lalita sahatram

 


901। నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి

902। విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి

903। కల్యా : మూలకారణము

904। విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది

905। బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది

906। తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి

907। తత్త్వమైయీ : తత్వస్వరూపిణి

908। తత్త్వమర్ధస్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది

909। సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది

910। సౌమ్యా : సౌమ్యస్వభావము కలిగినది

911। సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి

912। సవ్యాపసవ్యమార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది

913। సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది

914। స్వస్థా : మార్పులేకుండా ఉండునది

915। స్వభావమధురా : సహజమైన మధురస్వభావము కలది

916। ధీరా : ధైర్యము కలది

917। ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది

918। చైతన్యార్ఘ్య సమారాధ్యా : ఙ్ఞానులచే పూజింపబడునది

919। చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది

920। సదొదితా : సత్యస్వరూపిణీ

921। సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది

922। తరుణాదిత్యపాటలా : ఉదయసూర్యుని వంటి కాంతి కలిగినది

923। దక్షిణా జ్ఞానముతో కాని అజ్ఞానముతో కాని పూజిoచిన తృప్తి పడును : దాక్షిణ్యము కలిగినది

924। దరస్మేరముఖాంబుజా : చిరునవ్వుతొ కూదిన ముఖపద్మము కలిగినది

925। కౌళినీ కేవలా : కౌళమార్గమున ఉపాసించబదుచూ సమస్తమునకు తాను ఒక్కటియే మూలమైనది 

926। అనర్ఘ్య కైవల్యపదదాయినీ : అత్యుత్తమమైన మోక్షము ప్రసాదించును

927 స్తోత్రప్రియా : స్తోత్రములు అనిన ఇస్టము కలిగినది

928। స్తుతిమతే : స్తుతించుట అనిన ఇస్టము కలిగినది

929। శ్రుతిసంస్తుతవైభవా : వేదములచేత స్తుతింపబడెడి వైభవము కలిగినది

930। మనస్వినీ : మనస్సు కలిగినది

931। మానవతీ : అభిమానము కలిగినది

932। మహేశే : మహేశ్వర శక్తి

933। మంగాళాకృతి: : మంగలప్రదమైన రూపము కలిగినది। 

934। విశ్వమాతా : విశ్వమునకు తల్లి

935। జద్ధాత్రీ : జగత్తును రక్షించునది

936। విశాలాక్షీ : విశాలమైన కన్నులు కలది

937। విరాగిణీ : దేనిథోనూ అనుభందము లేనిది

938। ప్రగల్భా : సర్వసమర్ధురాలు

939। పరమోదారా : మిక్కిలి ఉదారస్వభావము కలిగినది

940। మరామోదా : పరమానందము కలిగినది

941। మనోమయీ : మనశ్శే రూపముగా కలిగినది

942। వ్యోమకెశే : అంతరిక్షమే కేశముగా కలది

943। విమానస్థా : విమానము (సహస్రారము) నందు ఉండునది

944। వజ్రిణీ : వజ్రము ఆయుధముగా కలిగినది

945। వామకేశ్వరీ : వామకేశ్వరుని శక్తి

946। పంచయఙ్ఞప్రియా : నిత్యము చేయు పంచయఙ్ఞములచే ప్రీతి చెందునది

947। పంచప్రేతమంచాధిశాయినీ : పంచప్రేతములచే ఏరడిన మంచముపై కూర్చుని ఉండునది

948। పంచమే : పంచకృత్యపరాయణి

949। పంచభూతేశే : పంచభూతములను ఆఙ్ఞాపించునది

950। పంచసంఖ్యోపచారిణి : శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరధింపబడునది

951। శాశ్వతీ : శాశ్వతముగా ఉండునది

952। శాశ్వతైశ్వర్యా : శాశ్వతమైన ఐశ్వర్యము కలది

953। శర్మదా : ఓర్పు ను ఇచ్చునది

954। శంభుమోహినీ : ఈశ్వరుని మోహింపజేయునది

955। ధరా : ధరించునది

956। ధరసుతా : సమస్త జీవులను తన సంతానముగా కలిగినది

957। ధన్యా : పవిత్రమైనది

958। ధర్మిణీ : ధర్మస్వరూపిణి

959। ధర్మవర్ధినీ : ధమమును వర్ధిల్ల చేయునది

960। లోకాతీతా : లోకమునకు అతీతమైనది

961। గుణాతీతా ; గుణములకు అతీతమైనది

962। సర్వాతీతా : అన్నిటికీ అతీతురాలు

963। శమాత్మికా : క్షమాగుణము కలిగినది

964। బంధూకకుసుమప్రఖ్యా : మంకెనపూలవంటి కాంతి కలిగినది

965। బాలా : 12సంవత్సరముల లోపు బాలిక,,,,బాల

966। లీలావినోదినీ : బ్రహ్మాండములను సృస్టించు అను లీల యందు వినోదమును కలిగినది

967। సుమంగళి : మంగళకరమైన రూపము కలిగినది

968। సుఖకరీ : సుఖమును కలిగించునది

969। సువేషాఢ్యా : మంచి వేషము కలిగినది

970। సువాసినీ : సుమంగళి

971। సువాసిన్యర్చనప్రీతా : సువాసినులు చేయు అర్చన యెందు ప్రీతి కలిగినది

972। శోభనా ; శోభ కలిగినది

973। శుద్ధమానసా : మంచి మనస్సు కలిగినది

974। బిందుతర్పణ సంతుష్టా : అమృత బిందు తర్పణము చే సంతృప్తి పొందినది

975। పూర్వజా : అనాదిగా ఉన్నది

976। త్రిపురాంబికా : త్రిపురములందు ఉండు అమ్మ

977। దశముద్రాసమారాధ్యా : 10 రకముల ముద్రలచే ఆరాధింపబదునది

978। త్రిపురా శ్రీవశంకరీ : త్రిపురసుందరీ సంపదలను వశము చేయునది

979। ఙ్ఞానముద్రా : బొతనవ్రేలును చూపుడు వ్రేలితో కలిపి మిగిలిన 3వ్రేళ్ళను నిటారుగా ఉంచుట

980। ఙ్ఞానగమ్యా : ఙ్ఞానము చే చేరదగినది

981। ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ : ఙ్ఞాన చే తెలియబడు స్వరూపము కలిగినది

982। యోనిముద్రా : యోగముద్రలలో ఓకటి

983। త్రికండేశీ : 3ఖండములకు అధికారిణి

984। త్రిగుణా : 3గుణములు కలిగినది

985। అంబా : అమ్మ

986। త్రికోణగా : త్రికోణమునందు ఉండునది

987। అనఘా : పవిత్రమైన

988। ద్భుత చారిత్రా : అద్భుత చరిత్ర కలిగినది

989। వాంఛితార్ధప్రదాయినీ : కోరిన కోర్కెలు ఇచ్చునది 

990। అభ్యాసాతియఙ్ఞాతా : అభ్యాసము చేసిన కొలది బొధపడును

991। షడధ్వాతీతరూపిణీ ; 6మార్గములకు అతీతమైన రూపము కలిగినది

992। అవ్యాజకరుణామూర్తి : ప్రతిఫలాపేక్షలేని కరుణ కలిగినది

993। రఙ్ఞానధ్వాంతదీపికా : అఙ్ఞానమును అంధకారమునకు దీపము వంటిది

994। ఆబాల గోపవిదితా : సర్వజనులచే తెలిసినది

995। సర్వానుల్లంఘ్యశాసనా : ఎవరునూ అతిక్రమించుటకు వెల్లులేని శసనము కలిగినది

996। శ్రీచక్రరాజనిలయా : శ్రీ చక్రము నివాసముగా కలిగినది

997। శ్రీమత్త్రిపురసుందరీ : మహా త్రిపుర సుందరి

998। శ్రీశివా : సుభములను కల్గినది

999। శివశక్తైక్యరూపిణీ : శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది

1000। లలితాంబికా : లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత

ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం ।

సర్వం శ్రీలలితా పరదేవతా అర్పనమస్తు

ఇతి శ్రీ బ్రహ్మండపురణె, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీ వాగస్థ్య 

సంవాదే శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామోధ్యాయః

ఫలశ్రుతి 💐

1। ఇత్యేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ 

రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకమ్

2। సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం 

సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకమ్

3। అనేన సదృశం స్తోత్రం నభూతం నభవిశ్యతి 

సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్

4।పుత్రప్రద మపుత్రాణాo పురుషార్థ ప్రదాయకమ్

ఇదం విశేషాచ్చ్రీదేవ్యాo స్త్రోత్రం ప్రీతి విధాయకమ్

5।జపేన్నిత్యం ప్రయత్యేన లలితోపాస్తి తత్పరః 

ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్యచ

గమనిక:- శ్రీ లలిత పరమేశ్వరి అనుగ్రహంతో 183 శ్లోకాలలో అన్నింటికీ ప్రతి పదార్థసహితంగా వ్రాయడం జరిగింది। ఇందులో అక్షర దోషాలు, భావ దోషాలు దొర్లి ఉంటే సహృదయంతో మన్నించ వలసిందిగా ప్రార్ధన।

 శ్రీ లలిత పరమేశ్వరి అనుగ్రహం కలగాలని ప్రార్దిస్తూ। 

స్వస్తి।ఓం

(()))


Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ