శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం

ఓంశ్రీమాత్రే నమః

కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.

1) దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ |

పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్||

భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.

2) మూలాధారే వారిజపద్మే సచతుష్కే వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః |

రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావం:- మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను.

3) స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః |

పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:-  స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం, మం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

4) నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే |

నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:- మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు). మణిపూరక మందున్న మేఘం నిలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

5) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్ |

సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:- హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది. అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయ కారకుడు, ధవల వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

6) కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే|

మాయాధీశం జీవశివం తం భగవంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:- విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమ వలె వుండును. అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఌ, ౡ,ఏ,ఐ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును. ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము. దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

7) ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం|

విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:- ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును. హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు. ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు, త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

8) మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే|

హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావము:- కపాలం పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును. హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన  పరమహంసలు పొందేస్థితి. పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.

9) బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ| పరమాత్మానం బ్రహ్మమునీంద్రం భసితాఙ్గం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ||

భావం:-  బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు, భగవంతుడు, బ్రహ్మజ్ఞాని  మరియు జ్ఞానమయుడు, నఓం నమః శివాయ*:

ిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు, బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు, శ్రీగురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.*

ఇతి శ్రీమద్శఙ్కరాచార్య విరచితం శ్రీదత్తాత్రేయ షట్చక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ ||

(()))

శ్రీ దత్త షట్చక్ర జాగరణ  స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం సాధన  పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.

సాధన :-  పద్మాసనం లో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి మొట్టమొదట మూలాధారం నుండి మొదలు పెట్టి సహస్రారం వరకు,..., ఒక్కొక్క చక్రానికి సంబంధించిన స్త్రోత్రంను ఆచక్రం వద్ద పారాయణ చేయాలి.

ఈ పారాయణ రోజుకి 11 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు దాని నుండి వచ్చే శక్తి తట్టుకోవడం కష్టం అతిగా  చక్రాలు క్రియావంతం అయినా సమస్యలు వస్తాయి గర్భిణీ స్త్రీలు చేయకూడదు.

ఏ చక్రానికి సంబంధించిన స్త్రోత్రం చేస్తున్నారో ఆ చక్రం మీద దృష్టి పెట్టి చేయవలెను.

11 సార్లు పారాయణ ముగిసిన తరువాత ధ్యానంలో . ఉండండి.

తరువాత గంట వ్యవధి ఇచ్చి మీ ఇష్ట దేవత మంతాన్ని గాని స్త్రోత్రం గాని దండకం కానీ 108 సార్లు పారాయణ చేసుకోవచ్చును.

ఇలా 40 రోజులు చేసుకోవచ్చును. శక్తిని బట్టి 90 రోజులు కూడా చేసుకోవచ్చును.

సాత్విక ఆహారం బ్రహ్మచర్యం అవసరానికి మించి ఎక్కువగా వృధాగా మాట్లాడకూడదు పనికి వచ్చే మాటలు ఎంత సేపు అయిన పరవలేదు ఉపయోగం లేనివి వృధా మాటలు ఈ సాధన చేసినప్పడు వద్దు.ఎందుకు అంటే విశుద్ధి చక్రంలో శక్తి క్షీణిస్తుంది ఈ చక్రం గొంతు దగ్గర ఉంటుంది.

                   

ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.

మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలనే యోగ సాధకులు చక్రాలంటారు.మనిషి వెన్నుపూసలో నిద్రాణ స్థితిలో దాగివుండే ఒక అనిర్వచనీయమైన శక్తినే కుండలిని శక్తిగా యోగ శాస్త్రం అభివర్ణిస్తోంది. విశేష యోగ సాధన ద్వారా వెన్నుపూస దిగువనుండే మూలాధారం వద్ద నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు సుషుమ్న నాడి సాయంతో చేర్చే పద్ధతిని కుండలినీ యోగం వివరిస్తోంది. ప్రాణ శక్తిని సమతుల్యం చేయటం తెలుసుకున్న మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.

చక్రాలు

మూలాధార చక్రము:- గుద భాగానికి పైన ,లింగ స్థానానికి కింది భాగంలో ఈ చక్రం ఉంటుంది. ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ చక్రం పనితీరు బాగున్న వారు ధైర్యం, భద్రతతో జీవిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు నిరంతరం అసంతృప్తి, భయం వంటి భావనలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. వీరు తరచూ ఎముకలు, దంతాలు, పేగులకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటుంటారు. మొక్కలు పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ చక్ర పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుపూస దిగువ భాగాన ఎరుపు రంగు ఉన్నట్లు భావిస్తూ 'నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అని భావన చేయటం ద్వారా ఈ చక్రం పనితీరును మెరుగు పరచుకోవచ్చు.

స్వాధిష్ఠాన చక్రము:- బొడ్డు దిగువ భాగాన ఉండే నారింజ రంగు చక్రమే స్వాధిష్ఠానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దీని పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అని పదే పదే మనసులో అనుకోవాలి.

మణిపూరక చక్రము:-  బొడ్డు పై భాగంలో పసుపు రంగులో ఉండే చక్రమే మణిపూరకం. మానసిక ప్రవృత్తిని, ఆత్మ నిగ్రహాలను ఇది ప్రభావితం చేస్తుంది. సమస్యలను ఎదుర్కొని సానుకూల పరిష్కారాలను కనుగొనేందుకు ఈ చక్రం దోహదపడుతుంది. దీని పనితీరు బాగున్న వ్యక్తులలో ఏదో తెలియని ఆకర్షణ, వెలుగు ఉంటుంది. దీని పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు సొంతనిర్ణయాలు తీసుకోలేరు. తరచూ మాట మార్చటం, ఇతరుల మీద ఆధారపడటం, ఒప్పుకున్న పనిని పూర్తి చేయలేకపోవటం, ఒకే సమయంలో పలు పనులు మొదలుపెట్టి ఒక్క పనీ చేయలేక పోవటం, ఎదుటి వారిని సంతోషపు పెట్టేందుకు సొంత సమయాన్ని వృధా చేసుకోవటం వంటి లక్షణాలుంటాయి. ఈ పరిస్థితి మారాలంటే క్రమబద్ధమైన జీవనానికి అలవాటు పడాలి. రోజూ వ్యాయామం చేయట, ధ్యానం చేయటం తప్పనిసరి. బొడ్డు, గుండె మధ్య భాగంలో పసుపు రంగు గోళాన్ని ఊహించుకొని ' నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అని మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా ఈచక్రం పనితీరు మెరుగుపడుతుంది.

అనాహత చక్రము:-  ఇది హృదయ స్థానములో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమ వంటి సున్నితమైన భావనలకు ఇది కేంద్రం. ఈ చక్రం ఛాతీ, వీపు భాగాల పనితీరును నియంత్రిస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రేమించేలా చేయటంతో బాటు ప్రాణ శక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాలని అంగీకరిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బ తిన్నవారికి ఏ పనిలోనూ సంతోషం, సంతృప్తి లభించవు. ఎవరినీ నమ్మరు. ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఆశిస్తారు. పనులను మధ్యలోనే వదిలేస్తారు. పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ద్వారా ఈ చక్రం పనితీరు బాగుపడుతుంది. గుండె భాగంలో ఆకుపచ్చ గోళాన్ని ఊహిస్తూ ' నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుటూ ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను.' అని రోజూ పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.

విశుద్ధి చక్రము:-  కంఠ స్థానములో నీలి రంగులో ఉండే ఈ చక్రం సృజన, భావ వ్యక్తీకరణకు కేంద్రం. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఏ రంగంలోనైనా నాయకులుగా, మార్గదర్శులుగా ఎదుగుతారు. వీరిమాటను అందరూ ఆమోదిస్తారు. ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే గాక ఇతరులు చెప్పేదాన్నీ శ్రద్దగా వింటారు. ఈ చక్రం పనితీరు దెబ్బవారు కంగారు, గందరగోళానికి గురికావటం, అనాలోచితంగా పనులు చేయటం వంటి ఇబ్బందులకు గురవుతారు . మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేయటం, ఇంటిపని, రచనా వ్యాసంగం, పుస్తకాలు చదవటం, క్రీడలు వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది. ప్రశాంతంగా కూర్చొని గొంతు భాగాన నీలిరంగు గోళం ఉందని భావిస్తూ ' నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలిగేలా చెప్పగలను' అని మననం చేయటం ద్వారా కూడా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.

ఆజ్ఞా చక్రము:- భ్రూ (కనుబొమల) మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే ఈ చక్రమే అంతర్బుద్దికి కేంద్రం. ఊహించటం, ఆలోచించటం దీని పని. దీన్నే త్రినేత్రం అనీ అంటారు. దీని పనితీరు బాగుంటే భవిష్యత్తులో రానున్న సంకేతాలను, మార్పులనూ సరిగా ఊహించగలరు. కళాకారులుగా గుర్తింపు పొందుతారు. ఈ చక్రం పని తీరు దెబ్బ తిన్నవారు కంటికి కనిపించే వాటినే నమ్ముతారు. సొంతనిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకూ అతిజాగ్రత్త పడుతుంటారు. బొమ్మలు వేయటం, రంగులద్డటం వంటి పనులతో ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది. కనుబొమ్మల మధ్యభాగంలో ముదురు నీలిరంగు గోళాన్ని ఊహిస్తూ ' అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను. ఈ క్రమంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను' అని సంకల్పం చెప్పుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది.

సహస్రార చక్రము :- మాడు భాగంలో బచ్చలి పండు రంగులో ఉంటుంది. ఈ చక్రాన్ని చేరుకున్న వ్యక్తి జీవాత్మ, పరమాత్మల సంబంధాన్ని తెలుసుకుంటాడు. యోగ సాధన పరంగా కుండలిని ఆఖరి మజిలీ ఇది.ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు ఈ చక్రాన్ని చేరగలరు. దీనిని శైవులు శివస్థానమనీ, వైష్ణవులు పరమ పురుష స్థానమనీ, శాక్తేయులు దేవీస్థానమనీ, కొందరు హరిహర స్థానమనీ అంటారు. కుండలిని శక్తిని ఈ స్థానానికి చేర్చిన మనిషికి పునర్జన్మ నెత్తాల్సిన అవసరం లేదని యోగ శాస్త్రం స్పష్టం చేస్తోంది.

ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ  చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.

((()))

ఓం నమః శివాయ:

శ్రీరుద్రాష్టకమ్

ఓంశ్రీమాత్రే నమః

1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!

అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!

2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!

కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!

3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!

స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!

4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!

మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!

5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!

త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!

6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!

చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!

7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!

న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!! 

8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!

జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!

ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.

((()))

1) నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపమ్!!

అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహమ్!!

1) నిర్వాణ రూపమైన ఈశాన మూర్తికి నమస్కారములు (శివుని పంచ ముఖ రుద్ర రూపములలో ఈశాన ముఖము ఒకటి).విభుడు (రక్షకుడు, శుభకరుడు, ప్రభువు అని అర్థం), సర్వ వ్యాపకుడు, పర బ్రహ్మం, వేద స్వరూపుడు, సత్యమైన వాడు, గుణములు లేని వాడు, వికల్పము లేని వాడు, విశ్వ వ్యాపుడు, ఆకాశ రూపుడు, దివ్యాకాశంలో నివసించే వాడు అయిన శివుని భజిస్తున్నాను.

2) నిరాకారమోంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్!

కరాళం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్!!

2) నిరాకారుడు (ఆకారము లేని వాడు), ఓంకారానికి మూలమైన వాడు, తురీయుడు (జాగ్రత్, సుషుప్త, స్వప్నావస్థలను దాటిన అత్యుత్తమమైన అవస్థ), గిరిపై నివసించే వాడు, పర్వతములకు అధిపతి, కరాళుడు (దుష్ట శిక్షణలో), యముని పాలిటి మృత్యువు (మృత్యువుని జయించుటకు సాధనం అని అర్థం), కృపాకరుడు, గుణములకు అతీతమైన వాడు, సంసార వారధిని దాటించే వాడు అయిన పరమ శివునికి నమస్కారములు.

3) తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్!

స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్ఫాలబాలేందు కంఠే భుజంగా!!

3) హిమాలయములు, శంఖము కంటే మిక్కిలి తెల్లని దేహకాంతి కలవాడు, గంభీరుడు, కోటి మన్మథుల మించిన దేహ సౌందర్యము కలవాడు, తన జటా ఝూటములో తరంగాలతో ఉప్పొంగే గంగను, నుదుట నెలవంక, మెడలో నాగరాజును ధరించిన పరమ శివునికి నా నమస్కారములు.

4) చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్!

మృగాధీశచర్మాంబరం రుండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి!!

4) ఊగే కర్ణ కుండలములు ధరించిన వాడు, విశాలమైన మంచి నేత్రములు, ప్రసన్నమైన ముఖము కలవాడు, నీలకంఠుడు, దయాళువు, మృగరాజు చర్మాన్ని ధరించిన వాడు, మెడలో కపాలమాల కలిగిన వాడు, అందరికి ప్రియుడు అయిన శంకరుని నేను భజిస్తున్నాను.

5) ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటిప్రకాశమ్!

త్రయః శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్!!

5) ప్రచండుడు (భీషణుడు, ప్రజ్వలించే వాడు), ఉత్కృష్టమైన వాడు, గంభీరమైన భాషణ చేసే వాడు, సమర్థుడు, దివ్యమైన వాడు, అఖండుడు, జన్మ లేని వాడు, కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, త్రిశూలముతో దుష్ట సంహారము చేసే వాడు, శూల పాణి, భవానీ పతి, భావ గమ్యమైన వాడు అయిన శంకరుని భజిస్తున్నాను.

6) కలాతీత కల్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ!

చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ!!

6) కాలమునకు (మృత్యువుకు) అతీతమైన, కల్పాంతమున (ప్రళయ కాలమున) సమస్తమును నాశనము చేసే, సజ్జనులకు మంచి చేసే, త్రిపురారి, మోహమును నాశనము చేసి చిదానందమును ప్రసాదించే, మన్మథుని సంహరించిన ఓ పరమ శివా! నన్ను అనుగ్రహించుము.

7) న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్!

న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వ భూతాధివాసమ్!! 

7) నీ పద కమలముల మ్రొక్కి శరణు కోరే వరకు జనులకు ఈ లోకములో కానీ, పర లోకములో కానీ దుఖములనుండి విముక్తి కలిగి సుఖము, శాంతి కలుగదు. కావున, సర్వ భూతములలో నివసించే పరమశివా! నన్ను అనుగ్రహించుము, అనుగ్రహించుము.

8) న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్!

జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో!!

8) ఓ శంభో! నాకు యోగము, జపము, పూజ తెలియవు. కానీ, ఎల్లప్పుడూ నీ భక్తుడను. నేను ముసలి తనము, జన్మ, మృత్యువు మొదలైన వాటిలో చిక్కుకొని యున్నాను. ప్రభో! పాహి పాహి. శంభో! నన్ను ఈ ఆపత్తుల నుండి కాపాడుము.

రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే! యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి!!

శివుని ప్రీతికి బ్రాహ్మణుడైన తులసీదాసు చెప్పిన ఈ రుద్రాష్టకం భక్తితో పఠించిన జనులకు ఆ పరమశివుని అనుగ్రహం కలుగును.

ఇతి శ్రీగోస్వామి తులసీదాసకృతం శ్రీరుద్రాష్టకం సంపూర్ణమ్.

(((())))

- శ్రీ వాసిష్ట గణపతి ముని - ఉమా సహస్రము (ద్వితీయశతకం)

136-140) శ్లోకములు:-

ఈ క్రింది 5 శ్లోకములు కలిపి ఒక వాక్యము కనుక కలిపి ఇవ్వబడినవి.

136) దేవేంద్రాయ విభుత్వమ్  సూర్యాయోస్రసహస్రమ్!

ఊష్మాణాం దహనాయ జ్యోత్స్నా మౌషధిరాజే !!     

137) వాతాయామిత వీర్యం  విస్తారం గగనాయ!

సాంద్రత్వం వసుధాయై తోయాయ ద్రవభావమ్!!      

138) మహాభాగ్యమపారం కోటిభ్యో విబుధానమ్!

చిత్రాః కాంచన సిద్ధి, ర్లక్షేభ్యో మనుజానామ్!!

139) స్థాణుభ్యో ధృతిశక్తిం గంతృభ్యో గతిశక్తిమ్!

కస్మాచ్చిన్ని జకోశా దేకా దేవి దదానా!!      

140) ఆశ్చర్యం విదధానా సర్వం వస్తు దధానా!

హంతత్వం మమమాతః కాచిత్ కోమలగాత్రీ!!

    136-140) భావము:-

దేవేంద్రునకు  ప్రభుత్వము, సూర్యునకు వేయి కిరణములు, దహనశీలి  అగ్నికి వేడిమి, ఓషదుల అధిపతి చంద్రునకు వెన్నెల, జగత్ప్రాణుడగు గాలికి బలము,

ఆకాశమునకు విస్తరణ, భూమికి ఘనీభవము, నీటికి ద్రవత్వము, దేవ కోటికి అపారమగు భాగ్యము, లక్షలాది మనుష్యులకు ఆశ్చర్యకరముగా బంగారము  అణిమాది సిద్ధులు,  కదలలేని వస్తువులకు స్థిరత్వము, 

కదలెడు ప్రాణులకు గమన శక్తి, ఆన్నిటిని  నీ ప్రభావ కోశము నుండి నీవు ఒక్కదానివే ప్రసాదించుచున్నావు.

ఓ తల్లీ! అద్బుతము, అసమాన్యము అగు అటువంటి  కర్మలు చేయుదానవు, 

చరాచర విశ్వమును ధరించుదానవు, శక్తిస్వరూపిణివి అయిన నీవు ఒక కోమల శరీరవై     ఆశ్చర్యకరముగా ఉన్నావు.

((()))

శ్రీ సూర్య పంజర స్తోత్రం 

ఓంశ్రీమాత్రే నమః

ప్రాంజలి ప్రభ 

1)ఓం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం|సకలభువననేత్రం రత్నరజ్జూపమేయమ్ |  తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాం|సురవరమభివంద్యం సుందరం విశ్వదీపమ్ ||

2)ఓం శిఖాయాం భాస్కరాయ నమః |లలాటే సూర్యాయ నమః |   భ్రూమధ్యే భానవే నమః |కర్ణయోః దివాకరాయ నమః |  నాసికాయాం భానవే నమః |నేత్రయోః సవిత్రే నమః |  ముఖే భాస్కరాయ నమః |ఓష్ఠయోః పర్జన్యాయ నమః | పాదయోః ప్రభాకరాయ నమః ||

3)ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః |                       ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః || 

4)ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు || 

5)ఓం బ్రహ్మతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం తారకబ్రహ్మరూపాయ పరయంత్ర-పరతంత్ర-పరమంత్ర-సర్వోపద్రవనాశనార్థం దక్షిణదిగ్భాగే మాం రక్షతు ||

6)ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం ప్రచండమార్తాండ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ||

6)ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు || 

7)ఓం అగ్నితేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం తిమిరతేజసే సర్వరోగనివారణాయ ఊర్ధ్వదిగ్భాగే మాం రక్షతు || 

8)ఓం సర్వతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుంభాయ హుం ఫట్ స్వాహా |          ఓం నమస్కారప్రియాయ శ్రీసూర్యనారాయణాయ అధోదిగ్భాగే సర్వాభీష్టసిద్ధ్యర్థం మాం రక్షతు ||

9)మార్తాండాయ నమః భానవే నమః హంసాయ నమః సూర్యాయ నమః దివాకరాయ నమః తపనాయ నమః భాస్కరాయ నమః మాం రక్షతు || 

10)మిత్ర-రవి-సూర్య-భాను-ఖగపూష-హిరణ్యగర్భ- మరీచ్యాదిత్య-సవిత్రర్క-భాస్కరేభ్యో నమః శిరస్థానే మాం రక్షతు ||  సూర్యాది నవగ్రహేభ్యో నమః లలాటస్థానే మాం రక్షతు ||

11)ధరాయ నమః ధృవాయ నమః సోమాయ నమః అథర్వాయ నమః అనిలాయ నమః అనలాయ నమః ప్రత్యూషాయ నమః ప్రతాపాయ నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు || 

12)వీరభద్రాయ నమః గిరీశాయ నమః

శంభవే నమః అజైకపదే నమః అహిర్బుధ్నే నమః పినాకినే నమః భువనాధీశ్వరాయ నమః దిశాంతపతయే నమః పశుపతయే నమః స్థాణవే నమః భవాయ నమః లలాటస్థానే మాం రక్షతు || 

13)ధాత్రే నమః అంశుమతే నమః పూష్ణే నమః పర్జన్యాయ నమః విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు || 

14)అరుణాయ నమః సూర్యాయ నమః ఇంద్రాయ నమః రవయే నమః సువర్ణరేతసే నమః యమాయ నమః దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు || 

15)అసితాంగభైరవాయ నమః రురుభైరవాయ నమః  చండభైరవాయ నమః క్రోధభైరవాయ నమః  ఉన్మత్తభైరవాయ నమః భీషణభైరవాయ నమః కాలభైరవాయ నమః సంహారభైరవాయ నమః  ముఖస్థానే మాం రక్షతు ||

16)బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వరాహ్యై నమః ఇంద్రాణ్యై నమః చాముండాయై నమః కంఠస్థానే మాం రక్షతు ||

17)ఇంద్రాయ నమః అగ్నయే నమః|యమాయ నమః నిర్‍ఋతయే నమః|వరుణాయ నమః వాయవే నమః|కుబేరాయ నమః ఈశానాయ నమః|బాహుస్థానే మాం రక్షతు || 

17)మేషాదిద్వాదశరాశిభ్యో నమః| హృదయస్థానే మాం రక్షతు ||

18)వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః|దండాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః|పాశాయుధాయ నమః|అంకుశాయుధాయ నమః|గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః|పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః|   కటిస్థానే మాం రక్షతు ||

19)మిత్రాయ నమః దక్షిణహస్తే మాం రక్షతు |  రవయే నమః వామహస్తే మాం రక్షతు |సూర్యాయ నమః హృదయే మాం రక్షతు |  భానవే నమః మూర్ధ్నిస్థానే మాం రక్షతు |  ఖగాయ నమః దక్షిణపాదే మాం రక్షతు |  పూష్ణే నమః వామపాదే మాం రక్షతు |హిరణ్యగర్భాయ నమః నాభిస్థానే మాం రక్షతు |మరీచయే నమః కంఠస్థానే మాం రక్షతు |  ఆదిత్యాయ నమః దక్షిణచక్షూషి మాం రక్షతు |  సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు |భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు |అర్కాయ నమః కవచే మాం రక్షతు ||

20)ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతి కరాయ ధీమహి | తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||

 || ఇతి శ్రీ సూర్య పంజర స్తోత్రమ్ ||


🕉🌞🌎🌙🌟🚩

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచితము శ్రీ విష్ణు షట్పది స్తోత్రం*  10-09-2021

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైత చైతన్య జాగృతి

*ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం.*

*భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు.*

 *భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*

*1)అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |*

*భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ||*

*ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.*

*2)దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగసచ్చిదానందే |

*శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ||*

*సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.*

*3)సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |*

*సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ||*

*ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.*

*4)ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |*

*దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ||*

*పర్వతమును ఎత్తిన వాడవు (కృష్ణుడవు, కూర్మావతారము కూడా), పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?*

*5)మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |*

*పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ ||*

*మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.*

*6)దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |*

*భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ||*

*నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో (దామోదరా)! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా! అందరి రక్షకుడా! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.*


*నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |*

*ఓ నారాయణా! కరుణామయా! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ!*


*ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||*


*ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ!*

*శ్రీవిష్ణు షట్పది స్తోత్రం భావం:-*

*ॐॐॐॐॐॐॐॐॐ*

*మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.*

*భ్రమర నాదాలు* 

*భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది.*

 *భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది.*

*తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే.*

*‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే!*

*హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు.*

*పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి.*

*ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది.*

 *సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది.*

*మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు.*

 *ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం.*

*మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసు కోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం!*



Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ