ఓం శ్రీరామ
రావమ్మ మహా లక్ష్మీ
నీవమ్మా మనసు తల్లి నిత్యా శుభమున్
సేవలు నీకే నమ్మా
భావభవమనస్సు తల్లి భాగ్యమ్మగుటన్
డబ్బు మనిషినే యాడించు డమరకమగు
యది మనశ్శాంతికి విలువ యదను తట్టు
అప్పుగా కూడ యివ్వలేరన్నది యది
ధ్యాన సాంగత్య సాధన దారి యగుట
మూర్ఖుడెవడు నీవును చెప్ప ముఖ్య మేది
కాల మార్పు యాకలి తీర్పు కాన వచ్చు
అనుభవము యాశ కావచ్చు యనుట యేల
అందరూ మూర్ఖులేయగు యెరుక పరచ
సోమరితనమే మనబుద్ధి హీనత యగు
స్వార్థ గుణమే తప్పుకు దారియగు
తాహతున్న మాటలతోన తప్పు వెతుకు
మన అహంకారమే విధి మాయ బ్రతుకు
ఆస్తులున్నను ఆప్తులు ఆశ తీర్చు
పస్తులున్నను పడకయే పాఠ మౌను
వ్రాస్తు వున్నను గుండ్రటి వ్రాత వచ్చు
నిత్య చస్తూ బతుకు యైన నీడ కరువు
బ్రాంతి కల్పిత మైనది బంధమగుట
బ్రహ్మ తత్వమే నీవని బాగుగానె
యాశ్రయమునిత్య యాటకు యానతి యగు
మదిన ధ్యానము జీవిత మర్మ మగుట
ప్రకృతి కదలికయేచూడు ప్రగతి తీరు
పగలు రాత్రిపాటు బడుట ప్రతిభ తీరు
శాంతి కామము సర్వము సాకు తీరు
మనిషి కదలికయే నిత్య మనసు తీరు
ఇసుకలో నూనె తీయుట యిష్ట మన ట
రాయిగానిత్య సుందరి వ్రాత యనుట
యాకులో ఔషదముయున్న యెరుక లేవు
మనిషి మనిషిగాను బతుకు మనను లేవు
మనిషిలో ప్రేమ వున్నాను మనుగడవదు
అర్ధమే యగుటేగుణ సంపదగుట
సంపదేయున్న సరిపోదు సహన ముంచు
సాయమేచేయు గుణము విశ్వాసమ్ము
గంగి రెద్దుల యాటలు గలగలగల
హరిహరా దాసుల కళల గు కలకలకళ
భోగి మంటల కాంతులు భగభగభగ
గాలి గాలిపఠాలుగా గల గలగల
కవితలతొ శుభాకాంక్షలు కనుల విందు
యీ సమస్యగా పరిష్కార మివ్వ గలుగు ,
చీకటి వెలుగురంగేళి చేరువ యగు
బాధ తోడగు సంతోష బంధ మగు .
ఆత్మ విశ్వాస విలువగా యంత రాత్మ
గాలివానకు గొడుగును వాడ ఫలిత
ముళ్ళకంప పెంచిన ఫలం ముఖ్య మవదు
కొన్ని బంధానుబంధాలు పోరు మనకు
జీవితంలో ఎదురగుటే జీవయాత్ర
చెట్టును నరికేయడమను చేష్ట యేల
చెట్టు పెద్దదవ్వాలన్న జీవ యాత్ర
మనకు మంచి అనిపించింది మనము చేయ
మంచి అనిపించుకోవడం మనకు వద్దు
చేతివేళ్ళన్ని ఒకపొడవే ననకుము
మడిచినప్పుడు అన్నీ సమానమౌను
మన పరిస్థితులకు అను మాన గుణము
సర్దుబాటు సులభ సుఖ సమయ మౌను
దీపకాంతి సర్వ మయము దీనులియడ
రూప కాంతి చెలికి నిత్య రమ్యత యగు
జ్ఞాన క్రాంతి రేఖ గదులు జ్ఞానులందు
చంద్రకాంతి భువికి తృప్తి చల్ల బర్చు
తీపి మాటలు మోసము చేయ నెంచ
కాని అందరూ అభిమాన కాల మాయ
కఠిన పలుకు నిజాయితీ కాని దగుట
నవ సమాజము తీరది నటనలగతి
నిత్య సంతోష, సుఖమగు నేర్ప కుండ
పాఠమను కష్ట కన్నీళ్లు పాశ మౌను
గెలుపు,విజయము దుఃఖము నేర్పలేరు
ఓటమి,అవమానాలుగా ఓడి గెలుచు
వస్త్ర మివ్వసూర్యుడకు వయసు లేదు
పుష్ప మైన విష్ణువుకును వుంచ లేదు
గంధమై వాయువును కాను కాలమేది
అన్నమైయింద్రునకు నే పంపలేను
వందనాలు తెల్పుట తప్ప వప్ప లేను
రావమ్మ మహా లక్ష్మీ
నీవమ్మా మనసు తల్లి నిత్యా శుభమున్
సేవలు నీకే నమ్మా
భావభవమనస్సు తల్లి భాగ్యమ్మగుటన్
చం.వెలవెలబోయె యాంద్రమగు తేజము తగ్గిన భాషగానులే
తెలుగుకు కష్ట మొచ్చినది తెప్పల సంద్రపుయాటు పోటుగా
సులువుగ మాతృభాషయిది సూత్రప్రభుత్వము రాజకీయమే
పలుకులు వ్రాతలే కరువు భాషకు ద్రోహము మంత్రి బుద్ధిగా
ప్రాంజలి ప్రభ జనవరి రెండవ వారం పద్యాలు
రచన మల్లాప్రగడ రామకృష్ణ
శా..మాతాధర్మముయే సుఖమ్ముతెలిపే మర్మమ్ము నిత్యమ్ముయే
మాతాలక్ష్యముగాను శాంతి సహనమ్మే సర్వ హృద్యమ్ము గా
మాతా క్షేమముగాను జూడు సుతులై మాధుర్య ప్రే మమ్ముయే
మాతా నీమనసౌను జీవిగమనమ్మే జాతి సౌభాగ్యమే
శా..అత్యంతానుభవమ్ముసర్వ మయమై యాశ్చర్య లక్ష్యమ్ము యే
నిత్యంబున్ సకలమ్ము కోరు మనసే నిస్తుల్య సేవమ్ముగన్
సత్యంబియ్యది నీదయా హృదయమే సర్వంబు చేకూరెడిన్
భృత్యుండన్ పరమాత్మ దేహముగనే ప్రార్ధించ విద్యార్థి గా
చం..గల గల పాఱు నీటిని సుఖంబుగ తా చవి చూచు చుండె నా
మిలమిల రంగు లెన్నొ తన మేనిని దాల్చెను సుందరంబు గా.
కిలకిల రావ మొప్పె నది కేళిగ వింతగు రాగమై -భళా!
తలపుల నేమి దాగెనొ? విధాతకె తెల్సు!నెరుంగ రెవ్వరున్!!
చం.కలిసిము కన్న పుత్తడియె కాలము గామరిపించు నిత్యమై
వెలసిన కూతురే యగుట వీనుల విందగు మాట సత్యమై
నిలయము నిర్మలమ్మగుట నీడల వెల్లువ సర్వ ప్రేమమై
పలుకుల పాఠమేగతియు పాలన లాలన విశ్వ మర్మమై
చం.కనపడకున్న నీమది వికాసము పొందె వరమ్ము భాగ్యమై
వినబడకున్న మాటలకు విస్మయ మవ్వుట కాల తీర్పుయై
క్షణమని నిత్య సౌఖ్యము సకాల మనస్సును పొందు తత్త్వమై
మనమనివొక్క టవ్వుటయె మార్గపు యూపిరిగాను సర్వమై
సుప్రభాతమ్మగు నిత్యసత్యమగు సూత్రంమ్మౌను జీవమ్ముకే
తపమే యోగము సర్వమానవులు తన్మాయ్యమ్ము చేదమ్ముకే
ఉపవాసమ్మగు ధర్మమార్గమున యున్మాదమ్ము మార్చేందుకే
యపకారమ్మును జేయకుండగను యానందమ్ము భానుండుగా
తరుణమ్మున్ మది నేర్పు సాధనయు తత్వార్ధం పు జ్ఞానీ యనం
త రుణమ్మున్ సహనమ్ము శోధనయు తన్మాయా సుఖమ్మున్ మనం
సిరి సమ్మోహముగాను జీవమగు స్వేచ్ఛా ప్రాణమేయున్ సుధీ
పురమే స్నేహ సమానదక్షతయు పూజ్యమ్మున్ సహాయం విదీ
పడతినిచేరి మాటలగు బానిసకాకయు తెల్పు కోపమున్
పడిపడి చేష్టలేయగుట భామను తిట్టియు కొట్ట బుద్ధిగన్
నడవడి నమ్మలేననుచు నానుడి గాగతి వేష భాషయున్
పడతిగ వోర్పుగాను దలపంగ నిజమ్మును చెప్ప శాంతియున్
Comments
Post a Comment