"శ్రీ భగవాన్ వాణి" 01 -01 -2023 to 07-01-2023
"శ్రీ భగవాన్ వాణి" 01 -01 -2026
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా ప్రవచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జీవితం ఒక స్వప్నం లాంటిది, ప్రపంచాన్ని స్వప్నంగా చూడ మన్నది , అందరికి నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలో అన్నీ నిజంగానే జరుగుతున్నాయని అనుకుంటాం. అది ఒక భ్రమ.
కానీ నిజానిజాలు గుర్తుకురావు, అలాగే "శ్రీ భగవాన్ వాణి" అర్ధం పరమార్ధ గ్రహించాలని హృదయ స్పందనల మేలు కొలుపు ప్రతి ఒక్కరికి శుభోదయ శుభాకాంక్షలు.
శరీరానికి - శాకాహారం మనోజ్ఞానానికి దోహదపడుతుంది, మనస్సుకు - సజ్జన సాంగత్యం ఆధారమవుతుంది, బుద్ధికి - స్వాధ్యాయం నిత్యమూ నిర్ణయ కర్మల ఆచరణ సౌలభ్య సహకార సహనము తోడవుతుంది, ఆత్మకు - ధ్యానం నిత్యమూ అణు కూలమవుతుంది.
దేహ స్థితిలో - సమస్య తెగదు. అయినా సందర్బానుసారము సహనము వహించి నిర్దేశిత ఆసనము నందు ధ్యానమే నిత్యా మోక్ష ముక్తి దాయక మౌతుంది, నీ ఆజ్ఞాను వర్తులై నీ కార్యక్రమాల మీద పరుగులు పెడుతూన్న నీ మౌన సేవకులతో నేను సంభాషించి సమ్మేళనంలో నేను కూడా మెల్కోటానికి పాల్గొన్నాను "శ్రీ భగవాన్ వాణి" వినేందుకు .
ఒక వ్యక్తి చిన్ననాటి స్నేహితులను ఇంటికి పిలిచాడు. వారికి మంచి పదార్థాలు పెట్టాడు. అందరూ పడుకున్నారు... ఇదంతా కలలో జరుగుతోంది. ఇంతలో అలారం మోగింది. ‘మిగిలిన స్నేహితులు లేచి వెళ్ళిన తరువాత నేను లేస్తాను’ అనుకున్నాడు. అలారం మోగుతూనే ఉంది. వాళ్ళందరూ లేచిన తరువాత మనం లేద్దాం అనుకుంటే... అది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే... ఆ స్నేహితులందరూ అతని సృష్టే. ప్రపంచం స్వప్నతుల్యం. "శ్రీ భగవాన్ వాణి" లో ఏమంటున్నది మొదటి అధ్యాయము
గ్రుడ్డివారైన, వయసు మీదపడిన వారైన వారికి కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు, మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం, ఆత్రుత తగ్గదు
అంటూ మనవారు పాండవులు పుణ్యభూమిన చేరి ఏమి చేసిరి అని సంజయుని అడుగుటే (గీత 1/1) ఇందులో పక్షపాతబుద్ధి సహజమని తెలుస్తున్నది
సశేషము ....
"శ్రీ భగవాన్ వాణి" 02 -01 -2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -2(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఆత్మ జ్ఞానము నిండుగా ఆట అవదు, జీవన్ముక్తుడై వెలుగొందు గీత అవదు, ఆత్మగ తన ఊరును నిత్య ఆనంద మవదు, అతనికిక వశ ఆస్వాదించుటయు అవదు
తాను బుట్టిన రోత తా దెలియ లేదు, యితర రోతాదులు యెంచు కోదు, యెక్క చూచినా యొక్కడే యుద్ధ మవదు, కరుణ జన్మకు కారణం కాల మవదు.
వజ్ర వ్యూహమును ఛేదించాలని ఆత్రుత దుష్ట దుర్యోధన మెదడులో చిందు లేయగా గురువు చెంత చేరి చేదు మాటలు మంచిగా చెప్పు చుండె
*ఎంతటి బలవంతుడైన సరే గురువుని ప్రార్ధించి ఏపని అయినను చేస్తే దానికి తగ్గ ఫలితము రాగలదు (గీత 1/2)
కీడెంచి మేలెంచుటలో తప్పు లేదు, అనుమానమన్నది అవమానమది కాదు, ముందు చూపు ఉంటె ఆపదన్నది రాదు, తడిమి చూసుకున్నంతనె సొమ్మేమియు పోదు
యుద్ధ ముందు అభిరుచుల ప్రేమ కాదు, యుద్ధ పిదప కలిసిపోవు ప్రక్రియ కాదు
యుద్ధ రుచులు సాగవుగాను మనసు కాదు, యుద్ధ రుచులె పరుగులెత్తు గడబి డవదు
పాండవ సైన్యము చూసి గొప్పగా బుద్ధిశాలివగు ఓ గురువర్యా ని శిష్యుని ప్రతాపమును చూడు, నీ విరోధి కొడుకు అని హెచ్చరికలాగా పలుకు 1/3
*ఎంతటి వారైనా గురుపుత్రులను తక్కువ చేయకూడదు, శిష్యులను తక్కువ చేయకూడదు, అందరిలో ఉన్న గొప్పతనమును గ్రహించాలి* (గీత 1/3).
*మనం హృదయంగానే ఉన్నా ప్రత్యేకంగా ‘నేను ఉన్నాను’ అనే ఒక అహంకార భావన మొదవుతుంది. దానికి ‘నేను’ అని పేరు పెట్టుకుంటాం. ఆ అహంకార భావనతో పుట్టినమాయా భ్రాంతి వల్ల హృదయంలో ఒక చలనం వస్తుంది. దేహాత్మ బుద్ధి కూడా కలుగుతుంది, ప్రపంచం అనేది ఒకటి ఉందనే భావన కూడా కలుగుతుంది. కానీ అది బేధ దృష్టి వల్ల కలిగింది. నాకు అన్యంగా... అంటే నేను కానిది ఏదో ఉందనే ఆలోచన వల్ల ఈ దృష్టి దోషం . ఇదే ఆనాడు దుర్యోధనునకు ఏర్పడిన మచ్చ*
((***)))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" .... ... ... 3 ..... ..... .03-01-2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఎంతమంది యున్నను తెల్వి ఎరుకపరచి, మొదటి మేధావి మార్గము మోక్షము యగు, వారికి పొరపాటులనేవి వచ్చి చేరు, పతన సుఖముయే తప్పదు పతనమవుతు.
ఎంత తెలిసిన వారైన ఏమిచేయ, నిర్ణయము తమది అయిన నీడ చేరు, నిత్య పొరపాట్లకే తాము నిశ్చయాత్మ బాధ్యులుగాను నిర్ణయమ్ము .
ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును. అదియే పాండవుల ప్రయత్నమూ ఆదు కొనెడివాడు పరమాత్ముడు.
ఇక రెండవ తరగతి వారు కౌరవులు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. అని బుకాయించువారు, కనుక వారి మార్గమున పతనమునకు బాధ్యత లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు.
కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. పాండవులు, కర్తవ్యము నిర్వహించుకొని దానిని స్వలాభము, దుష్ట ఆలోచన కలిగి భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. అట్టి వారు కౌరవులు
*ఎంతటి వారైన సరే, ఎదుటి వారి తెలివి, వారి వంశములో ఉన్న తెలివి, వారి నడవడిక ముందు కొంత తెలుసుకుంటే మనకు ఎంత వరకు ఉపయోగ పడునో తెలుసుకొని ఉపయోగించుకోగలరు అట్లు చేయక పొతే పతనమునకు మూలమవుతారు ( గీత 1/4 to 9)
*ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు..
అందుకే మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది.
తుర్య అని పిలువబడే నాల్గవ స్థాయి చైతన్యం గురించి చర్చిస్తుంది. అభోగ అంటే పారవశ్య దశ. (అభోగ అంటే భోగము లేనిది). సంభవః అంటే ఉన్నది. అంటే పారవశ్యపూరితమైన తుర్యము సైతం ఉనికిలో ఉందని చెబుతుంది.
మన స్నేహితులు పరిమితము అని బలహీన పడవద్దు, వారి స్నేహితులు అపరిమితము అని దిగులు చెందకు, ధైర్యవంతుడు ఒక్కడున్నా ఆవర్గము విజయము ఖాయము అని నమ్మకం ఉంచుకోవలెను. (గీత 1/10)
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" .... ... ... 4 ..... ..... .04-01-2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనిషి ఎంత ఎదిగిననూ మాట ఒదిగి, వుండుటయు కాని అహముతో ఉండ కుండ,
నైతికంగా మనిషినీవు కైపు ఏల, బుద్ధి పాతాళమునూ చేరు పుడమి నందు. అటుల ఆత్మాభిమానము ఆశ యగుట, దురభిమానము ఇబ్బంది దుష్ట బుద్ది,
వెలుగు ఉండే హృదయపరిపూర్ణమగుట, మనకు అన్యంగ ఏదైన మనకు రాదు, భావనయె అజ్ఞానంలోకి భంధ మవక, నీవు విజ్ఞాన సంపద నీకుతోడు, మనము అజ్ఞాన మధ్యలో మనసు ఉండు, మంద బుద్ధి ఉన్న తనను తాను తెలుసు కున్నవాడికీ శాస్త్రం అక్కర్లేదు.
దుర్యోధనుండు తనసైన్యము చాలాగొప్పదని అతిరధ, మహారధ అద్భుత వీరధీర రాజులను చూసి ఆనందం పొందాడు.
మహాద్భుతమైన మన పుణ్యభూమి, కర్మభూమి గొప్పదనం తెలుసుకుంటే విజ్ఞానవంతులై లోక శ్రేయస్సును పెంపొందిస్తారు. నేను, నాది అన్న అహంకారం వీడండి. అనిద్రోణాచార్యులు యుద్ధముచేయు వీరులకు బోధ చేసాడు.
*మనకు ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసు కున్నప్పుడు తప్పించు కొనుటకు ప్రయత్నించాలి, సింహనాదం చేసిన ముప్పు వచ్చేది రాక మానదు. విషయ లోలులకు లొంగి పోకండి (గీత 1/11to 13)
ఎన్నో రకాల వాయిద్యాలు మ్రోగించిన భయస్తుల గుండెలు భీతిల్లక మానదు, భయము లేనివారికి ఉత్తేజము పెరుగక మానదు. మీ అధైర్యమును తొలగించి యుద్ధకళతో విర్రవీ గండి (గీత 1/ 14 తో 20)
*ఎంతటి వారైన తనతో ఉన్న వారిని గొప్పతనం తెలుసు కోవాలి ముందు, గొప్పలకు పోయి నేనే ధైర్యవంతుణ్ణి ఈ పని నేను సాధిస్తా, అందరి ముందుకు తీసుకు వెళ్ళు అని ఆలోచించక గొప్పలు చెప్ప కూడదు. (గీత 1/21)
(((****))))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" .... ... ... 5 ..... ..... .05-01-2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనము ఏ విషయమైన ప్రత్యక్షముగా చూడవలెను, చారులు చెప్పిన విషయాలు గమనించక వారికి మనకు వ్యత్యాసము గమనించి దేశకాల పరిస్థితులను బట్టి ప్రవర్తించ వలెను. (గీత 1/22&23)
తెలుసుకోవడానికి గురువు అనుగ్రహం ముఖ్యం. ఇక్కడ గురువు అంటే హృదయం. ‘‘ఉన్నది ఉన్నట్టు ఉండడమే ఉండడం’’ అన్నారు భగవాన్. దాన్ని ‘హృదయం’ అన్నారు.
నడి రోడ్డులో మనిషిని నిలబెట్టి నీవు అన్నీ వైపుల గమనించు ఎం తెలుసు కుంటావో తెలుసుకో అంటే అతని చూపు ఎటు ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఆలోచించటం తప్ప. (గీత -1/24/25).
హృదయంగా ఉన్నప్పుడే ఆనందం మనకు కలుగుతుంది. కానీ హృదయంగా ఉంటూనే దాని నుంచి వేరుగా ఉన్నామనే భావన మనకు కలుగుతుంది. ‘‘ఒకసారి నీకు బేధ దృష్టి కలిగిందా... ఆత్మ విచారణ చేసుకోవడానికి నువ్వు అనర్హుడివి’’ అంటారు. కనీకనిపించని వెలుతురును. కటిక చీకటిలో కానీ, పట్టపగటి వెలుతురులో కానీ ఈ సమస్య ఉండదు. సాధారణమైన కొలమానాలతో ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోలేం. దేహ భ్రాంతి మనకు కలిగినా, కలగకపోయినా. దేహం అనేది ఒకటి ఉన్నదని తెలిసినా తెలియక పోయినా... ఆ విషయంతో మనకు సంబంధం లేదు.
(((****))))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" .... ... ... 6 ..... ..... .06-01-2023
(శ్రీమద్భగవద్గీతా మకరంద మాధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
జంతుజాతి వాటికి జబ్బు వస్తే వాటి దేహాలను ఎలా రిలాక్స్ చేసుకుంటాయో, ఔషధ మొక్కల్ని గుర్తించి ఎలా అనారోగ్యాన్ని నయం చేసుకుంటాయి చూసి మనమూ నేర్చుకోవాలి.
(((****))))
సశేషము
"శ్రీ భగవాన్ వాణి" .... ... ... 7 ..... ..... .07-01-2023
(శ్రీమద్భగవద్గీతా మకరందమా ధార అంతర్గత ఆధ్యాత్మిక సందర్భ సమస్య పరిష్కార సూక్తుల కధా వచనము ) -1(మొదటి అధ్యాయము )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పవిత్రం చేసే వాటన్నింటిలోనూ అత్యంత పవిత్ర పరిచేదీ, శుభాన్ని కలిగించే వాటన్నింటిలో అత్యంత శుభాన్ని కలిగించేది భగవన్నామమే (పవిత్రానాం పవిత్రంయో మంగళానాంచ మంగళం)
అందువల్ల ఉదయం సాయంత్రం భగవన్నామాన్ని జపించడం వల్ల క్రమేణా మనస్సు ప్రసన్నంగా ఉండడం అలవాటు అవుతుంది.
ఆహారశైవ నిద్రాచ భయం మైథునమేవచ
పశ్వాదీనాంచ సర్వేషాం సాధారణ మితీరితమ్
చతుర్వేవానురక్య స్సమూర్బోహ్యాత్మ ఘాతకః
*మనుష్యాణా మయం ధర్మ స్స్వబంధచ్ఛేదనాత్మకః *
*పాశ బంధన విచ్ఛేదో దీక్షయైవ ప్రజాయతే *
అతో బంధన విచ్ఛిత్యై మంత్రదీక్షాం సమాచరేత్
అంటుంది శాస్త్రం.
అంటే ఆహారం, నిద్ర, భయం, మైథునం అనే నాలుగు పశువులన్నింటికీ సమానంగా ఉండే విషయాలు. కేవలం ఈ నాలుగింటియందే అనురక్తుడైన వాడు మూర్ఖుడే కాదు ఆత్మ ఘాతకుడు కూడా ! (ఈ నాలుగువిషయాలలోని బలహీనతలను జయించి ఇంద్రియ నిగ్రహం ఏర్పడినపుడే మనిషి పశుత్వం నుండి బయటపడతాడు)
"ఎవరికైనా అనుకోని విధముగా దేహములో కనబడని మంటలు ఆవహించి మనస్సును అల్లకల్లోలము చేసిన మంటలకు కారణమును గ్రహించి తగు మందు వేసుకోనుటే నిజమైన లక్ష్యము అని గ్రహించాలి".
బంధింపబడడం పశులక్షణం. తన బంధాన్ని ఛేదించుకోవడమే మానవ ధర్మం. ఇలాంటి పాప బంధాలను ఛేదించుకోవడానికి మనుష్యులు మంత్ర దీక్షను స్వీకరించి చక్కగా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించాలి అంటుంది శాస్త్రం.
"గ్రహించిన విద్యను మరచిన, పరులకు ఉపయోగించక పోయిన అటువంటి వారు ఎవరైనా ఉన్నా లేనట్లే".
గాఢంగా నిద్రించేవాడికి పడుకోవాలని, లేవాలని రెండూ ఉండవు. మంచికల రావాలనీ, చెడ్డకల రాకూడదనీ రెండూ అనిపించవు. కేవలం దాన్ని అనుభవించడం కాకుండా గమనించ గలిగితే నిద్రాస్థితి అనునిత్యం మనకు ఎంతో బోధ చేస్తుంది.
" శరీర శుభ్రత చాలా అవసరము ఎందుకనగా నిద్రలో కళ్ళకు కనురెప్పలు ఎంత సహకరిస్థాయో, అట్లే మనలో ఉన్న మలినాన్ని తొలగించు కోవటం ప్రతిరోజూ ప్రార్ధన చేయాలి, అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతత కల్గిస్తుంది అని గ్రహించాలి".
(((****))))
సశేషము
om sri raam
ReplyDelete