***
*మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్యకాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.*
*శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం*
*1) శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥*
*భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప॥*
*కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*2) బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥*
*భక్తార్తి భంజన దయాకర రామదాస॥*
*సంసార ఘోర గహనే చరతోజితారే:॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*3)సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥*
*సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూర్తే॥*
*ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*4) సంసార ఘోర విష సర్ప భయోగ్ర దంష్ట్ర॥*
*భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ॥*
*ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*5)సంసార కూప మతిమజ్జన మొహితస్య॥*
*భుజానిఖేద పరిహార పరావదార ॥*
*లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*6) ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥*
*ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ॥*
*వరాహ రామ నరసింహ శివాది రూప ॥*
*శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!*
*7) ఆoజనేయ విభవే కరుణా కరాయ॥*
*పాప త్రయోప శయనాయ భవోషధాయ॥*
*త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥*
*కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే!!*
🕉🌞🌏🌙🌟🚩
*(-Sri Paramahansa యోగనంద / శ్రీ పరమహంస యోగానంద)*
🕉️🌞🌏🌙🌟🚩
[18/08, 13:57] +91 92915 82862: *331) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
యదభావి న తద్భావి భావి చేన్న తదన్యథా ౹
ఇతి చిన్తావిషఘ్నో ఽ యం బౌధో భ్రమ నివర్తకః
౹౹ 168 ౹౹
సమే ఽ పి భోగే వ్యసనం భ్రాన్తో గచ్ఛేన్న బుద్ధవాన్ ౹
అశక్యార్థస్య సంకల్పా ద్ర్భాంతస్య వ్యసనం బహు
౹౹169౹౹
సాధ్యముకాని విషయములను సంకల్పించుట చేత భ్రాంతికి వ్యసనము మెండు.కానిది కానేకాదు.కానున్నది ఆగదు.
మాయామయత్వం భోగస్య బుద్ధ్వాఽ ఽ స్థాముపసంహరన్౹
భుంఞ్జానో ఽ పి న సంకల్పం కురుతే వ్యసనం కుతః
౹౹170౹౹
సంకల్పమనేది లేనపుడు వ్యసనమనేది ఎట్లా కలుగుతుంది ?
వ్యాఖ్య :-
భ్రమలకు పరిహారమేంటట ?
యదార్థముగా జీవాత్మ నిజస్వరూపము
"అద్వైత బ్రహ్మమే".
ఇదే అతని
"అభయ స్వరూపము".
కానీ , నీళ్ళల్లో బట్టలుతికే చాకలి దాహానికి చచ్చాడట.
అట్లే , నాకు శుభం ఎన్నడు జరుగుతుంది ?
నా అనిష్టాలన్నీ ఎప్పుడు నివృత్తమౌతాయి ? అనేటటువంటి చింతయే అట్లా ఆలోచించే వానిని విషంలాగా
మింగేస్తుంది.ఈ భ్రమను జ్ఞానం మాత్రమే పోగొట్ట గలుగుతుంది.
శరీరము నేను అన్నదే అతి పెద్ద భ్రమ అందులో జీవిస్తున్నంతకాలమూ సౌక్యమునకు ఆటంకము వచ్చిన దుఃఖము కలుగును. శరీరము వదిలి పెట్టడమనేదే అతిపెద్ద బాధ.
శరీరము ఒకప్పుడు లేదు, కొంతకాలము ఉంటుంది, తరువాత లేకుండా పోతుంది.
దానివలన ఈ అనంతసృష్టిలో ఏ మార్పు వచ్చింది?
కుండను తయారుచేసి అవసరమైనంతకూ ఉపయోగించాము,తరువాత
పగిలిపోయింది.పడేసిన తరువాత ఆ తయారైన మట్టిలోనే కలిసిపోయింది. అంతేకదా?
జరగవలసినది జరగకుండా ఎన్నడూ ఆగదు,జరగరానిది ఎన్నడూ జరగదు అనే ఈ విధమైన జ్ఞానం వలన మాత్రమే చింతారూపమైన విషం వినష్టమౌతుంది.
ప్రారబ్దానుసారం జ్ఞానికి,అజ్ఞానికి
కర్మఫల భోగము,అనుభవము సమానమే అయినప్పటికీ, భ్రాంతుడు అశక్యమైన - సాధ్యముకాని పదార్థాల్ని పొందాలనే కోరికవల్ల -విషయములను సంకల్పించుట వలనను ,
వ్యసనం(కష్టాలు,ఆపదలు)లో
చిక్కుకుంటాడు.జ్ఞానవంతుడు అట్టి వ్యసనాన్ని పొందడు.
వివేకవంతముడైన జ్ఞానికి విషయభోగములు మిథ్యయని తెలియును.
మాయతో కూడిన భోగాలయొక్క స్వరూపాన్ని తెలుసుకొని భోగాలు మాయ అని గుర్తించి - వాటి యెడల ఆసక్తి తలెత్తనీయడు.
భోగాలను అనుభవించుచున్నను
అవి కావలెనని,చిరకాలము కొనసాగవలెనని సంకల్పింపక,
త్యాగభావంతో వాటిని అనుభవించును.
ఆ భోగాల యెడల అతనికి సంకల్పం ఉండదు. మనస్సునందు తలచుట ఉండదు.
సంకల్పమనేదే లేనపుడు వ్యసనమనేది
(కష్టాలు,ఆపదలు) ఎట్లా కలుగుతుంది ?
ఇక అతనికి దుఃఖ మెక్కడిది ?
లేదని భావము.
🕉️🌞🌏🌙🌟🚩
[18/08, 13:57] +91 92915 82862: *శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
1.సుగ్రీవ నారసింహ సులభుడ వందరికి | అగ్రేసరుడ నీవు అవధారు దేవ ||
2.సనకాదులొకవంక జయవెట్టుచున్నారు | ఎనసి సురలు చేతులెత్తి మొక్కేరు |
మును లిరుమేలనుండి మునుకొని నుతించేరు | అనుపమాలంకార అవధారు దేవ ||
3.గంగాది నదులెల్ల కడిగి నీపాదములు | పొంగుచు సప్తర్షులు పూజించేరు | సంగతి వాయుదేవుడు సరి నాలవట్టమిడీ | అంగజ కోటిరూప అవధారు దేవ ||
4.పరగ నారదాదులు పాడేరు నీచరిత | పరమ యోగీంద్రులు భావించేరు | సిరులు మించినయట్టి శ్రీవేంకటాద్రిమీద | అరుదుగ నున్నాడవు అవధారు దేవ ||
🕉️🌞🌏🌙🌟🚩
[18/08, 13:57] +91 92915 82862: *105- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)*
🕉🌞🌎🌙🌟🚩
105) శ్లోకము:-
వలక్షవక్షోజ పటాంచలేన
చలేనసార్ధం కృతకేలయోనః !
పురత్రయారాతికలత్రహాస
భాసోనిరాసం విపదాంక్రియాసుః !!
భావము:-
ఉమాదేవి శివునితో పరిహాసము చేయునపుడు,
ఆమె ఎడమ వక్షోజము పైనున్న
తెల్లని పట్టువస్త్రము జారిపడుచుండగా,
సిగ్గు తొణికొసలాడు
ఆమె మందహాసపు కాంతులు
మా ఆపదలన్ని మాపు గాక.
🕉🌞🌎🌙🌟🚩
[18/08, 13:58] +91 92915 82862: *🧘♂️105) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*ముముక్షు ప్రకరణము / మూడవ అధ్యాయము / మోక్షసాధనము*
3-53
వరం శరావహస్తస్య చాండాలాగారవీధిషు భిక్షార్థమటనం రామ న మౌర్ఖ్యహత జీవితమ్.
ఓ రామచంద్రా! చేత మూకుడు గైకొని చండాలుర వీధులందు బిచ్చ మెత్తుటయు మేలు! కాని అజ్ఞానముచే వినష్టమగు జీవితము మాత్రము ఉత్తమము కాదు.
3-54
వరం ఘోరాన్ధకూపేషు కోటరేష్వేవ భూరుహామ్ అన్ధకీటత్వమేకాన్తే న మౌర్ఖ్యమతిదుఃఖదమ్.
ఏకాంతమున భయంకర, అంధకారయుక్తములగు నూతులందు గాని, చెట్ల తొఱ్ఱలందుగాని, గ్రుడ్డి పురుగై యుండుట మేలు; కాని మహాదుఃఖప్రదమైనట్టి అజ్ఞానము కలిగియుండుట మాత్రము ఉత్తమము కాదు.
3-55
సంసారదుఃఖ మోక్షార్థం మాదృశైః సహ బన్ధుభిః స్వరూపమాత్మనో జ్ఞాత్వా గురుశాస్త్రప్రమాణతః
3-56
జీవన్ముక్తాశ్చరన్తీహ యథా హరిహరాదయః
యథా బ్రహ్మర్ష యశ్చాన్యే తథా విహర రాఘవ.
ఓ రామచంద్రా! సంసారదుఃఖ విమోచనము కొరకై మావంటి బంధువుల వలనను, గురుశాస్త్ర ప్రమాణముల వలనను, ఆత్మస్వరూపమును నీవెఱిఁగి జీవన్ముక్తులగు విష్ణు, శివాదులున్ను, తదితర బ్రహ్మర్షులున్ను ఈ ప్రపంచమున నెట్లు విహరించుచున్నారో, అట్లు (జీవన్ముక్తుఁడవై) విహరింపుము.
🕉️🌞🌏🌙🌟🚩
*🧘♂️జ్ఞానిసన్నిధి🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
దేవుడు నిద్ర నుండి లేపితేనే.. . మేలుకునే మనం!
దేవుణ్ణి నిద్ర లేపడనికి సుప్రభాతం పాడుతున్నాము.
ఇది విచిత్రంగా లేదూ !...
🌳🧘♀️🌳🧘♂️🌳
'ఇచ్చట నీడ దొరకబడును' అని ఏ చెట్టూ బోర్డ్ వేసుకోదు.
ఎండనబడి వచ్చినవాడు ఎవడైనా నీడను చేరి సేద తీరుతాడు.
అలాంటిదే జ్ఞాని సన్నిధి కూడా.
*ఏ వ్యక్తి గుణదోషాలనుగాని అతడి చర్యల స్వరూపాన్నిబట్టి నిర్ణయించకూడదు. ఏ దృష్టితో, ఏ విధంగా అతడు తన కర్మలను నిర్వర్తిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చును.*
*మంచిని చెయ్యడానికి మనం ఒక్కొక్కసారి బాధను అనుభవించాలి. ప్రభు దర్శనం కోసం బాధననుభవించడానికి మనం సిధ్ధపడి ఉండాలి. నిత్యమైన ఆత్మ సౌఖ్యం పొందడానికి శారీరక అసౌకర్యాన్ని , మానసిక క్రమ శిక్షణను భరించ వలసి వస్తే మాత్రం ఏమి?*
*దైవం యందలి ఆనందం ఎంత గొప్పదంటే ఆయన దేవుని కోసం తన శరీరాన్ని త్యాగం చెయ్యడానికి ఇష్టపడ్డాడు. జీవితం యొక్క లక్ష్యం అద్భుతానందం సాధించడమే -- అదే ఈశ్వరప్రాప్తి.*
[17/08, 14:56] +91 92915 82862: _*సత్యదర్శనం -(93)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"సాధనకు సోపానంగా !"*_
_*{రెండో భాగం}*_
_*నేనెవరు ! [సత్యానుభవం]*_
_*2. త్రిగుణాలు [సత్వగుణం-3] :*_
_*శ్రీరమణమహర్షి అద్భుతమైన ఒకగొప్ప విషయం చెప్పారు. మన మనసుకేకాదు కాలంలో కూడా త్రిగుణాలు ఉంటాయి. పగటిపూట కొంతసేపు రజోగుణంతో కార్యోముఖమై ఉంటుంది. అందులోనే మనసంతా కోపంగా, చికాకుగా, తొందరగా ఉంటుంది. మరికొంతసేపు మనసు శాంతిగా సత్వగుణంలో ఉంటుంది. అప్పుడు అన్నీ సరిగా అర్ధమై సానుకూలంగా అనిపిస్తాయి. మత్తులోకి జార్చే తమోగుణంతో మనసు బద్ధకంగా ఉంటుంది. సంశయాలు, ఆక్షేపణలు, అపార్ధాలతో మనసు అశాంతిగా ఉంటుంది. ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో అనుభవంలోకివచ్చి ఉండవచ్చు. కానీ వేకువకు ముందుండే బ్రహ్మీముహూర్తంలో అందరికీ మనసు సత్వంలో ఉంటుంది !*_
*_"సచ్చిదానంద రూపము"_*
*_30వ అధ్యాయము_*
*_మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే... బ్రహ్మమే అవుతాము !!_*
*_ఎప్పటికీ తుదిలేని మన అనంతస్వరూపమే మన అవ్యయస్థితిని తెలుపుతుంది. బ్రహ్మము ఎలా ఉంటుందంటే నిర్మలంగా, విమలంగా, కల్మష రహితంగా ఉంటుంది. మనంకూడా నిత్యజీవితంలో కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటే, మనో దేహాలను విమలంగా ఉంచుకుంటే ఆ బ్రహ్మమే అవుతాము. నిర్మలమైన ఆ బ్రహ్మ వస్తువు సదా ఆద్యంతాలు లేనిది. అందుకే జ్ఞాని ఎప్పుడూ బ్రహ్మపదార్థంగానే మనగలుగుతుంటారు. సర్వము నిండిన బ్రహ్మం నిరంతరమైన బ్రహ్మముగా తెలుస్తుంది. 'సత్'గా ఉండి 'చిత్'గా ప్రకాశిస్తూ వ్యక్తమయ్యేదంతా మన జ్ఞానానికి దైవం కల్పించిన అవకాశమే. అదే దాని చిదానందము... సచ్చిదానందము !_*
🕉️🌞🌏🌙🌟🚩
[17/08, 14:56] +91 92915 82862: *🧘♂️నిష్కామకర్మ🧘♀️*
*ఏమిటీ నిష్కామకర్మ:- సముద్రములోని అలలకు, బ్రహ్మముకు సంబంధం ఇదే!*
ఎప్పుడైతే నిష్కామ కర్మకి అవకాశం లేదో, అప్పుడు తనలోపలికి తాను ముడుచుకుంటాడన్నమాట! తన యందు తాను రమిస్తూ వుంటాడు. తన యందే తాను స్థిరమై ఉంటాడన్నమాట! అలా లోపలికి ముడుచుకోవడం చేతనైనటువంటి వాడు అన్నమాట. దీనిని ఏమన్నారు అంటే? ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఈ బుద్ధి గుహయందు సర్వేంద్రియములను నిక్షిప్తం చేయడం ఏదైతే ఉన్నదో, దానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. అంతేకానీ, బహిర్ వ్యాపారంలో ఒకచోట చేయుట, ఒక చోట చేయకుండుట కర్మ వ్యాపారంతో ఇంద్రియ నిగ్రహం బోధించబడుట లేదు.
ఇంద్రియములు వ్యవహరించినను, వ్యవహరించకున్ననూ, తాను వ్యవహరించుట లేదు. తాను సదా ఈ ఆంతరిక యజ్ఞమునందు నిమగ్నుడై, ఆత్మానందమగ్నుడై ఉన్నాడు. కాబట్టి సామాన్య వ్యవహారం ఏదైతే ఉన్నదో, అట్టి సామాన్య వ్యవహారమునకు సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, శరీరాది జరామరణాది వార్థక్యరూప జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు జ్ఞాని అని పిలువబడుతున్నాడు.
జ్ఞాని అంటే అర్థం ఏమిటంటే?
‘జ్ఞాని' అంటే అర్థం ఏమిటంటే "ఎవరైతే ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేసి, ఈ ఆత్మానంద భావమునందుకున్నారో, వాళ్ళందరూ జ్ఞానులు" కాబట్టి, వీళ్ళు మాత్రమే ఇలా ఈ క్రమంలో వెళ్ళేటటువంటి అంతర్ముఖులైనటువంటి, వారు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అంతేకాని, విషయవ్యావృత్తి కలిగినటువంటి, విషయావృత్తం అయినటువంటి, విషయముల యందు రమించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మను తెలియలేరు. ఎప్పటికీ తెలియలేరు. వారు ఆత్మను తెలుసుకోలేరు
జిలేబీ బాగుందా? పులిహోరా బాగుందా? దద్దోజనం బాగుందా? పచ్చిమిరపాకాయ బజ్జీ బాగుందా? ఆవకాయ బాగుందా? మాగాయి బాగుందా? అని పదార్థముల వెంటపడి వెళ్ళేవారు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల యందు మనస్సు లగ్నం చేసేవారు కానీ, కర్మల యందు ఫలాపేక్ష చేత, రమించేటటువంటి వారు కానీ, ఈ ఆత్మను తెలుసుకొన లేరు.
అనగా ప్రవృత్తి మార్గంలో వున్నటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. జనన మరణ మృత్యురూప భయమును పొందేటటువంటి వారు ఎప్పటికీ ఈ ఆత్మను తెలియలేరు. శబ్ద గ్రాహ్యత యందు కానీ, స్పర్శ గ్రాహ్యత యందు కానీ, రూప గ్రాహ్యత యందు కానీ, రస గ్రాహ్యత యందు గానీ, గంథ గ్రాహ్యత యందు గానీ బుద్ధిని రమింప చేసేటటువంటి వారు, బుద్ధిని బహిర్ముఖముగా వ్యవహరింప చేసేటటువంటి వారు, ఈ ఆత్మను తెలియజాలరు. కాబట్టి బుద్ధిని ఒకదానిని బుద్ధి ఇంద్రియములకు రాజు వంటిది. దానిని వేరు చేయాలి.
అలాంటి వారు ఆత్మానందస్థితిలో ఉంటారు
ఇంద్రియముల నుంచీ వేరుచేయాలి. ఇంద్రియముల యందు రమించి తాను పొందే సుఖము నుంచీ వేరు చేయాలి. ఇంద్రియములు ఇచ్చే సంవేదనల ద్వారా తాను పొందే దుఃఖము నుంచీ బుద్ధిని వేరుచేయాలి. వేరు చేసి, తాను తానుగా ఉండగలిగేటటువంటి, వ్యవహరించ గలిగేటటువంటి స్థితిని బుద్ధికి కల్పించాలి.
అటువంటి విరమణ అనేటటువంటి యజ్ఞాన్ని, విరమణ అనేటటువంటి క్రతువును, విరమణ అనేటటువంటి అంతర్ముఖత్వాన్ని ఎవరైతే చేస్తాడో, ఈ నిరసించేటటువంటి విధానంలో ఎవరైతే తన యొక్క ప్రయాణాన్ని పూర్తి చేస్తాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలబడి ఉంటాడో, తానైనటువంటి స్థితిలో తాను నిలకడ చెంది ఉంటాడో, ఆచలుడై ఉంటాడో, అంతర్ముఖుడై ఉంటాడో, సర్వవ్యాపియై ఉంటాడో, ఫలాపేక్ష రహితముగా వుంటాడో, సంగత్వ రహితంగా ఉంటాడో, అటువంటి వారు మాత్రమే ఆత్మానంద స్థితిలో ఉంటారని స్పష్టముగా చెపుతున్నారు.
ఆత్మకు శరీరం లేదు
ఈ ఆత్మ శరీరము లేనివాడు కనుక అశరీరయనబడును శరీరములు అనిత్యంలు జీర్ణించి పోవునవి. ఆత్మ నిత్యుడు, సర్వవ్యాపకుడును అచలుడునై అంతటా ఎల్లప్పుడూ ఉండును. అందుచేత అనిత్యములైన శరీరములందు నిత్యుడై యుండును. అట్టి గొప్పవాడును, సర్వ వ్యాప్తియునగు ఆత్మను ధ్యానాదులు మూలమున తెలిసికొనిన జ్ఞాని శోకింపడు.
ఇంకా ఆత్మ యొక్క లక్షణాలను విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషం గా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరం లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. కుండకు లోపల బయటా ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఆత్మ ఈ శరీరమునకు లోపల, బయటా అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఏ రకమైన శరీరమూ లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థమేమిటి? ‘శీర్యతే ఇతి శరీరః' - అంటే, తనకు తానుగా నశించిపోవునది ఏదో, అదే శరీరము. తనకు తా పుట్టినది, తనకు తాను నశించిపోవునది.
అనగా అర్థమేమిటంటే, సముద్రపు అలల మీద నురుగు వస్తుంది, ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి వుంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంత సేపు ఉంటుంది? ఎంత సేపటికి పోతుంది? అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపలా ఉన్నది, గాలి బయటా ఉన్నది. కానీ సముద్రము లేదా ఆ బుడగలో..? ఆ నీళ్ళు లేవా? వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోచుచున్నది. ఆ గాలి బుడగ బ్రద్దలైంది. బ్రద్దలైతే ఏమైంది? ఆ గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీటిలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటివరకూ ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలిలో పుట్టిందో, ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో, ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో, ఆ పంచభూతాలలోకే పోయింది.
ఈ జీవితం గాలిబుడగతో సమానం
ఇట్లా క్షణ భంగురమైనటువంటి శరీరము అనంతముగా వ్యాపించి యున్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు, ఒక మానవుడు పుట్టి, జీవించి, పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది. దానికి ఎంత విలువ వుందో, దీనికి అంతే విలువ ఉంది.
కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది. అనంత విశ్వ వ్యాపకమైనటువంటిది. బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు. జీర్ణించి పోవునవి. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ‘ఉండుట' అనేటటువంటి లక్షణం కలిగియున్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగియున్నది. సర్వ వ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే, దీనికి కంటే అవతల ఎల్లలు లేవు ఇక. ఎంతమేరకు చెబితే అంతమేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపకధర్మమును కలిగి వున్నది. అచలుడు - అంతగా వ్యాపించి ఉండటం చేత, కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకూ వ్యాపించడం చేత అది (ఆత్మ) కదలికే లేకుండా ఉంది. ఇది అచలము. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది. ‘ఉండుట' అన్నది మాత్రమే కలిగియున్నది. అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరము అనిత్యమే కానీ, ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరము - అనునది ఉన్నట్లుగా తోచినప్పటికి, అది ఆత్మ అనే దానియందు అంశీభూతమై యున్నది.
సముద్రపు అలలు - బ్రహ్మమునందు జీవులు
అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే, అఖండముగా వ్యాపించియున్నటువంటి బ్రహ్మము నందు అనేక జీవులు, ఈ అలలవలె, నురుగు వలె, బుడగల వలె ఉత్పన్నమౌతున్నవి. అయినచొ అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మము మాత్రమే. ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపి అగు ఆత్మ, ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోక రహితమైన స్థితిని.. ఋషులు, మునులు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే!
🕉️🌞🌏🌙🌟🚩
[17/08, 14:56] +91 92915 82862: *330) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*
దగ్ధబీజమరోహే ఽ పి భక్షణాయోపయుజ్యతే ౹
విద్వదిచ్ఛాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు ౹౹165౹౹
వేయించిన గింజలు కూడా తినడానికి ఉపయోగపడును, జ్ఞాని వలే.
ఎక్కువ తినడం వల్ల అజీర్తి చేయును. ఏది అతిగా చేస్తే వ్యసనం క్రింద మారును.
భోగేన చరితార్థత్వాత్ర్పరబ్ధం కర్మహీయతే ౹
భోక్తవ్యసత్యతా భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే
౹౹ 166 ౹౹
మా వినశ్యత్వయం భోగో వర్థతా ముత్తరోత్తరమ్ ౹
మా విఘ్నాః ప్రతిబధ్నన్తు ధన్యోఽ స్మ్యస్మాదితి భ్రమః
౹౹167౹౹
అనుభవమే ఉద్దేశమగుటచే, భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.భోగములు వర్ధిల్లుగాక.నేను ధన్యుడనగుదును ఇట్టిదే భ్రమ.
వ్యాఖ్య :- విద్వాంసుని ఇచ్ఛకు భోగరూపం ఉండదా? అంటే -
విషయములు మిథ్య అన్న జ్ఞానముండుటచే,
వేయించబడిన బీజం(గింజలు) అంకురించే శక్తిని కోల్పోయినను - అంకురోత్పాదనకు పనికి రాకపోయినను తినటానికి పనికివస్తుంది. అట్లాగే,విద్వాంసుని ఇచ్ఛ అల్పభోగము నిచ్చును. గొప్ప దుఃఖమును అవి కల్పింపలేవు. అనేకమైన వ్యసనాదుల్ని పుట్టించలేదు. విపత్తుల్ని,కష్టాలని కలిగించలేదు. కర్మయే వ్యసనాన్ని కూడా పుట్టిస్తుంది గదా ! అంటే - అనుభవములు సత్యములను భ్రాంతి వలన వానిచే దుఃఖము కలుగును.అనుభవమే ఉద్దేశమైతే,ప్రారబ్ధము అనుభవింపబడిన తీరిపోవును.
ప్రారబ్ధమనేది భోగాన్ని (అనుభవాన్ని)యిచ్చి చరితార్థమైనందున వినష్టమైపోతుంది.అది వ్యసనాన్ని కలిగించలేదు. కాని,భోక్తవ్య పదార్థాలు సత్యము అనే భ్రమయే వ్యసనం పుట్టటానికి కారణమౌతోంది.అంతే తప్ప వ్యసనాదులకు కర్మ కారణం కావటం లేదు.
వ్యసనానికి హేతువైన భ్రమ తెలుసుకుందాం -
భ్రమ వలననే దుఃఖము,లోలుపత,దర్పము మొదలగునవి కలిగి ఇతరులకు దుఃఖము కలిగించును.
"ఈ భోగాలు ఎన్నడూ నష్టం కాకూడదు - ఈ భోగము నశింపకుండుగాక ", "ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉండాలి - ఇక మీద కూడా అది వర్ధిల్లుగాక", "దానికి విఘ్నములు లేకుండు గాక - ఈ భోగాలకు విఘ్నాలవల్ల ఏ విధమైన అడ్డంకి కలుగ కూడ దు", "దీనిచే నేను దన్యుడనగుదును - ఈ భోగాలవల్లనే నేను కృతార్ధుణ్ణి అవుతాను" అని ఈ విధమైన భ్రమ కలుగుతుంది.ఈ భ్రమయే వ్యసనాలకు కారణమౌతుంది. జ్ఞానికి ఇవన్నీ మిథ్య అనే భావం సంస్కార రూపంలో దృఢమై యుండును. సద్వస్తువు "అద్వైతమే" రెండదంటూ ఉండదనే "నిర్ణయాత్మకముగా" వున్న అద్వైత బుద్ధి ఎన్నడూ నశించదు. లోక వ్యవహారం మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది, వివేకమనేది వ్యవహారాన్ని అడ్డగించదు కాబట్టి ! అర్థక్రియ అట్లా సాగిపోతూనే ఉంటుంది.
జరుగు కర్మలు వివేకజ్ఞానం వలన ఆత్మయొక్క అమరత్వము,సచ్చిదానంద రూపత్వ ప్రేరణతో కూడిన దృష్టితో జరుగుతాయి.
*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
1.శరణు శరణు రామచంద్ర నరేంద్రా సరి మమ్ముగావు రామచంద్రా నరేంద్రా
2.ఘన దశరథునకు కౌసల్యాదేవికిని జననమందిన రామచంద్రా నరేంద్రా కనలి తాటకి చంపి కౌశుకుజన్నము గాచి చనవులిచ్చిన రామచంద్రా నరేంద్రా!!
3.అరిది సీత పెండ్లాడి అభయమందరికిచ్చి శరధిగట్టిన రామచంద్రా నరేంద్రా అరసి రావణు చంపి అయేధ్యానగర మేలి సరవినేలిన రామచంద్రా నరేంద్రా!!
4.పన్నుగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు సన్నిధినిల్చిన రామచంద్రా నరేంద్రా అన్నిటా లక్ష్మణభరతాంజనేయశత్రుఘ్నుల సన్నుతికెక్కిన రామచంద్రా నరేంద్రా!!
*||శ్రీమన్నారాయణీయము|| దశమ స్కంధము 42వ దశకము - శకటాసురవధ - 42-10 శ్లోకము*
అనోనిలీనః కిల హంతుమాగతః సురారిరేవం భవతా విహింసితః।
రజో౾పి నో దృష్టమముష్య తత్కథం సశుద్ధసత్త్వే త్వయి లీనవాన్ ధృవమ్॥
భావము:-
భగవాన్! శకటరూపమున నిన్ను వధించుటకు వచ్చిన శకటాసురుని నీవు వధించితివి. "లేశ మాత్రము రజోగుణము చూపకపోయినను ఆ శకటాసురునికి నీ వలన మరణము సంభవించెను. అది ఎట్లు సాధ్యమయ్యెను? శుద్ధ సత్వగుణరూపుడవయిన నీ దరి చేరగనే అతను (నీ అనుగ్రహముతో) గుణరహితుడై నీలో లయమయి యుండవచ్చును".
[17/08, 14:56] +91 92915 82862: *104- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)*
🕉🌞🌎🌙🌟🚩
104) శ్లోకము:-
చంద్రాతపః కశ్చన సంప్రసన్నో
మహేశనేత్రా తిథితర్పణోనః!
మనోభిలాషం సఫలీకరోతు
మహేశ్వరీహాసలవప్రకాశః !!
భావము:-
ఉమాదేవి చిరుమాత్ర
మందహాసపు ప్రకాశము
మహేశ్వరుని మరియు అతని అతిథుల
మనస్సు రంజింప చేయుచున్నది.
ఆచూపుల సుఖశీతలత,
చంద్రుని అమృతత్త్వము
మహేశ్వరుని నేత్రములకే కాక,
భోజనార్థము వచ్చు అతిథులకు
సకల సంతర్పణముగా,
మనోభిలాషను తీర్చుచు,
వారి తాపముల ఉపశమింప చేయుచున్నవి.
🕉🌞🌎🌙🌟🚩
[17/08, 14:56] +91 92915 82862: *🧘♂️104) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*ముముక్షు ప్రకరణము / మూడవ అధ్యాయము / మోక్షసాధనము*
3-50
అవహేలితశాస్త్రై ర్థైరవజ్ఞాతమహాజనైః కష్టామప్యాపదం ప్రాప్తో న మూఢైః సమతామియాత్.
శాస్త్రములను, అందలి అర్థములను తిరస్కరించువారును, జ్ఞానులగు మహాత్ములను ఉపేక్షించువారు నగు మూఢులతోటి సాంగత్యమును, కష్ట ఆపత్కాలమలందును కూడ చేయరాదు.
3-51
న వ్యాధిర్న విషం నాపత్తథా నాధిశ్చ భూతలే
ఖేదాయ స్వశరీరస్థం మౌర్ఖ్య మేకం యథా నృణామ్.
ఈ ప్రపంచమున మనుజులకు తమ శరీరమందున్న అజ్ఞానము ఎంత దుఃఖమును కలిగించునో, అంత దుఃఖమును ఏవ్యాధిగాని, విషముగాని, ఆపదగాని, మానసిక బాధగాని కలుగజేయజాలవు.
3-52
ఆపదో యా దురుత్తారా యాశ్చ తుచ్ఛాః కుయోనయః
తాస్తా మౌర్ఖ్యాత్ర్పసూయన్తే ఖదిరాదివ కణ్టకాః.
దాటుటకు కష్టతరమైనట్టి గొప్ప ఆపద లెవ్వి కలవో, మఱియు ప్రపంచమున నీచజన్మ లెవ్వికలవో, అవియన్నియు ఖదిర (చండ్ర)వృక్షము నుండి ముండ్లవలె అజ్ఞానము నుండియే జనించుచున్నవి.
🕉️🌞🌏🌙🌟🚩
సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*
*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*బ్రాహ్మణ ఉవాచ*
*అంతట బ్రాహ్మణుడు ఇట్లనెను* ""అర్జునా! బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు ధనుర్ధాలలో అగ్రేసరులు. అనిరుద్ధుడు తిరుగులేని యోధుడు. అంతటివారే మా పుత్రులను రక్షింపజాలరైరి. ఆ జగదీశ్వరులకే అసాధ్యమైన ఈ పనిని నీవు ఎట్లు చేయగలవు? అజ్ఞానమువలన నీవు దీనికి సాహసించుచున్నావు. ఈ విషయమున మేము నిన్ను విశ్వసింపము".
*అర్జున ఉవాచ*
*అర్జునుడు ఇట్లనెను* "బ్రాహ్మణోత్తమా! నేను బలరాముడను కాను, కృష్ణుడనుగాను, ప్రద్యుమ్నుడను కానేకాను. నేను జగత్ప్రసిద్ధమైన గాండవ ధనుస్సును చేబూనిన అర్జునుడను. భూసురశ్రేష్ఠా! ముక్కంటినే సంతోషపఱచిన (ముక్కంటియే మెచ్చుకొనిన) నా పరాక్రమమును చులకన చేయవలదు. మృత్యుదేవతనైనను యుద్ధమున జయించి, నీ సంతానమును తీసికొనివచ్చి నీకు అప్పగించెదను"
మహారాజా! అంతట ఆ విప్రునకు అర్జునుని మాటలపై విశ్వాసము కుదురుకొనెను. పిమ్మట అతడు పార్థుని పరాక్రమమును కొనియాడుచు సంతోషముతో తన గృహమునకు చేరెను.
కొంతకాలమునకు ఆ విప్రుని భార్యకు ప్రసవకాలము సమీపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆతురతతో అర్జునుని కడకు వచ్చి, "మహాత్మా! నా సంతానమును మృత్యువునుండి రక్షింపుము' అని వేడుకొనెను.
వెంటనే అర్జునుడు పవిత్రజలములను ఆచమించి, పరమశివునకు నమస్కరించెను. పిదప అతడు దివ్యాస్త్రములను సంస్మరించి, గాండీవధనుస్సును చేబూని అల్లెత్రాడును సంధించెను.
పిదప పార్థుడు వివిధములగు అస్త్రములను అభిమంత్రించి, సూతికా గృహమునకు అన్నివైపుల యందును శరపంజరమును నిర్మించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*
*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*బ్రాహ్మణ ఉవాచ*
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*972వ నామ మంత్రము* 18.8.2021
*ఓం అశోభనాయై నమః*
అద్వితీయ సౌందర్యముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అశోభనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అశోభనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చించు భక్తజనులకు ఆ తల్లి కొంగుబంగారమై సకలాభీష్టములను సిద్ధింపజేయును.
జగన్మాత త్రిపురసుందరి. నిత్యయౌవనవతి. జగదేకసుందరి. కామేశ్వరుడే అత్యంత సుందరస్వరూపుడైతే, కామేశ్వరి (అమ్మవారు) ఆయనను మించిన అపురూప లావణ్యవతి.
*ఉద్యద్భాను సహస్రాభ* ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలిన కాంతితో తేజరిల్లునది ఆ తల్లి.
*నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల* తన ఎర్రని శరీర కాంతితో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింపజేయునది శ్రీమాత.
*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ* సహజ సుగంధపూరితమైన తన కేశసంపదతో చంపకాశోకపున్నాగాది కుసుమములకు సుగంధములను అందజేయునది పరమేశ్వరి.
*కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత* పద్మరాగ మణులతో ప్రకాశించు కిరీటంతో భాసిల్లు లలితాంబిక.
*అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభిత* అష్టమితిథి నాటి చంద్రునివలె ప్రకాశించే లలాటము గలిగినది ఆ జగదీశ్వరి.
*వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక* జగన్మాత వదనము మన్మథుని మంగళప్రదమైన గృహము. అటువంటి మంగళప్రదమైన గృహమునకు అమ్మవారి కనుబొమలు మన్మథ మాంగల్య గృహమునకు తోరణములై ప్రకాశించుచున్నవి.
*వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన* ఆ శ్రీమాత తన ముఖకాంతి అనే జలప్రవాహమునందు సంచరించు మీనముల కన్నులవంటి నయనములు కలిగినది..
*నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత* పరమేశ్వరి నాసాదండము (ముక్కు ఆకారము) అప్పుడే వికసించిన సంపెంగ వలె అతి కోమలముగాను, సుందరముగాను ఉన్నది. అనగా సంపంగి వంటి నాసిక కలిగినది శ్రీమాత.
*తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర* ముక్కుకు ఉన్న ముక్కెర కాంతులు అత్యంత మనోహరమైన దేదీప్యమాన కాంతులను విరజిమ్ముతూ, శుక్రనక్షత్రకాంతులనే త్రోసిపుచ్చుచున్నంతగా భాసిల్లునది ఆ అమ్మవారు.
*కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా* కదంబ కుసుమముల గుత్తిని చెవులపై భాగంలో ధరించుడంచేత ఆ తల్లి రమణీయమగా భాసిల్లుచున్నది.
*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అమ్మవారి చెవులకు ఉన్న చెవికమ్మలు రెండునూ సూర్యచంద్రులను తలపించుచున్నంత రమణీయమైన కాంతులను విరజిమ్ముచుండెను.
*పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః* పద్మరాగ శిలలను లేదా అద్దమును సైతం తిరస్కరించేటటువంటి నున్ననైన, నిర్మలమైన చెక్కిలి గలిగియున్నది ఆ శ్రీమాత.
*నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద* అప్ఫుడే సాన బట్టిన పగడము లేదా దొండపండుల కాంతులను మించిన ఎర్రని కాంతులను జిమ్ముచూ ప్రకాశించే పెదవులతో తేజరిల్లుచున్నది ఆ పరమేశ్వరి.
ఇంకనూ చెప్పాలంటే అమ్మవారి దంతపంక్తులజంట శ్రీవిద్యయందున్న పదహారు వర్ణమలు (అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం ఆః) అను నట్లుగను, మల్లెమొగ్గల మాదిరిగను అలరారుచున్నవి. వర్ణింపనలవి గాని చుబుకము, అంగద, కేయూరములు అను కాంచనాభరణములతో రాజిల్లు భుజములతోను, రత్నములు, ముత్యములతో చేయబడిన బంగారు కంఠాభరణములతోను, ఎర్రని వస్త్రమును ధరించిన భాసిల్లుచున్న కటిప్రదేశముతోను, చిఱుగంటలతో కూడిన వడ్డాణముతోను, మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వంటి మోకాలు చిప్పలతోను, ఎర్రని ఆరుద్రపురుగులచే చెక్కబడిన అమ్ములపొదులవంటి జంఘలు (పిక్కల) తోను, బలిష్ఠమైన చీలమండల సౌందర్యముతోను, పద్మములను సైతము ధిక్కరించే మృదువైన, సుకుమార లక్షణములతో కూడిన పాద ద్వయంతోను - పరమేశ్వరి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లుచున్నది. గనుకనే *అశోభనా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అశోభనాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[18/08, 04:47] +91 95058 13235: *శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*389వ నామ మంత్రము* 18.8.2021
*ఓం నిరుపమాయై నమః*
ఏ అంశమందైనను సాదృశ్యములేని (ఉపమానమే లేనట్టి/సాటిలేనట్టి) జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నిరుపమా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం నిరుపమాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదాంబికను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులను ఆ పరమేశ్వరి, వారి వారి (భక్తులయొక్క) వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులయందు సాటిలేని ప్రతిభాసంపదలతో రాజిల్లునట్లు అనుగ్రహించును.
వేదములయందు ఆ పరమేశ్వరిని *ఈమెకు సాటిలేదు* అని చెప్పబడింది.
శ్రీమాత తన భక్తులను కరుణించుటలో సాటిలేనిది. అపరాధములను క్షమించుటలో సాటిలేనిది. ఆర్తిని బాపుటలో సాటిలేనిది. కైవల్యప్రాప్తిని అనుగ్రహించుటలో సాటిలేనిది. భక్తులకు మాత్రం పరమేశ్వరియందు అచంచలమైన, నిర్మలమైన, సాటిలేనటువంటి భక్తితత్పరత ఉండవలయును.
జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. ఆదిపరాశక్తి. అందరికీ అమ్మ. తన బిడ్డలకు ఏది ఎప్పుడు అవసరమో తనకే తెలిసి, అభీష్టసిద్ధిని కలుగజేయుటలో ఆమెకు ఆమెయే ఉపమానము. వేరొక ఉపమానమే లేని *నిర్ ఉపమా* (నిరుపమా) యని అనబడినది. కనీసం వాక్కుతో చెప్పడానికి వేరొక ఉపమానమే లేని పరబ్రహ్మస్వరూపిణి. కంటితో చూడడానికి కూడా ఫలానాది ఈమెకు సాటియైనది అని చెప్పనవసరములేని పరమాత్మ అమ్మవారు. మనసులోకూడా భావించనవసరములేని నిరుపమానమైన శుద్ధజ్ఞానస్వరూపిణి జగన్మాత. అందుకే ఆ అమ్మ *నిరుపమా* యని అనబడినది.
అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం నిరుపమాయై నమః* అని యనవలెను.
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*
*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పిమ్మట ఆ బ్రాహ్మణుని పత్నికి కుమారుడు జన్మించెను. అనంతరము ఆ శిశువు పదేపదే ఏడ్చుచు మృతుడై సశరీరముగా ఆకాశమునందు అదృశ్యుడాయెను.
అప్పుడు బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని సన్నిధియందే అర్జునుని నిందించుచు ఇట్లనెను - "నా మూర్ఖత్వమును చూడుడు. ఈ నపుంసకుని ప్రగల్భవచనములను నమ్మి మోసపోయితిని. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, బలరాముడు, కడకు కృష్ణుడు మృత్యువునుండి నా సంతానమును రక్షింపజాలకుండిరి. ఇట్టిస్థితిలో వేరొకడు రక్షించుటకు ఎట్లు సమర్థుడగును? ఛీ! అర్జునుడు అసత్యవాది, తనను తానే పొగడుకొనునట్టి వీనియొక్క గాండివధనుస్సు గూడ వ్యర్థమే. దైవికముగా (ప్రారబ్ధవశమున) లోకాంతరమునకు ఏగిన (మృత్యువు పాలైన) నా పుత్రుని తీసికొనివచ్చుటకు పూనుకొనిన ఈ దుర్మతియొక్క మూర్ఖత్వమును గూర్చి ఏమని చెప్పవలెను?"
భూసురుడు ఇట్లు నిందించుచుండగా ఫల్గునుడు సర్వలోకములందును సంచరింపగల తన యోగవిద్యను ఆశ్రయించి, పూజ్యుడైన యమధర్మరాజు నివసించుచుండెడి సంయమని నగరమునకు శీఘ్రముగా చేరెను. కానీ అచట బ్రాహ్మణుని సంతానము కనబడకపోవుటతో అతడు సాయుధుడై క్రమముగా ఇంద్రుని పట్టణమైన అమరావతిని, అట్లే అగ్ని, నిరృతి, చంద్ర, వాయు, వరుణ లోకములను, రసాతలాది అధోలోకములను, ఊర్ధ్వలోకములను, ఇంకను తదితర ప్రదేశములను బ్రాహ్మణ పుత్రులకై గాలించెను.
ఎక్కడను విప్రుని సుతులు కనబడకపోవుటతో అర్జునుడు తాను చేసిన శపథమునందు విఫలుడై అగ్నిలో ప్రవేశించుటకు సన్నద్ధుడాయెను. అంతట శ్రీకృష్ణుడు ఆయనను నివారించుచు ఇట్లు నుడివెను-
"అర్జునా! నిన్ను నీవు తక్కువగా ఊహించుకొనవద్దు. నీకు బ్రాహ్మణుని తనయులను చూపించెదను. ఇప్పుడు నిన్ను నిందించుచున్న వారెల్లరును నీ నిర్మలమైన ఘనకీర్తిని వేనోళ్ళ ప్రశంసింతురు".
సకలలోకపూజ్యుడు, సర్వశక్తిమంతుడు ఐన శ్రీకృష్ణుడు అర్జునుని ఈ విధముగా ఓదార్చెను. పిమ్మట ఆ ప్రభువు అర్జునునితోగూడి దివ్యమైన తన రథమునందు ఆసీనుడై, పశ్చిమదిశకు బయలుదేరెను.
వారు క్రమముగా ఏడేసి పర్వతములుగల ఏడు ద్వీపములను, ఏడు సముద్రములను, లోకాలోక పర్వతమును దాటి దట్టమైన చీకటీని ప్రవేశించిరి.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*🌹. శ్రీమద్భగవద్గీత - 79 / Bhagavad-Gita - 79 🌹*
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 32 🌴*
32. యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖిన: క్షత్రియా: పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ||
🌷. తాత్పర్యం :
*ఓ పార్థా! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్దావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు.*
🌷. భాష్యము :
“ఈ యుద్ధము నందు ఎటువంటి శుభమును నేను గాంచుట లేదు. ఇది శాశ్వతమగు నరకవాసమునే గూర్చును.” అని పలికిన అర్జునుని నైజమును జగద్గురువైన శ్రీకృష్ణుడు నిరసించుచున్నాడు. అర్జునుని అట్టి పలుకులు కేవలము అజ్ఞానజనితములు. అతడు తన విధ్యుక్తధధర్మ నిర్వహణమునందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడైనవాడు యుద్ధరంగమునందు అహింసను పాటించుట యనునది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు మరియు గొప్ప ఋషియైన పరాశరుడు రచించిన పరాశరుడు రచించిన పరాశరస్మృతి యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
క్షత్రియో హి ప్రజా రక్షన్ శస్త్రపాణి: ప్రదణ్డయన్ |
ననిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్ ||
“పౌరులకు అన్నిరకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మమై యున్నందున అవసరమగు విషయములందు శాంతిభద్రతల పరిరక్షణకై హింసను చేపట్టవలసి యుండును. కావున అతడు శత్రురాజుల సైన్యమును జయించి, తదుపరి ధర్మబద్దముగా రాజ్యమును పాలించెను.
ఈ విషయమున నన్నింటిని బట్టి అర్జునుడు యుద్దమును త్యజించుటకు ఎట్టి కారణము లేదు. శత్రువులను జయించినచో రాజ్యమును అతడు అనుభవింపగలడు. ఒకవేళ యుద్ధరంగమునందు మరణించినచో ద్వారములు తెరువబడియున్న స్వర్గమునకు అతడు చేరగలడు. కావున ఏ విధముగా గాంచినను యుద్ధమే అతనికి లాభదాయకమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
ధర్మాధర్మ విహీనోఽపి ధర్మమేవ కరోతి యః ।
శ్రీవిష్ణుర్ధర్మమర్యాదాస్థాపనార్థం స ధర్మకృత్ ॥
ధర్మమును ఆచరించువాడు. తాను స్వయముగా ధర్మమును కానీ, అధర్మమును కానీ ఆచరించవలసిన పనిలేకున్నను ధర్మమర్యాద స్థాపనకై - ధర్మమును తాను ఆచరించి చూపి తాను లోకమునకు ఉదాహరణముగా ఉండువాడుగనుక ఆ శ్రీ విష్ణు దేవుడు ధర్మకృత్.
:: శ్రీమద్రామాయణే బాల కాండే ప్రథమస్సర్గః ::
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥
(శ్రీరాముడు) స్వ-పర భేదములులేక అందరిని రక్షించువాడు. ధర్మమును స్వయముగా ఆచరించుచు, లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడు వాడు. స్వధర్మమును పాటించువాడు. తనను ఆశ్రయించినవారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు. వేదవేదాంగముల పరమార్థమును ఎఱిగినవాడు. ధనుర్వేదమునందును ఆరితేరినవాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18/08, 06:03] +91 98494 71690: *🌹. దేవాపి మహర్షి బోధనలు - 128 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 105. దైవ నిర్ణయము 🌻*
యాత్రికుడొకడు ఓడ నెక్కుచు నుండగ అతని బంగారపు నగల మూట దొంగిలింపబడెను. అందరును కలత పడుచు, “దొంగ, దొంగ” అని “పట్టుకొనుడు పట్టుకొనుడు” అని “అయ్యో అయ్యో” అని అరచుచు అలజడి గావించిరి. యాత్రికుడు మాత్రము దొరకక పారిపోయిన దొంగ వైపు చూచి తోటి యాత్రికులతో నిర్లిప్తముగ "దైవ నిర్ణయము” అని మృదువుగ పలికినాడు. అందరును అతని వైపుర్యముగ చూచినారు. అతనిని గూర్చి కొందరు ప్రశంసించుకొనిరి. మరికొందరు పాపమనిరి. మరికొందరు "కర్మ” యనిరి. మరికొందరు “అశ్రద్ధ" యనిరి. ఇంకొందరు “దొంగిలింపబడినది, దొంగిలింపబడినది" అని పలికిరి.
ఓడ కదిలినది- అది పెద్ద ప్రయాణము. మూడు పగళ్ళు, రాత్రుళ్ళ గడచిన వెనుక సముద్ర మధ్యమున ఓడ తుఫానుకు గురియైనది- సముద్ర మధ్యమున గల ఒక రాతిని గుద్దుకొని, ఓడ బీటలు వారినది. పడవ మునుగుట మొదలిడినది. ప్రయాణికు లందరును ప్రాణములు చేత బట్టుకొని సముద్రములోనికి దుమికిరి. ఎవరి ప్రయత్నము వారు గావించిరి. యాత్రికుడు ఓడ నుండి చెదిరి పడిన ఒక చెక్కముక్క ఆధారముగ ద్వీపము నొకటి చేరినాడు. ద్వీప వాసులు అతని నాదరించి శుశ్రూషలు చేసి స్వస్థత కూర్చిరి.
ద్వీపవాసులు యాత్రికునితో నిట్లనిరి “నీవు పయనించిన ఓడ సముద్ర మధ్యమున మునిగినది. వందలాది యాత్రికులు ప్రాణములు కోల్పోయినారు. నీ వొక్కడివే మిగిలినావు. నీ అదృష్టమేమిటో తెలియకున్నది. నీవు మిగులుట ఒక అద్భుతము.” యాత్రికుడిట్లని సమాధాన మిచ్చెను. “నేను ఓడ ప్రయాణమునకు కొన్న టిక్కెట్టు ఖరీదు చాల ఎక్కువ. ఖరీదైన టిక్కట్టుతో ఓడ ఎక్కితిని. అది దైవనిర్ణయము. ఓడ మునుగుట దైవనిర్ణయము. నేను మిగులుట దైవనిర్ణయము.” అంతా దైవనిర్ణయమని తెలియుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
: *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 60 🌹*
*🍀. మానవ చైతన్యం లోపలికి వెళ్ళే కొద్దీ ఆ అనంత వైశాల్యం చూసి దిగ్రమ చెందుతాం. మనం కేంద్రానికి చేరితే అదే అనంత విశ్వం. అదే దైవత్వానికి సంబంధించిన అనుభవం. 🍀*
మనిషి బాహ్యంలో కనిపించేంత చిన్నవాడు కాడు. అనంత ఆకాశం అతన్లో వుంది. సప్త సముద్రాలు అతన్లో వున్నాయి. అవును, అతను ఒక మంచు బిందువులా కనిపిస్తాడు. కానీ అతను దారి తప్పినట్లు అనిపిస్తాడు. కనిపిస్తాడు. ఇప్పటికీ మంచు బిందువులా కనిపించే అతనిపై సైన్సు పరిశోధనలు జరుపుతోంది.
మానవ చైతన్యం లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఆశ్చర్యపోతాం. ఆ అనంత వైశాల్యం చూసి దిగ్రమ చెందుతాం. మనం కేంద్రానికి చేరితే అదే అనంత విశ్వం. అదే దైవత్వానికి సంబంధించిన అనుభవం. ధ్యానం నిలిపి లోపల్లోపలికి వెళ్ళాలి. అది అప్పటికే అక్కడ వుంది. దాని అడ్డంకుల్ని తొలగించాలి అంతే!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
[18/08, 06:03] +91 98494 71690: *🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 302-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 302 -1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।*
*హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀*
*🌻 302-1. 'హ్రీమతి' 🌻*
లజ్జ గలది శ్రీదేవి అని అర్థము. లజ్జ కలుగ జేయునది అని కూడ అర్థము. 'హ్రీమతి' అనగా బుద్ధిమతి. బుద్ధిమతి విచక్షణ కలుగ జేయును. ద్వంద్వ పూరితమైన సృష్టి యందు చేయతగినవి, చేయతగనివి యుండును. చేయతగని విషయముల యందు నిరాదరణ, నిరాసక్తి హ్రీమతుల కుండును. అనగా బుద్ధిమంతులు నీతినియమములు లేని కార్యములు చేయరు.
తత్సంబంధమైన భావములు కాలమును దేశమును బట్టి కలుగుచున్నను వాటిని నిరాకరింతురు. శ్రీమాత అనుగ్రహము వలననే జీవులకు బుద్ధి ప్రచోదనము కాగలదు. ఆమె అనుగ్రహపాత్రులు కానివారు ఆమె మాయ యందు చిక్కుకొని నీచకార్యములు కూడ చేయుదురు. అనుగ్రహమునకు భక్తి ఆరాధనము ప్రధానము. అట్టి ఆరాధనము లేనిచోట అహంకార ముద్భవించును. అహంకారము అజ్ఞాన కారణమై సిగ్గులేని కార్యములు చేయుట జరుగును. అమ్మ ప్రీమతి యగుటచే ఆమె సాన్నిధ్యము జీవితమున నిత్యావసరమైన విషయము. కానిచో బుద్ధిమంతుడు సహితము అహంకరించుట జరుగును.
జ్ఞానులు కూడ అహంకారపడి దెబ్బతిన్న సందర్భము లెన్నియో కలవు. ప్రీమతియై అమ్మ సాన్నిధ్య మిచ్చిననే జీవనము వైభవముగ సాగును. లేనిచో అహంకారము, చిత్త ప్రవృత్తులు విజృంభించి జీవుని కష్ట నష్టములకు లోను చేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18/08, 13:57] +91 92915 82862: *శ్రీ గణేశ మంగళాష్టకం*
*1) గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |*
*గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ ‖*
*2) నాగయజ్ఞోప వీతాయ నతవిఘ్న వినాశినే |*
*నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ ‖*
*3) ఇభవక్త్రాయ చేంద్రాయ వందితాయ చిదాత్మనే |*
*ఈశానప్రేమపాత్రాయ జేష్టదాయాస్తు మంగళమ్ ‖*
*4) సుముఖాయ సుశుండాగ్రో -క్షిప్తామృత ఘటాయ చ |*
*సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ ‖*
*5) చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |*
*చరణావసతానస్తతారణాయాస్తు మంగళమ్ ‖*
*6) వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |*
*విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశయ మంగళమ్ ‖*
*7) ప్రమోదమోద రూపాయ సిద్ధి విజ్ఞాన రూపిణే |*
*ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ‖*
*8) మంగళం గణనాథాయ మంగళం హరసూనువే|*
*మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళం ‖*
*శ్లోకాష్టక మిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |*
*పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే ‖*
*‖ ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ‖*
🕉️🌞🌏🌙🌟🚩
*(-Sri Paramahansa యోగనంద / శ్రీ పరమహంస యోగానంద)*
*(-పవిత్రీకరణ / Purification )*
*పశ్చిమ దేశాలలో ఉన్నా, తూర్పు దేశాలలో ఉన్నా , ముముక్షు - యోగి తనను తాను క్రమశిక్షణ లో ఉంచుకోవాలి.... శరీరాన్ని గూర్చి అనవసరమైన హడావిడి చెయ్యకూడదు. తనకు ఇతర విషయాలన్నిటికోసం సమయం లభించి, దేవుని కోసం మాత్రం సమయం లభించనప్పుడు , క్రమశిక్షణ అనే కొరడాను తనపైనే ఉపయోగించుకోవాలి. భయమెందుకు? దానివల్ల అన్నిటినీ పొందవచ్చు. మానవుడు తన ముక్తి కోసం తానే విలపించి , పోరాడకపోతే, అతని కొరకు ఇంకెవరైనా చేస్తారా?*
🕉🌞🌎🌙🌟🚩
[16/08, 15:38] +91 92915 82862: _*🧘♂️శరీరాలు - కలలు🧘♀️*_
*_మనము, ఈ భౌతిక శరీరంతో పాటు మొత్తం ఏడు శరీరాల సముదాయం. ఇవి ఒకదాని లోపల మరొకటి ఒదిగి ఉంటాయి._*
*_నిద్రావస్థలో సమగ్ర జ్ఞాన సముపార్జన కోసం వివిధ శరీరాలుచేసే క్రియలే 'కలలు'. మన దేహంలోని ఏడు శరీరాలు నిద్రావస్థలో కలలు కంటాయి. ఒక శరీరం యొక్క కల ముగిసిన తర్వాతే మరియొక శరీరం కల కంటుంది._*
*_1. స్థూల శరీరం (Physical Body - అన్నమయ కోశం) :- భౌతిక శరీరము కనే కలలకి చైతన్య స్పృహ ఉంటుంది. ఇది మనకు సంబంధించింది అని స్పష్టంగా తెలుస్తుంది._*
*_ఉదా : భౌతిక ప్రపంచానికి సంబంధించిన స్నేహితులు, సంఘటనలు, ప్రదేశాలు మొదలైనవి కలలుగా గోచరించడం._*
*_2. కాంతిమయ శరీరం (Etheric Body - ప్రాణమయ కోశం) :-__కాంతిమయ శరీరంతో కనే కలలు సుప్త చైతన్యంలో ఉంటాయి కనుక వెంటనే మర్చిపోతాము. ఇవి మనం బలవంతంగా అణచుకున్న కోరికలకు సంబంధించి ఉంటాయి. ఈ శరీరంతో మనం ఆ అనుభూతులను ఆస్వాదించవచ్చు._*
*_ఉదా :- పెద్ద ఇళ్లల్లో జీవించడం, నగలు ధరించడం, అందమైన అమ్మాయిలతో రమించడం మొదలైనవి._*
*_3. సూక్ష్మ శరీరం (Astral Body - మనోమయ కోశం) :- ఈ శరీరంతో కనే కలలు ఎంతో గుర్తుపెట్టుకుంటే కానీ గుర్తుండవు. ఈ శరీరం దూరాన్ని అధిగమించగలదు._*
*_ఉదా :- ఏ ప్రదేశానికంటే ఆ ప్రదేశానికి అనుకున్న వెంటనే చేరగలగడం._*
*_4. భావన శరీరం (Causal Body - విజ్ఞానమయ కోశం) :- ఈ శరీరం కనే కలలు పూర్వ జన్మలకు సంబంధించిన సంఘటనలు. ఉదాహరణకు ఏదైనా ప్రదేశాన్ని సందర్శించినచో అది అంతకు ముందే చూచినట్లు అనిపించడం._*
*_5. కారణ శరీరం (Spiritual Body - ఆనందమయ కోశం) :- భవిష్యత్తులో జరిగే సంఘటనలు అన్నీ ఈ శరీరం ద్వారా కలలుగా గోచరించును._*
*_ఉదా :- బంధు, మిత్రులలో ఎవరైనా చనిపోబోవుచున్నచో ముందే కలలుగా రావడం._*
*_6. మహాకారణ శరీరం (Cosmic Body - విశ్వమయ కోశం) :- ఇచ్చట ప్రజ్ఞ ఒక్కటే పని చేస్తుంది. ఈ శరీరం విశ్వ విరాట్ మూర్తితో తాదాత్మ్యం చెందుతుంది. యావత్ సృష్టిని ఈ శరీరం దర్శిస్తుంది. యోగులు మాత్రమే ఈ దశను గుర్తించగలరు._*
*_7. నిర్వాణమయ శరీరం (Nirvanic Body) :- ఈ దశలో కలలు, కల్పనలు ఉండవు. ఈ సమయం మొత్తం మహా శూన్యమే గోచరిస్తుంది. శూన్యం అయినా ఈ దశలోనే విశ్వప్రాణశక్తి పూర్ణంగా లభించును. దీనినే మనం గాఢనిద్ర అని పిలవవచ్చు._*
*_మనం నిద్రకు ఉపక్రమించినప్పుడు మొదటిగా భౌతికశరీరం యొక్క కలతో మొదలై వరుసగా నిర్వాణ శరీరం వరకు వెళ్ళి, తిరిగి నిర్వాణ శరీరం నుండి చివరగా భౌతిక శరీరం యొక్క కలతోనే నిద్ర ముగుస్తుంది. అందువల్లనే నిద్రను *'మహామాయ'*అని పిలుస్తారు !_*
🕉️🌞🌏🌙🌟🚩
[16/08, 15:38] +91 92915 82862: *🧘♂️మౌన మంత్రం🧘♀️*
🕉️🌞🌍🌙🌟🚩
*{మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం !}-*
*ప్రపంచం ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉంది. ఇల్లే ఒక లోకంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మానసికమైన ఆసరా కోసం వెతకడం సర్వసాధారణం. అలాంటి ఆసరా ఆధ్యాత్మిక చింతన ద్వారా సాధ్యమవుతుంది. దైవం అండగా ఉన్నాడనే భావన ఎనలేని శక్తిని ఇస్తుంది. వ్యతిరేక భావాల్లోకి జారిపోకుండా చేయూతనందిస్తుంది. ఆ చేతిని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకొనే మార్గాలు ఎన్నో ! వాటిలో ఎంతో శక్తిమంతమైనది మౌనం.*
*మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాన్ని ఆశ్రయిస్తే అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.*
*మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం ! ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికో, మానసికంగా తగిలిన గాయాలను మాన్పుకోవడానికో మౌనాన్ని మనం ఆశ్రయిస్తూనే ఉంటాం.*
*మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. అంతేకాదు, అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మౌనంలో లభిస్తాయి. అందుకే ఋషులు మౌనాన్ని ఆశ్రయించారు. వారిని ‘మౌని’ లేదా ‘ముని’ అని పిలవడానికీ అదే కారణం. మౌన వ్రతాన్ని దాదాపు అన్ని మతాలూ సూచించాయి. భాద్రపద మాసంలో మౌనవ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో శివ నామస్మరణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది.*
*ఇంటి నుంచి బయటకు వెళితే మనం ఏం చేస్తాం ? స్నేహితులతోనో, పరిచయస్థులతోనో మాట్లాడతాం. అయితే ఇప్పుడు మాటే చేటు తెస్తోంది. అందుకే ఇంటికే పరిమితం కావలసిన ప్రస్తుత కాలంలో మౌనాన్ని సాధన చేద్దాం.*
*మహాభారత లేఖనంలో...*
*మౌనం ఎంత గొప్పదో మహాభారత రచనకు సంబంధించిన ఒక కథ మనకు చెబుతుంది.*
*వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే భారతాన్ని వినాయకుడు వ్రాశాడు. రచన పూర్తయిన తరువాత వ్యాసుడు ‘‘వినాయకా! ఆ భగవంతుడే మహాభారతాన్ని సృష్టించాడు. అది నా నోటి నుంచి వచ్చింది. నువ్వు రాశావు. ఇది నా అదృష్టం. కానీ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించినది నీ మౌనం ! నేను భారతాన్ని చెబుతున్నప్పుడు దాదాపు రెండు లక్షల పదాలు నా నోటి నుంచి వచ్చాయి. ఇదంతా రాసే సమయంలో నువ్వు ఒక్క మాట మాట్లాడగా నేను వినలేదు. ఎందుకని ?’’ అని అడిగాడు.*
*దానికి గణపతి సమాధానమిస్తూ, ‘‘కొన్ని దీపాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. మరి కొన్నిటిలో చాలా కొంచెం ఉంటుంది. అయితే ఏ దీపానికీ నిరంతరంగా నూనె అందడం జరగదు. అలాగే, మానవులకూ, రాక్షసులకూ, ఆఖరికి దేవతలకు కూడా పరిమితమైన జీవిత కాలం ఉంటుంది. ఎవరికైతే స్వీయ నియంత్రణ ఉంటుందో, తమ శక్తులను సహనంతో, అవగాహనతో ఉపయోగించుకుంటారో వాళ్ళే జీవితం నుంచి పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. స్వీయ నియంత్రణకు మొదటి మెట్టు - మాటను నియంత్రించుకోవడం ! మాట మీద నియంత్రణ లేని వాళ్ళు అనవసరంగా ఎంతో శక్తిని కోల్పోతారు. మాటను నియంత్రించుకోవడం ద్వారా అలాంటి నష్టాన్ని నివారించుకోగలరు. అందుకే మౌనానికి ఉన్న శక్తిని నేనెప్పుడూ నమ్ముతాను’’ అని చెప్పాడు !*
[16/08, 15:38] +91 92915 82862: *329) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"*
నానిచ్ఛన్తో న చేచ్ఛన్తః పరదాక్షిణ్య సంయుతాః ౹
సుఖదుఃఖే భజన్త్యే తత్పరేచ్ఛాపూర్వకర్మ హి ౹౹162౹౹
ఇతరుల కొరకు కర్మ నిర్వర్తించేది పరేచ్ఛా ప్రారబ్ధము.
కథం తర్హి కిమిచ్ఛన్ని త్యేవమిచ్ఛా నిషిధ్యతే ౹
నేచ్ఛా నిషేధః కిన్త్విచ్ఛాబాధో భర్జిత బీజవత్
౹౹163౹౹
భర్జితాని తు బీజాని సన్త్యకార్య కరాణి చ ౹
విద్వదిచ్ఛా తథేష్టవ్యాఽ సత్యబోధాన్న కార్యకృత్
౹౹164౹౹
మూడు కోరికలు జ్ఞానికున్నచో "దేనిని కోరి"అని శ్రుతి జ్ఞానిలో కోరికలను నిషేధించుట ఏల?
సమాధానం:నిషేదము కాదు బాధ.
వ్యాఖ్య :-
అనిచ్ఛవల్ల కాకుండా, ఇచ్ఛవల్లనూ కాకుండా, కేవలం ఇతరులను సంతోష పెట్టాలనే ఉద్దేశ్యంతో దుఃఖాలను గాని, సుఖాలను గాని అనుభవిస్తాము. అంటే,తనకు కోరిక ఉన్నా లేకున్నా,ఇతరుల కొరకై కర్మ నిర్వర్తించి సుఖదుఃఖములనుభవించుట ఇటువంటివన్నీ పరేచ్ఛా ప్రారబ్ధం క్రిందకు వస్తాయి.
అందుచేతనే దోషదృష్టి ఉన్నప్పటికీ,అపరిహార్యమైన ప్రారబ్ధం నశించదు.ఆ ప్రారబ్ధంలో ఉండే ఇచ్ఛను పుట్టించే శక్తిని నివారించలేము.
తత్త్వవేత్తలకు కూడా ఇచ్ఛ అనేది తప్పదు అంటే,శ్రుతిలో చెప్పిన"కిమిచ్ఛన్"అనే దానికి వ్యతిరేకం కాదా ? అంటే -
అయితే, "కిమిచ్ఛన్..."
'ఏ మిథ్యావస్తువును కోరుతూ'
అంటూ చెప్పిన శ్రుతివాక్యంలో ఇచ్ఛను ఎందుకు నిషేధించారు ? అంటే - ఈ శ్రుతివాక్యంలో ఇచ్ఛకు నిషేదం లేదు.ఇచ్ఛ అనేది బాధితమవటం లేదా ఇచ్ఛకు హానిని చెప్పారు.
దగ్ధమైన బీజం స్వరూపంలో ఉన్నా,అంకురించే శక్తిని కోల్పోయినట్లుగా,ఇచ్ఛకు కూడా ప్రవృత్తిని కలిగించే సామర్థ్యం ఉండదని అన్నారు.
అంటే - స్వరూపం విషయంలో మామూలుగానే ఉన్నా, వేయించబడిన
బీజం - దగ్ధబీజం ఉత్పాదన శక్తిని కోల్పోయినట్లుగా, జ్ఞాని యైన వానియందలి ఇచ్ఛ మామూలుగా ఉన్నా విషయభూతమైన పదార్థాల యెడల మిథ్యత్వజ్ఞానం ఉన్నందువల్ల,ఆ ఇచ్ఛా మిథ్యాజ్ఞానాన్ని కోల్పోయినందువల్ల,
వ్యసనాదుల్ని కలిగించలేదు.
వేపిన గింజలుకూడా గింజలే.అయినా అవి నిష్పలములు అంకురించవు, వాటికా శక్తి ఉండదు.
జ్ఞానుల కోరికలును అట్టివే.
జీవన్ముక్తులగు మహాను భావులకు ఇచ్ఛలేక యుండినను ప్రారబ్ధము వలన ప్రవృత్తి గల్గును.ప్రవృత్తి పరమైన ఈ ఇచ్ఛ వ్యసనంబురకు కారణ మగుటలేదు.ఏలనగా విషయమగు పదార్థము మిథ్యయని తెలియబడి యుండుటచే ఇచ్చ వ్యసనరూపములో బంధింపజాలదు.
అనగా, పదార్థము మిథ్యగా తెరియబడుటచే
ఇష్టానిష్టవస్తు ప్రాప్తి యందు సముడై యుండును.
రాగ ద్వేషములు ఉన్నట్లు తొయ్యడమే గానీ పదార్థములను సమముగా జూడడమే "జీవన్ముక్తస్య" లక్షణము.
*తాళ్లపాక పెద తిరుమలాచార్య సంకీర్తన*
🕉🌞🌎🌙🌟🚩
॥పల్లవి॥
శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా
వాసుదేవుఁడా రమణీవశమై యుండఁగను!!
॥చ1॥
సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు
నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను
యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా
కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను!"
॥శ్రీసతి॥
॥చ2॥
కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి
అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను
యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా
తుద సభలో వదరి తునకలై పడెను!!
॥శ్రీసతి॥
॥చ3॥
సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య
గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను
పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు
గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను!!
🕉🌞🌎🌙🌟🚩
*||శ్రీమన్నారాయణీయము|| దశమ స్కంధము 42వ దశకము - శకటాసురవధ - 42-9 శ్లోకము*
🕉🌞🌎🌙🌟🚩
42-9
అయే సుతందేహి జగత్పతేః కృపాతరంగపాతాత్ పరిపాతమధ్య మే।
ఇతి స్మ సంగృహ్య పితా త్వదంగకం ముహుర్ముహుః శ్లిష్యతి జాతకంటకః॥
భావము:-
భగవాన్! నీ తండ్రి నందగోపాలుడు ఆనందముతో - "పరమాత్మా! నీ కరుణ చేతనే నా పుత్రుడు రక్షించబడెను", అని పలుకుచూ, "ఓ యశోదా! పుత్రుడిని నాకు ఇమ్ము!" అని తన చేతులలోనికి - నిన్ను తీసుకొని తన శరీరము గగుర్పొడుచుండగా నిన్ను పదే పదే కౌగలించుకొనెను.
🕉🌞🌎🌙🌟🚩
: *103- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)*
🕉🌞🌎🌙🌟🚩
103) శ్లోకము:-
కీర్తిర్వలక్షా కుసుమాయుధస్య
స్వర్ణాద్రికోదండ జయోన్నతస్య!
దరస్మితశ్రీ ర్థ్విరదాస్య మాతు
ర్ద్రాఘీయసీం వోవితనోతుభూతిమ్!!
భావము:-
బంగారు మేరుపర్వతమునే
విల్లుగా ధరించి త్రిపుర సంహారము చేసిన
శివుని చేత భస్మమయినాడు మన్మథుడు.
తల్లి ఉమాదేవి మందహాసము
మన్మథుని పునఃర్జన్మకు కారణమైనది.
పార్వతీ పరమేశ్వరుల వివాహముతో
శివుని పై గెలిచిన కీర్తి సాధించాడు మన్మథుడు.
ఆమె మందహాసమువలె స్వఛ్ఛమై
శుభప్రదమై మన్మథుని కీర్తి వెల్లివిరిసింది.
🕉️🌞🌏🌙🌟🚩
🧘♂️103) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*ముముక్షు ప్రకరణము / మూడవ అధ్యాయము / మోక్షసాధనము*
3-47
పరిత్యక్తసమస్తేహం మనోమధురవృత్తిమత్
సర్వతః సుఖమభ్యేతి చంద్రబిమ్బ ఇవ స్థితమ్.
అత్మ జ్ఞానముచే అన్ని కోర్కెలను (లేక చేష్టలను) త్యజించినవాడును. సదా బ్రహ్మాకారమైన మనోవృత్తి గలవాడునగు మనుజుడు చంద్రబింబమందున్న వానివలె సర్వత్ర సుఖమునే పొందును.
3-48
తస్మాద్విచారేణాత్మైవావ్వేష్టవ్య ఉపాసనీయో
జ్ఞాతవ్యో యావజ్జీవం పురుషేణ వేతరదితి.
కాబట్టి మనుజుడు యావజ్జీవితము విచారణ ద్వారా ఆత్మనే అన్వేషింపవలెను. ఆత్మనే ఉపాసింపవలెను; ఆత్మనే తెలిసికొనవలెను. గాని యితరమును గాదు. (ఆత్మనుగూర్చిన శ్రవణ మనన నిదిధ్యాసనములనే కావింపవలెనని భావము.)
3-49
స్వానుభూతేశ్చ శాస్త్రస్య గురోశ్చైవైకవాక్యతా యస్యాభ్యాసేన తేనాత్మా సన్తతేనావలోక్యతే.
శ్రవణాదుల అభ్యాసముచే స్వానుభవము వలనను, శాస్త్రము వలనను, గురువు వలనను, ఏకార్థ (ఆత్మ) నిశ్చయము కలుగును. అట్టి నిశ్చయముచే నిరంతరము ఆత్మ దర్శింపబడును.
🕉️🌞🌏🌙🌟🚩
: *🌹 . శ్రీ శివ మహా పురాణము - 440🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 28
*🌻. శివుని సాక్షాత్కారము - 3 🌻*
నీవు చెప్పిన తీరున చితాభస్మ అపవిత్రమైనచో, ఆయన శరీరమునుండి జారిన భస్మను దేవతలు నిత్యము శిరస్సుపై ధరించుటకు కారణమేమి? (21) ఏ దేవుడు సగుణుడై జగత్తులను సృష్టించి పోషించి సంహరించునో, నిర్గుణస్వరూపుడై శివనామధేయమును కలిగియుండునో, అట్టి దేవుడు ఎట్లు తెలియబడును? (22)
పరబ్రహ్మ పరమాత్మయగు శివుని నిర్గుణ స్వరూపమును నీ వంటి బహిర్ముఖులు ఎట్లు తెలియగల్గుదురు? (23) దురాచారపరులు, పాపప్రవృత్తి గలవారు, దేవతాగణమునుండి బహిష్కరింపబడినవారు నిర్గుణ స్వరూపుడగు శివుని తత్వమును ఎన్నటికీ తెలియజాలరు (24).
ఏ పురుషుడైతే తత్త్వము నెరుంగక శివుని నిందించునో, వానికి పూర్వజన్మల నుండియూ సంపాదించుకున్న పుణ్యము బూడిద యగును (25). మహాతేజస్వియగు శివుని నీవిచట నిందించితివి. అట్టి నిన్ను పూజించిన నాకు పాపము కలుగును (26). శివుని ద్వేషించువానిని చూచినచో కట్టుబట్టలతో స్నానము చేయవలెను (27). ఓరీ! దుష్టా! నాకు శంకరుడు ఎరుకయేనని నీవు చెప్పితివి. కాని సనాతనుడగు ఆ శివుడు నీచే నిశ్చయముగా తెలియబడలేదు (28).
రుద్రుడు ఎట్లైనూ ఉండుగాక! ఆయన వివిధ రూపములను ధరించుగాక! వికారరహితుడు, సత్పురుషులకు ప్రియుడునగు రుద్రుడు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైనవాడు (29). విష్ణువు, బ్రహ్మ కూడ ఏ కాలమునందైననూ ఆ మహాత్మునితో సరిదూగరు. కాలాధీనులగు ఇతర దేవతల గురించి చెప్పునదేమున్నది? (30)
ఈ సత్యమును సద్బుద్ధితో విచారించి తెలుసుకొని నేను శివుని పొందుటకొరకై అడవికి వచ్చి విస్తారమగు తపస్సును చేయుచున్నాను (31). ఆయనయే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, భక్తవత్సలుడు, దీనులను అనుగ్రహించే ఆయనను పొందవలెననే అభిలాష నాకు గలదు (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. గీతోపనిషత్తు -241 🌹*
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 21
*🍀 20. పరంధామము - ఈ సమస్త సృష్టికి ఆధారమగు సత్యమే తన శాశ్వత నివాసస్థానమని, అట్టి సత్యమే రూపు గట్టుకొని అర్జునుని ముందు నిలబడి యున్నదని, పరము, అక్షరము, బ్రహ్మము అగు తానే తన ప్రకృతిని కూడి ఉన్ముఖుడై నిలచి బోధించు చున్నాడని పరమాత్మ తన్ను తా నావిష్కరించుకొనినాడు. తన వాసమగు సత్యమును చేరినచో మాయా ప్రభావమునకు లోబడుట యుండదని తెలుపు చున్నాడు. సర్వజీవులవలె అవరోహణం, ఆరోహణ క్రమములు పొందక యుండుటకు తన నివాసము చేరుమని బోధించు చున్నాడు. 🍀*
అవ్యక్తో _ర ఇత్యుక్త సమాహు: పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తధామ పరమం మమ || 21
తాత్పర్యము : ఏ సత్యము అగోచరమో, నాశరహితమో, సర్వోత్తమమో, దేనిని పొందినచో మరల సృష్టి సర్గమమున జనింప నావశ్యకత లేదో, ఆ పరమగు సత్యమే నా నివాస స్థానము. అట్టి సనాతనమగు సత్యము నీ యందు ఉపస్థితమై యుండునని తెలియుము.
వివరణము : ఈ సమస్త సృష్టికి ఆధారమగు సత్యమే తన శాశ్వత నివాసస్థానమని, అట్టి సత్యమే రూపు గట్టుకొని అర్జునుని ముందు నిలబడి యున్నదని, పరము, అక్షరము, బ్రహ్మము అగు తానే తన ప్రకృతిని కూడి ఉన్ముఖుడై నిలచి బోధించు చున్నాడని పరమాత్మ తన్ను తా నావిష్కరించుకొనినాడు. కనుకనే ఈ బోధన భగవద్బోధన. గీతాకృతి దాల్చిన ఈ బోధన ముమ్మాటికిని భగవద్గీతయే.
ఇతర గీతలన్నియు పరమును గూర్చి బోధించినవే అయినను, బ్రహ్మమును గూర్చి బోధించినవే అయినను, సాక్షాత్తు పరబ్రహ్మము బోధించిన సమయమిది యొక్కటియే. కనుకనే శ్రీ కృష్ణుని శ్రీకృష్ణ పరమాత్మ అని పిలుచుట సమంజసము.
అట్టి శ్రీకృష్ణుడు అవ్యక్తమునకు కూడ అవ్యక్తుడు. అతడక్షరుడు. సర్వోత్తముడు. అతని నివాసమే సత్యము. అతడే సనాతనుడు. అట్టి తన నివాసమును చేరుమని అత్యంత వాత్సల్యముతో, తన కిష్టుడగు అర్జునుని హెచ్చరించుచున్నాడు. తన వాసమగు సత్యమును చేరినచో మాయా ప్రభావమునకు లోబడుట యుండదని తెలుపుచున్నాడు. సర్వజీవులవలె అవరోహణం, ఆరోహణ క్రమములు పొందక యుండుటకు తన నివాసము చేరుమని బోధించు చున్నాడు.
పరంధామమును చేరిన జీవికి ఇక జనన మరణము లుండవు. మాయ స్పృశింపదు. దివ్య సంకల్పమున సృష్టి యందు ప్రవేశించినప్పటికి, ఎట్టి వికారములేక, మాయకు లోబడక దివ్య కార్యములు నిర్వర్తించి, మరల తన నివాసమే చేరును. సనక సనందనాదులు, నారదుడు, సప్త ఋషులు, ప్రజాపతులు, మనువులు అట్లు శాశ్వత పదము నందుండి భగవత్ శాసనముగ సృష్టియందు తమ కర్తవ్యములను నిర్వర్తించుచు నున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17/08, 05:17] +91 98494 71690: *🌹. వివేక చూడామణి - 117 / Viveka Chudamani - 117🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 4 🍀*
389. ఆత్మయే లోపల బయట ఉన్నది. ఆత్మయే ముందు వెనుక ఉన్నది. ఉత్తరదక్షిణాలలో ఉన్నది ఆత్మయే. అలానే ఆత్మ పైన క్రింద ఉన్నది.
390. అలలు, నురుగు, సుడులు, బుడగలు మొదలైనవన్నియూ నీరుగాక వేరుకాదు. అదే విధముగా ఆత్మ జ్ఞానము, అన్ని అదే అయి ఉన్నది. శరీరము నుండి అహం వరకు ప్రతిది కేవలము చిత్తో సమానమైనవే.
391. మనస్సుతోనూ, మాటలతోనూ పలికే ఈ విశ్వమంతా బ్రహ్మమే కాని వేరేది కాదు. అట్టి బ్రహ్మము ప్రకృతికి అందనంతదూరములో ఉన్నది. మట్టికుండ, జారు, కూజ ఇవన్నియూ మట్టిలో నుండి తయారైనవే. మోసగించబడిన వ్యక్తి మాత్రమే ‘నీవు’ ‘నేను’ అను భేదముతో మాయ వలన త్రాగిన మత్తులో వాగుతుంటాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
: *🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 69 🌹*
*🌻. ఆనంద సూక్తము -1 🌻*
సపర్శ వలన ఆనందమున్నది. ఉద్రేకము వలనా సుకుమార సున్నిత భావావేశముల వల్లనూ ఆనందం కలుగుతుంది. అవగాహన వల్ల కూడ ఆనందోదయమవుతుంది. జ్ఞాన-వివేచన వల్ల కూడ ఆనందం కలుగుతుంది.
ఆనందములోనికి ప్రవేశించుటవల్లనూ ఆనందం, అట్లే ఆనందములో స్థిరపడుట వల్లనూ ఆనందముంది. ఎప్పటికైనా ఎవరైనా కోరవలసినదికూడా ఆనందమే కదా!
అయితే స్పర్శ వల్ల ఆనందము కూడా ఆనందమే! అది ఎవరూ కాదనలేరు. శీతాకాలంలో బయట చలిగా ఉంటుంది. అదే మీ కారులో కూర్చున్నామనుకోండి. లోపల వెచ్చగా ఉంటుంది. నాకు ఆనందంగానూ ఉంటుంది. అయితే ఒక విషయం.
మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళినప్పుడు గాని లేదా భూమధ్యరేఖా ప్రాంతానికి గాని వెళ్ళినట్లయితే, అదీ మండువేసవిలో అయితే, చల్లని హిమగృహంలో (ఏ.సి. రూములో) కూర్చుంటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. దీనినే స్పర్శ వల్ల కలిగే ఆనందమంటారు.
కృష్ణభగవానుడు ఇట్లా అన్నాడు "చలికాలంలో వెచ్చదనం ఆనందమైతే, వేసవిలో చల్లదనం ఆనందమనుకుంటే ఆ ఆనందానికి ప్రామాణికత ఏమిటి? చల్లగా ఉన్నప్పుడు నాకు హాయి అని నేనంటే, అది తప్పనిసరిగా వేసవే అయుండాలి. నేను డెన్మార్కు వెళ్ళేవరకు ఆగి, అక్కడ చలికాలమయితే, ఆనందమంటే ఏమిటో నన్ను అడగండి, వెచ్చదనమే ఆనందమంటారు.
అందువల్ల స్పర్శాసుఖము అని మనం పిలిచే ఆ సుఖంలో ఏదో కొద్ది సత్యము తప్ప పూర్తి నిజం కాదు.
ఆనందము యొక్క పై అంచునుండి క్రమక్రమంగా పై స్థాయిలోని ఆనందానికి వెళ్ళాలనుకొంటున్నారు ప్రజలు. అయితే చివరి మెట్టు చేరేవరకు, ప్రతి ఘట్టములోనూ కలిగే ఆనందం శాశ్వతమైనది కాదు...
.✍️ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹
: *🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 117 / Sri Lalita Sahasranamavali - Meaning - 117 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |*
*మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ‖ 117 ‖ 🍀*
🍀 578. మహాకైలాస నిలయా -
గొప్పదైన కైలసమే నిలయముగా గలది.
🍀 579. మృణాల మృదుదోర్లతా -
తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
🍀 580. మహనీయా -
గొప్పగా ఆరాధింపబడునది.
🍀 581. దయామూర్తిః -
మూర్తీభవించిన దయాలక్షణము గలది.
🍀 582. మహాసామ్రాజ్యశాలినీ -
పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment