్లు, వెంట్రుకలు, పులిపిరికాయలు మున్నగు వానితో కలిసియే వ్యక్తి గౌరవింపబడుచున్నాడు. వ్యక్తుల పేర్లు, దుస్తులు మున్నగు నిర్జీవ పదార్ధములతోను, చర్మాదులతోను కలిసి వ్యక్తికి చెందుచున్నవి. జీవి అనగా సృష్టి అను వస్త్రము, శరీరాదులు ధరించిన 'నే'నను సనాతనుడు. మిగిలినవి వాని అంశలు. వ్యక్తికి చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు మున్నగునవి అతని అంశలు. ఇట్లే సృష్టియందలి ప్రకృతి పొరలన్నియు సనాతననుని అంశములు. ఈ పొరల్లో నుండి సనాతనుని వెదకునట్టి మార్గమే వెనుదిరగని బాట.

ఇంద్రియములు మనష్షష్ఠములు. అనగా మనస్సును ఆరవ దానినిగా కలవి. ప్రతి ఇంద్రియము నుండియు మనస్సే పని చేయుచున్నది గనుక ఇట్లు వర్ణింపబడినవి. మనస్సను మొగ్గ నుండి వీనిని విచ్చుకొనిన ఐదు రేకలు అనవచ్చును. ప్రతి రేకకును పువ్వు కేంద్రమే ఆధారము. దాని నుండియే ఆహారాదులు పోషింపబడును. ఒక్కొక్క పువ్వునకు దాని ఆకారమెట్లు మారక నియతమై యుండునో, మనస్సునకు ఇంద్రియములకు వాని స్వభావ చేష్టలకి నట్లే. కనుక ఇవి అన్నియు స్వభావ మనబడు ప్రకృతి నుండి, ప్రకృతి వలన ఉద్భవించుచున్నవి. 'నేను' అను పరతత్త్వము నుండి ప్రకృతి పుట్టినది. ఈ ప్రకృతిలో పరతత్త్వము అంశగా ఉన్నది. అంశ అనగా వికాసములో కొంత అనియే గాని కొంత భాగమని కాదు. నేతికి పేరిన నెయ్యి యొక అంశ. ఇది స్థితి భేదముచే పరిణామముగా నిద్రించి సన్నగిల్లిన మూలతత్త్వము తెలియజేయును. కరగిన నేతిలో అడుగున నున్న వస్తువు కనిపించును. పాత్రను బట్టి ఆకారము మారును. నెయ్యి పేరుకొనగా ఈ రెండు శక్తులను కోల్పోవును. దానికొక ప్రత్యేక లక్షణ సముదాయము ఏర్పడును. అట్లే జీవునకు జీవ లక్షణములు, మనస్సునకు ఇంద్రియములకు వాని లక్షణములు తాత్కాలికముగా వర్తించును. బాహ్య స్పర్శలు ఇంద్రియములను లాగును. ఇంద్రియములు మనస్సును లాగును. మనస్సు బుద్ధిని, చిత్తమును, అహంకారమును లాగును. ఒక్కమారు 'నే'నను తత్త్వము వీని నన్నిటిని తనలోనికి ఆకర్షించును. కనుక ఇవి అన్నియు 'నే'నను శాశ్వత పురుషుని నుండి అంశలుగా వచ్చి వర్తించుచున్నవి. ఇట్లు వెదకుకొనవలసిన మార్గమేర్పడియున్నది.)


🕉🌞🌎🌙🌟🚩


-శ్రీ రామదాసు కీర్తన

(మణిరంగు రాగం/

త్రిపుట తాళం)

ప: నందబాలం భజరే బృందావన వాసుదేవం || నందబాలం ||

చ1: జలజసంభవాది వినుత చరణారవిందం

లలిత మోహన రాధావదన నళిన మిళిందం || నందబాలం ||

చ2: నిటలతటస్ఫుట కుటిల నీలలక బృందం

ఘటిత శోభిత గోపికాధర మకరందం || నందబాలం ||

చ3: గోదావరీ తీరవాస గోపికా కామం

ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం || నందబాలం ||

🕉🌞🌏🌙🌟🚩

|శ్రీమన్నారాయణీయము||

*అష్టమ స్కంధము 26వ దశకము - గజేంద్రమోక్షణము వర్ణనము/

26-6-శ్లోకము*

🕉🌞🌎🌙🌟🚩


ఆర్తివ్యక్తప్రాక్తనజ్ఞానభక్తిః శుండోత్ క్షిప్తైః పుండరీకైస్సమర్చన్।

పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్ఠం స్తోత్రశ్రేష్ఠం సో౾న్వగాదీత్ పరాత్మన్।।


భావము:- ప్రభూ! నారాయణమూర్తీ! అశక్తుడైన గజేంద్రుని హృదయము వేదనాభరితముకాగా అతనిలో నిభిడీకృతమై ఉన్న భక్తి జ్ఞానములు బహిర్గతమయ్యెను. తోడనే, ఆ సరస్సునగల తామర పువ్వులను తన తొండముతో ఎత్తి నీకు సమర్పించుచు - పూర్వము తను అభ్యసించిన ' పరబ్రహ్మ తత్వమును' ( ఏ విశేషమూ ఆపాదించ బడని నిర్వి శేషము) స్తోత్రము చేయుచు నిన్ను స్మరించసాగెను.


వ్యాఖ్య:-


గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు.



ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.



చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.

ఇక్కడ పోతనగారి పద్యం స్మరణీయం.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

భావం:-

 ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.

ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను" అని ఆర్తితో ప్రార్ధించాడు ఆ గజరాజు.


🕉🌞🌎🌙🌟🚩

[15:01, 24/01/2021] +91 92915 82862: 18-64-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అ||  అర్జునునిపై ప్రీతిగలిగి శ్రీకృష్ణభగవానుడు అతిరహస్యమైన, సారభూతమైన ఒకటి రెండు వాక్యములను మఱల చెప్పదలంచి యిట్లు నుడువుచున్నారు-



సర్వ గుహ్యతమం భూయః 

శృణు వేు పరమం వచః | 

ఇష్టోఽసి మే దృఢమితి 

తతో వక్ష్యామి తే హితమ్ || 


తా:- (ఓ అర్జునా!) రహస్యము లన్నిటిలో పరమ రహస్యమైనదియు, శ్రేష్టమైనదియునగు నా వాక్యమును మఱల వినుము. (ఏలయనిన) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఇక్కారణమున నీయొక్క హితమునుగోరి మఱల చెప్పుచున్నాను.



వ్యాఖ్య:-


"సర్వ గుహ్యతమమ్” - గుహ్యమ్ = రహస్యమైనది, గుహ్యతరమ్ = పరమరహస్యమైనది, గుహ్యతమమ్ = మిగుల పరమరహస్యమైనది, సర్వగుహ్యతమమ్ = మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది. - ఈ ప్రకారముగ శ్రీకృష్ణపరమాత్మ తాను వేయగలిగినన్ని విశేషణములన్నిటిని వేసి ఈ పదమును ప్రయోగించిరి. బోధయొక్క రహస్యత్వపరిమాణము, ప్రభావము దీనిచే గోచరమగుచున్నది. మఱియు చెప్పబోవు బోధయందు పరమ విశ్వాసము, కుతూహలము ఈ పదముచే ఏర్పడుచున్నవి.



"భూయః” - మఱల చెప్పుచున్నాను వినుము. శిష్యునిపైగల వాత్సల్యముచే గురువాతనికి బోధను మఱల మఱల చెప్పును. చెప్పినదానినే మఱల జ్ఞాపకము చేయును. క్రిందటి శ్లోకమున " ఇతి తే జ్ఞాన మాఖ్యాతమ్” అను వాక్యమును చెప్పి భగవానుడు గీతా బోధనంతను పరిసమాప్తము చేసిరి. అయినను అర్జునునిపైగల వాత్సల్యముచే ప్రేరితుడై మఱల కొంత ఉపదేశము చేయదలంచి ఈ వాక్యములను తిరిగి వచించిరి.



"పరమం వచః” - అని చెప్పుటవలన ఈ చెప్పబోవు వాక్యములు పరమోత్కృష్టములని స్పష్టమగుచున్నది. సాక్షాత్ భగవంతుడే వానిని ఉత్కృష్టములని పేర్కొనుటవలన ఆ వాక్యములపై జనులెంతటి విశ్వాసము గలిగియుండవలెనో ఊహించుకొనవచ్చును.



“ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్" - గురువుయొక్క ఇష్టమును సంపాదించుకొనుటలోనే ఉన్నది శిష్యుని ప్రజ్ఞ, గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్పవరప్రసాదము. ఏలయనిన, ప్రీతిపాత్రుడగు శిష్యునకే గురువు తన హృదయమును విప్పి అతిరహస్యములైనవానిని ఉపదేశించును.



 కనుకనే సేవాశుశ్రూషలద్వారా, నమస్కారాదులద్వారా, వినయవిధేయతలద్వారా గురువు యొక్క ప్రీతిని, ఇష్టమును సంపాదించుకొనినచో ఇక ముక్తిమార్గము శిష్యునకు చేతికి అందినట్టే యగును. ఈ విషయమునే భగవానుడు " తద్విద్ధి ప్రణిపాతేన…..” (4–34) అను శ్లోకముద్వారా పూర్వము స్పష్టపఱచియుండిరి.



ఇచట అర్జునుడు గురువగు శ్రీకృష్ణునకు ప్రీతిపాత్రుడయ్యెను. ఈసంగతిని శ్రీకృష్ణుడే 'ఇష్టోఽసి మే దృఢమితి' అను వాక్యముద్వారా తేటతెల్లమొనర్చిరి. హృదయమెపుడు పరిపక్వమై, నిర్మలమై, భక్తియుతమై యలరారునో, అపుడు గురువాతనిని వెతకి కొనుచువచ్చి ఆతనిహృదయక్షేత్రమునందు జ్ఞానబీజమును నాటిపోవును. చరిత్రలో అనేక దృష్టాంతము లిట్టివి కానంబడుచున్నవి.



 ప్రస్తుత సందర్భమునగూడ అర్జునుడు పరిపక్వ నిర్మలహృదయుడుగా నుండుటంబట్టి సాక్షాత్ భగవానుడే అర్జునునకు స్వయముగ హితమును బోధించిరి. మోక్షమునకు ఎవరు దారిచూపుదురాయని చింతింప పనిలేదు. వారి వారి హృదయమును, మనస్సును, భక్తిసంయుతముగ, పవిత్రముగ నుంచుకొనిన చాలును. సద్గురువుల యొద్దకు చేర్చును. లేక తానే వారిహృదయమున సద్బోధలను గావింపజేయును.



"నీవు నాకు ఇష్టుడవైనందువలన నీకు హితమును చెప్పుచున్నాను" అని భగవానుడు అర్జునునితో చెప్పుటవలన సర్వేశ్వరునియొక్కయు, సద్గురువులయొక్కయు అనుగ్రహమును సంపాదింపనివారికి వారిద్వారా బోధయు లభింపకుండునని స్పష్టమగుచున్నది.



కనుకనే శాస్త్రములలో పెక్కుచోట్ల ఈశ్వరానుగ్రహములేనిచో, సద్గురువుల అనుగ్రహములేనిచో అద్వైతజ్ఞానము (ఆత్మసాక్షాత్కారము) కలుగజాలదని చెప్పబడినది. కాబట్టి ముముక్షువులగు సాధకులందరును ఇవ్విషయమున కడు జాగరూకులై సర్వేశ్వరునియొక్కయు, సద్గురువులయొక్కయు అనుగ్రహమును సంపాదించుటకొఱకై నామస్మరణ, పూజా, సేవాదికార్యములను జేయుచు భక్తిభావసమన్వితులై యుండవలెను.



ప్ర:- శ్రీకృష్ణమూర్తి అర్జునునకు తిరిగి యెట్టి బోధను చెప్పదలంచిరి?


ఉ: - అతి రహస్యమై, సర్వోత్కృష్టమైనట్టి బోధను.



ప్ర:- శ్రీకృష్ణమూర్తి గీతాశాస్త్రమును అర్జునునికే ఏల బోధించిరి?


ఉ:- అర్జునుడు శ్రీకృష్ణునికి పరమప్రీతిపాత్రుడు కనుక (ఇష్టోఽసి మే దృఢమితి).


🕉🌞🌎🌙🌟🚩

[15:54, 24/01/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -132 🌹

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚

శ్లోకము 17


🍀. 15. అపునరావృత్తి -  సర్వమునకు ఆధారమైన తత్వము నందు తమ బుద్ధిని నిలుపువారు, నేను' అను అహంకారమును, నేను' అను  సర్వాంతర్యామి ప్రజ్ఞయందు స్థిరముగ నిలుపువారు ఆ తత్వము నందే నిష్ఠగలవారు, అదియే తానైన వారు. పునరావృత్తిలేని స్థితిని పొందు చున్నారు. జ్ఞాన మనగ ఆ తత్త్వముతో ముడిపడుటయే అట్టి వారిని పాపము లంటవు. ఉన్నది యొకటే. దానినే సత్యమందురు.  అన్నిటి యందున్నను, అన్నిటికి అతీతముగ నుండునది, అన్నిటికి ఆధారమై యుండునది ఈ తత్త్వము. దానితో ముడిపడి యుండుట నిజమగు జ్ఞానము, నిజమగు భక్తి, నిజమగు యోగము, నిజమగు సన్న్యాసము, వైరాగ్యము. బుద్ధి చేతను, స్మరణ చేతను, నిష్ఠ చేతను దానియందు స్థిరపడినవారు శాశ్వతులు. అట్టివారిని త్రిగుణాత్మకమగు ప్రకృతి ఆర…

[15:54, 24/01/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 332 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

83. అధ్యాయము - 38


🌻. క్షువదధీచుల వివాదము  - 4 🌻


క్షువ మహారాజు ఇట్లు పలికెను -


హే భగవన్‌! ధర్మములు తెలిసినవాడు, వినయముతో నిండిన మనస్సు గలవాడు, దధీచుడని పేరు బడిసినవాడు అగు ఒకానొక బ్రాహ్మణుడు నాకు పూర్వము మిత్రుడుగ నుండెడివాడు (54). మృత్యుంజయుడు, దోషరహితుడు, మహాదేవుడు అగు శంకరుని ఆరాధించి ఆతడు ఆ ప్రభావముచే సర్వకాలములయందు సర్వులకు వధింప శక్యము కాని వాడుగా అయినాడు (55). 


మహాతపస్వియగు ఆ దధీచి సభామధ్యమునందు అవమానకరముగా తన ఎడమకాలితో నా శిరస్సుపై వేగముగా తన్నెను (56). మరియు 'నేను మృత్యుంజయుని వద్దనుండి మంచి వరములను పొందియున్నాను గాన, నేను దేనికీ భయపడను ' అని ఆతడు గర్వముతో పలికెను. హే విష్ణో! ఆతడు అతిశయించిన గర్వము కలిగియున్నాడు (57).


[15:54, 24/01/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 217 🌹


🌻. జైమినిమహర్షి  - 2 🌻


06. వ్యాసమహర్షి ఎప్పుడయితే కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు వుభాగాలు ఈ విషయంలో చేసారో; ఏది అనుసరణీయం, ఏది ప్రధానమైనది అనే ప్రశ్న సహజంగా పుట్టింది. అంతకుముందు అదీ ఉంది, ఇదీ ఉంది. వేద్దంతులున్నారు. విజ్ఞానవేత్తలున్నారు. బ్రహ్మలున్నారు. మోక్షకాములున్నారు. మోక్షంకొరకే జీవించేవాళ్ళున్నారు. కర్మకాండకూడా ఉన్నది. 


07. ఆ విధంగా వేదంలో ఈ రెండువిభాగాలలో ఏది అత్యుత్కృష్టమైనది, ఏది అనుసరణీయము, సర్వులకూ విధిగావుండి, అందరికీ అనుసరణీయమయిన మతం ఒకటున్నాదా అని ప్రశ్న వచ్చినప్పుడు; దానికి సమాధానంగా జైమిని తన మతాన్ని ప్రతిష్ఠచేసాడు. 


08. ఎన్నిరకాలుగా జైమిని గురించి మనం సమర్థించే ప్రయత్నంచేసినా, వ్యాసమతం జైమినిమతం కాదు. జైమినిమతం వ్యాససమ్మతం కాదు. ఇద్దరికీ వేదమే …

[15:54, 24/01/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 156 🌹


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 1 🌻


గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః


612. భగవంతుని 10 వ స్థితిలో నున్నవారు సద్గురువులు, అవతారపురుషుడు.

613. భగవంతుని 10వ స్థితిలో సద్గురువు, భగవంతుని అనంతజ్ఞాన,శక్తి,ఆనందములను అనుభవించుటయే కాక, వాటిని భగవత్కార్కాలయము ద్వారా పరులకై వినియోగపరచును.

614. మానవునిగా ఉన్న భగవంతుడు, భగవంతుని స్థితిలో గమ్యస్థానమును చేరిన తరువాత చాలా అరుదుగా తన అనంతానందమును వీడి, సాధారణ చైతన్య స్థితికి క్రిందకి దిగివచ్చును.అనగా భగవంతుని జీవితములో స్థిరపడును ఇచ్చట మానవునిలో భగవంతుని జీవితము ప్రతిష్ఠింపబడినది. ఇదియే ఆత్మ ప్రతిష్టాపనము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీలలితా సహస్రనామ భాష్యము


795వ నామ మంత్రము 25.01.2021


ఓం కామదుఘే నమః


కోరికలను తీర్చుటలో కామధేనువు వంటి జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామధుక్ అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం కామదుఘే నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తితో ఆరాధించు సాధకులకు ఆ తల్లి సర్వాభీష్టములను తీర్చును.


జగన్మాత భక్తులకోర్కెలను తీర్చుటలో కామధేనువు వంటిది.

భక్తాభీష్టప్రదాయని. భక్తులకు వారి ధర్మబద్ధమైన కోర్కెలను తీర్చుటలో జగన్మాత కామధేనువు వంటిది. అనగా పరమేశ్వరి కామధేనుస్వరూపురాలు. గోవుల‌న్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. అయితే ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలో కామ‌ధేనువు కూడా మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తుంది. ఈ ఆవునే సుర‌భి…

[03:54, 25/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


221వ నామ మంత్రము 25.01.2021


ఓం మహావీర్యాయై నమః


అనన్యసామాన్యమైన వీరధర్మము, శౌర్యము, పరాక్రమము మొదలైన మహావీరలక్షణములతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహావీర్యా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహావీర్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఎనలేని జ్ఞానబలము, బుద్ధిబలము, ఆయురారోగ్యములు ప్రసాదించి, పరిపూర్ణమైన భగవధ్యాననిమగ్నతను కలుగజేసి తరింపజేయును.


జగన్మాత రాక్షస సంహారములో చూపిన శౌర్యపరాక్రమములు, యుద్ధకుశలత, సృష్టి,స్థితి,లయకార్యములను నిర్వహించుటయందు నెరపిన కార్యదక్షత, సకల జగములను పరిపాలించుటలో చూపిన బుద్ధికుశలత - ఇవన్నీ మహిళ అబల కాదు సబల యని తెలియుటకు కావలసిన తార్కాణములు. గనుకనే    అమ్మవారు మహావీర్యా యని అనబడినది.


మహిషాసురుడు, భండాసురు…

[05:24, 25/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 619  / Bhagavad-Gita - 619 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 36 🌴


36. సుఖం త్విదానీం త్రివిధం శ్రుణు మే భరతర్షభ |

అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||


🌷. తాత్పర్యం : 

భరతవంశీయులలో శ్రేష్టుడా! ఇక సుఖము నందలి మూడురకములను గూర్చి నా నుండి ఆలకింపుము. వాని ద్వారా బద్ధజీవుడు సుఖము ననుభవించుట, మరికొన్నిమార్లు సర్వదుఃఖముల అంతమును చేరుట జరుగుచుండును.


🌷. భాష్యము  :

బద్ధజీవుడు భౌతికసుఖమును పదే పదే అనుభవింప యత్నించుచుండును. ఆ విధముగా అతడు రసరహిత పిప్పినే మరల మరల ఆస్వాదించుచుండును. కాని కొన్నిమార్లు అతడు మహాత్ముల సాంగత్యఫలముచే అట్టి భౌతిక భోగానుభావమనెడు బంధనము నుండి ముక్తుడగుచుండును.   


అనగా ఏదియోనొక ఇంద్రియ భోగము నందు సదా నియుక్తుడై యుండెడ…

[05:24, 25/01/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 249 / Vishnu  Sahasranama Contemplation - 249🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻249. విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ🌻


ఓం విశిష్టాయ నమః | ॐ विशिष्टाय नमः | OM Viśiṣṭāya namaḥ


విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ


విశిష్యతే సర్వం అతిశేతే విశేషించును; సర్వమును మించియుండును.


:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::

సీ.భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందఱు ధర్మ మనియుఁజర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని సరవిఁ గొందఱు శక్తి సహితుఁడనియుఁజింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁడనియుఁదొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుఁడ నీవు;తే.తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె?కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింప వలదు. (386)


నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు. నీవు ధర్మమని కొందరు త…

[05:25, 25/01/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 2 / VIVEKA CHUDAMANI  - 2 🌹


🌻 2. మానవ జన్మ  - 2 🌻

8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.

9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.

10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.

11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము 

నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగల…

[05:25, 25/01/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 12 🌹 


🌻 4. అశ్వవిద్య - 4  🌻


పర్జన్య శక్తి ఇట్లే భూమి జలములను ఆకాశమునకు గొనిపోవుట, ఆకాశజలములను భూమికి

కొనువచ్చుట చేయుచున్నది. 


ఈ రహస్యములను తెలుపు యజ్ఞమునే జ్యోతిప్టోమము అందురు. అగ్నికి వాయువునకు గల ఋతు నిర్మాణాత్మక శక్తి ఇందు చమత్కరింపబడినవి.

బ్రాహ్మీకరణములైన యజ్ఞములలో ఈ అశ్వవిద్యను అశ్వమేధ మందురు. 


మేధ్యమైన అశ్వము ఈ సంవత్సర విద్యయే. జ్యోతిర్మార్గమున జీవి శ్వాస గమనాగమనములను, జీవన్మరణములను, కర్మ ఫలములను తెలుసుకొనుటకు సర్వజ్ఞమగు స్వస్వరూప జ్ఞానమునకు ఈ విద్య దారితీయును. సమస్తములకు మూల కారణమైన ఆత్మ తత్వము లేక సూర్య తత్వము ఒక అశ్వము శిరస్సుగా రూపింబడినది. 


ఉషస్సు అశ్వమునకు శిరస్సని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పు చున్నది. ఈ ఉషస్సు ప్రతి దినము ప్రారంభము నందు, ప్రతి సంవత్సర ప్రా…

 బంధాలు వదిలితేనే స్వేచ్ఛ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀*


మార్మికమైన జీవితంలో నిజాలతో నింపలేని ఖాళీలు మీకు చాలా కనిపిస్తాయి. మీలోని భావాలే వాటికి ప్రత్యామ్నాయాలు. అందువల్ల ఆ ఖాళీలను మీరు మీ భావాలతో నింపి, జీవితం మీకు పూర్తిగా అర్థమైనట్లు తృప్తి పడడం ప్రారంభిస్తారు.


ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.


‘‘అండర్‌స్టాండ్’’ అనే పదానికి ఉన్న అసలైన అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? దాని అసలైన అర్థం ‘‘మీకింద నిలబడి ఉండేది’’అని. ఇది మీకు వ…

[05:25, 25/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 9 / Bhagavad-Gita - 9 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 9  🌴


9. అన్యే చ బహవ: శూరా 

మదర్థే త్యక్తజీవితా: |

నానాశస్త్రప్రహరణా: 

సర్వే యుద్ధవిశారదా: ||


🌷. తాత్పర్యం : 

నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలువిధములైన ఆయుధములను దాల్చినవారు మరియు యుద్ధనిపుణతను కలిగినవారును అయియున్నారు. 


🌻 . భాష్యము: 

జయద్రదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై యున్నారు. వేరుమాటలలో పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరును మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయింపబడినది. కాని దుర్యోధనుడు మాత్రము పైన తెలుపబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు విజయము తప్పక లభిం…

[05:25, 25/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 189  / Sri Lalitha Chaitanya Vijnanam  - 189 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |

దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖


🌻 189. 'దుర్గమా' 🌻


దాట శక్యము కానిది శ్రీమాత అని భావము.


దుర్గమనగా కోట. కోటను దుర్గము అనుటలో, ఛేదింపలేనిది, భేదింపలేనిది, దాటిపోలేనిది అని అర్థములు తెలియును. గమము అనగా సాగుట. దుర్గమము అనగా సాగిపోవుటకు వీలులేనిది. శ్రీమాత సంకల్పము లేనిచో (అనుగ్రహము లేనిచో) సృష్టి యందు ఏ జీవియూ సాగిపోలేదు. అవరోధము లేర్పడును. 


జీవితమున అపరాధము లేర్పడుటకు కారణము దుర్గ అనుగ్రహము లేకపోపుటయే. ఇట్టివారికి అడుగడుగునా చిక్కులు పడుచుండును.…

[15:34, 25/01/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩


శ్రీ సమర్థ రామదాసు స్వామి వారి జీవిత చరిత్ర


🎤ఆడియో నం-3


🕉🌞🌎🌙🌟🚩

[15:39, 25/01/2021] +91 92915 82862: 🌀👂🍯🎊💖🎊👂🍯🌀


శ్రీకృష్ణ కర్ణామృతం.

     --  లీలాశుకుల రచన 

  

ఆడియో నం.23



శ్రీ శివ షడక్షరీ స్తోత్రమ్


1) ‖ఓం ఓం‖ 

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః|కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ‖

2) ‖ఓం నం‖

నమంతి మునయః సర్వే నమంత్య ప్సరసాం గణాః | నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ‖

3) ‖ఓం మం‖

మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం | మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ‖

4) ‖ఓం శిం‖

శివం శాంతం శివాకారం శివాను గ్రహకారణం | మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ‖

5) ‖ఓం వాం‖

వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం | వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ‖

6) ‖ఓం యం‖

యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం |యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ‖

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యు భయం కుతః ‖

శివశివేతి శివేతి శి…

శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.

రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.

  పాప లక్షణము-పాప నిర్ణయము.

ఆడియో నం.24

(పొరపాటుగా 23గా చెప్పడం జరిగింది)

💥🎊💥🎊💥🎊💥🎊💥🎊


*నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు కాని మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది.

*మైత్రేయ స్తోత్రము చేస్తున్నప్పుడు మనము మానసికముగా శ్రావస్తి గుహలకు వెళ్లినట్లుగా ఊహించుకోవాలి. ఆ శ్రావస్తి గుహ ముఖమున ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఏ లైట్ లేకుండా రావి చెట్టును  రాత్రిపూట ఒక్క సారి చూస్తే ఆకులు కదులుతాయి. వెండి కదులు తున్నట్లుగా ఉంటుంది. చక్కని తెలుపు,  నీలిమ కాంతి  వాటి మీద పడి మెరుస్తుంటాయి. ఆ చెట్టు ప్రత్యేకత అది.  అనుభూతి అంతా రాత్రికి సంబంధించినది.

*'జగద్గురో నమస్తుభ్యం' అన్నప్పుడు సరాసరి  ఆ గుహ ప్రాంతానికి వెళ్లినట్లు, ఎదురుగుండా ఒక చక్కటి పుష్టికరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి రావిచెట్టు ఉన్నట్లు, ఆకులన్నీ రాలుతూ ఉన్నట్లు భావన చేయాలి. ఆ చెట్టు క్రింద మైత్రేయ మహర్షి  ఆశీనులైనట్లు, వారి పాదుకలు అక్కడ ఉన్నట్లు భావన చేయాలి. ఆయన అక్కడే కూర్చొని యాభై సంవత్సరాలు వారి గురువైన పరాశర మహర్షి దగ్గర విష్ణుపురాణము వ్రాసారు. ఆ ప్రదేశము మైతేయుల వారికి ఇష్టమైన ప్రదేశము. ఎందుకంటే తన గురువు గారితో యాభై ఏళ్లు కాపురము చేసినటువంటి చెట్టు అది. ఎక్కువగా  ఆ చెట్టు దగ్గరే దర్శనమిస్తారు.

 *మైత్రేయ స్తోత్రము ఉదయము, సాయంత్రము చదువుతున్నప్పుడు  మన ప్రజ్ఞ స్థానికముగా ఉండకూడదు.

: మృదు భాషణం


-[భావ వ్యక్తీకరణకోసం భగవంతుడిచ్చిన మహత్తరమైన శక్తి- మాట]-

నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.

గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు. మృదుభాషణం మనుషులందరిలో కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి.

వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు. పరస్పరం అవిశ్వాసం కలిగించే మాటలే మనుషులొకరినొకరు చూసి భయపడటానికి కారణమన్నారు గాంధీజీ.

మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడుతున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు. ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు.

రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే. మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి.

వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది.

వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి. భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు.

మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం.

వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు !


[16:03, 25/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(782)

🕉🌞🌎🌙🌟🚩


"స్వామికార్యం, స్వకార్యంల ద్వారా 'అసలునేను', 'దొంగనేను'లను ఎలా తెలుసుకోవచ్చు !?"

సూక్ష్మంగా ఉన్న సత్యం గ్రహింపులోకి రావటమే గురువుదయ. తొలి ఎరుక ఎలాగైతే దైవకార్యమో దాన్ని గుర్తించే శక్తి గురువుదయ. స్వామికార్యంగా ఉన్న ఆ శుద్ధ ఎరుకే భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పిన 'అసలునేను'. స్వకార్యంగా కనిపిస్తున్న అహంకారమే 'దొంగనేను'. అద్దంపై సూర్యకాంతి పడిన తర్వాత అది పరావర్తనం చెంది గోడపై పడుతుంది. మనలో జరిగే స్వామికార్యం-స్వకార్యం అలాగే ఉంటాయి. మన ప్రతి కదలికలోనూ ఉన్న స్వామి-స్వకార్యాలను గుర్తించటం అలవర్చుకుంటే అది నిత్యసాధనగా మారి మనను సహజసమాధిలో ఉంచుతుంది. ఇలా గమనింపు ద్వారా మన ప్రతి కదలికను విచారించి, సత్యాన్ని గుర్తించే సహజ విధానానికే ఆత్మవిచారణ అని పేరు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

'స్వకార్యానికి ముందు స్వామికార్యం చూడాలి'- (అధ్యాయం -96)


🕉🌞🌏🌙🌟🚩

[16:03, 25/01/2021] +91 92915 82862: "ఋభుగీత" (249)

🕉🌞🌏🌙🌟🚩


ఆత్మవైభవము"

17వ అధ్యాయము 


విష్ణువు పోషకుడుగా.. శివుడు విషహరుడుగా... మనలోనే ఉన్నారు !


దైవాన్ని మర్చిపోవడం అంటే మనని మనం మర్చిపోవడం. దైవాన్ని స్మరించడం అంటే మన స్వస్వరూప స్మరణమే ! దైవం అంటే మనకు భిన్నమైనది కాదు. మనలోని "నేను భిన్నం" అనే ఆ ద్వైతభావాన్ని పొగొట్టేది. దైవంతో మనం అభిన్నమని తెలిస్తే ఈ సృష్టితో కూడా భిన్నంగా లేదని తెలుస్తుంది. సత్యం ఉన్నచోట ద్వైతం ఉండదు. ఆ సత్యభావన కోసం మనకు ఉపకరించే సాధనమే సత్సంగం. విష్ణువు పోషకుడుగా, శివుడు విషహరుడుగా ఉంటారు. వీరిద్దరూ ఆ గుణాల రూపంలో మనలోనే ఉన్నారు. భుజించిన ఆహారాన్ని పోషణగా మార్చేశక్తి, పనికిరాని దాన్ని విసర్జించే శక్తి మనలోనే ఉన్నాయి. అవి శివకేశవుల ప్రతిరూపాలే !


🕉🌞🌏🌙🌟🚩

[16:07, 25/01/2021] +91 92915 82862: 🌷138 - మంద్రగీత🌷


 పురుషోత్తమ ప్రాప్తి

8 శరీరమును పొందుచున్నదెవరు? దీనిని విడిచి పోవుచున్నది ఎవరు? అది నేనే. విడిచి పోవునప్పుడు మనసును ఇంద్రియములను గొనిపోవుచున్నాను. గాలి పూలవాసనలను ఎట్లు గొనిపోవునో అట్లు గొనిపోవుచున్నాను. కనుక వీనికి అన్నిటికి ఈశ్వరుడను నేను.

(నత్త పురుగు శరీరద్రవము నుండి చుట్టును నత్త గుల్ల కట్టుచున్నది. అట్లే ఈశ్వరుని ప్రకృతినుండి శరీరములు నిర్మాణమగుచున్నవి. నత్తగుల్ల నత్త పురుగు శరీరభాగముగా పనిచేయుచు దానితో పాకి వచ్చుచున్నది. కాని ఆవశ్యకమగుచో నత్తగుల్లను విడిచి పురుగు వెలికి రాగలుగుచున్నది. పాము చర్మమే కుబుసము కాగా అందుండి పాము వెలువడగలుగుచున్నది. అట్లే ఈశ్వరుడు తన ప్రకృతి నుండి నిర్మాణమైన శరీరమును విడిచి పోగలుగుతున్నాడు).

(పోవునప్పుడు శరీరధారణ స్వభావమును మాత్రము తనతో గొనిపోవుచున్నాడు. కన్ను, ముక్కు, చెవి మొదలగు ఇంద్రియముల పెట్టెలను విడిచి పోవుచున్నాడు. కాని చూచుట, వినుట మున్నగు శక్తులను తనయందు భాగములుగా గొనిపోవుచున్నాడు. వానిని మనస్సునందు మనో ధర్మములుగా ఇమిడ్చి, ఈ మొత్తము మనసును మనశ్శక్తిగా సూక్ష్మపరచి, మనస్సు కూడా లేకుండా మనశ్శక్తిని గొనిపోవుచున్నాడు. ఉదాహరణమునకు ఒక నగరమున నిలిపిన ఒక కార్యాలయము మరియొక నగరమునకు మార్చబడినప్పుడు కార్యాలయమునకై నిర్మింపబడిన భవనము, కుర్చీలు, బల్లలు ఆ నగరముననే అమ్మబడుచున్నవి. వ్యక్తులు మాత్రము భవన నిర్మాణము చేయు కూలీలు శాస్త్రజ్ఞులతో ఇంకొక నగరమునకు పోవచ్చును. అచ్చట ఒక మైదానమున మరల అట్టి భవనమే నిర్మించి అవే స్థానములలో కుర్చీలు, బల్లలను నిలిపి, అవే స్థానములలో వారే అధికారులుగా కూర్చుండి, అవే కార్యములను మరల నిర్వహింతురు. ఇట్లు మనస్సును, ఇంద్రియములను ఈశ్వరుడు జీవుని అధికారమున తనతో గొని పోవును. గాలి సుగంధమును గొని రాగలుగుటయే దీనికి మనము గ్రహింపగలిగిన నిదర్శనము.).

🕉🌞🌎🌙🌟🚩


🕉🌞🌏🌙🌟🚩

[16:10, 25/01/2021] +91 92915 82862: 40-శ్రీ రామదాసు కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


(యమునాకళ్యాణి రాగం / ఆది తాళం)



ప: గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా


పరమ పురుష యే వెరవులేక నీ


మరుగుజొచ్చితిని అరమర సేయకు || గరుడ ||



చ 1: పిలువగానెరమ్మి అభయము తలుపగానె యిమ్మి


కలిమి బలిమి నాకిలలో నీవని


పలువరించితిని నను గన్నయ్య || గరుడ ||



చ 2: పాలకడలి శయన దశరధ బాల జలజనయన


పాలముంచు నను నీటముంచు నీ


పాలబడితి నిక జాలముసేయక || గరుడ ||



చ 3: ఏలరావు స్వామి నను యిపుడేలుకోవదేమి


ఏలువాడవని చాల నమ్మితిని


ఏలరావు కరుణాలవాల హరి || గరుడ ||



చ 4: ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల


చింత లణచి శ్రీరామదాసుని


అంతరంగ పతివై రక్షింపుము || గరుడ ||


🕉🌞🌏🌙🌟🚩

 *||శ్రీమన్నారాయణీయము|| అష్టమస్కంధము/26వ దశకము - గజేంద్రమోక్షము వర్ణనము/

26-7-శ్లోకము*

🕉🌞🌎🌙🌟🚩


ఆర్తివ్యక్తప్రాక్తనజ్ఞానభక్తిః శుండోత్ క్షిప్తైః పుండరీకైస్సమర్చన్।

పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్ఠం స్తోత్రశ్రేష్ఠం సో౾న్వగాదీత్ పరాత్మన్।।


భావము:-


ప్రభూ! నారాయణమూర్తీ! అశక్తుడైన గజేంద్రుని హృదయము వేదనాభరితముకాగా అతనిలో నిభిడీకృతమై ఉన్న భక్తి జ్ఞానములు బహిర్గతమయ్యెను. తోడనే, ఆ సరస్సునగల తామర పువ్వులను తన తొండముతో ఎత్తి నీకు సమర్పించుచు - పూర్వము తను అభ్యసించిన ' పరబ్రహ్మ తత్వమును' ( ఏ విశేషమూ ఆపాదించ బడని నిర్వి శేషము) స్తోత్రము చేయుచు నిన్ను స్మరించసాగెను.


వ్యాఖ్య:-


గజరాజు గొప్పబలంతో అనేక సంవత్సరాలు యుద్ధం జేసి చేసి చివరికి చితికిపోయాడు. తన సత్తువ శత్రువు బలం సరిపోల్చుకొని ఆలోచించుకొన్నాడు “అనవసర ప్రయత్నాలు నాకు ఎందుకు. దీనిని జయించటం, సరిసమంగా పోరాడటం రెండు నాకు సాధ్యంకాదు.” అని దుఃఖించాడు. పూర్వజన్మల పుణ్య ఫలం వలన కలిగిన మేలైన ఙ్ఞానం వల్ల అతడు ఈ విధంగా అనుకోసాగాడు.



ఈ మొసలిని ఏ విధంగా జయించగలను? ఇకపై నేను ఏదేవుణ్ణి ప్రార్థించను? ఎవరిని పిలవాలి? ఎవరు నన్ను రక్షిస్తారు? ఈ మహామొసలిని ఆపేశక్తి కలవారు ఎవరు? సర్వకార్యాలలో దిట్టలు గొప్పపుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా. అట్టి వారికిమొరపెట్టుకుంటాను.



చాలాకాలం నుంచి అడవిలో ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందుతు ఉన్నాను. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు నాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో బలంగా పెరిగిన మంచి గంధంచెట్ల నీడలలో సుఖంగా ఉండకుండ, నీటిమీద ఆశతో ఇక్కడకి ఎందుకు వచ్చాను. భగవంతుడా! చాలా భయం వేస్తోంది. ఎలానో ఏమిటో.



ఇక్కడ పోతనగారి పద్యం స్మరణీయం.


ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ;డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.


భావం:-


 ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో; ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను.



ఒకసారి లోకాలను సృష్టి చేసి, ఇంకొకసారి తనలో లయం చేసుకుంటు, ఆ లోకాలు రెండు తానే అయ్యి, అన్ని విషయాలను సాక్షీభూతంగా ఆలోకిస్తూ, ఆత్మలకు ఆత్మ అయిన ఆ పరమాత్మను ఆసక్తితో ధ్యానం చేస్తాను" అని ఆర్తితో ప్రార్ధించాడు ఆ గజరాజు.


🕉🌞🌎🌙🌟🚩

[16:14, 25/01/2021] +91 92915 82862: 18-65-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

 🕉🌞🌎🌙🌟🚩


అII తాను చెప్పదలంచిన పరమరహస్యమగు బోధను భగవానుడు రెండు శ్లోకముల ద్వారా చెప్పుచున్నారు –



మన్మనా భవ మద్భక్తో  

మద్యాజీ మాం నమస్కురు | 

మామే వైష్యసి సత్యం తే 

ప్రతి జానే ప్రియోఽసి వేు ||


తా:- నాయందు మనస్సునుంచుము, నాయెడల భక్తి గలిగియుండుము, నన్నారాధించుము, నాకు నమస్కరింపుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవైయున్నావు. కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞచేసి చెప్పుచున్నాను.



వ్యాఖ్య:- ఈ శ్లోకము, రాబోవు చరమశ్లోకము గీతాసారమును తెలుపునవియైయున్నవి. భగవానుడు అతిరహస్యమగు బోధను చెప్పెదనని పలికి వీనిని ప్రారంభించుటవలన ఈశ్లోకములయొక్క మహత్తు ఎట్టిదో ముందుగనే ఊహించుకొనవచ్చును. ఈ రెండు శ్లోకములందును మొదటిపాదము “సాధనను", రెండవపాదము "సాధ్యమును” తెలుపుచున్నవి. అనగా ఏ సాధనచేయవలెనో మొదటిపాదములో చెప్పి దానికి లభించు ఫలితమునుగూడ వెంటనే రెండవపాదములో చెప్పివైచెను. ఇచట నాలుగు సాధనలు పేర్కొనబడినవి.



(1) మనస్సును దైవమందు లగ్నముచేయుట (2) దైవమందు భక్తిగలిగియుండుట

(3) దైవమునే ఆరాధించుట

(4) దైవమునకే నమస్కరించుట. ఈ నాలుగు సాధనలను చేయువాడు లక్ష్యమగు పరమాత్మను తప్పక పొందగలడు (మామేవైష్యసి). పరమాత్మప్రాప్తియే ఈసాధనయొక్క ఫలితమైయున్నది.



కాబట్టి జనులు తమ మనస్సును ప్రాపంచిక దృశ్యవిలాసములనుండి, శబ్దాది విషయములనుండి మఱలించి ఆత్మయందే (దైవమందే) నెలకొల్పవలెను. మఱియు జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి బాహ్యవిషయములందు కలదో దానిని అచ్చోటనుండి మఱలించి భగవంతునియందు స్థాపించవలెను. వారినే అర్చించవలెను. ధ్యానించవలెను. వారికే నమస్కరించవలెను.



 అజ్ఞానులగు జనులు అట్లుచేయక తమచిత్తములను దృశ్యవిషయములందే లగ్నముచేయుచు, వానినే సేవించుచు, కామాది రాక్షసులకే నమస్కరించుచు, వారినే అర్చించుచు, పరిపోషించుచున్నారు. అట్టివారు భగవానుని యెన్నడును పొందలేరని ఈశ్లోకముద్వారా స్పష్టమగుచున్నది. కావున అట్టి విషయ సేవనమును వదలివైచి జనులు తమ చిత్తమును పరమాత్మయందే కేంద్రీకరించవలెను. అత్తఱి వారు పరమాత్మను నిక్కముగా పొందగలరు.



"సత్యం తే ప్రతిజానే”  - ఆ ప్రకారము సాధనలను చేయువారు భగవానుని పొందుదురో - లేదో యని అర్జునునకు సంశయములు కలుగునేమోయని తలంచికాబోలు 'ఇది సత్యము నేను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను" అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగ చెప్పివైచిరి.



సాక్షాత్ భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నానని పలికినపుడు ఇక ఆ వాక్యము లెంతటి పరమసత్యములో ఊహించుకొనవచ్చును. ఈ ప్రకారముగ భగవానుడు ప్రతిజ్ఞచేసి చెప్పినచోటు గీతలో చాల అరుదు. కావున సాధకు లిట్టి అపూర్వవాక్యములపై పరిపూర్ణశ్రద్ధనుంచి తదనురీతి యాచరించి, భగవత్సాక్షాత్కారమను మహోన్నత ఫలితమును బొంది కృతార్థులు కావలయును.



"మన్మనాభవ” - అను వాక్యమునందు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములను నాలుగు సాధనలున్ను తెలుపబడినవి.



ప్ర:- భగవత్ప్రాప్తికి (మోక్షమునకు) ఉపాయలేవి?


ఉ:- (1) భగవంతునియందు (ఆత్మయందు) మనస్సు లగ్నమైయుండుట,

(2) భగవంతునిపై భక్తి కలిగియుండుట,

(3) భగవానుని ఆరాధించుట,

(4) భగవంతునకు నమస్కరించుట.



ప్ర:- భగవంతు డెవనిపై తన కృపాకటాక్షమును ప్రసరించును?


ఉ:- తన్నారాధించుటద్వారా తన యిష్టతను సంపాదించుకొనినవారిపై .



ప్ర:- పైన దెల్పిన విధముగ దైవమునుగూర్చి యత్నించువారికి కలుగు ఫలితమేమి?


ఉ:- వారు దైవమునే పొందెదరు. ఈ వాక్యము పరమసత్యము. సాక్షాత్ శ్రీకృష్ణమూర్తియే ఆ వాక్యములను సత్యమని ప్రతిజ్ఞచేసి చెప్పిరి.


🕉🌞🌎🌙🌟🚩

[11:16, 26/01/2021] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊

శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.

రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.

  పాప లక్షణము-పాప నిర్ణయము.

ఆడియో నం.24

(పొరపాటుగా 23గా చెప్పడం జరిగింది)

💥🎊💥🎊💥🎊💥🎊💥🎊

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚

శ్లోకము 18


🍀. 16. సమదర్శనము -  అన్నిటి యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు.  అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే.  ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది.  అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు. స్వభావములను చూచువారు  మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు.  సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు.   సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు.  దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. 🍀


విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |

శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః || 18


విద్య, వినయ సంపన్నులైన బ్రాహ్మణుల యందు, గోవుల యందు, ఏనుగు నందును, కుక్క యందును, కుక్క మాంసము తిను చండాలుని యందును సమదర్శనము చేయువారే జ్ఞానులు. అన్నిటి యందు ఉన్నది ఒక్కటియే. ఉన్నది సత్యము అని ముందు తెలిపితిమి. 


ఉన్నదాని చుట్టును ప్రకృతి తన గుణముల చేత, పంచభూతముల చేత వివిధములగు అల్లికలు చేయుచు నుండును. ఈ అల్లికలలో వైవిధ్యమున్నది. విద్య, వినయము సంపదగా గలిగిన బ్రాహ్మణులకు మూలముగ ఏది యున్నదో అదియే చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు నందు దర్శించుట సమదర్శనము. సామాన్యముగ మనసు, బుద్ధి ఆధారముగ జీవించు మానవులు యితరుల స్వభావమునే దర్శింతురుగాని, స్వభావమునకు మూలమున నున్న తత్త్వమును దర్శింపలేరు. 


అన్నిటియందు వసించి యున్నటువంటి తత్వమునే దర్శించుచు, స్వభావము ప్రకృతి యొక్క విలాసముగ దర్శించువారు నిజమగు జ్ఞానులు, సన్న్యాసులు. మంచి స్వభావము కలవారు, చెడ్డ స్వభావము కల వారు, ప్రాణము కలవి, ప్రాణము లేనివి అన్నిటి యందు ఉన్న దొక్కటే. త్రిగుణముల కలయికలు వేరగుటచేత అవి వేరు వేరు స్వభావములతో గోచరించును. స్వభావములను చూచువారు  మాయను బడక తప్పదు. ఉన్నదానిని చూచు వారిని ప్రకృతి బంధింపదు.


ఉన్నది చూచుట జ్ఞానము, సమదర్శనము. అట్లు చూచు వారే పండితులు. అనగా తెలిసినవారు. ఇతరములను చూచువారు శ్రీకృష్ణుని దృష్టిలో పండితులు కారు. అట్టివారు కేవలము చదివిన వారే కాని తెలిసినవారు కారని మాస్టర్ ఇ.కె. తెలుపుచునుండిరి.


అధికులని, అధములని భేదములు సృష్టిలో నుండుట ప్రకృతి అమరిక. తదతీతమైన సత్యమున యివి ఏవియును లేవు. ప్రపంచమున ప్రవర్తించినపుడు పేడ-బెల్లము కలుపు కొనుట, గుఱ్ఱమును-గాడిదను సమానమని భావించుట, గంగి గోవును-దున్నపోతును సమానముగ భావించుట, సంస్కారులు - కుసంస్కారులు సమానమేనని భావించుట అజ్ఞానము. అది సమదృష్టి కాదు. 


సమదృష్టి యనగ వైవిధ్యమునకు మూలము ఒక్కటే యని తెలియుట. అంతియే కాని స్వభావముల యందు సమానత్వము నాపాదించుట కాదు. స్వభావపరముగ ఆరోహణ, అవరోహణ క్రమములున్నవి. మూలమున కవి వర్తింపవు. 


సంఘమున బాధ్యత గలవారు, బాధ్యత లేనివారు యిరువురు సమానమా? స్వభావపరముగ వారు సమానము కాదు. కాని వారియందు మూలముగ నున్నది ఒక్కటియే. ఇట్లేకత్వమును గమనించుచు, వైవిధ్యమును మన్నించుచు సాగవలెను.  


ఏకత్వము స్థిరపడినపుడు అన్నింటి యందును ప్రేమ యుండును. అంత మాత్రము చేత వైవిధ్యమును మరువరాదు. శిశుపాలుడు, అర్జునుడు తత్త్వమున ఒకటియే. స్వభావమున చాల వ్యత్యాసమున్నది. అర్జునుని శ్రీకృష్ణుడు ప్రేమతో రక్షించెను. శిశుపాలుని ప్రేమతోనే శిక్షించెను. 


ఉండుటను సత్య మందురు. ప్రకృతి స్వభావమును చైతన్యమందురు. చైతన్యమునకే స్థితి భేదము. ఉండుటకు స్థితి భేదము లేదు. చైతన్యమునకు నిద్రావస్థ, స్వప్నావస్థ, మానసికావస్థ, బుద్ధి యిత్యాది అవస్థలు. ఎక్కువ చైతన్యము, తక్కువ చైతన్యము గల జీవులుందురు. దీనిని బట్టే స్థావరములు, జంగమములు, ప్రాణము లేని, ప్రాణము ఉన్న జీవులు, భూమి జీవులు, దేవతలు. 


దేవతలలో కూడ, పితృదేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఏర్పడి యున్నారు. సృష్టి యందు ఏడు లోకములు, ఏడు రకముల చైతన్యముతో కూడిన జీవులున్నారు. ఇవి యన్నియు చైతన్యావస్థలు. అజ్ఞానుల నుండి, జ్ఞానుల వరకు అనేక అవస్థలలో మానవులున్నారు. ఇది యంతయు ప్రకృతి విలాసము.


దానికాధారముగ నున్న పురుషుడు మాత్రము అన్నిటి యందు ఒకే స్థితి గొని యున్నాడు. పురుషుని దర్శించుట సమ దర్శనము కలవారికే వీలగును. వారు ప్రకృతి విలాసమున అంతర్గతుడై స్థితి చెందిన దైవమును కూడ చూతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[16:28, 25/01/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 333 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

84. అధ్యాయము - 39


🌻. విష్ణుదధీచి యుద్ధము  - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -


భక్త వత్సలుడగు విష్ణుభగవానుడు క్షువునకు హితమును చేయగోరి బ్రాహ్మణ వేషముతో దధీచుని అశ్రమమునకు వెళ్లెను (1). క్షువుని కార్యము కొరకై మారు వేషములో నున్నవాడు, జగద్గురువు అగు విష్ణువు శివభక్తులలో శ్రేష్ఠుడు, మహర్షియగు దధీచునితో నిట్లనెను (2).


విష్ణువు ఇట్లు పలికెను -


ఓయీ దధీచా! మహర్షీ! నీవు శివారాధకులలో అగ్ర గణ్యుడవు, నాశము లేనివాడవు. నీ నుండి ఒక వరమును కోరెదను. నీవు దానిని ఈయ దగుదువు (3).


బ్రహ్మ ఇట్లు పలికెను -


క్షువుని కార్యమును చేయగోరిన దేవదేవుడు విష్ణువుచే యాచింపబడిన శివ భక్తశ్రేష్ఠుడగు దధీచి వెంటనే విష్ణువుతో నిట్లనెను (4).


దధీచుడు ఇట్లు పలికెను -


హే బ్రాహ్మణా! నీ కోరిక నాకు తెలిసినది. నీవు క్షవుని కార్యము కొరకు బ్రాహ్మణ రూపములో వచ్చిన మాయావియగు విష్ణు భగవానుడవు (5). హే జనార్దనా! దేవదేవా! రుద్రుని అనుగ్రహముచే నాకు ఎల్ల వేళలా భూత భవిష్యద్వర్తమానములనే మూడు కాలముల సంగతులు తెలియచుండును (6). నీవు పాపహరుడవగు విష్ణువు అని నాకు తెలియును. ఓయీ గొప్ప వ్రతము గలవాడా! బ్రాహ్మణ వేషమును వీడుము. దుష్టబుద్ధియగు క్షువమహారాజు నిన్ను ఆరాధించినాడు (7). హే హరీ! భగవాన్‌! నీ భక్తవాత్సల్యమును నేను ఎరుంగుదును. నీవు మారు వేషమును వీడి సహజరూపమును స్వీకరించి శంకరుని స్మరింపుము (8).


శివుని అర్చించుటయందు అభిరుచి గలవానికి ఎవనికైననూ భయము ఉన్నచో నీవు నాతో సత్యప్రతిజ్ఞను చేసి నిశ్చితముగా చెప్పవలెను (9). నేను అసత్యమును ఎట్టి సందర్భములోనైననూ పలుకను. శివుని స్మరించుటయందు లగ్నమైన బుద్ధిగల నేను ఈ జగత్తులో దేవతలకు గాని, రాక్షసులకు గాని, ఇతరులకు గాని ఎవ్వరికీ భయపడను (10).


విష్ణువు ఇట్లు పలికెను -


దధీచా! గొప్ప వ్రతము గలవాడా! నీకు సర్వత్ర భయము తొలగి పోయినది. నీవు శివుని పూజించుట యందు నిష్ఠగలవాడవు. అందువలననే సర్వజ్ఞుడవైనావు (11). నీకు నమస్కారము. నా ఆజ్ఞచే నీవు 'భయపడుచున్నాను' అని ఒక్కసారి నీ శత్రువు అగు క్షువమహారాజు ఎదుట చెప్పవలెను (12).

బ్రహ్మ ఇట్లు పలికెను -


విష్ణువు యొక్కఆ వాక్యమును విని కూడ భయమును పొందనివాడై శివభక్తాగ్రగణ్యుడగు దధీచ మహాముని నవ్వి ఇట్లు పలికెను (13).


దధీచుడు ఇట్లు పలికెను -


పినాకధారి, దేవ దేవుడు అగు శంభుని ప్రభావము వలనే నేను ఏకాలమునందైననూ, ఏదేశమునందైననూ, ఏ వస్తువు వలన అయిననూ లేశ##మైననూ భయపడను (14).


బ్రహ్మ ఇట్లు పలికెను -


ఆ మహర్షి యొక్క ఈ మాటను విని విష్ణువు కోపించి, ఆ మహర్షిని దహించు కోరికతో చక్రమునెత్తి నిలబడెను (15). ఈశ్వరుని మహిమచే మిక్కిలి భయంకరమగు ఆ చక్రము ఆ బ్రాహ్మణుని యందు వ్యర్థమయ్యెను. క్షువ మహారాజు సన్నిధిలో కూడ అటులనే జరిగినది కదా !(16). మొక్క వోయిన చక్రము గల ఆ విష్ణువును చూచి దధీచుడు, సదసద్రూపమగు జగత్తు ఆవిర్భవించుటకు కారణభూతుడైన ఆ విష్ణువు ఎదుట చిరునవ్వుతో నిట్లనెను (17).


దధీచుడిట్లు పలికెను -


హే భగవాన్‌! నీవు పూర్వము ప్రయత్నమును చేసి అతి భయంకరమగు ఈ చక్రమును పొంది యుంటివి. ఇది లోకములో సుదర్శన మనియు, విష్ణు చక్రమనియు ప్రఖ్యాతిని గాంచినది (18). శివుడు అనుగ్రహించిన ఆ శుభచక్రము నన్ను సంహరింప నిచ్చగించుకున్నది. భగవానుడవగు నీవు కోపించి (19) బ్రహ్మాస్త్రము మొదలగు అస్త్రములతో, బాణములతో నన్ను సంహరించు యుత్నము చేయవచ్చును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:28, 25/01/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 218 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి  - 3 🌻


13. తరువాత జైమిని చరిత్రలో ‘జైమినిభారతం’ కూడా ఉన్నది. మహాభారతం తరువాతకాలంలోనూ, ఇప్పటికీకూడా మహాభారతంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు మనకు కొత్తకాదు. భారతంలో చాలా ప్రశ్నలు ఇప్పతికీకూడా జతిలంగానే కనబడతాయి. 


14. అయితే మూలగ్రంథానికి వెళ్ళి పరిశీలించి, నిర్మలమయిన ముద్ధితో సందేహనివారణకోసం చేసే ప్రయత్నం పహలిస్తుంది. ద్వేషంతోకాని, దానిమీద అగౌరవంతోకాని విమర్శించటానికి వెళితే దానికి సమాధానం సులభంగా దోర్కదు. సద్విమర్శకుడికి గొరికే సమాధానం కువిమర్శకుడికి లభించదు.


15. అందరికీ కూడా వేదమే ప్రమాణం. ఈ కలియుగం ప్రారంభమయింది. వైదికకర్మలేమో విస్తారంగా ఇదివరకే ఉన్నాయి. వాటిపై అనేక అభిప్రాయాలు మనుష్యుల్లో ఉండటంచేతనే వాటిని వ్యాసుడు విభాగం చేసి చెప్పాడు. వాటిలో బ్రాహ్మణులు, తాత్తిరీయము మొదలైన వుభాగాలు మనకు ఉన్నయి. దాంట్లో ప్రతీకాండ వెనుక ఒక బ్రాహ్మణము ఉంటుంది. ఇవన్నీ ఇదివరకే ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్లే ద్రంథస్థం చేసి పెట్టారు. అయితే వేదాల ఉద్దేశ్యం ఇది కాదు. వేదంమీద నిర్ణయంచేసే అధికారం వ్యాసుడికే లేనప్పుడు, తరువాతివాడు నిర్ణయం ఎలా చేస్తాడు అనే ప్రశ్న ఒకటి పుట్టింది. అలా చేసి ఉంటే, “రెండు మార్గాలున్నాయి. 


16. ఈశ్వరుడి యొక్క ఆరాధనతో నిమిత్తంలేకుండా ఉండే కర్మమార్గమిది; ఈశ్వరారాధన(ఈశ్వరుడిగా భావన చేసేటటువంటి మార్గం) ఇది” అని వ్యాసుడు రెండు మార్గములు చెప్పి ఉంటే; ఈశ్వరుడులేడని ఘంటాపథంగా చెప్పవలసిన ఆవశ్యకత ఉండేదికాదు. కాని ఆయన అలా చేయలేదు. ఉన్నాడనే భావనతో ఈశ్వరుడి యొక్క ప్రతిష్ఠ చేసాడాయన.


17. కృష్ణమతం అంతా కూడా ఈశ్వరారాధనే! ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడని, కర్మస్వరూపుడని, రెండుగా ఈశ్వరస్వరూపం వ్యాసుడివల్ల నిర్ణయించబడింది. ఈశ్వరుడికి కృష్ణావతారమే నిదర్శనం. కృష్ణావతారకాలంలో గోపికలు మొదలైన వాళ్ళందరికీకూడా భక్తే ప్రధానం. మనస్సు, బుద్ధి, చిత్తము అంతాకూడా ఈశ్వరుడియొక్క పాదార్పణంచేసి ఆయనను భక్తితో ఆరాధన చేస్తే చాలు. 


18. మధురభక్తి అని ఒకశాఖ ఏర్పడింది ఆ తరువాత. భక్తితో ఆత్మార్పణం చేసుకుంటే చాలు, కర్మతో నిమిత్తంలేదని చెప్పి వేదవ్యాసుడే ఆ మాటచెప్పితే, వేదంయొక్క ఉద్దేశ్యం ఏమిటి? మరి ఇప్పుడు ‘ఈశ్వరుడులేడు’ అని జైమిని చెప్పాడు అనుకున్నప్పుడు, న్యాయంగా వ్యాసమహర్షికి(అది ఇతడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉండటంచేత) కోపమొచ్చింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[16:28, 25/01/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 157 🌹


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 2 🌻


615. మానవుడు నిత్యజీవితంలో సుషుప్తిఅవస్థకు పోవునప్పుడు నిర్వాణస్థితి ఏర్పడుతున్నది. ప్రతి దినము మేల్కొనిన తరువాత ఏర్పడు వ్యక్తిగత జీవితము వలన ఆత్మ ప్రతిష్టాపనమ ఏర్పడుచున్నది.


616. మూడు రకముల 'ఫనా'-'బకా'లు. 

(a) సృష్టిలో నుండు సమస్త జీవరాశులలో జరుగుచుండు ఫనా-బకా. 

(b) ఆధ్యాత్మిక మార్గములో ఒకటవ భూమిక నుండి ఆరవ భూమిక వరకు చైతన్యమునకు విముక్తిని కలిగించు సంస్కారములననుసరించి యుండును. 

(c) విజ్ఞాన భూమికలో సత్యస్థితిలో జరుగు ఫనా- బకా.


617. ప్రతి భూమికయు దాని ఫనా-బకాలను కలిగియే యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[05:30, 26/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


796వ నామ మంత్రము 26.01.2021


ఓం కామరూపిణ్యై నమః


కామేశ్వరుని రూపమే తన రూపముగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


ఏరూపాన్ని ఊహించుకుంటాడో ఆరూపంలోనే సాధకుని మనోనేత్రాలలో దర్శనమిచ్చే జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామరూపిణీ యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం కామరూపిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు,  ఏరూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో వారి మనో నేత్రములకు దర్శనమిచ్చి కృతార్థులను చేయును.


పరమేశ్వరునికి ఒకరూపం అంటూ ఏదీ లేని నిర్గుణ స్వరూపుడు. ఆయనను ఏరూపములోనైనా చూడాలనుకుంటే అమ్మవారి ద్వారానే సాధ్యమౌతుంది. పరమేశ్వరుడు ఏరూపంలో కోరితే ఆ రూపంలో కనిపిస్తాడు గనుక కామేశ్వరుడైనాడు. కామేశ్వరుని పత్ని పరమేశ్వరి కామేశ్వరి అయినది. తన భర్త ఏరూపంలో ఉంటే తనూ అదే రూపంలో ఉండగలదు గనుక కామరూపిణీ అయినది.


ఒకసారి మూకాసురుడు అనే రాక్షసుడు వరాహ రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు ఎరుకలివాని రూపంలో అక్కడికి వస్తాడు. అమ్మవారు కూడా ఎరుకతెగా శివుని వెంట వస్తుంది. అర్జునుడు మరియు ఎరుకలివాని రూపంలో ఉన్న శివుడు ఇద్దరూ కలిసి ఆ వరాహం పైకి ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు ఎరుకలివాని రూపంలో ఉన్న పరమేశ్వరుడిని ఓడించలేక పోతాడు. ఎరుకతె రూపంలో ఉన్న అమ్మవారు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుఢు తాను ఎదురించినది శివుడే అని తెలుసుకుని,  తన తప్పు గ్రహించి శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు.  అక్కడ పరమేశ్వరుడు ఎరుకలివాడైతే, పరమేశ్వరి కూడా తన భర్తమాదిరిగానే ఎరుకతె అయింది. 


కాశీలో విశ్వేశ్వరునికి విశాలాక్షిగా, శ్రీకాళహస్తి లో వాయులింగేశ్వరునికి  జ్ఞానప్రసూనాంబగా, దక్షారామంలో (ద్రాక్షారామంలో) భీమేశ్వరునికి మాణిక్యాంబగా, శ్రీశైలంలో మల్లికార్జునునికి భ్రమరాంబగా వివిధ రూపాలలో కామేశ్వరుడైన పరమేశ్వరునికి కామేశ్వరియైనది జగన్మాత. గనుకనే కామరూపిణీ యని అనబడినది. 


అమ్మవారు మహాచతుష్షష్టికోటియోగినులచే సేవింపబడుతూ, చతుష్షష్టికోటియోగినుల రూపాలలో      విరాజిల్లినది. శ్రీలలితా సహస్రనామావళి యందు ఒక్కొక్క నామ మంత్రమునకూ ఒక్కొక్క రూపంలో భక్తుల మనోనేత్రములలో దర్శనమిచ్చుచున్నది గనుక కామరూపిణీ  యని అనబడినది. సప్తకోటి మంత్రములందు ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రూపాన్ని దర్శింపజేయగలది గనుకనే పరమేశ్వరి కామరూపిణీ యని అనబడినది. ఊరు ఊరికీ ఒక్కొక్క గ్రామదేవతగా, వనము వనమునకూ ఒక్కొక్క వనదేవతగా,    కొండకొండకూ కొండంత అండయైన కొండదేవతగా ఒకటేమిటీ విశ్వమంతయూ నిండిన విరాడ్రూపిణి గనుకనే కామరూపిణీ యని అనబడినది. 


అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం కామరూపిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[05:30, 26/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


222వ నామ మంత్రము 26.01.2021


ఓం మహాబలాయై నమః


మంత్రబలము, యంత్రబలము, తంత్రబలము, సైన్యబలము మొదలైన బలములతో మహాబలగా విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాబలా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాబలాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు జగన్మాతయొక్క అనుగ్రహబలముతో సర్వార్థసిద్ధిని పొందెదరు.


బల అను శబ్దమునకు చాలా అర్థములు గలవు. గంధము, రసము, రూపము, ఆత్మ, లావు, సేన అని అర్థములు చెప్పబడినవి. బలము అను శబ్దమునకు కాకి అనికూడా అర్థము గలదు. 


భుసండుడు అను వాయసము (కాకి) వశిష్ఠునితో ఇట్లు చెప్పినదని యోగవాసిష్ఠమందు చెప్పబడినది. అది ఏమిటంటే "ఓ వశిష్ఠమహర్షీ! మేము చండునికుమారులమైన ఇరువదియొక్క (21) కాకులము. భగవతియగు బ్రాహ్మీదేవిని చిరకాలము ఆరాధించితిమి. అప్పుడు ఆ తల్లి మమ్ములను కరుణించి ముక్తిని ప్రసాదించినది. అనగా భుసండాది వాయసము(బలము)లకు అనుగ్రహించినది" ఆ విధముగా బ్రాహ్మీరూపిణియైన జగన్మాత వాయసము(బలము) లకు ముక్తిని ప్రసాదించినది గనుక  మహాబలా యని అనబడినది.


జగన్మాత బలవంతులకే బలమైనది. తపోబలంగల వారు, యోగబలం గలవారు,  అంగబలం గలవారు, సైన్యబలం గలవారు, ఐశ్వర్యబలం గలవారు, చతుష్షష్టి కళల బలంగల వారు - ఇలా ఎంత మంది ఎన్నివిధాలైన బలంగలవారైనను, అట్టివారు అమ్మవారిలో గల ఆ బలముల సమిష్టి బలముముందు వారు ఏమియు కానేరరు. గనుకనే అమ్మవారు మహాబలా యని అనబడినది.


జగన్మాత ఐదువందల డెబ్బదియారు కోట్లమంది  యోగినులచే (మహాచతుష్షష్టికోటియోగినీ గణసేవిత) సేవింపబడుచున్నది గనుక మహాబలా యని అనబడినది.


సంపత్కరి, అశ్వారూఢ,శ్యామలా మొదలైన పదహారుగురు మంత్రిణులు, నిత్యాదేవతలు, జ్వాలామాలిని వంటి అగ్నిపుత్రికలు, వారాహి, బాలాత్రిపురసుందరి, చక్రరాజరథము, గేయచక్రరథము, కిరిచక్రరథము, మహాగణేశ్వరుడు, సప్తకోటి మంత్రయుత శస్త్రములు, తన చేతిపదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి వెడలివచ్చిన నారాయణుని దశావతారములు, కామేశ్వరాస్త్రము, మహాపాశుపతాస్త్రము వంటి సైన్యబలము, అస్త్రశస్త్ర, మంత్ర, యంత్ర, తంత్ర బలముతో మహాశక్తిమంతురాలైన జగన్మాత మహాబలా యని అనబడినది.


అట్టి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాబలాయై నమః అని యనవలెను.


: 🌹. శ్రీమద్భగవద్గీత - 620  / Bhagavad-Gita - 620 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 37 🌴


37. యత్తదగ్రే విషమివ పరిణామే(మృతోపమమ్ |

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||


🌷. తాత్పర్యం : 

ఆది యందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృతముతో సమానమగునదియు మరియు ఆత్మానుభూతి యెడ మనుజుని జాగృతుని చేయునదియు నైన సుఖము సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.


🌷. భాష్యము  :

ఆత్మానుభూతిని పొందు యత్నములో మనుజుడు మనస్సు, ఇంద్రియములను నిగ్రహించుట మరియు మనస్సును ఆత్మయందు లగ్నము చేయుటకు పలు విధినియమములను అనుసరింపవలసివచ్చును. 


ఆ విధి నియమములన్నియును విషమువలె అతి చేదుగా నుండును. కాని మనుజుడు వానిని అనుసరించుట యందు కృతకృత్యుడై దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరగలిగినచో నిజమైన అమృతాస్వాదనమును ప్రారమభించి జీవితమున సుఖింపగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



నిరంజనుడు - ఏమియు అంటనివాడు కావున శుచి - నిర్మలుడు, పవిత్రుడు.


:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::

సీ.భవము దోషంబు రూపంబుఁ గర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేకజగములఁ గలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁ డిన్నియును దాల్చునా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్ధరూపికి రూపహీనునకునుజిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ బరమాత్మునకుఁ బరబ్రహ్మమునకుతే.మాటలను నెఱుకల మనములఁ జెరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁ డగుచునిపుణుఁడైన వాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు. (78)


భగవంతునికి పుట్టుకా, పాపమూ, ఆకారమూ, కర్మా, నామాలూ, గుణాలూ లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడం కోసం తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం; అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకూ, ఊహలకూ అందరానివాడు; పరిశుద్ధుడు. సత్త్వగుణంతో దరిజేరదగినవాడు. నేర్పరులు చేసే ఫలాపేక్షలేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను.


155. శుచిః, शुचिः, Śuciḥ


సశేషం... 

 వివేక చూడామణి - 3 🌹

🍃 3. సాధకుడు - 1  🍃 


15. సాధకుడు ఆత్మ జ్ఞానము పొంది, వివేకముతో దయాసముద్రుడు, బ్రహ్మజ్ఞానమును పొందిన సద్గురువును ఆశ్రయించవలెను.

16. ఆత్మ జ్ఞానము పొందాలంటే సాధకుడు 14వ శ్లోకములో చెప్పినట్లు శాస్త్ర పరిజ్ఞానము పొంది, శాస్త్ర చర్చలలో విస్తారముగా పాల్గొనగల్గి ఉండవలెను.

17. ఏ వ్యక్తి సత్యాసత్య జ్ఞానమును పొంది అనిత్య స్థితులకు అతీతముగా మనస్సును మళ్ళించి ప్రశాంతతను పొంది, సత్వగుణ ప్రధానుడై జన్మ రాహిత్య స్థితికై ఆపేక్ష గల్గినవాడే బ్రహ్మన్ని గూర్చి తెలుసుకొనగలడు.

18. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందుటకు యోగులు నాల్గు విధములైన మార్గములను ప్రతిపాదించిరి. అలా కానిచో విజయమును సాధించలేరు.

19. మొదటిది సత్యాసత్యాలకు మధ్య తేడాను తెలుసుకొనుట. రెండవది తన కర్మల ద్వారా తాను పొందు ప్రతి ఫలముల ఎడ తిరస్కార భావము. మూడవది ప్రశాంతత, విశ్రాంతి. నాల్గవది విముక్తి ఎడల తీవ్ర ఆకాంక్ష.

20. మానసికంగా దృఢ నిశ్చయంతో బ్రహ్మము యొక్క సత్యాన్ని, ప్రపంచము యొక్క అసత్యాన్ని గూర్చిన నిర్ణయము. అందుకు సత్యాసత్యములను గ్రహించుటలో విచక్షణా శక్తి కల్గి యుండవలెను.


సశేషం....

[05:48, 26/01/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 13 🌹 


🌻 4. అశ్వవిద్య - 5  🌻


సమస్త జ్ఞాన ప్రదమగు యోగ విద్యయే అశ్వ విద్య. దీనికి మూలకారకమైన ఖగోళ భాగము ధనస్సు అనబడు రాశి. 


ఇది అశ్వని నుండి 240° లలో ఆరంభించి 270 డిగ్రీలలో అంతమగును. వింటిని ధరించి అశ్వము వంటి ఉత్తర శరీరము గల నరుడు దీని రూపము. అనగా విజ్ఞాన కేంద్రమునకు గురి పెట్టుచున్న జ్ఞానాగ్నియగు వేగవంతమైన జీవమని దీని అర్థము. 


ధనస్సు పురుషునకు సర్వశుభకర మనబడు నవమస్థానము. ప్రతి సంవత్సరము సూర్యుడీ భాగలలో ప్రవేశించినపుడు ధనుర్మాస మారంభమగును. 


నిష్కామమైన విజ్ఞాన కాండను ఉపాసించు ధనుర్మాస వ్రతమిందులకే. యోగదండమునకు రెండు పాములు మెలికలు చుట్టుకొని యుండుట అశ్వరాశి చిహ్నము. బైబిలు గ్రంథమున కూడ ఈ రాశికి సంకేతము కలదు. దీనినే Aron's Rod అని ఉపదేశ రహస్యముగ చిత్రించిరి. 


ఈ ఉపదేశమందిన వారికి దేవుని సృష్టి రహస్యములు వ్యక్తమగును. ఈ సంకేతమునే మనవారు కుండలినీ యోగ సాధనగ దర్శించిరి. ఈ అశ్వరాశిలో సూర్యుడు ప్రవేశించిన దినము నుండి యోగ సాధన వ్రతము లారంభించుట శాస్త్ర రహస్యము. 


ఈ విధముగ జ్యోతిర్మయమైన శాశ్వత జ్ఞానాశ్వమునకు అశ్వనీ నక్షత్రము ముఖము. మూలా నక్షత్రము తోక. సూర్యుడు అశ్వనిలో ప్రవేశించుట, మూలలో ప్రవేశించుట రెండు విధముల విజ్ఞాన యజ్ఞములకు మూలకారణమై అనంతమగు జ్ఞాన రాశికి చిహ్నమై ఒప్పుచున్నవి.


 ఇందలి రహస్యార్థము గమనింపదగినది. అశ్వని శిరస్సగు ఉషస్సు, మేషము యొక్క శిరస్సుగ ఉండును. మూల, అశ్వము యొక్క జఘనము. అది మూలాధారమున (ధనస్సున) నుండును.


ఈ రెండశ్వముల దేవతలే నాసత్యదులు. ఈ రెండు గుఱ్ఱములను కట్టిన రథమే జీవాత్మ శరీరము. ఈ రథముల రెక్కలే అక్షరముల లెక్కలుగ ఆదిపర్వము మొదట అక్షౌహిణి కథనముగ చెప్పబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. నిర్భయమే ప్రగతికి సోపానం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀


కొంచెం సేపట్లో మరణించబోతున్న ఒక జెన్ సన్యాసి నా చెప్పులెక్కడ అన్నాడు. మీకేమైనా మతి పోయందా మీరు కొంచెం సేపట్లో మరణించబోతున్నారు అన్నాడు వైద్యుడు.


మరణించబోయే మీకు ఇప్పుడు చెప్పులెందుకు?’’ అన్నాడు వైద్యుడు. ‘‘ఇంతవరకు నేను ఎవరిపైనా ఆధారపడలేదు. అందువల్ల నన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొంచెం సమయముంది కాబట్టి, అది ముగిసేలోగా నేను అక్కడికి చేరుకోవాలి. అందుకే చెప్పులడిగాను’’ అన్నాడు. 


వెంటనే శిష్యుడు చెప్పులు తెచ్చాడు. వాటిని ధరించిన ఆ సన్యాసి నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళి, ఇంకా సమయం ఉండడంతో తన సమాధిని తానే తవ్వుకుని, అందులో పడుకుని మరణించాడు.


అలా తెలియని దానిని అంగీకరిస్తూ, స్వయంగా మీరే అలౌకిక ఆవలి తీరాలను ఆహ్వానించడమే అసలైన ధైర్యం. మృత్యువు రూపాంతరం చెందడమంటే అదే. అలాంటి మరణం ఒక మరణమే కాదు. అలాంటి ధైర్యమున్న వ్యక్తి ఎప్పటికీ మరణించడు. ఎందుకంటే, మృత్యువు అతని ముందు ఓడిపోయింది. 


అందుకే అతడు దానిని దాటి ముందుకెళ్ళి, అలౌకిక ఆవలి తీరాలలోకి స్వయంగా అడుగుపెడతాడు. అలాంటి వ్యక్తులకే అవి స్వాగతం పలుకుతాయి. అలా మీరు వాటికి స్వాగతం పలికితే అవి మీకు స్వాగతం పలుకుతాయి. అందుకే అవి మీలో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంతేకానీ, అవి ఎప్పుడూ మృత్యువులా ఉండవు.


- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

[05:48, 26/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 10 / Bhagavad-Gita - 10 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 10  🌴


10. అపర్యాప్తం తదస్మాకం 

బలం భీష్మాభిరక్షితమ్ |

పర్యాప్తం త్విదమేతేషాం 

బలం భీమాభిరక్షితమ్ ||


🌷. తాత్పర్యం : 

మన సైన్యబలము లెక్కింప విలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవసైన్యము పరిమితముగా నున్నది.


🌻. భాష్యము : 

ఇచ్చట దుర్యోధనుడు ఇరుసేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనానియైన భీష్మపితామహునిచే ప్రత్యేకముగా రక్షింపబడు తన సైన్యబలము అపరిమితముగా నున్నట్లు అతడు భావించెను. 


అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుదాగు సేనానియైన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగా నున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయను కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తానూ సంహరింప బడుదునని అతడు ఎరిగి యుండుటయే అందులకు కారణము. 


కాని అదే సమయమున పరమోత్తమ సేనానియైన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్దరంగమున తాను విజయమును సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను.

🌹 🌹 🌹 🌹 🌹

[05:48, 26/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 190  / Sri Lalitha Chaitanya Vijnanam  - 190 🌹

🌻 190. 'దుర్గా' 🌻


తొమ్మిది దుర్గములు కలది అని అర్థము. దుర్గ నవదుర్గయై యున్నది. అనగా తొమ్మిది కోటలు కలిగి యున్నది. అవియే నవావరణములు. సంవత్సరముల వయసుకల కన్యలను దుర్గ అని పిలుతురు. సృష్టికి నవావరణములు కలవు. తత్కారణముగనే సృష్టి గోచరించుచున్నది. 'మూలప్రకృతి, అష్టప్రకృతులు కలిపి తొమ్మిది ప్రకృతు లున్నవి. 


అష్ట ప్రకృతులు తొమ్మిదివది యగు మూలప్రకృతి నుండి దిగి వచ్చినవే. దిగి వచ్చినప్పుడు, సూక్ష్మము నుండి స్థూల సుగుట జరుగ…

[11:16, 26/01/2021] +91 92915 82862: 💥🎊💥🎊💥🎊💥🎊💥🎊

శ్రీ రామతీర్ధ వేదాంత భాష్యము.

రచన:-శ్రీ కేశవ తీర్ధ స్వామి.

  పాప లక్షణము-పాప నిర్ణయము.

ఆడియో నం.24

(పొరపాటుగా 23గా చెప్పడం జరిగింది)

💥🎊💥🎊💥🎊💥🎊💥🎊

 శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం


1) నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |

శ్రీ మారుతాత్మ సంభూతం విద్యుత్కాంచన సన్నిభమ్ ||


2) పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణమ్ |

రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకమ్ ||


3) నానారత్న సమాయుక్త-కుండలాదివిరాజితమ్ |

ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠ విరాజితమ్ || 

4) త్రింశత్కోటి బీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితమ్ |

పద్మాసనస్థితం దేవం షట్కోణ మండలమధ్యగమ్ ||

5) చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరమ్ |

గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిమ్ ||

6) హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవ నియామకమ్ |

ప్రభంజనశబ్ద వాచ్యేణ సర్వదుర్మత భంజకమ్ ||

7) సర్వదాఽభీష్ట దాతారం సతాం వై దృఢమహవే |

అంజనాగర్భ సంభూతం సర్వశాస్త్ర విశారదమ్ ||


8) కపీనాం ప్రాణదాతారం సీతాన్వేష…



సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశుసమానుల కుతంత్రాలను వమ్ము చేయగలడు.


🕉🌞🌎🌙🌟🚩

[13:11, 26/01/2021] +91 92915 82862: భాగవతము 

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


మనము అగ్ని స్వరూపులము. మనలో అగ్ని, వాయువు ఉన్నాయి. మనము వాయువును బాగా వినియోగము చెయ్యాలి. మన మనస్సు నిండా భావాలు expand అయి పొతూ ఉంటాయి. మనస్సు ఆలోచనలతో కాలిపోతూ ఉంటుంది. అందుకే నీరసం.  అపుడు బాగా గాలి పీల్చి వదలాలి.  మనలో ఉన్న అగ్నికి వాయువు తోడైతే ఆ అగ్ని ఊర్ద్వముఖమై, మంచి చేతనలోకి తీసుకొని వెడుతుంది. అగ్ని క్రింద లోకాలలో మండించేస్తుంది. పై లోకాలలో విపరీతమైన కాంతినిస్తుంది.



అగ్ని, వాయువు కలిస్తేనే ధాతువులు తేలిక పడతాయి. అపుడు మన ప్రజ్ఞ ఊర్ధ్వ ముఖముగా బయలుదేరి ఫాలభాగములో ఒక చక్కని వెలుగుగా దర్శనం ఇస్తుంది. ఆరాధన మార్గములో గాని, ప్రాణాయామ మార్గములో గాని అక్కడకి చేరుకోవచ్చు. ఫాలభాగాన్నే రాజసింహాసనము అన్నారు.


🕉🌞🌎🌙🌟🚩


ఆచార్య సద్భోదన


తాళం తెరిచి విలువైనదేదో లోపల ఉందని గుర్తిస్తే గానీ దాని గురించి మన వంతు కృషిని చేయలేము.



అంతరంగ గుహలోనికి చూడనిదే ఏ మానవుడూ ఫలవంతమైన కార్యము చేయలేడు. భవిష్య ఫలాలను అందించలేడు. ఆ రహస్యం బోధపడనిదే ఏ కార్యమైనా ఆలోచనా రహితంగానే ఉంటుంది.



ఆదర్శం కొరకు పాటుపడేందుకు అనేక అవకాశాలు కలిగించే జన్మ మానవజన్మ. దానిని వదలి అశాంతి, సందేహం, నిరాశ, దుఃఖాలకు హృదయంలో చోటిస్తే మనం సంతోషంగా ఉండలేము, ఇంకొకరిని సంతోషపెట్టలేము.



మనలో సంతోషం, శాంతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు నిలిచి ఉన్నప్పుడే భగవంతుని, ప్రపంచాన్ని సేవించగలము .


శుభం భూయాత్


🕉🌞🌎🌙🌟🚩

[13:11, 26/01/2021] +91 92915 82862: స్వర్గం- నరకం మన ఆలోచనలలోనే...

🕉🌞🌎🌙🌟🚩

           "మరణించిన పిదప స్వర్గానికి పోతామా - నరకానికి పోతామా అనేది మనకు తెలియని విషయం.



 అయితే మనలోపల మరొక ప్రపంచం ఉన్నదన్న విషయం మనకు తెలియాలి. దానినే అంతర్ముఖ ప్రపంచం అంటారు. అదే ఆలోచనల ప్రపంచం. 

          


మానవుడి ప్రవృత్తులు భౌతిక జీవితానికి మాత్రమే పరిమితమై ఉంటే అతడు నరకంలో మునిగితేలుతుంటాడు. అలా కాక మానవుడి ప్రవృత్తులు అంతరిక శక్తితో పరిభ్రమిస్తూ అంతరంగం దిశగా సాగుతుంటే కనుక అతడి జీవితం స్వర్గలోకంలో నివసిస్తున్నట్లే ఉంటుంది.

           


స్వర్గమూ - నరకమూ ఈ రెండింటి గోడలు పరస్పరం కలిసే ఉంటాయి. ఒకే గ్రామంలో, ఒకే వీధిలో, ఒక్కచోటే ఉంటాయి. 



మానవుడి కోరికలు, ఆకాంక్షలు భౌతిక ప్రపంచంనకు సంబంధించినవై మనిషి నిరంతరం వాటికోసమే అర్రులు చాస్తూ వాటిని పొందాలని ప్రయత్నిస్తూ,



 వాటిని పొందలేక పోయినపుడు కోపానికి గురవుతూ, 



అవి అందుబాటు లోకి రాగానే సంతోషపడు తున్నట్లయితే అతడి జీవితం నరకంలో ఉన్నట్లుగా మనం అర్థం చేసు కోవాలి... ."



మనసు యొక్క సానుకూల ఆలోచనలే  మానసిక పరివర్తన /పరిపక్వత


🕉🌞🌎🌙🌟🚩

[13:59, 26/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(783)

🕉🌞🌎🌙🌟🚩


"ఆధ్యాత్మిక సాధనలో స్ఫురణ, స్మరణల వైశిష్ట్యం ఏమిటి !?"


స్మరణ అంటే మనం చేసేది. స్ఫురణ అంటే అదిగా మనసుకు జ్ఞప్తికి వచ్చేది. స్మరణమాత్రం చేతనే ముక్తినిచ్చేవాడు అరుణాచల శివుడు. శ్రీరమణుల బోధనల్లోని విశేషం ఏమిటంటే మనని అ'రుణం' చేయటం. మన కష్టనష్టాలు, సుఖదుఃఖాలు అన్నీ మనసు తీర్చాల్సిన బాకీలే. అరుణాచల స్మరణచేత మనసు ఆ బాకీల నుండి బయటపడుతుంది. జీవితంలో కష్టసుఖాలు ఉన్నా మనసు వాటినుండి విముక్తిని పొందటమే ముక్తి. స్మరణ అంటే నామాన్ని మనసులో మననం చేయటం. స్మరణ జరగాలంటే ముందు ఆ స్ఫురణ రావాలి. అరుణాచల శివుడు తనని స్మరించిన వారికి ముక్తినిస్తే, అరుణాచలేశ్వరుడుగా అవతరించిన భగవాన్ శ్రీరమణులు తానే స్ఫురణకు వచ్చిమరీ ముక్తినిస్తారు. అపర భగవాన్ స్వరూపులైన మన సద్గురు శ్రీశివానంద గురుదేవుల అనుగ్రహం కూడా అలాంటిదే. భగవాన్ దయతో జీవితంలో శాంతి, సద్గురుదేవుల దివ్యసన్నిధి రెండూ లభ్యం కావటం మన అదృష్టం !


{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

'స్వకార్యానికి ముందు స్వామికార్యం చూడాలి'- (అధ్యాయం -96)


🕉🌞🌎🌙🌟🚩

[13:59, 26/01/2021] +91 92915 82862: "ఋభుగీత "(250)

🕉🌞🌎🌙🌟🚩


"సర్వప్రపంచ హేయత్వము"

18వ అధ్యాయము 


అనుభవ పూర్వకంగా సత్యం తెలిసినప్పుడే భ్రమలు పోతాయి !


వేదాలలో కూడా ఉన్న రహస్యం ఏమిటంటే 'అహం బ్రహ్మాస్మి' అని. అంటే నేను బ్రహ్మము అని. రహస్యం అంటే గోప్యంగా అని. అంటే దాచిపెట్టారని కాదు. శాస్త్రాలన్నింటిలో నిగూఢంగా ఉన్న తాత్వికార్థం అహం బ్రహ్మమనే. రహస్యం అంటే మనకి తెలిసేవరకూ అర్థంకానిది అని. విన్నప్పుడు విషయంగా తెలుస్తుంది. కానీ అనుభవ పూర్వకంగా తెలిస్తేనే దానిలోని రహస్యం వీడుతుంది. మనసులో సమస్త సందేహాలు, పోయిన స్థితే బ్రహ్మం. భ్రమలుపోతే ఉన్నది బ్రహ్మమే. భ్రమలు ఎలా పోతాయంటే అనుభవ పూర్వకంగా సత్యం తెలిసినప్పుడు !


🕉🌞🌎🌙🌟🚩

[14:02, 26/01/2021] +91 92915 82862: 🌷139 - మంద్రగీత🌷

🕉🌞🌎🌙🌟🚩


 పురుషోత్తమ ప్రాప్తి


9. చెవి, కన్ను, స్పర్శ జ్ఞానము, రుచి, వాసన అనునవి మనస్సు నుండి ఐదు శక్తులుగా విప్పారి, భౌతిక శరీరమున ఆయా భాగములను ఆశ్రయించి పనిచేయుచున్నవి. ఇవి అన్నియు మనస్సును అధిష్టించియే శబ్దాది విషయములను గ్రహించుచున్నవి.



(ఇందు ఒక్కొక్క ఇంద్రియమునకు ముక్కు, కనుగుడ్లు మున్నగు భౌతిక స్థానములున్నవి. వానియందు ఇంద్రియములు ఆవేశించి పనిచేయుచున్నవి. వాని ప్రవర్తనల యందు మనస్సే పనిచేయుచున్నది. విద్యుద్దీపము, పంకా, రేడియో, టెలిఫోన్ అనువానిని ఆశ్రయించి విద్యుచ్ఛక్తియే ఆయా కార్యములను నిర్వర్తించుచున్నది. ఈ విద్యుచ్ఛక్తి ఒక చోట నుండి ప్రవహించి వచ్చినదే గాని అందు ఉద్భవించుటలేదు. అట్లే ఇంద్రియములు, మనస్సు, దేహము మరియొక తావు నుండి దిగివచ్చుచున్న ఈశ్వరుని అంశలుగానే పనిచేయును. విద్యుచ్ఛక్తి శక్త్యాలయము (power station) నుండి పంపబడుచున్నది. అట్లే ఈశ్వరుని శక్తి, హృదయము నుండి ఉద్భవింపజేయబడుచున్నది. శక్త్యాలయమున యంత్ర నిర్మాణము నందు అయస్కాంతీకరణ చక్రము (dynamo) యొక్క మథనమున ఆకాశమునుండి వ్యక్తము చేయబడుచున్నది. అట్లే హృదయమను యంత్రమున ఆకాశమునుండి ఈశ్వరుడు జీవుడుగా వ్యక్తమగుచున్నాడు.)


🕉🌞🌎🌙🌟🚩

[14:02, 26/01/2021] +91 92915 82862: 154) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

🕉🌞🌏🌙🌟🚩


అస్వతంత్రా హి మాయా స్యాదప్రతీతేర్వినా చితిమ్ ౹ స్వతంత్రాఽ పి తథైవ స్యాదసంగస్యాన్యథాకృతేః ౹౹132౹౹


132.  గుర్తించే చైతన్యము లేనిచో మాయ అనుభవమునకు రాదు కనుక అది అస్వతంత్రం అని అనాలి.కాని నిత్యముక్తమగు ఆత్మను బద్ధమైనట్లు చూపుట చేత మాయ స్వతంత్రమని కూడా చెప్పవచ్చు.




కూటస్థాసఙ్గమాత్మానం జగత్త్వేన కరోతి సా ౹ చిదాభాస స్వరూపేణ జీవేశావపి నిర్మమే ౹౹133౹౹


133. కూటస్థము(నిర్వికారము) సంగరహితము అగు ఆత్మను అది జగద్రూపముగ చూపును.ఆత్మను తనయందు ప్రతిఫలించుకొని జీవుని ఈశ్వరుని కూడా నిర్మించును.




కూటస్థమనుపద్రుత్య కరోతి జగదాదికమ్ ౹ దుర్ఘటైకవిధాయిన్యాం మాయాయాం కా చమత్కృతిః ౹౹134౹౹


134.  కూటస్థమునకు ఏ ఉపద్రవమును కల్పింపకయే మాయ జగదాది విషయములను సృష్టించును.ఇట్టి అసంభవములైన పనులను సంభవింప జేయుటయే మాయయందలి చమత్కారము.




ద్రవత్వముదకే వహ్నావౌష్ణ్యం కాఠిన్యమశ్మని ౹ మాయాయా దుర్ఘటత్వం చ స్వతః సిద్ధ్యతి నాన్యతః ౹౹135౹౹


135. జలమునకు ద్రవ్యత్వము, అగ్నికి ఉష్ణత,శిలకు కాఠిన్యము, స్వభావములైనట్లే అసంభవమును సంభవములుగా చేయుట మాయకు స్వభావ సిద్ధము.


🕉🌞🌎🌙🌟🚩

[14:05, 26/01/2021] +91 92915 82862: 41)-శ్రీ రామదాసు కీర్తన


(ముఖారి రాగం/ త్రిపుట తాళం)


ప: అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము


నెయ్యడ గాననయ్య శ్రీరామయ్య || అయ్యయ్యో ||



అ.ప.: ఇయ్యెడ నేను కుయ్యాడిన ఆలకించ


వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర || అయ్యయ్యో ||



చ1: ఎంతని వేడుదు ఎంతని పాడుదు


ఎంతని దూరుదు ఏమిసేతు రామ


సుంతైనగాని నీ అంతరంగమదేమో


వింత కరుగదు ఎంతో నమ్మినందుకు || అయ్యయ్యో ||



చ2: శరణన్న జనముల బిర బిర బ్రోచేటి


బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ


మరుగు జొచ్చినందు కరమర జేయుట


పరువే కరుణింప బరువే హరి హరి || అయ్యయ్యో ||



చ3: కామిత మందార కలుష విదూర


తామసమేల తాళజాలనురా నీ


మోము జూపుము స్వామి భద్రాచల


రామదాసుని ప్రేమ రయమున నేలుము || అయ్యయ్యో ||


🕉🌞🌏🌙🌟🚩

[14:06, 26/01/2021] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమస్కంధము/26వ దశకము - గజేంద్రమోక్షణము వర్ణనము/

26-8-శ్లోకము*

🕉🌞🌎🌙🌟🚩


శ్రుత్వాస్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే।

సర్వాత్మా త్వం భూరికారుణ్యవేగాత్ తార్ క్ద్యారూఢః ప్రేక్షితో౾భూఃపురస్తాత్।।


భావము:-


గజేంద్రుని స్తోత్రములను వినిన బ్రహ్మ, శివుడు మెుదలగు దేవతలు, గజేంద్రుడు - నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరబ్రహ్మను ప్రార్ధించుచుండెనే గాని తమని కాదని భావించి, స్పందంచక మిన్నకుండిరి. అప్పుడు, ప్రభూ! నారాయణమూర్తీ! సర్వాత్ముడవైన నీవు ఆ గజేంద్రుని కరుణించి తక్షణమే గరడవాహనుడవై అతని ఎదుట సాక్షాత్కరించితివి.


వ్యాఖ్య:-


చావు నిశ్చయమని తేల్చుకున్న గజేంద్రుడు దీనంగా ఇలా అంటున్నాడు.


కలఁడందురు దీనుల యెడఁ,

గలఁడందురు పరమయోగి గణముల పాలం,

గలఁడందు రన్నిదిశలను,

గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?



భావము. దేవుడు ఆర్తు లైన వారి వెంట ఉంటాడు అని అంటారు. ఉత్తము లైన యోగుల చెంత ఉంటా డని అంటారు. అన్ని దిక్కుల లోను ఉంటా డంటారు. “ఉన్నాడు ఉన్నాడు” అనే ఆ దేవుడు మరి ఉన్నాడో! లేడో!



నా విషయంలో ఆ భగవంతుడు గురించి అనుమానించాల్సిన పని లేదు. అతడు ఐశ్వర్యం పేదరికం లాంటివి చూడకుండా అందరికి అండగా ఉంటాడు. కాబట్టి నాకు అండగా ఉంటాడు. దుర్జనుల చేతిలో చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. అందువల్ల నాకు సాయం చేస్తాడు. బయటి చూపుల వదిలిపెట్టి తననే చూసేవారిని దయతో చూస్తాడు. కనుక నా కష్టాన్ని చూస్తాడు. దీనుల మొరలు విని తన్ను తానే మరచి పోతాడు కదా. నా మొర తప్పక వింటాడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. మొదలు నడుమ తుద అన్నవి ఆయనకు లేవు. భక్తులకు దిక్కులేని వారికి ఆయనే ఆధారం. మరి అటువంటి ప్రభువు ఇంకా నా మొర వినడేం? నా బాధ చూడడేం? నన్ను దయ చూడడేం? తొందరగా రాడేం?


ఇంకా ఇలా ప్రార్థించాడు.


"లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;

నీవేతప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;

రావే!యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!



భావము. దేవా! నాలో శక్తి కొంచం కూడ లేదు. ధైర్యం సడలి పోయింది. ప్రాణాలు కూడ కదలిపోతున్నాయి. మూర్చ వచ్చేస్తూ ఉంది. శరీరం స్రుక్కిపోయింది. బాగా అలసటగా ఉంది. నాకు నీవు తప్ప వేరే ఇతరు లెవ్వరు నాకు తెలియదు. నీవే దిక్కు. ఆర్తితో ఉన్న నన్ను ఆదుకోవయ్య. ఓ స్వామీ! రావయ్యా! కరుణించు, వరాలిచ్చే ప్రభూ! కాపాడు, పుణ్యాత్ముడా!



ఓ దయాసాగరా! నీవు సర్వ ప్రాణుల పిలుపులు వింటావట. వారిపై దయ చూపడానికి పోరాని చోట్లకు ఐనా పోతావట. శరణన్న వారికి వెంటనే ఓయ్ అని అంటావుట. కాని ఇప్పుడు ఇదంతా సత్యమేనా అని అనుమానంగా ఉంది.



ఓ కమలాక్షుడా! ఓ వరాలు ఇచ్చే ప్రభూ! శత్రువులపై కూడ వైరం లేనివాడా! పండితులచే నమస్కారాలు అందుకొనే వాడా! ఉత్తమ సుగుణాలు కలవాడా! శరణు కోరు వారికి కల్పవృక్షం వంటివాడా! మునీంద్రులకు ప్రియమైనవాడా! నిర్మలమైన మహిమ కల వాడా! నా మొర విను. వెంటనే రా. కనికరించు. కరుణించి శరణు వేడుతున్న నన్ను కాపాడు.



ఇలా ప్రార్థించి “రక్షణ లేనివారిని రక్షించే ఆ భగవంతుడు నన్ను కాపాడుగాక!” అని గజరాజు మొరపెట్టుకొన్నాడు. ఆకాశం వైపు నిక్కి నిట్టూర్చాడు. ఆకాశానికి చెవులు అప్పజెప్పి ఆక్రోశించాడు. ఆ సమయంలో.



ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తు డైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.


🕉🌞🌎🌙🌟🚩

[14:11, 26/01/2021] +91 92915 82862: 18-66-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌎🌙🌟🚩


అ||  గీతాసారమగు చరమశ్లోకమును చెప్పుచున్నారు –


సర్వధర్మాన్పరిత్యజ్య 

మామేకం శరణం వ్రజ | 

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః || 


తా:- సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణు బొందుము. నేను సమస్త పాపములనుండియు నిన్ను విముక్తునిగ జేసెదను.



వ్యాఖ్య: - ఈ శ్లోకము చాల ముఖ్యమైనది. దీనిని చరమశ్లోకమని యందురు. ఋష్యాది న్యాసములలో ఈ శ్లోకముయొక్క మొదటిపాదము శక్తియనియు, రెండవపాదము కీలకమనియు చెప్పబడినది.



 దీనిచే ఈ శ్లోకముయొక్క ప్రాధాన్యము వెల్లడియగుచున్నది. గీతాశాస్త్రముయొక్క తత్త్వబోధయందలి తుదిశ్లోకము గనుక సారమంతయు నిమిడ్చి భగవాను డిద్దానిని చెప్పివైచిరి. ఇందు తెలుపబడిన భగవచ్ఛరణాగతి, ప్రపత్తి సాధకులకు అతిముఖ్యమైనది. వైష్ణవులీశ్లోకమును అతి ప్రధానముగ నెంచి మంత్రమువలె సదా దీనిని జపించుచుందురు.



“సర్వధర్మాన్ పరిత్యజ్య” - నిత్యనైమిత్తికాది సమస్త ధర్మములకంటెను, కర్మలకంటెను భగవచ్ఛరణాగతి ఎన్నియోరెట్లు అధికఫలములను గలుగజేయును. ఆ చిన్నచిన్న ధర్మములు, కర్మలు అన్నియు పుణ్యమును గలుగజేయును.



 భగవచ్ఛరణాగతి మోక్షమునే కలుగజేయును. ఆ యా ధర్మములన్నింటియెుక్క, కర్మలన్నింటియొక్క ఫలితము శరణాగతియొక్క ఫలితముననే ఇమిడియున్నది. (నూటిలో పది ఇమిడి యున్నట్లు). కావుననే భగవానుడు ఆ స్వల్పస్వల్పకార్యము లన్నిటిని విడిచిపెట్టి అనంతమోక్షఫలమును గలుగజేయుదానినే పట్టుకొనుమని బోధించిరి.



 “మామేకమ్” - అని  చెప్పుటవలన భగవంతు నొక్కరినే ఆశ్రయించిన చాలును, సమస్త కర్మ ధర్మములను ఆశ్రయించినట్లే యగునని విదితమగుచున్నది. చెట్టుమూలమును తడిపినచో శాఖాపత్రాదులన్నిటిని తడిపినట్టే యగునుగదా! పైగా పెక్కుమార్గములు, కర్మలు, ధర్మములు గజిబిజిగానుండి మనస్సునకు విక్షేపమునుగూడ కలుగజేయవచ్చును. కాబట్టి ఒక్కదానినే ఆశ్రయించుట శ్రేయస్కరము.



ఆ ఒక్కటి యేది? దేనిని తెలిసికొనినచో సమస్తము తెలియబడినదగునో, దేనినిపొందినచో సమస్తము పొందబడినదియగునో, అట్టి ఆత్మవస్తువును, బ్రహ్మవస్తువును (భగవంతుని) ఒక్కరిని ఆశ్రయించిన చాలును. ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మలతో పనిలేదు. కావుననే వాని నన్నింటినివదలి తననొక్కనినే శరణుబొందుమని భగవాను డుపదేశించిరి.

“అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి” - అయితే కొందఱిట్లు ప్రశ్నించవచ్చును - అన్ని కర్మలు, ధర్మములు వదలుకొని భగవంతుని ఆశ్రయించినచో ఆతడు మాకేమి యొసంగగలడు? అని.



అందులకు శ్రీకృష్ణభగవానుడు సూటియైన సమాధానమిచ్చిరి - " అట్లు నన్నాశ్రయించినచో మీ యొక్క సమస్తపాపములనుండి, బంధములనుండి మిమ్ములను విముక్తునిగ జేసెదను" - అని. "సర్వపాపేభ్యో” అని చెప్పుటవలన ఏ ఒక్క పాపమునుండియో కాదనియు సమస్తపాపములనుండియు విడుదల పొందించెద ననియు హామీనిచ్చిరి — అనగా సంపూర్ణముగ బంధవిముక్తునిగ జేసెదనని చెప్పిరి.



మనుజున కింతకంటె నధికముగ కావలసినది యేమున్నది? జనన మరణాది బంధమునుండి తప్పించుకొనుట, కర్మపాశమునుండి విముక్తుడగుట ఒక్కటియే అతనికి కావలసినది. అది కలుగజేసెదనని భగవానుడు ప్రతిజ్ఞచేసిరి. అయితే యెవరికి? అందఱికినికాదు. అందఱును భగవంతుని బిడ్డలు అయియున్నప్పటికిని ఎవరు చేయిజాచి ఆతని నాహ్వానింతురో వారినే పట్టుకొని తన యొడిలో కూర్చుండబెట్టుకొనును.



ఎవడు సమస్తవాంఛలను, కర్మలను, ధర్మములను వదలి తన్ను (భగవానుని, లేక ఆత్మను) ఒక్కనినే శరణు బొందునో, శరీరవాఙ్మనంబులచే తననే ఆశ్రయించునో, అనగా దృశ్యవస్తువులను, దృశ్యవిషయసంబంధకర్మలను, ధర్మములను త్యజించి దృగ్రూపమగు ఆత్మనొకదానినే అవలంబించునో అట్టివానిని మాత్రమే సంసారబంధ (పాప) శృంఖలములనుండి విడివడజేసి తరింపజేసెదనని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగ చెప్పివైచిరి. 

దీనినిబట్టి జీవుడు నెరవేర్చవలసినదానిని నెరవేర్చినచో భగవంతుడు తానీయవలసినదానిని ఇచ్చునని స్పష్టమగుచున్నది.



 ఈ శ్లోకమందలి మొదటిపాదము జీవుని కర్తవ్యమును సూచించును. రెండవపాదము భగవంతు డొసంగు ప్రతిఫలమును సూచించును. జీవుడు తానుచేయవలసినది చేయనిచో భగవంతుడు తానొసంగవలసినదాని నొసంగరు. జీవుడు పరమాత్మనాశ్రయించనిచో, దృశ్యపదార్ధములను మాత్రమే అంటిపెట్టుకొనినచో పరమాత్మ మాత్ర మేమి చేయగలరు? ప్రకృతియందొకానొక అప్రతిహతనియమమును భగవాను డేర్పఱచిరి. అది యేదనగా - పాపముచే దుఃఖము, పుణ్యముచే సుఖము, జ్ఞానముచే లేక భగవచ్ఛరణాగతిచే మోక్షము కలుగును.



 ఎవరు ఏవిధముగ నాచరించుదురో వారావిధమగు ఫలితమునే అనుభవించుదురు. ఇందు భగవంతుని పక్షపాతమేమియులేదు. "చేసుకొన్నవారికి చేసుకొన్నంత మహాదేవ!”

“సర్వధర్మాన్ పరిత్యజ్య” — అను వాక్యమునకు మఱియొక అర్థమున్ను కలదు. "దృశ్యభావనలన్నింటిని వదలి దృగ్వస్తువగు ఆత్మనొకదానినే శరణు బొందుము." అనియు చెప్పవచ్చును. ఇది ఇంకను శ్రేష్టమైన అర్థము. త్యాగముచే మోక్షము లభించునను శాస్త్రనిర్ణయము నిది చక్కగ పోషించుచున్నది. ఒకదానిని త్యజించనిదే మఱియొకటి లభించదు. దయ్యమును పట్టుకొనినచో దేవుడు లభించడు. దేవుని పట్టుకొనవలెననిన దయ్యమును (దృశ్యరూప పిశాచమును) వదలవలెను.


అనగా దృశ్యమును గూర్చి, అనగా క్షేత్రమునుగుఱించిన భావములను త్యజించి క్షేత్రజ్ఞుడగు పరమాత్మను శరణు బొందవలెను.



ఈ శ్లోకమున సమస్త ధర్మములను వదలుమని చెప్పినంతమాత్రమున అధర్మము నాచరించవలెనని అర్ధముకాదు. లేక ధర్మములను వదలి సోమరిగ నుండుమని కాదు. మహాధర్మమగు భగవచ్ఛరణాగతిలోనే, ఆత్మాశ్రయములోనే తక్కిన అవాంతర ధర్మము లన్నియు అంతర్భూతములై యుండునుగావున -‘శతే పంచాశత్' (నూరులో యాభై ఇమిడియుండును అను) న్యాయము ననుసరించి అట్టి మహద్ధర్మము నాశ్రయించువారు చిన్న చిన్న ధర్మములను ప్రత్యేకముగ ఆచరించ నవసరములేదనియు, దాని నొక్కదానిని చక్కగ పాలించిన చాలుననియు చెప్పుటయే యగును. ఇచట పెద్దధర్మమున్నపుడు చిన్నధర్మమును పట్టుకొన నవసరములేదని చెప్పుటయేకాని, చిన్నధర్మమునందు అసలు ఏమియు సత్తువలేదనికాని, దానిని వదలి సోమరిగా నుండుమని కాని అర్థముకాదు. కాబట్టి పదములను జాగ్రత్తగ అన్వయించుకొనవలెను.



“మాశుచః” -  'ఈ సత్యమును తెలిసికొని భగవచ్ఛరణాగతి యొనర్చి ఇక యేమాత్రము శోకింపకుము' అని శ్రీకృష్ణమూర్తి అర్జునున కానతిచ్చిరి. దుఃఖరహితమగు శాశ్వత ఆత్మపదము, భగవంతుని స్థానము లభించుచున్నపుడు, ఇక శోకమున కాస్కారమే లేదు. దృశ్యము నాశ్రయించువారిని, నశ్వరవస్తువులను నమ్ముకొనువారిని శోకము బాధించునేకాని, శాశ్వతమగు ఆత్మను, భగవంతుని ఆశ్రయించువారిని కాదు. వారు నిత్యము పరమానందమునే యనుభవించుదురు. కనుకనే "నన్నాశ్రయించినచో ఇక నీవు దుఃఖపడవలసిన అవసరము లేదనియు, కాబట్టి శోకించవద్దు" (మాశుచః) -అనియు అర్జునునకు శ్రీకృష్ణమూర్తి బోధించుటకు కారణము.



"అశోచ్యానన్వశోచస్త్వమ్” - అను శోకరాహిత్యబోధద్వారా గీత ప్రారంభమై  “మాశుచః” అను శోకరాహిత్యవాక్యముతో అంతమైనదికావున గీతాలక్ష్యము శోకరాహిత్యమే యని స్పష్టపడుచున్నది. దుఃఖరాహిత్యము, ఆనందప్రాప్తి - సంసారదుఃఖశమనము, బ్రహ్మానంద ప్రాప్తి - ఇవియే గీతాలక్ష్యములు. అట్టి లక్ష్యములను జీవులచే బొందింపజేయుటయే గీతయొక్క ఆశయము.



ఈ శ్లోకమునందు అతిసులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి మాత్రమే ముక్తికి హేతువుగ తెలుపబడుటచే ఇక గొప్పగొప్ప శాస్త్రములు చదువలేనివారు పాండిత్య ప్రతిభ లేనివారు, చదువురానివారు మోక్షమునకై దిగులునొందవలసిన పనిలేదనియు, నిర్మల దైవభక్తియొక్కటుండిన చాలుననియు తెలియుచున్నది.



ఈ శ్లోకము గీతయందు చాల ముఖ్యమైన దగుటచే దీనిని బాగుగ కంఠస్థము చేసి అర్థము సదా మననము చేయుచునుండుట ముముక్షువుల కత్యంత శ్రేయస్కరము.



ప్ర:- జీవులకు సమస్త పాపనివృత్తి, బంధవిముక్తి, దుఃఖనివృత్తి యెట్లు కలుగగలదు?


ఉ:- సమస్త (నిత్యనైమిత్తికాది) ధర్మములను, కర్మలను లేక సమస్త దృశ్యభావనలను వదలివైచి భగవంతుని (ఆత్మను) ఒక్కనినే ఆశ్రయించినచో, వారే జీవునకు మోక్షము నొసంగగలరు.



ప్ర:- శోకరాహిత్యమునకు మార్గమేమి?


ఉ:- భగవచ్ఛరణాగతియే, దైవాశ్రయమే.


🕉🌞🌎🌙🌟🚩

[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -134 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚

శ్లోకము 19


🍀. 17. సమభావము -  సమభావము, స్థిరత్వము ఎవరి మనసునకు కలదో వారి కిచ్చటనే సర్గము జయింపబడి, దోషరహితము సమము అయిన బ్రహ్మమునందు స్థితిగొన్న వారగుదురు. సర్గమును మనసుచే జయించుటవలన బ్రహ్మమునందు స్థిరపడుట తెలుపబడినది. సర్గమనగా సృష్టిసర్గము. అది భూర్భువసువరాది ఏడులోకములుగ ఏర్పడి యున్నది.  ఇవన్నియు చైతన్యస్థితులు. భౌతిక స్థితి, ప్రాణమయ స్థితి, మనోమయ స్థితి, బుద్ధి స్థితి, ఆకాశ స్థితి (మహత్), తపో స్థితి, సత్య స్థితి యిట్లేడు లోకములు వర్ణింపబడినవి. ఇందు ప్రాథమిక స్థితులలో పదార్థ మెక్కువగను, ప్రజ్ఞ తక్కువగ నుండును. అట్లే ఉన్నత స్థితులలో ప్రజ్ఞ ఎక్కువగను, పదార్థము తక్కువగ నుండును. ప్రజ్ఞ ఎక్కువగ నున్న లోకములను వెలుగు లోకము లందురు.  మానవు…

[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 334 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

84. అధ్యాయము - 39


🌻. విష్ణుదధీచి యుద్ధము  - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -


విష్ణువు తన చక్రము మొక్క బోవుటను గాంచి, ఆతని మాటలను విని కోపించి ఆతనిపై అస్త్రములనన్నింటినీ క్రమముగా (20) ప్రయోగించెను. అపుడు దేవతలు ఆదరముతో విష్ణువునకు సహాయపడిరి (21). ఒక్క బ్రాహ్మణునితో యుద్ధమునకు తలపడిన మూర్ఖులగు ఇంద్రాది దేవతలు విష్ణువు పక్షమున నిలబడి దధీచునిపై వేగముతో తత తమ శస్త్రములను, అస్త్రములను శీఘ్రమే ప్రయోగించిరి (22). అపుడు వజ్రము వంటి ఎముకలు గలవాడు, సర్వము తన వశమునందున్న వాడు అగు దధీచుడు శివుని స్మరించుచూ గుప్పెడు దర్భలను తీసుకుని (23) దేవతలందరిపై ప్రయోగించెను.


శంకరుని మహిమచే మహర్షి ప్రయోగించిన ఆ దర్భల కట్ట (24) కాలాగ్నివంటి దివ్య త్రిశూలమాయెను.…

[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 219 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. జైమినిమహర్షి  - 4 🌻


19. ఒకసారి సుబాహుడు అనే రాజు, దానం చేయటం వలన వచ్చే లాభం ఏమిటి? చెప్పమని అడిగాడు.


జైమినిమహర్షి: దానం వలన స్వర్గము, సుఖము కలుగుతాయి.

రాజు: స్వర్గం వస్తే ఏమిటి లాభం?

జైమినిమహర్షి: ఈ సుఖాలే అపరిమితంగా ఉంటాయి స్వర్గంలో.

రాజు: తరువాత ఏమవుతుంది?

జైమినిమహర్షి: తిరిగి ఇక్కడికే మరో జన్మరూపంలో వస్తారు.

రాజు: అలాంటప్పుడు ఎందుకు దానం చెయ్యాలి? పునర్హన్మ బంధనహేతువు కదా! జ్ఞాని అనేవాడు దానం చేయకూడదు కదా! యజ్ఞాలు చేసాను. వేదం చెప్పిన కర్మలు చేసాను. దానం చేయమమే ఎందుకు చేయాలి? నాకర్థంకాలేదు.


20. జైమినిమహర్షి: రాజా! స్వర్గానికి వెళతావు అని చెప్పాను. స్వర్గం నీకు వద్దంటావు. కానీ నువ్వు మోక్షాన్వేషివి కాదు కదా! మోక్షమార్గంలో బంధనం వద్దనేట్లయితే, స్వర్గంమీద వై…

[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 158 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - 3 🌻


618. సర్వసాధారణంగా ఫనా-బకా స్థితులన్నియు ఒకే మాదిరిగా నున్నను, ఒక భూమికలోని 'ఫనా-బకా'

కును మరియొక భూమికలోని 'ఫనా-బకా'కును వాటి వాటి సంస్కారముల ననుసరించి అనుభవములో భేదముండును.

____________


Notes:-ఫనా=నిర్వాణస్థితి (సుషుప్తి అవస్థ)

బకా=ఆత్మ ప్రతిష్టాపనము (జాగ్రదవస్థ)


ఉదాహరణము:- అమెరికా నివాసియు, ఆసియా నివాసియు ఓకే భూమిమీద నివసించున్నను ఎవరి సంస్కారములు వారివి. ఆ సంస్కారములకు తగిన తమ వ్యష్టి జీవితము యొక్క సంబంధ అనుభవములు, తాము నివసించు ఖండములకు సంబంధించి యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 14  / Sri Lalita Sahasranamavali - Meaning - 14 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ 


🍀 14. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|

నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ‖ 14 ‖ 🍀


33) కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - 

కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.


34) నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - 

బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.


సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹


[15:58, 26/01/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 14  / Sri Vishnu Sahasra Namavali - 14 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻


మేషరాశి - రోహిణి నక్షత్ర 2వ పాద శ్లోకం


🍀 14. సర్వగ స్సర్వవిద్భానుః విశ్వక్షేనో జనార్దనః|

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః|| 🍀


🍀 123) సర్వగః - 

అన్నిచోట్లా ప్రవేశించువాడు, ఎక్కడికైనా వెళ్లగలిగేవాడు. 


🍀 124) సర్వవిద్భానుః - 

సర్వము తెలిసిన జ్ఞానముతో ప్రకాశించేవాడు.


🍀 125) విష్వక్సేనః - 

విశ్వాన్ని రక్షించేందుకు సైన్యాధిపతిగా వ్యవహరించేవాడు. 



కడలిలోకెరటాలు

కడలిపై కెరటాలు

కెరటాలవి ఉవ్వెత్తున లేచె  శంకరా

372

సాగరతీరమందు

సాగరపు అలలందు

అలలైన ఎగసెను పైకిచూడు శంకరా

373

సూనామి కాదుకద

కాదుగ సునామికద

సునామి వచ్చిన  నష్టం కదా శంకరా

374

, భగవంతుని లీలలు

లీల అతని లీలలు

లీలలను తెలియతరమా మాకు శంకరా

375

ప్రకృతి  నీసృష్టియె

నీదేకద సృష్టియె

సృష్టించు వాడవు నీవేకద శంకరా




[17:02, 19/01/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -128 🌹

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚

శ్లోకము 13


🍀. 11. మానసిక సన్న్యాసము  - మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు.   దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు  నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును.  కర్మ  ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 🍀


సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |

నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ II 13


మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. సన్న్యాస మనగ ముందు శ్లోకముల యందు దైవము నిర్వచన మందించినాడు. 


1. దేనిని కాంక్షింపనివాడు, ద్వేషింపని వాడు సన్న్యాసి. 


2. సతతము దైవముతో మనన మార్గమున యోగయుక్తుడైనవాడు సన్న్యాసి. సన్న్యాస దీక్ష వలన యింద్రియములు నియమమున నుండగలవు. మనసు పరిశుద్ధమగును.


3. సన్న్యాసి సర్వజీవుల యందలి దైవమునే దర్శించుచుండును. 


4. తన నుండి జరుగుచున్న మనో దేహేంద్రియ వ్యాపారములను

మననమున నుండి వీక్షించువాడు సన్న్యాసి. 


5. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు సన్న్యాసి. అట్టివాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును. 


6. 6. కర్మ  ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 


పై ఆరు గుణములు కల జీవుని మనసున సన్న్యాసము స్థిరపడి యుండును. సుఖ మతని వశమున నుండును. అట్టివాడు దేహము నందుండుటకు ఎట్టి అసౌకర్యముండదు. నిజమున

కిట్టి సన్న్యాసియే మానవదేహ సౌలభ్యము, సౌకర్యము అనుభూతి పరముగ నెరిగి యుండును.


పై సర్వమును గృహస్థు అయినను నిర్వర్తించుకొన వచ్చును. గృహము, సంఘము, దేహము బంధములు కావు. ప్రతిబంధకములు కానే కావు. కావున సన్న్యాసమను పేర భార్యాపిల్లలను

విసర్జించుట, వృత్తి వ్యాపారములను వదలివేయుట, సంఘమున వేరుపడి వెలిగ నుండమని భగవంతుడు చెప్పలేదు. 


“మనసా సన్న్యస్య" అని పలుకుటలో, మనసున సన్న్యసించిన చాలునని, భౌతిక సన్న్యాసము అవసరము కాదని తెలిపినాడు. తానట్లే ఆచరించి చూపినాడు. రాజర్షులు, మహర్షులుకూడ నట్లే ఆచరించిరని తెలిపినాడు. సంసారమధ్యమున కూడ సన్న్యాసిగ నుండవచ్చునని తెలిపినాడు. 


“సన్న్యాసులందు కూడ చాలమంది సంసారులే” అని అనుచు అప్పుడప్పుడు మాస్టర్ ఇ.కె. గారు పలుకుచుండెడి వారు. మాస్టర్ ఇ.కె. గారు సంసారమందు సన్న్యాసిగ ఎట్లుండ వచ్చునో జీవించి చూపించినారు. సన్న్యాసము మానసికమే అని తెలియవలెను. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[17:02, 19/01/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 328 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

82. అధ్యాయము - 37


🌻. యజ్ఞ విధ్వంసము  - 4 🌻


దక్షుడు శివుని నిందించిన సమయములో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నందికోపముతో నేలపై బడవేసి, అతని నేత్రములను గిల్లివేసెను(54) శివ గణనాయకులు ఆ యజ్ఞశాలయందు ఉన్న స్వాహ, స్వదా, దక్షిణా అను దేవతలను, మంత్ర తంత్రాదిష్టాన దేవతలను, ఇతరులను దురవస్థకు గురిచేసిరి(55) ఆ గణములు కోపముతో అగ్నివేదికయందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగ నుండెను(56). 


వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచే దాగియున్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీర భద్రుని సన్నిధిలో నిలబెట్టిరి(57)


వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా, యోగమహిమచే ఆతలను నరకుట సంభవము కాలేదు(58) ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచేగాని నరుకుట సర్వథా అసంభవమని భావించి, అతడు గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో పెరికివేసేను(59)


 గణాధ్యక్షుడగు వీరభద్రుడు దుష్టుడు, శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సునను అగ్ని కుండమునందు బారవైచెను(60) అపుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోథముతో సర్వమును తగులబెట్టి ప్రళయాకాలాగ్నిని బోలియుండెను(61)


వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి, తరువాత క్రోథముతో వారికి నిప్పుపెట్టి, అగ్నిహోత్రము మిడతలను వలె తగుల బెట్టెను(62) అపుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను(63) 


అపుడాతడు వీరశోభతో ప్రకాశించెను గణములతో కూడియున్న వీరభద్రునిపై నందన వనమునందు పుట్టిన దివ్యపుష్పములు వర్ణించెను(64) పరిమళభరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయములో దేవదుందుభులు అద్భుతముగా మ్రోగినవి(65)


  చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడు వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తిచేసుకొని శీఘ్రముమే కైలాసమునకు వెళ్ళెను(66) పరమేశ్వరుడగు శంభుడు కార్యమును పూర్తిచేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సుగలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను(67).


శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసనంహితయందు రెండవది యగు సతీఖండలో యజ్ఞ విద్వంస వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది(37)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[17:02, 19/01/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 213 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. శుకమహర్షి  - 1 🌻


జ్ఞానం:


01. జీవుడి పరిణామం ఎలా ఉందంటే, భౌతికంనుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటమే. అంటే, ధర్మబద్ధమైన భౌతికజీవనమునుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటము జరుగుతున్నది. ఈ రెండిటినీ చెప్పిన వేదవ్యాసుడు ఐహిక-ఆముష్మిక మార్గములు రెండింటికీ జగద్గురువు అయ్యాడు. వేదవిజ్ఞాన్నంతా మనకు ప్రసాదించాడు. 


02. శుకుడు ఆయన కుమారుడు. అతడు ఆధ్యాత్మికస్థితిలోనివాడిగా, బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. వ్యాసమహర్షికి – ఈ సర్మకాండలతోటి, వేదవాజ్ఞ్మయంతోటి నిమిత్తంలేకుండా ఉన్నటువంటి, వాటియొక్క పరిణామదశయైన స్థితిలోఉన్న శుకుడు కుమారుడిగా జన్మించాడు. 


03. అంటే, అది ఆయనయొక్క పరిణామదశ. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నట్లుగా, వ్యాసుడివిషయంలో పరమాత్మయే పుత్రనామంతో వచ్చినట్లుగా శుకుడి వృత్తాంతం సంభవించింది. తండ్రియైన వ్యాసమహర్షి ఆజ్ఞప్రకారం, జనకమహారాజుని “బ్రాహ్మణుడి కర్తవ్యం ఏమిటి? ఆయన మోక్షం ఎట్లా పొందుతాడు?” అని అడిగాడు. 


04. జనకుడు ఆయనతో, “బ్రాహ్మణుడు ఊపనీతుడై, బ్రహ్మచర్యము, వేదాభ్యాసము నడిపి వివాహంచేసుకుని సంతానం పొంది, దేవపితృవిధులాచరించి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళి హుతవహ ప్రయత్నముగా వ్రతపాలనచేసి, ఆ తర్వాత సన్యాసస్వీకారముచేసి బ్రహ్మాశ్రమ పదము పొంది, అనంతరం జీవన్ముక్తికి తపస్సుచేయాలి” అని చెప్పాడు.


05. శుకుడు, “కానీ జ్ఞానోదయమై ఉండగా ఆశ్రమ త్రయాన్ని క్రమంగా నడుపవలేనా? జ్ఞానియైనా ఆశ్రమములు విడువరాదని వేదములు చెబుతాయా?” అని అడిగాడు. దానికి జనకుడు, “మునీంద్రా! జ్ఞాన విజ్ఞానములు మోక్షసాధనములే! గురూపదేశంతో అవి లభించగా మోక్షం పొందినవాడు వాటిని విడిచిపెడతాడు. 


06. కానీ లోకోఛ్ఛేదకము, కర్మవ్యాకులత వాటిల్లకుండా ఉండటంకోసం లోకానికతడు ఉదాహరణగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని, కర్మభ్రష్టుడనే భ్రాంతిలోకానికి కలగరాదు. కాబట్టే పూర్వమునులు నాలుగు ఆశ్రమాలనూ క్రమంగా నడిపించారు. కాని ప్రథమ ఆశ్రమంలోనే సుస్థిరజ్ఞానం లభించిన వాడికి మిగిలిన ఆశ్రమాలతో పనిలేదు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

[17:02, 19/01/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 152 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 31 🌻


603.నిర్వాణము - నిర్వికల్పము.

శరీరము నిలిచి యుండగనే ఇది ప్రాప్తించును. అప్పుడు విదేహముక్తుడగును. దేహమునకు ముక్తి కాదు. దేహము కాని దానికి--అనగా, స్వాత్మకు ముక్తి లభించును.


604. విదేహ ముక్తి:-

మానవుడు భగవంతుడైన తరువాత 3 లేక 4 రోజుల వరకు అతని శరీరము నిలిచి యుండును. ఇతని చైతన్యము పూర్తిగా భగవంతునిలో కరిగిపోవును. కనుక దేహములయందు, సృష్టియందు స్పృహయుండదు. వారు నిరంతరముగా సచ్చిదానంద స్థితిని అనుభవించుచుందురు. కాని వాటిని సృష్టిలో ఎఱుకతో వినియోగించరు. ఇతరులు ముక్తులగుకు సహాయపడరు. 


కానీ, వారు భూమిమీద ఉన్నకొలది రోజులు, వారి సాన్నిధ్యము అనంతజ్ఞాన శక్యానందములను ప్రసారము చేయుటలో కేంద్రముగా నుండును; 


వారిని దరిచేరువారును, సేవించువారును, పూజించువారును, మిక్కిలి ప్రయోజనమును పొందెదరు ఇతరులు తమ తమ ప్రారబ్ధము ననుసరించి సంవత్సరముల కొలది శరీరములను నిల్పుకొందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[05:11, 20/01/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 615  / Bhagavad-Gita - 615 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 32 🌴


32. అధర్మం ధర్మమతి యా మన్యతే తమసావృతా |

సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి: సా పార్థ తామసీ ||



🌷. తాత్పర్యం : 

ఓ పార్థా! అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగ అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు, ఎల్లప్పుడును తప్పుద్రోవను పోవునట్టి బుద్ధి తామసగుణమును కూడినట్టిది.


🌷. భాష్యము  :

తమోమయమైన బుద్ధి సదా వర్తించవలసిన విధమునకు విరుద్ధముగ వర్తించుచుండును. ధర్మము కానటువంటి దానిని ధర్మముగా స్వీకరించు అట్టి బుద్ధి నిజమైన ధర్మమును నిరసించుచుండును. 


అట్టి తామసబుద్ధి కలిగినవారు మహాత్ముడైనవానిని సాధారణ మానవునిగా, సాధారణమానవునిగా మహాత్మునిగా భావింతురు. సత్యమును అసత్యముగా భావించుచు. 


అసత్యమును సత్యముగా వారు స్వీకరింతురు. అన్ని కర్మల యందును వారు కేవలము తప్పుద్రోవనే పట్టి పోవుదురు. కనుకనే వారి బుద్ధి తమోగుణమయమైనట్టిది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 241 / Vishnu  Sahasranama Contemplation - 241🌹

📚. ప్రసాద్ భరద్వాజ


🌻241. సత్కర్తా, सत्कर्ता, Satkartā🌻


ఓం సత్కర్త్రే నమః | ॐ सत्कर्त्रे नमः | OM Satkartre namaḥ


సత్కర్తా, सत्कर्ता, Satkartā


సత్కరోతి పూజయతి విష్ణువే జీవుడుగా, ఉపాసకుడుగా, పెద్దలను దేవతలనూ పూజించును. రామకృష్ణాద్యవతారములందు మునులను, ఋషులను పూజించెను.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::

క. గురువులకు నెల్ల గురులై, గురులఘుభావములులేక కొమరారు జగ

    ద్గురులు త్రిలోకహితార్థము, గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్‍.


గురువులకే గురువులు అయినవారూ, ఇతడెక్కువ అతడు తక్కువ అనే బేధభావములు లేక ప్రకాశించు లోకగురువులూ అయిన రామకృష్ణులు సంతోషంతో గురుశిష్యన్యాయంతో ఒజ్జయైన సాందీపనిని సేవించారు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


[05:11, 20/01/2021] +91 98494 71690: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 168 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ


🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 98 🌻


భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. 


జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు.  ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. 


ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.


        ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము. 


ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.


        కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు. 


సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. 


ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటు వంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము.


 చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము.  మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి


ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశము నందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్లు శుద్ధాంతఃకరణము నందు పరమాత్మ సాక్షాత్కారము లభించును.)

        ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[05:11, 20/01/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 8 🌹 

✍️. సద్గురు కె. పార్వతి కుమార్

 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 2  🌻


ఇట్లు శాశ్వత జ్ఞానమునకు గల ఏడు గ్రంథులలో జ్యోతిశ్చక్ర విద్య, రేఖా విద్యయు ఒకటి. దీని రహస్య గ్రంథము ప్రాచీనమున ఒక మూలభాషలో నుండెడిది. అది కేవలము ఉపదేశ గమ్యమైన భాష, అనగా, గురువు కొన్ని అక్షరము లుపదేశించి కొన్ని ఆకారములు చెప్పినచో శిష్యునకు సర్వజ్ఞత వచ్చును. ఆ గ్రంథములోని విషయములు కొంత కొంత భారతీయ భాషల లోనికి, టిబెట్, ఈజిప్టు, గ్రీకు భాషలలోకి అనువదింపబడినవి. కాలక్రమమున ఇతర భాషల లోకి అనువాదమగుసరికి మూలభావము నశించినది. 


వేదము, బైబిలు మొదలగు మూలగ్రంథము లందు ఈ విషయములు గోచరము కాగలవు. “ఖీరో" (Cheiro) అను ద్రష్ట విషయమున బైబిలు అనువాదకులు దురభిప్రాయబడిరి. ఏడవ అధ్యాయము, Book of John ఏడవ పద్యమున ఈ విధముగ నున్నది. “దైవము” మానవుని అరచేతుల యందు, వ్రేళ్ళయందు కొన్ని సంకేతములను గుర్తులను ఏర్పరచెను. కారణమేమన, ఆ గుర్తులను సంకేతములను అవగాహన చేసుకొని మానవుడు తన జీవన ప్రయోజనము తెలుసుకొన గలుగును. 


ఈ విషయము దురవగాహన చేసుకొనుటచే అనువాదము పొరపాటుగ జరిగినది.” భారతీయ సంప్రదాయమున ఈ జ్యోతిశ్చక్రమును భగవంతుని కాలస్వరూపముగ ఆరాధించుట జరుగుచున్నది. శాస్త్రపరమైన సుదర్శనము మరుగున పడినది. సుదర్శన చక్రము విషయమున దర్శనజ్ఞానము వలసినవారు పై చెప్పబడిన సంకేతమును గురు శ్లోకము నాధారముగ చేసికొని ధ్యానము చేసినచో వారియందీ శాస్త్రము మరల ఉద్భవింపగలదు. 


గురు శ్లోకము :

గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !

గురుస్సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

[

🌻 185. 'నీలచికురా' 🌻


నీలమగు శిరోజములు కలది శ్రీమాత అని అర్థము.


శిరోజములు అనగా శిరస్సునుండి మొలుచు వెంట్రుకలు. శ్రీమాత శిరస్సుపై నుండి ఉద్భమించినవి. అవి సహజముగా నీలకాంతి కలిగినవి. నలుపు నీలమగుటచే నల్లగా గోచరించును. కృష్ణ అనగా నలుపు నీలమే. 


కృష్ణ అనునది శ్రీలలిత నామములలో నొకటి. నలుపు = నీల కాంతియే ఇతర రంగులన్నిటికీ ఆధారము. తెలుపు వర్ణము కూడ ఆ నీలమునుండియే పుట్టినది. తెలుపు నుండి మరల ఏడు కాంతులు పుట్టును. అజ్ఞానులకు ముదురు నీలము నలుపువలె గోచరించును. 


జ్ఞానులకు, నలుపువలె గోచరించున దంతయూ ముదురు నీలముగా గోచరించును. అది యథార్గము. శ్రీకృష్ణుడు అల్లసులకు సలుపుగను, జ్ఞానులకు ముదురు నీలకాంతిగనూ గోచరించును. 


ముదురు చీకటి కావల ఉన్నది వెలుగు (తమసః పరస్తాత్). అదియే సమస్తమునకూ ఆధారమైనది. అందుండియే దితి అను నలుపు, అదితి అను తెలుపు, వాని సమ్మిశ్రమములుగ యితరములగు వర్ణములు ఏర్పడును. 


ఈ పై తెలిపిన ముదురు నీలకాంతి శ్రీమాత శిరోజములతో పోల్చబడినది. అందుండి అన్ని వర్ణములుగనూ ఆమెయే దిగి వచ్చును. 


సూర్యచంద్రాత్మకమగు కాంతి ఆమెనుండి దిగిరాగా అందుండి ఎఱుపు, నీలము, పసుపు కాంతులను అమ్మవారి ముఖములుగ వర్ణించు మరియొక సంప్రదాయ మున్నది. శ్రీమాతను గాయత్రిగా ధ్యానించునపుడు ఈ వర్ణములను పఠింతురు.


ముక్త  = చంద్ర కాంతి (ముఖము) 

విద్రుమ = ఎఱుపు కాంతి (ముఖము) 

హేమ = పసుపు కాంతి (ముఖము) 

నీల = ఆకాశ నీల కాంతి (ముఖము) 

ధవళ = సూర్యకాంతి (ముఖము) 

ఛాయ = ముదురు నీలము - ఆధారమగు కాంతి (Back ground) 


శ్రీమాత శిరోజములు సర్వోత్కృష్టములు. అట్లే స్త్రీ శిరోజములు కూడను. వానిని పట్టి పీడించువారికి నాశము తప్పదు. 

[05:33, 20/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


790వ నామ మంత్రము 20.01.2021


ఓం పరాపరాయై నమః


పరబ్రహ్మతత్త్వాన్ని తెలిసికోవడానికి, మోక్షసాధనకు సంబంధించిన పరావిద్య, ఐహిక భోగములకు సంబంధించినది అపరావిద్య. తననాశ్రయించిన భక్తులకు ఏది కావాలంటే అదే ప్రసాదించి పరాపరస్వరూపిణి యైన  జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాపరా యను నాలుగక్షరముల (చతురక్షరీ)  నామ  మంత్రమును ఓం పరాపరాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఐహికమైనవి, ఆముష్మిక సంబంధమైనవి కూడా వారి వారి అర్హతలననుసరించి అనుగ్రహించును.


జగన్మాత పర, అపర అను ఈ రెండు శబ్దములను సంధిచేసిన పరాపరా అనగా పరా యను శబ్దము ఆధ్యాత్మికతత్త్వమునకు, భగవంతునిపై ధ్యాసవైపు మనసును మరల్చి కర్మఫలములను   మెరుగుపరచుకోవడానికి చేయు ప్రయత్నమే పరా శబ్దమునకు సంబంధించినది. అపరా అనగా  ఇహలోక బంధములలో కొట్టుమిట్టాడు జీవుడు తనకు, తనవాళ్ళకు కావలసిన సుఖసంతోషములు, తాత్కాలికమైన ఐహికసంబంధమైన కోర్కెలు నెరవేర్చుకొను దిశగా చేయు ప్రయత్నములో పరమేశ్వరిని ఆరాధించుట. జగన్మాత ఈ రెండిటికి కూడా పలుకుతుంది. సాధకుని సాధనా పటిమను అంచనా వేస్తుంది. ధర్మబద్ధతను పరిశీలిస్తుంది. అందుకు తగినవిధంగా అనుగ్రహిస్తుంది. అందుకే పరమేశ్వరి పరాపరా యని అనబడినది.


శౌనకుడు అనే జిజ్ఞాసువు అంగిరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ఈ ఉపనిషత్తును బోధించాడు.


వేదవిద్య, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము నిరుక్తము ఇవి అన్నీ అపర విద్యయందురు ఈ విద్యలు వృత్తిపరంగా ఉపయోగించుకుని, ధనార్జనకు,  సంఘంలో కీర్తిప్రతిష్టలకు ఉపయోగపడి సంసారసుఖముల నుభవించడానికి ఉపయోగపడుతాయి. ఐహికంగా ఉన్నతస్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంఠే అపరవిద్య ఐహిక సంభంనంధమైన  సుఖసంతోషాలు పొందదగినదే.


పరావిద్య వలన పరమాత్మను తెలుసుకోవడానికి, బ్రహ్మలోక ప్రాప్తికి, మోక్షసిద్ధికి ఉపయోగపడుతుంది. పరావిద్య సాధించాలంటే లౌకిక బంధాలకు డూరంగా ఉందాలి. లైకిక లంపటమలున్నవారికి సాధసకష్టమే. ఈ సాధనకు మార్గము ముక్తిమార్గము. అకుంఠితమైన దీక్షకావాలి. మధ్యలో ఏర్పడే అవరోధాలను అధిగమించాలి.పరమాత్మను దర్శించాలంటే చర్మచక్షులు పనికిరావు. మనోనేత్రాలు మాత్రమే ఉపయోగిస్తాయి.ఇంద్రియాలకు. ఆత్మ సర్వవ్యాపకమైనది అనే భావన కలగించేది పరావిద్య. ఈ మాభావమే బ్రహ్నజ్లాసం.


పరమాత్మను ఆరాధిస్తూ సాష్థాంగపడి అమ్మా నా కుమార్తెకు కళ్యాణయోగం ప్రసాదించుతల్లి, ఉద్యోగంలో ఉన్నస్థితిని కలుగు నట్లు అనుగ్రహించు తల్లి, ఋణబాధలు తీరి ఆర్ధికాభివృధ్ధిని కలిగించుతల్లీ - ఇటువంటికోరికలు అపరవిద్యకు సంబంధింఛినవి.


అమ్మా నీపాదసేవ చేసుకుంటున్నాను. శరీరంలో శక్తియున్నంత వరకూ నిన్నే ఆరాధిస్తాను. ఐహికముగా నాకేవీ కోరికలు లేవు. ఎవరి చేతసేవలు చేయించుకోకుండా అనాయాస మరణము ప్రసాదించి, పునర్జన్మరాహిత్యమైన మోక్షమును ప్రసాదించుతల్లీ. ఇవి పరావిద్యకు సంబంధించినవి.


జగన్మాతకు నమస్కరించునపుదు ఓం పరాపరాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


[05:33, 20/01/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


216వ నామ మంత్రము 20.01.2021


ఓం మహాసత్త్వాయై నమః


చరాచర జగత్తు పాలించుటకు కావలసిన శక్తి, పరిపాలన దక్షతకు కావలసిన గుణసంపత్తి, చరాచర జగత్తునందు వస్తువులన్నిటియందు   అంతర్లీనంగా ఉనికిని చాటగలిగే మహనీయత గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాసత్త్వా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం మహాసత్త్వాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ కారుణ్యమూర్తిని ఆరాధనచేయు భక్తులకు ఆ తల్లి సదా వారి వెంటనే ఉండి శత్రుభయము, దుష్టగ్రహపీడ వంటి ప్రతికూలతలునుండి కాపాడుతూ, తలపెట్టిన ధర్మబద్ధమైన, సత్కార్యములను నిర్విఘ్నముగా కొనసాగింపజేయును.


అత్యంత భక్తిశ్రద్ధలతో తననారాధించు భక్తుల వెంటే తానుంటూ, తన యునికి వారికి మంగళప్రదమగునదిగా కనికరించు మహా మహిమాన్వితమూర్తి గనుకనే జగన్మాత మహాసత్త్వా యని అనిపించుకొనుచున్నది. 


సత్త్వము అంటే బలము, స్వభావము, ద్రవ్రము, గుణము, పిశాచాది ప్రాణి అను అర్థములు గలవు.


సృష్టిస్థితిలయలకు కారణభూతురాలు జగన్మాత. జీవులయొక్క కర్మఫలానుసారం తదుపరి జన్మలు నిర్ణయించేది జగన్మాతయే. లోక కంటకులైన రాక్షసులు సజ్జనులను హింసలు పెట్టు తరుణంలో, అట్టి రాక్షసులను నాశనము చేయుటకనుగుణముగా  అవతరించి రాక్షసపీడను లేకుండా చేయు శక్తిగలిగనిది గనుకనే మహాసత్త్వా యని అనబడినది.


నిరక్షర కుక్షియైన కాళిదాసును ఒక అద్భుతమైన కవిగా మార్చి శ్యామలాదండకం, దేవిస్తోత్రములు వంటివి  ఎన్నియో సృజింజేసి వాటిని తమ అనుష్ఠానములో వినియోగించు దేవీ భక్తులననుగ్రహించినది. అంతకు మించి అమాయకంగా అతనిని వివాహమాడిన రాజకుమార్తె సౌభాగ్యాన్ని అత్యంత మంగళకరమొనర్చినది. 


ఆ తల్లి  త్రిగుణాత్మిక, గుణాతీక కూడా.  త్రిగుణాత్మికమైన జగత్తును సృష్టించి గుణాతీతయై జీవులకు కావలసినవి సమకూర్చినది. 


సూర్యచంద్రులు వారి గమనములను నియంత్రించుచు జగత్తుకు వైపరీత్యముల కంటకము  లేకుండ చేసినది. నవగ్రహములు జీవులనావహించునపుడు, జీవులకర్మఫలములకనుగుణముగా నవగ్రహముల స్థానములు నిర్దేశించినది.


ఋతుధర్మములు, కాలధర్మములు,  జీవధర్మములు, పురుషార్థముల నిర్వహణ అన్నియు తన కనుసన్నలలోనే జరుగునట్లు చేసినది.


సృష్టిస్థితిలయకార్యనిర్వహణ బ్రహ్మవిష్ణుమహేశ్వరులదైనను సృష్టిస్థితిలయలకు తానే కారణమైనది.


తన ఉనికిని, తన బలమును, తన గుణములను జగత్పరిపాలనానిర్వహణలో తగిన విధంగా వినియోగించింది గనుకనే జగత్తు విపరీతములు లేక, ధర్మసంస్థాపన కుంటుబడక, జీవులను వారి కర్మఫలములకనుగుణంగా ప్రవర్పింపజేయుచూ విశ్వకార్యములను చక్కబెట్!నది గనుకనే ఆ తల్లి మహాసత్త్వా యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాసత్త్వాయై నమః అని అనవలెను.

[14:39, 20/01/2021] +91 92915 82862: ఏకదంతగణేశస్తోత్రం


!!ఓం శ్రీగణేశాయ నమః!!


1) మదాసురం సుశాంతం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః! భృగ్వాదయశ్చ మునయ ఏకదంతం సమాయయుః!!



2) ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్! తుష్టువుర్హర్షసంయుక్తా ఏకదంతం గణేశ్వరం!!



3) దేవర్షయ ఊచుః:- సదాత్మరూపం సకలాది-భూతమమాయినం సోఽహమ చింత్యబోధం! అనాది-మధ్యాంత-విహీనమేకం తమేకదంతం శరణం వ్రజామః!!



4) అనంత-చిద్రూప- మయం గణేశం హ్యభేద-భేదాది-విహీనమాద్యం! హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః!!



5) విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాంతమేకం! సదా నిరాలంబ-సమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః!!



 6) స్వబింబభావేన విలాసయుక్తం బిందుస్వరూపా రచితా స్వమాయా! తస్యాం స్వవీర్యం ప్రదదాతి యో వై తమేకదంతం శరణం వ్రజామః!!



7) త్వదీయ-వీర్యేణ సమర్థభూతా మాయా తయా సంరచితం చ విశ్వం! నాదాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదంతం శరణం వ్రజామః!!



8) త్వదీయ- సత్తాధర మేకదంతం గణేశమేకం త్రయబోధితారం! సేవంత ఆపుస్తమజం త్రిసంస్థాస్తమేకదంతం శరణం వ్రజామః!!



9) తతస్త్వయా ప్రేరిత ఏవ నాదస్తేనేదమేవం రచితం జగద్వై! ఆనందరూపం సమభావసంస్థం తమేకదంతం శరణం వ్రజామః!!



10) తదేవ విశ్వం కృపయా తవైవ సంభూతమాద్యం తమసా విభాతం! అనేకరూపం హ్యజమేకభూతం తమేకదంతం శరణం వ్రజామః!!



11) తతస్త్వయా ప్రేరితమేవ తేన సృష్టం సుసూక్ష్మం జగదేకసంస్థం! సత్త్వాత్మకం శ్వేత మనంతమాద్యం తమేకదంతం శరణం వ్రజామః!!



12) తదేవ స్వప్నం తపసా గణేశం సంసిద్ధిరూపం వివిధం వభూవ! సదేకరూపం కృపయా తవాఽపి తమేకదంతం శరణం వ్రజామః!!



13) సంప్రేరితం తచ్చ త్వయా హృదిస్థం తథా సుసృష్టం జగదంశ రూపం! తేనైవ జాగ్రన్మయమప్రమేయం తమేకదంతం శరణం వ్రజామః!!



14) జాగ్రత్స్వరూపం రజసా విభాతం విలోకితం తత్కృపయా యదైవ! తదా విభిన్నం భవదేకరూపం తమేకదంతం శరణం వ్రజామః!!



15) ఏవం చ సృష్ట్వా ప్రకృతిస్వభావాత్తదంతరే త్వం చ విభాసి నిత్యం! బుద్ధిప్రదాతా గణనాథ ఏకస్తమేక దంతం శరణం వ్రజామః!!



16) త్వదాజ్ఞయా భాంతి గ్రహాశ్చ సర్వే నక్షత్రరూపాణి విభాంతి ఖే వై! ఆధారహీనాని త్వయా ధృతాని తమేకదంతం శరణం వ్రజామః!!



17) త్వదాజ్ఞయా సృష్టికరో విధాతా త్వదాజ్ఞయా పాలక ఏవ విష్ణుః!త్వదాజ్ఞయా సంహరకో హరోఽపి తమేకదంతం శరణం వ్రజామః!!



18) యదాజ్ఞయా భూర్జలమధ్యసంస్థా యదాజ్ఞయాఽపః ప్రవహంతి నద్యః! సీమాం సదా రక్షతి వై సముద్రస్తమేకదంతం శరణం వ్రజామః!!



19) యదాజ్ఞయా దేవగణో దివిస్థో దదాతి వై కర్మఫలాని నిత్యం  యదాజ్ఞయా శైలగణోఽచలో వై తమేకదంతం శరణం వ్రజామః!!



20) యదాజ్ఞయా శేష ఇలాధరో వై యదాజ్ఞయా మోహప్రదశ్చ కామః! యదాజ్ఞయా కాలధరోఽర్యమా చ తమేకదంతం శరణం వ్రజామః!!



21) యదాజ్ఞయా వాతి విభాతి వాయుర్యదాజ్ఞ యాఽగ్నిర్జఠరాదిసంస్థః! యదాజ్ఞయా వై సచరాఽచరం చ తమేకదంతం శరణం వ్రజామః!!



22) సర్వాంతరే సంస్థితమేకగూఢం యదాజ్ఞయా సర్వమిదం విభాతి! అనంతరూపం హృది బోధకం వై తమేక దంతం శరణం వ్రజామః!!



23) యం యోగినో యోగబలేన సాధ్యం కుర్వంతి తం కః స్తవనేన స్తౌతి! అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదంతం శరణం వ్రజామః!!



24) గృత్సమద ఉవాచ ఏవం స్తుత్వా చ ప్రహ్లాద దేవాః సమునయశ్చ వై! తూష్ణీం భావం ప్రపద్యైవ ననృతుర్హర్ష సంయుతాః!!



25) స తానువాచ ప్రీతాత్మా హ్యేకదంతః స్తవేన వై! జగాద తాన్ మహాభాగాన్ దేవర్షీన్ భక్తవత్సలః!!



26) ఏకదంత ఉవాచ ప్రసన్నోఽస్మి చ స్తోత్రేణ సురాః సర్షిగణాః కిల! వృణుధ్వం వరదోఽహం వో దాస్యామి మనసీప్సితం!!



27) భవత్కృతం మదీయం వై స్తోత్రం ప్రీతిప్రదం మమ! భవిష్యతి న సందేహః సర్వసిద్ధిప్రదాయకం!!



28) యం యమిచ్ఛతి తం తం వై దాస్యామి స్తోత్రపాఠతః! పుత్ర-పౌత్రాదికం సర్వం లభతే ధన-ధాన్యకం!!



29) గజాశ్వాదిక మత్యంతం రాజ్యభోగం లభేద్ ధ్రువం! భుక్తిం ముక్తిం చ యోగం వై లభతే శాంతిదాయకం!!



30) మారణోచ్చాటనా దీని రాజ్యబంధాదికం చ యత్! పఠతాం శృణ్వతాం నృణాం భవేచ్చ బంధహీనతా!!



31) ఏకవింశతివారం చ శ్లోకాంశ్చైవైక వింశతిం! పఠతే నిత్యమేవం చ దినాని త్వేకవింశతిం!!



32) న తస్య దుర్లభం కించిత్ త్రిషు లోకేషు వై భవేత్ ! అసాధ్యం సాధయేన్ మర్త్యః సర్వత్ర విజయీ భవేత్ !!



33) నిత్యం యః పఠతే స్తోత్రం బ్రహ్మభూతః స వై నరః ! తస్య దర్శనతః సర్వే దేవాః పూతా భవంతి వై !!


34) ఏవం తస్య వచః శ్రుత్వా ప్రహృష్టా దేవతర్షయః ! ఊచుః కరపుటాః సర్వే భక్తియుక్తా గజాననం !!



ఇతి శ్రీ ఏకదంతస్తోత్రం సంపూర్ణం.


🕉🌞🌏🌙🌟

మీ శరీరాన్ని గాని, బుద్ధిని గాని, ఆధ్యాత్మికతను గానీ నిర్వీర్యం చేసే దేన్నయినా విషంలా తిరస్కరించండి.

🕉🌞🌎🌙🌟🚩

ఇంద్రియ భ్రాంతి జన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి. పారమార్థికులమై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం.

🕉🌞🌎🌙🌟🚩

[15:05, 19/01/2021] +91 92915 82862: భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩

మనము జన్మించేటపుడే మన స్వభావాన్ని తెచ్చుకుంటాము. మన స్వభావాన్ని బట్టి  మన తల్లిదండ్రులను ఎన్నుకోవడము జరుగుతుంది. మన స్వభావాన్ని బట్టి మన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. స్వభావాన్ని సరిదిద్దుకోవాలంటే, మన సంకల్పానికి బలము ఏర్పడాలి. బలము ఏర్పడాలంటే  కొంత దైవారాధన నిత్యము జరగాలి.

అపుడే మానవుడు తనకు తాను పరివర్తన చెందుతాడు. మానవుడు పురోగమించుటకు వీలవుతుంది. మన యొక్క వాసనలు మనము పరిశీలించుకొని, దేనిని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవాలి.

🕉🌞🌎🌙🌟🚩

[15:13, 19/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(776)

🕉🌞🌎🌙🌟🚩

"సత్, చిత్ అంటే ఏమిటి ? వాటిమధ్య గల అంతరం ఏమిటి !?"

'సత్' అంటే స్థితి. 'చిత్' అంటే శుద్ధచైతన్యం. 'చిత్' కూడా సత్తే. ఉన్నది ఒక్కటే. కాకపోతే తన ఉనికికి ప్రపంచ ఉనికి తెలియసాధ్యమే కాదు. అది స్థితికి, జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. ఇంతకూ ఆ రెండూ ఒక్కటే.. అభిన్నాలు. మాటవరుసకు 'చిత్' కాని 'సత్' ఉందనుకుందాం. అప్పుడా 'సత్' జడమై కూర్చుంటుంది. దాన్ని తెలుసుకోవడానికి వేరే 'చిత్' ఒకటి అవసరం అవుతుంది. ఆ రెండో 'చిత్ సత్' కి భిన్నం కాబట్టి ఉండనేలేదు. కానీ 'చిత్' లేకుండా ఎట్లు ? ఇక 'చిత్' ని 'సత్' అనుకుందాం. 'సత్' జడంకాబట్టి, 'చిత్' కూడా జడంకావాలి. అది అసంభవం. అప్పుడు దానికి తెలిసేందుకు మరో 'చిత్' అవసరం. అదీ అసంభవం. కాబట్టి 'సత్, చిత్' లు రెండూ ఒక్కటే ! సదృశ్యములే !!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

రూపనామాలతో తాదాత్మ్యత తగ్గటమే సాధన  [మనోదేహాల కలయికే యోగం]!''- (అధ్యాయం -95)

🕉🌞🌎🌙🌟🚩

[15:13, 19/01/2021] +91 92915 82862: "ఋభుగీత "(243)

🕉🌞🌎🌙🌟🚩

ఆత్మవైభవము"

17వ అధ్యాయము 

అభేదస్థితే మనసుకు అలసటలేని స్థితి !

దైవంతో నిజానికి మనది అభేదస్థితి. ఇది తెలియక పోవడంచేత మనసు పడే వేదనే దానికి నిజమైన అలసట. తాను దైవంలో భాగమని, దైవానికి ప్రతిరూపమని తెలిసినరోజు మనంచేసే ప్రతి నిత్యకృత్యం దైవకార్యం అవుతుంది. కర్మ మనది కాదని తెలిస్తే మనసుకు అలసట పోతుంది. అందుకే అన్నమాచార్యుల వారు అంత్యదశలో ఆలసితి... సొలసితి... అంటూ తిరిగి ఆ అభేద స్థితినే కోరుకున్నారు.  ఆయన కీర్తనలన్నీ బాహ్యంగా ఉన్న భగవంతుడికి సంబంధించినవి. బాహ్యజీవనంలో బేధం తప్పదు. కానీ అంత్యంలో అభేదస్థితిలో లయం కాక తప్పదు. లేకపోతే జీవితానికి పరిపూర్ణత  ఉండదు. అభేదస్థితే మనసుకు అలసటలేని స్థితి !

🕉🌞🌎🌙🌟🚩

[15:21, 19/01/2021] +91 92915 82862: 🌷132-మంద్రగీత🌷

🕉🌞🌎🌙🌟🚩

 పురుషోత్తమ ప్రాప్తి

2. ఈ చెట్టుకొమ్మలు క్రిందకును పైకినికూడా వ్యాపించుచున్నవి. అవి గుణములచే బలిష్టములగుచున్నవి. శబ్ద స్పర్శ రూప రస గంధములుగా చిగుర్చుచున్నవి. మూలములు క్రిందకును వ్యాపించుచున్నవి. అవి మనుష్య లోకమునందు వ్యాపించి కర్మలను అనుసంధానం చేయుచున్నవి.


మీ శరీరాన్ని గాని, బుద్ధిని గాని, ఆధ్యాత్మికతను గానీ నిర్వీర్యం చేసే దేన్నయినా విషంలా తిరస్కరించండి.


🕉🌞🌎🌙🌟🚩


ఇంద్రియ భ్రాంతి జన్యమైన ఈ ప్రపంచాన్ని పరిత్యజించండి. పారమార్థికులమై పరమ సత్యాన్ని అన్వేషించాలనే తపన మాత్రమే శ్రేయోదాయకం.


🕉🌞🌎🌙🌟🚩

[15:05, 19/01/2021] +91 92915 82862: భాగవతము

శ్రీగురుభ్యోనమః

🕉🌞🌎🌙🌟🚩


మనము జన్మించేటపుడే మన స్వభావాన్ని తెచ్చుకుంటాము. మన స్వభావాన్ని బట్టి  మన తల్లిదండ్రులను ఎన్నుకోవడము జరుగుతుంది. మన స్వభావాన్ని బట్టి మన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. స్వభావాన్ని సరిదిద్దుకోవాలంటే, మన సంకల్పానికి బలము ఏర్పడాలి. బలము ఏర్పడాలంటే  కొంత దైవారాధన నిత్యము జరగాలి.

 


అపుడే మానవుడు తనకు తాను పరివర్తన చెందుతాడు. మానవుడు పురోగమించుటకు వీలవుతుంది. మన యొక్క వాసనలు మనము పరిశీలించుకొని, దేనిని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవాలి.


🕉🌞🌎🌙🌟🚩

[15:13, 19/01/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(776)

🕉🌞🌎🌙🌟🚩


"సత్, చిత్ అంటే ఏమిటి ? వాటిమధ్య గల అంతరం ఏమిటి !?"


'సత్' అంటే స్థితి. 'చిత్' అంటే శుద్ధచైతన్యం. 'చిత్' కూడా సత్తే. ఉన్నది ఒక్కటే. కాకపోతే తన ఉనికికి ప్రపంచ ఉనికి తెలియసాధ్యమే కాదు. అది స్థితికి, జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. ఇంతకూ ఆ రెండూ ఒక్కటే.. అభిన్నాలు. మాటవరుసకు 'చిత్' కాని 'సత్' ఉందనుకుందాం. అప్పుడా 'సత్' జడమై కూర్చుంటుంది. దాన్ని తెలుసుకోవడానికి వేరే 'చిత్' ఒకటి అవసరం అవుతుంది. ఆ రెండో 'చిత్ సత్' కి భిన్నం కాబట్టి ఉండనేలేదు. కానీ 'చిత్' లేకుండా ఎట్లు ? ఇక 'చిత్' ని 'సత్' అనుకుందాం. 'సత్' జడంకాబట్టి, 'చిత్' కూడా జడంకావాలి. అది అసంభవం. అప్పుడు దానికి తెలిసేందుకు మరో 'చిత్' అవసరం. అదీ అసంభవం. కాబట్టి 'సత్, చిత్' లు రెండూ ఒక్కటే ! సదృశ్యములే !!


{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

రూపనామాలతో తాదాత్మ్యత తగ్గటమే సాధన  [మనోదేహాల కలయికే యోగం]!''- (అధ్యాయం -95)


🕉🌞🌎🌙🌟🚩

[15:13, 19/01/2021] +91 92915 82862: "ఋభుగీత "(243)

🕉🌞🌎🌙🌟🚩


ఆత్మవైభవము"

17వ అధ్యాయము 


అభేదస్థితే మనసుకు అలసటలేని స్థితి !


దైవంతో నిజానికి మనది అభేదస్థితి. ఇది తెలియక పోవడంచేత మనసు పడే వేదనే దానికి నిజమైన అలసట. తాను దైవంలో భాగమని, దైవానికి ప్రతిరూపమని తెలిసినరోజు మనంచేసే ప్రతి నిత్యకృత్యం దైవకార్యం అవుతుంది. కర్మ మనది కాదని తెలిస్తే మనసుకు అలసట పోతుంది. అందుకే అన్నమాచార్యుల వారు అంత్యదశలో ఆలసితి... సొలసితి... అంటూ తిరిగి ఆ అభేద స్థితినే కోరుకున్నారు.  ఆయన కీర్తనలన్నీ బాహ్యంగా ఉన్న భగవంతుడికి సంబంధించినవి. బాహ్యజీవనంలో బేధం తప్పదు. కానీ అంత్యంలో అభేదస్థితిలో లయం కాక తప్పదు. లేకపోతే జీవితానికి పరిపూర్ణత  ఉండదు. అభేదస్థితే మనసుకు అలసటలేని స్థితి !

****

నిత్య జ్ఞాన ప్రయత్నేచ్ఛా గుణానీశస్య మన్వతే ౹ 

అసఙ్గస్య నియంతృత్వ మయుక్తమితి తార్కికా ౹౹109౹౹


109.  ఈశ్వరుడు అసంగుడగుటచే అతని నియంతృత్వము అసంగత మని తార్కికులు నిరాకరింతురు. నిత్యమైన జ్ఞానప్రయత్న ఇచ్ఛ అనే గుణములను వారు ఈశ్వరునకు అన్వయింతురు.

పుం విశేషత్వమప్యస్య గుణై రేవ న చాన్యథా ౹ సత్యకామః సత్యసంకల్ప ఇత్యాదిశ్రుతిర్జగౌ ౹౹110౹౹


110.  ఈ గుణముల చేతనే ఈశ్వరుడు విశిష్ట పురుషుడగుట సిద్ధించును.మరొకవిధమున సిద్ధింపదు.సత్యకాముడు సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.

ఛాందోగ్య ఉప.8.1.5;8.7.1-3

నిత్యజ్ఞానాదిమత్వేఽ స్య సృష్టి రేవ సదాభవేత్ ౹ హిరణ్యగర్భ ఈశోఽ పి లిఙ్గదేహేన సంయుతః  ౹౹111౹౹


111. కానీ ఈశ్వరుడు నిత్యజ్ఞానాది గుణన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.కనుక తార్కికులు ఈశ్వరుడనునది నిజముగ లింగశరీరముల సమిష్టియగు హిరణ్యగర్భుడే.

వ్యాఖ్య:-

 సూక్ష్మ దేహం అనాదియైనది.ఇది అవిద్యా బలంతో జగత్కర్తయైన ఈశ్వరుని ద్వారా ఏర్పడి జీవునికి ఉపాధియై ఉన్నది.జీవుని కర్తృత్వ భోక్తృత్వములకు అధ్యాస మూలకమున ఇదియే కారణమై యున్నది.

ఈశ్వరుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.ఆత్మ యొక్క సత్యకామములు అసత్యముచే కప్పబడి యున్నవి.

సమస్త జీవుల లింగదేహముల యొక్క సమిష్టి రూపము ఈశ్వరునికి ఉపాధిగా యున్నది. ఇట్టి ఉపాధి గలిగినప్పుడు ఈశ్వరుడు హిరణ్య గర్భ (బ్రహ్మదేవుడు)నామముతో పిలవబడుచున్నాడు.

లింగదేహం యొక్క వ్యష్టిరూపాన్ని జీవుడును,సమిష్టి రూపాన్ని ఈశ్వరుడును ఉపాధులుగా గలిగి యున్నారు.

శుద్ధ బ్రహ్మమునందు మూలాజ్ఞానము లేదు. తూలాజ్ఞానము(మన అజ్ఞానము) లేదు.స్థూలసూక్ష్మ వ్యష్టి సమిష్టి మొదలగునవి ఏవీ లేవు.నిత్య స్వయం ప్రకాశమయిన బ్రహ్మము నందు జాగరణ నిద్రాదులుండవు.

సూర్యునకు ఉదయాస్తమములుగా అంతా మన బుద్ధి విలాసమే.

ఈశ్వరుడు గుణాన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.వేదాంతులిట్లు తార్కికుల వాదమునందు దోషమును చూపి వారి వాదమును తమ వాదముతో సమన్వయించుకొనుచున్నారు.

సంబంధ రహితుడు ఆత్మ ఒక్కటే.సజాతీయ వస్తువులు లేవు.అలాగే ఆత్మకు విజాతీయ వస్తువులు కూడా లేవు.ఉన్నవి మిధ్య గదా?స్వగతంగా ఏభేదమూ లేదు.ఆకాశము వలె నిరవయవము.

వస్త్రమునకు-దారమునకు స్వగత భేదము.అటువంటిదాత్మకు లేదు.

మిధ్యా వస్తువులున్నా వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధము వికారము ఏర్పడదు.ఎండమావిలో కనబడిన నీరు వలన ఎండమావి తడవదు(బురదకాదు).

ఇట్టి "ఆత్మ"నీవే.


🕉🌞🌏🌙🌟🚩

-శ్రీ రామదాసు కీర్తన

అసావేరి రాగం/ త్రిపుట తాళం.

ప: ఉన్నాడో లేడో భద్రాద్రియందు || ఉన్నాడో ||

చ1: ఉన్నాడో లేడో

యాపన్న రక్షకుడు

ఎన్నాళ్ళు వేడిన కన్నుల కగపడడు || ఉన్నాడో ||

చ2: నన్నుగన్న తండ్రి

నా పెన్నిధానము

విన్నపము విని తా నెన్నడు రాడాయె || ఉన్నాడో ||

చ3: ఆకొని నే నిపుడు

చేకొని వేడితే

రాకున్నా డయ్యయ్యో కాకుత్సతిలకుడు || ఉన్నాడో ||

చ4: వాటముగ

భద్రాచల రామదాసుతో

మాటలాడుటకు నాటకధరుడు || ఉన్నాడో ||                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

🌞🌎🌙🌟🚩దుగా పెరిగిన కొమ్మలు క్రిందికే కాక మూలములు మీదికిని వ్యాపించుచున్నవి. ఊర్థ్వముగా పెరిగిన వ్రేళ్ళు పైకే గాక దిగువ కొమ్మల మీదకును వ్యాపించుచున్నవి. అనగా వ్రేళ్ళును, కొమ్మలును కలసి అల్లుకొనిపోయి మ్రాను లభ్యము కాకుండా చేయుచున్నవని భావము. పరబ్రహ్మ తత్త్వము యొక్క అంశ సృష్టిలోని స్థూల భూతముల లోనికి కూడా వ్యాపించియున్నది. ఆకాశము మిగిలిన నాలుగు భూతములయందును వ్యాపించియున్నది. అవియును జీవులును కలసి ఆకాశమునందు వ్యాపించియున్నవి. ఒకదానియందు ఇంకొకదాని ప్రకృతి ధర్మములు అభావము లేదని అర్థము. ఇట్లు ప్రకృతిలోని త్రిగుణములు అసంఖ్యాకముగా గుణితములగుచున్నవి.

మానవుని యందు కూడా మనోబుద్ధ్యహంకారాది మూలశక్తులు దేహేంద్రియ రక్షణాది స్థితులకు, కర్మాచరణమునకు ఫలితములలోనికి దిగుచున్నవి. ఈ ఫలితములు కర్మలుగా శాఖలై ఫలితముల రూపమున మరల మనోబుద్ధ్యహంకారాదులలో సంకల్పములను ప్రేరేపించుచున్నవి. వీని వలన అవియు, వాని వలన ఇవియు బలిష్టములై అల్లుకొనుచున్నవి. ఒక సంకల్పము బాహ్య ప్రపంచమున విషయములయందు వర్తించుచున్న ఇంద్రియముల మూలమున మనస్సునకు కలుగును. అది దేహమున ఆచరణ రూపము దాల్చును. ఇది అంతయు త్రిగుణముల వలన శాఖలు ఉపశాఖలై ప్రసరించు విధము. దాని వలన మనస్సు మున్నగు వ్రేళ్ళు కర్మలతో, ఫలితములతో బంధించుకొనును. ఇది వ్రేళ్ళు క్రిందికి అల్లుకొను విధము. ఈ సంకల్పముల కర్మల గజిబిజి అల్లికయే మనుష్య లోకమై కర్మబంధన ప్రవర్తనమగును.

ఇందు వృక్షమునందు చెప్పబడని మరికొన్ని అంశములను కూడా అనుబంధము చేసుకొన్నచో రూపకల్పనము పూర్తియై ప్రధాన విషయము అలంకార మూలక వస్తుధ్వనిగా దర్శనమిచ్చును. భగవంతుడు ఎప్పుడును వాచ్య స్వరూపమైన సృష్టికి వ్యంగ్య స్వరూపుడుగా నిలిచి జ్ఞేయమగుచున్నాడు. విత్తనము సంస్కారము లేక వాసన. దాని నుండి వేరు సంకల్పముగా సాగును. దాని నుండి కొమ్మలు కర్మలుగా దిగును. దాని నుండి పువ్వులు ఇంద్రియాదుల కర్మ వాసనలుగా పుష్పించును. వాని నుండి ఫలములు కర్మఫలములుగా విపాకమగును. ఈ ఫలము మరియొక కర్మ సంగమునకు వాసనయై, చెట్ల యొక్క రెండవ తరము ఉత్పత్తిని కలిగించును. ఇట్లు బీజము నుండి అంకురము, మూలము, శాఖలు, పుష్పములు, ఫలములు అను మార్గమున మరల బీజము వరకు వృక్షము యొక్క అస్తిత్వమును కాల విపాక రూపమున మండలావృత్తులుగా తిరుగుచుండును. ఇదియే సంసారం చక్ర బంధము. ఇందు ఊర్థ్వాధస్సులగు  మార్గములు సృష్టికి ప్రవృత్తి మార్గములే గాని తదతీత స్థితికి మార్గములు కావనియు, నడుమ అనేకములగు అల్లికలు జీవునెదుర్కొనుననియు సూచింపబడినది.).

🕉🌞🌎🌙🌟🚩

[15:21, 19/01/2021] +91 92915 82862: 147) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

నిత్య జ్ఞాన ప్రయత్నేచ్ఛా గుణానీశస్య మన్వతే ౹ అసఙ్గస్య నియంతృత్వ మయుక్తమితి తార్కికా ౹౹109౹౹

109.  ఈశ్వరుడు అసంగుడగుటచే అతని నియంతృత్వము అసంగత మని తార్కికులు నిరాకరింతురు. నిత్యమైన జ్ఞానప్రయత్న ఇచ్ఛ అనే గుణములను వారు ఈశ్వరునకు అన్వయింతురు.

పుం విశేషత్వమప్యస్య గుణై రేవ న చాన్యథా ౹ సత్యకామః సత్యసంకల్ప ఇత్యాదిశ్రుతిర్జగౌ ౹౹110౹౹

110.  ఈ గుణముల చేతనే ఈశ్వరుడు విశిష్ట పురుషుడగుట సిద్ధించును.మరొకవిధమున సిద్ధింపదు.సత్యకాముడు సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.

ఛాందోగ్య ఉప.8.1.5;8.7.1-3

నిత్యజ్ఞానాదిమత్వేఽ స్య సృష్టి రేవ సదాభవేత్ ౹ హిరణ్యగర్భ ఈశోఽ పి లిఙ్గదేహేన సంయుతః  ౹౹111౹౹

111. కానీ ఈశ్వరుడు నిత్యజ్ఞానాది గుణన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.కనుక తార్కికులు ఈశ్వరుడనునది నిజముగ లింగశరీరముల సమిష్టియగు హిరణ్యగర్భుడే.

వ్యాఖ్య:-

 సూక్ష్మ దేహం అనాదియైనది.ఇది అవిద్యా బలంతో జగత్కర్తయైన ఈశ్వరుని ద్వారా ఏర్పడి జీవునికి ఉపాధియై ఉన్నది.జీవుని కర్తృత్వ భోక్తృత్వములకు అధ్యాస మూలకమున ఇదియే కారణమై యున్నది.

ఈశ్వరుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.ఆత్మ యొక్క సత్యకామములు అసత్యముచే కప్పబడి యున్నవి.

సమస్త జీవుల లింగదేహముల యొక్క సమిష్టి రూపము ఈశ్వరునికి ఉపాధిగా యున్నది. ఇట్టి ఉపాధి గలిగినప్పుడు ఈశ్వరుడు హిరణ్య గర్భ (బ్రహ్మదేవుడు)నామముతో పిలవబడుచున్నాడు.

లింగదేహం యొక్క వ్యష్టిరూపాన్ని జీవుడును,సమిష్టి రూపాన్ని ఈశ్వరుడును ఉపాధులుగా గలిగి యున్నారు.

శుద్ధ బ్రహ్మమునందు మూలాజ్ఞానము లేదు. తూలాజ్ఞానము(మన అజ్ఞానము) లేదు.స్థూలసూక్ష్మ వ్యష్టి సమిష్టి మొదలగునవి ఏవీ లేవు.నిత్య స్వయం ప్రకాశమయిన బ్రహ్మము నందు జాగరణ నిద్రాదులుండవు.

సూర్యునకు ఉదయాస్తమములుగా అంతా మన బుద్ధి విలాసమే.

ఈశ్వరుడు గుణాన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.వేదాంతులిట్లు తార్కికుల వాదమునందు దోషమును చూపి వారి వాదమును తమ వాదముతో సమన్వయించుకొనుచున్నారు.

సంబంధ రహితుడు ఆత్మ ఒక్కటే.సజాతీయ వస్తువులు లేవు.అలాగే ఆత్మకు విజాతీయ వస్తువులు కూడా లేవు.ఉన్నవి మిధ్య గదా?స్వగతంగా ఏభేదమూ లేదు.ఆకాశము వలె నిరవయవము.

వస్త్రమునకు-దారమునకు స్వగత భేదము.అటువంటిదాత్మకు లేదు.

మిధ్యా వస్తువులున్నా వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధము వికారము ఏర్పడదు.ఎండమావిలో కనబడిన నీరు వలన ఎండమావి తడవదు(బురదకాదు).

ఇట్టి "ఆత్మ"నీవే.


🕉

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ