***
101.."ప్రశ్న : కామ మోహాలను ఎలా అణచటం ?"
భగవాన్ శ్రీరమణమహర్షి : వాని [కామక్రోధాల] మూలాన్ని కనుగొంటే [వాటిని జయించటం] చాలా సులువు అవుతుంది.
*కామక్రోధాదులు ఎందుకు పొంగుతాయి ?
చూచే విషయాలపై ఇష్టాయిష్టాలవల్ల.
*విషయాలు నీ దృష్టిపథంలోకి ఎలా వచ్చినవి ?
అజ్ఞానం మూలంగా.
*ఏమా అజ్ఞానం ?
ఆత్మ తెలియకపోవటం.
కాబట్టి ఆత్మ నెరిగితే కామక్రోధాదుల బెడద ఉండదు !
*"ప్రశ్న : కామక్రోధాదులకు కారణమేమి ?"
భగవాన్ శ్రీరమణమహర్షి : సుఖసంతోషాలు కావాలన్న ఆశ !!
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ఆలోచనే మాయ - అది గుర్తించటమే జ్ఞానం'- (అధ్యాయం -97)
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (260)
🕉🌞🌎🌙🌟🚩
సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము
దేవుడు చెప్పిన మార్గంలో నడవగలగటం భక్తికి సంపూర్ణత !
[03:54, 06/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
807వ నామ మంత్రము 06.02.2021
ఓం పరంధామ్నే నమః
ధామములకు (నిలయములకు) ధామమైన మరియు ఉత్కృష్టధామము అయిన పరాశక్తికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరంధామ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రముము ఓం పరంధామ్నే నమః అని ఉచ్చరించుచూ, ఆ జగజ్జననిని భక్తితత్పరులై ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి కరుణించి భౌతికపరమైన కోర్కెలను తీర్చును మరియు పరమపదసోపానములకు మార్గము సుగమము చేసి తరింపజేయును.
పరం ధామ ఉత్కృష్టం తేజః ఉత్కృష్టమైన తేజోస్వరూపురాలు శ్రీమాత. భగవద్గీతలో ఇలా చెప్పబడినదని భాస్కరరాయలువారు సౌభాగ్యభాస్కరంలో చెప్పారు.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
య ద్గత్వా న నివర్తంతే త ద్ధామ పరమం మమ (సౌభాగ్యభాస్కరం, 909వ పుట)
సూర్యుడుగాని, చంద్రుడు గాని, అగ్నిగాని ఆ జ్యోతిని ప్రకాశింపజేయలేదు. ఏ అవస్థకైతే చేరినవానికి పునర్జన్మ ఉండదో ఆ స్థితియే (ఆ ధామమే) నాది అని భగవద్గీతలో గలదు. ఇక ఈ ధామమును దాటి అనగా తురీయస్థితికి సాధకుడు చేరుకుంటాడో దానిని తురీయస్థితి యందురు.
జాగ్రత్స్వప్నసుషుప్తి అవస్థలు మూడింటియందును భోగ్యము (అనుభవించదగినది ఏది? భోక్త (అనుభవించువాడు) ఎవడు? అను ఈ రెండిటిని తెలియువాడు కర్మఫలమనుభవించుచున్నసు వానిని కర్మఫలము అంటదు. అనగా తురీయ స్థితికి చేరినవానికి పరమాత్మతప్ప కర్మఫలసంబంధితములు ఏమియు ఉండవు. జాగ్రత్స్వప్నసుషుప్థులనెడి ఈ మూడు ధామములు తెలిసినవాడు ఆత్మస్వరూపుడే. ఆ ఆత్మ దృశ్యము కాదు. దృశ్యమంతయూ ఆత్మయందు కల్పింపబడియుండును. ఈ మూడు ధామములకు సాక్షీభూతుడును, సత్యజ్ఞానానందములే స్వరూపముగా గలది ధామము. ఈ మూడవస్థలు అతిక్రమించిన పరంధామ (పరంబ్రహ్మ లేక తురీయాతీతావస్థ) స్వరూపురాలు ఆ అమ్మవారు గనుక పరంధామా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పరంధామ్నే నమః యని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
233వ నామ మంత్రము 06.02.2021
ఓం మహాకామేశ మహిష్యై నమః
లోకములన్నిటికి ప్రభువు (రాజు) అయిన పరమేశ్వరునికి (కామేశ్వరునికి) పట్టమహిషి (పట్టపురాణిగా) తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాకామేశమహిషీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాకామేశమహిష్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సర్వాభీష్టములను సిద్ధింపజేయును, పరమార్థసాధనకు దీక్షాపటిమను అనుగ్రహించును.
పరమశివుడు లోకములన్నిటికి మహాప్రభువు. ఆ ప్రభువుకు జగన్మాత పట్టమహిషి గావున మహాకామేశమహిషీ యని అనబడినది.
కామము అనే పదానికి అర్థం కోరిక.
కోరికలు ఎన్నో ఉంటాయి. కొందరికి సిరిసంపదలు, మరికొందరికి సంతానము, విద్య, ఆరోగ్యము ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి. ఇవన్నీ భౌతికపరమైనవి. శరీరధారుల కోర్కెల…
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 631 / Bhagavad-Gita - 631 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 48 🌴
48. సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా: |
🌷. తాత్పర్యం :
అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి యత్నము కూడా ఏదియో ఒక దోషముచే ఆవరింపబడి యుండును. అందుచే ఓ కౌంతేయా! దోషపూర్ణమైనను తన సహజకర్మను ఎవ్వడును త్యజింపరాదు.
🌷. భాష్యము :
బద్ధజీవితము నందు సర్వకర్మలు కూడా త్రిగుణములచే ప్రభావితములై యుండును. బ్రాహ్మణుడైనవాడు జంతువధ తప్పనిసరియై యుండెడి కొన్ని యజ్ఞములను నిర్వహింపవలసి వచ్చుచుండును. అదేవిధముగా ఎంతటి పుణ్యాచరణుడైనను క్షత్రియుడైనవాడు శత్రువుతో పోరావలసివచ్చుచుండును.
దాని నాతడు ఏ విధముగను తప్పించుకొనలేడు. అదేరీతి ఎంతటి ధర్మాత్ముడైన వైశ్యుడు సైతము వ్యాపారము కొనసాగుట కొరకు కొన్నిమార్లు తన లాభమును గుప్తముగా ఉంచవలసివచ్చును లేదా నల్లబజారులో వ్యాపారము చేయవలసివచ్చును.
ఇవి తప్పని సరియైనట్టివి. వీనినెవ్వరును విడిచిపెట్టలేరు. అదేవిధముగా శూద్రుడు ఒక దుష్టయజమానిని సేవింపవలసి వచ్చినచో చేయరాని కార్యములైనను యజమాని ఆజ్ఞపై ఒనరింపవలసివచ్చును. ఆనగా స్వీయస్వభావము ననుసరించి సహజముగా కలుగుచున్నందున దోషపూర్ణములైనను స్వధర్మములను ప్రతియొక్కరు కొనసాగించవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 272, 273 / Vishnu Sahasranama Contemplation - 272, 273 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 272. బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ🌻
ఓం బృహద్రూపాయ నమః | ॐ बृहद्रूपाय नमः | OM Br̥hadrūpāya namaḥ
బృహద్రూపః, बृहद्रूपः, Br̥hadrūpaḥ
బృహన్మహద్వరాహాదిరూపమస్యేతి కేశవః ।
నైకేషు చావతారేషు బృహద్రూప ఇతీర్యతే ॥
బృహత్, మహత్, లేదా పెద్దదియగు వరాహాది రూపములు గల కేశవుడు, బృహద్రూపుడు.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
మ. సకలాభీరులు వీఁడె కృష్ణుఁ డన నైజంబైన రూపంబుతో
నకలంకస్థితినుండి శైలిమిదె మీ రర్చింప రం' డంచుఁ దా
నొక శైలాకృతిఁ దాల్చి గోపకులతో నొండొండ పూజించి గో
పక దత్తాన్నము లాహరించె విభుఁ డా ప్రత్యక్షశైలాకృతిన్. (891)
శ్రీ కృష్ణుడు ఎప్పటి రూపుతో గొల్లల నడుమ నిశ్శంకంగా నిష్కళంకంగా ఉంటూ, వారితో "ఇదిగో! పర్వతం. దీనిని ప…
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 14 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. బ్రహ్మ జ్ఞానము - 2 🍀
63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదాత్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది.
ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేము కదా!
64. ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు.
65. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయాలంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగారము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు.
అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 24 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 15. అశ్వము 🌻
జ్యోతిర్మయమైన ద్వాదశ రాశిచక్రమును ఋషులొక యజ్ఞముగ అభివర్ణించిరి. ఈ అశ్వము యొక్క ముఖము అశ్వినీ నక్షత్రము.
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢలు తోక. సూర్యుడు అశ్వినిలో ప్రవేశించుట, ధనుస్సులో ప్రవేశించుట రెండు విధముల విజ్ఞాన యజ్ఞములకు మూలకారణమై అనంతమగు జ్ఞానరాశికి చిహ్నమై ఒప్పుచున్నది.
ఇందలి రహస్యార్థము గమనింపదగినది. అశ్విని - గుఱ్ఱము శిరస్సగు ఉషస్సు. అది మేషరాశి యొక్క శిరస్సున నుండును. మూల అశ్వము యొక్క జఘనము.
అది మూలా (ధనురాశి ప్రజ్ఞ)
ధారమున నుండును. ఈ రెండు కేంద్రముల దేవతలే నాసత్య దస్రులు. వీరు ముఖముచే గర్భము ధరించు మొదటి కిరణముల జంట. వెన్నెముక యను నక్షత్ర మండలమునకు ప్రాణములు.
ఈ రెండు గుఱ్ఱములను కట్టిన రథమే జీవాత్మ శరీరము. అశ్వ (మేష) రాశిలో సూర్యుడు ప్ర…
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు - 2 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పాత భయాలను పోగొట్టే ధ్యానం: 🌻
చిన్నప్పుడు వేరే అతి లేక ఒప్పుకొన్న పాత విధానాలనే నేను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుసుకొన్నాను. నువ్వు ఎందుకూ పనికిరావు అని నా తల్లిదండ్రులు నన్ను తిట్టినపుడు నోరెత్తకుండా పారిపోయి ఎవరి అవసరం లేకుండా నేను ఒంటరిగా ఏదైనా చెయ్యగలను అనే భావనతో నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇపుడు నేను నా స్నేహితుల పట్ల అదే విధంగా స్పందిస్తున్నాను.
అది కేవలం మీలో చాలా గట్టిగా పాతుకుపోయిన ఒక పాత అలవాటు. ఈ ధ్యానానికి కావలసినది దానికి వ్యతిరేకంగా చెయ్యడం. ప్రయత్నించండి. ఏదైనా చెప్పాలనుకొంటే చెప్పకండి. ఎక్కడికైనా వెళ్లాలనుకొంటే వెళ్లకండి. మాట్లాడకూడదు అనుకొంటే మరింత గట్టిగా మాట్లాడండి. వాదించకూడదు అనుకొంటే మరింత గట్టిగా వాదించండి.
దాచాలనుకున్న దానిని బయట పెట్టండి.
ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడూ చాలా భయాన్ని కలిగిస్తుంది. అపుడు మీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటాయి. పోరాడడం, లేదా పారిపోవడం. పోరాడడమే భయానికి మందు. పారిపొవడం కాదు.
సంప్రదాయ దేశాలలో ప్రత్యేకించి లోక సంప్రదాయాల హద్దులకు పరిమితమైన దేశాలలో, కుటుంబాలలో పసివాడు ఏమాత్రం పోరాడలేదు. అందువల్ల వాడు ఏమాత్రం నోరెత్తకుండా తనని తాను రక్షించుకుంటాడు. అదే స్వేచ్ఛా సమాజంలో , చివరికి తల్లిదండ్రులు కూడా పారిపోయే స్థాయిలో ఆ పసివాడు పోరాడ గలడు.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
[05:16, 06/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 201 / Sri Lalitha Chaitanya Vijnanam - 201 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
గీతోపనిషత్తు -142 - 144 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 27
🍀 25. అంతర్ముఖుడు - బాహ్యమందలి స్పర్శాది విషయములను వెలుపలనే వదిలి ప్రాణాపానములను సమానము గావించి, చూపును అంతర్ముఖముగ నాసికాగ్రమున నిలిపి ముక్తుడై యుండుట తెలుపబడినది. ఇంద్రియముల అమరిక సృష్టింపక మునుపు జీవుడు అంతర్ముఖుడై, అంతరంగముననే యుండెడివాడు. ప్రచేతసులు అను ప్రజ్ఞల రూపమున యింద్రియ ప్రజ్ఞల నేర్పరచి, అంతః చేతనను బహిరంగముగ ప్రకటితము గావించుట జరిగినది. ఇంద్రియముల ద్వారా బాహ్యమున కలవాటుపడిన జీవులు, బాహ్యోన్ముఖులై అంతరంగమందలి స్వస్థానమును మరచిరి. మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు ప్రధానమగు ఉపాయము శ్వాసను గమనించుట, శ్వాసపై మనసు లగ్నము చేయుట. శ్వాసమార్గము బహిర్ముఖమైన మనోప్రజ్ఞను అంతర్ముఖము చేయుటకు ఉపయోగపడును. శ్వాసపై మన…
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 343 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, మునులు కలిసి అనునయించగా, పరమేశ్వరుడగు శంభుడు ప్రసన్నుడాయెను (1). కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు విష్ణువు మొదలగు దేవతలను ఓదార్చి, చిరునవ్వు నవ్వి, గొప్ప అనుగ్రహమును ఇచ్చువాడై ఇట్లు పలికెను (2).
శ్రీ మహాదేవుడిట్లు పలికెను -
దేవశ్రేష్ఠులారా! మీరిద్దరు నా మాటను సావధానముగా వినుడు. వత్సలారా! మీకు నేను సత్యమును చెప్పెదను. మీరు చూపిన క్రోధమును నేను సర్వదా సహించితిని (3). బాలురు చేయు పాపములను నేను పరిగణించను. వారి బాల్యమును మాత్రమే పరిగణించెదను. వారు నా మాయచే పరాజితులై యుందురు గనుక, వారి యందు దండమును ప్రయోగించను (4). దక్షుని యజ్ఞమును ధ…
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 227 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మైత్రేయమహర్షి - 4 🌻
21. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో ఒక సూక్షమముంది. నేను అనే భావనలేదక్కడ. ప్రతివాడికీ గోత్రనామములు, తల్లీతండ్రీ వాడికిచ్చిన ఒక నామము, దేహము, పుట్టుక, పెరుగుదల, చావు – ఇవన్నీ ఉంటాయి.
22. వాటిని ఆధారం చేసుకుని కర్మచేస్తే, అది మళ్ళీ ఆ జీవుడికి బంధనహేతువవుతుంది. అటువంటివాడికి పునర్జన్మ తప్పదు. కాని, కృష్ణుడి విషయంలో, ఆ జీవుడు చేసే కర్మ ఏదయినప్పటికీ, సాక్షిమాత్రుడుగా తానుంటాడు. ఆ జీవుడొక యంత్రం. ఆ దేహంలో ఉండే మనిషి ఒక యంత్రం. ఒక కర్మసాధనం అది.
23. అంటే, ఉదాహరణకు – సృక్స్రువములు యజ్ఞానికి కర్మ సాధనములు. అవి ఎట్లాంటివో ఈ దేహంకూడా అట్లాంటిదే! ఒకరు యజ్ఞం చేస్తే, వాటికి ఏమయినా కర్మఫలం అంటుతుందా! ఏమీ అంట్డం లేదు. యజ్ఞవేదిక ఏమయిపోతున్నది? తవ్వి తీసేస్తాం. ఆ తరువాత అక్కడ ఏమీ ఉండదు.
24. దానికి ఏం ఫలం అంటుతుంది? అట్లాంటప్పుడు, నశించేటటువంటి ఈ దేహానికి మాత్రం ఆ ఫలం ఎందుకు అంటుతుంది? ఆ సృక్స్రువములు ఎత్లాంటివో ఈ దేహముకూడా అట్లాంటిదే! ఈ దేహంలో ఉండేతటువంటి జీవుడు, జీవత్వము, అంతా నశ్వరమే – నశించేదే. దానికీ కర్మఫలమనేది ఉండకూడదు.
25. ‘నేను పరమాత్మను’ అని తనకు తెలుసు ఈ విషయం. కృష్ణ స్వరూపంగా ఉండేటటువంటి ఈ దేవకీనందనుడు లోకకల్యాణహేతువని, సత్యము, ధర్మము అను అనుకున్న పని చేయిస్తాడు. దాని ఫలం-లోకంలో నశించేటటువంటి జీవులకు ఫలం-ముట్టుతుంది.
26. ఈ ప్రాతిపదికన అతడు చేసినటువంటి కృష్ణావతార కాలంనాటి కార్యక్రమంయొక్క ఫలంకూడా శాశ్వతంకాదు. యజ్ఞఫలం అనేది శాశ్వతంగా ఎలా ఉంటుంది? అసలు యజ్ఞమే నశ్వరమయినది కదా! కృష్ణావతారకాలం సమాప్తి అయ్యేందుకు మరికొంతకాలం పట్టింది. ఆ కాలంలో అధర్మం మరికొంత పెరిగింది.
27. అయినప్పటికీ, నశ్వరమైన ఈ దేహానికికూడా, లోకం విషయంలో పుణ్యకార్యం చేసేటటువంటి బాధ్యత ఉంటుంది! అందువల్లనే, నశించే జీవలక్షణం కలిగిన ఆ శరీరానికికూడా ఈ జన్మలోనే ఏదో పవిత్రకార్యం చేయటంవలన ఆ జీవత్వానికి పవిత్రత.
28. కర్మచివర, ‘సర్వం ఈశ్వరార్పణం’ అంటాం మనకు తెలుసు. అదే లోకానికి చెందుతుంది. స్వవిషయంలోకూడా అతడే కర్మఫల ప్రదాత కదా! ఆ రహస్యాన్ని మైత్రేయమహర్షికి శ్రీకృష్ణుడు బోధించాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 166 🌹
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 4 🌻
643. సద్గురువులు అనంత జ్ఞాన స్థితిలో తమకు తామై నెలకొని అనంతానందము అనుభవించుచు తమ అనంత శక్తిని (అధికారమును) ఉపయోగించుటకు తమ అనంత జ్ఞానమును వినియోగించుటలోనే తర తమ భేదములున్నవి గాని సచ్చిదానంద స్థితి అనుభవములో పై నలుగురు సమానులే.
644. అన్ని యుగములలో అన్ని కాలములలో ఈ భూమి మీద 56గురు శివాత్మలు (బ్రహ్మీభూతులు) ఉందురు. ఈ యేబది ఆరుగురిలో చాలా హెచ్చు మంది బ్రహ్మీభూతస్థితిలో నుందురు. కొలది మంది 'దివ్యకూడలి' యైన 'తురీయావస్థ' లో నుందురు. బహు కొలది మంది తురీయావస్థను దాటి ఆత్మ ప్రతిష్టాపన స్థితిలో నుందురు. 5గురు మాత్రమే మానవ రూపములో మానవుల మధ్య భగవజ్జీవితమును గడుపుచుందురు.వారే సద్గురువులు.
645. సద్గురువును ఆరాధించినచో, అనంతగుణ విశిష్టుడైన భగవంతుని ఆరాధించినట్లే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 21 / Bhagavad-Gita - 21 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴
శ్లోకము 21
అర్జున ఉవాచ
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ||
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత |
🌷. తాత్పర్యం :
అర్జునుడు పలికెను :
ఓ రాజా! వ్యూహముగా నిలిచియున్నా ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణభగవానునితో ఈ వాక్యములను పలికెను.
ఓ అచ్యుతా! దయచేసి రెండుసేనల నడుమ నా రథమును నిలుపుము.
🌷. బాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 22 / Sri Lalita Sahasranamavali - Meaning - 22 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 22. సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా |
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ‖ 22 ‖ 🍀
🍀 55) సుమేరు శృంగమధ్యస్థా -
మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
🍀 56) శ్రీమన్నగర నాయికా -
శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్ఠాత్రి.
🍀 57) చింతామణి గృహాంతఃస్థా -
చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
🍀 58) పంచబ్రహ్మాసనస్థితా -
ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[16:44, 06/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 22 / Sri Vishnu Sahasra Namavali - 22 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
ఆరుద్ర నక్షత్రం 2వ పాద శ్లోకం - నిత్యం 108 సార్లు
*🍀 22. అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః|
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా|| 🍀*
🍀 198) అమృత్యుః -
నాసనము లేనివాడు.
🍀 199) సర్వదృక్ -
సర్వమును చూచువాడు.
🍀 200) సింహః -
పాపములను హరించువాడు.
🍀 201) సంధాతా -
జీవులను వారి కర్మఫలములను అనుసంధానము చేయువాడు.
🍀 202) సంధిమాన్ -
సకల జీవులలో ఐక్యమై యుండువాడు.
🍀 203) స్థిరః -
స్థిరముగా నుండువాడు, నిశ్చలుడు, నిర్వికారుడు.
🍀 204) అజః -
పుట్టుకలేనివాడు, అజ్ఞానము హరించువాడు, అక్షరాలకు మూలమైనవాడు.
🍀 205) దుర్మర్షణః -
తిరుగులేనివాడు, ఎదురులేనివా…
[22:06, 06/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 6.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 6.
Character has to be essential through a thousand stumbles.
వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టువదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలం.
🕉🌞🌎🌙🌟🚩
పచ్చి కట్టె సైతం మంటలో వేసినపుడు సత్వరమే ఎండి ,చివరకు మండి పోతుంది. అదే విదంగా సజ్జన సాంగత్యం లౌకికుల హృదయాలలోని లోభాన్ని కామాన్ని అనార్ద్రం (ఎండింప )చేసి క్రమంగా వాళ్ళలో వివేకాగ్నిని ప్రజ్వలింప చేస్తుంది.
-రామకృష్ణ పరమహంస-
🕉🌞🌎🌙🌟🚩
[22:06, 06/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
పంచభూతములకు, ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. మనము ధ్యానము చేసేటప్పుడు గాని, ప్రార్ధన చేసేటప్పుడు గాని మన ఇంద్రియార్దములు, మనస్సు రెండూ హృదయమందు లయమై పోవాలి. ఇది చాలా ప్రధానం. అపుడే బాహ్యమైన విషయముల యందు ఆసక్తి , మోజు తొలగుతుంది. అంతర్ముఖమైనటువంటి ప్రజ్ఞ మీద మోజు పెరుగుతుంది.
మన హృదయములో కూడా బంగారు గుడి ఉన్నది. ఆ గుడిలో ఉన్న దైవమును దర్శించడానికి భావ పరముగా ప్రయత్నము చేయాలి. ఈ ప్రయత్నము ఎంత చేస్తుంటే అంత బాహ్యమైన ప్రజ్ఞ తిరోధానము చెంది హృదయమును చేరుతుంది.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
మనలో సమత్వ స్థితిని సదా కలిగి ఉండటాన్ని అభ్యాసంచే కలిగిన జ్ఞానం అని గుర్తించవచ్చు.
మనలను మనం శరీరపరంగా అన్వయించుకుంటే ఆందోళనలు అధికంగా కలుగుతాయి. మన సమతుల్యతను తొందరగా కోల్పోతాం. కానీ మనలను మనం ఆత్మ స్వరూపులుగా భావించినప్పుడు స్థిరంగా ఉండగలుగుతాం.
అల్పమనస్కులకు చికాకులు అతి త్వరగా వస్తాయి. మనోవైశాల్యం గల వారిలో సమత్వస్థితి సదా నెలకొని ఉంటుంది.
మన లక్ష్యాన్ని, ఆదర్శాన్ని చేరుకునేందుకు జీవితాన్ని పణంగా పెట్టి అయినా ఫలితం సాధించాలనే తెగింపు ఉన్నప్పుడు, లక్ష్యమే మన గమ్యం అయినప్పుడు జీవితంలోని ఇతర సంఘటనలు మనపై అంతగా ప్రభావం చూపలేవు.
అందువలన అన్ని పరిస్థితుల్లో మనో నిబ్బరాన్ని కలిగి ఉండటం సాధ్యపడుతుంది.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
[22:13, 06/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(794)
🕉🌞🌎🌙🌟🚩
"ప్రశ్న : సుఖాశ ఎందుకు కలుగుతుంది !?"
భగవాన్ శ్రీరమణమహర్షి : నీ స్వభావం అదే కనుక. నీ స్వామ్యాన్ని పొందవలెనన్న ఆశ సహజమే. ఆత్మకు వెలిగా ఆనందం అబ్బేదికాదు. మరెక్కడ వెదికినా లాభంలేదు. ఆత్మనే వెదికి అందే స్థిరపడు. సుఖాసక్తి పెంచతగ్గదికాదు. పైన పెట్రోల్ చల్లుతూ అగ్నినెవ్వరూ ఆర్పలేరు. లాలసనొక్కమారు తృప్తిపరచి ఆపై అణచివేయగలమనుకోవటం వెర్రి. నీకు సహజమే అయిన ఆనందం, మరలా కంటపడటమేగానీ అది నష్టమెన్నడూకాదు. విషయసుఖాలు బహిరమైనవి. అందుచేత అవి నష్టములు కావచ్చు. అవి శాశ్వతంకావు. వానికైన శ్రమవృధా.
కామక్రోధాలను అణిచేందుకు ఇతర ఉపాయాలున్నాయి. నియతాహారం, ఉపవాసం, యోగాభ్యాసం, ఔషధ సేవనం. కానీ వాని వలన ఫలితం తాత్కాలికమే. అడ్డుతీయగానే వాంఛ రెట్టించిన బలంతో ఎగబడుతుంది. దాన్ని జయించే మార్గం ఒక్కటే, దాన్ని నాశనంచేయడమే. పైన చెప్పినట్లు వాని మూలాన్ని కనిపెడితేగానీ, వాని నిర్మూలనం సాధ్యంకాదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ఆలోచనే మాయ - అది గుర్తించటమే జ్ఞానం'- (అధ్యాయం -97)
🕉🌞🌎🌙🌟🚩
[22:13, 06/02/2021] +91 92915 82862: "ఋభుగీత "(261)
🕉🌞🌎🌙🌟🚩
సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము
సృష్టిసూత్రం ధర్మమే !!
ధర్మం అంటే మనసు యొక్క మౌలిక గుణం. అది ఈ సృష్టి క్రమణికలో అత్యంత సహజమైన, అత్యావశ్యకమైన అంశం. అది కేవలం మానవనిర్మితమైన దేవాలయాల్లోనూ, ప్రార్థనా మందిరాల్లోనూ మాత్రమే నిలిచి ఉండేదికాదు. వేటితో పని లేకుండానే సృష్టిలోని జంతుజాలాలు, పశుపక్ష్యాది వృక్షాలు సైతం సహజమైన ధర్మం అనుసరిస్తూ ఉన్నాయి. ఆచరిస్తున్నాయి. గణితంలో లెక్కలు ఒక సూత్రం ప్రకారం చేస్తూవెళ్తే సమాధానం వస్తుంది. అలాగే సృష్టిసూత్రం ధర్మమే. దాన్ని అనుసరించి ఆచరిస్తేనే సత్ఫలాలు సాధ్యం అవుతాయి !
- మంద్రగీత🌷
పురుషోత్తమ ప్రాప్తి
19. సమ్మోహము చెందక నన్నీవిధముగా పురుషోత్తముడని ఎవడు తెలిసికొనునో అతడు సమస్తము తెలిసినవాడు. అతడు సర్వభావముల చేతను నన్నే భజించును.
(సమ్మోహము చెందక అనగా క్షరాక్షర పురుషులను చూచునపుడు పురుషోత్తముని యంశలే అని మరువక అని అర్థము. ముగ్గురు పురుషులను వేరుగా గుర్తింపనిచో విజ్ఞానము జ్ఞాన వికాసము లేవు. ఒక్కని అంశములుగా నుండుట మరచినచో సర్వజ్ఞత, మోక్షము లేదు. క్షరాక్షరులను తెలియక పురుషోత్తమునే భావించినను అనుగ్రహ విశేషమున తెలియుట అను వికాసము తప్పదు. తెలిసినవారెల్ల ఇట్లే తెలిసికొనిరి. నిమిత్తములు శాస్త్రములు కావచ్చును. తెలియుట మాత్రము అనుగ్రహ విశేషము. సర్వభావములచే నన్ను భజించుట ఆనగా కంటితో శరీరమును, మనస్సుతో మనస్సును, బుద్ధితో బుద్ధిని, లౌకిక వ్యాపారములతో లోకవ్యక్తులను చూచుచుండియు పురుషోత్తముడుగా ఉపాసించుట.)
20. ఇప్ప…
[22:20, 06/02/2021] +91 92915 82862: 162) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
నిరుక్తావభిమానం యే దధతే తార్కికాదయః ౹ హర్ష మిశ్రాదిభిస్తే తు ఖండనాదౌ సుశిక్షితాః ౹౹149౹౹
149. నిర్వచనమునందే అభిమానమునుంచు తార్కికులు మొదలగు వారు తమ తమ వాదములతో తామే సంతసింపవచ్చును.కాని వారి వాదములందలి దోషములు హర మిశ్రుడు తన ఖండనఖండ ఖాద్యము(140)నందు విశదము చేసెను.
అచింన్త్యాం ఖలుయే భావా న తాంస్తర్కేషు యోజయేత్ ౹ అచింత్యరచనారూపం మనసాఽ పి జగత్ఖలు ౹౹150౹౹
150. మనస్సు గ్రహింపజాలని విషయములకు తార్కిక నియమములను తగిలింపరాదు. ఈ జగత్తు అట్టిది. ఏలన అది ఎట్లు సృష్టింపబడినదో ఊహింపనే సాధ్యము కాదు.
అచింత్యరచనాశక్తిబీజం మాయేతి నిశ్చను ౹ మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే ౹౹151౹౹
151. ఊహాతీతమైన ఆ కల్పనాశక్తి బీజమే మాయయని నిశ్చయింపుము.సుషుప్తియందు ఆ మాయా…
*||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - కూర్మావతారము వర్ణనము
27-4-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
సంధానం కృతవతి దానవైస్సురౌఘే
మంథానం నయతి మదేన మందరాద్రిమ్।
భ్రష్టే౾ స్మిన్ బదరమివోద్వహన్ ఖగేంద్రే
సద్యస్త్వం వినిహితవాన్ పయః పయోధౌ॥
భావము:-
భగవాన్! నీ ఆజ్ఞననుసరించి దేవతలు అసురులతో సంధి చేసుకొని, వారితో కలిసి క్షీరసాగర మథనమునకు ఉపక్రమించిరి. క్షీరసాగరమును మథించుటకై మందరపర్వతమును పెకిలించి తెచ్చుచుండగా వారిలో గర్వము ప్రవేశించెను. ప్రభూ! (నీ లీలచే) ఆ మందరపర్వతము వారివశము తప్పి పడిపోవసాగెను. అంతట గరుడవాహనుడవైయున్న నీవు, ఆ మందరపర్వతమును రేగుపండువలె అవలీలగా ఎత్తి క్షీరసాగరమున నిలిపితివి.
వ్యాఖ్య:-
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి"ఇప్పుడు రాక్…
[22:45, 06/02/2021] +91 92915 82862: 18-76-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అ|| భగవానుని యా దివ్య బోధలను స్మరించి స్మరించి మహదానందము నొందుచున్నానని సంజయుడు పలుకుచున్నాడు –
రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమ మద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహుః ||
తా:- ఓ ధృతరాష్ట్రమహారాజా! ఆశ్చర్యకరమైనదియు, పావనమైనదియు (లేక పుణ్యదాయకమైనదియు) నగు కృష్ణార్జునులయొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటిమాటికి ఆనందమును బొందుచున్నాను.
వ్యాఖ్య: - సంజయుడు గీతాసంస్మరణజనిత మహదానందమును వ్యక్తమొనర్చుచున్నాడు.
"సంస్మృత్య సంస్మృత్య" - సంస్మృత్య అని చెప్పుటలోను, సంస్మృత్య అని ఒక పర్యాయము చెప్పక, రెండు పర్యాయములు చెప్పుటలోను విశేషము కలదు. వివినబోధను లెస్సగస్మరించుటయే సంస్మరణము. మఱియు ఆ పదమును రెండుసార్లు చెప్పుటచే అద్దానిని మఱల మఱల లెస్సగా స్మరించవలెనని భావము. సంజయుడు ఆ ప్రకారమే చేసెను.
…
[04:12, 07/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
808వ నామ మంత్రము 07.02.2021
ఓం పరమాణువే నమః
పరమాణు స్వరూపిణి, తెలియ శక్యము కానంత మిక్కిలి సూక్ష్మముల కంటెను సూక్ష్మమైన పరాశక్తి స్వరూపురాలికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరమాణుః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరమాణువే నమః యని ఉచ్చరించుచూ, ఎనలేని భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రచిత్తులై కేవలం ఆ పరమేశ్వరి కరుణయే పరమావధిగా ఆ పరబ్రహ్మస్వరూపురాలైన శ్రీమాతను ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదించును.
అమ్మవారు పరమాణువు కన్నా మిక్కీలి సూక్ష్మ స్వరూపిణియై తెలియ శక్యముకానిది. కేవలం నిర్మలమైన జ్ఞానచక్షువులకు మాత్రమే దర్శింపదగినది. ఇంతకన్నా ఆంగ్లపదములు నేను (పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం) వ్రాయను . వొతోగుణవచనాత్ సూత్రముచే విధింపబడినద జ్ఞీవ్ వికల్పము గనుక అణ్వీ - అణుః అను రె…
[04:12, 07/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
234వ నామ మంత్రము 07.02.2021
ఓం మహాత్రిపురసుందర్యై నమః
మాతృ (కొలుచువాడు), మాన (కొలత), మేయము (కొలువబడునది) - త్రిపుటి అనే సంఖ్యతో తాదాత్మ్యత పొంది, త్రిపురసుందరియై తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాత్రిపురసుందరీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం మహాత్రిపుర సుందర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను ఆరాధించు భక్తులకు ఆ పరమేశ్వరి సర్వార్థసిద్ధిని కలిగించును మరియు ఆత్మానందానుభూతితో తరింపజేయును.
త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్షాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున మహాత్రిపుర సుందరి అంటారు.
జగన్మాత మూడు రూపాలలో ఉంటుంది.
1. స్థూల (భౌతికం) లలితా సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బ…
[04:12, 07/02/2021] +91 95058 13235: 7.2.2021 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - ముప్పది తొమ్మిదవ అధ్యాయము
బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు బయలుదేరుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
39.24 (ఇరువది నాలుగవ శ్లోకము)
తాసాం ముకుందో మధుమంజుభాషితైర్గృహీతచిత్తః పరవాన్ మనస్వ్యపి|
కథం పునర్నః ప్రతియాస్యతేఽబలా గ్రామ్యాః సలజ్జస్మితవిభ్రమైర్భ్రమన్ ॥9754॥
గోపికలు ఇట్లు పలుకుచున్నారు:
"సతులారా! మన శ్రీకృష్ణుడు సహజముగా ధీరుడే ఫైగా గురుజనుల ఆజ్ఞలను మీఱనివాడే. ఐనప్పటికిని, మథురానగర తరుణీమణుల యొక్క తేనెలొలికెడి మంజుల భాషణములకును, సిగ్గులతోగూడిన మందహాస విలాసములకును ముగ్ధుడై, తప్పక వారివాడగును. అట్టిస్థితిలో అబలలము, పల్లెపడుచులము ఐన మన దగ్గఱకు ఆ ప్రభువు ఏల వచ్చును?"
39.25 (ఇరువది ఐదవ శ్లోకము)
అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే దాశార్హభోజాంధకవృష్ణిసాత్వతామ్|
మహోత…
[05:20, 07/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 632 / Bhagavad-Gita - 632 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 49 🌴
49. ఆసక్తబుద్ధి: సర్వత్ర జితాత్మా విగతస్పృహ: |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
ఆత్మనిగ్రహము కలవాడును, అనాసక్తుడును, భౌతికసుఖములను త్యజించువాడును అగు మనుజుడు సన్న్యాసము ద్వారా కర్మఫల విముక్తి యనెడి అత్యున్నత పూర్ణత్వస్థాయిని బడయగలడు.
🌷. భాష్యము :
తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశననియు, తత్కారణముగా తన కర్మఫలముల ననుభవించు అధికారము తనకు లేదనియు ప్రతియొక్కరు తలచవలెను. నిజమైన సన్న్యాసము యొక్క భావమిదియే.
వాస్తవమునకు అతడు శ్రీకృష్ణభగవానుని అంశయై యున్నందున అతని కర్మల ఫలములన్నియును శ్రీకృష్ణుని చేతనే అనుభవనీయములై యున్నవి. ఇదియే నిజమైన కృష్ణభక్తిరస…
[05:20, 07/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 274, 275 / Vishnu Sahasranama Contemplation - 274, 275 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 274. ప్రకాశనః, प्रकाशनः, Prakāśanaḥ🌻
ఓం ప్రకాశనాయ నమః | ॐ प्रकाशनाय नमः | OM Prakāśanāya namaḥ
సర్వప్రకాశనశీలమస్యాస్తీతి ప్రకాశనః అన్నిటిని తన ప్రకాశముచే ప్రకాశింపజేయుట ఈతని శీలము లేదా అలవాటు లేదా స్వభావము గనుక ఈతడు ప్రకాశనః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥
సుభుజో దుర్ధరో వాగ…
[05:20, 07/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 15 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. బ్రహ్మ జ్ఞానము - 3 🍀
66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.
67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.
68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05:21, 07/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 202 / Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
🌻 202. 'సర్వేశ్వరీ' 🌻
సకలమునకు ఈశ్వరి శ్రీదేవి అని అర్థము.
సృష్టి యందు సర్వమూ శ్రీదేవి అధీనముననే యున్నది. సృష్టి చైతన్యము శ్రీదేవియే. అన్ని జీవరాశులయందు ఆమె చైతన్యమే విరాజిల్లుతూ నున్నది. త్రిగుణములుగాని పంచభూతములు గాని తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలవు.
అట్లే జీవులు కూడ తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలరు. జీవులయందు ఇచ్చగాని, జ్ఞానముకాని, క్రియాశక్తిగాని పనిచేయుటకు వారి యందున్న చైతన్యమే ఆధారము. చేతన లేనప్పుడు జీవునికి తనకు తా నున్నాడని కూడ తెలియదు. అందరి యందు, అన్నిటి యందు తానుండి, ఆయా ధర్మములను నిర్వర్తించు శక్తిగా శ్రీదేవియే యున్నది.
ఇది ఆమె ఈశ్వరత్వము. ఉప్పు ఉప్పగా నుండుట, వేప చేదుగ నుండుట, నిమ్మ పులుపుగ నుండుట, తేనె తీపిగ నుండుట యందు కూడ శ్రీదేవి అస్థిత్వము దర్శింప వచ్చును. ఇట్లందరి జీవుల సమస్త చేష్టలకు ఆధారముగా నున్నది శ్రీదేవి. సృష్టి యందు సమస్తమునకు ఆమె ఈశ్వరి. ఆమెకు ఈశ్వరుడాయన. ఆయన (ఈశ్వరుడు) కూడ కనుపింపవలె నన్నచో ఆమెయే ఆధారము. ఆమె లేని ఆయన జగత్తునకు లేడు. ఆయన లేక ఆమె ఏమియూ చేయలేదు. నిజమునకు ఆమె ఆయన ఒకటియే.
కనిపించునపు డామె యగును, సంకల్పించినపుడు ఆయన యగును. ఏమీ సంకల్పించని స్థితిలో కేవలము తానుగ నుండును, ఆ తాను ఆమె కాదు, ఆయన కాదు. రెండునూ ఏకము చెందిన స్థితి. ఆ ఏకత్వము నుండి తాను అస్థిత్వము (ఆయన)గను, చేతన (ఆమె)గను ఏర్పడుదురు. ఇవి రెండును అవిభాజకములు.
అందు వలననే సర్వేశ్వరి, సర్వేశ్వరుడని సంబోధింతురు. సత్, చిలు లేనిచో ఏమియూ లేదు. కావున వారిదే ఈశ్వరత్వము. ఈశ్వరత్వ మనగా అన్నిటి యందునూ అస్థిత్వముగను, చైతన్యముగను వశించి స్వామిత్వమును నెరపుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🕉🌞🌎🌙🌟🚩
[22:15, 07/02/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
పురుషార్ధముల కోసము జీవించేవారంతా మోసపోతూనే ఉంటారు. యజ్ఞార్ధము జీవించడమనేది (పరహితము) ఉండాలి. మనము యజ్ఞార్ధము అన్న పదమైతే నేర్చుకున్నాము గాని, నిజముగా మనము యజ్ఞార్ధము చేస్తున్నామా లేదా అన్నది ఎవరికి వారు తరచి చూసుకుంటే కనిపిస్తుంది. అది యజ్ఞార్ధమైతే బంధనముండదు. దీనివల్ల నాకేమిటి అని ప్రశ్న పుట్టకూడదు. జీవించి ఉన్నంతకాలం చేసుకుంటూ వెళ్లిపోవడమే.
నేను ధర్మంగానే చేస్తున్నాను కాబట్టి నేను అర్ధకామముల యందు ఉన్నా మోక్షమే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. స్వార్ధము నుంచి పురుషార్ధము, పురుషార్ధము నుంచి యజ్ఞార్ధానికి మనిషి తన్ను తాను, ఉత్తీర్ణుని చేసుకుంటూ ఉండాలి.
🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
మనకు ఎదురుదెబ్బలు తగలడం ఒక విధంగా గొప్ప దేవెనయే. దాని వలన మనలో దాగున్న శక్తి అంతా బయటకు వచ్చే అవకాశం కలుగుతుంది.
ధైర్యంగా లక్ష్యాన్ని అం…
[22:52, 07/02/2021] +91 92915 82862: 🌷147 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
పురుషోత్తమ ప్రాప్తి
18. ఉత్తమ పురుషుడనైన నేను క్షరునకు అరీతుడను, అక్షరుని కన్న ఉత్తముడను. అందుచే లోకము నందును, వేదము నందును పురుషోత్తముడని ప్రసిద్ధుడ నైతిని..
(కరుడుగా కూడ ఉండుట వలన క్షరుని కన్న అతీతుడు. ఉపాధ్యాయుడు తక్కువ తరగతికి కూడ పాఠము చెప్పగలడనుట వంటిది. అతడే అక్షరుడుగా కూడ ఉండుటవలన అక్షరునికన్న ఉత్తముడు. క్షరుడు, అక్షరుడు ఉత్తమునిగా మాత్రము ఉండలేరు. సృష్టియంతమునగాని, యోగస్థితి యందుగాని ఉత్తముడుగా మాత్రము ఉండగలరు. అనగా ఉత్తముని యందుండగలరు. క్షరాక్షరులు ఉత్తముని ప్రకృతి; పురుషోత్తముడు ప్రకృతికి అతీతుడు.
లోకము నందును, వేదము నందును - అనగా వ్యక్తులు పిలుచుకొనుట, తెలిసికొనుట, సృష్టిగా వ్యవహరించుట యందును, వేదమూర్తులుగా కీర్తింపబడుట యందును సమానులే యని అర్థము. లోకమునందు క్షరపురుషుడు వ్యవహరించును. అక్షరుడు వ్యవహరింపజేయును. పురుషోత్తముడు వారి ప్రవర్తనమున తేజరిల్లును. అనగా వారిచే ప్రవర్తన రూపమున ప్రశంసింపబడును. ఈ మూడవ విభూతియే వేదము. లోకమునందు అనగా లోకభాషా వాజ్ఞ్మయమను పురాణ కావ్యాదుల యందు అని అర్ధము. వేదమునందు అనగా వేద ఉపనిషద్ బ్రాహ్మణ ఆరణ్యకములయందు అని యర్థము. ఇదికాక అన్ని భాషల యందును ప్రతి పదమునకును లోకార్థము, వేదార్ధము అని రెండర్థములుండును. కృష్ణుడు, రాముడు మున్నగు పదములు వ్యక్తులను నిర్దేశించినపుడు లోకభాష యగును. అట్లుకాక సంకర్షణాపకర్షణాది కర్షణములకు కారణభూతుడు, ధర్మమునందు రమించువాడు మున్నగు మంత్రార్థములలో వాడబడినప్పుడును, వాక్యములందు కర్త కర్మ మున్నగు కారకశక్తులను వ్యక్తము చేయునపుడును వేదార్థములు అనబడును. అందు లోకార్థము నామ రూప దేశ కాలబద్ధుడగు క్షరపురుషుని, కర్మ క్రియా స్వరూపుడగు అక్షరపురుషుని కీర్తించును. వేదార్థము తదతీతుడైన పురుషోత్తముని మాత్రమే సూచించును. వ్యక్తుల నామములన్నియు గుణములచే వేర్వేరుగా వినియోగింపబడి, గౌణములు ఆగుచున్నవనియు, ఆత్మలకు చెందుచున్నవనియు, స్మరణ నిచ్చునపుడు మహా + ఆత్మయగు పరమపురుషుని కీర్తించు చున్నవనియు భారతమున భీష్ముడు 'విష్ణు సహస్రనామ ప్రశంస'లో ధర్మజునకు ఉపదేశించెను. కనుక ప్రతి పదమునకు లౌకికముగను అలౌకికముగను పురుషోత్తమునే స్ఫురింపజేయును.)
🕉🌞🌎🌙🌟🚩
[22:52, 07/02/2021] +91 92915 82862: 162) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
నిరుక్తావభిమానం యే దధతే తార్కికాదయః ౹ హర్ష మిశ్రాదిభిస్తే తు ఖండనాదౌ సుశిక్షితాః ౹౹149౹౹
149. నిర్వచనమునందే అభిమానమునుంచు తార్కికులు మొదలగు వారు తమ తమ వాదములతో తామే సంతసింపవచ్చును.కాని వారి వాదములందలి దోషములు హర మిశ్రుడు తన ఖండనఖండ ఖాద్యము(140)నందు విశదము చేసెను.
అచింన్త్యాం ఖలుయే భావా న తాంస్తర్కేషు యోజయేత్ ౹ అచింత్యరచనారూపం మనసాఽ పి జగత్ఖలు ౹౹150౹౹
150. మనస్సు గ్రహింపజాలని విషయములకు తార్కిక నియమములను తగిలింపరాదు. ఈ జగత్తు అట్టిది. ఏలన అది ఎట్లు సృష్టింపబడినదో ఊహింపనే సాధ్యము కాదు.
అచింత్యరచనాశక్తిబీజం మాయేతి నిశ్చను ౹ మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే ౹౹151౹౹
151. ఊహాతీతమైన ఆ కల్పనాశక్తి బీజమే మాయయని నిశ్చయింపుము.సుషుప్తియందు ఆ మాయాశక్తి బీజమే మనకు అల్పముగ అనుభవమునకు వచ్చును.
వ్యాఖ్య :- అవిద్య వల్ల తను సృష్టించుకున్న ద్వైతప్రపంచంలో పురుషుడు స్వప్న-జాగ్రదవస్థలలో శ్రమతో దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు.
అదే జీవుడు,దేహేంద్రియాలతో దూరమైన సుషుప్తిలో
సుఖ-దుఃఖాల నుండి విముక్తి పొంది పరబ్రహ్మను చేరి ఆనందంగా శాంతిని పొందుతుంది.
ఆ అనుభవము మనకు అనుభవములో వుండనే వుంది.
అలాగే కర్తకత్వం నుంచి ముక్తి పొందిన జీవుడు కైవల్యావస్థలో కేవల ఆత్మ స్వరూపుడై పరమానంద స్వరూపుడౌతాడు.
అందువలన
"అహంబ్రహ్మస్మి"(నేను బ్రహ్మమే) అను ప్రయత్న పూర్వకమగు భావనతో అన్యభావనలను మనస్సులో అనుసంధానము చేయని వ్యక్తి శాంతిని అనుభవించును.ఏల అనగ ఆ బ్రహ్మము "శాంతియే".
భావనలు,ఆలోచనలే జగత్తు. అందువలన వానినుండి విముక్తుడవయి చేయవలసిన దానిని యాదృచ్ఛికముగా (అప్రయత్నముగా)చేయుము.
మాయ ఉందా?లేని మాయా?ఊహాతీతమైన కల్పనాశక్తి బీజమే మాయయని నిశ్చయింపుము.
ద్వైతదర్శనమునకు ఏకైకమూలమగు మానసిక పరిమితిని పరిత్యజించవలెను.
మనస్సు గ్రహింపజాలని విషయములకు తార్కిక నియమములు తగిలింపరాదు. జ్ఞానహీనమగు మనస్సే బాధపడును.
(నిద్రవంటి)అజ్ఞాన దశలో మాత్రమే మనస్సు స్వప్నములో ప్రపంచదృశ్యమును జూచునుగానీ,అది జాగృతమైనప్పుడు లేక జ్ఞానవంతమైనప్పుడు చూడదు.
కావున ఈ ప్రపంచమున దుఃఖముననుభవించు దేహధారియగు వ్యక్తినే మనస్సనియు,అజ్ఞానమనియు,
జీవుడనియు,మానసిక పరిమితి అనియు,వ్యక్తిగత చైతన్యమనియు చెప్పుదురు.
ఈ దేహము అచేతనముగావున సుఖమును గానీ దుఃఖమునుగానీ పొందజాలదు.అవిద్యయే అజాగ్రత్తను అజ్ఞానమును కలిగించును.
మాయే బ్రహ్మం,బ్రహ్మమే మాయయను శుద్ధ జ్ఞానోదయ ఫలితముగా వ్యక్తి చైతన్యసత్యము (తత్త్వము) నందు చరించును.
తాను నిద్రించినాడా అన్నట్లు చేయవలసిన దానిని చేయును.
జీవించి యుండగనే ముక్తుడగును(జీవన్ముక్తుడగును)
🕉🌞🌏🌙🌟🚩
[23:05, 07/02/2021] +91 92915 82862: *||శ్రీమన్నారాయణీయము|| అష్టమ స్కంధము
27వ దశకము - కూర్మావతారము వర్ణనము
27-5-శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
ఆధాయ ద్రుతమథ వాసుకిం వరత్రాం
పాథోధౌ వినిహితసర్వబీజజాలే।
ప్రారబ్ధే మథనవిధౌ సురాసురైస్తైః
వ్యాజాత్ త్వం భుజగముఖే౾కరోస్సురారీన్॥
భావము:-
శీఘ్రమే - ఆ దేవదానవులు మందరపర్వతమును కవ్వముగాను, సర్పరాజగు వాసుకిని - ఆ కవ్వమునకు తాడుగాను - చేసుకొని పాలకడలిని మథించసాగిరి. ముందుగా ఆ కడలిలో దివ్యఔషధ విలువలు కలిగిన బీజములను వేసిరి. భగవాన్! భక్తజనపక్షపాతీ! నీ వప్పుడు మాయోపాయముతో దానవులు వాసుకి శిరమువైపు ఉండునట్లుజేసితివి.
వ్యాఖ్య:-
దుర్వాసుని శాపంతో ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. దరిద్రుడయ్యాడు. ఆసరికే చాలా మందిని కోల్పోయిన దేవతలు, ఇంద్రుడు దరిద్రుడు కావడంతో మరింతగా కుంగిపోయారు. ఏం చెయ్యాలో దిక్కు తోచలేదెవరికీ. ఆదుకోమని బ్రహ్మను ఆశ్రయించారు. ఆదుకొనగలిగేది ఒక్కడే, ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పి, దేవతలందరినీ వెంటబెట్టుకుని, జగన్నాథుణ్ణి సందర్శించాడు బ్రహ్మ.అంతా శ్రీహరిని వేయి విధాల స్తుతించారు. కాపాడమని వేడుకున్నారు.
అప్పుడు శ్రీహరి చెప్పాడిలా.‘‘దేవతలకు మంచిరోజులు కావవి. చెడురోజులు. మంచిరోజులు వచ్చేదాకా మీరంతా ఓపిక పట్టాలి. అందుకోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా ముందు మీరో పని చెయ్యాలి, రాక్షసులతో సంధి చేసుకోవాలి.
అదే మీ తక్షణ కర్తవ్యం.’’రాక్షసులతో సంధా? జరగని పని అన్నట్టుగా దేవతలంతా ఒకరినొకరు చూసుకున్నారు. గ్రహించాడది శ్రీహరి, నవ్వుతూ ఇలా అన్నాడు మళ్ళీ.‘‘రాక్షసులతో సంధి మీకు చాలా అవసరం. ఎందుకంటే మీకు అమృతం కావాలి. అమృతాన్ని మీరొక్కరూ సాధించలేరు. అందుకు రాక్షసుల సహాయం కావాలి. అందుకే సంధి చేసుకోండి అంటున్నాను. వారితో సంధి చేసుకుని, అమృతాన్ని సాధించేందుకు వారిని సమాయత్తం చేయండి.
సమస్త ఓషధులకూ నిలయమయిన మందరపర్వతాన్ని కవ్వంగానూ, సర్పరాజు వాసుకుని తాడుగానూ చేసి, మీరూ, రాక్షసులూ కలసి పాలసముద్రాన్ని మథించండి. మథిస్తే అమృతం పుడుతుంది.
ఆ అమృతాన్ని మీకు మాత్రమే అందేట్టుగా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను.’’‘‘అమృతం అందింది దేవా, ఉపయోగం?’’ అడిగారు దేవతలు. నవ్వాడు శ్రీహరి.‘‘అమృతాన్ని పానం చేస్తే చావు అనేదే ఉండదు. మీరు అమరులవుతారు.’’ అన్నాడు.దేవతలు ఆనందించారు. అక్కణ్ణుంచి నిష్క్రమించారు. శ్రీహరి చెప్పినట్టుగా ముందుగా రాక్షసులను మచ్చిక చేసుకున్నారు దేవతలు. తర్వాత వారితో సంధి చేసుకున్నారు.
ఓ మంచి ముహూర్తం చూసుకుని రాక్షసులతో ఇలా అన్నారు.‘‘మనం మనం అన్నదమ్ములం. పెత్తల్లి పిన్తల్లి బిడ్డలం. మనలో మనకి గొడవలనవసరం. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు.
అందుకని అంతా కలసి ఉందాం. కలసి ఉండి, అమృతాన్ని సాధిద్దాం. మందగిరితో క్షీరసాగరాన్ని మథిద్దాం. అమృతం పుడుతుంది. దాన్ని సరిసమానంగా పంచుకుందాం.’’‘‘అమృతాన్ని సరిసమానంగా పంచుకున్నాం, ఏమిటి లాభం?’’ అడిగారు రాక్షసులు.‘‘అమృతపానం చేస్తే చావన్నదే రాదు. చావు లేదంటే శత్రు భయం లేనట్టే! అప్పుడు ముల్లోకాలూ మన అధీనంలోనే ఉంటాయి.’’ అన్నారు దేవతలు.
రాక్షసరాజు బలి, దేవతలు చెప్పిందంతా ఒకటి రెండుసార్లు ఆలోచించాడు. ఇదెంత వరకూ సాధ్యం అనుకున్నాడు. ఆఖరికి ఒప్పుకున్నాడు. రాక్షసుల్ని కూడా ఒప్పించాడు. హమ్మయ్య అనుకున్నారు దేవతలు, ఊపిరి పీల్చుకున్నారు.
ఎలాగయితేనేం రాక్షసుల్ని తమ వైపునకు తిప్పుకున్నామనుకున్నారు.దేవదానవులు క్షీరసాగరాన్ని మథించి, అమృతాన్ని సంపాదించేందుకు ఉద్యమించారు. మందరపర్వతాన్ని పెళ్ళగించి, మోసుకుని రాసాగారు. పర్వతం బరువుని తట్టుకోలేకపోయారు. కాస్సేపటికి కిందపడవేశారు.
అప్పుడు అటు రాక్షసులు, ఇటు దేవతలు కూడా చాలా మంది ఆ పర్వతం కింద పడి, చనిపోయారు. మిగిలిన వారు మందరాన్ని మోసుకుని వెళ్ళడం అసాధ్యం అనుకున్నారు. తలలు పట్టుకుని అక్కడే చతికిలబడ్డారు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు.
🕉🌞🌎🌙🌟🚩
[23:07, 07/02/2021] +91 92915 82862: 18-77-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
🕉🌞🌎🌙🌟🚩
అll భగవానుని విశ్వరూపమును తలంచుకొని తలంచుకొని పరమాశ్చర్యము నొందుచున్నానని సంజయుడు చెప్పుచున్నాడు –
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్ రాజన్ ! హృష్యామి చ పునః పునః ||
తా:- ఓ ధృతరాష్ట్రమహారాజా! శ్రీకృష్ణమూర్తియొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మఱియు (దానిని తలంచుకొని) మాటిమాటికిని సంతోషమును బొందుచున్నాను.
వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమున భగవానుని బోధవలన కలుగు ఆనందము తెలుపబడినది. ఈశ్లోకమున భగవానుని విశ్వరూపమును తలంచుకొనినపుడు, భావించినపుడు కలుగు దివ్యానుభూతి, పరమానందము వ్యక్తము చేయబడుచున్నది.
"హృష్యామి చ పునః పునః” - సంజయుడు భగవానుని బోధను, రూపమును తలంచుకొని ఆనందము పట్టలేకున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యమునకున్ను అంతులేకున్నది. ప్రతివాడును ఈ దశను అనగా “అతిహర్ష” దశను ఎప్పటికైనను (జ్ఞానప్రాప్తిచే) పొందవలసియేయున్నాడు. నశ్వర ప్రపంచ భావనను వీడి శాశ్వత భగవత్స్వరూపమును చింతించునపుడు కొందఱు ఆనందముపట్టలేక చిందులు త్రొక్కుదురు.
కొందఱు యెలుగెత్తి గానముచేయుదురు (సామగానమువలె). కొందరు ఆనందపారవశ్యముచే నృత్యముచేయుదురు. ఇవియన్నియు అతిహర్షమునకు చిహ్నములు. సంజయునకు గీతాశ్రవణానంతరము, విశ్వరూపసందర్శనానంతరము తన్మననాదులచే అట్టి మహదానందమే కలిగినది. ఆ విషయమునే యతడీ రెండు శ్లోకములద్వారా ధృతరాష్ట్రునకు వ్యక్తపఱచెను.
ప్ర:- భగవానుని విశ్వరూప మెట్టిది?
ఉ :- అత్యద్భుతమైనది.
ప్ర:- దానిని తలంచుకొనినపుడు సంజయున కెట్టి యనుభవము గలుగుచుండెను?
ఉ:- (1) మహదాశ్చర్యము,
(2) పరమానందము గలుగుచుండెను.
🕉🌞🌎🌙🌟🚩
[05:12, 08/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 633 / Bhagavad-Gita - 633 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 50 🌴
50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||
🌷. తాత్పర్యం :
ఓ కుంతీపుత్రా! ఇట్టి పూర్ణత్వమును పొందినవాడు నేను ఇపుడు సంగ్రహముగా చెప్పాబోవు రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితియైన పరమపూర్ణత్వస్థితిని (పర బ్రహ్మము) ఏ విధముగా బడయగలడో నీవు ఆలకింపుము.
🌷. భాష్యము :
కేవలము స్వధర్మమునందు నెలకొనినవాడై దానిని భగవంతుని కొరకు ఒనరించుట ద్వారా ఏ విధముగా మనుజుడు అత్యున్నత పూర్ణత్వస్థితిని బడయగలడో శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరించుచున్నాడు.
కర్మఫలములను శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై త్యాగమొనర్చుట ద్వారా మానవుడు బ్రహ్మముయొక్క దివ్యస్థితి బడయగలడు. అదియే ఆత్మానుభవ విధానము. నిజమైన జ్ఞానపూర్ణత్వము పవిత్రమగు కృష్ణభక్తిభావనను పొందుట యందే గలదు. ఈ విషయము రాబోవు శ్లోకములందు వివరింపబడినది.
🌻276. ప్రకాశాత్మా, प्रकाशात्मा, Prakāśātmā🌻
ఓం ప్రకాశాత్మనే నమః | ॐ प्रकाशात्मने नमः | OM Prakāśātmane namaḥ
ప్రకాశాత్మా, प्रकाशात्मा, Prakāśātmā
అస్తి ప్రకాశస్వరూప ఆత్మా యస్య స కేశవః ।
ప్రకాశాత్మేతి విద్వద్భిరుచ్యతే వేదపారగైః ॥
ప్రకాశమే స్వరూపముగాయున్న ఆత్మగల కేశవుడు ప్రకాశాత్మా.
:: మహాభారతము - శాంతి పర్వము, దశాధికద్విశతతమోఽధ్యాయః ::
యథా దీపః ప్రకాశాత్మా హ్రస్వో వా యది వా మహాన్ ।
జ్ఞానాత్మానం తథా విద్యాత్ పురుషం సర్వజన్తుషు ॥ 39 ॥
ఏ విధముగా చిన్నదైననూ, పెద్దదైననూ దీపము ప్రకాశస్వరూపమైయుండునో, అదే ప్రకారమునను అన్ని ప్రాణులులోగల జీవాత్మ సైతము జ్ఞానస్వరూపమై యుండునని తెలుసుకొనవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 277/ Vishnu Sahasranama Contemplation - 277🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻277. ప్రతాపనః, प्रतापनः, Pratāpanaḥ🌻
ఓం ప్రతాపనాయ నమః | ॐ प्रतापनाय नमः | OM Pratāpanāya namaḥ
ప్రతాపనః, प्रतापनः, Pratāpanaḥ
విశ్వం ప్రతాపయతి యస్సవిత్రాది విభూతిభిః ।
స శ్రీవిష్ణుః ప్రతాపన ఇతి సంకీర్యతే బుధైః ॥
సూర్యుడూ మొదలగు తన విభూతులచేత విశ్వమును మిక్కిలిగా తపింపజేయు విష్ణువు ప్రతాపనః.
:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
లేలిహ్యసే గ్రసమానస్సమన్తాల్లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణోః ॥ 30 ॥
ఓ విష్ణుమూర్తీ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్నవాడవై ఆస్వాదించుచున్నావు. నీయొక్క భయంకరమైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి.
[05:12, 08/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 203 / Sri Lalitha Chaitanya Vijnanam - 203 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
🌻 203. 'సర్వమయీ' 🌻
సర్వమూ తానై యున్నది శ్రీదేవి అని అర్థము. పై నామమున తెలిపిన ఈశత్వము హద్దు లేనిదై సృష్టి యంతయూ వ్యాపించి యుండును. సృష్టి రూపము ఆమె రూపమే. అందలి కోటానుకోట్ల జీవుల రూపము కూడ ఆమెయే.
అందు వర్తించు పంచభూతములు ఆమెనుండి పుట్టినవే. ఆయా జీవుల స్వభావము లన్నియూ వారి యందలి త్రిగుణములు సంమిశ్రమమై యుండగ అట్టి త్రిగుణములామె నుండి పుట్టినవే. ఆ జీవుల అస్థిత్వము కూడ ఆమెయే.
ఇట్లు అంతయూ ఆమెయే అయి వుండగ అట్టి అద్భుత దర్శనము కలిగి నపుడు సర్వమయీ అను నామము సత్యమై నిలచును. ప్రత్తి ఆధారముగ అనేకానేక వస్త్రములు, దుస్తులు, ఇతర వస్తువులు ఏర్పడుచున్నవి. ఈ వివిధత్వము కలిగిన సమస్త వస్తువులకు ప్రతియే ఆధారము కదా! ప్రతియే లేనిచో దుస్తులేమియు లేవు.
ప్రత్తియే ఇట్లు రూపాంతరము చెందినది. ఇది తెలియుట సులభము కాని సత్యలోకము నుండి భూలోకము వఱకూ చైతన్యమే త్రిగుణములుగను, జీవులుగను, జీవ రూపములుగను అల్లుకొని యున్నదని తెలియుటకు శ్రద్ధ కావలెను. దర్శన మగుటకు భక్తి కావలెను. భావన చేయుటకు ఓర్పు కావలెను. స్వభావము నిర్మలము కావలెను. అపుడే సర్వమయీ తత్త్వము తెలియనగును.
భువన మంతయూ రెండు వందల ఇరువది నాలుగు (224) లోకములుగ తంత్రము తెలుపుచున్నది. దీనిని 'భువనాధ్వము' అందురు. అట్లే శబ్దము 52 అక్షరములుగను, వర్ణములుగను తెలుపబడుచున్నది. దీనిని 'అక్షరాధ్వము' అందురు. మూలవిద్య నుండి పుట్టిన ఏడు కోట్ల మహా మంత్రములు శ్రీదేవి రక్తముగ తెలుపబడినది. దీనిని 'మంత్రాధ్వము' అందురు.
ఈ మంత్రముల గుంపులను శ్రీదేవి మాంస రూపముగ తెలుపుదురు. దీనిని 'పదాధ్వము' అందురు. పంచభూతములు, పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచ ప్రాణములు, పంచాంగములు, జీవుడు, దేవతల ఉచ్చారణముగ శబ్దము నుండి ఏర్పడినవి. దీనిని 'తత్త్వాధ్వము' అందురు. ఇట్లు పంచాధ్వములుగ శ్రీదేవియే వ్యాప్తి చెంది యుండుటచేత సర్వమునూ ఆమెయే అని తెలియనగును.
సర్వమయీ అనగా ఐదు మార్గములుగ శివ స్వరూపమును తెలుపుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:23, 08/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
809వ నామ మంత్రము 08.02.2021
ఓం పరాత్పరాయై నమః
బ్రహ్మాదుల కంటెను ఉత్కృష్టురాలైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పరాత్పరా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పరాత్పరాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును. అన్నిటికన్న ప్రధానమైన కవల్యప్రాప్తికి కావలసిన ధ్యాననిమగ్నత, దీక్షాబద్ధత అనుగ్రహించును.
బ్రహ్మ, విష్ణు, రుద్రులందరూ ఉత్కృష్టులు. అనగా శ్రేష్ఠమైనవారు. వీరికంటెను జగన్మాత ఇంకను గొప్పది గనుకనే పరాత్పరా యని అనబడినది. ఇంకను చెప్పవలెనంటే బ్రహ్మయొక్క ఆయువునకు నిమేషము (రెప్పపాటు) నుండి బ్రహ్మయొక్క ఆయువు అయిన నూరుసంవత్సరముల వరకును లెక్కింపవచ్చును. కాని పరబ్రహ్మకు అటు వంటివి ఏమియులేవు. అనగా ఆద్యంతములు లేవు. పరమేశ్వరి పరంధామ స్వరూపురాలు, పరమాణు స్వరూపురాలు గనుకనే కాలపరిమాణము లెక్కలోనికిరాదు అని కాళీ పురాణములో చెప్పబడినది. బ్రహ్మదేవుని రాత్రింబవళ్ళగు ఆయువునకు పరము అని పేరు. అనగా సగము అనగా పరార్ధము. పరమేశ్వరుడు స్థూలములన్నిటికంటె స్థూలము, సూక్ష్మము లన్నిటికంటె సూక్ష్మము అగుటచే పగలు,రాత్రి, అనియు, సంవత్సరము అనియు కాలపరిమాణములులేవు. ఆవిధంగా పరమేశ్వరి పరమునకే పరమై పరాత్పరా యని అనబడినది.
ఇంద్రియములకన్నను మనస్సు శ్రేష్ఠమైనది, మనస్సు కన్నను బుద్ధి శ్రేష్ఠమైనది, బుద్ధి కన్నను మహత్తు శ్రేష్ఠమైనది, మహత్తు కన్నను అవ్యక్తము శ్రేష్ఠమైనది, అవ్యక్తము కన్నను పరబ్రహ్మము శ్రేష్ఠమైనది. పరబ్రహ్మము కన్నను శ్రేష్ఠమైనది లేదు గనుక పరమేశ్వరి పరాత్పరా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం పరాత్పరాయై నమః అని యనవలెను.
శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
235వ నామ మంత్రము 08.02.2021
ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః
అరువది నాలుగు ఉపచారములతో ఆరాధింపబడు అఖిలాండేశ్వరియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి చతుష్షష్ట్యుపచారాఢ్యా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చతుష్షష్ట్యుపచారాఢ్యాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ శ్రీమాతను అరువది నాలుగు ఉపచారములతో అత్యంత భక్తి శ్రద్ధలతోఉపాసించు సాధకులకు ఆ అమ్మ సర్వాభీష్టసిద్ధిని కలుగజేయుటయేగాక, జన్మజన్మలనుండి సంచితమైన కర్మఫలముల దుష్ప్రభావం శాంతించును, కైవల్యమునకు మార్గము సుగమమవును.
సాధారణంగా షోడశోపచారములతో భగవంతుని ఆరాధిస్తాము. పరమేశ్వరి శ్రేష్ఠమైన దేవత గనుక అరువదినాలుగు ఉపచారములతో ఆరాధించడం జరుగుతుంది.
1. ధ్యానము, 2. ఆవాహనము, 3. సింహాసనము, 4. అర్ఘ్యము, 5. పాద్యము, 6. ఆచమనీయము, 7. మధుపర్కము, 8. పునరాచమనీయము, 9. ఆభరణారోపణము, 10. అభ్యంగవస్త్రపరిధానము, 11. అభ్యంగ పీఠోపవేశనము, 12. తైలాభ్యంజనము, 13. ఉష్ణోదక స్నానము, 14. పంచామృత స్నానము, 15. ఉద్వర్తనము, 16. దేవీసూక్తపఠన పూర్వక సకల తీర్థాభిషేచనము, 17. ఆలేపన పీఠోపవేశనము, 18. అరుణ దుకూల పరిమార్జనము, 19. రక్తోత్తరీయము, 20. అధోవస్త్రము, 21. కంచుకధారణము, 22. కేశధూపము, 23. గంధానులేపనము, 24. కాటుక, 25. ఆభరణ పీఠోపవేశనము, 26. మణిమకుటము, 27. చంద్రశకలము, 28. సిందూరతిలకము, 29. నాసాభరణము, 30. పాళీయుగము, 31. మణికుండలయుగము, 32. తాటంకయుగము, 33. కనక చింతాకము, 34. మంగళసూత్రము, 35. గ్రైవేయము, 36. తారావళి, 37. ఏకావళి, 38. కటిసూత్రము, 39. కేయూరయుగళ చతుష్టయము, 40. వలయావళి, 41. ఊర్మికావళి, 42. సౌభాగ్యాభరణము, 43. పాదకటకము, 44. నూపురయుగళము, 45. పాదాంగుళీయకము, 46. కరాంగుళీయకము, 47. ఒకచేతి పాశము, 48. అంకుశము, 49. పుండ్రేక్షుపాశము, 50. పుష్పబాణము, 51. పాదుకలు, 52. చక్రాధిరోహణము, 53. తీర్థపూర్ణ కలశము, 54. గంధము, 55. పుష్పపూజ, 56. ధూపము, 57. దీపము, 58. నైవేద్యము, 59. తాంబూలము, 60. నీరాజనము, 61. దర్పణదర్శనము, 62. ఛత్రసీమ, 63. చామరసీమ, 64. తాళవృంతసేవ (విసనకర్ర)
ఈ ఉపచారములు సాంప్రదాయాన్ననుసరించి మారుతూ ఉంటాయి.
పరశురామునిచే కల్పసూత్రమునందు ఈ అరువది నాలుగు ఉపచారములు చెప్పబడినవి. ఇవిగాక ఇంకను ఇతర తంత్రములందు ఎనిమిది ఉపచారములు చెప్పబడినవి. అవి:
1. శివపాదమందలి పుష్పములను ధరించుట, 2. దేవతాస్వరూపమును ఆత్మయందు ఆరోపించుకొనుట, 3. పరివార దేవతలకు ఉద్వాసన చెప్పుట, 4. గురువులను, భక్తులను అర్చించుట, 5. శైవ పుస్తకములను పూజించుట, 6. శైవాగ్నియందు దేవతలను గూర్చి హోమము చేయుట, 7. శివపాదతీర్థమును స్వీకరించుట, 8. సాంగముగా ప్రాణాగ్నిహోత్రము చేయుట.
గృహమునకు వచ్చిన అతిథికి ఇంట్లోకి రమ్మనమని సాదరంగా లోనికి పిలుపు (ఆవాహన) కాళ్ళుకడుగుకోవడానికి నీళ్ళు
కాశీ విశ్వనాథుని - దివ్యదర్శనము 🚩🕉️🙏
( జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం ) కాశీ " శివుడుకి ఇష్టమైన ప్రదేశం శివుడు నిర్మించిన మొదటి నగరం.
#కాశీ విశ్వనాథుని దివ్యదర్శనము 🚩🛕🌾🌼🌿🌺🪴🎋🌸
ఓంకారేశ్వర్ - జ్యోతిర్లింగ దివ్యదర్శనము 🚩🛕🎋🌻🌸🪴🌺🌿🌾🌾🌷🌼🚩
మహాకాళేశ్వర్ - జ్యోతిర్లింగం, దివ్యదర్శనము🚩🛕🎋🌻🌷🪴🌹🌼🌸🌾🌿🫐🌺
సోమనాథ్ - జ్యోతిర్లింగం, దివ్యదర్శనము 🚩🛕🎋🌻🪴🌺🌿🫐🌾🌼🌹🌷🚩
నాగేశ్వర - జ్యోతిర్లింగం, దివ్యదర్శనము 🚩🛕🌿🌾🌸🌼🪴🌹🌷🌻🎋
101.. శ్రీ ఆదిశంకరాచార్య కృతం వేదసార శివస్తోత్రమ్
1) పశూనాం పతిం పాపనాశం పరేశం గజేన్ద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ ।
జటాజూటమధ్యే స్ఫురద్గాఙ్గవారిం మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ ॥
సమస్త ప్రాణులకూ ప్రభువు, పాపనాశకుడు, పరమేశ్వరుడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, ప్రార్ధించదగినవాడు, జటాజూటమునందు గంగనుమోయుచున్నవాడు, మన్మథుని సంహరించినవాడు అగు మహాదేవుని ఒక్కనినే స్మరించుచున్నాను.
2) మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యఙ్గభూషమ్ ।
విరూపాక్షమిన్ద్వర్కవహ్నిత్రినేత్రం సదానన్దమీడే ప్రభుం పఞ్చవక్త్రమ్ ॥
మహేశ్వరుడు, దేవతలను కూడా శాసించువాడు, రాక్షసులను సంహరించువాడు, అంతటా వ్యాపించినవాడు, ప్రపంచమును పాలించువాడు, విభూతితో దేహమునలంకరించుకున్నవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని అను మూడు నేత్రములు కలవాడు, సదానందరూపుడు, పంచముఖములున్నవాడు అగు పరమశివుని స్తుతించుచున్నాను.
3) గిరీశం గణేశం గలే నీలవర్ణం గవేన్ద్రాధిరూఢం గుణాతీతరూపమ్ ।
భవం భాస్వరం భస్మనా భూషితాఙ్గం భవానీకళత్రం భజే పఞ్చవక్త్రమ్ ॥
కైలాసముపైనున్నవాడు, ప్రమథ్గణములకధిపతి, కంఠమునందు నీలవర్ణమున్నవాడు, నందివాహనుడు, సత్వరజస్తమోగుణములకతీతుడు, ప్రకాశించువాడు, భస్మచే అలంకరించబడిన శరీరము కలవాడు, భవానీపతి, పంచముఖుడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
4) శివాకాన్త శమ్భో శశాఙ్కార్ధమౌలే మహేశాన శూలిఞ్జటాజూటధారిన్ ।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప ॥
ఓ పార్వతీపతీ! శంభో! చంద్రమౌళీ! మహేశ్వరా! శూలమును ధరించినవాడా! జటాజూటమున్నవాడా! నీవొక్కడివే ప్రపంచమంతా వ్యాపించిన విశ్వరూపుడవు. ఓ ప్రభూ! పరిపూర్ణరూపుడా! ప్రసన్నుడవగుము.
5) పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోఙ్కారవేద్యమ్ ।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ ॥
పరమాత్మ, ఒక్కడు, ప్రపంచము ఏర్పడుటకు మూలకారణుడు, కోరికలు లేనివాడు, ఆకారములేనివాడు, ఓంకారముచే తెలియబడువాడు, ప్రపంచము యొక్క సృష్టి,స్థితి,లయలకు ఆధారమైనవాడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
6) న భూమిర్నం చాపో న వహ్నిర్న వాయు ర్న చాకాశమాస్తే న తన్ద్రా న నిద్రా ।
న చోష్ణం న శీతం న దేశో న వేషో న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే ॥
భూమి - నీరు - నిప్పు - గాలి - ఆకాశము కానివాడు, ఆలస్యము - నిద్ర - వేడి - చలి -దేశము - వేషము లేనివాడు, ఆకారము లేనివాడైనా త్రిమూర్తి స్వరూపుడు అగు పరమేశ్వరుని స్తుతించుచున్నాను.
7) అజం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానామ్ ।
తురీయం తమఃపారమాద్యన్తహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ ॥
పుట్టుకలేనివాడు, శాశ్వతుడు, కారణములకే కారణమైనవాడు, శుభకరుడు, కైవల్యస్వరూపుడు, ప్రకాశించు సూర్యుడు, చంద్రుడు మొదలగు వారిని కూడా ప్రకాశింప చేయువాడు, సత్త్వరజస్తమో గుణములకు అతీతుడుగా నాలుగవ స్వరూపుడు, అజ్ఞానాంధ కారమునకు అవతలనున్నవాడు, ఆది అంతము లేనివాడు, పరమపవిత్రుడు, భేదములేనివాడు అగు పరమేశ్వరుని శరణుపొందుచుచున్నాను.
8) నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానన్దమూర్తే ।
నమస్తే నమస్తే తపోయోగగమ్య నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య ॥
అంతటా వ్యాపించి ఉన్నవాడా! విశ్వస్వరూపుడా! చిదానందాకారుడా! తపస్సు యోగములద్వారా పొందదగినవాడా! వేదవిజ్ఞానముచే తెలుసుకొనదగినవాడా! నీకు నమస్కారము.
9) ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శమ్భో మహేశ త్రినేత్ర ।
శివాకాన్త శాన్త స్మరారే పురారే త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః ॥
ప్రభూ! శూలపాణీ! అంతటా వ్యాపించినవాడా! విశ్వనాథా! మహాదేవా! శంభో! మహేశా! ముక్కంటీ! పార్వతీవల్లభా! శాంతస్వరూపుడా! మన్మథుని జయించినవాడా! త్రిపురాసురుని సంహరించినవాడా! నీకంటే వేరొకడు ప్రార్ధించదగినవాడు, లెక్కించదగినవాడు లేడు.
10) శమ్భో మహేశ కరుణామయ శూలపాణే గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ ।
కాశీపతే కరుణయా జగదేతదేక స్త్వంహంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి ॥
శంభో! మహేశా! కరుణామయుడా! శూలపాణీ! గౌరీపతీ! పశుపతీ! ప్రాణులబంధములను పోగొట్టువాడా! కాశీపతీ! నీవొక్కడివే కరుణతో ఈ ప్రపంచమును నాశనము చేయుచున్నావు, పాలించుచున్నావు, సృష్టించుచున్నావు, నీవు మహేశ్వరుడవు.
11) త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ లిఙ్గాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ ॥
ఓ దేవా! శంకరా! మన్మథుని జయించినవాడా! నీ నుండే ప్రపంచము పుట్టుచున్నది. ఓ సుఖదాతా! విశ్వనాథా! నీ యందే ప్రపంచము నిలుచుచున్నది. ఓ ఈశ్వరా! హరా! ప్రపంచస్వరూపుడా! లింగరూపుడవైన నీయందే ఈ ప్రపంచము లీనమగుచున్నది.
|| ఇతి శ్రీ శంకరాచార్య కృతం వేదసారశివస్తోత్రం సమ్పూర్ణమ్ ||
***
Comments
Post a Comment