Jan 9...2021

ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రేనమ: సేకరణ రచయిత: మల్లాప్రగడ  




మనకు కావలసింది శ్రద్ధ... మనిషికి మనిషికి మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమి కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను; ఇంకొకరిని బలహీనుడిగాను, అధముడిగాను చేసేది శ్రద్ధే... 

అంటే శ్రద్ధలో వ్యత్యాసమే కాబట్టి ఈ శ్రద్ధ మీలో పాదుకోవాలి.

మార్పుని కోరని జడత్వం మూర్ఖుడి స్వభావం. చెడును నివారించి, మంచిని కోరడం మనిషి లక్షణం, ద్వందాలన్నింటినీ అతిక్రమించి దేన్నీ ఆశించక సదానందుడై ఉండడం భగవంతుడి తత్వం, అదే మన గమ్యం.

ఆత్మవికాశానికి స్ఫూర్తిదాయక ఆలోచనలు.

కృతజ్ఞత, అతిథి సత్కారం భారతీయుల విశిష్ట లక్షణాలని మనం గుర్తించాలి.

శ్రీగురుభ్యోనమః

*మనము పదార్ధ సముపార్జన కోసము ఆరాటపడుతూ, తింటూ, తిరుగుతూ, ఇంకా పోగేసుకుంటూ అదే కార్యక్రమములో ఉంటే  మూలాధారములో ఉన్నట్టు లెక్క. మనకి తీరవలసిన కోరికలు బాగా ఉండి, వాటి మీదే ధ్యాస ఉంటే స్వాధిష్టానములో ఉన్నట్లు లెక్క .

ప్రాపంచిక భావాలలో మన మనసు ఎక్కువ తిరుగుతూ  ఉంటే మణిపూరకములో  ఉన్నట్లు లెక్క.*

వీటికి అలవాటు పడిన మనస్సుని సరాసరి తీసుకొని వెళ్లి భ్రూమధ్యములో  ఉంచాలి. ఇది జిజ్ఞాసువులు చేయవలసినటువంటి ప్రధానమైన ప్రయత్నము. మనసు అక్కడనుండి విచలితమై అటు, ఇటు పోతూ ఉన్నా, మరల తీసుకొని వెళ్ళి అక్కడే పెడుతూ ఉండాలి. ఇది ఓపిగ్గా అభ్యాసము చేయాలి. దీనినే *A game of patience అన్నారు.*

🕉🌞🌎🌙🌟🚩

ఆత్మజ్ఞానము 🧘‍♀️

 సృష్టిలో అన్ని జీవులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సింహము గర్జిస్తే పది మైళ్ళ దూరము అవలీలగా. వినపడు తుంది , ఏనుగు 5 టన్నుల బరువు ఉంటే , తిమింగలం 100-150 టన్నుల బరువు ఉంటుంది మిణుగురు పురుగు కటిక చీకట్లో స్వయము ప్రకాశముతో చూడగలదు , కుక్కలు వాసన చూసి దొంగలను పట్టగలవు – చీమలు తమకంటే 52 రెట్లు బరువును అధికంగా మోసుక పోగలవు ,చిరుత గంటకు 100  మైళ్ల కు మించిన వేగముతో పరిగెత గలవు , గ్రద్దలు ఆకాశములో ఎంతో ఎత్తున ఎగురుతూ నేల మీద ఉన్న. నలుసంత కోడి పిల్లను చూడగ లదు, భూమిపై ఉన్న పశు , పక్షి, క్రిమి , కీటకాలలో ఎన్నో ప్రత్యే కతలు గలవి ఎన్నో జీవులు కలవు.

మరీ మనషి పత్యేకత ఏమిటి..? ఈ చరాచర సృష్టిలో అతని స్థానము ఏమిటి ? జీవ జాతులలో అతని గొప్పతనం ఏమిటి ? నేడు భూమిమీద నివసిస్తున్న జంతువులలో 20 లక్షల రకాల కన్నా కీటకాలలోని 15 లక్షల జాతుల కన్నా , పక్షులలోని 8,650 జాతుల కన్నా నిశ్చయంగా ఉన్న మానవుడే మహనీయుడు.

ఇన్ని కోట్ల జీవాలలో ఇన్ని లక్షల జాతులలో ఒక మానవ జాతే సమస్త భూమండలాన్ని , భూమండలంలోని కోటాను కోట్ల జాతుల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకో గలిగిందంటే దానికి కారణం ? మానవుని మేధాసులో ఉన్న  జ్ఞానం – ఆలోచన – అన్వేషణ కలిగిన మానవుడు ప్రపంచం ఫై ఆధీపత్యము వహిస్తున్నాడు.

సమస్త జీవ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు ? అసలు సృష్టికర్త ఎవరు ? అతను అపారాశక్తి సంపన్నుడు ఆది అంతము లేనివాడు, సృష్టి , స్థితి, లయాలకు మూల కారకూడైన ఆ శక్తి సంపన్నున్ని – ఎలా దర్శించాలి ? ఎలా ప్రసన్నం చేసుకోవాలి ? అతనిలో ఎలా లీనం కావాలి ? ఎలా ధ్యానించాలి ? ఎలా పూజించాలి ? అసలు అతడు ఒక్కడా! అనేకులా ?

మరి మానవుడు ఎక్కడ నుండి వచ్చినాడు. అన్ని రంగాలలో  ఆలోచన చేయగలిగిన మానవుడు తను ఎందుకు వచ్చాడో, తన ప్రత్యేకత ఏమిటి ? అని తనకు తానూ తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఈ నాడు అనంతమైన విజ్ఞానాన్ని పొందుతూ  ఖగోళంలో  ఏముందో చూడగలిగిన మానవుడు,  భూగర్భములో ఏముందో చెప్పగలిగిన మానవుడు, గర్భస్థ శిశువు ఆడ, మగ అని చెప్పగలిగిన మానవుడు, దేహ రచన శాస్త్రములో కానీ అన్ని రంగాలలో ఎంతో ముందుకు పోతున్నాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో మాత్రం తనని  తాను తెలుసుకునే దానిలో ముందుకు పోలేకపోతున్నాడు కారణం ? జ్ఞానం లేకనా ? ఆలోచన లేకనా ? అశ్రద్ధ వలననా ? తనలో ఉన్న జ్ఞానం, ఆలోచన, అన్వేషణ అనునవి సూక్ష్మ స్థితిలో తనలోనే ఉన్నా-వీటికి మూలము ఏమిటి అని అన్వేషించలేక పోతున్నాడు కారణం ? మార్గం తెలవకనా, ఈ విశాల సృష్టికి మూలం ఎవరో ఒకరు ఉంటారు కదా? అతనిని వెతకటం ఎందుకు ప్రయత్నము చేయడం లేదు.

తనను సృష్టించింది ఎవరు? తన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని    సృష్టించింది ఎవరు? ఈ ప్రకృతిని , ఈ అనంత ఆకాశాన్ని , సువిశాల భూమండలాన్ని, మహాపర్వత శ్రేణులను, సరస్సులు, సాగరములు ఇలా ఆనంతసృష్టిని సృష్టించిందెవరు. ఆ సృష్టికర్త ఎవరు ? అతడు అపారాశక్తి సంపన్నుడై ఉండాలి-సృష్టి స్థితి లయకు కారణమై ఉండాలి. అన్ని తెలుసుకునే మానవుడు నిన్న నీవు ప్రథమంగా తెలుసుకో. తరువాత అన్ని నీకే తెలుస్తాయి అని ఋషులు,యోగులు  తెలుసుకునే మార్గాన్ని చూపించినప్పటికీ దానిని దర్శించ లేకపోవడం మన ఆశ్రద్ధ తార్కాణమే గదా? ఈ మానవుడికి పరిపూర్ణమైన మేధస్సు ఇచ్చి జ్ఞనము ఆలోచన, అన్వేషణ అన్నింటిని కలిపింది సృష్టిలోని సమస్త జీవుల యెడ దయార్ధ హృదయంతో చూడాలని, వచ్చిన మార్గాన్ని వెతకడమే నీ బాధ్యత. ప్రయత్నం చేయండి.

1)  నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.

2)  నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది  అని వెతకకు, అది నీ అంతరంగంలోనే  అంతర్యామి అయిన  అంతరాత్మలోనే ఉంటుంది.

3)   సంతోషానిచ్చేది , సంపదలు , అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.

4)  నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.

5)  మన సమస్యలకు , మన దుఃఖాలకు , మన బాధలకు పరిస్కారాలు మన దగ్గరే ఉంటాయి , కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.

6)  సంతోషం అనేది ఎంతో మధురమినది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.

7)  విజయం సాధించడములో ఎవరు నిన్ను మోసము చేయలేరు-నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్పా.

8)  నీలో ఉన్న శక్తిని నీవు తెలుసు కున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.

9)  నిన్ను నీవు విమర్శించించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.

10)  నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.

11)   నిన్ను నీవు మోసాగించు కున్నంతగా , ఇంకొక రెవరూ నిన్ను మోసాగించరు.

12)  దేని నైనా ఆశించబోయే ముందు అందుకు కావలిసిన అర్హతను సంపాదించుకో – తనను తానూ జయించు కోగల వ్యక్తీ అన్నింటిని జయించగలడు.

13)   దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు.

14)  నీమీద నీకు నమ్మకం పెరుగు తున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.

15)  అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

 శ్రీరమణీయం - (766)

"శాంతి పొందేందుకు మనసును సంస్కరించునే విధానాలు ఏమిటి !?"

శాంతి కావాలనే కోరిక ఉత్కృష్టమైనది. జీవనంలో ఉన్న అసమతౌల్యాన్ని గుర్తించి తొలగించుకుంటూ పోతే మనసుకు ఏర్పడే ఫలమే ధ్యానం. ఆత్మలక్షణమే శాంతి. అందుకే నిద్రలో మనకి రోజూ అది అందుతూనేవుంది. నిద్రలో ఎలాగైతే మనసుకు ఉన్న బాధలు, శరీరానికి ఉన్న వ్యాధులు ఏవీ తెలియనివ్వని అత్యున్నత శాంతి లభిస్తుందో అలాగే నిత్యజీవితంలో కూడా పొందే స్థితిని పొందటమే నిజమైన ధ్యానఫలం. మనసును సంస్కరించేందుకు ఉపయోగపడే దైవారాధనను నిత్యనైమిత్తిక కర్మల్లో కొనసాగించాలి. అయితే వాటిద్వారా ఏదో పొందాలన్న కోరికను విడనాడాలి. అప్పుడే భగవాన్ శ్రీరమణమహర్షి వంటి మహానుభావులు తెల్పిన సత్యం అనుభవంలోకి వస్తుంది. మనం దైవానికి భిన్నంగా లేమన్నజ్ఞానం కలుగుతుంది !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"

ఘర్షణలేని మనసే శాంతి సామ్రాజ్యం !''- (అధ్యాయం -94)

 "ఋభుగీత " (233)

ఆత్మవైభవము"

17వ అధ్యాయము 

మనసును మౌనంగా ఉంచితే సత్యం సంపూర్ణంగా సిద్ధించి అఖండ శాంతినిస్తుంది!

ఒకడు శివుడిని కనిపించమని కోరతాడు. మరొకడు శివుడిని తనకు కావాల్సిన లౌకికమైన కోర్కెలు తీర్చమని కోరతాడు. తేడా ఏమిటంటే ఒకరు లౌకిక విషయాల్లో మౌనంగా ఉంటే, మరొకరు పారలౌకిక విషయాల్లో మౌనంగా ఉన్నారు. కానీ ఇద్దరిదీ సంపూర్ణమౌనం కాదు. ఎవరెవరు ఏఏ విషయాల్లో మనసును మౌనంగా ఉంచలేకపోతున్నారో, వారు ఆయా విషయాల్లో మనసును మౌనంగా ఉంచితే అది సంపూర్ణంగా సిద్ధించి అఖండశాంతినిస్తుంది. చిత్తహీనులు, తత్ అయినవారు, సంసారహీనులకు సులభం అని చెప్తున్నారు. సంసార హీనులు అంటే బాహ్యంగా సంసారాలు లేనివారని కాదు.  మనసులో సంసార జంజాటం లేనివారు. సంసార పోషణను ఒక బంధంగా కాకుండా బాధ్యతగా చేసేవాళ్ళు !

🕉🌞🌎🌙🌟🚩

 🌷123-మంద్రగీత🌷

🕉🌞🌎🌙🌟🚩

 క్షేత్రము-క్షేత్రజ్ఞుడు

29. నశించుచున్న పదార్థజాలమంతయు నశింపనివానియందే ద్రష్టచే ఆరోపితమై యున్నది. అదియు, ద్రష్టయు కూడి క్షేత్ర క్షేత్రజ్ఞులు. వీరి సంయోగమున సర్వజీవులయందు సమానముగా నిలిచియున్న పరమేశ్వరుని దర్శించినవాడే దర్శించినవాడు.

30. ఇట్లు దర్శించినవాడు సమస్తము తానే. తనను తాను హింసించుకొనడు కనుక తాను సృష్టికి హింసాకారణము కాదు. ఇట్టి సమబుద్థితో ఉత్తమగతి యందుండును.

31. ఇతరులుగాని, తాను గాని ఆచరించుచున్న సర్వకర్మలును ప్రకృతిచే ఆచరింపబడుచుండెనని దర్శించును. తాను కర్త కాదని తెలియును.

32. జీవులలో వేర్వేరుగాయున్న అస్థిత్వము నాయందు ఏకత్వముగా ఉన్నదని దర్శనము చేయును. అప్పుడిది అంతయు విస్తారమై ఆద్యంతములు లేని 'నేను'గా అనుభూతమగును. ఇదియే బ్రహ్మత్వమును పొందుట.

33. ఈ బ్రహ్మము అనాదియు, నిర్గుణము, జ్ఞేయము కానిది అని తెలిసినప్పుడు శరీరమునందున్నను ఏమియు చేయుట గాని, అంటుటగాని ఉండదు.

34. వాయువు ఆకాశము నందు పుట్టి అందే చరించును. అది ఉండుటవలన గాని, వీచుటవలన గాని ఆకాశమునకు అంటుటలేదు. అట్లే పృథివ్యాది భూతములు, ప్రకృతులు, జీవులు, వారి ప్రవర్తనలు ఆకాశమునందే ఉన్నవి. వాని అణువుల అంతర్భాగములలో ఆకాశము మునిగి తేలుతున్నను అంటుకొనుటలేదు. అట్లే ఆత్మ వానికి అంటుకొనదు.‌

🕉🌞🌎🌙🌟🚩

 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

ఆనందమయకోశో యః సుషుప్తౌ పరిశిష్యతే ౹ అస్పష్టచిత్స ఆత్మైషాం పూర్వకోశోఽ స్య తే గుణాః ౹౹94౹౹

94. పంచకోశములలో మొదటిదగు ఆనందమయకోశము సుషుప్తి యందును ఉండును.అది చైతన్యమును అస్పష్టముగ మాత్రమే ప్రకటించును.ఆ ఆనందమయకోశమే ఆత్మయని ప్రాభాకరులు,తార్కికులు భావింతురు.ఆత్మ యొక్క గుణములని వీరు చెప్పునవి ఈ ఆనందమయ కోశపు గుణములే.

వ్యాఖ్య:  సుషుప్తిలో చైతన్యము లేక జాగ్రత్ స్వప్నములందు మాత్రమే ఉండినచో

"సుఖముగా నిద్రించితిని,నాకేమీ తెలియలేదు"అనే సుఖము,అజ్ఞానముల జ్ఞాపకము సంభవింపదు.వీనిని అనుభవించి మరల గుర్తు తెచ్చుకొను ఒక చైతన్యసత్త ఉండే తీరవలెను.

శ్రుతి కూడా ఆత్మ నిర్గుణమని వర్ణించును.

ఇచ్ఛాద్వేషాదు మనోధర్మములని బృహదారణ్యక ఉప.1.5.3 చెప్పును.దానికి తగినట్లు మనస్సు పనిచేయు జాగ్రత్ స్వప్నములందు మాత్రమే ఇచ్ఛాదులు కన్పించును కదా !

తార్కికులనునట్లు అసంఖ్యాకులగు పురుషులందరు సర్వవ్యాపులైనచో అందరును అన్ని శరీరములు కర్మలతో సంబంధపడుటచే ఏది ఎవరికి చెందునో అనే నిర్ణయము కష్టమగును.ఇతర కారణములచే కూడా ఆత్మను గూర్చి ప్రాభాకరుల,తార్కికుల వాదము అసమంజసము.ఆత్మయని వారు భ్రమపడునది ఆనందమయకోశము మాత్రమే.

ధర్మధర్మ సుఖదుఃఖాదులు బుద్ధి ధర్మాలు.నిజానికి బుద్ధి జడము. దానికి సుఖదుఃఖాది జ్ఞాన రూపధర్మములు కుదరవు.

ఆత్మ నిర్ధర్మకం గనుక వాటిని బుద్ధిధర్మాలని చెప్పవలసి వచ్చినది.

బుద్ధి,సుఖదుఃఖాలు ఇవన్నీ ఆత్మయందారోపితములు.కనుక వాస్తవముగా లేనివి.రజ్జువునందు సర్పము లేదు గదా! అలాగే ఆరోపిత వస్తువునందు మరో వస్తువు ఉండదు.

శుద్ధ చైతన్యం మీద అజ్ఞానము ఆరోపితము.ఈ ఆజ్ఞానోపహిత శుద్ధ చైతన్యము మీద అంతఃకరణము ఆరోపితం. అంతఃకరణోపహిత చైతన్యమునందు ధర్మా ధర్మ సుఖదుఃఖాదులు ఆరోపితములు. ఈ విధముగా ఆత్మయందు సుఖదుఃఖాదులను ఆరోపించుటకు ఉపాధి అయిన అంతఃకరణము కారణము కనుక సుఖదుఃఖాదులు దాని ధర్మములని చెప్పారు.

ఉపాధి=తటస్థము.వస్తువు తనతో ఉన్నా అది దానికన్నా భిన్నంగా ఉండును.

విశేషణం=తటస్థం కాదు. వస్తువును తనతో కలిపియే చూపును.

"ఉపాధి-ఉపహితం;

విశేషణం-విశిష్టం"

"అంతఃకరణాధిష్ఠాన" చైతన్యమందే అధిష్ఠాన లక్షణం ఉంది.ఈ అంతఃకరణం అజ్ఞానోపహిత చైతన్యం మీద ఉన్నది.విశిష్ఠం మీద కాదు.కాగా

ఆత్మ-అధిష్ఠానము;ధర్మము దాని మీద ఆరో పితము.

ఉపాధి-అంతఃకరణము.

కనుక ధర్మాదికము,బుద్ధి ధర్మముల మధ్య తేడా తెలియకపోవడం వలన మరియు అంతఃకరణము ఆత్మ అనే రెండింటియందు కనబడుతున్నది.

అందుచే అంతఃకరణ విశిష్టుడయిన ప్రమాత యొక్క ధర్మాలుగా ఇవి ప్రసిద్ధం.

"ఆత్మధర్మ"ములు మాత్రము కావు. ఆరోపిత పదార్ధాలు ఎప్పటికి అధిష్ఠాన ధర్మాలు కావు.కనుక "ఆత్మ"  "నిర్ధర్మకం".

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ రామదాసు కీర్తన

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

శంకరాభరణ - త్రిపుట.

పల్లవి:-

ఇతడేనా ఈ లోకములో గల

పతితుల నెల్లను పావనము చేయువాడు!! ఇ !!

చరణము(లు):-

పరిపూర్ణకరుణచే బ్రహ్మాదుల గాచిన

నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు!! ఇ!!


ఇల లంకపురమున అవనిజను బ్రోవ

బలుడైన రావణుని పరిమార్చినవాడు!! ఇ!!

అలనాడు ద్రౌపతికి అక్షయవలువలు

వల నొప్పనొసగిన వైకుంఠవాసుడు!! ఇ !!

ఏ వేళ మునివరులు నితర చింతలు మాని

కేవలము మదినుంచి కొలువు గాచెడువాడు !!ఇ!!

ప్రేమను దయతో నాపన్నుల బ్రోచుచు

రామదాసునేలు రామచంద్రవిభుడు!! ఇ!!

🕉🌞🌏🌙🌟🚩

 *||శ్రీమన్నారాయణీయము||

సప్తమ స్కంధము/ 25వ దశకము - శ్రీనృసింహావిర్భావ వర్ణనము/25-4-శ్లోకం*

🕉🌞🌎🌙🌟🚩


 ఉత్సర్పద్వలిభంగభీషణహనుం హ్రస్వస్థవీయస్తర

గ్రీవం పీవరదోశ్శతోద్గత నఖక్రూరాంశుదూరోల్బణమ్।

వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాననిర్ధావితస్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః।।

భావము:-

ఓ! ఉగ్రనరసింహమూర్తీ! నీ దవడల ముడతలు ముఖముపైకి ఎగబ్రాకి ప్రస్ఫుటించుచుండగా నీవు భీకరముగా గర్జించితివి. నరకేసరి రూపమున ఉన్న నీ కంఠము చిన్నదిగా ఉండి బహు ధృఢముగా నున్నది. నీ బాహువులు నూరు హస్తముల శక్తికలిగి బలిష్టముగా నున్నవి. నీ చేతి నఖముల (గోళ్ళ) కాంతి నీ రౌద్రమునకు ప్రతీకగా మెరయుచూ దూరమునకు కూడా కనిపించుచుండెను. నీ ఘర్జన ధ్వని - దట్టమగు వర్షాకాలపు కాలమేఘ గర్జనవలె అంబరమును దాటి వినిపించు చుండెను. అట్టి నీ ఉగ్ర రూపమును చూచి నీ శత్రువులగు ఆ అసురులు (భయబ్రాంతులై) చెల్లాచెదురుగా పారిపోయిరి. ప్రభూ! అట్టి నీ 'ఉగ్రనరసింహ' రూపమునకు నేను నమస్కరించుచున్నాను.

వ్యాఖ్య:-

హిరణ్యకశిపుని భార్య మగపిల్లవాడు ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమే అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు. ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. 

తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తు ఉండేవాడు.

ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రంతో క్రుద్ధుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. ఇందుగలడని అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు.

అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పరుండబెట్టి ఆయన వాడి గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని అంతమొందిస్తాడు. 

🕉🌞🌎🌙🌟🚩

గీతా మకరందము.

 మోక్షసన్న్యాసయోగము

🕉🌞🌏🌙🌟🚩


అII స్వధర్మాచరణము చాలా  ఉత్తమమైనదని వచించుచున్నారు -

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | 

స్వభావనియతం కర్మ 

కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || 

తా:- తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్ఠింపబడినను) చక్కగా అనుష్ఠింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) శ్రేష్ఠమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు.

వ్యాఖ్య:- స్వకీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత కఠినమైనను, తేలికగా ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది.

కావున నిజధర్మమును ఒకింత కష్టమైనను వదలరాదు. స్వకీయకర్మను పైశ్లోకమందు తెలుపబడిన చందమున ఈశ్వరార్పణబుద్ధితో చేసినచో మనుజుడు పాపమును బొందకుండును.

(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును. ఆత్మచింతనాదులు, ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను, పరధర్మములైన దృశ్యవస్తుధర్మములను, లేక, దృశ్యవస్తుచింతనమును గ్రహించుటకంటె ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు (స్వధర్మము) ప్రారంభమున ఒకింత కష్టముగ తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్యవస్తువులు (పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది).

ప్ర:- జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్ఠమైనది?

ఉ:- ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్ఠమైనది.

ప్ర:- దేనిచే మనుజుడు పాపమును బొందకుండును?

ఉ:- స్వభావముచే ఏర్పడిన కర్మమును, స్వధర్మమును (ఈశ్వరార్పణబుద్ధితో) చక్కగ నాచరించినపుడు పాపమును బొందకుండును.

🕉🌞🌏🌙🌟🚩

🌹. గీతోపనిషత్తు  -119 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚

శ్లోకము 3

🍀. 2. సన్న్యాసము -  దేనిని కోరనివాడు, ద్వేషింపనివాడు సన్న్యాసి అని తెలియుము. అతడే నిత్య సన్న్యాసి. అతనికి రాగద్వేషములు లేవు కనుక బంధము లేదు. కోరుట రాగము. తనకిది అక్కర లేదనుకొనుట ద్వేషము. తనకిది కావలె ననుకొనుట రాగము.  జీవితము కర్మానుసారము సాగుచుండగ, కేవలము అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్పడుట కవకాశమున్నది. కర్తవ్యములను నిర్వర్తించినపుడు ఫలితములు కోరుట రాగము . దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలితము కొరకై ప్రక్కదారులు తొక్కుట బంధము. కర్మము సత్ఫలితముల నిచ్చినపుడు వానియందు తగుల్కొనుట మరల రాగము. సన్యసించిన బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము. 🍀

3. జేయస్స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |

నిర్ద్వంద్వా హి మహాబాహో సుఖం బంధా త్రముచ్యతే || 3

దేనిని కోరనివాడు, ద్వేషింపనివాడు సన్న్యాసి అని తెలియుము. అతడే నిత్య సన్న్యాసి. అతనికి రాగద్వేషములు లేవు కనుక బంధము లేదు. కోరుట రాగము. తనకిది అక్కర లేదనుకొనుట ద్వేషము. తనకిది కావలె ననుకొనుట రాగము. ప్రతి జీవికిని జీవితమున కొన్ని జరగవలెనని, కొన్ని జరుగకూడదని అనిపించు చుండును. జరుగవలెనని కోరినవి జరుగుట అంతంతమాత్రమే. 

అట్లే జరుగ కూడదనుకున్నవి జరుగుట లోకవిదితమే. కష్టము, నష్టము, మృత్యువు రాకూడదని; సుఖము, లాభము, జీవనము సాగవలెనని సామాన్య జీవు లందరును కోరుదురు. కాని జీవితమున నిత్య సత్యమైన చేదు నిజమొకటి తారసిల్లుచునే యుండును.

ఆరోగ్యము కోరినను అనారోగ్యము వచ్చును. లాభము కోరినను నష్టము వచ్చును. ఆయుషు కోరినను మృత్యువు వచ్చును.  జీవునికి తీరని కోరిక లెప్పుడును మిగిలిపోవును. కోరని బంధములు ఎప్పుడును ఏర్పడుచుండును. 

తీరని కోరికలు, వదలని బంధములు జన్మపరంపరలు కలిగించు చుండును. వీటన్నిటికిని రాగద్వేషములే కారణము. జీవితము కర్మానుసారము సాగుచుండగ, కేవలము అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్పడుట కవకాశమున్నది. కర్తవ్యములను నిర్వర్తించినపుడు ఫలితములు కోరుట రాగము. 

దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలితము కొరకై ప్రక్కదారులు తొక్కుట బంధము. కర్మము సత్ఫలితముల నిచ్చినపుడు వానియందు తగుల్కొనుట మరల రాగము. 

కర్మలు ఫలించనపుడు కలుగునది క్రోధము, ద్వేషము. ఇట్టి ఒడుదొడుకుల జీవితములే అన్నియును. కర్తవ్యమే తనవంతని, మిగిలిన దంతయు దైవమని భావించి కాలక్రమమున తనను సమీపించు కార్యములను రాగ ద్వేషములు లేక నిర్వర్తించుట నిజమగు సన్న్యాసము. 

సన్యసించిన బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము. అనగ రాగద్వేషముల నంటనీయక ఆసాంతము కర్తవ్యకర్మలనే నిర్వర్తించుట ఈ శ్లోకమున సూచింప బడినది. అట్లు నిర్వర్తించువారు సంసార మందున్నను సన్న్యాసియే. రాగద్వేషములకు చిక్కినవారు సన్యసించిననూ సంసారులే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 🌹 . శ్రీ శివ మహా పురాణము - 319 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 

80. అధ్యాయము - 35

🌻. విష్ణువు పలుకులు  - 2 🌻

దక్షుడిట్లు పలికెను -

హే విష్ణో! మహాప్రభో! నీ బలము చేతనే నేనీ మహాయజ్ఞము నారంభించితిని. సత్కర్మల ఫలము లభించుటలో నీవే ప్రమాణమై యున్నావు (20). హే విష్ణో! నీవు కర్మసాక్షివి. హే మహాప్రభో! నీవు వేద ప్రోక్తములైన ధర్మములకు, యజ్ఞములకు, వేదములకు కూడ రక్షకుడవు (21). హే ప్రభో! కావున నీవు ఆ ఈ యజ్ఞమును కాపాడవలెను. ఈ పనికి సమర్థుడు నీకంటె మరియొకడు లేడు. సర్వమునకు ప్రభువు నీవే గదా! (22)

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుని వచనమును విని అపుడు విష్ణువు మిక్కిలి దీనుడు, శివతత్త్వమునందు అభిరుచి లేనివాడు నగు దక్షునికి శివతత్త్వమును బోధించుచున్నవాడై ఇట్లు పలికెను (23).

విష్ణువు ఇట్లు పలికెను -

ఓయీ దక్షా! నేను నీ యజ్ఞమును రక్షించవలసిన వాడనే. ధర్మమును నేను రక్షించెదను. ఇది నా శపథము. ఇది సత్యమని అందరికీ తెలియును (24). కాన నీవు చెప్పిన ఆ మాట సత్యమే. దాని ఉల్లంఘనము ఏమి కలిగినది? ఓయీ దక్షా! నేను చెప్పెదను. నీవు వినుము. నీవు ఇపుడు నీ క్రూర బుద్ధిని వీడుము (25). 

ఓ యీ దక్షా! నైమిషారణ్యములో నిమిష క్షేత్రమునందు జరిగిన అద్భుతమగు వృత్తాంతము నీకు గుర్తు లేదా? దుష్ట బుద్ధివి అగు నీవు దానిని విస్మరించితివా? (26).రుద్రుని కోపమునుండి నిన్ను రక్షించగల మొనగాడు ఇక్కడ ఎవ్వరు గలరు? ఓయీ దక్షా! నిన్ను రక్షించవలెననే ఇచ్ఛలేని వారెవ్వరు? కాని, దుర్మార్గుడు మాత్రమే నిన్ను రక్షింప బూనుకొనును (27).

ఓరీ దుష్టబుద్ధీ! ఏ పనిని చేయవలెను? దేనిని చేయకూడదు? అను వివేకము నీకు లేదు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కేవల కర్మ ఫలము నీయజాలదు (28). ఏ కర్మను చేసి మానవుడు ఉన్నతిని పొందునో అది ఆతనికి కర్తవ్య కర్మయగునని తెలియును. కర్మలకు శుభఫలములను ఇచ్చువాడు ఈశ్వరుడు తక్క మరియొకడు గాడు (29). ఎవడైతే మనస్సును శివునిపై నిలిపి శాంతముగా ఈశ్వరుని ఆరాధించునో, వానికి శివుడు కర్మాంతమునందు కర్మఫలము ననుగ్రహించును (30).

కేవల జ్ఞానమును ఆశ్రయించి, ఈశ్వర సేవించని నరులు వందకోటి కల్పముల కాలము వరకు నరకములో నుందురు (31). కేవల కర్మఠులు కర్మలు అనుపాశములచే బంధింపబడిన వారై జన్మ జన్మలయందు నరక ప్రాయమగు బ్రతుకులలో పచనము చేయబడుదురు (32). 

రుద్రగణములకు అధిపతి, శత్రుసంహారకర్త, రుద్రుని కోపమనే అగ్నినుండి పుట్టినవాడు అగు వీరభద్రుడు యజ్ఞసాలవద్దకు వచ్చుచున్నాడు (33). ఈతడు మనలను నాశము చేయుటకై వచ్చినాడనుటలో సందేహము లేదు. ఎట్టి కార్యమైననూ, ఈతనికి శక్యము కానిది లేనేలేదు (34).

మహాప్రభుడగు ఈ వీరభద్రుడు మనలనందరినీ నిశ్చయముగా కాల్చి చంపి, అటు పిమ్మట ప్రసన్నమైన మనస్సు కలవాడు కాగలడనుటలో సంశయము లేదు (35). నేను మహాదేవునిపై దధీచి చేసిన శపథమును భ్రమచే ఉల్లంఘించి ఇక్కడనే ఉన్న కారణముచే నీతోబాటు దుఃఖప్రాప్తి అనివార్యమగుచున్నది (36). 

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 204 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. చ్యవనమహర్షి-సుకన్య  - 1 🌻

జ్ఞానం:

01.  భృగుమహర్షి చ్యవనుడితో “నాయనా! ఈ సృష్టిలో చిట్టచివరికి పొందదగింది జ్ఞానమొక్కటే! ఇంకేమీ లేదు. సృష్టిలో ప్రతీజీవుడు కోరుకోదగిన ఆత్యంతిక వస్తువు ఒక్కటే ఉంది. అదే జ్ఞానం, మోక్షం. అది తప్ప ఇక కావలసింది ఏముంది ఇందులో! నీవు తపస్సుకు వెళ్ళిపో” అని ప్రేరణ చేసాడు.

  02.  అశ్వినీ దేవతలు వైద్యులు కాబట్టి యజ్ఞంలో వాళ్ళకు హవిర్భాగాలు లేవు. స్వాహాకారంతో అగ్నిహోత్రంలో నెయ్యివేస్తాం. ‘అగ్నయే స్వాహా అగ్నయ ఇదం న మమ’ అంటాం. అగ్నిహోత్రుడికి, ఇతర దేవతలకు హవిస్సులు ఇస్తాం. అశ్వినులకు అలా లేవు. వాళ్ళు వైద్యులు కావటమే ఇందుకు కారణం. 

03. ఆర్యసంస్కృతిలో మొదటనుంచీ వైద్యుడికి, సంగీతం పాడేవాడికి, నాట్యంచేసేవాడికి-ఇలాంటివాళ్ళను అపాంక్తేయులని-బ్రాహ్మణపంక్తిలో వాళ్ళు పనికిరారు. వాళ్ళను తక్కువగా చూసేవారు. ఎందుకంటే, ఉదాహరణకు వైద్యుడు సంఘానికి ఎంతసేవచేసినా, అతడు చేసే వృత్తి ఎలాంటిదంటే; రోగంలో స్థితినిబట్టి, విచక్షణలేకుండావెళ్ళి వైద్యంచేయాలి. 

04. ఏ కులమైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడయినా ఎండిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి శవాకారంగా ఉండేవాడికి అయినా సరేవెళ్ళి చేయాలి. అదంతా శౌచంకాదు. శౌచవిధికాదు. అశుచికరమైనటువంటి వృత్తి అది. కాబట్టి వైద్యవృత్తిని ఉత్తమకులానికికాని, లేకపోతే బ్రాహ్మణ ధర్మానికి నిషేధంగా భావించారు. 

05. ఇప్పుడు ఎంత ఉత్తమ కులస్థుడు అయితే అంతపోటీగా వెళ్ళి వైద్యవృత్తికికై ప్రయత్నంచేసే యుగంమనది! నేడు వైద్యవృత్తి అంత పవిత్రమయినది ఇంకొకటి లేదు. కాని ఆనాడు మాత్రం ‘అపవిత్రం భేషజం'(భేషజం అంటే వైద్యం). సంగీతం కూడా అటువంటిదే. 

06. వీళ్ళను ‘నటవిటగాయకులు’ అనేవారు; వారందరూ అలాంటివాళ్ళే! వీళ్ళు అందరినీ వినోదింపచెయ్యాలి. రాజు కొలువులో కూడా పాడాలి. ఎవరు ధనవంతులయితే వారి ఇంటికి, పిలిస్తే వచ్చి పాడాలి. ఇక అట్టివాడికి నిత్యఆహ్నికాలెలా ఉంటాయి? వాడి వృత్తే అది. వీళ్ళందరూ (నటవిట గాయకులందరూ) కూడా వైద్యుడితో సహా తక్కువగా పరిగణించబడ్డారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 143 🌹

✍️. శ్రీ బాలగోపాల్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర  - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 22 🌻

578. స్వరూప ఐక్యము:- 

మానవుని ఆధ్యాత్మిక వికాసములలో నిదియొకటి. ఇది భగవంతుని సత్యస్థితి (సత్యగోళము). ఈ గోళములో భగవంతుని అనంత శక్తి, జ్ఞాన, ఆనంద స్థితులు ఇమిడియున్నవి.

579. భగవంతుని అనాది అనంతస్థితి.

అనంత శక్తి - అనంత జ్ఞానము - అనంత ఆనందము.

పరమాత్మ:-

580. భగవంతుని బాహ్యస్థితి. ఎరుకతోకూడిన ఏకత్వము. ఏకమ్.అనుభవాతీత స్థితి యొక్క అనుభవస్థితి పరమాత్మ స్థితి ద్వారా భగవంతుడు అనుభవాతీత స్థితి యందు ఎఱుక కలిగి యున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 107  / Sri Vishnu Sahasra Namavali - 107 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

రేవతి నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 107. శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః|| 107 ‖ 🍀

🍀 993) శంఖభృత్ - 

పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.

🍀 994) నందకీ - 

నందకమను ఖడ్గమును ధరించినవాడు.

🍀 995) చక్రీ - 

సుదర్శనమును చక్రమును ధరించినవాడు.

🍀 996) శారంగ ధన్వా - 

శారంగము అనెడి ధనుస్సు కలవాడు.

🍀 997) గదాధర: -

కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.

🍀 998) రథాంగపాణి: - 

చక్రము చేతియందు గలవాడు.

🍀 999) అక్షోభ్య: - 

కలవరము లేనివాడు.

🍀 1000) సర్వ ప్రహరణాయుధ: - 

సర్వవిధ ఆయుధములు కలవాడు.

సశేషం.... 

🌹 🌹 🌹 🌹 🌹 

: తిరుప్పావై 26వ పాశురం

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

26.పాశురం

ॐॐॐॐॐॐॐॐॐॐ

      మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;

        మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;

        ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన 

        పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,

        శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,

        కోలవిళక్కై, కోడియే, వితానమే,

        ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్!!

ॐॐॐॐॐ

భావం

ॐॐॐॐॐ

ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. 

ఈ …

[10/01, 04:59] +91 98494 71690: *🌹. శ్రీమద్భగవద్గీత - 605  / Bhagavad-Gita - 605 🌹*

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద

📚. ప్రసాద్ భరద్వాజ


*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 22 🌴*


22. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |

అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||


🌷. తాత్పర్యం : 

ఏఏ జ్ఞానము ద్వారా మనుజుడు అల్పమైనట్టి ఒకానొక కార్యము నందు కారణము మరియు సత్యావగాహనము లేకుండ అదియే సర్వస్వమనెడి భావనలో ఆసక్తుడగునో అట్టి జ్ఞానము తమోగుణ సంబంధమైనదని చెప్పబడును.


🌷. భాష్యము  :

సామాన్యమానవుని “జ్ఞానము” సదా తమోగుణభరితమై యుండును. ప్రతిజీవుడు బద్ధజీవనమున తమోగుణమునందు జన్మించుటయే అందులకు కారణము. మానవుడు జ్ఞానమును ప్రామాణికుల ద్వారా గాని, శాస్త్రముల ద్వారా గాని వృద్దిచేసికొనినచో అతని జ్ఞానము దేహము వరకే పరిమితమై యుండును. 


అట్టి స్థితిలో అతడు శాస్త్రనిర్దేశానుసారము వర్తించవలననెడి భావనను ఏ మాత్రము కలిగియుండడు. అటువంటి వారికి ధనమే భగవంతుడు మరియు దేహావసరములను తీర్చుకొనుటయే జ్ఞానము. అట్టి జ్ఞానమునకు మరియు పరతత్త్వజ్ఞానమునకు ఎట్టి సంబంధము లేదు. అది దాదాపు ఆహారము, నిద్ర, భయము, మైథునములతో కూడిన పశుజ్ఞానముతో సమానమైనట్టిది. ఈ శ్లోకమున అటువంటి జ్ఞానము తమోగుణఫలమని వర్ణింపబడినది. 


అనగా దేహమునకు పరమైన ఆత్మజ్ఞానము సత్త్వగుణపూర్ణమైనది. తర్కము మరియు మానసికకల్పనల ద్వారా పలుసిద్ధాంతములను కల్పించు జ్ఞానము రజోగుణపూర్ణమైనది. దేహమును ఏ విధముగా సుఖింపజేయవలెనను భావననే కలిగిన జ్ఞానము తమోగుణపూర్ణమైనది.

🌹 🌹 🌹 🌹 🌹

 +91 98494 71690: *🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 220, 221  / Vishnu  Sahasranama Contemplation - 220, 221 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻220. శ్రీమాన, श्रीमान, Śrīmān🌻*


*ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ*


శ్రీమాన, श्रीमान, Śrīmān


సర్వాతిశాయినీ శ్రీ కాంతిః అస్య అందరకాంతులను మించు కాంతి ఇతనికి కలదు.


:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

సీ. ఘనమేరు శృంగ సంగత నీల మేఘంబు, నెఱి గరుడస్కంధ నివసితుండుఁ

గమనీయ నిజదేహకాంతి విపాటితాభీలాఖి లాశాంతరాళ తముఁడు

సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర, సేవక పరిజన సేవితుండు

మండిత కాంచన కుండల రుచిరోప, లాలిత వదన కపోలతలుడుఁ

తే. జారు నవరత్న దివ్యకోటీరధరుఁడుఁ, గౌస్తుభప్రవిలంబ మంగళ గళుండు

లలిత పీతాంబర ప్రభాలంకృతుండు, హారకేయూర వలయ మంజీర యుతుఁడు. (902)


ఆయన మేరు పర్వత శిఖరంపై నల్లని మేఘం వలె గరుడుని మూపుపై కూర్చున్నాడు. తన శరీర కాంతులతో నలు దిక్కుల నడుమ వ్యాపించిన చీకటిని తొలగిస్తున్నాడు. అష్టాయుధములు మూర్తి మంతములై ఆయనను సేవిస్తున్నవి. దేవతలు, మునీశ్వరులు సేవకులై కొలుస్తున్నారు. ఆయన చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖం మీద, చెక్కిళ్ళ మీద వ్యాపిస్తున్నది. నవరత్నమయమైన కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి కంఠంలో వ్రేలాడుతున్నది. బంగారు వలువను కట్టుకున్నాడు. ముత్యాలహారాలు, భుజకీర్తులు, కడియాలు, అందెలు ధరించాడు.


22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān

178. శ్రీమాన్‌, श्रीमान्‌, Śrīmān


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 



అగ్రణీర్గ్రామణీశ్శ్రీమాన్న్యాయో నేతా సమీరణః ।

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్ ॥ ౨౪ ॥


Agraṇīrgrāmaṇīśśrīmānnyāyo netā samīraṇaḥ ।

Sahasramūrdhā viśvātmā sahasrākṣassahasrapāt ॥ 24 ॥


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 221 / Vishnu  Sahasranama Contemplation - 221🌹*

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻 221. న్యాయః, न्यायः, Nyāyaḥ 🌻*


*ఓం న్యాయాయ నమః | ॐ न्यायाय नमः | OM Nyāyāya namaḥ*


న్యాయః, न्यायः, Nyāyaḥమానానుగ్రహకో భేదకారకస్తర్క ఉచ్యతే ।

యో న్యాయ ఇతి విష్ణుస్సన్యాయశబ్దేన బోధ్యతే ॥


భగవతత్త్వనిర్ణయమునకు సాధకములగు ప్రమాణములకు అనుగ్రహకమును, అనుకూలించునదియును, జీవాత్మ పరమాత్మల అభేద ప్రతిపత్తిని కలిగించునదియు అగు తర్కము 'న్యాయము' అనదగును. పరమాత్ముడు నారాయణుడు అట్టి న్యాయ స్వరూపుడు.


సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. 

[ *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 158 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ

*🌻.   ఆత్మను తెలుసుకొను విధము - 88 🌻*

నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసద్‌, కార్యకారణ, దృక్‌ దృశ్య వివేకములనేటటువంటి పద్ధతులుగా దీనిని ఏ వివేక పద్ధతిలోకి వస్తుందో విచారణ చేసుకుని, ఆ విచారణ ద్వారా ఏది ప్రధానమో దానిని గ్రహించి, ఏది అప్రధానమో దానిని త్యజించాలి. భాగత్యాగ నిర్ణయము అంటారు. 

ఈ భాగత్యాగ నిర్ణయము లేకపోతే, వివేకము అసాధ్యము. అవివేకమే ఉంటుంది ఎప్పటికి కూడా. అజ్ఞానమే ఉంటుంది ఎప్పటికి కూడా. అవిద్యే ఉంటుంది ఎప్పటికి కూడా. బంధమే ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి, అవివేకాన్ని, అజ్ఞానాన్ని, అనాత్మని, అవిద్యని, బంధాన్ని - వీటన్నింటినీ తొలగించగలిగేటటువంటి ఏకైక వజ్రాయుధం వివేకం – జ్ఞానం.

కాబట్టి, అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరైతే సంసిద్ధులై ఉన్నారో, అట్టి ఆత్మోపరతియందు స్థితుడైయున్నాడో, అట్టి ఆత్మోపవస్తు లబ్ధిచే మాత్రమే సంతుష్టత చెందేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో, అటువంటి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అటువంటి సచ్ఛిష్యుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఉత్తమ తరగతికి సంబంధించిన సాధకుడు ఎవరైతే ఉన్నారో, అతడు ఆభాసయుతమైనటువంటి ప్రతిబింబ సహితమైనటువంటి అనాత్మ వస్తువులచేత, సంతుష్టత చెందడం లేదు. 

అవి ఏనుగుపై ఒక మనిషి నిలబడి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తుకు వెళ్తుందో, అంత ఎత్తు ధనరాశిని నీకెచ్చదన్ననూ, అఖండ మండలాకారముగా వ్యాపించి ఉన్నటుంవంటి, భూమండలాధిపత్యమును నీకిచ్చెదనన్ననూ, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వ్యాప్తమై ఉన్నటువంటి సమస్త జీవ తను చతుష్టయాధిపత్యమును ఇస్తాను అని అన్నప్పటికినీ, 

సకల చతుర్దశ భువనాధిపత్యమును ఇస్తాను అనేటటువంటి ఆధిపత్యమును ఇస్తానన్నప్పటికి ఎవరైతే అవుననడో, ఎవరైతే వాటిని తృణప్రాయముగా, గడ్డిపోచవలె చూస్తాడో, అటువంటి తీవ్ర వైరాగ్యోపరతుడు మాత్రమే, అటువంటి కాంక్షారహితుడు మాత్రమే, అటువంటి మనోవాసనారహితుడు మాత్రమే, అటువంటి వివేకశీలి మాత్రమే, ఈ ఆత్మవస్తువును పొందగలుగుచున్నాడు. - విద్యా సాగర్  గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 175  / Sri Lalitha Chaitanya Vijnanam  - 175 🌹*

*సహస్ర నామముల తత్వ విచారణ*

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 

*🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀. పూర్తి శ్లోకము :*

*48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |*

*నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖*


*🌻 175. 'భవనాశినీ' 🌻*

జనన మరణములను నశింపజేయునది శ్రీదేవి అని అర్థము. 

జనన మరణములు లేని జీవులకు అవి యున్నట్లుగా తోచుటే అజ్ఞానము. ఈ అజ్ఞానమునుండి శ్రీమాత తన భక్తులను ఉద్ధరించును. జ్ఞానభిక్ష నొసగి అజ్ఞానము నశింపజేయును. దేహి, దేహములు మనిషి, అతని దుసుల వంటివి. 

దుస్తులు మార్చునట్లుగా జీవుడు దేహమును మార్చును. దుస్తుల కాయుర్దాయ మున్నది. అవి ఒక జీవితకాలమున ఎన్నియోమార్లు మార్చబడు చున్నవి. చివికి, చినిగి, నశించు దుస్తులవలన మనిషికి దుఃఖము కలుగుచున్నదా? మరియొక దుస్తులను ఏర్పరచుకొనునేగాని, దుస్తులతోపాటు నశింపడు. అట్టివే దేహములు. అవి నశించుట కాల క్రమమున జరుగును. జీవుడు నశించుట యుండదు. కాలక్రమమున అతనికి కారణము, సూక్ష్మము, భౌతికము అను దేహములు ఏర్పడును. 

అందున్నపుడు వానివలన కలుగు ఆకర్షణకు లోనైనపుడు, వానిదైన స్వభావమేర్పడును. వివిధములగు కోరిక లేర్పడును. అవి కారణముగ లింగ శరీరము, కామ శరీరము కూడ ఏర్పడును. ఇవి వికృతములు, స్వయంకృతములు. శ్రీదేవి ఇచ్చిన కారణ, సూక్ష్మ, భౌతిక శరీరములు ప్రకృతములు కాగ, స్వభావము, కోరికలు కారణముగ ఏర్పరచుకున్న లింగదేహము, కామదేహము వికృతములై బాధించును. వీని వలన అజ్ఞానము జనించును. 

నిప్పువలన పుట్టిన పొగ నిప్పును కప్పినట్లు, జ్ఞాన మజ్ఞానముచే కప్పబడును. అట్టి అజ్ఞానమునుండి బయల్పడుటకు జ్ఞానము ప్రధానము. జ్ఞానమునకు కర్తవ్య కర్మాచరణము ప్రధానము. 


విధియుక్తమైన కర్మలనాచరించుచు దైవము నారాధించుచు జీవించు సంకల్పము, దైవానుగ్రహము వలననే స్థిరపడి నిలబడును. అందువలన శ్రీమాత ఆరాధనము మరణాది అవస్థలనుండి భక్తుల నుద్ధరించ గలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*780వ నామ మంత్రము* 10.01.2021


*ఓం విశ్వతో ముఖ్యై నమః*


ఎక్కడ ధ్యానించాలనుకుంటే అక్కడే, ఏరూపంలో కావాలంటే అలాగే ఆవిర్భవించు నటువంటి అఖిలాండేశ్వరియైన పరమేశ్వరికి నమస్కారము. 


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశ్వతోముఖీ* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం విశ్వతోముఖ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ తల్లి కరుణచే జగన్మాతను దర్శించినంత ఆనందానుభూతిచెందును మరియు సఖశాంతులతో జీవనము గడుపును.


*విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖః* అని వేదములో గలదు. అనగా విశ్వమంతయు నేత్రములు, ముఖములు, హస్తములు, పాదములు గలది భగవద్రూపం. ఉపాసకుడు  ఏ రూపమును మనసులో మనోనేత్రములందు ఉంచుకుని, ఏ ప్రదేశములో ధ్యానించినను పరమాత్మ ఆ ప్రదేశములో, అదే స్వరూపముతో ప్రత్యక్షమగును. అందుచే జగన్మాతను విశ్వతోముఖీ అన్నాము.


*సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్*


ఆ పరమాత్మ అనేకవేల శిరస్సులు, నయనములు, ముఖములు, చేతులు, పాదమములు గలవాడు అని వర్ణింపబడినది. జగత్తంతయూ  పరబ్రహ్మ స్వరూపమే.


అందుకే ప్రహ్లాదుడు ఇలా అన్నాడని పోతనామాత్యులవారు భాగవతంలో చెప్పారు.


*మత్తేభ విక్రీడితము*


"కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం

గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం

గలఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింగవ్యక్తులం దంతటం

గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.


నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురుష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల సర్వావస్థలలోను ఉన్నడయ్యా!


*కంద పద్యము*


ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."



ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!


పరమేశ్వరి సాక్షాత్తు నారాయణ స్వరూపిణి. ఆ తల్లి సర్వాంతర్యామి. గనుక అమ్మ వారు *విశ్వతోముఖీ* యని అనబడుచున్నది.


అమ్మవారిని కులదేవతగా, గ్రామదేవతగా కొలవడం చాలా పరిపాటి. ప్రతీ ఊరిలోనూ దుర్గమ్మ, కోటసత్తెమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, అశిరమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, కనకమహాలక్ష్మి, నీలమ్మ, అంకాళమ్మ, చెంగాళమ్మ, పచ్చాలమ్మ, మజ్జిగౌరమ్మ, శంబరపోలమ్మ, పైడితల్లి, పోలిపల్లి, ఏగులమ్మ, పాదాలమ్మ అని ఇలా ఎన్నో నామములతో, ఎన్నో రూపాలతో ఆరాధిస్తున్నాము. ఇంట్లో చంటి బిడ్డపుడితే, దశరా, ఉగాది, సంక్రాంతి పండుగలకు నైవేద్యాలు, బలులు ఇస్తుంటారు. ఇదంతా ఏమిటి? అమ్మవారేగదా! అందుకే జగన్మాత *విశ్వతోముఖీ* యని అనబడుచున్నది.


అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశ్వతోముఖ్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[10/01, 05:22] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*206వ నామ మంత్రము* 10.01.2021


*ఓం సర్వతంత్రరూపాయై నమః*


సర్వతంత్రాలను తన స్వరూపంగా గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వతంత్రరూపా* యను ఆరక్షరముల (షడాక్షరీ) నామ మంత్రమును *ఓం సర్వతంత్రరూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణించి సుఖసంతోషములను, ఆయురారోగ్యములను, సిరిసంపదలను ప్రసాదించును.


శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతున్నవి. శివుడు పార్వతికి తెలిపినవి ఆగమాలుగా, పార్వతి శివుడికి తెలిపినవి నిర్గమాలుగా తెలుపబడుతున్నవి. . హైందవ తంత్రములో శక్తి ముఖ్య దేవతగా కొలవబడుతుంది. ఈ సృష్టి, శివ-శక్తుల దివ్య సంగమముతోనే ఏర్పడినదని నమ్మబడుతుంది. తంత్ర సంప్రదాయాలు, వైదిక సంప్రదాయాలకి సమాంతరంగా ఉంటూనే, ఒక దానితో ఒకటి విడదీయరానివిగా ఉంటాయి. సులువుగా మనకు తెలియాలంటే తంత్రమనేది చేయవలసిన విధానము. సంకల్పం చేసిన దగ్గర నుండి ఆ కార్యక్రమము పరిసమాప్తి అయేవరకూ చేయవలసిన విధానమే తంత్రము అనబడుతుంది. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ పూర్తి అయిన తరువాత    చివరలో *ఇతిశ్రీవామకేశ్వర తంత్రే, ఉమామహేశ్వర సంవాదే, శ్రీదేవీ ఖడ్గమాలాస్తోత్రం సంపూర్ణమ్* అంటాము. అనగా ఈ ఖడ్గమాలాస్తోత్రము వామకేశ్వర తంత్రములోనిది. శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణ. 


దేవతలను తృప్తిపరచి, మన కోర్కెల సాధన కోసమే ఈ తంత్రములు చెప్పబడ్డాయి. ఇవి కేవలం ఐహికప్రయోజనముల కొరకు మాత్రమే. వీటి ద్వారా, ఈ లోకంలో మనకు కావలసినవి సంప్రాప్తింపజేసుకోవచ్చును. ఈ విషయాన్ని శంకర భగవత్పాదులవారు సౌందర్యలహరిలో ఇలా చెప్పారు.


*చతుఃషష్టయా తంత్రైః -  సకల మతిసంధాయ భువనం*


*స్థిత స్తత్తత్సిద్ధి - ప్రసవ పరతంత్రైః పశుపతిః |*


*పునస్త్వన్నిర్బంధా - దఖిల పురుషార్థైక ఘటనా*


*స్వతంత్రం తే తంత్రం -  క్షితితల మవాతీతరదిదమ్ || 31 ||*.

 

అమ్మా! జగన్మాతా! పశువులైన సకల ప్రాణులను పరిపాలించే, పశుపతియైన శివుడు,  భక్తజనులందరూ నిన్ను ఉపాసించి వారి వారి కామితార్ధములు తీర్చుకొనుటకు మాత్రమే ఉపయోగపడే మహామాయా శాంబర విద్యలైన 64 తంత్రములను నీ ఉపాసనలుగా శంకరుడు ఈ లోకమునకు ప్రసాదించెను. కానీ అవి వామాచార ప్రధానములై మోక్షమునకు ఏమాత్రము దోహద పడకుండా ఉండుటచేత, నీవు భక్తజనులను ఉద్దరింపదలచి ఇహలోకంలో పురుషార్ద ప్రదమైన సకల వాంచితార్ధములను తీర్చి పరలోకమున మోక్షమును ప్రసాదించు విద్యను అందివ్వమని నీవు పరమేశ్వరుని పట్టుపట్టి ప్రోత్సహించి ఆదేశించగా అపుడు ఆ శంకరుడు అన్ని విద్యలకన్నా పరమోత్కృష్టమైన శ్రీవిద్యా తంత్రమును ఈ భూతలమున అవతరింపచేసెను.


*లోకంలో మనలను ఉద్దరింప తలచి అమ్మే పరమశివునిచే శ్రీవిద్యోపాసన అను మహా తంత్రమును అందించినది.*


 అమ్మా! ఓపరమేశ్వరీ! పరమేశ్వరుడు అరవై నాలుగు విధాలైన మహామాయా శంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకలసిద్ధి ప్రదాయకమూ, ఐహిక ఫల ప్రదాయికాలూ ఐన ఈ తంత్రాలద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిన్నకున్నాడు. మళ్లా నీ అభీష్టం మేరకు ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని అనగా శ్రీవిద్యా తంత్రాన్ని ఈ లోకానికి ప్రసాదించాడు.


ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు శ్రీవిద్యా తంత్రమును గురించి మనకు తెలియజేస్తున్నారు. పశువులను, ప్రాణులను పరిపాలించు ఆ పశుపతి పూర్వము ఈ సమస్త ప్రపంచమును మోహపెట్ట తలంచి చతుష్షష్ఠి (64) తంత్రములను సృష్టించి ఇచ్చాడు. పశువులైన ఈ మానవులు ఆ కామ్యక మైన తంత్రముల యందు మోజుతో వాటి మత్తులో పడి పరమ పురుషార్ధమైన మోక్షమును మరిచి మోహములో తమను తాము మరిచి వాటి వలన కలిగిన సిద్దులతో ఆడుకొంటూ మూఢులై పరమార్ధము తెలుసుకొనలేక, జీవన్ముక్తులు కాలేక కొట్టుమిట్టా డుతున్నారు ఈ భ్రమణ చక్రములో పడి. బిడ్డలకు తల్లియైన ఆ మహా జగన్మాత  ఓర్వలేక ఒకరోజు ఆ పరమ శివుని దగ్గరకు వెళ్లి అడిగినది.

“ స్వామీ, బిడ్డలు పాడై పోతున్నారు, అజ్ఞానంలో కూరుకు పోతున్నారు మీరు ఇచ్చిన మాయా తంత్రముల చేత, కావున ఎల్ల కోరికలు ఈడేరే తంత్రము, ధర్మార్ధ కామ మోక్షములు ఇచ్చే మహా తంత్రమును, జ్ఞానమును ప్రసాదించే విద్యను  ఒక్కటి ఇవ్వండి చాలు నా బిడ్డలకు” అని.


“పార్వతీ, సకల తంత్రములకు మూలమైన, మిన్నయైన, ధర్మాది చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించే సర్వ స్వతంత్రమైన శ్రీవిద్యాతంత్రము నీ పేరు మీదుగా ఇస్తున్నాను.” అని పరమేశ్వరుడు అనుగ్రహించినాడు.

ఈ విధముగా మహాదేవునిచే నిర్మితములైన చతుష్షష్ఠి (64) తంత్రములు మహా పండితులను సైతము మోహ పరుచు చున్నవి. ఐహిక సుఖములను కలిగించే ఈ తంత్రములు వైదిక మార్గ దూరములైనవి. ఆయా జాతులను బట్టి, వర్ణములను బట్టి వీటిని అనుసరించ వలెను అని పెద్దలు చెప్పుదురు. ఇవి అందరికీ అనుష్టించడానికి యోగ్యములు కావని, ప్రపంచాన్ని వంచిస్తాయని  శంకర భగవత్పాదులు పై శ్లోకములో చెప్పియున్నారు.


చతుష్షష్ఠి కళామయి,  చతుష్షష్ఠుపచారాడ్యా  ...అని పరమేశ్వరి పేర్లు. చతుష్షష్ఠి ఉపచారములు, చతుష్షష్ఠి కళలు, చతుష్షష్ఠి తంత్రములు ఇలా 64 మీద చెప్పబడినవి. 

గూడార్ధము:- 64 తంత్రములు జీవుడ్ని మాయా మొహితుడ్ని చేస్తే, శ్రీవిద్యా తంత్రము అనే పరమేశ్వరిని  పట్టుకొన్న వాడికి జ్ఞానము లబిస్తుంది. అంటే పరమ శివుని దర్శనము లభిస్తుంది.


సగుణ బ్రహ్మను గురించి చెప్పే తంత్ర శాస్త్రములను ఆగమాలు అంటారు. వాటిని సమిష్టిగా తంత్ర శాస్త్రము అని అంటారు. ఆగమాలు  (తంత్రములు) మూడు రకములు.

1. వైష్ణవ తంత్రములు,  2. శైవ తంత్రములు,3. శాక్తేయ తంత్రములు.


సాత్వికులు ఆరాధించేది వైదిక దేవతలను. రాజసులు ఆరాధించేది  యక్షరాక్షసులను , తామసులు ఆరాధించేది భూతప్రేత పిశాచాలను.


సాత్వికుల గ్రంథములు ఆగమాలు-ఇహపర సాధనకు తోడ్పడునవి *(తంత్రములు)*, రాజసుల గ్రంథములు  *యామళాలు*. తామసుల గ్రంథములు *డామరాలు* అని అంటారు.

 

ఇహపరసాధనకు తోడ్పడే అరువది నాలుగు (చతుష్షష్టి) తంత్రముల స్వరూపమే జగన్మాత. కాబట్టి ఆ తల్లిని *సర్వతంత్రరూపా* అని యన్నాము.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వతంత్రరూపాయై నమః*  అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ